సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. విద్యార్థులు ఇలా జల సమాధి కావడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘సివిల్స్ విద్యార్థులు ముగ్గురు జల సమాధి కావడం ఆందోళనకరం. వేలాదిమంది విద్యార్థులు ఎంతో ఖర్చుపెట్టి తమ కలలను నెరవేర్చుకునేందుకు ఢిల్లీకి వస్తున్నారు. వారికి సరైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉంది. విద్యార్థుల ఆందోళనకు మద్దతిస్తున్నాం. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు.
The death of 3 UPSC aspirants in Old Rajinder Nagar due to drowning in the basement of a coaching institute is a matter of concern. Thousands of students come to Delhi and spend lakhs to fulfil their dream. They deserve better. Extending support to their protest. The concerned…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 29, 2024
Comments
Please login to add a commentAdd a comment