dro
-
ఆన్ లైన్ లో రమ్మీ ఆడుతూ దొరికిన అనంతపురం డీఆర్వో మలోల
-
సీరియస్ మీటింగ్.. సైలెంట్‌గా రమ్మీ!
అనంతపురం అర్బన్: కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తరువాత రెవెన్యూ శాఖలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పోస్టు అత్యంత కీలమైనది. అలాంటి పోస్టులో ఉన్న అధికారి అందరికీ ఆదర్శంగా, జవాబుదారీగా ఉండాలి. అయితే జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కీలకమైన సమావేశం జరుగుతున్న సమయంలో.. అదేమీ తనకు పట్టనట్లు బాధ్యతలు విస్మరించి తన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాలు.. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 20న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు వినోద్‌కుమార్, టి.ఎస్.చేతన్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్సీ, ఇతర సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఇదే సమయంలో వేదికపై ఉన్న డీఆర్ఓ మలోల అక్కడి వ్యవహారం తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. తన పక్కన ఉన్నతాధికారులు ఉన్నారనే కనీస ఆలోచన లేకుండా మొబైల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. వివరణ కోరిన కలెక్టర్ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో డీఆర్ఓ మలోల ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తీవ్రంగా పరిగణించారు. డీఆర్ఓను వివరణ కోరినట్లు తెలిసింది. దీంతో డీఆర్ఓ మలోల స్వయంగా కలెక్టర్ బంగ్లాకు వెళ్లి కలెక్టర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. -
కీలకమైన సమావేశంలో ఆన్ లైన్ లో రమ్మీ ఆడిన డీఆర్వో మలోలా
-
Karimnagar: పనిభారంతో పరిపాలన అస్తవ్యస్తం
‘పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేశామని, ప్రజాసమస్యలు వెనువెంటనే పరిష్కారమవుతాయని, ఎలాంటి అర్జీలకైన సత్వరమే స్పందించి జవాబుదారీతనం పాటించేలా పాలన ఉంటుందని చెప్పిన పాలకుల మాటలు నీటిమూటలవుతున్నాయి. జిల్లాల విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా కీలకమైన శాఖలకు అధికారులు లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రజలు తమ అర్జీలతో జిల్లా కలెక్టరేట్లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణికి వెల్లువలా రావడం, పోవడం వంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎవరిని కదలించినా సమస్యకు పరిష్కారం దొరకడం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి’. కరీంనగర్: జిల్లాలో ఇన్చార్జీల పాలనే కొనసాగుతోంది. వివిధ శాఖలకు పూర్తిస్థాయి జిల్లా అధికారులు లేరు. మరోవైపు ఒక్కో అధికారికి అదనంగా మరో శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ పనిచేసే వారికి ఇతర జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. సంబంధిత అధికారి ఏ వారం ఎక్కడ ఉంటారో తెలియని దుస్థితి నెలకొంది. జిల్లా కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. ఏళ్లుగా డెప్యూటేషన్లపై ఒకేచోట.. జిల్లాల పునర్విభజన తర్వాత కార్యాలయాల్లో పూర్తిస్థాయి ఉద్యోగులను నియమించకపోవడంతో డెప్యూటేషన్లపై ఏళ్లుగా ఒకేచోట కొనసాగుతున్నారు. 15 మంది వరకు జిల్లా విద్యాశాఖ, ఎంఈవో కార్యాలయాల్లో, కొందరు ఉపాధ్యాయులు అనధికారికంగా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. రెవెన్యూ, వైద్యశాఖల్లో 20 నుంచి 30 మంది ఇలాగే ఉన్నారు. వైద్యశాలల్లో సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడింది. ఇన్చార్జీల చేతుల్లో కీలక శాఖలు ► జిల్లాలో రెవెన్యూ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన డీఆర్వో పోస్టులో రెండేళ్లుగా అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ► జిల్లాలోని 16 మండలాల్లో ఎంఈవో ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి. రెండు ఉప విద్యాధికారి పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి. ► జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా ఇన్చార్జి అధికారిగానే వ్యవహరిస్తున్నారు. ► కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు వైద్య సేవలందిస్తున్న కరీంనగర్ ప్రధానాస్పత్రిలో సూపరింటెండెంట్ పోస్టు కొన్నేళ్లు ఖాళీగా ఉంది. దీంతో అదేశాఖలో పనిచేస్తున్న రత్నమాలకు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. ► మెడికల్ షాపులను పర్యవేక్షించాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ► గనులు, భూగర్భ గనుల శాఖకు సంబంధించి ఏడీగా వ్యవహరిస్తున్న సత్యనారాయణకు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల అదనపు బాధ్యతలు ఉన్నాయి. ఇదే శాఖలో అసిస్టెంట్ జువాలజీ(ఏజీ)గా ఉన్న రవిబాబు కరీంనగర్, ములుగు జిల్లాల ఇన్చార్జిగా ఉన్నారు. ► తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి రవీందర్ జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే శాఖలో రెండు ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ► జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్‌రావు ఎనిమిదేళ్లుగా ఇన్చార్జి అధికారిగానే పనిచేస్తున్నారు. ► మార్కెటింగ్ శాఖ ఏడీ పద్మావతి కొన్ని నెలలు సెలవులో వెళ్లడంతో అదే శాఖలో పనిచేస్తున్న పెద్దపల్లి జిల్లా అధికారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ► కరీంనగర్ అగ్రికల్చర్ ఏడీ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ► కార్మిక శాఖ అధికారి రమేశ్‌బాబు గత 3 నెలలుగా సెలవులో ఉండటంతో సంగారెడ్డి జిల్లా కార్మికశాఖ అధికారి రవీందర్‌రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. ► జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తార్యనాయక్ నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే శాఖలో మరో రెండు ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ► మహిళా శిశు సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారిగా సబితకుమారి పని చేస్తున్నారు. ► ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు గంగారాం, మధుసూదన్‌లకు ఉమ్మడి జిల్లా పరిధిలోని పరిపాలన వ్యవహారాలు చూడాల్సి రావడం, అదనపు బాధ్యతలతో ఆ శాఖలపై పూర్తి పట్టు సాధించలేక పోతున్నారన్న విమర్శలున్నాయి. -
పాలన పడక!
