సాక్షి, విశాఖపట్నం : ముస్లింల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ ప్రాధాన్యత ఇస్తోందని విఎంఆర్‌డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ వెల్లడించారు. మైనారిటీ మహిళలకు సొంత ఇళ్లు కల్పించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేసే ఆలోచన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మదిలో ఉన్నట్లు స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరుగుతోందని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఇసుక దోపిడి జరిగిందని, ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలవుతుంటే పచ్చపార్టీ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మైనార్టీలకు కనీసం పది సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment