ఢిల్లీ: భారీ వరద కారణంగా ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి నీరు పోటెత్తి.. ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది. ఈ కేసులో నిందితులు అయిన రావుస్ కోచింగ్ సెంటర్ ఓనర్.. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తెలిసి కూడా ఉద్దేశపూర్వంగా బేస్‌మెంట్‌ను లైబ్రరీగా వినియోగించారని దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్( సీబీఐ) ఆరోపణలు చేసింది.
ఈ నేపథ్యంలో నిందుతులైన కోచింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని అభిషేక్ గుప్తా, ఇతర నిందితులు దేశపాల్ సింగ్, హర్విందర్ సింగ్, పర్వీందర్ సింగ్, సరబ్జీత్ సింగ్ , తజిందర్ సింగ్‌లను ‘కస్టడీ విచారణ’ కోసం అనుమతి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రత్యేక కోర్టు కోరింది.శనివారం అడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నిశాంత్ గార్గ్ ఆరుగురి నిందితులను సెప్టెంబర్ 4 వరకు సీబీఐ కస్టడీకి పంపించారు. రావుస్ కోచింగ్ సెంటర్‌కు సుమారు ఏడాది నుంచి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ లేదని తమ దర్యాప్తులో తెలిసిందని పేర్కొంది.
ఇదే విషయాన్ని గతేడాది ఈ ప్రాంతంలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్లు లేవని హైకోర్టు గుర్తించినట్లు తెలిపింది.దీంతో రావుష్ స్టడీ సర్కిల్ యజమానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కోర్టుకు ప్రత్యేక కోర్టుకు వెల్లడించింది. కాగా.. ఆగస్ట్ 8, 2023న కోచింగ్ సెంటర్ యజమాని ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కోసం ఎంసీడీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. జూలై 9, 2024న ఇన్‌స్టిట్యూట్‌కి సర్టిఫికేట్‌ను అధికారులు జారీ చేశారని తెలిపారు. ఈ ఘటనపై జూలై 27న చోటుచేసుకోగా.. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం కేసు నమోదు అయిది. ఇక.. విచారణను ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ పోలీసుల నుంచి ఆగస్టు 2న సీబీఐకి బదిలీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment