Malladi vishnu
-
మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన YS జగన్
-
మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్ (ఫోటోలు)
-
మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహం నేడు(ఆదివారం) ఎస్ఎస్ కన్వెన్షన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు.వైఎస్ జగన్‌కు మల్లాది విష్ణు, ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. వివాహ మండపం వద్దకు చేరుకున్న వైఎస్ జగన్.. వధూవరులు లక్ష్మీ చంద్రిక, తనికెళ్ల వేంకట సుబ్రహ్మణ్య సాయి కిరణ్‌లకు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ నేతలు హాజరయ్యారు. -
మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: అధికారం కోసం చంద్రబాబు అడ్డగోలు హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కుదేలైపోయిందని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో వచ్చిన ప్రతీ సమస్యను వైఎస్ జగన్ మేనిఫెస్టోలో చేర్చారని.. సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఆయన కృషి చేశారన్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించారు. ఎన్నికల్లో రకరకాల హామీలిచ్చి దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ ఏమైపోయిందని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం. ఏడు నెలల కాలంలో లక్షా 46 వేల కోట్ల రూపాయల అప్పుచేసి రికార్డు సృష్టించారు. మమ్మల్ని విమర్శించి.. మాపై తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రతీ మంగళవారాన్ని అప్పులవారంగా మార్చేశారు.. దీనికి చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి’’ అని మల్లాది విష్ణు నిలదీశారు.‘‘వైఎస్ జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. టీడీపీ మంత్రులకు ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే మాతో చర్చకు రావాలని సవాల్ చేస్తున్నాం. కరెంట్ ఛార్జీలు పెంచారు.. యూజర్ ఛార్జీలు పెంచారు.. పన్నుల భారం మోపారు. ప్రజల నుంచి డబ్బులు పిండి సంపద సృష్టి అని చెప్పుకుంటున్నారు. ఒక్క మంత్రి కూడా సరిగా పనిచేయడం లేదని నిన్నటి ర్యాంకులను చూస్తేనే అర్ధమవుతోంది’’ అని మల్లాది విష్ణు దుయ్యబట్టారు.‘‘లక్షా 46 వేల కోట్లు అప్పుచేసి ఆర్ధిక విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై అక్రమ కేసులతో వేధిస్తున్నారు’’ అని విష్ణు ధ్వజమెత్తారు. -
పేదల ఇళ్లపై కూటమి సర్కార్ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: పేదల ఇళ్లపై కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. మంగళవారం ఆయన.. నున్న, సూరంపల్లిలో జగనన్న కాలనీలను సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. తాగునీరు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నామని గృహ యజమానులు తెలిపారు.నిరుపేదల సొంతింటి కల సాకారం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీల పేరుతో ఏకంగా మినీ సిటీలనే నిర్మించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31.70 లక్షల ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. సెంట్రల్ నియోజకవర్గంలో 23,490 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించాం. తొలిదశలో 14,986 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. 2,712 ఇళ్లు పూర్తి అయ్యాయి. మరో 2 వేల ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇళ్లన్నింటినీ పాడుబెడుతోంది.’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు.‘‘పైగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇస్తామని కేబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి.. ఇప్పటివరకు ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. అమరావతిలో పేదలెవరు ఉండకూడదనే రీతిలో ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని 8,504 మంది పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించాం.ఇదీ చదవండి: కూటమిలో ‘లోకేష్’ రాగం.. మరోసారి బాబు మైండ్ గేమ్?..కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్దాక్షిణ్యంగా నిర్మాణాలను నిలిపివేసింది. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, మరోవైపు అద్దెల భారంతో లబ్ధిదారులు ఆర్థిక వెతలను ఎదుర్కొంటున్నారు. తక్షణమే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలి. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలి. లేనిపక్షంలో పేదల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుంది’’ అని మల్లాది విష్ణు తెలిపారు. -
టీటీడీలో లోకేష్ ప్రైవేట్ మనుషులు..మల్లాది విష్ణు రియాక్షన్
-
KSR Live Show: జగన్ పై కోపంతో విద్యావ్యవస్థపై చంద్రబాబు కుట్ర
-
టీటీడీ, చంద్రబాబుపై మల్లాది విష్ణు ఫైర్
-
46 మంది చనిపోయారు ఆ పాపం నీదే చంద్రబాబు
-
పింఛన్లపై ‘కూటమి’ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ హయాంలో పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరిగిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఐదేళ్ల పాటు ఏ సమస్యా లేకుండా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించారన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వృద్దులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు వాలంటీర్లు అండగా నిలిచారన్నారు.‘‘చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను బ్రేక్ చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వాలంటీర్లను పక్కకు తప్పించారు. ఇది పెన్షన్‌దారులకు శరాఘాతంగా మారింది. చంద్రబాబు నిర్వాకంతో 44 మంది వృద్దులు పెన్షన్ల కోసం వెళ్లి మృతిచెందారు. ఎన్నికలకు ముందు పింఛన్లను వెయ్యి పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు. ఒక చెత్తో ఇస్తున్నట్టు నటిస్తూ రెండో చేత్తో పెన్షన్లు తొలగిస్తున్నారు. 66 లక్షలకు పైగా పెన్షన్లు జగన్ హయాంలో అందించారు. ఇప్పుడు 3 లక్షలమంది పెన్షన్లను చంద్రబాబు తొలగించారు’’ అని విష్ణు మండిపడ్డారు.‘‘అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వృద్ధులు, వికలాంగుల ఆత్మగౌరవం దెబ్బ తీశారు. ఇంకా 2 లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇవ్వకపోగా అదనంగా మరో మూడు లక్షల పెన్షన్లు తొలగించటం అన్యాయం. పెన్షన్‌దారుల మీద కూడా ఇలా కుట్రలు చేయటం అవసరమా?. పార్టీలు మారితేనే పెన్షన్ ఇస్తామని టీడీపీ వారు అంటున్నారు. ఇలాంటి ధోరణి మంచిది కాదు’’ అని మల్లాది విష్ణు హితవు పలికారు‘‘వైఎస్ జగన్ హయాంలో అర్హులందరికీ పెన్షన్ అందించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో పార్టీ మారితేనే పెన్షన్లు ఇస్తామనటం సరికాదు. అలా కాదంటే పక్క జిల్లాలకు పెన్షన్‌ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయటం సబబు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలమంది పెన్షన్లు తొలగించటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
మంచు ఫ్యామిలీ వివాదంపై మల్లాది విష్ణు రియాక్షన్
-
నల్ల చట్టాలు తేవడంలో కూటమి సర్కార్ ముందుంది: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: ఏపీలో సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవడం దారుణమన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలోని సింగ్ నగర్లో పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘రాజ్యాంగం ప్రతీ పౌరుడికి భద్రత, హక్కులు, స్వేచ్ఛ కల్పించింది. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బయటకు వచ్చినప్పుడు భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటోంది.కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తోంది. సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవటం దారుణం. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందుంది. ఆంధ్ర రాష్ట్రంలో వినూత్నమైన పరిపాలన జరుగుతోంది. ప్రజల హక్కులు హరించబడుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది. రాజ్యాంగం అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు ఎందుకు నివాళులర్పించలేదు?. ప్రభుత్వం, అధికారులు వివక్షత చూపిస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: AP: సోషల్ మీడియా కార్యకర్తలపై పెరిగిన వేధింపులు -
KSR Live Show: చంద్రబాబు సర్కార్ మోసపూరిత హామీలు, దుర్మార్గాలు
-
చంద్రబాబుకు మాటలెక్కువ.. పని తక్కువ: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబుకు మాటలెక్కువ.. పని తక్కువ అంటూ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇదే సమయంలో తిరుపతి దేవస్థానం బోర్డు లిస్టులో బ్రాహ్మణులు ఎందుకు లేరు అని ప్రశ్నించారు. చంద్రబాబుకి బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే చిన్నచూపు అంఊ ఘాటు వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం, చంద్రబాబుకు మాటలెక్కువ పని తక్కువ. దేవస్ధానం బోర్డుల్లో బ్రాహ్మణులకు స్ధానం కలిపిస్తామని చెప్పారు. తిరుపతి దేవస్ధానంలో బోర్డు లిస్టులో బ్రాహ్మణులు ఎందుకు లేరు?. కేబినెట్ మీటింగ్‌లో, జీవోలో గొప్పలు చెప్పుకున్నారు. 2024, 2019, 2014లో ఒక్క నియోజకవర్గంలో ఒక్కరికి కూడా పోటీ చేయడానికి టికెట్ ఇవ్వలేదు.600 మంది వేద పడింతులకు మూడు వేల చొప్పున స్కాలర్షిప్ ఇస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ఈ మేరకు తీర్మాణం చేసింది వైఎస్సార్సీపీనే. తీర్మానం చేయడమే కాదు.. నిధులు కూడా విడుదల చేశాం. ఇప్పుడు బ్రాహ్మణులకు చోటు లేదు కాబట్టే దాన్ని పక్కదారి పట్టించడానికి స్కాలర్షిప్ ఇస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుకి బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే చిన్నచూపు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభలో ఎక్కడా బ్రాహ్మణులకు స్ధానం కల్పించలేదు. కేబినెట్లో వాళ్లు చేసిన నిర్ణయాన్ని నేడు ఉల్లఘించారు. ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. బ్రాహ్మణులకు టీటీడీలో ప్రాతినిధ్యం లేదు.హిందూ సమాజానికి, ఆధ్యాత్మిక చింతనలో బ్రాహ్మణ వర్గాన్ని గౌరవించడంలో పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం విఫలం చెందింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
దేవాలయాల జోలికొస్తే ఊరుకోం.. చంద్రబాబుపై మల్లాది ఫైర్
సాక్షి,విజయవాడ : హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, దేవాలయాల జోలికి వస్తే ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ మధురా నగర్లో మున్సిపల్ అధికారులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కాలువ గట్టు వివి.నరసరాజు రోడ్డులో స్థానికులు చేపట్టిన దుర్గాదేవి ఆలయం నిర్మాణాలు తొలగించారు.తాజాగా,అదే ప్రాంతంలో శ్రీకృష్ణుడి మందిరం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను కూల్చివేశారు. సుమారు 15 గోవులకు నీడ లేకుండా చేశారు.గోశాల కూల్చివేతలపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం, కూటమి ప్రభుత్వం , మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు.‘గోశాలను కూల్చేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకం.సుమారు 15 గోవులకు నీడ లేకుండా చేశారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తామని చెప్పే పెద్దమనుషులు సమాధానం చెప్పాలి.ఈ కూల్చివేతల బాధ్యత చంద్రబాబు,పవన్,దేవాదాయశాఖ మంత్రిదే,రాష్ట్రప్రభుత్వ శాఖలే దుర్మార్గంగా వ్యవహరించడం హిందూ ధర్మం,సనాతన ధర్మం పైన దాడిగానే పరిగణించాలి. గోవుల రక్షణ వైఎస్సార్సీపీ ధ్యేయం.కెనాల్ బండ్ ప్రొటెక్ట్ చేయాలని మేం ఆనాడే నిధులిచ్చాం.ఫెన్సింగ్ పనులు ప్రారంభించాం. బుల్డోజర్లతో ఇలా కూల్చివేతలకు పాల్పడటం ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే. మరోసారి గుడుల జోలికి వస్తే ఊరుకోం.పుష్కరాల సమయంలో అనేక దేవాలయాలను చంద్రబాబు కూల్చివేయించారు. ఆంజనేయ విగ్రహం మున్సిపల్ ట్రాక్టర్లో తీసుకెళ్లారు. హిందూవుల మనోభావాలకు వ్యతిరేకంగా ఆనాడూ..ఈనాడూ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలి’ అని సూచించారు. -
ఎల్లో గ్యాంగ్ తో కలిసి షర్మిల కుట్రలు..
-
విజయవాడ లడ్డు ఇష్యూ.. మల్లాది విష్ణు స్ట్రాంగ్ రియాక్షన్
-
KSR Live Show: సనాతనధర్మం ముసుగులో పవన్ కొత్త అవతారం
-
విజయవాడ వరదలు వచ్చి నెల రోజులు.. బాధితులకు చంద్రబాబు చేసింది..
-
రాజీనామా..!? వాళ్ల గోతిలో వాళ్లే పడ్డారు
-
ఇది చంద్రబాబు బీ టీం.. సిట్ పై మల్లాది విష్ణు విమర్శలు
-
ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది : మల్లాది
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద బురద జల్లాలని చూస్తే.. ఆ బురద మీ మీదే పడుతుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో కూటమి నేతల అరాచకాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం గాలి కొదిలేసింది. రాజకీయ దుర్భుద్ధితో ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది. టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటుంది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రజలను గందరగోళంలోకి నెట్టేసింది. నెయ్యి ట్యాంకర్లు ఎప్పుడొచ్చాయి. ఎప్పుడు తిప్పి పంపించారో డేటాతో సహా చెప్పాం. ఈవో ఒకలా, చంద్రబాబు మరోలా మాట్లాడుతున్నారు.ఏపీలో రౌడీరాజ్యం నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు రౌడీల్లా మారారు. పోలీసులు ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే వారిపైనే కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆ ప్రాంతాన్ని దోచుకుతింటున్నారు. సొంత పార్టీ వాళ్లే టీడీపీ ఆఫీస్‌కు వెళ్లి కొలికపూడిపై ఫిర్యాదు చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రభుత్వ వైద్యుడిపై దాడి చేసి బూతులు తిట్టారు. డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు..ప్రజలకు సమాధానం ఏం చెబుతారు. ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అంబేద్కర్ బ్యానర్‌ను చించేసి అవమానించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన దగ్గర ఓ రెడ్ బుక్ ఉందని బెదిరిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలను గెలిపించింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. వరద బాధితులకు సాయం చేయాల్సింది పోయి వారినే బెదిరిస్తున్నారు. వరద బాధితులపై లాఠీఛార్జి చేయడమేంటి. సాయం అడిగినందుకు చెట్టుకు కట్టేసి కొట్టడమేంటి. విజయవాడ మునిగిపోతే నిర్లక్ష్యంగా ఎన్యుమరేషన్ చేశారు. ఎన్యుమరేషన్ సరిగా చేయాలని మేం స్వయంగా కలెక్టర్‌ను కలిసి కోరాం. కానీ మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు.లడ్డూ వివాదంపై సిట్ వల్ల ఏం ఉపయోగం. సిట్ చంద్రబాబుకు బీ టీమ్ వంటిది. మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలని ప్రయత్నించి...ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలబడింది.రాజకీయాల కోసమే లడ్డూ అంశాన్ని చంద్రబాబు వాడుకున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే లడ్డూ వివాదం పై సీబీఐ విచారణ జరిపించాలి. సుప్రీంకోర్టు పై మాకు అచెంచలమైన విశ్వాసం ఉంది. మా హయాంలో ఏ తప్పూ జరగలేదని..మేం గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నాం. వైఎస్ జగన్ మీద బురద జల్లాలని చూస్తే..ఆ బురద మీపైనే పడింది. వైఎస్ జగన్ జగన్ ఐదేళ్లలో హిందూత్వాన్ని కాపాడారని గుర్తు చేశారు. కూటమి వందరోజుల పాలనలో అరాచకం..రౌడీయిజం.. ఘోరాలకు అడ్డేలేకుండా పోయింది. రౌడీ ఎమ్మెల్యేల అరాచకాలపై చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. 👉 చదవండి : చంద్రబాబు ఓ పొలిటికల్ జాదు -
అనంతపురంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై మల్లాది విష్ణు రియాక్షన్
-
అధికారం కోసం అబద్ధాలు..
-
7 వేల కోట్లు నష్టం..700 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు
-
నిండా ముంచేసి.. అరకొర సాయమంటే ఎలా బాబూ?: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వరదలు వస్తాయని తెలిసినా ప్రజలను చంద్రబాబు సర్కార్ అప్రమత్తం చేయలేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రభుత్వంలోని పెద్దల తప్పిదాన్ని అధికారులపై వేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘మేము వరద ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాం.. రూ.7 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని భావిస్తున్నాం.. ప్రభుత్వం రూ.700 కోట్లు మాత్రమే ఇస్తామంటోంది.’’ అని దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు నిర్లక్ష్యమే ప్రజలను ముంచేసింది. కాలనీలకు కాలనీలే నీటిలో మునిగిపోయాయి. ఇల్లు మునిగితే రూ.25 వేలు ఇస్తే ఏ మూలకి సరిపోతుంది?. ఫర్నీచర్ విలువ, వాహనాల విలువ చంద్రబాబుకు తెలుసా?. బాధితుల కష్టాలు చూసి జగన్ చలించిపోయారు. అందుకే మా వంతుగా బాధితులకు సాయం అందించాం. ప్రభుత్వం రైతులకు పదివేలు ఇస్తే ఏం సరిపోతుంది?. చంద్రబాబు ప్రకటించిన ప్యాకేజీని పెంచాలి. ఆస్తి పన్నును రద్దు చేయాలని కోరతున్నాం. ఒక నెల కరెంటు బిల్లును పూర్తిగా రద్దు చేయాలి.ఇదీ చదవండి: పవన్.. గొంతు ఎందుకు పెగలడం లేదు?..నష్టపోయిన ఆటోల స్థానంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి కొత్తవి ఇప్పించాలి. రెండు లక్షల వడ్డీలేని రుణాలను చిన్న పరిశ్రమల వారికి ఇప్పించాలి. చంద్రబాబు వైఖరి వలన 60 మంది పైనే చనిపోయారు. 7 వేల కోట్ల నష్టం జరిగితే 7 వందల కోట్లతో సరిపెట్టేలా చూడటం భావ్యం కాదు. వరదల వైఫల్యానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.నిండా ముంచి ఇప్పుడు పాతిక వేలు ఇస్తామంటే ఎలా?: దేవినేని అవినాష్విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ, వరద బాధితులకు సహాయం చేయటంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. మా పార్టీ తరపున ప్రతి ఇంటికీ సాయం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చేయలేక పోతోంది?. నిండా ముంచి ఇప్పుడు పాతిక వేలు ఇస్తామంటే ఎలా కుదురుతుంది?. పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతి ఇంటికీ కనీసం యాభై వేలు చొప్పున ఇవ్వాలి’’ అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకోవటానికి బోట్ల విషయం తెరపైకి తెచ్చారు
-
విజయవాడను ముంచిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే: మల్లాది విష్ణు
-
‘జనం లేని సమయంలో నష్టం అంచనా.. గృహోపకరణాల సంగతేంటీ?’
