'కారులో తీసుకెళ్లి రక్తం వచ్చేలా కొట్టారు' | Attack on VRO VRA sign of land mafia going | Sakshi
Sakshi News home page

'కారులో తీసుకెళ్లి రక్తం వచ్చేలా కొట్టారు'

Published Mon, Jul 27 2015 10:25 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

'కారులో తీసుకెళ్లి రక్తం వచ్చేలా కొట్టారు' - Sakshi

'కారులో తీసుకెళ్లి రక్తం వచ్చేలా కొట్టారు'

గుంటూరు : గుంటూరు జిల్లా ఆత్మకూరులో కబ్జాదారుల దాడిలో గాయపడ్డ వీఆర్వో శ్రీనివాసరావు, వీఆర్ఏ చలపతిరావు...తమపై దాడి జరిగిన వైనాన్ని 'సాక్షి'కి వివరించారు.  తహశీల్దార్ ఆదేశాల మేరకే సంఘటనా స్థలానికి వెళ్లామని వీఆర్వో, వీఆర్ఏ తెలిపారు. అక్రమంగా నిర్మించిన గోడలు తొలగిస్తుండగా కబ్జాదారులు వచ్చారని, వీఆర్ఓ శ్రీనివాసరావును కిందపడేసి చితకబాదారని, ప్రాణభయంతో దండం పెడుతున్నా వదల్లేదని, వీఆర్ఏ చలపతిరావును కారులో తీసుకెళ్లి కొట్టారని, రక్తం వస్తున్నా వదల్దేదని, తమ నిర్మాణాలకు అడ్డం వస్తే ఉద్యోగాలను ఊడపీకిస్తామంటూ బెదిరించారని వారు వెల్లడించారు.

మరోవైపు  రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్ కరీముల్లాతో పాటు మరో ముగ్గురిపై సెక్షన్ 3332, 353, రెడ్విత్ 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు కబ్జాదారుల దాడిలో గాయపడ్డ వీఆర్వో శ్రీనివాసరావు, వీఆర్ఏ చలపతిరావు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement