హైదరాబాద్: త్వరలోనే ఇంటిగ్రేటేడ్ మొబైల్ యాప్ ప్రవేశపెడుతున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ యాప్తో ఇక మొబైల్లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్స్ పొందవచ్చునని ఆయన తెలిపారు. మంగళవారం కమిషనర్ జనార్ధన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదులను మొబైల్ యాప్ ద్వారా స్వీకరిస్తామన్నారు. ఈ మొబైల్ యాప్ రెడీగానే ఉందనీ, త్వరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అదేవిధంగా వంద రోజుల ప్రణాళికను దాదాపు అమలు చేశామని తెలిపారు. బిల్డింగ్, లే అవుట్ లకు ఆన్లైన్ అనుమతుల విధానం త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
డస్ట్ బిన్ పంపిణీ 100 శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. 1116 గార్బేజ్ సెంటర్లను పూర్తిస్థాయిలో తీసేశామన్నారు. 1817 చెత్త ఆటో ట్రాలీలను పంపిణీ చేశామని తెలిపారు. నాలాల పూడికతీత 94 శాతం పూర్తి చేశామని కమిషనర్ జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే మోడల్ మార్కెట్లు కేవలం నాలుగు మాత్రమే సిద్ధమయ్యాయని, మిగతావి 80 శాతం పూర్తి చేసినట్టు చెప్పారు. టాయిలెట్ల నిర్వహణ ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయిందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు.
ఇక మొబైల్లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్స్..
Published Tue, May 31 2016 7:00 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM
Advertisement