
ఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లోకి వర్షం నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. ఈ ఘటన నేపథ్యంలో ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి బేస్‌మెంట్ ఏరియాను ఉపయోగిస్తున్న 13 కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీబీ) చర్యలు చేపట్టింది. ఈ మేరకు 13 కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు.
‘‘ఆదివారం రాజేంద్ర నగర్ ప్రాంతంలోని పలు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో ఎంసీడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బేస్‌మెంట్ ఏరియాను కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తున్న కోచింగ్ సెంటర్లను సీజ్‌చేశాం. శనివారం జరిగిన ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు చేపట్టాం. రాజేంద్రనగర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లను సీజ్ చేస్తాం. అదేవిధంగా ఢిల్లీ మొత్తం ఉన్న కోచింగ్ సెంటర్లు, పలు భవనాల్లో తనిఖీలు చేస్తాం’’ అని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబేరాయ్ ‘ఎక్స్ ’లో పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రావుస్ ఐఎఎస్ స్టడీ సెంటర్‌లో జరిగిన సంఘటనకు ఎంసీడీ అధికారులు ఎవరైనా బాధ్యులు ఉన్నారా? అనేదానిపై వెంటనే విచారణ జరుగుతోందని అన్నారు. ఈ ఘటన వెనుకు ఎవరైనా అధికారులు దోషులగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
సీజ్ చేసిన 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ఇవే..
ఐఏఎస్ గురుకులం
చాహల్ అకాడమీ
ప్లూటస్ అకాడమీ
సాయి వర్తకం
ఐఏఎస్ సేతు
టాపర్స్ అకాడమీ
దైనిక్ సంవాద్
సివిల్ రోజువారీ ఐఏఎస్
కెరీర్ పవర్
99 నోట్లు
విద్యా గురు
గైడెన్స్ ఐఏఎస్
ఐఏఎస్‌లకు ఈసీ
చదవండి: సివిల్స్ కల జల సమాధి
