
సాక్షి, విజయవాడ: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో పాటు ప్రార్థనల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ముస్లిం సోదరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సుఖ సంతోషాల పాలన నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు చాలా గొప్ప సేవలు అందిస్తోందన్నారు.
ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రేమ, త్యాగాలకు ప్రతీక బక్రీద్. ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. చంద్రబాబు హయాంలో మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. వైఎస్సార్ తర్వాత ముస్లింలకు మేలు చేస్తున్నది సీఎం జగన్ మాత్రమే. మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: అల్లాహ్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి.. ముస్లింలకు సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment