vro
-
VRO బాగోతం బయటపెట్టిన మహిళ
-
తాడిపత్రిలో వీఆర్వో కీచకపర్వం
సాక్షి, అనంతపురం జిల్లా: కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించిన రామరాజ్యం నాడు. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరికి పంపు అని వీఆర్వో అడిగిన రావణ పాలన నేడు. రేషన్ కార్డు అడిగిన పాపానికి పేద వృద్ధురాలికి వచ్చిన బెదిరింపు ఇది. ‘రేషన్‌కార్డు కావాలంటే నీ కూతురిని నా దగ్గరకు పంపించు’ అన్న ఓ వీఆర్వో కీచకపర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆ వృద్ధురాలు తన వేదనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో అధికారులు ఆ కీచక వీఆర్వోపై విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్‌కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్వో చంద్రశేఖర్‌ను బతిమాలుతూ వస్తోంది.తాడిపత్రి మునిసిపల్ అధికారులకూ విన్నవించుకుంది. అయినా ఫలితం లేకపోయింది. పదే పదే వీఆర్వోను బతిమాలుతుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చంద్రశేఖర్ ‘నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్‌కార్డు ఇప్పిస్తా’ అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై అనంతపురం ఆర్డీవో కేశవనాయుడు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తాడిపత్రి తహసీల్దార్ రజాక్‌వలి శుక్రవారం నాగమునెమ్మను తన కార్యాలయానికి పిలిచి విచారించి.. నివేదికను ఆర్డీవోకు అందించారు.ఇదీ చదవండి: మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం -
ఇసుక తరలిస్తా.. అడ్డుకోవద్దు!
శింగనమల: ‘నేను టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి కుడి భుజం. ఎమ్మెల్యే చెప్పి ఉంటేనే ఆ ఇసుక తోలుతున్నాం. అడ్డుకుంటే ఇక నీ ఇష్టం...’ అంటూ ఓ టీడీపీ నాయకుడు... వీఆర్వోను బెదిరించాడు. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బాధిత వీఆర్వో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇందుకు సంబంధించిన వివరాలు... అనంతపురం జిల్లా శింగనమల మండలం సలకంచెర్వు–కొరివిపల్లి మార్గంలోని చీలేపల్లి వంక నుంచి కొన్ని రోజులుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి టీడీపీ నాయకులు నిల్వ చేసిన ఇసుక డంప్‌లను సీజ్ చేశారు. వాటి పర్యవేక్షణ బాధ్యతను రాచేపల్లి వీఆర్వో నాగేంద్రకు అప్పగించారు. అయితే, సీజ్ చేసిన ఇసుకను దౌర్జన్యంగా తరలించడానికి ఈ నెల 12న టీడీపీ నాయకులు జేసీబీ, టిప్పరుతో రాగా, వీఆర్వో అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వీఆర్వోకు నార్పల మండలానికి చెందిన టీడీపీ నాయకుడు నరసింహ యాదవ్ ఫోన్ చేసి రెచ్చిపోయాడు. ‘ఎమ్మెల్యే చెప్పి ఉంటేనే ఇసుక తోలుతున్నాం. సీఐకి కూడా ముందే చెప్పాం. సీజ్ చేసిన ఇసుకను తరలించి తీరుతాం. ఎమ్మెల్యే చెప్పినా లెక్క లేదా? రాత్రికి వచ్చి ఇసుక తరలిస్తాం..’ అని బెదిరించాడు. ‘సీజ్ చేసిన ఇసుకను తరలించడం తప్పు కదా అన్నా’ అని వీఆర్వో చెప్పగా... ‘ఎలా తప్పవుతుంది..? ఈ మాటలన్నీ రికార్డు చేసుకున్నా నాకేమీ ఇబ్బంది లేదు...’ అంటూ నరసింహ యాదవ్ రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో భయాందోళనలకు గురైన వీఆర్వో నాగేంద్ర మండల పోలీసులకు ఫిర్యాదు చేయగా, నరసింహ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. -
Telangana: గ్రామాల్లో జేఆర్వోలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తిరిగి గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామన్న రాష్ట్ర సర్కారు... ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా... ‘జూనియర్ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ)’ పేరుతో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. దీనిపై విధాన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా.. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసి, ఇతర శాఖల్లోకి మార్చి న వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ సోమవారం జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ పంపారు. కొత్త చట్టం మేరకు నియామకాలు: ఇటీవల అసెంబ్లీ ఆమోదం పొందిన భూభారతి చట్టం–2024 ద్వారా సంక్రమించే అధికారాల మేరకు గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. గతంలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు ముందు ఆ పోస్టుల్లో పనిచేసినవారు, వీఆర్ఏలుగా పనిచేస్తూ వివిధ శాఖల్లోకి పంపిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది. డిగ్రీ చదివిన పూర్వ వీఆర్వో, వీఆర్ఏలను నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు. ఈ క్రమంలో 3,600 మంది పూర్వ వీఆర్వోలు, 2,000 మంది వరకు పూర్వ వీఆర్ఏలకు ఈ అర్హత ఉన్నట్టు అంచనా. మిగతా సుమారు 5,300 పోస్టులను ఏ విధంగా భర్తీ చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇంటర్ పూర్తిచేసిన వారు, ముఖ్యంగా ఇంటర్మీడియట్లో గణిత శాస్త్రం చదివిన వారిని కూడా నేరుగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది కొత్త సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో... ఇంటర్ పూర్తి చేసిన పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను సర్వేయర్లుగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి, సర్వేయర్ పోస్టులు పోగా... మిగతా పోస్టులకు రాతపరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఓపెన్‌గా దరఖాస్తులు స్వీకరించి ఈ పోస్టులను భర్తీ చేస్తారా? లేక పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలకు మాత్రమే పరీక్ష నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అంగీకారం తెలిపితేనే! పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలలో తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన వారినే జూనియర్ రెవెన్యూ అధికారులుగా నియమించనున్నారు. వాస్తవానికి 2022కు ముందు రాష్ట్రంలో 5వేల మందికిపైగా ‘గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)’గా పనిచేశారు. అయితే రెవెన్యూ శాఖలో పెరిగిపోయిన అవినీతిని నియంత్రించడం కోసమంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసింది. ఆ పోస్టుల్లో ఉన్నవారిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపింది. ఆ నిర్ణయంపై కోర్టుకు వెళ్లిన సుమారు 70 మంది కోర్టు తీర్పు ఆధారంగా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతున్నారు. మిగతా వారంతా వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలలో వార్డు అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కూడా పొందారు. ఈ క్రమంలో మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన వారిని మాత్రమే జూనియర్ రెవెన్యూ అధికారులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వీఆర్ఏల విషయానికొస్తే... 2023 జూలై నాటికి 22 వేల మందికిపైగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నారు. అందులో 61 ఏళ్లలోపు వయసున్న, 2011 సంవత్సరంలోపు నియమితులైన 16,758 మందిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపారు. మరో 3,797 మంది వయసు 61 ఏళ్లు దాటడంతో.. వారి వారసులకు వేరే శాఖలో ఉద్యోగాలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇలా వివిధ శాఖల్లోకి వెళ్లిన వీఆర్ఏలలో కూడా సుముఖత వ్యక్తం చేసినవారిని మాత్రమే మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులపై భారం గత ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్వోలను రెవెన్యూ శాఖ నుంచి పంపించేశాక.. గ్రామస్థాయిలో రెవెన్యూ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతల్లో కొన్నింటిని పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. చాలా చోట్ల పెద్ద గ్రామ పంచాయతీలు ఉండటం, రెవెన్యూ వ్యవహారాలపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తాయి. ప్రభుత్వ భూములను కాపాడటం, గ్రామాల్లోని రెవెన్యూ అంశాలను ప్రభుత్వానికి నివేదించడం వంటి పనులతో పంచాయతీ కార్యదర్శులపై అదనపు భారం పడింది. మరోవైపు గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది లేని కారణంగా ధ్రువీకరణ పత్రాల జారీ, సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తిరిగి గ్రామ రెవెన్యూ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ మినహా గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలు నిర్వహించిన బాధ్యతలన్నీ ‘జూనియర్ రెవెన్యూ అధికారుల’కు అప్పగించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల టీజీఆర్ఎస్ఏ హర్షం భూభారతి చట్టం కింద రాష్ట్రంలో గ్రామానికో రెవెన్యూ అధికారిని నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం హర్షం వ్యక్తం చేశారు. పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆప్షన్లను కోరుతూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేశారని.. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. పూర్వ వీఆర్ఏల సంఘం రాష్ట్ర సలహాదారు వింజమూరు ఈశ్వర్ కూడా మరొక ప్రకటనలో ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వీఆర్వోలు, వీఆర్ఏలను గూగుల్ ఫామ్‌లో ఏమడిగారంటే..గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్ పోస్టులలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్న పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి వివరాలు తీసుకోవాలంటూ సీసీఎల్ఏ కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం గూగుల్ ఫామ్ ద్వారా ప్రత్యేక ఫార్మాట్‌ను పంపారు. ఈ నెల 28లోగా జిల్లాల వారీగా వివరాలన్నీ సేకరించి, ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. అయితే ఈ ఫార్మాట్లో... వీఆర్వో/వీఆర్ఏ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం, ప్రస్తుతం పనిచేస్తున్న శాఖ, ఎంప్లాయి ఐడీ, ఆ శాఖలో చేరిన తేదీ, రెవెన్యూ శాఖలో నియమితులైన తేదీ, విద్యార్హతలు, ఫోన్ నంబర్, సర్వేయర్‌గా పనిచేసేందుకు అంగీకారమా లేదా?, వారి సొంత జిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా, ప్రస్తుత చిరునామా వంటివి అడుగుతూ గూగుల్ ఫామ్‌ను రూపొందించారు. ఇందులో విద్యార్హతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ముఖ్యంగా మేథమేటిక్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? అనే అంశంలో మేథమేటిక్స్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేటా? అని.. ఇంటర్ పూర్తి చేశారా అనే అంశంలో మేథమేటిక్స్ సబ్జెక్టు ఉందా? అని అదనపు ప్రశ్నలు అడిగారు. ఇక సర్వేయర్ పోస్టుకు సుముఖత వ్యక్తం చేసేవారిని కూడా గ్రాడ్యుయేషన్/ ఇంటర్మీడియట్లో మేథమేటిక్స్ సబ్జెక్టు ఉందా? అని అడగటం గమనార్హం. -
కదం తొక్కిన వీఓఏలు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ తొలగింపులకు వ్యతిరేకంగా వెలుగు వీఓఏలు కదం తొక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు. వీఓఏల నినాదాలతో విజయవాడలోని ధర్నా చౌక్ దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్ ఐకేపీ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి యానిమేటర్లు తరలివచ్చారు.యానిమేటర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వీఓఏలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు. కూటమి అధికారంలోకి వచి్చన వెంటనే కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేస్తామని వాగ్దానం చేసిందని గుర్తుచేశారు. వీఓఏలపై పని భారం పెంచుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నారని, ప్రభుత్వ విధానాలను వెంటనే మార్చాలని ఆమె డిమాండ్ చేశారు. రోజుకో రకమైన యాప్‌తో వీఓఏల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారన్నారు.అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు రూపాదేవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై వీఓఏలు పెట్టుకున్న ఆశలను అడియాసలు చేయొద్దన్నారు. అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని,బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. -
విజయవాడ ధర్నా చౌక్ లో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ వీఓఏల ధర్నా
-
‘తెలంగాణలో వీఆర్ఓ, వీఆర్ఏ సేవలు’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను పున:ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పదేళ్ల పాలనకు...ఏడాది ఇందిరమ్మ పాలనకు స్పష్టమైన తేడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మేం అధికారంలోకి వచ్చే నాటికి 2 లక్షల 40 వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తున్నాం.డిసెంబర్ 1 నుంచి ధరణి పోర్టల్‌ను ఎన్ఐసీకి అప్పగించాం. 2024 కొత్త ఆర్వో ఆర్ చట్టాన్ని తయారు చేశాం. అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తాం. గతంలో ధరణి 33 మాడ్యుల్స్‌తో ఇబ్బందిగా ఉండేది. మాడ్యుల్స్‌ను తగ్గిస్తాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. మళ్ళీ మేం ఈ వ్యవస్థలను తీసుకు వస్తాం.గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పింక్ షర్ట్స్ వేసుకున్న వాళ్ళకే వచ్చాయి. మేము అత్యంత నిరుపేదలకు మాత్రమే ఇళ్లు ఇస్తాం. ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు. ఇందిరమ్మ ఇళ్లు ఒక్కసారి ఇచ్చి వదిలేసే కార్యక్రమం కాదు. కేంద్రం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇవ్వకపోయినా మా ప్రభుత్వం ఇస్తుంది. ఆనాటి ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టక పోయి ఉంటే వడివడిగా హామీలు నెరవేర్చే వాళ్ళం. అయినా మేము ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం.జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను పరిష్కారం చేసుకుందాం. రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొంత మంది మాజీ మంత్రులు అంటున్నారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని ప్రధాన ప్రతిపక్షం గ్రహించాలి. మేము 15 నుంచి 18 శాతం అనుకున్నాం కానీ..ఆశించినంత పెరగలేదు. ప్రతిపక్ష పార్టీకి జ్ఞానోదయం కలగకపోవటం బాధాకరం. ప్రతిపక్ష పార్టీకి డిశ్చార్జ్ షీట్ ప్రజలు ఇచ్చారు.ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో నడుపుతున్నది తుగ్లక్ పాలనా?సెక్రటేరియట్లో నడుపుతున్నది తుగ్లక్ పాలనా?.రేపటి కార్యక్రమానికి కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నాం’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. చదవండి👉 : ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ.. బీఆర్ఎస్ ఎల్పీలో కేసీఆర్ -
పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు.. గుండెపోటుతో వీఆర్వో మృతి
రాజానగరం: తీవ్ర పని ఒత్తిడి, జీతాలందక ఆర్థిక ఇబ్బందులు ఒక వీఆర్వో ప్రాణాలు తీసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), వీఆర్వోల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి పెనుమాక గనిరాజు (47) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి వరకు పనిచేసిన ఆయనకు గుండెనొప్పి రావడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందారు. కడియం మండలం జేగురుపాడుకు చెందిన గనిరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పని ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉక్కిరిబిక్కిరి చేయడంతో గనిరాజు గుండెపోటుకు గురై మృతిచెందారని మండల వీఆర్వోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జాన్, ఎస్.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ మంత్రికి లేఖ రాశారు. అధికారులు అనేక పనులు పురమాయిస్తున్నారని తెలిపారు. దీనికితోడు టార్గెట్లు పూర్తిచేసే వరకు జీతాలు కూడా నిలిపేయడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోందని పేర్కొన్నారు. ఇంతవరకు అక్టోబర్ నెల జీతాలు రాలేదని తెలిపారు. దీంతో కుమార్తెల ఫీజు, ఇంటి అద్దె సకాలంలో చెల్లించలేక ఆవేదనతో ఉన్న గనిరాజు.. నీటిపన్నుల కలెక్షన్ డేటాను త్వరగా ఎంట్రీ చేయాలని అధికారులు ఫోన్లో ఆదేశించడంతో మంగళవారం అర్ధరాత్రి వరకు అదేపనిలో నిమగ్నమై గుండెపోటుకు గురయ్యారని వారు పేర్కొన్నారు. -
తహసీల్దారును నిర్బంధించిన వీఆర్వో
ఘంటసాల: కృష్ణాజిల్లా ఘంటసాల తహసీల్దారును మంగళవారం వీఆర్వో నాగమల్లేశ్వరి నిర్బంధించారు. తోటి వీఆర్వోను చెప్పుతో కొట్టబోయారు. తనకు న్యాయం చేయకపోతే కొడుకుతో సహా చనిపోతానంటూ ధర్నాకు దిగారు. ఈ వ్యవహారం సంచలనం కలిగించింది. ఘంటసాల మండలం ఘంటసాలపాలెం సచివాలయ వీఆర్వోగా బి.నాగమల్లేశ్వరి పనిచేస్తున్నారు. సచివాలయం పరిధిలోని ఘంటసాలపాలెం, కొత్తపల్లి, తాడేపల్లి గ్రామాల వీఆర్వోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ మూడు గ్రామాలకు సంబంధించిన పాస్‌బుక్ ఫైల్స్, ప్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఇతర రెవెన్యూ పనులను అధికారులు తన ప్రమేయం లేకుండానే కొడాలి, ఘంటసాల, లంకపల్లి వీఆర్వోలు తదితరులతో చేయిస్తున్నారని, తన సంతకాలు లేకుండా ఫైల్స్ ఆన్లైన్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కొడాలి వీఆర్వోను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించారు. కార్యాలయంలో తహసీల్దారు ఎన్.బి.విజయలక్షి్మని నిర్బంధించారు. తనకు న్యాయం చేసేంతవరకు తలుపులు తీయనని భీషి్మంచారు. బయట నుంచి సిబ్బంది కేకలు వేయడంతో ఆమె తలుపులు తీశారు. ఆమె కుమారుడు కార్యాలయం బయట గోడలపై పెట్రోల్ పోశాడు. కలెక్టర్, జేసీ, ఆర్డీవో వచ్చి తనకు న్యాయం చేయాలని, లేదా తన కుమారుడితో కలసి చనిపోతానంటూ కుమారుడితో కలసి తహసీల్దార్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. తన పరిధిలో పనులు తన ప్రమేయం లేకుండా జరగడంపై ఆర్డీవో విచారించాలని, తనకు న్యాయం చేయాలని తొమ్మిది నెలలుగా ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయమై తహసీల్దార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చల్లపల్లి సీఐ సీహెచ్.నాగప్రసాద్, ఎస్ఐ చినబాబు అక్కడికి వచ్చి వీఆర్వో నాగమల్లేశ్వరితో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూద్దామని సర్దిచెప్పారు. అయినా నాగమల్లేశ్వరి ఆందోళన విరమించకపోవడంతో కలెక్టర్‌తో మాట్లాడిస్తామని సంబంధిత అధికారులతో చెప్పించి ధర్నా విరమింపజేశారు. ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ తాను ఎన్నికల విధుల్లో భాగంగా ఐదునెలలు కిందట ఘంటసాల వచ్చినట్లు చెప్పారు. తాను పనుల్ని ప్రాపర్ చానల్ ద్వారానే చేస్తున్నానని, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. తన గదిలోకి వచ్చిన వీఆర్వో నాగమల్లేశ్వరి అక్కడే ఉన్న కొడాలి వీఆర్వోను చెప్పుతో కొట్టబోయిందని, ఏమైందని అడుగుతుండగానే అసభ్య పదజాలంతో తిట్టడమేగాక తలుపులు మూసేసిందని, అనంతరం తన చాంబర్ ముందు బైఠాయించిందని చెప్పారు. గత తహసీల్దార్ హయాంలో వీఆర్వోకు సంబంధం లేకుండా ఫైల్స్ చేశారని వీఆర్వో ఆరోపిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో నుంచి వీఆర్వోపై వచ్చిన రిపోర్టు చూసి ఆగ్రహంతో ఆందోళన చేసి ఉంటుందని భావిస్తున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. -
Korutla: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
కోరుట్ల: నాలుగేళ్లలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది కోరుట్లకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బెజ్జారపు వేణు–మాధవిల కూతురు మౌనిక. ఆమె 2013లో ఎం.ఫార్మసీలో గోల్డ్‌మెడల్ సాధించింది. మౌనిక వివాహం సాఫ్ట్వేర్ ఇంజినీర్ శేఖర్‌తో జరిగింది. అనంతరం మళ్లీ చదువుపై దృష్టిపె ట్టి, 2019లో వీఆర్వో ఉద్యోగం సాధించింది. ఆ జాబ్ చేసూ్తనే అదే ఏడాది ఫార్మసిస్ట్ పోస్టుకు ఎంపికైంది. ప్రస్తుతం హై దరాబాద్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తోంది. 2022 డిసెంబర్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తు చేసుకుంది. 6 నెలల కష్టపడి చదివి, పరీక్ష రాయగా శుక్రవారం రాత్రి ఫలితాలు వెలువడ్డాయి. ఆమె రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. తన భర్త శేఖర్ ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఉద్యోగాలు సాధించానని తెలిపింది. -
వీఆర్వోలకు మేలు చేసేలా జీవోలు
సాక్షి, అమరావతి: వీఆర్వోలకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం 154, 64, 6538, 166, 31 జీవోలు జారీ చేసిందని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం (వీఆర్వో అసోసియేషన్) అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకు త్వరలో రాష్ట్రస్థాయిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశంలో రవీంద్రరాజు మాట్లాడుతూ.. రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులలో వీఆర్వోలకు ప్రస్తుతం ఉన్న కోటా 40 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని, ఖాళీగా ఉన్న సీనియర్ సహాయకుల పోస్టులలో వన్‌టైమ్ సెటిల్మెంట్ ప్రకారం 70 శాతం పదోన్నతులను వీఆర్వోలతో భర్తీ చేయాలని కోరారు. సర్వే సప్లిమెంటరీ పరీక్షలు రాసిన గ్రేడ్–2 వీఆర్వోల ఫలితాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాన్ని గుర్తింపు సంఘంగా ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, నాయకులు బాలాజీరెడ్డి, మౌళి భాష, లక్ష్మీనారాయణ, బాపూజీ పాల్గొన్నారు. -
కిడ్నీ వ్యాధితో వీఆర్వో మృతి
ప్రకాశం: సింగరాయకొండ–2 వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న కళ్యాణి బుధవారం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఈమె బింగినపల్లి వీఆర్వోగా కూడా పని చేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమెకు తన తల్లి కిడ్నీ దానం చేయడంతో కొంత కాలం బాగానే ఉన్నారు. ఆరోగ్యం కుదుటపడుతోందని అనుకుంటున్న తరుణంలో కిడ్నీ సమస్య పునరావృతమైంది. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం మృతి చెందారు. గ్రామ సచివాలయ ఉద్యోగిగా ఎంపికై న కళ్యాణికి ఇంకా వివాహం కాలేదు. ఆమె మరణ వార్త తెలిసి మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని తహసీల్దార్ సీహెచ్ ఉష, రెవెన్యూ సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు. -
వీఆర్వోలు ‘వెనక్కి’?
సాక్షి, హైదరాబాద్: జీతం లేదు.. సీనియారిటీ లేదు.. పదోన్నతులు రావు... పనిచేసేందుకు వెళ్లిన శాఖలో వివక్ష... ఉన్నచోట ఒక్కరికే పది పనులు.. లేనిచోట ఎలాంటి పనీ లేదు.. పేరుకే జూనియర్ అసిస్టెంట్... చేయాల్సింది మాత్రం తోటమాలి, వాచ్‌మన్, అటెండర్ పనులు.. ఇవీ ఇతర శాఖల్లోకి వెళ్లిన ‘గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల)’పరిస్థితి. సర్దుబాటులో భాగంగా ఇతర శాఖల్లోకి వెళ్లినవారు ఆయా చోట్ల కష్టాలు, సమస్యలను తట్టుకోలేక.. తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై కొన్నినెలలుగా చర్చ సాగుతున్నా.. వీఆర్ఏల సర్దుబాటు నేపథ్యంలో బలంగా తెరపైకి వస్తోంది. వీఆర్ఏలను సర్దుబాటు చేసిన తరహాలోనే తమకు కూడా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించి రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలనే డిమాండ్ వస్తోంది. దీనికి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కూడా మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వీఆర్వోలకు పేరు మార్చి, రెవెన్యూశాఖలోనే భూసంబంధిత పనులు కాకుండా ఇతర విధులు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక ఇబ్బందితో.. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయడంతో.. సుమారు 5,400 మంది వివిధ ప్రభుత్వ శాఖలకు వెళ్లాల్సి వచ్చింది. విద్య, మున్సిపల్, వైద్యం, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇలా పలు ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో వారిని సర్దుబాటు చేశారు. రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖల్లోకి రావడంతో వారి సీనియారిటీని కోల్పోయారు. ఆరేళ్ల నుంచి గరిష్టంగా 20ఏళ్లవరకు సీనియారిటీని కోల్పోవాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. పేరుకు జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఇతర శాఖల్లో చేరినా.. ఆయాచోట్ల రికార్డు అసిస్టెంట్‌గా, తోటమాలిగా, అటెండర్‌గా పనిచేయాల్సి వస్తోందని అంటున్నారు. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా వెళ్లిన వారికి కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీలు లేవని చెప్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని ఓ మున్సిపాలిటీలో వార్డు అధికారిగా చేరిన ఓ వీఆర్వోకు శక్తికి మించిన బాధ్యతలు ఇచ్చారని.. లీగల్ సెల్, ఇళ్లు కూలగొట్టడం, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ, చెట్ల పెంపకం, పార్కుల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ, ఆసరా పింఛన్లలో వేలిముద్రల గుర్తింపు పనులు అప్పగించారని వీఆర్వో వర్గాలు చెప్తున్నాయి. అన్ని పనులు చేయలేక మానసిక వేదనతో సదరు వీఆర్వో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యారని అంటున్నాయి. పని లేక.. జీతాలు రాక.. ఇక సొసైటీలు, కార్పొరేషన్లు, కొన్ని స్థానిక సంస్థల పరిధిలోకి వెళ్లిన వీఆర్వోలకు స్థానిక నిధుల నుంచే వేతనం ఇస్తుండటంతో.. కొందరికి నాలుగైదు నెలలుగా జీతాల్లేవని అంటున్నారు. కొన్నిజిల్లాల్లో అవసరమైన ఉద్యోగుల సంఖ్య (కేడర్ స్ట్రెంత్)కు మించి పోస్టింగులు ఇచ్చారని, ఐదుగురు సిబ్బంది అవసరమైన చోటకు 10 మందిని పంపారని, అక్కడ ఎలాంటి విధులు నిర్వహించాలో కూడా తెలియక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఆయా శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బంది నుంచి వివక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని, తమకు పదోన్నతులు రాకుండా చేయడానికి వచ్చారా? అంటూ మండిపడుతున్నారని చెప్తున్నారు. సొంత శాఖలో సమస్యలు కూడా పరిష్కారం కాక మాజీ వీఆర్వో లు రెవెన్యూ శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ప్రొబేషన్ డిక్లరేషన్, సర్వీసు వ్యవహారాల ఫైళ్లు సీసీఎల్ఏ, రెవెన్యూ కార్యదర్శి పేషీల్లో పెండింగ్‌లో ఉన్నాయని.. ప్రత్యేక, సాధారణ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ వర్తింపు అంశాల్లో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం తమకు సమస్యగా మారిందని వీఆర్వోలు వాపోతున్నారు. సంఘాలకు అతీతంగా సమావేశమై.. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు రాష్ట్రంలోని 33 జిల్లా లకు చెందిన మాజీ వీఆర్వోలు బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమయ్యారు. సంఘాలకు అతీతంగా ‘సమస్యలపై చర్చ–ప్రభుత్వానికి నివేదన’అనే నినాదంతో తమ ఉద్యోగ హక్కులకు భద్రత కల్పించాలని.. లేదంటే మాతృశాఖకు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్వోలను ఇతర శాఖల్లో కలపడం వల్ల సీనియారిటీ దెబ్బతింటుందని, వేల మంది ఇబ్బందిపడుతున్నారని టీఆర్ఈఎస్ఏ అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసుకు భద్రత లేక వారంతా ఆందోళనలో కూరుకుపోయారన్నారు. అయితే.. వీఆర్వోల సమావేశం నిర్వహణ వెనుక ప్రభుత్వంలో కీల క హోదాలో ఉన్న కొందరు నాయకులు ఉన్నారని, వారి సలహా మేరకే ఈ సమావేశం నిర్వహించారని సమాచారం. భూసంబంధిత అంశాలు మినహా మిగతా రెవెన్యూ వ్యవహారాల ను చూసుకునేందుకు వీఆర్వోల పేరు మార్చి మళ్లీ రెవెన్యూశాఖలోకి తీసుకునేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. వీఆర్‌ఏలతోనే తంటా! రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వీఆర్ఏ సర్దుబాటు ప్రక్రియ వీఆర్వోలలో అలజడికి కారణమైంది. తమకంటే కింది కేడర్‌లో పనిచేసిన వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయడంతోపాటు సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి మరీ.. రెవెన్యూ శాఖల్లోనే కొనసాగిస్తున్నారని, అదే పద్ధతిని తమ విషయంలో ఎందుకు పాటించలేదని వీఆర్వోలు ప్రశ్నిస్తున్నారు. సర్వీసు వ్యవహారాలు పెండింగ్‌లో ఉండటంతో చాలా జిల్లాల్లో వేతనాలు రావడం లేదని, ప్రతి విషయానికి ఏదో ఒక అడ్డంకి వస్తోందని అంటున్నారు. రెవెన్యూలో మరిన్ని సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి, తమను వెనక్కి తీసుకోవడమే ఏకైక పరిష్కారమని పేర్కొంటున్నారు. -
రాత్రి వేళ తహసీల్దార్ కార్యాలయంలో రిటైర్డ్ వీఆర్వో
అనకాపల్లి: తహసీల్దార్ కార్యాలయంలో రాత్రి సమయంలో రిటైర్డ్ వీఆర్వో కనిపించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. రాత్రి వేళలో ఆయనకు ఏం పనంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బయ్యవరం గ్రామానికి చెందిన లాలం సూర్యనారాయణ గతంలో వీఆర్వోగా పనిచేసి రిటైరయ్యారు. ఈయన శనివారం రాత్రి 10 గంటల అనంతరం గిడుతూరు సచివాలయ సర్వే అసిస్టెంట్ శ్రీనుతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో కనిపించారు. రెవెన్యూ రికార్డులకు సంబంధించిన విషయాలపై మాట్లాడుతుంగా తీసిన ఫొటోలు, వీడియో ఆదివారం సోషల్ మీడియాతోపాటు వివిధ వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. దీంతో శనివారం మొహర్రం సందర్భంగా కార్యాలయానికి సెలవు కావడం, పైగా రాత్రివేళ కార్యాలయంలో కనిపించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గిడుతూరు సచివాలయం పరిధిలోని బయ్యవరానికి సంబంధించి రికార్డులు తారుమారు చేసేందుకే ఆ సమయంలో రిటైర్డ్ వీఆర్వోను రెవెన్యూ అధికారులు రప్పించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ రెవెన్యూ అధికారులు ఆ సమయంలో ఆయన్ను కార్యాలయంలోకి అనుమతించడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆరోపణల్లో వాస్తవం లేదు.. రెవెన్యూ కార్యాలయంలో సెలవు రోజు రాత్రి రిటైర్డ్ వీఆర్వోతో కలిసి రికార్డులు తారుమారు చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తహసీల్దార్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. బయ్యవరం గ్రామానికి సంబంధించి రీసర్వేపై డీఎల్ఆర్(డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్) నమోదు చేస్తున్నామని, సూర్యనారాయణకు ఉన్న భూమికి సంబంధించిన వివరాలపై సర్వే అసిస్టెంట్ పిలవడంతోనే ఆయన వచ్చాడని తహసీల్దార్ తెలిపారు. -
నేనే వీఆర్వో.. నేనే ఎమ్మార్వో..
కనిగిరి రూరల్: ‘‘నేనే వీఆర్వో.. నేనే ఎమ్మార్వో’’ అన్నట్లు జగన్నాథం సురేష్ అనే యువకుడు ఇష్టారాజ్యంగా భారీ అక్రమాలకు పాల్పడ్డాడు. నియోజకవర్గంలోని కనిగిరి, హెచ్‌ఎంపాడు, పీసీపల్లి తదితర మండలాలకు చెందిన సుమారు 12 మందికి దొంగ ఇళ్ల పట్టాలు, అసైన్డ్ భూముల డీకే పట్టాలు, పాస్ పుస్తకాలు తయారు చేసి ఇచ్చి సుమారు రూ.అర కోటి పైగా స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మరో ఇద్దరు కూడా ఉన్నట్లు తెలుస్తుండగా, కొందరూ రెవెన్యూ అధికారుల పాత్రకూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వెలుగు చూసింది ఇలా.. లింగసముద్రం మండలానికి చెందిన జగన్నాథం సురేష్ కొంత కాలంగా కనిగిరి ప్రాంతంలో ఉంటున్నాడు. గతంలో ఉన్న తహసీల్దార్‌కు ఇతను వాహన డ్రైవర్‌గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతను అక్రమాలకు పాల్పడ్డాడు. సురేష్, పొదిలికి చెందిన అతని స్నేహితుడు మర్రిబోయిన రమణయ్య కలిసి పట్టణంలోని సూరా పాపిరెడ్డి కాలనీలో తమకు పట్టాలు ఉన్నాయని పట్టణానికి చెందిన సుధాకర్‌కు చెప్పారు. అతను అతని స్నేహితుడైన బాషాకు చెప్పాడు. వీరిద్దరూ కలిసి పట్టణంలోని చింతపాలేనికి చెందిన కొండారెడ్డికి రూ.1.50 లక్షలకు అమ్మించారు. రమణయ్య అమ్మిన పట్టాను కొనుగోలుదారుడు ఆన్లైన్ చేసేందుకు తహసీల్దార్ కార్యాలయంలో చూపించుకున్నాడు. ప్రభుత్వ ఆన్లైన్, లిఖిత పూర్వక రికార్డుల్లో రమణయ్య పేరు లేదు. దీంతో బాధితుడు కొండారెడ్డి తనకు ఆ ఇంటి స్థలం వద్దని, అది దొంగపట్టా అని చెబుతూ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని దాన్ని అమ్మించిన బాషా, సుధాకర్‌లను కోరాడు. దీంతో వీరిద్దరు సురేష్, రమణయ్యలకు చెప్పారు. వారు డబ్బులు తిరిగి ఇవ్వకుండా, సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. సుమారు 6 నెలల నుంచి కనిపించకుండా తిరుగుతున్నారు. ఈక్రమంలో మంగళవారం అర్బన్ కాలనీలో మరొకరి దొంగపట్టాలు అమ్మేందుకు సురేష్, రమణయ్యలు వచ్చినట్లు బాధితులు తెలుసుకున్నారు. సుధాకర్, బాషా మరికొందరు వెళ్లి సురేష్, రమణయ్యలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్పీకి ఫిర్యాదు: అయితే అప్పటికే కనిగిరి మండలం చల్లగిరిగిలకు చెందిన వంగేపురం కోటమ్మ.. తనకు అసైన్డ్ భూమి 3 ఎకరాలు ఇప్పిస్తానని చెప్పి రూ.1.50 లక్షల డబ్బులు సురేష్ అనే అతను తీసుకుని మోసం చేశాడని, ఏడాది నుంచి నగదు ఇవ్వకుండా కనిపించడం లేదని ఎస్పీ మలికా గర్గ్‌కు స్పందనలో ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులకు ఎస్పీ ఆఫీసు నుంచి రిఫర్ చేశారు. ఈమేరకు కనిగిరి పోలీసులు సురేష్ కోసం గాలిస్తున్నారు. ఇంతలో సురేష్ దొరకడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసున్నారు. పట్టాలపై సంతకాలన్నీ గత తహసీల్దార్, ప్రస్తుత ఆర్డీఓ పేరుతోనే.. అయితే ఈ దొంగపట్టాలన్నీ గతంలో కనిగిరిలో పనిచేసిన తహసీల్దార్, ప్రస్తుత కనిగిరి ఆర్డీఓ అజయ్‌కుమార్ పేరుతో ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంలో బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుతున్నారు. అసైన్డ్ భూములు ఇప్పిస్తానని రూ.3 లక్షలు స్వాహా... వాగుపల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వ అసైన్డ్ భూములు పెట్టిస్తానని చెప్పి ఐదుగురి దగ్గర సురేష్ రెండు దఫాలుగా రూ.3 లక్షలు తీసుకున్నాడు. మొదట రూ.1.50 లక్షలు తీసుకుని భూమి డీకే పట్టాలు ఇచ్చాడు. ఆ తర్వాత రూ.1.50 లక్షలు తీసుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆన్లైన్ పూర్తయ్యాక మరో రూ.3 లక్షలు ఇవ్వాలని తెలిపాడు. కానీ ఏడాది నుంచి కనిపించడం లేదు. ఫోన్ కూడా ఎత్తడం లేదు. దీంతో ఆ పట్టాలను, పాస్ పుస్తకాలను తహసీల్దార్ కార్యాలయంలో తీసుకెళ్లి చూపించగా, అవి దొంగవిగా చెప్పారు. కనీసం మ్యాన్యువల్ బుక్‌లో కూడా లేవని తేల్చారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వాగుపల్లికి చెందిన బాధితుడు వెంకటరెడ్డి తెలిపాడు. చిన ఇర్లపాడులో.. . అలాగే చిన ఇర్లపాడులో డీకే పట్టాలు పెడతామని చెప్పి ఆంధోని, రూత్, బ్రహ్మారెడ్డి, జయపాల్‌తో పాటు తన దగ్గర రూ.3 లక్షలు డబ్బులు తీసుకుని దొంగపట్టాలు ఇచ్చాడని ముద్దా బాబు అనే వ్యక్తి తెలిపాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన మరొకరి దగ్గర రూ.5 లక్షల డబ్బులు తీసుకుని దొంగ ఇంటి పట్టాలు ఇచ్చి మోసం చేసినట్లు బాధి తులు తెలిపారు. ఇలా అనేక మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. బాధితుడు వాగుపల్లికి చెందిన మూలే వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఫోర్జరీ సంతకాలతో దొంగపట్టాలు, పాస్ పుస్తకాలు ఇచ్చిన నెల్లూరు జిల్లా లింగసముద్రంకు చెందిన సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దాసరి ప్రసాద్ తెలిపారు. విచారణకు ఆదేశించా.. నా పేరుతో సంతకం పెట్టి కొందరు దొంగ పట్టాలు, పాస్ పుస్తకాలు తయారు చేసినట్లు నా దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణ విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించాను. అలాగే ఫోర్జరీ సంతకాలు, దొంగ స్టాంప్‌లతో పట్టాలు తయారు చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. – టీ అజయ్‌కుమార్, కనిగిరి ఆర్డీవో -
AP: జాబ్ పేరుతో నిరుద్యోగులకు టోకరా.. వీఆర్వో రేఖ అరెస్ట్
సాక్షి, విజయవాడ: నిరుద్యోగులను టార్గెట్ చేసి ఉద్యోగాల పేరుతో మోసం చేసిన మహిళా వీఆర్వోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన విజయవాడ పరిధిలో చోటుచేసుకుంది. నిరుద్యోగులకు ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సదరు మహిళ డబ్బులు వసూలు చేసింది. వివరాల ప్రకారం.. వీఆర్వో రేఖ కొంత మందితో కలిసి నిరుద్యోగులకు టోకరా వేసింది. ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడింది. ఈ క్రమంలో నిరుద్యోగుల నుంచి రూ.3లక్షల నుంచి రూ.8లక్షల చొప్పున వసూలు చేసింది. దీంతో, ఉద్యోగాల విషయమై ఆమెను ప్రశ్నించడంతో ముఖం చాటేసింది. ఈ నేపథ్యంలో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. సూర్యారావుపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక, బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: పెళ్లింట తీవ్ర విషాదం.. వరుడు సహా అక్కాచెల్లి మంటల్లో సజీవ దహనం -
పోలీసులపై నారా లోకేష్ బూతులు
-
అనకాపల్లి: మహిళపై వీఆర్వో వేధింపులు.. వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తూ..
పాయకరావుపేట: ఇంటి స్థలం మంజూరు చేయాలంటే నన్ను ప్రేమించు... పక్కా గృహం నిర్మించుకోవాలంటే పక్కలోకి రా... అంటూ ఒక వీఆర్వో దళిత మహిళతో బేరసారాలు సాగించాడు. అతని వేధింపులు తట్టుకోలేని బాధిత మహిళ బంధువుల సమక్షంలో వీఆర్వోకు దేహశుద్ధి చేసింది. ఈ షాకింగ్ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత మహిళ తెలిపిన వివరాలు, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పి.ఎల్.పురం గ్రామానికి చెందిన వివాహిత ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తు వీఆర్వో భాస్కరనాయుడు పరిశీలనకు వచ్చింది. ఆయన మహిళకు ఫోన్ చేసి ప్రేమించమని, సహజీవనం చేయమని వేధించడం మొదలుపెట్టాడు. అప్పుడే పనవుతుందని బెదిరించాడు. వాట్సాప్‌లో కూడా అసభ్యకరమైన మెసేజ్‌లు చేసేవాడు. ఒకరోజు బాధితురాలికి ఫోన్ చేసి.. ‘ఒంటరిగా ఉంటున్నావు.. నాతో సహజీవనం చేస్తే అన్నీ చూసుకుంటాన’ని ఒత్తిడి చేశాడు. వీఆర్వో వేధింపులు సహించలేక ఆమె కుటుంబ సభ్యుల దృష్టికి సమస్యను తీసుకువచ్చింది. వీఆర్వో వద్దకు వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో బాధిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులు వీఆర్వోకు దేహశుద్ధి చేశారు. బాధితురా లు తహసీల్దార్ జయప్రకా‹Ùకు, పోలీసులకు ఫిర్యా దు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, వీఆర్వోను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
AP Govt: వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రేడ్–1, 2 గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో)కు ప్రభుత్వం భరోసానిచ్చింది. సర్వీస్‌లో ఉన్న గ్రేడ్–1, 2 వీఆర్వో మరణిస్తే అతని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పిస్తూ ఏపీ వీఆర్వో సర్వీస్ నిబంధనలు–2008 లో మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులిచ్చారు. దీంతో గ్రేడ్–1, 2 వీఆర్వో కుటుంబంలో డిగ్రీ విద్యార్హత కలిగిన భాగస్వామి/పిల్లలకు కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్, ఈ క్యాడర్‌కు సమానమైన ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తారు. కారుణ్య నియామకాలపై వీఆర్వోలు ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం వీఆర్వోల డిమాండ్‌ను పట్టించుకోలేదు. సీఎం జగన్ సర్కార్.. వీరి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని వీఆర్వోల సుదీర్ఘ కాల డిమాండ్‌ను నెరవేర్చింది. దీనిపై ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (ఏపీ టెట్ ఫలితాలు విడుదల) -
వీఆర్వోల అంశంపై తెలంగాణ సర్కార్‌కు షాకిచ్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు(విలీనం) ప్రక్రియ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 121 అమలుపై హైకోర్టు స్టే విధించింది. జీవో చట్టానికి వ్యతిరేకంగా ఉందని భావిస్తూ.. తదుపరి ఉత్తర్వులు వెల్లడించే వరకు నిలిపివేత ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. జీవోలోని మూడో పేరాలోని విషయాలు యాక్ట్4 (1)కి వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకే జీవో అమ లును నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటివరకు వేరే శాఖల్లో బాధ్యతలు చేపట్టని ఉద్యోగులను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది. వీఆర్వోలుగా పనిచేస్తున్న వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు(విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతిస్తూ జీవో నంబర్ 121ను విడుదల చేసిన విషయం తెలిసిందే. గత నెల విడుదల చేసిన ఈ జీవో చట్టవిరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించినట్లేనని, వివక్షపూరితమని పేర్కొంటూ.. తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం, నల్లగొండ జిల్లా మహమూదాపురం వీఆర్వో పగిళ్ల వీరయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రెవెన్యూశాఖలో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో తమను సర్దుబాటు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభు త్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారమే వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్ధుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఐదు వేల మంది వీఆర్వోల్లో 56 మందే వేరే శాఖల్లో చేరలేదని, 98.9 శాతం ఉద్యోగులు చేరిపోయారని వెల్లడించారు. ఉద్యోగం నుంచి ఎవరినీ తొలగించలేదని, ప్రభుత్వానికి ఏ శాఖలో అవసరమో అక్కడ సర్దుబాటు చేశామని.. దీంతో వీఆర్వోలకు నష్టం జరగడం లేదన్నారు. పిటిషనర్ తరఫున అడ్వొకేట్ పీవీ కృష్ణయ్య వాదనలు వినిపించారు. వీఆర్వోల బదిలీలతో సంబంధం లేకుండానే జీవో వెలువడిందన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుకు చట్టం తెచి్చన ప్రభుత్వం అందుకు అవసరమైన నిబంధనల్ని రూపొందించలేదని నివే దించారు. రెవెన్యూ శాఖలోనే వీఆర్వోలు కొనసాగాలని కోరుకుంటున్నారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. విధివిధానాల నిబంధనలను రూపొందించకుండా జీవో ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదే శించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారు: జీవన్ రెడ్డి -
కొత్త ఉద్యోగాల భర్తీ అంకెల గారడీ : వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ‘కొత్త ఉద్యోగాల భర్తీ.. సీఎం కేసీఆర్ అంకెల గారడీ’ అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన సీఎం ఇప్పడు గ్రూప్ 4 ఉద్యోగాల్లో వాళ్లను భర్తీ చేయాలని చూస్తున్నారన్నారు. ధరణి పేరిట భూములు దోచుకోవడానికి వీఆర్వోలు అడ్డుగా ఉన్నారని ఆ వ్యవస్థనే రద్దు చేశారని ఆరోపించారు. లక్ష ఉద్యోగాలకు ఎసరు పెట్టి.. 80 వేల ఉద్యోగ ఖాళీలే అని తేల్చారన్నారు. రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఎనిమిదేళ్లుగా కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా.. తొలగించిన ఉద్యోగులతో భర్తీ చేయడమేంటని ఆక్షేపించారు. కాగా.. ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఈ నెల 4 నుంచి పునఃప్రారంభం కా నుంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మలచెరువు నుంచి ఆమె పాదయాత్రను కొనసాగించనున్నట్టు ఆ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ పేర్కొన్నారు. -
ఇతర శాఖల్లోకి వీఆర్వోలు, జీవో జారీ.. భగ్గుమన్న జేఏసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోల) శకం ముగిసింది. రెవెన్యూ శాఖను పర్యవేక్షించే భూపరిపాలన విభాగంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న 5,385 మందిని ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు (విలీనం) చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో వీఆర్వోలుగా పనిచేస్తున్న వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ సమాన హోదాలో సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించే బాధ్యతను జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం జీవో నంబర్ 121ను విడుదల చేశారు. 2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం వీఆర్వోల వ్యవస్థ రద్దయినందున.. ఆ పోస్టుల్లోని సిబ్బందిని ఇతర శాఖల్లోకి తీసుకోనున్నట్టు అందులో తెలిపారు. ఇప్పటికే ఆయా జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం గుర్తించిన ఖాళీల్లో వారిని సర్దుబాటు చేయాలని, లాటరీ తీసి ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రెవెన్యూ శాఖ ఇచ్చే సర్వీస్ రిజిస్టర్, తాజా పే సర్టిఫికెట్ ఆధారంగా ప్రభుత్వ శాఖలు వారిని చేర్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం సెలవు, సస్పెన్షన్, డిప్యుటేషన్, ఫారిన్ సర్వీసులో ఉన్న వీఆర్వోలను కూడా ఇతర శాఖలకు పంపాలని ఆదేశించారు. అదనంగా ఉంటే పొరుగు జిల్లాలకు.. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ఆర్థికశాఖ ప్రతి జిల్లాకు ఓ ఉత్తర్వును జారీ చేసింది. సదరు జిల్లాల్లో గుర్తించిన ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను విభాగాల వారీగా ప్రకటిస్తూ.. ఎంతమంది వీఆర్వోలను సర్దుబాటు చేయాలో పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ మెమో నంబర్: 1634052–బీ/186/ఏ1/హెచ్ఆర్ఎం–7/2022 పేరిట అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ పంపారు. లాటరీ ప్రక్రియను వీడియో తీయాలని.. నిర్దేశిత ఫార్మాట్లో ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లే ఇవ్వాలని సూచించారు. ఏదైనా జిల్లాలో గుర్తించిన ఖాళీల కంటే వీఆర్వోల సంఖ్య ఎక్కువగా ఉంటే పొరుగు జిల్లాలకు పంపాలని ఆదేశించారు. భూపరిపాలన మినహా.. జిల్లాల వారీగా ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలిస్తే.. వీఆర్వోలను ఎక్కువగా నీటి పారుదల, పంచాయతీరాజ్, విద్య, వైద్య శాఖలకు కేటాయించారు. జిల్లాల్లో హెచ్‌వోడీల పరిధిలోకి వచ్చే విభాగాల్లోని ఖాళీల్లో వీఆర్వోలను సర్దుబాటు చేయాలన్నారు. దేవాదా య, ఎక్సైజ్, పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లోకి కూడా వీరిని తీసుకునేందుకు అనుమతినిచ్చిన ఆర్థిక శాఖ.. భూపరిపాలన విభాగంలోకి తీసుకునేందుకు అనుమతించలేదు. జీవో నం 121 ప్రతి దహనం తమను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడంపై వీఆర్వోల సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం 121 ప్రతిని వీఆర్వో సంఘాల జేఏసీ నేతలు హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయ ప్రాంగణంలో దహనం చేశారు. వీఆర్వోలుగా తాము ఒక్క భూపరిపాలన విధులు మాత్రమే చూడటం లేదని.. మొత్తం 54 రకాల విధుల్లో అదీ ఒకటని, తమను ఇతర శాఖలకు పంపితే మిగతా 53 విధులను ఎవరు నిర్వర్తించాలని ప్రశ్నించారు. తమను సంప్రదించకుండా, సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రకటించారు. అప్పటివరకు జిల్లా కలెక్టర్లు ఇచ్చే సర్దుబాటు ఉత్తర్వులను తీసుకోవద్దని నిర్ణయించారు. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వీఆర్వోల జేఏసీ నేత వింజమూరి ఈశ్వర్ తెలిపారు. ఎక్కడో అవినీతి జరిగిందనే సాకుతో వ్యవస్థనే రద్దు చేయడం దారుణమన్నారు. ముందు కేడర్ స్ట్రెంత్ నిర్ధారించండి: ట్రెసా వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే ప్రక్రియను ప్రారంభించడంపై తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అసంతృప్తి వ్యక్తం చేసింది. రెవెన్యూ శాఖ 6,874 పోస్టులను కోల్పోతోందని ట్రెసా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, కె.గౌతమ్‌కుమార్ పేర్కొన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో తమ శాఖలో పని ఒత్తిడి పెరుగుతుందని.. పరిపాలన, ఎన్నికలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలు, ధ్రువపత్రాల జారీ, సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలకు విఘాతం కలుగుతుందన్నారు. పాలనా సౌకర్యార్ధం ప్రతి మండలానికి ఐదుగురు అదనపు సిబ్బందిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూశాఖను అనాథ చేశారు: టీజీటీఏ తెలంగాణ పాలన వ్యవస్థకు ఆయువు పట్టు అయిన రెవెన్యూ శాఖను ప్రభుత్వం అనాథను చేసిందని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ (టీజీటీఏ) పేర్కొంది. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ఇప్పటివరకు చెప్పలేదని టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి మండిపడ్డారు. కొత్త మండలాలు, డివిజన్లు, జిల్లాలు ఏర్పాటయ్యాక ఒక్క పోస్టునూ పెంచని ప్రభుత్వం.. ఏకంగా 6వేలకు పైగా పోస్టులను రెవెన్యూ శాఖ నుంచి తీసేయడం దారుణమన్నారు. వెంటనే జీవో 121ను రద్దు చేయాలని, లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. -
ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. భర్తను చూడగానే..
కమలాపురం: మండలంలోని టి.చదిపిరాళ్లకు చెందిన రిటైర్డ్ వీఆర్ఓ లింగాల రాఘవేంద్ర రావు రెండున్నరేళ్ల తర్వాత ఇంటికొచ్చాడు. మండలంలోని పలు గ్రామాల్లో వీఆర్ఓగా పనిచేసిన ఆయన నాలుగేళ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. అయితే పక్షవాతం రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆయన తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వివిధ చోట్ల గాలించి ఆశలు వదిలేశారు. ఇంటి నుంచి వెళ్లి దాదాపు రెండున్నరేళ్లవుతోంది. శనివారం కమలాపురం పట్టణంలోని క్రాస్ రోడ్డులో రాఘవేంద్రరావు ఉన్నట్లు గ్రామ మాజీ సర్పంచ్ జయ సుబ్బారెడ్డికి సమాచారం వచ్చింది. ఆయన అక్కడకు చేరుకుని రాఘవేంద్రరావును ఇంటికి తీసుకెళ్లి భార్య లీలావతమ్మకు అప్పగించారు. ఆమె భర్తను చూడగానే ఆనందపరవశమయ్యారు. ఎటు చూసినా కరోనా కాటేస్తోంది..ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. అని కన్నీటి పర్యంతమైంది. ఇన్నాళ్లు ఎక్కడున్నావని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడుగుతున్నప్పటికీ ఆయన సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఏదీ అడిగిన నమఃశివాయః అనడం తప్ప వేరే మాట మాట్లాడటం లేదు. రాఘవేంద్ర రావుకు ఒక వివాహిత కుమార్తె ఉన్నారు. ఇవీ చదవండి: పెళ్లికి పిలవలేదని.. పిల్లల ఆటను సాకుగా తీసుకుని.. సబ్ రిజిస్ట్రార్ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర -
‘వీఆర్ఓల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ కృషి’
సాక్షి, తాడేపల్లి: వీఆర్ఓల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని, ఫైనాన్స్ శాఖలో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. పరీక్షల్లో ఉన్న సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. -
ప్రస్నార్ధకంగా తెలంగాణ వీఆర్వోల పరిస్థితి
-
కల్యాణ లక్ష్మి డబ్బుల కోసం వీఆర్వో కక్కుర్తి
సాక్షి, నల్లబెల్లి(వరంగల్): నిరుపేద కుటుంబాల్లో యువతుల వివాహానికి ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం దరఖాస్తు ఆమోదించేందుకు లంచం డిమాండ్ చేసిన వీఆర్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు యువతి తండ్రి నుంచి రూ.3వేలు తీసుకుంటున్న వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడపల్లి వీఆర్వో ఐలయ్య సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలు.. విచారణ నివేదిక కోసం.. మేడపల్లి గ్రామానికి చెందిన దేవరాజు పద్మ – ఏకాంబ్రం దంపతుల కుమార్తె మౌనిక వివాహాన్ని ఈ ఏడాది జనవరి 6న జరిపించారు. ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి పథకం కోసం ఏకాంబ్రం మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసి పత్రాలను ఫిబ్రవరి 13న వీఆర్వో ఐలయ్యకు అందించాడు. అయితే, విచారణ నివేదికను పూర్తి చేసేందుకు వీఆర్వో ఐలయ్య రూ.10 వేలు లంచం డిమాండ్ చేయగా అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో రూ.5వేలైనా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు. ఈమేరకు మొత్తాన్ని చెక్కు వచ్చాక ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొన్నాడు. గత నెల 25న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారురాలి తల్లి పద్మ చెక్కు తీసుకున్నప్పటి నుంచి వీఆర్వో ఐలయ్య రూ.5వేల కోసం వేధిస్తుండగా, ఏకాంబ్రం తమ వద్ద డబ్బు లేదని చెప్పాడు. రూ.3వేలైనా ఇవ్వాలని తేల్చిచెప్పడంతో ఏకాంబ్రం శుక్రవారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ మధుసూదన్, సీఐలు క్రాంతికుమార్, శ్యాంసుందర్ రంగంలోకి దిగి ఏకాంబ్రం నివాసం ఉంటున్న నర్సంపేట మండలం రాజుపేటలో సోమవారం మాటు వేశారు. అక్కడకు వచ్చిన వీఆర్వో ఐలయ్య రూ.3 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం ఆయనను నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి రికార్డులు పరిశీలించారు. అనంతరం డీఏస్పీ మధుసూదన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 94404 46146 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీంతో చైల్డ్‌లైన్ ప్రతినిధులు బాలిక, బాలుడితో పాటు వారి తల్లిదండ్రులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్ -
స్వామి భక్తి చాటుకున్న వీఆర్వో
సైదాపురం: మండలంలోని మర్లపూడి వీఆర్వో ముని శనివారం జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సమయంలో టీడీపీకి ఓట్లేయంటూ ఓ పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రభావితం చేయడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల వేళ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఉద్యోగి ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడ్డారు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న ముని టీడీపీ నేత లోకేష్‌తో దిగి ఉన్న ఫొటో ఆదివారం వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది. శనివారం జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటింగ్ వేసేందుకు వస్తున్న ఓ వృద్ధ దంపతులను టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేయాలంటూ వీఆర్వో ప్రలోభాలకు గురిస్తున్నారనే అనుమానంతో స్థానికులు నిలదీశారు. దీంతో కొంత సేపు పోలింగ్ కేంద్రం వద్దనే వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు రంగప్రవేశం చేసి వివాదాన్ని సర్దుబాటు చేసి వీఆర్వోను పోలింగ్ కేంద్రం వద్ద నుంచి తీసుకెళ్లారు. వీఆర్వో పనితీరు మొదటి నుంచి సక్రమంగా లేదంటూ ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారి ఓ పార్టీకి తొత్తుగా వ్యవహరించడం ఏమిటని మర్లపూడి వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వీఆర్వోను వెంటనే సస్పెండ్ చేయాలంటూ స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు వరదబండి ప్రభాకర్‌రెడ్డి, చీర్ల వెంకురెడ్డి, భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: టీడీపీలో సస్పెన్షన్ల కలకలం.. వీర్రాజు, అచ్చెన్నలకు పదవీ గండం? -
మానవత్వం చూపించిన వీఆర్వో
సాక్షి, నందిగాం: కరోనా భయంతో ఓ వ్యక్తి అంత్యక్రియలకు గ్రామస్తులంతా భయపడుతుంటే.. ఆ ఊరి వీఆర్వో మాత్రం అంతా తానై వ్యవహరించి మానవత్వం చాటుకున్నారు. నందిగాం మండలం సైలాడ గ్రామానికి చెందిన అట్టాడ వైకుంఠరావు(67) వారం రోజులుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో విశాఖ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమ వారం రాత్రి వైకుంఠరావు మృతి చెందారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు మంగళవారం గ్రామానికి తీసుకువచ్చారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానికులు అంత్యక్రియలకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న స్థానిక వీఆర్వో పేరాడ యుగంధర్ మృతుని కుటుంబసభ్యులతో పాటు బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి అవగాహన కల్పించారు. కరోనా రక్షణ చర్యలు చేపట్టి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. కర్రలను సమకూర్చి స్వయంగా తాను కూడా శ్మశానం వద్దకు వెళ్లారు. వీఆర్వో యుగంధర్ చూపిన చొరవను పలువురు ప్రశంసించారు. చదవండి: వీఆర్వోలకు కొత్త బాధ్యతలు.. -
లంచం అడిగే.. అడ్డంగా దొరికిపాయే..
సాక్షి, శ్రీకాకుళం: మ్యుటేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన మందస వీఆర్ఓ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మందస మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ పండాకు బుడారిసింగి పంచాయతీలో 67 సెంట్ల భూమి ఉంది. ఆయన మృతి చెందడంతో కుమారుడు రాజేష్‌పండా తన తండ్రి పేరున ఉ న్న భూమికి మ్యుటేషన్ కావాలని పది రోజుల కిందట సోంపేట మండలంలోని కొర్లాంలో గల మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దడానికి వీఆర్ఓ బి.రేణుకారాణి రంగంలోకి దిగారు. రూ.3వేలు లంచం ఇస్తే గానీ పని జరగదని రాజేష్ పండాకు తేల్చి చెప్పారు. దీంతో ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. బాధితుడి వాదనలు విన్న ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి తన సిబ్బందితో కలిసి మందస తహసీల్దార్ కార్యాలయంలోనే వీఆర్వోను పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. సీఐలు భాస్కరరావు, హరి, ఎస్ఐలు సత్యారావు, చిన్నంనాయుడులతో పాటు సుమారు 15 మంది సిబ్బంది బుధవారం మందస తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని మాటు వేశారు. రాజేష్‌పండా నగదును వీఆర్వో రేణుకారాణికి ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలోనే ఈ సంఘటన జరగడంతో అధికారులు, ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఎప్పటి నుంచో తహసీల్దార్ కార్యాలయంపై ఆరోపణలు వినిపిస్తుండగా, వీఆర్వో అదే కార్యాలయంలో దొరికిపోవడంతో స్థానికంగా ఈ సంఘటన సంచలనం కలిగిచింది. మందస తహసీల్దార్ కార్యాలయంలో అవినీతికి పాల్పడిన వీఆర్ఓ బి.రేణుకారాణిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. ఆమెను విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తాం. అధికారులు, ఉద్యోగు లు, సిబ్బంది అవినీతిపై బాధితులు ఏసీబీకి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం జీతం ఇస్తోంది. అవినీతికి పాల్పడితే ఎవ్వరైనా ఉపేక్షించం. 14400 అనే నంబరు కు గానీ, ఏసీబీ డీఎస్పీ 9440446124, సీఐలు 7382629272, 9440446177 అనే నంబర్లకు ఫిర్యాదు చేయాలి. లంచం తీసుకోవడం, ఇవ్వడమూ నేరమే. బాధితులకు ఏసీబీ అండగా ఉంటుంది. – బీఎస్ఎస్వీ రమణమూర్తి, డీఎస్పీ, యాంటీ కరప్షన్ బ్యూరో చదవండి: భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన భర్త -
వీఆర్వోలకు కొత్త బాధ్యతలు..
సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారు (వీఆర్వో)లను రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా వీఆర్వోల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 5,348 మంది వీఆర్వోలు గత కొన్ని నెలలుగా పనిలేకుండా ఖాళీగా ఉంటున్నారు. అవసరాన్ని బట్టి వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని, అప్పటివరకు వారికి యథావిధిగా జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిలో 40 శాతం మందిని పురపాలక శాఖలోకి తీసుకోనున్నారు.వార్డుకొకరు చొప్పున: జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 141 పురపాలికల్లో దాదాపు 2,200 వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలుత ప్రత్యక్ష నియామకాల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కొత్త పోస్టులు సృష్టించడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి కోరుతూ పురపాలక శాఖ ఇటీవల ప్రతిపాదనలు సైతం పంపించింది. అయితే వీఆర్వోలను పురపాలక శాఖలో విలీనం చేసుకుని వార్డు ఆఫీసర్లుగా నియమించాలనే ఆలోచన రావడంతో ప్రత్యక్ష నియామకాల ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనబెట్టింది. వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేసేందుకు అవసరమైన విధివిధానాలను ప్రభుత్వం రూపొందించాల్సి ఉంది. ప్రభుత్వ అవసరాలు, ఖాళీలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలో విలీనం కావడానికి వీఆర్వోల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇతర శాఖల్లో వీఆర్వోలను విలీనం చేస్తే 5,348 మందిలో 40 శాతం మంది ఒక్క పురపాలక శాఖకే వస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త పుర చట్టం అమలుకే... పురపాలనలో సంస్కరణల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చింది. వార్డు/ డివిజన్ స్థాయిలో ఈ చట్టం అమలు బాధ్యతలను వార్డు ఆఫీసర్లకు అప్పగించబోతోంది. వార్డు కమిటీలతో సమావేశాలు నిర్వహించడం, వార్డు అభివృద్ధి పనుల్లో కౌన్సిలర్లు/ కార్పొరేటర్లతో సమన్వయం చేసుకోవడం, హరితహారం కింద మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడం, పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించడం, అక్రమ నిర్మాణాలపై నిఘా వేయడం, ఆస్తి పన్ను వసూళ్లు తదితర బాధ్యతలను వార్డు ఆఫీసర్లకు ప్రభుత్వం అప్పగించనుంది. ఈ బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, లేక కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం నాటిన వాటిలో 85 శాతం మొక్కలను పరిరక్షించడంలో విఫలమైనా వార్డు ఆఫీసర్లను బాధ్యులుగా చేయనున్నారు. -
వీఆర్వో సూసైడ్ నోట్ కలకలం
సాక్షి, చిత్తూరు : ఎంపీడీఓ టార్చర్ పెడుతున్నారంటూ ఓ వీఆర్వో సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని 49కొత్తపల్లి వీఆర్వోగా పనిచేస్తున్న కోదండ రామిరెడ్డి మంగళవారం సూసైడ్ నోట్ రాని కనిపించకుండా పోయాడు. తన సొంత మండలంలో జాయిన్ చేయించుకోవడానికి ఎంపీడీవో నిరాకరిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకోబుతున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. గత ఏడాది రామిరెడ్డి నారాయణవనం మండలంకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. అయితే గత నెలలో ఆయన డిప్యుటేషన్ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ ఎత్తేశారు. దీంతో సొంతమండలానికి వెళ్లాలని రామిరెడ్డి భావించారు. కానీ సొంత మండలంలో జాయిన్ చేయించుకోవడానికి ఎంపీడీఓ నిరాకరించినట్లు రామిరెడ్డి ఆరోపించారు. ఎంపీడీవో అక్రమాలకు తాను సహరించకపోవడంతో తనపై కక్ష కట్టారని సూసైడ్ నోట్లో తెలిపారు. ఎంపీడీఓ చర్యలకు విరక్తి చెంది తనువు చాలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కోదండరామిరెడ్డి కనిపించకుండా పోయారు. అతని ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం!
-
వీఆర్ఓపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిట్ల పురాణం!
సాక్షి, హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే.పి. వివేకానంద తనను బెదిరించాడని గాజుల రామారం వీఆర్ఓ శ్యామ్ కుమార్ ఆరోపించారు. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆదేశాలమేరకు విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చినందుకు ఎమ్మెల్యే ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడని అన్నారు. తనపై, రెవెన్యూ శాఖ అధికారులపై ఎమ్మెల్యే తిట్ల పురాణానికి సంబంధించి ఆడియో టేపులను పోలీసులకు అందించానని శ్యామ్ తెలిపారు. ఎమ్మెల్యేపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ఎమ్మెల్యే వివేకానందపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్యామ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, అధికారులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలకు సంబంధించినదిగా ఓ ఆడియో టేపు ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇక ఎమ్మెల్యే తీరుపట్ల రెవెన్యూ ఉద్యోగులు మేడ్చల్ కలక్టర్ వద్ద ఇప్పటికే నిరసన వ్యక్తం చేశారు. (చదవండి: తుపాకులతో టీడీపీ నేత కుమారుడి హల్చల్) -
బయటపడుతున్న రెవెన్యూ లీలలు!
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): రెవెన్యూ శాఖలోని కొందరు వీఆర్వోలు అక్రమాలకు పాల్పడ్డారు. బడాబాబుల వద్ద డబ్బులు తీసుకుని చిన్న, సన్నకారు రైతుల భూములను మరొకరికి పట్టా చేసి ఇచ్చారు. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో తమకు గతంలో జరిగిన అన్యాయాన్ని బాధితులు ఇప్పుడు వెల్లబోసుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకపోవడంతో ఇతరులకు పట్టా చేసి ఇచ్చిన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన చిట్యాల నర్సుబాయి అనే వృద్ధురాలికి 921 సర్వే నంబర్లో 21 గుంటల భూమి ఉంది. ఈ భూమిని నర్సుబాయి కుటుంబ సభ్యులు చాలా ఏళ్ల కిందనే కొనుగోలు చేశారు. అనివార్య కారణాల వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కాగా తెలంగాణ ప్రభుత్వం సాదా బైనామాలపై ఉన్న భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని నిర్ణయించగా తమ గ్రామ వీఆర్వోకు వినతి పత్రం సమర్పించింది. సాదా బైనామాపై ఉన్న భూమిని పట్టా మార్పిడి చేయడానికి ఈ గ్రామ వీఆర్వో లంచం అడగగా నర్సుబాయి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. అంతే నర్సుబాయికి సంబంధించిన భూమిని మరో మోతుబరి రైతు పేరిట పట్టా మార్పిడి చేశారు. సాదాబైనామాలకు సంబంధించిన కాగితాలు నర్సుబాయి వద్ద ఉండగా పట్టా మార్పిడి ఆమె పేరిట కాకుండా ఎలాంటి కాగితాలు లేని వ్యక్తి పేరిట పట్టా చేశారు. ఇదే తొర్తి గ్రామానికి చెందిన కుండ మధు 781 సర్వే నంబర్లో 24 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఇతను 2007లో ఆర్వోఆర్లో దరఖాస్తు చేసుకుని తన పేరిట పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ సైతం తీసుకున్నాడు. ఈ భూ మిని మధు సాగు చేస్తున్నాడు. కానీ భూ ప్రక్షాళనలో భాగంగా మధుకు డి జిటల్ పాసు పుస్తకం రావాల్సి ఉంది. అప్పటికే మధుకు సంబంధించిన భూమి మరో బడా రైతు పేరిట పట్టా చేయబడింది. ఆర్వోఆర్కు సంబంధించిన ప్రొసీడింగ్‌తో పాటు ఉమ్మడి రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నా రికార్డులలో మాత్రం మధు పేరుకు బదులు మరోకరి పేరు ఉంది. ఇలా నర్సుబాయి, మధులకు భూమి ఉన్నా రెవెన్యూ రికార్డులలో అక్రమాలు చోటు చేసుకోవడంతో రైతుబంధుకు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధి పొందలేక పోయారు. తమ భూమికి సంబంధించిన రికార్డులను సరి చేసి తమకు పట్టా పాసు పుస్తకం జారీ చేయాలని వీఆర్వో, ఇతర అధికారులకు విన్నవించగా ఏదో ఒక సాకు చెబుతూ పట్టా సర్టిఫికెట్లను జారీ చేయలేదు. కాగా రికార్డులను సరిచేస్తామని వీఆర్వో నమ్మించడంతో బాధితులు ఎక్కడ కూడా తమ బాధ చెప్పుకోలేదు. చివరకు వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడంతో పట్టాల మార్పిడిలో చోటు చేసుకున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఒక నర్సుబాయి, కుండ మధులకు సంబంధించిన సమస్యనే కాదు. ఎంతో మంది చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన సమస్య. చిన్న సన్నకారు రైతుల భూములను డబ్బులు ఇచ్చిన వారి పేరిట పట్టా మార్పిడి చేసిన అవినీతి వీఆర్వోల బాగోతం ఇది. కబ్జా కాలమ్ రద్దుతో అసలు సమస్య కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం పహణీలలో కబ్జా కాలమ్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కబ్జా కాలం రద్దు కావడంతో పట్టా పాసు పుస్తకాలు రాని భూముల యజమానుల పరిస్థితి అగమ్యగోచరం కానుంది. తొర్తికి చెందిన చిట్యాల నర్సుబాయి, కుండ మధులు ఇది వరకు కబ్జా కాలంలో ఉండగా కబ్జా కాలం రద్దయితే యాజమాన్య హక్కులను పూర్తిగా కోల్పోతారు. సమగ్ర దర్యాప్తు జరిపితేనే.. తొర్తితో పాటు పలు గ్రామాల్లో చోటు చేసుకున్న అక్రమాలు వెలుగులోకి వచ్చి బాధితులకు న్యాయం జరగాలంటే భూ రికార్డులపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాదా బైనామాలపై ఉన్న భూముల పట్టాల మార్పిడికి చిన్న, సన్నకారు రైతులు వీఆర్వోలు అడిగినంత ఇచ్చుకోకపోవడంతో భూముల యజమానులు మారిపోయారు. వీఆర్వోలు గ్రామాలలో తిష్టవేసి ఉన్నంత కాలం పట్టాల మార్పిడికి సంబంధించి వారు ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకున్నారు. వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడంతో తమకు గతంలో జరిగిన అన్యాయాన్ని బాధితులు ఇప్పుడు వెల్లబోసుకుంటున్నారు. అసైన్డ్ భూములది అదే పరిస్థితి.. అసైన్డ్ భూములను గతంలో పొందిన కొందరు తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో భూములను విక్రయించుకున్నారు. ఈ భూములకు సంబంధించి పట్టాల మార్పిడికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అసైన్డ్ భూముల పట్టాల మార్పిడిని రిజిస్ట్రేషన్ పద్ధతిలో కాకుండా సాదాబైనామాలపై మార్పిడి చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో ఒక్కో ఎకరం భూమి పట్టా మార్పిడికి రూ. 25వేల వరకు కింది స్థాయి ఉద్యోగులు వసూలు చేశారు. కొందరు డబ్బులు ఇవ్వకపోవడంతో సాదాబైనామా దరఖాస్తులను వీఆర్వోలు పక్కన పడేశారు. ప్రతి రెవెన్యూ కార్యాలయంలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు పడి ఉన్నాయి. అవినీతి వీఆర్వోలపైనే చర్యలు తీసుకువాలి అధికారం తమ చేతిలో ఉందనే ధీమాతో కొందరు వీఆర్వోలు తమ పరిధిలోని గ్రామాల్లో అడ్డగోలుగా దోచుకున్నారు. అక్రమంగా ఎన్నో రకాల ఆస్తులను కొందరు అవినీతి వీఆర్వోలు సంపాదించుకున్నారు. ప్రభుత్వం విచారణ చేపట్టి ఇలాంటి వీఆర్వోలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కొత్త రెవెన్యూ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు
సాక్షి, హైదరాబాద్: వీఆర్వోలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అలాగే వీఆర్ఏలలో అత్యధికంగా పేదవర్గాల వారే ఉన్నారని, వీరిలో వయోభారం ఉన్నవారి పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. వీఆర్ఏలకు స్కేల్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.260 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రెవెన్యూ యంత్రాంగానికి విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. శనివారం ప్రగతి భవన్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఎలక్షన్లు, ప్రకృతి వైపరీత్యాలు సహా 54 రకాల బాధ్యతలను నిర్వహిస్తూ రెవెన్యూ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. రెవెన్యూ శాఖలో అన్నిస్థాయిల్లో ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, తహసీల్దార్లకు కారు అలవెన్సు రెగ్యులర్‌గా ఇవ్వాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సౌకర్యాల కల్పన కోసం రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజల సౌలభ్యం కోసమే కొత్త చట్టం ప్రజలు కేంద్ర బిందువుగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ నేపథ్యంలోనే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని, ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూశాఖలోని అధికారులు, సిబ్బంది సమష్టిగా చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ఇక నుంచి రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆకాంక్షించారు. వివిధ పనులపై రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా, హుందాగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి 60 మంది ట్రెసా ప్రతినిధులు హాజరయ్యారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి ట్రెసా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చట్టం అమలులో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టును భర్తీ చేయాలని, అర్హులైన వీఆర్వోలను రెవెన్యూశాఖలోనే కొనసాగించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రెవెన్యూశాఖలో ఖాళీలను భర్తీ చేసి, సిబ్బందిని పెంచాలని, కంప్యూటర్ ఆపరేటర్లను రెగ్యులరైజ్ చేయాలని, రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించడానికి ముందు తహసీల్దార్లతో ప్రత్యేకంగా సమావేశం కావాలని వారు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎస్ సోమేశ్ కుమార్, సెక్రటరీ స్మితా సభర్వాల్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
చరిత్రాత్మకం
సాక్షి, హైదరాబాద్: ‘ఈ రోజు చరిత్రాత్మకమైనది. ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడే రోజు. రైతులకు సరళీకృతమైనటువంటి చట్టం కోసం కొత్త బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టాం. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో.. ఇప్పుడు అంతే సంతోషంగా ఉన్నా. ప్రతీ కుటుంబానికి వర్తించే బిల్లు ఇది’అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శాసనసభలో బుధవారం రెవెన్యూ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆయన బిల్లులోని ముఖ్యాంశాలను వివరించారు. ప్రపంచంలో ఇంతటి అత్యుత్తమైన బిల్లు మరోటి లేదన్నారు. ‘కొత్త చట్టంతో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూతగాదాల పీడ విరగడవుతుంది. అధికారుల దయాదక్షిణ్యాల మీద ప్రజలు ఆధారపడాల్సిన పని ఉండదు. వారసత్వ భూ మార్పిడి సమస్యలు కూడా తీరిపోతాయి. కుటుంబ సభ్యులు తమ సమాచారాన్ని రాసి ఇస్తే ధరణి పోర్టల్ ద్వారా పరిష్కారమవుతాయి. ఇకనైనా అవినీతి అంతం కావాలి’అని అన్నారు. అంతులేని అవినీతికి ఈ బిల్లు అడ్డుకట్ట వేస్తుందన్నారు. ‘భూములన్నింటినీ డిజిటలైజ్డ్ సర్వే చేస్తాం. డిజిటల్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ తయారవుతుంది. అది కూడా ప్రజలకు ఐటీ నెట్వర్క్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన ఇంకేం అన్నారంటే... వారి ఉద్యోగాలకు ఢోకా లేదు... ‘వీఆర్వో, వీఆర్ఏల ఉద్యోగాల భద్రతకు ఎటువంటి డోకా లేదు. అవసరాల మేరకు వేర్వేరు శాఖల్లో సర్దుబాటు చేస్తాం. భూసంస్కరణలను క్రమబద్ధీకరించడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినా పాలకులు పూర్తిస్థాయిలో మార్పును తీసుకురాలేకపోయారు. అంతులేని అవినీతి కారణంగా ప్రజలకు, రెవెన్యూ శాఖకు మధ్య విద్వేషపూరిత వాతావరణం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేళ్లుగా దీన్ని చక్కదిద్దడానికి కసరత్తు చేస్తున్నాం. భూరికార్డుల ప్రక్షాళన మొదలుపెట్టాం. మధ్యలో ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఆగింది. కరోనా మహమ్మారి రాకతో ఆరేడు మాసాలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. రెవెన్యూ బాధ్యతలను నేనే స్వీకరించా. సెక్రటరీని కూడా నియమించలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే దీన్ని చూస్తున్నారు. మూణ్నాలుగు నెలలుగా మళ్లీ భూరికార్డుల ప్రక్షాళనపై దృష్టి పెట్టా. రెవెన్యూ ఉద్యోగులతోనూ నేరుగా మాట్లాడా. తమకు గౌరవం, ఉద్యోగ భద్రత కావాలని అడిగారు. వారి ఉద్యోగ భద్రతకు డోకా ఉండదు. ప్రజలకు దీంతో మేలు జరుగుతుంది. రాష్ట్రంలో వీఆర్ఏలు 22,900 మంది ఉన్నారు. వీరిలో దళితులు, బీసీలే ఎక్కువ. ఇప్పుడు వీరికి స్కేల్ ఇచ్చి గుర్తిస్తాం. కొందరిని రెవెన్యూలో, మరికొందరిని ఇరిగేషన్, మున్సిపల్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తాం. ఈ ప్రక్రియ మూణ్నాలుగు నెలల్లో పూర్తవుతుంది. వీరికి స్కేల్ పోస్టులు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ. 260 కోట్ల వరకూ అదనపు భారం పడుతుంది. వారి అధికారాలకు కత్తెర... ‘సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఉన్న 5,480 మంది వీఆర్వోలను తీసేయం. ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నాం. వీరికి ప్రత్యామ్నాయ సేవలు ఐటీ ద్వారానే జరుగుతాయి. తహసీల్దార్లు, ఆర్టీఓలు ఉంటారు. అయితే వారి అధికారాలు పోతాయి. రాజ్యాంగం ప్రకారం చట్టం నిర్దేశించినట్లుగా పనిచేయాలి. ప్రస్తుతం ఎలా ఉందంటే తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లే ఉత్తర్వులు జారీ చేస్తారు. మళ్లీ వీరే కోర్టులు నిర్వహిస్తారు. ఇది కొంచెం వికారంగా ఉంది. అందుకే కొత్త చట్టం అమల్లోకి వచ్చాక, ఈ మూడు రెవెన్యూ కోర్టులుండవు. సివిల్ కోర్టు, సెషన్ కోర్టు, హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు వంటి న్యాయ వ్యవస్థ ఉండగా మళ్లీ ఈ రెవెన్యూ కోర్టులెందుకు?. ఈ మూడు కోర్టుల్లో కలుపుకొని మొత్తం 16,137 కేసులున్నాయి. వీటి పరిష్కారానికి ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటుచేస్తాం. మూడునాలుగు నెలల్లో కేసులు పరిష్కరించేలా కృషిచేస్తాం. ఆ తర్వాత భూ తగాదా కేసులుండవు. ఒకటో అరో కేసులొచ్చినా వారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి. ఎక్కడికెళ్లినా ఎకరా రూ.10 లక్షలకు పైనే ఉంది. ప్రస్తుత భూ వివాదాలు తీవ్ర రూపం దాల్చకుండా ఉండాలంటే భూరికార్డుల క్రమబద్ధీకరణ జరగాల్సిందే. రెవెన్యూ చట్టంలో ఎలాంటి మార్పులు చేస్తారా? అని ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నూతన విధాన అమలుకు ఎంత ఖర్చైనా వెనుకాడవద్దని చెప్పా. గతంలో నిజాం హయాంలో తర్వాత ఇప్పటి వరకూ భూరికార్డుల సర్వే చేయలేదు. అక్షాంశాలు, రేఖాంక్షాల ఆధారంగా.. ‘ఇప్పుడు తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రతి భూమిని సర్వే చేయిస్తాం. ప్రతి ఇంచునూ కొలుస్తాం. అక్షాంశాలు, రేఖాంశాలతో భూమి హద్దుల(కోఆర్డీనేట్)ను నిర్ణయిస్తాం. ఇక బలహీనుల భూమిని బలవంతులు దౌర్జన్యంగా ఆక్రమించుకోలేరు. ఇటువంటి పోర్టల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. హరియాణాలో ఉన్నా ఇంత లోతుగా లేదు. ఎలక్ట్రానిక్ ధరణి పోర్టల్ త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఒకటి వ్యవసాయ భూములు.. రెండోది వ్యవసాయేతర భూములు. రాష్ట్రంలో 1.12 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగముంది. ఈ పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఎవరైనా చూసుకోవచ్చు. డౌన్లోడ్, కాపీ కూడా చేసుకోవచ్చు. మల్టీపుల్ సర్వర్లలో, దేశంలో సురక్షితమైన ప్రాంతాల్లో వీటి రికార్డులు భద్రపరుస్తారు. ఒకవేళ ఏదైనా విపత్తు వచ్చినా ఇతర ప్రాంతాల్లో వీటి రికార్డులుంటాయి. కొన్ని బ్యాంకులు రుణాలివ్వడానికి రైతులను తిప్పించుకుంటున్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం (ఎన్‌కంబెన్స్) ధరణి పోర్టల్‌లో లభ్యమవుతుంది. గతంలో కొందరు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను కూడా రిజిస్ట్రేషన్ చేశారు. కొత్త టెక్నాలజీతో రాష్ట్రంలో ఇటువంటి వాటికి తావుండదు. ప్రసిద్ధ స్థలాల వివరాలను ముందే పొందుపర్చి ఉంచుతాం గనుక సాఫ్ట్వేర్ ఆటోమెటిక్‌గా తిరస్కరిస్తుంది. అన్ లాక్ చూపిస్తుంది. జాయింట్ రిజిస్ట్రార్లుగా తహసీల్దార్లు... తహసీల్దార్లను జాయింట్ రిజిస్ట్రార్లుగా చేస్తాం. వ్యవసాయ భూములను వీరు రిజిస్ట్రేషన్ చేస్తారు. నిర్ణీత సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాలి. స్లాట్‌ను రైతులే బుక్ చేసుకోవచ్చు. ఆ సమయానికి వచ్చి పోతే సరిపోతుంది. వెంటనే సంబంధిత డాక్యుమెంట్లు కూడా అందజేస్తారు. వ్యవసాయేతర భూములను ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. మొత్తం రాష్ట్రంలో గ్రామ, పురపాలక, జీహెచ్ఎంసీ పరిధిలో కలుపుకొని 89.47 లక్షల ఆస్తులు ఆన్ లైన్లో ఉన్నాయి. ధరణి పోర్టల్‌లోకి ఇవన్నీ వస్తాయి. రిజిస్ట్రేషన్, ఎమ్మార్వో కార్యాలయాల్లో డాక్యుమెంట్లను ఎవరికి వారు సొంతంగా రాసుకోవచ్చు. దానికి సంబంధించిన నమూనా కాపీని ఆయా కార్యాలయాల్లో ప్రభుత్వమే అందుబాటులో ఉంచుతుంది. ఒకవేళ డాక్యుమెంట్ రాసుకోవడానికి వీలు పడని వారు నిర్దేశిత ఫీజు చెల్లించి రాయించుకోవచ్చు. అలా రాసే వారికి లైసెన్సు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. కుల ధ్రువీకరణ పత్రాలను కూడా ఇక నుంచి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లోనే ఇస్తారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలోనూ ఆస్తుల ప్రాతిపదికన జారీచేస్తారు. ఆ డేటా బేస్ అంతా ప్రభుత్వం వద్ద ఉంటుంది’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనిపై సుదీర్ఘంగా శుక్రవారం చర్చ జరుగుతుందన్నారు. దీనికి ముందు ముఖ్యమంత్రి వీఆర్వో పోస్టుల రద్దు బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు. అలాగే మంత్రి కేటీఆర్.. మున్సిపల్ లా సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. పంచాయతీరాజ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. -
ఒకే క్లిక్‌తో భూమి భద్రం
సాక్షి, హైదరాబాద్: భూమి హక్కుకు ‘కొత్త’కళ వచ్చింది. ‘రెవెన్యూ’పరిధులు, పరిమితులు నూతన బాట పట్టాయి. ఇకపై వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు ఒక చోటుకు, మ్యుటేషన్‌కు మరో చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జాయింట్ రిజిస్ట్రార్ల హోదాలో తహసీల్దార్లే ఆ రెండు పనులు చేసి రైతుకు వెంటనే పాసు పుస్తకం ఇచ్చేస్తారు. పంట రుణాల కోసం రైతులు పాసు పుస్తకాలను కుదువ పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే అన్నీ చూసుకుని బ్యాంకర్లు రుణాలిస్తారు. డిజిటల్ రికార్డులే భూమిని భద్రంగా ఉంచుతాయి. బ్యాంకులకు భరోసా ఇస్తాయి. భూ వివాదాలకు, రెవెన్యూ విభాగానికి ఇక నుంచి సంబంధం ఉండదు. రెవెన్యూ కోర్టులన్నీరద్దయ్యాయి. ఇక భూమి హక్కుపై కిరికిరి వస్తే సివిల్ కోర్టులకు వెళ్లి పరిష్కరించుకోవాల్సిందే. ధ్రువీకరణలు స్థానిక సంస్థల దారి మళ్లాయి. వీఆర్వోల వ్యవస్థ రద్దు, వీఆర్ఏలకు పేస్కేల్, ఇతర శాఖల్లో సమానశ్రేణిలో విలీనం. ఇదీ స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం. సాధికారతకు సాంకేతికత.... యాజమాన్య హక్కుల బదలాయింపు, పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేసే పరిస్థితికి కొత్త చట్టంతో చెక్ పడింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన కొన్ని క్షణాల వ్యవధిలోనే మ్యుటేషన్ (భూ బదలాయింపు), పాస్ పుస్తకాన్ని అక్కడికక్కడే జారీ చేయనుంది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ మొదలు పాస్ పుస్తకం పంపిణీ, ధరణి వెబ్సైట్ రికార్డుల నమోదు వరకు అంతా చిటికెలోనే పూర్తి కానుంది. ఈ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితికి కూడా ఫుల్స్టాప్ పడింది. భూ లావాదేవీలకు వెబ్సైట్ ద్వారా స్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్/సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన సమయానికి పత్రాలిచ్చి సేవలు పొందాలి. భూములను కుదవపెడితే ధరణి వెబ్సైట్లో నమోదు చేయించాలి. పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో భూరికార్డుల నిర్వహణ ఉంటుంది. భూమి హక్కుపత్రం, పట్టాదారు పాస్ పుస్తకం ఏకీకృతం చేయడం ద్వారా కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ సేవలు అందుతాయి. రైతులకు పట్టాదారు పాసుపుస్తకం ప్రతి లేకుండా ఎలక్ట్రానిక్ విధానంలో రుణాలు అందనున్నాయి. ‘ధరణి’మంత్రం... రెవెన్యూ సేవలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్న సర్కారు.. ఇకపై ప్రతి భూ లావాదేవీని ఆన్ లైన్ లోనే నిక్షిప్తం చేయనుంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ధరణి వెబ్సైట్ సేవలు విస్తృతం చేయనుంది. భూముల క్రయవిక్రయాలు, బ్యాంకు రుణాలు, ఈసీల మొదలు ప్రతీది ఈ పోర్టల్‌లోనే తెలుసుకునే వెసులుబాటు కలుగనుంది. ఈ మేరకు పార్ట్–ఏ(వ్యవసాయ), పార్ట్–బీ(వ్యవసాయేతర) భూములకు వేర్వేరు ధరణి పోర్టళ్లను రెండు విధాలుగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రభుత్వ, నిషేధిత, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు జరుగకుండా ఆటోమేటిక్ లాక్ వ్యవస్థను కూడా ఈ వెబ్సైట్లో పొందుపరుచనున్నారు. ప్రతి గ్రామంలోని భూ హక్కుల రికార్డును డిజిటల్ స్టోరేజ్ చేయనున్నారు. అలాగే ధరణి వెబ్సైట్లో నిక్షిప్తం చేసే సమాచారాన్ని వేర్వేరు సర్వర్లలోనూ, వేర్వేరు చోట్ల భద్రపరచనున్నారు. తహసీల్దార్ కమ్ సంయుక్త సబ్ రిజిస్ట్రార్... తహసీల్దార్ ఇక కొత్త అవతారమెత్తనున్నారు. ఇన్నాళ్లూ రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించే ఈ అధికారి ఇకపై జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా సేవలందించనున్నారు. అంటే ఇక నుంచి తహసీల్దార్ కూడా రిజిస్ట్రేషన్లను చేయనున్నారన్నమాట. వ్యవసాయ భూములను మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్లే చక్కబెడతారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 530 మండలాల్లో రిజిస్రేషన్లు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారాలను తాజా చట్టం ద్వారా దాఖలుపరిచారు. డాక్యుమెంట్ల నమూనాలను నేరుగా క్రయవిక్రయదారులే వివరాలు పూరించి ఇచ్చే ఏర్పాటు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్.... రెవెన్యూ కోర్టుల కథ ముగిసింది. వీటిస్థానే ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్ ఏర్పాటు కానుంది. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ వరకు ఉన్న రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన ప్రభుత్వం.. వీటి పరిధిలో పెండింగ్‌లో ఉన్న 16,137 కేసులను ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునల్‌కు బదలాయించనుంది. ప్రతి వేయి కేసులకో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సర్కారు.. ఈ కేసుల పరిష్కారానికి నిర్ణీత కాలవ్యవధిని నిర్దేశించనుంది. తర్వాత ఈ ట్రిబ్యునళ్లను కూడా ఎత్తివేస్తారు. అనంతరం ఎలాంటి భూ వివాదాలకైనా న్యాయస్థానాలనే ఆశ్రయించాలి. ఈ ట్రిబ్యునల్‌కు రిటైర్డ్ జడ్జి లేదా ఇతర సభ్యులతో కూడిన కమిటీ ప్రాతినిథ్యం వహించనుంది. విచారణ తరువాత ట్రిబ్యునల్ ఉత్తర్వులే అంతిమం. వీఆర్ఏలకు పే స్కేల్.... గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం.. గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ)కు తీపి కబురు అందజేసింది. ఇప్పటివరకు గౌరవ వేతనంపై పనిచేస్తున్న వీఆర్ఏలకు ఇకపై అర్హతనుబట్టి పే స్కేల్‌ను వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 22,900 మంది పనిచేస్తుండగా.. పదో తరగతిని విద్యార్హతగా ప్రకటిస్తే సుమారు 8 నుంచి 10వేల మందికి పేస్కేల్ రానుంది. తద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.260 కోట్ల మేర భారం పడనుంది. కాగా, 5,480 మంది వీఆర్వోలతోపాటు వీరిని కూడా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వీఆర్ఏలలో కొందరి సేవలను మాత్రం రెవెన్యూశాఖలోనే వినియోగించుకోనుంది. ‘స్థానికం’గానే కుల ధ్రవీకరణ.... ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల అధికారాలకు కత్తెరపడింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ వీరి నుంచి తప్పించిన ప్రభుత్వం.. గ్రామ పంచాయతీలు, పుర/నగర పాలక సంస్థల్లోనే కులధ్రువీకరణ పత్రాలను అందజేయనుంది. అలాగే సమగ్ర కుటుంబ సర్వే, ఇతర సర్వే ఆధారంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆదాయ వనరులు, ఆస్తుల సమాచారం ఉన్నందున.. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు ఈ డేటాబేస్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ ఇతర రాష్ట్రాలు గనుక అభ్యంతరం తెలిపిన పక్షంలో వీటిని అప్పటికప్పుడు జారీ చేసే అధికారాలను తహసీల్దార్లకు దాఖలుపరిచారు. మరికొన్ని ముఖ్యాంశాలు.. భూమి హక్కుల రికార్డుల్లో అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారిపై క్రిమినల్ చర్యలతోపాటు సర్వీసు నుంచి తొలగింపు(భర్తరఫ్, శిక్ష). కొత్త చట్టం వ్యవసాయ భూమికి మాత్రమే వర్తిస్తుంది. పట్టాదారు పాస్ పుస్తకం హక్కు పత్రంగా పరిగణన. కొత్త పట్టాదారు పుస్తకానికి హక్కుల రికార్డుగా పరిగణిస్తారు. ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదు. పాయిగా, జాగీరు, సంస్థానాలు, మక్తా, ఉహ్మ్లి, ముకాసా సహా అన్ని రకాల భూముల యాజమాన్యం ఈ చట్టం ప్రకారం బదిలీ చేయరాదు. జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి. ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన చేయాలి. ఒకవేళ సయోధ్య కుదరకపోతే నిర్ణీత గడువు తర్వాత ఆ భూమిని లాక్‌లో పెడతారు. ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేస్తే రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. జారీ చేసిన చేసిన తహసీల్దార్‌ను బర్తరఫ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు పెడతారు. అలాగే తిరిగి భూములు స్వాధీనం చేసుకుంటారు. కొత్త బిల్లు ప్రకారం హక్కుల రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారిపై ఎటువంటి దావా వేసే వీలులేదు. ఇప్పటివరకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహసీల్దార్‌కు ఉంది. వ్యవసాయ రుణాల మంజూరు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు. ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 కింద విచారణకు అర్హత ఉంది. -
ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు
-
ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాకాల శాసనసభ మూడో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు కీలకమైన కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రవేశ పెట్టిన బిల్లులకు సంబంధించిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాన్ని హక్కు పత్రంగా పరిగణిస్తామన్నారు. ఇకపై సబ్ రిజిస్ట్రార్ అధికారాలను తహశీల్దార్‌కు అప్పగిస్తామని తెలిపారు. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోని భూముల హక్కుల రికార్డులు డిజిటల్ స్టోరేజ్‌లో ఉంటాయని తెలిపారు. కొత్త పట్టాదారు పుస్తకం హక్కుల రికార్డుగా పరిగణిస్తామని వివరించారు. ఆ రికార్డులో పట్టాదారు పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం అన్ని ఉంటాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములకు ఈ చట్టం వర్తించదని తెలిపారు. జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఏ రకమైన రిజిస్ట్రేషన్ కోసమైనా ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవటం తప్పనిసరి అని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ సమయంలో పాస్ పుస్తకం బదిలీ దస్తాలు రిజిస్ట్రార్ సమక్షంలో ఇవ్వాలని చెప్పారు. మ్యూటేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. అదే విధంగా వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదని హామీ ఇచ్చారు. వారిని స్కేల్ ఉద్యోగులుగా పరిగణిస్తామని తెలిపారు. వీఆర్వోలను ఏదైనా సమానస్థాయి ఉద్యోగానికి బదిలీ చేస్తామని పేర్కొన్నారు. వీఆర్ఎస్ లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించేలా చట్టం తీసుకువస్తామని చెప్పారు. రికార్డులను అక్రమంగా దిద్దడం, మోసపూరిత ఉత్తర్వులు చేయ కూడదన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులపై చర్యలు, సర్వీసు నుంచి తొలగింపు ఉంటుందని తెలిపారు. తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేయిస్తామని తెలిపారు. అన్ని వివరాలతో ధరణి పోర్టల్ ఉంటుందని చెప్పారు. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ విభాగాలుగా ధరణి పోర్టల్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ధరణి పోర్టల్‌ను ఎక్కడి నుంచైనా ఓపెన్ చేసుకోవచ్చు వివరించారు. ఇకపై ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. నిషేధిత భూములు ఇకపై రిజిస్ట్రేషన్లు కావని స్పష్టం చేశారు. కేసుల పరిష్కారానికి 16 ఫాప్ట్ ట్రాక్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తహశీల్దార్లను జాయింట్ సబ్రిజిస్ట్రార్లుగా చేస్తామని తెలిపారు. వ్యవసాయ భూములను జాయింట్ సబ్రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తారని చెప్పారు. వ్యవసాయేతర భూములను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తారని సీఎం కేసీఆర్ వివరించారు. ఇక శాసనసభలో మంత్రి కేటీఆర్ మున్సిపల్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. -
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 7,039 వీఆర్వో పోస్టులు రద్దయ్యాయి. మరోవైపు కాలం చెల్లిన చట్టాలకు స్వస్తిచెప్పి కొత్త రెవెన్యూ చట్టం తేనుందనే ప్రచారం జరిగినా ప్రస్తుతం అమల్లో ఉన్న భూ యాజమాన్య హక్కులు–1971 చట్టం స్థానే.. తెలంగాణ భూ యాజమాన్య హక్కులు–పట్టాదార్ పాస్‌పుస్తకాల బిల్లు–2020’కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు బుధవారం అసెంబ్లీ ముందుకు రానుంది. రెవెన్యూ సిబ్బందికి అధికారాల కత్తెర, హోదాల మార్పు, కొత్త విభాగాల కూర్పుతో ఈ చట్టానికి రూపకల్పన చేసిన సర్కారు.. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ వీఆర్వో పోస్టుల రద్దు బిల్లును కూడా కేబినెట్ ఆమోదించింది. మొదట్నుంచి ఈ వ్యవస్థపై గుర్రుగా ఉన్న ప్రభుత్వం వీఆర్వోలపై వేటు వేసింది. అందులో భాగంగా సోమ వారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీఆర్వోల వద్ద ఉన్న రికార్డులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో వీఆర్వోలపై మెడపై కత్తివేలాడుతున్నట్లు తేటతెల్లమైంది. రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం! అవినీతి రహితంగా, వివాదాలకు తావివ్వకుండా రెవెన్యూ సేవలను సులభతరం చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం.. కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ రికార్డుల్లో మార్పుచేర్పులు చేయాలని భావిస్తోంది. భూమి రిజిస్ట్రేషన్ జరిగిన మరుక్షణమే మ్యుటేషన్, పట్టాదార్ పుస్తకం జారీ అయ్యేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రస్తుత విధానం వల్ల అవినీతి, వివాదాలకు ఆజ్యం పోస్తుందని భావించిన సర్కారు.. నోటీసులు, విచారణలు, రికార్డుల అప్డేషన్, ఆన్లైన్ పేరిట కాలయాపన చేయకుండా అదే రోజు పాస్‌పుస్తకం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖను అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. అధికారాల బదలాయింపు, వికేంద్రీకరణతో ఇరుశాఖలు ఏకీకృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి మండలంలో తహసీల్దార్ కమ్ సబ్ రిజిస్ట్రార్ ఒకరే ఉండనున్నారు. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలపై ఇరు శాఖల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇదిలావుండగా, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లు, వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్ చేస్తారనే మరో ప్రచారం కూడా ఉంది. వీఆర్వో ఎందుకొద్దంటే.. గ్రామస్థాయిలో వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థకు స్వస్తి పలకాలని నిర్ణయించిన సర్కారు.. అధికారాల కూర్పు, పేర్ల మార్పుపై కసరత్తు చేసింది. తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారాల్లో సాధ్యమైనంత వరకు తగ్గించాలని నిర్ణయించింది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పహాణీలో కాస్తు కాలమ్ ఎత్తివేసిందున.. కాస్తు కాలమ్‌ను గ్రామస్థాయిలో నమోదు చేసే వీఆర్వో వ్యవస్థ అవసరంలేదనే అంచనాకు ప్రభుత్వం వచ్చింది. దీంట్లో భాగంగా 1985, 1991ల్లో తీసుకువచ్చిన చట్ట సవరణలకు కొనసాగింపుగా వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేయాలని నిర్ణయించింది. మరోవైపు వీఆర్వోలు, వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకులు)లను పురపాలక, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల్లో విలీనం చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, వీఆర్ఏలలో కొందరిని మాత్రం కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. తహసీల్దార్‌తో లింకు తెగిపోకుండా కొనసాగించడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను కలెక్టర్లు స్వాధీనం చేసుకునే పని వేగవంతంగా సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలంతా రెవెన్యూ రికార్డులను కలెక్టర్లకు అప్పగించే పనిలో బిజీగా ఉన్నారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్ సర్కార్ వీఆర్వో వ్యవస్థ రద్దుకు యోచిస్తుంది. రాష్ట్రంలోని వీఆర్వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నిన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనం ఏ మేరకు పూర్తయిందో నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. (తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!) ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల వద్ద నుంచి రికార్డులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం వరకు 60 శాతం రెవెన్యూ రికార్డులు కలెక్టరేట్‌కు చేరాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, వీఆర్వోలు, వీఆర్ఏలు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయకుండా, స్వచ్ఛందంగా రెవెన్యూ రికార్డులను అప్పగిస్తున్నారని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టడంతో ఒకింత ఆందోళన, మరికొంత ఆనందం నెలకొంది. వీఆర్వోలు, వీఆర్ఏలు బాధపడుతుండగా ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బాధతో వీఆర్ఏ, వీఆర్వోలు స్వాగతిస్తూనే తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. మాతృసంస్థ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వేరే శాఖకు వెళ్లమంటే తమకు ఇబ్బందేనని అభిప్రాయపడుతున్నారు. -
వీఆర్వో వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధమైనట్టేనా!
సాక్షి, హైదరాబాద్: పాలనలో ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్ సర్కార్ వీఆర్వో వ్యవస్థ రద్దుకు యోచిస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్రంలోని వీఆర్వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లుగా పభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనం ఏ మేరకు పూర్తయిందో నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం తగదని హితవు పలుకుతున్నాయి. కాగా, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన చేస్తున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే కొత్తచట్టాన్ని ప్రకటిస్తారని తెలిసింది. దానికి అనుగుణంగానే గ్రామాధికారుల వ్యవస్థ రద్దుకు అంతా సిద్ధం చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, వీఆర్వోలను ఉద్యోగాల నుంచి తొలగించకుండా వేరే శాఖలో సర్దుబాటు చేసే విధంగా సీఎం కేసీఆర్ ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లుగా తెలిసింది. గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ శాఖలో కీలకంగా వారికి ఉద్యోగ భద్రత సైతం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. (చదవండి: ‘పునర్వ్యవస్థీకరణ’పై ప్రకటన ) -
‘ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: త్వరలో రాబోయే కొత్త రెవెన్యూ చట్టంలో తమ పాత్ర ఏమిటో ప్రభుత్వం సృష్టం చేయాలని తెలంగాణ వీఆర్వోల సంఘం ప్రెసిడెంట్ గోల్కొండ సతీష్ కోరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా మీడియాలో వీఆర్వోల విషయంలో అనేక కథనాలు వస్తున్నాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కూడా మాట్లాడారు. అందులో వీఆర్వో ల పాత్ర ఎలా ఉంటుందో తెలియదు. కొత్త చట్టాన్ని తాము స్వాగతిస్తామని, కానీ అందులో తమ పాత్ర ఏమిటో చెప్పాలన్నారు. ‘‘వీఆర్వోలుగా అనేక మంచి పనులు చేసాం.. కానీ మా ఉద్యోగాలు ఉంటాయో లేదో లేదో తెలియదు. రెవెన్యూ విషయంలో మా పరిధిలోకి వచ్చిన సమస్యపై ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తున్నాం. ఇంత చేస్తున్నా చాలి చాలని జీతాలతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. కొత్తగా వచ్చే చట్టం పై ఆందోళన చెందుతున్నాం. మా కష్టాన్ని గుర్తించకుండా మమ్మల్ని ఇతర శాఖలకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని’’ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వో అధికారాలు తీయొద్దని, తమపై అవినీతి ఆరోపణలు వేసి ఇతర శాఖలకు పంపటం సమంజసం కాదన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన 100 రోజుల్లో చేశాం కాబట్టే రైతులు సమర్థంగా రైతుబంధు పొందుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం. కొత్త చట్టం రావడాన్ని స్వాగతిస్తాం కానీ మమ్మల్ని రెవెన్యూ శాఖలోనే ఉంచాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అందరిపై అవినీతి ఆరోపణలు వేసి ఇతర శాఖలకు పంపవద్దన్నారు. గ్రామ స్థాయి నుండి అధ్యయనం చేసి ఈ చట్టం తేవాలని, అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టేముందు తమ సలహాలు తీసుకోవాలని గోల్కొండ సతీష్ విజ్ఞప్తి చేశారు. -
వేలివెన్ను వీఆర్ఓపై సస్పెన్షన్ వేటు
సాక్షి, పశ్చిమ గోదావరి: ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన వీఆర్ఓ సూర్యజ్యోతిని శనివారం అధికారులు సస్పెండ్ చేశారు. మండలంలోని సచివాలయంలో ఆమె వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జూలై 27న వేలివెన్ను గ్రామానికి చెందిన బూరుగుపల్లి సుబ్బలక్ష్మి అనే మహిళా రైతుకు సంబంధించిన 42 సెంట్ల భూమి మ్యుటేషన్ కోసం 42 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. తహిసీల్దార్‌కు వీఆర్ఓపై ఆమె ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీఆర్వో లంచం అడిగినట్టు విచారణలో రుజువు కావడంతో ఆమెను సస్పెండ్ చేయాలంటూ నిన్న(శుక్రవారం) కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ ఆయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ సూర్యజ్యోతిని అధికారులు సస్పెండ్ చేశారు. (కరోనా: ఆఖరు ఘడియల్లో ఆత్మబంధువులు) -
వీఆర్వోపై పెట్రోలుతో దాడి..!
అచ్చంపేట (పెదకూరపాడు): మండలంలోని గ్రంధశిరి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తనపై పెట్రోలుతో దాడి చేశారంటూ ఆ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) కోటా మోహనరావు శుక్రవారం అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. తాను తహసీల్దారు కార్యాలయం పక్కనే ఉన్న గ్రామ సేవకుల గదిలో కూర్చుని రికార్డులు రాసుకుంటుండగా రావెళ్ల లవణ్‌కుమార్, పరుచూరి రామకృష్ణ వచ్చి వారి గ్రామానికి చెందిన అర్జీలు మొత్తం తమకు ఇవ్వమని, తహసీల్దార్‌తో తామే మాట్లాడుకుంటామని అడిగారని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో కులంపేరుతో దూషించి, రికార్డులపైన, తనపైన పెట్రోలు పోసి అగ్గిపుల్ల గీసే ప్రయత్నం చేశారన్నారు. తన వద్ద పనిచేసే నాగేశ్వరరావు వారిని అడ్డుకోవడంతో తాను ప్రమాదం నుంచి బయట పడ్డానని వీఆర్వో మోహనరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాదు, మేమే పోసుకోబోయాం.. మా భూమిని ఆన్లైన్లో ఎక్కించటానికి వీఆర్వో లంచం తీసుకుని కూడా పనిచేయకుండా తిప్పుకుంటున్నాడని, దీంతో తాము మనస్తాపంతో పెట్రోలు పోసుకునేందుకు ప్రయత్నించగా, పక్కనున్న వారు అడ్డుకున్నారని పరుచూరి రామకృష్ణ, రావెళ్ల లవణ్‌కుమార్ శుక్రవారం అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకున్న ఒకటిన్నర ఎకరాల భూమిని ఆన్లైన్లో ఎక్కించి, అడంగల్ కాపీలు పొందేందుకు వీఆర్వో మోహనరావు లంచం తీసుకుని కూడా పని చేయలేదని, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని వారు వాపోయారు. వీఆర్వోపై తాము పెట్రోలు పోయడం అవాస్తవమన్నారు. ఇరు వర్గాల నుంచి స్టేట్మెంట్లు నమోదు చేసుకుని, కేసు విచారిస్తున్నట్లు ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు. -
నిజామాబాద్‌లో 173 మంది వీఆర్ఓల బదిలీ
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో భారీగా వీఆర్ఓలను బదిలీ చేశారు. 173 మంది వీఆర్ఓలను బదిలీ చేస్తూ అదనపు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించారు. మరోవైపు మేడ్చల్ జిల్లా రెవెన్యూశాఖలో కూడా బదిలీలు జరిగాయి. 18 మంది వీఆర్ఓలను బదిలీ చేస్తూ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏసీబీ వలలో పీఆర్ చేప
అనంతపురం క్రైం: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గాలానికి పంచాయతీరాజ్ చేప చిక్కింది. గురువారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో కాపుగాసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ రబ్బానిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఏసీబీ డీఎస్పీ అల్లాబకాష్ తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు మండలం బి.కొత్తకోటకు చెందిన బాబాఫకృద్దీన్, అతని స్నేహితులు ఓబులేసు, నగేష్, ఆంజనేయులు, రంగనాథ్, సయ్యద్లాల్బాషా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లలో ఎలక్ట్రిక్ పరికరాలు ఏర్పాటు చేసేందుకు రూ.32 లక్షలతో కాంట్రాక్ట్‌ను తీసుకున్నారు. రాయదుర్గం, విడపనకల్లు రూరల్, విడపనకల్లు, తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ పరికరాలను ఏర్పాటు చేశారు. అయితే సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ)లో నిధులు లేనందున బిల్లులను పంచాయతీ రాజ్ శాఖ నుంచి చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో బిల్లుల కోసం బాబాఫకృద్దీన్ అతని మిత్రులు ధర్మవరం పంచాయతీరాజ్ డివిజన్ సూపరింటెండెంట్ రబ్బానిను కలిశారు. అయితే బిల్లులు పాస్ చేయాలంటే ఈఈకి 1శాతం, తనతో పాటు సిబ్బందికి 0.25 శాతం పర్సెంటేజ్ ప్రకారం రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాబా ఫకృద్దీన్ అతని స్నేహితులు ప్రస్తుతం తమకు రూ.19,38,884 బిల్లు రావాలని త్వరగా చేయాలని కోరారు. ఇందుకు రూ.25,500 ఇవ్వాలని రబ్బాని డిమాండ్ చేయగా...అందుకు ఒప్పుకున్న ఫకృద్దీన్ అతని మిత్రులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అరెస్టు ఇలా.. పంచాయతీ రాజ్ సూపరింటెండ్ రబ్బాని గురించి తెలుసుకున్న ఏబీసీ తిరుపతి డీఎస్పీ, అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ అల్లాబకాష్ నేతృత్వంలో సీఐలు ప్రభాకర్, సత్యనారాయణ, చక్రవర్తి తదితరులు రంగంలోకి దిగారు. గురువారం మధ్యాహ్నం బాబాఫకృద్దీన్ ద్వారా రబ్బానిని సప్తగిరి సర్కిల్‌కు రప్పించారు. బాబాఫకృద్దీన్ రూ.25,500 లంచం రబ్బానికి ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి రబ్బానిని అదుపులోకి తీసుకున్నారు. పంచాయతీరాజ్ కార్యాలయానికి తీసుకెళ్లి కెమికల్ టెస్టు చేయడంతో లంచం తీసుకున్నట్లు రికార్డెడ్‌గా రుజువైంది. విచారణలో కొందరి పేర్లు ఏసీబీ అధికారులు సూపరింటెండెంట్ రబ్బానిని ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ సందర్భంగా రబ్బాని తనతో పాటు కొందరి అధికారులకు ఇందులో వాటా ఉందని తెలిపినట్లు సమాచారం. పంచాయతీరాజ్ ఈఈ అస్లాంబాషా, సీనియర్ అసిస్టెంట్ నరసయ్య, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ నాగశేఖర్ రెడ్డి పేర్లు చెప్పారు. వారిపై కూడా విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ అల్లాబకాష్ తెలిపారు. కాగా ప్రస్తుతం తమ అదుపులో ఉన్న రబ్బానిని శుక్రవారం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన సూగూరు వీఆర్వో
పెబ్బేరు: మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సూగూరు వీఆర్వో వెంకటరమరణ రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సూగూరుకి చెందిన రైతులు ఆడెం ఆంజనేయులు, ఆడెం భాగ్యమ్మ, ఆడెం మద్దిలేటి, ఆడెం బాల్రాంలకు 2ఎకరాల 19గుంటల భూమి ఉంది. భాగ పరిష్కారాల అనంతరం వేర్వేరుగా వారి పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడు డాక్యుమెంట్ల జిరాక్స్‌లతో తమ పొలాలకు ఆర్వోఆర్, పాసుబుక్కులు ఇవ్వాలని జూలై 14న తహసీల్దార్ కార్యాలయంలో ఆంజనేయులు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీఆర్వో వెంకటరమణ ఈ పని చేసేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు. ఆంజనేయులు రూ.6 వేలు ఇస్తానని ఒప్పుకుని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారు రైతుకు డబ్బులిచ్చి అతని వద్దకు పంపారు. వీఆర్వో వెంకటరమణ రైతు వద్ద నగదు తీసుకుని పంపించాడు. కార్యాలయం బయట ఉన్న ఏసీబీ డీఎస్పీ క్రిష్ణయ్యగౌడ్, ఇన్స్పెక్టర్లు లింగస్వామి, ప్రవీణ్‌లు వెంటనే కార్యాలయంలోకి వెళ్లి వీఆర్వో తీసుకున్న డబ్బులను పరిశీలించారు. నోట్లకు, అతని చేతులు, ప్యాంట్ జేబుకు పింక్ కలర్ ఉండటాన్ని గుర్తించారు. విచారణ చేసి వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు.దాడుల్లో ఏసీబీ సిబ్బంది 10మంది ఉన్నారు. -
ఎల్పీసీ ఇవ్వలేదని వీఆర్వో..
చిలప్‌చెడ్(నర్సాపూర్): ఎల్పీసీ(లాస్ట్ పే సర్టిఫికెట్) ఇవ్వలేదనే మనస్తాపంతో వీఆర్ఓ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిలప్‌చెడ్ మండలం చండూర్ గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చండూర్ గ్రామానికి చెందిన గొట్టం వెంకటేశం(48) వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. గత సంవత్సరం చిలప్‌చెడ్ మండలం నుంచి నర్సాపూర్ బదిలిపై వెళ్లి, ఆ తర్వాత నర్సాపూర్ మండలం బ్రహ్మణపల్లి, తుజాల్పూర్ గ్రామాలకు వీఆర్వోగా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో అతని పనితీరు నచ్చడం లేదని, అధికారులు కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేశారు. అక్కడ 4 నెలలు విధులు నిర్వహించిన అనంతరం నెల క్రితం చేగుంట మండలానికి బదిలీ పై వెళ్లాడు. కాగా ఇన్ని చోట్లకు వెళ్లినా నర్సాపూర్ నుంచి వెళ్లిన అతనికి నర్సాపూర్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు లాస్ట్ పే సరి్టఫికేట్(ఎల్పీసీ) ఇవ్వకపోవడంతో 8 నెలలుగా అతడికి జీతం రాలేదు. జీతం రాకపోవడంతో తరుచూ భార్యతో బాధపడుతూ ఉండేవాడని, వెంకటేశం ఎల్పీసీ కోసం నర్సాపూర్ కార్యాలయం చుట్టూ తిరగగా ఒకసారి వెంకటేశం కుమారుడు రంజిత్ కుమార్‌ను పంపిస్తే ఎల్పీసీ ఇస్తామన్నారని, రంజిత్ వెళ్లినా ఎల్పీసీ ఇవ్వలేదన్నారు. సోమవారం రాఖీ పౌర్ణమి కావడంతో అతని భార్య సువర్ణ రాఖీలు కట్టేందుకు కుమారుడు రంజిత్‌తో కలసి అమ్మగారి గ్రామం కుసంగి వెళ్లి, మంగళవారం 11:30 గంటలకు చండూర్ గ్రామానికి రాగా వెంకటేశం ఉరి వేసుకుని ఉన్నాడన్నారు. సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్ఐ మల్లారెడ్డి తెలిపారు. -
వీఆర్ఓపై ఎస్ఐ దాడి
యాలాల: కోవిడ్ విధుల్లో భాగంగా వెళుతున్న ఓ వీఆర్ఓను ఎస్ఐ లాఠీతో కొట్టాడు. ఈ సంఘటన ఇందిరమ్మ కాలనీ సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కోకట్ గ్రామ వీఆర్ఓ ఆంజనేయులు విధుల్లో భాగంగా ఆర్ఐ వెంకటేశ్ ఆదేశం మేరకు గురువారం సాయంత్రం 6 గంటల కు ఖాంజాపూర్ గేటు వద్దకు బైక్‌పై వెళుతున్నాడు. అయితే ఇందిరమ్మ కాలనీ వద్ద యాలాల పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద కానిస్టేబుళ్లు బైక్‌ను ఆపారు. కంటైన్మెంట్ జోన్‌గా ఉన్న ఇందిరమ్మ కాలనీ పరిధిలో ఎందుకు వచ్చారని కానిస్టేబుళ్లు అడగగా, తాను ఇందిరమ్మ కాలనీ పరిధిలోకి వచ్చే కోకట్ గ్రామ వీఆర్ఓనని ఆంజనేయులు సమాధానమిచ్చారు. అయితే హడావుడిలో ఐడీ కార్డు తీసుకురాలేదని, తన ఐడీ కార్డుకు సంబంధించిన వివరాలు ఫోన్లో ఉన్నాయని కానిస్టేబుళ్లకు వివరించాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన యాలాల ఎస్ఐ– 2 రమేష్ వీఆర్ఓను లాఠీతో కొట్టాడు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన వీఆర్ఓ జరిగిన విషయాన్ని తోటి సిబ్బంది, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఇదే విషయమై ఎస్ఐ విఠల్‌రెడ్డిని వివరణ కోరగా.. ఐడీ కార్డు చూపించే విషయంలో వీఆర్ఓ సరిగ్గా స్పందించలేదని, ఎస్ఐ– 2తో క్షమాపణ చెప్పిస్తామని పేర్కొన్నారు. కాగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి, ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న తమ పట్ల పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని యాలాల రెవెన్యూ సిబ్బంది పేర్కొన్నారు. అకారణంగా తమ తోటి ఉద్యోగిని కొట్టిన పోలీసులకు వ్యతిరేకంగా శుక్రవారం విధులకు దూరంగాఉంటామని యాలాల రెవెన్యూ సిబ్బంది తెలిపారు. -
మాట తప్పని నేత
-
చేయి చాపాడు... ఏసీబీకి చిక్కాడు
తూర్పుగోదావరి, అయినవిల్లి: ప్రభుత్వ సేవలు అందించాల్సిన ఉద్యోగి చేయి చాపాడు.. ఆ సొమ్ము ఇచ్చుకోలేక బాధితుడు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరును ఆశ్రయించాడు... దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. లంచం తీసుకుంటుండగా ఆ అవినీతి ఉద్యోగిని వల పన్ని రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... అయినవిల్లిలంక వీఆర్వో పట్టేం నాగేశ్వరరావు వీరవల్లిపాలెం గ్రామ పంచాయతీకి ఇన్చార్జ్ వీఆర్వోగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన వట్టికూటి సత్యనారాయణ పేరున పది సెంట్ల కొబ్బరి తోట ఉంది. మ్యుటేషన్ చేసి తన కుమారుడు కట్టికూటి కేదారేశ్వరరావు పేరున పట్టాదారు పాస్‌పుస్తకం ఇప్పించాలని 2019 అక్టోబర్ 22న మీసేవ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై విచారణ చేసిన వీఆర్వో నాగేశ్వరరావు పాసు పుస్తకం ఇవ్వడానికి రూ.5 వేలు లంచంగా ఇవ్వాలని అడిగాడు. ఆ సొమ్ము ఇవ్వడానికి ఇష్టపడని వట్టికూటి సత్యనారాయణ కుమారుడు కేదారేశ్వరరావు స్పందనలో టోల్‌ఫ్రీ నంబర్ 14400కు ఈ నెల 10న ఫిర్యాదు చేశాడు. దీంతో కేదారేశ్వరరావుతో ఏసీబీ అధికారులు సంప్రదింపులు జరిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మంగళవారం ఏసీబీ రాజమహేంద్రవరం డీఎస్పీ పి.రామచంద్రరావు, సీఐలు వి.పుల్లారావు, తిలక్, మోహనరావులతో అయినవిల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ట్రాప్ నిర్వహించారు. అక్కడ కేదారేశ్వరరావు నుంచి వీఆర్వో నాగేశ్వరరావు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా డీఎస్పీ రామచంద్రరావు తన సిబ్బందితో కలిసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. సంబంధిత రికార్డులు సీజ్ చేశారు. నాగేశ్వరరావు తీసుకున్న రూ.5 వేలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వివరాలు నమోదు చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ఏసీబీ కోర్టుకు అప్పగిస్తామన్నారు. -
ఉరి వేసుకుని వీఆర్వో ఆత్మహత్య
సాక్షి, నకిరేకల్: పని ఒత్తిడితో నెలరోజులుగా విధులకు వెళ్లకుండా ఇంట్లో ఉంటున్న ఓ వీఆర్వో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. నకిరేకల్ మండలం నోముల గ్రామ వీఆర్వోగా శాలిగౌరా రం మండలం తక్కళ్లపాడుకి చెందిన మొగిలి సోమనర్సయ్య(53) పనిచేస్తున్నాడు. గతంలో ఇతను శాలిగౌరారం, కేతేపల్లి, మునుగోడు మండలాల్లో పని చేశాడు. 5 నెలల క్రితం మునుగోడు నుంచి నకిరేకల్ మండలం నోములకు బదిలీపై వచ్చాడు. ఇదే మండలంలోని పన్నాలగూడెంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల భూ సమస్యలు అధికంగా వస్తుండడంతో పని ఒత్తిడి పెరిగింది. కాగా, అతను విధులకు సరిగా హాజరుకాకపోవడంతో అధికారులు ఇటీవల కలెక్టర్‌కు సరెండర్ చేశారు. దీంతో సోమనర్సయ్య నెల నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. బుధవారం ఉదయం 10 గంటలకు భార్యకు చెప్పి బయటకువెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నకిరేకల్‌లోని ఓ ఫంక్షన్ హాల్ వెనక ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి 100కు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ హరిబాబు తెలిపారు. దీనిపై స్థానిక తహసీల్దార్ జంగయ్య మాట్లాడుతూ సోమనర్సయ్య నెల నుంచి విధులకు రావడం లేదని, దీంతో కలెక్టర్‌కు సరెండర్ చేశామని చెప్పారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
కశింకోట(అనకాపల్లి): పట్టాదారు పాసు పుస్త కం ఇచ్చేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఏసీబీ అధికారులకు చిక్కారు. అవినీతి నిర్మూలనకు సీఎం ప్రవేశపెట్టిన ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరును బాధితుడు ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా వీఆర్వోను పట్టుకుని అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు తెలిపిన వివరాలిలావున్నాయి. కారణం లేకుండా దరఖాస్తు తిరస్కారం.. మండలంలోని తాళ్లపాలెం గ్రామానికి చెందిన గల్లా సత్యనారాయణకు అదే గ్రామ రెవెన్యూలో సర్వే నెంబర్ 133/1లో 49.50 సెంట్ల భూమి ఉంది. దీని వివరాలు ఆన్లైన్లో నమోదు కాలే దు. దీంతో ఆన్లైన్లో నమోదు చేయాలని 2012లో రెండు దఫాలు తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేశాడు. అధికారులు అకారణంగా వాటిని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ గత డిసెంబర్ నెలలో తనకు రైతు భరోసా పథకం సొమ్ము పొందేందుకు తన భూమి వివరాలను ఆన్లైన్ చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. అయితే ఇందుకు రూ.3 వేలు ఇవ్వాలని తాళ్లపాలెం వీఆర్వో పీవీ రాజేష్ డిమాండ్ చేశారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదుతో.. అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఏసీబీ టోల్ ఫ్రీ నంబరు 14400కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. వాస్తవమేనని వెల్లడవడంతో వారు రంగంలోకి పథకం రూపొందించారు. సత్యనారాయణ బంధువైన చప్పగడ్డ ప్రసాద్ ద్వారా వీ ఆర్వో రాజేష్‌కు లంచం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా వీఆర్వో రూ.2 వేలకు అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. నగదు ఇచ్చిన వెంటనే.. నగదు ఇచ్చిన వెంటనే పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడానికి వీఆర్వో అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రసాద్‌తో నాలుగు రూ.500 నోట్లు పంపించారు. వీటిని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వీఆర్వో రాజేష్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు స్వా«దీనం చేసుకొని రాజే‹Ùపై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రంగరాజు తెలిపారు. శనివారం కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వివరించారు. ఈ దాడిలో సీఐలు గఫNర్, రమే‹Ù, లక్ష్మణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ దాడితో రెవెన్యూ సిబ్బంది కలవరం చెందారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ
కృష్ణాజిల్లా, తిరువూరు: ఓ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయడానికి డబ్బులు డిమాండ్ చేసిన గ్రామ రెవెన్యూ అధికారిని అవినీతి నిరోధక శాఖాధికారులు బుధవారం పట్టుకున్నారు. వివరాలు.. తిరువూరు లయోలా స్కూలు సమీపంలో నివసిస్తున్న రాజుపేట వీఆర్వో పోతురాజు జయకృష్ణ, వావిలాల గ్రామ వీఆర్ఓగా ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్నారు. వావిలాల శివారు రాజుగూడెం గ్రామానికి చెందిన కొమ్మినేని చంద్రమౌళి తన భార్య లక్ష్మి, కుమార్తె నాదెండ్ల రమ్యకృష్ణ పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాల జారీ కోసం 4 నెలల క్రితం దరఖాస్తు చేశాడు. అడంగళ్ 1బీలో మార్పు చేర్పులు చేయకుండా వీఆర్‌లో జాప్యం చేస్తున్నారు. ఇటీవల పట్టాదారు పాసు పుస్తకాల జారీకి రూ.16వేలు వీఆర్ఓ డిమాండ్ చేయగా, చంద్రమౌళి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వీఆర్ఓ ఇంటి వద్ద రైతు నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కనకరాజు ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. వీఆర్వో నుంచి నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు మధ్యవర్తుల సమక్షంలో పంచనామా చేసి కేసు నమోదు చేశారు. గురువారం జయకృష్ణను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. -
మహిళా రైతుపై వీఆర్వో దాడి
మంథని: పట్టా చేసేందుకు తీసుకున్న డబ్బు తిరిగి అడిగినందుకు ఓ మహిళా రైతులపై వీఆర్వో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో గురువారం జరిగింది. నాగెపల్లికి చెందిన తన తండ్రి కొయ్యల దుర్గయ్య పేరిట పట్టా చేస్తానంటే మంథని మండలం అడవిసోమన్‌పల్లి వీఆర్వో సహీరాభానుకు రూ.30 వేలు ఇచ్చినట్లు దుర్గయ్య కూతురు సమ్మక్క తెలిపింది. తన తండ్రి చనిపోయాక తల్లి పేరిట పట్టా చేస్తానని చెప్పడంతో ఏడాదిగా తిరుగుతున్నానని తెలిపింది. దీనిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే.. ఆన్లైన్లో దరఖాస్తు చేయమని చెప్పినట్లు వివరించింది. వీఆర్వో ఇంటికి వెళ్లి డబ్బులు అడగ్గానే దాడి చేసిందని చెప్పింది. తాను డబ్బులు తీసుకున్నానన్న ఆరోపణల్లో నిజం లేదని వీఆర్వో తెలిపారు. కాగా, వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
చెవి కొరికి..చెప్పులతో కొట్టుకున్న వీఆర్వోలు
సాక్షి, కర్నూలు రూరల్: గ్రామస్థాయిలో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన వీఆర్వోలు విచక్షణ మరిచారు. తాము ప్రభుత్వ ఉద్యోగులం అన్న మాట మరచి వీధి రౌడీల్లా మారిపోయారు. యుష్టి యుద్ధానికి దిగారు.. చెప్పులతో దాడి చేసుకున్నారు. కోపోద్రిక్తుడైన ఓ వీఆర్వో.. చెవి కొరికి కక్ష తీర్చుకున్నాడు. ఆదివారం ఉదయం కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలు మండలం సుంకేసుల వీఆర్వోగా వేణుగోపాల్ రెడ్డి కొనసాగుతున్నాడు. ఈయనకు వెబ్‌ల్యాండ్‌లో ఆన్లైన్ నమోదు చేసే బాధ్యతను తహసీల్దార్ తిరుపతి సాయి అప్పగించారు. తహసీల్దార్ డిజిటల్ కీని సైతం జూలై నెలలో ఇచ్చారు. అప్పటి నుంచి ఆన్లైన్లో పేర్లు మార్పులు, చేర్పులు చేస్తున్నాడు. ప్రతీ ఆన్లైన్ మార్పు, చేర్పునకు ఆ గ్రామంలో భూమికి ఉన్న ధరను బట్టి ఎకరానికి రేటు నిర్ణయించి తీసుకునేవాడని రైతులు చెబుతున్నారు. జొహరాపురానికి చెందిన మహేశ్వరయ్య పేరు ఆన్లైన్లో మహేశ్వరమ్మ అని పడింది. అలాడే అదే గ్రామానికి చెందిన పాండురంగస్వామి ఇంటి పేరు ఆన్లైన్లో నమోదు కాలేదు. ఈ రెండింటిని మార్చాలని జొహరాపురం వీఆర్వో శ్రీకృష్ణదేవరాయలు ఫైల్ పెట్టాడు. రెండు వారాలైనా పనికాకపోవడంతో ఆదివారం ఉదయం వేణుగోపాల్‌రెడ్డిని శ్రీకృష్ణదేవరాయలు గట్టిగా నిలదీశాడు. మాటామాటా పెరిగి ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ నేపథ్యంలో వేణుగోపాల్ రెడ్డి చెవిని శ్రీకృష్ణదేవరాయలు కొరికాడు. దీంతో చెవి నుంచి విపరీతంగా రక్త్రస్తావమైంది. ఇద్దరూ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో వెంటనే తహసీల్దార్ తిరుపతి సాయి కలుగజేసుకొని తహసీల్దార్ కార్యాలయంలో రాజీ కుదిర్చడానికి ప్రయత్నించాడు. మరోసారి ఇద్దరు వీఆర్వోలు రెచ్చిపోయి సాక్షాత్తూ తహసీల్దార్ ముందే ఒకరినొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. మరో సారి వేణుగోపాల్‌రెడ్డికి చెవిని శ్రీకృష్ణదేవరాయలు కొరికాడు. వీఆర్వో శ్రీకృష్ణదేవరాయలు.. రైతుల నుంచి ఆన్లైన్ ఎక్కించడానికి రూ.లక్షలు తీసుకున్నాడని, తనకు చిల్లిగవ్వ ఇవ్వడంలేదన్న భావన వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి నుంచి వ్యక్తం అయింది. ఇద్దరు వీఆర్వోల సస్పెన్షన్ – ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ కర్నూలు(సెంట్రల్): కర్నూలు తహసీల్దార్ కార్యాలయంలో బాహాబాహీకి దిగిన ఇద్దరు వీఆర్వోలపై జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ వేటు వేశారు. జొహరాపురం వీఆర్వో కృష్ణదేవరాయులు, సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డిలపై క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్లు రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది.. కార్యాలయాల బయట, లోపల ప్రజలకు అనుకువగా ఉండి గౌరవ మర్యాదలను పొందాలని సూచించారు. అవినీతికి దూరంగా ఉండాల్సింది పోయి గొడవలు పడడం దారుణమన్నారు. భవిష్యత్‌లో మరెవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పెట్రోల్‌తో తహసీల్దార్ కార్యాలయానికి రైతు
కల్హేర్(నారాయణఖేడ్): అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన మరువకముందే భూమి పట్టా చేయడం లేదని బాటిల్లో పెట్రోల్ పోసుకుని వచ్చి మరో రైతు రెవెన్యూ ఉద్యోగులకు షాక్ ఇచ్చాడు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని మహదేవుపల్లికి చెందిన రైతు జి.లింగయ్య, వీఆర్ఓగా పనిచేసిన లాలయ్య తన పట్టా పాసుపుస్తకం నుంచి రెండు ఎకరాల భూమిని తీసేసి ఇతరుల పేరిట మార్చారని ఆరోపించాడు. గ్రామ శివారులోని 49 సర్వే నంబర్లో తన తల్లి శివమ్మ పేరిట ఉండాల్సిన భూమికి హక్కులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీఆర్ఓ లాలయ్య తమకు అన్యాయం చేశారని సోదరులతో కలసి వచ్చి కార్యాలయం వద్ద కలకలం సృష్టించాడు. బాటిల్లో వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న వారు లింగయ్య చేతిలోంచి పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. అనంతరం లింగయ్య ఠాణాకు వెళ్లి వీఆర్ఓపై ఫిర్యాదు చేశాడు. దీనిపై వీఆర్ఓ లాలయ్యను ప్రశ్నించగా, సదరు 2 ఎకరాల భూమిని ఎవరిపేరుపై నమోదు చేయకుండా పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. -
వీఆర్వో గల్లా పట్టిన మహిళ
కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఓ మహిళ హల్చల్ చేసింది. తన భర్త పేరిట ఉన్న భూమిని అతని సోదరులపై అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ వీఆర్వో కాలర్ పట్టుకుంది. మండలంలోని నమిలికొండలో కనకమ్మ భర్త లింగాల లచ్చయ్య, అతని సోదరులిద్దరికి 8 గుంటల చొప్పున భూమి ఉంది. కనకమ్మ భర్త చనిపోవడంతో కొన్నాళ్లుగా తల్లి ఊరైన మంగపేటలో ఉంటోంది. కనకమ్మ స్థానికంగా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఆమె బావ, మరిది కుమారులు కనకమ్మకు సంబంధించిన 8 గుంటల భూమిని వారి పేరిట మార్చుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేదు. ఇదే విషయమై వీర్వోను ప్రశ్నిస్తూ కాలర్ పట్టుకుంది. వీఆర్వో రమేశ్ మాట్లాడుతూ కనకమ్మ తనను గతంలో ఒకసారి కలిసిందన్నారు. మళ్లీ సోమవారం రాగా.. ఫోన్లో ఆమె మరిది నుంచి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుండగా దాడి చేసిందని పేర్కొన్నారు. -
విచక్షణారహితంగా దాడి చేసిన టీడీపీ కార్యకర్త
-
వీఆర్వోపై టీడీపీ కార్యకర్త దాడి, బండబూతులు..
సాక్షి, ప్రకాశం : రోజు రోజుకు పచ్చ నేతల ఆగడాలు అధికమవుతున్నాయి. టీడీపీ నేతలు ఓటమి అక్కసుతో రగిలిపోతున్నారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. కడుపు మంటతో భౌతిక దాడులకు దిగుతున్నారు. నిన్నటి వరకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేసేవారు. తాజాగా వారు మరో అడుగు ముందుకేసి.. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మల్లపాలెం గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త ఏకంగా వీఆర్వోపైనే దాడికి తెగబడ్డాడు. తాము చెప్పిన పనులు చేయాల్సిందే అంటూ బండ బూతులు తిట్టాడు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. అంతటితో ఆగకుండా ఓటరు గుర్తింపు కార్డులకి ఆధార్ అనుసంధానం చేసే పనిలో ఉన్న వీఆర్వో వెంకటేశ్వర్లుపై గ్రామస్తుల సమక్షంలోనే టీడీపీ నాయకుడు బాలూ నాయక్ విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మెదక్‌లో బడికి బరోసా..
సాక్షి, మెదక్: ‘మన పల్లె బడి.. మన ధర్మ నిధి’ లక్ష్యం నెరవేరేలా కలెక్టర్ పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ట్రస్ట్‌కు విరాళాల సేకరణ.. పాఠశాలల్లో సమస్యల గుర్తింపు, పరిష్కారానికి సంబంధించి గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీతోపాటు జిల్లా స్థాయి నిర్వహణ ఏజెన్సీకి రూపకల్పన చేశారు. జిల్లా కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్ చైర్మన్లుగా జేసీ, ఎస్పీ వ్యవహరించనున్నారు. మండల కమిటీలకు ఎంఈఓ చైర్మన్‌గా, ముగ్గురు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ముగ్గురు ఉపాధ్యాయులు, విద్యావేత్తలు లేదా ధర్మదాతల సభ్యులుగా.. గ్రామ కమిటీల్లో ప్రధానోపాధ్యాయుడు, వీఆర్వో, వీఆర్ఏ, ఉపాధ్యాయుడు కమిటీల్లో సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీల బాధ్యతలు ఏమిటి.. ఏం చేయాలి.. ఎవరు ఎన్నారైల వివరాలు సేకరించాలి.. ఎవరు మాట్లాడాలి.. వంటి అంశాలపై కూడా సంస్థ విధివిధానాల్లో పొందుపరిచారు. జిల్లా స్థాయి నిర్వహణ ఏజెన్సీ జిల్లా కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్ ఆదేశా మేరకు నడవాల్సి ఉంటుంది. పక్కాగా బైలా.. రిజిస్ట్రేషన్ ట్రస్ట్‌కు సంబంధించి అవకతవకలకు చోటు లేకుండా పక్కాగా బైలా రూపొందించారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ ధర్మారెడ్డి, డీఈఓ రవికాంతరావు, నోడల్ ఆఫీసర్ సూర్యప్రకాష్, మరో ఇద్దరు ఉపాధ్యాయులు సాయికుమార్, రమేష్ చౌదరి కలిసి దాదాపు 15 రోజులు శ్రమించి ట్రస్టుకు సంబంధించి విధివిధానాలు రూపొందించారు. ఎవరైతే కలెక్టర్‌గా ఉంటారో వారే ఈ ట్రస్టుకు బాధ్యత వహిస్తారు. సంస్థ చిరునామాగా సమీకృత కలెక్టరేట్ సముదాయం, కలెక్టరేట్ కార్యాలయం, మెదక్ – 502110గా పేర్కొన్నారు. విరాళాలు అందించే వారితోపాటు విరాళాల మొత్తం, ఖర్చు వివరాలను వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. సమస్యల గుర్తింపు.. దశల వారీగా పరిష్కారం గ్రామ, మండల కమిటీలు ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు గుర్తించి జిల్లా కమిటీకి పంపాలి. ప్రాధాన్యతా క్రమంలో ఆ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కమిటీ చర్యలు తీసుకుంటుంది. మొత్తం ఐదు దశల్లో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా అధికారులు ప్లాన్ రూపొందించారు. మొదటి దశలో పాఠశాలల్లో చిన్న చిన్న మరమ్మతులతోపాటు భవనాలకు పాఠ్యాంశ చిత్రపటాలతో ఆకర్షణీయమైన రంగులు వేయనున్నారు. రెండో దశలో అన్ని పాఠశాలల్లో తాగు నీటి ఫిల్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. మూడో దశలో మండల స్థాయి నివేదికలకు పరిష్కారం చూపనున్నారు. నాలుగో దశలో గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబ్ నరికరాలు ఏర్పాటు చేయనున్నారు. ఐదో దశలో డిజిటల్ బోధన పరికరాలు, ఈ–లెర్నింగ్, ఆట వస్తువులు సమకూర్చడంతోపాటు బాలికల ఆత్మ రక్షణకు కరాటే శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు రూ.కోటి.. గత నెల 25న మెదక్ కలెక్టరేట్లో జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్యా శాఖలో నెలకొన్న సమస్యలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ ధర్మారెడ్డి ‘మన పల్లె బడి.. మన ధర్మ నిధి’ లక్ష్యం వివరాలు వెల్లడించారు. తనవంతు వాటాగా రూ.25 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి హరీశ్‌రావు తన వేతనంలో నుంచి రూ.లక్ష ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఇతర ప్రజాప్రతినిధులు పోటీపడ్డారు. జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సుమారు 4 వేల వరకు ఉండగా.. వారు ఒక రోజు వేతనాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దాదాపు రూ.65 లక్షలు ట్రస్ట్ ఖాతాలో త్వరలో జమకానున్నాయి. మొత్తానికి ఇప్పటివరకు సుమారు రూ.కోటి సేకరించినట్లు సమాచారం. -
రెండు నెలలు కాలేదు.. అప్పుడే..
