శ్రీకాకుళం టౌన్ : జిల్లా రెవెన్యూ అధికారిగా డి కృష్ణభారతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లాలో జాయింట్ కలెక్టరు-2గా విధులు నిర్వహిస్తున్న ఆమెను శ్రీకాకుళం డీఆర్‌ఓగా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. తొలుత ఆమె కలెక్టరు డా. లక్ష్మీనృసింహంను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తర్వాత కలెక్టరేటుకు చేరుకుని బాధ్యతలను స్వీకరించారు. కలెక్టరేటు పరిపాలనాధికారి ఎం కాళీప్రసాద్ నుంచి స్వీకరించిన ఫైళ్లపై ఆమె తొలిసంతకం చేశారు.
కలెక్టరేటు లోని వివిధ విబాగాల సూపరెండెంట్లు, కార్యాలయ ఉద్యోగులు మర్యాద పూర్వకంగా ఆమెను కలసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలను స్వీకరించిన అనంతరం విలేకర్లతో ఆమె మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులందరి సహకారంతో మంచి ఫలితాలు తీసుకొస్తానన్నారు. శాఖా పరంగా లోపాలుంటే సరిదిద్దుకుని పనిలో అందరి బాగస్వామ్యంతో విజయాలు సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు. తహశీల్దార్ స్థాయి నుంచి అన్ని విభాగాల్లో తాను పని చేశానన్నారు. అందువల్ల శాఖాపరంగా సమస్యలన్నీ తనకు తెలుసన్నారు.
డీఆర్‌ఓగా కృష్ణభారతి బాధ్యతల స్వీకరణ
Published Wed, Apr 6 2016 11:18 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement