లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పెద్దకల్వల వీఆర్వో మల్లేశం
వీఆర్వోల లంచావతారం
Published Mon, Sep 19 2016 3:45 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
పట్టాదారు పాసుపుస్తకాలు, కంప్యూటర్ అడంగళ్లు, భూముల వివరాల కోసం కొందరు వీఆర్వోలు అన్నదాతలను జలగల్లా పట్టిపీడిస్తున్నారు. తాజాగా సోమవారం తెలంగాణలోని రెండు జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వీఆర్వోల లంచావతారం మరోసారి బయటపడింది.
వరంగల్ జిల్లా చిట్యాల మండలం పంగిడిపల్లి గ్రామ పంచాయితీలో లంచం తీసుకుంటూ ఓ వీఆర్‌ఓ ఏసీబీ అధికారులకు చిక్కాడు. గ్రామానికి చెందిన గౌడ సమ్మయ్య అనే రైతు నుంచి స్థానిక వీఆర్‌ఓ కొత్తూరి రవీందర్ రూ. 30 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రందించాడు. ఈ క్రమంలో ఈ రోజు రైతు నుంచి వీఆర్వో లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి డబ్బును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం పెద్దకల్వల వీఆర్‌ఓ మల్లేశం, దుర్గయ్య అనే రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పెద్ద కల్వల గ్రామానికి చెందిన దుర్గయ్య అనే రైతు తన భూమి మ్యుటేషన్ కోసం వీఆర్‌ఓకు దరఖాస్తు చేసుకోగా రూ.15 వేలు డిమాండ్ చేశాడు. 5 వేల రూపాయలు ఇదివరకే ఇచ్చినా పనిచేయకపోవడంతో పాటు మిగతా డబ్బులు కూడా ఇవ్వాలన్నాడు. చివరకు రూ.10 వేలు రైతు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Advertisement