
న్యూఢిల్లీ: దేశవ్యాపంగా ఈద్-అల్-అదా (బక్రీద్) వేడుకలు శనివారం ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా వివిధ నగరాల్లోని ప్రధాన ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ.. త్యాగాలకు మారు పేరుగా ఈ పర్వ దినాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ వేడుకలు ప్రజల మధ్య శాంతి సామరస్యాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. త్యాగానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ పండుగ సమాజంలోని వివిధ వర్గాల మధ్య జాలి, దయ, కరుణ అనే స్ఫూర్తిని నింపుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) August 1, 2020
Greetings on Eid al-Adha. May this day inspire us to create a just, harmonious and inclusive society. May the spirit of brotherhood and compassion be furthered.




Comments
Please login to add a commentAdd a comment