
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ జోకర్లే అని అన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి బుర్ర లేదంటూ ఫైర్ అయ్యారు.
కాగా, మల్లాది విష్ణు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లోంచి వచ్చిన కార్యక్రమమే జగనన్నే మా భవిష్యత్తు. ఏడాది ముందే ప్రజల ముందుకు వెళ్లగలిగే గట్స్ ఉన్న పార్టీ మాదే అని స్పష్టం చేశారు. ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో మిగిలిన పార్టీలున్నాయి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు. మేం చేసింది చెప్పడానికే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధిలో నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. విద్య, వైద్య రంగంలో సమూల మార్పులు తెస్తున్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక టీడీపీ నేతలు మాపై విమర్శలు చేస్తున్నారు.
నారా లోకేష్, బాలకృష్ణ ఇద్దరూ జోకర్లే. అచ్చెన్నాయుడుకి అసలు బుర్ర ఉందా లేదా?. ఎవరో నలుగురు ఎమ్మెల్యేలు గడ్డితిన్నంత మాత్రాన అందరూ అలా ఉంటారనుకోవడం పొరబాటు. మా గురించి పక్కన పెట్టి ముందు మీపార్టీ గురించి ఆలోచించుకోండి. గన్నవరంలో రోడ్డు మీదే కొట్టుకున్నారు. చంద్రబాబు పర్యటిస్తే పంచాయతీ పెట్టేందుకు గుడివాడలో మీ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు అంటూ చురకలు అంటించారు.
Comments
Please login to add a commentAdd a comment