ఓ ప్రభుత్వ కార్యాలయంలో రూ. 2 కోట్లకు పైగా నగదు, కిలో బంగారం బయట పడటం తీవ్ర కలకలం రేపింది. అదీకూడా దేశంలో రెండు వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న వేళ ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన రాజస్తాన్‌లో జైపూర్‌లోని యోజన భవన్‌లో ఇన్‌ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కార్యాలయం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీజీపీ, పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ్‌లతో కలిసి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు.
రాజస్తాన్ ప్రభుత్వాధికారుల ప్రభుత్వ భవనమైన యోజన భవన్‌లో బేస్‌మెంట్‌లో లెక్కల్లోకిరాని ఈ నగదు, బంగారాన్ని గుర్తించారు పోలీసులు. భవనం బేస్‌మెంట్‌లోని అల్మార్‌్‌లో ఉంచిన బ్యాగులో ఈ నగదు, బంగారం ఉన్నట్లు వెల్లడించారు. అందులో సుమారు రూ. 2.31 కోట్లకు పైగా నగదు, ఒక కిలో బంగారం బిస్కెట్లు ఉన్నాయని తెలిపారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేయడమే గాక ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
ఈ మేరకు పోలీసుల కమిషనర్ ఆనంద్ కుమార్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ..సమీపంలోని సీసీఫుటేజ్‌ని పరిశీలిస్తున్నామని తెలిపారు. సీఎం అశోక్ గెహ్లాట్‌కు కూడా ఇదే విషయమే సమాచారం అందించామని శ్రీ వాస్తవ చెప్పారు.
#WATCH | Jaipur, Rajasthan: Around Rs 2.31 crores of cash and 1 kg of gold biscuits have been found in a bag kept in a cupboard at the basement of the Government Office Yojana Bhawan. Police have seized these notes and further investigation has been started. CCTV footage is being… pic.twitter.com/xanN2NQhi7
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 19, 2023
(చదవండి: పేరుకే ఎమ్మెల్యేని.. వీఏఓ కూడా పట్టించుకోవడం లేదు!)
Comments
Please login to add a commentAdd a comment