సాక్షి, తాడేపల్లి: ఏపీలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రతీ కుటుంబాన్ని కలిసినట్టు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కోటి లక్షల కుటుంబాలను కలుసుకున్నామని స్పష్టం చేశారు
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనను సమర్థిస్తూ కోటి 10లక్షల మిస్ట్ కాల్స్ వచ్చాయి. 80శాతం మంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ప్రజలంతా జగన్‌కు జేజేలు పలుకుతున్నారు. చంద్రబాబు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. రజనీకాంత్‌కు ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసు?. ఎవరో రాసిచ్చిన స్స్ర్కిప్ట్ చదవడం సినిమా వాళ్లకు అలవాటే. చంద్రబాబు విజన్ అనేది కల్పిత కథ. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తొస్తారు.
మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి 80శాతం ప్రజల మద్దతు ఉంది. డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 99శాతం హామీలు అమలు చేశాం కాబట్టే మమ్మల్ని నమ్ముతున్నారు.
ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. విజన్ ఉన్న నాయకుడు సీఎం జగన్. మెగా పీపుల్స్ సర్వేలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కోటి 45 లక్షల కుటుంబాలకు కోటి 10లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయి. సీఎం జగన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనం.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ప్రజలంతా సీఎం జగన్ పాలనపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజా మద్దతు పుస్తకంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. చంద్రబాబులా గాలిలో లెక్కలు చెప్పడం లేదు.
వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలంతా జగన్ననే మా భవిష్యత్ అంటున్నారు. చంద్రబాబు కనీసం సర్వే ఆలోచన కూడా చేయలేదు. కుల, మత, రాజకీయాలకతీతంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారు. అందుకే ప్రజల నుంచి ఈ స్థాయిలో మద్దతు వచ్చింది.
ఇది కూడా చదవండి: థాంక్యూ సీఎం సార్.. మీ సాయంతో అంతరిక్షం అందుకుంటున్నా
Comments
Please login to add a commentAdd a comment