సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబుకు మాటలెక్కువ.. పని తక్కువ అంటూ కామెంట్స్ చేశారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇదే సమయంలో తిరుపతి దేవస్థానం బోర్డు లిస్టులో బ్రాహ్మణులు ఎందుకు లేరు అని ప్రశ్నించారు. చంద్రబాబుకి బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే చిన్నచూపు అంఊ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్‌సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం, చంద్రబాబుకు మాటలెక్కువ పని తక్కువ. దేవస్ధానం బోర్డుల్లో బ్రాహ్మణులకు స్ధానం కలిపిస్తామని చెప్పారు. తిరుపతి దేవస్ధానంలో బోర్డు లిస్టులో బ్రాహ్మణులు ఎందుకు లేరు?. కేబినెట్ మీటింగ్‌లో, జీవోలో గొప్పలు చెప్పుకున్నారు. 2024, 2019, 2014లో ఒక్క నియోజకవర్గంలో ఒక్కరికి కూడా పోటీ చేయడానికి టికెట్ ఇవ్వలేదు.
600 మంది వేద పడింతులకు మూడు వేల చొప్పున స్కాలర్‌షిప్ ఇస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ఈ మేరకు తీర్మాణం చేసింది వైఎస్సార్‌సీపీనే. తీర్మానం చేయడమే కాదు.. నిధులు కూడా విడుదల చేశాం. ఇప్పుడు బ్రాహ్మణులకు చోటు లేదు కాబట్టే దాన్ని పక్కదారి పట్టించడానికి స్కాలర్‌షిప్ ఇస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుకి బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే చిన్నచూపు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభలో ఎక్కడా బ్రాహ్మణులకు స్ధానం కల్పించలేదు. కేబినెట్‌లో వాళ్లు చేసిన నిర్ణయాన్ని నేడు ఉల్లఘించారు. ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. బ్రాహ్మణులకు టీటీడీలో ప్రాతినిధ్యం లేదు.హిందూ సమాజానికి, ఆధ్యాత్మిక చింతనలో బ్రాహ్మణ వర్గాన్ని గౌరవించడంలో పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వం విఫలం చెందింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment