Bakrid celebrations
-
విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియంలో బక్రీద్ వేడుకలు
సాక్షి, విజయవాడ: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో పాటు ప్రార్థనల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ముస్లిం సోదరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సుఖ సంతోషాల పాలన నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు చాలా గొప్ప సేవలు అందిస్తోందన్నారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రేమ, త్యాగాలకు ప్రతీక బక్రీద్. ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. చంద్రబాబు హయాంలో మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. వైఎస్సార్ తర్వాత ముస్లింలకు మేలు చేస్తున్నది సీఎం జగన్ మాత్రమే. మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: అల్లాహ్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి.. ముస్లింలకు సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు -
మనోవాంఛల త్యాగమే బక్రీద్.. ఖుర్బానీ అంటే ఏమిటి?
ఈదుల్ అజ్ హా ఒక మహత్తర పర్వదినం. వ్యావహారికంలో దీన్ని బక్రీద్ పండుగ అంటారు. బక్రీద్ పేరు వినగానే మొదట మనకు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయీల్ అలైహిస్సలాంల పేర్లు గుర్తుకొస్తాయి. ఆ మహనీయుల విశ్వాస పటిమ, త్యాగ నిరతి కళ్ళముందు కదలాడతాయి. అలనాటి ఆ మధుర ఘట్టాలు ఒక్కొక్కటిగా మనో యవనిక పై ఆవిష్కృతమవుతాయి. వారి ఒక్కో అడుగు జాడ విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఈ విధంగా ఆ త్యాగ దనుల ఒక్కో ఆచరణనూ స్మరించుకుంటూ జరుపుకునే పర్వదినమే ఈదుల్ అజ్ హా... అదే బక్రీద్. ఆరోజే అరేబియా దేశంలోని మక్కా నగరంలో ‘హజ్’ ఆరాధన జరుగుతుంది. లక్షలాదిమంది యాత్రికులతో ఆ పవిత్ర నగరం కళకళలాడుతూ ఉంటుంది. ‘లబ్బైక్’ నినాదాలు సర్వత్రా మిన్నంటుతూ ఉంటాయి. అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్త వారి ప్రవచనాలను ΄ాటించడంలో భక్తులు నిమగ్నమై ఉంటారు. నేల ఈనినట్లు కనిపించే ఆ జనవాహినిలో ‘తవాఫ్ ‘చేసేవారు కొందరైతే, ‘సఫా మర్వా’ కొండల మధ్య ‘సయీ’ చేసేవారు మరికొందరు. అదొక అపురూపమైన సుందర దృశ్యం. రమణీయమైన అద్భుత సన్నివేశం. అల్లాహ్ స్తోత్రంతో పరవశించి తన్మయత్వం చెందే ఆధ్యాత్మిక కేంద్రబింబం. జిల్ హజ్ పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. హజ్రత్ ఇబ్రాహీమ్, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం. ప్రపంచ విశ్వాసుల పర్వదినం. ఇదేదో షరా మామూలుగా జరిగే ఆచారం కాదు. ఇదొక మహత్తర సందేశం కలిగిన శుభదినం. క్రియా రూపంలో దైవ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత ప్రక్రియ. మనిషి తనను తాను తగ్గించుకొని, వినమ్ర పూర్వకంగా అల్లాహ్ ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను కీర్తించే గొప్పరోజు. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పాక్షిక పొరపొచ్చాలనూ విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన రోజు. ఈ పర్వదినం మనకిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకు పోకుండా, నలుగురితో మమేకం కాకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోషకార్యమైనా నలుగురితో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుందీ పండుగ. ప్రతి ఒక్కరూ తమ స్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్ధిక స్థోమత ఉన్నవారు జిల్ హజ్జ్ నెలలో ‘హజ్ ’యాత్రకు వెళతారు. అంతటి స్థోమత లేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. ఆ స్థోమత కూడా లేకపోతే రెండు రకాతుల నమాజ్ ఆచరించినా దయామయుడైన దైవం హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఆయన తన దాసుల చిత్తశుధ్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంతమాత్రం లేదు. కనుక సర్వకాల సర్వావస్థల్లో చిత్తశుధ్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. ఒకప్పుడు ఎలాంటి జనసంచారం లేని నిర్జీవ ఎడారి ప్రాంతమది. కాని ఈనాడు విశ్వప్రభువు అనుగ్రహంతో నిత్యనూతనంగా కళకళలాడుతూ యావత్ ప్రపంచ ముస్లిం సమాజానికి ప్రధాన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆ పుణ్యక్షేత్రమైన మక్కాలో జరిగే హజ్ ఆరాధనకు, ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే ఈదుల్ అజ్ హా పండుగకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పండుగకు, హజ్, ఖుర్బానీలకు మూలకారణం హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. ఈయన గొప్పదైవ ప్రవక్త. దేవునికి ప్రియ మిత్రుడు. తన పూర్తిజీవితం ద్వారా దైవప్రసన్నతకు మించిన కార్యం మరొకటి లేదని నిరూపించిన త్యాగధనుడు. కలలో కనిపించింది కూడా కరుణామయుని ఆజ్ఞగానే భావించి ఆచరించేవారు. ఒకరోజు ఇబ్రాహీం ప్రవక్త తన ముద్దుల కొడుకు ఇస్మాయీల్ గొంతుకోస్తున్నట్లు కలగన్నారు. దీన్ని ఆయన దైవాజ్ఞగా భావించి, తనయునితో సంప్రదించారు. తండ్రికి దగ్గ ఆ తనయుడు వెనకా ముందు ఆలోచించకుండా త్యాగానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో వారు ఎదుర్కొన్న పరీక్షలు, అందులో వారు సఫలమైన తీరు, వారి ఒక్కో ఆచరణ ప్రళయకాలం వరకు సజీవంగా ఉండేలా ఏర్పాటు చేశాడు దైవం. అందుకే విశ్వవ్యాప్త విశ్వాసులు ఆ మహనీయుల ఒక్కో ఆచరణనూ స్మరించుకుంటూ, దేవుని ఘనతను, గొప్పతనాన్ని కీర్తిస్తూ, సముచిత రీతిలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి పండుగ రోజు ఈద్గాహ్కు చేరుకుని వేనోళ్ళా దైవాన్ని స్తుతిస్తారు. తన అవసరాలను త్యజించి దైవ ప్రసన్నత కోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేదే ఈ త్యాగాల పండుగ. మంచికోసం మానవ సంక్షేమం కోసం, ధర్మంకోసం, ధర్మసంస్ఢాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఇందులో ఉంది. ఈరోజున ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. అందుకని, పండుగ సందర్భంగా చేసే ప్రతి ఆచరణలో త్యాగ ధనులైన హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల స్పూర్తి తొణికిసలాడాలి. దైవప్రసన్నత కోసం, ఇహపర సాఫల్యం కోసం వారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, ఎంతటి సహన స్ధయిర్యాలు కనబరిచారో మనం కూడా అలాంటి ప్రయత్నం చెయ్యాలి. సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలి. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ సందర్భంగా మనం ఖుర్బానీలు ఇస్తాం, నమాజులు చేస్తాం. ఇతరత్రా ఇంకా ఏవో పుణ్యకార్యాలు ఆచరిస్తాం. కాని మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్నకార్యమే. కాని, హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల త్యాగాలను స్మరించుకుంటే ఏమాత్రం కష్టంకాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమయిన దశలను దాటవలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమయినా వృథా పోదు. చరిత్రే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. దైవం మనందరిలో త్యాగభావం, పరోపకార గుణాలను పెంపొదించాలని ప్రార్ధిద్దాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
హైదరాబాద్‌లో బక్రీద్ కోలాహలం (ఫొటోలు)
-
ముస్లిం సోదరులకు ఏ పీ సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
-
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మరింత శక్తినివ్వాలని ప్రార్థించా
-
బక్రీద్ సందర్బంగా విజయవాడ లో ప్రత్యేక ప్రార్ధనలు
-
హైదరాబాద్ లో ఘనంగా బక్రీద్ వేడుకలు
-
హైదరాబాద్‌లో బక్రీద్ వేడుకలు
-
దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు
న్యూఢిల్లీ: దేశవ్యాపంగా ఈద్-అల్-అదా (బక్రీద్) వేడుకలు శనివారం ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా వివిధ నగరాల్లోని ప్రధాన ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ.. త్యాగాలకు మారు పేరుగా ఈ పర్వ దినాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ వేడుకలు ప్రజల మధ్య శాంతి సామరస్యాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. త్యాగానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ పండుగ సమాజంలోని వివిధ వర్గాల మధ్య జాలి, దయ, కరుణ అనే స్ఫూర్తిని నింపుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. Eid Mubarak! Greetings on Eid al-Adha. May this day inspire us to create a just, harmonious and inclusive society. May the spirit of brotherhood and compassion be furthered. — Narendra Modi (@narendramodi) August 1, 2020 -
బక్రీద్ బిజినెస్ ఎలా?
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ కారణంగా సీజనల్ బిజినెస్లన్నీ ఢమాల్ అయ్యాయి. రంజాన్‌ను లాక్డౌన్ పూర్తిగా మింగేసింది. తాజాగా బక్రీద్ బిజినెస్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. బుధవారం నెలవంక దర్శనమివ్వడంతో ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం జిల్‌హజ్ పవిత్ర మాసం ప్రారంభమైంది. సరిగ్గా ఈద్–ఉల్–జోహా (బక్రీద్ పండగ)కు కేవలం తొమ్మిది రోజులే మిగిలిఉంది. అయినా ఖుర్బానీ జీవుల సందడికనిపించడం లేదు. వాస్తవంగాబక్రీద్కు పది రోజుల ముందు నుంచే ఖుర్బానీ జంతువులైన పొట్టేళ్లు, మేకపోతుల సందడి నగరంలో ఎక్కడచూసినా కనిపిస్తుంది. ఈసారి పరిస్థితి అలాలేదు. ఒకవైపు విజృంభిస్తున్న కరోనా, మరోవైపు ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వ్యాపారం అంత ఈజీ కాదన్న భావన సర్వత్రా నెలకొంది. కొనుగోలుదారులు సగానికి సగం తగ్గే అవకాశాలుండడంతో బిజినెస్‌పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కోవిడ్ నేపథ్యంలో.. కరోనా వైరస్‌తో అందరికీ ప్రాణభయం పట్టుకుంది. బయటకు వెళ్లేందుకు జనం భయపడిపోతున్నారు. సంప్రదాయ పండగలు సైతం ఇళ్లకే పరిమితం అవుతున్నాయి. ముస్లింలు ఇప్పటికే రంజాన్ నెల ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షల విరమణ, తవారీతో పండగ ప్రార్థనలన్నీ ఇళ్లలోనే జరుపుకున్నారు. ప్రతి ముస్లింకు ఖుర్బానీ తప్పనిసరి. బక్రీద్ ఖుర్బానీలు అత్యధికంగా పాతబస్తీలోనే కనిపిస్తాయి. ప్రతి ఇంటా కనీసం ఒక ఖుర్బానీకి తగ్గకుండా రెండు నుంచి నాలుగు ఖుర్బానీలు ఇస్తుంటారు. ప్రతి ఖుర్బానీలో మూడు భాగాలు చేసి అందులో ఒక భాగం బంధువులకు, మరో భాగం ఇరుగుపొరుగు వారికి పంపిణీ చేస్తారు. మిగిలిన భాగాన్ని ఇంట్లో వినియోగించుకుంటారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఖుర్బానీ మాంసం పంపిణీ కూడా అంత సునాయాసం కాదన భావన వ్యక్తమవుతోంది. ఖుర్బానీ మాంసం స్వీకరించే వారు సైతం సంశయించే పరిస్థితి లేకపోలేదు. ఫలితంగా ప్రతి కుటుంబంలో ఖుర్బానీల సంఖ్య తగ్గి ఇంటికే పరిమితమయ్యే అవకాశాలుండొచ్చు. కరోనా పరీక్షలు.. బక్రీద్ పండగను పురస్కరించుకొని మాంసం వ్యాపారులైన ఖురేషీ వర్గాల వారికి కరోనా టెస్టులు చేస్తున్నారు. పాతబస్తీలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెండు రోజులుగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఖుర్బానీ జీవులను కోయడంలో ఖురేషీల పాత్ర అధికంగా ఉంటుంది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీరికి కరోనా పరీక్షలు ప్రారంభించారు. వందల కోట్ల వ్యాపారం వాస్తవానికి బక్రీద్ సీజన్ వచ్చిందంటే నగరంలో వందలకోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. చాలామంది నిరుద్యోగులు ఈ సీజన్‌పైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. కానీ, కరోనా భయంతో ఆ పరిస్ధితి కనిపించడం లేదు. -
జమ్మూకశ్మీర్‌లో ఈద్ ప్రశాంతం
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో సోమవారం బక్రీద్ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. జమ్మూతో పాటు కశ్మీర్‌లోని పలుచోట్ల ముస్లింలు భారీ సంఖ్యలో ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకోగా, ఆందోళనకారుల్ని భద్రతాబలగాలు చెదరగొట్టాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. పండుగ సందర్భంగా మద్దతుదారులతో సందడిగా ఉండే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీల ఇళ్లు ఈసారి మూగబోయాయి. ఫరూక్‌ను గుప్కార్‌రోడ్డులోని ఆయన ఇంట్లోనే హౌస్అరెస్ట్ చేసిన బలగాలు.. ఆయన కుమారుడు ఒమర్‌ను హరినివాస్ ప్యాలెస్‌లో నిర్బంధించాయి. ఇక ముఫ్తీని చష్మా సాహి అనే నివాసంలో ఉంచారు. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ జమ్మూకశ్మీర్‌లో పరిస్థితిని సమీక్షించారు. శ్రీనగర్‌తో పాటు దక్షిణ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆర్మీ, పోలీస్ ఉన్నతాధికారులూ ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ సేవలు మూగబోయిన నేపథ్యంలో కశ్మీరీలు ఇతర రాష్ట్రాల్లోని తమ వారితో మాట్లాడేందుకు పోలీసులు 300 ప్రత్యేక టెలిఫోన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు
-
హైదరాబాద్‌లో ఘనంగా బక్రీద్ వేడుకలు
-
ఎమ్మెల్సీ సలీం ఇంట్లో సీఎం బక్రీద్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: బక్రీద్ వేడుకలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తమ పార్టీ నేతలతో కలసి జరుపుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం ఇంట్లో శుక్రవారం జరిగిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. హైదరాబాద్‌లోని రాంనగర్ అడిక్‌మెట్ ప్రాంతంలో సలీం ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సలీంకు సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర నేతలు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. -
దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు
-
హైదరాబాద్‌లో బక్రీద్ సందడి
-
త్యాగానికి ప్రతిరూపం బక్రీద్
బక్రీద్ వేడుకల కోసం ముస్లింలు సిద్ధమయ్యారు. సోమవారం జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీనికోసం అవసరమైన ఇప్పటికే షాపింగ్‌ను పూర్తి చేశారు. చిన్నాపెద్దా తేడాలేకుండా జరుపుకునే పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ సందర్భంగా పట్టణంలోని మెదక్ రోడ్ సమీపంలో గల ఈద్గా మైదానాన్ని నమాజ్‌ల కోసం సిద్ధం చేశారు. 60 ఏళ్ల క్రితం నిర్మించిన తంజిముల్ మసీదును అందంగా ముస్తాబు చేశారు. పండుగను పురస్కరించుకుని పలు చోట్ల అన్నదానం, వస్తుదానం, వస్త్రదానం చేస్తారు. చరిత్ర... ఐదు వేల సంవత్సరాల క్రితం ఇరాక్ ప్రాంతాన్ని పాలిస్తున్న సమ్రూద్ రాజ్యంలో.. హజ్రత్ ఇబ్రహీం అనే వ్యక్తి దైవ ప్రచారం నిర్వహిస్తూ.. ప్రజల్లోని అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా రాజ్య బహిష్కరణకు గురయ్యాడని చరిత్ర చెబుతోంది. అనంతరం వేరే రాజ్యానికి వెళ్లిన ఇబ్రహీం దైవ సంకల్పాన్ని కొనసాగించారని ముస్లిం పెద్దలు పేర్కొంటున్నారు. ఇలా ఏళ్లకు ఏళ్లు కాల గర్భంలో కలిసి పోవడంతో ఆయనకు వృద్ధాప్యం వచ్చింది. ఈ సమయంలో ఒక రోజు రాత్రి ఇబ్రహీం పడుకుని ఉండగా అల్లా తన కలలోకి వచ్చి నీ కుమారుడిని నాకు బలివ్వమని (ఖుర్బానీ) కోరుతాడు. దైవ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఇబ్రహీం తన కొడుకును బలిచ్చేందుకు సిద్ధమైన క్షణంలో.. అతని దైవ నిరతికి ముగ్దుడైన అల్లా ప్రత్యక్షమై తన కుమారుడి స్థానంలో పొట్టేలును ఖుర్బానీగా స్వీకరిస్తాడని చరిత్ర చెబుతోంది. ఈ సంఘటనకు గుర్తుగా ముస్లింలు బక్రీద్‌ను జరుపుకుంటారు. -
నమాజు పఠించిన ముస్లింలు