గుంటూరు : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్ కరీముల్లాతో పాటు మరో ముగ్గురిపై సెక్షన్ 3332, 353, రెడ్విత్ 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు కబ్జాదారుల దాడిలో గాయపడ్డ వీఆర్వో శ్రీనివాసరావు, వీఆర్ఏ చలపతిరావు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా మండల పరిధిలోని ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిని అనుకుని ఉన్న సర్వే నంబరు 366లో అదే గ్రామానికి చెందిన బొమ్ము ఉమామహేశ్వరరెడ్డితోపాటు మరో ఇద్దరికి ప్రభుత్వం గతంలో 65 సెంట్లకు డీ పట్టాలు మంజూరు చేసింది. ఈ భూమి రికార్డుల్లో మాత్రం వాగు పోరంబోకుగా నమోదుగా ఉంది. మంగళగిరికి చెందిన కొందరు అందులోని 20 సెంట్లకు నకిలీ దస్తావేజులు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నించగా అనుభవదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులను పిలిపించి న పోలీసులు, ఆ భూమి విషయం తేల్చేవరకు అక్కడ అడుగుపెట్టవద్దని హెచ్చరించారు. అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోయిన భూ మాఫియా ఆదివారం స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో స్థానిక తహశీల్దార్ వీఆర్వో శ్రీనివాసరావును పరిశీలనకు పంపారు. వీఆర్‌ఏ చలపతిరావుతో కలిసి స్థలం వద్దకు వెళ్లిన వీఆర్వో.. నిర్మాణాలు ఆపాలని వారికి సూచించారు. అక్కడే వున్న కరిముల్లాతో పాటు మరో ఐదుగురు రెవెన్యూ సిబ్బందిని దూషించడంతో ఘర్షణ మొదలైంది. దీంతో రెచ్చిపోయిన ఆరుగురు వీఆర్వో , వీఆర్ఏలపై దాడి చేశారు.
రెవెన్యూ సిబ్బందిపై దాడిచేసిన వారిపై కేసు నమోదు
Published Mon, Jul 27 2015 10:06 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM
Advertisement