సాక్షి, హైదరాబాద్/తుర్కయంజాల్: ఓ రైతుకు సంబంధించిన భూమిని మ్యుటేషన్ చేసేందుకు వీఆర్వో రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) చేతికి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కమ్మగూడలో గురువారం ఈ ఘటన జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుర్రంగూడకు చెందిన రైతు ముత్యంరెడ్డి తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలో కొంతకాలం క్రితం ఎకరం 29 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమికి సంబంధించిన మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మ్యుటేషన్ చేయాలని రైతు ముత్యంరెడ్డి వీఆర్వోను ఆశ్రయించగా, రూ.1 లక్ష లంచం ఇవ్వాలని వీఆర్వో శంకర్ డిమాండ్ చేశాడు. అంతడబ్బు ఇవ్వలేనని, రూ.70 వేలు ఇస్తానని రైతు వీఆర్వోకు చెప్పాడు. అనంతరం ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం తెలిపాడు. ఈ మేరకు వీఆర్వోను పట్టుకోవాలని ఏసీబీ అధికారులు పథకం పన్నారు. గురువారం రూ.50 వేలను రైతు ముత్యంరెడ్డి తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలోని వీఆర్వో కార్యాలయంలో శంకర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. అధికారులు ఎవరైనా పనులు చేసేందుకు లంచం డిమాండ్ చేస్తే తమను ఆశ్రయించాలని 94404 46140 నంబర్లో ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సూచించారు. కాగా, వీఆర్వో శంకర్ రెండు నెలల క్రితమే తొలిసారిగా బాధ్యతలు తీసుకున్నారు. అంతలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడటం గమనార్హం. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
సాక్షి, సీతానగరం(విజయనగరం) : భూములు ఆన్లైన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఉద్యోగిని ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. లంచం ఇచ్చిన డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వోను విచారణ జరపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... సీతానగరం మండలం బూర్జ రెవెన్యూ పరిధిలోని చెల్లన్నాయుడువలస గ్రామానికి చెందిన రైతు భాస్కరరావు తన భూములను ఆన్లైన్ చేయాలని వీఆర్వో రాయిపిల్లి బలరాంకు విన్నవించాడు. భూముల పత్రాలను సైతం అందజేశాడు. ఏడాదిగా తిరుగుతున్నా ఇప్పటికీ పని పూర్తిచేయలేదు. ఇప్పటికే కొంత మొత్తాన్ని లంచంగా ముట్టచెప్పాడు. మళ్లీ లంచం డిమాండ్ చేయడంతో విసిగిపోయిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లంచం ఇస్తానని వీఆర్వోకు భాస్కరరావు నమ్మబలికాడు. వీఆర్వో సూచనల మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వస్తానని చెప్పాడు. లంచం డబ్బుల కోసం ఉదయం 11.30 గంటలకే తహసీల్దార్ కార్యాలయానికి వీఆర్వో చేరుకున్నాడు. రైతు కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పటికే వలపన్నిన ఏసీబీ అధికారులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో లంచం ఇవ్వాల్సిన రూ.9 వేలును దాసరి భాస్కరరావుకు అందజేశారు. వాటిని తీసుకెళ్లి రైతు ఇస్తుండా వీఆర్వోను ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
చేయి తడపాల్సిందేనా..?
నందిగాం మండలం పాలవలస సమీపంలో ఓ రైతుకు చెందిన 73 సెంట్లను సబ్ డివిజన్ చేసేందుకని టెక్కలి ఆర్డీవో కార్యాలయం డీఐఎస్( డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే) ఏకాశి రూ. 5లక్షలకు బేరం పెట్టుకుని రూ. 50వేలు తీసుకుంటూ ఆగస్టు 31వ తేదీన ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తాజాగా కొత్తూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈ–పాసు పుస్తకం మంజూరు కోసం మెట్టుగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ సాయమ్మ నుంచి రూ. 10వేలు లంచం తీసుకుండగా వీఆర్ఓ సుందరరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సాక్షి, శ్రీకాకుళం: వీరు దొరికినోళ్లు.. మరి దొరకనివాళ్లు.. చాలా మంది ఉన్నారనేది ప్రజల మాట. రెవెన్యూ అంటేనే అవినీతికి చిరునామా అని జనం అంటున్నారు. ఈ శాఖలో గతంలో అవినీతి యథేచ్ఛగా సాగింది. సిబ్బం ది దగ్గరి నుంచి అప్పటి మంత్రుల వరకూ అవి నీతిలో భాగస్వాములు కావడంతో పట్టించుకున్న దాఖ లాల్లేవు. అవినీతి విశృంఖలం అయిపోయింది. ఇప్పుడా పరిస్థితి మారింది. పాలకులు అవినీతికి దూరంగా ఉంటున్నారు. నిజాయితీతో కూడిన పాలన కోసం పరితపిస్తున్నారు. అవినీతి వ్యవహారాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ‘రెవెన్యూలో పరిస్థితి మారాలి. అవినీతికి ఆస్కారం ఉండకూడదు. మీకేమైనా సమస్యలు, ఇబ్బందులుంటే నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను. అంతే తప్ప అవినీతికి పాల్పడకూడదు. చెప్పినా కూడా చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. చర్యలు గతం కన్నా కఠినంగా ఉంటాయి. ఒక్కసారి ఉద్యోగానికి ఇబ్బంది వచ్చిందంటే కష్టం. నా హయాంలో పైరవీలకు అవకాశం ఉండదు.’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరుచూ అధికారులకు చెబుతూ వస్తున్నారు. అవినీతి రహిత పాలన అందించాలని, లంచాల్లేని పాల న కొనసాగాలని ఆయన పదేపదే హెచ్చరించడమే కాకుండా హితబోధ చేస్తున్నారు. అయినా కొందరి తలకెక్కడం లేదు. తమ పాత బాణీ కొనసాగిస్తున్నారు. అలవాటు పడిన చేతులతో లంచాలు తీసుకుంటున్నారు. చివరికి అడ్డంగా బుక్ అవుతున్నారు. స్పందన దగ్గరి నుంచి సీఎంఓ కార్యాలయం వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఏ ఒక్క ఫిర్యాదునూ విడిచిపెట్టడం లేదు. సీరియస్‌గా తీసుకుని చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్రమాలకు పాల్పడితే వారిని దేవుడే రక్షించాలి. రెవెన్యూలో మామూలేనా? రెవెన్యూలో అవినీతి సాధారణమైపోయిందని అందులో పనిచేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్న వారే నిరూపించుకుంటున్నారు. ఈ పట్టాదారు పాసు పుస్తకాల కోసం భూమి విలువ మేరకు రూ. 5వేల నుంచి రూ. 50వేల వరకు వసూలు చేస్తున్నారన్న వాదనలు కొనసాగుతూనే ఉన్నా యి. కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం సర్టిఫికెట్ (లీగల్ హెయిర్), కొరిలేషన్ సర్టిఫికేట్, మ్యూటేషన్, కరెక్షన్లకు పలుచోట్ల డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ రకమైన ఫిర్యాదులు ప్రతివారం కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమానికి కూడా వస్తున్నాయి. ఉన్నతాధికారులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంత గట్టిగా హెచ్చరిస్తున్నా ఇంకా మారలేదన్న ఆవేదనైతే ఉన్నతాధికారుల్లో కూడా ఉంది. వాస్తవానికైతే ధ్రువీకరణ పత్రాలు అవసరమైన వారు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటారు. వీఆర్ఓ ప్రాథమిక దర్యాప్తు చేస్తారు. దీని ఆధారంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధ్రువీకరిస్తారు. వీరిద్దరి స్టేట్మెంట్ సంతృప్తికరంగా ఉంటే తహసీల్దార్ డిజిటల్ కీ ద్వారా ఆమోదం తెలుపుతారు. ఈ ప్రక్రియ కోసం కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తాం కొత్తూరులో లంచం తీసుకుంటూ దొరికిన వీఆర్ఓ సుందరరావుపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్పం దనలో భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సమస్యల పరిష్కారంలో జాప్యమెందుకవుతోందో నిఘా పెట్టి పరిశీలన చేస్తున్నాం. స్పందనలో వచ్చే అర్జీలను క్షుణ్ణంగా విచారణ చేస్తున్నాం. అవసరమైతే అధికారులే నేరుగా అర్జీదారుని ప్రాంతానికి వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – బలివాడ దయానిధి, జిల్లా రెవెన్యూ అధికారి, శ్రీకాకుళం ఏసీబీ వలలో అవినీతి వీఆర్ఓ ఏసీబీ అధికారులకు చిక్కిన వీఆర్వో మదన్మోహన్ సుందరరావు కొత్తూరు: మరో అవినీతి చేప ఏసీబీ అధికారుల వలలో పడింది. రెవెన్యూ శాఖలోనే మరో ఉద్యోగి లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయారు. కొత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయం పరిధి నేరడిరెవెన్యూ గ్రూపునకు ఇన్చార్జి వీఆర్వోగా పనిచేస్తున్న కె.మదన్ మోహన్ సుందరరావు (ఉరఫ్ సుందరరావు) మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో పడ్డారు. అదే మండలం లోని మెట్టూరుగూడకు చెందిన సవర సాయమ్మ అనే గిరిజన మహిళ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెట్టూరుగూడకు చెందిన సాయమ్మకు 1.80 సెంట్ల భూమి ఉంది. దీనికి ఈ పాస్ పుస్తకం, మ్యుటేషన్ చేయించాలని ఆరు నెలలుగా అధికారులను ఆమె కోరుతున్నారు. మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఫలి తం కనిపించలేదు. దీనిపై వీఆర్వో సుందరరావును సంప్రదించగా రూ.20వేలు లంచం ఇస్తే పని జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్నే సాయమ్మ సరుబుజ్జిలి మండలం వెన్నిలవలసకు చెందిన తన అల్లుడు సవర మిన్నారావుకు చెప్పారు. దీంతో ఆ యన అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని సూచించి, అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇంతలో వీఆర్వో సాయమ్మను రూ.10వేలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని అడిగారు. ఇదే విషయాన్ని సాయమ్మ ఏసీబీ అధికారులకు చెప్పా రు. దీంతో ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి పక్కాగా స్కెచ్ వేశారు. రూ.10వేలను సాయమ్మకు ఇచ్చి అంతకుముందుగానే తన సిబ్బందితో కొత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో మాటు వేశారు. సరిగ్గా వీఆర్వో డబ్బు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, ఆయనను విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు బాస్కరరావు, హరిలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
వీఆర్ఓ మాయాజాలం..!
గతంలో తండ్రి.. ప్రస్తుతం కుమారుడు.. ఇద్దరూ వీఆర్‌ఓలే కావడం... వారికి తెలిసినంతగా అమాయకులైన రైతులకు మాయాజాలం తెలియకపోవడంతో వీఆర్‌ఓలైన తండ్రి, కుమారుడు చేతిలో రైతులైన తండ్రి, కుమారుడు ఇద్దరూ మోసపోయారు. ఎప్పుడో 1980, 1981లో పోయిందనుకున్న భూమికి మరో వీఆర్ఓ వచ్చి బకాయి ఉన్న శిస్తు చెల్లించాలని కోరడంతో ఇంకా తమ పేరిట రికార్డులలో ఉందని గుర్తించిన రైతు వివరాలన్నీ సేకరించి తమ భూమిని తమకు ఇప్పించాలని స్పందనలో కోరడంతో వీఆర్ఓ కుటుంబం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, బొబ్బిలి రూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస పంచాయతీ పరిధిలో వెంకటరాయుడిపేట రెవెన్యూ గ్రామంలో కొట్నాన అప్పలస్వామికి 6–1–1977లో సర్వే నంబరు 44లో 7లో 221ఖాతా నంబరులో 4.55ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం అందించింది. అప్పట్లో 37.56 ఎకరాల పోరంబోకు భూమిని వెంటకరాయుడిపేట రెవెన్యూ గ్రామంలో జగ్గునాయుడు చెరువు వద్ద ఈ ప్రాంత రైతులకు నాటి ప్రభుత్వం అందించింది. అప్పట్లో వీఆర్ఓగా పని చేసిన గ్రామానికి చెందిన అప్పలస్వామి సాగు చేసుకుంటున్న భూమికి ఇది నీది కాదని చెప్పడం, అప్పట్లో ఏమీ తెలియని రైతులు తమకు ఇంకా ప్రభుత్వం అందించలేదోమోనని అమాయకంగా వదిలేశారు. ఇదే అదునుగా నాటి వీఆర్ఓ తమ బంధువులకు ఆ భూమిని అప్పగించి వారితో సాగు చేయించారు. కాలక్రమేణా అప్పలస్వామి మరణించడం, వీఆర్ఓ మారిపోవడం, వీఆర్ఓ కుమారుడు వీఆర్ఓ కావడం, అప్పలస్వామి కుమారుడు లక్ష్మణరావు వ్యవసాయం చేçస్తుండడం జరిగాయి. ఇటీవల గ్రామానికి వచ్చిన కొత్త వీఆర్ఓ పొలానికి శిస్తు బకాయి కట్టాలని కొట్నాన లక్ష్మణరావును కోరడంతో అనుమానం వచ్చి వీఆర్ఓ, సర్వేయరు ద్వారా వివరాలు సేకరించగా భూరికార్డులన్నీ తమ తండ్రి అప్పలస్వామి పేరిట 2008 వరకు ఉండడం, తరువాత ఆ భూములు వేరొకరి పేరిట మారడం గుర్తించిన లక్ష్మణరావు ఇటీవల స్పందనలో కలెక్టర్, పార్వతీపురం సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిన అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఇటీవల వీఆర్ఓ, ఆర్ఐ ఎవరి సంతకాలు లేకుండా నేరుగా అప్పటి తహసీల్దార్ ఆమోదంతో పోరంబోకు భూములు జిరాయితీలుగా వేరొకరి పేరిట బదిలీ కావడం, ఆన్లైన్లో కూడా మారిపోయాయి. తమ తండ్రి అప్పలస్వామి ఎప్పుడో చనిపోయాడని, తన తండ్రి కానీ, తాము కానీ భూములు ఎవరికీ అమ్మలేదని, తనఖా పెట్టలేదని కొట్నాన లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ కారకుడు గ్రామానికి చెందిన వీఆర్ఓగా గుర్తించారు. ఆ వీఆర్ఓ బంధువుల పేరిట భూములు ఉండడం గమనించిన అధికారులు వీఆర్ఓపై చర్యలకు నివేదికలు పంపారు. కాగా సదరు వీఆర్ఓను వివరణ కోరగా తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పేరిటగాని, తన భార్య పేరిటగాని ఎలాంటి భూములు లేవని, ఎవరు ఏం చేసుకుంటారో.. ఏం రాసుకుంటారో రాసుకోండని సమాధానం చెప్పాడు. కాగా ఈ వీఆర్ఓ ఆస్తుల కోసం తండ్రినే చూడడం లేదని, గతంలో వీఆర్ఓగా పని చేసిన తండ్రే ఈ వీఆర్ఓపై స్పందనలో ఫిర్యాదు చేయడం, డీఆర్ఓ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లోనే ఈ వీఆర్ఓను నిలదీయడం విశేషం. న్యాయం చేయాలి... నా తండ్రి అప్పలస్వామి పేరిట మాకు 1977లో 4.55ఎకరాల భూమి అప్పట్లో ప్రభుత్వం అందించింది. మాయ మాటలు చెప్పి మాకు పొలం రాలేదని మా నాన్నకు చెప్పి స్థానిక వీఆర్ఓ కుటుంబం మోసం చేసింది. మా నాన్న చనిపోవడంతో మేం పట్టించుకోలేదు. ఇటీవల గ్రామానికి మరో వీఆర్ఓ వచ్చి భూమి శిస్తు బకాయి అడగడంతో నాకు సందేహం వచ్చి వివరాలు ఆరా తీశాను. స్పందనలో ఫిర్యాదు చేశాను. సర్వేయరు వచ్చి పరిశీలించారు. తహసీల్దార్ న్యాయం చేస్తామన్నారు. మాకు న్యాయం చేయాలి. – కొట్నాన లక్ష్మణరావు, బాధిత రైతు, దిబ్బగుడ్డివలస చర్యలకు సిఫార్సు... అన్యాయం జరిగింది వాస్తవమే. స్థానికంగా ఉన్న వీఆర్ఓ పాత్ర ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అసలు పోరంబోకు భూమి ఎలా ఇంకొకరి పేరిట ఆన్‌లైన్‌లోకి వచ్చిందో అర్ధం కాలేదు. దీనిపై స్పందనలో ఫిర్యాదు రావడంతో సర్వే చేపట్టి వాస్తవాలు కనుగొన్నాం. 1977నాటి భూమి కదా. కొద్ది సమయం పడుతుంది. ఈ గందరగోళానికి బాధ్యుడైన వీఆర్ఓపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేసాం. దీనిపై కలెక్టర్‌కు ఫ్యాక్స్ చేస్తా... – పి.గణపతిరావు, తహసీల్దార్, బొబ్బిలి -
వీఆర్వో కాలర్ పట్టుకున్న మహిళ, మెట్లపై నుంచి..
సాక్షి, సంగారెడ్డి: భూ పట్టా మార్పిడి విషయంలో ఓ మహిళ వీఆర్వో చొక్కా కాలర్ పట్టుకోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో సదరు మహిళ తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయిన ఘటన సంగారెడి జిల్లాలోని వట్పల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని మేడికుందా గ్రామానికి చెందిన ఖాదిరాబాద్ బీర్‌గొండ అనే రైతుకు సంబంధించిన రెండెకరాల 34 గుంటల భూమిని వారి ముగ్గురు కుమారులు తమ పేర్ల మీద పట్టా చేయించుకున్నారు. దీంతో బీర్‌గొండ మూడో భార్య అయిన పోచమ్మ తన భర్తకు సంబంధించిన భూమిని తనకు తెలియకుండా కుమారుల పేరుపై పట్టా ఎలా చేస్తారంటూ వీఆర్వో రామలింగాన్ని ప్రశ్నించింది. తన పేర కొంత భూమిని పట్టా చేయాలని కొన్ని రోజులుగా ఆయనను కోరుతోంది. ఈ క్రమంలో పోచమ్మ గురువారం తహసీల్దారు కార్యాలయం వద్దకు చేరుకొని నువ్వు అడిగినన్ని డబ్బులు ముట్టజెప్పి కాళ్లరిగేలా తిరిగుతున్నా నన్ను పట్టించుకోవా అంటూ వీఆర్వోను నిలదీసింది. వీఆర్వో చొక్కా కాలర్ పట్టుకొని కార్యాలయం వరకు లాక్కొని వచ్చింది. ఈ ఘర్షణలో కార్యాలయం మెట్లపై నుంచి మహిళ కింద పడటంతో తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయింది. -
వీఆర్ఓ మల్లారెడ్డిపై సస్పెన్షన్ వేటు
సాక్షి, డోన్/కర్నూలు: ప్యాపిలి మండలం జలదుర్గం వీఆర్ఓగా పని చేసి బదిలీపై వెళ్లిన మల్లారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వీఆర్ఓ మల్లారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అవుకు మండలం మెట్టుపల్లి వీఆర్ఓగా పనిచేస్తున్న మల్లారెడ్డి స్వగ్రామం ప్యాపిలి మండలం గార్లదిన్నె. గత ప్రభుత్వ హయాంలో అతడు ప్రభుత్వ ఉద్యోగినన్న సంగతి మరచిపోయి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో ఏకంగా టీడీపీ డోన్ నియోజకవర్గ అభ్యర్థి కేఈ ప్రతాప్‌తో కలసి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నాడు. దీంతో అతడిపై అప్పట్లో ‘సాక్షి’లో కథనాలు కూడా వెలువడ్డాయి. వైఎస్సార్ సీపీ నాయకులు సైతం వీఆర్ఓ తీరుపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు వీఆర్ఓ మల్లారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
గుండెపోటుతో వీఆర్వో మృతి
సాక్షి, పశ్చిమగోదావరి : గణపవరం మండలం పిప్పర వీఆర్వో డీకే శ్రీనివాసరావు (45) గురువారం ఉదయం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఉదయం తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను ఏలూరు ఆస్పత్రికి తరలిస్తుండగా కారులోనే గుండెపోటుకు గురై మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు పిప్పర వీఆర్వోగా పనిచేస్తూ సమీపంలోని అత్తిలిలో మకాం ఉంటున్నారు. ఆయన మృతదేహం వద్ద తహసీల్దార్ బొడ్డు శ్రీనివాసరావు, ఆర్ఐ పోతురాజు, వీఆర్వోలు, మండల రెవె న్యూ సిబ్బంది నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
వీఆర్వో వ్యవస్థ రద్దు?
సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థ రద్దు కానుందా? వీరిని పంచాయతీరాజ్ లేదా వ్యవసాయశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందా? ఈ రకమైన సంకేతాలే కనబడుతున్నాయి. అత్యున్నత అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడొచ్చని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో పనిచేస్తోన్న కిందిస్థాయి ఉద్యో గుల్లో అవినీతి పెరిగిపోయిందని, వీరిని సంస్క రించకపోతే రెవెన్యూ వ్యవస్థకే ప్రమాదమని సీఎం కేసీఆర్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే అంశాన్ని కేసీఆర్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సీఎం, సీఎస్, భూ పరి పాలన ప్రధాన కమిషనర్‌కు లేని అధికారాలు వీఆర్ఓల కున్నాయని శాసనసభ సాక్షిగా సీఎం వ్యాఖ్యానించడం ఉద్యోగవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ రైతుతో ఫోన్లో మాట్లాడిన సీఎం.. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం రెవెన్యూ పని పడదామని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కొత్త రెవెన్యూ చట్టంపై కసరత్తు చేస్తున్న సర్కారు.. భూ వివా దాలకు తావివ్వకుండా టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావా లని యోచిస్తోంది. ఓవైపు కొత్త చట్టంలో పొందు పరచాల్సిన అంశాలపై మల్లగుల్లాలు పడుతూనే.. పాలనాపరమైన సంస్కరణలు చేపట్టే దిశగా నిపుణుల కమిటీతో చర్చిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ స్థాయిలో ఉన్న వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి.. ఉద్యోగులను పంచాయతీరాజ్ లేదా వ్యవసాయశాఖలో విలీనం చేస్తే సరిపోతుందనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. కొందరితో అందరికీ నష్టం: వాస్తవానికి గ్రామస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా వీఆర్వోలు వ్యవహరిస్తారు. ఏ శాఖ పనిలోనైనా వీఆర్వోలే కీలక భూమిక పోషిస్తారు. అదే సమయంలో రెవెన్యూ రికార్డుల సంరక్షకుడిగా పనిచేస్తారు. అయితే, భూముల విలువలు పెరగడం.. దానికి తగ్గట్లుగానే వివాదాలు కూడా పెరగడం వీఆర్ఓలకు కల్పతరువుగా మారింది. రికార్డుల తారుమారు.. ఒకరికి బదులు మరొకరి పేరు, విస్తీర్ణం నమోదులోనూ అడ్డగోలుగా వ్యవహరించ డంతో దుమారం చెలరేగింది. వీఆర్వోల వ్యవస్థ అవినీతి కేంద్ర బిందువుగా మారిందనే విమర్శలు ఎక్కువయ్యాయి. దీనికితోడు వీఆర్వోలుగా పదోన్నతులు పొందిన మరికొందరు.. చట్టంపై అవగాహన లేక తప్పుల తడకగా రికార్డులు నమోదు చేయడం కూడా భూ వివాదాలకు దారితీసింది. ఈ పరిణామాలతో రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో ఒకరకమైన దురభిప్రాయం ఏర్పడిందని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికితోడు భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం జరిగిన పరిణామాలు శాఖ పనితీరుపై ప్రభావం చూపాయి. సాంకేతిక సమస్యలు, మార్పు చేర్పులకు ఆప్షన్ ఇవ్వకపోవడం, రికార్డులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ఎడతెగని జాప్యం కారణంగా పరిస్థితి చేయిదాటింది. పట్టాదార్ పాస్‌పుస్తకాలు రాకపోవడం.. తాతల కాలంనాడే భూములమ్ముకున్న వారి పేర్లతో పాస్ పుస్తకాలు జారీ కావడంలాంటి సంఘటనలు చోటుచేసు కున్నాయి. దీంతో ఆఖరికి భూ రికార్డుల ప్రక్షాళన లక్ష్యం కాస్తా పక్కదారి పట్టింది. ఈ పరిణామాలన్నింటిపై ఇంటెలిజెన్స్ విభాగంతో వివరాలు తెప్పించుకున్న సీఎం.. రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోయిందని ఇక కఠినంగా వ్యవహరించాల్సిందేననే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికితోడు ఇటీవల ఏసీబీ దాడుల్లోనూ వీఆర్‌ఓలే ఎక్కువగా పట్టుబడుతుండడం కూడా సీఎం ఆగ్రహానికి కారణమైంది. డేంజర్‌జోన్‌లో వీఆర్ఓలు! రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తోన్న 4,700 మంది వీఆర్ఓల భవితవ్యంపై ఈ ప్రతిపాదనలతో నీలినీడలు కమ్ముకున్నాయి. రెవెన్యూశాఖ గురించి ప్రస్తావించిన సందర్భాలలో వీఆర్‌ఓలవైపు కేసీఆర్ వేలెత్తి చూపుతుండడంతో తమ పోస్టులకు ముప్పు వాటిలినట్లుగానే ఉద్యోగవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలావుండగా, గతంలో భూ రికార్డుల ప్రక్షాళనకు ముందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావు, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు వెంకట్రాంరెడ్డి, లోకేశ్ కుమార్‌లతో కూడిన కమిటీ.. గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరించే వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేయకూడదని సిఫార్సు చేసింది. అయితే, సీఎం మాత్రం రోజుకో హెచ్చరికతో వేడిపుట్టిస్తుండడంతో కొత్త రెవెన్యూ చట్టం ఎలా ఉంటుంది? వీఆర్ఓలు ఉంటారా? ఇతర శాఖల్లో విలీనం అవుతారా? అనే ఉత్కంఠ ఉద్యోగవర్గాల్లో నెలకొంది. సీఎం గారూ.. ఏంటిలా? అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై వీఆర్ఓ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తామే తప్పుచేశామని స్వయంగా ముఖ్యమంత్రే దోషులుగా చిత్రీకరిస్తే తమ బాధలు ఎవరు చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. సీఎం వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యామని, సీఎస్, సీసీఎల్ఏలకు లేని అధికారాలు తమకున్నాయని సీఎం వ్యాఖ్యానించారని, తమకేం అధికారాలున్నాయో సీఎం చెప్పాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. తమను అవమానించేలా సీఎం మాట్లాడారని, 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నామని, చిరుద్యోగులైన తమపై కక్షసాధింపునకు పాల్పడడం సరైంది కాదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సీఎం వ్యాఖ్యల కారణంగా ప్రజల్లో తమకు గౌరవం లేకుండా పోతుందని, సామాజిక భద్రత కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా శనివారం నుంచి ఈనెల 27వరకు వర్క్‌టూ రూల్ పాటిస్తున్నామని, నల్లబ్యాడ్జీలతో వీఆర్‌ఓలందరూ విధులకు హాజరవుతున్నారని తెలిపారు. -
అవినీతి తిమింగళాలు..
సాక్షి, షాద్‌నగర్: ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా రెవెన్యూ సిబ్బందిలో మార్పు కానరావడం లేదు. యథేచ్ఛగా అక్రమాలను కొనసాగిస్తున్నారు. చిన్నచిన్న పనుల కోసం వచ్చే రైతులను లంచాల పేరుతో వేధిస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ రైతు నుంచి కొందుర్గు వీఆర్వో రూ.4లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. హైదరాబాద్‌లోని కేశంపేట వీఆర్వో ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. ఒకే రోజు జరిగిన ఈ రెండు ఘటనలు రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపాయి. భూమి ఆన్లైన్లో నమోదుకు రూ.9లక్షలు లంచం డిమాండ్ కొందర్గు వీఆర్ఓ అనంతయ్య ఇటీవల కేశంపేట నుంచి బదిలీపై వచ్చారు. కాగా, కేశంపేట మండలం దత్తాయపల్లె శివారులో సర్వే నంబర్ 85/ఆ లో 9–07 ఎకరాల విస్తీర్ణం భూమి మామిడిపల్లి చెన్నయ్య పేరున పట్టా ఉంది. వీఆర్ఓ అనంతయ్య చెన్నయ్యకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చే సమయంలో రూ.30 వేలు లంచం తీసుకున్నాడు. ఆ తర్వాత అనంతయ్య జూన్ 13న కొందుర్గు బదిలీపై వచ్చారు. అయితే, రైతు చెన్నయ్యకు సంబందించిన భూమి 2019 జూన్ 18 వరకు ఆన్లైన్లో ఆయన పేరుపైనే కనిపించింది. కానీ, జూన్ 24న ఆన్లైన్లో చూడగా ఆ భూమి కనిపించలేదు. దీంతో బాధిత రైతు సంబందిత వీఆర్ఓ అనంతయ్యను సంప్రదించారు. దీంతో ఆన్లైన్లో నమోదు చేయడం కోసం రూ.9 లక్షలు కావాలని, తనతోపాటు తహశీల్దార్ లావణ్యకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని అనంతయ్య రైతు చెన్నయ్య, అతడి కుమారుడు భాస్కర్‌కు చెప్పాడు. దీంతో వారు రూ.8 లక్షలు లంచం ఇవ్వడానికి వీఆర్ఓ అనంతయ్యతో ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయమై రైతు చెన్నయ్య కుమారుడు భాస్కర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న వీఆర్ఓ అనంతయ్యకు బుధవారం భాస్కర్ రూ.4 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ దాడల్లో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు గంగాధర్, మాజీద్, రామలింగారెడ్డి, నాగేంద్రబాబు పాల్గొన్నారు. రూ.9లక్షలు అడిగాడు : భాస్కర్ 1951లో మా నాన్న చెన్నయ్య భూమి కొనుగోలు చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు కూడా వచ్చాయి. ఆన్లైన్లో కూడా నమోదు చేశారు. కానీ, తిరిగి ఆన్లైన్లో నుంచి తొలగించారు. ఆన్లైన్ నమోదు చేయాలంటే రూ.9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ. 8లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నాం. నాలుగు బృందాలుగా ఏర్పడి.. అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి అవినీతి చేపలను పట్టుకున్నారు. అయితే బుధవారం ఏసీబీ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి కొందుర్గు, షాద్‌నగర్, కేశంపేట రెవెన్యూ కార్యాలయాలతో పాటుగా, హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కేశంపేట తహిసీల్దార్ లావణ్య ఇంటిపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కొందుర్గు తహిసీల్దార్ కార్యాలయంలో రైతు మామిడిపల్లి భాస్కర్ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో షాద్‌నగర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంతో పాటు కేశంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో రైతుకు సంబంధించిన భూరికార్డులను అధికారులు పరిశీలించారు. ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం కార్యాలయంలోని కంప్యూటర్లతో పాటుగా, రికార్డులను పరిశీలించారు. భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసి తీసుకోవడం వెనక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. రైతు మామిడిపల్లి భాస్కర్‌కు సంబంధించిన భూమి వివరాలను ఓసారి ఆన్లైన్లో నమోదు చేసి కొన్ని రోజుల తర్వాత ఏవిధంగా తొలగించారన్న విషయంపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. వీఆర్వో బదిలీ అయినా కేశంపేట మండలంలో సుమారు పదేళ్ళకు పైగా అనంతయ్య వీఆర్వోగా పనిచేశారు. కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ, దత్తాయపల్లి, ఇప్పలపల్లి, కేశంపేట గ్రామాల్లో వీఆర్వోగా పనిచేసిన అనంతయ్యపై పలు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేశంపేటకు చెందిన చందన అనే మహిళా రైతుకు సంబంధించిన భూమిని ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో ఆమె తహిసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఈ వ్యవహారంలో తహిసీల్దార్ లావణ్య, వీఆర్వోలు ఇబ్బందులు పెడుతున్నారని మహిళా రైతు ఆరోపణలు చేసింది. ఇటీవల జిల్లా అధికారులు వీఆర్వోల బదిలీల నేపథ్యంలో అనంతయ్యను కొందుర్గు మండల కేంద్రానికి బదిలీ చేశారు. ఆయన బదిలీ అయినా కేశంపేట మండలానికి సంబంధించిన రైతుల భూ వ్యవహరాల్లో తలదూర్చి ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఇటీవల షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు కేశంపేట తహిసీల్దార్ లావణ్య కాళ్లుపట్టుకొని భూ సమస్యను పరిష్కరించాలని వేడుకున్న సంఘటన ఆ రోజు చర్చనీయాంశమైంది. ఆర్డీఓ కార్యాలయ అధికారుల పాత్ర? వీఆర్వో భారీ ఎత్తున లంచం డిమాండ్ చేయడంలో ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసే అధికారుల హస్తం ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నా.. తొలగించాలన్నా.. ఆర్డీఓ కార్యాలయం అధికారుల ప్రమేయం కూడా ఉంటుంది. అయితే భూమికి సంబంధించిన వివరాలను ఒకసారి ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత.. తొలగించడంలో ఎవరెవరి పాత్ర ఉంది, లంచాలు ఎవరెవరు డిమాండ్ చేశారు అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాపు చేపడుతున్నట్లు తెలిసింది. ఉలిక్కిపడిన అధికారులు రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబడటంతో షాద్‌నగర్ డివిజన్లోని అన్ని శాఖల అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కొందరు అధికారులు సమయాని కంటే ముందే కార్యాలయాల నుంచి వెళ్లిపోయారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున లంచం తీసుకుంటూ పట్టుబడటం, ఏకకాలంలో కార్యాలయాల్లో తనిఖీలు జరగడంతో అసలు ఏం జరుగుతుందోనని, ఎవరెవరు మెడకు ఉచ్చుబిగించుకుంటుందనే చర్చ జరుగుతోంది. అవినీతి దందాలో కుమ్మక్కు తహసీల్దార్, వీఆర్వో ఇద్దరు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే రైతుకు సంబంధించిన భూమి వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. భూ వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించాలంటే.. ఎందుకు తొలగించాల్సి వస్తుందోనన్న వివరాలను రైతుకు తెలియజేయడంతో పాటుగా దీనికి సంబంధించిన ప్రొసీడింగ్‌లు విధిగా ఉండాలని, అప్పుడే ఆన్లైన్లో నుంచి తొలగించేందుకు అవకాశం ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ, ఇక్కడ మాత్రం అలాందేమీ లేకుండా ఆన్లైన్లో వివరాలు తొలగించినట్లు తెలుస్తోంది. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూర్యానారాయణ సూచించారు. అధికారులు లంచం అడిగితే 9440446140 సంప్రదించాలని తెలిపారు. -
లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీఆర్వో
సాక్షి, మందస(శ్రీకాకుళం) : ఇటీవల సోంపేట మండలం బారువ ఇన్చార్జి వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన మరువక ముందే తాజాగా మందస మండలం దున్నవూరు గ్రామ రెవెన్యూ అధికారి కిల్లి ప్రసాదరావు అడ్డంగా దొరికిపోయారు. రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. ఈ ఘటన రెవెన్యూ వర్గాల్లో అవినీతిపరులను చెమటలు పట్టించింది. మండల చరిత్రలో తొలి ఏసీబీ కేసు నమోదైంది. మందస మండలంలోని ఉద్దాన ప్రాంతమైన దున్నవూరు గ్రామ రెవెన్యూ అధికారి కిల్లి ప్రసాదరావు పని చేస్తున్నారు. మూణ్నెల్ల క్రితం కోటబొమ్మాళి మండలం నుంచి డిప్యూటేషన్‌పై ఇక్కడకు వచ్చారు. భేతాళపురం పంచాయతీకి కూడా ఇన్చార్జి వీఆర్వోగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భేతాళపురం పంచాయతీలోని సిగలపుట్టుగ గ్రామానికి చెందిన చీగటి షణ్ముఖరావు తనకున్న 96 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు రుణ నిమిత్తం ఆశ్రయించాడు. స్థలానికి సంబంధించిన ఎల్పీసీ(ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్) కావాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో మందస తహసీల్దార్ కార్యాలయంలో షణ్ముఖరావు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ఫైల్ వీఆర్వో వద్దకు వెళ్లగా, రూ.4 వేలు డిమాండ్ చేసినట్టు ఆరోపిస్తూ, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ విజయనగరం డీఎస్పీ (శ్రీకాకుళం ఇన్చార్జి) బీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విజయనగరం, శ్రీకాకుళం సీఐలు భాస్కరరావు, హరి, విజయ్, మహేశ్, సిబ్బంది మోహనరావు, రామారావు, రాము, రమేష్ తదితరులు బుధవారం అవినీతి చేపను పట్టుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా షణ్ముఖరావు వీఆర్వోకు లంచం ఇవ్వడానికి ఫోన్ చేశాడు. మందస పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద కలవాలని వీఆర్వో చెప్పడంతో ఏసీబీ అధికారులకు సమాచారం చేరవేశాడు. అక్కడ రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా, అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, ఫింగర్ ప్రింట్స్‌ను తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ సొంత స్థలం కోసం పొజిషన్ సర్టిఫికెట్‌కు షణ్ముఖరావు నుంచి రూ.4 వేలు లంచం డిమాండ్ చేశారని, పక్కా ప్రణాళికతో వీఆర్వో కిల్లి ప్రసాదరావును పట్టుకున్నామని, విశాఖపట్నం ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ఇదిలాఉంటే మందస మండలంలో కొంతమంది అధికారులు, సిబ్బంది అవినీతిపై ప్రచారం సాగుతున్నప్పటికీ, ఇంతవరకు బాధితులు బయట పడలేదు. తహసీల్దార్ కార్యాలయంపై పలు ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో ఏసీబీ వలలో వీఆర్వో చిక్కుకోవడంతో వీరి వెన్నులో వణుకు పుట్టింది. -
లంచం తీసుకుంటూ దొరికిన వీఆర్వో
సాక్షి, నరసన్నపేట (శ్రీకాకుళం): వెబ్‌ల్యాండ్‌లో పేరు మార్పునకు ఐదు వేల రూపాయలు తీసుకుంటూ కోమర్తి వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. తన ఆస్తిని భార్య పేరున మార్చమని కోరిన హోంగార్డు కె.శంకరరావును వీఆర్వో వై.రాజు లంచం అడిగాడు. బాధితుడు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించడంతో అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కరణం రాజేందర్, తెలిపిన వివరాలు.. శ్రీకాకుళంలో హోంగార్డుగా పనిచేస్తున్న కె.శంకరరావు భార్య లక్ష్మి పేరున యారబాడులో 33 సెంట్ల భూమి ఉంది. గడిచిన పదేళ్లుగా శిస్తు కడుతున్నారు. గత నెలలో ఈ భూమిని ఇతరులకు అమ్మేందుకు శంకరరావు ప్రయత్నించగా వెబ్‌ల్యాండులో శంకరరావు తండ్రి మల్లేశ్వరరావు పేరున ఉంది. ‘పట్టాదారు పుస్తకం భార్య పేరున ఉంది.. ఈమేరకు శిస్తు కడుతున్నాను.. ఎందుకిలా జరిగింద’ని బాధపడ్డ శంకరరావు పాస్ పుస్తకం ప్రకారం తన భార్య పేరున వెబ్‌ల్యాండులో పేరు మార్చాలని వీఆర్వో రాజును కోరాడు. పేరు మార్చడానికి వీఆర్వో రూ.5 వేలు డిమాండ్ చేశాడు. శంకరరావు రూ.2 వేలు ఇచ్చినా పని జరగలేదు. మిగిలిన డబ్బు ఇస్తేనే పనిచేస్తానని డిమాండ్ చేయడంతో శంకరరావు కడుపు మండి ఏసీబీని ఆశ్రయించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా.. కొమర్తి స్కూల్ వద్ద వీఆర్వో ఉన్నట్లు తెలుసుకొని ఏసీబీ అధికారులు స్కూల్ వద్దకు గురువారం సాయంత్రం వచ్చారు. అక్కడ లేకపోవడంతో శంకరరావుతో ఫోన్ చేయించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్నాను.. రమ్మని వీఆర్వో రాజు చెప్పడంతో శంకరరావును తీసుకొని ఏసీబీ అధికారులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు వచ్చారు. శంకరరావు నుంచి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకొన్న ఏసీబీ సిబ్బంది తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి రికార్డులను పరిశీలించి.. వీఆర్వో ప్రవర్తనతో శంకరరావు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన అనంతరం కేసు నమోదు చేశారు. వీఆర్వో రాజును అదుపులోనికి తీసుకున్నామని, శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ రాజేందర్ తెలిపారు. హడలిపోయిన రెవెన్యూ కార్యాలయ సిబ్బంది గురువారం సాయంత్రం ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న వేళ.. ఏసీబీ అధికారులు ఒక్కసారిగా కార్యాలయానికి రావడంతో కలకలం రేగింది. ఏసీబీ అధికారులు ఎవరిని పట్టుకుంటారో.. ఎవరు దొరికిపోతారో అని రెవెన్యూ సిబ్బంది ఆందోళన చెందారు. చివరికి కోమర్తి వీఆర్వో లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్టు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. నాలాగ ఎందరో.. కోమర్తి, యారబాడు పంచాయతీల్లో తనలా అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని బాధితుడు శంకరరావు చెప్పారు. డబ్బు ముట్టందే వీఆర్వో రాజు పనులు చేయరని, చిన్న పనికి తనను అనేక అవస్ధలు పెట్టడంతో చివరికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఏసీబీ అధికారుల సహకారంతో అవినీతి అధికారి ఆట కట్టిందన్నారు. -
టీడీపీ నేత కబ్జా పర్వం
సాక్షి, ఆత్మకూరు(చేజర్ల): ఆ గ్రామంలో ఆ నేతదే పెత్తనం. ఆయన మాటకు ఎవరైనా ఎదురు చెప్తే ఇక అంతే. గత ప్రభుత్వ కాలంలో అధికార బలంతో మండల స్థాయి అధికారులను లోబరుచుకున్నాడు. దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములతో పాటు పెన్నా పొరంబోకు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. దర్జాగా లీజుకు ఇచ్చి ఏటా లక్షలాది రూపాయలు జేబులో వేసుకుంటున్నాడు. దళితులు ఎవరైనా ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నాడు. మాజీ శాసనసభ్యుడి అండతో సదరు టీడీపీ నేత సాగిస్తున్న దాష్టీకానికి స్థానిక వీఆర్వో సైతం మద్దతుగా నిలవడంతో దళితులు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లిలో సర్వే నంబర్లు 183, 185, 191లోని 40 ఎకరాల పెన్నా పొరంబోకును దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో నలబై దళిత కుటుంబాలకు పంపిణీ చేశారు. కొందరికి పాసు పుస్తకాలు సైతం అందజేశారు. మరికొందరికి హద్దులు చూపాల్సి ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ భూములపై కన్నేసిన టీడీపీ నేత దళితుల నుంచి పాసుపుస్తకాలు తీసుకుని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. గ్రామ నాయకుడే కదాని నమ్మిన దళితులు పాసుపుస్తకాలు అందజేశారు. పెన్నా పొరంబోకును సదరు నాయకుడు చదును చేసి తన ఆధీనంలో ఉంచుకుని దర్జాగా వేరుశనగ సాగుకు ఇతర ప్రాంతాల వారికి(రామతీర్థ, అల్లూరు) లీజుకు ఇచ్చాడు. ఏటా ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వివిధ స్థాయిల్లో లీజు దండుకుంటున్నాడని బాధితులు తెలిపారు. గ్రామంలోని శ్మశాన వాటిక వెనుక ఉన్న పెన్నా పొరంబోకు సుమారు 30 ఎకరాలకు పైగా ఆక్రమించి వివిధ బినామీ పేర్లతో పట్టాలు సైతం తెచ్చుకున్నాడు. పొలాల వద్దకు పెన్నా నదిలోనే మెటల్ రోడ్డు సైతం వేసుకున్నాడు. ఈ భూమిలో దర్జాగా విద్యుత్ శాఖ అధికారుల సాయంతో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించుకుని మోటార్లు బిగించి ఏటా రెండు పంటలు వేరుశనగ సాగుకు లీజుకు ఇస్తున్నాడు. ఇలా పెన్నా పొరంబోకు 70 ఎకరాలను అధికారం అండతో కబ్జా చేశాడు. సంగం రోడ్డు పక్కనే సర్వే నంబర్ 511లోని 12 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. ఇందులోని 8 ఎకరాలను తాను వేరే వ్యక్తుల వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పుకుంటున్నాడు. ఈ భూమి సమీపంలో దళితుడైన సబ్బు పుల్లయ్యకు ఉన్న 4 ఎకరాల భూమిని తన భూమిలో కలిపేసుకున్నాడు. పుల్లయ్య, ఆయన కుమారుడు వెంకటేశ్వర్లు భూమి తమదని, గతంలో బోర్లు సైతం వేసుకున్నామని చెబుతున్నా వారి వేదన అరణ్య రోదనగా మారింది. తహసీల్దార్‌కు ఫిర్యాదు గత మూడ్రోజుల క్రితం చేజర్ల తహసీల్దార్ విజయజ్యోతికి టీడీపీ నేత భూముల ఆక్రమణపై దళిత యువకుడు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ విచారణ జరపాలని స్థానిక వీఆర్వోను ఆదేశించింది. అయితే టీడీపీ నేతకు వత్తాసు పలికే సదరు వీఆర్వో తూతూ మంత్రంగా విచారణ జరిపాడు. టీడీపీ నేత ఆధీనంలో ఉండే భూమి సర్వే నంబరు 179లో ఉందని తహసీల్దార్‌ను పక్కదారి పట్టించాడు. వీఆర్వో కీలక పాత్ర టీడీపీ నేత కబ్జాల పర్వంలో స్థానికంగా పనిచేస్తున్న వీఆర్వో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. వీఆర్వో ప్రభుత్వ భూములకు బినామీ పేర్లతో పట్టాలు తయారు చేసి అడంగల్‌లో సైతం నమోదు చేయించి నాయకుడికి అప్పగించాడని దళితులు ఆరోపిస్తున్నారు. సదరు వీఆర్వో ఏడేళ్లుగా గ్రామంలోనే పనిచేస్తున్నాడు. 2016లో ఓ మారు బదిలీ అయినా టీడీపీ నేత అండతో కొద్ది రోజులకే గ్రామానికి మళ్లీ బదిలీ చేయించుకున్నాడు. ఇటీవల ప్రభుత్వం మారడం..తహసీల్దార్ సైతం భూములపై విచారణ జరపాలని ఆదేశించడంతో వేరే ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడంతో పాటు తమ భూములను అప్పగించాలని దళితులు వేడుకుంటున్నారు. పాసుపుస్తకం తీసుకుని బెదిరిస్తున్నాడు ప్రభుత్వం భూమితో పాటు పట్టా పాసుపుస్తకం సైతం మంజూరు చేసింది. ఏడాది పాటు సాగు చేసుకున్న తరువాత నా పాసు పుస్తకాన్ని టీడీపీ నాయకుడు తీసుకున్నాడు. ఇప్పుడు భూమి తనదేనని అడుగు పెట్టనీయడం లేదు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. – ఎం నరసింహులు, పుల్లనీళ్లపల్లి అధికారులు న్యాయం చేయాలి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని టీడీపీ నాయకుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ప్రభుత్వం భూములు మంజూరు చేసినట్లు ఆయనే చెప్పడంతో నమ్మకంతో పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు అడిగితే అసలు మీకు హక్కే లేదంటూ దాష్టీకానికి పాల్పడుతున్నాడు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – బొర్రా పెద్దన్న, పుల్లనీళ్లపల్లి భూమిని ఆక్రమించాడు మా తాతల కాలం నుంచి సర్వేనంబర్ 511లోని భూమిని సాగు చేసుకుంటున్నాం. మూడేళ్ల కిందట బోర్లు సైతం వేయించుకున్నాం. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత భూమిని ఆక్రమించుకుని అడిగితే దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. – సబ్బు వెంకటేశ్వర్లు, పుల్లనీళ్లపల్లి భూముల సర్వేకు ఆదేశించాం టీడీపీ నేత అక్రమణలపై బాధితులు ఫిర్యాదు చేశారు. పెన్నా పొరంబోకు భూములపై సర్వే జరపాలని సర్వేయర్‌కు సూచించాం. ఆక్రమణలను గుర్తించి తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్ఐ, వీఆర్వోలను ఆదేశించాం. –విజయజ్యోతికుమారి, తహసీల్దార్, చేజర్ల -
సీఎం కేసీఆర్‌కు సెల్ఫీ వీడియో.. ముగ్గురు పిల్లలతో అదృశ్యం
-
సీఎం కేసీఆర్‌కు లేఖ.. ముగ్గురు పిల్లలతో అదృశ్యం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వీఏఓ, వీఆర్వోల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలను వేధించుకుతింటున్నారు. దీనికి తాజాగా జరిగిన ఘటన ఉదాహరణగా నిలిచింది. వీఆర్వో, వీఏవో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని సీఎం కేసీఆర్‌కు లేఖ రాసి.. తన ముగ్గురు పిల్లలతో కలిసి అదృశ్యమయ్యారు హైదరాబాద్‌లోని తార్నాకలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి. పెద్దపల్లి జిల్లా పగిడిపల్లిలోని తన తండ్రి నారాయణ రెడ్డి మరణించిన తర్వాత వారసత్వంగా వచ్చే భూమిని తన పేరు మీదకు మార్చాలని అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడి వీఏఓ, వీఆర్వోలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని లేఖలో పేర్కొన్నారు. తన చావుకు, పిల్లల చావుకు వీఏఓ, వీఆర్వోలే కారణమని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఒక సెల్ఫీ వీడియో రికార్డు చేసి, తన మరణానంతరం ఆస్తిని తన తల్లి పేరు మీద రాసివ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా మల్లా రెడ్డి అదృశ్యం పట్ల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. మల్లారెడ్డి ఆచూకి లభ్యం తార్నాకలో తన ముగ్గురు పిల్లలలతో మిస్సింగ్ అయిన మల్లారెడ్డి ఆచూకీని ఓయూ పోలీసులు కనుగొన్నారు. భువనగిరిలో ఉన్న మల్లారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మల్లారెడ్డి ఆచూకి కనుగొన్న పోలీసులు.. ఆయనతో పాటు ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. -
లంచం అడిగిన వీఆర్ఓ.. నిర్భందించిన గ్రామస్తులు
సాక్షి, నవాబుపేట : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేటలో ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ఓ ఆది నారాయణను గ్రామస్తులు నిర్భంధించారు. తమ పట్టా పాస్బుక్ల కోసం ముప్పు తిప్పలు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం ఇవ్వనిదే పని చేయడం లేదని, ఎప్పుడూ మద్యంమత్తులో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడ్డారు. గ్రామపంచాయతీలోని ఒక గదిలో ఉంచి బయట తాళం వేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : వీఆర్ఓను నిర్బంధించిన గ్రామస్తులు -
వీఆర్ఓను నిర్బంధించిన గ్రామస్తులు
-
వీఆర్వోలను వెంబడించి మరీ దాడి చేశారు..
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో ఇసుకు మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు రెవెన్యూ సిబ్బందిని వెంబడించి మరీ తలలు పగులగొట్టారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా నైరాలో చోటుచేసుకుంది. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వరావు గతరాత్రి సంఘటనా స్థలానికి వెళ్లారు. దీంతో ఇసుక మాఫియా దుండగులు ఒక్కసారిగా రెచ్చిపోయి కర్రలతో మూకుమ్మడిగా దాడికి చేశారు. ఈ ఘటనలో వీఆర్వోలు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఇసుక మాఫియా దాడులపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ సీరియస్ అయ్యారు. రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసినవారిని వదిలేదని లేదని ఆయన స్పష్టం చేశారు. రాత్రి, పగలు అనకుండా రెవెన్యూ సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ ప్రశంసించారు. రాజకీయ ఒత్తిడికి లొంగకుండా కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు. కాగా ఇసుక మాఫియా దాడిలో గాయపడి, రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీఆర్వోలను జిల్లా కలెక్టర్ నివాస్, జాయింట్ కలెక్టర్ చక్రధర్ బాబు పరామర్శించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా -
వైద్యం వికటించి మహిళా వీఆర్వో మృతి
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమ): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళా వీఆర్వో మృతి చెందారని కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. కాలం చెల్లిన ఇంజక్షన్ వేయడం వల్లే చనిపోయారని ఆరోపించారు. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 7న ఉబ్బసం వ్యాధి ఉందంటూ అనకాపల్లి మండలం తుమ్మపాల ప్రాంతానికి చెందిన వీఆర్వో ఉప్పాడ రామలక్ష్మి(37) సన్‌రైజ్ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులు వైద్యం అనంతరం ఆమె కోలుకుంది. వైద్యుడు జి.శ్రీధర్ శుక్రవారం డిస్ఛార్జ్ చేస్తానని చెప్పాడు. అయితే శుక్రవారం శ్రీధర్ వ్యక్తిగత పనిమీద గోవా వెళ్లిపోయాడు. మధ్యాహ్నం సమయంలో రామలక్ష్మి ఒక్కసారిగా అస్వస్థతకు గురయింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెకు ఇంజక్షన్ వేయగా అరగంట గడిచిన తరువాత ఆమె చనిపోయింది. ఇంజక్షన్ వికటించి మృతి చెందిందని.. దీనికి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. రామలక్ష్మి భర్త ఉప్పాడ నాగేంద్ర జగదీష్ ప్రతాప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. రామలక్ష్మీకి 5 నెలల కుమార్తె ఉంది. ఆసుపత్రి సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో రామలక్ష్మి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. -
మహిళ చేతిలో వీఆర్వోకు చెప్పుదెబ్బలు
-
వీఆర్వోపై దాడి నలుగురిపై కేసు నమోదు
అల్వాల్: ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారిపై దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులపై అల్వాల్ పోలీస్‌లు కేసు నమోదు చేశారు. సీఐ మట్టయ్య, అల్వాల్ తహసీల్ధార్ సరళ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖానాజీగూడ గ్రీన్ఫిల్డ్స్లోని ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతున్నట్లు సమాచారం అందడంతో తహసీల్ధార్ సరళ ఆదేశాల మేరకు సిబ్బంది, వీఆర్వో శ్రీదేవి అక్కడికి వెళ్లగా ఆక్రమణలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులు వీఆర్వో శ్రీదేవిపై దాడికి పాల్పడ్డారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు సుజాత, క్రిష్ణవేణి, శ్రీలత, రవి కుమార్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వీఆర్వో ఆత్మహత్య
శ్రీకాకుళం రూరల్: ఎచ్చెర్ల మండలం కుశాలపురంలో వీఆర్వో గా, అరిణాం అక్కివలసలో ఇన్చార్జి వీఆర్వోగా పనిచేస్తున్న జె.శ్రీరాములు(35) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయన స్వగ్రామం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ. శ్రీరాములు భార్య శోభారాణి ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరికి ఏడాది వయసు గల బాబు ఉన్నాడు. శ్రీకాకుళం సమీపంలోనే ఇద్దరికీ ఉద్యోగాలు కావడంతో నగరంలోకి క్రాంతి అపార్ట్‌మెంట్స్‌లోనే కొంతకాలంగా వీరు ఉంటున్నారు. మంచి ఉద్యోగం, చక్కటి కుటుం బంతో హాయిగా జీవిస్తున్న శ్రీరాములు ఇలా బలవణ్మరణానికి పాల్పడడం అందరికీ షాక్‌కు గురిచేసింది. శ్రీరాములు ఇటీవలే స్నేహితుల సహకారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. మొదట్లో వ్యాపారం బాగానే సాగినా ఆ తర్వాత నష్టాలు వచ్చాయి. దాని కారణంగా అతను ఆత్మహత్యకు పాల్పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఆ రోజు ఏం జరిగిందంటే..? శ్రీరాములు భార్య శోభారాణితో కలిసి ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో బయటకు వెళ్లి నూడుల్స్ తెచ్చుకున్నారు. సాయంత్రం 6.30 వరకూ అపార్ట్మెంట్ పరిసర ప్రాంతంలో తమ బాబును పట్టుకొని వాకింగ్ చేశారు. 7గంటలు సమయంలో ఇద్దరూ కలిసి అపార్ట్మెంట్లోకి వెళ్లిపోయారు. తెచ్చుకున్న నూడిల్స్‌లో కొంత శ్రీరాములు తిన్నాక మిగతాది భార్యకు ఉంచారు. రాత్రి 8 గంటల సమయంలో శ్రీరాములుకు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. మాట్లాడుతూనే అతను బెడ్రూమ్లోకి వెళ్లారు. అంతసేపూ బాబుతో ఉన్న శోభారాణి కాసేపయ్యాక బెడ్రూమ్ వైపు చూడగా శ్రీరాములు ఊయలకు కట్టే తాడుతో ఉరి వేసుకుని కనిపించారు. ఈ హఠాత్పరిణామంతో శోభారాణి దిగ్భ్రాంతికి గు రయ్యారు. ఏం చేయాలో అర్థం కాక కింద ఫ్లోర్ కు దిగి వాచ్‌మెన్‌కు, చుట్టుపక్కల ఉన్న వారికి విషయం చెప్పారు. అప్పటికే శ్రీరాములు కొన ఊపిరితో ఉన్నారు. వారు వచ్చి పైన తాడు కోసి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించగా ఆయన కన్ను మూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీఆర్వో మృతితో విషాదం ఎచ్చెర్ల క్యాంపస్: కుశాలపురం వీఆర్వో, అరిణాం అక్కివలస ఇన్చార్జి వీఆర్వో జగి లింకి శ్రీరాములు మృతితో ఎచ్చెర్ల రెవెన్యూ వర్గాల్లో విషాదం నెలకొంది. గత ఆరేళ్ల నుంచి ఈయన ఎచ్చెర్ల మండలంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నారు. చురుగ్గా పనిచేసే శ్రీరాములుకు అధికారుల వద్ద మంచి పేరుంది. శ్రీరాములు మృతిపై తహసీల్దార్ శ్రీనివాసరావుతోపాటు, రెవెన్యూ సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు శ్రీరాములు భార్య శోభారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు. మృతదేహానికి రిమ్స్‌లోనే పోస్టుమార్టం నిర్వహించారు. రెండో పట్టణ సీఐ మల్లా మహేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముందే అనుకున్నారా..? శ్రీరాములు కొంతకాలంగా దిగాలుగా ఉన్నట్లు భార్య శోభారాణి తెలిపారు. ఆదివారం సాయంత్రం నూడుల్స్ కొనడానికి వెళ్లినప్పుడు శ్మశానాన్ని చూపిస్తూ ‘నేను మరికొద్ది రోజుల్లో ఇక్కడకు వచ్చేస్తాను’ అని అన్నారని, అప్పుడే మందలించానని ఆమె చెప్పారు. ఫ్లాట్‌కి వెళ్లినప్పటికీ బాబును ముద్దాడుతూ ‘మీ అమ్మను నువ్వే బాగా చూసుకోవాలం’టూ చెప్పారని తెలిపారు. ఇంతలోనే ఇంత ఘోరానికి పాల్పడతారని అనుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కారణాలు ఏంటి..? వాస్తవంగా భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఆర్థికంగా బాగా స్థిరపడిన వారే. ఆత్మహత్యకు పాల్పడేంత పెద్ద గొడవలేమీ వారి మధ్య లేవని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన నష్టమే ఆత్మహత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈయనతో వ్యాపారాలు చేసే పార్టనర్స్ ఏమైనా మోసగించారా, ఇంకేమైనా తగాదాలు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. రాత్రి 8 గంటల సమయంలో ఫోన్ వచ్చాక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కాల్ సారాంశం ఏమిటన్నది అంతు చిక్కాల్సి ఉంది. -
ఏఆర్వోలపై ఈసీ వేటు
సాక్షి, అమరావతి : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మొత్తం 12 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి నాలుగు రోజుల క్రితం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. నూజివీడు, సూళ్లూరుపేట, కోవూరు ఆర్వోలపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించి.. ముగ్గురు ఏఆర్వోలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరికొంతమంది అధికారులకు షోకాజ్ నోటీసులను జారీ చేసింది. త్వరలో మిగిలిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముంది. ఆ వార్తలతో సంబంధం లేదు: సీఈవో ద్వివేదీ ఈవీఎంలకు సంబంధించి ‘అధికారుల నిర్లక్ష్యమా, పెద్దల డైరెక్షనా?’అనే వార్త తో పాటు ‘మొరాయింపు కుట్ర’కథనం తో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు గానీ, తన కు గానీ, ఇతర అధికారులకు గానీ సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ శుక్రవారం పేర్కొన్నారు. -
ఏసీబీ వలలో వీఆర్వో
పశ్చిమగోదావరి, కొయ్యలగూడెం: రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ నుంచి లంచం తీసుకుంటూ కొయ్యలగూడెం మండలానికి చెందిన వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పరింపూడి–1 రెవెన్యూ గ్రామ వీఆర్వో అడపా రాంబాబు తన పరిధిలోని 30 సెంట్ల భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి యూనియన్ బ్యాంకు మాజీ మేనేజర్ కోడె శ్రావణ్‌కుమార్‌ను రూ.30 వేలు డిమాండ్ చేశాడు. తాడేపల్లిగూడెంలో నివాసం ఉంటున్న శ్రావణ్‌కుమార్ తనకు ఆన్లైన్లో మంజూరైన పాస్‌పుస్తకాలను వీఆర్వో ఇవ్వకుండా తొక్కిపెట్టారని, లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఏసీబీను ఆశ్రయించారు. దీంతో మంగళవారం రాత్రి వీఆర్వో కార్యాలయానికి శ్రావణ్‌ను రూ.30 వేలు ఇచ్చి పంపగా సొమ్మును వీఆర్వో రాంబాబుకు ముట్టచెబుతున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి బుధవారం న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్టు డీఎస్పీ గోపాలకృష్ణ చెప్పారు. ఏసీబీ సీఐలు శ్రీనివాస్, రవీంద్ర, జె.మురళీకృష్ణ దాడుల్లో ఉన్నారు. -
వీఆర్వో తుది ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. గత సెప్టెంబర్‌లో టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మొత్తం 700 పోస్టులకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. గత డిసెంబర్లోనే రాతపరీక్ష ఫలితాలను ప్రకటించగా, శుక్రవారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం నోటిఫై చేసిన 700 పోస్టుల్లో 697 ఖాళీలు భర్తీ కాగా, హైకోర్టు కేసుల కారణంగా రెండు పెండింగ్‌లో ఉన్నాయి. మరో పోస్టుకు సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు ఫలితాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. -
రికార్డులు మాయం
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: మండలంలోని కోడిగూడెం వీఆర్వో కార్యాలయంలో రికార్డులు మాయమయ్యాయి. దీనిపై స్థానికులు మంగళవారం ఉదయం ద్వారకాతిరుమల తహసీల్దారు ఎం.కృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం రాత్రి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన కోడిగూడెం (సీహెచ్ పోతేపల్లి ఇన్చార్జి) వీఆర్వో వి.సుబ్రహ్మణ్యం కుమారుడు, అతని తమ్ముడే రికార్డులను మాయం చేశారని పేర్కొన్నారు. స్థానికు ల కథనం ప్రకారం.. దెందులూరు మం డలం చల్లచింతలపూడికి చెందిన సుబ్ర హ్మణ్యం ఐదేళ్ల నుంచి కోడిగూడెం వీఆ ర్వోగా పనిచేస్తున్నాడు. ఈయన పనిచేయాలంటే ఎంతోకొంత సొమ్ము ముట్టజెప్పాల్సిందే. కౌలు పత్రం నుంచి పాస్ బుక్ వరకు ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించారు. గొడవలెందుకని భావించిన రైతులు పని త్వరగా పూర్తిచేసుకునేందు కు వీఆర్వో అడిగినంతా ముట్టజెబుతున్నారు. ఇలా చేయని వారి పాస్ పుస్తకా లు, ఇతర కాగితాలు తన కార్యాలయంలోనే ఉంచేవాడు. ఎన్నిసార్లు మీసేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వాటిని పరిశీలించకుండానే తిరస్కరించేవాడు. ఈ క్రమంలోనే దొరసానిపాడుకు చెందిన రైతు రాయపాటి నాగేశ్వరరావు కుమారుడు లీలాకృష్ణమూర్తికి డిజిటల్ ఈ పాస్ పుస్తకాలు ఇచ్చేం దుకు రూ.4 వేలను డిమాండ్ చేశాడు. దీంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి, వీఆర్వో సుబ్రహ్మణ్యంకు లంచ ం సొమ్ము రూ.4 వేలు ఇస్తూ సోమవారం రాత్రి పట్టించిన విషయం తెలిసిందే. విచారణకు హామీ వీఆర్వో సుబ్రహ్మణ్యం ఏసీబీ అధికారుల కు పట్టుబడటంతో, ఆయన కుమారుడు, తమ్ముడు సోమవారం అర్ధరాత్రి కోడిగూడెం వీఆర్ఏ సైదు కాశీం ఇంటికి వెళ్లారు. ఆ తరువాత కాశీంతో వీఆర్వో కార్యాలయం తలుపులు తెరిపించి పాస్ పుస్తకాలు, గొలుసు, తదితర పత్రాలను తీసుకెళ్లిపోయారు. దీనిపై గ్రామస్తులు కొంద రు కాశీంను నిలదీయడంతో అసలు విష యం బయటకొచ్చింది. ఈ వ్యవహారమంతా ఒక కాగితంపై రాసి కాశీంతో సం తకం చేయించారు. రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు, కాగితాలు పెద్ద ఎత్తున వీఆర్వో కార్యాలయంలో దొరికి తే, అవి ఎందుకు పెండింగ్‌లో ఉంచారనే ప్రశ్నలు ఎదురౌతాయన్న ఉద్దేశంతోనే వాటిని దొంగిలించారని స్థానికులు చెబుతున్నారు. రికార్డుల మాయంపై విచారణ చేస్తానని గ్రామస్తులు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, చెలికాని బుల్లియ్య, బీజేపీ జిల్లా నేత తాండ్ర శేషగిరిరావులకు తహసీల్దారు కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. కనిపించని ఫైల్ ఇదిలా ఉండగా వీఆర్వోను ఏసీబీ అధికారులకు పట్టించిన రైతుకు సంబం ధించి ఫైల్ తహసీల్దారు కార్యాలయంలో దొరకలేదు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ సిబ్బంది ఫైల్ కోసం రికార్డు రూములో వెదికినా ఫలితం లేదు. ఐతే కోడిగూడెంలోని వీఆర్వో కార్యాలయంలో మాయమైన రికార్డుల్లో, ఈ ఫైల్ ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. జనన ధ్రువీకరణకు రూ.5 వేలు జనన ధ్రువీకరణ పత్రం ఇస్తానని చెప్పి గతేడాది రూ.5 వేలు తీసుకున్నాడు. రేపు మాపు అంటూ తిప్పాడు. అసలు ఆ పత్రం ఇచ్చేది వీఆర్వో కాదని తెలుసుకుని, నా డబ్బులు ఇవ్వమని ఎన్నోసార్లు వెంటపడ్డాను. సరైన సమాదానం చెప్పలేదు. చేసేదేం లేక ఇక ఊరుకున్నాను.– చవల దుర్గారావు, కోడిగూడెం, గ్రామస్తుడు ఈ పాస్ పుస్తకాల కోసం వసూలు నా పొలానికి మేన్యువల్ పాస్ పుస్తకాలున్నాయి. వాటిని మార్చి డిజిటల్ ఈ పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పి తొలుత రూ.1500, ఆ తరువాత పొలం కొలతలంటూ రూ.3 వేలు తీసుకున్నాడు. అలాగే పాత పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలను దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా డబ్బులు కావాలని అడిగాడు. వీఆర్వో చుట్టూ తిరగలేక ఊరుకున్నాను.– పాలం రాంబాబు, కోడిగూడెం, గ్రామస్తుడు ఎకరమైనా, అరెకరమైనా ఒకే రేటు నా పొలం పాస్ పుస్తకాలను ఈ పాస్ పుస్తకాలుగా మార్చేందుకు అరెకరానికి రూ.5 వేలు మరో ఎకరానికి మరో రూ.5 వేలు తీసు కున్నాడు. ఉన్నతాధికారులకు చెబుదామంటే పనులు అవ్వవని భయపడేవాళ్లం. వీఆర్వో ఏసీబీ అధికారులకు దొరకడంతో రికార్డులను మాయం చేశారు.– బచ్చు శ్రీనివాసరావు, కోడిగూడెం, గ్రామస్తుడు -
కారు ఢీకొని వీఆర్ఓ దుర్మరణం
కృష్ణాజిల్లా, తోట్లవల్లూరు (పామర్రు): కారు ఢీకొన్న ఘటనలో మండలంలోని భద్రిరాజుపాలెం వీఆర్ఓ కాటూరి మురళీకృష్ణ (42) దుర్మరణం పాలయ్యారు. మండలంలోని యాకమూరు వద్ద జరిగిన ఈ ప్రమాదం రెవెన్యూ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాల ప్రకారం.. ఉయ్యూరు నుంచి విధులకు హాజరయ్యేందుకు తోట్లవల్లూరు వస్తున్న వీఆర్ఓ కాటూరి మురళీకృష్ణ (42) యాకమూరు శ్రీనగర్ కాలనీ వద్ద కారు ఢీకొని మృతి చెందారు. గురువారం ఉదయం 9.40 గంటలకు జరిగిన ఈ ప్రమాదం వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. భద్రిరాజుపాలెం వైపు నుంచి అతి వేగంగా ఉయ్యూరు వెళ్తున్న హోండా సిటీ కారు చెరకు లోడు ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో.. ఉయ్యూరు వైపు నుంచి తోట్లవల్లూరు వైపు వెళ్తున్న కారును ఢీకొట్టడమే కాకుండా ఆ వెనుకనే సమీపంలో బైక్‌పై వస్తున్న వీఆర్ఓ మురళీకృష్ణను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో మురళీకృష్ణ తీవ్రంగా గాయపడగా, ఆయా కారుల్లో ప్రయాణిస్తున్న ఇరువురు స్వల్ప గాయాలకు గురైనట్లు తెలిసింది. మురళీకృష్ణను హుటాహుటిన విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. ఆయనకు భార్య దేవిశ్రీ, కుమారుడు హేమంత్ ఉన్నారు. ఉయ్యూరు మండలం కలువపాముల ఆయన స్వగ్రామం. ప్రమాద ప్రాంతాన్ని ఉయ్యూరు సీఐ కాశీవిశ్వనాథం, పమిడిముక్కల ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ నాంచారయ్య సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. సహచరుల నివాళి.. అందరితో కలిసి మెలసి ఉంటూ, సౌమ్యునిగా పేరుగాంచిన వీఆర్ఓ మురళీకృష్ణ మృతితో రెవె న్యూ వర్గాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న తహసీల్దార్ జీ. భద్రు, డీటీ సాయిమహేష్, ఆర్ఐ ప్రసాద్, వీఆర్ఓలు ఘటనా ప్రాంతానికి తరలివెళ్లారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కూడా మురళీ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో !
శ్రీకాకుళం, సోంపేట: తండ్రి నుంచి వచ్చే వారసత్వ ఆస్తిని తన పేరున మార్చేందుకు కావాల్సిన మ్యూటేషన్ కోసం ఆ వ్యక్తి వీఆర్వోను సంప్రదించాడు. అయితే 15 వేల రూపాయలు లంచం ఇస్తేనే మ్యూటేషన్ ఇస్తానని గ్రామ రెవెన్యూ అధికారి షరతు విధించాడు. దీంతో చేసేది లేక పది వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించాడు. తరువాత విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారిచ్చిన సలహా మేరకు డబ్బులు ఇస్తుండగా దాడి చేసి వీఆర్వోను అవినీతి నిరోధకశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన సోంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం చోటుచేసుకుంది. తూముల వినోద్ కృష్ణ అనే వ్యక్తి నుంచి రూ. 10 వేలు తీసుకుంటుండగా జింకిభద్ర వీఆర్వో (బారువ ఇన్చార్జి) గుంట కృష్ణదాసును పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సోంపేటపట్టణానికి చెందిన తూముల వినోద్కృష్ణకు తండ్రి లక్ష్మీనారాయణ పాత్రో నుంచి వారసత్వంగా బారువ రెవెన్యూ గ్రామంలో 3.04 ఎకరాల ఆస్తి సంక్రమించింది. దీన్ని తన పేరున మార్చుకోవడానికి వినోద్‌కృష్ణ ఏడాదిగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. మ్యూటేషన్ కోసం ఈ ఏడాది 5వ తేదీన మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. తన తండ్రి పేరు మీద ఉన్న ఆస్తి తన పేరున మార్పు చేయాలని బారువ ఇన్చార్జి గ్రామ రెవెన్యూ అధికారి కృష్ణదాసును వినోద్ కృష్ణ కలిశాడు. అయితే 15 వేల రూపాయలను ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేశారు. కేవలం మ్యూటేషన్ కోసం ఇంత మొత్తం అడగడంతో చేసేది లేక ఏసీబీ అధికారులను ఆయన ఆశ్రయించి తన గోడు చెప్పుకున్నాడు. దీంతో వీఆర్వోను పట్టుకోవడానికి పథకం వేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని సర్వేయర్ కార్యాలయంలో ఉన్న వీఆర్వో కృష్ణదాస్‌ను వినోదకృష్ణ కలిశాడు. మ్యూటేషన్ కోసం పది వేల రూపాయలు ఇస్తున్నానని చెప్పాడు. ఆ నగదును వినోదకృష్ణ నుంచి వీఆర్వో కృష్ణదాసు తీసుకుంటుండగా అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి కృష్ణదాసునుఅదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఏసీబీ సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ అధికారిని అదుపులోకి తీసుకొని శ్రీకాకుళం తరలించి విచారణ చేస్తామని ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. కావాలనే ఇరికించారు మూడు నెలల క్రితం బారువ గ్రామానికి ఇన్చార్జి రెవెన్యూ అధికారిగా చార్జి తీసుకున్నాను. వినోద్ కృష్ణ ఈ నెల 5వ తేదీన మ్యూటేషన్ కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు స్వీకరణకు మార్చి 5వ తారీఖు వరకు గడువు ఉంది. సర్వేయర్ కార్యాలయంలో ఉన్న నన్ను బయటకు పిలిచి జేబులో కవరు పెట్టాడు. ఏమి జరిగిందో తెలుసుకునే లోపే అధికారులు నన్ను అదుపులోకి తీసుకున్నారు. కావాలనే నన్ను ఎవరో ఇరికించారు.కృష్ణదాసు, గ్రామ రెవెన్యూ అధికారి -
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వీఆర్వో
-
ఏసీబీ వలలో వీఆర్వో
శ్రీకాకుళం ,రాజాం సిటీ/రూరల్: రాజాం రెవెన్యూ కార్యాలయంలో అవినీతి ఊడలు పాతుకుపోతున్నాయి. రెండేళ్ల క్రితం ఈ శాఖకు చెందిన వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుపడగా.. తాజాగా ఇదే శాఖకు చెందిన వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. మ్యుటేషన్ నిమిత్తం ఆశపడిన ఓ వీఆర్వో ఏసీబీకి పట్టుపడ్డాడు. ఓ వైపు ఏసీబీ అధికారుల దాడులు జరుగుతున్నా అవినీతి అ«ధికారులు వెనక్కుతగ్గకపోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం నగరపంచాయతీ పరిధిలోని సారధి గ్రామానికి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న అలజంగి ఈశ్వరరావు, ఇదే మండలంలోని కంచరాం గ్రామానికి ఇన్చార్జి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. కంచరాం గ్రామానికి చెందిన కలిశెట్టి చిన్నంనాయుడుకు గ్రామంలో 1.81 ఎకరాల సాగుభూమి ఉంది. పంటరుణం నిమిత్తం ఆంధ్రాబ్యాంకును ఆశ్రయించగా పట్టాదారు పాసుపుస్తకంలో వివరాలు ఉన్నప్పటికీ వెబ్అడంగల్లో పూర్తి భూమి చూపించకపోవడంతో జూలై 24న మీ సేవా కేంద్రంలో మ్యుటేషన్ నిమిత్తం ఇతడు దరఖాస్తు చేసుకున్నాడు. అప్పట్లో ఆ దరఖాస్తు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వీఆర్వో వద్దకు చేరుకోగా అధికారులు పట్టించుకోలేదు. మరోవైపు గడువు కూడా ముగిసింది. దీంతో విసుగుచెందిన రైతు అధికారులను సంప్రదించగా మరోదఫా మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాధిత రైతు నవంబర్ 28న మ్యుటేషన్ నిమిత్తం రెండోదఫా దరఖాస్తు చేసుకోగా నెలరోజులు కావస్తున్నా ఫలితం కనిపించలేదు. ఈ దఫా కూడా గడువు ముగుస్తుండడంతో రైతు రాజాం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఉన్నతాధికారులను సంప్రదించాడు. ఈ తంతు వీఆర్వో ఈశ్వరరావు వద్దకు చేరగా, వీఆర్వో బాధిత రైతుకు ఫోన్‌చేసి మ్యుటేషన్ కావాలంటే రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. అంత ఇచ్చుకోలేమని చెప్పినా వినిపించుకోకుండా ముందుగా రూ.6 వేలు చెల్లించాలని, పని పూర్తయ్యాక మిగతా రూ.4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భూ యజమాని కలిశెట్టి చిన్నంనాయుడు తన మనుమడు కలిశెట్టి మురళితో విషయం చెప్పడంతో ఈ నెల 26న మురళి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు సూచించిన విధంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం మురళి వీఆర్వో ఈశ్వరరావుకు రూ.5 వేలు అందించగా తీసుకున్న ఈశ్వరరావు వాటిని జేబులో పెట్టుకొని తన బండి వద్దకు వెళ్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం లోపలకు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. బాధితులు ఫిర్యాదు మేరకు నిందితుడిని విశాఖ ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర విలేకరులకు తెలిపారు. విసిగిపోయి... ఈ సందర్భంగా బాధిత రైతుకుటుంబానికి చెందిన మురళి విలేకరులతో మాట్లాడుతూ తన తాత సాగుభూమి మ్యుటేషన్ నిమిత్తం వీఆర్వో డబ్బులు డిమాండ్ చేశాడని తెలిపాడు. పేద కుటుంబానికి చెందినవారమని, తక్కువ ఇస్తామని చెప్పినా వినలేదని, ప్రతీ దఫా మీసేవా కేంద్రంలో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేయడం, సమయం గడిచిపోవడం జరిగిపోతుందని ఆవేదన వ్యక్తంచేశాడు. చేసేదిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించామన్నారు. రెండేళ్ల క్రితం సరిగ్గా రెండేళ్ల క్రితం 2016 ఆగస్టు 19న ఇదే రాజాం తహసీల్దార్ కార్యాలయానికి చెందిన కంచరాం వీఆర్వో కృష్ణ భూసంబంధిత విషయంలోనే ఏసీబీకి చిక్కాడు. అదే ఏడాదిలో సంతకవిటి మండలంలో మోదుగులపేట గ్రామానికి చెందిన అప్పట్టి పంచాయతీ కార్యదర్శి కూడా ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటనలు మరువకముందే మళ్లీ ఏసీబీ దాడులుకు వీఆర్వో చిక్కాడు. ఇప్పుడు కూడా రాజాం మండలంలో ఇదే కంచరాం గ్రామానికి చెందిన వీఆర్ఓ ఏసీబీకి చిక్కడం కొసమెరుపు. -
ఏసీబీ కలకలం
పశ్చిమగోదావరి, గోపాలపురం: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వీఆర్వో దానిలో ఆర్‌ఐకూ వాటా ఉందని వెల్లడించడం దేవరపల్లి రెవెన్యూ ఉద్యోగుల్లో కలకలం రేపింది. దీనిపై క్షుణ్ణంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఏసీబీకి చిక్కిన ఘటనలు ఉన్నాయి. అసలేం జరిగిందంటే..! దేవరపల్లిలో ఒక రైతు వద్ద నుంచి రూ.13 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దేవరపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ కథనం ప్రకారం.. త్యాజంపూడి వీఆర్వోగా పనిచేస్తున్న కొండపల్లి వేణుగోపాలరావు కొంత కాలంగా దేవరపల్లి ఇన్చార్జి వీఆర్వోగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తు్తన్నాడు. దేవరపల్లి శివారు కొత్తగూడెంకు చెందినరైతు పి.వెంకటేశ్వరరావు తన పొలంలో మంచినీటి బోరు వేసుకుని విద్యుత్ కనెక్షన్ అనుమతి సర్టిఫికెట్ కోసం 15 రోజుల క్రితం అర్జీ పెట్టుకున్నాడు. దీంతో రైతు వద్దనుంచి పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డులు తీసుకున్న వీఆర్వో రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. రైతు అంత ఇవ్వలేనని చెప్పడంతో రూ.13 వేలు ఇవ్వాలని పట్టుబట్టాడు. వెంకటేశ్వరరావును 15రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నాడు. దీంతో విసిగి వేసారిన వెంకటేశ్వరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు స్ధానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు నుంచి రూ.13 వేలు తీసుకుని ప్యాంటు జేబులో పెట్టుకుంటున్న వీఆర్వో వేణుగోపాలరావును పట్టుకున్నారు. ఆర్ఐ పాత్రపై అనుమానం ఘటనపై వీఆర్వో వేణుగోపాలరావును ప్రశ్నించగా, రూ.13 వేలల్లో రూ.పది వేలు రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) అడిగారని, దీనిలో తనకు కేవలం రూ.3వేలు మాత్రమే వాటా అని వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో అవాక్కవడం ఏసీబీ అధికారుల వంతైంది. అయితే ఆర్ఐ మూడు రోజులుగా సెలవులో ఉన్నట్టు తెలిసింది. ఆర్ఐ అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చిన తర్వాత విచారణ చేస్తామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ఆర్ఐ పాత్ర ఉన్నట్టు తేలితే ఇద్దరినీ రాజమండ్రి ఏసీబీ కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు. ఈ దాడుల్లో ఎస్పై కె. శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. లంచం ఇవ్వజూపినా నేరమే లంచం తీసుకోవడమే కాదు.. ఇవ్వజూపినా నేరమేనని, వారిపైనా కేసు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ వి. గోపాలకృష్ణ చెప్పారు. దేవరపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరుతో మాట్లాడారు. మెట్ట ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులను ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులకు గురిచేస్తే ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇవ్వకుండా వారి పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు ఇచ్చినట్లు విచారణలో తేలితే తీసుకున్న ఉద్యోగికి మూడేళ్ల జైలు శిక్ష, లంచం ఇచ్చిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడతాయని పేర్కొన్నారు. గతంలోనూ ఘటనలు దేవరపల్లిలో గతంలోనూ ఏసీబీ దాడులు జరిగాయి. గతంలో ఇద్దరు తహసీల్దార్లు ఏసీబీకి చిక్కారు. అలాగే ఓ డెప్యూటీ తహసీల్దార్, ఓ సూపరింటెండెంట్, ఓ వీఆర్వో ఏసీబీ వలలో పడ్డారు. తాజాగా వీఆర్వో పట్టుబడి, ఆర్ఐ పాత్ర కూడా ఉందని చెప్పడంతో ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. -
ఏసీబీ వలలో వేమవరం వీఆర్వో
గుంటూరు, మాచవరం: మండలంలోని వేమవరం గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న మీసాల కోటేశ్వరరావు రూ.3వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. అవినీతి నిరోధక శాఖ అడిషనల్ ఎస్పీ సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చెన్నాయపాలెం గ్రామానికి చెందిన నెల్లూరి నరసింహారావు బాబాయి వడ్లమూడి సత్యన్నారాయణ దాచేపల్లి మండలం నడికుడిలో నివాసం ఉంటున్నారు. సత్యన్నారాయణ పేరున వేమవరం శివారులో 3.50 ఎకరాల సాగుభూమి ఉంది. వన్‌బీ, అడంగళ్ ఆన్లైన్ చేసుకునేందుకు ఈనెల 8వ తేదీన మీ–సేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ చేసేందుకు వీఆర్వో కోటేశ్వరరావు సత్యన్నారాయణను రూ.5 వేలు ఇమ్మని అడిగాడు. అంత మొత్తంలో ఇవ్వలేమని రూ.3వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నా లంచం ఎందుకు ఇవ్వాలన్న ఉద్దేశంతో బుధవారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు గురువారం వీఆర్వో గూర్చి ఆరా తీశారు. శుక్రవారం ఉదయం వీఆర్వో కోటేశ్వరరావు ఆన్లైన్ చేసేందుకు ఇస్తామన్న రూ.3వేలు డబ్బులు తీసుకుని రావాలని రైతుకు రెండుసార్లు ఫోన్ చేశాడు. అనుకున్న ప్రకారం ఏసీబీ అధికారులు రైతుకు నగదు ఇచ్చి పంపారు. వీఆర్వోను తనిఖీ చేయగా రూ.3 వేలు నగదు దొరికాయి. నగదు స్వాధీనం చేసుకొని కేసును నమోదు చేశారు. కార్యక్రమంలో ఆర్ఆండ్ బీ ఏఈ గణేష్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్ దినేష్, ఏసీబీ అధికారి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.5వేలు లంచం తీసుకుంటూ చిక్కిన వీఆర్ఓ
సాక్షి,భీమదేవరపల్లి(హుస్నాబాద్): ఆర్వోఆర్ పట్టా చేసేందుకు ఓ రైతు వద్ద నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటూ వీఆర్ఓ గుమ్మడి రమేష్ ఏసీబీకి చిక్కిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం చోటు చేసుకుంది. ఏసీబీ వరంగల్ డీఎస్పీ కడారి భద్రయ్య కథనం ప్రకారం... మండల పరిధిలోని వంగర రెవెన్యూ గ్రామ పరిధి రంగయపల్లికి చెందిన బొల్లవేన రవికి వంగర గ్రామ శివారులో అతని తండ్రి మల్లయ్య పేరిట 766సర్వే నంబర్లో 3.16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తండ్రి పేరిట ఉన్న భూమిని కుమారులైన రవి, కుమారస్వామి పేరిట మార్పిడి కోసం గత ఏడాది క్రితం ఆర్వోఆర్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ భూమికి సంబంధించి వివరాలు సక్రమంగా ఉండడంతో ఆర్వోఆర్ అమలు చేసేందుకు అప్పటి తహసీల్దార్ కిరణ్‌కుమార్ మల్లయ్యకు ప్రొసిడింగ్ జారీ చేశారు. పట్టదారు పాసు బుక్కు కోసం ఆరు మాసాలుగా రవి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. రూ. 15వేలు ఇస్తే పాసు బుక్కు ఇస్తానంటూ వంగర వీఆర్ఓ గుమ్మడి రమేష్ సదరు రైతుకు చెప్పాడు. తన దగ్గర అంత డబ్బులు లేవని రూ. 5వేలు ఇస్తానని చెప్పాడు. దీంతో రైతు రవి నెల రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల ఆదేశాల మేరకు రవి రూ. 5వేలు తీసుకొని మంగళవారం భీమదేవరపల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నాడు. కార్యాలయం వెనకల సదరు రైతు వీఆర్ఓ రమేష్‌కు రూ. 5వేలు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్ఓ రమేష్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఇందులో సీఐలు సతీష్‌కుమార్, క్రాంతి కుమార్, వెంకట్ ఉన్నారు. పదేళ్లలో ఆరుగురు.... భీమదేవరపల్లి మండలంలో పదేళ్ల కాలంలో ఐదుగురు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. పదేళ్ల క్రితం ఏఎస్‌డబ్ల్యూవో, తహసీల్దార్ వామన్‌రావు, ఆరేళ్ల క్రితం తహసీల్దార్ చంద్రలింగం, ఎస్టీవో జోగ్యానాయక్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్‌గా చేసిన కనకయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. తాజాగా వీఆర్ఓ రమేష్ ఏసీబీకి చిక్కడంతో భీమదేవరపల్లిలో చర్చనీయశంగా మారింది. అవినీతికి పాల్పడుతున్న మరో ఇద్దరు వీఆర్ఓలపై సైతం ఫిర్యాదులున్నట్లు వారిపై ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించా.. పట్టదారుపాసు బుక్కు కోసం విసిగి పోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. ఆరు నెలలుగా పట్టదారు పాసుబుక్కు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. పంట రుణం కోసం బ్యాంక్‌కు పోతే పాసు బుక్కు అడుగుతండ్లు. వీఆర్ఓను బుక్కు అడిగితే రూ. 15వేలు ఇస్తేనే పాసుబుక్కు ఇస్తానన్నాడు. అన్ని డబ్బులు నా దగ్గర లేవు రూ. 5వేలు ఇస్తానని చెప్పిన. ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవ్వు. దాంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. – బొల్లవేన రవి -
లంచం తీసుకుంటూ పట్టబడిన వీఆర్ఓ
వైఎస్ఆర్ జిల్లా, పెనగలూరు : ఈ–పాసుపుస్తకం కోసం రూ.9 వేలు లంచం తీసుకుంటూ వైఎస్సార్ జిల్లా సింగనమల ఇన్చార్జి వీఆర్ఓ శ్రీనివాసులు ఏసీబీకి చిక్కారు. శుక్రవారం ఉదయం 10:30గంటలకు కడప ఏసీబీ డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో దాడులుచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సింగనమల వీఆర్ఓ నరసింహులు సెలవుపై వెళ్లడంతో ఓబిలి వీఆర్ఓ శ్రీనివాసులును ఇన్చార్జిగా నియమించారు. గ్రామానికి చెందిన కోడూరు నరేష్ ఐదుఎకరాలకు సంబంధించి ఈ–పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం రూ.10వేలు లంచం అడిగినట్లు నరేష్ తెలిపారు. కువైట్ నుంచి ఇండియాకు వచ్చి ఈ–పాసుపుస్తకం కావాలంటూ దరఖాస్తు చేసుకుని శ్రీనివాసులు ఇంటివద్దకు శుక్రవారం రాత్రి వెళ్లారు. నేను కువైట్‌కు త్వరగా వెళ్లాలి. ఈ–పాసుపుస్తకం కావాలని వీఆర్ఓ, నరేష్‌ల మధ్య రూ.9వేలకు ఒప్పందం కుదిరింది. ఒప్పందం మాటలు కూడా నరేష్ రికార్డుచేసి ఏసీబీకి అందించినట్లు సమాచారం. కడప ఏసీబీ డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పెనగలూరుకు రావడంతో నరేష్ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న వీఆర్ఓకు రూ.9వేలు లంచం ఇచ్చారు. కార్యాలయంపక్కనే ఉన్న ఏసీబీ అధికారులు శ్రీనివాసులు వద్దకు వెళ్లి రూ.9వేలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసులు వద్ద ఉన్న రూ.9వేలు నగదు తాము ఇచ్చిందేనని ఏసీబీ అధికారులు వేలిముద్రలు సేకరించి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. శ్రీనివాసులును తమ వెంటే తీసుకుని కర్నూలుకు వెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఏసీబీ వలలో వీఆర్ఓ
కర్నూలు, నంద్యాల: ఏసీబీ అధికారులకు అవినీతి చేప దొరికింది. శిరివెళ్లకు చెందిన వీఆర్ఓ తిరుపాల్ నంద్యాల పట్టణంలోని ఓ కూల్‌డ్రింక్ షాపులో ఈ పాసు పుస్తకం కోసం రూ.8వేలు లంచంతీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శిరివెళ్ల మండల కేంద్రానికి చెందిన జాఫర్‌వలి అనే రైతు తన తమ్ముడుకు చెందిన 2.54ఎకరాల భూమికి ఈ పాసుపుస్తకం కావాలని వీఆర్ఓ తిరుపాల్‌ను సంప్రదించారు. ఈ పాపుపుస్తకం కావాలంటే రూ.10వేలు డబ్బులు ఇవ్వాలని వీఆర్ఓ రైతుకు తెలిపారు. తాము పేదవాళ్లమని, అన్ని రికార్డుల ప్రకారం డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినా డబ్బులు ఇవ్వనిదే పని కాదని వీఆర్ఓ తేల్చిచెప్పారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక రూ.10వేలు ఇచ్చుకోలేమని, రూ.8వేలు ఇస్తామని చెప్పగా వీఆర్ఓ అంగీకరించాడు. వీఆర్ఓ ఈ పాసుపుస్తకం కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్న విçషయాన్ని రైతు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు రైతు జాఫర్‌వలీ బుధవారం డబ్బులు తెచ్చామని, ఎక్కడ ఇవ్వాలని వీఆర్ఓకు ఫోన్ చేయగా తాను శిరివెళ్లలో లేనని, నంద్యాలలో ఉన్నానని, నంద్యాలకు వచ్చి ఫోన్ చేయమని తెలిపారు. రైతు నంద్యాలకు వచ్చి ఫోన్ చేయగా బస్టాండ్ వద్ద ఉన్న కూల్‌డ్రింక్ షాపులో ఉన్నానని, ఇక్కడికి రావాలని తెలిపారు. దీంతో ఏసీబీ అధికారులు మఫ్టీలో పంచలు కట్టుకొని కూల్‌డ్రింక్ షాపు వద్దకు చేరుకున్నారు. రైతు కూల్‌డ్రింక్ షాపులో ఉన్న వీఆర్ఓకు రూ.8వేలు నగదు ఇవ్వగానే రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఓల్ట్ టౌన్‌లోని వీఆర్ఓ ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా రైతుకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచిన ఈ పాసుపుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీఆర్ఓను అరెస్ట్ చేశామని, శుక్రవారం ఉదయం కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ సీఐ నాగభూషణం తెలిపారు. అవినీతి అధికారులపై ప్రజలు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు. -
అధికారంలో ఉన్నాం.. ఏమైనా చేస్తాం!
నెల్లూరు(వేదాయపాళెం): రూరల్ మండలంలోని అంబాపురం అరుంధతీయవాడలో బుధవారం స్థానిక దళితుడైన ఇండ్ల ప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకుడు బద్దేపూడి కృష్ణయ్యలపై అదే గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకుడు, విశ్రాంత వీఆర్ఓ పల్నాటి రాగపనాయుడు, అతని కుమారులు మస్తాన్‌నాయుడు, మల్లికార్జుననాయుడు, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు సర్వేనంబరు 105/2లోని 33 అంకణాల నివేశన స్థలాన్ని లఘుసాని వెంకటసుబ్బమ్మ వద్ద గత కొన్నేళ్ల క్రితం ఇండ్ల ప్రసాద్ కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన స్థలంలో బుధవారం ఇంటి నిర్మాణ పనులు చేపడుతుండగా అధికార పార్టీ నాయకులు అక్కడకు చేరుకుని ఈ స్థలం తమదంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. స్థలానికి సంబంధించిన అన్ని హక్కు పత్రాలు తన వద్ద ఉన్నాయని ప్రసాద్ తెలపగా అధికార పార్టీ నాయకుడు ఏమాత్రం పట్టించుకోలేదు. కులం పేరుతో దూషించి ప్రసాద్‌పై దాడి చేశారు. ప్రసాద్ బంధువైన ఎమ్మార్పీఎస్ నాయకుడు బద్దేపూడి కృష్ణకు విషయం తెలియడంతో అక్కడకు చేరుకుని ఇదెక్కడి అన్యాయమని టీడీపీ నాయకులను ప్రశ్నించాడు. అతడిపై కూడా దాడి చేశారు. అధికారం ఉంది ఏమైనా చేస్తాం అంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. -
మరో వివాదంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జనగాం: టీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. జనగాం మండలం పెంబర్తిలోని ఓ వెంచర్ విషయంలో రాత్రి సమయంలో మహిళా వీఆర్వీ ఇంటికి వెళ్లి హల్చల్ చేశారు. మహిళా వీఆర్‌ఓతో దుందుడుకుగా, దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో నొచ్చుకున్న ఆ మహిళా వీఆర్ఓ, రెవిన్యూ ఉద్యోగ సంఘాల నాయకులకు ఈ విషయం తెలియ జేసింది. ఎమ్మెల్యే తీరుపై టీఆర్ఎస్ నాయకులు మహిళ వీఆర్‌ఓతో సద్దుమనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మహిళ వీఆర్ఓ మాత్రం బాగా నొచ్చుకుని ఉండటం వల్ల పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకే సమాయత్తం అయినట్లు తెలిసింది. ఎమ్మెల్యే తీరుపై సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. -
వెలుగులోకి వీఆర్ఓ అక్రమాలు
తిరుపతి : సస్పెన్షన్‌లో ఉన్న పిచ్చాటూరు మాజీ వీఆర్ఓ నాగభూషణం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తల్లి పేరుతో ఉన్న పట్టాను మార్చేందుకు రూ.1.25 లక్షలు తీసుకున్నాడు. దీంతో బాధితుడు సోమవారం పోలీసులు, తహసీల్దారుకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు, తహసీల్దారు కథనం మేరకు.. పిచ్చాటూరు బజారు వీధికి చెందిన కె.రాధాక్రిష్ణన్‌కు ఎక్కువయ్యాయి. తన తల్లి సి.పట్టమ్మ పేరుతో ఉన్న పట్టాను (దస్తావేజు నెం.729/2018) తన పేరుతో మార్చుకొని బ్యాంకులో రుణం తీసుకోవాలని అనుకున్నాడు. పిచ్చాటూరు వీఆర్ఓగా పని చేసిన నాగభూషణంను కలిసి సలహా కోరాడు. దీన్ని నాగభూషణం ఆసరాగా తీసుకున్నాడు. రెవెన్యూ రికార్డుల్లో పట్టమ్మ పేరు తొలగించి రాధాక్రిష్ణన్ పేరు చేర్చడానికి రూ.50 వేలు, రాధాక్రిష్ణ తండ్రి, తాత డెత్ సర్టిఫికెట్ తీసుకోవడానికి రూ.20 వేలు, రిజిస్ట్రేషన్ ఖర్చులకు మరో రూ.55 వేలు అవుతుందని చెప్పాడు. అందుకు ఒప్పుకున్న రాధాక్రిష్ణన్ ఈ నెల 7వ తేదీన రూ.50 వేలు, 14వ తేదీన రూ.20 వేలు 18న 10 వేలు, 24న రూ.45 వేలు చొప్పున మొత్తం రూ.1.25 లక్షల నగదును స్థానికుడైన ఆరుముగం ద్వారా నాగభూషణంకు అందజేశాడు. నాగభూషణం పని చేయలేదు. దీనిపై ప్రశ్నించగా మరో రూ.50 వేలు ఇస్తే ఒరిజినల్ సెటిల్మెంట్ డ్యాక్యుమెంట్ ఇస్తామని అతను నమ్మబలికాడు. దీంతో రాధాక్రిష్ణన్ ఎస్ఐ రామాంజనేయులు, తహసీల్దారు కిరణ్‌కు ఫిర్యాదు చేశాడు. డబ్బు తీసుకున్నట్టు ఎవరికీ చెప్పరాదని, చెబితే చంపేస్తామని నాగభూషణం తనను బెదిరిస్తున్నట్లు బాధితుడు వాపోయాడు. మధ్యవర్తి బీఈ ఆరుముగంతోపాటు నాగభూషణంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరాడు. బాధితుడు ప్రస్తుత వీఆర్వో విశ్వనాథం, ఆర్ఐ స్వరూపరాణి సమక్షంలో ఫిర్యాదు చేయడం గమనార్హం. మరో ఆరుగురి నుంచి రూ.5 లక్షలు వసూలు నాగభూషణం మరో ఆరుగురి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు తహసీల్దారు చెప్పారు. వాటిపై విచారణ చేసి రెవెన్యూ శాఖ తరపున నాగభూషణంపై మరో కేసు నమోదు చేయనున్నామన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ సమస్యలు ఉంటే నేరుగా సంబంధిత వీఆర్ఓ ద్వారా తమను సంప్రదించాలని తెలిపారు. వీలైనంత త్వరలో పనులు పూర్తి చేస్తామని, మాజీ వీఆర్ఓలను, దళారులను ఆశ్రయించవద్దని ప్రజలకు సూచించారు. జిల్లా యంత్రాంగాన్నితప్పుదారి పట్టించిన ఘనుడు దీనిపై తహసీల్దారు కిరణ్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. పిచ్చాటూరు వీఆర్ఓగా పని చేస్తున్న నాగభూషణంను గత ఏడాది పులిచెర్ల మండలానికి కలెక్టర్ బదిలీ చేశారని తెలిపారు. ఆయన విధులకు హాజరు కాలేదన్నారు. పైగా సమాచార హక్కు చట్టం పేరిట నకిలీ పత్రాలను సృష్టించి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో కేసు వేసినట్టు పేర్కొన్నారు. ఇందులో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, అప్పటి తిరుపతి సబ్ కలెక్టర్ నిషాంత్ కుమార్‌ను ప్రతివాదులుగా చేర్చారని తెలిపారు. ఈలోపే తనకు న్యాయం చేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రిని ఆశ్రయించాడన్నారు. అతనికి ఉద్యోగం ఇవ్వాలని మంత్రి సర్క్యులర్ ఇచ్చారని పేర్కొన్నారు. దాన్ని కలెక్టర్, సబ్‌కలెక్టర్ అమలు చేయలేదని నాగభూషణం ట్రిబ్యునల్‌కు తెలిపాడని వివరించారు. దీంతో వ్యక్తిగతంగా హాజరుకావాలని కలెక్టర్, సబ్‌కలెక్టర్‌ను ట్రిబ్యునల్ కోర్టు ఆదేశించిందని తెలిపారు. నాగభూషణంపై ఉన్న ఆరోపణలను కలెక్టర్, సబ్ కలెక్టర్ నిరూపించడంతో ట్రిబ్యునల్ కేసును కొట్టి వేసిందన్నారు. అనంతరం నాగభూషణంను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. -
పాసుబుక్కు అడిగితే కొట్టాడు..
పెబ్బేరు: పట్టాదారు పాసుబుక్కు అడిగిన పాపానికి రైతుపై వీఆర్వో దాడి చేసిన ఘటన ఇది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల పరిధిలో జనుంపల్లి గ్రామానికి చెందిన రైతు మన్నెపురెడ్డికి అదే గ్రామ శివార్లలో 4.34 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి పట్టాదార్ పాస్బుక్కు ఇచ్చేందుకు వీఆర్వో ఎం.కృష్ణయ్య కొన్నిరోజులుగా సతాయిస్తున్నాడని రైతు ఆరోపణ. గురువారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన మున్నెపురెడ్డి ఉప తహసీల్దార్ ఎదుట వీఆర్వోను పాసుబుక్కు ఇవ్వాలని కోరగా.. ‘మాకేం పనిలేదా? ఎపుడూ మీ పనేనా?’అని గదమాయిస్తూ రైతు భుజంపై గట్టిగా కొట్టాడు. ఉప తహసీల్దార్ ఆశోక్‌కుమార్ జోక్యం చేసుకుని మన్నెపురెడ్డిని కాపాడారు. అనంతరం ఈ ఘటనపై మున్నెపురెడ్డి తహసీల్దార్ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. వీఆర్వో డబ్బులకోసం డిమాండ్ చేయగా తాను నిరాకరించానని మున్నెపురెడ్డి ఆరోపించారు. అందుకే పాస్‌బుక్ ఇవ్వడంలో జాప్యం చేయడమే కాకుండా దాడి చేశారని అన్నారు. -
వీఆర్ఓ ఆత్మహత్యాయత్నం
పర్ణశాల భద్రాద్రి : మండలంలోని నారాయణరావుపేట వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న రేసు ఆదినారాయణ యాసిడ్ తాగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నాడనే కారణంతో తహసీల్దార్ హరిచంద్ నాలుగు రోజులు క్రితం మెమో ఇవ్వడంతో పాటు జీతం నిలిపివేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆదినారాయణ ఇంట్లో వున్న యాసిడ్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆదినారాయణ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. తహసీల్దార్‌తో పాటు డీటీ, ఆర్ఐలు వేధించడం వల్లనే ఆదినారాయణ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు, వీఆర్ఓల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ హరిచంద్‌ను వివరణ కోరగా ఆదినారాయణ ఒక్కడికే కాదు విధులు సరిగా నిర్వహించని ఏడుగురు వీఆర్ఓలకు మెమోలు ఇచ్చామన్నారు. ఎంత హెచ్చరించినా పద్ధతి మారకపోవడంతో మెమో ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు అతను మెమోను తీసుకోలేదన్నారు. వేధింపులకు గురిచేయడం అవాస్తవం అన్నారు. భద్రాచలంలో చికిత్స పొందుతున్న వీఆర్ఓ దగ్గరకు సిబ్బంది వెళ్లడంతో తహసీల్దార్ కార్యాలయం ఖాళీ అయింది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
కలెక్టర్‌కే కథలు
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇవ్వాల్సిన టైమ్ స్కేల్ ప్రమోషన్‌ను అడ్డగోలుగా కట్టబెట్టేశారు..ఈ వ్యవహారంలో నిబంధనలను చాపచుట్టేశారు.. వేలకు వేలు వసూలు చేసి అర్హత లేని పలువురు వీఆర్వోలకు ప్రమోషన్ స్కేల్ ఇప్పించేసి.. ఒక్కొక్కరికీ లక్షల్లో ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు.. కలెక్టరేట్ ఏ సెక్షన్ సాక్షిగా ఇద్దరు ఉద్యోగులు సాగించిన ఈ దందాను ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో కలెక్టరేట్ మొత్తం ఉలిక్కిపడింది. స్వయంగా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. డీఆర్వో, ఏవోలను పిలిపించి.. ఈ వ్యవహారం నిగ్గు తేల్చాలని.. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలతోపాటు అడ్డగోలు ప్రమోషన్ పొందిన ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని కూడా ఆదేశించారు.అయితే ఆ సాయంత్రానికే సీను మారిపోయిం ది. దందా చేసిన ఉద్యోగుల తరపున కొందరు రెవె న్యూ ఉద్యోగ సంఘాల నేతలు రంగంలోకి దిగారు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ప్రమోషన్ల వర్తింపు అంతా సవ్యంగానే జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్ల డైందని ఏకంగా కలెక్టర్ చేతే ప్రకటన ఇప్పించేశారు.. దందాను బయటపెట్టిన ‘సాక్షి’ ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్లింది. ఎటువంటి అర్హతలు లేకపోయినా.. నిర్ణీత పరీక్షలు రాయకపోయినా.. పలువురు వీఆర్వోలకు ప్రమోషన్లు కట్టబెట్టేశారని పరిశీలనలో తేలింది. కలెక్టర్‌కే కట్టు కథలు చెప్పి.. దందా వ్యవహారాన్ని కంచి చేర్చేస్తున్నారనీ తేలింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని వీఆర్వోలకు అడ్డగోలుగా టైమ్ స్కేల్ ప్రమోషన్ వర్తింపజేసిన వ్యవహారంలో కలెక్టరేట్లో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన కొందరు అధికారులు ఏకంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌నే తప్పుదోవ పట్టించారని తెలుస్తోంది. కలెక్టర్ కార్యాలయంలోని ఏ3, ఏ4 ఉద్యోగులు జీవో నెం.93, 96లలోని నిబంధనలకు విరుద్ధంగా టైమ్ స్కేల్ ఫైళ్లు రూపొందించి ఉన్నతాధికారులతో సంతకాలు పెట్టించిన వైనాన్ని సాక్షి వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 25న ‘కలెక్టరేట్లో ఏ4, ఏ3ల దందా’ శీర్షికతో ప్రచురితమైన ఈ కథనం కలకలం రేపింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్.. ప్రాథమిక సమాచారం మేరకు వీఆర్వోలకు ప్రమోషన్ స్కేలు వర్తింపజేయడంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఫైళ్లన్నింటినీ పరిశీలించామని పేర్కొంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ విషయంలోనూ అధికారులు కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించినట్లు స్పష్టమవుతోంది. జీల్లో ఏముందంటే.. టైమ్ స్కేల్‌కు సంబంధించిన జీవోలను పరిశీలిస్తే.. జీవో నెం. 93 ఫైనాన్స్ పే కమిషన్–2 (తేదీ 30.4.2010) ప్రకారం ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరిన తర్వాత సర్వీస్ రూల్స్‌లో మార్పులు, చేర్పులు జరిగి.. పదోన్నతికి ఆటంకాలు ఎదురయ్యే సందర్భాల్లో మాత్రమే ఆ ఉద్యోగికి ప్రత్యేక పదోన్నతి స్కేల్–1 లేదా 2 ఇవ్వవచ్చు. ఈ జీవో నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో 23.1.2011న ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆర్థిక శాఖ 20.5.2011న జీవో నెం. 96ను ఫైనాన్స్ విభాగం (పేకమిషన్ –2) జారీ చేసింది. దీని ప్రకారం అప్పటి వరకు అమల్లో ఉన్న 8, 16, 24 సంవత్సరాల్లో ఇస్తున్న స్పెషల్ స్కేల్స్‌ను 6, 12, 18, 24 సంవత్సరాల్లో ఇచ్చేలా మార్చారు. ఆ పరీక్షలేమీ లేకుండానే.. జీవోలోని పేరా 7 (2) ప్రకారం 12 ఏళ్ల స్పెషల్ ప్రమోషన్ స్కేలు పొందాలంటే విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి. అదే జీవోలోని పేరా 7 (3) ప్రకారం నాలుగో తరగతి కేటగిరీ ఉద్యోగులు అంటే.. అటెండర్లు, డఫేదార్లు, డ్రైవర్లు, ఆపరేటర్లుకు మాత్రం ఈ అర్హతల నుంచి మినహాయించారు. వీఆర్వోలు జూనియర్ అసిస్టెంట్ స్కేలును పొందుతున్నందున వారికి ఈ మినహాయింపులు అసలు వర్తించవు. అలాగే ప్రభుత్వానికి, వీఆర్వోల సంఘానికి జరిగిన ఒప్పందం ప్రకారం.. వారు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాలంటే రెవెన్యూ పరీక్షలు పార్ట్–1 (పేపర్ కోడ్–18, 27), పార్ట్ –2 (పేపర్ కోడ్ 43), పార్ట్–3 (పేపర్ కోడ్ 04), అకౌంట్ టెస్టు (పేపర్ కోడ్–7), సర్వే ట్రైనింగ్,, క్రాప్ శాంప్లింగ్ శిక్షణ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అయితే ప్రస్తుతం స్పెషల్ అడ్హాక్ పే స్కేలు ఇచ్చిన ఏ ఒక్క వీఆర్వోకూ ఈ అర్హతలు లేవు. అయినా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఆర్సీ నెం. 1051/2015/ఏ4(తేదీ 15.3.2015) ద్వారా 32 మందికి ఈ స్కేలును వర్తింపజేశారు. ఈ ఉత్తర్వుల్లోని 22వ పేరులో పేర్కొన్న పొలమరశెట్టి వీరప్పారావు (ప్రస్తుతం అచ్యుతాపురం మండలంలో పని చేస్తున్నారు.) ఏ ఒక్క పరీక్షలోనూ అర్హత సాధించలేదు. ఇతనికి అడ్డగోలుగా 12 సంవత్సరాల ప్రమోషన్ స్కేలు ఇచ్చేశారు. అతనొక్కడే కాదు, మిగతా వీఆర్వోల సర్వీసు రిజిస్టర్లను పరిశీలిస్తే ఏ3, ఉద్యోగుల ఘనకార్యం బయటపడుతుంది. వీరివురు సీసీఏ రూల్స్‌ను అతిక్రమించి వీఆర్వోలతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏ3, ఏ4 అంటే హడలెందుకు? వాస్తవానికి సోమవారం ఈ వ్యవహారం మొత్తం సాక్షి వెలుగులోకి తీసుకువచ్చిన వెంటనే సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించారు. అయితే రెవెన్యూ ఉద్యోగుల సంఘంలోని కొందరు నేతల ఒత్తిడి మేరకు విచారణ అటకెక్కించి .. ప్రాధమిక విచారణ మేరకు అంతా సవ్యంగానే జరిగినట్టు మళ్లీ కలెక్టర్ చేతే ప్రకటన ఇప్పించేశారు. దీంతో ఏ–3. ఏ4లు గండం నుంచి గట్టెక్కినట్టేనని భావించారు. ఈ వ్యవహారం కలెక్టరేట్ ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశమైంది. మిగతా జిల్లాల్లో ఈ స్కేల్‌ను ఎందుకు వర్తింపజేయడం లేదు.. అంతవరకకెందుకు మన జిల్లాల్లోనే ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎందుకు వర్తింపజేయడం లేదో కలెక్టర్‌కే తెలియాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన ఏ3, ఏ4లపై విచారణకు సైతం ఉన్నతాధికారులు వెనుకాడటమే ఇప్పుడు కలెక్టరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
వీఆర్వోలపై ఆర్డీఓ ఆగ్రహం
కొడంగల్ రూరల్: మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ పరిపాలనాధికారులపై తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. వీఆర్వోల పనితీరుపై ఆర్డీఓ అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన వీఆర్వోలు తహసీల్దార్ కార్యాలయానికే పరిమితమయ్యారని అన్నారు. రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నూతనంగా ఇచ్చిన పాసుపుస్తకాల్లో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దాల్సిన బాధ్యతను వీఆర్వోలు విస్మరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు జవాబుదారీతనం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్, డీటీ ధనుంజయ, ఆర్ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
పేరు మార్చడానికి పది వేలు
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని టి.నరసాపురం మండలం బండివారిగూడెం గ్రామంలో ప్రవల్లిక అనే మహిళ వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్థానికులైన కూరం పోతురాజు అల్లుడు శ్రీనివాస్ పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పుకు ఆమె వద్దకు వెళ్లాడు. పేరు మార్చడానికి వీఆర్వో ససేమిరా కాదన్నారు. మరలా వెళ్లి ఆమెను కలవగా పది వేలు డిమాండ్ చేయటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో శ్రీనివాస్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ పక్కా పథకం ప్రకారం సోమవారం ప్రవల్లికను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరింత సమాచారం రాబట్టడం కోసం ఏసీబీ అధికారులు టి.నరసాపురం తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు -
పదేళ్లు సడలింపు
సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రూప్–4, మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తదితర పోస్టులకు ప్రభుత్వం పదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ శనివారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్లలో పేర్కొంది. వయోపరిమితి లెక్కింపునకు 2018 జూలై 1వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది. జనరల్ అభ్యర్థులకు సాధారణ గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుకాగా.. తాజా సడలింపుతో 44 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి వర్తిస్తుంది. దీనికి ఆయా రిజర్వేషన్ల మేరకు అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మన్‌లకు మూడేళ్లు, ఎన్సీసీ వారికి మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల మేర అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. అయితే ఆర్టీసీలోని 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం సాధారణ గరిష్ట వయోపరిమితికి, ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కలుపుకొని జనరల్ అభ్యర్థులకు 40 ఏళ్లు గరిష్ట వయోపరిమితి ఉంటుందని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మన్‌కు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుందని వెల్లడించింది. మొత్తంగా ఆర్టీసీలోని పోస్టులకు 45 ఏళ్లు దాటినవారు మాత్రం అనర్హులని స్పష్టం చేసింది. -
ఇమేజ్ పెంచేవారికి అన్యాయమా?
ఒంగోలు టౌన్: ‘వీఆర్ఓలు లేకుండా శిస్తు కట్టించలేరు.. పోస్టుమార్టం చేయించలేరు. వీఆర్ఓలు లేకుండా తహసీల్దార్లు గ్రామాల్లోకి అడుగుపెట్టలేరు. ఇలా రెవెన్యూ ఇమేజ్ పెంచుతున్న వీఆర్ఓలకు మాత్రం పదోన్నతులు ఇవ్వరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. లేకుంటే వారు చేసే ఆందోళనా కార్యక్రమాల్లో ఏపీ జేఏసీ అండగా నిలుస్తుంది’ అని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఏపీవీఆర్‌ఓ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. తొలుత స్థానిక డీఆర్ఆర్ఎం మునిసిపల్ హైస్కూల్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయాల్లో కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన వారు ఆర్ఐ, డీటీ, తహసీల్దార్లుగా పదోన్నతులు పొందుతుంటే, వీఆర్ఓలు మాత్రం అదే పోస్టులో ఉద్యోగ విరమణ చేయడం దారుణమన్నారు. రెవెన్యూ కాన్ఫెడరేషన్ పేరుతో వీఆర్ఓలను వాడుకొని అవమానించి బయటకు పంపడం క్షమించరాని నేరమని బొప్పరాజు వెంకటేశ్వర్లును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వీఆర్ఓలు, వీఆర్ఏలకు ఏపీఎన్జీఓ అసోసియేషన్ అండగా నిలిచి పెద్దన్న పాత్ర పోషిస్తోందని స్పష్టం చేశారు. పదోన్నతులు కల్పిస్తే నష్టమా? ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి కె. శరత్‌బాబు మాట్లాడుతూ రెవెన్యూ కాన్ఫెడరేషన్ పేరుతో వీఆర్ఓలను అణగదొక్కారని విమర్శించారు. వీఆర్ఓలకు పదోన్నతులు కల్పిస్తే కాన్ఫెడరేషన్కు వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. ఈనెల 10 లోపు వీఆర్ఓల పదోన్నతుల సమస్యను పరిష్కరించకుంటే వారు చేపట్టే ఆందోళనలో తాము పాల్గొంటామన్నారు. వీఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సత్యనారాయణరావు మాట్లాడుతూ మీ పంట, మీ సేవ, మీ ఇంటికి మీ భూమి, రైతు సేవలో రెవెన్యూశాఖ వంటి కార్యక్రమాల పేరుతో వీఆర్ఓలతో వేలకు వేలు ఖర్చు చేయించారన్నారు. అనుభవంలేని వారిని సీనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తూ వీఆర్ఓల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారన్నారు. వీఆర్ఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి. రాము మాట్లాడుతూ అర్హులైన వారికి పదోన్నతులు రాకుండా తమ సోదర సంఘం అడ్డుపడుతూ వచ్చిందన్నారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వైపీ రంగయ్య మాట్లాడుతూ మేం ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చామా అని ప్రశ్నించారు. ఈనెల 10వ తేదీ సీసీఎల్ఏను ముట్టడిస్తామని, అప్పటికి న్యాయం జరగకుంటే మూకుమ్మడి సెలవుల్లో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ధర్నాలో అసోసియేట్ ప్రెసిడెంట్ వీ మనోహర్‌రెడ్డి, విద్యాశాఖ ఉద్యోగుల సంఘం నాయకుడు ఏ స్వాములు, సర్వేయర్ల సంఘం జిల్లా కార్యదర్శి భాస్కర్, వీఆర్ఏ అసోసియేషన్ నాయకులు బాలరంగయ్య, పి. వివేకానంద, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. -
హత్యాయత్నం కేసులో ఇద్దరు వీఆర్ఓల అరెస్ట్
సంగం: హత్యాయత్నం కేసులో ఇద్దరు వీఆర్వోలపై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై వేణు తెలిపారు. ఆయన వెల్లడించిన సమాచారం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన సుష్మ, సంగం మండలం తరుణవాయి పంచాయతీ మజరా ఉడ్‌హౌస్‌పేటకు చెందిన తిరుపతిరావు ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. సుష్మ ప్రస్తుతం జెండాదిబ్బలో వీఆర్ఓగా పనిచేస్తుంది. భార్యాభర్తల మధ్య నాలుగు నెలల క్రితం విభేదాలు రావడంతో భర్త తిరుపతిరావు తనను వేధిస్తున్నట్లు సుష్మ బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతడిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి భార్యాభర్తలు ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారరు. ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీ సాయంత్రం తిరుపతిరావు తన స్నేహితుడి మురళీతో కలిసి బుచ్చిరెడ్డిపాళెంకు మోటార్‌బైక్‌లో వెళ్లి తిరిగి ఉడ్‌హౌస్‌పేటకు వెళ్తుండగా దువ్వూరు వద్ద తరుణవాయి వీఆర్ఓ రామకృష్ణారెడ్డితో కలిసి సుష్మ కారులో వెళ్తుండడాన్ని గమనించాడు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న తిరుపతిరావు కారును వెంబడిండించి ఆపి ఎక్కడ నుంచి వస్తున్నావని తన భార్య సుష్మను ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన సుష్మ రామకృష్ణారెడ్డిని కారుతో తిరుపతిరావు ఢీకొట్టమని చెప్పడంతో అతను తన కారుతో బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో గాయపడిన తిరుపతిరావు సంగం పోలీసులకు ఇద్దరు తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వీఆర్ఓలిద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
పైసా మే పట్వారీ!
28 మార్చి 2018 : జన్నారం మండలం కలమడుగుగ్రామంలో దయాకర్ అనే వ్యక్తి చనిపోయిన తన తాతకు చెందిన 24 గుంటల భూమిని కుటుంబ సభ్యుల పేరిట విరాసత్ చేయించేందుకు ఇన్చార్జి వీఆర్ఓ మహ్మద్ ఇక్బాల్‌ను సంప్రదించాడు. రూ.6వేల లంచం ఇవ్వందే పనికాదని తేల్చిచెప్పడంతో దయాకర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రూ.4వేలు లంచం తీసుకుంటూ ఇక్బాల్ ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యాడు. గతంలో కూడా ఇక్బాల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం విశేషం. 13 ఏప్రిల్ 2016 : మందమర్రి మండలం అందుగులపేట వీఆర్ఓ బూక్యా చందు సర్వేనెంబర్ 9/1లోని ఎకరా భూమి మ్యుటేషన్ కోసం మంచిర్యాలకు చెందిన నాగేశ్వర్రావు అనే వ్యక్తి నుంచి రూ.7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ట్రాప్ అయ్యాడు. అతని ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు ఏకంగా రూ. 8లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:గ్రామాల్లో రైతులకు తలలో నాలుకలా ఉండాల్సిన పట్వారీలు ధనార్జనకు ఎగబడ్డారు. సర్కారు భూములకు కాపాడాల్సిన వీఆర్‌ఓలే డబ్బులకు ఆశపడి ప్రైవేటు వ్యక్తుల పేరిట రాసిచ్చేశారు. అందినకాడికి దండుకునే పనిలో భాగంగా డబ్బులు ఇస్తే ఏమైనా చేసేందుకు వెనుకాడని పరిస్థితి. ఇసుక అక్రమ రవాణా మొదలుకొని భూముల మ్యూటేషన్ వరకు.. సర్కారీ స్థలాల్లో పట్టాలు సృష్టించడం మొదలు.. అసైన్మెంట్ భూములను పట్టాలుగా మార్చే వరకు కొందరు వీఆర్ఓలు చేయని పనిలేదు. మంచిర్యాల జిల్లాలో భూములకు విలువ పెరిగిన నాటి నుంచి ఇక్కడ పనిచేసిన అనేకమంది వీఆర్ఓలు తమపై అధికారులనుకూడా శాసించే స్థాయిలో ఆస్తులు కూడబెట్టుకున్నారు. 2012 తరువాత భూముల పహాణీలను ఆన్‌లైన్‌లోకి మార్చే ప్రక్రియ మొదలైన తరువాత వీఆర్ఓల ఆదాయం కూడా భారీగా పెరిగింది. అక్రమార్కులకు అండగా నిలిచి, సర్కారీ భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీదకు బదలాయించడం, సర్కారీ, అసైన్డ్, సీలింగ్ భూములను పట్టా భూములుగా ఆన్‌లైన్‌లోకి ఎక్కించడం వంటి అక్రమాలతో భారీగా సంపాదించారు. నెన్నెల మండలంలోని పలు గ్రామాల్లో భూములను అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో అనర్హులకు బదలాయింపు చేసిన ఉదంతంలో మల్లేష్, తిరుపతి అనే ఇద్దరు వీఆర్ఓల పాత్ర మీద జిల్లా కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్ ఏకంగా హైకోర్టుకు నివేదిక అందజేశారు. దొరికిన వారే దొంగలు అనే తరహాలో వీరిద్దరు కనిపిస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల అండదండలు, ఉన్నతాధికారుల చలువతో అక్రమాలకు పాల్పడుతున్న వీఆర్ఓలు జిల్లాలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తగినంత మంది వీఆర్ఓలు లేక ఒక్కో పట్వారీకే రెండు మూడు రెవెన్యూ గ్రామాలను అప్పగిస్తుండడంతో వీరు సాగిస్తున్న అక్రమాలకు అంతు లేకుండా పోయింది. వెయ్యి రూపాయల నుంచి కేసును బట్టి లక్షల్లో వసూలు చేస్తున్న వీఆర్ఓలు కూడా మంచిర్యాల జిల్లాలో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీరు సంపాదించిన ఆస్తులను చూస్తే కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి. భూ బదలాయింపు నుంచి అన్నింటా.. కుటుంబ పెద్ద చనిపోతే విరాసత్ ద్వారా భూమి బదలాయింపు జరపడం అత్యంత సాధారణం. వారసుల్లో ఎలాంటి వివాదాలు లేకపోతే వీఆర్ఓ విరాసత్ చేసి తహసీల్దార్ ద్వారా ఆమోదముద్ర వేయిస్తారు. కానీ ఈ ప్రక్రియ జరిపేందుకు అనేక మంది వీఆర్ఓలు వేలల్లో లంచం వసూలు చేయడం సర్వసాధారణమైంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సాదాబైనామా, భూ ప్రక్షాళన కార్యక్రమాల్లో కూడా చేతివాటం ప్రదర్శించిన పలువురు వీఆర్ఓలకు రూ.లక్షల్లో ముట్టాయి. మంచిర్యాల జిల్లాలోని అసైన్మెంట్, సీలింగ్ భూములతోపాటు సర్కారు భూములు కూడా పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురికాగా, వాటిని తప్పుడు ధ్రువపత్రాలతో సొంతం చేసుకున్న వ్యక్తులు విరాసత్, సాదాబైనామాల ద్వారా అధికారికంగా సొంతం చేసుకునేందుకు వీఆర్‌ఓలే దిక్కయ్యారు. మంచిర్యాల, నస్పూరు, జైపూర్, మందమర్రి, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ , కోటపల్లి, భీమిని, వేమనపల్లి వంటి మండలాల్లో ఈ తరహా దోపిడీ బాహాటంగానే సాగినట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఇసుక అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తూ తహసీల్దార్లకే వాటాలు ఇచ్చే స్థాయికి కొన్ని మండలాల వీఆర్ఓలు ఎదిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సర్కారు భూముల హాంఫట్లో పట్వారీలే కీలకం జిల్లాలోని నెన్నెల, జైపూర్, మందమర్రి, మంచిర్యాల, భీమారం, చెన్నూరు, బెల్లంపల్లి తదితర మండలాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడం వెనుక ఆయా గ్రామాల్లో పనిచేసిన వీఆర్వోలే ప్రధానం. వీఆర్ఓల వద్ద ఉండే మాన్యువల్ పహాణీలో మార్పులు చేర్పులు చేయాలన్నా, తహసీల్దార్ ద్వారా ఆన్లైన్ పహాణీలోకి పేర్లు ఎక్కాలన్నా వీఆర్వోల ద్వారానే జరుగుతుంది. ఈ నేపథ్యంలో సర్కారీ భూములతోపాటు అసైన్డ్, సీలింగ్ భూములన్నీ పట్టాదారుల పేర్ల మీదికి మారడంలో వీరే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. భూముల ధరలు పెరిగిన ప్రాంతాల్లోనే ఇలాంటి అక్రమాలు చోటు చేసుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో భూ బదలాయింపుల విషయంలోనే వీఆర్ఓలు అధికశాతం చేతివాటం ప్రదర్శించిన దాఖలాలు ఉన్నాయి. మంచిర్యాలలో ఓ కంప్యూటర్ ఆపరేటర్‌తో కలిసి భూమాయ చేసిన రమేష్ అనే వీఆర్వోను కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. రమేష్ హయంలో మంచిర్యాల సర్కార్ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి దర్జాగా వెళ్లిపోయాయి. కళ్లు బైర్లు కమ్మే ఆస్తులు.. ఆదాయ వనరులు అధికంగా ఉన్న రెవెన్యూ గ్రామంలో ఒక్కసారి వీఆర్ఓగా పనిచేస్తే చాలు కోట్లు వెనుకేసుకోవచ్చు అనే వాస్తవం ఇక్కడ పనిచేసిన వారి ఆస్తులు పరిశీలిస్తే అర్థమవుతోంది. మంచిర్యాల పట్టణం పరిధిలోని రెండు రెవెన్యూ గ్రామాలలో పనిచేసిన పట్వారీల ఆస్తులను పరిశీలిస్తే కళ్లు తేలేయాల్సిందే. ఏసీబీకి చిక్కిన ఓ పట్వారీ, ఇటీవల సస్పెండ్ అయి బెల్లంపల్లిలో తిరిగి పోస్టింగ్ పొందిన మరో పట్వారీకి మంచిర్యాల పట్టణంలో రెండు, మూడంతస్తుల భవనాల ద్వారా అద్దెల రూపంలో నెలనెలా ఆదాయం సమకూరుతుంది. మంచిర్యాలలో వీఆర్ఓగా పనిచేసి కోట్లల్లో సంపాదించి ప్రస్తుతం కలెక్టరేట్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఆస్తులు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. మంచిర్యాల, హైదరాబాద్‌లలో కూడా ఆయనకు ఆస్తులున్నాయంటే వీఆర్ఓ పోస్టింగ్ చలువే. ♦ మంచిర్యాల, ముల్కల్లలో వీఆర్ఓగా పనిచేసి ఫిబ్రవరిలో రిటైర్డ్ అయిన ఓ పట్వారీ అక్రమ పట్టాల ద్వారా అడ్డగోలుగా సంపాదించాడు. వీఆర్ఓగా ఆయన రిటైర్డ్ అయ్యాక కూడా పక్క మండలంలో కాంట్రాక్టు పద్ధతిన వీఆర్వో సహాయకుడిగా పనిచేస్తుండడం గమనార్హం. ♦ నస్పూరులో పనిచేసి పదవీ విరమణ పొందిన మరో పట్వారీ మంచిర్యాల పట్టణంలోనే రూ.2కోట్ల విలువైన భవనాన్ని నిర్మించుకున్నాడు. నస్పూరులోనే వీఆర్ఓగా పనిచేసి ప్రస్తుతం గిర్దావరిగా పదోన్నతి పొందిన మరో ఉద్యోగి నస్పూరులోని 48, 21, 21, 23 సర్వే నెంబర్లలో జరిపిన అక్రమాలతో కోట్లకు పడగలెత్తాడు. ♦ 324 సర్వే నెంబర్ వివాదంలో సస్పెండ్ అయి బెల్లంపల్లి మండలంలో పనిచేస్తున్న వీఆర్ఓకు బినామీ ఆస్తులే రూ.5కోట్ల వరకు ఉన్నట్లు మంచిర్యాలలో రెవెన్యూ వర్గాల సమాచారం. ♦ మందమర్రి, కోటపల్లి మండలాల్లో ఇద్దరు మహిళా వీఆర్ఓలు కూడా ధనార్జనలో కొత్త రికార్డులు సృష్టించారు. మందమర్రి మండలంలో పనిచేసి, ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్‌గా ఓ ప్రాజెక్టులో పనిచేస్తున్న మహిళా వీఆర్ఓ ఏకంగా రెండు పెట్రోల్ బంకులనే బినామీ పేర్లతో నడిపిస్తున్నట్లు సమాచారం. మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ బిల్డర్‌కు బినామీగా ఆస్తులు కూడబెట్టారు. ఇక కోటపల్లి మండలంలో పనిచేస్తున్న మహిళా వీఆర్వో సర్వే నెంబర్ 172లో సుమారు 20 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్న ఓ వీఆర్ఓ భార్యనే ఈమె. ♦ జైపూర్ మండలంలో వీఆర్ఓగా పనిచేస్తున్న మరో పట్వారీకి ఇసుక రీచ్‌లకు చెందిన ఫైళ్లు అంటేనే ఇష్టం. ఆయన ఇసుక దందాలు సాగే ప్రాంతాల్లోనే పనిచేసేందుకు ఇష్ట పడుతాడు. సదరు ఉద్యోగి కరీంనగర్ నడిబొడ్డున ఓ లాడ్జింగ్ నిర్వహిస్తుండడం గమనార్హం. ♦ భీమారంలో ఓ మహిళా వీఆర్ఓ పట్టాల మ్యుటేషన్లో అవినీతికి పెట్టింది పేరు. అలాగే ఇందారంలో శంకర్‌నాయక్ అనే వీఆర్ఓ ఏసీపీకి ట్రాప్ అయ్యాడు. నస్పూరులో 37, 38 సర్వే నెంబర్లలో అక్రమంగా పట్టాలిప్పిచ్చిన ఓ వీఆర్ఏ వీఆర్ఓగా ప్రమోషన్ పొందాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వీఆర్ఓల అక్రమాలకు మంచిర్యాల జిల్లాలో అంతే లేదు. -
త్వరలో వీఆర్వోల బదిలీలు..?
హన్మకొండ అర్బన్: జిల్లాలో వీఆర్వోల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఓ వైపు వరంగల్ అర్బన్ జిల్లా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో రాష్ట్రంలో ముందు వరుసలో ఉండి అవార్డు కోసం పోటీపడుతుంటే.. మరోవైపు అవినీతి, అక్రమాల విషయంలో వీఆర్వోలపై కుప్పలు తెప్పలుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఏం చేయాలో ఉన్నతాధికారులకు దిక్కు తోచడం లేదు. చిన్నాచితకా ఘటనలు వదిలేసినా.. ప్రస్తుతం భారీ భూకుంభకోణంగా వెలుగు చూసిన ఎల్కతుర్తి అక్రమాల ఘటనతో జిల్లా అధికారులు క్రమశిక్షణ చర్యల విషయంలో కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలో జిల్లాలోన ?వీఆర్వోలను మూకుమ్మడిగా బదిలీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రెవెన్యూ వర్గాల్లో ఇప్పటికే చర్చ ప్రారంభమైంది. వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. జిల్లాలోనే బదిలీలు.. ప్రస్తుతం అర్బన్ జిల్లాలో మొత్తం 126 వీఆర్వో పోస్టులు ఉండగా.. 96 మంది పనిచేస్తున్నారు. అయితే ఉన్నవారిలో మూడోంతుల మందిపై లిఖిత పూర్వక ఫిర్యాదులు, విచారణ నివేదికలు ఉన్నతాధికారుల వద్ద సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఒకరిద్దరిపై వేటు వేసేకన్నా పెద్ద మొత్తంలో వీఆర్వోలను బదిలీ చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉన్నవారిలో కనీసం 50 మందికి తగ్గకుండా స్థానచలనం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ల పైనా..? రికార్డుల ప్రక్షాళన విషయంలో జరిగిన అక్రమాలు, అందుతున్న ఫిర్యాదులు కేవలం వీఆర్వోలపైనే కాకుండా కొన్నిచోట్ల తహసీల్దార్ల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తహసీల్దార్ల వద్ద ఉండాల్సిన డిజిటల్ కీ విషయంలో ఉద్దేశ పూర్వకంగా కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం చేసినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎల్కతుర్తి తహసీల్దార్‌పై చర్యలకు ఆదేశించగా.. మిగతా వారి విషయంలో ఏం చేస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే తహసీల్దార్ల ప్రమేయం లేకుండా వీఆర్వోలు మాత్రమే అక్రమాలకు పాల్పడుతున్నారనడాన్ని వారు తప్పుపడుతున్నారు. అధికారుల ప్రమేయం లేకుండా వీఆర్వో ఒక్కరే ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఉన్నతాధికారులు ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం రెవెన్యూ వర్గాల్లో ఆసక్తిరంగా మారింది. -
ఏసీబీ వలలో వీఆర్వో
కశింకోట(అనకాపల్లి):అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో కన్నూరుపాలెం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) చిక్కాడు. పట్టాదారు పాసు పుస్తకం మంజూరు కోసం గురువారం రూ.9 వేలు లంచం తీసుకుని దొరికి పోయాడు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రామకృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఈ.చౌడువాడ (కన్నూరుపాలెం), సుందరయ్యపేట గ్రామ పంచాయతీలకు జి.రామఅప్పారావు వీఆర్వోగా పని చేస్తున్నాడు. కన్నూరుపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ప్రసాద్ వర్మ, మరో ఇద్దరు కలిసి అక్కడ ఎకరం 40 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. దానికి ఈ–పాసు పుస్తకం, టైటిల్ డీడ్ కోసం మీ–సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసి, వీఆర్వో రామఅప్పారావును సంప్రదించారు. పాస్ పుస్తకం మంజూరు చేయాలంటే రూ.పది వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.లంచం ఇవ్వలేదని చాలా రోజులుగా తిప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రూ.9 వేలు ఇవ్వడానికి శ్రీనివాస్ప్రసాద్వర్మ అంగీకారం కుదుర్చుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులను ఈ నెల 20న ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఇచ్చిన రూ.9 వేలను వీఆర్వోకు గురువారం వర్మ అందజేశారు. అనంతరం ఏసీబీ అధికారులకు ఆ సమాచారం అందజేశారు. దీంతో ఏసీబీ అధికారులు వీఆర్వోకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్వో కోసం వాకబు చేశారు. ఇక్కడ లేరని బదులివ్వడంతో తహసీల్దార్ కార్యాలయ డఫెదార్ నాగేశ్వరరావు సెల్ ద్వారా వీఆర్వోకు ఫోన్ చేశారు. దీంతో ఎక్కడ ఉన్నది సమాచారం ఇవ్వడంతో బయ్యవరం హెరిటేజ్ పార్లర్ సమీపంలో ఉన్న వీఆర్వోను పట్టుకున్నారు. అతని పరసలో ఉన్న రూ.9 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. వీఆర్వోను అరెస్టు చేశామని, ఉన్నతాధికారుల నుంచి ప్రొసిడింగ్స్ వచ్చాక శుక్రవారం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ఈ దాడిలో సీఐలు గణేష్,ప్రసాద్, రమణమూర్తి, గపూర్,మహేశ్వరరావు పాల్గొన్నారు. ఏసీబీ వలకు వీఆర్వో చిక్కడంతో రెవెన్యూ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. -
రెవెన్యూలో అవినీతి లీలలు
సాక్షి, విశాఖపట్నం: రెవెన్యూశాఖ పరువు రోజురోజుకు అథఃపాతాళానికి దిగజారిపోతోంది. ఈ శాఖలో ఆర్డీవోలు.. తహసీల్దార్లు.. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లే కాదు.. చివరకు అట్టడుగునున్న వీఆర్వో, వీఆర్ఏలు సైతం వందల కోట్లకు పడగలెత్తడం విస్మయానికి గురిచేస్తోంది. రెవెన్యూ అధికారులకు ఆర్థిక రాజధాని విశాఖ కల్పతరువుగా తయారైంది. ఓ పక్క రికార్డుల ట్యాంపరింగ్, మరో వైపు భూకబ్జాల్లో అక్రమార్కులకు సహకరిస్తూ సర్వేయర్ల నుంచి ఆర్డీవో స్థాయి వరకు కోట్లకు పడగలెత్తారు. వీరికి తామేం తీసిపోలేదన్నట్టుగా పలువురి వీఆర్వోలు అందినకాడికి చక్కబెట్టుకుంటున్నారు. ఆదాయనికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై ఏసీబీకి చిక్కిన వీఆర్వోల్లో ఒకరైన సంజీవ్‌కుమార్ ఆస్తులు తవ్వే కొద్ది వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈయన ఆస్తులు వంద కోట్లు దాటేయడం ఆశ్చర్యమేస్తోంది. మరో వీఆర్వో వెంకటేశ్వరరావుతో పాటు జీవీఎంసీ చైన్‌మెన్ నాగేశ్వరరావు ఆస్తులు రూ.25 కోట్లకుపైగా వెలుగుచూశాయి. చక్రం తిప్పేది వీఆర్వోలే గ్రామాల్లోనే కాదు.. సిటీలో కూడా రెవెన్యూ శాఖలో చక్రం తిప్పేది వీఆర్వోలే. తహసీల్దార్లు, డీటీలు సైతం వీఆర్వోలను కాదని ఏ పనిచేయని పరిస్థితి నెలకొంది. ఏళ్లతరబడి పాతుకుపోయిన వీరిని ఎన్నిసార్లు బదిలీ చేసినా రాజకీయ ఒత్తిళ్లతో లక్షలు కుమ్మరించి తాము కోరుకున్న చోట పోస్టింగ్‌ను క్షణాల్లో పొందుతున్నారు. గతంలో పలుమార్లు వీర్ని బదిలీ చేసేందుకు యత్నించిన జేసీలపై కూడా ఒత్తిళ్లు బలంగా పనిచేయడం కన్పించింది. ప్రస్తుతం ఏసీబీకి చిక్కిన వెంకటేశ్వరరావును కశింకోటకు, సంజీవరావును చోడవరం బదిలీ చేస్తే అనతి కాలంలోనే వీరు మళ్లీ నగరానికి వచ్చేశారు. పేర్లు మార్చేసి దాచుకోవడమే.. గ్రామీణ ప్రాంతాల్లో వెబ్‌ల్యాండ్‌లో మాయాజాలం చేసేదంతా వీరే. ఒకరి సర్వే నెంబర్లు.. మరొకరి పేరిట.. ఒకరి పేరిట ఉన్న భూములు మరొకరి పేరిట మార్చేయడం.. ఆనక బల్లకింద చేతులు చాచడం.. అందినకాడకి దండుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. గతంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నుంచి మ్యుటేషన్ వరకు ప్రతి చోట వేలు..లక్షలు చూడనిదే సంతకాలు కూడా పెట్టని వారెందరో ఉన్నారు. ఆక్రమణల క్రమబద్ధీకరణతో కాసుల వర్షం ఇక సిటీతో పాటు పరిసర మండలాల్లో పనిచేసే వీఆర్వోల అక్రమాలైతే ఊçహలకు సైతం అందని పరిస్థితి నెలకొంది. రికార్డులు ట్యాంపరింగ్ చేయడమే కాదు, భూ కబ్జా రాయుళ్లకు అండదండలందించడంలో కూడా వీరిది అంది వేసిన చేయి. గత రెండేళ్లుగా ఆక్రమణల క్రమబద్ధీకరణ కూడా వీరికి కాసుల వర్షం కురిపించింది. కొండవాలు ప్రాంతాలు.. అభ్యంతరకర ఆక్రమణలు, గెడ్డలు, వాగు పోరంబోకు భూముల్లో ఆక్రమణలను సైతం క్రమబద్ధీకరించేందుకు చక్రం తిప్పడంలో వీరే కీలక సూత్రధారులు. తొలి విడతలో క్రమబద్ధీకరించిన వాటిలో మూడోవంతు అభ్యంతరకర, వివాదస్పద భూములలోని ఆక్రమణలే ఎక్కువ. వీటికి అడ్డుచెప్పారన్న అక్కసుతోనే అప్పట్లో జేసీ జే.నివాస్‌పై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. కానీ క్షేత్ర స్థాయిలో తహసీల్దార్లు, వీఆర్వోలు టీడీపీనేతల అడుగులకు మడుగులొత్తుతూ వారి చెప్పిన వారికల్లా పట్టాలు రాసిచ్చేశారు. చివరకు స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులకు కేటాయించిన భూములను కూడా కబ్జా చేసి క్రమబద్ధీకరణ పట్టాలు పొందారంటే ఏ స్థాయిలో వీఆర్వోలు చక్రం తిప్పారో అర్ధం చేసుకోవచ్చు ఒక్క సంజీవరావే కాదు.. ఇలా ఎంతో మంది కోట్లకు పడగలెత్తుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఒత్తిళ్లకు తొలొగ్గి వీరిపై చర్యలకు తీసుకునేందుకు సాహసించలేకపోతున్నారు. సిబ్బంది కొరత జిల్లాలో 925 పంచాయతీలుండగా.. వాటి పరిధిలో 3200 రెవెన్యూ గ్రామాలున్నాయి. సిటీ పరిధిని 14 క్లస్టర్స్, గ్రామీణ జిల్లాను 734 క్లస్టర్స్‌గా విభజించారు. ఆ మేరకు 748 మంది వీఆర్వోలు ఉండాల్సి ఉంది కానీ. జిల్లాలో పనిచేస్తున్నది కేవలం 637 మంది మాత్రమే. గ్రామీణ జిల్లాలోనే 120 పోస్టులు ఖాళీగా ఉండగా.. సిటీ పరిధిలో ఒక వీఆర్వో పోస్టు ఖాళీగా ఉంది. మూడో వంతు వీఆర్వోలు రెండు క్లస్టర్స్‌కు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తుండడంతో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారు. ప్రక్షాళనకు చర్యలు చేపట్టాం రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు చేపట్టా. తహసీల్దార్లను బదిలీ చేశాం. అదే స్థాయిలో వీఆర్వోలు, వీఆర్ఏలను కూడా పెద్ద ఎత్తున బదిలీలు చేయాల్సి ఉంది. ప్రతి మండలంలోనూ మెజార్టీ వీఆర్వోలు అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక నుంచి నేనే స్వయంగా వీరి పనితీరును సమీక్షిస్తా. ప్రతి మండలానికి వెళ్తా. ఆరోపణలు రుజువైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడను. ఆర్డీవోలు, తహసీల్దార్లను కూడా తనిఖీలు చేయమని ఆదేశిస్తా. వీఆర్వోలను మోనటరింగ్ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడతా. క్రమబద్ధీకరణ పట్టాల జారీలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందించా. అభ్యంతరక భూముల్లో క్రమబద్ధీకరణ జరగకుండా బ్లాక్ చేసేలా చూస్తాం. ఎక్కడైనా అనర్హులకు పట్టా ఇచ్చినట్టుగా తెలిస్తే వెంటనే రద్దు చేయడంతోపాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటాం. – జి.సృజన, జాయింట్ కలెక్టర్ -
విశాఖలో ఏసీబీ అధికారుల విస్తృత దాడులు
-
విశాఖలో అవినీతి చేపలు ; ఏసీబీ వల
సాక్షి, విశాఖపట్నం : అవినీతికి పాల్పడుతూ, అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను ఏసీబీ షాకించ్చింది. విశాఖపట్నం జిల్లా మదనపల్లె వీఆర్వో వెంకటేశ్వరరావు, మద్దెలపాలెం వీఆర్వో ఏవో వెంకటేశ్వరరావు, మాల్కాపురం సంజీవ్ కుమార్, జీవీఎంసీ 3వ జోన్ చైన్మన్ నాగేశ్వరరావుల ఇళ్లల్లో శుక్రవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఆదాయానికి మించి ఆస్తులు పోగేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
పెట్రోలు పోసి యువకుని దారుణ హత్య
కొత్త తుంగపాడు (రాజానగరం): కొత్త తుంగపాడు శివారు జి.ఎర్రంపాలెం వెళ్లే దారిలో సగం పైగా కాలి పడి ఉన్న ఒక వ్యక్తి మృతదేహం ఆయా గ్రామాల్లో గురువారం సంచలనం కలిగించింది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కట్టెలతో కాల్చి, ఆనవాలు లేకుండా చేయాలని, ఈ ఘాతుకానికి పాల్పడిన వారు ప్రయత్నించి ఉండ వచ్చునని, మృతుని శరీరంలో తల, ఒక చేయి పూర్తిగా కాలకుండా మిగిలిపోయాయని, కట్టెలు, పెట్రోలు పోసి, తగులబెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం అటుగా వెళ్లిన పై రెండు గ్రామాలవారు చూసినా గాని, పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు భయపడ్డారు. చివరికి విషయం తెలుసుకున్న వీఆర్వో హరి మోహన్ గురువారం రాజానగరం పోలీసులకు మృతిపై ఫిర్యాదు చేశారు. మృతుడు చైతన్యనగర్వాసి సంఘటనా స్థలాన్ని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి, డీఎస్పీ నాగరాజు, ప్రకాష్‌నగర్ సీఐ భాస్కరరావు, రాజానగరం ఎస్సై జగన్మోహన్లు సందర్శించి మృతుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కడియం మండలం మాధవరాయుడుపాలెం శివారు చైతన్యనగర్‌కు చెందిన చందక ప్రవీణ్ కుమార్ (20) మూడు రోజులుగా కనిపించడం లేదని తెలుసుకున్నారు. ఇటీవల అతడు దంతాలకు క్లిప్పింగ్ చేయించాడు. మృతదేహం పండ్లకు కూడా క్లిప్పింగ్ ఉండడంతో ఇది ప్రవీణ్ మృతదేహమేనని నిర్థారించారు. ఇదే విషయాన్ని పోస్టు మార్టం అనంతరం ప్రవీణ్ తల్లి రాజమ్మ, అక్క సిరియాల పద్మ, పెదనాన్నలు లక్ష్మీనారాయణ, అప్పారావు గుర్తించినట్టు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. వివాహేతర సంబంధమే కారణమా? బీ ఫార్మశీ చదివిన ప్రవీణ్ రాజమహేంద్రవరంలోనే పనిచేస్తున్నారు. అక్కడ పని చేస్తున్న యువతితో అతను చనువుగా ఉండటం ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారంలో, అది నచ్చని సహోద్యోగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు భావిస్తున్నారు. కాగా ఘటన స్థలాన్ని వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గిరజాల వీర్రాజు సందర్శించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఏసీబీ వలలో వీఆర్ఓ
వల్లూరు : ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ వల్లూరు మండలంలోని వీఆర్ఓ గంగమ్మ మంగళవారం ఏసీబీకి పట్టుబడింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ నాగరాజు విలేకరుల సమావేశంలో ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా వారు గుంటూరు జిల్లా చిలకలూరి పేట నుంచి కడప వరకు 765 కేవీ నూతన విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేయడానికి సర్వే చేస్తున్నారు. ఈ విద్యుత్ లైను వల్లూరు మండలంలోని గ్రామాల మీదుగా వెళ్లనుంది. దీంతో విద్యుత్ లైన్లు వెళ్లే మార్గంలోని భూములు, రైతుల వివరాలను, అందులో ఉన్న పంట, ఇతర నిర్మాణాలపై విచారణ చేసి పూర్తి స్థాయిలో నివేదిక పంపాలని కోరుతూ పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా వారు రెవెన్యూ కార్యాలయానికి నోటీసులు అందించారు. ఈ లైను వల్లూరు గ్రామానికి చెందిన పి. మల్లికార్జునరెడ్డికి సంబంధించిన పొలం మీదుగా పోతోంది. దీంతో ఆయన వీఆర్ఓ గంగమ్మను కలిసి విచారణ చేసి వివరాలను అందించాలని కోరారు. దీనికి ఆమె రూ.5 వేలు ఇస్తేనే పని చేస్తానని తెలిపింది. పలు దఫాలు మల్లికార్జున రెడ్డి ఆమెను కలిసినప్పటికీ ఇదే విధమైన సమాధానం ఇచ్చింది. దీంతో మల్లికార్జునరెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓ గంగమ్మ రైతు మల్లికార్జునరెడ్డి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఆకస్మికంగా దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన ఈమెను కర్నూలులోని ఏసీబీ కోర్జుకు హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు సుధాకర్‌రెడ్డి, రామచంద్ర పాల్గొన్నారు. -
ఏసీబీకి పట్టుబడిన వీఆర్ఓ
విజయనగరం టౌన్: లంచం తీసుకుంటూ ఓ మహిళా వీఆర్వో తాను పనిచేస్తున్న తహసీల్దార్ కార్యాలయంలోనే అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. దీనికి సంబం ధించి ఏసీబీ డీఎస్పీ షకీలాభాను అందించిన వివరాలిలా ఉన్నాయి. షేక్ షలీమా విజయనగరం మండలం కోరుకొండపాలెం వీఆర్ఓగా పనిచేస్తూనే రాకోడు, పినవేమలి క్లస్టర్లకు ఇన్చార్జిగా వ్యవహరిస్తోంది. రాకోడు ప్రాంతానికి చెందిన దరిమిరెడ్డి శ్రీను తన తండ్రి సన్నిబాబుకి చెందిన నాలుగున్నర ఎకరాల పొలాన్ని ఆన్లైన్ చేసి పాస్‌బుక్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పత్రాలను పరిశీలించిన వీఆర్వో ఆన్లైన్ చేయడంతో పాటు పాస్‌బుక్ ఇవ్వడానికి మొదట రూ.50 వేలు డిమాండ్ చేసింది. చివరకు రూ.20 వేలు ఇస్తేనే పనవుతుందని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తన దగ్గర అంత నగదు లేదని, భూమి వివరాలను ముందు ఆన్లైన్ చేయండి ఈ లోగా డబ్బు సర్దుబాటు చేస్తానని బాధితుడు చెప్పినా వీఆర్ఓ వినిపించుకోలేదు. డబ్బులిస్తేనే పని జరుగుతుందని కరాఖండిగా చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బాధితుడు రూ. 20 వేల నగదును వీఆర్ఓకు అందజేశాడు. అప్పటికే అక్కడ కాపుకాచిన ఏసీబీ సిబ్బంది ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి , ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ డిఎస్పీ షకీలాభాను తెలిపారు. రెండో కేసు కూడా వీఆర్‌ఓనే.. ఈ మధ్య కాలంలో వీఆర్ఓలు వరుసుగా ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఈ ఏడాదిలో రెండో కేసు కూడా వీఆర్ఓ కావడం విశేషం. 2018 జనవరి 9న వేపాడ వీఆర్వో జగన్నాథం రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడ్డాడు. తాజాగా కోరుకొండపాలెం వీఆర్వో షేక్షలీమా రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడింది. 2017లో డెంకాడ మండలం మోపాడ గ్రామానికి చెందిన వీఆర్వో అలజంగి ఉషారాణి రూ.35 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడింది. -
ఏసీబీ ఉచ్చులో వీఆర్వో
దాచేపల్లి: పాసు పుస్తకాల కోసం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను దాచేపల్లిలో ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. గామాలపాడు వీఆర్వోగా పనిచేస్తున్న కొత్తపల్లి బెంజిమెన్ యిరికేపల్లికి చెందిన ఆవుల శ్రీనివాసరావు దగ్గర రూ.4వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ సీహెచ్. దేవానంద్ శాంతో, సీఐలు వెంకటేశ్వరరావు, ఫిరోజ్‌లు పట్టుకున్నారు. డీఎస్పీ కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యిరికేపల్లికి చెందిన ఆవుల శ్రీనివాసరావు తండ్రి మల్లయ్య, భార్య ప్రియాంకల పేరుమీద గామాలపాడు శివారులో ఉన్న 1.70ఎకరాల పొలానికి పాసు పుస్తకాల కోసం వీఆర్వోను ఆశ్రయించారు. గతేడాది ఆక్టోబర్‌లో మీసేవలో ఆయన దరఖాస్తు చేసుకోగా డిసెంబర్లో వీరి పేరుమీద పుస్తకాలు వచ్చాయి. వాటిని ఇవ్వాలంటే ఒక్కోదానికి రూ.3వేల చొప్పున ఇవ్వాలని శ్రీనివాసరావును వీఆర్వో డిమాండ్ చేశాడు. ఒక్కోదానికి రూ.2వేల చొప్పున ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో వీఆర్వో కు లంచం ఇవ్వడం ఇష్టంలేని శ్రీనివాసరావు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. బెంజిమెన్ ఉంటున్న ఇంట్లో శ్రీనివాసరావు నుంచి రూ. 4వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి ఏసీబీ అధికారులు సేకరించారు. తహసీల్దార్ డి. మల్లికార్జునరావు సంఘటన స్థలానికి వచ్చారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ దేవానాంద్ తెలిపారు. -
వీఆర్వోకి రెండేళ్ల జైలుశిక్ష!
సాక్షి, విజయవాడ : విజయవాడ ఏసీబీ కోర్టు తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం మండపం వీఆర్వో వెంకటరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతొ పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. వెంకటరెడ్డి 2015లో రూ.2500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వెంకటరెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా 2015లో రూ.2500 లంచం తీసుకోవడం నిజమేనని కోర్టు నిర్థారించింది. దీంతో వెంకటరెడ్డికి శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. -
బరి తెగించిన ఇసుక అక్రమ వ్యాపారులు
మరికల్ (నారాయణపేట): మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం పూసల్‌పహాడ్ సమీప కోయిల్‌సాగర్ వాగు వద్ద ఇసుక అక్రమ వ్యాపారులు బుధవారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న పాపానికి వీఆర్వో మైబన్నపై దాడికి దిగారు. పూసల్‌పహాడ్‌కు చెందిన కొందరు అక్రమ ఇసుక వ్యాపారులు బుధవారం రాత్రి కోయిల్‌సాగర్ వాగులో నుంచి ఇసుక తరలిస్తున్నారు. గుర్తించిన గ్రామ సేవకులు వీఆర్వో మైబన్నకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వచ్చి.. గ్రామ సేవకుల సహాయంతో ట్రాక్టర్లను సీజ్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆయనపై దాడికి దిగుతూ పక్కకు నెట్టేశారు. వెంటనే ట్రాక్టర్లో ఉన్న ఇసుకను అన్లోడ్ చేస్తూ పరారయ్యారు. ఈ సమయంలో తమ ట్రాక్టర్ల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించినట్లు వీఆర్వో, గ్రామసేవకులు తెలిపారు. -
లంచం తీసుకున్న ఇద్దరికి కఠిన శిక్ష
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): పట్టా భూమి పేరు మార్పునకు లంచం డిమాండ్ చేసిన వీఆర్వోకు ఏడాది, ఆయన అసిస్టెంట్‌కు ఆర్నెళ్లపాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం ఏసీబీ కోర్టు కరీంనగర్ ప్రత్యేక న్యాయమూర్తి భాస్కర్‌రావు తీర్పు చెప్పారు. బీర్కూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన వెన్నం వెంకట్రామయ్య 1970లో మిర్జాపూర్ శివారులో 5.20 గుంటల భూమిని సబ్బిడి భూమయ్య, సబ్బిడి విఠల్ల నుంచి కొన్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు. ఈయన మరణాంతరం 5.20 గుంటల వ్యవసాయ భూమిని అన్నలిద్దరు తమతమ పేర్లమీదకు మార్చుకోగా చిన్నవాడైన వెన్నం రామకృష్ణ తన భాగం భూమిని తన పేరుమీదకు మార్చేందుకు 28 జనవరి 2009న మిర్జాపూర్ వీఆర్వో కొమ్ము మురళికి దరఖాస్తు చేశాడు. అందుకు వీఆర్వో తనకు రూ.2100లు లంచం ఇస్తేనే విచారించి తహసీల్దార్‌కు నివేదిక ఇచ్చి పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ ఇప్పిస్తానని, లేదంటే కుదరదని చెప్పాడు. అనంతరం వీఆర్వో కొద్దిరోజుల తర్వాత పాస్‌బుక్ టైటిల్ డీడ్లు సిద్ధంగా ఉన్నాయని, 26 ఫిబ్రవరి 2009న లంచం డబ్బులు తనను ఇంట్లో కలిసి ఇచ్చి వాటిని తీసుకెళ్లాలని చెప్పాడు. దాంతో రామకృష్ణ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అదే రోజు ఏసీబీ అధికారులను కలిసి వీఆర్వోపై ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడు రామకృష్ణ వీఆర్వోకు లంచం డబ్బులు ఇవ్వగా ఆయన ఆ డబ్బులను తన అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఇచ్చి దగ్గర పెట్టుకోవాలని చెప్పాడు. శ్రీనివాస్ డబ్బులు లెక్క పెడుతుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు వారిని రెడ్హాండ్గా పట్టుకున్నారు. ఈ కేసులో బుధవారం ఏసీబీ తరపున ప్రత్యేక పీపీ లక్ష్మీప్రసాద్ వాదనలు వినిపించారు. ఇరువార్గల వాదనలు విన్న న్యాయమూర్తి భాస్కర్‌రావు వీఆర్వో మురళీకి ఏడాది, రూ.5వేలు, అతడి అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఆర్నెళ్ల శిక్ష, రూ. 2500లు జరిమానాలు విధిస్తూ తీర్పు చెప్పారు. -
రూ.18 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఓ రైతు వద్ద రూ.18 వేలు లంచం తీసుకుంటూ తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వీఆర్వో ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డబ్బులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. జిల్లెల్లకు చెందిన కిరణ్ అనే రైతు సాదా బైనామాతో భూమిని ముటేషన్ చేసేందుకు వీఆర్ఓను ఆశ్రయించాడు. పని చేసేందుకు వీఆర్ఓ రూ.18 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా..పథకం ప్రకారం లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డు తొలగించుకున్నారు!
సాక్షి, శెట్టూరు (కళ్యాణదుర్గం): యువకుడి హత్య గుట్టు రట్టయ్యింది. మిస్సింగ్ కేసు నమోదుతో విచారణ చేపట్టిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. ఏడాది కిందట లేపాక్షి సమీపంలో జరిగిన హత్య కేసు వివరాలను కళ్యాణదుర్గం డీఎస్పీ టీఎస్ వెంకటరమణ, సీఐ శివప్రసాద్, పట్టణ ఎస్ఐ శంకర్‌రెడ్డిలు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. నిందితులైన భార్య, ఆమె ప్రియుడుతోపాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. భర్త అడ్డు తొలగించుకున్నదిలా.. తమ వివాహేతర సంబంధం సాఫీగా సాగిపోవాలంటే నందిని భర్త మంజునాథ్‌ను అడ్డు తొలగించుకోవాలని బొల్లు విశ్వేశ్వరరెడ్డి కుట్రపన్నాడు. ఇందు కోసం యలగలవంక గ్రామానికి చెందిన స్నేహితుడు మాదిగ హనుమంతరాయుడుతో కలిసి 2017 జనవరి మూడో తేదీన మంజునాథ్‌కు హిందూపురంలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తమ బైకులో ఎక్కించుకెళ్లారు. మంజునాథ్‌కు మార్గం మధ్యలో మద్యం తాపించారు. లేపాక్షి దాటిన తర్వాత కనుమగుడి దగ్గర ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మరోమారు మద్యం పూటుగా తాపారు. మత్తులో ఉన్న మంజునాథ్ కాళ్లను హనుమంతరాయుడు కాళ్లు గట్టిగా పట్టుకోగా.. విశ్వేశ్వరరెడ్డి అతని గొంతు కోసి చంపేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని కిరోసిన్ పోసి నిప్పంటించారు. కాలిన అనంతరం శవాన్ని అక్కడే ఓ గుంతలో పూడ్చి వచ్చేశారు. వెలుగు చూసిన హత్య కేసు బోయ దాసరి మంజునాథ్ కనిపించడం లేదంటూ తమ్ముడు దాసరి అనిల్ ఈ నెల ఆరో తేదిన కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న ఎస్ఐ శంకర్‌రెడ్డి.. మంజునాథ్ భార్య నందినిని పలు కోణాల్లో విచారించారు. భర్త కొన్ని నెలలుగా కనిపించపోయినా తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఆమె స్వగ్రామం సింగేపల్లికి వెళ్లడంపై పోలీసులకు అనుమానం కలిగింది. లోతుగా దర్యాప్తు చేయడంతో యలగలవంక గ్రామానికి చెందిన విశ్వేశ్వరరెడ్డితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. వీఆర్వో ఎదుట లొంగిపోయిన నిందితులు పోలీసుల విచారణతో హత్య విషయం తెలుస్తుందని భయపడిన నిందితులు ఇటీవల ఇళ్ల నుంచి పారిపోయారు. ఎట్టకేలకు గురువారం ఉదయం నందిని, విశ్వేశ్వరరెడ్డి, హనుమంతరెడ్డిలు మానిరేవు వీఆర్వో ఇంటి వద్ద లొంగిపోయారు. నిందితులు వాడిన కత్తి, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సంఘటన స్థలంలో లభ్యమైన హతుడి పుర్రెను డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య నేపథ్యం.. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన బోయ దాసరి మంజునాథ్(32)కు బొమ్మనహళ్ మండలం సింగేపల్లికి చెందిన దాసరి నందినితో వివాహమైంది. వీరిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కూలి పనులకెళ్లే సమయంలో బెళుగుప్ప మండలం యలగలవంక గ్రామానికి చెందిన బొల్లు విశ్వేశ్వరరెడ్డితో నందినికి ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. -
ఇచ్చింది చాలదు.. ఇంకా పట్రా
సాక్షి, బలిజిపేట: ఆన్లైన్ చేసేందుకు వీఆర్వోకి రూ.వెయ్యి ఇచ్చా. అయినా ఆన్లైన్ చేయలేదు. నిలదీస్తే ఇచ్చిన లంచం చాలదు. ఇంకా ఇస్తే ఆన్లైన్ చేస్తాను అంటూ తిప్పుతున్నాడు.. అంటూ మురగడాం గ్రామానికి చెందిన గొట్టాపు నరసమ్మ వాపోయింది. ఆమె బుధవారం విలేకరులకు అందించిన వివరాల ప్రకారం.. మురగడాం గ్రామానికి చెందిన గొట్టాపు నరసమ్మకు తండ్రి అక్కేన శివుడునాయుడి మరణానంతరం భూమి సర్వే నంబర్ 122–సబ్ డివిజన్ 2లోని 1.05 ఎకరాల భూమిని ఫోతీకేసు కింద ఆమె పేరున మార్చారు. భూమిని ఆన్లైన్ చేసేందుకు 5నెలల క్రితం వీఆర్వో సాంబమూర్తికి రూ.వెయ్యి చెల్లించారు. అప్పటినుంచి తిప్పుతున్న వీఆర్వో ఇచ్చిన డబ్బులు చాలవని.. మరికొంత ఇస్తే చేయిస్తానంటున్నాడు. దిక్కుమొక్కు లేని తన భూమిని తన పేరున వన్‌బీకి జారీ చేసేందుకు ఇన్ని ఇబ్బందులు పెడితే అధికారుల చుట్టూ ఎలా తిరుగుతానని నరసమ్మ కన్నీరుమున్నీరైంది. భూముల్ని ఆన్లైన్ చేయడంలో ఎకరాకు రూ.వెయ్యి వంతున బలిజిపేట రెవెన్యూ సిబ్బంది వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెదపెంకి జన్మభూమి గ్రామ సభలో దత్తి మురళి అనే రైతు డబ్బులు ఇస్తే తప్ప ఆన్లైన్ కావడం లేదని ఆరోపించడం తెలిసిందే. ఆన్‌లైన్‌కు డబ్బులు ఇస్తే తప్ప చేయటం లేదని అజ్జాడ గ్రామ సభలో ఆరోపించారు. డబ్బులిస్తేనే ఆన్లైన్ నా తల్లి సన్యాసమ్మ పేరున ఉన్న భూమిని ఆన్లైన్ చేసేందుకు అజ్జాడ వీఆర్వో డబ్బులు ఇమ్మన్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఆన్లైన్ చేయరా? అని అడిగాను. డబ్బులిస్తేనే చేస్తానంటున్నారు. – ప్రదీప్, అజ్జాడ ఫిర్యాదు చేస్తే చర్య నా దృష్టికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. సంబంధిత వీఆర్వోపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాను. డబ్బు ఎవరు తీసుకున్నారో తెలిస్తే చర్యలుంటాయి. –బీవీ లక్ష్మి, తహసీల్దార్, బలిజిపేట -
డిగ్రీ చదివితేనే సీనియర్ అసిస్టెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)గా పనిచేస్తున్న వారికి పదోన్నతులలో విద్యార్హత కీలకం కానుంది. వీఆర్వోలకు గతంలో జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చే ప్రక్రియ ఉండగా, ఇప్పుడు వీఆర్వో నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇది డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి మాత్రమే వర్తిస్తుందని గురువారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డిగ్రీ నిబంధనలో కొంత మినహాయింపునిచ్చారు. 2014 మే 12 నాటికి వీఆర్వోలుగా నియమితులై ఉంటే వారి కి ఇంటర్ ఉత్తీర్ణతతోనే సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులివ్వాలని, ఆ తర్వాత నియామకమైన వారికి డిగ్రీ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. -
భూ రికార్డుల ప్రక్షాళనలో ‘తిరగరాత’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కొత్త మలుపు తిరిగింది. కంప్యూటర్లో అందుబాటులో ఉన్న రికార్డులను చూసి చేతితో పహాణీలు రాయించి సిబ్బంది సంతకాలు తీసుకోవాలని, సరిచేసిన ఆ వివరాలనే కంప్యూటర్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పటివరకు కేవలం రికార్డుల పరిశీలన, సరిచేతకే పరిమితమైన క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిపై ‘తిరగరాత’పెనుభారాన్ని మోపుతోంది. మరో పక్క ఈ వివరాలను రాయాల్సిన గ్రామరెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల్లో మూడో వంతు ఖాళీగా ఉండడంతో ఒక్కో వీఆర్వో తనకు కేటాయించిన దాదాపు 10 గ్రామాల పహాణీలు తయారు చేయలేక తీవ్ర ఒత్తిడితో పడరాని పాట్లు పడుతుండడం గమనార్హం. ముందే చెప్పకుండా.. వాస్తవానికి, భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమై దాదాపు 90 రోజులు కావస్తోంది. ఈ 90 రోజుల్లో దాదాపు 1.30 కోట్ల సర్వే నంబర్లలోని 1.5 కోట్ల ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను రెవెన్యూ యంత్రాంగం పరిశీలించింది. ముందుగా రైతులకు ఆన్లైన్ 1బీలు ఇచ్చి, రికార్డులను సరిచేసిన తర్వాత మరోసారి 1బీలను రైతులకు అందజేసి వారితో సంతకాలు తీసుకుంది. రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయిన చోట్ల కూడా లిఖితపూర్వకంగా తీసుకుని వాటిని సరిచేస్తోంది. ఈ వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తోంది. మరో 20 రోజులు గడిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేలా సజావుగా సాగుతోంది. అయితే, గత 10 రోజుల క్రితం జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్ ఈ ప్రక్షాళన ప్రక్రియను పూర్తిగా మలుపు తిప్పింది. భూ రికార్డులన్నింటినీ కచ్చితంగా మాన్యువల్‌గా రాయాలని, వీఆర్వోల స్వదస్తూరితో పెన్నుతో రాసిన పహాణీలను పరిశీలించి వాటిలో తప్పులు సరిచేసి భద్రపర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఇప్పుడు క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగమంతా పెన్నూ, పేపర్లు పట్టుకుని మాన్యువల్ పహాణీలు తయారు చేసే పనిలో పడింది. తిరగరాత ఎందుకో? అయితే, భవిష్యత్తులో ఏవైనా తప్పులు వస్తే రెవెన్యూ సిబ్బందిని బాధ్యులు చేసేందుకు ఈ మాన్యువల్ పహాణీలు ఉపయోగపడతాయని ఉన్నతస్థాయి అధికారులంటున్నారు. కానీ, కంప్యూటర్లో ఉన్న వివరాలను పేపర్‌పై పెట్టి అక్కడ తప్పులు సరిచేసి, మళ్లీ కంప్యూటర్లోకి ఎక్కించడం వృథా ప్రయాస అవుతుందని, దీని ద్వారా ఎక్కువ తప్పులు దొర్లే అవకాశం ఉందని క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. కంప్యూటర్లో ఉన్న వివరాలను చూసి చేత్తో రాసేదాని కన్నా కంప్యూటర్ నుంచే ప్రింట్లు తీసుకుని తప్పు వచ్చిన వివరాలను సరిచేసి మళ్లీ కంప్యూటర్లో నమోదు చేసి ఫైనల్ కాపీలు తీసుకుంటే సరిపోతుందని, ఈ ఫైనల్ కాపీకి ప్రొసీడింగ్స్ తయారు చేసి అందరి సంతకాలు తీసుకుంటే బాధ్యులను చేసినట్టే అవుతుందని యంత్రాం గమంటోంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను చేతిరాతతో కూడిన పహాణీలు ఉండాల్సిందేనని మొండిపట్టు పడుతున్న నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన అనుకున్న గడువులోపు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు. వీఆర్వోలు ఏరీ? రాష్ట్రంలో మొత్తం 10,815 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఇప్పుడు మాన్యువల్ పహాణీలను ఈ రెవెన్యూ గ్రామాల వారీగా తయారు చేయాల్సి ఉంది. ప్రతి సర్వే నంబర్, బైసర్వే నంబర్ల వారీగా, రైతువారీ వివరాలతో 31 కాలమ్‌లతో కూడిన పహాణీని వీఆర్వోలు తయారు చేయాలి. అయితే, రాష్ట్రంలో మొత్తం 7,032 వీఆర్వో పోస్టులు మంజూరు కాగా, అందులో కేవలం 5,854 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఒక్కో వీఆర్వో కింద 3–4 గ్రామాల క్లస్టర్లుండగా, వీఆర్వోలు లేని చోట్ల ఇన్చార్జులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్వోలందరూ పహాణీలు తయారు చేయగలిగినంత అక్షరాస్యత ఉన్నవారు కాదు. ఈ నేపథ్యంలో ఒక్కో వీఆర్వో సగటున 4–5 రెవెన్యూ గ్రామాల నుంచి 10 గ్రామాల వరకు పహాణీలు తయారు చేయాల్సి వస్తోంది. గ్రామంలో ఉన్న రికార్డులను బట్టి ఒక్కో గ్రామానికి 3 నుంచి 10 రోజులు రాస్తే కానీ పహాణీలు తయారు కావని వీఆర్వోలంటున్నారు. దీనికి తోడు సమయం మరో 20 రోజులు మాత్రమే ఉన్నందున హడావుడిగా రికార్డులను పరిశీలించాల్సి వస్తోందని, ఇప్పుడు ఈ తిరగరాత మొదలవడంతో అసలు ఏం చేయాలో పాలుపోవడం లేదని వీఆర్వోలు, ఆర్ఐలు, తహసీల్దార్ స్థాయి అధికారులు వాపోతున్నారు. -
మహిళా వీఆర్వోపై మాజీ సర్పంచ్ దౌర్జన్యం
గొల్లపల్లి(ధర్మపురి): రికార్డుల్లో పేరు పొందుపర్చనందుకు ఓ మాజీ సర్పంచ్ మహిళా వీఆర్వోను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో జరిగింది. మల్లన్నపేట గ్రామంలో కొద్దిరోజులుగా రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ జరుగుతోంది. మాజీ సర్పంచ్ మానుక బక్కయ్య తన సోదరుడికి విక్రయించిన భూమి వివాదంలో ఉంది. ఆ భూమిని తన పేరిట రికార్డుల్లో పొందుపర్చాలని బక్కయ్య కొద్ది రోజులుగా వీఆర్వో శ్రీలత వద్దకు వచ్చి కోరుతున్నాడు. అలా చేయడం తన పరిధి కాదని, ఉన్నతాధికారులకు అప్పీలు చేసుకుని సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. గురువారం మరోసారి వీఆర్వో వద్దకు వచ్చి తన పేరు చేర్చాలని ఒత్తిడి చేశాడు. వినకపోవడంతో పంచాయతీ గదిలో ఉంచి తాళం వేశాడు. వీఆర్వోపై దౌర్జ్జన్యానికి పాల్పడి విధులకు ఆటంకం కల్గించినందుకు బక్కయ్య పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. -
ఏసీబీ వలలో భీమవరం వీఆర్వో
ముండ్లమూరు: ఓ రైతు వద్ద లంచం తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ముండ్లమూరు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకెళ్తే... మండలంలోని భీమవరం రెవెన్యూ పరిధిలో గల కొమ్మవరం గ్రామానికి చెందిన రైతు కంచర్ల వీరాంజనేయులు పట్టాదారు పాసుపుస్తకాల కోసం గత ఆగస్టులో మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో భీమవరం వీఆర్వో సరోజని అతడికి ఫోన్ చేసి పిలిపించి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలంటే కొంత నగదు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో చేసేది లేక రూ.3 వేలను రైతు వీరాంజనేయులు వీఆర్వోకి ఇచ్చాడు. అనంతరం సెప్టెంబర్ 5వ తేదీ ఈ పాస్‌పుస్తకాలు మంజూరైనట్లు అతడి ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే వీఆర్వోని కలవగా, ఒక్కొక్క పాసుపుస్తకానికి రూ.2 వేల చొప్పున మూడింటికి రూ.6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తన వద్ద అంత డబ్బు లేదని వీరాంజనేయులు ప్రాధేయపడినా.. ససేమిరా అంది. రూ.6 వేలు ఇస్తేనే పాసుపుస్తకాలు ఇస్తానని, లేకుంటే లేదని తేల్చి చెప్పింది. దీంతో కడుపుమండిన ఆ రైతు.. పదిరోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ ఆధ్వర్యంలో రచించిన ప్రణాళిక ప్రకారం.. మంగళవారం వీరాంజనేయులు రూ.6 వేలను వీఆర్వో సరోజనికి ఇస్తుండగా, ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. వీఆర్వో వద్ద ఉన్న 30 పాసుపుస్తకాలను కూడా ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, అధికారులు స్వాధీనం చేసుకుని రైతులÆకు ఇవ్వాలని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో బీరువాలో దాచి ఉంచిన 250 ఈ పాసుపుస్తకాలను కూడా గమనించి వారం రోజుల్లో సంబంధిత రైతులకు వాటిని పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు ఆదేశించారు. పట్టుబడిన వీఆర్వోను విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు ప్రతాప్‌కుమార్, సంజీవకుమార్, ఎస్సై కరిముల్లా, సిబ్బంది పాల్గొన్నారు. లంచాల కోసం పీడిస్తే సహించేది లేదు – ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకరరావు అధికారులు, సిబ్బంది లంచాల కోసం ప్రజలను పీడిస్తే సహించేది లేదని ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ హెచ్చరించారు. భీమవరం వీఆర్వో సరోజనిని పట్టుకున్న అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. రెవెన్యూ అధికారులు లంచాల కోసం రైతులను ఇబ్బంది పెడితే జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. గత్యంతరం లేకనే ఏసీబీని ఆశ్రయించాను మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన 12 ఎకరాల పొలాన్ని మా ముగ్గురు అన్నదమ్ములం సమానంగా నాలుగు ఎకరాల చొప్పున పంచుకున్నాం. వాటికి సంబంధించిన పాస్‌పుస్తకాల కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకోగా, వీఆర్వో సరోజని లంచం డిమాండ్ చేసింది. అంత మొత్తం ఇచ్చుకోలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. – కంచర్ల వీరాంజనేయులు, బాధిత రైతు -
పాపం వీఆర్వోలు.. !
హన్మకొండ అర్బన్ : సుమారు 10 రోజుల క్రితం మొదలైన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనతో వీఆర్వోలకు ఊపిరి సల్పకుండా అయింది. ఉదయం 8 గంటలకు గ్రామ సభలతో మొదలైతే సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి చేరేసరికి రాత్రి పొద్దుపోతుంది. పదిరోజుల పాటు విరా మం లేకుండా ఉన్న తమకు ఆదివారం కాస్త సెలవు దొరికిందనుకుంటే ఓట్ల జాబితా సవరణ పేరుతో ఆదివారం కూడా హన్మకొండ మండలంలోని వీఆర్వోలను అధికారులు కార్యాలయానికి పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో హన్మకొండ, వరంగల్ కాజీపేట మండలాల పరిధిలోని వారు ఉదయం 9 గంటలకే కలెక్టరేట్ చేరుకున్నారు. కనీసం ఆదివారం కూడా వదలకుండా విధుల్లో ఉంచితే ఇక తమ కుటుంబం, ఇంటిపనుల చేసుకునేదెలా అని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఫోర్జరీ సంతకాలతో బ్యాంకు రుణం
తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు విజయనగరం ,జియ్యమ్మవలస : తహసీల్దార్, వీఆర్ఓ, డీటీల సంతకాలు ఫోర్జరీ చేసి రుణం పొందిన సంఘటన మండలంలోని పెదబుడ్డిడి గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సీమల రమాదేవికి మూడెకరాల జిరాయితీ పొలం ఉంది. దీనిపై ఆమె (సర్వే నంబర్లు 259/9, 258/10, 264/1, 3, 271/4) రావివలస ఆంధ్రాబ్యాంక్ బ్రాంచిలో లక్ష రూపాయల రుణం కూడా తీసుకుంది. అయితే శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం మండలం విక్రమపురానికి చెందిన మాచర్ల అచ్యుతరావు నకిలీ కౌలుపత్రాలు సృష్టించి పల్లి కొండయ్య అనే వ్యక్తిని జామీనుగా చూపించి లక్ష రూపాయల రుణం తీసుకున్నారు. వీరిద్దరు కూడా ఆంధ్రాబ్యాంక్ రావివలస బ్రాంచిలో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలు రమాదేవి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు సోమవారం వినతిపత్రం అందజేసింది. దీనిపై తహసీల్దార్ కేవీఎస్ భాస్కరరావు స్పందిస్తూ ఈ విషయమై విచారణ చేపడతామన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎంపీటీసీ సభ్యుడు బాబూ భువనమోహనరావు, గ్రామపెద్దలు ఉన్నారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
♦ సాదాబైనామా’కురూ.27వేలు డిమాండ్ ♦ తన గదిలో లంచం తీసుకుంటూ ♦ పట్టుబడిన వీఆర్వో రవి వైరా : సాదా బైనామా ప్రక్రియ పూర్తి చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాం డ్ చేసిన వైరా ఇన్చార్జ్ వీఆర్వో మీనుగు రవిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపిన వివరాలు ఇలా.. వైరా మండలం గండగలపాడు గ్రామానికి చెందిన న్యా యవాది జోనబోయిన గోవిందరావు..తన 7.5 ఎకరాలు, తన సోదరుడికి చెం దిన మరో రెండు ఎకరాల భూమి నిసాదాబైనామా కింద ఆన్లైన్ చే యాలని ఏడాదికాలంగా తహసీ ల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రు. అష్ణగుర్తి, గొల్లెనపాడు వీఆర్వోగా చేస్తున్న రవి, వైరా ఇన్చార్జ్గా కూడా ఉండడంతో..ఆయనను కలిశారు. 1బీ, ఆన్లైన్, మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే రూ.27వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో..బాధితుడు ఏసీబీ కార్యాలయంలో సంప్రదించారు. వారి సూచనల మేరకు డబ్బు తీసుకొని వీఆర్వోకు ఫోన్ చేయగా..బ్రాహ్మణపల్లిలోని తన గదికి రావాలని సూచించగా..అక్కడికి వెళ్లి లంచం ఇస్తుండగా..ముందగానే వలపన్ని ఉన్న ఏసీబీ అధికారులు వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమణమూర్తి, పద్మ, సిబ్బంది ఉన్నారు. రైతుల గోడు..: ఏసీబీ డీఎస్పీని పలువురు రైతులు కలిసి..తహసీల్దార్ కార్యాలయంలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా..ఈ విషయమై బాధ్యులైన అధికారిని ఆయన ప్రశ్నించారు. విసిగిన లాయర్ తెగువతో.. ఖమ్మంలో నివాసముంటున్న న్యాయవాది జోనబోయిన గోవిందరావు సాదా బైనామా ప్రక్రియ కోసం దాదాపు ఏడాదికాలంగా..వైరాకు వచ్చి వెళుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని, వంశపారపర్యంగా వచ్చిన భూమిని నిబంధనల ప్రకారం కేటాయించాలని దరఖాస్తు చేసుకోగా..ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వీఆర్వో రవి ఎకరానికి రూ.10వేలు నుంచి రూ.20వేలు తీసుకుంటానని, లాయర్ కాబట్టి తగ్గించి తీసుకుంటున్నాని ఇబ్బంది పెట్టాడని, గతంలో రూ.6వేలు ఇచ్చానని తెలిపారు. చివరకు ఎకరానికి రూ.3వేల చొప్పున ఇవ్వాల్సిందేనని, ఆఫీసులో మిగతావారికి వాటా ఇస్తానని పట్టుబట్టడంతో.. విసిగి ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు చెప్పారు. గోవిందరావు, న్యాయవాది ప్రతి పనికీ ఓ లెక్క..ఆయన గదే అడ్డా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వో రవి వైరా గ్రామ పంచాయతీ ఇన్చార్జ్. బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల నుంచి ప్రతి పనికీ ఓ లెక్క ఏర్పాటు చేసుకొని కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల మంజూరుకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత మండల అధికారి కనీసం మందలించలేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గది ఉన్నా..బ్రాహ్మణపల్లిలో ఓ కిరాయి గదిని ఏర్పాటు చేసుకొని వసూళ్ల దందా నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొణిజర్ల, మధిర మండలాల్లో పనిచేసిన చోట కూడా వసూళ్లకే ప్రాధాన్యం ఇచ్చారనే మచ్చుంది. ఉలిక్కి పడ్డ వైరా..అప్పుడు వారిపై..ఇప్పుడు ఇతడిపై 2007లో వైరాలో మోటారు వాహనాల తనఖీ అధికారిగా పనిచేస్తున్న నాగేశ్వరావు..ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తులను, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం. ఈ కార్యాలయంలో ఎంవీఐగా పనిచేసిన ఎండీ.గౌస్ పాషా కొత్తగూడెం ఎంవీఐగా బదిలీపై వెళ్లాక కొత్తగూడెం, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇప్పుడు రెవెన్యూ విభాగంలో వైరా ఇన్చార్జ్ వీఆర్వో లంచం తీసుకుంటూ పట్టుబడడంతో చర్చనీయాంశమైంది. ఏసీబీ అధికారుల దాడితో..కొన్ని ప్రభుత్వ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఒక్కసారిగి ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సాదాబైనామాలకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రక్రియ చేపడుతుంటే..అవినీతికి పాల్పడుతున్న ఘటన వెలుగు చూడడంతో..రైతులు, సామాన్యులు దీనిపై చర్చించుకున్నారు. -
వీఆర్వోల వింత కథ!
టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తున్న ఉన్నతాధికారులు సాక్షి, హైదరాబాద్: బెదిరింపులు.. వేధింపులు.. వసూళ్లు.. అన్నింటికీ గ్రామ రెవెన్యూ అధికారులే (వీఆర్వోలే) టార్గెట్లు! హోదా చిన్నదే.. చేయాల్సిన కీలక పనులెన్నో.. క్షేత్రస్థాయిలో ఏ పని చేయాలన్నా.. ఏ పథకం అమలు చేయాలన్నా భారం వారిపైనే.. దీంతో అవినీతి, అక్రమాలకు వీఆర్వోలే కేంద్రంగా మారుతున్నారు. కొందరు తహసీల్దార్లకు నెలవారీ మామూళ్లు ఇవ్వాల్సి రావడం, మరికొందరు అధికారులు టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తుండడం వంటి వాటితో తాము అవినీతికి పాల్పడాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని వీఆర్వోలు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి కారణంగానే మానసిక ఒత్తిడికి గురై వరంగల్ జిల్లాకు చెందిన ఓ వీఆర్వో బలవన్మరణానికి పాల్పడ్డాడని పేర్కొంటున్నారు. వసూళ్లకు టార్గెట్లు! రెవెన్యూ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించే క్రమంలో వీఆర్వోల వ్యవస్థ అవినీతి, అక్రమాల ఆరోపణలకు కేంద్రంగా మారుతోంది. భూముల వ్యవహారం కావడం, సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించాల్సిన పరిస్థితుల్లో కొందరు వీఆర్వోలు లంచాలు తీసుకునే పరిస్థితి ఉండడం వివాదాస్పదంగా మారుతోంది. కొందరు తహసీల్దార్లకు నెలవారీ మామూళ్లు ఇవ్వాల్సి రావడం, మరికొందరు తహసీల్దార్లు ఏకంగా టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేయిస్తుండడం, అన్ని స్థాయిల్లోనూ చేతులు తడపనిదే ఫైళ్లు కదిలే పరిస్థితి లేకపోవడంతో తామూ అవినీతిలో కూరుకుపోవాల్సి వస్తోందని వీఆర్వోలు వాపోతున్నారు. పైఖర్చులు కూడా.. తన పరిధిలోని ప్రతి వీఆర్వో వారానికి రూ.2 వేల చొప్పున ముట్టచెప్పాలని హైదరాబాద్ జిల్లాలోని ఓ తహసీల్దార్ టార్గెట్ పెట్టినట్లు తెలిసింది. గ్రామాల్లో ప్రోటోకాల్ ఖర్చులను వీఆర్వోలే భరిస్తున్నారు. ఎమ్మెల్యేల కార్యక్రమాల నుంచి స్థానికంగా జరిగే అన్ని కార్యక్రమాల ఖర్చులను పెట్టుకోవాలని వీఆర్వోలకు తహసీల్దార్లు హుకుం జారీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. అసలు పని వదిలేసి.. ఏటా భూముల వివరాల్లో మార్పులు, ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగయిందనే వివరాల నమోదుతోపాటు. జనన, మరణ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో నివేదికలు ఇవ్వాలి. కానీ వీఆర్వోల వ్యవస్థ ఏర్పాటైన తొమ్మిదేళ్లలోనే వారి జాబ్‌చార్ట్ పూర్తిగా మారిపోయింది. తహసీల్దార్లు తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల అమలు వీఆర్వోల నెత్తినే పెట్టి చేతులు దులుపుకొన్నారు. దీంతో క్లస్టర్ పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో 67 రకాల విధులు, సంక్షేమ పథకాల అమలును చూసుకోవాల్సి రావడం వీఆర్వోలకు భారంగా పరిణమించింది. ఇక రాష్ట్రంలో వీఆర్వోల కొరత కారణంగా దాదాపు వెయ్యి మందికిపైగా వీఆర్వోలు మరో రెవెన్యూ గ్రామానికి ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. సౌకర్యాలు సున్నా.. వీఆర్వోల పనుల జాబితా చాంతాడంత ఉన్నా సౌకర్యాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. గ్రామాల్లో కనీసం ఒక కార్యాలయం అంటూ లేకపోవడం గమనార్హం. గ్రామాలకు వచ్చిపోతున్నా.. ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. ఇక నివేదికలకు అయ్యే స్టేషనరీ ఖర్చులు, గ్రామాలు, మండలాలు తిరిగేందుకు అయ్యే ప్రయాణ భత్యాల వంటివేవీ వీఆర్వోలకు అందడం లేదు. పైగా కొందరు పై అధికారులు ‘వసూళ్ల’ టార్గెట్లు కూడా పెడుతుండటంతో లంచాల బాట పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పనిచేయడం కష్టంగా మారింది ‘‘మా పని చాలా కష్టంగా తయారైంది. మోయలేనంత పనిభారం, అధికారుల ఒత్తిడులు నైరాశ్యానికి గురిచేస్తున్నాయి. మాకు రెవెన్యూ పనులు మాత్రమే అప్పగించాలి. గ్రామస్థాయిలో కనీస వసతులు కల్పించాలి. అన్ని రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమించాలి. ఈ సమస్యలపై అన్ని సంఘాలతో కలసి త్వరలోనే సీఎస్‌ను కలుస్తాం..’’ – గోల్కొండ సతీశ్, తెలంగాణ వీఆర్వోల సంఘం అధ్యక్షుడు -
వీఆర్వోపై చేయిచేసుకున్న జేసీ
మహబూబ్‌నగర్: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన ఓ వీఆర్వోపై జాయింట్ కలెక్టర్ చేయి చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం వెలుగుచూసింది. ధర్మాపూర్ గ్రామ సదస్సులో పాల్గొన్న జేసీ శివకుమార్ గ్రామానికి భూ వివరాలు చెప్పాలని స్థానిక వీఆర్వో మహమూద్ పాషాను అడిగారు. దీనికి వీఆర్వో సరైన సమాధానం చెప్పకపోవడంతో కోపోద్రిక్తుడైన జేసీ గ్రామసభలోనే వీఆర్వోపై చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. -
అడిగే వారేరి.!
►గ్రామ పంచాయతీల్లో పాలన కరువు పేరుకే గ్రామాధికారులు ►ఉద్యోగం ఒక చోట.. ఉండేదొక చోట ►క్షేత్రస్థాయి ఉద్యోగులపై కొరవడిన పర్యవేక్షణ ►సమస్యలతో తల్లడిల్లుతున్న పల్లె ప్రజలు పట్టించుకోని ఉన్నతాధికారులు ఒంగోలు టూటౌన్ : జిల్లాలో పల్లె పాలన గాడి తప్పింది. ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఆయా గ్రామాధికారులు ఎక్కడుంటున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. అసలు విధులకు హజరవుతున్నారో లేదో కూడా ఆయా శాఖల మండల, జిల్లా స్థాయి అధికారులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగం చేసే చోట ఉండకపోయినా.. కనీసం సకాలం విధులకు హజరు అవుతున్నారా లేదా ప్రశ్నించే వారు కరువయ్యారు. దీంతో గ్రామాల్లో పాలన కరువైంది. సమస్యలతో పల్లె ప్రజలు సతమతమవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక పడుతున్న అవస్థలు ఇన్ని కావు. ఒక వేళ మండల స్థాయి అధికారికి చెప్పుకుందామని వచ్చినా.. అక్కడ మండల స్థాయి అధికారుల సీట్లు ఖాళీగా దర్శనమిస్తాయి. అక్కడ అటెండరో.. లేక ఒక కంప్యూటర్ ఆపరేటరో తప్ప అధికారులు కనిపించని పరిస్థితి ఉంది. సకాలంలో విధులకు హజరయ్యే వారి సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. జిల్లాలో 56 మండలాలు ఉండగా వీటి పరిధిలో 1029 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి విలేజ్ రెవెన్యూ అధికారి ఉన్నారు. కొన్ని గ్రామాలకు రెగ్యులర్ వీఆర్వో లేకపోయినప్పటికి ఇన్చార్జి వీఆర్వోలను నియమిస్తారు. వీరంతా ఉద్యోగం చేసే గ్రామంలో ఉండటం లేదు. పట్టణాలు, నగరాలలో ఉంటున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు చుట్టు పక్కల గ్రామాల వీఆర్వోలు అందరూ కూడా ఒంగోలులోనే దాదాపు ఉంటున్నారు. లేదా సొంతూళ్లలోనే ఉంటున్నారు. పని ప్రదేశానికి 25 కిలో మీటర్ల దూరంలోనే ఉంటున్నారు. ఇంకొంత మంది 50 కిలోమీటర్ల దూరంలోకూడా ఉంటున్నట్లు తెలుస్తోంది. కనీసం మండల కేంద్రంలో కూడా 90 శాతం మంది ఉండటంలేదు. గ్రామంలో ప్రతి ఒక్కరికి వీఆర్వోతో అవసరం ఉంటుంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక నష్టపోవాల్సి వస్తోంది. ఏ సర్టిఫికేట్కైనా.. వీఆర్వో తరువాత ఆర్ఐ. ఆ తరువాత తహశీల్దార్ సంతకం అవసరం. గ్రామ స్థాయి అధికారులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఆడిం దే ఆట.. పాడిందే పాట సాగిపోతోంది. వీరితో పాటు గ్రామ కార్యదర్శులు కూడా విధులకు సక్రమంగా రాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 70 శాతం గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిత్యం తలుపులు మూసే ఉంటాయి. సిటిజన్ చార్టర్ ఉండదు. ఫోన్ రంబర్లు ప్రజలకు తెలియవు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటు ప్రజలకు సేవ చేయకపోవడంపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయి అధికారులు కూడా జిల్లా , డివిజన్ కేంద్రాలలో ఉండటంతో గ్రామ స్థాయి అధికారులను ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. దీంతో గ్రామ పాలన ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారయింది. కనీసం గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు గ్రామానికి రాని అధికారులను అడగలేని స్థితిలో ఉన్నారు. అందుబాటులో ఉండాల్సిన అధికారులు వీరే.. గ్రామ కార్యదర్శి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో), వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్), ఏఎన్ఎం, నీటి పారుదల శాఖ అధికారి; విద్యుత్ శాఖ లైన్‌మేన్, హెల్పర్, వెటర్నరీ అసిస్టెంట్ (పశు వైద్యాధికారి), వ్యవసాయ శాఖ విస్తరణాధికారి, ఎంపీఈవో, ఉద్యానశాఖ అధికారి, ఆర్‌డబ్లు్యఎస్ ఉద్యోగి (వాటర్‌మేన్), రేషన్ షాపు డీలర్లు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు ప్రతి రోజు విధులకు హాజరయినట్లు ప్రతి గ్రామ పంచాయతీలోని మూమెంట్ రిజిస్ట్రర్‌లో సంతకాలు పెట్టి విధులకు హజరు కావాలి. వీళ్ల పోన్ నంబర్లు ఆయా గ్రామ ప్రజలకు తెలియజేయాలి. ఏ పని ఎన్ని రోజులకు అవుతుందో చెప్పాలి. వీరితో పాటు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాల్సిఉంది. కానీ ఇవేమీ పంచాయతీలలో జరగడం లేదు. వీరిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకుండాపోయింది. జిల్లా కలెక్టర్ అయినా గ్రామస్థాయి ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
అన్నా.. జర అడ్రస్ చెప్పవే
►మన వీఆర్వో.. ఎక్కడుంటడే! ►కార్యాలయాలు లేక వీఆర్వోల ఇక్కట్లు ►చెట్ల కింద, అద్దె ఇళ్లలో విధులు ►రికార్డులను భద్రపరిచేందుకు నానా అగచాట్లు ►మండల కేంద్రాలకే పరిమితమవుతున్న అధికారులు ►ప్రతి చిన్న పనికి తహసీల్దార్ ఆఫీసులకే జనం పరుగు హైదరాబాద్: మల్లారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ.. 1,500 జనాభా ఉంటుంది.. ఊరికి వీఆర్వో ఉన్నారు.. అయితే ఆయనకు ఆఫీసు మాత్రం లేదు.. చేసేది లేక ఆ అధికారే నెలకు రూ.500 చొప్పున ఊళ్లోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఆఫీసు నడుపుతున్నారు! కార్యాలయం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో అటు గ్రామస్తులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు!!.. ఇది ఒక్క మల్లారంలో పరిస్థితే కాదు.. రాష్ట్రంలో చాలా గ్రామాల వీఆర్వోలు ఇవే ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కార్యాలయాలు లేక ఇంటిని అద్దెకు తీసుకొని విధులు నిర్వర్తిస్తున్నవారు కొందరైతే.. చెట్టు కింద, పాడుబడ్డ భవనాల్లో, మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయాల్లో పనులు చేస్తున్నవారు మరికొందరు. ఆఫీసులు లేకపోవడంతో గ్రామంలోని భూములకు సంబంధించిన కీలక రికార్డులను భద్రపర్చడం కూడా కష్టమవుతోందని వీఆర్వోలు గోడు వెల్లబోసుకుంటున్నారు. పట్టించుకునేవారేరి..? కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టకపోవడంతో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థకు నిలువ నీడ లేకుండా పోయింది. ఫలితంగా రాష్ట్రంలోని 6,873 వీఆర్వోలు, 22,245 మంది వీఆర్ఏలు గ్రామంలో ఏదో ఒక పంచన కూర్చుని పనులు చక్కబెట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఒక వీఆర్వోకు అదనంగా ఐదారు గ్రామాల బాధ్యతలను కూడా ప్రభుత్వం అప్పగించడంతో కొన్ని సందర్భాల్లో ఆయా గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండడం సాధ్యం కావడం లేదు. మండల తహశీల్దార్ కార్యాలయంలో కూర్చొని అన్ని గ్రామాల ప్రజలను అక్కడికే పిలిపించుకోవాల్సి వస్తోంది. ఇక గ్రామంలోని భూములకు సంబంధించిన రికార్డులకూ రక్షణ కరువవుతోంది. దీంతో వాటన్నింటినీ మండల కేంద్రంలో భద్రపరచుకోవాల్సి వస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) కార్యాలయం నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో 2013లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో ఖాళీగా ఉన్న కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ భవనాలను వీఆర్వో కార్యాలయాలకు కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. అయినా క్షేత్రస్థాయిలో ఇవి ఎక్కడా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ ఏర్పడి మూడేళ్లవుతున్నా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి ప్రయత్నం ప్రారంభించలేదు. మండల కార్యాలయాలకే పరిమితం గ్రామాల్లో ఉండాల్సిన గ్రామ రెవెన్యూ అధికారులు మండల రెవెన్యూ కార్యాలయానికే పరిమితవుతున్నారు. తహశీల్దారు కార్యాలయంలో సరిపడా సిబ్బంది లేకపోవడం, పనిభారం అధికంగా ఉండడంతో.. కాస్తోకూస్తో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వీఆర్వోలతోనే తహశీల్దార్లు పనులను చేయించుకుంటున్నారు. రెవెన్యూ సేవలన్నింటినీ ప్రభుత్వం కంప్యూటరైజ్ చేయడం, వెబ్‌ల్యాండ్ డేటాను ఆన్లైన్లో ప్రతిరోజూ అప్డేట్ చేయాల్సి ఉండటంతో చాలామంది తహశీల్దార్లు ఆ పనులను వీఆర్వోలకు అప్పగిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూం ఇళ్లు.. ఇలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ ఆన్లైన్ ద్వారానే సమాచారం ఇవ్వాల్సి ఉన్నందున తహశీల్దార్ కార్యాలయంలో ఉండాల్సి వస్తోందని వీఆర్వోలు చెబుతున్నారు. వీఆర్ఏల మాదిరే వీఆర్వోలను కూడా అదే గ్రామానికి చెందిన వ్యక్తిని నియమిస్తే మేలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. గ్రామంలోనే రెవెన్యూ కార్యాలయం ఉంటే.. – గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతమవుతుంది. ప్రజలు చిన్నచిన్న అవసరాలకు మండల కేంద్రానికి వెళ్లే పని తప్పుతుంది – కార్యాలయం లేక, వీఆర్వో గ్రామానికి రాక ప్రతి పనికీ మండలాఫీసుకు వెళ్లి రావడం రైతులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఉన్న ఊళ్లోనే ఆఫీసు ఉంటే ప్రజలకు ప్రయాణ ఖర్చులు తప్పడంతోపాటు విలువైన సమయం వృథా కాకుండా ఉంటుంది – క్షేత్రస్థాయి పరిశీలన త్వరితగతిని పూర్తవుతుంది. రైతులకు అవసరమైన పహానీ నకళ్లను అక్కడిక్కడే వీఆర్వో జారీ చేస్తారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ అవసరమైన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలకు వీఆర్వో సిఫార్సు ఉంటేనే మండల తహశీల్దారు జారీ చేస్తారు – గ్రామంలో అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణ సాయం కోసం వీఆర్వోనే ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయడం సులభతరం అవుతుంది – చెరువులు, భూములు, నాలాల రక్షణ, రెవెన్యూ రికార్డుల నిర్వహణ సులువవుతుంది ఆఫీసులు ఉంటే సేవలు మరింత చేరువ ప్రతి గ్రామానికి రెవెన్యూ కార్యాలయం ఉంటే ప్రజలకు మరింత మేలు చేకూరుతుంది. అధికారి అందుబాటులో ఉంటే ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత చేరువవుతాయి. వివిధ పథకాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వెంటనే పరిశీలించేందుకు వీలవుతుంది. రెవెన్యూ గ్రామాల్లో తప్పనిసరిగా కార్యాలయం ఉండాలని గత ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో చాలా గ్రామాల్లో వీఆర్వోలు ఇల్లు అద్దెకు తీసుకొని కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో తమ జేబు నుంచే అద్దె చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం అన్ని గ్రామాల్లోనూ వీఆర్వో కార్యాలయాలు నిర్మించాలి. – బాణాల రామిరెడ్డి, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఏసీబీ వలలో వీఆర్వో
రూ.ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం ఆలమూరు (కొత్తపేట) : పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరు కోసం రైతును లంచం అడిగిన వీఆర్వో ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. జొన్నాడలో విలేజ్ రెవెన్యూ అధి కారి (వీఆర్ఓ)గా పి.బాబూరావు పనిచేస్తున్నాడు. స్థానిక రెవెన్యూ పరిధిలో మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన రైతు ఉండమట్ల శ్రీనివాసు కుటుంబానికి చెందిన తొమ్మిది ఎకరాల భూమి ఉంది. దానికి సంబంధించి ఆ¯ŒSలై¯ŒSలో కుటుంబసభ్యుల పేర్లలో తప్పులు దొర్లడంతో వాటిని సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతు శ్రీనివాసు వీఆర్వో బాబూరావును పలుమార్లు కోరినా పట్టించుకోలేదు. సుదీర్ఘ ప్రక్రియ కావడంతో అడంగల్‌లో పేర్లు సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరుకు మార్గం సుగమం కావాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. వీఆర్వో చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతు శ్రీనివాసు ఏసీబీని ఆశ్రయించాడు. రాజమహేంద్రవరం అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ ఎం.మధుసూదనరావు ఆధ్వర్యంలో అధికారుల బృందం జొన్నాడలో నిఘా పెట్టి వీఆర్వోను లంచం తీసుకుంటుండగా పట్టుకుంది. ఏసీబీ అధికారులతో పాటు రాజమహేంద్రవరంలోని ఆర్టీఓ అధికారులైన టీకే పరంధామరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ జీవీవీ సత్యనారాయణను సాక్ష్యులుగా ఉన్నారు. పక్కా ప్రణాళికతో ఏసీబీ వల జొన్నాడ వీఆర్వో పి.బాబూరావు అవినీతిపై నెల రోజుల కిందటే ఫిర్యాదు అందడంతో ఏసీబీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. వీఆర్వోను జొన్నాడ సెంటర్లోని ఒక ప్రదేశానికి రప్పించారు. రైతులు మాదిరిగా వచ్చిన ఏసీబీ అధికారుల సమక్షంలో రైతు శ్రీనివాసు అడిగిన లంచంలో అడ్వా¯Œ్సగా రూ.ఐదు వేలు అందజేశారు. అందులో రెండు రెండు వేల నోట్లు, రెండు ఐదు వందల నోట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అడంగల్ సవరణ కోసం చేసుకున్న రైతు దరఖాస్తును పరిశీలించేందుకు ఆలమూరు తహసీల్దారు కార్యాలయానికి వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. దరఖాస్తు గడువు నిర్ణీత సమయంలో బడే ఉందని అధికారులు నిర్ధా రించుకున్నారు. అడంగల్‌లో సవరణకు సమగ్ర వివరాలు అందించాలన్నందుకే తనపై కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా ఇరికించారని నిందితుడైన వీఆర్వో బాబూరావు వివరించారు. బాధిత రైతు శ్రీనివాసు మాట్లాడుతూ బీ 1 ఫారం సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలంటే కోరిన లంచం ఇవ్వాల్సిందేనని, కూరగాయల బేరం ఆడవద్దని వీఆర్వో బాబూరావు హేళన చేశారని విలేకర్లకు తెలిపారు. ఏసీబీ సీఐ సూర్యమోహన్, ఎస్సై టి.నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు వీఆర్వోల సస్పెషన్
కృష్ణగిరి: మండలంలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఇద్దరు వీఆర్వోలను సస్పెండ్ చేసినట్లు జిల్లా అధికారుల నుంచి ఉత్తర్వులు అందినట్లు తహసీల్దార్ డీ.గోపాల్‌రావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్‌హెచ్ ఎర్రగుడి, మన్నెకుంట గ్రామాలకు సంబంధించిన వీఆర్వో బాలసుంకన్న, కృష్ణగిరి వీఆర్వో రేష్మాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
వైఎస్సార్ జిల్లాలో రెవెన్యూ అధికారుల జల్సాలు
-
ఏసీబీ వలలో వీఆర్వో
7 వేల నగదు స్వాధీనం తర్లుపాడు : ఈ-పాస్ పుస్తకం ఇచ్చేందుకు రైతు నుంచి 7 వేల రూపాయల లంచం తీసుకున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ సంఘటన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఏసీబీ ఒంగోలు ఇన్చార్జ్ డీఎస్పీ దేవానంద్ సాంతో కథనం ప్రకారం.. మండలంలోని నాగెళ్లముడుపు గ్రామానికి చెందిన దూళ్ల వెంకట లక్ష్మమ్మ అదే గ్రామానికి చెందిన చింతం రాజయ్య వద్ద ఈ ఏడాది జనవరిలో 28 సెంట్ల పొలాన్ని కొనుగోలు చేసి రిజిస్టర్ చేరుుంచుకుంది. తాను కొనుగోలు చేసిన పొలాన్ని ఆన్లైన్లో నమోదు చేసి ఈ-పాస్ పుస్తకం ఇవ్వాలని వీఆర్వో వెంకట శివ కాశయ్యను ఆమె కోరింది. ఇందుకోసం మీ సేవలో దరఖాస్తు చేసి వీఆర్వోను సంప్రదించింది. ఇందుకు వీఆర్వో 10 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పటంతో 7 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని వెంకటలక్ష్మమ్మ తమ కుమారుడు వెంకటేశ్వర్లుకు తెలిపింది. అతడు వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్లాన్ ప్రకారం రంగుపూసిన నోట్లను ఏసీబీ అధికారులు వెంకటేశ్వర్లుకు ఇచ్చారు. ఆయన నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వీఆర్వోకు ఆ నగదు ఇచ్చాడు. ఆయన ఆ డబ్బులు తీసుకుని డైరీలో పెట్టుకున్నాడు. ఆ వెంటనే ఏసీబీ డీఎస్పీ దేవానంద్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి వీఆర్వో వెంకట శివ కాశయ్య నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. విషయం క్షణాల్లో దావానలంలా వ్యాపించడంతో కార్యాలయంలోని మిగిలిన సిబ్బంది, వీఆర్వోలు బయటకు పరుగులు తీశారు. ఏసీబీ సీఐలు ప్రతాప్‌కుమార్, డి.సత్యకుమార్, సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు. -
వీఆర్ఏలపై ప్రభుత్వం కక్షసాధింపు
పాలకొండ : గ్రామ రెవెన్యూ సహాయకులపై(వీఆర్ఏ) ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.అప్పలస్వామి అన్నారు. ఆ సంఘ సమావేశం శుక్రవారం పాలకొండలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ వేతనాలతో జీవిస్తున్న వీఆర్ఏలకు రేషన్ సరుకులు నిలిపివేయడం అన్యాయమన్నారు. కనీస వేతనం కూడా చెల్లించడం లేదని పేర్కొన్నారు. కేవలం వీఆర్ఏలను వేధించేందుకే ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ పెత్తందార్లు తెలుపు రేషన్‌కార్డులు పొందినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అట్టడుగు వర్గాలకు చెందినవీఆర్ఏలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 13న కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. వీఆర్ఏలంతా పాల్గొని విజయవంత చేయాలని పిలుపునిచ్చారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఆ సంఘ నేతలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో తహసీల్దార్, వీఆర్ఓ
∙రూ.30వేల లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీఆర్ఓ ∙రూ.10 వేల కోసం రైతును డిమాండ్ చేసిన తహసీల్దార్.. ∙ఇద్దరి అరెస్టు, రిమాండ్ చిట్యాల : పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం డబ్బులు ఇవ్వాలంటూ రైతును వేధించిన తహసీల్దార్, వీఆర్ఓ ఏసీబీకి అధికారులకు చిక్కారు. ఇందులో వీఆర్ఓ డబ్బు తీసుకుంటూ దొరికిపోగా.. వీఆర్ఓకు ఇచ్చే నగదు కాకుండా తనకు మరికొంత ఇవ్వాలంటూ సంతకం చేయకుండా ఆపిన తహసీల్దార్‌ను సైతం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం.. మండలంలోని పంగిడిపల్లి గ్రామ శివారు పెద్దంపల్లికి చెందిన గౌడ సమ్మయ్య అదే గ్రామంలో ఏడు ఎకరాల పది గుంటల భూమి కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిసే్ట్ర¯ŒS పూర్తయ్యాక పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం మీ–సేవలో దరఖాస్తు చేసుకుని గ్రామ వీఆర్ఓ కొత్తూరి రవీందర్‌ను సంప్రదించాడు. దీని కోసం రూ.30వేలు ఖర్చవుతాయని వీఆర్ఓ చెప్పగా చిట్యాల తహసీల్దార్ భూక్యా పాల్‌సింగ్ వద్దకు వెళ్లగా.. ఆర్ఐ, డీటీ, డేటా ఎంట్రీ ఉద్యోగులతో పాటు ఆర్డీఓ ఆఫీస్‌లో వీఆర్ఓలు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. దీనికి తోడు వీఆర్ఓకు ఇచ్చే రూ.30వేలు కాకుండా తనకు మరో రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు రైతు సమ్మయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇందులో భాగంగా సోమవారం పంగిడిపల్లి గ్రామపంచాయితీలో రైతు సమ్మయ్య దగ్గర రూ.30 వేల లంచం తీసుకుంటుండగా వీఆర్ఓ రవీందర్‌ను అరెస్ట్ చేశారు. ఇక డబ్బు కోసం వేధిస్తూ పట్టాదార్ పాసు పుస్తకాలపై సంతకం చేయకుండా ఈనెల 6వ తేదీ నుంచి వీఆర్ఏ చందు బీరువాలో ఉంచిన తహసీల్దార్‌ను పాల్‌సింగ్‌ను సెల్ఫో¯ŒS సంభాషణ ఆధారంగా అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు. 80 రోజుల పాటు ఇబ్బంది పెట్టారు : గౌడ సమ్మయ్య ,రైతు పట్టాదారు పాస్బుక్ల కోసం వెళ్లే డబ్బులు ఇవ్వాల్సిందేనం టూ వీఆర్ఓ రవీందర్, తహసీల్దార్ పాల్‌సింగ్ 80 రోజుల పా టు ఇబ్బంది పెట్టారని బాధిత రైతు గౌడ సమ్మ య్య తెలిపారు. సోమవారం తహసీల్ కార్యాలయంవద్ద విలేకరులతో మాట్లాడారు. డబ్బులు వేధిస్తుండడంతో వారికి బుద్ధి చెప్పాలని ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. 17న రెక్కీ.. రైతు సమ్మయ్యను వేధించిన వీఆర్ఓ, తహసీల్దార్ కోసం ఈనెల 17న(శనివారం) ఏసీబీ అధికారులు రెక్కి నిర్వహించినట్లు తెలిసింది. అదే రోజు డబ్బులు ఇచ్చేందుకు సమ్మయ్య ఆఫీస్‌కు వెళ్లడంతో వీఆర్ఓ, తహశీల్దార్లు అప్పటికే బయలుదేరడంతో ఏసీబీ అధికారులు వెనుతిరిగినట్లు సమాచారం. ఏసీబీకి చిక్కిన రెండో తహసీల్దార్ చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తు ఏసీబీ వలలో చిక్కిన తహసీల్దార్ల సంఖ్య రెండుకు చేరింది. 2006–07లో తహసీల్దార్‌గా పని చేసిన లింగాల సూరిబాబు పరకాలలోని అద్దె ఇంట్లో ఒడితలకు చెందిన రైతు వద్ద రూ. 30 వేల లంచం తీసుకుంటు దొరికిపోయాడు. ఇప్పుడు పాల్‌సింగ్ సైతం పట్టుబడడం గమనార్హం. -
వీఆర్వోల లంచావతారం
పట్టాదారు పాసుపుస్తకాలు, కంప్యూటర్ అడంగళ్లు, భూముల వివరాల కోసం కొందరు వీఆర్వోలు అన్నదాతలను జలగల్లా పట్టిపీడిస్తున్నారు. తాజాగా సోమవారం తెలంగాణలోని రెండు జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వీఆర్వోల లంచావతారం మరోసారి బయటపడింది. వరంగల్ జిల్లా చిట్యాల మండలం పంగిడిపల్లి గ్రామ పంచాయితీలో లంచం తీసుకుంటూ ఓ వీఆర్ఓ ఏసీబీ అధికారులకు చిక్కాడు. గ్రామానికి చెందిన గౌడ సమ్మయ్య అనే రైతు నుంచి స్థానిక వీఆర్ఓ కొత్తూరి రవీందర్ రూ. 30 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రందించాడు. ఈ క్రమంలో ఈ రోజు రైతు నుంచి వీఆర్వో లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి డబ్బును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం పెద్దకల్వల వీఆర్ఓ మల్లేశం, దుర్గయ్య అనే రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పెద్ద కల్వల గ్రామానికి చెందిన దుర్గయ్య అనే రైతు తన భూమి మ్యుటేషన్ కోసం వీఆర్ఓకు దరఖాస్తు చేసుకోగా రూ.15 వేలు డిమాండ్ చేశాడు. 5 వేల రూపాయలు ఇదివరకే ఇచ్చినా పనిచేయకపోవడంతో పాటు మిగతా డబ్బులు కూడా ఇవ్వాలన్నాడు. చివరకు రూ.10 వేలు రైతు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
18న తాడేపల్లిగూడెంలో వీఆర్వోల సమావేశం
పెనుమంట్ర : ఈనెల 18న వీఆర్వోల జిల్లా సమావేశం తాడేపల్లిగూడెంలో జరుగుతుందని సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు బీహెచ్ రవీంద్రరాజు చెప్పారు. పెనుమంట్రలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తాడేపల్లిగూడెం రైల్వేస్టేçÙన్ ఎదురుగా ఉన్న ధన రెసిడెన్సీలో ఆదివారం మధ్యాహ్నం ఈ సమావేశం జరుగుతుందన్నారు. సమావేశానికి రాష్ట్ర వీఆర్వోల సంఘ అధ్యక్షుడు బొత్స వత్సలనాయుడు, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొంటారన్నారు -
రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ సర్పంచ్ దాడి
పాత శ్రీకాకుళం : ‘ఏరా.. ఒళ్లు ఎలా ఉంది.. నువ్వు ఫోన్ చేయడమేట్రా? వీఆర్ఓ చేయలేడా.. వాడు ఏం చేస్తున్నాడు.. మేం వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.. మాకు ఫోన్ చేసే అర్హత నీకు లేదు.. ప్రభుత్వం మాదీ, మాతో జాగ్రత్తగా ఉండండి.. లేదంటే మీ జాతకాలు మార్చేస్తాం..’ అంటూ శ్రీకాకుళం రూరల్ మండలం శిలగాం సింగువలస టీడీపీ సర్పంచ్ వీఆర్ఏ, వీఆర్ఓలను అసభ్యకర పదజాలంతో దూషించాడు. అక్కడితో ఆగకుండా ఒక్కొక్కరినీ చెంపదెబ్బకొట్టాడు. దీంతో ఉద్యోగులిద్దరూ మంగళవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... శిలగాం సింగువలస లో రేషన్ డిపోకు సంబంధించి డీలర్ నియామకానికి సర్పంచ్ సంతకం అవసరం ఏర్పడింది. దీనికోసం వీఆర్ఏ కొర్రాగి చిన్న రాజారావు మంగళవారం ఉదయం టీడీపీ సర్పంచ్ ఇంటికి వెళ్లారు. సర్పంచ్ లేకపోవడంతో ఆయన ఇంటి వద్ద నుంచే ఫోన్ చేశాడు. ఈ సమయంలో వీఆర్ఏపై సర్పంచ్ తీవ్రంగా మండిపడ్డాడు. మధ్యాహ్నం పూట ప్రజా సాధికార సర్వేలో ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏను చూసి అటుగా వెళ్లిన సర్పంచ్ ఆగాడు. ఇంతలో వీఆర్ఏ సర్పంచ్ వద్దకు వెళ్లి రేషన్ డిపోకు సంబంధించి సంతకం కావాలని అడిగారు. దీంతో సర్పంచ్ ఒక్కసారిగా ఆగ్రహంతో రెచ్చిపోయి వీఆర్ఏపై చేయి చేసుకున్నాడు. ఇంతలో వీఆర్ఓ వైద శ్రీనివాసరావు విషయం తెల్సుకుందామని సర్పంచ్ వద్దకు వెళ్లగా ఆయనకు కూడా చెంపదెబ్బలు తగిలించాడు. దీంతో వీఆర్ఓ, వీఆర్ఏలు జరిగిన విషయాన్ని రెవెన్యూ సంఘం అసోషియేషన్‌కు తెలియజేయగా నేతలు కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి వీఆర్ఓ, వీఆర్ఏ సంఘ ఉద్యోగులంతా కలిసి రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడు, టౌన్ సీఐ అప్పలనాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. రూరల్ ఏఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు వీఆర్వోల సంఘం సమావేశం
హన్మకొండ అర్బన్ : తెలంగాణ వీఆర్వోల సంఘం ముఖ్య నాయకుల సమావేశం ఈ నెల 7న హన్మకొండలోని రెవెన్యూ అతిథి గృహంలో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లాఅధ్యక్షుడు సలువాది సర్వేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. కొత్త జిల్లాలకు కేటాయింపులు, వీ ఆర్వోల బదిలీలు, ఇతర సమస్యలపై సమావేశంలో 11 గంటలకు చర్చంచనున్నట్లు తెలిపారు. -
46 మంది వీఆర్వోల బదిలీ
డివిజన్ దాటేలా పోస్టింగ్‌లు ‘టోల్ ఫ్రీ’ ఫిర్యాదుల ఎఫెక్ట్ ముందే చెప్పిన ‘సాక్షి’ హన్మకొండ అర్బన్ : జిల్లాలో 46 మంది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(వీఆర్వో)లకు స్థానచలనం కల్పిస్తూ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన జిల్లాల ఏర్పా టు సమయంలో పెద్ద సంఖ్యలో వీఆర్వోలను బదిలీ చేయ డం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదులు, ఇటీవల ఉద్యోగుల పనితీరు విషయంలో ఆర్డీవోల నుంచి కలెక్టర్ సేకరించిన నివేదిక ఆధారంగా భారీ సంఖ్యలో వీఆర్వోలను కలెక్టర్ బదిలీ చేసినట్లు సమాచా రం. ప్రస్తుత బదిలీల్లో వీఆర్వోలను రెవెన్యూ డివి జన్ పరి ధి దాటేలా చేశారు. ములుగు డివిజన్ నుంచి అత్యధికంగా 17 మందికి స్థానచలనం కల్పించారు. కాగా త్వర లో ఇతర కేడర్ల ఉద్యోగులు, అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైం ది. బదిలీ అయిన వీఆర్వోల వివరాలిలా ఉన్నాయి. వరంగల్ డివిజన్ నుంచి ఏడుగురు శ్రీధర్‌రెడ్డి ఆత్మకూరు మండలం నుంచి బచ్చన్నపేట మండలం అల్లిపురానికి, పద్మ ఆత్మకూరు మండలం నుంచి జనగామ మండలం చీటకోడూరు, సంపత్ వర్ధన్నపేట మండలం నుంచి లింగాలఘన్పూర్ మండలం కల్లెంకు, శ్రీనివాస్ వర్ధన్నపేట మండలం నుంచి పెద్దరాంచెర్లకు, రాంబాబు గీసుకొండ మండలం నుంచి చిట్యాల మండలం దానంపల్లికి, ఏకాంబరం పర్వతగిరి మండలం నుంచి కొడకండ్లకు, ప్రదీప్‌కుమార్ జఫర్‌గఢ్ మండలం నుంచి బచ్చన్నపేట మండలం కట్కూర్‌కు. జనగామ డివిజన్ నుంచి 8 మంది వీఆర్వో నర్సింహులును బచ్చన్నపేట మండలం నుంచి ఆత్మకూరు మండలం దామెరకు, అదే మండలం నుంచి లక్ష్మనర్సయ్యను జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లుకు, రామకృష్ణారెడ్డి లింగాలఘన్పూర్ మండలం నుంచి వర్ధన్నపేట మండలం నందనంకు, సైదులు కొడకండ్ల మండలం నుంచి పర్వతగిరి మండలం గోపనపల్లికి, బాబు జనగామ నుంచి ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌కు, అబ్బసాయిలు జనగామ మండలం నుంచి వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, సిద్దమల్లయ్య చిట్యాల నుంచి గీసుకొండ మండలం మచ్చాపూర్, తిరుపతి నర్మెట్ట మండలం నుంచి గూడూరు మండలం లక్ష్మపూర్కు. నర్సంపేట డివిజన్ నుంచి ఆరుగురు గూడూరు మండలం నుంచి రవీందర్ నర్మెట్ట మండలం వెల్దండకు, శ్రీనయ్య చెన్నారావుపేట మండలం నుంచి డోర్నకల్ ఉయ్యాలవాడకు, వీరస్వామి గూడూరు మండలం నుంచి డోర్నకల్ మండలం చిల్కోడు, రమేష్ కొత్తగూడ మండలం నుంచి కేసముంద్రం మండలం పెనుగొండ, సురేష్‌బాబు కొత్తగూడ మండలంనుంచి కురవి మండలం గుండ్రాతిమడుగు, రాములు కొత్తగూడ మండలం నుంచి కురవి మండలం నేరడకు. మహబూబాబాద్ డివిజన్ నుంచి 8 మంది కుమారస్వామి మహబూబాబాద్ మండలం నుంచి చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌కు, యాకయ్య తొర్రూరు నుంచి నల్లబెల్లి మండలం రంగాపూర్‌కు, నారాయణ నెక్కొండ మండలం నుంచి రేగొండ మండలం కొడవటం చ, నాగభూషణం డోర్నకల్ మండలం నుంచి ఏటూరునాగారం మండలం ఐలాపూర్‌కు, పండయ్య కురవి మండలం నుంచి ఏటూరునాగారం ఆకులవారి ఘనపురం, బషీర్ మరిపెడ మండలం నుంచి చిట్యాల మండలం గర్మిళ్లపల్లికి, అఫ్జల్ మరిపెడ మండలం నుంచి చిట్యాల మండలం వెల్లంపల్లికి, ముత్తయ్య కేసముంద్రం మండలం నుంచి గోవిందరావుపేట మండలం కర్లపల్లికి బదిలీ చేశారు. ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠములుగు డివిజన్ నుంచి 17 మంది వీఆర్వో సంతోష్ చెల్పూర్ గ్రామం నుంచి కురవి మం డలం కందికొండకు, రాజేందర్ భూపాలపల్లి మండలం నుంచి నర్సింహులపేట మండలం గున్నెపల్లికి, కిష్ణమూర్తి భూపాలపల్లి మండలం నుంచి తొర్రూరు మండలం బొమ్మకల్‌కు, జేసీ భాస్కర్ ములుగు మండలం నుంచి నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లికి, దేవేందర్ మొగుళ్లపల్లి మండ లం నుంచి మరిపెడ మండలం తానంచెర్లకు, మొగిలి మొగుళ్లపల్లి మండలం నుంచి మరిపెడ మండలం ధర్మారం, మం డల సుభాష్ రేగొండ మండలం నుంచి మరిపెడ మండలం గుండెపుడి, గంపల నర్సయ్య ఏటూరునాగారం మండలం నుంచి నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం, ఎండీ.ఖాసిం ఏటూరునాగారం మండలం నుంచి నెల్లికుదురు మండలం నైనాల, ఐలయ్య ఏటూరునాగారం మండలం నుంచి నెల్లికుదురు మండలం ఆలేరుక్లస్టర్, శేఖర్ మంగపేట మండలం నుంచి కొత్తగూడ మండలం జంగంవానిగూడెం, మున్వర్ మంగపేట మండలం నుంచి కొత్తగూడ మండలం గంగారం, గోపాల్‌రావు వెంకటాపూర్ మండలం నుంచి తిమ్మరేనిపహాడ్కు, మల్లయ్య చిట్యాల మండలం నుంచి గూడూరు మం డలం అప్పరాజుపల్లికి, సాంబలక్ష్మి చిట్యాల మండలం నుంచి దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి, సాంబయ్య తాడ్వా యి మండలం నుంచి పాలకుర్తి మండలం విస్నూరు. -
సస్పెన్షన్ ఎత్తివేయకుంటే ఉద్యమిస్తాం
ఏలూరు (మెట్రో) : వీఆర్వో దుర్గారావును ఆర్డీవో చేయి చేసుకోవడం తప్పు కాదా అని జిల్లా వీఆర్వోలు, రెవెన్యూ సంఘ నాయకులు ప్రశ్నిం చారు. శుక్రవారం సాయంత్రం స్థానిక రెవెన్యూ భవన్లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్ మాట్లాడుతూ వీఆర్వో దుర్గారావుకు కలెక్టర్ సొమ్ములు ఇచ్చి అది లంచం అని చెప్పడం ఎంతవరకూ సమంజసమన్నారు. కనీసం నేటికీ బాధితుల వద్ద నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని, అయినప్పటికీ తహసీల్దార్‌తో బలవంతంగా నివేదిక తెప్పించుకుని దుర్గారావును సస్పెండ్ చేశారన్నారు. జిల్లాలో అవినీతి అంతా జిల్లా అధికారుల వద్దే ఉందని, కిందిస్థాయి ఉద్యోగుల పట్ల నిరాధార ఆరోపణలు చేసి సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని సాగర్ అన్నారు. కార్యదర్శి కె.రమేష్ మాట్లాడుతూ ఇటీవల జమాబంధీ పేరుతో ఒక్కో వీఆర్వో రూ.10 వేల నుంచి రూ. 20 వేలు వసూలు చేసి ఇచ్చారని, ఈ లంచాలు తీసుకున్న ఉన్నతాధికారులు నిజాయతీపరులా అని ప్రశ్నించారు. బలవంతంగా సొమ్ములు ఇచ్చి దానికి లంచం అని పేరుపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దుర్గారావుపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే ఎన్జీవోలు, రెవెన్యూ, జేఏసీ సంఘాల ఆ««దl్వర్యంలో ఉద్యమిస్తామని రమేష్ చెప్పారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. -
లంచం కేసు నమోదుపై పోలీసుల మల్లగుల్లాలు
ఏలూరు (మెట్రో) : జనన ధ్రువీకరణ పత్రాల కోసం వీఆర్వో లంచం అడిగారని మహిళ ఫిర్యాదుతో అతడిని కలెక్టరేట్‌కు పిలిపించిన కలెక్టర్ భాస్కర్ రూ.5 వేలు ఇచ్చి పని పూర్తి చేయాలంటూ కోరిన ఘటనకు సంబంధించి వీఆర్వో దుర్గారావుపై కేసు నమోదుకు పోలీసులు మల్లగుల్లాలు పడ్డారు. సోమవారం రాత్రి నుంచి దుర్గారావుపై ఏ విధంగా కేసు నమోదు చేయాలనే సమాలోచనలు చేసిన పోలీసులు చివరకు కలెక్టరేట్ తమ పరిధిలోనిది కాదంటూ చేతులెత్తేశారు. ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదును ఏలూరు త్రీటౌన్ పోలీసులకు బదిలీ చేశారు. దీంతో త్రీటౌన్ పోలీసులు సోమవారమే సదరు వీఆర్వోపై రాత్రి 10 గంటల సమయంలో కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్ పొందుపరిచారు.166 ఐపిసి, 7 పీసీఏ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. వీఆర్వోను సుమారు 30 గంటల పాటు పోలీసులు తమ నిర్భందంలో ఉంచుకుని స్టేషన్ల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. చివరకు వీఆర్వోల సంఘ నేతలు, ఎన్జీవో నాయకుల చర్చల ఫలితంగా పూచీకత్తుపై వీఆర్వోను విడుదల చేశారు. ఏసీబీ కేసును పోలీసులు ఎలా నమోదు చేస్తారు? వాస్తవానికి ఒకరు చేసిన ఆరోపణపై వీఆర్వోను కలెక్టరేట్‌కు పిలిపించిన కలెక్టర్ రూ. 5 వేలు ఇచ్చారని, వీఆర్వో తిరస్కరించినా బలవంతంగా ఇచ్చి వెళ్లిపోయారని, వాస్తవానికి ఈ కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయాలి కానీ పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటని వీఆర్వోల సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. వీఆర్వో లంచం డిమాండ్ చేస్తే సస్పెన్షన్ వేటు వేయకుండా పోలీస్‌స్టేషన్ లో నిర్భందించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. -
వీఆర్వోకు లంచం ఇచ్చిన కలెక్టర్ !
ఏలూరు (మెట్రో) : తన కుమారులకు సంబంధించిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసి, సమస్య పరిష్కారం చేయాలని కోరితే లంచం అడుగుతున్నారని, కొంతమేర లంచం ఇచ్చినా మిగిలిన సొమ్ములు ఇస్తేనే పనులు చేస్తామని వీఆర్వో దుర్గారావు తిప్పుతున్నాడని ఏలూరుకు చెందిన ఒక మహిళ కలెక్టర్ భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఏలూరు–1 వీఆర్వోను కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి లంచం విషయంపై ఆరా తీశారు. బాధిత మహిళను పిలిచి ఎంత లంచం డిమాండ్ చేశాడని ప్రశ్నించారు. రూ.10 వేలు అడిగారని, రూ. 2,500 ఇచ్చానని, మిగిలిన సొమ్ములు ఇస్తేనే కానీ పనిచేయనని చెబుతున్నాడని తెలిపింది. దీనిపై స్పందించిన కలెక్టర్ తన జేబులో ఉన్న రూ.5 వేలు తీసి తక్షణమే పని చేయాలని, బాధిత మహిళ తరఫున తాను లంచం సొమ్ములు ఇస్తున్నానని చెప్పారు. దీంతో కంగుతిన్న వీఆర్వో తాను లంచాన్ని అడగలేదని చెప్పుకొచ్చాడు. కలెక్టర్ ఇచ్చిన సొమ్ములు ఇవ్వబోయాడు. ఈ సొమ్ములు తీసుకుని సోమవారం సాయంత్రానికి పనిచేయాలని లేకుంటే మంగళవారం నుంచి ఉద్యోగం చేయడానికి వీఆర్వోగా ఉండవని హెచ్చరించారు. ఈ విషయంపై విచారణ నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావును ఆదేశించారు. లంచం సొమ్ముల విషయంపై కలెక్టర్ భాస్కర్ ఏలూరు ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత వీఆర్వో దుర్గారావుపై చేయి చేసుకున్నట్టు తెలిసింది. దీనిపై ఆగ్రహించిన వీఆర్వో సంఘ నేతలు స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్ ముందు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత వీఆర్వోపై కేసు నమోదు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. దీనిపై త్రీటౌన్ ఎస్సై ఎం.సాగర్‌బాబును వివరణ కోరగా డీఎస్పీ ఆదేశాల మేరకు తాము వీఆర్వోపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. లంచం తీసుకున్న కేసులో కేసు నమోదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. -
ఆశపడ్డాడు.. దొరికిపోయాడు!
రూ. 4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో రాజాంలో కలకలం రాజాం/రాజాం రూరల్: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్న వారి జాబితాలో తాజాగా మరో ప్రభుత్వ ఉద్యోగి చేరారు. కంచరాం గ్రామానికి చెందిన రైతు నుంచి శుక్రవారం రూ. 4 వేలు లంచం తీసుకుంటూ కంచరాం–1 వీఆర్ఓ సీహెచ్ కృష్ణ అడ్డంగా ఏసీబీ పన్నిన వలలో చిక్కారు. ఈ సంఘటన రాజాం మండలంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే .. కంచరాం గ్రామానికి చెందిన రైతు పొట్నూరు సత్యం వీఆర్ఓ కృష్ణను ఆరు నెలల క్రితం సంప్రదించి తాము నలుగురు అన్నదమ్ములమని, భూములకు సంబంధించి సర్వేనంబర్లు మ్యూటేషన్ చేసి పట్టాదార్ పాస్‌పుస్తకాలు తయారు చేసి అందించాలని కోరాడు. దీంతో ముగ్గురుకి చెందిన పాస్ పుస్తకాలను వీఆర్వో జారీ చేయగా.. సత్యం విషయానికి వచ్చేసరికి ఐదు వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో సత్యం అప్పట్లోనే వెయ్యి రూపాయలను వీఆర్వోకు ఇచ్చాడు. మిగిలిన సొమ్మును ఇవ్వడంలో రైతు జాప్యం చేయడంతో వీఆర్వో కూడా పాస్ పుస్తకాల పనిని చేయడంలో వాయిదా వేస్తూ వచ్చారు. దీనిపై పలుమార్లు బాధితుడు సత్యం వీఆర్ఓ కృష్ణను సంప్రదిస్తున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో విసిగెత్తిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ రంగరాజ్ రంగప్రవేశం చేసి శుక్రవారం గ్రామంలో పల్స్ సర్వేలో ఉన్న వీఆర్ఓ కృష్ణకు రైతుతో ఫోన్ చేయించి మిగిలిన రూ. నాలుగు వేలు సొమ్మును ఇస్తానని చెప్పాడు. వీఆర్ఓను రైతు సత్యం కలిసి సొమ్మును అందజేస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు కృష్ణను పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రంగరాజ్ చెప్పారు. స్థానిక డిప్యూటీ తహసీల్దార్ కృష్ణమూర్తి నుంచి మరికొన్ని వివరాలు సేకరించారు. కడుపు మండింది పేద రైతునైన తనను వీఆర్వో కృష్ణ డబ్బుల కోసం నానా ఇబ్బందులకు గురిచేశాడు. పాస్ పుస్తకాలు లేకపోవడంతో అనేక రాయితీలు కోల్పోయాను. అందుకే కడుపు మండి ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. – పొట్నూరు సత్యం, రైతు, కంచరాం లంచం అడిగితే జైలే ప్రజల తరఫున పనిచేయాల్సిన అధికార యంత్రాంగం అవినీతికి పాల్పడి లంచం పేరుతో వారిని వేధింపులకు గురిచేస్తే కృష్ణకు పట్టిన గతే పడుతుంది. ఎవరైనా సత్యం లాంటి బాధితులు ఉంటే తమకు తెలియజేయాలి. అలాంటి వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. – రంగరాజ్, డీఎస్పీ, ఏసీబీ, శ్రీకాకుళం -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో
రాజాం(శ్రీకాకుళం): రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కంచరాం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు అడంగళ్ పహాణీ కోసం కొద్ది రోజులుగా వీఆర్వో చింత కృష్ణ చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, వీఆర్వో మాత్రం రూ.5 వేలు ఇస్తేనే పని అవుతుందని చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలోని కొల్లివీధిలో రైతు వీఆర్వోకు రూ.4 వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.