సాక్షి, తాడేపల్లి: వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. తుపానుకు ముందు తీసుకోవాల్సిన చర్యల విషయంలో సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని చెప్పారు. ఇదే సమయంలో ఇప్పటికైనా సహాయక చర్యల్లో వేగం పెంచి బాధితులను ఆదుకోవాలని సూచించారు.కాగా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడలోకి వరద వచ్చి ఎనిమిది రోజులు అయినా ప్రభుత్వంలో చలనం లేదు. కాలమే సమస్యకు పరిష్కారం చూపుతుందన్నట్టుగా ఉన్నారు. వర్షాలు, వరదల గురించి ముందే సమాచారం ఉన్నా పట్టించుకోలేదు. 28న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో వరదల గురించి కనీసంగా కూడా చర్చించలేదు. తుపానుకు ముందు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఘోర వైఫల్యం చెందారు.వరద వచ్చి లక్షన్నర మంది గ్రౌండ్ ఫ్లోర్‌లోని వారు మునిగిపోతే పట్టించుకోలేదు. ఎంతసేపూ వైఎస్ జగన్‌ను విమర్శించటమే తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రజలకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోరంటూ సాక్షాత్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీనే అన్నారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా?. రెండు లక్షల మందిని తరలించలేకపోతే కనీసం అలర్ట్ చేస్తే వారే వెళ్లిపోయేవారు కదా?. అదికూడా చేయకుండా జనం చనిపోవడానికి కారణం అయ్యారు. పది రోజులుగా మురుగు నీరు నిల్వ ఉంటే పట్టించుకోవటం లేదు. పారిశుధ్యం దారుణంగా మారింది. సహాయక చర్యల్లో వేగం పెంచాలి.ఇళ్ల దగ్గర జనం లేని సమయంలో నష్టం అంచనా వేయటం ఏంటి?. వ్యాపార సంస్థల నష్టాన్ని కూడా అంచనాలు వేయాలి. ఇళ్లలో నష్టపోయిన గృహోపకరణాలకు కూడా నష్ట పరిహారం అందించాలి. బుడమేరు వరద తప్పిదం వెనుక బాధ్యులెవరో చెప్పాలి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంత నష్టానికి కారకులెవరో తేల్చాలి. ప్రజలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. పేదలను కోటీశ్వరులను చేస్తామని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు పేదలు రోడ్డున పడ్డారు, కోటీశ్వరులు పేదలయ్యారు. 35వేల క్యూసెక్కుల నీటిని ఎవరికీ చెప్పకుండా ఎలా కిందకు వదిలారు?.అధికారులంతా బందర్ రోడ్డులో, బీఆర్టీఎస్ రోడ్డులోనే కనపడుతున్నారు తప్ప వరద ప్రాంతాల్లో కనపడటం లేదు. బోట్లను వదిలి బ్యారేజిని కూల్చాలని ఆరోపణలు చేసే బదులు వాటిపై విచారణ చేయాలి. పర్మిషన్ లేని బోట్లు ఎవరి చేతుల్లో ఉన్నాయో కూడా విచారణ జరపాలి. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ప్రకటించాలి. వరద ముంపునకు కారకులెవరో కూడా వెంటనే తేల్చాలి. చిన్న ఉద్యోగి నుండి పెద్ద అధికారి వరకు ఉదాసీనంగా వ్యవహరించారు. అందుకే వరదలతో లక్షల మంది ఇక్కట్ల పాలయ్యారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రాష్ట్రం మునిగిపోతుంటే.. చంద్రబాబు నిద్రపోతున్నాడు
-
స్నేహితుడి కోసం వెళ్లాడు.. అవును అతను పుడింగే..
-
చంద్రబాబు అన్న క్యాంటీన్ పై మల్లాది విష్ణు షాకింగ్ కామెంట్స్
-
పేరు తీసేసినంత మాత్రాన, ప్రజల హృదయాల్లో చరిత్రను చెరపలేరు
-
YSRCP రాజ్యసభ ఎంపీలకు చంద్రబాబు ఆఫర్ నిజమే.. కానీ.. !
-
ఎల్లోబాన్లపై వైఎస్సార్సీపీ ఆగ్రహం
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకాలపై వైయస్సార్సీపీ నేతలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వినుకొండలో పార్టీ కార్యకర్త దారుణహత్య. పుంగనూరులో ఎంపీ పి.మిధున్‌రెడ్డిపై రాళ్లతో దాడి. వాహనాల «ధ్వంసం ఘటనలను వారు ముక్త కంఠంతో ఖండించారు.అ«ధికారం చేపట్టిన టీడీపీ తొలి రోజు నుంచి పాలన గాలికి వదిలేసి, కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, ఎక్కడికక్కడ దాడుల చేస్తోందని వారు ఆక్షేపించారు. ఇకనైనా టీడీపీ తన వైఖరి మార్చుకోకపోతే, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని వైయస్సార్సీపీ నేతలు, నాయకులు హెచ్చరించారు.వైయస్సార్సీపీ నేతలు.. ఎవరు, ఏమన్నారంటే..: ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించారు. రాళ్ళతో, మారణాయుధాలతో దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ డైరెక్షన్లోనే పుంగనూరు ఘటన చోటు చేసుకుంది. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకోవాలన్న కుట్రలో భాగమే ఈరోజు అక్కడ రాళ్ల దాడి, వాహనాల ధ్వంసం జరిగింది. రూ.5 వేల కోట్లతో ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీ పుంగనూరులో ఏర్పాటవుతుంటే, దాన్ని ఎలాగైనా ఆపాలన్న కుట్ర చేస్తున్నారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవు. ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నా సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా ఉండాలని చూస్తున్నారు. అందుకే మా వాహనాలు ధ్వంసం చేశారు. నాపై రాళ్ల దాడి చేశారు.:::పి.మిధున్‌రెడ్డి. రాజంపేట ఎంపీపుంగనూరు నా ఇంటికి వచ్చిన ఎంపీ పి.మిధున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. మారణాయుధాలు, రాళ్లతో ఎంపీ మిథున్‌రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. నా వాహనాలతో పాటు, మిథున్‌రెడ్డి వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. వారు టీడీపీ తొత్తులుగా వ్యవహరించారు.:::రెడ్డప్ప. చిత్తూరు మాజీ ఎంపీఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దాడులు హత్యలు దారుణంగా పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు. దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. దాడులు చేస్తున్న వారికి ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు.:::గొల్ల బాబురావు. ఎంపీ (రాజ్యసభ సభ్యుడు)చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఎంపీ మిధున్‌రెడ్డిపై దాడి అమానుషం. ఎంపై రాళ్ల దాడి చేసి, వారి వాహనాలు« «ధ్వంసం చేయడం అత్యంత హేయం. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో రాక్షస, ఆరాచక పాలన సాగుతోంది. ఈ దాడులపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రజలు అధికారాన్ని ఇస్తే, సభ్య సమాజం తలదించుకునేలాగా టీడీపీ నాయకులు ప్రవర్తించడం సిగ్గుచేటు.:::ఇస్సాక్ బాషా. వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ.రేపు (19వ తేదీ, శుక్రవారం) ఉదయం మా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి వినుకొండలో పర్యటిస్తారు. టీడీపీ కార్యకర్త చేతిలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పడానికే, ఆయన రేపు వినుకొండలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది, వందలాది ప్రజలు, పోలీసులు చూస్తుండగానే, వినుకొండ నడిరోడ్డులో మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం అంటే.. అంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది.. ఇలా పార్టీ కార్యకర్తలను నరికి చంపడానికా?. వినుకొండలో తెలుగుదేశం పార్టీ కొత్త సాంప్రదాయానికి బీజం వేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తున్నాడన్న కారణంతోనే రషీద్‌ను దారుణంగా నరికి చంపారు.:::బొల్లా బ్రహ్మనాయుడు. మాజీ ఎమ్మెల్యే (వినుకొండ)వినుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ ఘటన.. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. అంత కిరాతకమైన దృశ్యాలు ఆ వీడియోలో కన్పిస్తున్నాయి. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.ఆంధ్రప్రదేశ్‌ను అత్యాచారప్రదేశ్‌గా మార్చొద్దు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ కనిపించడం లేదు. కేవలం నారా లోకేష్ ఆర్డర్ కనిపిస్తోంది. వినుకొండ లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటిపై ప్రధాని మోదీ గారు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాగారు దృష్టి పెట్టాలి. అలాగే రాష్ట్రంలో ఈ ఒకటిన్నర నెలల్లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి.:::సి.అనిల్‌కుమార్ యాదవ్. మాజీ మంత్రి.వినుకొండలో జరిగిన హత్య ఒక రాజకీయ హత్య. అలాగే ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి అత్యంత హేయం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వినుకొండలో మా పార్టీ కార్యకర్తను అత్యంత పాశవికంగా హత్య చేసి, దాన్ని వ్యక్తిగత హత్యగా చిత్రీకరించడం దారుణం. టీడీపీ దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరు వెళ్లిన ఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్లతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యుడికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుంది?. ఏకంగా ఒక ఎంపీపైనే రాళ్లతో దాడి చేస్తున్నా, రక్షణ కల్పించకుండా పోలీసులు చోద్యం చూశారంటే, ఇక్కడ ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలి. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుంది.:::ధర్మాన కృష్ణదాస్. మాజీ మంత్రి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన తాలిబన్ల పాలనను తలపిస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్‌పై దృష్టి పెట్టకుండా సూపర్ మ్యాజిక్ చేసి మోసం చేస్తున్నారు. కూటమి నాయకులు దళితులనే టార్గెట్ చేసి దాడులు చేయడం హేయమైన చర్య. ఈ కూటమి తాలిబన్లను తరమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మీ దాడులపై మా పార్టీ ప్రతి దాడులకు దిగితే తట్టుకోలేరు.:::కోరుముట్ల శ్రీనివాసులు. మాజీ ఎమ్మెల్యే (రైల్వే కోడూరు)రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. చంద్రబాబు మార్క్ రాజకీయాలు నడుస్తున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. హత్యలు, దొమ్మీలు ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. ఈ తరహా పద్ధతి మారకపోతే తిరగబడాల్సి వస్తుంది. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి దారుణం. వెంటనే రాజ్యాంగ వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి. ఇకనైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలి.:::జక్కంపూడి రాజా. మాజీ ఎమ్యెల్యే. (తూ.గో.జిల్లా)కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచకం నడుస్తోంది. టీడీపీ నాయకులు దాడులు, మర్డర్లు ,మానభంగాలతో చెలరేగిపోతున్నారు. ఇందుకేనా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది?. మీ పాలనలో గ్రామాలలో ఎన్నో కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. వినుకొండలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం దారుణం.:::కాసు మహేష్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే (గురజాల).తెలుగుదేశం నాయకులు అసలు ఎందుకు దాడులు చేస్తున్నారు?. నడిరోడ్డుపైన పోలీసులు ఉండగానే రషీద్‌ను అత్యంత దారుణంగా చంపడం దుర్మార్గపు చర్య. గతంలో జిల్లా ఎస్పీగా మల్లికాగార్గ్, నెల రోజులపాటు పని చేసినప్పుడు, ఈ తరహా దాడులు కాస్త తగ్గాయి. జిల్లాకు చెందిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, సీఎం చంద్రబాబును కలిసి, ఎస్పీని మార్చమని కోరారు. ఆయన వెంటనే ఆ పని చేశారు. ఇప్పుడు వినుకొండలో మా పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగిన వెంటనే, ఎలాంగి దర్యాప్తు చేయకుండానే, అర్ధరాత్రి మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ, అది వ్యక్తిగత, పాత కక్షల వల్లనే జరిగిందని చెప్పడం దారుణం. మరోవైపు రషీద్‌ను నరికి చంపిన జిలానీ, వాస్తవానికి టీడీపీకి చెందినవాడైనా, అతడు తమ పార్టీ కార్యకర్త అంటూ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో జిలానీ, టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు కోసం పని చేశారు.:::మర్రి రాజశేఖర్. ఎమ్మెల్సీ.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేయటమే తెలుగుదేశం కార్యకర్తలు పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వారు గాలికి వదిలేశారు. హత్య జరిగిన తరవాత అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్ని ఎస్పీ, పాతకక్షల వల్లే రషీద్ హత్య జరిగిందని చెప్పడం దారుణం.:::గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే (నర్సారావుపేట) పక్కా ప్లాన్‌తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. 31 హత్యలు, 35 మంది ఆత్మహత్యలు జరిగాయి. ఏకంగా 2,750 కుటుంబాలు ప్రాణభయంతో వలస పోయాయి. ప్రతిపక్షాన్ని టెర్రరైజ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ని తలపిస్తున్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హైకోర్టు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి. వినుకొండ హత్యకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అటు పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి చేశారు. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది?. వారం లోగా పరిస్థితిని చక్కదిద్దాలి. లేకపోతే రాజీనామా చేయాలి. మా ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుంది.:::కనుమూరు రవిచంద్రారెడ్డి, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల కూడా గడవక ముందే మా పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలపై టీడీపీ దాడులు తీవ్రమయ్యాయి. ఎంపీ మిధున్‌రెడ్డిపై పుంగనూరులో రాళ్లదాడిని ఖండిస్తున్నాం. సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా పేరున్న మిథున్‌రెడ్డిపై టీడీపీ దాడి ఎంత వరకు సబబు?. తమ నియోజకవర్గంవలో పర్యటించే హక్కు, ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. ఆ హక్కును కాలరాయాలని టీడీపీ చూడడం దారుణం.:::అకేపాటి అమర్నాథ్రెడ్డి. రాజంపేట ఎమ్మెల్యే.రాష్టంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. గుంటూరు జిల్లాలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వారి దాడులు తీవ్రమవుతున్నాయి. వినుకొండలో నడి రోడ్డుపై రషీద్‌ను దారుణంగా నరికి చంపారు. వ్యక్తిగత వివాదాలు, పాతకక్షల వల్లే ఆయన హత్య జరిగిందని, అర్థరాత్రి హడావిడిగా ఎస్పీ చెప్పడం దారుణం. అలాంటి ఎస్పీకి రాష్ట్రంలో పని చేసే అర్హత లేదు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు పెరిగాయి. దాదాపు 3 వేల కుటుంబాలు ఇళ్లు, ఊళ్లు వదిలి వెళ్లాయి. మరోవైపు మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు అధికమయ్యాయి. మా పార్టీ వారిపై నానాటికీ దాడులు పెరుగుతున్నా, పోలీసులు అస్సలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు 40 రోజుల పాలనలో అనేక దారుణాలు జరిగాయి. ఆడపిల్లల జోలికి వస్తే.. భయపడేలా చేస్తామన్న పవన్‌కళ్యాణ్.. ఇప్పుడు నోరు మెదపడం లేదు.:::కాకాణి గోవర్థన్‌రెడ్డి. మాజీ మంత్రి.పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాల «ధ్వంసం హేయమైన చర్య. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డి. పుంగనూరులో మాజీ ఎంపీ ఇంటికి వెళ్లిన ఆయనపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేయడం, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం పిరికిపంద చర్య. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వరుసగా జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం, కూల్చివేతల సంఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. గతంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. నెల రోజులుగా వరుసగా పసిపిల్లలపై అత్యాచారాలు జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. నంద్యాల జిల్లా నందికొట్కూరు ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురై, హత్యకు గురైనా, ఇప్పటికీ ఆ బాలిక మృతదేహం కనుక్కోక పోవడం దారుణం.:::జి.శ్రీకాంత్‌రెడ్డి. వైయస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడురాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిపై దాడి అత్యంత హేయం. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుంది. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంçస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి. అధికారం శాశ్వతం కాదు.:::గురుమూర్తి. ఎంపీ (తిరుపతి) -
లా అండ్ ఆర్డర్ విఫలం..
-
ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్
-
సీఎం జగన్ 5 ఏళ్ల సంక్షేమ పాలనపై మల్లాది విష్ణు రియాక్షన్
-
ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదు
సాక్షి, అమరావతి/అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో ఎక్కడా ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కానీ టీడీపీ, బీజేపీ నాయకులు పనిగట్టుకుని ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయని విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధైర్యం ఉంటే ఆరోగ్యశ్రీ సేవలపై పచ్చ నేతలు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు మల్లాది విష్ణు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అయినా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయంటూ కొన్ని పత్రికలు అబద్ధాలు వండివారుస్తూ పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పేదల సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా కలి్పస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిరీ్వర్యం చేసిన టీడీపీకి ఈ పథకం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. టీడీపీ హయాంలో కేవలం తెల్ల రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించేది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తెల్ల రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలతోపాటు రూ.5లక్షలలోపు ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 1.42కోట్లకు పైగా కుటుంబాలకు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది.దీనిని తెలుగుదేశం నేతలు కాదనగలరా?.. టీడీపీ హయాంలో కేవలం 1,059 మాత్రమే ఉన్న ప్రొసీజర్లను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 3,257కి పెంచింది. ఉచిత వైద్య పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పాలనలో కేవలం 919 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీ సేవలను మా ప్రభుత్వం 2,371 ఆస్పత్రులకు విస్తరించింది. ఇతర రాష్ట్రాల్లోని నెట్వర్క్ ఆస్పత్రులను 72 నుంచి 204కి పెంచింది. టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నిధులన్నీ చంద్రబాబు దురి్వనియోగం చేయగా, నేడు గ్రీన్ చానల్ ద్వారా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91లక్షల మందికి రూ.13,471కోట్ల విలువైన వైద్యసేవలు అందించాం2023–24 ఆరి్థక సంవత్సరానికి సంబంధించి నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3,566కోట్లు చెల్లించింది. 2024–25 ఆరి్థక సంవత్సరంలో తొలి రెండు నెలల్లో రూ.366కోట్లు చెల్లించగా, తాజాగా మరో రూ.200కోట్ల బకాయిలు విడుదల చేసింది. అదేవిధంగా ప్రజలకు ఇంటి వద్దే వైద్యసేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అమలుచేసింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రూ.16,852కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసింది.గత ఐదేళ్లలో వైద్యశాఖలో సుమారు 54వేల పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రులలో పేదలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయి. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆరోగ్య సూచీల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. ప్రజలకు డిజిటల్ వైద్యసేవలు, పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలోనూ ఏపీ తొలి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య అవసరాలు తీర్చడమే లక్ష్యంగా సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అహరి్నశలు పనిచేస్తోంది.’ అని విష్ణు పేర్కొన్నారు. -
టీడీపీ అంటేనే కుట్ర కుతంత్రం.. చంద్రబాబుపై రెచ్చిపోయిన మల్లాది విష్ణు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు
-
ఓటర్లపై కూటమి ప్రలోభాల వల
సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈ మేరకు ఆదివారం వెలగపూడి సచివాలయంలో ఈసీని కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాకు వెల్లడించిన వివరాలు.. ► రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఘటనలను ఎప్పటికప్పుడు ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నాం. కడప బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని, ఓట్లు మాత్రం కాంగ్రెస్‌కు వేయమని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడారు. దీనిపై ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశాం. ► విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ నేత కేశినేని చిన్ని, ఓటర్లను ప్రలోభ పరుస్తూ డబ్బులు పంచడాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. ఆనాడు కేంద్ర కేబినెట్లో ఉండి కూడా, రాష్ట్ర ప్రయోజనాలను సుజనా పూర్తిగా పక్కన పెట్టారు. ప్రత్యేక హోదాను సమాధి చేసి ప్యాకేజీగా మార్చడంలో సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల పాత్రే కీలకం. ► సీఎస్, డీజీపీలపై నర్సీపట్నం సభలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వాడిన భాష సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. అధికారులను తూలనాడటం, వ్యవస్థలను తేలిక చేసి మాట్లాడటం, చంద్రబాబు నుంచి అభ్యర్థుల వరకు షరా మామూలైపోయింది. – పింఛన్ దారుల విషయంలోనూ ఏవిధంగా కూటమి నేతలు చులకన చేసి మాట్లాడారో ఈసీ దృష్టికి తీసుకువెళ్లాం. మైనార్టీలపై బాబు కపట ప్రేమ ‘‘మైనార్టీల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు, టీడీపీకి ఏమాత్రం లేదు. ఆనాడు దివంగత మహానేత మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ తీసుకువస్తుంటే, కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుంది టీడీపీ కాదా? అధికారంలో ఉండి కూడా ఎన్నికలకు ముందు 4 నెలల వరకు మైనార్టీలకు కేబినెట్లో స్థానం కల్పించని వ్యక్తి చంద్రబాబు. కానీ సీఎం వైఎస్ జగన్ తన తొలి కేబినెట్లోనే మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించి, మైనార్టీల పక్షపాతిగా నిలిచారు’’ అని విష్ణు పేర్కొన్నారు. అమరావతి పేరుతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆడిన డ్రామాలను ప్రజలు గ్రహించినందునే స్థానిక ఎన్నికల్లో అక్కడి ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించారని గుర్తుచేశారు. రైతు రుణమాఫీని ఎగ్గొట్టి అన్నదాతలకు ద్రోహం చేసిన చంద్రబాబు రైతు సంక్షేమంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరెన్ని విమర్శలు గుప్పించినా ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎ. నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సుజనా చౌదరి, కేశినేని చిన్నిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు గాం«దీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్నికల ప్రచారంలో భాగంగా హారతి పళ్లెంలో డబ్బులు వేసిన ఘటనపై ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసులో ఆయన ఫిర్యాదు చేశారు. డబ్బుల పంపిణీపై వార్తా చానల్స్, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్, హారతి పళ్లంలో డబ్బులు వేస్తున్న వీడియోలు ఎన్నికల అధికారులకు అందజేశారు. పూర్తి ఆధారాలు ఉన్నందున ఎన్నికల నియమావళిలో సూచించిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుజనా చౌదరి డబ్బుల సంచులతో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారన్నారు. తొలిరోజే ఆయన కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. -
వాలంటీర్లపై ‘పచ్చ’ కుట్ర.. చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేతల ఫైర్
సాక్షి, విజయవాడ: పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ అండ్ కో ఫిర్యాదుపై ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మండిపడ్డారు. సీఎం జగన్ చెప్పినట్లు పేదలకు, పెత్తందార్లుకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయించడం దురదృష్టకరమన్నారు. పెన్షన్ల పంపిణీ అంశంపై ఈసీ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులు ఇబ్బందులు పడతారు: ఎంపీ కేశినేని పెన్షన్లు ఆపేస్తే లబ్ధిదారులు ఇబ్బంది పడతారన్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. మొన్నటి వరకూ ఒకటవ తేదీనే పెన్షన్ ఇచ్చేవాళ్లం. ఆ విధానాన్ని కొనసాగించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారన్నారు. నిమ్మగడ్డ రమేష్‌తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా.. తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పెన్షన్లను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందేనన్నారు. వృద్ధుల ఉసురు పోసుకున్న చంద్రబాబు: వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిమ్మగడ్డ రమేష్ అండ్ బ్యాచ్ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో మూడు రోజులు క్యూలో నిలబడితేనే కానీ పెన్షన్లు వచ్చేవి కాదు. ఈ కుట్రకు కారణం చంద్రబాబే. వృద్ధుల ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుంది. సీఎం జగన్ ఇంటికే పెన్షన్లు అందిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ల ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
చంద్రబాబుకు మల్లాది విష్ణు స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విజయవాడ: టీడీపీ తీరు ఆత్మస్తుతి పరనిందలాగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. ‘విధ్యంసం’ పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు,పవన్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు తన గురించి తాను రాసుకున్న ‘మనసులో మాట’ పుస్తకాన్ని బయటపెట్టాలి. చంద్రబాబు ఐదేళ్ల పాలనకు.. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనకు బహిరంగ చర్చకు మేం సిద్ధం. ఎక్కడ చర్చకు రమ్మన్నా వచ్చేందుకు రెడీ. చంద్రబాబుకు ఇదే నా సవాల్. పథకాలిస్తుంటే ఏపీ శ్రీలంక అయిపోతుందన్నావ్. ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఆరు గ్యారంటీలిస్తానంటున్నావ్. ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటున్నారు’’ మల్లాది విష్ణు పేర్కొన్నారు. నీ గురించి గొప్పగా.. సీఎం జగన్‌పై తప్పుగా ప్రచారం చేయిస్తున్నావ్. బాబు జమానా అవినీతి ఖజానా అని పుస్తకం వేసింది సీపీఐ కాదా?. సీఎం జగన్‌పై బురద చల్లడానికే ‘విధ్వంసం’ పుస్తకాన్ని తెచ్చారు. సీఎం జగన్‌ని ఢీకొట్టే సత్తాలేక బాబు ఇతర పార్టీలను కలుపుకుంటున్నాడు. కుర్చీ కోసం పాకులాడటం తప్ప.. ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన మీకులేదు. ఐదేళ్లలో విజయవాడ నగరానికి ఒక్క మంచి పనైనా చేశావా?. విజయవాడ అభివృద్ధి పై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అంటూ మల్లాది విష్ణు హితవు పలికారు. ‘‘పరిపాలనకు మీరు పనికిరారని, ప్రజలు 2019లో మిమ్మల్ని విధ్వంసం చేశారు. తప్పుడు సంకేతాలివ్వాలనే టీడీపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. విధ్వంసం పుస్తకం వెనుక చంద్రబాబు, పవన్, సీపీఐ రామకృష్ణ ఉన్నారు. మూడు రాజధానులే మా పార్టీ విధానం. ఏపీలో పొత్తులు తేలాక ఎవరి పై ఎవరు రాళ్లు విసురుతారో.. ఎవరి కుర్చీ ఎవరు మడతపెడతారో తేలిపోతుంది. పొత్తులు ప్రకటించాక మంచి వినోదం మొదలవుతుంది. ఏపీని మోసం చేసిన పార్టీలే మళ్లీ కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి. చంద్రబాబు,పవన్ ది రెండు నాల్కల ధోరణి. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ ఏం మాట్లాడారో.. ఇప్పుడేం మాట్లాడుతున్నారో అంతా గమనిస్తున్నారు’’ అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. -
175 స్థానాలలో పోటీ చేసే దమ్ము లేక..టీడీపీ పై మల్లాది విష్ణు ఫైర్
-
అసెంబ్లీలో టీడీపీ తీరు అత్యంతహేయంగా ఉంది: మల్లాది
-
మల్లాది విష్ణుకి టికెట్ ?..సజ్జల కీలక కామెంట్స్
-
ఒక్క హగ్‌తో యెల్లో బ్యాచ్‌కి చెక్
ఎన్టీఆర్, సాక్షి: పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు తప్పవని.. అలాంటప్పుడు అలకలు సహజమని.. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ముందు నుంచే చెబుతున్నాయి. అయితే యెల్లో మీడియా మాత్రం ఈ అలకల్ని భూతద్ధంలో పెట్టి చూపించే యత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ్టి విజయవాడ సెంట్రల్ పరిణామాలు.. ఆ బ్యాచ్ నోళ్లు మూయించాయి. వైఎస్సార్సీపీ నుంచి తొలి గెలుపు విజయవాడ సెంట్రల్‌దే కావాలని.. వెల్లంపల్లి శ్రీనివాస్‌ను గెలిపించాలంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం పిలుపు ఇచ్చారు. అంతేకాదు విజయవాడలో పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అయితే టీడీపీ అనుకూల మీడియా చానెల్స్, పత్రికలు చాలారోజుల నుంచి వీళ్ల మధ్య ఏదో వైరం నడుస్తున్నట్లు చూపించే యత్నం చేసింది. ఒక అడుగు ముందుకేసి ఆయన పార్టీని కూడా వీడుతారంటూ ఊహాజనిత కథనాలు రాశాయి. అయితే ఆ రోతరాతలకు ఒక్క హగ్‌తో చెక్ పెట్టారు ఈ ఇద్దరూ. విజయవాడ సెంట్రల్ సింగ్ నగర్ లో వైఎస్సార్సీపీ ఇంఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి ఆఫీస్‌కు ర్యాలీ తన ఆఫీస్ నుంచి మల్లాది వచ్చారు. ఈ సందర్భంగా మల్లాదికి వెల్లంపల్లి ఆత్మీయ స్వాగతం పలికారు. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని.. పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. సమిష్టిగా పని చేయడం ద్వారా ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరాతామని ఈ సందర్భంగా ఈ ఇద్దరు ప్రకటించారు. -
'మందలో ఒకరిగా కాదు.. వందలో ఒకరిగా..' : ఆర్.కే. రోజా
నేటి యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని, యూత్ ఐకాన్ లుగా తయారవ్వాలని, స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవంను పురష్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. యువజన వేడుకలకు ముఖ్య అతిధిగా హజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని నేటి యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని యువత ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కడివెడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు అని అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు యువత శక్తిపై అపార నమ్మకాన్ని ఉంచి వారి అభ్యున్నతి కోసం మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి ఆర్.కె. రోజా తెలిపారు. స్వామి వివేకానంద యువతకు మార్గనిర్ధేశం చేశారని, ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు, స్ఫూర్తికి అనుగుణంగా యువత నడిస్తే వారికి తిరుగుండదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పేర్కొన్నారు. హిందూ యోగిగా స్వామి వివేకానంద మన దేశ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని విదేశాల్లో చాటి చెప్పిన తొలి వ్యక్తి అని కొనియాడారు. స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లు నేడు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాయని వివరించారు. అందుకనే 120 సంవత్సరాల తరువాత కూడా స్వామి వివేకానంద గొప్పతనాన్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నామన్నారు. స్వామి వివేకానంద మన దేశంలో జన్మించటం మనం చేసుకున్న అదృష్టమని మంత్రి ఆర్. కె. రోజా పేర్కొన్నారు. నేటి యువత మందలో ఒకరిగా కాదు వందలో ఒకరిగా నిలవటానికి వారి వారి రంగాల్లో విశేష కృషి చేయాలని కోరారు. స్వామి వివేకానంద సముద్ర కెరటం నాకు ఆదర్శమన్నారని, అంటే ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కాని ప్రయత్నం చేయటంలోనే ఓడిపోకూడదని, యువత తమ జీవితంలో ఒక గోల్ నిర్ణయించుకుని నిరంతరం శ్రమిస్తే విజయం తథ్యమని మంత్రి ఆర్. కె. రోజా అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకుని ప్రతి ఏడాది యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ ఏడాది థీమ్ యూత్ ఫర్ డిజిటల్ ఇండియా గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిదన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవ పోటీల్లో ప్రధమంగా నిలిచిన విజేలందరినీ, ఈ ఏడాది నాసిక్ లో నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనటానికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని నాసిక్ లో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల్లో ప్రతిభ చూపి మన రాష్ట్రానికి మరిన్నీ బహుమతులు తీసుకురావాలని మంత్రి ఆర్.కె. రోజా కోరారు. రండి-మెల్కోండి-లక్ష్యాన్ని చేరుకోండి అన్న స్వామి వివేకానంద స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. యువతకు మార్గనిర్ధేశకులు స్వామి వివేకానంద అని అన్నారు. యువత అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వం దేశంలోనే మన ముందు వరుసలో ఉండటం గర్వకారణమని, అందుకు మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కు ధన్యవాదాలు తెలిపారు. ఆడుదాం ఆంధ్రాకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత మానసిక వికాసం, శారీరక ధారుడ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే విష్ణు కోరారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న స్వామి వివేకానంద జీవితానికి సంబంధించిన నాలుగు చిన్న కథలను విద్యార్థులకు వివరించి అందులోనుంచి సమయస్ఫూర్తి, శారీరక బలం, మానసిక బలం, ధైర్యం ప్రాముఖ్యతను యువతకు వివరించారు. ఈ నాలుగు జీవితంలో భాగం చేసుకోవాలని అప్పుడే యువత తమ లక్ష్యాన్ని మరింత త్వరగా చేరుకుంటారన్నారు. స్వామి వివేకానంద దేశ భవిష్యత్ గురించి కూడా చెప్పారని రాబోయే తరాలు మన సంస్కృతికి, సాంప్రదాయలకు పెద్దపీట వేస్తారని అన్నారని గుర్తుచేశారు. రామకృష్ణ మిషన్ స్వామిజీ తాతా మహారాజ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, ఆయన రచనలు యువతకు ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద యువతకు దిక్సూచి అని కొనియాడారు. భారతదేశం గొప్పతనాన్ని తెలుచుకోవాలంటే వివేకానందుడి జీవితాన్ని చదివితే తెలుస్తుందన్నారు. సనాతన ధర్మం గొప్ప తనాన్ని నేటి యువత గుర్తించాలన్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అతిధులు ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన యువజనోత్సవాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందచేశారు. అలాగే యువజన శాఖ ఆధ్వర్యంలో అధికారులు మంత్రి రోజాను ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది మన రాష్ట్రం సాధించిన లార్జెస్ట్ యూత్ ఐకాన్ ఫెస్టివల్ అవార్డును మంత్రి రోజా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్నకు అందచేశారు. వేదికపై చెస్ మాస్టర్ ఎం. లలిత్ బాబును మంత్రి రోజా శాలువా, పూలామాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె. శారదాదేవి, డిప్యూటీ మేయర్ ఎ. శైలజారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్. ఆసీఫ్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పి. మహేష్ తదితరులు పాల్గొన్నారు. - కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. -
మల్లాది విష్ణు, నేను వేరు కాదు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లాది విష్ణు, తాను వేరు కాదు.. ఇద్దరూ ఒక్కటేనని వెల్లంపల్లి స్పష్టం చేశారు. అలాగే, బోండా ఉమా హద్దు మీరి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వెల్లంపల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం. మల్లాది విష్ణు, నేను వేరు కాదు.. ఇద్దరం ఒక్కటే. సామాజిక సమీకరణాల్లో భాగంగానే మార్పులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండగా పాటిస్తాం. సీఎం వైఎస్ జగన్ పథకాలు, సంక్షేమ పాలనే వైఎస్సార్సీపీని, మమ్మల్నిని గెలిపిస్తాయి. టీడీపీ నేత బోండా ఉమ హద్దు మీరి మాట్లాడుతున్నాడు. బోండా ఉమ హద్దు మీరితే సహించేది లేదు. ముందు వాళ్ల సీట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి అని హితవు పలికారు. -
పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి సీఎం జగన్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
మాజీ సిఎం చంద్రబాబు రాష్ట్రానికి పనికొచ్చే పని ఏం చేశారు?- వైసీపీ ఎమ్మెల్యే మల్లాదివిష్ణు
-
నారా లోకేష్ పై మల్లాది విష్ణు సెటైర్లు
-
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి .. మల్లాది విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్
-
మైనారిటీలపై చంద్రబాబు కక్ష సాధింపు..మల్లాది విష్ణు ఫైర్..
-
పురంధేశ్వరిపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్
-
శ్రీవారి పాదాల సాక్షిగా నారా భువనేశ్వరిని ఒక్కటే అడుగుతున్నా
-
జైల్లో చంద్రబాబు కేజీ బరువు పెరగడంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు సెటైర్లు..
-
డబ్బులిస్తే అతను ఏ పనైనా చేస్తాడు
-
అవినీతి అనకొండ చంద్రబాబు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
రాజరాజేశ్వరిపేటలో గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం
-
బాలకృష్ణ, టీడీపీ నేతలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు
-
సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ, జనసేనకు లేదు: మల్లాది విష్ణు
-
ఈ స్కిల్ స్కామ్ లో పవన్ కళ్యాణ్ వాటా ఎంతో నిన్నే అర్ధమయింది
-
సీపీఐ, జనసేనపై మల్లాది విష్ణు సీరియస్ కామెంట్స్
సాక్షి, విజయవాడ: సీపీఐ రామకృష్ణ, చంద్రబాబు, పవన్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తొత్తులా సీపీఐ రామకృష్ణ వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. జనసేన సిద్ధాంతం లేని పార్టీ అని ఎద్దేవా చేశారు. అలాగే, బాలకృష్ణ, పవన్ నోరు అదుపులో పెట్టకుని మాట్లాడాలని హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి చేసిన చంద్రబాబును సీపీఐ సమర్థిస్తోంది. చంద్రబాబుకు తొత్తులా రామకృష్ణ వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చేసిన స్కాంలు పవన్‌కు కనబడట్లేదా?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం 12 నుంచి 6 శాతానికి తగ్గింది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. జనసేన సిద్ధాంతం లేని పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు అత్యుత్సహం ఎక్కువైంది. దత్త తండ్రి అరెస్ట్‌ను పవన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అవినీతి చేసిన వ్యక్తిని సపోర్టు చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు చేసిన అవినీతిలో పవన్, బాలకృష్ణకు కూడా వాటా ఉందా?. చంద్రబాబు ఒక ఆర్థిక నేరస్థుడు. పవన్‌కు భయం పట్టుకుంది. అందుకే ఈరోజు జైలుకి వెళ్లాడు. పవన్ బీజేపీతో వివాహం.. టీడీపీతో కాపురం చేస్తున్నాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మాకొద్దు ‘బాబు’ వర్రీ.. మాకెందుకు ఈ కొరివి! -
బాలకృష్ణ చంద్రబాబు తప్పు గురించి మాట్లాడటంలేదు: మల్లాది విష్ణు
-
టీడీపీ బంద్‌కు మద్దతుగా పిలుపునివ్వడానికి పవన్‌కు సిగ్గుందా
విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై ఎమ్మెల్యే,మల్లాది విష్ణు స్పందించారు. చంద్రబాబు చేతిలో అధికారం ఉందన్న గర్వంతో అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కౌరవసభగా మార్చేశారు.. ఆదివారం ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు పాలనంతా అవినీతిమయమేనని ప్రజల జీవన స్థితిగతులు మార్చేందుకు కనీస చర్యలు కూడా తీసుకోలేదన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ కళ్లు నెత్తిమీద పెట్టుకుని పాలించారని శాసన సభను కౌరవ సభగా మార్చి రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయడానికి ప్రయత్నించారన్నారు. అన్నీ కుంభకోణాలే.. స్కిల్ స్కాంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దొరికిపోయాడని అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ ఐదేళ్ల పాలనలో అన్నీ కుంభకోణాలేనన్నారు. ఆ ఐదేళ్ల రాక్షస పాలనలో కిందనున్న కార్యకర్తలు జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని పైనున్న మంత్రులు,ముఖ్యమంత్రి స్కాముల పేరుతో దోచుకున్నారన్నారు. తుస్సుమన్న బంద్.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ పార్టీ అని మరోసారి నిరూపితమైంది నిజంగా తమ తప్పు లేకపోతే స్కిల్ కుంభకోణంతో తనకు సంబంధం లేదని చంద్రబాబు, టీడీపీ నాయకులు ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. తప్పు చేసినట్టు ఆధారాలున్నాయి కాబట్టి రిమాండ్ విధిస్తే ఆఘమేఘాల మీద బంద్ కు పిలుపునిచ్చారు. తీరా చూస్తే బంద్ పూర్తిగా విఫలమవ్వడంతో టీడీపీ పరువుపోయిందన్నారు. ఆయనకు సిగ్గులేదు.. టీడీపీ బంద్‌కు మద్దతుగా పిలుపునివ్వడానికి పవన్‌కు అసలు సిగ్గుందా అని ప్రశ్నించారు. బాబు జమానాలో అంతా అవినీతికి పాల్పడే ఖజానా నింపుకుందని ఏమీ తెలియనట్టు ఈరోజు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడని అన్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అవినీతికి ఎక్కడా ఆస్కారం లేకుండా మేం పాలన చేస్తున్నామన్నారు. చంద్రబాబు తప్పులన్నీ తాను చేసి నిందలు మాపై వేస్తున్నాడని అన్నారు. నోరు జాగ్రత్త.. చంద్రబాబుకి మద్దతిచ్చే పార్టీల వైఖరి చూస్తే నవ్వొస్తుంది. చంద్రబాబు మోదీని పొగుడుతాడు. మోదీని పొగిడిన చంద్రబాబును సీపీఐ వెనకేసుకొని వస్తుంటుంది. ఇక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడతాడో ఆయనకే అర్ధం కాదన్నారు. పవన్ పులివెందుల గురించి మాట్లాడే ముందు అక్కడి సంస్కృతి గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు. తెలుసుకుని మాట్లాడు.. చంద్రబాబుకు, పవన్‌కు అమరావతి తప్ప మరొకటి తెలియదని పేదలకు సొంతింటి కల నెరవేరిందంటే అది పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తి ఆలోచన వలనేనని అన్నారు. అమ్మ ఒడి, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి అనేక పథకాలు వచ్చాయంటే అది పులివెందుల వ్యక్తి నుంచి వచ్చిన ఆలోచనల చలవేనని అన్నారు. పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పవన్‌కు మానవత్వమే లేదని అన్నారు. అసలు పవన్‌కు సీఎం జగన్‌ను విమర్శించే అర్హతే లేదన్నారు. ఇది కూడా చదవండి: చెంపలు వేసుకోవాల్సింది పోయి జనాన్ని రెచ్చగొడతారా? -
చంద్రబాబు నీచ రాజకీయం ప్రజలకు తెలుసు : మల్లాది విష్ణు
-
అదో విఫల గళం
సాక్షి, అమరావతి: నారా లోకేశ్ పాదయాత్రకు బాహుబలి స్థాయిలో బిల్డప్‌లు ఇచ్చేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా ఎంత ప్రయత్నించినా ప్రజలు జోకర్‌గానే భావిస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ సమన్వయకర్త(విజయవాడ తూర్పు) దేవినేని అవినాశ్ వ్యాఖ్యానించారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. పాదయాత్రకు ప్రజా స్పందన లేకపోవడంతో చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్‌ను రంగంలోకి దించారని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ సైకోల్లా ప్రవర్తిస్తుండటం వల్లే వారిని ప్రజలు ఆదరించడం లేదన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో ప్రజలు మెచ్చేలా పరిపాలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభంజనంలో ఆ ముగ్గురూ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఆ ముగ్గురూ ద్రోహులే: వెలంపల్లి శ్రీనివాస్ అధికారంలో ఉండగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలను ఏమాత్రం అభివృద్ధి చేయకుండా చంద్రబాబు, లోకేశ్ ద్రోహం చేశారు. టీడీపీ సర్కార్‌కు మద్దతిచ్చిన పవన్‌కళ్యాణ్ కూడా ద్రోహే. ఆ ముగ్గురూ కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో 45 దేవాలయాలను కూల్చేసిన హిందూ ద్రోహులు. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను సైతం ధ్వంసం చేసిన ద్రోహులు. కుల మతాలు, పార్టీలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. వాటిని పొందిన వారిలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న కూడా ఉన్నారు. లోకేశ్ పాదయాత్రకు టీడీపీ నేతలు కూడా స్పందించడం లేదు. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని, గల్లా జయదేవ్.. లోకేశ్ పాదయాత్రను బహిష్కరించారు. లోకేశ్ పాదయాత్రపై చంద్రబాబుకు నమ్మకం ఉంటే 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి పెట్టే దమ్ము పవన్‌కు ఉందా? రాజకీయాల్లో జీరో అయిన పవన్ ఇప్పుడు సినిమాల్లో కూడా జీరో అయిపోయారు. ఆ ముగ్గురూ సన్నాసులు కాబట్టే కలసి పోటీ చేసి జగన్‌ను ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్నారు. విదేశీ విద్య పథకం ద్వారా ఆర్య వైశ్యుల పిల్లలను కూడా విదేశాలకు పంపిన ఘనత సీఎం జగన్‌ది. పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగా నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరిస్తే రాష్ట్ర అవతరణ దినాన్ని జూన్ 2కు మార్చింది చంద్రబాబే. దాన్ని మళ్లీ మార్చి నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని సీఎం జగన్ నిర్వహిస్తున్నారు. బ్యారేజ్‌పై ఫొటో షూట్‌కు రూ.5 కోట్లు: మల్లాది విష్ణు టీడీపీ హయాంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్తామంటే అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. నల్ల బెలూన్లతో నిరసన తెలిపి పసుపు నీళ్లతో కడిగే స్థాయికి దిగజారిపోయారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్రను మేం ఎక్కడన్నా అడ్డుకునే ప్రయత్నం చేశామా? డబ్బులు, మద్యాన్ని పంచి పెయిడ్ వర్కర్లతో ప్రకాశం బ్యారేజ్‌పై ఈవెనింగ్ వాక్ చేసిన లోకేశ్ ఫొటో షూట్‌కు రూ.5 కోట్లు ఖర్చు పెట్టారు. విజయవాడ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్లను దారి మళ్లించి ద్రోహం చేసింది చంద్రబాబే. దొంగ టీడీఆర్ బాండ్లను తయారు చేసి అమ్మిన పార్టీ టీడీపీ. అమ్మవారి దేవాలయంలో క్షుద్ర పూజలు చేసిన వ్యక్తి లోకేశ్. బ్రాహ్మణ వీధిలో గోశాలను కూలగొట్టి గోవులకు నిలువ నీడ లేకుండా చేశారు. నదీ తీరంలో పురోహితులకు చోటు లేకుండా చేసిన ఘనత కూడా టీడీపీదే. మేం 11 అంశాలతో రూపొందించిన చార్జ్షిట్కు లోకేశ్, చంద్రబాబు సమాధానం చెప్పాలి. జగనన్న కాలనీల ద్వారా విజయవాడలో 90 వేల మందికి ఇళ్ల స్థలాలు అందించిన ఘనత సీఎం జగన్‌ది. టీడీపీ పాలనలో వైశ్యులు, ముస్లింలు, బ్రాహ్మణులకు ఏం చేశారో లోకేశ్ చెప్పాలి. ఆర్–5 జోన్లో విజయవాడకు చెందిన 30 వేల మందికి సీఎం జగన్ ఇళ్ల పట్టాలిస్తుంటే వాటిని రద్దు చేస్తానని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు, లోకేశ్, పవన్ ముగ్గురూ సైకోలే. విజయవాడ నగరం వైఎస్సార్సీపీ అడ్డా. ఎర్ర పుస్తకం పట్టుకుని సైకోలా: దేవినేని అవినాశ్ పెయిడ్ వర్కర్లతో ఈవెనింగ్ వాక్ చేస్తున్న లోకేశ్‌కు 2014–19 మధ్య ప్రజలకు ఏం చేశారో చెప్పే దమ్ముందా? ఎర్ర పుస్తకం పట్టుకుని సైకోలా ఊగిపోతున్నాడు. లోకేశ్ యాత్ర వల్ల చంద్రబాబు సీఎం కాలేరు. లోకేశ్ ఎమ్మెల్యే కాలేడు. చంద్రబాబూ? ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది. గత నాలుగేళ్లలో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో విజయవాడ నగరం మౌలిక సదుపాయాల కల్పనతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిటైనింగ్ వాల్, ఫ్లైఓవర్లు వంటి అనేక నిర్మాణాలు పూర్తి చేశారు. పాదయాత్రలో లోకేశ్ వాటిని చూడాలి. టీడీపీ హయాంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌ను సింగపూర్ కంపెనీకి కట్టబెట్టాలని చూస్తే ఇప్పుడు సీఎం జగన్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. -
ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ దుష్ప్రచారం చేస్తున్నారు: మల్లాది
-
పుంగనూరు పోలీసులపై దాడి కేసు.. మరో 9 మంది అరెస్ట్
సాక్షి, చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో సంచలనం కలిగించిన పుంగనూరు పోలీసులపై దాడి కేసులో మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 72కు చేరుకుంది. A1 ముద్దాయి అయిన పుంగనూరు టీడీపీ ఇంఛార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. అతని కోసం ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడి జరిగిన రోజు ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో చెక్ పోస్ట్, టోల్ గేట్ వద్దనున్న సీసీ కెమెరాలు ద్వారా వాహనాలు నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.అనంతపురం, బెంగళూరు,రాయచోటి ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకుల,కార్యకర్తల వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: టీడీపీ రాక్షస క్రీడ సాక్షి, విజయవాడ: పుంగనూరులో చంద్రబాబు సృష్టించిన విధ్వంసకాండను ఖండిస్తూ పైపుల రోడ్డు సెంటర్లో నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిఫ్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పుంగనూరులో చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రౌడీయిజం చేస్తూ దౌర్జన్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని, ముందస్తుగా వ్యూహం పన్ని పోలీసులపై దాడులు చేసి పోలీసు వాహనాలను తగలబెట్టించాడని మండిపడ్డారు. ‘మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందంటాడు. కానీ గత కొన్ని రోజులుగా చంద్రబాబు వైఖరి చాలా జుగుప్సాకరంగా ఉంది. అంజు యాదవ్ విషయంలో పవన్ పోలీసు యంత్రాంగం మొత్తాన్ని తప్పుబట్టాడు. పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తే ఎందుకు పవన్ ఖండించలేదని ప్రశ్నిస్తున్నా. ప్రతిపక్షాలు ప్రస్టేషన్ లో ఉన్నాయి. భవిష్యత్తులో గెలవలేమనే భయం ప్రతిపక్షాల్లో ఉంది. పుంగనూరులో రాబోయే తరాల్లో గెలుపు సాధ్యం కాదని భావించి హింసకు పాల్పడ్డారు. కర్రలు, తుపాకులు తీసుకొచ్చి చేసిన వీరంగం టీడీపీ ఏ స్థాయికైనా దిగజారిపోతుందనేదానికి నిదర్శనం. ప్రాజెక్టుల పేర్లతో హింసను ప్రోత్సహించడానికి ఆలోచన చేస్తున్న చంద్రబాబు నైజాన్ని ఖండిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
అర్ధరాత్రి గడప గడపకు నిర్వహించిన ఎమ్మెల్యే విష్ణు
-
వారాహి యాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారాహి యాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని దుయ్యబట్టారు. యాత్రలో పవన్ తన విధానాలను చెప్పుకోవాలి కానీ, ఇతరులను దూషించడం సరికాదని హితవు పలికారు. ‘‘సేవా దృక్ఫథంతో పనిచేస్తున్న వలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందనడం దిగజారుడుతనం. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నడుస్తున్నాడు. వలంటీర్ వ్యవస్థ గురించి చంద్రబాబు కూడా గతంలో కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. వలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదు. ఏ ఆధారాలతో వలంటీర్ల పై పవన్ ఆరోపణలు చేశాడో చెప్పాలి’’ అంటూ మల్లాది విష్ణు నిప్పులు చెరిగారు. చదవండి: పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని.. ‘‘పవన్ కల్యాణ్‌కు మామూలుగానే తిక్క. ఆ తిక్కతోనే వలంటీర్ల పై వ్యాఖ్యలు చేస్తున్నాడు. తక్షణమే పవన్.. వలంటీర్లకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని ఎమ్మెల్యే విష్ణు హెచ్చరించారు. -
విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియంలో బక్రీద్ వేడుకలు
సాక్షి, విజయవాడ: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో పాటు ప్రార్థనల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ముస్లిం సోదరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సుఖ సంతోషాల పాలన నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు చాలా గొప్ప సేవలు అందిస్తోందన్నారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రేమ, త్యాగాలకు ప్రతీక బక్రీద్. ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. చంద్రబాబు హయాంలో మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. వైఎస్సార్ తర్వాత ముస్లింలకు మేలు చేస్తున్నది సీఎం జగన్ మాత్రమే. మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: అల్లాహ్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి.. ముస్లింలకు సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు -
వై నాట్ 175తో చంద్రబాబుకు భయం
ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కాగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పూర్తి విశ్వాసంతో వై నాట్ 175 అనే నినాదం తీసుకోవడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం ఒంగోలు వచ్చిన ఆయన స్పందన భవనంలో నవరత్నాలు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఏ నారాయణమూర్తి, కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్‌లతో కలిసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ప్రియారిటీ ఇండికేటర్స్‌పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్న పిల్లల ఆరోగ్య రక్షణ, గర్భిణులు, బాలింతలు, శిశు మరణాలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలతో సత్ఫలితాలు వచ్చాయన్నారు. పేదరిక నిర్మూలన, విద్యా, వ్యవసాయం, వైద్యం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నట్లు తెలిపారు. సమీక్ష సమావేశంలోని అంశాలను వివరించారు.గతంలో పలుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నవరత్నాలు ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్ సీపీ నవరత్నాలు, టీఆర్ఎస్ పార్టీలో కొన్ని, కర్ణాటకలో మ్యానిఫెస్టోలోవి మరికొన్ని కాపీ కొట్టి చంద్రబాబు మ్యానిఫెస్టో అని విడుదల చేయడం హాస్యాస్పదం అన్నారు. కాపీ కొట్టిన మ్యానిఫెస్టోతో చంద్రబాబు విఫలమై నవ్వులపాలయ్యాడన్నారు. వైఎస్ జగన్ నవరత్నాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పుల పాలై శ్రీలంక అవుతుందని బుకాయించిన చంద్రబాబు ఇప్పుడు అవే పథకాలను ఆయన మ్యానిఫెస్టోగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నా ఇచ్చిన మాటల మేరకు జగన్ నవరత్నాలను అమలు చేశారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య, వ్యవసాయం, వైద్యం, గృహాల గురించి పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట, అధికారం వచ్చాక మరో మాట చెప్పడం ప్రజలకు తెలియంది కాదని, ఆయన్ను నమ్మే పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు. పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ వీకెండ్ పర్యటనలు పట్టించుకోమన్నారు. సిద్దాంతం, ఎజెండాలు లేని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పాదయాత్రలు వైఎస్సార్ సీపీని ఏమీ చేయలేవన్నారు. రాష్ట్రంలో 55 శాతానికిపైగా ప్రజలు జగన్‌తో ఉన్నారని, అందుకు మున్సిపాలిటీ, జెడ్పీ, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పక్కా తీర్పును ఇవ్వడమే నిదర్శనమన్నారు. పవన్‌కళ్యాణ్ అమితాబ్‌తో కలిసినా, అమిత్‌షాతో కలిసినా ఒరిగేదేమీ లేదన్నారు. -
గతంలో 600 హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన బాబు
-
‘చంద్రబాబు అందితే జుట్టు...అందకపోతే కాళ్లు పట్టుకుంటాడు’
సాక్షి, విజయవాడ: తమ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన చేశారని, పేదల మీద అద్దెలు భారం పడకుండా, సొంత ఇల్లు ఉండాలనుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ‘ రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు కొని అందరికీ ఇళ్లిచ్చారు. పేదల ఇళ్ల కోసం గత ప్రభుత్వం కనీస ఆలోచన చేయలేదు. పేదల ఇళ్ల విషయాన్ని ఎన్నికల నినాదంగా వాడుకుని వదిలేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో 7600 ఇళ్లను అమరావతిలో ఇస్తున్నాం.చంద్రబాబు చేయని కుట్రలేదు...మాటని మార్చలేదు.అమరావతిలో పేదలు ఉండకూడదనుకున్నారు. అమరావతిలో తన అనుచరులతో కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. హైకోర్టు,సుప్రీంకోర్టుల నుంచి మాకు సానుకూలంగా తీర్పునిచ్చాయి. చంద్రబాబు అందితే జుట్టు...అందకపోతే కాళ్లు పట్టుకుంటాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చామని గొప్పలు చెబుతున్నాడు. విజయవాడలో ఎంతమందికి రెండు సెంట్లు ఇచ్చాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ధైర్యముంటే ఇళ్ల స్థలాలు తీసుకున్న లబ్ధిదారుల పేర్లు, నెంబర్లు ఇవ్వాలని కోరుతున్నా. విజయవాడ నగరంలో 95 వేల మందికి స్థలాలు కొని అమరావతి...ఇతర ప్రాంతాల్లో ఇచ్చారు.పేదలకు ఒక హక్కు...ధైర్యాన్ని ఇచ్చారు. పేదల పక్షపాత ప్రభుత్వం మాది. ధనికుల పక్షపాతి గత టీడీపీ ప్రభుత్వం. టీడీపీ అధికారంలోకి వస్తే పేదలను ఖాళీ చేయిస్తామని అచ్చెన్నాయుడే చెప్పాడు.చంద్రబాబు కుయుక్తులు పనిచేయవు. టిడ్కో ఇళ్లలో అప్లికేషన్లను జిరాక్సులు తీసి అమ్మిన చరిత్ర టీడీపీ నేతలది’ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యే మల్లాది విష్ణును పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఆయన తల్లి బాలాత్రిపుర సుందరమ్మ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ ఆమె మృతి చెందారు. విజయవాడ ఎంజీ రోడ్‌లోని మల్లాది విష్ణు నివాసానికి చేరుకున్న సీఎం.. బాలా త్రిపుర సుందరమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. (చదవండి: తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు) -
ఏపీ: ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మాతృవియోగం
సాక్షి, కృష్ణా: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి బాలాత్రిపుర సుందరమ్మ కన్నుమూశారు. దీంతో పలువురు వైఎస్సార్సీపీ నేతలు మల్లాది విష్ణు కుటుంబ సభ్యులకు సంఘీభావం చెబుతున్నారు. ఇదీ చదవండి: 24న ‘నావిక్–01’ ఉపగ్రహ ప్రయోగం -
రజినీకాంత్ తో పొగిడించుకున్నంత మాత్రనా చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాకపోడు : మల్లాది విష్ణు