బర్త్‌ సర్టిఫికెట్‌కు బదులు డెత్ సర్టిఫికెట్ | VRO issue death certificate to child instead birth certificate in Prakasam District | Sakshi
Sakshi News home page

బర్త్‌ సర్టిఫికెట్‌కు బదులు డెత్ సర్టిఫికెట్

Published Sat, May 10 2014 11:31 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

VRO issue death certificate to child instead birth certificate in Prakasam District

ఒంగోలు : లంచం ఇవ్వలేదనే అక్కసుతో ఓ  గ్రామ పంచాయతీ కార్యదర్శి జనన ధ్రువీకరణ పత్రానికి బదులు మరొకటి జారీ చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లిలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు జనన ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.400 ఇవ్వలేదని ఓ చిన్నారికి బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్ జారీ చేశాడు.

బంగారు తల్లి పథకం కోసం అరుణ అనే మహిళ బర్త్ సర్టిఫికెట్ దరఖాస్తు చేసుకుంది.  కాగా పంచాయతీ కార్యదర్శి వ్యవహరించిన తీరుపై చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం ఇవ్వనంత మాత్రానా సర్టిఫికెట్ మార్చేస్తారా అంటూ మండిపడుతున్నారు. వెంకటేశ్వరరావుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement