చిల్లర సొమ్ములకు, చిన్నాచితకా కారణాలకు నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజులివి. అయితే వరుస దాడులతో ఇక్కడో వ్యక్తి వార్తల్లో నిలిచాడు. అయితే అలా ఎందుకు దాడులు చేశావని అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం విని పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు.
రాజస్తాన్‌లోని బాలొత్రా గ్రామానికి చెందిన బాబురామ్ భిల్ మీద డజన్‌కు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో దాడుల కేసులే ఎక్కువ ఉన్నాయి. కేవలం తాను బతికే ఉన్నానని నిరూపించుకోవటం కోసమే ఆయన ఆ దాడులు చేశానని చెప్పేసరికి అంతా షాక్ తిన్నారు. ‘‘నేను చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇష్యూ అయ్యింది. అది తెలిసి నాకు నోట మాట పడిపోయింది. నా ఆస్తిని లాక్కునే ప్రయత్నంలో భాగంగానే అలా దొంగ సర్టిఫికెట్ సృష్టించారు. అందుకే నేను బతికి ఉన్నానని సమాజానికి నిరూపించుకోవాలనుకున్నా. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు. ఇలా అయినా అందరికీ తెలుస్తుంది కదా’’ అని భిల్ అంటున్నారు.
Villains are not born they are made pic.twitter.com/uouwZuug9y
— narsa. (@rathor7_) July 24, 2024
ఈ ఒక్క ఉదంతమే కాదు.. బతికుండగానే చనిపోయినట్లు రికార్డులకు ఎక్కుతున్న కేసుల సంఖ్య మన దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఒక కారణమైతే, అవినీతి మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్ల జారీ సమయాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి కేసులు వల్ల అట్టడుగు వర్గాల ప్రజలు దోపిడీకి ఎక్కువగా గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వ్యవస్థలు సక్రమంగా పని చేయడం, అధికారుల అవినీతి కట్టడి జరిగినప్పుడే రాజస్థాన్ తరహా ఘటనలు తగ్గుతాయని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment