death certificate
-
బతికున్నానని చెప్పేందుకు.. పోలీసులు సైతం షాక్ తిన్న ఘటన!
చిల్లర సొమ్ములకు, చిన్నాచితకా కారణాలకు నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజులివి. అయితే వరుస దాడులతో ఇక్కడో వ్యక్తి వార్తల్లో నిలిచాడు. అయితే అలా ఎందుకు దాడులు చేశావని అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం విని పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. రాజస్తాన్‌లోని బాలొత్రా గ్రామానికి చెందిన బాబురామ్ భిల్ మీద డజన్‌కు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో దాడుల కేసులే ఎక్కువ ఉన్నాయి. కేవలం తాను బతికే ఉన్నానని నిరూపించుకోవటం కోసమే ఆయన ఆ దాడులు చేశానని చెప్పేసరికి అంతా షాక్ తిన్నారు. ‘‘నేను చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇష్యూ అయ్యింది. అది తెలిసి నాకు నోట మాట పడిపోయింది. నా ఆస్తిని లాక్కునే ప్రయత్నంలో భాగంగానే అలా దొంగ సర్టిఫికెట్ సృష్టించారు. అందుకే నేను బతికి ఉన్నానని సమాజానికి నిరూపించుకోవాలనుకున్నా. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు. ఇలా అయినా అందరికీ తెలుస్తుంది కదా’’ అని భిల్ అంటున్నారు.Villains are not born they are made pic.twitter.com/uouwZuug9y— narsa. (@rathor7_) July 24, 2024ఈ ఒక్క ఉదంతమే కాదు.. బతికుండగానే చనిపోయినట్లు రికార్డులకు ఎక్కుతున్న కేసుల సంఖ్య మన దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఒక కారణమైతే, అవినీతి మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్ల జారీ సమయాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి కేసులు వల్ల అట్టడుగు వర్గాల ప్రజలు దోపిడీకి ఎక్కువగా గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వ్యవస్థలు సక్రమంగా పని చేయడం, అధికారుల అవినీతి కట్టడి జరిగినప్పుడే రాజస్థాన్ తరహా ఘటనలు తగ్గుతాయని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. -
ఆ సర్టిఫికెట్లు అవసరం లేదు.. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎల్ఐసీ బాసట
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) బాసటగా నిలిచింది. ఇన్సూరెన్స్ క్లయిమ్ కోసం డెత్ సర్టిఫికేట్ అవసరాన్ని మినహాయించి, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సడలించనున్నట్లు ఎల్ఐసీ చైర్పర్సన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల ఎల్ఐసీ ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని మహంతి పేర్కొన్నారు. మృతులు, బాధితులకు బాసటగా నిలుస్తుందని, ఆర్థిక ఉపశమనం అందించడానికి క్లయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేస్తుందని చైర్పర్సన్ వివరించారు. ఎల్ఐసీ పాలసీల క్లయిమ్‌దారులు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీదారుల కష్టాలను తగ్గించడమే దీని లక్ష్యం అని తెలిపారు. రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్లకు బదులుగా రైల్వే అధికారులు, పోలీసులు, ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రచురించిన మరణాల జాబితాను పాలసీదారుల మరణానికి రుజువుగా అంగీకరించనున్నట్లు ఎల్ఐసీ చైర్పర్సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే క్లయిమ్ సంబంధిత సందేహాలకు నివృత్తికి, హక్కుదారులకు సహాయం అందించడానికి డివిజనల్, బ్రాంచ్ స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. -
బతికుండగానే చంపేశారు!
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ఆస్తిపై కన్నేసిన దుర్మార్గులు ఓ వ్యక్తి బతికుండాగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించారు. ఘటనకు సంబంధించి ఎప్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు అనంతపురం రెండో పట్టణ సీఐ శివరాముడు కేసు నమోదు చేశారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. అనంతపురం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరామ్‌నాయక్... మృతి చెందినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆయన ఇంటిని కాజేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీరామ్‌నాయక్ ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల పాత్రపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మూడేళ్లుగా అగ్రస్థానంలో ఏపీ) -
సర్టిఫికెట్ల జారీ సమయం తగ్గింపు?
సాక్షి, అమరావతి: రెవెన్యూ సర్వీసుల్లో ప్రధానమైన సర్టిఫికెట్ల జారీ సమయాన్ని తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇంటిగ్రేటెడ్, ఇన్కమ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్/డెత్ సర్టిఫికెట్లను ఇంకా సులభంగా, తక్కువ సమయంలో జారీచేసేందుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన ఒకరోజు సదస్సులో ఈ అంశంపై రెవెన్యూ మంత్రి, సీసీఎల్ఏ ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల వారీగా వస్తున్న దరఖాస్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల ఆధారంగా ప్రతిపాదనలు తయారుచేసి వాటి జారీ సమయంపై ఒక అంచనాకు వచ్చారు. ► కమ్యూనిటీ, నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్‌లను కలిపి ఒకటిగా ఇచ్చే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్‌ను ఇచ్చేందుకు ప్రస్తుతం 30 రోజుల గడువు ఉంది. దీన్ని ఎనిమిది రోజుల్లో జారీచేయాలని ప్రతిపాదించారు. ► గతంలో వీఆర్ఓ వెరిఫికేషన్‌కు ఉన్న ఏడురోజుల సమయాన్ని మూడ్రోజులకు, ఆర్ఐ వెరిఫికేషన్‌కు 10 రోజుల సమయాన్ని రెండ్రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ రెండు దశల వెరిఫికేషన్ల తర్వాత మూడో దశలో చివరిగా తహసీల్దార్ 13 రోజుల్లో సర్టిఫికెట్ జారీచేయాల్సి వుంది. కానీ, చివరి దశను డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించి సమయాన్ని మూడ్రోజులకు కుదించాలని భావిస్తున్నారు. గతంలో ఈ సరి్టఫికెట్ జారీచేసి ఉంటే ఏ–కేటగిరీ కింద వెంటనే సర్టిఫికెట్ జారీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ► ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి సమయాన్ని 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. వీఆర్ఓ వెరిఫికేషన్ సమయాన్ని ఏడు నుంచి మూడ్రోజులకు, ఆర్ఐ వెరిఫికేషన్ సమయాన్ని ఐదు నుంచి రెండ్రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. చివరిగా తహసీల్దార్ వద్దకు వెళ్లాక ఆయన పరిశీలించి జారీచేసే సమయాన్ని మూడు నుంచి ఐదు రోజులకు పెంచారు. మొత్తంగా జారీ సమయం 5 రోజులు తగ్గించాలని చూస్తున్నారు. ► ఇక లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్/డెత్ సర్టిఫికెట్ల జారీని 60 నుంచి 20 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. వీఆర్ఓ వెరిఫికేషన్ సమయాన్ని ఏడు నుంచి మూడ్రోజులు, ఆర్ఐ వెరిఫికేషన్ 10 నుంచి మూడ్రోజులు, తహసీల్దార్ వెరిఫికేషన్ 10 నుంచి మూడ్రోజులు, చివరిగా ఆర్డీఓ/సబ్ కలెక్టర్ వెరిఫికేషన్ సమయాన్ని 33 నుంచి 11 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. ► అలాగే, ఆదాయ ధ్రువీకరణ (ఇన్కమ్) పత్రం జారీకి ప్రస్తుతం ఏడురోజుల గడువు వుండగా దాన్ని మాత్రం 10 రోజులకు పెంచాలని ప్రతిపాదించారు. వీఆర్ఓ వెరిఫికేషన్‌కు ప్రస్తుతం ఉన్న రెండ్రోజుల్ని మూడ్రోజులకు, డిప్యూటీ తహసీల్దార్ పరిశీలనకు ప్రస్తుతమున్న మూడ్రోజుల గడువుని ఐదు రోజులుగా ప్రతిపాదించారు. మధ్యలో ఆర్ఐ వెరిఫికేషన్‌కు రెండ్రోజుల సమయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ► భూమి సరిహద్దుల కొలతలు నిర్ధారించే ఎఫ్–లైన్ దరఖాస్తులు గతంలో మాదిరిగానే 30 రోజుల సమయాన్ని నిర్దేశించారు. పట్టా సబ్ డివిజన్‌కు ఉన్న 30 రోజులు, చుక్కల భూముల వినతులకు 180 రోజులు, నిషేధిత భూముల జాబితా 22 (ఎ) నుంచి తొలగించే దరఖాస్తుల పరిష్కారానికి ఉన్న 30 రోజుల సమయాన్ని అలాగే ఉంచాలని భావిస్తున్నారు. వీలైనంత సులభంగా, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల్ని త్వరగా జారీచేయడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ మార్పులు ప్రతిపాదించింది. త్వరలో ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత వీటిని ఆమల్లోకి తేవాలని రెవెన్యూ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
‘నా డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నాను’.. వైరలవుతోన్న పేపర్ యాడ్
సాధారణంగా డెత్ సర్టిఫికెట్ చనిపోయిన తరువాత ఇస్తారు. డెత్ సర్టిఫికెట్ పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకుంటే అధికారులు మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. ఈ మధ్య కాలంలో బతికున్న వారికి కూడా డెత్ సర్టిఫికెట్లు జారీ అవుతున్న ఘటనలు మచ్చుకు కొన్ని చూస్తూనే ఉన్నాం. అధికారుల తప్పిదాల కారణంగా మనిషి బతికున్నప్పటికీ చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కల్లో కొకొల్లలు ఉన్నాయి. తాజాగా డెత్ సర్టిఫికెట్ విషయంలో ఓ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నట్లు పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్సాంకు చెందిన రంజిత్ కుమార్ ఈ నెల 7న ఉదయం 10 గంటలకు నాగాన్‌లోని లుమ్డింగ్ బజార్ వద్ద తన మరణ ధ్రువీకరణ పత్రం పోయిందని ఒక పత్రికలో ప్రకటన ఇచ్చాడు. సదరు డెత్ సర్టిఫికేట్ నంబర్ కూడా అందులో పేర్కొన్నాడు. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ఈ పేపర్ ప్రకటన ఫొటోను ట్విట్టర్లో ఆదివారం పోస్ట్ చేశారు. ‘ఇలాంటివి కేవలం ఇండియాలోనే జరుగుతాయి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ ప్రకటనను చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ‘ఆ వ్యక్తి స్వర్గంలో నుంచి సాయం కోరుతున్నాడా? ఒకవేళ ఆ ‘మరణ ధ్రువీకరణ పత్రం’ ఎవరికైనా దొరికితే ఎక్కడికి పంపాలి స్వర్గానికా? లేక నరకానికా? ఒక వ్యక్తి తన డెత్ సర్టిఫికేట్ పోగొట్టుకున్నాడు. ఎవరికైనా దొరికితే తనకు ఇచ్చేయండి. దయచేసి దీనిని అత్యవసరంగా పరిగణించండి. లేకపోతే ఆ దెయ్యం ఆగ్రహం చెందుతుంది’ అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. చదవండి: షాకింగ్ ఘటన: మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలు... సీరియస్ అయిన మంత్రి -
బతికుండగానే కాగితాల్లో చంపేశారు!
సంస్థాన్ నారాయణపురం: వితంతు పింఛన్‌కు దరఖాస్తున్న చేసుకున్న మహిళ బతికుండగానే అధికారులు కాగితాల్లో చంపేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం పరిధి ఆరెగూడెం గ్రామానికి చెందిన బచ్చన బోయిన బాలమ్మ భర్త రామచంద్రం అనారోగ్య కారణాలతో 2021 జనవరి 28న మృతిచెందాడు. దీంతో బాలమ్మ అదే ఏడాది సెప్టెంబర్ 14న పలు ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులతో వితంతు పింఛన్ కోసం గ్రామ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంది. కాగా, స్వాతంత్య్ర వజ్రోత్సవాల కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బాలమ్మ తనకు పింఛన్ మంజూరైందా? అని అధికారులను ఆశ్రయించింది. దీంతో వారు ఆన్లైన్లో శోధించగా ఆ జాబితాలో మాత్రం బాలమ్మ చనిపోయినట్లు ఉందని చెప్పడంతో ఆమె అవాక్కయింది. తాను బతికే ఉన్నానని, పింఛన్ ఇప్పించాలని బాలమ్మ అధికారులను వేడుకుంది. కాగా, దీనిపై ఎంపీడీవో యాదగిరిని సంప్రదించగా మీ–సేవలో దరఖాస్తు చేసుకోవడంలో జరిగిన పొరపాటుగా గుర్తించామని తెలిపారు. బాధితురాలికి పింఛన్ వచ్చేలా చూస్తామని చెప్పారు. -
ఆసరా కోసం వెళ్తే చనిపోయావన్నారు!
ఆసరా పెన్షన్ కోసం ఓ వ్యక్తి ఏడాది క్రితం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో ఆ వ్యక్తి గురువారం తన దరఖాస్తును పరిశీలింగా చనిపోయినట్లు చూపడంతో ఒక్కసారిగా కంగుతున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో జరిగింది. తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన పాతనబోయిన పుల్లయ్య చనిపోయినట్లు చూపడంతో గత ఏడాది గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేశాడు. కానీ ఆన్లైన్లో పుల్లయ్య చనిపోయినట్లు చూపిస్తోంది. బతికి ఉన్న తనను ఏకంగా రికార్డుల్లో తప్పుగా నమోదు చేíసి చంపేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. –తిరుమలగిరి (నాగార్జునసాగర్) -
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఇక ఆఫీసుల చుట్టూ తిరగొద్దు!
ఖమ్మం మయూరిసెంటర్: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఇక ఎక్కడెక్కడో తిరగాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఆస్పత్రులు, పురపాలికలు అంటూ ఎంతో కొంత ఖర్చు చేసి ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. ఇక నుంచి అలాంటి అవసరమే లేకుండా ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాల జారీని సులభతరం చేసింది. ఇప్పటివరకు వాటి కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా అనేక కొర్రీలతో అధికారులు జారీ చేసేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాల జారీలో మార్పులు తీసుకొచ్చి అమలు చేస్తుంది. పుట్టిన వెంటనే రికార్డు నమోదయ్యేలా కీలక మార్పులు చేసింది. అలాగే మరణించిన వ్యక్తి వివరాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంది. జన్మించిన, మరణించిన చోటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకొచ్చింది. ఆస్పత్రిలోనే.. శిశువు జన్మిస్తే ధ్రువీకరణ పత్రం కోసం ఇంతకుముందు ఆస్పత్రి వారు పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలు, సమయం నమోదు చేసి మున్సిపల్ కార్యాలయానికి పంపించేవారు. అక్కడ ఆస్పత్రి వారు పంపించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసే వారు. ఫామ్ 1,2 మున్సిపల్ అధికారులే రిజిస్ట్రేషన్ చేసేవారు. ఈ విధానాన్ని మార్చిన ప్రభుత్వం ఫామ్ 1,2 రిజిస్ట్రేషన్‌ను ఆస్పత్రులకే అప్పగించింది. శిశువు జన్మించగానే ఆన్లైన్లో తమ ఆస్పత్రి కోడ్‌తో ఫామ్ 1,2 రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఒకట్రెండు రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రం ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. జనన ధ్రువీకరణ పత్రంలో సవరణలు ఉంటే నేరుగా మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులు ఆన్లైన్లో సవరణల దరఖాస్తును పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. మరణించిన వెంటనే.. మరణ ధ్రువీకరణ పత్రాన్ని సులువుగా పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఎవరైనా ఆస్పత్రిలో మరణిస్తే అక్కడే వ్యక్తి ఆధార్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆస్పత్రిలో రిజిస్ట్రేషన్ చేయని పక్షంలో వైకుంఠధామంలో మున్సిపల్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడతారు. ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్ద మరణించినా.. సంబంధిత వ్యక్తి వివరాలను ఇంటి వద్ద లేదా దహన సంస్కారాల ముందు వైకుంఠధామంలో రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ అనంతరం మున్సిపల్ అధికారులు సంతకం చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. వ్యక్తి బంధువులు దానిని ఆన్లైన్లో పొందవచ్చు. ఇక ఇంటి వద్ద మరణించిన వ్యక్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కార్పొరేషన్ అధికారులు ఇంటి వద్దనే పూర్తి చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు. కీలక మార్పులు.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా జరిగేందుకు ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఆస్పత్రిలో జన్మించినా, మరణించినా అక్కడే సంబంధిత వివరాలను ఆస్పత్రి సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ వివరాల ప్రకారం ధ్రువీకరణ పత్రం మంజూరవుతుంది. ఒకవేళ సవరణలు చేసుకునేందుకు మీ సేవల్లో దరఖాస్తు చేసుకుంటే మున్సిపాలిటీ నుంచి సవరణ చేసి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తారు. జనన, మరణ రిజిస్ట్రేషన్ల కోసం మున్సిపాలిటీలకు రావాల్సిన అవసరం లేదు. – ఆదర్శ్ సురభి, కేఎంసీ కమిషనర్ -
‘నీ పని అవ్వాలంటే రూ.2000 ఇవ్వాల్సిందే.. లేదంటే..’
‘జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ తన కూతురు జనన ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ఓ సిబ్బందిని బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చే కార్యాలయం అడ్రస్ అడగగా, సర్టిఫికెట్ తీసుకోవడం పెద్ద ప్రాసెస్ ఉంటుందని.. తనకు రూ.2000 ఇస్తే వారం రోజుల్లో సర్టిఫికెట్ చేతులో పెడతానని నమ్మబలికాడు. చేసేది లేక చంద్రశేఖర్ డబ్బులు ఇచ్చి వారం రోజుల తర్వాత సర్టిఫికెట్ తీసుకున్నాడు.’ కరీంనగర్‌టౌన్: జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో మ్యాన్వల్గా ఇచ్చే సర్టిఫికెట్లను ఏడాది కాలంగా నుంచి ఆన్‌లైన్‌కు మార్చారు. మీసేవలో దరఖాస్తు చేసుకొని ఉచితంగా పొందాల్సిన సర్టిఫికెట్‌కు వందలు, వేలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తూ అమాయకుల వద్ద అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. మ్యాన్వల్గా ఇచ్చిన సర్టిఫికెట్లు అన్ని ప్రాంతాలలో చెల్లడం లేదనే ఉద్దేశంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డెలివరీ అయిన పిల్లలకు సైతం జనన ధ్రువీకరణ పత్రాలు మీసేవలోకి మార్చారు. మ్యాన్వల్గా ఉన్నప్పుడు దందా నడిపించిన కేటుగాళ్లు ఆన్‌లైన్‌కు మార్చినా వదలడం లేదు. అమాయకులు సర్టిఫికెట్ల కోసం ఆసుపత్రికి వస్తే వారిని మోసం చేస్తూ డబ్బులు వసూళ్లకు తెగబడుతున్నారు. కొంత మంది సిబ్బంది ఆసుపత్రి ముందు తిష్ట వేసి సర్టిఫికెట్ల కోసం వచ్చేవారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని వేలల్లో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా మీసేవకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో సర్టిఫికెట్ వస్తుంది. అది తెలియని వారిని దళారులు బోల్తా కొట్టిస్తున్నారు. ఇలా ఉచితంగా పొందాల్సిన సర్టిఫికెట్లకు వేలల్లో వసూలు చేస్తుండడంతో సర్టిఫికెట్లు పొందే వారు ఆందోళన చెందుతున్నారు. మరణ ధ్రువీకరణాల పరిస్థితి దారుణం జనన ధ్రువీకరణ సర్టిఫికెట్లకే ఇంత ఇబ్బంది అవుతుంటే ఇక మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ల విషయంలో చుక్కలు చూపిస్తున్నారు. ఏకంగా సిబ్బందితో కుమ్మక్కై దళారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఆన్లైన్లో రికార్డు లేకపోతే ఆసుపత్రి నుంచి మరణ నివేదికను తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని రికార్డులను దాచిపెట్టి దొరకడం లేదంటూ ఆసుపత్రి చుట్టూ తిప్పుకుంటున్నారు. చివరకు బేరం కుదిరితే రికార్డులు దొరికాయంటూ మరణ నివేదిక రాసి ఇస్తున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం.. జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం వచ్చేవారు ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు. సర్టిఫికెట్లు ఆన్లైన్ ద్వారా ఉచితంగా పొందాలి. ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా ఆసుపత్రిలో ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం. ఆసుపత్రి సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు నిరూపణ అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ జ్యోతి, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో చదవండి: అబ్దుల్లాపూర్ మెట్లో దారుణం.. జంట మృతదేహాల కలకలం -
డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదని.. కార్యాలయం ఎదుట..
దోమ( వికారబాద్): నెలరోజుల క్రితం తన తండ్రి మరణధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసినా అధికారులు నిర్లక్ష్యంతో ఇవ్వలేదని మనోవేదనకు గురైన ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘంన శుక్రవారం దోమ మండల పరిషత్ కార్యాలయం ఎదుట జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని రాకొండ గ్రామానికి చెందిన బండి నర్సింలు రెండు నెలల క్రితం మరణించాడు. ఆయనకు భార్యలు సాయమ్మ, బాబమ్మ ఉన్నారు. సాయమ్మ వివాహమైన రెండు నెలలకు భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోవడంతో నర్సింలు బాబమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొడుకు శ్రీనివాస్ తండ్రి మరణ «ధ్రువీకరణపత్రం కోసం జనవరి 25న పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేశాడు. నెలరోజులు గడుస్తున్నా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై శుక్రవారం అతడు కుటుంబీకులతో కలిసి వచ్చి ఎంపీడీఓ జయరాంను కలిస్తే ఇష్టానుసారంగా మాట్లాడారని శ్రీనివాస్ ఆరోపించాడు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డెత్ సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు మండల పరిషత్ కార్యాలయం నుంచి కదిలేదిలేదని కుటుంబసభ్యులతో అతడు నిరసనకు దిగాడు. ఎంతకూ ఎంపీడీఓ బయటకు రాకపోవడంతో శ్రీనివాస్ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి వెంటనే అతని వద్ద నుంచి పెట్రోల్ డబ్బాను లాకున్నారు. అంతలోనే ఎంపీడీఓ జయరాం బయటకు వచ్చి శ్రీనివాస్ కుటుంబీకులకు డెత్ సర్టిఫికెట్ అందజేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉద్దేశపూర్వకంగా ఆలస్యం.. రాకొండ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై తాను ఆర్టీఐకి దరఖాస్తు చేశానని, దీంతోనే అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ అధికారులు ఉద్దేశపూర్వకంగా తన తండ్రి డెత్ సర్టిఫికెట్ ఆలస్యం చేశారని బండి శ్రీనివాస్ తెలిపాడు. సర్పంచ్ భర్త, అతని సోదరుడితో పాటు ఎంపీడీఓ జయరాం కలిసి సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయమై ఎంపీడీఓ జయరాంను వివరణ కోరగా.. శ్రీనివాస్ డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని, రాకొండ పంచాయతీ కార్యదర్శి బదిలీ కావడంతో మరొకరికి బాధ్యతలు అప్పగించామన్నారు. బండి నర్సింలుకు ఇద్దరు భార్యలు ఉండటంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి సర్టిఫికెట్ ఇవ్వాలని కార్యదర్శికి సూచించినట్లు చెప్పారు. బాధితులు పంచాయతీ కార్యదర్శికి ఫామ్ నంబర్ – 2 ఇవ్వకపోవడంతో ఆలస్యం జరిగిందన్నారు. నిబంధనల మేరకు ఫామ్ తీసుకొని సర్టిఫికెట్ అందజేశామని స్పష్టం చేశారు. కేసు నమోదు డెత్ సర్టిఫికేట్ కోసం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం నేరమని, దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
దారుణం: గతేడాది కోవిడ్‌తో చనిపోతే.. ఇప్పుడు మృతదేహాలు అప్పగింత!
బెంగళూరు: ఏడాది క్రితం కరోనా మహమ్మారి కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన రెండు కుటుంబాలకు బెంగళూరులోని రాజాజి ఆసుపత్రి నుంచి ఊహించని షాక్ ఎదురైంది. అయితే తమ ప్రియమైన వ్యక్తులు కరోనా బారినపడి చనిపోయిన ఏడాది తర్వాత మీ సంబంధికుల మృతదేహాలు ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయంటూ ఆసుపత్రి సిబ్బంది నుంచి కాల్ వచ్చింది. దాంతో సదరు కుటుంబ సభ్యులు అయోమయానికి గురి కావడమే కాక అసలు విషయం తెలుసుకుని షాక్‌కి గురయ్యారు. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) అయితే నిజానికి ఆ మృతులు దుర్గా సుమిత్ర (40), మునిరాజు (50) గతేడాది కరోనాతో మృతిచెందారు. అంతేకాక బెంగళూరులోని రాజాజీనగర్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మోడల్ ఆస్పత్రి సర్టిఫికేట్లలో గతేడాది జూలై 2, 2020న మరణించినట్లు మరణ ధృవీకరణ పత్రాలు కూడ ఇచ్చింది. పైగా ఆ సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృభించడంతో ఆస్పత్రి సిబ్బంది మృతదేహాలను ఇవ్వమని చెప్పారు. ఈ మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) ఆ మృత దేహాలకు దహన సంస్కారాలు నిర్వహించాం అని కూడా ఆయా బాధిత కుటుంబాలకు తెలియజేసింది. అయితే ఇటీవలే మూడురోజుల క్రితం బాధిత కుటుంబాలకి మీ వాళ్ల మృతదేహాలు మార్చురీలో ఉన్నాయంటూ సదరు ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించింది. అయితే సదరు బాధిత కుటుంబాలు తాము మొదటగా నమ్మలేదని ఆసుపత్రికి వెళ్తే అసలు విషయం తెలిసిందని అంటున్నారు. దీంతో ఆయా బాధిత కుటుంబాలు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష వైఖరి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ మేరకు సదరు ఆస్పత్రి ఆధికారులు సిబ్బంది పై చర్యలు తీసుకోవడమే కాక అసలు ఇది ఎలా జరిగిందో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: దూషించొద్దు అన్నందుకు స్నేహితులే హత్య చేశారు!) -
హలో సార్.. వచ్చి డెత్ సర్టిఫికెట్ తీసుకెళ్లండి
చిన్నపాటి నిర్లక్క్ష్యం ఒక్కోసారి పెద్ద అనర్థాలకే దారి తీస్తుంది. కరోనా టైంలో ప్రజా సంక్షేమం గురించి బాగానే ఆరాలు తీసిన అధికారులు.. చిన్న తప్పిదంతో బతికున్న ఓ వ్యక్తిని రికార్డులో చంపేశారు. అంతేకాదు కాల్ చేసి మరీ మరణ ధృవీకరణ పత్రం తీసుకెళ్లమని ఆయనకే ఫోన్ చేసి చెప్పారు. ఊహించని ఆ అనుభవంతో ఖంగుతిన్న ఆయన.. మీడియా ముందుకు వచ్చాడు. ముంబై: థానే మాన్‌పడాలో టీచర్‌గా పనిచేస్తున్నాడు చంద్రశేఖర్ దేశాయ్(54). కిందటి ఏడాది ఆగష్టులో ఆయన కరోనా వైరస్ బారినపడి కోలుకున్నాడు. ఇంట్లో ఉండే ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఐసోలేషన్ టైంలో తన ఆరోగ్యం గురించి మున్సిపాలిటీ అధికారులు రోజూ ఆరాతీస్తుంటే మురిసిపోయాడాయన. కట్ చేస్తే.. ఈమధ్యే ఆయనకు మరో కాల్ వచ్చింది. ఈసారి ఆయన కూడా ఊహించని ప్రశ్న ఎదురైంది. థానే మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి ఓ మహిళా ఆఫీసర్ ఆయన నెంబర్‌కు కాల్ చేసి.. చంద్రశేఖర్ దేశాయ్ పేరు మీద డెత్ సర్టిఫికెట్ సిద్ధమైందని, వచ్చి తీసుకెళ్లాలని కోరింది. అయితే తాను బతికే ఉన్నానని చెప్పడంతో ఆమె కంగారుపడిపోయింది. ఆ ఇంట్లో ఇంకెవరైనా కొవిడ్‌తో చనిపోయారా? అని ఆమె ఆరా తీసిందట. ‘లేదు’ అని చెప్పడంతో ఆ కాల్ కట్ అయిపోయిందని చంద్రశేఖర్ మీడియా ముందు వాపోయాడు. ఇక ఈ ఘటన తర్వాత సరాసరి థానే మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లాడాయన. అక్కడి అధికారులకు ఘటనపై ఫిర్యాదు చేశాడు. మున్సిపాలిటీ వాళ్లు పంపకుండా ఐసీఎంఆర్‌కు తన పేరు ఎలా వెళ్లిందని, దీనికి సమాధానం కావాలని కోరుతున్నాడాయన. ఇక ఈ ఘటనపై టీఎంసీ అధికారులు స్పందించారు. పొరపాటు జరిగిందని చెబుతూ.. దానిని సవరించే ప్రయత్నం చేస్తారని వెల్లడించారు. చదవండి: చిన్నగొడవ.. డాక్టర్ దంపతుల ఆత్మహత్య -
డెత్ సర్టిఫికెట్ కోసం ‘యుద్ధం’: స్పందించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తన తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం, సైన్యంలోనే కల్నల్ హోదాలో పనిచేస్తున్న ఆయన కుమారుడు జీహెచ్ఎంసీతో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. చివరకు మంత్రి కేటీఆర్ స్పందించడంతో సమస్య పరిష్కారమైంది. సైన్యంలో పనిచేసి పదవీ విరమణ అనంతరం సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలో నివసిస్తున్న సత్యబ్రత దాస్‌గుప్తా (84)ఈ నెల 9వ తేదీన మృతి చెందారు. ఆయన కుమారుడు కల్నల్ జాయ్ దాస్‌గుప్తా కూడా ఒక బెటాలియన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న జాయ్, తండ్రి మరణవార్త తెలుసుకుని నగరానికి వచ్చారు. ఎన్నో ఇబ్బందుల మధ్య నేరేడ్మెట్ శ్మశానవాటికలో తండ్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. తిరిగి విధుల్లో చేరాల్సి ఉండటంతో, తండ్రి డెత్ సర్టి ఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీన శ్మశానవాటికకు వెళ్లారు. అయితే శ్మశాన వాటిక నిర్వాహకులు అంత్యక్రియలకు సంబంధించిన రశీదు ఇవ్వలేదు. ఇటీవలి కాలంలో మరణాలు పెరిగి, రశీదు పుస్తకాలు అయిపోయాయని, జీహెచ్ఎంసీ నుంచి కొత్త పుస్తకాలు రాలేదని వారు తెలిపారు. విషయాన్ని ఫిర్యాదు చేసేందుకు కల్నల్ జాయ్ జీహెచ్ఎంసీ యాప్‌లో ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసినా సమస్య పరిష్కారం కాలేదు. జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయానికి వెళ్లాల్సిందిగా వారు సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో పనిచేస్తున్న ఒకరు, దాస్‌గుప్తా పరిస్థితిని వివరిస్తూ మంత్రి కేటీఆర్‌కు ఈ నెల 13వ తేదీన ట్వీట్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి, అధికారులతో మాట్లాడి సోమవారం డెత్ సర్టిఫికెట్ జారీ చేయించారు. ఇకముందు ఇలాంటి పరిస్థితి రాకుండా పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌కు కేటీఆర్ సూచించారు. -
బతికుండగానే చంపేశారు
నెల్లూరు సిటీ: నగర పాలక సంస్థకు చెందిన రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికురాలిని బతికుండగానే చంపేశారు. తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంతో ఆమె ఉద్యోగాన్ని మరో మహిళకు కేటాయించారు. బాధిత మహిళ ఫిర్యాదుతో గతంలో హెల్త్ విభాగం అధికారులు, సిబ్బంది కలిసి చేసిన నిర్వాకం బట్టబయలైంది. ఈ విషయమై మున్సిపల్ హెల్త్ అధికారి వెంకటరమణ పాతరికార్డులను పరిశీలించగా కొత్త కోణాలు వెలుగుచూశాయి. అప్పటి అధికారులు, సిబ్బంది కలిసి తప్పుడు పత్రాలతో బాధిత మహిళతో ఎటువంటి సంబంధం లేని మరో మహిళకు ఉద్యోగం కట్టబెట్టినట్లు తేలింది. (నేను బతికే ఉన్నా సారూ!) వివరాల్లోకి వెళితే..నగర పాలక సంస్థ పరిధిలో 1995 నుంచి రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికురాలిగా కిష్టమ్మ అనే మహిళ పనిచేస్తోంది. కిష్టమ్మ భర్త బీమగుంట కోటేశ్వరరావు. నెల్లూరు మున్సిపాలిటీలో రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహించేవాడు. కోటేశ్వరరావు మృతితో ఆ ఉద్యోగాన్ని అప్పటి కమిషనర్ కిష్టమ్మకు కేటాయించారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొద్దికాలం పాటు ఆమె పనికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు కార్పొరేషన్ ఉద్యోగులు చేతివాటం చూపి ఆమె ఉద్యోగాన్ని మరొకరికి కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. 1997లోనే కిష్టమ్మ మృతి చెందినట్లు 2012లో తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు. ఆమెతో ఏ సంబంధం లేని రమాదేవి అనే మహిళకు ఉద్యోగాన్ని కేటాయించారు. చనిపోయిన కోటేశ్వరరావు తమ కూతురుకు ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు, ఆ మేరకు ఉద్యోగాన్ని కేటాయించినట్లు రికార్డుల్లో పేర్కొనడం కొసమెరుపు. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్లు స్పష్టమవుతోంది. అక్రమాలపై విచారణ ముమ్మరం రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికురాలి ఉద్యోగాన్ని మరో మహిళకు అప్పగించడంపై ఎంహెచ్ఓ వెంకటరమణ విచారణ చేపట్టారు. హెల్త్విభాగంలోని పాతరికార్డులను పరిశీలించగా కొత్తకోణాలు వెలుగుచూశాయి. అప్పటి హెల్త్ ఉద్యోగులు, సిబ్బంది కలిసి తప్పుడు మరణ ధ్రువీకరణపత్రాలతో మరొకరికి ఉద్యోగం కట్టబెట్టారని తేలింది. దీంతో ఆధారాలను ఎంహెచ్ఓ ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. -
నేను బతికే ఉన్నా సారూ!
నెల్లూరు సిటీ: 2012వ సంవత్సరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహించిన ఓ మహిళను మృతిచెందినట్లుగా ధ్రువపత్రాలు సృష్టించి ఆమె స్థానంలో మరో మహిళను పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 2012 సంవత్సరంలో కృష్ణమ్మ అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తుండేది. అప్పట్లో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పారిశుద్ధ్య పనులకు వెళ్లలేకపోయేది. కొన్ని నెలలపాటు పనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హెల్త్ విభాగంలోని ఓ ఉద్యోగి కృష్ణమ్మ మృతిచెందినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించారు. కృష్ణమ్మ కూతురుగా మరో మహిళను పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించారు. ఈ వ్యవహారం వెనుక హెల్త్ విభాగం అధికారులు, సిబ్బంది పాత్ర ఉందని స్పష్టమవుతోంది. అయితే ఆమె తన ఆరోగ్యం కుదుటపడిందని తిరిగి పనిలో చేర్చుకోవాలని గతంలో అధికారులను వేడుకోగా ఆమె స్థానంలో వేరే వాళ్లను నియమించామని చెప్పి పంపించేశారు. దీంతో ఆమె అప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మరోసారి కార్పొరేషన్ అధికారుల వద్ద తన పరిస్థితిని తెలియజేసేందుకు రెండు రోజుల క్రితం కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చింది. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ వద్ద తన గోడు వినిపించింది విచారణలో బట్టబయలైన నిజాలు కృష్ణమ్మ తాను గతంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేశానని, ఆరోగ్యం సరిగాలేక రాలేకపోయానని, తిరిగి తనను పారిశుద్ధ్య కార్మికురాలిగా తీసుకోవాలని ఎంహెచ్ఓ వెంకటరమణను కోరింది. దీంతో ఆమె గతంలో పనిచేసిన వివరాలను పరిశీలించారు. 2012లో అప్పటి ఉద్యోగులు చేసిన అక్రమాలు వెలుగుచూశాయి. బతికి ఉన్న మహిళను చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి ఆమె స్థానంలో మరో మహిళను పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించిన ఘటన వెలుగుచూసింది. కృష్ణమ్మ కూతురుగా రమాదేవి అనే మహిళను పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించారు. ఈ ఘటన వెనుక అప్పటి నాయకులు, అధికారులు పాత్ర ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ఎంహెచ్ఓ వెంకటరమణ విచారిస్తున్నారు. -
బతికున్న భార్యకు డెత్‌సర్టిఫికెట్
తిరువొత్తియూరు: బతికున్న భార్యకు డెత్ సర్టిఫికెట్ కోసం దాఖలు చేసిన భర్త వ్యవహారం చెన్నై కొడుంగయూరులో సంచలనం కలిగించింది. కొడుంగయూరుకు చెందిన జమీలాబీవి భర్త బాబు రైల్వే ఉద్యోగి. వీరికి మహ్మద్ అలీ అనే కుమారుడు ఉన్నాడు. బాబు 1992లో జమీలాబీవి నుంచి విడిపోయి తిరువళ్లూరు ఎగటూరుకు చెందిన లలితాదేవిని వివాహం చేసుకున్నాడు. గత ఏడాది బాబు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో భార్య జమీలాబీవి రైల్యేశాఖ నుంచి రావాల్సిన ఫలాల కోసం రైల్వే అధికారులను సంప్రదించింది. అయితే మొదటి భార్య మృతి చెందినట్లు బాబు డెత్ సర్టిఫికెట్ అందజేసి నామినీగా రెండో భార్య లలితాదేవి పేరును మార్చివున్నట్లు అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో ఇద్దరు భార్యలు, కుమారుడు చెన్నై న్యాయవ్యవహారాల కమిషన్ న్యాయమూర్తి జయంతి వద్ద పిటీషన్ దాఖలు చేశారు. అందులో కుమారుడికి భర్త ఉద్యోగం, డెత్‌సర్టిఫికెట్ దాఖలు చేయడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి రైల్వే అధికారులకు నోటీసులు జారీ చేశారు. అలాగే డెత్ సర్టిఫికెట్ మంజూరు చేయడంపై తిరువళ్లూరు జిల్లా జనన, మరణ సర్టిఫికెట్స్ జారీ చేసే అధికారికి నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. -
అద్దెకు ఇస్తే అమ్మేశాడు
బంజారాహిల్స్: బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు పత్రాలు సృష్టించి ఓఎల్ఎక్స్లో కారును అమ్మకానికి పెట్టి మోసగించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎన్బీటీ నగర్‌కు చెందిన నుకుం శ్రీలత అనే మహిళ ఓఎల్ఎక్స్లో హుందాయ్ ఐ–20(టీఎస్ 08 ఎఫ్‌టి 6402) కారు అమ్మకానికి ఉన్నట్లు తెలుసుకుని అందులో ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా జూలై 20న కేపీహెచ్‌బీకి చెందిన పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణను సంప్రదించింది. తన అన్న సురేష్‌జాదవ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని అతడికి చెందిన కారును విక్రయిస్తున్నట్లు అతను పత్రాలు చూపడంతో అతడి మాటలు నమ్మిన శ్రీలత రూ. 4.75 లక్షలకు కారును కొనుగోలు చేసింది. అయితే సదరు కారుపై బేగంపేట ఎస్.బ్యాంకులో లోన్ ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి విచారిచగా సదరు సురేష్ జాదవ్ బతికే ఉన్నట్లు బ్యాంకు అధికారి తెలిపాడు. దీంతో సురేష్ జాదవ్‌కు ఫోన్ చేయగా కారును బాల వంశీకృష్ణ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చినట్లు తెలిపాడు. బతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా చిత్రీకరించి ఓఎల్ఎక్స్లో అద్దెకు తీసుకున్న కారును విక్రయానికి పెట్టి తమను మోసం చేశాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
48 గంటల్లో మరణ ధ్రువీకరణ పత్రం
సాక్షి, హైదరాబాద్: రైతు బీమా కింద క్లెయిమ్స్‌కు అవసరమైన రైతు మరణ ధ్రువీకరణ పత్రం ఇక 48 గంటల్లోనే రానుంది. ఈ పత్రాలను అందించడంలో గ్రామ కార్యదర్శి వేగంగా స్పందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఒకవేళ రైతు పట్టణాల్లో చనిపోయినా మున్సిపల్ కమిషనర్ 48 గంటల్లోగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలని సీఎం స్పష్టంచేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 14 నుంచి రైతు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా రైతు బాండ్ల పంపిణీ పూర్తికానుంది. మంగళవారం నుంచి రైతులెవరైనా చనిపోతే వారికి ఎల్ఐసీ నుంచి బీమా సొమ్ము అందనుంది. బాండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తి చేసిన వ్యవసాయ శాఖ.. ఇప్పుడు క్లెయిమ్స్ ఇప్పించే అంశంపై దృష్టి సారించింది. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని ఎల్ఐసీనే చేపట్టాలి. కానీ ఎల్ఐసీకి విస్తృత నెట్వర్క్ లేనందున ఆలస్యమయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. అందుకే ఎక్కడైనా రైతు చనిపోయిన వెంటనే తక్షణమే వారికి మరణ ధ్రువీకరణ ఇప్పించడంతోపాటు ఇతరత్రా అన్ని వివరాలను ఎల్ఐసీకి పంపి పది రోజుల్లో క్లెయిమ్స్ ఇప్పించాలని నిర్ణయించింది. 27 లక్షల మంది రైతులకు బీమా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము అందించడమే రైతు బీమా ఉద్దేశం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు ఉండి, రైతుబంధు చెక్కు పొందిన ప్రతి రైతుకూ బీమా సౌకర్యం ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 48.77 లక్షల మంది రైతులకు రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ నివేదిక ప్రకారం 47.31 లక్షల మంది రైతులు బీమా కోసం వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించారు. ఇందులో 27,00,416 మంది రైతులు నిబంధనలకు అనుగుణంగా బీమాకు అర్హులయ్యారు. వారిలో ఎవరైనా చనిపోతే మంగళవారం నుంచి బీమా క్లెయిమ్స్ అందిస్తారు. రైతు కుటుంబాలకు పది రోజుల్లోనే క్లెయిమ్స్ అందించేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనుంది. అందుకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతో వ్యవసాయశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. రైతు చనిపోతే వ్యవసాయశాఖ అధికారులు.. క్లెయిమ్ కం డిశ్చార్జి ఫారం, మరణ ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీ, సదరు రైతు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, రైతు బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్‌లను స్కాన్ చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఎన్ఐసీకి ఆ సమాచారం పంపుతారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఎన్ఐసీ నుంచి ఆటోమెటిక్‌గా ఎల్ఐసీకి రైతు డాక్యుమెంట్లతో సమాచారం వెళ్తుంది. డాక్యుమెంట్లను పరిశీలించిన వెంటనే ఎల్ఐసీ వర్గాలు నామినీ బ్యాంకు ఖాతాలో క్లెయిమ్ సొమ్ము జమ చేస్తారు. మరోవైపు ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది రైతులు బీమా పథకంలో చేరేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. -
బతికుండగానే డెత్ సర్టిఫికెట్ !
కరీంనగర్‌కార్పొరేషన్ : కరీంనగర్ కార్పొరేషన్ అధికారుల్లో నిర్లక్ష్యం ఎంతమేరకు పేరుకుపోయిందే తాజా సంఘటనే ఉదాహరణ. అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లడంలో జాప్యం చేస్తున్న బల్దియా అధికారులు వివిధ సర్టిఫికెట్ల జారీలోనే అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బతికుండగానే చనిపోయినట్లు సర్టిఫికెట్ జారీ చేశారు. విషయం తెలుసుకున్న బాధితుడు సోమవారం కార్పొరేషన్ ఎదుట ఆందోళనకు దిగాడు. కరీంనగర్‌కు చెందిన మహ్మద్ జమాలొద్దీన్‌తవక్కళికి బతికుండానే డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆయుష్ డిపార్ట్మెంట్లో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్న జమాలొద్దీన్ 1977 జనవరి 28న చనిపోయినట్లు 2017లో సర్టిఫికెట్ జారీ కాగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్‌నగర్‌కు చెందిన మహ్మద్ జమాలొద్దీన్‌తవక్కళి 1962 మార్చి 4న జన్మించారు. అంధుడైన జమాలొద్దీన్ 1991 డిసెంబర్లో ఆయుష్ డిపార్ట్మెంట్లో అటెండర్‌గా ఉద్యోగంలో చేరారు. జమాలొద్దీన్‌తవక్కళి తండ్రి ఖాసీమొద్దీన్ పేరిట ఉన్న ఉమ్మడి ఆస్తిని సోదరుడు సిరాజొద్దీన్ కుమారుడు ఇలియాసొద్దీన్ విక్రయించాడు. తనకు తెలియకుండా ఉమ్మడిఆస్తిని అమ్మడంతో జమాలొద్దీన్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే జమాలొద్దీన్ పదిహేనేళ్ల వయస్సులోనే చనిపోయినట్లు సర్టిఫికెట్ పెట్టి తమకు వారసులు లేరని నమ్మించి ఇతరులకు రిజిస్ట్రేషన చేసినట్లు వెలుగుచూసింది. డెత్ సర్టిఫికెట్లో తన తండ్రి పేరు ఖాసీమొద్దీన్‌కు బదులు ఖాసీంఅలీగా ఉందని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఆస్తిని అమ్ముకునేందుకే తన అన్న కుమారుడు ఈ నీచానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బల్దియా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టకుండా సర్టిఫికెట్ ఎలా జారీచేస్తారని ప్రశ్నించారు. సర్టిఫికెట్ జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, సదరు డెత్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డెత్ సర్టిఫికెట్‌ను చూపిస్తున్న బాధితుడు జమాలొద్దీన్ విచారణ జరిపిస్తాం కరీంనగర్‌కు చెందిన మహ్మద్ జమాలొద్దీన్ 1977లో చనిపోయినట్లు 2017లో డెత్ సర్టిఫికెట్ జారీ అయినట్లు ఫిర్యాదు అందింది. డెత్‌సర్టిఫికెట్ ఎలా జారీ అయ్యిందనే విషయంపై విచారణ చేపట్టాలని కౌన్సిల్ సెక్రటరీ గౌతంరెడ్డికి ఆదేశాలు జారీ చేశాం. తప్పుడు సర్టిఫికెట్ అని తేలితే రద్దు చేస్తాం. తప్పుడు సర్టిఫికెట్ జారీ చేయడంలో ఉద్యోగులు బాధ్యులైతే చర్యలు తీసుకుంటాం. – కె.శశాంక, కార్పొరేషన్ కమిషనర్ -
బతికి ఉన్న వ్యక్తికే డెత్ సర్టిఫికెట్ ఇచ్చేశారు!
