
సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ఆర్‌సీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌కి పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సంతాప కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరయ్యి.. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ద్రోణంరాజు శ్రీనివాస్ గారి మరణం పార్టీకి, విశాఖ ప్రాంతానికి తీరని నష్టం మిగిల్చింది. అక్కడ ఆ కుటుంబానికి ప్రజల మద్దతు ఉంది. ఆయన మరణానికి పార్టీ తీవ్ర సంతాపం తెలుపుతుంది. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది’ అన్నారు. (చదవండి: విశాఖ.. మంచి రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది)
అనంతరం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘శ్రీనివాస్ స్నేహ శీలి, మృదుస్వభావి. ఆయన అందరికీ తలలో నాలుకలా ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివ కుమార్, స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, మాజీ మంత్రి నర్సీ గౌడ, రాష్ట్ర అధికార ప్రతినిధులు నారుమల్లి పద్మజ, నారాయణమూర్తి, ఈదా రాజశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment