Jagan Anne Ma Bhavishyat
-
జగనన్న వల్లే నా భర్త ప్రాణాలు కాపాడుకోగలిగాను
-
విజయవాడలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం
-
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు
-
మళ్ళీ జగనన్నే రావాలి..!
-
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై ఏపీ ప్రజలు...!
-
జగనన్నే మా భవిష్యత్తుకు విశేష స్పందన : కాకాణి గోవర్ధన్‌రెడ్డి
-
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో అద్భుతం
-
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు
-
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు
-
సీఎం జగన్ పథకాలపై మహిళా గ్రామ వాలంటీర్ గొప్ప మాటలు
-
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సీఎం జగన్ పథకాలు
-
జగనన్న ఫోటో చూడగానే బాబు రియాక్షన్ చూడండి
-
జగనన్న ఫోటో చూసి ఈ అవ్వ ఏం చేసిందో చూడండి
-
సీఎం జగన్ పై ఈ పాప పాట...!
-
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం : తమ్మినేని సీతారాం
-
జగనన్న పథకాలు చూసి బ్యాంకు వాళ్లే లోన్ ఇస్తున్నారు
-
జగనన్న ఫోటో చూడగానే ఈ అవ్వ ఏం చేసిందో చూడండి
-
చంద్రబాబు నీకు ఒక్కటే చెప్తున్నాం..!
-
సీఎం జగన్ పై ఈ అవ్వ అద్భుతమైన మాటలు
-
పార్వతీపురంలో జగనన్నే మా భవిష్యత్తు
-
జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమంలో అద్భుతం
-
పిల్లలతో కొడాలి నాని కామెడీ...!
-
చంద్రబాబు నీచ రాజకీయం...!
-
జగనన్న ఫోటోని ఎలా గుర్తు పట్టిందో చూడండి
-
సీఎం జగన్ పథకాలతో కట్టిన ఇల్లు చూస్తే బిత్తరపోతారు
-
ఈ ట్రాన్స్ జెండర్ ఎం చేసిందో చూడండి...!
-
ఈ వృద్దుల మాటలు విన్నారా సీఎం జగన్ గురించి ...!
-
ప్రజలు జగనే మా నమ్మకం అంటున్నారు
-
నా కొడుకు కన్నా బాగా చూసుకుంటున్నాడు మళ్ళీ జగనే రావాలి
-
జగన్ కి ఎంత కష్టమొచ్చినా మాకు మంచే చేస్తున్నాడు
-
జగన్ ఫోటో చూడగానే ఈ అవ్వ ఏం చేసిందో చూడండి
-
కొడాలి నానికి బ్రహ్మరథం పట్టిన గుడివాడ మహిళలు
-
మహిళల మాటలకు మంత్రి రోజా ఫిదా
-
మళ్ళీ జగనే రావాలి మేము చచ్చేదాకా ఆయనే సీఎంగా ఉండాలి
-
మళ్ళీ నువ్వే రావాలంటూ మహిళల భావోద్వేగం
-
నీళ్లకు ఇబ్బందిగా ఉంది ఎమ్మెల్యే సార్ వెంటనే పరిష్కారం ఇచ్చిన ఎమ్మెల్యే
-
నా జీవితంలో ఎంతో మంది సీఎంలను చూసాను కానీ ఇలాంటి సీఎంను చూడలేదు
-
మా ప్రభుత్వ లక్ష్యం ఇదే..
-
సీఎం జగన్ గురించి ఈ అవ్వ ఎంత బాగా మాట్లాడిందో చూడండి
-
గడప గడపలో అదే పిలుపు, అదే నమ్మకం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ (ఫొటోలు)
-
‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్‌కు అపూర్వ స్పందన
-
మళ్లీ మళ్లీ వైఎస్ జగనే సీఎం కావాలని జనం కోరుకుంటున్నారు
-
జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన
-
ఏపీలో జగనన్నే మా భవిష్యత్తు విజయవంతం
-
అచంచలమైన నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేలో 1.45 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్సీపీ చేరువైంది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని భారీ మెగా పీపుల్స్ సర్వేగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ నిలిచింది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్సీపీ క్యాడర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సుపరిపాలన, ప్రభుత్వ విధానాలపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి మద్దతు తెలిపిన 1.16 కోట్ల కుటుంబాలకు, పార్టీ క్యాడర్‌కు ధన్యవాదాలు’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. ‘‘ప్రజలకు మరింత సేవ చేసేందుకు దేవుని దయ, మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. మన పాలన పట్ల మన ప్రభుత్వ విధానాల పట్ల అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి నాకు మద్దతు తెలిపిన 1.16కోట్ల కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన @YSRCParty క్యాడర్ కు ధన్యవాదాలు. మీకు మరింత సేవ చేసేందుకు, దేవుని దయ మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా… pic.twitter.com/92DSw9eFFX — YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2023 కాగా, వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కలిసి సీఎం జగనన్న పాలనపై వారి అభిప్రాయాలను సేకరించింది. సీఎం జగన్ పాలనకు 1.1 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్ ద్వారా మద్దతు ప్రకటించారు. చదవండి: ఇంటింటా ‘నమ్మకం’.. జగనన్నే మా భవిష్యత్తు..1.1 కోట్ల మిస్డ్ కాల్స్ -
సీఎం జగన్ పాలనలో లబ్ధిదారుడి ఇంటివద్దకే సంక్షేమం
సాక్షి, గుంటూరు: సీఎం జగన్ పాలనలో లబ్ధిదారుడి ఇంటివద్దకే సంక్షేమం చేరుతోందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పథకాలు అందుతున్నాయని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98 శాతం నెరవేర్చినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లామని అంబటి చెప్పారు. గడపగడపకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చిందని తెలిపారు. చదవండి: ‘పవన్‌ను బ్లాక్మెయిల్ చేసేందుకు రజినీకాంత్ రంగంలోకి!’ -
ఇంటింటా ‘నమ్మకం’.. జగనన్నే మా భవిష్యత్తు.. 1.1 కోట్ల మిస్డ్ కాల్స్
సాక్షి, తాడేపల్లి: జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేలో 1.45 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్సీపీ చేరువైంది. ప్రభుత్వ పాలనపై 80 శాతం ప్రజల సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని భారీ మెగా పీపుల్స్ సర్వేగా జగనన్నే మా భవిష్యత్తు నిలిచింది. సర్వేలో విశేషంగా పాల్గొన్న ప్రజలకు వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మెగా సర్వేతో వైఎస్సార్సీపీ క్యాడర్ మరింత ఉత్సాహవంతమైంది. వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కలిసి సీఎం జగనన్న పాలనపై వారి అభిప్రాయాలను సేకరించింది. సీఎం జగన్ పాలనకు 1.1 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్ ద్వారా మద్దతు ప్రకటించారు. ఈ మెగా సర్వే పూర్తి వివరాలను పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు మీడియా సమావేశంలో వెల్లడించారు. సీఎం జగన్ పాలనపై 80 శాతం ప్రజల సంతృప్తి.. "జగన్ నాయకత్వం మీద రాష్ట్ర ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారు. ఇంత భారీ పబ్లిక్ సర్వే చేయడం ద్వారా వైఎస్సార్ సీపీ సాహసం చేసింది. ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే కార్యక్రమంతో చరిత్ర సృష్టించింది. ఈ సర్వేతో వైఎస్సార్ సీపీ రాజకీయంగా బలంగా ఉందని నిరూపించింది. ఈ మెగా సర్వే అన్ని రకాలుగా పారదర్శకంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టలేదు. తక్కువ సమయంలో ఈ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గ్రామస్థాయిలో కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్న వాస్తవాలు తెలుసుకున్నాము. ఇంత భారీ సర్వే చేయగలమా అనుకున్నాం కానీ సీఎం జగన్ నేతృత్వంలో విజయవంతం పూర్తి చేసాము. సర్వే ప్రారంభంలో మా అధినేత సీఎం జగన్ తన విజన్ ని నేతలకు పూర్తిగా వివరించడంతో దానికి తగినట్లుగా పనిచేసాము. ఈ సర్వేలో గత ప్రభుత్వం చేసిన పనితీరును మా ప్రభుత్వ పని తీరును గురించి ప్రజలని అడిగి తెలుసుకున్నాము. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా కూడా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీద ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నాం. మొత్తం ఆరు లెవల్స్ లో ఈ మెగా సర్వే పూర్తి చేసాము." అని రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు. 1.45 కోట్ల కుటుంబాల మద్దతుతో ఓ చరిత్ర "రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ మెగా సర్వేలో కకోటి 45 లక్షల కుటుంబాల మద్దతు సాధించి ప్రజల అభిప్రాయాలు తీసుకుని వైఎస్సార్ సిపీ ఓ చరిత్ర సృష్టించింది. 7 లక్షల మంది గృహసారథులు, నాయకల ద్వారా ఈ కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం అయ్యింది. ప్రజల్లో సీఎం జగనన్న ప్రభుత్వం మీద మంచి స్పందన వచ్చింది. ప్రజలు వారి భవిష్యత్తు కోసం మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. భావి తరాలు కూడా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సీఎం జగన్ తోనే సాధ్యం నమ్ముతున్నారు. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలకు ప్రజల స్వచ్చందంగా సమాధానాలు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఈ మెగా సర్వే ఫలితాలు ప్రదర్శిస్తాము. సిఎం జగన్ ఇచ్చే ప్రతి పథకం ప్రజలకి నేరుగా అందుతోంది." "చంద్రబాబు సంస్కార హీనుడిలా మాట్లాడటం సరికాదు. ప్రజల ఇష్టంతోన్ వారి ఇళ్లకు స్టిక్కర్ అంటించాము. అన్ని పార్టీల ప్రజలకి పథకాలు అందుతున్నాయి. మే 9 నుండి జగన్నన్నకి చెబుదాం అనే నూతన కార్యక్రమం కూడా ప్రారంభిస్తాము." అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. ప్రజా మద్దతు వైఎస్సార్సీపీకే.. "ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ ఇలాంటి కార్యక్రమం చేయలేదు. మెగా సర్వేతో ప్రజా మద్దత్తు వైఎస్సార్ సీపీకే ఉందని స్పష్టం అయ్యింది. సిఎం జగన్ పాలనకు 80 శాతం ప్రజలు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రతి గడపకి మా నాయకులు వెళ్లి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నారు. కాకినాడ, ఎన్టీఆర్, బాపట్ల, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలో సర్వే అద్భుతంగా జరిగింది. అవినీతి, వివక్ష లేని పాలనకు ప్రజలు మద్ధతుగా నిలిచారు.. ఇదే సర్వేలో స్పష్టమైంది. చంద్రబాబు ఇలాంటి సర్వే జీవితంలో ఎప్పుడైనా చేశారా. తాము 15 వేల సచివాలయల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించాము. సీఎం జగన్ చేస్తున్న మంచికి ప్రజల్లో ఆమోదం, సంతృప్తి ఉంది." అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వివరించారు. 22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలకు చేరువ "దేశంలోనే ఇలాంటి సర్వే చేసిన మొదటి ప్రభుత్వం మాది. గతంలో 40 ఏళ్ళు అనుభవం అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. సీఎం జగనన్న చెప్పే మాటకు చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా సైన్యం సిద్ధంగా ఉంది. కేవలం 22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలను కలిసాము.ఇలాంటి కార్యక్రమం చేసే దమ్ము చంద్రబాబుకి ఉందా.. కులం, మతం అతీతంగా వైసీపీ పాలన చేస్తోంది. ఈ మాట చంద్రబాబు ఒక్కసారైనా తన ప్రభుత్వ హయాంలో చెప్పగలిగారా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెగా సర్వేను విజయవంతం చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం." అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజా మద్దతు పుస్తకం ప్రజాభిప్రాయానికి ప్రతీక. "ఇలాంటి ఆలోచన దేశంలో ఎలాంటి సీఎంకి రాలేదు. ప్రజలోకి నేరుగా వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీద అభిప్రాయం తీసుకున్నాము. ప్రజా మద్దతు పుస్తకం ద్వారా ప్రజలు అభిప్రాయం చెప్పారు. కులం, మతం చూడకుండా ఓటు వేయని వారికీ కూడా లబ్ది చేకూరుతోంది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజలను ఈ సర్వేలో కలిసాము. చంద్రబాబు లాగా గాల్లో లెక్కలు వైఎస్సార్ సీపీ ఎన్నటికీ చెప్పదు. సీఎం జగనన్న పరిపాలన మీద ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టే జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేను ప్రజలు విశేష స్థాయిలో అందరించారు." అని విజయవాడ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ వివరించారు. చదవండి: రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన లక్ష్మీపార్వతి -
రాజకీయ పార్టీలకు అతీతంగా పాలన చేస్తున్న ఘనత సీఎం జగన్ దే
-
‘విజన్ ఉన్న నాయకుడు సీఎం జగన్’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రతీ కుటుంబాన్ని కలిసినట్టు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కోటి లక్షల కుటుంబాలను కలుసుకున్నామని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ కోటి 10లక్షల మిస్ట్ కాల్స్ వచ్చాయి. 80శాతం మంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ప్రజలంతా జగన్‌కు జేజేలు పలుకుతున్నారు. చంద్రబాబు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. రజనీకాంత్‌కు ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసు?. ఎవరో రాసిచ్చిన స్స్ర్కిప్ట్ చదవడం సినిమా వాళ్లకు అలవాటే. చంద్రబాబు విజన్ అనేది కల్పిత కథ. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తొస్తారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి 80శాతం ప్రజల మద్దతు ఉంది. డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 99శాతం హామీలు అమలు చేశాం కాబట్టే మమ్మల్ని నమ్ముతున్నారు. ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. విజన్ ఉన్న నాయకుడు సీఎం జగన్. మెగా పీపుల్స్ సర్వేలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కోటి 45 లక్షల కుటుంబాలకు కోటి 10లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయి. సీఎం జగన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనం. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ప్రజలంతా సీఎం జగన్ పాలనపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజా మద్దతు పుస్తకంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. చంద్రబాబులా గాలిలో లెక్కలు చెప్పడం లేదు. వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలంతా జగన్ననే మా భవిష్యత్ అంటున్నారు. చంద్రబాబు కనీసం సర్వే ఆలోచన కూడా చేయలేదు. కుల, మత, రాజకీయాలకతీతంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారు. అందుకే ప్రజల నుంచి ఈ స్థాయిలో మద్దతు వచ్చింది. ఇది కూడా చదవండి: థాంక్యూ సీఎం సార్.. మీ సాయంతో అంతరిక్షం అందుకుంటున్నా -
ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ కోటిమందికి పైగా మిస్డ్ కాల్స్ ఇచ్చారు
-
అపూర్వ స్పందన: ఇంటింటా జన నీరాజనం.. జగనన్నే మా భవిష్యత్తు.. (ఫొటోలు)
-
గడప గడపలో అదే పిలుపు, అదే నమ్మకం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ (ఫొటోలు)
-
ప్రతి ఇంటా అదే ఆదరణ..‘జగనన్నే మా భవిష్యత్’ (ఫొటోలు)
-
జనం జేజేలు.. ‘జగనన్నే మా భవిష్యత్’కు విశేష స్పందన (ఫొటోలు)
-
‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్‌కు అపూర్వ స్పందన
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. సోమవారం(24-04-2023) ఏడో రోజు సైతం ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్‌కు ప్రతీ ఇంటా విశ్వాసం వ్యక్తమైంది. -
‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం.. విశేష మద్దతు
వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా మెగా పీపుల్స్ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోంది. ఆదివారం(23-04-2023) నాటి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి ప్రజలు విశేష మద్దతు పలికారు. -
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
-
మా నమ్మకం నువ్వే జగనన్న.. ప్రతీ ఇంటా ఇదే నినాదం (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి: 14 రోజుల్లో కోటికి పైగా కుటుంబాల్లో సర్వే నిర్వహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. కోటి మార్క్‌ను దాటడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జగన్, చంద్రబాబు పాలన తేడాను వివరిస్తూ గృహ సారథులు సర్వే చేస్తున్నారు. మ్యానిఫెస్టో అమలు తీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాగా, ఏపీలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి ఊళ్లోనూ సందడి నెలకొంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు.. సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటింటికీ వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. ఏప్రిల్ 19 నాటికి 70 లక్షల మంది 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. చదవండి: ఇటు పునాది రాళ్లు-అటు సమాధి రాళ్లు -
మా ఆఖరి శ్వాస వరకు సీఎం జగన్ వెంటే ఉంటాం..
-
ఏపీ: జగనన్నే మా భవిష్యత్తుకు జనం జేజేలు (ఫొటోలు)
-
‘జగనన్నే మా భవిష్యత్తు’ పొడిగింపు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఓ యజ్ఞంలా కొనసాగుతున్న ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని.. పొడిగించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకుంది. ప్రజల నుంచి దక్కుతున్న విశేష స్పందనతో కార్యక్రమానికి ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఈనెల 20తోనే ముగించాలనుకుంది. అయితే.. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. దీంతో.. షెడ్యూల్‌ను మరో తొమ్మిది రోజులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం మొదలైంది. అప్పటి నుంచి ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరు సర్వత్రా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు 84 లక్షల కుటుంబాల సర్వే పూర్తి అయ్యింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతుగా 63 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఇదీ చదవండి: ‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’ -
క్షేత్రస్థాయి సైనికులను కలుసుకోవడం ఆనందదాయకం.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: సచివాలయాల్లోని ప్రతి ఇంటిని అవిశ్రాంతంగా సందర్శించి.. రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి సందేశాన్ని ప్రతి గడపకూ తీసుకెళ్లిన తమ సైనికుల్లో కొందరిని కలుసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సచివాలయ కన్వీనర్లు మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం తనను కలిసిన వారి ఫొటోలను జత చేసి సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అంకితభావంతో పనిచేసే క్షేత్ర స్థాయి సైనికులను కలుసుకోవడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఇది గర్వకారణమన్నారు. It was a pleasure meeting some of our dedicated grassroots soldiers, who have tirelessly visited every household in their Sachivalayams, taking our message of progress and development to every doorstep. Proud of our @YSRCParty Kutumbam! pic.twitter.com/b818JK0EKM — YS Jagan Mohan Reddy (@ysjagan) April 18, 2023 -
'జగనన్నే మా భవిష్యత్తు' క్యాంపెయిన్.. భారీ స్పందన (ఫొటోలు)
-
Jagan Anne Ma Bhavishyat: ప్రభుత్వానికి మద్దతుగా 59 లక్షల మిస్డ్ కాల్స్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్నే మా భవిష్యత్తు' మెగా పీపుల్స్ సర్వేకు భారీ స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన 11 రోజులకు 78 లక్షల కుటుంబాల సర్వే పూర్తయ్యాయి. సీఎం జగన్ పాలనకు మద్దతుగా ఇప్పటి వరకు 59 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. అయితే కిందటి పోలిస్తే తాజాగా 5 లక్షల కుటుంబాల సర్వే, 4 లక్షల మిస్డ్ కాల్స్ పెరిగాయి జగ్గయ్యపేట పట్టణ 31వ వార్డు శాంతినగర్‌లో జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, కేడీసీసీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, కౌన్సిలర్ వెంకట్రావు, నంబూరు రవి, అప్పారావు ,సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు, వాలంటీర్లు పాల్గొన్నారు. కాగా ప్రజలే ప్రభుత్వంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దతు పలుకుతున్నారు. గత 46 నెలలుగా సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న సుపరిపాలన గురించి ప్రతిఇంటా జగనన్న సైన్యం వివరిస్తోంది. చదవండి: మార్గదర్శిపై 17 ఏళ్ల న్యాయ పోరాటంలో కీలక మలుపు ఇది: ఉండవల్లి -
ఇంటింటా అభిమానం.. 55 లక్షల కుటుంబాల ప్రజలు మిస్డ్కాల్స్
సాక్షి, అమరావతి/పాణ్యం (నంద్యాల): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. 11వ రోజు సోమవారం కార్యక్రమానికి కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, సచివాలయాల కన్వీనర్లు, వలంటీర్లు, గృహ సారథులకు ప్రతిఇంటా ఆ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. గత 46 నెలలుగా సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న సుపరిపాలన గురించి ప్రతిఇంటా జగనన్న సైన్యం వివరించింది. టీడీపీ సర్కార్‌కూ.. జగన్ ప్రభుత్వానికి మధ్యనున్న తేడాలను వివరిస్తూ కరపత్రాలు అందించారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసంచేశారని.. సీఎం జగన్ వైఎస్సార్ ఆసరా పథకం కింద ఆ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించి మాట నిలబెట్టుకున్నారని అక్కచెల్లెమ్మలు జగనన్న సైన్యానికి వివరించారు. ఇక జన్మభూమి కమిటీలోని టీడీపీ నేతలకు లంచం ఇచ్చినా అప్పట్లో పింఛన్ మంజూరు చేసేవారు కాదని.. సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చాక ఎవరి వద్దకు వెళ్లకుండానే.. లంచాలకు అతీతంగా పింఛన్ మంజూరు చేశారన్నారు. అలాగే, ప్రతినెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే వలంటీర్ వచ్చి రూ.2,750ల చొప్పున పింఛన్ అందిస్తూ ఆదుకుంటున్నారని అవ్వాతాతలు ప్రశంసించారు. ఏ నోట విన్నా ఇదే మాట. మళ్లీ వైఎస్సార్సీపీనే గెలిపించి.. సీఎంగా వైఎస్ జగన్నే చేసుకుంటామని.. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ నినదించారు. పొలమంతా ‘అభిమానం’ నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని కందికాయపల్లె గ్రామానికి చెందిన బిరవోలు శివ అనే రైతు తన ఎడ్లకు సీఎం వైఎస్ జగన్ స్టిక్కర్ అతికించి పొలాన్ని దున్నడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల గ్రామంలో ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమంలో భాగంగా గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు పర్యటించారు. రైతు ఇంటి బయట స్టిక్కర్ అతికించేందుకు శివ అనుమతి కోరగా.. అభిమాన నాయకుని ఫొటో బయటకాదని, ఇంట్లో ఉండాలనడం విశేషం. వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబం కావడంతో మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు రైతుభరోసా కింద ఏటా రూ.13,500 తన ఖాతాలో జమవుతోందన్నారు. పంటనష్టం కింద కూడా డబ్బు జమవుతోందని.. భార్య పొదుపు గ్రూపులో ఉండటంతో ఆసరా కింద డబ్బులు వస్తున్నాయన్నాడు. తల్లికి చేయూత ద్వారా సాయం అందిందని సంతోషం వ్యక్తంచేశాడు. ఎవ్వరినీ అడగకుండా, ఎక్కడికి వెళ్లకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ అంటే తమ కుటుంబానికి ప్రాణమన్నాడు. అందుకే వ్యవసాయంలోనూ ఆయన తోడుగా ఉన్నట్లుగా భావించేందుకు ఎడ్లకు స్టిక్కర్లు అతికించుకున్నట్లు శివ తెలిపాడు. చదవండి: నోటీసులిచ్చి అరెస్టులా? 73 లక్షల కుటుంబాలతో మమేకం మరోవైపు.. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పదోరోజు ముగిసే నాటికి అంటే ఆదివారానికి జగనన్న సైన్యం 73 లక్షల కుటుంబాలను నేరుగా కలిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయాల కన్వీనర్లు, గృహసారథులు నిర్వహిస్తున్న మెగా ప్రజాసర్వేలో జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 55 లక్షల కుటుంబాల ప్రజలు 82960–82960 నెంబర్‌కు మిస్డ్కాల్స్ ఇచ్చారు. గృహ సారథులను అడిగి మరీ వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్లను తీసుకుని.. ఇంటి తలుపులకు, మొబైల్ ఫోన్లకు అతికించుకుని అభిమానాన్ని చాటుకుంటున్నారు. -
‘జగనన్నే మా భవిష్యత్తు’ మెగా పీపుల్స్ సర్వే అనూహ్య మద్దతు (ఫొటోలు)
-
Jagan Anne Ma Bhavishyat: ప్రభుత్వానికి మద్దతుగా 55 లక్షలకుపైగా మిస్డ్ కాల్స్
సాక్షి, తాడేపల్లి: ప్రజలే ప్రభుత్వంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దతు పలుకుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా మెగా పీపుల్స్ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. తమ ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని ఊళ్లలో మేళతాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాలు మొదలు పట్టణాల వరకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ నినాదం మార్మోగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల కుటుంబాల సర్వే పూర్తయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా 55 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. చదవండి: కన్నతల్లి లాంటి ఏపీని విమర్శిస్తే పవన్‌కు బాధ లేదా?: పేర్ని నాని -
‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం.. ప్రతి ఇంటా విశేష మద్దతు
-
‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన (ఫొటోలు)
-
జగనన్నే మా భవిష్యత్తు.. ఇది చారిత్రాత్మక ప్రజా మద్దతు
సాక్షి, తాడేపల్లి: గత చంద్రబాబు పాలనకు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకూ ఉన్న తేడాను ప్రజలు గమనించారని, అందుకే ప్రజలంతా మా భవిష్యత్తు నువ్వే జగన్ అంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏడు లక్షల మంది సైన్యం అక్కాచెల్లెమ్మల ఇళ్లకు వెళ్లగా.. వారంతా ఎంతో అభిమానంతో మెగా సర్వేకు సహకరిస్తున్నారని చెప్పారు. వారం రోజుల్లో 63 లక్షల కుటుంబాల సర్వే చేయగా.. సీఎంకు మద్దతు తెలుపుతూ 47 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయని వెల్లడించారు. ఇది ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకమని, ఇదొక చారిత్రాత్మక ప్రజామద్దతుగా పేర్కొన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని మ్యానిఫెస్టోలో పెట్టడంతో పాటు అవన్నీ పరిష్కరిస్తున్నారని కొనియాడారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. గణాంకాలతో ప్రజలకు జరిగిన మేలును వివరిస్తున్నామన్నారు. మాకు ఓటు వేయని వారికి కూడా సాయం చేశామని, అందరికీ మేలు చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు. టీడీపీ కోటలు బద్దలు అవుతున్నాయి.. ఏడు లక్షల మంది సైనికులు చేస్తున్న సర్వేలో అదే తేలుతోందని స్పష్టం చేశారు. కరోనా వలన ఆర్ధిక సమస్యలు వచ్చినా ఏపీ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందని.. సీఎం జగన్ సువర్ష పాలనలోనే ఇది సాధ్యం అయిందని చెప్పారు. -
జగనన్నే మా భవిష్యత్తుకు విశేష స్పందన.. 43 లక్షల మిస్డ్ కాల్స్...
సాక్షి, నెల్లూరు: ప్రజాసంక్షేమాన్ని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు. సీఎం జగన్ పథకాలతో లబ్ధి పొందుతున్నాం అని ప్రజలు అంటున్నారని తెలిపారు. 'జగనన్నే మా భవిష్యత్తు ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. సొంతింటి కలను సాకారం చేశారంటు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటి వద్దే పింఛన్ అందిస్తూ బాసటగా నిలిచారని అవ్వాతాతలు చెబుతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ అన్ని వర్గాల ప్రజలు నినదిస్తున్నారు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ 43 లక్షల కుటుంబాలకు పైగా మిస్డ్ కాల్స్ ఇచ్చాయి.' అని మంత్రి కాకాణి పేర్కొన్నారు. చదవండి: కేంద్రం తీరుపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆగ్రహం.. నిరసనగా సింహాచలం వరకు పాదయాత్ర -
‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్‌కు అపూర్వ స్పందన (ఫొటోలు)
-
‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన
తాడేపల్లి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం ఏడోరోజు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రతి ఇంటా విశ్వాసం వ్యక్తమైంది. ఈ కార్యక్రమం ఏడో రోజు ముగిసే సమయానికి 55 లక్షల కుటుంబాల సర్వే పూర్తి కాగా, జగన్ ప్రభుత్వానికి మద్దతుగా 45లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. -
‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం.. ప్రతి ఇంటా విశ్వాసం (ఫొటోలు)
-
తిరుపతిలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
-
ప్రజల నుంచి విశేష స్పందన.. ‘మా నమ్మకం నువ్వే జగన్’ (ఫొటోలు)
-
జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన
-
గ్రామగ్రామాన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
-
‘జగనన్నే మా భవిష్యత్తు’.. అడిగి మరీ తీసుకుని ఇళ్లకు, ఫోన్లకు స్టిక్కర్లు..
సాక్షి, అమరావతి: గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా చేస్తున్న మేలును ఇంటింటా వివరించి.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావారణంలో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 15,004 సచివాలయాల పరిధిలో 1.65 కోట్ల కుటుంబాల్లోని ఐదు కోట్ల మందిని నేరుగా కలవడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, సచివాలయాల కన్వీనర్లు, వలంటీర్లు, గృహసారథులకు ప్రతి ఇంటా ఆ కుటుంబ సభ్యులు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ పాఠశాలలను ‘నాడు–నేడు’ ద్వారా కార్పొరేట్ బడులకు దీటుగా అభివృద్ధి చేసి.. ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టి.. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా తమ పిల్లల భవితకు బంగారు బాటలు వేసిన జగనన్నే మా భవిష్యత్తు అంటూ ముక్తకంఠంతో అక్కాచెల్లెమ్మలు నినదిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కలమల్ల గ్రామంలో ప్రజలతో మాట్లాడి బుక్‌లెట్‌లోని ప్రశ్నలకు జవాబులు నమోదు చేస్తున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేస్తే.. వాటిని వడ్డీతో సహా నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా ద్వారా చెల్లిస్తానని ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకుంటూ ఇప్పటికే మూడు విడతలు డబ్బులను ఖాతాల్లో వేశారని అక్కచెల్లెమ్మలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 8296082960 నంబర్‌కు పోటీలు పడి మిస్డ్ కాల్ ఇచ్చిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు.. మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలంటూ ఆశీర్వదించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. నాలుగు రోజుల్లో 39 లక్షల కుటుంబాలను కలిస్తే.. అందులో 28 లక్షల మంది ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ మిస్డ్ కాల్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల ప్రజలు సీఎం వైఎస్ జగన్‌తోనే ఉన్నారని స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా సర్వేకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం నాలుగో రోజు అంటే సోమవారం ముగిసేసరికి 39 లక్షల కుటుంబాలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, వలంటీర్లు, గృహసారథులు కలిశారు. ప్రజా మద్దతు పుస్తకంలో స్లిప్పుల్లోని ఐదు ప్రశ్నలను చదివి.. టీడీపీ సర్కార్‌కూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాలను వివరించారు. చంద్రబాబు సర్కార్ హయాంలో ఇంటి స్థలం కావాలన్నా.. పెన్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలకు లంచాలు ఇచ్చుకున్నామని.. అయినా సరే పథకాలను తమకు మంజూరు చేయలేదని అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఎవరి దగ్గరికి వెళ్లకుండా, ఒక్క రూపాయి లంచం కూడా ఇవ్వకుండా పథకాలు అందుతున్నాయని కొనియాడారు. చదవండి: టిడ్కో ఇళ్ల పరిశీలన అంటూ ప్రకటన.. మచిలీపట్నం టూర్‌కు బాబు వెనుకడుగు సోమవారం నాటికి 28 లక్షల మంది ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 8296082960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చారు. మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ రాగానే సంతోషంతో కేరింతలు కొట్టారు. సీఎం వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్లర్లను గృహసార«థుల వద్ద అడిగి మరీ తీసుకుని.. ఇంటి తలుపులకు, మొబైల్ ఫోన్లకు అతికించుకుని సంబరపడిపోయారు. -
ఇంటింటా సంక్షేమం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ (ఫొటోలు)
-
Jagananne Maa Bhavishyathu: ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్‌కు విశేష స్పందన (ఫొటోలు)
-
మళ్ళీ జగనన్నే రావాలి
-
జగనన్నే మా భవిష్యత్ ప్రోగ్రాం ఎట్ విజయవాడ
-
జగనన్నవల్లే నా భర్త ప్రాణాలు కాపాడుకోగలిగాను
-
ఇది వరకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది అంటూ మహిళా భావోద్వేగం
-
ఊరూవాడ ‘జగనన్నే మా భవిష్యత్తు’ (ఫొటోలు)
-
జగనన్నే మా భవిష్యతుకు మద్దతుగా విద్యార్థుల భారీ ర్యాలి
-
దేవుడి గదిలో సీఎం జగన్ ఫోటో
-
‘జగనన్నే మా భవిష్యత్తు’.. ఇంటింటా సందడి
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. తమ ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని ఊళ్లలో మేళతాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. ‘ఎమ్మెల్యే వద్దకు ప్రజలు వెళ్లడం మామూలే.. అందుకు విరుద్దంగా ప్రజల వద్దకే ఎమ్మెల్యే రావడం అంటే అది కేవలం ఒక్క జగనన్న వల్లే సాధ్యమైంది’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏ మేరకు లబ్ధి కలిగిందో ప్రజలే ఆనందంగా నేతలకు వివరిస్తుండటం ఊరూరా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్ పలు విధాలా తమను ఆదుకుంటున్నారని, ఇలా ఆదుకుంటుండటం కొంత మంది పెత్తందారులకు గిట్టడం లేదని అక్కచెల్లెమ్మలు నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత మంచి పనులు చేస్తుంటే సంతోషించాల్సింది పోయి దుష్ప్రచారం చేయడం దుర్మార్గం అని, వారంతా బాగు పడరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, ఎల్లోమీడియా ఎన్ని అబద్ధాలు చెప్పినా.. వాటిని నమ్మే ప్రసక్తే లేదని.. తిరిగి జగనన్ననే మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని ప్రతినబూనుతున్నారు. ‘వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, రైతుల బాగు కోసం సీఎం జగన్ తీసుకున్నన్ని చర్యలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ సీఎం కూడా తీసుకోలేదు. ఈ నాలుగేళ్లలో చేపట్టిన సంస్కరణలు ఆషామాషీ కాదు. వీటి ఫలితాలు ఎంతటి సంచలనాలు సృష్టిస్తాయో ముందు ముందు తెలుస్తుంది. 85–87 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చడమంటే మాటలా! అందువల్లే ఇంత ధైర్యంగా ఇంటింటికి ఆయన ప్రతినిధులుగా ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు’ అని తిరుపతికి చెందిన వెంకటయ్య వ్యాఖ్యానించారు. ‘సీఎం జగనే లేకపోయుంటే మా పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదో ఊహించలేం’ అని అనంతపురానికి చెందిన శ్రీదేవి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాణి పేర్కొంది.గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరిద్దామనుకున్న నేతల కంటే ప్రజలే ముందుగా స్పందిస్తూ గత చంద్రబాబు పాలను తూర్పారబడుతున్నారు. తామంతా జగన్ వేంటేనని, ఆరు నూరైనా తిరిగి వైఎస్ జగనే సీఎం అవ్వడం ఖాయం అని స్పష్టం చేస్తున్నారు. అన్ని వర్గాలకూ న్యాయం చేశారు ‘జగనన్నే మా భవిష్యత్తు’ మూడో రోజు కార్యక్రమం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే ప్రారంభమైంది. అన్ని వర్గాల ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా వినిపించింది. చెప్పింది చెప్పినట్లు చేస్తున్నందు వల్లే ‘జగనన్నే మా భవిష్యత్’ అని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో తమకు అండదండగా నిలిచారని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి మళ్లీ సీఎం జగన్‌కే తమ మద్దతు అని చెబుతున్నారు. స్వచ్ఛందంగా అభిప్రాయం ప్రజా సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో స్లిప్పులలోని ఐదు ప్రశ్నలను గృహ సారథులు వినిపించినప్పుడు.. వైఎస్ జగన్ ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరిగిందని, మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలంటూ ప్రజలు సమాధానం చెబుతున్నారు. వాటిని నమోదు చేయించి, రసీదు తీసుకుంటున్నారు. ఆ తర్వాత గృహ సారథులు అడగక ముందే.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తున్నారు. ఆ వెంటనే.. ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గృహ సారథుల వద్ద నుంచి వైఎస్ జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్లను తీసుకుని, ఇంటి తలుపునకు, మొబైల్ ఫోన్‌కు అతికించి.. ‘జగనన్నే మా భవిష్యత్’ అంటూ నినదించారు. ఇలా ఊరూరా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు వ్యక్తం అవుతోంది. 15 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ ప్రారంభమైంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వీనర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వలంటీర్లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్రత్యేకమైన కిట్ బ్యాగ్‌లు అందజేశారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు. ఇదిలా ఉండగా ’మెగా పీపుల్స్ సర్వే’కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా మద్దతు పుస్తకంలో 21 లక్షలకు పైగా కుటుంబాలు పాల్గొన్నాయి. తొలి రెండు రోజుల్లోనే 82960–82960 నంబర్‌కు 15 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. -
మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజల నినాదాలు
-
జగన్ అంటే అంతులేని అభిమానం..
-
జగనన్నే మా భవిష్యత్తు.. మూడో రోజూ అదే జోరు
నెల్లూరు జిల్లా: ►సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, మనుబోలు, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాల్లో జగనన్నే మా భవిష్యత్తు, మానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో పాల్గొన్న గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు వైఎస్సార్సీపీ నాయకులు ►ప్రతి ఇంటికి వెళ్లి బుక్ లెట్, స్టికర్ అందించి సీఎం జగన్ స్టిక్కర్లను ఇళ్ల కు అంటించిన గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా విన్పిస్తోంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 7వ తేదీన ప్రారంభమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. తొలి రోజు మెగా పీపుల్స్ సర్వేలో 10 లక్షల కుటుంబాలు పాల్గొన్నాయి. ఏకంగా 8 లక్షల మంది సీఎం వైఎస్ జగన్‌కు మద్దతు తెలుపుతూ 82960 82960 నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చారు. మొత్తం 175 నియోజకవర్గాల్లోని 15 వేల సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమానికి విజయవంతంగా శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల ప్రజా రంజక పాలన గురించి మరోసారి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య గల తేడాను వివరించి చెబుతున్నారు. ఇంకా ఎక్కడైనా అర్హులు మిగిలిపోయి ఉంటే వారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందించేలా అడుగులు ముందుకు వేస్తున్నారు. -
జగన్ అంటే అభిమానం, అంత కంటే మించి ప్రాణం
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే మా భవిష్యత్తు అంటున్నారు జనాలు.. పేద ప్రజల బతుకులకు ఒక భరోసా ఇచ్చి.. ‘కుల, మత, పార్టీలకు అతీతంగా గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ఎంతో మేలు చేస్తున్నారు సీఎం జగన్. సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా వినిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేదల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన దానికంటే ఎక్కువగానే మేలు చేస్తున్నారు. పైసా అవినీతి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే 5 గంటలకే నిద్రలేపి మరి పింఛను ఇస్తున్నారు. ‘నా మనవడు జగనయ్య మా కోసం వలంటీర్లను పెట్టారు. ఇంటి వద్దకే పింఛన్ పంపిస్తున్నారు. మా మనవడు చల్లగా ఉండాలయ్యా’ అంటూ వృద్ధులు దీవిస్తున్నారు. చదవండి: జగనన్న కాలనీలు చూద్దాం వస్తావా బాబూ..? -
‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం.. 2వ రోజు అప్డేట్స్
Updates పశ్చిమగోదావరి జిల్లా: ►నరసాపురం పట్టణం 8,9 వ వార్డు లలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె వెంకటరమణ ఏలూరు జిల్లా: ►కైకలూరు మండలం పెంచికలమర్రు గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ ఎన్టీఆర్ జిల్లా : ►తిరువూరు పట్టణంలోని ఒకటో వార్డులో "జగనన్నే మా భవిష్యత్తు- నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమంలో గృహసారథులు సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి తిరుపతి జిల్లా: ►"జగన్ అన్నే మా భవిష్యత్తు" కార్యక్రమంలో భాగంగా పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామంలో ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమం పథకాలను వివరిస్తూ, తలుపులకు, ఫోన్ లకు జగనన్న స్టిక్కర్ లను అతికించి, సర్వే నిర్వహించిన స్ధానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, పార్టీ శ్రేణులు, వాలంటీర్లు గృహసారథులు, సచివాలయం కన్వీనర్లు తిరుపతి జిల్లా: ►కొర్లగుంట మారుతీ నగర్ లో కొనసాగుతున్న ఎమ్మేల్యే భూమన కరుణాకర్ రెడ్డి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ►ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పై లబ్ధి దారులనుంచి వివరాలు సేకరిస్తు ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తున్న ఎమ్మెల్యే భూమన మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ లను ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం లబ్ధి దారులు సంతోషంగా అతికిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా: చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెం గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు నెల్లూరు జిల్లా: ఇందుకూరుపేట (మం) కొత్తూరులో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.. ►ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రెండో రోజు ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం ప్రారంభమైంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వినర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. ►దీనికి సంబంధించి వారికి ప్రత్యేకమైన కిట్ బ్యాగ్‌లు అందచేశారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు. ►గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 14 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు నిర్వహించాయి. తొలి రోజు ఘనమైన ఆహ్వానం ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు.. ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకాలు.. మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్షగా ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేయాలని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఆశీర్వచనాలు.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంటి తలుపు, మొబైల్ ఫోన్‌కు వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్లను అతికించుకోవడానికి పోటీ పడ్డ అక్కచెల్లెమ్మలు.. 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి, మద్దతు తెలిపిన వెంటనే సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ రావడంతో కేరింతలు.. వెరసి మా నమ్మకం నువ్వే జగన్.. అంటూ నినాదాలు.. ఇదీ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి తొలి రోజున వచ్చిన స్పందన. ప్రతి ఇంటా ఎదురేగి ఆహ్వానం సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా విన్పించింది. గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో తమకు అండదండగా సీఎం వైఎస్ జగన్ నిలుస్తున్నారని అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో స్లిప్పులలోని ఐదు ప్రశ్నలను గృహ సారథులు వినిపించినప్పుడు.. వైఎస్ జగన్ ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరిగిందని, మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలంటూ సమాధానాలు చెప్పి.. వాటిని నమోదు చేయించి, రసీదు తీసుకున్నారు. రసీదు తీసుకున్నాక గృహ సారథులు అడగక ముందే.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. గృహ సారథుల వద్ద నుంచి వైఎస్ జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్లను తీసుకుని.. ఇంటి తలుపునకు, మొబైల్ ఫోన్‌కు అతికించి.. ‘జగనన్నే మా భవిష్యత్’ అంటూ నినదించారు. -
జగనన్నే మా భవిష్యత్తు
-
ఘనంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం (ఫోటోలు)
-
ఇంటింటా జన నీరాజనం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ ఘనంగా ప్రారంభం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు.. ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకాలు.. మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్షగా ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేయాలని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఆశీర్వచనాలు.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంటి తలుపు, మొబైల్ ఫోన్‌కు వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్లను అతికించుకోవడానికి పోటీ పడ్డ అక్కచెల్లెమ్మలు.. 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి, మద్దతు తెలిపిన వెంటనే సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ రావడంతో కేరింతలు.. వెరసి మా నమ్మకం నువ్వే జగన్.. అంటూ నినాదాలు.. ఇదీ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి తొలి రోజున వచ్చిన స్పందన. గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 14 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు నిర్వహించాయి. ప్రతి ఇంటా ఎదురేగి ఆహ్వానం సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా విన్పించింది. గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో తమకు అండదండగా సీఎం వైఎస్ జగన్ నిలుస్తున్నారని అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో స్లిప్పులలోని ఐదు ప్రశ్నలను గృహ సారథులు వినిపించినప్పుడు.. వైఎస్ జగన్ ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరిగిందని, మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలంటూ సమాధానాలు చెప్పి.. వాటిని నమోదు చేయించి, రసీదు తీసుకున్నారు. రసీదు తీసుకున్నాక గృహ సారథులు అడగక ముందే.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. గృహ సారథుల వద్ద నుంచి వైఎస్ జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్లను తీసుకుని.. ఇంటి తలుపునకు, మొబైల్ ఫోన్‌కు అతికించి.. ‘జగనన్నే మా భవిష్యత్’ అంటూ నినదించారు. 20వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం ‘జగన్నే మా భవిష్యత్తు’ పేరుతో భారీ ఎత్తున వైఎస్సార్సీపీ చేపట్టిన కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలల్లో 1.65 కోట్ల కుటుంబాల్లోని ఐదు కోట్ల మంది ప్రజలను సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా గృహ సారథులు, కన్వీనర్లు, వలంటీర్లు కలవనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభం గత టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ మరోసారి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ సంజీవ్ కుమార్ తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ’జగనన్నే మా భవిష్యత్తు’ మెగా పీపుల్ సర్వే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ‘1.65 కోట్ల ఇళ్లకి వెళ్లి ఈ సర్వే చేపడతాం. 7 లక్షలు మంది పార్టీ సైనికులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు ఈ సర్వే కోసం అందుబాటులో ఉంటారు. జగనన్న ప్రభుత్వానికి, గత టీడీపీ ప్రభుత్వానికి గల తేడాలను పోల్చి చెబుతారు’ అని తెలిపారు. ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘కుల, మత, పార్టీలకు అతీతంగా ఈ మెగా పీపుల్ సర్వే జరుగుతుంది. దేశంలో ఇలాంటి కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి. ఇంత వరకు ఇంత ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదు. తాను ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజాభిప్రాయం కోరటం మొదటిసారి ఏపీలోనే జరుగుతోంది’ అని అన్నారు. ఎంపీ ఎస్.సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో సీఎం జగన్ పేదల తరుపున యుద్ధం చేస్తున్నారు. సీఎం జగన్‌కు అందరూ అండగా ఉండి సామాజిక కుట్రలు తిప్పికొట్టాలి. ప్రజల నుంచి వచ్చిన ప్రధాన నినాదం ‘మా నమ్మకం నువ్వే జగన్’. అందుకే ఈ నినాదాన్ని ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా పెట్టాం. గత 46 నెలల్లో ప్రజల జీవితాల్లో, వారి జీవనశైలిలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం’ అని వివరించారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికే గడప గడపకూ తిరిగి జరిగిన అభివృద్ధి వివరించి చెబుతున్నాం. ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్తు పేరుతో మెగా పీపుల్స్ సర్వే కోసం ధైర్యంగా ప్రజల ముందుకు వెళుతున్నాం. ప్రతి తలుపు తడుతూ, ప్రతి గడప తొక్కుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరిస్తాం’ అని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో ఉత్సాహంగా.. ► రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆలూరులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కళ్యాణదుర్గం మండలం శీబావి గ్రామంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి ఉషశ్రీ చరణ్, వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పాల్గొన్నారు. ► గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పుంగనూరులోని భగత్‌సింగ్ నగర్ కాలనీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం పూడి గ్రామంలో మంత్రి ఆర్కే రోజా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించారు. ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాలన్నింటిలో కార్యక్రమం కొనసాగింది. అంతటా అదే ఉత్తేజం.. ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఒంగోలులోని గద్దలగుంటలో వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యర్రగొండపాలెంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌లు ప్రజల స్పందన తెలుసుకున్నారు. ► పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటలో మంత్రి అంబటి, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, చిలకలూరిపేట మండలం వేమూరులో మంత్రి విడదల రజని పాల్గొన్నారు. మాచర్లలో ర్యాలీ నిర్వహించారు. ► గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం ఘనంగా మొదలైంది. ఆయా కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ► బాపట్ల జిల్లా రేపల్లెలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు ప్రజలతో మమేకం అయ్యారు. వేమూరులో మంత్రి మేరుగ నాగార్జున కార్యక్రమంలో పాల్గొన్నారు. ► ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వ్యాప్తంగా శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఉత్సాహంగా మొదలైంది. ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లను ఇళ్ల గోడలు, తలుపులపై అంటించి ప్రజా మద్దతు కోరారు. పెడనలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడలో మాజీ మంత్రి వెలంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ► ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, తణుకులో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని ఇందిరమ్మ కాలనీలో హోం మంత్రి తానేటి వనిత, రాజమహేంద్రవరంలో ఎంపీలు మార్గాని భరత్‌రామ్, పిల్లి సుభాష్ చంద్రబోస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రామచంద్రాపురంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ► విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరులో డిప్యూటీ æసీఎం రాజన్నదొర, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం, పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నేతలు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లారు. ► అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మోడల్ కాలనీలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, తుమ్మపాల పంచాయతీ పరిధిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. విశాఖ నగరంలో పార్టీ ఎమ్మెల్యేలు, శ్రేణులు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాయి. ప్రజల స్పందన తెలుసుకునేందుకే : మంత్రి అంబటి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అందించిన సంక్షేమ పథకాలపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకునేందుకే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయని విధంగా.. ప్రజా స్పందన కోసం వారి వద్దకే వెళ్తున్నామని చెప్పారు. ‘నేను కూడా నకరికల్లు మండలం కుంకలగుంట, రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామాలలో పర్యటించాను. ప్రజల స్పందన సంతోషకరంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉంది. ప్రజల అనుమతితోనే తలుపుకు, సెల్ ఫోన్‌కు స్టిక్కర్ అంటిస్తున్నాం’ అని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం : మంత్రి రజిని జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వెళ్లి ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ఐదు అంశాలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని నమోదు చేసుకుంటారని తెలిపారు. గత ప్రభుత్వ అరాచకాలను, అప్పట్లో ప్రజలు పడిన ఇబ్బందులను, ప్రజలు ఎలా మోసపోయారో కూడా వివరిస్తారని చెప్పారు. నవరత్నాలు పేరుతో హామీలు ఇచ్చి, వాటిని అతి తక్కువ సమయంలో అమలు చేసి ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లేలా చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక్క జగనన్నే కనిపిస్తారని చెప్పారు. చిలకలూరిపేట నియోజకవర్గం వేదికగా ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: అక్కడ సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్ -
రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం
-
మళ్ళీ మా జగనన్న రావాలి అంటూ గుంటూరు మహిళలు..
-
ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నారు అది సీఎం జగన్ అంటే..
-
నెల్లూరులో జగనన్నే మా భవిష్యత్..నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమం
-
గుంటూరు బ్రాడీపేటలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
-
దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం జరగలేదు..
-
జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో మంత్రి రోజా
-
‘నారా లోకేష్, బాలకృష్ణ.. ఇద్దరూ జోకర్లే’
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ జోకర్లే అని అన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి బుర్ర లేదంటూ ఫైర్ అయ్యారు. కాగా, మల్లాది విష్ణు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లోంచి వచ్చిన కార్యక్రమమే జగనన్నే మా భవిష్యత్తు. ఏడాది ముందే ప్రజల ముందుకు వెళ్లగలిగే గట్స్ ఉన్న పార్టీ మాదే అని స్పష్టం చేశారు. ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో మిగిలిన పార్టీలున్నాయి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు. మేం చేసింది చెప్పడానికే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధిలో నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. విద్య, వైద్య రంగంలో సమూల మార్పులు తెస్తున్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక టీడీపీ నేతలు మాపై విమర్శలు చేస్తున్నారు. నారా లోకేష్, బాలకృష్ణ ఇద్దరూ జోకర్లే. అచ్చెన్నాయుడుకి అసలు బుర్ర ఉందా లేదా?. ఎవరో నలుగురు ఎమ్మెల్యేలు గడ్డితిన్నంత మాత్రాన అందరూ అలా ఉంటారనుకోవడం పొరబాటు. మా గురించి పక్కన పెట్టి ముందు మీపార్టీ గురించి ఆలోచించుకోండి. గన్నవరంలో రోడ్డు మీదే కొట్టుకున్నారు. చంద్రబాబు పర్యటిస్తే పంచాయతీ పెట్టేందుకు గుడివాడలో మీ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు అంటూ చురకలు అంటించారు. -
దేశ చర్రితలోనే ఇలాంటి కార్యక్రమం జరగలేదు: మంత్రి బొత్స
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి ప్రారంభమయ్యే ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ చర్రితలోనే ఇలాంటి కార్యక్రమం జరగలేదని స్పష్టం చేశారు. కాగా, మంత్రి బొత్స శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. 1.60 కోట్ల కుటుంబాలను సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు కలుస్తారు. నాడు-నేడు పాలనలో వ్యత్యాసాన్ని వివరిస్తారు. ఇంటింటికి స్టిక్కర్ అంటిస్తారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా ఎలాంటి పథకాలు అమలు చేయొచ్చో నిర్ణయం తీసుకుంటాం. దేశ చర్రితలోనే ఇలాంటి కార్యక్రమం జరగలేదు. ప్రజలతో మమేకమై సర్వే చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఐదు ప్రశ్నలతో వివరాలు సేకరించి ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తారు. ప్రభుత్వ పథకాలు నచ్చితే 82960 82960కి మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. వివక్ష, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో పథకాల కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేవారు. గతంలో జన్మభూమి కమిటీ అనుమతి లేనిదే పథకాలు వచ్చేవి కావు అని తెలిపారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ క్లోజ్ అన్నారు. చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉంటే వారి పేర్లు చెప్పాలి?. చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకమైనా గుర్తొస్తుందా?. కేరళలో విద్య బాగుంటుందని గతంలో చెప్పుకునేవారు. ఇప్పుడు దేశమంతా ఏపీ గురించి చెప్పుకుంటున్నారు. జనసేన ఒక సెలబ్రిటీ పార్టీ. జననేనను మేము రాజకీయ పార్టీగా భావించడం లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన
కృష్ణా జిల్లా ►పెడనలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు.. ►మా భవిష్యత్తు జగనన్నే అనేది ప్రజల ఆకాంక్ష: మంత్రి జోగిరమేష్ ►భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి కార్యక్రమాలను ఏపీలో సీఎం జగన్ చేస్తున్నారు ► బటన్ నొక్కగానే రైతులు , అక్కచెల్లెమ్మల అకౌంట్లలలోకి డబ్బులు జమ అయ్యేలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు ► ప్రతీ గడపకూ వెళ్లి ప్రభుత్వం పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నారో అడిగి తెలుసుకుంటాం. కర్నూలు. కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ కామెంట్స్ ► ప్రభుత్వ చేసినా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్తాం. ► ప్రతి గడప గడపకు ప్రభుత్వం మేలు గురించి తెలియజేస్తున్నాం. ► రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్నారు. ► ఒక్క వైపు సంక్షేమ, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ► చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ► వారి దుష్ప్రచారం తిప్పికొట్టేందుకు జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ► పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తీరు రౌడీ తరహాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ►నాలుగు సంవత్సరాలు చేసి సంక్షేమ పథకాలు అందించిన ప్రజలకు వివరిస్తూ సమస్యలను తెలుసుకుంటాం. ► కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారు. విజయవాడ ► ప్రజల గుండెల్లోంచి వచ్చిన కార్యక్రమమే ఈ జగనన్నే మా భవిష్యత్తు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ► 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ► ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో మిగిలిన పార్టీలున్నాయి. ► ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు. ► మేము చేసింది చెప్పడానికే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. పశ్చిమ గోదావరి ►తణుకు పట్టణంలోని 4వ వార్డులో జగనన్నే మాభవిష్యత్, నువ్వే మానమ్మకం జగన్ కార్యక్రమాన్ని మంత్రి కారుమూరి ప్రారంభించారు. గృహసారదులకు వాలంటరీలకు కార్యక్రమం విధి విధానాలను మంత్రి వివరించారు. పట్టణంలోని 4వ వార్డులో గృహ సారధులతో కలసి పలు ఇళ్లకు తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. చంద్రబాబు ప్రభుత్వానికి సీఎం జగన్ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు స్వయంగా తెలియజేశారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టాక రూపాయి అవినీతికి తావులేకుండా పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ►నిన్ననే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం మొదలు పెట్టాం, పేదప్రజలు దగ్గరకు నేరుగా డాక్టరే వెళ్లి వైద్యం చేయటం దేశ చరిత్రలో ప్రప్రథమమని మంత్రి పేర్కొన్నారు. ఏపీ లో జరుగుతున్నఅభివృద్ధిని ఇతర రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడ ఆదర్శంగా తీసుకొంటున్నారని పేర్కొన్నారు. ‘చంద్రబాబు.. కరువు కవలపిల్లలు చంద్రబాబు పాదం ఉన్నంతకాలం వర్షాలు పడవు పంటలు పండవు. సీఎం జగన్ రాగానే మేఘాలు కదిలాయి వర్షాలు వర్షించాయి. జగన్ సీఎం అయ్యాక ప్రకృతి కూడా పరవశించింది. పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. నాడు నేడులో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు’ అని తెలిపారు. ► జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి విశేష స్పందన: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ►టీడీపీ, జనసేన నేతల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ►రాష్ట్రంలో పాలనపై ప్రతి ఇంటికి వెళ్తున్న కన్వీనర్లు, గృహసారథులు కర్నూలు జిల్లా: ►ఆలూరులో మా నమ్మకం మీరే -జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాం ►చంద్రబాబు చేసిన మోసాలను,సీఎం జగనన్న చేసిన మంచి గడప గడప తీసుకెళ్తున్నాము. ►రాష్ట్రంలో ప్రతి ఇంటికి నవర్తన సంక్షేమ పథకాలు తీరును ఆడిగితెలుసుకుంటున్నాము. ►గత ప్రభుత్వాలు పాలన ఈ ప్రభుత్వ పాలన గురించి లబ్ధిదారులకు తెలియజేస్తున్నాము....మంత్రి గుమ్మనూరు జయరాం తిరుపతి జిల్లా: ►తిరుపతి జిల్లా చిల్లకూరులో ఎంపీడీఓ కార్యాలయంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ ప్రారంభించారు. ప్రతి ఇళ్లు తిరుగుతూ సీఎం జగన్‌ను మరోసారి ఆశీర్వదించాలని కోరుతూ మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు అంటించారు. ►వెంకటగిరిలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ►సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపు తిరుపతి జిల్లా : ►సూళ్లూరుపేట నియోజకవర్గం లో అట్టహాసంగా ప్రారంభమైన జగనన్నే మా భవిష్యత్..నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమం ►నాయుడుపేటలోని డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సూళ్లూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య ►కార్యక్రమంలో పాల్గొన్న ఆరుమండలాల వైసీపీ శ్రేణులు, జీసీఎస్ కన్వీనర్లు, గృహసారథులు పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం, నువ్వే జగన్ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు.. జగనన్నే మా భవిష్యత్తు - మా నమ్మకం నువ్వే జగన్ పామ్ ప్లేట్ ను ప్రతి ఇంటికి తీసుకెళ్లబోతున్నామని, ఈ పామ్ ప్లేట్లో వాస్తవాలను ప్రచురించడం జరిగిందని మంత్రి కొట్టుసత్య నారాయణ తెలిపారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు అయ్యాయో, ఎన్ని అవ్వలేదో అనేవి ప్రజల్ని వారి ఇంటి వద్దకే వెళ్లి అడగడం జరుగుతుందన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారో అడుగుతామని చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సాధికారత, గృహ నిర్మాణ లను ప్రాధాన్యంగా ఈ ప్రభుత్వం తీసుకుందన్నారు. ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని గుర్తు చశారు. వెన్నుపోటు దారుడు చంద్రబాబు. అటువంటి వ్యక్తిని అసలు నమ్మే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. ►జగనన్న మా భవిష్యత్తు,మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం పోస్టర్ ను పెద ఆమీరం పార్టీ కార్యాలయంలో విడుదల చేసిన డిసిసిబి చైర్మన్ పి వి ఎల్ నరసింహరాజు పశ్చిమగోదావరి జిల్లా: ►భీమవరం ఒకటో వార్డు మెంటే వారి తోటలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ►మెంటే వారి తోటలో ఇంటింటికి తిరుగుతూ డోర్ పోస్టర్లు అతికిస్తూ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు వివరిస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ►పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, వైయస్సార్ సిపి నాయకులు ,కార్యకర్తలు ఎన్టీఆర్ జిల్లా: ►మైలవరం లో జగనన్నే మా భవిష్యత్తు మానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, నియోజకవర్గ పరిశీలకుడు పడమటి సురేష్ బాబు. నెల్లూరు జిల్లా: ►కావలి 10వ వార్డులో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ►ఇంటింటికి వెళ్లి. అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా : ►తిరువూరు నియోజకవర్గ స్థాయిలో విసన్నపేటలోని నాలుగో వార్డ్ లో "జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని గృహ సారధులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ప.గో:జిల్లా: ►పాలకొల్లు మావుళ్ళమ్మ పేట లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ►పాల్గొన్న ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లె0 ఆనంద ప్రకాష్, జెడ్పీటీసీ గోవిందరాజుల నాయుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ ఏలూరు జిల్లా: ►కైకలూరు నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం నువ్వే జగన్, కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎలిజా కామెంట్స్ ►జగనన్న నువ్వే మా భవిష్యత్. కార్యక్రమం ఈరోజు నుంచి 20 తారీకు వరకు జరగుతుంది ►ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసి, గత తెలుగుదేశం ప్రభుత్వం లో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేస్తాం. కృష్ణా జిల్లా : ►ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి శ్రీకాకుళం ►శ్రీకాకుళంలోని సిపన్ నాయుడుపేటలోని జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పోస్టల్ ఇంటికంటే అంటిస్తున్న ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వైఎస్సార్ జిల్లా: డిప్యూటీ సీఎం అంజద్ బాషా కామెంట్స్.. ►జగనన్న నీవే మా భవిష్యత్ ఆన్న నినాదంతో కొత్త కార్యక్రమం చేపట్టాం ►అధికారంలో ఉండగా తమ ప్రభుత్వ పనితీరును ధైర్యంగా చెప్పి, వారికి అవగాహన కల్పించే సాహసోపేత నిర్ణయం ►కోటి 60 లక్షల కుటుంబాలను నేరుగా కలిసేందుకే ఈ జగనన్నే మా భవిషత్ కార్యక్రమం ►ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు ఇవేమీ అందుతున్నాయి.. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను గుర్తించేలా వైసిపి సైనికులు పనిచేస్తారు.. ►వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైనికులు, గృహ సారథులు, కన్వీనర్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను వివరిస్తారు ►పథకాల వివరాలతో కరపత్రం, స్టిక్కర్ అందిస్తారు. ►సంతృప్తి చెందితేనే నన్ను ఆశీర్వదించండి అని చెప్పిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్. కాకినాడ జిల్లా ►పిఠాపురం: చిత్రాడ గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. ►ప్రతి పేదవాడికి క్షేమ పథకాలు గత టిడిపి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధిని గుర్తించాలని ప్రజలను కోరిన.. ఎమ్మెల్యే దొరబాబు ►ప్రజల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్సార్ జిల్లా ►ప్రొద్దుటూరు మునిసిపాలిటీ లో జగనన్నే మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ►నేటి నుండి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం రానున్న ఎన్నికల వరకు కొనసాగుతుంది ►గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పతకాలు ఎంతవరకు అందాయని వివరించనున్న ఎమ్మెల్యే రాచమల్లు ►600 కోట్ల తో ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల ను వివరించనున్న ఎమ్మెల్యే రాచమల్లు ►పార్టీలకు అతీతంగా పేదరికం నే ప్రామాణికముగా ప్రభుత్వ సంక్షేమ పతకాలు అందించిన ముఖ్యమంత్రి ►ఈ కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ చైర్మన్ లక్ష్మీదేవి, ఆప్కోబ్ చైర్మన్ జాన్సీ,పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ విజయ లక్ష్మి, కౌన్సిలర్లు, వైఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తూరు ►పుంగనూరు మండలం భగత్ సింగ్ నగర్ కాలనీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ►ఇంటింటికి వెళ్లి జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమం ►నివాస గృహాలకు స్టిక్కర్లు అతికించిన మంత్రి పెద్దిరెడ్డితో పాటు పార్టీ నేతలు ►ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లాలి ►టిడిపి వైఎస్ఆర్సిపి పాలనకు ఉన్న వ్యత్యాసం వివరించాలి ►సీఎం జగన్ చేసిన మేలును వివరించాలి చిత్తూరు ►కార్వేటి నగర్ మండలంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పర్యటన ►జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమం ►అన్నమయ్య జిల్లా పీలేరు నియోజవర్గం వాల్మీకిపురం మండలంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ పాల్గొన్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ►విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జగనన్నే.. మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్.. కార్యక్రమం ప్రారంభం ►కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, వైసీపీ నేత కడియాల బుచ్చిబాబు తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ►ప్రజలవద్దకు వెళ్లే దమ్ము, ధైర్యం వైసీపీకే ఉన్నాయి ►ప్రతీ ఇంటికి వెళ్లి టీడీపీ చేసిన మోసం, వైసీపీ చేసిన సంక్షేమాభివృద్ధి మేము చెప్తున్నాం ►రాష్ట్రంలో ఏ ఇంటికి సీఎం జగన్ సైన్యం వెళ్లినా ఆశీర్వదించి పంపుతున్నారు ►సీఎం జగన్ పాలనలో సుభిక్షంగా ఉన్నామని చెప్తున్నారు ►లోకేశ్ పాదయాత్రలో విద్యార్థులను మధ్యాహ్న భోజనం బావుందా అని అడిగితే చాలబావుందని చెప్పారు ►విద్యార్థుల సమాధానం విని లోకేష్ మైండ్ బ్లాంక్ అయ్యింది ►రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది ►175నియోజకవర్గాల్లో సీఎం జగన్ నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తారు ►తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నూటికి నూరుశాతం గెలుస్తుంది ►విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ కొత్త రాజీవ్ నగర్ లో జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం నువ్వే జగన్" కార్యక్రమం ప్రారంభం ►పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సెంట్రల్ నియోజకవర్గం పరిశీలకులు కడవకొల్లు నరసింహారావు, గృహసారథులు, కన్వీనర్లు ,వాలంటీర్లు ►ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి ప్రారంభమయ్యే ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగనుంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వినర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. ►దీనికి సంబంధించి వారికి ప్రత్యేకమైన కిట్ బ్యాగ్‌లు అందచేశారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలివీ.. ► ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు, మీ కుటుంబానికి మంచి జరిగిందా? ►మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? ►.గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛన్, అమ్మ ఒడి, ఆసరా, చేయూత లాంటి అనేక పథకాల ద్వారా డబ్బులను నేరుగా మీ అకౌంట్లో వేయడం లేదా వలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? ► నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? ►జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా? కిట్ బ్యాగ్‌లో ఏముంటాయంటే.. ♦ ఒక్కో కిట్ బ్యాగ్‌లో 200 ఇళ్లకు సరిపడా సామగ్రి ఉంటుంది. ♦టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ రూపొందించిన 200 కరపత్రాలు ♦ ప్రజా మద్దతు పుస్తకాలు టమూడు పెన్నులు ♦ ఇద్దరు గృహ సారథులు, ముగ్గురు కన్వినర్లు ధరించేందుకు సీఎం జగన్ ఫొటోతో కూడిన ఐదు బ్యాడ్జీలు ♦సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉన్న 200 స్టిక్కర్లు ♦ సీఎం జగన్ ఫోటో ఉన్న 200 మొబైల్ ఫోన్ స్టిక్కర్లు కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటే.. ♦ ప్రతి ఇంటి వద్దకు ఇద్దరు గృహ సారథులు, వలంటీరు వెళతారు. టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను ఆ కుటుంబ సభ్యులకు వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని చదివి వినిపిస్తారు. తర్వాత కరపత్రాన్ని వారికి అందజేస్తారు. ♦ప్రజా మద్దతు పుస్తకంలో ప్రజా సర్వేకు సంబంధించి ఐదు ప్రశ్నలు ఉన్న స్లిప్పుపై కుటుంబ పెద్ద పేరు, ఫోన్ నంబర్ నమోదు చేస్తారు. ఆ తర్వాత ఐదు ప్రశ్నలను చదివి ఆయా కుటుంబాలు ఇచ్చే సమాధానాల ఆధారంగా అవును / కాదు అనే వివరాలను నమోదు చేస్తారు. స్లిప్పు కుడి వైపున ఉన్న రసీదును ఆ కుటుంబానికి ఇస్తారు. ♦వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిని 82960–82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతారు. మిస్డ్ కాల్ ఇచ్చిన నిముషంలోపే కృతజ్ఞతలు తెలియచేస్తూ సీఎం జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ ఆ కుటుంబానికి వస్తుంది. ♦ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి తలుపునకు సీఎం వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్ అతికించేందుకు అనుమతి కోరతారు. సమ్మతించిన వారి ఇంటి తలుపునకు స్టిక్కర్ అతికిస్తారు. అదే రీతిలో మొబైల్ ఫోన్‌కు స్టిక్కర్ అతికించి ధన్యవాదాలు తెలియచేస్తారు. ♦ ఈ కార్యక్రమం పూర్తయ్యాక ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన ప్రజా మద్దతు పుస్తకాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు. చదవండి: జనంలోకి జగనన్న సైన్యం -
ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేపటి నుంచి ఏడు లక్షల మంది గృహ సారథులు కోటి 60 లక్షల ఇళ్లకు వెళ్తారన్నారు. ‘‘మమ్మల్ని మా జగన్ అన్న పంపారు అని చెప్పి పది నిమిషాలు మాట్లాడతారు. జగన్ ఇచ్చిన మెసేజ్ వారికి అందించి వెళ్తారు. అన్ని కులాలు, మతాలు, ఇతర రాజకీయ కుటుంబాలను కూడా కలుస్తారు. గతంలో పాలన ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా జరుగుతోందో? వారి అభిప్రాయాలు తీసుకుంటారు. దేశంలో ఎవరూ చేయని కార్యక్రమం మేము చేస్తున్నాం. మీకు ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ సాయం అందితేనే తనకు ఓటేయమని జగన్ అంటున్నారు. ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు’’ అని సజ్జల అన్నారు. ‘‘ఏ నెలలో ఏ సంక్షేమం అందించబోతున్నది కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు. అప్పట్లో జన్మభూమి కమిటీ జలగలు ప్రజల్ని పీడించాయి. ఇప్పుడు లంచాలు లేకుండా అర్హతే ప్రమాణంగా సంక్షేమం అందిస్తున్నాం. గృహ సారథులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లినప్పుడు ఐదు ప్రశ్నలు వేస్తారు. వారి నుండి జగన్ పాలనపై అభిప్రాయాలు తెలుసుకుంటారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: ఆ తోడేళ్లవి ఎత్తులు, జిత్తులు, పొత్తులు, కుయుక్తులు: సీఎం జగన్ -
రేపటి నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం
నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యే ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్సీపీ. పార్టీ తరఫున సచివాలయ కన్వీనర్లతో పాటు వారి తర్వాత స్థాయిలో పనిచేసే గృహసారథుల నియామకం తర్వాత మొట్టమొదటి సారిగా ఒక భారీ పార్టీ కార్యక్రమంతో ప్రజలతో మమేకమవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పార్టీ నియమించిన ఈ రెండు వ్యవస్థలు (కన్వీనర్లు, గృహసారథులు) ఒక మిషన్ మోడ్‌లో బాధ్యతగా ఫోకస్డ్గా.. సుశిక్షితులైన సైనికుల్లా పనిచేస్తే ఎలా ఉంటుందనే విషయంపై దృష్టిసారించింది. పార్టీ పరంగా పనిచేసే వారు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి.. వాటిని తీర్చే బాధ్యతగల కార్యకర్తలున్న రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుందన్నది నిరూపించాలనేది తమ ప్రయత్నం. అలాగే, ప్రభుత్వం పనితీరుపై పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ .. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండా మార్చుకోవాలనుకునే సమర్ధమంతమైన పార్టీ అధ్యక్షుడుని కలిగి ఉన్నది ‘వైఎస్ఆర్సీపీ’ అని మనందరం గర్వంగా చెప్పుకునేందుకు కసరత్తు ప్రారంభించినట్లు వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. దీనిలో భాగంగా ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమం ఎలా ఉండాలి..? పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. 7 నుంచి 20 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’... ఈనెల 7 నుంచి 20 వ తేదీ వరకు ‘జగన న్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 7 లక్షల మందిదాకా ప్రధాన కిందిస్థాయి కార్యకర్తలు మా పదాధిదళంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం సచివాలయ వాలంటీర్లు స్థానికంగా ఎంత ఏరియా కవర్ చేస్తారో.. అంతే పరిధిలో గృహసారథుల వ్యవస్థ కూడా పనిచేస్తుంది. వాళ్లమీద సచివాలయ కన్వీనర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసే జేసీయస్ మండల ఇన్ ఛార్జులు సైతం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో భాగస్వాములవుతారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే నినాదంతో... ప్రజల నుంచి వచ్చిన ప్రధానమైన నినాదం ‘మా నమ్మకం నువ్వే జగన్’. అందుకే ఈ నినాదాన్ని కూడా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా పెట్టాం. ఈ నినాదమనేది మాకు మేముగా అనుకున్నది కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకొచ్చాక ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే లక్షణం రాజకీయ పార్టీలకు ఉండాలని, అలాగే ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలకు, అంచనాలకు అనుగుణంగా పాలన సాగించాలని, ప్రజల జీవితాల్లో, వారి జీవనశైలిలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. రియల్ ఛేంజ్... ప్రజల జీవితాల్లో అనూహ్యమైన మార్పును తెస్తూ, బాధ్యతగా సేవలందించడంలో అందరికంటే మేము ముందున్నాం. పార్టీ అజెండా రూపకల్పన దగ్గర్నుంచి, మా పార్టీ విధానాలు.. సంక్షేమ పథకాలు అమలు తీరు.. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న క్రమాన్ని అందరూ గుర్తించారు. ఈ విషయాన్ని మా పార్టీ జనంలోకి వెళ్లినప్పుడు, గడపగడపకు మా ప్రభుత్వం కార్యక్రమం పేరిట మేము ఇంటింటికీ తిరిగినప్పుడు.. సచివాలయాల ద్వారా వాలంటీర్లు క్షేత్రస్థాయి నుంచి తీసుకొస్తున్న సర్వేల ద్వారా పరిశీలిస్తే.. దాదాపు 80 నుంచి 90 శాతం వరకు సమాజంలో ఒక రియల్ ఛేంజ్ (గుణాత్మకమైన మార్పు) కనిపిస్తుందని నిరూపితమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో.. దాన్ని ఒకటికి రెండింతలు నిలబెట్టుకున్నారని .. అందుకనే జగన్మోహన్రెడ్డినిమేమంతా నమ్ముతున్నామని ఈరోజు ప్రజలు చెబుతున్నారు. మా భవిష్యత్తు జగన్మోహన్రెడ్డిలో కనిపిస్తోందని బలంగా ప్రజల మాటల్లో వినిపిస్తోంది. ఇవన్నీ చూశాక.. ప్రజల నుంచి వచ్చిన ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే నినాదంగా తీసుకుని, దీన్నే కార్యక్రమం పేరుగా ఎందుకు చేయకూడదని అనుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల కుటుంబాలను నేరుగా కలిసి... 14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1కోటి 60 లక్షల కుటుంబాలను జగన్మోహన్రెడ్డి గారి ప్రతినిధులుగా నియమించిబడిన గృహసారథులు, సచివాలయ కన్వీనర్లుతో పాటు మిగతా అన్ని స్థాయిల్లో నేతలు కలుస్తారు. గత ప్రభుత్వాలకు-ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు. అర్హులైన కుటుంబాలను నూటికి నూరుశాతం సంక్షేమ పథకాల అమలులోకి తీసుకువచ్చి.. వాళ్లందర్నీ కూడా సొంతకాళ్లమీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే, సర్వే ప్రశ్నల ద్వారా వారి అభిప్రాయాల్ని సమాధానాల రూపంలో ఇస్తారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు చెప్పినట్లు రాష్ట్రంలో సగటున 87శాతం ప్రజలు మా ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పూర్తిస్థాయి విశ్వసనీయత కనబరుస్తారనే నినాదం ఈ కార్యక్రమం ద్వారా వినబోతున్నామని వైఎస్ఆర్సీపీ తరఫున బలంగా నమ్ముతున్నాం. దీని తరువాత ఒక ప్రత్యేకమైన ‘పీపుల్స్ సర్వే’ నిర్వహించనుంది.. ఈ సర్వేలో ప్రతి ఇంటికి తిరిగి వారి పిల్లల భవిష్యత్తు కోసం సీఎం జగన్‌పై నమ్మకం ఉందా? అని అడిగి తెలుసుకుంటారు. ఇది ‘ప్రజా మద్దతు పుస్తకం’ లేదా ‘5 పాయింట్ల ప్రశ్నాపత్రం’ ద్వారా నిర్వహించనున్నారు. ప్రతిపక్షాల పేరుతో వికృతచేష్టలకు ఒడిగట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ రథానికి అడ్డంపడే ప్రయత్నాలు, కుట్రలు చేస్తున్న దుష్టశక్తులకు మా పార్టీ కార్యక్రమం తగిన గుణపాఠం చెబుతుంది. - వైఎస్సార్సీపీ విశాఖ ఐటీ విభాగం -
వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ
అమరావతి: ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్ పార్టీకి చెందిన ప్రాంతీయన సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే…. ► ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉంది. ► పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లుగా మీరు ఓనర్షిప్ తీసుకోవాలి. ► మీకు అప్పగించిన వివిధ జిల్లాల్లో పార్టీనేతలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీదే. ► ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే.. వాటిని సరిదిద్ది అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి. ► అంతిమంగా మన అభ్యర్థులకు మంచి మెజార్టీలు రావాలి. ► ఆ లక్ష్యంతోనే మీరు సంకల్పంతో పనిచేయాలి. ► పార్టీ సమన్వయ కర్తలుగా మీరు నాతో ఏ విషయాన్నైనా చర్చించండి. ► ఎప్పుడైనా నన్ను కలవవచ్చు. పార్టీ పరంగా మీరు నాకు టాప్ టీం. ► సచివాలయ కన్వీనర్ల రూపంలో, గృహసారథుల రూపంలో కింద చక్కటి యంత్రాంగం ఉంది. వాలంటీర్లను వారితో మమేకం చేయాలి. ► ఈ యంత్రాంగాన్ని చురుగ్గా పనిచేయించడానికి, క్రియాశీలకంగా ఉండడానికి కార్యక్రమాలను నిర్దేశించాం. ► ఆ కార్యక్రమాలన్నీ సజావుగా, సమర్థవంగా ఆయా నియోజకవర్గాల్లో నడిచేలా మీరు పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలు స్వీకరించండి. ► మీరు, నేను, పార్టీ యంత్రాంగం అంతా కలిసి ముందుకుసాగాలి. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, భూమన కరుణాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్, రామసుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి, బీద మస్తాన్ రావు తదితరులు హాజరైయ్యారు. -
మా నమ్మకం నువ్వే.. ఏప్రిల్ 7 నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనతో పాటు మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఏప్రిల్ 7 నుంచి 20 వరకూ రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలతో మమేకమయ్యే ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నిన్న జరిగిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్, మా పార్టీ శాసనసభ్యులు, సమన్వయకర్తలతో ఈ కార్యక్రమం తీరు తెన్నులను వివరించారు. పార్టీ తరఫున సచివాలయ కన్వీనర్లతో పాటు వారి తర్వాత స్థాయిలో పనిచేసే గృహ సారథుల నియామకం తర్వాత మొట్టమొదటి సారిగా ఒక భారీ పార్టీ కార్యక్రమంతో ప్రజలతో మమేకమవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పార్టీ నియమించిన ఈ రెండు వ్యవస్థలు (కన్వీనర్లు, గృహసారథులు) ఒక మిషన్ మోడ్‌లో బాధ్యతగా ఫోకస్డ్గా.. సుశిక్షితులైన సైనికుల్లా పనిచేస్తే ఎలా ఉంటుందనే విషయంపై దృష్టిసారించాం. పార్టీ పరంగా పనిచేసే వారు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి.. వాటిని తీర్చే బాధ్యతగల కార్యకర్తలున్న రాజకీయ పార్టీగా వైఎస్సార్సీపీ ముందుకెళ్తుందన్నది నిరూపించాలనేది మా ప్రయత్నం. అలాగే, ప్రభుత్వం పనితీరుపై పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండా మార్చుకోవాలనుకునే సమర్ధమంతమైన పార్టీ అధ్యక్షుడుని కలిగి ఉన్నది ‘వైఎస్సార్సీపీ’ అని మనందరం గర్వంగా చెప్పుకునేందుకు కసరత్తు ప్రారంభించాము. అందుకనే, ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమం ఎలా ఉండాలి..? మా పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. 7 నుంచి 20 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ ఈనెల 7 నుంచి 20 వ తేదీ వరకు ‘జగన న్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది దాకా ప్రధాన కిందిస్థాయి కార్యకర్తలు మా పదాధిదళంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం సచివాలయ వాలంటీర్లు స్థానికంగా ఎంత ఏరియా కవర్ చేస్తారో.. అంతే పరిధిలో గృహసారథుల వ్యవస్థ కూడా పనిచేస్తుంది. వాళ్లమీద సచివాలయ కన్వీనర్ల వ్యవస్థతో పాటు మండల ఇన్ ఛార్జులు, వారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసే జోనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థలు సైతం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో భాగస్వాములవుతారు. ఈ యంత్రాంగం మొత్తం శాసనసభ్యులు, నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నడుస్తోంది. ‘మా నమ్మకం నువ్వే జగన్’అనే నినాదంతో.. ప్రజల నుంచి వచ్చిన ప్రధానమైన నినాదం ‘మా నమ్మకం నువ్వే జగన్..’. అందుకే ఈ నినాదాన్ని కూడా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా పెట్టాం. ఈ నినాదమనేది మాకు మేముగా అనుకున్నది కాదు. వైఎస్ జగన్ అధికారంలోకొచ్చాక ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే లక్షణం రాజకీయ పార్టీలకు ఉండాలని, అలాగే ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలకు, అంచనాలకు అనుగుణంగా పాలన సాగించాలని, ప్రజల జీవితాల్లో, వారి జీవనశైలిలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. రియల్ ఛేంజ్.. ప్రజల జీవితాల్లో అనూహ్యమైన మార్పును తెస్తూ, బాధ్యతగా సేవలందించడంలో అందరికంటే మేము ముందున్నాం. పార్టీ అజెండా రూపకల్పన దగ్గర్నుంచి, మా పార్టీ విధానాలు.. సంక్షేమ పథకాలు అమలు తీరు.. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న క్రమాన్ని అందరూ గుర్తించారు. ఈ విషయాన్ని మా పార్టీ జనంలోకి వెళ్లినప్పుడు, గడపగడపకు మా ప్రభుత్వం కార్యక్రమం పేరిట ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఇంటింటికీ తిరిగినప్పుడు.. సచివాలయాల ద్వారా వాలంటీర్లు క్షేత్రస్థాయి నుంచి తీసుకొస్తున్న సర్వేల ద్వారా పరిశీలిస్తే.. దాదాపు 80 నుంచి 90 శాతం వరకు సమాజంలో ఒక రియల్ ఛేంజ్ (గుణాత్మకమైన మార్పు) కనిపిస్తుందని నిరూపితమైంది. సీఎం జగన్‌పై ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో.. దాన్ని ఒకటికి రెండింతలు నిలబెట్టుకున్నారని .. అందుకనే సీఎంను మేమంతా నమ్ముతున్నామని ఈ రోజు ప్రజలు చెబుతున్నారు. మా భవిష్యత్తు జగన్‌లో కనిపిస్తోందని బలంగా ప్రజల మాటల్లో వినిపిస్తోంది. ఇవన్నీ చూశాక.. ప్రజల నుంచి వచ్చిన ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే నినాదంగా తీసుకుని, దీన్నే కార్యక్రమం పేరుగా ఎందుకు చేయకూడదని అనుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో.. తమ నాయకుడితో మాట్లాడే అవకాశం కూడా లభిస్తోంది. కోటి 60 లక్షల కుటుంబాలను నేరుగా కలిసి.. 14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1 కోటి 60 లక్షల కుటుంబాలను సీఎం జగన్ ప్రతినిధులుగా మేం నియమించిన గృహసారథులు, సమన్వయ కన్వీనర్లుతో పాటు మిగతా అన్ని స్థాయిల్లో నేతలు కలుస్తారు. అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, సమన్వయకర్తలు కీలక భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తారు. గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు. అర్హులైన కుటుంబాలను నూటికి నూరుశాతం సంక్షేమ పథకాల అమలులోకి తీసుకువచ్చి.. వాళ్లందర్నీ కూడా సొంతకాళ్లమీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే, సర్వే ప్రశ్నల ద్వారా వారి అభిప్రాయాల్ని సమాధానాల రూపంలో ఇస్తారు. మా నాయకుడు సీఎం జగన్ చెప్పినట్లు రాష్ట్రంలో సగటున 87శాతం ప్రజలు మా ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పూర్తిస్థాయి విశ్వసనీయత కనబరుస్తారనే నినాదం ఈ కార్యక్రమం ద్వారా వినబోతున్నామని వైఎస్సార్సీపీ తరఫున బలంగా నమ్ముతున్నాం. చదవండి: వైఎస్సార్సీపీకి నన్ను దూరం చేయలేరు: ఎమ్మెల్యే ఆర్కే ప్రతిపక్షాల పేరుతో వికృతచేష్టలకు ఒడిగట్టి సీఎం జగన్ సంక్షేమ రథానికి అడ్డంపడే ప్రయత్నాలు, కుట్రలు చేస్తున్న దుష్టశక్తులకు మా పార్టీ కార్యక్రమం తగిన గుణపాఠం చెబుతుందని సజ్జల అన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ సంక్షేమ కార్యక్రమాలపై ఒక వీడియోను ప్రదర్శించారు. -
CM Jagan: రెట్టించిన స్పీడ్‌తో పనిచేయాలి
సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా.. నేడు(సోమవారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్, పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఏమన్నారంటే.. ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశాం దాని తర్వాత కార్యక్రమానికి కాస్త గ్యాప్ వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గ్యాప్ వచ్చింది మార్చి 16వరకూ కోడ్ కొనసాగింది తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి దీనివల్ల గడపగడపకూ కాస్త గ్యాప్ వచ్చిందిమళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి గేర్ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలి రాష్ట్ర చరిత్రే కాదు… దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే.. రూ.2లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అక్కౌంట్లో పడింది అర్బన్ ప్రాంతంలో 84శాతం, రూరల్ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, యావరేజీన 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదు 87శాతం కుటుంబాలను గమనించినట్టైతే… అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశాం పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్ చేసిన మరీ… వారికి పథకాలు అందిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చాం: బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ… గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు. ఇచ్చాం ఇలా చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫, చంద్రబాబును చూసినా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు 21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే.. 17 స్థానాల్లో మనం గెలిచాం మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి: ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లైన ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో దాదాపు చాలా శాతం మంది డీబీటీలో లేనివారు కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుంది రాష్ట్రంలో ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపిల్ ఏదైతే.. ఉందో.. అది ఇది కాదు ఒకటో ప్రాధాన్యం.. రెండో ప్రాధాన్యం… మూడో ప్రాధాన్యాలు ఉన్నాయి మిగిలిన పార్టీ అందరూ కలిశారు.. మనం ఒక్కరిమే అయినప్పటికీ కూడా… తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి.. జరిగింది అయినా కూడా ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారు దానికితోడు ఈనాడు రాయడం, ఆంధ్రజ్యోతి రాయడం, టీవీ-౫ చూపడం రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు 60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారుచేస్తున్నారని చెప్తారు ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు ఇంతకంటే.. దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారంచేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అందుకే అంటున్నా.. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం వారంతా గజ దొంగల ముఠా దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం వచ్చాక గండిపడింది అందుకే గజదొంగల ముఠా ఇవన్నీ చేస్తున్నాయి రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి వాటిని తిప్పికొట్టాలి సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం కేడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలి గృహసారథులను, సచివాలయ కన్వీనర్లు.. వ్యవస్థను పూర్తిచేసుకోవాలి ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారుచేసుకోవాలి వాలంటీర్లను, గృహసారథులను మమేకం చేయాలి వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వంచేస్తున్నమంచిని ప్రతికుటుంబానికీ తీసుకెళ్లాలి దాదాపుగా ఇప్పటికి సగం సచివాలయాల్లో గడపగడపకూ పూర్తిచేశాం ఈ సగం వచ్చే 5 నెలల్లో, అంటే ఆగస్టు నాటికి పూర్తిచేయాలి నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలి నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారంచుడదాం ఒకవైపున గడపగడపకూ జరుగుతుంది… రెండోవైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయి వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నాం రాజకీయాల్లో నేను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోను మీతో పనిచేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే.. ఈ కార్యక్రమాలు ఈ అడుగులన్నీ కూడా దానికోసమే కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నాకు ప్రతి నియోజకవర్గంలో లక్షలమంది మనపై ఆధారపడి ఉన్నారు ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం మన అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలి ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది నేను చేయాల్సింది.. నేను చేయాలి మీరు చేయాల్సిది మీరు చేయాలి ఈరెండూ సంయుక్తంగా, సమర్థవంతంగా జరిగితే… అప్పుడు కచ్చితంగా 175కి 175 గెలుస్తాం ఇదీ చదవండి: బోధనాస్పత్రుల బలోపేతం