-
భర్త ఉండగానే మరో వ్యక్తితో వివాహం
బనశంకరి : భర్త జీవించి ఉండగానే మృతి చెందినట్లు నకిలీ ధ్రువీకరణపత్రం తయారు చేసిన ఓ వివాహిత మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఈ ఉదంతం కుమారస్వామిలేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన నాగరాజ్ అనే వ్యక్తి బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల నాగరాజ్ భార్య మృతిచెందడంతో మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు. ఈ సమయంలో చిక్కబళ్లాపుర నివాసి వెంకటలక్షి పరిచయమైంది. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో తన భర్త 1990లో మృతి చెందినట్లు వెంకటలక్ష్మి చిక్కబళ్లాపురం తహసీల్దార్ కార్యాలయంలో ధ్రవీకరణపత్రం తీసుకుంది. వివాహమైన అనంతరం వెంకటలక్ష్మి నాగరాజ్ కట్టిన బంగారుమంగళసూత్రం తో పాటు ఇతర బంగారుఆభరణాలు విక్రయించింది. దీంతో అనుమానపడిన నాగరాజ్ చిక్కబళ్లాపుర తహశీల్దార్ కార్యాలయంలో విచారించగా వెంకటలక్ష్మీ భర్త బతికి ఉన్నట్లు తెలిసింది. దీంతో నాగరాజ్ శుక్రవారం కుమారస్వామిలేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
శ్రీదేవి కేసు; దుబాయ్ అధికారుల తప్పిదాలు!
సాక్షి, వెబ్‌డెస్క్ : యావత్ భారతావని అతిలోక సుందరిగా ఆరాధించే శ్రీదేవి అకాల మరణంపై దుబాయ్ అధికారుల వరుస తప్పిదాలు చర్చనీయాంశమవుతున్నాయి. తాను బసచేసిన జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లో ఫిబ్రవరి 24 రాత్రి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి శ్రీదేవి చనిపోయారని అక్కడి పోలీసులు, ఆరోగ్య శాఖ, ప్రాసిక్యూటర్లు నిర్ధారించారు. అయితే ఈ మేరకు జారీ అయిన డెత్, ఎంబామింగ్ సర్టిఫికేట్లలో మృతురాలి వివరాలను ఒక్కోచోట ఒక్కోలా పేర్కొనడం గమనార్హం. గల్ఫ్ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి అంశాలనైనా అధికారులుగానీ, మీడియాగానీ బయటకు వెల్లడించడానికి వీలేలేదు. ఆఖరికి దుబాయ్ రాజు కూడా విచారణలో జోక్యం చేసుకునేవీలులేదన్న విషయం తెలిసిందే. మరి అంత పకడ్బందీగా సాగే వ్యవహారాల్లో తప్పులు చోటుచేసుకోవడం, అదికూడా శ్రీదేవి లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీ విషయంలో జరుగడం అధికారుల నిర్లక్ష్యమనే చెప్పాలి. శ్రీదేవి వయసెంత? శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్ అలియాస్ శ్రీదేవి 1963, ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశీలో జన్మించారన్నది నిర్వివాదాంశం. ఆ ప్రకారం చనిపోయేనాటికి ఆమె వయసు 54 ఏళ్లపైమాటే. కానీ యూఏఈ ఆరోగ్య శాఖ జారీచేసిన డెత్ సర్టిఫికేట్లో శ్రీదేవి వయసు 53 ఏళ్లుగా పేర్కొన్నారు. అదే ఎంబామింగ్ ప్రక్రియకు సంబంధించి అదే శాఖ జారీ చేసిన మరో ఆదేశాల్లో మృతురాలి వయసును 52 ఏళ్లని రాశారు. అందరికీ తెలిసినట్లు ఆమె వయసు 54 ఏళ్లు కాకుండా పాస్‌పోర్టులో మరోలా ఉందనుకున్నా, రెండు సర్టిఫికేట్లలోనూ దానినే పేర్కొనాలి. కానీ అలా జరగలేదు. ఒక్కోచోట ఒక్కోలా వయసును పేర్కొనడం ఖచ్చితంగా పొరపాటే. ఇప్పటికే నటి మరణంపై కొన్ని అనుమానాలు తలెత్తిన దరిమిలా దీనిపై దుబాయ్ అధికారులు వివరణ ఇస్తారా లేదా అన్నది తేలాల్సిఉంది. ఫిబ్రవరి 27న యూఏఈ ఆరోగ్య శాఖ జారీ చేసిన ఎంబామింగ్ సర్టిఫికేట్ ఇది(వయసు52గా పేర్కొన్నారు) ఆ మూడురోజులూ శ్రీదేవి మృతదేహం అక్కడే.. యూఏఈ ఆరోగ్య శాఖ భవనంలో పోస్ట్‌మార్టం అనంతరం భారత కార్మికుల మృతదేహాలను ఎక్కడైతే భద్రపరుస్తారో అదే చోట శ్రీదేవి మృతదేహాన్ని కూడా మూడు రోజులపాటు ఉంచారు. మంగళవారం సాయంత్రానికి దర్యాప్తు పూర్తయినట్లు అధికారులు వెల్లడించడంతో శ్రీదేవి భౌతికకాయాన్ని ఎంబామింగ్ చేసి విమానాశ్రయానికి తరలించారు. నిజానికి దుబాయ్ అధికార వర్గాలు ఇలాంటి అధికారిక ప్రకటనలు చేయడం అరుదు. అయితే శ్రీదేవి మరణం, ఆమె భౌతికాయాన్ని ఎప్పుడు తీసుకొస్తారనేదానిపై స్వదేశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యాన్ని వివరిస్తూ భారత్‌లోని యూఏఈ దౌత్యవర్గాలు తమ ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు సమాచారం. ఫిబ్రవరి 26న జారీ అయిన శ్రీదేవి డెత్ సర్టిఫికేట్ (వయసు 53గా రాశారు) నేడు అంత్యక్రియలు : శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానులు, శ్రేయోభిలాషుల చివరి చూపుకోసం ముంబై లోఖండ్‌వాలాలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 వరకు ఉంచునున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. విల్లే పార్లేలోని సేవా జమాజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. -
ఆశకు పోయి.. అడ్డంగా దొరికాడు..!
నల్లగొండ టూటౌన్ : ఆయన విభాగమే రెవెన్యూ.. తన పనులను పక్కన బెట్టి ఇతర విభాగాల్లో వేలు పెట్టి చూశాడు. తన విభాగంలో తీసుకుంటున్న కమీషన్లు సరిపోవని అత్యాశకు పోయాడు.. ఆ అత్యాశే ఇప్పుడు కొంప ముంచింది. కమీషన్ల కోసం కక్కుర్తిపడి చనిపోని వ్యకిక్తి మరణ ధ్రువీకరణ పత్రం ఇప్పించి పోలీసులకు అడ్డంగా దొరికాడు. ఈ ఘటన నీలగిరి మున్సిపాలిటీలో వెలుగుచూసింది. ఏ ఆధారం లేకుండా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి నీలగిరిలో మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు అయ్యిందంటే మన మున్సిపాలిటీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిప్యుటేషన్‌పై నీలగిరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారి (ఆర్వో) ఆరీపోద్దీన్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రవిశంకర వర్మ అలియాస్ కృష్ణమోహన్ శర్మ 2016లో మృతిచెందినట్లు నీలగిరి మున్సిపాలిటీ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్ సోదరుడు కృష్ణమోహన్ శర్మ గుంటూరులో ఆత్మహత్య చేసుకున్నాడని.. అక్కడ మరణ ధ్రువీకరణ తీసుకుంటే ఆయనకు వచ్చే బీమా డబ్బులు రావని, సాధారణ మరణంతో చనిపోయినట్లు ధ్రువపత్రం ఇప్పించాలని మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్వోను సంప్రదించాడు. ఆయన కుటుంబానికి బీమా (ఇన్సూరెన్స్) కార్యాలయం నుంచి డబ్బులు రావాలంటే సర్టిఫికెట్ తప్పని సరి అని చెప్పాడు. ద్రువపత్రం జారీ చేసినందుకు కొంత నగదు ముట్టజెప్పుతానని ఆర్వోతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. సుమారుగా రూ. 50 వేలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. తర్వాత జనన, మరణ ద్రువపత్రాల విభాగం ఉద్యోగులపై ఒత్తిడితెచ్చి మరణ ధ్రువీకరణ పత్రం ఇప్పిం చాడు. నల్లగొండ పట్టణానికి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తికి మరణ ద్రువీకరణ పత్రం జారీ చేసిన విషయం బహిర్గతం కావడంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. బీమా కంపెనీకి టోకరా.. మున్సిపల్ ఉద్యోగులు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రంతోనే కృష్ణమోహన్ శర్మ హైదరాబాద్‌లోని బీమా కార్యాలయంలో రూ.19 లక్షలు క్లయిమ్ చేశారు. ఇలా కృష్ణమోహన్ శర్మ బీమా కంపెనీకి టోకరా పెట్టాడు. ఆయనకు తెలిసిన నల్లగొండలోని మాజీ కౌన్సిలర్ సోదరుడి ద్వారా ఇక్కడి ధ్రువపత్రం సంపాదించారు. రూ.19 లక్షల క్లయిమ్పై అనుమానం వచ్చిన బీమా కంపెనీ కార్యాలయం బాధ్యులు హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయట పడింది. అక్కడి పోలీసులు వచ్చి మున్సిపల్ కార్యాలయంలోని ఆర్వోతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులను హైదరాబాద్‌కు తీసుకెళ్లి విచారించి వారి నుంచి పూర్తి వివరాలు రాబట్టారు. పోలీసుల విచారణలో కృష్ణ మోహన్‌శర్మ చనిపోకుండానే బీమా డబ్బులు క్లయిమ్ చేసినట్లు తేలింది. అసలు మరణ ద్రువీకరణ పత్రం ఇవ్వడంతోనే ఇది సాధ్యమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. కృష్ణమోహన్ శర్మ, మాజీ కౌన్సిలర్ సోదరుడు, మున్సిపల్ ఆర్వోలపై కేసులు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు పంపారు. దాంతో ఇక్కడి కార్యాలయంలో అవినీతి, అక్రమాలకు అలవాటు పడిన కొంతమంది ఉద్యోగుల వల్ల మరో మారు నీలగిరి మున్సిపాలిటీ పేరు రాష్ట్ర రాజధానిలో చర్చనీయాశమయ్యింది. పోలీసులు సమాచారం ఇచ్చారు మరణ ధ్రువపత్రం జారీ చేసిన విషయంలో హైదరాబాద్ పోలీసులు ఆర్వో అరీపోద్దీన్ అరెస్ట్ విషయంపై ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. – కె. వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ -
ఆ డెత్ సర్టిఫికెట్‌పై వివరణ ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్: చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా తన సోదరి మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న కేసులో శుక్రవారం ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మెదక్‌లో తన సోదరి చనిపోతే బాన్సువాడ ఆస్పత్రిలో మరణించినట్లుగా అధికారులు ధ్రువపత్రం ఇచ్చారని మెదక్‌కు చెందిన జ్యోత్స్న కమలాదేవి పిటిషన్ దాఖలు చేశారు. మృతురాలి భర్త అయిన తన బావ తప్పుడు ధ్రువీకరణపత్రాన్ని సృష్టించారని.. దీనిపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చిందని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్టాఫ్‌నర్సుగా పనిచేసే ఎలిజిబెత్ రాణి, గత మార్చి 11న ఉదయం గుండెపోటుతో మెదక్‌లో మరణించగా, రాణి భర్త హనుమాండ్లు ఆమె ఆస్తి కొట్టేసేందుకు బాన్సువాడ ఆస్పత్రిలో తప్పుడు మరణ ధ్రువీకరణపత్రాన్ని పొందారని పిటిషన్ తరఫు న్యాయవాది చెప్పారు. అలాగే ఇందుకు సహకరించిన బాన్సువాడ ఆస్పత్రి వైద్యుడు, పంచాయతీ అధికారిపై చర్యలు తీసుకోవాలని వాదించారు. దీనిపై ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు స్పందిస్తూ.. వివరాలు సమర్పించాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలి
► తప్పు కప్పిపుచ్చేందుకు వైద్యులయత్నాలు ► మరణించిన గంటన్నర తర్వాత పెద్దాసుపత్రికి రెఫర్ జైనూర్(ఆసిఫాబాద్): వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణి బలైంది. పురిటి నొప్పులు, వాంతులతో బాధపడుతూ చికి త్స కోసం ఆస్పత్రికి వచ్చిన గిరిజన గర్భిణి గంటసేపు నరక యాతన అనుభవించింది. చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు వైద్యులు సవాలక్ష ప్రయత్నాలు చేశారు. గర్భిణి మరణించిన గంట సేపు తర్వాత మరో ఆస్పత్రికి రెఫర్ చేశారు. మృతి చెందిన తర్వాత ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించినా.. తమ నిర్వాకం బహిర్గతం కాకుండా ఉండేందుకు డెత్ సర్టిఫి కెట్ అవసరం ఉంటుందని మెప్పించినట్లు బాధిత కుటుంబీ కులు తెలిపారు. జైనూర్ మండల కేంద్రం రాంనగర్‌కు చెం దిన ఆత్రం అరుణకు పురిటినొప్పులు రావడంతో శనివారం జైనూర్ ఆస్పత్రి తీసుకెళ్లారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ఆమె భర్త సుదర్శన్ డాకర్ట్స్ క్వార్టర్స్‌కు వెళ్లి విషయం చెప్పారు. గంటసేపు తర్వాత వచ్చి న వైద్యుడు రెండు ఇంజక్షన్లు ఇచ్చాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అరుణ కొద్ది సేపటికే కన్నుమూసింది. మర ణించిన గంట తర్వాత అరుణను అవ్వాల్ అంబులెన్స్‌లో ఉట్నూర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. శవాన్ని ఉట్నూర్ ఎందుకు పంపిస్తున్నారని వైద్యులను నిలదీయగా ..డెత్ సర్టిపికెట్ కోసం ఉట్నూర్ వెళ్లాల్సిందేనని చెప్పినట్లు సుదర్శన్ వివరిం చాడు. అయితే, అంబులెన్స్‌లో ఉట్నూర్ వెళ్లగా అప్పటికే ఫోన్ మాట్లాడుకున్న ఉట్నూర్ ఆస్పత్రి వైద్యుడు వాహనం వద్దకే వచ్చి శ్వాస ఆడక మృతి చెందిందని చెప్పి తిరిగి పంపించినట్లు కుటుంబీకులు తెలిపారు. గైనకాలజిస్ట్ ఒపినియన్ కోసం పంపించాం అరుణ మరణించిన తర్వాత ఉట్నూర్ ఆస్పత్రికి పంపించిన విషయమై వైద్యుడు నరేశ్‌ను సంప్రదించగా, మృతికి గల కారణాలతో పాటు.. మరణించినట్లు ధ్రువీకరించేందుకు గైనకాలజిస్ట్ ఒపినియన్ కోసం పంపించానన్నారు. తాను వెంటనే చికిత్స ప్రారంబించానని ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని పేర్కొన్నారు.