మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం: మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్టు రాష్ట్ర సమాచారం, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. వక్ఫ్ ఆస్తులను పరి రక్షించాలని ఆధికారులను ఆదేశించా రు. జిల్లా పరిషత్ సమావేశం మంది రంలో జిల్లా అధికారులతో మంగళవా రం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మైనార్టీ సంక్షేమంపై సమీక్షిస్తూ 1780 ఎకరాల వక్ఫ్ భూములుయని అధికారులు అన్నారు. వీటిలో 755.73 ఎకరాలు పొం దూరు, 12.82 ఎకరాలు బలగలోనూ గుర్తించామని అధికారులు వివరించారు. వక్ఫ్ భూము లు కోట్లాది రూపాయల విలువైనవని, ఆక్రమణలను గుర్తించి తమకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుని వాటి పరిరక్షణకు కృషి చేస్తామని రాష్ట్ర కార్మికశాఖమంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఆమదాలవలసలో షాదీఖా నా నిర్మించినా నిరుపయోగంగా ఉందని ప్రభుత్వ విప్ కూ న రవికుమార్ తెలిపారు. తహశీల్దార్ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసుకొని వక్ఫ్ ఆస్తులను పరిరక్షించుకోవాలని మంత్రి రఘునాథరెడ్డి సూచిం చారు. జిల్లాలో 48 వక్ఫ్ సంస్థలున్నప్పటికీ.. చాలా చోట్ల ఆక్రమణలో ఉన్నాయని సమీక్షలో పాల్గొన్న ముస్లిం నా యకులు ఫిర్యాదు చేశారు. స్పెషల్ డ్రైవ్‌లో ఆక్రమణ భూముల వివరాలను సేకరించి తమకు అందజేయాలని డీఆర్‌వోను మంత్రి రఘునాథరెడ్డి ఆదేశించారు. శ్రీకాకుళం చౌకబజారులో సర్వే నంబరు 224లోని మసీదు ఆక్రమణలో ఉన్నందున త్వరలోనే జరగబోయే పీర్ల పండుగకు అవకాశం లేదని ముస్లీం నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థలం కోర్టు ట్రిబ్యునల్‌లో ఉన్నందున తమకు న్యాయం చేయాలని కోరారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఒకే మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఉండడం వల్ల సామూహిక వివాహాల బడ్జెట్ ఖ ర్చు చేయలేక పోయామని జిల్లా ట్రెజ రీలో సాంకేతిక సమస్య వల్ల బిల్లుల చెల్లింపులు జరగడం లేదని మైనార్టీ సంక్షేమాధికారి తెలిపారు.
సమాచార శాఖ అధికారులు
వారిధిలాంటి వారు
సమాచారశాఖపై సమీక్షించిన మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమాచార శాఖ అధికారులు వారధిలాంటివారన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు పని తీరు ప్రజలకు తెలియజేయడం, ప్రజల స్పందనను ప్రభుత్వానికి చేరవేయడం రోజూ పత్రికల్లో వచ్చే అనుకూల, ప్రతి కూల వార్తలను జిల్లా, డివిజన్ స్థాయి ల్లో కలెక్టర్‌కు, ఆర్డీవోలకు పంపించి ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేయడానికి నిరంతరం సమాచార శాఖాధికారులు పనిచేయూలన్నారు. పాత్రికేయుల సంక్షేమ నిధిని కోటి రూపాయల నుంచి పెంచుతామన్నారు. రాష్ట్రంలో 9,264 విద్యుత్ ఫీడర్లు ఉన్నాయని, 4.20 లక్షల ఆధార్ సీడింగ్ పూర్తరుునట్టు మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాను పారి శ్రామికంగా అభివృద్ధి పరిచి వలసలను నివారించేందుకు కృషి చేస్తానన్నారు.
తెలుగుజాతి ప్రతిష్టను పెంపొందిస్తాం
తెలుగుజాతి ప్రతిష్టను పెంపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని, ప్రతిష్టను నిలిపిన మహానుభావులు అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, టంగుటూరి ప్రశాశం పంతులు వంటి మహోన్నతుల ఉత్సవాలు జరుపుకోవాల న్నారు. విజయనగరం జిల్లాలో లలిత కళా అకాడమీని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో విమానాశ్రయం, పుడ్‌పార్కు ఏర్పాటు చేస్తామని, ఫార్మా రం గాలను అభివృద్ధి చేస్తామన్నారు. వంశధార, నాగావళికి ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికిఎంత ఖర్చు అయిన వెనుకాడబోమని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, ఎమ్మె ల్యే గుండ లక్ష్మీదేవి, జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ జి.వీరపాండ్యన్, ఏజేసీ మహమ్మద్ హషీం షరీఫ్ మాట్లాడారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, సమాచార శాఖ సంయుక్త సంచాకుడు కె. రాజబాబు, డీఆర్‌వో నూర్ బాషాఖాసీం, సమాచారశాఖ ప్రాంతీ య సమాచార ఇంజినీర్ ఎ.సత్యనారాయణ, ఏడీ బాబ్జి, డీపీఆర్‌వో ఎల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.