Basement
-
ఢిల్లీ సర్కార్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో సివిల్స్ అభ్యర్థుల జలసమాధి ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. మరణాలపై మీడియా వార్తలతో కేసును సూమోటోగా స్వీకరించింది. ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమరి్పంచాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వంతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసుల జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలో నడుస్తున్న కోచింగ్ సెంటర్లు, సంస్థల వివరాలు, వాటిపై వచ్చిన ఫిర్యాదులు, సంబంధిత శాఖ అధికారులు వాటిపై తీసుకున్న చర్యల గురించి కూడా నివేదికలో పొందుపర్చాలని ఎన్హెచ్ఆర్సీ కోరింది. అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడింది. పటేల్ నగర్ ప్రాంతంలో పూడిక తీయకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచి అక్కడ విద్యుదాఘాతానికి గురై సివిల్స్ అభ్యర్థి మరణించిన ఉదంతాన్నీ కేసుగా ఎన్హెచ్ఆర్సీ సూమోటోగా స్వీకరించింది. -
ఢిల్లీలో 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు సీజ్
ఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వర్షం నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. ఈ ఘటన నేపథ్యంలో ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి బేస్మెంట్ ఏరియాను ఉపయోగిస్తున్న 13 కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీబీ) చర్యలు చేపట్టింది. ఈ మేరకు 13 కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు.‘‘ఆదివారం రాజేంద్ర నగర్ ప్రాంతంలోని పలు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో ఎంసీడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బేస్మెంట్ ఏరియాను కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తున్న కోచింగ్ సెంటర్లను సీజ్‌చేశాం. శనివారం జరిగిన ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు చేపట్టాం. రాజేంద్రనగర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లను సీజ్ చేస్తాం. అదేవిధంగా ఢిల్లీ మొత్తం ఉన్న కోచింగ్ సెంటర్లు, పలు భవనాల్లో తనిఖీలు చేస్తాం’’ అని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబేరాయ్ ‘ఎక్స్ ’లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రావుస్ ఐఎఎస్ స్టడీ సెంటర్లో జరిగిన సంఘటనకు ఎంసీడీ అధికారులు ఎవరైనా బాధ్యులు ఉన్నారా? అనేదానిపై వెంటనే విచారణ జరుగుతోందని అన్నారు. ఈ ఘటన వెనుకు ఎవరైనా అధికారులు దోషులగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.సీజ్ చేసిన 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ఇవే..ఐఏఎస్ గురుకులంచాహల్ అకాడమీప్లూటస్ అకాడమీసాయి వర్తకంఐఏఎస్ సేతుటాపర్స్ అకాడమీదైనిక్ సంవాద్సివిల్ రోజువారీ ఐఏఎస్కెరీర్ పవర్99 నోట్లువిద్యా గురుగైడెన్స్ ఐఏఎస్ఐఏఎస్లకు ఈసీచదవండి: సివిల్స్ కల జల సమాధి -
ఢిల్లీ ప్రమాదం: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్లు ఇవి ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా రాజేంద్ర నగర్‌లోని రావు ఐఏఎస్ అకాడమీ బేస్మెంట్లోకి చేరిన వరద నీటిలో ముగ్గురు విద్యార్థులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలతో పాటు ఒక విద్యార్థి మృతదేహాన్ని కూడా వెలికితీశారు. ఈ ఘటనపై ఢిల్లీ సర్కారు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. #UPDATE | Delhi: The death toll in the Old Rajender Nagar incident rises to three after the rescue teams recovered a third body from the basement: Delhi Fire Department— ANI (@ANI) July 27, 2024 ఈ సందర్భంగా డీసీపీ హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలతోపాటు పాటు ఒక విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించామని, రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. నీటిని బయటకు పంపుతున్నామని, బేస్మెంట్లో ఇంకా ఏడు అడుగుల మేర నీరు నిలిచివుందన్నారు. అగ్నిమాపక అధికారి అతుల్ గార్గ్ మాట్లాడుతూ శనివారం సాయంత్రం 7.15 గంటలకు తమకు సమాచారం అందిందని, మొత్తం ఐదు వాహనాలతో సహా వచ్చిన సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. ఘటన జరిగిన సమయంలో కోచింగ్ సెంటర్లో 30 మంది విద్యార్థులు ఉన్నారని, ఇంత భారీగా నీరు బేస్మెంట్లోకి ఎలా చేరిందన్న విషయం విచారణలో తేలాల్సి ఉందన్నారు. #WATCH | Delhi: On the Old Rajender Nagar incident, DCP Central M Harshavardhan says, "... The bodies have been sent to the hospital for further legal action. Rescue operations are still underway. The water is being pumped out. There is still about 7 feet of water in the… pic.twitter.com/37un19ApIJ— ANI (@ANI) July 27, 2024 ఈ ఘటనపై ఆప్ నాయకురాలు అతిషి సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై మెజిస్ట్రీరియల్ విచారణకు ఆదేశించామని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామన్నారు. ఈ ఘటనపై నివేదిక అందజేయాలని రెవెన్యూ మంత్రి అతిశీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. పరిస్థితిని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనాస్థలికి చేరుకున్నాయి. బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ సంఘటనా స్థలంలో ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. #WATCH | Old Rajender Nagar incident | Delhi: Fire Officer Atul Garg says, "... A total of 5 fire vehicles reached the sport after we received the information at around 7.15 pm... We pumped the water out and recovered the dead bodies of two girls. Around three children were… pic.twitter.com/p453wAD21L— ANI (@ANI) July 27, 2024 -
జ్ఞానవాపిలో మరిన్ని నేలమాళిగలు.. ఏఎస్ఐ సర్వేలో వెల్లడి!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోగల జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో వ్యాస మహర్షి నేలమాళిగతో పాటు, పలు నేలమాళిగలున్నాయని, వీటిలో నాలుగు నేలమాళిగలను మూసివేశారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన సర్వే నివేదికలో వెల్లడించింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీని ఉపయోగించి ఏఎస్ఐ జరిపిన పరిశోధనలో ప్లాట్‌ఫారమ్ కింద, ప్లాట్‌ఫారమ్ ప్రాంతంలో అనేక బేస్మెంట్లు ఉన్నాయని తేలింది. వాటి ఎగువ భాగం తెరిచి ఉండగా, దిగువ భాగమంతా చెత్తతో నిండి ఉంది. వీటిని మూసివేశారు. ప్లాట్‌ఫారమ్‌కు నైరుతి భాగంలో చెత్తతో నిండిన మూడు మీటర్ల వెడల్పుగల నేలమాళిగలు ఉన్నాయి. ఒక మీటరు మందపాటి గోడలతో తొమ్మిది చదరపు మీటర్ల పరిమాణంలో ఈ నేల మాళిగలు ఉన్నాయి. ఈ పెద్ద సెల్లార్లు దక్షిణ గోడ వైపు ప్రవేశద్వారాలను కలిగి ఉన్నాయి అవి ఇప్పుడు మూసివేసివున్నాయి. నేలమాళిగకు ఉత్తరం వైపున ఓపెన్ ఫంక్షనల్ తలుపులు ఉన్నాయి. తూర్పు వైపున రెండు మీటర్ల వెడల్పుతో మూడు నుండి నాలుగు నేలమాళిగలు ఉన్నాయి. తూర్పు గోడ మందంలో అనేక మార్పులు ఉన్నాయి. కారిడార్ ప్రాంతానికి ఆనుకుని, ప్లాట్‌ఫారమ్‌కు పశ్చిమ భాగంలో మూడు నుండి నాలుగు మీటర్ల వెడల్పు గల రెండు సెల్లార్ల రెండు వరుసలు ఉన్నాయి. నేలమాళిగలో దాగి ఉన్న బావి రెండు మీటర్ల వెడల్పు కలిగివుంది. దక్షిణ భాగంలో మరో బావి జాడలు కనిపించాయి. బేస్మెంట్ గోడల జీపీఆర్ స్కానింగ్‌లో మూసివున్న బావులు, కారిడార్లు కూడా ఉన్నట్లు తేలిందని నివేదిక పేర్కొంది. దక్షిణ నేలమాళిగ గోడతో కప్పినట్లు ఉందని జీపీఆర్ చూపించింది. ఏఎస్ఐ తన సర్వే సమయంలో పలు సున్నితమైన వస్తువులను శుభ్రపరచడం, లేబులింగ్ చేయడం, వర్గీకరించడం, పలు పరీక్షలను నిర్వహించడం మొదలైన పనులు చేసింది. ఇందుకోసం అదే ప్రాంగణంలో ప్రాంతీయ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇది మెటల్‌తో సహా ఇతర పదార్థాలను పరిశీలించడంలో సహాయపడుతుంది. -
కోపం వచ్చిందని ఎనిమిదేళ్లుగా..
ఆండ్రెస్ కాంటో అనే ఈ స్పానిష్ కుర్రాడికి కోపం వచ్చింది. ఎవరి మీదంటారా? తల్లిదండ్రుల మీదే! కారణం మరీ పెద్దదేమీ కాదు గాని, అసలు కథలోకి వచ్చేద్దాం. ఎనిమిదేళ్ల కిందట ఆండ్రెస్ పద్నాలుగేళ్ల కుర్రాడు. ట్రాక్సూట్తోనే ఊళ్లోకి బలాదూరుగా తిరగడానికి వెళతానన్నాడు. ట్రాక్‌సూట్‌లో అలా తిరగొద్దని తల్లిదండ్రులు మందలించారు. అంతే! ఆండ్రెస్కు చర్రున కోపం తన్నుకొచ్చింది. కోపం వస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఆండ్రెస్ కూడా ఊరుకోలేదు. విసవిసా పెరట్లోకి వెళ్లాడు. పెరట్లో పాతకాలం నాటి గడ్డపలుగు కనిపించింది. వెంటనే ఆ గడ్డపలుగు పుచ్చుకుని, చేతులు నొప్పెట్టే వరకు పెరట్లో మట్టిని తవ్విపోశాడు. ఇలా ఒకరోజు రెండురోజులు కాదు, ఎనిమిదేళ్లు అదేపనిగా తవ్విన చోటనే తవ్వుతూ, తాను తలదాచుకోవడానికి అనువైన నేలమాళిగను నిర్మించుకున్నాడు. తనకు అవసరమైన కుర్చీ, బల్ల, మంచం వంటి సామగ్రిని ఇంటి నుంచి అందులోకి చేరవేసుకున్నాడు. వైఫై, స్పీకర్లు, వంట చేసుకోవడానికి ఒక బొగ్గుల పొయ్యి కూడా అందులో అమర్చుకున్నాడు. ఇప్పుడు ఆ నేలమాళిగనే తన ప్రత్యేక స్థావరంగా వాడుకుంటున్నాడు. -
ప్రభుత్వ కార్యాలయంలో రూ. 2 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం..
ఓ ప్రభుత్వ కార్యాలయంలో రూ. 2 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం బయట పడటం తీవ్ర కలకలం రేపింది. అదీకూడా దేశంలో రెండు వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న వేళ ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన రాజస్తాన్‌లో జైపూర్‌లోని యోజన భవన్లో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కార్యాలయం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీజీపీ, పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ్‌లతో కలిసి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్తాన్ ప్రభుత్వాధికారుల ప్రభుత్వ భవనమైన యోజన భవన్లో బేస్మెంట్లో లెక్కల్లోకిరాని ఈ నగదు, బంగారాన్ని గుర్తించారు పోలీసులు. భవనం బేస్మెంట్లోని అల్మార్్లో ఉంచిన బ్యాగులో ఈ నగదు, బంగారం ఉన్నట్లు వెల్లడించారు. అందులో సుమారు రూ. 2.31 కోట్లకు పైగా నగదు, ఒక కిలో బంగారం బిస్కెట్లు ఉన్నాయని తెలిపారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేయడమే గాక ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు పోలీసుల కమిషనర్ ఆనంద్ కుమార్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ..సమీపంలోని సీసీఫుటేజ్‌ని పరిశీలిస్తున్నామని తెలిపారు. సీఎం అశోక్ గెహ్లాట్‌కు కూడా ఇదే విషయమే సమాచారం అందించామని శ్రీ వాస్తవ చెప్పారు. #WATCH | Jaipur, Rajasthan: Around Rs 2.31 crores of cash and 1 kg of gold biscuits have been found in a bag kept in a cupboard at the basement of the Government Office Yojana Bhawan. Police have seized these notes and further investigation has been started. CCTV footage is being… pic.twitter.com/xanN2NQhi7 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 19, 2023 (చదవండి: పేరుకే ఎమ్మెల్యేని.. వీఏఓ కూడా పట్టించుకోవడం లేదు!) -
భార్యకు ప్రేమతో...
యెరెవాన్ : భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం షాజహాన్ తాజ్‌మహల్ నిర్మించారు. ఆయనంటే మహారాజు.. కాబట్టి ఏమైనా చేయగలరు. మనం సామాన్యులం, అవన్నీ మన వల్ల అయ్యే పనులు కావనుకుంటాం మనలో చాలా మంది. కానీ అర్మెనియా(గతంలో సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేది) దేశానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం భార్య కోసం రెండు దశాబ్దాలకు పైగా, ఒంటరిగా శ్రమించి అద్భుతమైన భూగృహాన్ని నిర్మించాడు. ఇప్పుడది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వివరాల ప్రకారం..అర్మెనియా దేశంలోని అరెంజీ గ్రామానికి చెందిన లెవాన్ అరాక్లేయన్, తొస్యా గరిభ్యాన్ దంపతులు. ఒక రోజు తొస్యా ఆలుగడ్డలు నిల్వ చేసుకునేందుకు తన కోసం ఒక బేస్మెంట్ / భూగృహాన్ని నిర్మించాల్సిందిగా తన భర్తను కోరింది. భార్య కోరిక మేరకు చిన్న బేస్మెంట్ నిర్మాణాన్ని ప్రారంభించిన లెవాన్ అంతటితో ఆగక ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ భూగృహాన్ని నిర్మించాడు. దీని లోపలంతా ఒంపులు తిరిగిన నిర్మాణాలు, గుహలు, సొరంగాలతో నిర్మితమై ఉంది. ఈ అపురూప కట్టడం గురించి తొస్యా ‘నేను సరదాగా కోరిన కోరికను ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దాదాపు 23 ఏళ్లపాటు ఏకధాటిగా శ్రమించి, ఒక్కరే ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఆవిష్కరించారు. 1985లో ఈ భూగృహ నిర్మాణాన్ని ప్రారంభించారు. రోజులో ఆయన 18 గంటలు పనిచేసేవారు. కాసేపు విశ్రమించి వెంటనే ఇక్కడికి వచ్చేవారు’ అని తెలిపారు. అంతేకాక ఈ నిర్మాణానికి సంబంధించి ఆయన ఎటువంటి ప్లాన్ రూపొందించుకోలేదు. ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇంత అద్భుతంగా ఎలా చెక్కుతున్నారని అడగ్గా ‘దాని గురించి నాకు ఏం తెలీదు. కానీ తరువాత చేపట్టబోయే నిర్మాణాల గురించి, శిల్పాలు, కళాఖండాల గురించి నాకు కలలో కన్పిస్తుంటుంది. దాన్ని బట్టే వీటన్నింటిని చెక్కగల్గుతున్నాన’ని తెలిపారు. ‘నా భర్త పని ప్రారంభించిన కొత్తలో రాతిని చెక్కడం చాలా కష్టంగా ఉందని తెలిపారు. ఎందుకంటే అదంతా నల్ల బసాల్డ్ రాయి. కానీ లోతుకు వెళ్లిన కొద్ది మృదువైన టఫ్పా రాయి వచ్చింది. దాంతో రాయిని తొలచడం చాలా తేలికయ్యిందని, అప్పటి నుంచి పని చాలా వేగంగా నడుస్తుందని తెలిపే’వారన్నారు. ‘ఈ భూగృహ నిర్మాణంలో దాదాపు 600 రాళ్లను ఉపయోగించారు. వీటన్నింటిని లెవాన్ కేవలం బకెట్ల ద్వారానే భూమిలోకి తీసుకెళ్లేవారు. ఎవరి సాయం తీసుకోలేద’ని తెలిపారు. ‘ఆ విధంగా 280 చదరపు అడుగుల వైశాల్యం, 21 మీటర్ల లోతు వరకూ తవ్వుతూ వెళ్లాడ’న్నారు. లెవాన్ కుమార్తె అరకస్య ‘నా చిన్నతనంలో నేను మా నాన్నగారిని చూసింది చాలా తక్కువ సార్లు మాత్రమే. కానీ ఎప్పుడు రాతిని తొలిచే శబ్దం వినిపిస్తూనే ఉండేది. ఇప్పటికి మా నాన్న గారిని గుర్తుకు తెచ్చుకుంటే నాకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆ ఉలి శబ్దం మాత్రమే’ అన్నారు. ఈ సొరంగం నిర్మాణం పూర్తి కావొస్తున్న సమయంలో అనగా 2008లో తన 67 ఏట లెవాన్ మరణించారు. భర్త మరణించిన అనంతరం తొస్యా ఈ భూగృహంతో పాటు, మరో చిన్న మ్యూజియాన్ని కూడా నిర్వహిస్తోంది. దీనిలో తన భర్త భూగృహం నిర్మాణం కోసం వినియోగించిన వస్తువులను ప్రదర్శన కోసం ఉంచింది. ఇప్పుడు ఈ భూగృహాన్ని దర్శించడానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. దీన్ని సందర్శించిన ప్రతి ఒక్కరు ‘అద్భుమైన ప్రదేశం.. భూమి మీద నెలకొన్న స్వర్గం’గా అభివర్ణిస్తున్నారు. భార్యకు ప్రేమతో... ఓ హైదరాబాదీ! -
‘రాజ’సం రాదాయే!
బేస్‌మెంట్‌కే ఐదేళ్లు.. గోపుర నిర్మాణానికి ఇంకెన్నేళ్లో? నత్తనడకన రాజగోపుర నిర్మాణ పనులు శ్రీకాళహస్తికే వన్నెతెచ్చే రాజగోపుర నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పునఃనిర్మాణ పనులు ప్రారంభించి ఐదేళ్లు గడిచినా ఇంతవరకు బేస్మెంట్ కూడా సక్రమంగా పూర్తికాలేదు. ఇక గోపుర నిర్మాణం పూర్తయ్యేది ఎన్నాళ్లకోనని భక్తులు నిట్టూర్చుతున్నారు. శ్రీకాళహస్తి : పరమశివున్ని దర్శించుకోవడానికి ముందు ఆరుగురిని దర్శించుకోవాలని పురాణాలు ఘోషిస్తున్నట్లు వేదపండితులు చెబుతున్నారు. శివున్ని దర్శించుకునే ముందు గోపురం, శిఖరం, ఆలయ ద్వారం, ప్రాకారం, బలిపీఠం, అర్చకుడిని దర్శించుకోవాలని సూచిస్తారు. దీనికి సంబంధించి గోపురే, శిఖరే, ద్వారే, ప్రాకారే, బలిపీఠకే, అర్చకే, మూలలింగేచ సప్తయితే శివదర్శనం అనే స్తోత్రాన్నీ వారు భక్తులకు వినిపిస్తుంటారు. అలాంటి గాలిగోపురం శ్రీకాళహస్తిలో కరువయ్యింది. దేవదేవుని చెంత గోపురంలేక పలువురు భక్తులు చింతిస్తున్నారు. తమకు మోక్షం కలగుతుందోలేదోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేస్‌మెంట్‌కే ఐదేళ్లు శ్రీకాళహస్తికే తలమానికంగా ఉన్న రాజగోపురం 2010 మే 26వ తేదీన కూప్ప కూలిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి మూడు నెలల తర్వాత ఆగస్టు 29వ తేదీన గాలిగోపురాన్ని తిరిగి నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు గోపుర నిర్మాణ పనులు పూర్తిచేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. శంకుస్థాపన చేసి ఐదేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ గోపుర నిర్మాణ పనులు బేసిమెంట్కే పరమితమయ్యాయి. నత్తనడకన పనులు గోపురాన్ని నిర్మించేందుకు నవయుగ కన్స్ట్రక్షన్స్ ముందుకొచ్చింది. రూ.46 కోట్ల వ్యయంతో గోపుర నిర్మాణాన్ని 16 నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. కానీ నిర్మాణానికి స్థల సమస్యతోపాటు అనేక ఆటంకాలు ఎదురు కావడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.