
సాక్షి, అనంతపురం : గుంతకల్లు ట్రాన్స్ కో డివిజనల్ ఇంజనీర్ రవిబాబు అవినీతి బాగోతం బట్టబయలైంది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల మంజూరు కోసం రైతుల నుంచి డీఈ రవిబాబు లక్షన్నర లంచం తీసుకున్నారు. ఇద్దరు రైతులు కలిసి లక్షన్నర లంచం ఇవ్వగా ఈ సొమ్ము లైన్ మెన్ ద్వారా డీఈకు చేరింది. కాగా రవిబాబు బాగోతాన్ని రైతులు రహస్యంగా సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అనంతరం దీనిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో డీఈ రవిబాబు దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా రైతులను వేధిస్తున్నట్లు డీఈ రవిబాబు పై కొంతకాలంగా ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఒక్కొ కొత్త ట్రాన్స్ ఫార్మర్‌కు 75000 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు దళారుల సహకారంతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment