ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో డీఈ
ఖమ్మం: పని పూర్తిచేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన ట్రాన్స్‌కో డీఈ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ట్రాన్స్కోశాఖలో డీఈ గా పనిచేస్తున్న సుదర్శన్ అదే శాఖలో జూనియర్ లైన్మెన్ గా పనిచేసి సస్పెండ్ అయిన పూర్ణచంద్రరావు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. సస్పెండ్ అయిన పూర్ణచంద్రరావు తనకు రావాలసిన ఏరియర్కు సంబంధించిన డబ్బులు ఇప్పించాల్సిందిగా డీఈని సంప్రదించారు. ఈ పనిచేయాలంటే రూ.25 వేలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. దీంతో పూర్ణచంద్రరావు ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సుదర్శన్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతనితో పాటు ఏజెంట్‌గా వ్యవహరించిన శ్రీనివాస్‌రెడ్డితో పాటూ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.