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని కేంద్రమైన హైదరాబాద్ జిల్లా పరిపాలనా యంత్రాంగానికి మళ్లీ కష్టకాలం వచ్చింది. ‘ముఖ్య’ అధికారి విషయంలో ఈ జిల్లాకు తరచు ఏదో ఒక రూపంలో సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఎక్కువ కాలం ముఖ్య అధికార విభాగం ఇన్‌చార్జిలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కలెక్టర్ రఘునందన్‌రావు స్టడీ టూర్ కోసం విదేశాలకు వెళ్లడంతో ప్రస్తుత జాయింట్ కలెక్టర్ రవి తాత్కాలికంగా ఇన్చార్జి కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్వో)గా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మరోవైపు జిల్లా రెవెన్యూ అధికారి కూడా సెలవుపై వెళ్లడంతో జిల్లా భూ పరిరక్షణ అధికారి వెంకటేశ్వరరావు ఇన్చార్జి డీఆర్వోగా కొనసాగుతున్నారు. దీంతో పలు కీలకమైన నిర్ణయాలు, ఫైళ్లు ఎక్కడక్కడే పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. రెండేళ్ల వ్యవధిలో ముగ్గురు కలెక్టర్లు ఇలా వచ్చి...అలా వెళ్లిపోయారు. నాలుగు నెలలుగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఎలాంటి ఫైళ్లు, ఇతర పనులు ముందుకు సాగక పోగా, తాజాగా ఇన్చార్జిల పాలనతో అదే తీరు ఇంకా కొనసాగుతోంది. డివిజన్, మండల రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఉన్నప్పటికి పనితీరు మాత్రం అంటీముట్టనట్లుగా తయారైంది. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ దరిమిలా జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులందరూ ఇతర జిల్లాలకు బదిలీ కాగా, ఇతర జిల్లాకు చెందిన అధికారులకు ఇక్కడ పోస్టింగ్ లభించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో తిరిగి చేర్పులు, మార్పులకు ఆస్కారం లేకండా పోయింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల గడువు సైతం ముంచుకోస్తోంది. ప్రస్తుత డివిజన్, మండల బాధ్యులు నామమాత్రపు అంశాలు మినహా కీలకమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. ఆర్థిక చేయూతకు గ్రహణం జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆర్ధిక చేయూతకు గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వ పథకాలు, సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల నామమాత్రపు పనితీరు, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై క్షేత్ర స్థాయి విచారణ ముందుకు సాగడం లేదు. ఇప్పటికే క్షేత్రస్థాయి విచారణ పూర్తయి లబ్ధిదారుల ఎంపిక జరిగినా చెక్కుల పంపిణీ మాత్రం జరగడం లేదు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు రుణాలు అందని ద్రాక్షగా మారాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ విడుదలైనా...బ్యాంకులు సవాలక్ష కొర్రీల కారణంగా లక్ష్యం మాత్రం చేరడం లేదు. నిరుద్యోగ యువత కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ధూల్‌పేట్‌లో గుడుంబా తయారీ నుంచి బయటకు వచ్చిన యువతకు పునరావాసం కల్పించేందుకు కొన్ని యూనిట్ల కేటాయింపులు కాగితాలకు పరిమితమయ్యాయి. ఇలా చాల పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా ఇన్చార్జి అధికారుల పద్ధతికి స్వస్తి పలికి..అన్ని ముఖ్యవిభాగాలకు రెగ్యులర్ అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. -
కీలక పోస్టులు ఖాళీ..!
విజయనగరం గంటస్తంభం : జిల్లాలో ఒకేసారి కీలక అధికారుల పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ తర్వాత స్థానంలో ఉన్న జేసీ పోస్టు ఖాళీగా ఉండగా వేర్వేరు కారణాలు రీత్యా ఆ తర్వాత కేడరు పోస్టులు జేసీ–2, డీఆర్వో పోస్టులు ఖాళీ ఏర్పడనున్నాయి. ఆయా పోస్టులు వెంటవెంటనే భర్తీ చేయకుంటే పాలన గాడి తప్పుతుందన్న ఆందోళన జిల్లా ప్రజల్లో కనిపిస్తోంది. పోస్టులు ఖాళీ అవుతున్నా... జిల్లా పరిపాలనా కేంద్రానికి కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. తర్వాత స్థానంలో సంయుక్త కలెక్టర్(జేసీ) ఉంటారు. కలెక్టర్ తర్వాత దాదాపు అన్ని వ్యవహారాలు జేసీ చక్కబెట్టాలి. రెవెన్యూ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ వంటి కీలక వ్యవహారాలు ఆయనే చూడాలి. అయితే, జిల్లా జేసీగా పనిచేసిన శ్రీకేష్ బి.లఠ్కర్‌ను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ చేసి నెలరోజులవుతున్నా ఆ పోస్టులో కొత్తగా ఎవరినీ నియమించ లేదు. దీంతో కలెక్టరపై అదనపు భారం పడింది. దీంతో జేసీ బాధ్యతలను జేసీ–2 కె.నాగేశ్వరరావుకు ఆయన అప్పగించారు. కలెక్టర్ తర్వాత జేసీ–2 కీలకం కావడంతో ఆయనే దాదాపు అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు ఆయన కూడా ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులకు పట్టుబడడం, కోర్టులో హాజరు పరచడం, రిమాండ్‌కు తరలించడంతో ఆ పోస్టు కూడా ఖాళీ అయ్యింది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు తేలడంతో ఆయన సస్పెన్షన్ దాదాపు ఖాయం. ఈ వ్యవహారాన్ని కలెక్టరు వివేక్‌యాదవ్ ప్రభుత్వానికి నివేదించారు. నేడే రేపో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఆ పోస్టు ఖాళీ కానుంది. ఆ స్థానంలో ప్రభుత్వం వెంటనే ఎవరినో ఒకరిని నియమించకపోతే రెండు కీలక పోస్టులు ఖాళీ అవుతాయి. దీంతో జేసీ, జేసీ–2 బాధ్యతలు కలెక్టర్‌పైనే పడ్డాయి. దీంతో జేసీ–2గా ఇన్చార్జి బాధ్యతలు డీఆర్డీఏ పీడీ సుబ్బారావుకు అప్పగించారు. మరోవైపు ఈ నెల 21, 22 తేదీల్లో ఢిల్లీలో జరుగుతున్న సివిల్ సర్వీసెస్ సదస్సుకు కలెక్టర్ వివేక్‌యాదవ్‌ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించినా వెళ్తారోలేదో తెలియని పరిస్థితి. తక్షణమే జేసీ, జేసీ–2 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. డీఆర్వో రిటైర్మెంట్తో మరో సమస్య.. ఈ పరిస్థితుల్లో జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) పోస్టులో ఎవరో ఒకరు ఉంటే పాలన కొంతవరకైనా నెట్టుకు రావచ్చు. ఈ పోస్టు కూడా ఖాళీకి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం పని చేస్తున్న డీఆర్వో ఆర్.ఎస్.రాజ్‌కుమార్ ఈనెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆ రోజు నాటికి ఎవరినో ఒకరిని ఆపోస్టులు నియామకం చేస్తే సమస్య ఉండదు. అయితే, పోస్టుల భర్తీలో తాత్సారం జరుగుతుండడంతో డీఆర్వో పోస్టును కూడా వెంటనే భర్తీ చేస్తారన్న నమ్మకం జిల్లా వాసులకు కలగడంలేదు. జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు పోస్టుల భర్తీపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, ప్రభుత్వం కూడా జిల్లా గురించి పెద్దగా పట్టించుకోకపోవడమే దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ రూరల్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా మార్కెట్లో డిజిటల్(నగదు రహిత) లావాదేవీలు పెరుగుతున్నాయి.. మోసాల బారిన పడకుండా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి భూక్యా హరిసింగ్ సూచించారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సివిల్ సప్లై అధికారి ఎస్డబ్ల్యూ.పీటర్ అధ్యక్షత ఏర్పాటు చేసిన వినియోగదారుల సదస్సులో ఆయన మాట్లాడారు. డిజిటల్ మార్కెట్ విస్తృతమంతున్న తరుణంలో అదే స్థాయిలో వినియోగదారుల సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. డబ్బులు చెల్లించి వస్తువులు కొనుగోలు చేసే సమయంలో, సేవలు పొందేప్పుడు స్పష్టమైన అవగాహన కలిగిఉండాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, వినియోగదారుల సంఘాలు సమన్వయంతో పనిచేసి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు. సివిల్ సప్లై అధికారి పీటర్ మాట్లాడుతూ జిల్లాలో వీలైనంత త్వరగా ఆహార సలహా సంఘం, ధరల పర్యవేక్షణ కమిటీలను పునర్వ్యవస్థీకరించి వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశ సమన్వయకర్తగా ఏఎస్ఓ పుల్లయ్య వ్యవహరించగా జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, సమన్వయ సమితి అధ్యక్షుడు బి.శ్రావన్‌కుమార్ మాట్లాడారు. లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్‌రావు, సివిల్ సప్లై, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్లు వెంకటేశ్వర్లు, హరిప్రసాద్, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రమేష్, ప్రభాకర్, సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహార భద్రత విభాగం, తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. -
మా గోడు వినండయ్యా..
మహబూబ్‌నగర్ న్యూటౌన్: మా గోడు వినండయ్యా అంటూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు ప్రజావాణిలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ సమావేశం హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్, జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ కొమురయ్య, మెప్మా పీడీ గోపాల్ ప్రజలనుంచి వినతలు, ఫిర్యాదులు స్వీకరించారు. తిరిగి తిరిగి అలిసిపోతున్నామని, తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. భూసమస్యలు, పెన్షన్లు, రుణాలు, సర్వే సమస్యలపై పలువురు ఫిర్యాదులు సమర్పించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదని కలెక్టర్ సూచించారు. మొత్తం 89 ఫిర్యాదులు, వినతులు అధికారులకు అందాయి. ప్రజావాణి కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ వద్ద ఫిర్యాదుదారులకు ఉచితంగా ఫిర్యాదులను రాసిచ్చారు. ఫిర్యాదులు ఇలా. - పాలమూర్ స్యాండ్ వెబ్సైట్లో హన్వాడ మండలం పేరు లేకపోవడంతో ఇసుకను బుక్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందని, స్థానిక వాగుల్లో ఇసుక తీసుకునేందుకు అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ నాయకులు కృష్ణయ్య, లక్ష్మయ్య, బసిరెడ్డి, జంబులయ్య తదితరులు కోరారు. - తమకు ఉన్న కొంచెం భూమి కోయిల్‌సాగర్ కాల్వలో పోగా.. మిగిలిన కొంత భూమిని జాతీయ రహదారి 167 నిర్మాణానికి తీసుకుంటామని చెబుతున్నారని దేవరకద్ర మండలం గోప్లాపూర్ రైతులు పేర్కొన్నారు. తమ భూమి కాకుండా అవతలి వైపు రోడ్డు నిర్మించాలని కోరారు. - గ్రామంలో తమ భూమిని దౌర్జన్యంగా ప్లాట్లుగా మారుస్తున్నారని, సహాయం చేయాల్సిన గ్రామ ప్రజా ప్రతినిధి, న్యాయవాది తమపై దౌర్జన్యం చేస్తూ మా భూమిని ప్లాట్లుగా మార్చారని నారాయణపేట మండలం చిన్నజట్రం గ్రామానికి చెందిన అబ్దుల్ మజీద్, కుమారుడు బాబా తమ ఆవేదనను అధికారులకు చెప్పుకున్నారు. - కోస్గి మండల కేంద్రంలో నెహ్రూ పార్కు వద్ద కూరగాయలు అమ్ముకునే 30మందిని ఖాళీ చేయించి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొంటూ మహిళలు, గ్రామస్తులు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. - గ్రామ సమీపంలోని మొగుళ్ల కుంటను తొలగించి అక్రమంగా ప్లాట్లుగా మార్చేందుకు కబ్జాదారులు వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని, వెంటనే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని భూత్పూర్ మండలం తాటిపర్తికి చెందిన మత్స్య సహకార సంఘం సభ్యులు డి.కృష్ణయ్య, బాలకిష్టయ్య, వెంకటయ్య ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. -
రిజిస్టర్డ్ ఏజెంట్ ద్వారానే విదేశాలకు వెళ్లాలి : డీఆర్వో
అనంతపురం అర్బన్: ప్రభుత్వ గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ ఏజెంటు ద్వారానే విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లాలని ప్రజలకు జిల్లా రెవెన్యూ అధికారి సి.మల్లీశ్వరిదేవి సూచించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బోగస్ ఏజెంట్ల ద్వారా విదేశాలకు వెళ్లరాదని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే సమయంలో ఇతరులు ఇచ్చిన పార్సిళ్లు, ప్యాకెట్లను తీసుకెళ్లరాదన్నారు. అలా వెళితే ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందన్నారు. విదేశాలకు వెళ్లిన తరువాత ముందుగా భారత దౌత్యవేత్తలను కలవాలన్నారు. మరింత సమాచారం కోసం 1800 113 090 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలన్నారు. -
సమస్యలను పరిష్కరించకుంటే...
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిర్దిష్ట గడువులోగా ప్రజల సమస్యలను పరిష్కరించని అధికారులకు నోటీసులు జారీచేస్తామని జిల్లా రెవిన్యూ అధికారి భవానీ శంకర్ హెచ్చరించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా లక్డీకపూల్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. అనంతరం డీఆర్ఓ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వినతులు అందిన నాటి నుంచి 30 రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీన్ని అమలు చేయని అధికారులకు నోటీసులు ఇవ్వడంతోపాటు వివరణ తీసుకుంటామని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి ఆయా శాఖలకు సంబంధించి అధికారులకు మొత్తం 63 దరఖాస్తులు అందాయి. కార్యక్రమంలో సీపీఐ వైఆర్‌బీ శర్మ, డీఆర్డీఓ ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
9న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు
అనంతపురం అర్బన్ : ఈ నెల 9వ తేదీ పోలింగ్ ఉన్నందున ఓటుహక్కు కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు(స్పెషల్ కాజ్యువల్ లీవు) మంజూరు చేస్తామని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్వో మల్లీశ్వరిదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ సమయం ఇదే.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని ఆమె తెలిపారు. ఓటు ఎలా వేయాలి అనే అంశాన్ని తెలియజేస్తూ ఎన్నికల కమిష¯ŒS జారీ చేసిన ఫ్లెక్సీలను ఎంపీడీఓ, తహశీల్దారు, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్లో ప్రదర్శనకు ఉంచామన్నారు. -
డీఆర్ఓ బాధ్యతల స్వీకరణ
నెల్లూరు (వేదాయపాళెం): నెల్లూరు డీఆర్ఓగా కృష్ణభారతి శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం డీఆర్ఓగా పనిచేస్తూ నాలుగు నెలల సెలవు అనంతరం ఆమె నెల్లూరుకు బదిలీ చేసిన విషయం విదితమే. బాధ్యతలు చేపట్టిన అనంతరం కృష్ణభారతి మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూపరమైన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా భూసమస్యల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ పదేపదే తిరిగే పరిస్థితి ఇక ఉండబోదన్నారు. -
ప్రజావాణికి 83 ఫిర్యాదులు
డీఆర్వో కార్యాలయానికి మారిన వేదిక స్పెషల్ ఆఫీసర్ సమీక్ష నేపథ్యంలో.. వినతులు స్వీకరించిన డీఆర్వో ఇందూరు: కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వేదిక ఈసారి ఆర్డీవో కార్యాలయానికి మారింది. జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రత్యేక అధికారి అశోక్‌కుమార్ సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. దీంతో ప్రజావాణి వేదికను డీఆర్వో కార్యాలయానికి మార్చారు. పోలీసులు ఫిర్యాదుదారులను డీఆర్వో కార్యాలయానికి మళ్లించారు. కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి సమీక్షలో ఉండడంతో డీఆర్వో పద్మాకర్, కలెక్టరేట్ ఏవో గంగాధర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వారం మొత్తం 83 ఫిర్యాదులునమోదయ్యాయి. నష్ట పరిహారం చెల్లించాలి పంచగూడ బ్రిడ్జి రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్నామని, మార్కెట్ ధర ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని నందిపేట్ మండలంలోని సీహెచ్ కొండూర్, బజార్ కొత్తూర్, ఉమ్మెడ, లక్కంపల్లి, చింరాజ్‌పల్లి బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు డీఆర్వో పద్మాకర్‌కు వినతిపత్రం అందజేశారు. పండగూడ బ్రిడ్జి నిర్మాణం కారణంగా భూములు కోల్పోతున్నామని, రూ.15 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని రైతులు సంద బాబురాజ్, ఎర్రం ముత్యం,పోశెట్టి, రాములు తదితరులు కోరారు. రోడ్డుతో నరకం అనుభవిస్తున్నాం తమ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని మద్నూరు మండలం చిన్న తడ్లూర్ గ్రామస్తులు డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక నరకం అనుభవిస్తున్నామని తెలిపారు. పాముకాటుకు గురైన రవిదాస్‌ను ఆస్పత్రికి తరలించేందుకు తీసుకెళ్తుండగా, రోడ్డు సరిగా లేక ఆలస్యమైందని, దీంతో ఆయన మార్గమధ్యలోనే చనిపోయాడని వివరించారు. సరైన సమయంలో వైద్యం అందక గర్భిణులు, పిల్లలను కూడా ఇలాగే కోల్పోయామని వాపోయారు. అలాగే, పెన్షన్ రేషన్ సరుకులు కూడా పక్క గ్రామానికి వెళలి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తమ గ్రామానికి కొత్త రోడ్డు వేయించాలని స్థానికులు బాలాజీ, హన్ములు, మారుతి, శంకర్, తదితరులు కోరారు. ఎన్సీఎల్పీ పీడీని తొలగించాలి తమకు అన్యాయం చేసిన ఎన్సీఎల్పీ పీడీ సుధాకర్‌రావును తొలగించాలని డిమాండ్ చేస్తూ పలువురు మెసేంజర్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. అకారణంగా తమను తొలగించారని, దీంతో రోడ్డున పడ్డామని వారు వాపోయారు. అయితే ఆర్వీఎం శాఖ ఐఈడీ కో–ఆర్డినేటర్, ప్రస్తుతం డిప్యూటేషన్‌పై ఎన్సీఎల్పీ పీడీగా పని చేస్తున్న సుధాకర్‌రావుకు అర్హత లేదని, ఐఈడీ పరీక్ష రాయకుండానే గెజిటెడ్ అధికారిగా చలామణి అవుతున్నారని వారు ఆరోపించారు. అలాగే ఫారిన్ సర్వీస్‌పై రెండేళ్లకు మించి పని చేయరాదని నిబంధన ఉన్నా ఎన్సీఎల్పీ పీడీగా, ఐఈడీ కో–ఆర్డినేటర్‌గా పని చేస్తున్నారని, ఆయన్ను వెంటనే అసలు స్థానమైన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పంపించాలని గంగాధర్, మహేశ్ తదితరులు విజ్ఞప్తి చేశారు. దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి దౌర్జన్యం చేస్తూ తమ గ్రామ చెరువులో చేపలు పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ మండలం మల్లారం గ్రామానికి చెందిన మత్స్యకారులు డీఆర్వోకు మొర పెట్టుకున్నారు. 1946 నుంచి తమ గ్రామ చెరువులో 180 కుటంబాలు చేపలు పట్టుకుని జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. అయితే, రాజమండ్రికి చెందిన లంబాడి వ్యక్తులు డీసీఎం వ్యానుల్లో వచ్చి చెరువులో అక్రమంగా చేపలు పడుతున్నారని, చేపలు పట్టొద్దని చెబితే బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు సాయన్న, లింగం, అబ్బయ్య తదితరులు కోరారు. ఆర్థిక సాయం ఇప్పించాలి.. భారీ వర్షాలతో తమ ఇల్లు కూలిపోయిందని, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇప్పించాలని నగరంలోని ఇస్లాంపుర, కొజ్జకాలనీకి చెందిన అబ్దుల్ రషీద్ కుటుంబ సభ్యులు డీఆర్వోకు విజ్ఞప్తి చేశారు. వర్షాలతో ఉన్న గూడు లేకుండా పోయిందని, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తే ఇంటికి మరమ్మతులు చేయించుకుంటామని తెలిపారు. విచారణ జరిపించాలి బోధన్ మండలంలోని అమ్థాపూర్ కస్తూర్బాగాంధీ పాఠశాలలో అకౌంటెంట్ పోస్టు నియామకంలో అక్రమాలు జరిగాయని బోధన్ని శక్కర్‌నగర్‌కు చెందిన గీత డీఆర్వోకు ఫిర్యాదు చేశారు. డీటీసీవో శకుంతల, ఎస్వో హిమబిందు కలిసి అకౌటెంట్ పోస్టు నియామకంలో చక్రం తిప్పి అనర్హులకు అప్పగించారని, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు. -
డీఆర్ఓగా కృష్ణభారతి బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం టౌన్ : జిల్లా రెవెన్యూ అధికారిగా డి కృష్ణభారతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లాలో జాయింట్ కలెక్టరు-2గా విధులు నిర్వహిస్తున్న ఆమెను శ్రీకాకుళం డీఆర్ఓగా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. తొలుత ఆమె కలెక్టరు డా. లక్ష్మీనృసింహంను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తర్వాత కలెక్టరేటుకు చేరుకుని బాధ్యతలను స్వీకరించారు. కలెక్టరేటు పరిపాలనాధికారి ఎం కాళీప్రసాద్ నుంచి స్వీకరించిన ఫైళ్లపై ఆమె తొలిసంతకం చేశారు. కలెక్టరేటు లోని వివిధ విబాగాల సూపరెండెంట్లు, కార్యాలయ ఉద్యోగులు మర్యాద పూర్వకంగా ఆమెను కలసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలను స్వీకరించిన అనంతరం విలేకర్లతో ఆమె మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులందరి సహకారంతో మంచి ఫలితాలు తీసుకొస్తానన్నారు. శాఖా పరంగా లోపాలుంటే సరిదిద్దుకుని పనిలో అందరి బాగస్వామ్యంతో విజయాలు సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు. తహశీల్దార్ స్థాయి నుంచి అన్ని విభాగాల్లో తాను పని చేశానన్నారు. అందువల్ల శాఖాపరంగా సమస్యలన్నీ తనకు తెలుసన్నారు. -
మంత్రి ఖాతాలో మరో వికెట్!
దీర్ఘకాలిక సెలవుపై డీఆర్వో కలెక్టర్‌పై మంత్రి ఒత్తిళ్లతోనే... జిల్లా యంత్రాంగంలో చర్చనీయాంశం దుర్గగుడి మాజీ ఈవో నరసింగరావును తెచ్చేందుకే? సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా మంత్రి అచ్చెన్నాయుడి చేతిలో మరో ప్రభుత్వ ఉద్యోగి బలయ్యారు. తాను చెప్పినట్టు వినకపోతే సరెండర్, లాంగ్‌లీవ్, బదిలీ, సస్పెన్షన్లు తప్పవంటూ మంత్రి పదేపదే సెలవిచ్చేవారు. ఈ తరహాలో గతంలో కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇందులో మహిళలూ ఉన్నారు. డీఈవో, ఆర్వీయం పీవో, మెప్మా పీడీ, పోలాకీ ఎంపీడీవో ఇలా పలువురు మంత్రి బారిన పడ్డారు. తాజాగా డీఆర్వో బీహెచ్ఎస్ హేమసుందర్రావు సోమవారం నుంచి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. వివిధ ఆరోపణలతో పాటు బాధ్యతగా వ్యవహరించాల్సిన కొన్ని కీలక అంశాల్లో డీఆర్వో నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే తక్షణం లాంగ్‌లీవ్‌లో వెళ్లిపోవాలని మంత్రి హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఈయన స్థానంలో జేసీ-2 రజనీకాంతరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ పి. లక్ష్మీనృసింహం సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. డీఆర్వో సెలవుపై వెళ్లిపోయేందుకు జిల్లా మంత్రి ఒత్తిళ్లే కారణమని కలెక్టరేట్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, రెవెన్యూ శాఖలో ఆరోపణలు సహజమేనని, డీఆర్వో విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని వీరు మండిపడుతున్నాయి. అనుకున్న వ్యక్తిని తీసుకువచ్చేందుకే విజయవాడ దుర్గగుడి ఈవో సీహెచ్ నరసింహరావును ఇక్కడకు తీసుకువచ్చేందుకు జిల్లా మంత్రి విశ్వప్రయత్నాలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాకే చెందిన ఆయన అక్కడి పూజారుల పట్ల దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలపై ప్రభుత్వం పక్కన పెట్టి ఆజాద్‌ను ఈవోగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నరసింహరావును తీసుకువచ్చేందుకే జిల్లా మంత్రి..డీఆర్వో బీహెచ్ఎస్ వెంకట్రావు పట్ల కక్షపూరితంగా వ్యవహరించి ఉంటారనే కలెక్టరేట్ ఉద్యోగులు భావిస్తున్నారు. పశ్చిమగోదావరి, నెల్లూరు, విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో పనిచేసి సుమారు 9నెలల క్రితమే ఇక్కడకు వచ్చిన డీఆర్వోపై అనేక ఒత్తిళ్లు తెచ్చి..పనుల విషయంలో అంగీకరించకపోవడం వల్లే కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి ఆయన్ను దీర్ఘకాలిక సెలవుపై పంపించేయాలని మంత్రి ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కలెక్టరేట్‌కు ఎన్నికల ఖర్చు పేరిట పెద్ద మొత్తంలో నిధులొచ్చాయని, వాటిలో మంత్రి కూడా వాటాలడిగారని, ఈ విషయంలో డీఆర్వో అడ్డుతగిలారని, అదే విషయం ఇంత వరకు తెచ్చిందని కూడా ప్రచారంలో ఉంది. జరిగిందిదీ తాము చెప్పింది చేయకపోతే చర్యలు తప్పవంటూ మంత్రి సహా ఆయన అనుచరులు ఇటీవల డీఆర్వోపై ఒత్తిళ్లు తెచ్చారని తెలిసింది. ఎన్వోసీల జారీ, భూముల ఫైళ్లు కదలడం, సస్పెండయిన ఉద్యోగులకు త్వరితగతిన పోస్టింగ్‌లు ఇవ్వాలనడం, వంశధార నిర్వాసితుల పట్ల కఠినంగా వ్యవహరించడ ం వంటి అంశాలపై జిల్లా మంత్రి తమకు అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి తేవడం పట్ల డీఆర్వో కొన్నిమార్లు మాట వినలేకపోయారని, నిబంధనల ప్రకారమే తాను నడుచుకుంటానని చెప్పడంతో దీర్ఘకాలిక లీవ్‌తో ఆయన బహుమతి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఆర్థికలావాదేవీల ఆరోపణలపై సస్పెండయిన వీఆర్వోలకు సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో చూసీ చూడనట్టు పోవాలని మంత్రి తరచూ డీఆర్వోపై ఒత్తిళ్లు తెచ్చినట్టు కూడా తెలిసింది. భూ సేకరణ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించినందునే సెలవుపై వెళ్లిపోవాల్సి వచ్చిందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
తన సమస్య పరిష్కారం కోసం కర్నూలు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ రైతు అక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన రైతు బ్రహ్మయ్యకు నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉంది. భూమి వివరాలు.. ఆన్ లైన్ చేసేందుకు చాలా కాలంగా వీఆర్వో చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసిగి పోయిన బ్రహ్మయ్య సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ ను కలిసేందుకు వచ్చాడు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందుబాటులోకి రాకపోవడంతో.. డీఆర్వోకు ఫిర్యాదు ఇచ్చాడు. తర్వాత వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు.. ఇది గమనించిన సిబ్బంది బ్రహ్మయ్యను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైతుకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. -
వాటీజ్ దిస్
డీఆర్ఓపై జేసీ రజత్‌కుమార్ చిర్రుబుర్రు ►కలెక్టరేట్లో పోస్టర్లు, గోడరాతలపై గరం ►సాయంత్రం వేళ ఆకస్మిక తనిఖీ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘వాటీజ్ దిస్. ఎన్నిసార్లు చెప్పాలండీ. గోడలపై ఈ రాతలేమిటీ? అడ్డదిడ్డంగా ఆ వాహనాల పార్కింగే ంటీ? మెయిన్ గేట్ ముందు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పాగా, ఇప్పటివరకు ఎందుకు చేయలేదు. ఐయామ్ సారీ. మీ పద్ధతి బాగాలేదండి’ అని జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్ సైనీ మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారి సూర్యారావుపై చిర్రుబుర్రులాడారు. సాయంత్రం వేళ ఆకస్మికంగా కలెక్టరేట్ ఆవరణను పరిశీలించిన జేసీ.. పరిశుభ్రత పాటించకపోవడంపై డీఆర్ఓ సహా ‘బీ’సెక్షన్ సూపరింటెండెంట్ నర్సింహరావుకు క్లాస్ తీసుకున్నారు. గోడలపై కార్యాలయాల పేర్లు ఉండడం, ప్రధాన గేటు ముందర అటవీ వస్తువుల విక్రయానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ‘స్నేహా’ బిల్డింగ్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో తుప్పుపట్టిన వాటిని ఇంకా తొలిగించకపోవడంపై చిరాకు పడ్డారు. కొత్త బోర్డు ఏర్పాటు చేయమని ఎన్నిసార్లు చెప్పాలండీ. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో నాకర్థం కావడంలేదని పెదవివిరిచారు. -
కదులుతున్న స్థానాలు...
జిల్లాలో ఉన్నతాధికారుల స్థానాలు కదులుతున్నాయి. జన్మభూమి కార్యక్రమం ముగియడంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు బదిలీ పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే జెడ్పీసీఈఓ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలకు బదిలీ అయింది. ఆరోగ్యశాఖ ఉద్యోగులకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తాము కోరుకున్న స్థానం లభిస్తుందో లేదో తెలియక టెన్షన్ పడుతున్నారు. మరో పక్క పైరవీల స్పీడ్ పెంచారు. కానుకలు సమర్పించుకుంటూ కావలసిన సీటు కొట్టేయాలని చూస్తున్నారు. * ప్రారంభమైన బదిలీల పర్వం * కోరుకున్న స్థానం కోసం జోరుగా యత్నాలు * తిరుమల వెళ్లేందుకు జేసీ ప్రయత్నాలు * డీఆర్వో మళ్లీ ఇక్కడేనా? విజయనగరం కంటోన్మెంట్: ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న బదిలీలు, వాటికోసం చేసే యత్నాలు మళ్లీ జోరందుకున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా విధులు నిర్వహిస్తున్న హెచ్వీ ప్రసాదరావుకు తూర్పుగోదావరి జిల్లా డీఆర్డీఏ ఏపీడీగా బదిలీ అయింది. ఆయన మంగళవారం రిలీవ్ అయ్యారు. ఈయన స్థానంలో కేఆర్‌పీసీ డిప్యూటీ కలెక్టర్ శ్రీలతను ఇన్చార్జ్గా నియమించారు. జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, పంచాయతీరాజ్ ఎస్ఈ వేణుగోపాల్‌కు బదిలీలు అయ్యాయి. వీరితో పాటు ఆరోగ్యశాఖలో కిందిస్థాయి ఉద్యోగుల బదిలీలకు మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఇంతకుముందే బదిలీలు జరుగుతాయని అనుకున్నా జన్మభూమి కార్యక్రమాలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. 11వ తేదీతో జన్మభూమి కార్యక్రమం ముగియడంతో బదిలీల ప్రక్రియకు కదలిక వచ్చింది. జాయింట్ కలెక్టర్ నుంచి జిల్లాలో ఇతర అధికారుల వరకూ అందరూ బదిలీలపై దృష్టి సారించారు. కొందరు ఇప్పటికే రిటెన్షన్ (బదిలీకాకుండా నిలుపుకోవడం) తెచ్చుకున్నారు. మరికొందరు తాము ఎన్నాళ్లనుంచో ఎదురు చూస్తున్న స్థానాల కోసం ప్రయత్నాలు చే సుకుంటున్నారు. జిల్లాలో చాలా మంది ఉన్నతాధికారులు కలెక్టరేట్లో స్థానాల కోసం పైరవీలు చేస్తున్నారు. అధికారులు తమ ఆప్షన్లు తెలియజేసేందుకు ఈనెల 15 తుది గడువు కావడంతో వారంతా చాలా బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా పైరవీలు సాగిస్తున్నారు. అయితే బదిలీలు ఎవరికి జరిగాయనే విషయం మాత్రం బుధ,గురువారాల్లో ఒక కొలిక్కి రావచ్చనేది భోగట్టా. ఇప్పటికే రిలీవ్ అయి ఉంటే ప్రభుత్వం వారిని అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్‌లో ఎప్పుడైనా నియమించే అవకాశం ఉంది. ఏజేసీగా ఇక్కడ చేరేందుకు నర్సింగరావు ఏలూరులో రిలీవ్ అయి వచ్చారు. కానీ ఆయనకు ఇక్కడ పోస్టు ఖాళీగా లేకపోవడంతో వెనుక్కు తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఇక్కడ ఆయన చేరితే జిల్లాలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశాలొచ్చాయి. కానీ నాగేశ్వరరావు విధుల నుంచి రిలీవ్ కాకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లి తనకు తెలిసిన వారితో మాట్లాడి బదిలీ అయితే పడే ఇబ్బందుల దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారని, ఇక్కడే కొనసాగేందుకు రిటెన్షన్ తెచ్చుకున్నారని, దీంతో ఆయన బదిలీ ప్రస్తుతానికి ఆగిపోయిందని చెబుతున్నారు. అయితే నర్సింగరావు పదోన్నతిపై బదిలీ అయిన ఉద్యోగి కనుక ఎక్కడ వేసినా పదోన్నతికి సంబంధించిన పోస్టే ఆయనకు ఉంటుందని చెబుతున్నారు. జిల్లాలోని ఎస్డీసీలు, జిల్లా స్థాయి అధికారులు తమకు దగ్గరలోని శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలకు బదిలీలు చేయించుకునేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. శ్రీకాకుళం వెళ్లేందుకు అక్కడి స్థానికత ఓ కారణంగా చెబుతుంటే, లోకల్ ఏరియాకు ట్రాన్స్ఫర్ అంటే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారని, అందువల్ల ఆలోచించుకోవాలని హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు బదిలీ కోరిన వారికి ఉపదేశిస్తున్నారు. విశాఖపట్నం వెళ్లేందుకు కూడా చాలా మంది ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎందుకంటే అక్కడ అన్ని రకాల సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయన్నది వారి ఆలోచన. విజయనగరం వచ్చి వెళ్లేందుకు ప్రయాణసాధనాలు కూడా విరివిగా ఉండటంతో పాటు గంట ప్రయాణం మాత్రమే ఉండటంతో చాలా మంది ఉద్యోగులు విశాఖ పట్నం బదిలీ అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు. తిరుమల జేఈఓ పోస్టుపై ఆసక్తి చూపుతున్న జేసీ ? జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బి రామారావు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ పోస్టుపై ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం తనకు తెలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారని వినికిడి. ఇప్పటికే ఆయన పలువురు అధికారులతో మాట్లాడి అక్కడకు బదిలీ చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారనీ అంటున్నారు. అంతే కాకుండా బుధవారం నుంచి ఆయన మూడు రోజుల పాటు సెలవు పెట్టారు. జేఈఓ పోస్టుసాధించేందుకునేందుకు సెలవు పెట్టారని సమాచారం. మళ్లీ డీఆర్వోగా హేమసుందర్? జిల్లాలో డీఆర్వోగా పనిచేస్తున్న హేమసుందర్‌ను కలెక్టర్ నాయక్ మందలించడంతో కినుక వహించి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. పలుమార్లు ఆయన తన సెలవును పొడిగించుకున్నారే తప్ప విధుల్లో చేరలేదు. ఈ లోగా ఆయన పలు పోస్టుల కోసం ప్రయత్నించారు. అయితే అవేవీ సఫలం కాకపోవడంతో మళ్లీ విజయనగరంలోనే డీఆర్వో పోస్టులో చేరే అవకాశముందని అంటున్నారు. దీనికోసం ఆదివారం వచ్చి వెళ్లినట్టు తెలిసింది పైరవీలతో పాటు సంభావనలూ .. కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు చేయించుకునేందుకు పైరవీలతో పాటు సంభావనలూ ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది. నలుగురు అధికారులు ఒక చోట చేరితే ఈ విషయమే చర్చించుకుంటున్నారు. ఓ జిల్లా స్థాయి అధికారి తనకు బదిలీకాకుండా ఉండేందుకు రూ.15 లక్షలు ఇచ్చారని తెలిసింది. కింది స్థాయి ఉద్యోగులు రూ.లక్షల్లో సమర్పించుకుంటున్నట్టు సమాచారం. -
మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం: మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్టు రాష్ట్ర సమాచారం, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. వక్ఫ్ ఆస్తులను పరి రక్షించాలని ఆధికారులను ఆదేశించా రు. జిల్లా పరిషత్ సమావేశం మంది రంలో జిల్లా అధికారులతో మంగళవా రం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మైనార్టీ సంక్షేమంపై సమీక్షిస్తూ 1780 ఎకరాల వక్ఫ్ భూములుయని అధికారులు అన్నారు. వీటిలో 755.73 ఎకరాలు పొం దూరు, 12.82 ఎకరాలు బలగలోనూ గుర్తించామని అధికారులు వివరించారు. వక్ఫ్ భూము లు కోట్లాది రూపాయల విలువైనవని, ఆక్రమణలను గుర్తించి తమకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుని వాటి పరిరక్షణకు కృషి చేస్తామని రాష్ట్ర కార్మికశాఖమంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆమదాలవలసలో షాదీఖా నా నిర్మించినా నిరుపయోగంగా ఉందని ప్రభుత్వ విప్ కూ న రవికుమార్ తెలిపారు. తహశీల్దార్ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసుకొని వక్ఫ్ ఆస్తులను పరిరక్షించుకోవాలని మంత్రి రఘునాథరెడ్డి సూచిం చారు. జిల్లాలో 48 వక్ఫ్ సంస్థలున్నప్పటికీ.. చాలా చోట్ల ఆక్రమణలో ఉన్నాయని సమీక్షలో పాల్గొన్న ముస్లిం నా యకులు ఫిర్యాదు చేశారు. స్పెషల్ డ్రైవ్‌లో ఆక్రమణ భూముల వివరాలను సేకరించి తమకు అందజేయాలని డీఆర్వోను మంత్రి రఘునాథరెడ్డి ఆదేశించారు. శ్రీకాకుళం చౌకబజారులో సర్వే నంబరు 224లోని మసీదు ఆక్రమణలో ఉన్నందున త్వరలోనే జరగబోయే పీర్ల పండుగకు అవకాశం లేదని ముస్లీం నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థలం కోర్టు ట్రిబ్యునల్‌లో ఉన్నందున తమకు న్యాయం చేయాలని కోరారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఒకే మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఉండడం వల్ల సామూహిక వివాహాల బడ్జెట్ ఖ ర్చు చేయలేక పోయామని జిల్లా ట్రెజ రీలో సాంకేతిక సమస్య వల్ల బిల్లుల చెల్లింపులు జరగడం లేదని మైనార్టీ సంక్షేమాధికారి తెలిపారు. సమాచార శాఖ అధికారులు వారిధిలాంటి వారు సమాచారశాఖపై సమీక్షించిన మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమాచార శాఖ అధికారులు వారధిలాంటివారన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు పని తీరు ప్రజలకు తెలియజేయడం, ప్రజల స్పందనను ప్రభుత్వానికి చేరవేయడం రోజూ పత్రికల్లో వచ్చే అనుకూల, ప్రతి కూల వార్తలను జిల్లా, డివిజన్ స్థాయి ల్లో కలెక్టర్‌కు, ఆర్డీవోలకు పంపించి ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేయడానికి నిరంతరం సమాచార శాఖాధికారులు పనిచేయూలన్నారు. పాత్రికేయుల సంక్షేమ నిధిని కోటి రూపాయల నుంచి పెంచుతామన్నారు. రాష్ట్రంలో 9,264 విద్యుత్ ఫీడర్లు ఉన్నాయని, 4.20 లక్షల ఆధార్ సీడింగ్ పూర్తరుునట్టు మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాను పారి శ్రామికంగా అభివృద్ధి పరిచి వలసలను నివారించేందుకు కృషి చేస్తానన్నారు. తెలుగుజాతి ప్రతిష్టను పెంపొందిస్తాం తెలుగుజాతి ప్రతిష్టను పెంపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని, ప్రతిష్టను నిలిపిన మహానుభావులు అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, టంగుటూరి ప్రశాశం పంతులు వంటి మహోన్నతుల ఉత్సవాలు జరుపుకోవాల న్నారు. విజయనగరం జిల్లాలో లలిత కళా అకాడమీని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో విమానాశ్రయం, పుడ్‌పార్కు ఏర్పాటు చేస్తామని, ఫార్మా రం గాలను అభివృద్ధి చేస్తామన్నారు. వంశధార, నాగావళికి ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికిఎంత ఖర్చు అయిన వెనుకాడబోమని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, ఎమ్మె ల్యే గుండ లక్ష్మీదేవి, జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ జి.వీరపాండ్యన్, ఏజేసీ మహమ్మద్ హషీం షరీఫ్ మాట్లాడారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, సమాచార శాఖ సంయుక్త సంచాకుడు కె. రాజబాబు, డీఆర్వో నూర్ బాషాఖాసీం, సమాచారశాఖ ప్రాంతీ య సమాచార ఇంజినీర్ ఎ.సత్యనారాయణ, ఏడీ బాబ్జి, డీపీఆర్వో ఎల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే సిబ్బంది పనితీరుపై డీఆర్ఎం ఆగ్రహం
సామర్లకోట, న్యూస్‌లైన్ :రైల్వే సిబ్బంది పనితీరుపై డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శని వారం విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సామర్లకోట వచ్చిన ఆయన అన్నవరానికి కుటుంబ సభ్యులతో కారులో వెళ్లా రు. తిరిగి వచ్చిన అనంతరం స్థానిక రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. రైల్వే ట్రాక్ మధ్య డ్రెయిన్‌లో మురుగు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చే శారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజి ద్వా రా మురుగు పోయేలా ఏర్పాటు చే యాలని ఆదేశించారు. దీనిపై ఇం జనీరింగ్ సిబ్బంది, హెల్త్ సిబ్బం దిని మందలించారు. సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్నల్ సెక్షన్ ఇంజ నీర్ అన్వర్‌బాషాను పనితీరు మెరు గు పర్చుకోవాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ కార్యాలయంలో రికార్డులు సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఒకటో నంబరు ప్లాట్ ఫారంపై పార్సిల్ కార్యాలయం వద్ద తాగునీరు వేడిగా రావడం, కుళాయిలు సక్రమంగా పనిచేయక పోవడంపై మండిపడ్డారు. రైల్వే లిఫ్టు వద్ద ఉన్న తాగునీటి ప్రదేశానికి బోర్డు లేకపోవడం, చెత్త ఎక్కువగా ఉండడంతో సిబ్బందిని మందలించారు. స్టేషన్ మేనేజర్ కార్యాలయం, విశ్రాంతి గ దులు, ప్లాట్ఫారంను పరిశీలించి, లిఫ్టు పనితీరుపై ఆరా తీశారు. కాగా జిల్లా మీదుగా ప్రయాణించే రైళ్లకు అదనపు బోగీలు కేటాయించడంపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుం దని ప్రదీప్‌కుమార్ అన్నారు. పలువురు ప్రయాణికులు ఆయనకు వినతిపత్రాలు సమర్పించారు. రైలుకు కనీసం 4 సాధారణ బోగీలు ఏర్పా టు చేసి, ముఖ్యమైన రైళ్లు నాలుగు నిమిషాలు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సీని యర్ డివిజనల్ మేనేజర్ అమిత్ అగర్వాల్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎన్వీవీ సత్యనారాయణ, ఎస్డీఎం (ఆపరేషన్స్) కె. సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం, ఏడీఈఎన్ సీహెచ్ తులసీరామ్, పబ్లిక్ వే ఇన్స్పెక్టర్ ఆర్.సత్యం, ఇంజనీర్లు సుబ్రహ్మణ్యం, కె.కామేశ్వరరావు, ఆర్పీఎఫ్ సీఐ బి.రాజు, ఏఎస్సై డీవీ నరసింహరావు, రైల్వే ఎస్సై ఎస్.గోవిందరెడ్డి తదితరులు ఉన్నారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ఆయన సామర్లకోట నుంచి విజయవాడ వెళ్లారు. -
డీఆర్ఓ పోస్టుకు పైరవీల జోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పోస్టు కోసం పైరవీలు ఊపందుకున్నాయి. రెవెన్యూ విభాగంలో హాట్‌సీటుగా పరిగణించే ఈ కుర్చీని ఎగరేసుకుపోయేందుకు ఆశావహులు పెద్దస్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం డీఆర్ఓగా వ్యవహరిస్తున్న కె.రాములు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. పది నెలల క్రితం డీఆర్ఓగా నియమితులైన రాములు అనారోగ్యం కారణంగా ఎక్కువ కాలం సెలవులోనే ఉన్నారు. పదిహేను రోజుల క్రితం మరోమారు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మళ్లీ సెలవు పెట్టాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఖాళీఅయ్యే డీఆర్ఓ కుర్చీని దక్కించుకునేందుకు పలువురు తెరవెనుక మంత్రాంగం నెరుపుతున్నారు. జిల్లా పాతకాపులే ఎక్కువగా ఈ సీటు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ డీఆర్ఓ కృష్ణారెడ్డి, పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న వెంకటేశ్వర్లు సహా హెచ్ఎండీఏలో జోనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సురేశ్పొద్దార్, యూఎల్‌సీలో అదనపు ఎస్ఓగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు, నిజామాబాద్‌లో పనిచేస్తున్న అశోక్‌కుమార్ కూడా డీఆర్ఓ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధానికి చేరువలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో భూముల విలువలు గణనీయంగా ఉంటాయి. అదే స్థాయిలో రెవెన్యూ వివాదాలున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని రెండు చేతులా సంపాదించుకునే వీలుండడంతో ఈ పోస్టుకు డిమాండ్ ఏర్పడింది. ఈ కుర్చీ కోసం చేతులు తడిపేందుకు అధికారులు వెనుకడుగు వేయడంలేదు. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు..! డీఆర్ఓ సీటుపై కన్నేసిన ఆశావహులు ఉన్నతస్థాయిలో పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. తమ లక్ష్యాన్ని సాధించేందుకు మంత్రులు, గాడ్ఫాదర్లతో సిఫార్సులు చేయించుకుంటున్నారు. మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు పేషీల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జిల్లా మంత్రి, ఇన్చార్జి మంత్రి సహా రెవెన్యూ మంత్రి ఆశీస్సులతో సీటు కోసం వ్యూహారచన చేశారు. కాగా, అశోక్, వెంకటేశ్వర్లును డీఆర్ఓగా నియమించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి ప్రసాద్‌కుమార్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. అలాగే, తన జిల్లాలో డీఆర్ఓగా పనిచేస్తున్న కృష్ణారెడ్డి పేరును పరిశీలించాలని ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచా రం. మరోవైపు గతంలో పలు మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేసిన పొద్దార్ కూడా డీఆర్ఓగా తనకో అవకాశం ఇవ్వాలని కలెక్టర్ బి.శ్రీధర్‌ను కలిశారు. కలెక్టర్ కూడా ఆయన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి లేఖ రాసినట్లు సమాచారం. ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి సిఫార్సుతో ఏఎస్ఓ వెంకటేశ్వర్లు కూడా ఈ సీటుపై గంపెడాశ పెట్టుకున్నారు. వీరేకాకుండా తెరవెనుక మరికొందరు ఈ కుర్చీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కూడా తన విధేయుడిని ఇక్కడ నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.