VAO
-
మొక్కుబడిగా ‘స్థానిక’ ధ్రువీకరణ పత్రాలిస్తారా?
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్) అడ్మిషన్ల భర్తీ కోసం ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాల జారీలో తహసీల్దార్ల తీరు ఆక్షేపణీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్థానికత ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి తెలంగాణకు చెందిన వారో.. కాదో విచారణ చేసి సర్టీ ఫికెట్ ఇవ్వాలి తప్ప, మొక్కబడిగా ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. ఈ విషయంలో తహసీల్దార్లకు తగిన సూచనలు చేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కు చెప్పింది. ఇతర రాష్ట్రాల్లో చదివి తిరిగి తెలంగాణకు వచ్చిన విద్యార్థులకు ‘స్థానిక’ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని, ఇందులో ఫలానా చోట రెండేళ్లుగా నివాసం ఉంటున్నారని మాత్రమే జారీ చేయడంతో వాటిని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆమోదించడం లేదని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తెచ్చిన వైద్య విద్య అడ్మిషన్ల నిబంధనల కారణంగా తెలంగాణకు చెందిన వారైనప్పటికీ సీట్లు కోల్పోతున్నారని, తల్లిదండ్రుల ఉద్యోగ, ఇతర కారణాలతో ఒకట్రెండేళ్లు పక్క రాష్ట్రాల్లో చదువుకున్న వారికి స్థానిక కోటా కింద సీటు నిరాకరించడం తగదని ఇటీవల సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఎటూ తేల్చని విధంగా ఇస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో స్థానికతపై స్పష్టత ఇస్తూ సర్టి ఫికెట్లు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
సీఎం కేసీఆర్‌కు సెల్ఫీ వీడియో.. ముగ్గురు పిల్లలతో అదృశ్యం
-
సీఎం కేసీఆర్‌కు లేఖ.. ముగ్గురు పిల్లలతో అదృశ్యం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వీఏఓ, వీఆర్వోల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలను వేధించుకుతింటున్నారు. దీనికి తాజాగా జరిగిన ఘటన ఉదాహరణగా నిలిచింది. వీఆర్వో, వీఏవో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని సీఎం కేసీఆర్‌కు లేఖ రాసి.. తన ముగ్గురు పిల్లలతో కలిసి అదృశ్యమయ్యారు హైదరాబాద్‌లోని తార్నాకలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి. పెద్దపల్లి జిల్లా పగిడిపల్లిలోని తన తండ్రి నారాయణ రెడ్డి మరణించిన తర్వాత వారసత్వంగా వచ్చే భూమిని తన పేరు మీదకు మార్చాలని అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడి వీఏఓ, వీఆర్వోలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని లేఖలో పేర్కొన్నారు. తన చావుకు, పిల్లల చావుకు వీఏఓ, వీఆర్వోలే కారణమని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఒక సెల్ఫీ వీడియో రికార్డు చేసి, తన మరణానంతరం ఆస్తిని తన తల్లి పేరు మీద రాసివ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా మల్లా రెడ్డి అదృశ్యం పట్ల కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. మల్లారెడ్డి ఆచూకి లభ్యం తార్నాకలో తన ముగ్గురు పిల్లలలతో మిస్సింగ్ అయిన మల్లారెడ్డి ఆచూకీని ఓయూ పోలీసులు కనుగొన్నారు. భువనగిరిలో ఉన్న మల్లారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మల్లారెడ్డి ఆచూకి కనుగొన్న పోలీసులు.. ఆయనతో పాటు ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. -
'కారులో తీసుకెళ్లి రక్తం వచ్చేలా కొట్టారు'
గుంటూరు : గుంటూరు జిల్లా ఆత్మకూరులో కబ్జాదారుల దాడిలో గాయపడ్డ వీఆర్వో శ్రీనివాసరావు, వీఆర్ఏ చలపతిరావు...తమపై దాడి జరిగిన వైనాన్ని 'సాక్షి'కి వివరించారు. తహశీల్దార్ ఆదేశాల మేరకే సంఘటనా స్థలానికి వెళ్లామని వీఆర్వో, వీఆర్ఏ తెలిపారు. అక్రమంగా నిర్మించిన గోడలు తొలగిస్తుండగా కబ్జాదారులు వచ్చారని, వీఆర్ఓ శ్రీనివాసరావును కిందపడేసి చితకబాదారని, ప్రాణభయంతో దండం పెడుతున్నా వదల్లేదని, వీఆర్ఏ చలపతిరావును కారులో తీసుకెళ్లి కొట్టారని, రక్తం వస్తున్నా వదల్దేదని, తమ నిర్మాణాలకు అడ్డం వస్తే ఉద్యోగాలను ఊడపీకిస్తామంటూ బెదిరించారని వారు వెల్లడించారు. మరోవైపు రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్ కరీముల్లాతో పాటు మరో ముగ్గురిపై సెక్షన్ 3332, 353, రెడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు కబ్జాదారుల దాడిలో గాయపడ్డ వీఆర్వో శ్రీనివాసరావు, వీఆర్ఏ చలపతిరావు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెవెన్యూ సిబ్బందిపై దాడిచేసిన వారిపై కేసు నమోదు
గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్ కరీముల్లాతో పాటు మరో ముగ్గురిపై సెక్షన్ 3332, 353, రెడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు కబ్జాదారుల దాడిలో గాయపడ్డ వీఆర్వో శ్రీనివాసరావు, వీఆర్ఏ చలపతిరావు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మండల పరిధిలోని ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిని అనుకుని ఉన్న సర్వే నంబరు 366లో అదే గ్రామానికి చెందిన బొమ్ము ఉమామహేశ్వరరెడ్డితోపాటు మరో ఇద్దరికి ప్రభుత్వం గతంలో 65 సెంట్లకు డీ పట్టాలు మంజూరు చేసింది. ఈ భూమి రికార్డుల్లో మాత్రం వాగు పోరంబోకుగా నమోదుగా ఉంది. మంగళగిరికి చెందిన కొందరు అందులోని 20 సెంట్లకు నకిలీ దస్తావేజులు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నించగా అనుభవదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పిలిపించి న పోలీసులు, ఆ భూమి విషయం తేల్చేవరకు అక్కడ అడుగుపెట్టవద్దని హెచ్చరించారు. అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోయిన భూ మాఫియా ఆదివారం స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో స్థానిక తహశీల్దార్ వీఆర్వో శ్రీనివాసరావును పరిశీలనకు పంపారు. వీఆర్ఏ చలపతిరావుతో కలిసి స్థలం వద్దకు వెళ్లిన వీఆర్వో.. నిర్మాణాలు ఆపాలని వారికి సూచించారు. అక్కడే వున్న కరిముల్లాతో పాటు మరో ఐదుగురు రెవెన్యూ సిబ్బందిని దూషించడంతో ఘర్షణ మొదలైంది. దీంతో రెచ్చిపోయిన ఆరుగురు వీఆర్వో , వీఆర్ఏలపై దాడి చేశారు.