
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్నే మా భవిష్యత్తు' మెగా పీపుల్స్ సర్వేకు భారీ స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన 11 రోజులకు 78 లక్షల కుటుంబాల సర్వే పూర్తయ్యాయి. సీఎం జగన్ పాలనకు మద్దతుగా ఇప్పటి వరకు 59 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. అయితే కిందటి పోలిస్తే తాజాగా 5 లక్షల కుటుంబాల సర్వే, 4 లక్షల మిస్డ్ కాల్స్ పెరిగాయి
జగ్గయ్యపేట పట్టణ 31వ వార్డు శాంతినగర్‌లో జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, కేడీసీసీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, కౌన్సిలర్ వెంకట్రావు, నంబూరు రవి, అప్పారావు ,సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
కాగా ప్రజలే ప్రభుత్వంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దతు పలుకుతున్నారు. గత 46 నెలలుగా సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న సుపరిపాలన గురించి ప్రతిఇంటా జగనన్న సైన్యం వివరిస్తోంది.
చదవండి: మార్గదర్శిపై 17 ఏళ్ల న్యాయ పోరాటంలో కీలక మలుపు ఇది: ఉండవల్లి