traps
-
వివాహితను ట్రాప్ చేసిన ఏఎస్సై రామయ్య..
ఇబ్రహీంపట్నం: తన భర్త కొడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ యువతిని ట్రాప్ చేశాడు ఇబ్రహీంపట్నం ఏఎస్సై రామయ్య. అంతటితో ఆగకుండా ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటో తీయించుకున్నాడు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఇదే మండలం వర్షకొండకు చెందిన ఓ యువకుడితో గతంలోనే పెళ్లయ్యింది. వారికి కొడుకు, కూతురు సంతానం. ఉమ్మడి కుటుంబం కావడంతో కుటుంబంలో చిన్నచిన్న గొడవలు జరిగాయి. దీంతో భార్యాభర్తలు వేరుకాపురం పెట్టారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థాలు వచ్చాయి. భర్త తనను వేధిస్తున్నాడని, కొడుతున్నాడని సదరు యువతి కొద్దిరోజుల క్రితం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. ఏఎస్ఐ రామయ్య ఆమెనుంచి ఫిర్యాదు స్వీకరించాడు. విచారణ పేరుతో ఆమెతో సన్నిహితం పెంచుకున్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడి మరింత దగ్గరయ్యాడు. ఇటీవలే ఆ యువతితో ఓ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని యువతితో కలిసి ఫొటో దిగాడు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. న్యాయం కోసం వెళ్లిన యువతిని కాపాడాల్సిన పోలీసే ట్రాప్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయ.ుమై ఎస్సై అనిల్‌ను వివరణ కోరగా.. ఏఎస్ఐ రామయ్య విషయాన్ని చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎస్పీ కార్యాలయానికి అటాచ్డ్ జగిత్యాలక్రైం: ఇబ్రహీంపట్నం ఏఎస్సై రామయ్యను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు చేపడతామని తెలిపారు. -
50 మంది సైనికులపై వలపు వల
న్యూఢిల్లీ: భారత ఆర్మీకి సంబంధించిన కీలక వివరాలను సేకరించేందుకు పాకిస్తానీ మహిళ 50 మంది జవాన్లపై వల వేసిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. సున్నితమైన సమాచారాన్ని ఆమెతో పంచుకోవడంతో సోమ్‌వీర్ సింగ్ అనే సిపాయిని ఆర్మీ ఇప్పటికే అరెస్టు చేసింది. ఫేస్బుక్లో అనికా చోప్రా పేరుతో ఖాతా తెరిచి, ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్న ఫొటోను ప్రొఫైల్‌కు పెట్టి సదరు మహిళ జవాన్లకు వలపు వల విసిరింది. మిలిటరీ నర్సింగ్ విభాగంలో ఆర్మీ కెప్టెన్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకుంది. సోమ్‌వీర్‌ను అరెస్టు చేయడంతోపాటు మిగతా జవాన్లను కూడా ఆర్మీ ప్రస్తుతం విచారిస్తోంది. రాజస్తాన్‌లోని జైçసల్మేర్‌లో విధులు నిర్వర్తిస్తున్న సోమ్‌వీర్‌కు 2016లో ఈ మహిళ స్నేహ అభ్యర్థనను పంపి సంభాషించడం మొదలుపెట్టింది. త్వరలోనే వారి మాటలు హద్దులు దాటాయి. ఓ దశలో సోమ్‌వీర్ తన భార్యకు విడాకులివ్వాలని కూడా నిర్ణయించుకున్నాడు. అయితే, ఐదు నెలలుగా జమ్మూ నుంచి సోమ్‌వీర్‌కు ఎక్కువగా ఫోన్‌కాల్స్ వస్తుండటంతో ఆర్మీకి అనుమానం వచ్చి అతని సామాజిక మాధ్యమ ఖాతాలపై ఓ కన్నేసింది. ఫేస్బుక్లో సదరు మహిళతో అతని చాటింగ్‌ను ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఆమె పాకిస్తాన్ నుంచి ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లుగా నిర్ధారించుకుంది. సంభాషణల్లో తొలుత నీ పోస్టింగ్ ఎక్కడ లాంటి ప్రశ్నలతో మొదలుపెట్టి ట్యాంక్ ఫొటోలు పంపించమని ఆమె అడిగిందనీ, ఇది ఆమె పన్నిన వల అని తెలియని సోమ్‌వీర్ కొన్ని వివరాలు ఆమెకు తెలిపాడని అధికారులు చెప్పారు. అనంతరం ఆమె సోమ్‌వీర్‌ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందనీ, ఆ తర్వాత సమాచారం ఇచ్చినందుకు బదులుగా సోమ్‌వీర్ డబ్బు తీసుకుంటున్నాడని తెలిపారు. ఇలా మొత్తం 50 మంది జవాన్లపై పాక్ మహిళ ఫేస్బుక్ ద్వారా వల వేసింది. ఒక్కో జవాన్‌కు ఒక్కో సమయాన్ని కేటాయించి, ఆ సమయంలోనే ఆమె మాట్లాడేదని దర్యాప్తులో వెల్లడయింది. -
భార్యను ట్రాప్ చేసిన టెకీ: విడాకులకు ఓకే
బెంగళూరు: భార్యపై తనకున్నది అనుమానం కాదని, ఆమె మోసకారేనని కోర్టుకు నిరూపించి విడాకులు పొందాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ ఉదంతంలో టెకీ భర్త టెక్నాలజీ సాయంతో భ్యార్య మోసాన్ని వెలుగులోకి తెచ్చాడు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న 31ఏళ్ల యువకుడు భార్య, మూడేళ్ల కూతురితో కలిసి బెంగళూరు సిటీలోని ఓ ఫ్లాట్ లో ఉంటున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో అతనికి మెదటిసారి భార్యపై అనుమానం వచ్చింది. సిగరెట్ తాగేవాళ్లెవ్వరూలేని తన ఇంట్లో ఒక మూలన కాల్చిపారేసిన సిగరెట్ పీకను గుర్తించిన టెకీ.. భార్యను అడగ్గా, తనకేమీ తెలియదని బుకాయించిందామె. పెరిగిన అనుమానంతో భార్యపై నిఘా పెట్టిన టెకీ ఇంట్లో ఆమెకు తెలియకుండా నాలుగైదుచోట్ల కెమెరాలు ఏర్పాటుచేశాడు. అప్లికేషన్లను వినియోగించి భార్య ఫోన్ ను తన లాప్ టాప్ కు అనుసంధానం చేశాడు. దాదాపు నాలుగు అనుమానాన్ని నివృత్తిచేసే ఆధారాలేవీ దొరకలేదు. కానీ జులైలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని, వచ్చేటప్పుడు గర్భనిరోదక మాత్రలు తెమ్మని చెప్పిన మాటలు టెక్కీ చెవినపడ్డాయి. ఇక కెమెరాలు వాటిపని అవి చేసుకుపోయాయి. లివింగ్ రూమ్ లో, బాత్ రూమ్ లో, బెడ్ రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె సాగించిన లీలలన్నీ రికార్డయ్యాయి. ఆ ఫుటేజీలను చేతబట్టుకుని నేరుగా కోర్టుకు వెళ్లిన టెక్కీ తనకు విడాకులు కావాలని అభ్యర్థించాడు. కోర్టు ఆదేశానుసారం వీడియో రికార్డులను పరీక్షించిన బెంగళూరు మీడియేషన్ సెంటర్ (బీఎంసీ) అధికారులు అవి నిజమైనవేనని, ఎలాంటి మార్పులు చేయలేదని నిర్ధారించాయి. దీంతో కోర్టు ఆ టెకీకి విడాకులు మంజూరుచేసింది. పాప సంరక్షణ బాధ్యతలు కూడా తండ్రికే అప్పగించింది. -
ఏసీబీ వలలో వీఆర్వో
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరు వీఆర్వో సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బుచ్చిరెడ్డి అనే రైతు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సంబంధిత వీఆర్వో పర్వతాలు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా బుచ్చిరెడ్డిని తరచూ తిప్పుతున్నాడు. చివరకు రూ.2 వేలు ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీఆర్వో లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. పర్వతాలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో డీఈ
ఖమ్మం: పని పూర్తిచేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన ట్రాన్స్‌కో డీఈ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ట్రాన్స్కోశాఖలో డీఈ గా పనిచేస్తున్న సుదర్శన్ అదే శాఖలో జూనియర్ లైన్మెన్ గా పనిచేసి సస్పెండ్ అయిన పూర్ణచంద్రరావు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. సస్పెండ్ అయిన పూర్ణచంద్రరావు తనకు రావాలసిన ఏరియర్కు సంబంధించిన డబ్బులు ఇప్పించాల్సిందిగా డీఈని సంప్రదించారు. ఈ పనిచేయాలంటే రూ.25 వేలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. దీంతో పూర్ణచంద్రరావు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సుదర్శన్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతనితో పాటు ఏజెంట్‌గా వ్యవహరించిన శ్రీనివాస్‌రెడ్డితో పాటూ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
మృత్యుంజయులు
క్షేమంగా తిరిగొచ్చిన మత్స్యకారులు అచ్యుతాపురం : సముద్రంలో మృత్యువుతో పోరాడి మత్స్యకారులు బుధవారం పూడిమడక తీరానికి క్షేమంగా చేరుకున్నారు. ఈ నెల 14న పూడిమడకకు చెందిన ఉమ్మిడి దుర్గారావు, ఉమ్మిడి మసేను, ఉమ్మిడి దేముడు, మేరుగు తాతారావు, ఎరిపల్లి సత్తియ్య వేటకు వెళ్లారు. వీరు మంగళవారం రాత్రికి తీరానికి చేరుకోవాలి. సమయం మించిపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు బుధవారం ఉదయం మత్స్యకారులు తీరానికి చేరుకున్నారు. వలలు, వేట, భోజన సామగ్రి, డీజిల్, తాగునీరు క్యాన్లు, బట్టలు కోల్పోయారు. కట్టుబట్టలు, పడవతో తీరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంటాలమ్మ దేవతే తమను కాపాడిందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, బుధవారం ఈదురు గాలులు వీచి పడవ తిరగబడిపోయిందని తెలిపారు. సామగ్రి మొత్తం సముద్రంలో మునిగిపోయాయి. పడవను పలుమార్లు సరిచేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఒక దశలో ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. గంటలపాటు బోర్లా పడిన పడవను పట్టుకొని సేదదీరారు. గాలులు తగ్గడంతో తీరానికి రాగలిగామని వారు తెలిపారు. మత్స్యకారులు తీరానికి చేరుకోవడంతో వారి కుటుంబసభ్యులు ఊపిరి తీసుకున్నారు.