Minorities Welfare
-
మనసున్న ప్రభుత్వమిది
భారతదేశం అంటేనే ఏడు రంగుల ఇంద్ర ధనస్సు. మన దేశంలో అనేక రాష్ట్రాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, అనేక కులాలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా, అందరం కలిసికట్టుగా.. ఇంద్ర∙ధనస్సుగా ఒక్కటిగా ఉంటున్నాం.. ఎప్పుడూ ఉంటాం అన్నది భారతదేశ చరిత్ర. భిన్నత్వంలో ఏకత్వంతో పాటు ఒకరినొకరు గౌరవించుకోవడం మన బలం. అల్ప సంఖ్యలో ఉన్న వారికి అండగా నిలబడటం మన బలం. మెజారిటీ, మైనార్టీల మధ్య అన్నదమ్ముల ఆత్మీయత, అనుబంధం పెంచటం ఒక వైఎస్సార్ బలం.. ఒక జగన్ బలం.. వెరసి మన అందరి బలం. గత 53 నెలల్లో దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, మన రాష్ట్రంలో ముందెన్నడూ చూడని విధంగా ఈ ప్రభుత్వం ప్రతి అడుగులోనూ పేదల కోసం పరితపిస్తూ పరిపాలన సాగిస్తోంది. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ నిరుపేదలంటూ గతంలో ఓనర్ షిప్ (బాధ్యత) తీసుకున్న పరిస్థితులు లేవు. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ వర్గాల వారందరినీ నా కుటుంబంగా భావిస్తున్నా. వీరికి అన్ని విధాలా భరోసా ఇస్తూ అడుగులు ముందుకు వేస్తున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వంలో ఒక జగన్ కనిపిస్తాడు. జగన్‌కు ఇటు వైపు, అటు వైపు డిప్యూటీ సీఎంలుగా ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనార్టీ కనిపిస్తారు. మీ బిడ్డ సీఎంగా ప్రమాణం చేసిన మొదటి రోజు నుంచీ వీళ్లందరూ నా పక్కనే కనిపిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఒక్క జగన్‌దే కాదు.. మనందరిది. మనసున్న ప్రభుత్వం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని శనివారం రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమాలను విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు స్థాపించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం అజాద్ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని నేషనల్ ఎడ్యుకేషన్ డే గా జరుపుకుంటున్నామన్నారు. మైనారిటీస్ సంక్షేమ దినోత్సవంగా (మైనార్టీస్ డే) కూడా జరుపుకుంటున్నట్లు 2008లో అప్పటి ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు, దివంగత రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రకటించారని గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ముస్లింలలో పేదలందరికీ రిజర్వేషన్లు అమలు చేసిన నాయకుడు దివంగత మహానేత రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. నాన్న ముస్లిం సోదరుల పట్ల, మైనార్టీల సంక్షేమం పట్ల ఒక అడుగు వేస్తే.. ఆయన బిడ్డగా, మీ అన్నగా, మీ వాడిగా రెండడుగులు ముందుకు వేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. గతానికి, ఇప్పటికి మధ్య తేడా గమనించండి ► గత ప్రభుత్వంలో మైనార్టీలకు మంత్రి పదవి కూడా ఇవ్వని మనసు లేని ముఖ్యమంత్రి ఉండేవారు. మన ప్రభుత్వంలో రెండు దఫాలు మంత్రి మండలి కూర్పులో ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో నా మైనార్టీ సోదరుడు ఈ రోజు నా పక్కనే ఉన్నాడు. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చాక అనేక గొప్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ► ఈ రోజు ముస్లిం సోదరులకు రాజకీయ, ఆర్థిక, మహిళా, విద్యా సాధికారత విషయంతో పాటు వారికి సంక్షేమం అందించే ఏ విషయంలోనైనా ముందున్నాం. మన పార్టీ నుంచి దేవుడి దయతో నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోగలిగాం. మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా కూర్చొబెట్టగలిగాం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా నా సోదరి జకియాఖానం శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. నా అక్కచెల్లెమ్మలు, ముస్లిం సోదరుల బాగోగులు చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాగా అడుగులు వేస్తోందో చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనం. ► ఎంపీపీలు, జడ్పీ చైర్మన్, మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్, ఏఎంసీ.. ఇలా ఏ నామినేటెడ్ పదవులు తీసుకున్నా.. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 50 శాతం పదవులు ఇవ్వాలని.. అందులో కూడా 50 శాతం నా అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని చట్టం చేశాం. ► ఈ రోజు, ఆ రోజు ఇదే బడ్జెట్.. ఇదే రాష్ట్రం. అప్పులు కూడా అప్పటి కన్నా ఇప్పుడే తక్కువ. మారిందల్లా ముఖ్యమంత్రి మాత్రమే. ఈ 53 నెలల కాలంలో లంచాలు, వివక్షకు తావు లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కితే నేరుగా రూ.2.40 లక్షల కోట్లు (డీబీటీ) అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. మరి అప్పట్లో ఈ రూ.2.40 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయన్నది ఆలోచించండి. పేదవాళ్లు వెళ్తున్న స్కూళ్లు, ఆస్పత్రులు కూడా మార్పు చేస్తున్నాం. గుడ్‌మారి్నంగ్ చెబుతూ ప్రతి నెల 1వ తేదీన అవ్వాతాతలకు వారి ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చే గొప్ప పాలన జరుగుతున్న రోజులకు, నాటి రోజులకు మధ్య తేడా గమనించండి. విజయవాడ నుంచే హజ్ యాత్ర ► గతంలో హజ్ యాత్రకు వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి వెళ్లే పరిస్థితి. విజయవాడ నుంచి నేరుగా వెళ్లేలా ఎంబార్కేషన్ పాయింట్‌గా ప్రకటించాం. ఆ తర్వాత హజ్ యాత్రకు హైదరాబాద్ కంటే విజయవాడ నుంచి విమాన టిక్కెట్ రూ.80 వేలు ఎక్కువగా వేశారని డిప్యూటీ సీఎం అంజాద్ చెప్పాడు. మనం ఇవ్వాలంటే అవుతుందా.. అని అడిగాడు. ఇక్కడ ఉన్నది మనందరి ప్రభుత్వం కాబట్టి.. కచ్చితంగా తోడుగా ఉంటామని చెప్పాను. ► రూ.14 కోట్లు ఎక్కువ అవుతుందంటే వెంటనే చెక్కు ఇచ్చి కార్యక్రమాన్ని కొనసాగించాం. నేను అడిగిందల్లా ఒక్కటే.. హజ్ యాత్రకు వెళ్లినప్పుడు మీ బిడ్డ ప్రభుత్వం కోసం దువా చేయండి అని. ఈ రోజు మైనార్టీలందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం మనది. ► అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనం పెంచాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పాస్టర్లకు కూడా రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తున్న ప్రభుత్వం కూడా మనదే. వక్ఫ్ బోర్డు, ముస్లిం మైనార్టీ, చర్చిలకు సంబంధించిన ఆస్తుల సంరక్షణ కోసం ఏకంగా జీవో నెంబరు 60 జారీ చేశాం. వీటి రక్షణ కోసం ఒక జీవో ఇచ్చి జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు వేసిన తర్వాత సచివాలయంలో ఉన్న ప్లానింగ్ సెక్రటరీలకు ఇన్ఛార్జ్ ఫర్ ప్రొటెక్షన్ బాధ్యతలు అప్పగిస్తూ అడుగులు వేసిన ప్రభుత్వం మనది. దేవుడు దయ, మీ అందరి చల్లని దీవెనలు మీ బిడ్డ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కోరుకుంటున్నా. అవార్డుల ప్రదానం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన అవార్డులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేశారు. మౌలానా ఆజాద్ జాతీయ అవార్డు–2023 డాక్టర్ ఎస్ఏ సత్తార్ సాహెబ్ (వైఎస్సార్ కడప), డాక్టర్ అబుల్ హక్ అవార్డు–2023 బాబా ఫకృద్దీన్ (అన్నమయ్య జిల్లా), పఠాన్ కరీముల్లా ఖాన్ (చిత్తూరు)కు అందించారు. జీవిత సాఫల్య (లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్) అవార్డు2023ను మహ్మద్ అజ్మత్ అలీ (కర్నూలు), మహ్మద్ నజీర్ (గుంటూరు), మహ్మద్ హఫీజర్ రెహ్మాన్ (నంద్యాల), పఠాన్ మహ్మద్ ఖాన్ (మదనపల్లె), షేక్ అబ్దుల్ గఫర్ (కర్నూలు), సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీ (తిరుపతి), మహ్మద్ గౌస్ ఖాన్ అరీఫ్ (వైఎస్సార్ కడప)కు అందజేశారు. 37 మంది రాష్ట్ర ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులకు, 51 మంది ఉర్దూ విద్యార్థులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చేతుల మీదుగా అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఉపా«ధ్యక్షురాలు జకియాఖానమ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్, మైనార్టీస్ కమిషన్ చైర్మన్ కె.ఇక్బాల్ అహ్మద్, హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజమ్, ఉర్దూ అకాడమి చైర్మన్ హెచ్.నదీమ్ అహ్మద్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఖాదర్ బాషా, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు రుహుల్లా, తలశిల రఘురాం, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. మైనార్టీలకు 53 నెలల్లో రూ.23,176 కోట్లు ► నా ముస్లిం మైనార్టీలనే తీసుకుంటే.. ఈ 53 నెలల కాలంలో డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ.23,176 కోట్లు ఇవ్వగలిగాం. వైఎస్సార్ పెన్షన్ కానుక, అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నావడ్డీ ఇలా ఏ పథకం తీసుకున్నా నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం చూసే విధంగా అడుగులు వేయగలిగాం. గత పాలనలో కేవలం రూ.2,665 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. తేడా మీరే గమనించాలి. ► ప్రతి అడుగులో, ప్రతి పనిలో, వేసే ప్రతి మొలక చెట్టు కావాలని, ప్రతి ముస్లిం కుటుంబం కూడా బాగు పడాలని, వారి పిల్లలు గొప్పగా ఎదగాలనే తపనతో అడుగులు పడ్డాయి. ఈ మధ్య కాలంలో షాదీ తోఫా పథకాన్ని తీసుకొచ్చాం. నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలని, వారిని చదివించే విధంగా ప్రోత్సహించేందుకు షాదీ తోఫా కోసం పదోతరగతి పాస్ కావాలన్న నిబంధన పెట్టాం. ఆ నిబంధన పెట్టినప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాం.. మనం ఇలాంటి కండిషన్లు ఎందుకు పెట్టడం.. తీసేద్దాం అని కొందరు అన్నారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను. నాయకుడు అన్నవాడు ఆలోచన చేయాల్సింది ఎన్నికల గురించి కాదు.. రేప్పొద్దున వీళ్ల జీవితాల్లో వెలుగు ఎలా నింపాలని, వారి భవిష్యత్ కోసం ఆలోచనలు జరగాలని చెప్పాను. ► ఈ రోజు మనం పదోతరగతి సర్టిఫికెట్ తప్పనిసరి అని చెప్పడంతో పాటు రూ.లక్ష పెళ్లి చేసుకునేటప్పుడు ఇస్తామని చెబుతున్నాం. అప్పుడు దానికోసం కచ్చితంగా పదోతరగతి వరకు చదివించే దిశగా తల్లిదండ్రులు అడుగులు వేస్తారు. ఆ పిల్లలు కూడా చదవడం మొదలు పెడతారు. ఆ పిల్లలు చదువుల కోసం అమ్మఒడి పథకం ద్వారా అడుగులు ముందుకు వేయించగలుగుతాం. నాడు–నేడు ద్వారా స్కూళ్లను మార్పు చేస్తున్నాం. ఇంగ్లిషు మీడియం, 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలో ఐఎఫ్పి డిజిటల్ స్క్రీన్లు, బైలింగువల్ టెక్ట్స్ బుక్స్, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్ బాగుండేలా ఊతమిస్తాయి. ► ఉన్నత విద్యకు వచ్చేసరికి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ (విద్యా దీవెన), వసతి దీవెన ఇస్తున్నాం. ఏ పేద తల్లి తన పిల్లలను చదవించేందుకు అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా ప్రతి అడుగులోనూ చేయిపట్టుకుని నడిపించే గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. అందులో మరో అడుగు కళ్యాణమస్తు (బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోని పేదల కోసం), షాదీతోఫా పథకాలని గొప్పగా చెప్పగలను. ► మనందరి ప్రభుత్వం వచ్చాక ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించాం. రాష్ట్రంలోని అన్ని వర్గాల మైనార్టీల కోసం సబ్ ప్లాన్ అమలు చేస్తున్నది కూడా మన ప్రభుత్వమే. దీనికోసం ఏకంగా ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపోనెంట్ చట్టం– సబ్‌ప్లాన్‌ను తీసుకువచ్చాం. మహనీయుల ఆదర్శంతో ప్రజా రంజక పాలన భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వంటి ఎంతో మంది మహనీయులను ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్ కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజా రంజక పాలన అందిస్తున్నారు. జగన్ మంత్రివర్గంలో తొలి ముస్లిం ఉప ముఖ్యమంత్రిగా, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రిగా పని చేస్తుండటం నా అదృష్టం. నాడు వైఎస్సార్ ముస్లింలకు రిజర్వేషన్లు తీసుకురావడంతో ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు పొందారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ ముస్లిం మైనార్టీలకు రాజకీయ సాధికారత కల్పించారు. ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా చేస్తే, అందులో నేనూ ఒకడిని. నలుగురు ముస్లిం ఎమ్మెల్సీలలో మహిళకు తొలిసారి అవకాశం ఇచ్చారు. ముస్లిం సోదరులు నలుగురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. ముస్లింలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. – అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి -
మొక్కల కన్నా ముస్లింలు హీనమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హరితహారం కోసం ఖర్చు చేస్తున్నన్ని నిధులు కూడా మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శిం చారు. ‘ఏడేళ్లలో మైనార్టీల సంక్షేమంపై ప్రభుత్వం రూ.6.199 కోట్లు ఖర్చు చేసింది. అదే హరితహారంపై ఇంతవరకు రూ.6,555 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఒక్క ఏడాదే రూ.548 కోట్లు వ్యయం చేశారు. మొక్కలు, చెట్లకన్నా మైనార్టీలు హీనమై పోయారా? ముస్లింలకు హరితహారం కన్నా తక్కువ నిధులు ఖర్చు చేస్తారా..?’ అని నిల దీశారు. సోమవారం శాసనసభలో మైనారిటీ సంక్షే మం, పాతబస్తీ అభివృద్ధిపై చర్చను అక్బరుద్దీన్ ప్రారంభించారు. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులకు సంబంధించి ఒక్కోసారి ఒక్కోరకమైన లెక్కలు ఇవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తప్పుడు లెక్కల మాదిరే మైనార్టీల ప్రగతి కూడా ఉందన్నారు. కొనసాగుతున్న వివక్ష రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో వివక్ష కొనసాగుతోందని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అం దుతున్న ఫలాలు మైనారిటీలకు దక్కడం లేదంటూ గణాంకాలతో సహా వివరించారు. మైనారిటీ పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్ షిప్పులు అందజేసే విషయంలో కూడా ప్రభుత్వ యంత్రాంగం చిన్నచూపు చూస్తోంద న్నారు. 2019 ఎన్నికల తర్వాత మైనార్టీల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని చెప్పారు. 2014–15 నుంచి ఇంతవరకు మసీదుల అభివృధ్ధికి, దర్గాల పనులు, ఖబరిస్థాన్ల కోసం మొత్తంగా రూ.210 కోట్లతో 800ల జీవోలు విడుదల చేసినా ఒక్క రూపాయిని కూడా ప్రభు త్వం ఇంతవరకు విడుదల చేయలేదని విమర్శిం చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 56,653 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల గుర్తింపు విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కుటుంబ వార్షికాదాయ పరిమితి రూ. 8 లక్షలు ఉంటే, మైనారిటీలకు రూ.2 లక్షలకే పరిమితం చేశారని, దీనిని మార్చాలని అక్బరుద్దీన్ కోరారు. పాతబస్తీపై నిర్లక్ష్యం హైదరాబాద్ పాత నగరాన్ని అభివృద్ధి చేయడంలో వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం కలుగు తోందని అక్బరుద్దీన్ చెప్పారు. ఫ్లై ఓవర్ల నిర్మాణం, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ), కుతుబ్షాహి టూంబ్స్ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, మెట్రో రైలు నిర్మాణం, మోనోట్రైన్ తీసుకురావడం వంటి అంశాల్లో పాతబస్తీని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. మెట్రో మూసీ దాటలేదని చెప్పారు. నాలాల నిర్మాణం, దర్గాలు, పహాడీల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని అధునాతనంగా నిర్మించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని అక్బరుద్దీన్ కొనియాడారు. హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధికి వైఎస్సార్ ఆనాడే రూ.2 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని తెలిపారు. 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: భట్టి విక్రమార్క మైనారిటీ ముస్లింలకు రాష్ట్రంలో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ (వైఎస్) ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఈ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని చెప్పిన టీఆర్ఎస్ అందుకు కట్టుబడి ఉండాలని కోరారు. రాజకీయ కారణాలతోనే పాతబస్తీని అభివృద్ధి చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కబ్జాలకు ఓల్డ్‌సిటీ అడ్డాగా మారిందని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. -
Telangana Assembly: ప్రతీకార రాజకీయాలను నమ్మం..
సాక్షి, హైదరాబాద్: ‘హమ్ బద్లేకి రాజ్‌నీతిమే విశ్వాస్ నహీ రక్తే.. బద్లావ్‌కి రాజ్‌నీతిమే విశ్వాస్ రక్తేహై (మేం ప్రతీకార రాజకీయాలను విశ్వసించం.. మార్పు తెచ్చే రాజకీయాలను నమ్ముతాం).. మార్పు తేవాలనుకుంటున్నాం.. కానీ మిమ్మల్ని ఆగం చేసి (రాజకీయంగా) ఖతం చేయాలని అను కోవడం లేదు. అందరినీ తీసుకుని ముందుకు పోతున్నాం’ అని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం–పాతనగరం అభివృద్ధి అంశంపై సోమ వారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన సభ్యులు లేవనెత్తిన అంశాలకు బదులి చ్చారు. ప్రభుత్వ పథకాల అమలులో తమ ప్రభు త్వం ఎన్నడూ వివక్ష చూపలేదని, భవిష్యత్తులో కూడా చూపదన్నారు. పాత నగరం, కొత్త నగరం.. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. ‘చరిత్రాత్మక గోల్కొండ కోట, సెవెన్ టోం బ్స్, చార్మినార్‌లకు ప్రపంచ పర్యాటక ప్రాంతా లుగా యునెస్కో గుర్తింపు పొందడానికి కృషి చేస్తాం. మీర్ఆలం మండిని చారిత్రక ఆనవాళ్లు దెబ్బతినకుండా పునరుద్ధరిస్తాం. ఇందుకు రూ.10 కోట్లు కేటాయించాం. దుర్గం చెరువు తరహాలో మీర్ ఆలం ట్యాంక్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.40 కోట్లతో ప్రతిపాదనలను మంజూరు చేస్తాం. ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు బకాయిపడిన నిధులను త్వరలో విడుదల చేస్తాం. ప్రైవేటు స్థలాల స్వాధీనం పూర్తయిన వెంటనే లాల్‌దర్వాజ మహంకాళి ఆలయ విస్తరణ పనులను ప్రారంభిస్తాం. అఫ్జల్‌గంజ్ మసీదు అభివృద్ధి పనులను సైతం త్వరలో చేపడతాం’ అని కేటీఆర్ చెప్పారు. వీటి విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ లేవనెత్తిన ప్రశ్నకు ఆయన బదులి చ్చారు. శివాజీనగర్‌లోని లక్ష్మీనర్సింహ ఆలయం వద్ద కళ్యాణ మండపం, బండ్లగూడలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా మని హామీనిచ్చారు. కొత్త సచివాలయం నిర్మాణంలో భాగంగా రెండు మసీదులు, ఒక ఆలయంతోపాటు చర్చిని సైతం నిర్మిస్తామని ఇచ్చిన హామీకి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని తేల్చి చెప్పారు. త్వరలో ముహూర్తం ఖరారు చేసి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. పాతబస్తీకి మెట్రో రైలు కల్పనకు కట్టుబడి ఉన్నామని, త్వరలో మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మసీదులు, ఆలయాన్ని పునర్నిర్మించాలి : అక్బరుద్దీన్ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కొత్త సచివాలయం నిర్మాణంలో భాగంగా రెండు మసీదులు, ఒక ఆలయాన్ని నిర్మించడంతో పాటు చర్చి నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలని ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎంఎంటీఎస్ రెండో విడత ప్రాజెక్టు ముందుకు కదలడం లేదన్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు మహంకాళి లాల్ దర్వాజ ఆలయ విస్తరణ, అఫ్జల్‌గంజ్ మసీదు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఛత్రినాకలోని శివాజీనగర్‌లో శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి సంబం ధించిన 2000 చదరపు అడుగుల స్థలంలో కళ్యాణమండపం నిర్మించాలని కోరారు. -
మైనార్టీల శ్రేయోభిలాషి వైఎస్సార్: అక్బరుద్దీన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో సోమవారం మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. వైఎస్సార్ లాంటి నేతను తన జీవితంలో చూడలేదని అన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజల పక్షపాతి, ముస్లింల శ్రేయోభిలాషిగా అభివర్ణించారు. వైఎస్సార్‌ను మైనార్టీ ప్రజలు తమ జీవితంలో మరచిపోరని అన్నారు. సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగానే తక్షణం పరిష్కరించిన గొప్ప మనసున్న నాయకుడిగా.. దివంగత నేత చేసిన సేవలను అక్బరుద్దీన్ గుర్తుచేసుకున్నారు. గతంలో.. కబ్జాలకు గురైన 85 ఎకరాల బాబా షర్ఫోద్దిన్ దర్గా స్థలాలను .. ఒక జీవోతో తిరిగి వక్ఫ్‌బోర్డుకు వైఎస్సార్ అప్పగించారని అక్బరుద్దీన్ అన్నారు. చదవండి: రాష్ట్రంలో ప్రతి మహిళ సెల్ఫోన్లో ‘దిశ’ యాప్ ఉండాలి: సీఎం జగన్ -
దళితబంధు లాగా మైనార్టీల బంధు ఇవ్వాలి: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందని, దళితబంధు లాగా మైనార్టీ బంధు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీ గర్జనలో ఎంపీ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కల్పించారని తెలిపారు. కేసీఆర్ 12శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామి ఇచ్చి మరిచిపోయాడని మండిపడ్డారు. మైనార్టీలు ఒకసారి ఆలోచించాలని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వంటి కీలకమైన పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమేనని గుర్తుచేశారు. యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మీదే, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీదేనని, కారునో, పతంగినో నమ్ముకొని మోసపోవద్దని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. -
న్యాయబద్దంగా ఎలా చేయాలో అదే చేశాం: సీఎం జగన్
-
మైనారిటీల సంక్షేమ చరిత్రలో సువర్ణాధ్యాయం
నంద్యాల ఘటన బాధాకరం. ఆ ఘటనకు సంబంధించిన సెల్ఫీ వీడియో బయటకు రాగానే, న్యాయబద్ధంగా ఏం చేయాలో అది చేశాం. తన, మన, పర అని చూడకుండా పోలీసులపై కేసులు పెట్టి, అరెస్టు చేశాం. అయితే గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, ఆ పార్టీకి చెందిన రామచంద్రరావు అనే వ్యక్తి ఆ ఇద్దరు పోలీసులకు వెంటనే బెయిల్ ఇప్పించాడు. అంటే వారే బెయిల్ పిటిషన్ వేస్తారు. మళ్లీ వారే ప్రభుత్వాన్ని నిందిస్తారు. వారి పలుకుబడి ముందు మా పలుకుబడి సరిపోవడం లేదు. ఆ బెయిల్‌ను క్యాన్సిల్ చేయడం కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మైనారిటీల సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అన్ని మతాలు, కులాల మధ్య అన్నదమ్ముల భావనను మరింతగా పెంపొందించేందుకు అన్ని ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని తెలిపారు. 17 నెలల పాలన కాలంలో మైనారిటీలకు రూ.3,428 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం జగన్ నివాళులర్పించారు. అనంతరం అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, పెన్షన్ కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, చేదోడు, నేతన్న నేస్తం, లా నేస్తం తదితర పథకాల ద్వారా గత నెల వరకు రూ.2,585 కోట్లు నేరుగా నగదు బదిలీ చేశామని చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, ఇవ్వనున్న ఇళ్ల స్థలాల పట్టాల ద్వారా మైనారిటీలకు అందే ప్రయోజనం రూ.843 కోట్లు అని వివరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. విద్యా రంగంలో సంస్కరణలకు ఆద్యుడు ► నేడు (బుధవారం) ఆజాద్ జయంతి. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు, మానవతావాది, బహు భాషా ప్రవీణుడు. దేశ తొలి విద్యా మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఎన్నో సేవలు అందించారు. అందుకే ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ► 2008లో ప్రియతమ నాయకుడు వైఎస్సార్ నిర్ణయం ప్రకారం ఆజాద్ జయంతిని మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ► మన విద్యా వ్యవస్థ దేశ అవసరాలకు తగినట్లు మార్చేందుకు ఆజాద్ ఎంతో కృషి చేశారు. ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు పలు సంస్కరణలు అమలు చేశారు. విద్యా శాఖలో భాగమైన బోర్డులు, సంస్థలు, కమిషన్లు, అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ (ఏఐసీటీఈ), యూజీసీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ప్రారంభించింది ఆయనే. ముస్లిం, క్రైస్తవ మత పెద్దలతో సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు తల్లిదండ్రుల్లా బాధ్యతగా నిర్ణయాలు ► రాష్ట్రంలో మన పిల్లల అవసరాలు, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా విధానంలో మార్పులు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు–నేడు’తో సమూల మార్పులు తీసుకొస్తున్నాం. ► చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పిల్లలకు దుస్తులు, షూస్, సాక్సులు, పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్స్ మొదలగునవి ఇస్తున్నాం. తరగతి గదులు, టాయిలెట్లు, క్లీన్ వాటర్, కాంపౌండ్ వాల్ వరకు అన్ని వసతులు కల్పిస్తున్నాం. ► మధ్యాహ్న భోజనం మెనూ మార్చాం. మంచి కరిక్యులమ్, ఇంగ్లిష్ మీడియమ్, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చులూ ఇస్తూ అండగా నిలుస్తున్నాం. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల మాదిరిగా ఆలోచించి బాధ్యతగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. వివిధ మతాల పెద్దలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో.. ► ఇవాళ మైనారిటీల మీద జూమ్‌లో, ట్విటర్లో ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్న ఒకాయన, గతంలో ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో మైనారిటీలకు అందించింది రూ.2,661 కోట్లు మాత్రమే. ► 2014–15లో రూ.345 కోట్లు, 2015–16లో రూ.340 కోట్లు, 2016–17లో రూ.641 కోట్లు, 2017–18లో రూ.667 కోట్లు, 2018–19లో రూ.668 కోట్లు ఇచ్చారు. ► ఒక్కరంటే ఒక్కరు మైనారిటీ మంత్రి లేని ప్రభుత్వాన్ని నడిపిన మహానుభావుడు. ఎన్నికల ముందు వరకు మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ ఈ రోజు మైనారిటీల మీద తనకు ప్రేమ ఉందంటాడు. ఎలా బురద చల్లాలన్నదే వారి లక్ష్యం. అవి కూడా అమలు చేస్తాం ► మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో ఇంకా రెండు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వైఎస్సార్ పెళ్లి కానుక పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం. ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనాలు పెంచడం, పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, కొడాలి నాని, సీఎస్ నీలం సాహ్ని, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు. మైనారిటీల కోసం ఎన్నెన్నో చేశాం.. ► ఇవాళ మైనారిటీ సోదరుల కోసం నిజాయితీగా అన్నీ చేస్తున్నాం. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు, హోలీ ల్యాండ్‌కు వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సహాయాన్ని రూ.30 వేల నుంచి రూ.60 వేలకు పెంచాం. ► రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.60 వేలు, రూ.3 లక్షలకు పైబడి ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజాన్లకు రూ.3 వేల గౌరవ వేతనం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గౌరవ పూర్వకంగా అందిస్తున్నాం. దీన్ని ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజాన్లకు రూ.5 వేలకు పెంచుతూ జనవరి 1న ఆదేశాలు జారీ చేశాం. ► వక్ఫ్ బోర్డు, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర, చర ఆస్తులను రీసర్వే చేయించి వారి ఆస్తులు కాపాడే చర్యలు తీసుకుంటున్నాం. క్రైస్తవులు, మిషనరీల ఆస్తులు కాపాడేందుకు కూడా రీ సర్వే చేపడుతున్నాం. ► నవరత్నాల ద్వారా మైనారిటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నాం. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేశాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ముస్లింలు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. -
'ముస్లింలకు మాపార్టీ తగిన ప్రాధాన్యత ఇస్తుంది'
సాక్షి, విశాఖపట్నం : ముస్లింల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ ప్రాధాన్యత ఇస్తోందని విఎంఆర్డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ వెల్లడించారు. మైనారిటీ మహిళలకు సొంత ఇళ్లు కల్పించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేసే ఆలోచన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మదిలో ఉన్నట్లు స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతోందని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఇసుక దోపిడి జరిగిందని, ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలవుతుంటే పచ్చపార్టీ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మైనార్టీలకు కనీసం పది సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. -
సలామ్ వైఎస్సార్ సాబ్ !
