తెలంగాణలో వీఏఓ, వీఆర్వోల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలను వేధించుకుతింటున్నారు. దీనికి తాజాగా జరిగిన ఘటన ఉదాహరణగా నిలిచింది. వీఆర్వో, వీఏవో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని సీఎం కేసీఆర్‌కు లేఖ రాసి.. తన ముగ్గురు పిల్లలతో కలిసి అదృశ్యమయ్యారు హైదరాబాద్‌లోని తార్నాకలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి. పెద్దపల్లి జిల్లా పగిడిపల్లిలోని తన తండ్రి నారాయణ రెడ్డి మరణించిన తర్వాత వారసత్వంగా వచ్చే భూమిని తన పేరు మీదకు మార్చాలని అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడి వీఏఓ, వీఆర్వోలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని లేఖలో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌కు సెల్ఫీ వీడియో.. ముగ్గురు పిల్లలతో అదృశ్యం
Published Thu, Jun 6 2019 7:12 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement