మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు వీఆర్వో సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు వీఆర్వో సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బుచ్చిరెడ్డి అనే రైతు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సంబంధిత వీఆర్వో పర్వతాలు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా బుచ్చిరెడ్డిని తరచూ తిప్పుతున్నాడు. చివరకు రూ.2 వేలు ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీఆర్వో లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. పర్వతాలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.