సాక్షి, విజయవాడ : స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా ముస్లింలకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. ఎన్నికల ముందు నేతలు ఇచ్చే హామీలు నమ్మి ఓట్లేయడం. అనంతరం తమ సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వాన్ని నిందించుకోవడం. ఇదీ 2004 ముందు వరకు ముస్లింల పరిస్థితి. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రయాణ స్వీకరం చేశారు. ముస్లింల సంక్షేమానికి బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. అలాంటి వారి జీవితాల్లో ఐదున్నర దశాబ్దాల తర్వాత వెలుగులు నింపారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. అందుకే మైనార్టీల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన హయాంలో మైనార్టీల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.మరోక వైపు బీజేపీతో పొత్తులు పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లింలపై కపట ప్రేమ చూపించారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు.. పేదరికంలో ఉన్న మైనార్టీలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కనీస భద్రత, ఆనందవంతమైన బతుకు గడిపేందుకు భరోసా అందించారు. ఇందులో భాగంగా 4 శాతం రిజర్వేషన్ పథకాన్ని అమలు చేశారు. ఇందులో నిరుపేద ముస్లింలను మొత్తం చేర్చారు. 2005 జూన్‌లో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా జిల్లాలో వందల మంది రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు సాధించారు. తద్వారా ఐఏఎస్, ఐపీఎస్, వైద్యులు, ఆర్డీఓ, తహసీల్దార్ తదితర ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. పేదరికంలో మగ్గుతున్న మైనార్టీ విద్యార్థుల జీవితాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో ఉన్నత విద్యా వెలుగులు నింపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ఇందులో భాగంగా ఇంజినీరింగ్, మెడిసిన్‌కు సంబంధించి కళాశాల గ్రేడ్‌ను బట్టి మైనార్టీలకు రూ.35 వేలు, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు రూ.26 వేల నుంచి రూ.27 వేల వరకు ఆయా కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. దీంతో పాటు కళాశాలకు సంబంధించిన హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ కింద రూ.13 వేలను అందజేసేది. జిల్లా వ్యాప్తంగా 39 ఇంజినీరింగ్ కళాశాలలుండగా.. వీటి పరిధిలో ప్రతి ఏటా 11,584 నుంచి 12,000 మంది మైనార్టీ విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసెన్ కోర్సుల్లో విద్యను అభ్యసించేవారు. వీరి ఏటా సుమారు రూ.23.18 కోట్లు చెల్లించేవారు. ఇలా ఐదేళ్లలో 58 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారంటే అది వైఎస్సార్ ఘనతే. బీజేపీతో బాబు దోస్తీ.. చంద్రబాబునాయుడు బీజేపీతో స్నేహం కోసం తహతహలాడతారు. 1999లో తొలిసారిగా బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. వాజ్‌పేయ్‌కు ఉన్న హవాతో చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్లు ముస్లింల వైపు చంద్రబాబు కన్నేతి చూడలేదు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరి గారు. 2004లో బీజేపీతో కలిసి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తన ఓటమికి బీజేపీనే కారణమంటూ ఇక భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకోనంటూ శపధం చేశారు. అయి తే 2014లో తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. నరేంద్ర మోడి ప్రభంజనంతో తిరిగి ము ఖ్య మంత్రి అయ్యారు. ముస్లింలను దూరంగా ఉంచారు. నాలుగున్నర ఏళ్లు చిలకా గోరింకలులాగా బీజేపీ, టీడీపీలు కలిపి పనిచేశాయి. అప్పుడు ముస్లింలను దగ్గరకు రానీవ్వలేదు. బీజేపీకీ దూరమైన తరువాత కేవలం ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఫారూఖ్‌కు మంత్రి పదవి ఇచ్చారు. విజయవాడలో తొలి ఎమ్మెల్సీ సీటు ముస్లింలదే.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలను తన గుండెల్లో పెట్టుకని చూసుకుంటున్నారు. రాజకీయ సమీకరణాల్లో ముస్లింలకు జిల్లాలో సీటు ఇవ్వలేకపోయారు. అయితే విజయవాడలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నేపథ్యంలో జననేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల తరువాత విజయవాడకు కేటాయించిన తొలి ఎమ్మెల్సీ సీటు ముస్లింలకే కేటాయిస్తానని, వారికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ముస్లింలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తండ్రి లాగానే వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పరని తమకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తారని వారు నమ్ముతున్నారు. ముస్లింల జీవితాల్లో వెలుగులు ముస్లింలకు ఎవరూ చేయలేని మేలును డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసి చూపించారు. ఆయన కల్పించిన 4 శాతం రిజర్వేషన్ల ఫలితంగా ముస్లింలు ఉన్నత ఉద్యోగాల్లో చేరడమే కాక, వైద్యులు, ఇంజినీర్లుగా ఎదిగారు. అప్పటి వరకూ చదువుకోవాలని ఉన్నా సీట్లు రాక, ఫీజులు చెల్లించలేక నిస్సహాయ స్థితిలో ఉన్న ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి. ఆయన చేసిన మేలును ఎన్నటికీ మరువజాలదు. ముస్లింలకు ఏదైనా మేలు జరిగిందంటే అది వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలోనేనని అందరూ నమ్ముతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ నేటికీ ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. – ఫయాజ్ అహ్మద్, లబ్బీపేట, విజయవాడ -
జగన్‌తోనే మైనార్టీలకు సంక్షేమ ఫలాలు
సాక్షి, కర్నూలు : ‘నాకు డబ్బు సంపాదించాలన్న వ్యామోహం లేదు. సేవ చేయాలనే తలంపుతోనే రాజకీయాల్లోకి వచ్చా. కర్నూలు నగర ప్రజల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లో చేరాను. ఇక్కడి సమస్యలపై తొమ్మిదేళ్లు అవగాహన పెంచుకున్నాను. నగర ప్రజల అవసరాలేంటి, వారికేం కావాలో ఇప్పుడు నాకు పూర్తిగా తెలుసు. అవన్నీ నా మదిలో ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి చేరిన నేను ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి.. వాటిని ఎలా పరిష్కారించాలనేది క్షేత్ర స్థాయికి వెళ్లి అవగాహన పెంచుకున్నాను. కర్నూలు అసెంబ్లీ సీటు గెలిచి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇస్తా’ అంటున్నారు వైఎస్సార్సీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్. ‘సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకున్నారు. ‘మైనార్టీ వర్గానికి చెందిన నాలాంటి వ్యక్తికి సీటు రావడమే తొలి విజయం. నేను ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కర్నూలు మాంటిస్సోరి, ఇంటర్మీడియెట్ ఉస్మానియాలో, సివిల్ ఇంజినీరింగ్ హైదరాబాద్‌లోని ఎంజే కాలేజీలో పూర్తి చేశా. తరువాత అమెరికా వెళ్లాను. డెట్రాయిట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశాను. అక్కడే సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించి నిర్వహించాను. 2011లో కర్నూలు తిరిగొచ్చా. మా నాన్నను వైఎస్సార్ సీపీలో చేర్పించాలని ఓదార్పు యాత్రలో భాగంగా తెర్నేకల్‌కు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశాను. అప్పుడే రాజకీయాల్లోకి రావాలని జగనన్న కోరితే కాదనలేకపోయా. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయా. పార్టీలో సామాన్య కార్యకర్తగా నా ప్రస్థానం ప్రారంభమైంది. నా సేవలను గుర్తించిన వైఎస్ జగన్ కర్నూలు అసెంబ్లీ సీటిచ్చారు. ఇదే నా తొలి విజయం. వైఎస్ హయాంలోనే మైనార్టీల సంక్షేమం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మైనార్టీలకు ఆరాధ్య దైవం. ఆయన ముస్లిం, మైనార్టీల్లో వెనుకబడిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ,, పేద మహిళల పెళ్లిళ్లకు ప్రోత్సాహం వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. వీటితో ఎంతోమంది పేద ముస్లింలు బాగుపడ్డారు. ఆయన మరణం తరువాత మైనార్టీలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే ముస్లింలకు మళ్లీ సంక్షేమ ఫలాలు అందుతాయి. నవరత్నాల వల్ల ముస్లింల అభివృద్ధి మళ్లీ పట్టాలెక్కుతుంది. కర్నూలు నగరంలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. అందులో పేదల శాతం ఎక్కువ. ఇక్కడ వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. అలా వెళ్లేవారికి ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించాలన్నదే నా ధ్యేయం. కర్నూలు–నంద్యాల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్ సీపీ సానుకూలంగా ఉంది. అదే జరిగితే కర్నూలు జిల్లా నిరుద్యోగులకు ఎంతో ఉపయోగం కలుగుతుంది. వారిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు కర్నూలు నగరం విభిన్న కులాల సమాహారం. ఇక్కడ ముస్లింలు, ఆర్యవైశ్యులు, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు రాజస్థానీయులు జీవిస్తున్నారు. బడా వ్యాపారవేత్త టీజీ వెంకటేష్ కుటుంబం వారిని ఇబ్బంది పెడుతోంది. అన్ని వ్యాపారాలు వాళ్లే చేయాలనుకుంటున్నారు. వాళ్లు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారు. జీవనం కోసం కష్టపడే వారిని నష్టాలకు గురి చేస్తూ అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. అలాంటి నాయకులపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వారి పాలనను ప్రజలు కోరుకోవడం లేదు. వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయానికి ఢోకా లేదు కర్నూలు నగరంలో వైఎస్సార్ సీపీకి కార్యకర్తల బలం అధికంగా ఉంది. టీజీ కుటుంబం డబ్బుతో ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తోంది. మా పార్టీలో అమ్ముడుపోయే కార్యకర్తలు లేరు. కొందరు రాజకీయమంటే వ్యాపారంగా చూస్తున్నారు. అది తప్పు. రాజకీయమంటే పేదలకు సేవ చేయడం. సంపాదన కోసం మాత్రం కాదు. కర్నూలును స్మార్ట్ సిటీగా మారుస్తా కర్నూలు నగరంలో దాదాపు 6 లక్షల జనాభా ఉంది. ఇక్కడి ప్రజలకు మంచి నీళ్లు అందడం లేదు. ఫిబ్రవరి నుంచే నీటి ఎద్దడి ఉంటోంది. దీని కోసం రెండో సమ్మర్ స్టోరేజి ట్యాంకు కట్టేందుకు వైఎస్ హయాంలో నిధులిచ్చినా వెనక్కిపోయాయి. హంద్రీ, తుంగభద్ర నదుల రక్షణ గోడ నిర్మాణానికి పెద్దాయన నిధులిచ్చినా తరువాత వచ్చిన పాలకులు కట్టలేకపోయారు. నగరంలో ఎక్కడా డ్రెయినేజీలు లేవు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. ఇన్నర్, అవుటర్ రింగ్‌రోడ్ల నిర్మాణం చేపట్టాలి. నగరాన్ని దోమల బెడద నుంచి కాపాడాల్సి ఉంది. యువతకు ఉద్యోగాలు కావాలి. వీటన్నింటినీ సాధించి కర్నూలు నగరాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంతో స్మార్ట్ సిటీగా మారుస్తా. ఐదేళ్ల టీడీపీ పాలనలో స్మార్ట్ సిటీ అంటూ హడావుడి చేసి అభివృద్ధి చేయలేకపోయారు. గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలతో కర్నూలు అభివృద్ధి కుంటుపడింది . -
హర్ దిల్ మే వైఎస్సార్
సాక్షి, గుంటూరు : బడుగుల అంతులేని బాధలు ఆయన చూశాడు అణగారిన వర్గాల ఆవేదనలు ఆయన విన్నాడు అభాగ్యుల ఆకలి కేకలను ఆయన ఆలకించాడుబిడ్డల భవిష్యత్‌పై తల్లిదండ్రుల ఆకాంక్షలను గుర్తించాడుఉన్నత చదువులపై పిల్లలు పెంచుకున్న ఆశలు తెలుసుకున్నాడు..అందుకే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాడు.. ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా నిలిచాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పిల్లల ఉన్నత చదువులకు అక్షర బాటలు పరిచాడు.. నాలుగు శాతం రిజర్వేషన్లతో ఉన్నత విద్యావకాశాలను పేదల ఇంటి ముంగిటకు నడిపించాడు. ఎదిగిన బిడ్డల భవిష్యత్‌లో, పిల్లలను చూసి మురిసిన తల్లిదండ్రుల ఆనందంలో నిత్యం చిరునవ్వై కొలువుదీరాడు. కాలంలో కలిసిపోయినా వెన్నెలంటి మంచితనంతో కలకాలం ప్రతి ఇంటా దేదీప్యమానంగా వెలుగొందుతూనే ఉన్నారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రతిసారీ ఎన్నికలకు ముందు నేతలు ఇచ్చే హామీలను నమ్మి ఓట్లేయడం.. అనంతరం తమ సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వాన్ని నిందించుకోవడం. ఇదీ 2004 ముందు వరకు ముస్లింల పరిస్థితి. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముస్లిం సంక్షేమానికి బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టే సమాజంలో ముస్లింలను తలెత్తుకుని జీవించేలా చేశారు. వెలుగు కిరణాలు...4 శాతం రిజర్వేషన్లు ముస్లింల వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు రాజశేఖరరెడ్డి రిజర్వేషన్లు ప్రవేశ పెట్టారు.15 ఉపకులాలను బీసీలుగా గుర్తించి విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో 5 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించేందుకు జీవో తెచ్చి ఆచరణలో పెట్టారు. కొన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి న్యాయస్థానంలో స్టే తీసుకొచ్చి అమలు చేశారు. ఆటంకాలు తొలగించేందుకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2007లో జీవోఎంఎస్ నంబరు 29ని జారీ చేశారు. దీంతో ఎంతో మంది ముస్లింలు ఉద్యోగ, వయో పరిమితి, ఉపాధి రంగాల్లో అర్హత సాధించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పదో తరగతి తరువాత కళాశాల విద్య కావాలంటే వేలాది రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. వైఎస్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని 2007లో వర్తింప చేశారు. అర్హులైన విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, బీఈడీ, పీజీ, బీ ఫార్మసీ, ఐటీఐ, డిప్లొమో, లా, నర్సింగ్ వంటి విద్యను ప్రభుత్వ కళాశాలలతోపాటు ప్రైవేటు సంస్థలలోనూ ఉచితంగా అందించారు. దీంతోపాటు స్కాలర్షిప్లు మంజూరు చేశారు. 2004 ముందు ఏటా 3 వేలలోపు మందికి స్కాలర్షిప్లు అందుతుండగా వైఎస్సార్ ఈ సంఖ్యను 30 వేల మందికి పెంచారు. రుణ మాఫీ...కొత్త రుణాలు 2006లో వైఎస్సార్ రుణ మాఫీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో జిల్లాలో 25 వేల మందికిపైగా ముస్లింలపై రుణ భారం తొలగింది. ఆ తరువాత రుణాలు తిరిగి చెల్లించే మార్జిన్ మనీ విధానాన్ని తొలగించి 50 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చేందుకు కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఉచిత వివాహాలు సామూహిక వివాహాల పథకాన్ని 2006లో ప్రవేశ పెట్టారు. పెళ్లిళ్లతోపాటు వధూవరులకు పెళ్లి దుస్తులు, రెండు గ్రాముల బంగారంతో కూడిన నల్లపూసల హారం(కాలిపోత్‌ల లచ్చ), పవిత్ర గ్రంథం ఖురాన్, మంచం, వంట సామగ్రిలను ఒక్కో జంటకు రూ.15 వేలు ఖర్చు చేసి ఉచితంగా అందించారు వైఎస్సార్. తండ్రి బాటలోనే.. వైఎస్సార్ బాటలోనే ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారు. ఇప్పటికే ముస్లిం సంక్షేమం కోసం అనేక వరాలు ప్రకటించారు. మసీదుల్లో ఉండే ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.4 వేలు గౌరవ వేతనం ఇస్తారు. దుల్హన్ పథకం ద్వారా ముస్లిం పిల్లల వివాహనికి రూ.లక్ష అర్థిక సాయం చేస్తామన్నారు ముస్లిం సబ్‌ప్లాన్‌తోపాటు ఇస్లామిక్ బ్యాంకుల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. సున్నా వడ్డీతో ముస్లిం యువతకు రూ.75 వేల వరకు రుణం అందిస్తారు. వైఎస్సార్ చేయూత పథకం కింద 45 ఏళ్లు దాటిన ముస్లిం మహిళలకు పెన్షన్లు, రూ.75 వేల వరకు ఆర్థికసాయం ఇస్తారు. నిరుద్యోగ యువతకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు రుణాలు అందిస్తారు. ముస్లింలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి ఒక షాదీఖానా నిర్మాణం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. -
వైఎస్సార్ సీపీతోనే మైనారిటీల సంక్షేమం
సాక్షి, మచిలీపట్నం టౌన్: పట్టణానికి చెందిన పలువురు టీడీపీ మైనార్టీ విభాగం నాయకులు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని) పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా నాయకుడు షేక్ మౌలాలికి పేర్ని నాని పార్టీ కండువాను కప్పారు. మౌలాలితో పాటు 20 కుటుంబాలకు చెందిన వారు పార్టీలో చేరారు. వీరిలో బాబూలాల్, లతీఫ్, అమ్జత్ఖాన్, షరీఫ్, నాగూర్, మస్తాన్‌షరీఫ్, అమాన్, అబ్బాస్, హజీ, అసీఫ్, రహీమాన్, అతీఫ్, అజీజ్, ఇద్రిస్, అబ్బాస్, సలీమ్, సలామ్, హషన్ తదితరులు ఉన్నారు. టీడీపీకి చెందిన మస్తాన్‌వలీ, ఎస్కె బాజీ లు కూడా పార్టీలో చేరారు. వీరికి కూడా పేర్ని నాని కండువాలు కప్పారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు షేక్ సలార్‌దాదా, మునిసిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చెబా, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు పాల్గొన్నారు. ముస్లింలతో పేర్ని నాని సమావేశం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) శుక్రవారం ముస్లింలను కలుసుకున్నారు. స్థానిక రాజుపేటలోని కొత్తమసీదులో ప్రార్థనలు చేసి బయటకు వచ్చిన ముస్లింలను పలకరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలార్‌దాదా, మునిసిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చెబా, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు, 31వ వార్డు ఇన్చార్జి ఇక్బాల్, వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం నాయకుడు మహ్మద్‌రఫీ, మొహముద్, మొహముద్ సాహెబ్, బాజి, పార్టీ నాయకులు శొంఠి ఫరీద్ ఉన్నారు. ఇంటింటి ప్రచారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను గెలిపించాలని కోరుతూ పట్టణంలోని పలు వార్డుల్లో ఆ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 37వ వార్డులో పేర్ని నాని తనయుడు కృష్ణమూర్తి (కిట్టు) బలరామునిపేట అంబేద్కర్‌నగర్‌లో పర్యటించారు. పర్యటనలో ఆ వార్డు కౌన్సిలర్ లంకా సూరిబాబు, మాజీ కౌన్సిలర్ బండారు నాని, పిన్నెంటి శ్రీనివాసరావు, విజయగణపతి ఆలయ చైర్మన్ సింహాచలం, రవి పాల్గొన్నారు. 25వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 15వ వార్డులో.. కోనేరుసెంటర్: పేర్ని నానిని గెలిపించాలని అని 15వ వార్డు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ మేకల సుధాకర్ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఆర్థిక స్వావలంబనే.. మచిలీపట్నం సబర్బన్: డ్వాక్రా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. చిన్నాపురంలో డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు లంకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకుల ప్రచారం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలేఖాన్‌పేటలో పర్యటిస్తూ ఎన్నికల్లో రాష్ట్రంలో మాదిగ వ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబునాయుడును గద్దె దింపేందుకు మాదిగలు సమాయత్తం కావాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బీడెల్లి మరియకుమార్, కొల్లూరి బసవ, చీలి రవీంద్ర ఉన్నారు. -
దేశం మొత్తం తెలంగాణ ఎన్నికలను గమనిస్తోంది!
సాక్షి, హైదరాబాద్ : దేశం మొత్తం తెలంగాణ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోందని, ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కలిసి తెలంగాణను మోసం చేయాలని చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో కాంగ్రెస్ పార్టీ ఆదివారం నిర్వహించిన మైనారిటీలో సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు కేసీఆర్‌కు గుణపాఠం కాబోతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లిం మైనారిటీల పక్షపాతి అని, పేద ముస్లింల కోసం వైఎస్సార్ హయాంలో ఎన్నో పథకాలను కాంగ్రెస్ అమలు చేసిందని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్‌కు ఓటు వేస్తె మోదీకి వేసినట్టేనని, కేసీఆర్ ఊసరవెల్లిలాంటి వారని విమర్శించారు. కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. కేసీఆర్ మైనారిటీలకు ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్ అమలు చేయలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కేబినెట్లో ఎస్సీలకు, మహిళలకు చోటు దక్కలేదన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు ఫ్యామిలీగా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పార్లమెంటులో తాము పోరాటం చేసినపుడు కేసీఆర్ లేరని పేర్కొన్నారు. డైనమిక్ యువ నేత రేవంత్ అంటే కేసీఆర్‌కు భయమన్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుందని ఆరోపించారు. చిన్న దొంగ కేసీఆర్ అయితే.. పెద్దదొంగ నరేంద్ర మోదీ అని అభివర్ణించారు. రాష్ట్రంలో అభివృద్ధి అటకెక్కిందని, కేసీఆర్‌కు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చిందని చెప్పారు. కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింల అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని పేర్కొన్నారు. -
మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం: మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్టు రాష్ట్ర సమాచారం, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. వక్ఫ్ ఆస్తులను పరి రక్షించాలని ఆధికారులను ఆదేశించా రు. జిల్లా పరిషత్ సమావేశం మంది రంలో జిల్లా అధికారులతో మంగళవా రం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మైనార్టీ సంక్షేమంపై సమీక్షిస్తూ 1780 ఎకరాల వక్ఫ్ భూములుయని అధికారులు అన్నారు. వీటిలో 755.73 ఎకరాలు పొం దూరు, 12.82 ఎకరాలు బలగలోనూ గుర్తించామని అధికారులు వివరించారు. వక్ఫ్ భూము లు కోట్లాది రూపాయల విలువైనవని, ఆక్రమణలను గుర్తించి తమకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుని వాటి పరిరక్షణకు కృషి చేస్తామని రాష్ట్ర కార్మికశాఖమంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆమదాలవలసలో షాదీఖా నా నిర్మించినా నిరుపయోగంగా ఉందని ప్రభుత్వ విప్ కూ న రవికుమార్ తెలిపారు. తహశీల్దార్ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసుకొని వక్ఫ్ ఆస్తులను పరిరక్షించుకోవాలని మంత్రి రఘునాథరెడ్డి సూచిం చారు. జిల్లాలో 48 వక్ఫ్ సంస్థలున్నప్పటికీ.. చాలా చోట్ల ఆక్రమణలో ఉన్నాయని సమీక్షలో పాల్గొన్న ముస్లిం నా యకులు ఫిర్యాదు చేశారు. స్పెషల్ డ్రైవ్‌లో ఆక్రమణ భూముల వివరాలను సేకరించి తమకు అందజేయాలని డీఆర్వోను మంత్రి రఘునాథరెడ్డి ఆదేశించారు. శ్రీకాకుళం చౌకబజారులో సర్వే నంబరు 224లోని మసీదు ఆక్రమణలో ఉన్నందున త్వరలోనే జరగబోయే పీర్ల పండుగకు అవకాశం లేదని ముస్లీం నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థలం కోర్టు ట్రిబ్యునల్‌లో ఉన్నందున తమకు న్యాయం చేయాలని కోరారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఒకే మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఉండడం వల్ల సామూహిక వివాహాల బడ్జెట్ ఖ ర్చు చేయలేక పోయామని జిల్లా ట్రెజ రీలో సాంకేతిక సమస్య వల్ల బిల్లుల చెల్లింపులు జరగడం లేదని మైనార్టీ సంక్షేమాధికారి తెలిపారు. సమాచార శాఖ అధికారులు వారిధిలాంటి వారు సమాచారశాఖపై సమీక్షించిన మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమాచార శాఖ అధికారులు వారధిలాంటివారన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు పని తీరు ప్రజలకు తెలియజేయడం, ప్రజల స్పందనను ప్రభుత్వానికి చేరవేయడం రోజూ పత్రికల్లో వచ్చే అనుకూల, ప్రతి కూల వార్తలను జిల్లా, డివిజన్ స్థాయి ల్లో కలెక్టర్‌కు, ఆర్డీవోలకు పంపించి ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేయడానికి నిరంతరం సమాచార శాఖాధికారులు పనిచేయూలన్నారు. పాత్రికేయుల సంక్షేమ నిధిని కోటి రూపాయల నుంచి పెంచుతామన్నారు. రాష్ట్రంలో 9,264 విద్యుత్ ఫీడర్లు ఉన్నాయని, 4.20 లక్షల ఆధార్ సీడింగ్ పూర్తరుునట్టు మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాను పారి శ్రామికంగా అభివృద్ధి పరిచి వలసలను నివారించేందుకు కృషి చేస్తానన్నారు. తెలుగుజాతి ప్రతిష్టను పెంపొందిస్తాం తెలుగుజాతి ప్రతిష్టను పెంపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని, ప్రతిష్టను నిలిపిన మహానుభావులు అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, టంగుటూరి ప్రశాశం పంతులు వంటి మహోన్నతుల ఉత్సవాలు జరుపుకోవాల న్నారు. విజయనగరం జిల్లాలో లలిత కళా అకాడమీని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో విమానాశ్రయం, పుడ్‌పార్కు ఏర్పాటు చేస్తామని, ఫార్మా రం గాలను అభివృద్ధి చేస్తామన్నారు. వంశధార, నాగావళికి ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికిఎంత ఖర్చు అయిన వెనుకాడబోమని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, ఎమ్మె ల్యే గుండ లక్ష్మీదేవి, జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ జి.వీరపాండ్యన్, ఏజేసీ మహమ్మద్ హషీం షరీఫ్ మాట్లాడారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, సమాచార శాఖ సంయుక్త సంచాకుడు కె. రాజబాబు, డీఆర్వో నూర్ బాషాఖాసీం, సమాచారశాఖ ప్రాంతీ య సమాచార ఇంజినీర్ ఎ.సత్యనారాయణ, ఏడీ బాబ్జి, డీపీఆర్వో ఎల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.