transco DE
-
గుంతకల్లు డీఈ అవినీతి బాగోతం
సాక్షి, అనంతపురం : గుంతకల్లు ట్రాన్స్ కో డివిజనల్ ఇంజనీర్ రవిబాబు అవినీతి బాగోతం బట్టబయలైంది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల మంజూరు కోసం రైతుల నుంచి డీఈ రవిబాబు లక్షన్నర లంచం తీసుకున్నారు. ఇద్దరు రైతులు కలిసి లక్షన్నర లంచం ఇవ్వగా ఈ సొమ్ము లైన్ మెన్ ద్వారా డీఈకు చేరింది. కాగా రవిబాబు బాగోతాన్ని రైతులు రహస్యంగా సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అనంతరం దీనిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో డీఈ రవిబాబు దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా రైతులను వేధిస్తున్నట్లు డీఈ రవిబాబు పై కొంతకాలంగా ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఒక్కొ కొత్త ట్రాన్స్ ఫార్మర్కు 75000 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు దళారుల సహకారంతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
అనంతపురం: గుంతకల్లు ట్రాన్స్‌కో డీఈ రవిబాబు అవినీతి బాగోతం
-
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో డీఈ
ఖమ్మం: పని పూర్తిచేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన ట్రాన్స్‌కో డీఈ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ట్రాన్స్కోశాఖలో డీఈ గా పనిచేస్తున్న సుదర్శన్ అదే శాఖలో జూనియర్ లైన్మెన్ గా పనిచేసి సస్పెండ్ అయిన పూర్ణచంద్రరావు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. సస్పెండ్ అయిన పూర్ణచంద్రరావు తనకు రావాలసిన ఏరియర్కు సంబంధించిన డబ్బులు ఇప్పించాల్సిందిగా డీఈని సంప్రదించారు. ఈ పనిచేయాలంటే రూ.25 వేలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. దీంతో పూర్ణచంద్రరావు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సుదర్శన్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతనితో పాటు ఏజెంట్‌గా వ్యవహరించిన శ్రీనివాస్‌రెడ్డితో పాటూ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.