
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ త్వరలో కోలుకోవాలని ప్రార్ధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జగదీప్ అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రితో చికిత్స అందిస్తున్నారు. ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున దన్కర్ కు ఛాతీలో నొప్పి రావడంతో ఎయిమ్స్ కు తరలించి అత్యవసర చికిత్స అందించారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లి దన్కర్ ను పరామర్శించారు. దన్కర్ ఆరోగ్యం గురించి అక్కడ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దన్కర్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.రావాలని ప్రార్ధించినట్లు మోదీ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
Went to AIIMS and enquired about the health of Vice President Shri Jagdeep Dhankhar Ji. I pray for his good health and speedy recovery. @VPIndia
— Narendra Modi (@narendramodi) March 9, 2025
కాగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు ఛాతి నొప్పితో బాధపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, తెల్లవారుజామున 2 గంటలకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment