Dronamraju Srinivas
-
సీఎం జగన్ అండగా నిలిచారు: శ్రీవాత్సవ
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోగ్యం గురించి సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీశారని ఆయన కుమారుడు శ్రీవత్సవ అన్నారు. తన తండ్రి అనారోగ్యానికి గురైతే.. పార్టీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిందని గుర్తుచేశారు. మంగళవారం విశాఖలోని ఉడా చిల్డ్రన్ థియేటర్లో ద్రోణంరాజు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయ్‌సాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, ఎంవీవీ సత్యనారాయణ.. సత్యవతి, గుడివాడ అమర్నాథ్, అదీప్‌రాజు, గొల్ల బాబూరావు, భాగ్యలక్ష్మి, కార్యకర్తలు పాల్గొని ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్ర పటానికి పుల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు శ్రీవాత్సవ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తమకు అండగా నిలిచారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రేమ అనేది స్వచ్ఛంగా ఉంటుందని చెప్పారు. పార్టీలో ఆలస్యంగా చేరిన తన తండ్రికి సీఎం జగన్ ఎమ్మెల్యే సీటు ఇచ్చారని గుర్తుచేశారు. తన నాన్న ఆరోగ్యం గురించి ఆయన ఎప్పటికప్పుడు ఆరా తీశారని చెప్పారు. మెరుగైన వైద్యం అందించమని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దురదృష్టవశాత్తు తన తండ్రి చనిపోయారని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు తమకు అండగా నిలిచారని చెప్పారు. సంస్మరణ సభలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల మనసులో ద్రోణంరాజు శ్రీనివాస్ చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. చివరిసారిగా తనకు ద్రోణంరాజు శ్రీనివాస్ ఫోన్ చేసి శ్రీవత్సవను బాగా చూసుకోవాలని చెప్పారని తెలిపారు. ద్రోణంరాజు కుటంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ద్రోణంరాజు కుటంబానికి అండగా ఉంటారని చెప్పారు. శ్రీవత్సవ తన తండ్రి బాటలోనే నడవాలని కోరుకుంటున్నానని అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ. ద్రోణంరాజు శ్రీనివాస్ మరణం చాలా బాధాకరమని, విశాఖ నగరంతో విడదీయరాని బంధం ద్రోణంరాజు కుటుంబానికి ఉందని తెలిపారు. పార్టీ తరుఫున ద్రోణంరాజు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అదే విధంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ద్రోణంరాజు సంస్మరణ సభలో పాల్గొటనని ఎన్నడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనే మనుషులను ఎన్నడూ సీఎం జగన్ వదులుకోరని తెలిపారు. వైఎస్, ద్రోణంరాజు కుటంబానికి ఎంతో సన్నిహిత సంబంధం ఉందని గుర్తుచేశారు. ఎన్నికల్లో ద్రోణంరాజు ఓడిపోయినప్పటికీ సీఎం జగన్ వీఎంఆర్డీఏ చైర్మన్ పదవినిచ్చి గౌరవించారని చెప్పారు. -
'అమర్నాథ్ అన్నయ్య చొరవ మరువలేనిది': శ్రీవాత్సవ
సాక్షి, విశాఖపట్నం: కష్ట కాలంలో నెల రోజుల పాటు తమ కుటుంబానికి ఆత్మీయ బంధువుగా అన్నీ తానై అండగా నిలిచిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు దివంగత మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కుమారుడు శ్రీవాత్సవ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా నాన్నను బాబాయ్ అంటూ తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగే అమర్నాథ్ అన్నయ్య చూపించిన చొరవ మరువలేనిదన్నారు. (విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే') తమ తండ్రిని పినాకిల్ ఆస్పత్రిలో చేర్చినప్పటి నుంచి నెల రోజుల పాటు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ.. బాగోగులు చూసుకున్నారన్నారు. తమ తండ్రి మరణించినప్పటి నుంచి అంతిమ యాత్ర చివర వరకూ తమతోనే ఉండి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారని గుర్తు చేశారు. తమ కుటుంబంలో సభ్యుడిగా, అన్నగా అమర్నాథ్ చూపించిన ప్రేమ, ఆప్యాయతలు మరిచిపోమని, ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. నాన్న లేని తనకు అమర్నాథ్ అన్న అశీస్సులు ఎప్పటికీ ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానన్నారు. (బాగున్నావా కేకే.. సీఎం జగన్ ఆత్మీయ పలకరింపు) -
ద్రోణంరాజు మరణం తీరనిలోటు
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మరణం వైఎస్సార్ సీపీకి, విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తీరని నష్టం మిగిల్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ద్రోణంరాజు అనగానే సత్యనారాయణ గుర్తుకు వస్తారన్నారు. విశాఖపట్నంలో ఆదివారం మరణించిన ద్రోణంరాజు శ్రీనివాస్ సంతాపసభను సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. శ్రీనివాస్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైనా ప్రజల మధ్య ఉంటూ వచ్చారన్నారు. ఆయన మరణానికి పార్టీ తీవ్ర సంతాపం తెలుపుతోందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ స్నేహశీలి, మృదుస్వభావి అయిన శ్రీనివాస్ అందరికీ తలలో నాలుకలా ఉండేవారన్నారు. సజ్జలతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా మధు, మాజీ మంత్రి నర్సీగౌడ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఇ.రాజశేఖర్‌రెడ్డి, ఎన్.పద్మజ, ఎ.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, వీఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అంత్యక్రియలు సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని హిందూ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. పోలీసులు గౌరవ వందనం అనంతరం నాలుగు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ప్రభుత్వ విప్ బి.ముత్యాలనాయుడు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులర్పించారు. -
ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి పార్టీకి తీరని లోటు
సాక్షి, తాడేపల్లి: వైఎస్ఆర్సీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌కి పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సంతాప కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరయ్యి.. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ద్రోణంరాజు శ్రీనివాస్ గారి మరణం పార్టీకి, విశాఖ ప్రాంతానికి తీరని నష్టం మిగిల్చింది. అక్కడ ఆ కుటుంబానికి ప్రజల మద్దతు ఉంది. ఆయన మరణానికి పార్టీ తీవ్ర సంతాపం తెలుపుతుంది. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది’ అన్నారు. (చదవండి: విశాఖ.. మంచి రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది) అనంతరం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘శ్రీనివాస్ స్నేహ శీలి, మృదుస్వభావి. ఆయన అందరికీ తలలో నాలుకలా ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివ కుమార్, స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, మాజీ మంత్రి నర్సీ గౌడ, రాష్ట్ర అధికార ప్రతినిధులు నారుమల్లి పద్మజ, నారాయణమూర్తి, ఈదా రాజశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
ద్రోణంరాజు శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తి
సాక్షి, విశాఖ: ప్రభుత్వ లాంఛనాలతో ఉత్తరాంధ్ర సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ అంత్యక్రియలు ముగిశాయి. కాన్వెంట్ జంక్షన్ సమీపంలోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు డాక్టర్స్ కాలనీలో మొదలైన ద్రోణంరాజు అంతిమయాత్రలో పెద్ద ఎత్తున అభిమానులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్స్ కాలనీ, సిరిపురం జంక్షన్, జగదాంబ జంక్షన్, పూర్ణ మార్కెట్, దుర్గమ్మ గుడి మీదుగా యాత్ర జ్ఞానాపురం స్మశాన వాటిక వరకు కొనసాగింది. (చదవండి: 'విశాఖ చరిత్రలో ఆ కుటుంబానికి ఓ పేజీ') ద్రోణంరాజు శ్రీనివాస్‌కు రాష్ట్ర మంత్రులు, పలు పార్టీల నాయకులు సోమవారం ఘన నివాళులు అర్పించారు. డాక్టర్స్ కాలనీలో ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయాన్నిసందర్శించి పార్టీలకతీతంగా నివాళులు అర్పించారు. విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు శ్రీనివాస్ చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం పార్టీకీ తీరని లోటని వైస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ద్రోణంరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. -
'విశాఖ చరిత్రలో ఆ కుటుంబానికి ఓ పేజీ'
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్‌కు రాష్ట్ర మంత్రులు, పలు పార్టీల నాయకులు సోమవారం ఘన నివాళులు అర్పించారు. డాక్టర్స్ కాలనీలో ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయాన్నిసందర్శించి పార్టీలకతీతంగా నివాళులు అర్పించారు. విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు శ్రీనివాస్ చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం పార్టీకీ తీరని లోటని వైస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ద్రోణంరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వైజాగ్ అభివృద్ధికి పరితపించే వాడు: కోన రఘుపతి, డిప్యూటీ స్పీకర్ ‘నాకు ద్రోణంరాజు శ్రీనివాస్ మంచి స్నేహితుడు. వైజాగ్ అభివృద్ధిలో కీలక భాగస్వామి అయ్యారు. వైజాగ్ అభివృద్ధి కోసమే శ్రీనివాస్ పరితపించే వాడు. ద్రోణంరాజు మరణం విశాఖపట్నానికి తీరని లోటు. ఆయన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించేవారు. భగవంతుడు చాలా త్వరగా ద్రోణంరాజు శ్రీనివాస్‌ను తీసుకెళ్లిపోయారు. ద్రోణంరాజు శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. తన మామ గారు చనిపోవడంతో ద్రోణంరాజు అంత్యక్రియలకు రాలేకపోతున్నానని సీఎం జగన్ తెలిపార’ని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. (విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే') అత్యంత విషాద కరమైన రోజు: అవంతి ‘ఈ రోజు అత్యంత విషాద కరమైన రోజు. ద్రోణంరాజు శ్రీనివాస్ నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం నన్ను ఎంతో బాధించింది. పేదల కోసం ఆయన ఎంతో శ్రమించారు. ద్రోణంరాజు విలువలతో కూడిన రాజకీయాలు చేశార’ని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ అభివృద్ధిలో వారిది కీలక పాత్ర: వాసుపల్లి గణేష్ ‘ద్రోణం రాజు మరణాన్ని విశాఖ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు సత్యనారాయణ ఆయన కుమారుడు శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. విశాఖ చరిత్రలో ఒక పేజీ వాళ్ళ కుటుంబానికి ఉంటుంద’ని ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ అన్నారు. (ద్రోణంరాజు శ్రీనివాస్‌కు నివాళులు) ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఓ ల్యాండ్ మార్క్: పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ‘గిరిజన ప్రాంత ప్రజలతో ద్రోణంరాజు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్‌లు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఓ ల్యాండ్ మార్క్’ అని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మంచితనానికి నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. -
విశాఖ అభివృద్ధి లో ద్రోణం రాజు చెరగని ముద్ర వేశారు
-
ద్రోణంరాజు శ్రీనివాస్‌కు నివాళులు
విశాఖపట్నం : వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్‌కు రాష్ట్ర మంత్రులు, పలు పార్టీల నాయకులు సోమవారం ఘన నివాళులు అర్పించారు. విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు శ్రీనివాస్ చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం పార్టీకీ తీరని లోటని వైస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయానికి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే అదీప్ రాజ్, వైస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీ కృష్ణ, వైస్సార్సీపీ రూరల్ అధ్యక్షుడు శరగడం చిన్న అప్పలనాయుడు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాళులు అర్పించారు. విశాఖ అభివృద్ధిలో అవిశ్రాంతంగా పనిచేసిన ద్రోణంరాజు శ్రీనివాస్ లేరన్న బాధ జీర్ణించుకోలేక పోతున్నానని సీపీఎం నేత నర్సింగ రావు అన్నారు. డాక్టర్స్ కాలనీలో ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయాన్నిసందర్శించి నివాళులు అర్పించారు. తమ అభిమాన నేతను కడసారిగా చూసేందుకు పెద్దఎత్తున నగర ప్రజలు, నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్ నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత ద్రోణంరాజు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. (విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే') ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాస్ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. గత నెలవరకు వీఎంఆర్డీఏ చైర్మన్‌గా పనిచేశారు. నిష్కళంక నాయకుడిగా, అవినీతి మరకలేని నేతగా పేరు సంపాదించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న శ్రీనివాస్‌కు ఆగస్టు 29న కోవిడ్ పాజిటివ్ రావడంతో నాలుగు రోజులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందారు. తరువాత నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్సతో కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. (ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపై ముఖ్యమంత్రి జగన్ విచారం) -
నేడు ద్రోణంరాజు శ్రీనివాస్ అంత్యక్రియలు
-
విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే'
నిస్వార్థ ప్రజా నాయకుడిని కోల్పోయిన విశాఖ శోకసంద్రంలో మునిగిపోయింది. సమున్నత విలువలకు చిరునామాగా బతికిన ద్రోణంరాజు శ్రీనివాస్ ఇక లేరన్న చేదు నిజం నగర ప్రజల గుండెల్ని పిండేస్తోంది. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే నేత అర్ధంతరంగా కన్నుమూయడం అందరి మదిలో విషాదం నింపింది. ఉత్తరాంధ్ర రాజకీయ చాణుక్యుడు ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు వీఎంఆర్డీఏ తొలి చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఇక లేరనే వార్త అందరినీ కలచివేసింది. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పిలిచే ఆ పిలుపు మూగబోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఆరిలోవ ప్రాంతం హెల్త్‌సిటీలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు. జీవితంలో ఎన్నో అడ్డంకులెదురవుతాయి. అవరోధాలు పరీక్ష పెడతాయి. కొందరు సందర్భానుసారం దారి మార్చుకుంటారు. కొద్దిమంది మాత్రం నిర్భయంగా ముందుకు పోతారు.. ఆయన ఆ బాటనే ఎంచుకున్నారు. అందుకే జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. పదవిలో ఉన్నా.. పదవీచ్యుతుడైనా.. ప్రజలతో మమేకమై.. అదే ఆప్యాయత పంచుతూ అందరి మన్ననలు పొందారు. ప్రజల మనిషిగా సేవలందించిన ద్రోణంరాజు శ్రీనివాస్ విశాఖ వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. విద్యార్థి దశ నుంచే ఎన్నో పదవులు అలంకరించి, ప్రజల తరఫున పోరాటాలు చేసి అందరి ప్రశంసలు పొందారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చినా.. తనదైన రాజకీయంతో నగర ప్రజల హృదిలో రాజుగా నిలిచారు. ఆయన మరణం.. ఉత్తరాంధ్రకు తీరని లోటని ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిబద్ధత గల నాయకుడు.. ద్రోణంరాజు శ్రీనివాస్ మరణవార్త విన్నాక బాధని వ్యక్తపరిచేందుకు మాటలు రావడం లేదు. ఆయన తండ్రి వారసత్వంతోపాటు నిబద్ధత గల నాయకుడిగా రాజకీయ విలువల్ని కొనసాగించారు. ద్రోణంరాజు మృతి పార్టీకి, ఉత్తరాంధ్ర ప్రజలకు తీరనిలోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఈ విపత్కర పరీక్ష సమాయాన్ని ఎదుర్కొనేలా ద్రోణంరాజు కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. – విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు కుటుంబ సభ్యులతో తండ్రి, తనయుడు తొలి చైర్మన్లు ద్రోణంరాజు తండ్రీ తనయులు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) ఆవిర్భావం తర్వాత తొలి చైర్మన్‌గా 1979లో ద్రోణంరాజు సత్యనారాయణ నియమితులయ్యారు. ఆ సమయంలో విశాఖ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అనంతరం వుడా పరిధి పెరిగి వీఎంఆర్డీఏగా రూపాంతరం చెందింది. 5 జిల్లాలకు విస్తరించిన వీఎంఆర్డీఏ తొలి చైర్మన్ పదవిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్రోణంరాజు శ్రీనివాస్‌కు అప్పగించారు. ఇలా.. వుడా, వీఎంఆర్డీఏలకు తండ్రీ కొడుకులు తొలి చైర్మన్లుగా నియమితులై రికార్డు సృష్టించారు. (ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపై ముఖ్యమంత్రి జగన్ విచారం) వీఎంఆర్డీఏ తొలి చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్‌కు ప్రతి కుటుంబం సుపరిచయమే. కార్యకర్తలనే కాదు.. వార్డు పర్యటనకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించి అక్కున చేర్చుకునేవారు. అటువంటి వ్యక్తి దూరం కావడంతో విశాఖ నగర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు దశాబ్దాల పాటు ఉత్తరాంధ్ర రాజకీయాన్ని ప్రభావితం చేసిన ద్రోణంరాజు సత్యనారాయణ వారసుడిగా వచ్చిన ద్రోణంరాజు శ్రీనివాస్.. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. గ్రామ కరణంగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి.. ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ తనయుడు ద్రోణంరాజు శ్రీనివాస్. ద్రోణంరాజు శ్రీనివాస్ 1961 ఫిబ్రవరి ఒకటిన జన్మించారు. తండ్రిని రాజకీయ గురువుగా భావిస్తూ.. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. 1980–81లో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో చదువుతున్నప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపించి, ఎన్ఎస్యూఐ నాయకుడయ్యారు. శ్రీనివాస్ న్యాయ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఆయన అనేక రాజకీయ పదవులు నిర్వహించారు. 1994లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని.. పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2001 నుంచి 2006 వరకు విశాఖ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యేగా ఉన్న తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ మరణించడంతో 2006లో విశాఖ ఒకటో నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రభుత్వ విప్‌గా, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా పనిచేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌లో అనేక కీలక పదవులు చేపట్టారు. వైఎస్సార్ కుటుంబంతో అనుబంధం ద్రోణంరాజు కుటుంబానికి.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. 2006లో తండ్రి మరణానంతరం ద్రోణంరాజుకు టికెట్ ఇచ్చి.. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సహించారు. 2009లో జరిగిన ఎన్నికల్లోనూ దక్షిణ నియోజకవర్గం టికెట్‌కు పోటీ ఉన్నప్పటికీ.. ద్రోణంరాజుపై నమ్మకం ఉంచి.. వైఎస్సార్ టికెట్ ఇచ్చి.. గెలిపించారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు.. రాజకీయ పునర్జన్మనిచ్చారు వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. 2019 ఎన్నికల ముందు పార్టీలో చేరిన ద్రోణంరాజుకు దక్షిణ నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ వీఎంఆర్డీఏ చైర్మన్‌గా కీలక పదవిని అప్పగించి ప్రోత్సహించారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉన్న నాయకుడు తండ్రి సత్యనారాయణకు ఉన్నంత రాజకీయ చతురత, దుందుడుకు స్వభావం శ్రీనివాస్‌కు లేకపోయినా.. ప్రజల నాయకుడిగా మన్ననలు పొందారు. గెలిచినా, ఓడిపోయినా.. ప్రజలతో అదే తీరుగా వ్యవహరిస్తూ.. నిస్వార్థంగా సేవలందించారు. ప్రతి నిమిషం అందుబాటులో ఉంటూ ప్రజలకు చేరువయ్యారు. తండ్రి పేరును నిలబెట్టిన వారసుడిగా పేరు సంపాదించుకున్నారు. రెండు మార్లు ఎమ్మెల్యేగా, వివిధ కీలక పదవులు అలంకరించినా.. అవినీతి మరక అంటకుండా.. సేవలందించడం శ్రీనివాస్‌కు పేరు సంపాదించి పెట్టింది. ఆస్పత్రి వద్దకు అభిమానులు ఆరిలోవ: వీఎంఆర్డీఏ తొలి చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ హెల్త్‌సిటీలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ఆగస్టు 29వ తేదీ రాత్రి పినాకిల్‌లో చికిత్స కోసం చేరారు. కొద్ది రోజుల తర్వాత కరోనా తగ్గి .. నెగిటివ్ వచ్చింది. అయితే కిడ్నీల సమస్య ఉండటంతో వైద్యం కొనసాగించారు. రెండు రోజుల కిందట ఆయన ఆరోగ్యం విషమించింది. ఆదివారం మధ్యాహ్నం ఆయన చివరి శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త వినగానే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్తో పాటు ఆరిలోవ, పెందుర్తి, నగరంలో పలు ప్రాంతాల నుంచి అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ నగర కార్యాలయంలో ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్ర పటం వద్ద మౌనం పాటిస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అమర్నాథ్, అదీప్‌రాజ్, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మంత్రి ముత్తంశెట్టి ఆరా ద్రోణంరాజు శ్రీనివాస్ చికిత్స పొందుతున్న పినాకిల్ ఆస్పత్రికి ఆదివారం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వచ్చారు. ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, ఆయన కుమారుడు శ్రీవాత్సవ్‌తో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోగ్యం విషమించిందని, గంటల వ్యవ«ధి కంటే ఎక్కువ సమయం బతికే అవకాశం లేదని వైద్యులు మంత్రికి చెప్పారు. ఆయన కిడ్నీలు పాడవడంతో పాటు బ్రెయిన్ ఫంక్షనింగ్ నిలిచిపోయిందని, వైద్యానికి ఆయన శరీరం సహకరించడంలేదని వారు వివరించారు. దీంతో మంత్రి విచారం వ్యక్తం చేశారు. అనంతరం రెండు గంటల్లోనే ద్రోణంరాజు చనిపోయారు. -
ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపై ముఖ్యమంత్రి జగన్ విచారం
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే, వీఆర్ఎండీఏ మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీనివాస్ మృదుభాషి అని నివాళులర్పించారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ద్రోణంరాజు కుటుంబం కీలకపాత్ర పోషిస్తూ వచ్చిందన్నారు. శ్రీనివాస్ మరణం తనకు ఎంతో హృదయవేదన కలిగించిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఉత్తరాంధ్రలో పార్టీకి నష్టం శ్రీనివాస్ మృతిపట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన మరణంతో ఉత్తరాంధ్రలో తమ పార్టీకి తీరని నష్టం వాటిల్లిందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శ్రీనివాస్ మరణంతో వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్రలో ప్రజాబలం కలిగిన నాయకుడిని కోల్పోయిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్ మృతిపట్ల ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి వెంకట సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. విశాఖలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, అదీప్‌రాజు, పార్టీ నేతలు ద్రోణంరాజు శ్రీనివాస్‌కు ఘనంగా నివాళులర్పించారు. -
ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ (59) ఆదివారం కన్నుమూశారు. ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాస్ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. గత నెలవరకు వీఎంఆర్డీఏ చైర్మన్‌గా పనిచేశారు. నిష్కళంక నాయకుడిగా, అవినీతి మరకలేని నేతగా పేరు సంపాదించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న శ్రీనివాస్‌కు ఆగస్టు 29న కోవిడ్ పాజిటివ్ రావడంతో నాలుగు రోజులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందారు. తరువాత నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్సతో కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించారు. కలెక్టర్‌తో మాట్లాడి బెంగళూరు నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక వైద్య పరికరాల ద్వారా ఎక్మో ట్రీట్మెంట్ అందించారు. అయినా పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. 1961 ఫిబ్రవరి 1న జన్మించిన ఆయనకు భార్య శశి, కుమారుడు శ్రీవాత్సవ్, కుమార్తె శ్వేత ఉన్నారు. తన తండ్రి అంత్యక్రియల్ని సోమవారం నిర్వహించనున్నట్లు శ్రీనివాస్ కుమారుడు శ్రీవాత్సవ్ చెప్పారు. తన తండ్రి అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని పెదవాల్తేరు డాక్టర్స్ కాలనీలోని తమ నివాసంలో ఉంచుతామని, మధ్యాహ్నం కాన్వెంట్ జంక్షన్లో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. వీఎంఆర్డీఏ తొలి చైర్మన్‌గా.. తిరుగులేని నాయకుడిగా పేరొందిన దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడైన శ్రీనివాస్ 1980 నుంచి యువనేతగా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. 1994 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ద్రోణంరాజు సత్యనారాయణ ఆకస్మిక మరణంతో 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత 2009లో కూడా విజయం సాధించారు. ఈ సమయంలో ప్రభుత్వ విప్‌గా, టీటీడీ సభ్యుడిగా పనిచేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటమి చెందిన ఆయన 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీఎంఆర్డీఏ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. వీఎంఆర్డీఏ తొలి చైర్మన్‌గా పనిచేసిన ఆయన పదవీకాలం నెలకిందట పూర్తయింది. తండ్రికి తగ్గ తనయుడిగా, నిస్వార్థ రాజకీయాలకు మారుపేరుగా ప్రజల మన్ననలు పొందారు. జగన్ రాజకీయ పునర్జన్మనిచ్చారు... ఓ దశలో ద్రోణంరాజు కుటుంబ రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తంగేడు రాజుల నుంచి విశాఖ రాజకీయాల్ని తన చతురతతో చేజిక్కించుకున్న ద్రోణంరాజు సత్యనారాయణ తిరుగులేని నేతగా మారారు. దశాబ్ద కాలంగా ద్రోణంరాజు శ్రీనివాస్ రాజకీయ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓటమి పాలైన ఆయన ఆ పార్టీలోనే కొనసాగారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరిన ఆయనకు సీఎం వైఎస్ జగన్ దక్షిణ నియోజకవర్గ టికెట్ కేటాయించి ప్రాధాన్యతనిచ్చారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన శ్రీనివాస్‌కు ధైర్యం చెప్పి.. వీఎంఆర్డీఏ పదవిని కట్టబెట్టారు. ‘‘ద్రోణంరాజు కుటుంబం రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వైఎస్ జగన్ మళ్లీ రాజకీయ పునర్జన్మనిచ్చారు’’ అంటూ ద్రోణంరాజు శ్రీనివాస్ పలుమార్లు భావోగ్వేదంతో వ్యాఖ్యానించేవారు. -
పార్టీ ఆఫీసులో ద్రోణంరాజు సంతాప సభ
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి పట్ల పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అభిమానులు విచారం వ్యక్తం చేశారు. విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయంలో వారంతా సంతాప సభ నిర్వహించారు. ద్రోణంరాజు శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, అమర్నాథ్ నివాళులర్పించారు. ద్రోణంరాజు శ్రీనివాస్ అకాల మృతి పట్ల వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి, ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ద్రోణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ద్రోణంరాజు శ్రీనివాస్ పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన విశాఖ వన్‌టౌన్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రేపు ఉదయం ద్రోణంరాజు అంత్యక్రియలు ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయానికి రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పినాకిల్ ఆసుపత్రి నుంచి పెద వాల్తేరులోని ద్రోణంరాజు స్వగృహానికి భౌతిక కాయాన్ని తరలించారు. ఉదయం 9 గంటల నుంచి ద్రోణంరాజు భౌతిక కాయాన్ని అభిమానులు, కార్యకర్తలు అభిమానులు సందర్శనార్థం ఉంచుతామని ద్రోణంరాజు శ్రీనివాస్ బంధువులు తెలిపారు. అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తామనేది రేపు ఉదయం వెల్లడిస్తామని చెప్పారు. (చదవండి: మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత) I have no words to express my grief and sorrow over the sudden demise of Sri Dronamraju Srinivas garu.its a great loss to the party and people of North Andhra.I convey my condolences to the bereaved family members and pray to God to give them courage to face these testing times. — Vijayasai Reddy V (@VSReddy_MP) October 4, 2020 -
ద్రోణంరాజు మృతిపై సీఎం జగన్ సంతాపం
-
విశాఖ.. మంచి రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది
సాక్షి, విశాఖపట్నం : మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపట్ల విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సంతాపం ప్రకటించారు. ద్రోణంరాజు శివైక్యం చెందారన్న వార్తను తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మంచి రాజనీతిజ్ఞుడిని విశాఖ నరగం కోల్పోయిందని పేర్కొన్నారు. విశాఖ శారదాపీఠంతో ద్రోణంరాజు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. (చదవండి : మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత) సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ద్రోణం రాజు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలతోనే ద్రోణంరాజు జీవించారని కొనియాడారు. ద్రోణంరాజు కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని రాజశ్యామల అమ్మవారిని కోరుకుంటున్నానని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. -
ద్రోణంరాజు మృతిపై సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి : మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ మరణం విశాఖ ప్రజలకు తీరనిలోటు అని పేర్కొన్నారు. ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. (చదవండి : మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత) మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాసరావు మరణం పట్ల మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, శెట్టి పాల్గుణతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఎమ్మెల్యేగా, ఎంఆర్ డిఎ ఛైర్మన్ గాను ఆయన తనకున్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. శ్రీనివాస్ అకాల మరణం విశాఖ ప్రజలకు తీరని లోటని వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. మంచి మిత్రుడిని కోల్పోయానని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ద్రోణంరాజు కుటుంబంతో ఎనలేని అనుబంధం ఉందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గుర్తుచేశారు. -
ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్(59) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన విశాఖ వన్‌టౌన్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అపర రాజకీయ చాణిక్యుడు ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడుగా ద్రోణంరాజు శ్రీనివాస్‌కు ఉత్తరాంధ్రలో చెరగని ముద్ర వేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ కు భార్య శశి, కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీవత్సవ ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి అవంతి శ్రీనివాస్ రావు, ద్రోణంరాజు రవికుమార్ సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్ మృతి బ్రాహ్మణ సమాజానికి తీరని లోటని రవికుమార్ అన్నారు. -
టీడీపీ మహానాడు ఓ పెద్ద మాయ
-
'టీడీపీ మహానాడు ఓ పెద్ద మాయ'
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ మహానాడు ఒక పెద్ద మాయ అని, పార్టీ క్యాడర్ జారిపోతుందనే భయంతోనే చంద్రబాబు మహానాడు నిర్వహించారని విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాల ధోరణిపై, మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మళ్ల విజయప్రసాద్‌తో కలిసి ద్రోణంరాజు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంలో ఏం చేశారని చంద్రబాబు మహానాడు నిర్వహించారని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేకిగా ఉండడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి అభివృద్ధి పని అడ్డుకుంటున్నారని తెలిపారు.(రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీమోహన్) మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ.. ' 40 ఏళ్ల అనుభవం అని చెప్పే చంద్రబాబు నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక మంచి పనైనా చెప్పుకోగలరా ? సీఎంగా వైఎస్ జగన్ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ పదవి బాధ్యతలు చెప్పట్టిన రోజు రాష్ట్రం ఊబిలో కూరుకుపోయి ఉంది. ఆయన దూరదృష్టితో ఆలోచించి కష్టాల్లో ఉన్న సమయంలోనూ ప్రజలను ఆదుకుంటున్నారు . వైఎస్ జగన్ కారణంగానే ఆదివాసుల జీవితాలు మెరుగుపడ్డాయి. అభివృద్ధికి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు అభినందనీయం' అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అందిస్తున్ననవరత్నాలు టిడిపి కార్యకర్తలతో పాటు ఆ పార్టీ సానుభూతి పరులకు కూడా చేరాయి. అభివృద్ధి ఓర్వలేక చంద్రబాబు నాయుడు ప్రతీది రాజకీయం చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు టిడిపి ఎమ్మెల్యేలు 50 లక్షలు నష్టపరిహారం అడిగితే సీఎం జగన్ కోటి రూపాయలు ఇచ్చారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో టీడీపీది శవరాజకీయం' అంటూ మండిపడ్డారు. (సెప్టెంబర్ వరకు జీ7 సమ్మిట్ వాయిదా) మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులను మాత్రమే కాదు ఆత్మాభిమానాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ గుర్తించారని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాల్లో జీవో 97 రద్దు ద్వారా సీఎం గిరిజనుల పక్షపాతిగా నిలిచారు. రాజకీయాలు శాసిస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారన్నారు.మహానాడు తీర్మానాలు చూస్తుంటే టీడీపీ పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇంత పనికిమాలిన తీర్మానాలు మహానాడులో చేయలేదు. ఐదేళ్లలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చినట్టు చెప్పే చంద్రబాబు నాయుడు ఒక్క ఉద్యోగమైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. పోలవరం పట్టిసీమ ప్రాజెక్టుల్లో టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. జెసి దివాకర్‌కు చెందిన బస్సు ప్రమాదం లో 30 మంది చనిపోయినా... జుట్టు పట్టుకొని ఎమ్మార్వో వనజాక్షిని కొట్టినా న్యాయస్థానాలకు గుర్తుకు రాలేదన్నారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. -
సీఎం జగన్ దృష్టిలో అన్ని మతాలు సమానం
-
ఏపీలో అత్యధిక కరోనా టెస్టులు చేసింది అక్కడే..
సాక్షి, విశాఖపట్నం: విపత్కర పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం జిల్లా యంత్రాంగం కష్టపడి పనిచేస్తోందని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అభినందించారు. విశాఖలో సోమవారం నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలో కరోనా టెస్ట్ లు నిర్వహించామని పేర్కొన్నారు. విశాఖలో కరోనా కేసులను దాచాల్సిన అవసరం లేదని.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో కరోనా కేసులు పెరగాలని కొందరు కోరుకున్నారని.. వారి ఐరన్ టంగ్ ఫలితంగా దురదృష్టవశాత్తూ కేసులు పెరిగాయన్నారు. (కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు) లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలో పేదలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాల ఆదుకుంటున్నారని తెలిపారు. కరోనా నియంత్రణలో ప్రధాని మోదీ సైతం తీసుకున్న లాక్డౌన్ లాంటి నిర్ణయాలు మంచి ఫలితాలిచ్చాయని ఆయన పేర్కొన్నారు.టీడీపీ నేతలు విమర్శలు చేయడం మాని ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు. నీచ రాజకీయాలు చేయకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. పార్టీలకతీతంగా ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయంలో ప్రభుత్వంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడాన్ని ద్రోణంరాజు శ్రీనివాస్ తప్పుపట్టారు. (ఏపీ సచివాలయంలో పెరిగిన ఉద్యోగుల హాజరు) -
'దండుపాళ్యం గ్యాంగ్ ఎవరో తేలుతుంది'
సాక్షి, విశాఖపట్నం : విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో శనివారం విశాఖకు రానున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలకనున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి పార్టీని నడిపే అర్హత లేదని, విజయనగరం పర్యటనను హఠాత్తుగా ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకి అమరావతి తప్ప రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలపై ప్రేమ లేదని విమర్శించారు. విశాఖలో వైఎస్సార్ సీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. ఒకవేళ అది నిజమని నిరూపిస్తే ఆ భూములు వారికే ఇచ్చేస్తామన్నారు. ఆలీబాబా అరడజను దొంగలు ఎవరో... దండుపాళ్యం గ్యాంగ్ ఎవరో త్వరలోనే తేలుతుందని హెచ్చరించారు. సుజనా చౌదరి లాంటి చీటర్ చెప్పే మాటలకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంతా సీఎం వైఎస్ జగన్‌కు మేమంతా రుణపడి ఉంటాం. సీఎం వైఎస్ జగన్ రాకతో విశాఖ నగరానికి మహర్దశ పట్టబోతుందని అమర్నాథ్ తెలిపారు. జీఎన్ రావు కమిటీతో పాటు నిపుణుల కమిటీ నివేదిక కూడా వచ్చిన తర్వాత రెండు కమిటీల నివేదికలపై చర్చించి విశాఖకు పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తారని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. విఎంఆర్డీఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి తాటి చెట్ల పాలెం రైల్వే స్టేషన్ రోడ్, ఫ్లైఓవర్, వుడా పార్క్ కైలాసగిరి వరకు ఇరువైపులా విశాఖ పౌరులతో స్వాగత సన్నాహాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కైలాసగిరిపై 37 కోట్ల వ్యయంతో ప్లానిటోరియం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. దీంతో పాటు వుడా సెంట్రల్ పార్క్‌లో రూ. 380 కోట్ల అంచనా వ్యయంతో, విఎంఆర్డీఏలో రూ. 800 కోట్ల వ్యయంతో జివిఎంసి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ జగన్ సెంట్రల్ పార్క్ లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్ ఫ్లవర్ షో ను ప్రారంభించిన అనంతరం అక్కడినుంచే ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. -
విశాఖ ఉత్సవ్ బ్రోచర్లను విడుదల చేసిన మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: దేశానికి ముంబై ఎంత ముఖ్యమో.. ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నం అంత ముఖ్య నగరమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం విశాఖపట్నంలో ఆయన, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు డిసెంబర్ 28, 29 తేదీలలో జరగనున్న‘విశాఖ ఉత్సవ్’ బ్రోచర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖ నగరానికి తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. అంతర్జాతీయంగా విశాఖ బ్రాండ్ ఇమేజ్ పేరిగేలా విశాఖ ఉత్సవాలను నిర్వహించబోతున్నామని తెలిపారు. టూరిజం ప్రమోషన్లలో భాగంగా ఈ ‘విశాఖ ఉత్సవ్’ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి రోజుకు లక్షల మంది పర్యాటకులు రానున్నట్లు అంచనాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే విశాఖ ఉత్సవాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహరెడ్డిలు ముఖ్య అతిథులుగా హజరుకానున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఉత్సవాలలో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాకారుల కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందించే విధంగా ‘విశాఖ ఉత్సవ్’ను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా జనవరిలో కాకినాడ బీచ్ ఫెస్టివల్‌ను, నెల్లూరులో కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ వినయ్‌చంద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, యువి రమణమూర్తి రాజు, పోలీసు కమిషనర్ ఆర్కె మీనా తదితరుల పాల్గొన్నారు. -
అదృశ్య శక్తి ఎవరో పవన్ బయటపెట్టాలి..
సాక్షి, విశాఖ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ సీపీ నేత, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘పవన్ నీ బెదిరింపులు ఎవరికి?. నా వెనుక వున్నారంటున్నావు. నీ వెనుక ఎవరున్నారో చెప్పు. నీ వెనుక దావుద్ ఇబ్రహీం ఉన్నాడా?. ప్రభుత్వాన్ని విమర్శించిన పవన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాజకీయ నాయకుడిగా రాణించాలంటే ఆవేశం తగ్గించుకోవాలి. వాపును చూసి...బలుపు అనుకుంటే దెబ్బతింటారు. మీ వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరో పవన్ బయటపెట్టాలి’ అని డిమాండ్ చేశారు. -
'మహిళా సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత'
సాక్షి, విశాఖపట్నం : విశాఖ తగరపువలస జూట్ మిల్స్ గ్రౌండ్లో మహిళా సంఘాలకు రుణ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ జి. సృజన తదితరులు హాజరయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పది సంవత్సరాల పోరాటం తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన అయిదు నెలల కాలంలోనే మేనిఫెస్టోలోని 80శాతం హామీలను నెరవేర్చామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే అన్ని వర్గాలకు మేలు చేసే 20 బిల్లులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దేశంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50శాతం మేర రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా రైతలకు అండగా నిలబడుతున్నామని తలిపారు. కృష్ణా ,గోదావరి నదీ జలాల వినియోగంపై ఇతర రాష్ట్రాలతో సఖ్యతగా మెలుగుతూనే పరిష్కార మార్గాలకు ప్రత్యేక ప్రణాళిక నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆదాయ వనరులిచ్చే మద్యాన్ని ఏ రాష్ట్రం వదులుకోదు, కానీ మా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం రాష్ట్రాన్ని సంపూర్ణ మద్య నిషేదం రాష్ట్రంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే తొలిదశలో బెల్టు షాపుల నియంత్రణకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ అయిదేళ్ల పాలనలో పేదలకు 25 లక్షల ఇళ్లను ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. విశాఖను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంపీ విజయసాయిరెడ్డి నిరంతరం కష్టపడుతున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజాతీర్పును సహించలేకే టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని విమర్శించారు. లోకేష్ రాజకీయ జీవితం ముగిసిపోయందన్న ఉక్రోశంలో చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అమర్నాథ్ దుయ్యబట్టారు. నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. విశాఖ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు ప్రయత్నం కొనసాగిస్తామని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తెలిపారు. సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం విశాఖపట్నంలోని మధురవాడలో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల ఇంగ్లీషు మీడియం స్కూల్ లో రాష్ట్ర స్దాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సిఎం పాముల పుష్పశ్రీ వాణి సైన్స్ ఎగ్జిబిషన్‌ను లాంచనంగా ప్రారంభించారు . కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి బాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.