సీరియస్‌ మీటింగ్‌.. సైలెంట్‌గా రమ్మీ! | Anantapur DRO Found Playing Online Rummy At Key Meeting, Check More Details Inside | Sakshi
Sakshi News home page

సీరియస్‌ మీటింగ్‌.. సైలెంట్‌గా రమ్మీ!

Published Wed, Jan 22 2025 10:04 AM | Last Updated on Wed, Jan 22 2025 1:45 PM

Anantapur DRO Found Playing Online Rummy at Key Meeting

 డీఆర్‌ఓ మలోల నిర్వాకం 

 వివరణ కోరిన కలెక్టర్‌  

 

అనంతపురం అర్బన్‌: కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ తరువాత రెవెన్యూ శాఖలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) పోస్టు అత్యంత కీలమైనది. అలాంటి పోస్టులో ఉన్న అధికారి అందరికీ ఆదర్శంగా, జవాబుదారీగా ఉండాలి. అయితే జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కీలకమైన సమావేశం జరుగుతున్న సమయంలో..  అదేమీ తనకు పట్టనట్లు బాధ్యతలు విస్మరించి తన మొబైల్‌ ఫోన్‌లో ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌ ఆడుతూ కెమెరాకు చిక్కారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. వివరాలు.. 

ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా ఈ నెల 20న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు వినోద్‌కుమార్, టి.ఎస్‌.చేతన్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్సీ, ఇతర సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఇదే సమయంలో వేదికపై ఉన్న డీఆర్‌ఓ మలోల అక్కడి వ్యవహారం తనకేమీ     సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. తన పక్కన ఉన్నతాధికారులు ఉన్నారనే కనీస ఆలోచన లేకుండా మొబైల్‌ ఫోన్‌లో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడారు. ఈ దృశ్యాన్ని     కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 

వివరణ కోరిన కలెక్టర్‌ 
కీలక సమావేశం జరుగుతున్న సమయంలో డీఆర్‌ఓ మలోల ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తీవ్రంగా పరిగణించారు. డీఆర్‌ఓను వివరణ కోరినట్లు తెలిసింది. దీంతో డీఆర్‌ఓ మలోల స్వయంగా కలెక్టర్‌ బంగ్లాకు వెళ్లి కలెక్టర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement