jagdeep dhankhar
-
నియామకాల్లో సీజేఐ ప్రమేయమా?
భోపాల్: సీబీఐ డైరెక్టర్ వంటి ఉన్నతస్థాయి కార్యనిర్వాహక పదవుల నియామకాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భాగస్వామి కావడం ఏ మేరకు సబబని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నించారు. ‘‘చట్టప్రకారమే అయినా సరే, భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి ప్రక్రియలో సీజేఐ ఎలా పాల్గొంటారు? నాటి పాలకులు న్యాయతీర్పు తాలూకు ఒత్తిడికి లొంగడంతో ఈ నిబంధన పుట్టుకొచ్చింది. దీనికి చట్టపరంగా హేతుబద్ధత ఉందా?’’ అని ప్రశ్నించారు. శుక్రవారం భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కార్యనిర్వాహక కార్యకలాపాలు న్యాయవ్యవస్థ నిర్ణయాలు, తీర్పుల ద్వారా జరగడం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి నిబంధనలను పునఃపరిశీలించాల్సిన సమయం వచ్చింది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. పాలనపరమైన వ్యవహారాల్లో శాసన, న్యాయవ్యవస్థల జోక్యం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. కోర్టులకున్న న్యాయసమీక్ష అధికారం సముచితమే అయినా రాజ్యాంగాన్ని సవరించే అధికారం మాత్రం అంతిమంగా పార్లమెంటుదేనని ధన్‌ఖడ్ స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా పలు అంశాలపై న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను కూడా ఆయన పరోక్షంగా తప్పుబట్టారు. ‘‘న్యాయవ్యవస్థ తీర్పుల రూపంలో ప్రజల ముందుకు రావాలే తప్ప ఇతరేతర వ్యక్తీకరణలకు పూనుకోవడం ఆ వ్యవస్థ గౌరవాన్నే భంగపరుస్తుంది. సామాజికాంశాలపై న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం ప్రపంచంలో మరెక్కడా జరగదు’’ అన్నారు. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే సాకుతో అధికారపు అతిశయం ప్రదర్శించరాదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. -
యోగి సర్కారును మెచ్చుకున్న ఉపరాష్ట్రపతి ధన్కర్
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వేడుకగా కొనసాగుతోంది. ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పవిత్ర సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళాకు ఘనమైన ఏర్పాట్లు చేశారని యోగి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం గురించి మీడియా ఆయనను ప్రశ్నించినప్పుడు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పరిస్థితులు సద్దుమణిగాయని, దీనిని చూస్తుంటే యూపీ సర్కారు ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నదో ఇట్టే గ్రహించవచ్చని అన్నారు. ఈ విషయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మెచ్చుకోవాలని ఉపరాష్ట్రపతి(Vice President) అన్నారు. ఈ భూమిపై ఎక్కడా ఇంతటి భారీ కార్యక్రమం జరిగివుండదు. కుంభమేళా నిర్వహణకు యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ధన్కర్ పేర్కొన్నారు.మహా కుంభమేళాలో లక్షకు పైగా మరుగుదొడ్లు నిర్మించారని, యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్(Maha Kumbh)కు వచ్చిన వారి సంఖ్య అమెరికా జనాభాకు సమానం అని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారని ఆయన అన్నారు. తాను కుంభ్ స్నానం కోసం నీటిలోకి దిగిన క్షణం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన సమయం అని ధన్కర్ పేర్కొన్నారు. ప్రపంచంలో భారతదేశం లాంటి దేశం మరొకటి లేదని, అంకితభావం, సామర్థ్యం, సంస్కృతి పరిజ్ఞానం, దేశానికి సేవ చేసే స్ఫూర్తి ఇక్కడ ఉన్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. -
పార్లమెంట్ లో ఉపరాష్ట్రపతి ప్రసంగం
-
అల్విదా మన్మోహన్జీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలతో భారతదేశ దశదిశను మార్చిన మహోన్నత నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్(92)కు జాతి యావత్తూ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో శనివారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. దివంగత మాజీ ప్రధానమంత్రిని కడసారి దర్శించుకొని వీడ్కోలు పలకడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భూటాన్ రాజు జింగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగుచుక్, మారిషస్ విదేశాంగ మంత్రి ధనుంజయ్ రామ్ఫుల్తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ దేశా ల ప్రతినిధులు, ప్రముఖులు తరలివచ్చారు. మన్మోహన్‌కు కన్నీటి వీడ్కోలు పలికిన అనంతరం పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాం«దీతోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖీ్వందర్ సింగ్ సుఖూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినోద్ కుమార్ సక్సేనా, వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు భూపీందర్ సింగ్ హుడా, అశోక్ గహ్లోత్, భూపేష్ భగేల్ తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ అమర్ రహే శనివారం ఉదయం 9 గంటలకు మన్మోహన్ పార్థివ దేహాన్ని పుష్పాలతో అలంకరించిన సైనిక వాహనంలో ఆయన నివాసం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయనకు ఎంతో ఇష్టమైన నీలిరంగు తలపాగాను చివరి ప్రయాణంలోనూ ధరింపజేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాంధీతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కడసారి నివాళులర్పించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ భార్య గురుశరణ్‌కౌర్, ఒక కుమార్తె కూడా పుష్పాంజలి ఘటించారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. ‘మన్మోహన్ సింగ్ అమర్ రహే.. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, తబ్ తక్ తేరా నామ్ రహేగా’ అనే నినాదాల మధ్య వేలాది మంది అనుసరిస్తుండగా యాత్ర ముందుకు సాగింది. ఉదయం 11.30 గంటల సమయానికి నిగమ్‌బోధ్ ఘాట్‌కు చేరుకుంది. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతోపాటు రాహుల్ గాంధీ సైతం యాత్రలో చివరివరకూ పాల్గొన్నారు. పాడెను సైతం మోశారు. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ భౌతికకాయాన్ని ప్రత్యేక వేదికపైకి చేర్చారు. సిక్కు మత సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, మత గురువులు పవిత్ర గుర్బానీ కీర్తనలు ఆలపించారు. భౌతికకాయం వద్ద పలువురు ప్రముఖులు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. త్రివిధ దళాల సైనికులు 21 తుపాకులు గాల్లోకి పేల్చి గౌరవ వందనం సమర్పించారు. తర్వాత చితికి మన్మోహన్ పెద్ద కుమార్తె ఉపీందర్ సింగ్ నిప్పంటించడంతో అంత్యక్రియలు ముగిశాయి. మన్మోహన్ సింగ్ జ్ఞాపకాలతో అందరి హృదయాలు బరువెక్కాయి. అల్విదా మన్మోహన్జీ అంటూ కొందరు బోరున విలపించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం మన్మోహన్ ‘అఖండ్ పథ్’ను జనవరి 1న ఢిల్లీలోని నివాసంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 3న ‘భోగ్’ కార్యక్రమం ఉంటుందన్నారు. అంతిమ్ అర్దాస్(చివరి ప్రార్థనలు) జనవరి 3న ఢిల్లీలో గురుద్వారా రికబ్ గంజ్ సాహిబ్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మన్మోహన్ సింగ్ శ్రద్ధాంజలి సభను సోమవారం నిర్వహించనున్నట్లు గుజరాత్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఇండియా ప్రగతికి బాటలు వేసిన నేత మన్మోహన్: లారెన్స్ వాంగ్ మన్మోహన్ సింగ్ మృతిపట్ల సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సంతాపం ప్రకటించారు. భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చిన గొప్ప నాయకుడు మన్మోహన్ అని కొనియాడారు. దార్శనికత, అంకితభావంతో దేశ ప్రగతికి బాటలు వేశారని, ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. ఆంటోనియో గుటెరస్ సంతాపం మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ విచారం వ్యక్తంచేశారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు, భారతదేశ ప్రజలకు, ప్రభుత్వానికి సంతాపం ప్రకటించారు. ఇండియా ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. మన్మోహన్ హయాంలో ఐక్యరాజ్యసమితితో భారత్ బంధం బలోపేతమైందని ఉద్ఘాటించారు. భూటాన్‌లో ప్రత్యేక ప్రార్థనలు భారత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ ఆత్మశాంతి కోసం భూటాన్‌లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రాజధాని థింపూలోని బౌద్ధ మందిరంతోపాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రార్థనలు నిర్వహించారు. 20 జిల్లాల్లో ప్రార్థనలు జరిగినట్లు భూటాన్ ప్రభుత్వం తెలియజేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ రాయబార కార్యాలయా లు, కాన్సులేట్లలో తమ జాతీయ పతాకాన్ని అవనతం చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీలో జరిగిన మన్మో హన్ అంత్యక్రియలకు భూటాన్ రాజు హాజరయ్యారు. మన్మోహన్ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ధర్మరాజు స్థాపించిన శ్మశాన వాటిక! మన్మోహన్ అంత్యక్రియలు జరిగిన నిగమ్‌బోధ్ ఘాట్ శ్మశానవాటిక ఢిల్లీలో యమునా నది ఒడ్డునే ఉంది. నగరంలో అది అత్యంత రద్దీగా ఉండే అతిపెద్ద శ్మశానవాటిక. ప్రాచీనమైన ఈ మరుభూమిని పాండవుల అగ్రజుడు, ఇంద్రప్రస్థ పాలకుడైన యుధిష్టరుడు(ధర్మరాజు) స్థాపించాడని చెబుతుంటారు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. రకరకాల పక్షులు విహరిస్తుంటాయి. అందుకే పక్షులను కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు వస్తుంటారు. పక్షి ప్రేమికులకు ఇదొక చక్కటి వేదిక. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ, జనసంఘ్ నేత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్, ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ సహా పలువురు ప్రముఖుల అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి. 5,500 సంవత్సరాల క్రితం మహాభారత కాలంలో సాక్షాత్తూ బ్రహ్మ ఇక్కడ యమునా నదిలో స్నానం ఆచరించాడని, దాంతో ఆయన పూర్వస్మృతి జ్ఞప్తికి వచ్చిందని, అందుకే దీనికి నిగమ్‌బోధ్ అనే పేరు స్థిరపడిందని కొన్ని పుస్తకాల్లో రాశారు. నిగమ్‌బోధ్ ఘాట్‌ను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) నిర్వహిస్తోంది. 1950వ దశకంలో ఎలక్ట్రిక్ దహన వాటిక, 2000 సంవత్సరం తర్వాత సీఎన్జీ దహన వాటిక సైతం ఏర్పాటు చేశారు. అధికారికంగా 1898లో ఈ శ్మశానవాటిక ప్రారంభమైంది. అప్పట్లో ఈ ప్రాంతం పేరు షాజహానాబాద్. మన్మోహన్ స్మారకం నిర్మించే చోటే అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరినప్పటికీ కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ఈ పరిణామంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశానికి తొలి సిక్కు ప్రధానమంత్రి అయిన మన్మోహన్‌ను కేంద్రం ఉద్దేశపూర్వకంగా అవమానించిందని మండిపడుతున్నారు. -
ఆర్థిక సంస్కర్తకు అశ్రు నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: దివికేగిన ఆర్థిక సంస్కర్త మన్మో హన్ సింగ్‌కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తదితర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసమైన 3, మోతిలాల్ నెహ్రూ రోడ్డుకు తరలించారు. నివాళులర్పించడానికి శుక్రవారం పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి మన్మోహన్ అందించిన సేవలను స్మరించుకున్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భార్య గురుశరణ్ కౌర్‌ను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జె.పి.నడ్డాతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాందీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు మన్మోహన్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఢిల్లీ సీఎం అతిశీ, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కూడా నివాళులర్పించారు. నేడు నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు దివంగత మాజీ ప్రధాని అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ చెప్పారు. మన్మోహన్ పారి్థవదేహాన్ని ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తామని, ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రజలు సందర్శించవచ్చని తెలిపారు. 9.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్ శ్మశాన వాటికలో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలియజేసింది. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖకు సూచించినట్లు పేర్కొంది. కేంద్ర మంత్రివర్గం సంతాపం మన్మోహన్ మృతి పట్ల కేంద్ర మంత్రివర్గం సంతాపం ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ శుక్రవారం సమావేశమైంది. మన్మోహన్ ఆత్మశాంతి కోసం తొలుత రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రభుత్వంతోపాటు యావత్తు దేశం తరఫున సంతాపం తెలియజేశారు. అనంతరం సంతాప తీర్మానం ఆమోదించారు. మహోన్నత రాజనీతిజు్ఞడు, ఆర్థికవేత్త, గొప్ప నాయకుడిని దేశం కోల్పోయిందని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా ఆయన మనందరిపై బలమైన ముద్ర వేశారని కొనియాడారు. మన్మోహన్ గౌరవార్థం ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. సీడబ్ల్యూసీలో సంతాప తీర్మానం ఆమోదం మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నివాళులర్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యా లయంలో భేటీ అయ్యింది. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ హాజరయ్యారు. మన్మోహన్‌కు సంతాపం ప్రకటిస్తూ ఒక తీర్మా నం ఆమోదించారు. భారత రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో అగ్రగణ్యుడు మన్మోహన్ అని కొనియాడారు. ఆయన కృషితో ప్రపంచస్థాయిలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించాయని పేర్కొన్నారు. దేశంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన మన్మోహన్ చిరస్మరణీయులని ఉద్ఘాటించారు. ప్రజల తలరాతలు మార్చేలా ఎన్నో విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని ప్రశంసించారు. ఢిల్లీలో స్మారక చిహ్నం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు దేశ రాజధాని ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కాంగ్రెస్‌కు కూడా అందించినట్లు శుక్రవారం ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపాయి. అయినప్పటికీ ఈ అంశంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించాయి.అదే సంప్రదాయం పాటించాలి: ఖర్గే ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మించడానికి వీలైన చోటేఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రెండు పేజీల లేఖ రాశారు. మన మాజీ ప్రధానమంత్రులకు, రాజనీతిజు్ఞలకు అంత్యక్రియలు జరిగిన చోటే స్మారకం నిర్మించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి మన్మోహన్ అందించిన విశిష్టమైన సేవలను ఖర్గే తన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతకముందు ఆయన ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. మన్మోహన్ స్మారక నిర్మాణంపై చర్చించారు. మన్మోహన్ శాశ్వత విశ్రాంతి తీసుకొనే ప్రదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని, అదొక పవిత్రమైన స్థలంగా ఉండాలని పేర్కొన్నారు. -
సేంద్రియ రైతులకు ఆహ్వానం
సాక్షి, సిద్దిపేట/రంగారెడ్డి జిల్లా/నందిగామ: భారతదేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగానిది కీలకపాత్ర అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. రైతుల ఆర్థిక ప్రగతే దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా పనిచేస్తుందని చెప్పారు. మెదక్ జిల్లాలోని తునికి గ్రామంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో బుధవారం నిర్వహించిన సేంద్రియ రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. మెదక్ జిల్లాలో 655 మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలో చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. తునికి గ్రామం తనకు మార్గదర్శకమని చెప్పారు. తునికి సేంద్రియ సాగు రైతులంతా మూడు రోజులపాటు ఢిల్లీలోని తన గృహానికి అతిథులుగా రావాలని ఆహ్వానించారు. స్థానిక మార్కెటింగ్ పెంచాలి 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి కిసాన్ దివస్‌ను ప్రారంభించగా.. త్వరలో అత్యంత వైభవంగా రజతోత్సవం నిర్వహించుకోబోతున్నామని ఉపరాష్ట్రపతి చెప్పారు. ఇందులో దేశంలోని 730పైచిలుకు కేవీకేలు, 150 ఐకార్ సంస్థలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పండించిన పండ్లు, కూరగాయలను అక్కడే విక్రయిస్తే.. ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రతీ భారతీయుడు జాతీయవాదంపై విశ్వాసంతో ఉండాలని పిలుపునిచ్చారు. సేంద్రియ సాగు పెరగటం శుభ పరిణామం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సేంద్రియ వ్యవసాయ సమ్మేళనంలో 500 కుటుంబాలు పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రైతులు సేంద్రియ సాగు దిశగా అడుగులు వేస్తూ.. రసాయనిక సాగును క్రమంగా తగ్గిస్తుండటం శుభ పరిణామం అని సంతోషం వ్యక్తంచేశారు. కేవీకేలో 43,337 మంది పురుషులు, 16,937 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉండటం గొప్ప విజయమన్నారు. ఈ కార్యక్రమంలో సేంద్రియ రైతులు నరేందర్ రెడ్డి, ధనలక్ష్మిని ఉపరాష్ట్రపతి ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సతీమణి సుదేష్ ధన్‌ఖడ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్‌రావు, ఆర్ఎస్ఎస్ కార్యదర్శి భాగయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి దంపతులకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీలు డాక్టర్ కె.లక్ష్మణ్, వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి, డీజీపీ జితేందర్, తదితరులు ఘన స్వాగతం పలికారు. కన్హా శాంతివనంలో ధ్యానం.. రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనం దేశంలో అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుందని జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. బుధవారం ఉపరాష్ట్రపతి దంపతులు కన్హా శాంతివనాన్ని సందర్శించారు. హార్ట్ఫుల్నెస్, శ్రీరామచంద్ర మిషన్ గురూజీ కమ్లేష్ పటేల్ (దా జీ)తో కలిసి వారు ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. కమ్లేష్ పటేల్ వలన ప్రతి ఒక్క రూ ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ధన్‌ఖడ్ దంపతులు రాత్రి కాన్హాలోనే బసచేశారు. గురువారం ఉదయం ధ్యానం చేసిన అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు. -
ధన్‌ఖడ్‌పై అభిశంసన నోటీసు తిరస్కరణ
న్యూఢిల్లీ: అధికార పక్షం పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాల కూటమి పార్టీలు రాజ్యసభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నోటీసు గురువారం తిరస్కరణకు గురైంది. వాస్తవికత లోపించిందని, వ్యక్తిగత దాడిని ఈ నోటీసు ప్రతిబింబిస్తోందని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘ నోటీసు మొత్తం తప్పుల తడకగా ఉంది. ప్రామాణిక విధానంలో రూపొందించ లేదు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రతిష్టను దురుద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా నోటీసును సిద్ధంచేశారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ప్రవేశపెట్టిన నోటీస్ ఇది’’ అంటూ హరివంశ్ ఈ నోటీసును తిరస్కరించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఛైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధిత వివరాలున్న మూడు పేజీల రూలింగ్‌ను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి పీసీ మోడీ గురువారం సభ ముందు ఉంచారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ధన్‌ఖడ్‌పై తాము విశ్వాసం కోల్పోయామని, ఆయనను ఆ పదవిని తప్పించాలని కోరుతూ 60 మంది విపక్ష పార్టీల ఎంపీలు డిసెంబర్ పదో తేదీన సంతకాలుచేసి ఆ అభిశంసన తీర్మాన నోటీసును రాజ్యసభలో అందించిన విషయం విదితమే. ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు వీలు కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బీ) కింద విపక్షాలు ఈ నోటీసును ఇచ్చాయి. ‘‘ నోటీస్ ద్వారా విపక్ష సభ్యులు ఉపరాష్ట్రపతి అధికారాలను తక్కువ చేసి చూపించే అనవసర సాహసం చేశారు. పార్లమెంట్, పార్లమెంట్ సభ్యుల ప్రతిష్టకు భంగం కల్గించేలా ఉన్న ఈ నోటీసు డిప్యూటీ ఛైర్మన్ అభిప్రాయాలను కించపరిచేలా ఉంది. అయినా ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు సంబంధించిన తీర్మానంపై ఓటింగ్ చేపట్టాలంటే కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. డిసెంబర్ 10న సభ ముందుకొచ్చిన ఈ నోటీస్‌పై తీర్మానం, అనుమతి అనేవి నిబంధనల ప్రకారం డిసెంబర్ 24వ తేదీ తర్వాతే సాధ్యం. మంత్రిమండలి నవంబర్ ఆరో తేదీన నోటిఫై చేసిన ప్రకారం ప్రస్తుత రాజ్యసభ 266వ సెషన్ నవంబర్ 25న మొదలై డిసెంబర్ 20న ముగుస్తుంది. ఈ లెక్కన తీర్మానం తేదీ(డిసెంబర్ 24)కంటే ముందుగానే రాజ్యసభ సెషన్ ముగుస్తోంది. ఇలాంటి సందర్భంలో తీర్మానాన్ని ఆ తేదీలోపే అనుమతించడం కుదరదు’’ అని హరివంశ్ వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
నేను రైతు బిడ్డను.. నేను కార్మికుడి బిడ్డను
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై శుక్రవారం ఎగువ సభలో తీవ్రస్థాయిలో రగడ జరిగింది. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం దూషించుకున్నారు. చైర్మన్ ధన్‌ఖడ్, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభ మొదటి గంటలోనే సోమవారానికి వాయిదా పడింది. శుక్రవారం సభ ప్రారంభం కాగానే తొలుత బీజేపీ సభ్యుడు రాధామోహన్ దాస్ మాట్లాడారు. ధన్‌ఖడ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసు అంశాన్ని లేవనెత్తారు. నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజులకు సభలో చర్చ జరగాల్సి ఉండగా, ప్రతిపక్షాలు నిత్యం ధన్‌ఖడ్‌పై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయని తప్పుపట్టారు. దేశాన్ని, ఉపరాష్ట్రపతి పదవిని, రైతులను కించపరుస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రపతులను, ఉప రాష్ట్రపతులను అగౌరవపర్చిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ దేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను పదేపదే కించపర్చేవారని చెప్పారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ మృతిచెందితే అంత్యక్రియలు ఢిల్లీలో జరగనివ్వలేదని, మృతదేహాన్ని పటా్నకు తరలించారని గుర్తుచేశారు. అంత్యక్రియలకు హాజరు కాకూడదని అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను నెహ్రూ కోరారని తెలిపారు. అయినప్పటికీ నెహ్రూ మాట లెక్కచేయకుండా పటా్నలో బాబూ రాజేంద్ర ప్రసాద్ అంత్యక్రియలకు రాధాకృష్ణన్ హాజరయ్యారని వెల్లడించారు. కాంగ్రెస్ పారీ్టకి రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కేవలం ఒక్క కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఆరాటపడుతోందని బీజేపీ ఎంపీ కిరణ్ చౌదరి విమర్శించారు. రైతు బిడ్డ అయిన ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఈ సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీకి ధన్‌ఖడ్ అవకాశం ఇచ్చారు. ధన్‌ఖడ్ రైతు బిడ్డ అయితే, ఖర్గే కార్మికుడి బిడ్డ అని చెప్పారు. దళితుడైన ఖర్గేకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో ధన్‌ఖడ్ తీవ్రంగా స్పందించారు. ‘‘నేను రైతు బిడ్డను. ఎవరికీ భయపడను. దేశం కోసం ప్రాణత్యాగమైనా చేస్తా. మీకు(విపక్షాలు) నిత్యం ఒక్కటే పని. నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. నాపై దు్రష్పచారం చేస్తుండడం వ్యక్తిగతంగ బాధ కలిగిస్తోంది. ఇప్పటికే చాలా సహించా. నాపై అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కుమీకు ఉండొచ్చు. నోటీసు ఇచ్చాక చర్చ జరగడానికి 14 రోజులు వేచి చూడాలి. కానీ, వేచి చూసే ఓపిక మీకు లేదు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు’’ అని ధన్‌ఖఢ్ మండిపడ్డారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మీ గొప్పలు వినడానికి రాలేదు: ఖర్గే ఆ తర్వాత ఖర్గే మాట్లాడారు. ‘‘మీరు(ధన్‌ఖడ్) బీజేపీ సభ్యులను ప్రోత్సహిస్తున్నారు. మాపై ఉసిగొల్పుతున్నారు. నేను కార్మికుడి బిడ్డను. జీవితంలో మీకంటే ఎక్కువ సవాళ్లు ఎదుర్కొన్నా. మీరు మా పార్టీని, మా పార్టీ నాయకులను కించపరుస్తున్నారు. మీరు చెప్పుకొనే గొప్పులు వినడానికి మేము ఇక్కడికి రాలేదు. చర్చ కోసం వచ్చాం. మీరు పక్షపాతం చూపుతున్నారు. విపక్షాల గొంతును నొక్కేస్తున్నారు. రాజ్యసభ కార్యకలాపాలకు మీరే పెద్ద అడ్డంకి. మరో పదోన్నతి సాధించుకోవడానికి ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు. సభ సజావుగా సాగాలన్నదే తన ఉద్దేశమని, సభలో గొడవలకు తావులేకుండా సభ్యులంతా సహకరించాలని కోరారు. దీనిపై చర్చించడానికి తన చాంబర్‌కు రావాలని ఖర్గేతోపాటు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను ధన్‌ఖడ్ ఆహ్వానించారు. దీనిపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని ఎలా గౌరవించాలి? మీరు నన్ను దారుణంగా కించపర్చారు అంటూ మండిపడ్డారు. -
పార్లమెంట్లో అదే రగడ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రగడ యథాతథంగా కొనసాగింది. ప్రధానంగా రాజ్యసభలో గురువారం వాగ్వాదాలు, నిరసనలు, నినాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం పట్ల అధికార బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా బిలియనీర్ జార్జి సోరోస్‌తో కాంగ్రెస్ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని, దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభ్యుల ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము లేవనెత్తిన అంశాలపై సభలో వెంటనే చర్చ ప్రారంభించాలని కోరుతూ విపక్షాలు ఇచ్చిన ఆరు నోటీసులు చైర్మన్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. సభలో కేంద్ర మంత్రి జె.పి.నడ్డా మాట్లాడారు. ధన్‌ఖడ్ బీజేపీ ప్రతినిధిగా పని చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలను ఖండించారు. చైర్మన్ ఇచ్చిన రూలింగ్‌ను విమర్శించడం సభా మర్యాదను ఉల్లంఘించడమే, సభాధ్యక్ష స్థానాన్ని అగౌరవపర్చడమే అవుతుందని అన్నారు. చైర్మన్‌ను చీర్లీడర్ అనడం ఏమిటని కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం అంటే, పార్లమెంటరీ సంప్రదాయాలు అంటే గౌరవం లేదని ఆక్షేపించారు. జార్జి సోరోస్‌కు, సోనియా గాం«దీకి సంబంధాలు ఏమిటని నిలదీశారు. దీనిపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మన దేశాన్ని ముక్కలు చేయడానికి సోరోస్ కోట్లాది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాడని నడ్డా ధ్వజమెత్తారు. నడ్డాపై వ్యాఖ్యలపై సభలో మల్లికార్జున ఖర్గే స్పందిస్తుండగా, బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో మైనారీ్టలపై హింసాకాండపై ప్రధాని మోదీ స్పందించాలని, సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ సభ్యులు నినాదాలు ప్రారంభించారు. సభ ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు. ముఖం దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నా: గడ్కరీ దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రమాదాల నివారణపై ఆయన లోక్‌సభలో గురువారం సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. విదేశాల్లో జరిగే సమావేశాలకు వెళ్లినప్పుడు మన దేశంలో రోడ్డు ప్రమాదాల ప్రస్తావన వస్తే తన ముఖాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అయితే రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిందేనని తేలి్చచెప్పారు. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్(సవరణ) బిల్లు–2024ను లోక్‌సభలో విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. వాతావరణ మార్పులను ఎలా ఎదుర్కొంటారో ఈ బిల్లులో ప్రస్తావించలేదని విమర్శించారు. ఈ బిల్లు గురువారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. -
అతిపెద్ద అధికార ప్రతినిధి ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభ నిర్వహణలో రాజ్యసభ చైర్మన్ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన జగదీప్ ధన్‌ఖడ్ పూర్తి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి అతిపెద్ద అధికారి ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తాయి. ధన్‌ఖడ్‌ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానం నోటీసును మంగళవారం రాజ్యసభలో విపక్ష సభ్యులు అందజేయడం తెల్సిందే. దీనిపై బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తోటి విపక్షాల ‘ఇండియా’ కూటమి ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ ధన్‌ఖడ్ ఒక ప్రభుత్వ అధికారి ప్రతినిధిలా ప్రవర్తిస్తున్నారు. సీనియర్ పార్లమెంటేరియన్లకూ పాఠశాల ప్రధానోధ్యాయునిలా ధన్‌ఖడ్ క్లాసులు పీకుతున్నారు. సభలో విపక్ష సభ్యులకు మాట్లాడే స్వేచ్ఛనివ్వట్లేదు. సభ సజావుగా సాగకుండా అడ్డు తగిలే అతిపెద్ద అవరోధం ధన్‌ఖడ్. ఆయన చూపే వివక్ష చూసి విసుగెత్తిపోయాం. ఆయన వైఖరి, ధోరణి సైతం విపక్షాలకు అనుకూలంగా లేదు. అందుకే ఆయనను తొలగించాలని నోటీస్ ఇచ్చాం. రాజ్యసభ నియమ నిబంధనావళిని తుంగలో తొక్కి రాజకీయాలు ముందంజలోకి వచ్చాయి’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ రాజ్యాంగం, రాజ్యాంగబద్ధ సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ ధన్‌ఖడ్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తర్వాత మరేదో పదోన్నతి వస్తుందన్న ఆశతో పనిచేస్తున్న అతిపెద్ద అధికార ప్రతినిధిలా ఆయన వాలకం ఉంది. ఆయన తన వైఖరితో రాజ్యసభకు ఉన్న ప్రతిష్టను, పరువును దెబ్బతీస్తున్నారు. మాకు ఆయనపై ఎలాంటి వ్యక్తిగత కక్ష, కోపాలు లేవు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మేం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు పట్టుబడుతున్నాం’’ అని ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి: డీఎంకే‘‘ ఛైర్మన్ ద్వారా బీజేపీ ప్రదర్శిస్తున్న ఈ వైఖరి స్పష్టంగా ప్రజాస్వామ్యంపై దాడే’’ అని డీఎంకే నేత తిరుచ్చి శివ వ్యాఖ్యానించారు. ‘‘ రాజ్యసభలో విపక్ష సభ్యుల గొంతుక వినిపించే అవకాశం చిక్కట్లేదు’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్ హక్ అన్నారు. ‘‘ చైర్మన్ రాజ్యసభను నడుపుతున్నట్లు లేదు ఒక సర్కస్‌ను నడుపుతున్నట్లు ఉంది. ఉన్న సమయమంతా ఆయన తన సొంత విషయాలు మాట్లాడటానికే సరిపోతోంది. ఉన్న కాస్తంత సమయాన్ని ఆయనే వృథాచేస్తారు’’ అని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. టీఎంసీ నేత సాగరికా ఘోష్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా తదితరులు ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇదీ చదవండి: ధన్‌ఖఢ్‌పై అవిశ్వాసం -
రాజ్యసభ ఛైర్మన్ పై ఇండియా కూటమి అవిశ్వాసం
-
ధన్‌ఖడ్‌పై ‘అవిశ్వాసం’
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపార్టీలు మంగళవారం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న ధన్‌ఖడ్‌ను రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి తొలగించాల్సిందేనని తేల్చిచెప్పాయి. అవిశ్వాస తీర్మానం నోటీసుపై కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆమ్ ఆద్మీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యసభ చరిత్రలో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం గట్టిగా పోరాడుతామన్న సందేశం ఇవ్వడానికే అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చినట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. ఆయన అన్ని పరిధులు అతిక్రమించారని, అందుకే నోటీసు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యనాయకులపై బీజేపీ ఎంపీలు ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నా ధన్‌ఖఢ్ పట్టించుకోలేదని విమర్శించారు.ఈ మేరకు జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ధన్‌ఖఢ్ విషయంలో ఇండియా కూటమి పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. సభను ఆయన నడిపిస్తున్న తీరు సక్రమంగా లేదన్నారు. ప్రతిపక్షాలపై ఆయన వివక్ష చూపుతున్నారన్న అభిప్రాయం కలుగుతోందన్నారు. ధన్‌ఖఢ్ కేవలం ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు తప్ప రాజ్యసభ చైర్మన్‌గా నిజాయతీగా పనిచేయడం లేదని తప్పుపపట్టారు. ధన్‌ఖడ్‌ను పదవి నుంచి తప్పించడానికి అవసరమైన బలం తమకు లేదని రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు సాగరికా ఘోష్ చెప్పారు. అయినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ కోసమే పోరాడుతున్నారని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని తేలి్చచెప్పారు. ధన్‌ఖడ్‌ను చూసి గర్వపడుతున్నాం: రిజిజు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను పదవి నుంచి తొలగించడానికి విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం చాలా విచారకరమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ధన్‌ఖడ్‌ను చూసి తాము గర్వపడుతున్నామని చెప్పారు. ఆయన చాలా హూందాగా, పక్షపాతానికి తావులేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం ఎంతమాత్రం లేదని, రాజ్యసభలో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉందని రిజిజు గుర్తుచేశారు. లోక్‌సభలో మూడుసార్లు నోటీసులు లోక్‌సభలో స్పీకర్‌ను తొలగించాలని కోరుతూ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 1954 డిసెంబర్ 18న అప్పటి స్పీకర్ జి.వి.మౌలాంకర్, 1966 నవంబర్ 24న హుకం సింగ్, 1987 ఏప్రిల్ 15న బలరాం జక్కడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి. మౌలాంకర్, బలరాం జక్కడ్‌పై తీర్మానాలు వీగిపోయాయి. హుకుం సింగ్‌పై ఇచ్చిన నోటీసు తిరస్కరణకు గురైంది. ఓటింగ్‌లో పాల్గొనడానికి 50 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు సముఖత వ్యక్తం చేయకపోవడమే ఇందుకు కారణం. ఓటింగ్ జరగాలంటే కనీసం 50 మంది సభ్యులు అంగీకరించాలి. -
ధన్‌ఖడ్‌పై అవిశ్వాసం..జరిగేది ఇదే..!
సాక్షి,ఢిల్లీ: ఉపరాష్ట్రపతి,రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానంపై దాదాపు 70 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అవిశ్వాస తీర్మానానం అంశంలో కాంగ్రెస్ లీడ్ తీసుకుంటోంది. కాంగ్రెస్ సభ్యులతో చైర్మన్ రాజ్యసభలో వ్యవహరిస్తున్న తీరు వల్లే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు చెబుతున్నారు.అధికార బీజేపీ సభ్యులకు చైర్మన్ కావాలనే కాంగ్రెస్-సోరోస్ లింకులపై నినాదాలు చేయడానికి అవకాశాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే తీర్మానం ఆమోదం పొంది ఉపరాష్ట్రపతి దన్ఖడ్ను తొలగించాలంటే పార్లమెంట్ ఉభయసభల్లో అవిశ్వాస తీర్మానం మెజారిటీ ఓట్లతో నెగ్గాల్సి ఉంటుంది. అధికార ఎన్డీఏతో పోలిస్తే ఇండియా కూటమికి పార్లమెంట్ ఉభయసభల్లోనూ మెజారిటీ లేకపోవడంతో ఈ తీర్మానం నెగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే తమ తీర్మానంతో ఇండియా కూటమి సభ్యులంతా మళ్లీ ఒక్కటై రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం అంశంలో విజయం సాధిస్తామని విపక్షాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.కాగా, ప్రొసీజర్ ప్రకారం అవిశ్వాస తీర్మానం ముందు రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలని రాజ్యాంగం చెబుతోంది. అయితే ఈ పార్లమెంట్ సెషన్ డిసెంబర్ 20తో ముగుస్తుండడంతో తీర్మానం అసలు సభలోకి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. కేవలం చైర్మన్ తీరును దేశ ప్రజల ముందు ఎండగట్టాలనే వ్యూహంతోనే ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందన్న మరో వాదనా వినిపిస్తోంది.ఒకవేళ రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. తర్వాత ఏం జరుగుతుంది..?చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ఒకవేళ రాజ్యసభలో ప్రవేశ పెట్టారనే కాసేపు అనుకుందాం. ఇక్కడ తీర్మానం సింపుల్ మెజారిటీతో ఆమోదం పొందాలి. అప్పుడే తీర్మానం లోక్‌సభకు వెళుతుంది. అక్కడికీ వెళ్లిందనుకుందాం.. తీర్మానం.. అక్కడా సింపుల్ మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇంత జరిగితేనే ధన్‌ఖడ్ పదవిని కోల్పోతారు. నిజానికి నోటీసు ఇచ్చినప్పటి నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలంటే 14 రోజుల టైమ్ రాజ్యాంగ నిబంధన. ఇక్కడ ఆ నిబంధనను ఇండియా కూటమి పాటించలేదు. సెషన్ మరో 10 రోజులుందనగా నోటీసు ఇచ్చింది. దీంతో తీర్మానం అసలు రాజ్యసభకే వెళ్లదని తెలుస్తోంది. ఒక వేళ వెళ్లినా ఏ సభలోనూ ఇండియా కూటమికి సింపుల్ మెజారిటీ లేదనే విషయం తెలిసిందే. -
రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి.. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. రాజ్యసభలో చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు తరుచూ ఆరోపిస్తున్నాయి. ఆయన తమ ప్రసంగాలకు అంతరాయం కలిగిస్తున్నారని, క్లిష్టమైన అంశాలపై తగిన చర్చకు అనుమతించడం లేదని, వివాదాస్పద చర్చల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే రాజ్యంగంలోని ఆర్టికల్ 67(బీ) ప్రకారం జగ్దీప్ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, ఇతర భారత బ్లాక్ పార్టీల సభ్యులు ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తీర్మానంపై ఇప్పటికే ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన 70 మంది ఎంపీలు సంతకాలు చేశారు.కాగా బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరస్‌తో కాంగ్రెస్ నేతలు లింకు పెట్టుకున్నట్లు బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. సభాపక్ష నేత, ప్రతిపక్ష నేతలతో ధన్కడ్ సమావేశం నిర్వహించి సభను సజావుగా సాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఐక్యత, సార్వభౌమత్వం.. దేశానికి పవిత్రమైనవని, ఆ ఐకమత్యాన్ని, సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడాన్ని సహించబోమని ధన్కడ్ తెలిపారు. -
రాజ్యసభలో దొరికిన డబ్బులు ఎవరివి?
ఢిల్లీ : రాజ్యసభలో సెక్యూరిటీ అధికారులకు రూ.50వేల నగదు లభ్యమవ్వడంపై దుమారం చెలరేగింది. సభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సంఘ్వీకి కేటాయించిన స్థానంలో ఆ నగదు లభ్యమైందని భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వెల్లడించారు. వెంటనే ఆ నగదుపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.అయితే జగదీప్ ధనకర్ ఆదేశాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టకుండానే నగదు ఎక్కడ దొరికిందో చెప్పడం సరైంది కాదన్నారు. విచారణ పూర్తయిన తర్వాత సభలోని సభ్యుల పేర్లను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.మరోవైపు, తన స్థానంలో రూ.50వేల నగదు లభ్యం కావడంపై కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ ఖండించారు. రూ.50వేల నగదు గురించి నాకు తెలియదు. భారీ మొత్తంలో రాజ్యసభలో నగదు లభ్యమైందని తొలిసారి వింటున్నా. గురువారం రాజ్యసభకు వెళ్లేటప్పుడు జేబులో రూ. 500 నోటు మాత్రమే ఉంది. మధ్యాహ్నం 12.57 గంటలకు రాజ్యసభకు చేరుకున్నాను.. మధ్యాహ్నం 1.00 గంటకు సభ వాయిదా పడింది. అనంతరం 1.30 గంటల వరకు క్యాంటీన్లో కూర్చున్నాను.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాను.’ అని సింఘ్వీ తెలిపారు.కొన్నినిమిషాల పాటు సభలో కూర్చున్నానని, రూ.50వేల నగదు తన సీటు వద్ద ఎలా దొరికాయో తనకు తెలియదని అన్నారు. విచారణ చేపడితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఎక్స్ వేదికగా స్పందించారు. Seat number 222 in Rajya Sabha belongs to Congress MP Abhishek Manu Singhvi ji.Abhishek Manu Singhvi ji StatedThat he goes to Rajya Sabha with only one Rs 500 note.Yesterday also he reached the house at 12.57The House adjourned at 1 o'clock, till 1.30 he was present in the… pic.twitter.com/iAQtQxrVCQ— Harmeet Kaur K (@iamharmeetK) December 6, 2024 -
‘నా ఛాంబర్లో చొరబాటు’.. రాజ్యసభ ఛైర్మన్‌కు ఖర్గే లేఖ
ఢిల్లీ: సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్( సీపీడబ్ల్యూడీ ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), టాటా ప్రాజెక్ట్‌ల అధికారులు సమాచారం ఇవ్వకుండా పార్లమెంట్‌లోని తన గదిలోకి ప్రవేశించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు లేఖ రాశారు.‘‘ఇది చాలా అసాధారణ విషయం. నా ఛాంబర్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి.. ఎంపీగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నాకున్న అధికారాలు, నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇలా నా ఛాంబర్లోకి చొరబాడటం... అగౌరవపర్చటంతో పాటు ఆమోదయోగ్యం కాదు. ఎవరి అదేశాలు, సూచనల ప్రకారం వారు అనుమతి లేకుండా నా ఛాంబర్లోకి ప్రవేశించారో తెలియజేయాని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి' అని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.అయితే.. ఈ విషయంపై ఇంకా ఎటువంటి అప్డేట్ లేదని రాజ్యసభ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఖర్గే లేఖపై.. సీఐఎస్ఎఫ్ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఛాంబర్లతో ఏవైనా నిర్మాణ మరమత్తు పనులు జరుగుతున్న సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్‌లోని ప్రోటోకాల్‌లో భాగంగా ఇతర ఏజెన్సీలతో కలిసి ఉంటారని ఓ అధికారి తెలిపారు.‘‘పలు కార్యాలయాల్లో మరమత్తు పనులు జరిగాయి. కార్యాలయాల తాళాలు సీఐఎస్ఎఫ్ వద్ద లేవు. పార్లమెంటు అంతటా భద్రత కోసం మాత్రమే సీఐఎస్ఎఫ్ ఉంది. నిర్వహణ పనుల జరగుతున్న సమయంలో వారు.. అధికారులతో పాటు పలు కార్యాలయాలకు వెళ్లి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూశారు’ అని చెప్పారు. -
రాహుల్ రాజ్యాంగ వ్యతిరేకి: ధన్‌ఖడ్
ముంబై : రిజర్వేషన్లను ఎత్తివేయాలన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మండిపడ్డారు. ఆయనది రాజ్యాంగ వ్యతిరేక మనస్తత్వమని విమర్శించారు. ఆదివారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కొందరు రాజ్యాంగ స్వరూపం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో రాజ్యాంగంపై అందరికీ అవగాహన అత్యవసరం’’ అని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు. ‘‘రాజ్యాంగమున్నది డాంబికంగా ప్రదర్శించడానికి కాదు. దాన్ని గౌరవించాలి. అధ్యయనం చేయాలి. అర్థం చేసుకోవాలి. బాధ్యత కలిగిన, తెలివున్న, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ వ్యక్తీ ఇలా ప్రవర్తించరు’’ అంటూ రాహుల్‌పై నిప్పులు చెరిగారు. ఇటువంటి దుస్సాహాలను తిప్పికొట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ‘‘రాజ్యాంగ పదవిలో వ్యక్తి రిజర్వేషన్లను ఎత్తేయాలని విదేశీ గడ్డపై మాట్లాడటం రాజ్యాంగ వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం. ఇలాంటి రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరి బహుశా ఆయనకు వారసత్వంగా అబ్బింది’’ అంటూ దుయ్యబట్టారు. రిజర్వేషన్లున్నది సమాజానికి మూలస్తంభాల్లాంటి సామాజిక వర్గాలకు చేయూతనిచ్చేందుకేనని ధన్‌ఖడ్ స్పష్టం చేశారు. -
Vice President Jagdeep Dhankhar: పరస్పర సహకారం మరింతగా పెరగాలి
న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికా మధ్య మౌలిక సదుపాయాలు, స్పేస్, వ్యవసాయం, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పరస్పర సహకారం మరింతగా పెరగాలని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ఆకాంక్షించారు. ఇండియా–ఆఫ్రికా సదస్సులో మాట్లాడుతూ డ్యూటీ–ఫ్రీ టారిఫ్ ప్రిఫరెన్స్ (డీఎఫ్‌టీపీ) స్కీముతో ఇరు దేశాలు అభివృద్ధి చెందడానికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పుష్కలంగా సహజ వనరులు, ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా ద్వారా పెరుగుతున్న ఆర్థిక సమగ్రత తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు ఆఫ్రికా ఆకర్షణీయమైన కేంద్రంగా ఉంటోందని ధన్కడ్ చెప్పారు. అలాగే, కొత్త తరం డిజిటల్ టెక్నాలజీలు, అంతరిక్ష రంగంలాంటి విషయాల్లో భారత్‌తో ఆఫ్రికా సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చన్నారు. సీఐఐ ఇండియా–ఆఫ్రికా బిజినెస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ధన్కడ్ ఈ విషయాలు వివరించారు. 43 ఆఫ్రికా దేశాల్లో 203 ఇన్ఫ్రా ప్రాజెక్టులపై భారత్ 12.37 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. 85 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఆఫ్రికాకు భారత్ నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటోందని వివరించారు. స్వచ్ఛ సాంకేతికత, వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలవగలిగే సాగు విధానాలు, తీర ప్రాంత గస్తీ, కనెక్టివిటీ వంటి విభాగాల్లో భారత్, ఆఫ్రికా కలిసి పని చేయొచ్చని ధన్కడ్ చెప్పారు. -
విస్మరిస్తే చంపెయ్యాలి: ధన్‌ఖడ్
జైపూర్: దేశం కంటే వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారిని చంపేయాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలను పరమోన్నతంగా భావించని వారు వెల్లడించే అభిప్రాయం దేశ వ్యతిరేకంగానే ఉంటుందని పేర్కొన్నారు. దేశం ముందుకు సాగాలంటే ఇటువంటి వారిని అడ్డుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అయినా వారు జాతి అభివృద్ధికి హానికరమైన తమ చర్యలను కొనసాగిస్తున్న పక్షంలో చంపేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానన్నారు. విభిన్న అభిప్రాయాలను కలిగి ఉండటం ప్రజాస్వామ్యమనే పుష్పగుచ్ఛంలో పరిమళాలన్న ఉపరాష్ట్రపతి.. వ్యక్తిగత, రాజకీయ లాభం కంటే జాతి ప్రయోజనాలను మిన్నగా చూసుకునే వారికే ఇది వర్తిస్తుందన్నారు. మన గుర్తింపు భారతీయత, మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదన్నారు. ఆదివారం జైపూర్‌లో అవయవదాతలతో ఏర్పాటైన సమావేశంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ మాట్లాడారు. -
వంకర బుద్ధుల పెద్దలు
ఏం చదివితే ఏమి? ఏ పదవిలో కూర్చుంటే ఏమి? పితృస్వామ్య భావజాలం నరనరాన జీర్ణించుకున్నప్పుడు ప్రతి ఒక్కడూ ఒక మనువే అవుతాడు. ఇందుకు రాజ్యసభలో జయాబచ్చన్ పట్ల చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వ్యవహారశైలే ఒక ఉదాహరణ.ప్రజలందరి స్వేచ్ఛా సమానత్వాలను కాపాడటానికి కృషి చేసే చట్టసభల్లో మహిళా సభ్యులు అవమానాలకు, వివక్షలకు గురి కావడం భారతదేశంలో చాలా సహజంగా మారిపోయింది, చర్చించవలసిన విషయం కాకుండా పోయింది. ఇందిరాగాంధీ, జయ లలిత, సోనియాగాంధీ, మాయావతి, మమతా బెనర్జీతో సహా రాష్ట్రాల మహిళా శాసనసభ్యులు అనేకమంది ఇలాంటి వాటిని ఎదుర్కొన్నవారే. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, రెండు దశాబ్దాలుగా భారత పార్లమెంటేరియన్; ఆస్తులు, హోదాలు, కుటుంబపు దన్ను, సామాజిక ఆధిపత్య స్థానంలో ఉన్న జయాబచ్చన్ కూడా రాజ్యసభలో తన పేరును వ్యంగ్యంగా కాక గౌరవంగా పిలవడం కోసం పోరాటం చేస్తోంది. ‘తోటి సభ్యురాలి పేరుకి విలువ ఇవ్వనివారు, మా హక్కులను ఎలా కాపాడతారని’ ప్రజలు ప్రశ్నిస్తే చట్టసభలు ఏమని సమాధానం ఇస్తాయి? మొన్నటి రాజ్యసభ సమావేశాల్లో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్‌ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తను మాట్లాడ టానికి అవకాశం ఇమ్మని కోరిన జయను ఉద్దేశించి– ‘ఇపుడు జయా అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడతారని’ ధన్‌ఖడ్ అన్నారు. ‘అమితాబ్’ పేరుని ఒత్తి పిలవడంతో, అందులోని వ్యంగ్యాన్ని జయ గుర్తించి అందుకు అభ్యంతరం చెప్పింది. అప్పటికి అది నాలుగోసారి జయ పేరుని ధన్‌ఖడ్ ఆ తీరులో పలకడం! తనని జయాబచ్చన్ అని మాత్రమే పిలవమని ప్రతిసారీ ఆయనకు చెబుతూనే ఉంది. తను భర్త చాటు భార్యను కాననీ, స్త్రీగా తన ఉనికిని గుర్తించాలని స్పష్టంగా చెప్పింది. ఒక స్త్రీ, అందునా ప్రతిపక్షంలో ఉన్న స్త్రీ కచ్చితంగా చెప్పడం ఎంతటి ఉదారులకైనా నచ్చు తుందా! ఎన్నికల అఫిడవిట్లో జయ పేరు ‘జయా అమితాబ్ బచ్చన్’ అని ఉంటుంది. అందుకే అలా పిలిచానని ధన్‌ఖడ్ అన్నారు. రాజ్యసభలో ఉన్న సభ్యుల పేర్లన్నీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే పిలవడం లేదు కదా! దీన్ని బట్టి చూస్తే జయని రెచ్చగొట్టడానికే పదేపదే అలా పిలిచారు. అయితే పేరు పిలవడం కేవలం సాంకేతిక విషయం కాదు. పైకి మామూలుగా కనిపించే మాటకు మనం అద్దే స్వరం ద్వారా ఉద్దేశించిన అర్థం మారి పోవచ్చు. తనొక కళాకారిణిననీ, ఎదుటివారి హావభావాలు తనకి ఇట్టే తెలిసిపోతాయనీ, ‘పిలిచిపుడు మీ టోన్ బాలేద’నీ చెప్పింది జయ. చట్టసభల్లో సభాధ్యక్షులు ఎలా వ్యవహరించాలి అన్నదానికి మనకి కొన్ని సంప్ర దాయాలు ఉన్నాయి. చైర్మన్ ఏ పార్టీ నుంచి ఎన్నిక అయినా సరే సభలో ఉన్న అన్ని పార్టీలు, సభ్యుల పట్ల తటస్థ వైఖరితో వ్యవహరించాలి. కానీ జగదీప్ ధన్‌ఖడ్ సభా నిర్వహణ చాలా స్పష్టంగా ఒక పక్షం వైపు పనిచేస్తూనే ఉంది. ఆయన ముందుగానే ప్రతిపక్ష సభ్యులతో వాదం వేసుకుని అధికారపార్టీ సభ్యుల పని సులువు చేస్తారు. దేశ ప్రజలందరికీ ఆదర్శమైన వ్యక్తిత్వంతో ఉండాల్సిన మనిషి, పరుషమైన భాష, వ్యంగ్యపు హావభావాలు, కటుత్వం, ఆధిపత్యపు మొగ్గు, సభా సంప్రదాయాలను పట్టించుకోకపోవడం ద్వారా ప్రతిపక్ష సభ్యుల విశ్వసనీయతను కోల్పోతున్నారు. తను కళాకారిణిని కాబట్టి హావభావాలు గ్రహించానని చెప్పడం, ‘మనం కొలీగ్స్ కదా’ అని జయ అనడంతో ధన్‌ఖడ్ ద్వంద్వానికి గురయ్యారు. ‘మీరు సెలబ్రెటీ అయితే ఏమిటి, సభలో అందరూ ఒక్కటే’ అన్న మరుక్షణమే ‘మనం ఒకటి ఎలా అవుతాం! అధ్యక్ష స్థానానికి విలువ ఇవ్వరా!’ అంటూ ధన్‌ఖడ్ పెద్దస్వరంతో మాట్లాడడం రాజ్యసభ ప్రసారాలు చూసినవారికి ఆశ్చర్యం కలిగించింది. ప్రతిపక్ష సభ్యులంతా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. జయకి సోనియాగాంధీ మద్దతుగా నిలబడింది. ధన్‌ఖడ్ స్వభావం గురించి చెబుతూ సభ్యులను తరచుగా ‘శూన్యబుద్ధి’ అంటారని, మాట్లాడుతుంటే ‘న్యూసెన్స్’ అంటారని జయ చెప్పింది. ఈ సందర్భంలో జయ ప్రస్తావించిన ‘మాటల్లో ధ్వని’ గురించి మాట్లాడుకోవాలి. ‘ఇప్పుడు ఆడవాళ్ళని ఒక మాటని బతకగలమా!’ అన్నది తరచూ వింటున్న మాట. స్త్రీలమీద జరిగే రకరకాల వేధింపులు, దాడులను అరికట్టడానికి కొన్ని చట్టాలు వచ్చాక నిస్సంకోచంగా స్త్రీలను అవమానించడం కొంతమేరకు తగ్గి ఉండవచ్చు. కానీ ఆ మేరకు కొత్త సాధనాలను పితృస్వామ్యం సమకూర్చుకుంటుంది. అందులో ఒకటి ధ్వని గర్భితంగా మాట్లాడటం! తాము వాడే ప్రతీ పదం రాజకీయంగా తప్పులేకుండా చూసుకుని– స్వరంలోని హెచ్చుతగ్గులు, తమకి అవసరమైన పదాలను ఒత్తి పలకడం, హావభావాల ద్వారా వివక్షను చూపడం! రాజ్యసభలో ఈ తెలివైన వివక్షకే జయ గురయింది. దీని వెనుక ఉన్న కారణం ఒక్కటే. ఇప్పటికీ స్త్రీలు రెండవతరగతి పౌరులు! అటువంటివారు చట్టసభల్లోకి వచ్చి మౌనంగా కూర్చోకుండా సవాళ్ళు విసురుతారు, గట్టి గొంతుతో మాట్లాడతారు.అందుకే జేపీ నడ్డా లాంటి వారికి జయలో సభా మర్యాదలు, ప్రజాస్వామిక విలువలు పాటించడం తెలియని గర్వపోతు కనపడింది. స్త్రీలు ఎంతటి స్థానానికి ఎదిగినా వారు సమాజం కళ్ళకు స్త్రీలుగానే కనపడతారు. అందుకే సోనియా గాంధీ ఇటలీ వెళ్లిపోవాలని ఆశిస్తారు. సునీత రెండో పెళ్లి చేసుకోవద్దని డిమాండ్ చేస్తారు. తులసి చందు తన యూట్యూబ్ ఛానెల్ ఆపేయాలని బెదిరిస్తారు. దేశంలోని మామూలు మనుషులంతా ఆ కుస్తీపిల్లని గుండెల్లో పెట్టుకుంటే మతతత్వ వాదులు ఆమె ఒంటి మీది దుస్తులను విప్పాలని చూస్తారు. జయను ఎలా పిలవాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు! కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
Parliament Session: చినికి చినికి గాలివానగా... జయ వర్సెస్ ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: పేరులో ఏముందంటారు. కానీ పేరు పెను వివాదానికి దారి తీయగలదని, అంతకుమించి రాజకీయ సంక్షోభానికీ కారణం కాగలదని రాజ్యసభ సాక్షిగా రుజువైంది. సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్ పేరు విషయమై శుక్రవారం రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ మలుపులు తిరిగి చివరికి రాజకీయ దుమారంగా మారింది. ఏకంగా రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకునే దాకా వెళ్లింది! దాంతో విపక్ష సభ్యులకు, ఆయనకు మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు కీలక మలుపు తిరిగాయి. వేడెక్కిన రాజ్యసభ జయాబచ్చన్ ‘పేరు’ అంశం శుక్రవారం రాజ్యసభను అమాంతం వేడెక్కించింది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై గత వారం బీజేపీ సభ్యుడు ఘన్‌శ్యాం తివారీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడంతో రగడకు బీజం పడింది. ఇది ముగిసిపోయిన అంశమని ధన్‌ఖడ్ బదులివ్వడంతో విపక్ష ఎంపీలంతా గొడవకు దిగారు. దీనిపై జయ మాట్లాడతాననడంతో ధన్‌ఖడ్ అనుమతించారు. ‘జయా అమితాబ్ బచ్చన్! మాట్లాడండి’ అన్నారు. ఆయన తన పేరును పిలిచిన తీరులో వ్యంగ్యం ధ్వనిస్తోందంటూ జయ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘నేను నటిని. హావభావాలను ఇట్టే అర్థం చేసుకోగలను. మీ మాటతీరు ఏమాత్రం అంగీకారయోగ్యంగా లేదు. మీరు సభాధ్యక్ష స్థానంలో ఉండొచ్చు గాక. కానీ మీరు మా తోటి సభ్యులు మాత్రమే’’ అన్నారు. దాంతో ధన్‌ఖడ్ తీవ్రంగా ఆగ్రహించారు. ‘ఇక చాలు’ అంటూ మధ్యలోనే కలి్పంచుకున్నారు. ‘‘మీకు గొప్ప పేరుండొచ్చు. కానీ నటీనటులు దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందే. సభాధ్యక్ష స్థానం నుంచి నేను చూసేది మీకు కని్పంచకపోవచ్చు. నా మాటతీరునే తప్పుబడతారా? నేనేం చేయాలో మీరు నిర్దేశించలేరు’’ అంటూ ఆక్షేపించారు. ఇందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ధన్‌ఖడ్ మరింతగా మండిపడ్డారు. ‘‘మీరు సెలబ్రిటీ అయినా, మరెవరైనా సరే! నథింగ్ డూయింగ్. నిబంధనలను అర్థం చేసుకోవాల్సిందే. సభా మర్యాదలు పాటించి తీరాల్సిందే’’ అని బచ్చన్‌కు స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలంతా తీవ్ర అభ్యంతరం తెలిపినా, మూకుమ్మడిగా నినాదాలకు దిగినా లెక్కచేయలేదు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎవరికీ అనుమతివ్వబోనని స్పష్టం చేశారు. ‘‘పేరు ప్రఖ్యాతులు మీకే ఉంటాయనుకోకండి. మనమంతా ఇక్కడికొచ్చేది మన బాధ్యతలు సరిగా నిర్వర్తించి పేరు సంపాదించేందుకే. పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా నడుచుకోవాలి’’ అంటూ క్లాసు తీసుకున్నారు. ‘‘సీనియర్ సభ్యులైనంత మాత్రాన సభాపతి స్థానాన్ని అవమానించేందుకు సభాపతి మాటతీరుకు ఉద్దేశాలు ఆపాదించేందుకు ఎవరికీ హక్కు లేదు. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించాల్సి వచ్చింది. నా సొంత స్క్రిప్టునే అనుసరిస్తాను తప్ప ఎవరో చెప్పినట్టు నడుచుకునే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లబోవని స్పష్టం చేశారు. జయ పేరుపై రాజ్యసభలో ఆమెకు, ధన్‌ఖడ్‌కు సంవాదం జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. మేం స్కూలు పిల్లలమా?: జయ ధన్‌ఖడ్ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ప్రకటించారు. దాంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు దేశం మొత్తాన్నీ అస్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నారని నాకు బాగా తెలుసు. సభలో గందరగోళం సృష్టించడమే మీ ఉద్దేశం. అందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోను. మీరంతా మీ బాధ్యతల నుంచి పారిపోతున్నారు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘రాజ్యాంగాన్ని పణంగా పెట్టయినా ఖర్గే తన మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’’ అంటూ తప్పుబట్టారు. అనంతరం సోనియాగాంధీ తదితరులతో కలిసి జయాబచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘క్రమశిక్షణలో పెట్టేందుకు మేమేమీ స్కూలు పిల్లలం కాదు. ధన్‌ఖడ్ మాటతీరుతో చాలా కలత చెందాను. అధికార పక్ష సభ్యులు నిండు సభలో మా పట్ల అమర్యాదకరమైన మాటలు వాడుతున్నారు’’ అని ఆరోపించారు.87 మంది ఎంపీల సంతకాలుఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు నోటీస్‌పై 87 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. ‘‘నోటీసు ఎప్పుడివ్వాలో త్వరలో నిర్ణయిస్తాం. ఇది తీర్మానం దాకా వెళ్లకపోయినా, చైర్మన్‌గా ధన్‌ఖడ్ అనుసరిస్తున్న ఏకపక్ష పోకడలను దేశ ప్రజల ముందు ఎత్తి చూపడమే మా ఉద్దేశం’’ అని విపక్షాలు స్పష్టం చేశాయి.ముందస్తు నోటీసు తప్పనిసరి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 67(బి) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలని కోరుతూ మహాభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే తీర్మానం నెగ్గి ఆయన పదవీచ్యుతుడవుతారు. అయితే మహాభిశంసన కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామంటూ కనీసం 14 రోజుల ముందస్తు నోటీసివ్వడం తప్పనిసరి. -
ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి తీర్మానం?
న్యూఢిల్లీ : భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ తీరును విమర్శిస్తూ విపక్ష పార్టీల 'ఇండియా' కూటమిలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఛైర్మన్ పదవి నుంచి ధన్‌ఖర్‌ను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బి) ప్రకారం.. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ పదవి నుండి తొలగించవచ్చు అని ఇండియా కూటమి పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టికల్ 67(బీ) అనుగుణంగా ధన్ఖర్పై చర్య తీసుకోవాలనే ప్రతిపాదనపై 87 మంది సభ్యులు సంతకం చేసినట్లు ప్రతిపక్ష పార్టీ నేతలు చెబుతున్నాయి. రెండ్రోజుల క్రితమే విపక్షాలు ధనఖర్‌ను తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాయని రాజ్యసభలో అధికార పక్ష నేత జేపీ నడ్డాకు సమాచారం అందిందని జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి.ప్రతిపక్ష నాయకులు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేయడం, అమర్యాదగా మాట్లాడడం వంటి అంశాలను ఎత్తి చూపుతూ ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా తీర్మానించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విపక్ష పార్టీ నేతలు మాత్రం సభను నిబంధనల ప్రకారం నడపాలని కోరుకుంటున్నాయని, సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆ వర్గాలు తెలిపాయి.రాజ్యసభ ఛైర్మన్ ధన్ఖర్ సభను ఏకపక్షంగా నడుపుతున్నారని, ప్రతిపక్షంపై పక్షపాత వైఖరని ప్రదర్శిస్తున్నారంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు శుక్రవారం సభలో ఆందోళన చేపట్టాయి. ఆమోదయోగ్యం కాని విధంగా సభలోని సభ్యుల్ని అగౌరపరుస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ.. ఎగువ సభలో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ధన్ఖర్ ఇవ్వడం లేదని పేర్కొన్నాయి. ఈ తరుణంలో రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యారు. -
‘జయా అమితాబ్ బచ్చన్’ వివాదం.. రాజ్యసభలో విపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: ‘జయా అమితాబ్ బచ్చన్’ ప్రస్తావన రాజ్యసభలో మరోసారి గందరగోళాన్ని సృష్టించింది. సమాజ్‌వాదీ ఎంపీ అయిన జయా బచ్చన్‌ను రాజ్యసభలో శుక్రవారం చైర్మన్ జగదీప్ ధన్ఖర్ జయా అమితాబ్ బచ్చన్‌గా సంబోధించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటికే జయా బచ్చన్నుఇప్పటికే రెండు సార్లు ఆ పేరుతో పిలవడం వల్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు మరోసారి ఇదే తంతు పునరావృతం కావడంతో జయా బచ్చన్ అసహనానికి గురయ్యారు. మరోసారి అలా పిలవొద్దని అన్నారు. దీనిపై దన్ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘నాకు పాఠాలు బోధించవద్దు’ అని తీవ్రంగా స్పందించారు. అయితే ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేయడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఛైర్మన్ వైఖరిని నిరసిస్తూ విపక్ష ఎంపీలంతా వాకౌట్ చేశాయి. జయా బచ్చన్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. వాకౌట్ తర్వాత జయా బచ్చన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇది అవమానకరమైన అనుభవమని తెలిపారు. అధికార బీజేపీ నేతలు ప్రతిపక్ష ఎంపీల పట్ల వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. ‘ చైర్మన్ ఏదీ మాట్లాడిన చెల్లుతుందా? ఆయన కూడా మనలంటి ఎంపీనే. ఛైర్మన్ ఉపయోగించిన స్వరాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మేం స్కూల్ పిల్లలం కాదు. మాలో కొందరు సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు.ప్రతిపక్ష నేత (కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే) మాట్లాడేందుకు నిల్చున్న సమయంలో ఆయన మాట తీరు బాధించింది. మైక్ కట్ చేశారు. అలా ఎలా ప్రవర్తిస్తారు? మీరు సెలబ్రిటీ అయితే ఏంటి నేను పట్టించుకోనంటూ తీవ్ర పదజాలం వాడుతుంటారు. ఆయన పట్టించుకోవాలని నేను అడగడం లేదు. ఐదోసారి నేను రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. నాకు తెలీదా ఏం మాట్లాడాలో..? ఇలాంటి ప్రవర్తన పార్లమెంట్లో ఎన్నడూ చూడలేదు. ఆయన మాట్లాడిన తీరు మహిళలకు అగౌరపరిచేలా ఉంది. దీనిపై క్షమాపణలు చెప్పాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఆమె వెంట సోనియా గాంధీ కూడా ఉన్నారు.కాగా ఇటీవల రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వానించారు. దీనిపై జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’ అంటూ పేర్కొన్నారు. ‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’ అంటూ చెప్పగా.. ‘మహిళలను వారి భర్త పేరుతోనే పిలస్తారా, వారికంటూ స్వతహాగా గుర్తింపు లేదా’ అంటూ మండిపడ్డారు. అనంతరం గత సోమవారం కూడా జయా అమితాబ్ బచ్చన్ అని సంభోధించారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ.. జయా బచ్చన్ అని సంబోధిస్తే సరిపోతుందని అన్నారు.పార్లమెంట్ నిరవధిక వాయిదాపార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. -
రాజ్యసభలో తీవ్ర రగడ
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు అంశం పట్ల రాజ్యసభలో అలజడి రేగింది. ప్రతిపక్ష సభ్యులు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. వినేశ్ ఫోగాట్ అంశంపై సభలో చర్చించేందుకు చైర్మన్ అనుమతి ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ జగదీప్ ధన్‌ఖడ్ సభ నుంచి వెళ్లిపోయారు. ఎగువ సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. వినేశ్ ఫోగాట్‌పై అనర్హత అంశంపై తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. అందుకు ధన్‌ఖడ్ అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. డెరెక్ ఓబ్రెయిన్‌తోపాటు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండడంతో సభలో గందరగోళం నెలకొంది. ఫోగాట్‌పై చర్చించేందుకు ధన్‌ఖడ్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. విపక్ష ఎంపీల తీరు పట్ల ధన్‌ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఉండలేనని చెప్పారు. భారమైన హృదయంతో సభ నుంచి నిష్కృమిస్తున్నానని తెలిపారు. -
‘జయా అమితాబ్ బచ్చన్’.. సమాజ్‌వాదీ ఎంపీ మరోసారి అభ్యంతరం
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆమెను ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ పూర్తి పేరుతో సంబోధించడంపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కొత్త డ్రామా ప్రారంభించారంటూ జయా బచ్చన్ మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమితాబ్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నా. ఆయనతో నా వివాహం, భర్తతో ఉన్న అనుబంధాన్ని చూసి గర్వపడుతున్నా.. నా భర్త పాధించిన విజయాలపై సంతోషంగా, గర్వంగానూ ఉంది. కానీ నన్ను కేవలంజయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుంది. మహిళలకు సొంత గౌరవం అంటూ లేేదా? మీరందరూ ప్రారంభించిన కొత్త డ్రామా ఇది. ఇంతకు ముందు ఇలా జరిగేది కాదు’ అని జయా బచ్చన్ పేర్కొన్నారు.అయితే దీనిపై ఉపరాష్ట్రపతి ధన్ఖర్ స్పందిస్తూ.. ఎన్నికల సర్టిఫికెట్లో పేరు అలాగే ఉందని, కావాలంటే తన పేరును మార్చుకునే నిబంధన కూడా ఉందని తెలిపారు. ‘అమితాబ్ బచ్చన్ సాధించిన విజయాలకు దేశమంతా గర్విస్తోంది. ‘ఎన్నికల సర్టిఫికేట్లో కనిపించే పేరునే మేము ఉపయోగిస్తున్నాం. మీరు కావాలంటే పేరు మార్చుకోవచ్చు. దాని కోసం నిబంధన కూడా ఉంది’ అని పేర్కొన్నారు.కాగా జయాబచ్చన్ తన పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదేం తొలిసారి కాదు. జూలై 29న సభా కార్యక్రమాల్లో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ‘జయ అమితాబ్ బచ్చన్’ అని సంబోధించడంపై అసహనానికి లోనయ్యారు. తనను కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందన్నారు. అయితే, ఇలా తనను భర్త పేరుతో కలిపి పిలవడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన రోజుల వ్యవధిలోనే ఆమె అదే పేరుతో తనను పరిచయం చేసుకుని రాజ్యసభలో శుక్రవారం కాసేపు సరదాగా నవ్వులు పూయించారు. -
రాజ్యసభలో అమితాబ్ ప్రస్తావన.. పగలబడి నవ్విన ఛైర్మన్
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలో భాగంగా రాజ్యసభలో శుక్రవారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. సభలో తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో ఆమె తన భర్త అమితాబ్ పేరును ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పగలబడి నవ్వారు. సభలో మిగిలిన ఎంపీలు నవ్వుతూ కనిపించారు. అయితే సోమవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వాహించాగా.. ఆమె అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. తనను ‘‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’’ అంటూ పేర్కొన్నారు. దానికి బదులుగా డిప్యూటీ ఛైర్మన్ స్పందిస్తూ.. ‘‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’అంటూ చెప్పారు. దానికి ఆమె స్పందిస్తూ మహిళలకు సొంతంగా గుర్తింపు లేదా’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.Watch 🔥 🔥 🔥Vice-president Jagdeep Dhankhar Ji enjoying the meltdown with his witty relies.🤣🤣🤣🤣🤣 pic.twitter.com/N6SMykvQg0— Alok (@alokdubey1408) August 2, 2024 ఈ నేపథ్యంలో శుక్రవారం జయా బచ్చన్ మాట్లాడుతూ.. తనను తాను జయా అమితాబ్ బచ్చన్‌గా పేర్కొనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఆమె అబితాబ్ ప్రస్తావన తీసుకురాగనే జగదీప్ ధన్‌ఖడ్ పగలబడి నవ్వారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘మీరు ఇవాళ భోజనం చేసినట్లు లేదు. అందుకే కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన పేరు ప్రస్తావించకుంటే మీకు ఆహారం అరగదేమో’అంటూ చమత్కరించారు. దానికి ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సైతం అంతే సరదాగా సమాధానం ఇచ్చారు. ‘వాస్తవానికి బ్రేక్ సమయంలో లంచ్ చేయలేదు. తర్వాత జైరాంతో కలిసి భోజనం చేశాను’అంటూ సమాధానం ఇవ్వడంతో సభలో నవ్వులు విరిశాయి. -
రాజ్యసభలో ఖర్గే భావోద్వేగం.. ‘ఆ వ్యాఖ్యలు తొలగించాలి’..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం రాజ్యసభలో భావోద్వేగానికి గురయ్యారు. తన రాకీయ జీవితంపై బీజేపీ ఎంపీ ఘనశ్యామ్ తివారీ సభలో మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు. తన కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉందని ఘన శ్యామ్ తివారీ అన్నారని, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని సభాపతిని కోరారు. అయితే ఖర్గే మాటలకు సభ ఛైర్మన్ జదగీప్ ధన్ఖర్ స్పందించారు. ఖర్గేను బాదపెట్టిన ఏ పదం రికాల్లో ఉండదని హామీ ఇచ్చారు. మరోవైపు ఖర్గే మా ట్లాడుతూ.. తమ కుటుంబంలో తానే మొదటితరం రాజకీయ నాయకుడినని తెలిపారు. యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్‌లో చేరడంతో తన రాజకీయ జీవితం ప్రారంభమయ్యిందని అన్నారు. తాను చేపట్టిన వివిధ పదవుల గురించి ఆయన వివరించారు.అయితే తన తండ్రి 85 ఏ ళ్ల వయసులో మరణించాడని ఖర్గే తెలపగా.. దీనికి చైర్మన్ స్పందిస్తూ.. తన తండ్రి కంటే ఎక్కువ సంత్సరాలు ఖర్గే జీవించాలని ఆకాంక్షించారు. అయితే ఈ వాతావరణంలో ఎక్కువ కాలం జీవించాలనే కోరిక తనకు లేదని ఖర్గే బదులిచ్చారు.అనంతరం తివారీ మాట్లాడిన సమయంలో తాను సభలోనే ఉన్నానని, బీజేపీ నేత తప్పుగా ఉద్దేశించి మాట్లాడినట్లు తాను భావించడం లేదని అన్నారు. రికార్డులను సూక్ష్మంగా పరిశీలించి, అటువంటి వ్యాఖ్యలు ఉంటే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు. -
కోచింగ్ సెంటర్లు వ్యాపారంగా మారిపోయాయి: రాజ్యసభ ఛైర్మన్
‘కోచింగ్ వ్యవస్థ పూర్తిగా వాణిజ్యంగా మారింది. ఎప్పుడూ వార్తాపత్రికలను చదువుదాం అని తెరిచిన ప్రతిసారీ ముందు ఒకటి రెండు పేజీల్లో వారి ప్రకటనలే కనిపిస్తాయి’ అంటూ అని ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో వరదనీటిలో మునిగి యూపీఎస్సీ అభ్యర్థులు మరణించిన ఘటనను ఉద్దేశిస్తూ సోమవారం రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ దుర్ఘటనపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు పిలుపునివ్వడం సముచితమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై తన ఛాంబర్లో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తానని ఉపరాష్ట్రపతి ధన్కర్ తెలిపారు. కాగా ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ సహా ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్‌ను స్టోర్ రూమ్, పార్కింగుకు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. -
రాజ్యసభ నిరవధిక వాయిదా
ఢిల్లీ: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగ తీర్మానం చర్చపై ప్రధాని మోదీ సమాధాన ప్రసంగం ముగిసింది. అనంతరం రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ సభను నిరవధికంగా వాయిదా చేశారు.Rajya Sabha adjourned sine die after PM Modi's speech on Motion of Thanks to President's Address pic.twitter.com/1tEpe6Tk1F— ANI (@ANI) July 3, 2024ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు...బంజారాల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశాంమహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం: మోదీప్రజలు ఓడించినా వారిలో మార్పు రాలేదు: మోదీచర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారు.సభను విపక్షాలు అవమానిస్తున్నాయి.నా సమాధానం వినే ధైర్యం విపక్షాలకు లేదు.విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. సన్నకారు రైతుల కోసం కాంగ్రెస్ ఎలాంటి పథకాలు తేలేదు: మోదీకిషాన్ సమ్మాన్ నిధి రైతులకు అండగా నిలిచింది.వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం.రైతుల కోసం పంటలకు మద్దతు ధరను భారీగా పెంచాం విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్ అసంతృప్తివిపక్షాలు ఇలా చేయటం సరికాదువిపక్షాలు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయి. నిజాలు చెబుతుంటే విపక్షాలు భరించటం లేదు: ప్రధాని మోదీవిపక్షాలు అవమానిస్తున్నాయి. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్విపక్ష సభ్యులను మాట్లాడనివ్వడం లేదని సభ నుంచి వాకౌట్ కిషాన్ సమ్మాన్ యోజనా ద్వారా రైతులకు అండగా ఉంటాం: ప్రధాని మోదీప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్షాలుపదేళ్ల చేసిన అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాంప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళన నడుమ ప్రధాని ప్రసంగంరైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.ఈ ఎన్నికలో దేశ ప్రజలు చూపిన విశ్వాసం పట్ల గర్వపడుతున్నాపదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం సేవాభావంతో ముందు వెళ్లుతోంది.అంబేద్కర్ ఆశయాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది.మా విజయాన్ని చూసి కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం చర్చలో 70 మంది ఎంపీలు పాల్గొన్నారు. రాజ్యాంగం మాకు చాలా పవిత్రమైంది.అంబేద్కర్ రాజ్యాంగం వల్లే మాకు ఈ అవకాశం దిక్కింది.ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందిఈ ప్రభుత్వానికి రాజ్యాంగమే దిక్చూచికరోనా కష్టకాలంలో కూడా భారత్ ఆర్థికంగా ముందుకు వెళ్లింది.గతపదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది.వచ్చే ఐదేళ్లలో పేదరికంపై యుద్ధం చేస్తాంఆర్థిక వృద్ధిలో భారత్‌ను ఐదోస్థానం నుంచి మూడో స్థానానికి తీసుకువెళ్తాంవచ్చే ఐదేళ్లలోమ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాంవిపక్షాల నిసనల మధ్య మోదీ ప్రసంగిస్తున్నారు.గతంలో రిమోట్ ప్రభుత్వం నడిచింది. ప్రజలు మూడోసారి ఎన్డీయేకు పట్టం కట్టారు. స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు.60 ఏళ్ల తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ప్రజాతీర్పును కొందరు ఇష్టపడటం లేదు. హత్రాస్ సత్సంగ్ తొక్కిసలాట ఘటనపై రాజ్యసభలో ఎంపీలు సంతాపం తెలిపారు.మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది భక్తులు మృతి చెందారు.#WATCH | Delhi: Rajya Sabha observes silence to mourn the loss of lives in Hathras Stampede accident. pic.twitter.com/mcF3aBszUo— ANI (@ANI) July 3, 2024 ప్రారంభమైన రాజ్యసభరాజ్యసభ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సమాధానం ఇవ్వనున్నారు.Prime Minister Narendra Modi will speak in the Rajya Sabha on the Motion of Thanks to the President's Address at around 12 noon. pic.twitter.com/YQqV0GqVlH— ANI (@ANI) July 3, 2024 నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం నిన్న(మంగళవారం) రాజ్యసభను కుదిపేసింది. పేపర్ లీక్‌తో లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి.లోక్‌సభలో మంగళవారం రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వటంలో చర్చ ముగిసింది. అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు. -
విజయసాయి రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు: రాజ్యసభ చైర్మన్
న్యూఢిల్లీ, సాక్షి: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు నేడు(జులై 1). ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘విజయసాయిరెడ్డి రెండోసారి ఎన్నికై రాజ్యసభలో వైఎస్సార్సీపీ పక్ష నేతగా ఉన్నారు. ఆయన అపార జ్ఞానం, అనుభవం సభలో చట్టాల రూపకల్పనకు ఎంతో ఉపయోగపడింది. అంతేకాదు.. స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి విశేష సేవలందించారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్, టీటీడీ మెంబర్ గా, పబ్లిక్ సర్వీస్ బ్యాంకు డైరెక్టర్ గానూ గతంలో ఆయన పని చేశారు. ఆయన సంతోషకరమైన జీవితం గడపాలని కోరుకుంటూ రాజ్యసభ తరఫున జన్మదిన శుభాకాంక్షలు అని చైర్మన్ ధన్‌ఖడ్ తెలిపారు. అలాగే.. రాజ్యసభలో కొందరు సభ్యులు ఆయనకు పుట్టినరోజు విషెస్ తెలియజేశారు. -
అధికారులతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర గనుల శాఖ అధికారులతో కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఢిల్లీలోని శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గనుల శాఖ సాధించిన విజయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చించారు. మైనింగ్ రంగంలో భారత్‌ను ఆత్మనిర్భర్‌గా మార్చేందుకు ఆటోమేషన్, ఇన్నొవేషన్, సుస్థిరత, అధునాతన సాంకేతికతలను అమలు చేయడం వంటి కీలకమైన అంశాలపై ప్రధానంగా సమీక్షించారు. అంతకుముందు అధికారులు శాఖకు సంబంధించిన పలు అంశాలను కిషన్‌రెడ్డికి వివరించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్‌చంద్ర దూబే, సీపీఎస్ఈలు, అనుబంధ కార్యాలయాల ఉన్నతాధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్లను మర్యాదపూర్వకంగా కలిశారు. కిషన్‌రెడ్డి వెంట కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబే ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కేబినెట్లో మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న కిషన్‌రెడ్డి, సతీశ్‌చంద్ర దూబేలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందించారు. -
ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
టెహ్రాన్: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి దేశ రాజధాని టెహ్రాన్ ప్రజలు ఘన తుది వీడ్కోలు పలికారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లాహ్ అలీ ఖమేనీ సైతం నివాళులరి్పంచారు. బుధవారం సంతాప ర్యాలీలో టెహ్రాన్ సిటీ వీధుల గుండా భారీ వాహనం మీద రైసీ పారి్థవదేహాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఇరానీయన్లు పాల్గొని తమ నేతకు తుది వీడ్కోలు పలికారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం టెహ్రాన్ వెళ్లి రైసీకి నివాళులర్పించారు. మహిళా, మానవ హక్కుల హననానికి పాల్పడి ‘టెహ్రాన్ కసాయి’గా పేరుబడినందుకే రైసీ సంతాప ర్యాలీలో తక్కువ మంది పాల్గొన్నారని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. సంతాప ర్యాలీలో ఖమేనీ పక్కనే తాత్కాలిక దేశాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్ ఏడుస్తూ కనిపించారు. బుధవారం ఖమేనీ మినహా మాజీ దేశాధ్యక్షులెవరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనకపోవడం గమనార్హం. రైసీ మృతికి సంతాపంగా భారత్‌లోనూ ఒక రోజు సంతాపదినం పాటించారు. -
భారత్‌కు ఎవరూ పాఠాలు నేర్పాల్సిన పనిలేదు: జగదీప్ ధన్కర్
న్యూఢిల్లీ: భారత్‌లో చట్టబద్దమైన పాలన కొనసాగుతోందని.. దీన్ని ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరంలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్. మన దేశానికి ఎవరూ పాఠాలు నేర్పాల్సిన అవసరంలేదని ధన్కర్ చెప్పుకొచ్చారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ, అమెరికా, ఐక్యరాజ్యసమితి స్పందించింది. అటు, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడంపై కూడా అమెరికా, యూఎస్ ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వీరి వ్యాఖ్యలకు జగదీప్ ధన్కర్ కౌంటరిచ్చారు. తాజాగా జగదీప్ ధన్కర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్ అద్వితీయమైన ప్రజాస్వామ్య దేశం. భారత్ పటిష్టమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. ఈ విషయంలో ఏ వ్యక్తి లేదా ఏ సమూహం కోసం రాజీపడటం అనేది ఉండదు. మా దేశ చట్టబద్ధమైన పాలనపై ఎవరి నుంచీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే. అవినీతి అనేది ఒక అవకాశం. అది జైలుకు వెళ్లే మార్గం. ఎన్నికల సందర్భంగానే ఇదంతా జరిగిందంటున్నారు. దోషులను శిక్షించడానికి ప్రత్యేకంగా సీజన్ ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. #WATCH | Vice President Jagdeep Dhankhar says "Corruption is no longer rewarding. Corruption is not a passage to opportunity, employment or a contract. It is a passage to jail. The system is securing it. Now again you go on a high moral ground, the corrupt must not be dealt with,… pic.twitter.com/qR8OobBzOU — ANI (@ANI) March 29, 2024 ఇదిలా ఉండగా.. కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఇండియా కూటమి తొలి ర్యాలీని మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించనున్నారు. ఢిల్లీ పోలీసుల నుంచి కూడా ర్యాలీకి ఆమోదం లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్వహించే ఈ ర్యాలీలో కాంగ్రెస్, ఎస్పీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, టిఎంసి, శివసేన (యుబిటి) తదితర పార్టీల పెద్ద నేతలు పాల్గొంటారు. ‘రిమూవ్ డిక్టేటర్షిప్, సేవ్ డెమోక్రసీ’ నినాదంతో ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష నేతలపై రాజకీయ చర్యలు, ఎలక్టోరల్ బాండ్లు, ఇతర సమస్యలను ర్యాలీ ద్వారా లేవనెత్తుతాయి. రాంలీలా మైదాన్‌లో ర్యాలీకి ఆమోదం లభించిందని ఆప్ ఢిల్లీ రాష్ట్ర సమన్వయకర్త గోపాల్ రాయ్ తెలిపారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత, మాకు ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీల నాయకుల నుండి మద్దతు లభించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి 31న ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. -
ధ్యానంతోనే విశ్వశాంతి
నందిగామ/శంషాబాద్ (హైదరాబాద్): ప్రపంచ శాంతికి ధ్యానం ఒక్కటే మార్గమని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ అభిప్రాయపడ్డారు. మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ కమ్లేష్ పటేల్ (దాజీ)కు కామన్వెల్త్ ఆధ్వర్యంలో గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్ అవార్డు రావడం ఆనందకరమన్నారు. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ మాట్లాడుతూ.. దాజీ 160 దేశాల్లో 16 వేల మంది వలంటీర్లు, 5 వేల కేంద్రాల్లో 5 మిలియన్లకు పైగా అభ్యాసీలను కలిగి ఉండటం ప్రపంచ స్థాయిలోనే గొప్ప విషయమని ప్రశంసించారు. ఆయన సేవలను గుర్తించి ‘గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్’ అవార్డు అందజేస్తున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. కమ్లేష్ పటేల్ (దాజీ) మాట్లాడుతూ.. తనకు కామన్వెల్త్ ఆధ్వర్యంలో అవార్డు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు అధ్యాత్మికవేత్తలు ధ్యానం చేశారు. కార్యక్రమంలో ప్రపంచ మత పెద్దల మండలి సెక్రటరీ జనరల్ భావాజైన్, సైంటిస్ట్ డాక్టర్ రోలీన్ మెక్క్రాటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్సియె ఎస్ బీయింగ్ వ్యవస్థాపకుడు డాక్టర్ జోసెఫ్ బెంటన్ హోవెల్ పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు ఆధ్యాత్మిక సమ్మేళనంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి దంపతులు జగదీప్ ధన్‌ఖడ్, సుధేష్ ధన్‌ఖడ్‌లు తమ పర్యటన ముగించుకుని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరికీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ తమిళి సై, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఘనంగా వీడ్కోలు పలికారు. -
‘ఈశా’ శివరాత్రి వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్
ఈ నెల 8న మహాశివరాత్రి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆధ్మాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులోగల ‘ఈశా’ ఫౌండేషన్ రాబోయే మహశివరాత్రి వేడుకలను ఆదియోగి విగ్రహం ముందు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ మెగా వేడుక మార్చి 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు సద్గురు యూట్యూబ్ ఛానల్లో, ప్రధాన మీడియా నెట్‌వర్క్‌లలో ప్రసారం కానుంది. ఆరోజు అర్ధరాత్రి, బ్రహ్మ ముహూర్త సమయంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ‘సద్గురు’ జగ్గీవాసుదేవ్ భక్తులను శివుని ధ్యానంలో లీనమయ్యేలా చేయనున్నారు. కాగా గతంలో జరిగిన ‘ఈశా’ మహాశివరాత్రి వేడుకల లైవ్ స్ట్రీమింగ్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. 2023లో ‘ఈశా’లో జరిగిన మహాశివరాత్రి వేడుకలను 14 కోట్ల మంది వీక్షించారు. -
సముద్ర వాణిజ్యంలో భద్రతా సవాళ్లను అధిగమిద్దాం
సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): బ్లూ ఎకానమీలో మారీటైమ్ డొమైన్ కీలకంగా వ్యవహరిస్తోందనీ.. 2047 నాటికి భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా.. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని సాముద్రిక ఆడిటోరియంలో గురువారం మధ్యాహ్నం అంతర్జాతీయ మారిటైమ్ సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథి ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ మహా సముద్రాలంతటా దేశాల మధ్య సహకారం, అభివృద్ధికి వేదికగా మిలాన్ మారిందన్నారు. దేశ చరిత్రలో కీలకంగా వ్యవహరిస్తూ సముద్ర భద్రతలో, భారతదేశ సముద్ర చరిత్రలో కీలకమైన పాత్రను పోషించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో మిలాన్‌తో పాటు ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, వివిధ దేశాలతో భాగస్వామ్యాలు, సహకారంతో సాగర జలాల్లో తలెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో మన దేశం పెద్దన్న పాత్ర పోషిస్తోందన్నారు. సముద్ర వాణిజ్యంలో భద్రత సవాళ్లను కలిసికట్టుగా అధిగవిుంచాలని పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఎంతో అవసరమని, ఇందుకోసం భద్రత, సుస్థిరతను నిర్ధారించడానికి దేశాలు కలిసివచ్చి.. సహకార వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని ఉప రాష్ట్రపతి ధన్కర్ చెప్పారు. సదస్సులో నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, వివిధ దేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరయ్యారు. అంతకు ముందు మిలాన్–2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు ఐఎన్ఎస్ డేగాలో నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మేయర్ హరివెంకటకుమారి, తూర్పు నావికాదళాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే గణబాబు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, అడిషనల్ డీజీ(గ్రేహౌండ్స్) ఆర్కే మీనా తదితరులున్నారు. -
అఖండ భారత్‌కు ప్రతీక
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయాన్ని ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తికి పరిపూర్ణ ప్రతీకగా పార్లమెంటు అభివర్ణించింది. శనివారం ఈ మేరకు ఉభయ సభలు తీర్మానాలను ఆమోదించాయి. ఆలయ నిర్మాణం, రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట అంశంపై రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ లో స్పీకర్ ఓం బిర్లా తీర్మానాలు ప్రవేశపెట్టారు. ‘‘శతాబ్దాల ఎదురుచూపుల అనంతరం సుపరిపాలన, ప్రజా సంక్షేమ రంగాల్లో నూతన శకానికి రామాలయ నిర్మాణం నాంది పలికింది. అది కేవలం రాళ్లు, ఇటుకలతో కూడిన నిర్మాణం కాదు. నమ్మకం, విశ్వాసాలతో నిండిన జాతి ప్రతీక. ఈ చారిత్రక క్షణాన్ని సాకారం చేయడంలో న్యాయవ్యవస్థ, పౌర సమాజం కూడా కీలక పాత్ర పోషించాయి’’ అంటూ వారు కొనియాడారు. రామ మందిరంపై సుప్రీంకోర్టు తీర్పు దేశ లౌకికత్వ విలువలను ప్రతిఫలించిందని లోక్‌సభలో చర్చలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. మందిర నిర్మాణంలో సమాజంలోని అన్ని వర్గాలనూ ప్రధాని మోదీ భాగస్వాములను చేశారన్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ మెజారిటీ సామాజిక వర్గం ఇలా తమ మత విశ్వాసాలకు సంబంధించిన అంశంపై ఇంతటి సుదీర్ఘకాలం ఎదురు చూడాల్సి రాలేదన్నారు. జనవరి 22న మందిర ప్రారంభంతో మహోన్నత భారత్ దిశగా గొప్ప ప్రయాణం మొదలైందని, మన దేశం విశ్వగురువుగా ఆవిర్భవించేందుకు దారులు పడ్డాయని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఘనవిజయం సాధించి ప్రజల ఆకాంక్షలను మోదీ సర్కారు నెరవేరుస్తుందని చెప్పారు. చరిత్రాత్మక రథయాత్ర ద్వారా ఆలయ నిర్మాణంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే ఆడ్వాణీ కూడా కీలక పాత్ర పోషించారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం తీర్మానాలు సభలు ఆమోదం పొందాయి. జన్మస్థలికి వందల మీటర్ల దూరంలో ఆలయ నిర్మాణం: కాంగ్రెస్ అయోధ్య రామాలయంపై కొత్త చర్చకు కాంగ్రెస్ తెర తీసింది. రామ మందిర నిర్మాణంపై రాజ్యసభ చేపట్టిన స్వల్ప వ్యవధి చర్చ ఇందుకు వేదికైంది. రాముని అసలు జన్మస్థలికి కొన్ని వందల మీటర్ల అవతల ఆలయాన్ని నిర్మించారని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు. కావాలంటే దీనిపై పరిశీలనకు ఎంపీలతో అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ నిర్మాణం పూర్తవకుండానే ప్రారంభించడం పూర్తిగా శాస్త్రవిరుద్ధమన్నారు. అసంపూర్తి ఆలయంలో పూజలు చేస్తే దేశానికే అరిష్టమని వాదించారు. పైగా ఆలయ ప్రారంపోత్సవంలో అన్ని నిబంధనలనూ యథేచ్ఛగా ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. ఉభయసభలు నిరవధిక వాయిదా పార్లమెంటు ఉభయసభలూ శనివారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు. ఈ ఐదేళ్లలో సభ 222 బిల్లులను ఆమోదించినట్టు స్పీకర్ తెలిపారు. ‘‘అధికార, విపక్ష సభ్యులను నేనెప్పుడూ సమానంగానే చూశా. కాకపోతే సభ హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది.’’ అని చెప్పుకొచ్చారు. మరోవైపు, రాజ్యసభ 263వ సమావేశాలు కూడా ముగిశాయని చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ సభలో ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
ఖర్గేపై రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం !
న్యూఢిల్లీ: భారతరత్న మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ మనవడు, రాష్ట్రీయ లోక్‌దళ్ చీఫ్ జయంత్ చౌదరి రాజ్యసభలో మాట్లాడుతుండగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చరణ్‌సింగ్‌కు తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. తన తాతకు అత్యున్నత పురస్కారం ఇవ్వడంపై మనవడు జయంత్ చౌదరి కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. జయంత్ మాట్లాడుతుండగా మధ్యలో ఖర్గే అడ్డుకున్నారు. ‘భారతరత్న పొందిన నాయకులపై సభలో ప్రస్తుతం చర్చ జరగడం లేదు. ఇప్పుడు జయంత్ ఏ నియమం ప్రకారం అనుమతి పొందారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ అనుమతిని మాకూ ఇవ్వండి. మేమూ వినియోగించుకుంటాం. రూల్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండాలి’అని ఖర్గే అభ్యంతరం వ్యక్తంచేశారు. ఖర్గే వ్యాఖ్యలపై జగదీప్ ఆగ్రహానికి గురయ్యారు. చరణ్‌సింగ్‌ను అవమానించి ప్రతి రైతును బాధపెట్టారన్నారు. ఈ చర్యతో అందరూ సిగ్గుతో తల దించుకోవాలన్నారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ భారతరత్న పొందిన పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్, స్వామినాథన్ ముగ్గురికి సెల్యూట్ చేస్తున్నామన్నారు. ఇదీ చదవండి.. ప్రజల్లో విశ్వాసం పెరిగింది -
ఎంపీ జయా బచ్చన్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా?
ఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయబచ్చన్ రాజ్యసభలో శుక్రవారం వీడ్కోలు ప్రసంగంలో క్షమాపణలు చెప్పారు. అమె ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఒక సందర్భంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అయితే ఆ విషయాన్ని జయా బచ్చన్ రాజ్యసభ వీడ్కోలు సమయంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆ రోజు తాను ప్రవర్తించిన తీరుకు రాజ్య సభ చైర్మన్ నొచ్చుకొని ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నాని తెలిపారు. ‘మీరు ఎందుకు ఆవేశపడతారని నన్ను చాలా మంది అడుగుతారు. అది నా తత్వం. నేను సహజమైన ప్రవర్తనను మార్చుకోను. నాకు కొన్ని విషయాలు నచ్చకపోతే లేదా అంగీకరించలేకపోతే వెంటనే కొంత శాంతాన్ని కోల్పోతాను. నా ప్రవర్తన, మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. నా మాటలను వ్యక్తిగతంగా తీసుకొని ఎవరైనా నొచ్చుకొని ఉంటే వారికి నా క్షమాపణలు. నాది క్షణికమైన ఆవేశం తప్పితే.. నాకు ఎవరిని నొప్పించాలని ఉండదు’ అని అన్నారామె. Samajwadi Party MP Jaya Bachchan apologised to the fellow members of the Rajya Sabha during her farewell speech. Watch for more🎥#JayaBachchan #SamajwadiParty #RajyaSabha pic.twitter.com/7AeNPQjDwg — Moneycontrol (@moneycontrolcom) February 9, 2024 వీడియో క్రెడిట్స్: moneycontrol ఇక.. పెద్దల సభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యుల సహకారం, ప్రేమను చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేసుకున్నారు. పెద్దల సభలో సదరు సభ్యుల ద్వారా పంచుకున్న జ్ఞానాన్ని తాను ఇక నుంచి మిస్ అవుతానని అన్నారు. రిటైర్ అవుతున్న సభ్యుల వల్ల సభలో కొంత శూన్యత కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు. మంగళవారంనాడు సభలో కాంగ్రెస్ సభ్యుడి ప్రశ్నను దాటేవేసే క్రమంలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్.. జయా బచ్చన్ నుంచి ఎదురుదాడిని ఎదుర్కొన్నారు. దీంతో ధన్‌ఖడ్.. సభ్యులకు సమస్యను చెబితే వారు అర్థం చేసుకోగలరని వారేం చిన్న పిల్లలు కాదని అన్నారు. దీంతో జయా.. ఎంపీలను సభలో గౌరవంగా చూడాలని అన్నారు. సభలోని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడాని దాటివేసిన ప్రశ్నను మళ్లీ అడగాలని ధన్‌ఖడ్ అనుమతి ఇచ్చారు. చదవండి: భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..! -
ఆత్మనిర్భర భారత్, డిజిటల్ ఇండియా మన బలం
-
దశాబ్ద కాలంలో భారత్ పురోభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: అవిరళ కృషి, అత్యాధునిక సాంకేతికతతో భారత్ కీర్తి విశ్వవ్యాప్తమవుతోందని భార త ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం అన్ని విధాలా పురోగమిస్తోందని అన్నారు. దశాబ్ద కాలంలోనే భారత్ ప్రపంచ నాయకత్వ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. దివంగత మాజీ న్యాయమూర్తి జస్టిస్ కొండా మాధవరెడ్డి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విలువలతో జన్మించిన రైతుబిడ్డ కొండా మాధవరెడ్డి అని కొనియాడారు. ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శమన్నారు. భారత్ అమృత్ కాల్ జరుపుకుంటున్న వేళ ఆయనకు సముచిత స్థానం ఇవ్వడం అభినందనీయమన్నారు. భారత్ వైపు ప్రపంచం చూపు యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందని ధన్‌ఖడ్ పేర్కొన్నారు. జీ–20 తర్వాత మనం ప్రపంచ నాయకత్వ స్థాయికి ఎదిగామని అన్నారు. ఈ సదస్సు ద్వారా భారత్ శక్తియుక్తులు ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యాయని చెప్పారు. సాంకేతిక విప్లవం సవాళ్ళతో పాటు కొత్త అవకాశాలను కల్పిస్తోందని, ఈ రంగంలో దూసుకెళ్ళేందుకు భారత్ చేసే ప్రయత్నాలన్నీ ప్రపంచ దేశాలతో పోటీపడేలా చేస్తున్నాయని వివరించారు. ఇ–కోర్టుల ఏర్పాటు, పారదర్శక న్యాయ విధానం, డిజిటలైజేషన్, మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం, పెండింగ్ కేసులు తగ్గించడంపై శ్రద్ధ.. న్యాయ వ్యవస్థలో సంస్కరణలుగా ఆయన పేర్కొన్నారు. సొంత భాషలోనే తీర్పులివ్వడం గొప్ప పరిణామంగా అభివర్ణించారు. కొద్ది రోజుల క్రితమే చట్టసభల ఆమోదం పొందిన క్రిమినల్ కోడ్ బిల్లులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన తీర్పులు నేటికీ ఆదర్శం: తమిళిసై న్యాయమూర్తిగా కొండా మాధవరెడ్డి ఇచ్చిన తీర్పులు నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఇచ్చి న తీర్పులు ఇప్పటికీ న్యాయవ్యవస్థకు మార్గదర్శకంగానే ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి పాల్గొన్నారు. -
‘వెయ్యి సార్లు చేస్తా.. జైల్లో వేసిన వెనకాడ’
కోల్‌కతా: అనుకరించడం ఓ కళ అని, అనుకరించడాన్ని తాను అలాగే కొనసాగిస్తూ ఉంటానని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బేనర్జీ అన్నారు. అయితే పార్లమెంట్ భద్రత వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి మాట్లాడాలని విపక్ష ఎంపీలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పలవురు ప్రతిపక్ష ఎంపీలు కూడా సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెన్షన్‌పై విపక్ష ఎంపీలు పార్లమెంట్ బయట నిరసన తెలిపాయి. నిరసనలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ హావభావాలను టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వ్యంగ్యంగా అనుకరించిన తెలిసిందే. ఈ వ్యవహారంపై మరోసారి ఎంపీ కల్యాణ్ బేనర్జీ స్పందింస్తూ.. మరోసారి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను అనుకరించారు. తాను ఇలాగే అనుకరించడం కొనసాగిస్తానని అన్నారు. అది ఒక కళారూపమని తెలిపారు. అవరమైతే వెయ్యిసార్లు అయినా ఇలానే అనుకరిస్తానని పేర్కొన్నారు. తన భావాలను వ్యక్తం చేయడానికి అన్ని రకాలుగా ప్రాథమిక హక్కులు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో జైలులో వేసినా తాను వెనకడుగు వెయనని తేల్చి చెప్పారు. ఎటువంటి ప్రాధాన్యత లేని ఈ విషయాన్ని ధన్‌ఖడ్ పెద్దది చేస్తున్నాడని విమర్శించారు. చదవండి: వికసిత్ భారత్‌ను నిజం చేయండి: మోదీ కల్యాణ్ బెనర్జీ చేసిన అనుకరణ తనను ఎంతగానో బాధించిందని, ఇలా చేయడం తనను, తన కులాన్ని అవమానించడమేనని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు ధన్‌ఖడ్‌ను అనుకరించినందుకు అదే రోజు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై కేసు నమోదైంది. అభిషేక్ గౌతమ్ అనే ఓ న్యాయవాది ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. कल्याण बनर्जी ने फिर की जगदीप धनखड़ की मिमिक्री ◆ संसदीय क्षेत्र श्रीरामपुर में एक सभा के आयोजन के दौरान की मिमिक्री ◆ कहा-"उपराष्ट्रपति धनखड़ अपने पद की संवैधानिक गरिमा को नष्ट कर रहे" TMC MP Kalyan Banerjee | #JagdeepDhankar #KalyanBanerjee pic.twitter.com/fkl79gxiUu — News24 (@news24tvchannel) December 24, 2023 -
ఎన్నో అవమానాలు భరించా: జగ్ధీప్ ధన్‌ఖడ్
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తాను ఎన్నో అవమానాలు, బాధలు భరించిన వ్యక్తినని అన్నారు. పార్లమెంట్ భద్రత వైఫల్యంపై విపక్ష ఎంపీలు కేంద్ర హోం మంత్రి స్పందించాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాల ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. దానిని ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ.. జగదీప్ ధన్‌ఖడ్ హావభావాలను అనుకరించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ధన్‌ఖడ్.. తనను, తన కులాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు కూడా. అయితే తాజాగా ఆయన ఈ వ్యవహారంపై ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసు(ఐఎస్ఎస్) ప్రొబేషనర్లు ఏర్పాటు చేసిన ఓ కర్యక్రమంలో మాట్లాడారు. ‘నేను ఎన్నో అవమానాలు, బాధలు అనుభవించిన వ్యక్తిని. అన్ని వైపుల నుంచి వచ్చే అవమానాలు, బాధలను సహించడం నాకు తెలుసు. మనం భారత మాత సేవలో ఉన్నాం’ అని అన్నారు. విమర్శలను తట్టుకోవడం నేర్చుకోవాలని, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నప్పటికీ దేశ ప్రజలు తనకు దూరంగా లేరని తెలిపారు. రాజ్యసభ చైర్మెన్‌గా, ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగ హోదాలో ఉన్నప్పటికీ తనను ప్రజలు ఎప్పుడూ విడిచి పెట్టలేదని తెలిపారు. అది తన ఆలోచనా విధానాన్ని మార్చాలా?.. అది తన మార్గాన్ని తప్పుదారి పట్టించాలా? అని అన్నారు. ధర్మ మార్గంలో మనం ఎల్లప్పుడూ ముందుకు సాగాలని తెలిపారు. మన ఎదుగుదలను చూసి ఎవరైతే తట్టుకోలేరో.. అటువంటి వారే ఎప్పుడూ విమర్శలు చేస్తారని మండిపడ్డారు. చదవండి: ‘మార్పు’పై అసంతృప్తి! -
ధన్‌ఖడ్‌పై ఖర్గే విమర్శలు.. నేను అలా అనుకోవాలా?
ఢిల్లీ: పార్లమెంట్ భద్రత వైఫల్యానికి సంబంధించి హోంమంత్రి అమిత్ షా స్పందించాలని పట్టుబట్టారు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఎంపీలు. ఈ క్రమంలో 146 మంది ఉభయ సభల నుంచి సస్పెండ్ చేయబడిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్‌పై నిరసనగా శుక్రవారం ఇండియా కూటమి ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే.. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై విమర్శలు గుప్పించారు. ‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మీరు, హుందాగా వ్యవహరిస్తూ ఆ పదవిని నిలబెట్టుకోవాలి. కులం పేరుతో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నామని అనడం సరికాదు. ట్రెజరీ బెంచ్‌లు నన్ను చాలాసార్లు మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నాయి. దానికి నా కులం(దళిత సామాజికవర్గం) పేరుతో నన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారని నేను అనుకోవాలా?’ అని ఖర్గే తీవ్రంగా విమర్శించారు. అయితే పార్లమెంట్ భద్రత వైఫల్యంపై నిరసన తెలిపిన ఎంపీలపై రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ పలువురు ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్ బయట ‘మాక్ పార్లమెంట్’ నిర్వహించారు. ఇందులో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ.. రాజ్యసభ చైర్మన్ సభలో వ్యవహరించే తీరును అనుకరించి మరీ నిరసన తెలిపాడు. దీంతో.. ‘నన్ను కులం (జాట్) పేరుతో అవమానించారు. నేను ఒక వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినందుకు నన్ను టార్గెట్ చేశారు’ అంటూ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ సదరు ఎంపీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఆరు నెలల పాపకు కరోనా! అప్రమత్తమైన అధికారులు -
‘మిమిక్రీ’పై ఆగ్రహ జ్వాలలు
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ధన్‌ఖడ్‌కు మద్దతు ప్రకటిస్తూ ముర్ము బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఎంపీల ప్రవర్తనను చూసి కలత చెందానని పేర్కొన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను ఎంపీలంతా కాపాడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్రపతికి ధన్‌ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు. అవమానాలు, హేళనలు తన మార్గం తనను నుంచి తప్పించలేవన్నారు. ధన్‌ఖడ్‌కు మోదీ ఫోన్ ధన్‌ఖడ్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు. విపక్ష సభ్యుల ప్రవర్తన చాలా బాధ కలిగించిందన్నారు. విపక్ష సభ్యులు మిమిక్రీ చేయడాన్ని మోదీ ఆక్షేపించారు. ఎవరు ఎన్ని విధాలుగా హేళన చేసినా తన విధులు తాను నిర్వరిస్తూనే ఉంటానని, ఎవరూ తనను అడ్డుకోలేరని మోదీతో ధన్‌ఖడ్ చెప్పారు. తాను 20 ఏళ్లుగా ఇలాంటి హేళనలు, అవమానాలు ఎదుర్కొంటున్నానని మోదీ చెప్పారంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, ఎన్డీయే ఎంపీలు కూయాయనకు మద్దతు ప్రకటించారు. సంఘీభావంగా బుధవారం లోకసభలో 10 నిమిషాలపాటు లేచి నిల్చున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ధన్‌ఖఢ్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. ధన్‌ఖడ్ బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. పార్లమెంట్‌ను, ఉప రాష్ట్రపతి పదవిని అవమానిస్తే సహించబోనని హెచ్చరించారు. మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ ఎవరినీ కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు. ఉప రాష్ట్రపతిని అవమానించలేదని చెప్పారు. బీజేపీ ఎంపీపై చర్యలేవి: కాంగ్రెస్ జాట్ కులాన్ని ప్రతిపక్షాలు అవమానించాయన్న ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. పార్లమెంట్లో తనను ఎన్నోసార్లు మాట్లాడనివ్వలేదని, దళితుడిని కాబట్టే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తాను అనొచ్చా అని ప్రశ్నించారు. మోదీ గతంలో అప్పటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని మిమిక్రీ చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గుర్తు చేశారు. -
NDA: ఉపరాష్ట్రపతికి సంఘీభావంగా..
సాక్షి, ఢిల్లీ: దేశ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ను హేళన చేస్తూ టీఎంసీ ఎంపీ ఒకరు చేసిన చేష్టలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. చైర్మన్ ధన్కడ్ ఈ చర్యను ఖండించగా.. ప్రధాని మోదీ ఈ ఉదయం ఉపరాష్ట్రపతికి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు కూడా. ఈ క్రమంలో.. బుధవారం పెద్దల సభలో ఎన్డీయే ఎంపీలు, ధన్కడ్కు సంఘీభావం ప్రకటించారు. ‘‘ఈ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్లు రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో ఉన్నవాళ్లను పదే పదే అవమానిస్తున్నారు. అన్నివిధాలుగా పరిధి దాటి ప్రవర్తించారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఓ ప్రధానిని అవమానిస్తూ వస్తున్నారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని అవమానించారు. జాట్ కమ్యూనిటీ నుంచి ఉపరాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి మీరు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి మిమ్మల్ని ఇప్పుడు అవమానించారు. మీరు ఉన్న ఉన్నతస్థానం పట్ల వాళ్లకు గౌరవం లేదు. రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానించడం మేం సహించలేం అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రాజ్యసభలో తెలిపారు. వాళ్లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. మీకు గౌరవసూచికంగా ప్రశ్నోత్తరాల సమయం మొత్తం మేం నిలబడాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారాయన. ఏం జరిగిందంటే.. ఎంపీల సస్పెన్షన్ పరిణామం అనంతరం.. పార్లమెంటు వెలుపల మంగళవారం ఓ ఘటన చోటుచేసుకుంది. ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ను ఉద్దేశించేలా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరణ చేశారు. ఆయన గొంతును అనుకరిస్తూ.. విచిత్రంగా ప్రవర్తించారు. ఆ సమయంలో విపక్ష సభ్యులు నవ్వులు కురిపిస్తుండగా.. రాహుల్ గాంధీ ఆ దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించారు. దీనిపై ధన్కడ్ మండిపడుతూ.. ఎంపీ స్థానంలో ఉండి ఛైర్మన్‌ని హేళన చేయడం సిగ్గుచేటన్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. If the country was wondering why Opposition MPs were suspended, here is the reason… TMC MP Kalyan Banerjee mocked the Honourable Vice President, while Rahul Gandhi lustily cheered him on. One can imagine how reckless and violative they have been of the House! pic.twitter.com/5o6VTTyF9C — BJP (@BJP4India) December 19, 2023 మరోవైపు రాజకీయంగా ఈ ఘటన దుమారం రేపుతోంది. అధికార-విపక్ష ఎంపీలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం స్పందించారు. రాహుల్ జీ(రాహుల్ గాంధీ) వీడియో తీసి ఉండకపోతే.. ఈ వ్యవహారంపై ఇంత రాద్దాంతం జరిగి ఉండి కాదేమో అనేలా ఆమె ప్రకటన ఇచ్చారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ధన్కడ్కు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జాట్ కమ్యూనిటీ సైతం ఈ డిమాండ్‌తో నిరసనలకు దిగింది. #WATCH | On TMC MP mimicry row, West Bengal CM Mamata Banerjee says, "...You wouldn't have come to know if Rahul ji had not recorded a video..." pic.twitter.com/t1gNmnI69p — ANI (@ANI) December 20, 2023 -
20 ఏళ్లుగా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు: ధన్కర్కు మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ధన్కర్ స్వయంగా ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. మంగళవారం పార్లమెంట్లో జరిగిన ఘటన విషయంపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప రాష్ట్రపతిలాంటి రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని, అది కూడా పార్లమెంట్లో విపక్షాల ఎంపీలు ఇలా అవమానించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఆయన ఇలాంటి అవమానాలకు గురవుతున్నారని చెప్పినట్లు తెలిపారు. అయితే కొంతమంది ప్రవర్తన తన కర్తవ్యాన్ని నిర్వర్తించడకుండా అడ్డుకోలేవని ధన్కర్ వెల్లడించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా తాను మాత్రం కట్టుబడి పని చేస్తానని తెలిపారు. తన హృదయపూర్వకంగా రాజ్యంగ విలువలకు కట్టుబడి ఉన్నానని, తన మార్గాన్ని ఎవరూ మార్చబోరని పేర్కొన్నారు. ఇక ప్రధానితోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీలు తమ వ్యక్తీకరణ గౌరవంగా ప్రవర్తించాలని హితవు పలికారు. కాగా మంగళవారం సస్పెండ్ అయిన పార్లమెంట్ విపక్ష సభ్యులు సస్పెన్షన్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కకర్ మిమిక్రీ చేశారు. పార్లమెంట్ మెట్ల వద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మెన్ జగదీప్‌ను అనుకరిస్తూ ఎగతాళి చేశారు. ఈ మిమిక్రీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన ధన్కర్.. రాజ్యసభలో తనపట్ల జరిగిన సంఘటనను వ్యక్తిగత దాడిగా అభివర్ణించారు. మరోవైపు ‘ఎంపీల సస్పెన్షన్’ వివాదం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. పార్లమెంట్లో గతవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగింస్తున్నందుకు ఇప్పటి వరకు రాజ్యసభ, లోక్‌సభలోని విపక్షాలకు చెందిన 141 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఎంపీల సస్పెన్షన్‌పై ప్రతిపక్షాలు తమ నిరసనలను తీవ్రం చేస్తున్నాయి. Received a telephone call from the Prime Minister, Shri @narendramodi Ji. He expressed great pain over the abject theatrics of some Honourable MPs and that too in the sacred Parliament complex yesterday. He told me that he has been at the receiving end of such insults for twenty… — Vice President of India (@VPIndia) December 20, 2023 -
మంటలు రేపిన..మాక్ పార్లమెంట్!
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల నుంచి తమ సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్ష ఎంపీలు చేపట్టిన కార్యక్రమం తీవ్ర రాజకీయ దుమారానికి తెర తీసింది. విపక్ష ఇండియా కూటమికి చెందిన రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు మంగళవారం ఉదయం పార్లమెంటు ఆవరణలోని మకర ద్వారం మెట్లపై మాక్ పార్లమెంటు నిర్వహించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాందీతో పాటు పలు విపక్షాల సభ్యులు అందులో పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అచ్చంగా సభల్లో మాదిరిగానే సభ్యులంతా నినాదాలతో హోరెత్తించారు. పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉభయ సభల నుంచి విపక్ష సభ్యులను భారీగా సస్పెండ్ చేస్తున్న తీరును తీవ్రంగా ఆక్షేపించారు. పాలక పక్షానివి నియంతృత్వ పోకడలంటూ దుమ్మెత్తిపోశారు. పార్లమెంటులో అధికార పక్షానికి చెందిన సభ్యుల వ్యవహార శైలిని వ్యంగ్యంగా అనుకరించారు. ఆ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ ఉన్నట్టుండి లేచి నిలబడి రాజ్యసభలో చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ నడక తీరును, హావభావాలను, ఆయన సభను నిర్వహించే తీరును రకరకాలుగా అనుకరిస్తూ ఎద్దేవా చేశారు. అచ్చం ధన్‌ఖడ్ మాదిరిగానే కాస్త వెనక్కు వంగి నిలబడి, ‘వెన్నెముక’ అంటూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యులంతా నవ్వుతూ ఆయన్ను ప్రోత్సహించగా దీన్నంతటినీ రాహుల్ తన సెల్ ఫోన్లో వీడియో తీస్తూ కని్పంచారు. మరికొందరు విపక్షసభ్యులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నడిపే తీరును కూడా వ్యంగ్యంగా అనుకరిస్తూ ఆటపట్టించారు. ఇదంతా టీవీ చానళ్లలో లైవ్‌గా ప్రసారమైంది. ముఖ్యంగా ధన్‌ఖడ్‌ను బెనర్జీ అనుకరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిగ్గుచేటు: బీజేపీ విపక్షాల తీరుపై బీజేపీ మండిపడింది. విపక్ష సభ్యులు తమ ప్రవర్తనతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను దారుణంగా హేళన చేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ మండిపడ్డారు. ఈ చర్యతో విపక్ష ఇండియా కూటమి సంస్కారరాహిత్యం అట్టడుగుకు దిగజారిందన్నారు. ప్రజాస్వామిక విలువల పరిరక్షకుడినని చెప్పుకునే రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు, దేశానికి సిగ్గుచేటంటూ ఆక్షేపించారు. వెనకబడ్డ సాదాసీదా నేపథ్యం నుంచి వచ్చి అత్యున్నత రాజ్యాంగ పదవులను అధిష్టించిన వారిని అవమానించడం ఇండియా కూటమి సంస్కృతి అంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. ‘‘ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన ధన్‌ఖడ్‌ను అవమానించి తీరు ఇందుకు తాజా నిదర్శనం. ఓబీసీ అయిన ప్రధాని నరేంద్ర మోదీని విపక్షాలు ఎంతగా అవమానిస్తున్నదీ దేశమంతా చూస్తూనే ఉంది. ఈ విషయంలో రాహుల్‌ను కోర్టు దోషిగా కూడా తేలి్చంది. రాష్ట్రపతి ముర్మును కూడా అదీర్ రంజన్ చౌధరి రాష్ట్రపత్ని అంటూ అవమానించారు’’ అన్నారు. తీరని అవమానం: ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల ప్రవర్తన అత్యంత దారుణ, సిగ్గుచేటు అంటూ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ మండిపడ్డారు. ఉదయం రెండుసార్లు వాయిదా పడ్డ రాజ్యసభ మధ్యాహ్నం తిరిగి సమావేశం కాగానే కాంగ్రెస్ ఎంపీ దిగి్వజయ్‌సింగ్ నినాదాలకు దిగగా కూర్చోవాల్సిందిగా ఆదేశించారు. విపక్ష ఎంపీలు తనను అనుకరిస్తూ ఎద్దేవా చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘పార్టీల మధ్య వాగ్యుద్ధాలు, పరస్పర విమర్శలు సహజమే. కాకపోతే రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ వంటి వ్యవస్థలపై కనీస గౌరవం చూపాలి. కానీ నేనిప్పడే చానళ్లలో చూశా. చైర్మన్‌ను, స్పీకర్‌ను వ్యంగ్యంగా అనుకరిస్తూ ఒక ఎంపీ అత్యంత దారుణంగా ప్రవర్తిస్తుంటే మీ పార్టీ సీనియర్ నాయకుడు (రాహుల్) దాన్ని వీడియో తీస్తున్నాడు. ఆయన మీకంటే పెద్ద నాయకుడు. ఇది చాలా దారుణం. అభ్యంతరకరం. అత్యంత సిగ్గుచేటు. ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. దేనికైనా ఒక హద్దుంటుంది! కానీ ఈ దిగజారుడుతనానికి హద్దంటూ లేదా? మీకు సద్బుద్ధి కలగాలని ఆశించడం తప్ప ఏం చేయగలను?’’ అంటూ మండిపడ్డారు. అనంతరం మరో కాంగ్రెస్ సభ్యుడు పి.చిదంబరాన్ని ఉద్దేశించి కూడా ధన్‌ఖడ్ తన ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రాజ్యసభ చైర్మన్ వంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని ఒకరు వ్యంగ్యంగా అనుకరిస్తుంటే, ఇంకొకరు వీడియో తీస్తుంటే చూసి నా హృదయం ఎంతగా క్షోభిల్లి ఉంటుందో మీరే ఊహించండి! దేశాన్ని చిరకాలం పాటు పాలించిన పార్టీ రాజ్యసభ చైర్మన్ వ్యవస్థను ఇంత దారుణంగా అవమానించడం దారుణం. మిస్టర్ చిదంబరం! ఏమిటిది? మీకో విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నా. ఈ ఉదంతంతో నా మనసు ఎంతగానో గాయపడింది. పైగా ఆ వీడియోను మీ పార్టీ ఇన్స్టా్రగాంలో, పార్టీ ట్విటర్లో కూడా పెట్టారు. తద్వారా నా రైతు నేపథ్యాన్ని, ఒక జాట్‌గా నా సామాజిక నేపథ్యాన్ని, రాజ్యసభ చైర్మన్‌గా నా హోదాను... ఇలా అన్నింటినీ తీవ్రంగా అవమానించారు’’ అంటూ ధన్‌ఖడ్ తీవ్రంగా ఆక్షేపించారు. -
'సిగ్గుచేటు..' రాజ్యసభ ఛైర్మన్‌పై విపక్ష ఎంపీ మిమిక్రి
ఢిల్లీ: పార్లమెంటు వెలుపల తనపై మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మండిపడ్డారు. ఎంపీ స్థానంలో ఉండి ఛైర్మన్‌ని హేళన చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి విపక్ష ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇమిటేట్ చేశారు. ఇందుకు విపక్ష సభ్యులు నవ్వులు కురిపిస్తుండగా.. ఆ దృశ్యాలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫోన్లో చిత్రీకరించారు. If the country was wondering why Opposition MPs were suspended, here is the reason… TMC MP Kalyan Banerjee mocked the Honourable Vice President, while Rahul Gandhi lustily cheered him on. One can imagine how reckless and violative they have been of the House! pic.twitter.com/5o6VTTyF9C — BJP (@BJP4India) December 19, 2023 విపక్షాల చర్యను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఖండించారు. కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేయాలని పిలుపునిచ్చారు. సభ గౌరవ మర్యాదలను కాపాడకుండా, సభాధ్యక్షునిపై హేళనగా ప్రవర్తించిన ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్‌సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారిక ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో గందరగోళం సృష్టించడంతో ఇప్పటివరకు 141 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇదీ చదవండి: లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు -
ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పథకాలు వ్యయప్రాధాన్యతను వక్రీకరిస్తాయని చెప్పారు. ఉచిత పథకాల అంశంలో పోటాపోటీగా నడుస్తున్న రాజకీయాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ‘భారత మండపం’లో ఎన్హెచ్ఆర్సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఉచిత పథకాలతో ప్రజల జేబులు నింపడం సరికాదని జగ్దీప్ ధన్‌ఖడ్ అన్నారు. ప్రజల జీవన శైలి, సమర్థత, నైపుణ్యాలను మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు. భారత్ మాదిరిగా ప్రపంచంలో ఏ ప్రదేశమూ మానవ హక్కులతో విరాజిల్లడం లేదని స్పష్టం చేశారు. ఉచితాలు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని తగ్గిస్తాయని ఆయన చెప్పారు. ‘అమృత్ కాల్’ సమయంలోనే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా 75వ వార్షికోత్సవాన్ని చేసుకోవడం యాదృచ్ఛికమని జగ్దీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ శోంబి షార్ప్ పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ పంపిన సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా తీవ్రవాదం, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులపై దాని ప్రభావం తీవ్రమైన సమస్యగా ప్రస్తావించారు. ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి -
రాజ్యసభ ఛైర్మన్‌కు క్షమాపణలు చెప్పండి: చద్దాకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్కు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛద్దాకు స్పష్టం చేసింది. రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేస్తూ ఛైర్మన్ తీసుకన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఛద్దా సుప్రీంకోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ విషయమై శుక్రవారం చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపి తీర్పునిచ్చింది. ఛద్దా క్షమాపణలను రాజ్యసభ ఛైర్మన్ కూడా సానుభూతితో పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు బెంచ్ సూచించింది. సస్పెన్షన్ కేసులో ఛద్దా నేరుగా ఛైర్మన్‌ను కలిసి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. సీజేఐ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ శుక్రవారం తీర్పునిస్తూ.... రాజ్యసభ చైర్మన్ అయిన జగ్దీప్ ధన్కర్.. చద్దా క్షమాపణలను సానుభూతితో పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ కేసులో ముందుకు వెళ్లే మార్గాన్ని సృష్టించేందుకు ప్రయత్నించాలని సూచించారు. అయితే ఆప్ ఎంపీ అయిన రాఘవ్ చద్దా తొలిసారి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఆయన అత్యంత పిన్న వయస్కుడన్న విషయాన్ని ప్రస్తావించారు. కోర్టు ఆదేశాలపై చద్దా తరపు న్యాయవాది షాదన్ ఫరాసాత్ స్పందిస్తూ.. రాజ్యసభ చైర్మన్‌ను క్షమాపణలు కోరడంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. చైర్మన్‌కు కలిసి క్షమాపణలు కోరేందుకు చద్దా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆప్ ఎంపీ క్షమాపణలు చెప్పడం సరైనదేనని కేంద్రం తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా అంగీకరించారు. అనంతరం ఈ కేసులో పురోగతిని నవంబర్ 20న తెలియజేయలన్న సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా కాగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ పరిశీలించేందుకు ప్రతిపాదిత సెలక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే అయిదుగురు సభ్యుల పేర్లను చేర్చారన్న ఆరోపణలపై గత వర్షాకాల సమావేశాల్లో రాఘవ్ చద్దాను ఆగస్టు 11న రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ తెలిపింది. రాఘవ్ చద్దాను సస్పెండ్ చేయాలంటూ పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార వైఖరి ఆరోపణలపై ఆయనపై సస్పెన్స్ వేటు పడింది. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చేంత వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. దీనిపై రాఘవ్ చద్దా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
సంగీత నాటక అకాడమీ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు వురికి సంగీతనాటక అకాడమీ అవార్డులు ప్రదానం చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌ఖడ్ గ్రహీతలకు అవార్డు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడికి చెందిన మహంకాళి శ్రీమన్నారాయణ మూర్తి (కూచిపూడి), ముమ్మిడి వరానికి చెందిన పండితారాధ్యుల సత్యనారాయణ (హరికథ), మచిలీపట్నానికి చెందిన మహాభాష్యం చిత్తరంజన్ (సంప్రదాయ సంగీతం–సుగమ్ సంగీత్), తెలంగాణ నుంచి కోలంక లక్ష్మణరావు (కర్ణాటక సంగీతం–మృదంగం) (స్వస్థలం పిఠాపురమైనా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు), నల్లగొండ జిల్లా కూర్మపల్లికి చెందిన ఐలయ్య ఒగ్గరి (ఒగ్గు కథ), వరంగల్‌కు చెందిన బాసని మర్రెడ్డి (థియేటర్ డైరెక్టర్)లు అవార్డులు అందుకున్నారు. అవార్డు గ్రహీతలను రూ.లక్ష బహుమతి, తామ్రపత్రం, శాలువాతో సత్కరించారు. -
మహేంద్రగిరి జల ప్రవేశం
ముంబై: భారత నావికాదళం సామర్థ్యాన్ని మరింత పెంచే మహేంద్రగిరి యుద్ధనౌక శుక్రవారం ముంబైలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ యుద్ధనౌకను జలప్రవేశం చేయించారు. మహేంద్రగిరిని ప్రారంభించడం మన నావికాదళ చరిత్రలో కీలక మైలురాయిగా ధన్‌ఖడ్ సందర్భంగా అభివర్ణించారు. భారత సముద్ర నావికాశక్తికి రాయబారిగా మహా సముద్ర జలాల్లో త్రివర్ణపతాకాన్ని మహేంద్రగిరి సగర్వంగా రెపరెపలాడిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) మహేంద్రగిరిని తయారు చేసింది. ప్రాజెక్ట్ 17ఏ సిరీస్‌లో ఇది ఏడోదని అధికారులు తెలిపారు. దేశ ఆర్థిక ప్రగతికి, ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు, సముద్ర జలాల్లో మన ప్రయోజనాలను రక్షించుకునేందుకు నావికాదళాన్ని ఆధునీకరణ చేయడం ఎంతో అవసరమన్నారు. హిందూమహా సము ద్ర ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయాలు, భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా కూడా ఈ అవసరం ఎంతో ఉందని చెప్పారు. మహేంద్రగిరిలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థల్లో 75 శాతం దేశీయంగా తయారైనవే కావడం గర్వకారణమని పేర్కొన్నారు. -
రాజ్యసభ ఎంపీగా జైశంకర్ ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ సహా తొమ్మిది మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం పార్లమెంట్ హౌజ్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. 2019లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన జైశంకర్ రెండోసారి గుజరాత్ నుంచి ఇటీవల రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు బీజేపీకి చెందిన బాబూభాయ్ జెసంగ్‌భాయ్ దేశాయ్ (గుజరాత్), కేస్రీదేవ్ సింగ్ దిగి్వజయ్‌సింగ్ ఝాలా (గుజరాత్), నాగేంద్ర రాయ్ (పశి్చమ బెంగాల్)లు, ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డెరెక్ ఒబ్రియాన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, ప్రకాష్ చిక్ బరైక్, సమీరుల్ ప్రమాణ స్వీకారం చేశారు. -
Parliament session: నాకు కోపమే రాదు ఎందుకంటే... నా పెళ్లై 45 ఏళ్లయింది!
మణిపూర్ అంశంపై పార్లమెంటు అట్టుడుకుతున్న వేళ రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తనపైనే జోకులు వేసుకుని సభలో నవ్వులు పూయించారు. దాంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మీకు పదేపదే కోపమెందుకు వస్తుందని విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ‘సర్. నాకసలు కోపమే రాదు. ఎందుకంటే నా పెళ్లై 45 ఏళ్లయింది’ అంటూ ధన్‌ఖడ్ చెణుకులు విసరడంతో సభ్యుల నవ్వులతో సభ దద్దరిల్లిపోయింది. ‘‘చిదంబరం (కాంగ్రెస్ సభ్యుడు) చాలా సీనియర్ లాయర్ కూడా. అథారిటీపై కోపం చూపే హక్కు మాకుండదని ఆయనకు బాగా తెలుసు. సభలో మీరే (సభ్యులు) అథారిటీ. మరో విషయం. నా భార్య ఎంపీ కాదు. కనుక ఆమె గురించి నేనిలా సభలో మాట్లాడటం సరికాదు కూడా’’ అంటూ ధన్‌ఖడ్ మరోసారి అందరినీ నవి్వంచారు. తనకు కోపం వస్తుందన్న వ్యాఖ్యలను సవరించుకోవాల్సిందిగా ఖర్గేను కోరారు. దాంతో ఆయన లేచి, ‘‘మీకు కోపం రాదు. చూపిస్తారంతే. కానీ నిజానికి చాలాసార్లు లోలోపల కోపగించుకుంటారు కూడా’’ అనడంతో అధికార, విపక్ష సభ్యులంతా మరోసారి నవ్వుల్లో మునిగిపోయారు! రెండుసార్లు వాకౌట్ అంతకుముందు, మణిపూర్ అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, తృణమూల్, ఆర్జేడీ, ఆప్, వామపక్షాలు తదితర విపక్షాలు ఉదయం రాజ్యసభ భేటీ కాగానే వాకౌట్ చేశాయి. మధ్యాహ్నం రెండింటికి తిరిగి సమావేశమయ్యాక కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్ తివారీకి చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ అవకాశమిచ్చారు. మణిపూర్ హింసపై, మహిళలపై ఘోర అత్యాచారాలపై చర్చకు అవకాశం కోరుతున్నట్టు ఆయన చెప్పారు. దీనిపై అధికార, విపక్ష సభ్యులతో ఎన్నిసార్లు సమావేశమైనా ఎవరికి వాళ్లే తమదే పై చేయి కావాలని పట్టుదలకు పోవడంతో లాభం లేకపోతోందంటూ చైర్మన్ వాపోయారు. ఆగ్రహించిన విపక్ష సభ్యులు ‘ప్రధాని మోదీ సభకు రావాలి’ అంటూ నినాదాలకు దిగారు. వాటిని పట్టించుకోకుండా ఖనిజాల (సవరణ) బిల్లు ప్రవేశపెట్టేందుకు మంత్రి ప్రహ్లాద్ జోషికి చైర్మన్ అవకాశమిచ్చారు. దాన్ని నిరసిస్తూ విపక్షాలు రెండోసారి వాకౌట్ చేశాయి. -
రాజ్యసభలో నవ్వులు పూయించిన ఖర్గే-చైర్మన్లు..
మణిపూర్ అంశంపై పార్లమెంట్లో విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. నిరంతరం ఆందోళనలు, నినాదాలు, నిరసనలతో ఉభయ సభలను స్తంభింపచేస్తున్నారు. మణిపూర్ సమస్యపై చర్చించాలంటూ పార్లమెంట్లో ప్రతిపక్షాల డిమాండ్‌తో పది రోజులుగా సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలుగుతూనే ఉంది. తాజాగా తాను ఎవరిని సమర్ధించాల్సిన అవసరం లేదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ స్పష్టం చేశారు. తను కేవలం రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందంటూ వ్యాఖ్యానించారు. అయితే మణిపూర్ విషయంలో చైర్మన్ ప్రధాని మోదీని సమర్థిస్తున్నారంటూ బుధవారం ఏఐసీసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రతిపక్ష నేత వ్యాఖ్యల నేపథ్యంలో జగదీప్ ధన్‌ఖడ్ ఈ విధంగా గురువారం బదులిచ్చారు. కాగా మణిపూర్ హింసపై రూల్ 267 కింద సభలో చర్చ చేపట్టాలంటూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. అయితే వాటిని తిరస్కరిస్తూ..మణిపూర్ వ్యవహారంపై రూల్ 176 కింద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసపై మోదీ ఎందుకు నోరువిప్పడం లేదని ఖర్గే నిలదీశారు. దీనిపై స్పందించిన ధన్‌ఖడ్.. ప్రధాని రావాలనుకుంటే రావొచ్చని, రావాలంటూ ఆదేశించలేనని తేల్చిచెప్పారు. అయితే రాజ్యసభ చైర్మన్ ప్రధాని మోదీని సమర్ధిస్తున్నారంటూ ఖర్గే విమర్శించారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ గురువారం మాట్లాడుతూ.. ‘మనది 1.3 బిలియన్లకు పైగా జనాభా ఉన్న ప్రజాస్వామ్య దేశమని అందరూ గుర్తించాలి. ప్రధానమంత్రిని నేను సమర్థించాల్సిన అవసరం లేదు. ప్రపంచ వేదికలపై ఆయనకు గుర్తింపు వచ్చింది. నేను ఎవరినీ రక్షించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, మీ హక్కులను రక్షించడమే నా కర్తవ్యం. ప్రతిపక్ష నేత నుంచి ఇలాంటి మాటలు రావడం సరి కాదు’ అని జగదీప్ ధన్ఖర్ అన్నారు. చదవండి: పార్లమెంట్ అంతరాయాలు.. మధ్యే మార్గం ద్వారా పరిష్కారం? ధన్‌ఖడ్, ఖర్గే మధ్య సరదా సంభాషణ మణిపూర్ హింసతో పార్లమెంట్ అట్టుడుకుతుండగా.. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇద్దరి మాటలతో సభలో కాసేపు నవ్వులు విరిశాయి. మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో గురువారం మాట్లాడుతూ, రూల్ 267కు ప్రాధాన్యం ఇస్తూ మణిపూర్ సమస్యపై చర్చను చేపట్టాలని, ఇతర సభా కార్యకలాపాలను వాయిదా వేయాలని కోరారు. ‘‘ఈ డిమాండ్‌ను అంగీకరించాలంటే, ఏదో ఓ కారణం ఉండాలని మీరు చెప్పారు. నేను మీకు కారణాన్ని చూపించాను. నిన్న (బుధవారం) కూడా ఇదే విషయంపై విజ్ఞప్తి చేశాను. . కానీ బహుశా మీరు కోపంగా ఉండి ఉంటారు’’ అని అన్నారు. "मैं 45 साल से शादीशुदा आदमी हूं, इसलिए मैं गुस्सा नहीं करता हूं" ◆ मल्लिकार्जुन खड़गे से बोले सभापति जगदीप धनखड़, राज्यसभा में लगे हंसी के ठहाके@kharge | #MallikarjunKharge | Jagdeep Dhankhar | #JagdeepDhankhar pic.twitter.com/8o39PY69p9 — Amit Singh 🇮🇳 (@KR_AMIT007) August 3, 2023 ఖర్గే మాటలపై ధన్కర్ స్పందిస్తూ.. నాకు పెళ్లై 45 ఏళ్లు దాటింది. నాకు ఎప్పుడూ కోపం రాదు. నమ్మండి అంటూ సరాదాగా పేర్కొన్నారు. తో సభ్యులంతా గొల్లుమని నవ్వారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరాన్ని ఉద్ధేశిస్తూ.. ‘ చిదంబరం గొప్ప సీనియర్ అడ్వకేట్ అనే విషయం మన అందరికీ తెలుసు. ఓ సీనియర్ అడ్వకేట్‌గా(స్వతహాగా ధన్‌ఖడ్ సైతం న్యాయవాదియే) కోపం ప్రదర్శించే అధికారం మనకు లేదు. మీరొక అధికారి(ఖర్గేను ఉద్ధేశిస్తూ), ఈ స్టేట్మెంట్ను దయచేసి సవరించండి’’ అని కోరారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ, ‘‘మీకు కోపం రాదు, మీరు కోపాన్ని ప్రదర్శించరు, కానీ లోలోపల కోపంగా ఉంటారు’’ అన్నారు. దీంతో సభ్యులు మరోసారి నవ్వుకున్నారు. ఖర్గే కొనసాగిస్తూ.. రూల్ 267 ప్రకారం మణిపూర్‌పై చర్చించాలని పట్టుబట్టారు. ‘ఈ రూల్ ప్రకారం చర్చ జరపడానికి ఎలాంటి కారణం లేదని చైర్మన్ చెబుతున్నారు. కానీ మణిపూర్ అంశం ప్రతిష్టాత్మక సమస్యగా మారింది. మేము దీనిని రోజూ లేవనెత్తుతున్నాము. కానీ వారు దీనిని వ్యతిరేకిస్తున్నారు’ మండిపడ్డారు. చదవండి: హర్యానా ఘర్షణలు.. ప్రాణాలతో బయటపడ్డ మహిళా జడ్జి, మూడేళ్ల చిన్నారి -
రాజ్యసభ వైస్ చైర్పర్సన్లలో సగం మంది మహిళలు
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ వైస్ చైర్పర్సన్ల ప్యానెల్లో సగం మంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇది జూలై 17 నుంచి అమల్లోకి వచ్చిందని ఆయన గురువారం ప్రకటించారు. కొత్తగా ఉపాధ్యక్షులైన రాజ్యసభ సభ్యుల్లో పీటీ ఉష, ఎస్.ఫంగ్నొన్ కొన్యాక్, ఫౌజియా ఖాన్, సులాటా దియో, వి.విజయసాయిరెడ్డి, ఘన్‌శ్యామ్ తివారీ, ఎల్.హనుమంతయ్య, సుఖేందు శేఖర్ రే ఉన్నారు. నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మొట్టమొదటి మహిళ కొన్యాక్ సహా ప్యానెల్లోకి తీసుకున్న మహిళా సభ్యులందరూ మొదటిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన వారే. ఎగువసభ చరిత్రలో వైస్ చైర్పర్సన్ల ప్యానెల్లోకి సగం మందికి ప్రాతినిధ్యం కల్పించడం ఇదే ప్రథమం అని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. -
జలసంరక్షణలో జాతీయ అవార్డు
సూపర్‌బజార్(కొత్తగూడెం) : జల సంరక్షణ విభాగంలో ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు రాగా, ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ గడ్డం భవాని, కార్యదర్శి షేక్ ఇబ్రహీం శనివారం పురస్కారం స్వీకరించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 11 కేటగిరీల్లో 41 మంది విజేతలను ప్రకటించగా జల సంరక్షణలో ఉత్తమ పంచాయతీగా జగన్నాథపురం నిలిచిన విషయం తెలిసిందే. గ్రామానికి అవార్డు రావడం పట్ల కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. ప్రశంసపత్రంతో పాటు నగదు బహుమతి అందుకున్నారని తెలిపారు. జాతీయస్థాయిలో జల సంరక్షణలో మొదటి స్థానం సాధించేందుకు కృషి చేసిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, సహకరించిన ప్రజలను ఆయన అభినందించారు. జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుంచి జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులు అందజేస్తున్నారని పేర్కొన్నారు. -
చిన్ననాటి గురువు ఇంటికి వెళ్లిన ఉపరాష్ట్రపతి
కన్నూర్(కేరళ): ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ సోమవారం కేరళలో కన్నూర్ జిల్లాలోని పన్నియన్నూర్ గ్రామానికి వెళ్లారు. చిత్తోఢ్‌గఢ్ సైనిక్ స్కూల్లో తన గురువైన రత్న నాయర్‌ను కలుసుకున్నారు. అత్యున్నత స్థాయిలో తమ ఇంటికి వచ్చిన శిష్యుడిని చూసిన ఆమె పొంగిపోయారు. ఇంతకు మించిన గురుదక్షిణ ఇంకేముంటుందంటూ ఆనందించారు. వారిద్దరూ నాటి ఘటనలను గుర్తు తెచ్చుకుంటూ గడిపారు. -
ప్రజల గొంతు నొక్కేయగలరా?
న్యూఢిల్లీ: భారతదేశంలో ఉన్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ప్రపంచంలో ఇంకెక్కడా లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజల గొంతు నొక్కేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇటీవల ఓ పత్రిక వ్యాసంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవి తనకు బాధ కలిగించాయన్నారు. ప్రజల గొంతును ఎవరూ నొక్కేయలేరని చెప్పారు. బుధవారం ‘మన్‌కీ బాత్ 100 జాతీయ సదస్సు’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే ఈ రేడియో కార్యక్రమం దేశానికి ఒక ఆశాదీపమన్నారు. దీనిద్వారా రాజకీయాలకు అతీతంగా మోదీ దేశానికి సందేశమిస్తున్నారని ప్రశంసించారు. కొందరు నాయకులు విదేశాలకు వెళ్లి, మన దేశాన్ని తూలనాడుతున్నారని మండిపడ్డారు. మోదీ హయాంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మన్ కీ బాత్ 100 కాఫీ టేబుల్ బుక్ తదితరాలను ధన్‌ఖడ్ విడుదల చేశారు. ముఖ్యమైన భావప్రసారం: ఆమిర్ ఖాన్ మన్ కీ బాత్ చాలా ముఖ్యమైన భావప్రసార కార్యక్రమమని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రశంసించారు. మన్ కీ బాత్ ద్వారా మోదీ దేశ ప్రజలతో అనుసంధానం అవుతున్నారని తెలిపారు. అత్యంత కీలకమైన అంశాలపై చర్చిస్తున్నారని, తన ఆలోచనలు పంచుకుంటూ చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారని అమీర్ ఖాన్ ప్రశంసించారు. -
భారతదేశ సమగ్రతపై పథకం ప్రకారం జరుగుతున్న దాడి!: ధన్‌ఖడ్
భారతదేశ సమగ్రతపై పక్కా ప్లాన్ ప్రకారమే తీవ్ర స్థాయిలో దాడి జరుగుతోందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హెచ్చరించారు. గ్లోబెల్స్ ప్రచారం కూడా చిన్నబోయేలా ఈ దాడి జరుగుతోందన్నారు. ఈమేరకు ఆయన ఓ వార్త సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రైజింగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. ప్రభుత్వం అవినీతిపై చేస్తున్న యుధ్దాన్ని పక్షపాత ధోరణితో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడ్డుకోవాలని చూడటం దురదృష్టకరం అన్నారు. అవినీతి అంశాన్ని ఎలా రాజకీయ కోణంలో చూడగలమని ప్రశ్నించారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని తమను టార్గెట్ చేస్తుందంటూ.. ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నేపథ్యంలోనే ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ న్యాయవ్యవస్థ పట్ల గర్విస్తోందని అన్నారు. ఎవరికైనా పరువు నష్టం వాటిల్లందంటే తక్షణమే ఉపశమనం పొంది, న్యాయం చేకూరేలా చేసే సుప్రీం కోర్టులాంటి న్యాయవస్వయస్థ ఎక్కడ లభిస్తోందన్నారు. అయినా ఈ అంశంపై మాకు పాఠాలు చెప్పడానికి ప్రపంచంలో ఎవరికీ చట్టబద్ధత గానీ అందుకు సంబంధించి సాక్ష్యాధారాలు గానీ వారి వద్ద లేవని నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీపై విధించిన అనర్హత వేటును గమనిస్తున్నాం అని జర్మని ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ధన్ఖర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతేగాదు తన ప్రసంగంలో భారతదేశ సమగ్రతపై పథకం ప్రకారమే దాడి జరుగుతోందని, అందుకోసం దేశం లోపల, వెలుపల కొన్ని దుష్ట శక్తుల పనిచేస్తున్నాయన్నారు. అంతేగాదు భారతదేశ వృద్ధిని కుంటిపరిచే ఒక వ్యవస్థ మొత్తం పనిచేస్తోందని ఆరోపించారు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఇతర దేశాల్లో తన సొంత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతారా అని విరుచుకుపడ్డారు. ఇలాంటి వాటికి ప్రజలు కచ్చితం అడ్డుకట్ట వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ధన్‌ఖడ్. (చదవండి: పార్లమెంట్ నూతన భవనాన్ని సందర్శించిన ప్రధాని) -
పార్లమెంటే అత్యుత్తమం: ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశంలో పార్లమెంటే అత్యుత్తమమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. రాజ్యాంగం మన పార్లమెంట్‌లోనే పురుడు పోసుకుందని గుర్తుచేశారు. రాజ్యాంగ రచనలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ తదితరాల పాత్ర ఎంతమాత్రం లేదన్నారు. ప్రజల తీర్పును పార్లమెంట్ ప్రతిబింబిస్తుందని చెప్పారు. రాజ్యాంగ రూపశిల్పి పార్లమెంటేనని వివరించారు. తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్రావు జీవిత చరిత్ర గ్రంథాన్ని జగదీప్ ధన్‌ఖడ్ ఆదివారం పార్లమెంట్ ప్రాంగణంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ మాట్లాడారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నడుమ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, దేశాభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు విదేశాలకు వెళ్లి మన దేశంపై విషం చిమ్ముతున్నారని, మన ప్రజాస్వామ్యంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ధన్‌ఖడ్ విమర్శించారు! అలాంటి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇటీవల బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం పార్లమెంటులో దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ పేరు ప్రస్తావించకుండా ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు ఉపయోగించుకోలేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కేపీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై సమాధానం ఇస్తూ ఫిబ్రవరి 9న రాజ్యసభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీపై రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 188 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ తన నోటీసులో పేర్కొన్నారు. నెహ్రూ కుటుంబాన్ని ప్రధాని అవమానించారని ఆక్షేపించారు. నెహ్రూ కుటుంబ సభ్యులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యులేనని గుర్తుచేశారు. నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు వాడుకోలేదని ప్రశ్నించడం అసంబద్ధం, అర్థరహితమని వేణుగోపాల్ తేల్చిచెప్పారు. -
ఆస్కార్ విజేతలకు పార్లమెంట్ జేజేలు
న్యూఢిల్లీ: విశ్వ వేదికపై తెలుగు బావుటా ఎగరేసిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట, ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డులు సాధించినందుకు పార్లమెంట్ జేజేలు పలికింది. భారతీయ సినిమా ఖ్యాతికి ఈ విజయాలు మరింతగా వన్నెతెచ్చాయంటూ మంగళవారం రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రస్తుతించారు. ‘‘ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఇద్దరు మహిళల ఉత్కృష్ట పనితనాన్ని ఎలుగెత్తి చాటింది. భారతీయ మహిళలకు అంతర్జాతీయంగా దక్కిన అపురూప గౌరవమిది’’ అని రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఆర్ఆర్ఆర్ రచయిత వి.విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యుడేనని గుర్తుచేశారు. సభలో నవ్వులు పూయించిన ఖర్గే రెండు దక్షిణాది సినిమాలు ఆస్కార్ దక్కడం గర్వించాల్సిన గొప్ప విషయమని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా బీజేపీనుద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ‘అధికార పార్టీని నేను కోరేదొక్కటే. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది, పాట రాసింది మేమేనంటూ మోదీజీ గానీ, బీజేపీ సర్కార్ గానీ ఆస్కార్ ఘనతను తమ ఖాతాలో వేసుకోవద్దు. ఇది దేశం సాధించిన ఘనత’ అన్నారు. దాంతో సభ్యులు బిగ్గరగా నవ్వేశారు. ఆస్కార్ గెలిచిన దేశ ప్రతినిధుల గురించి పార్లమెంట్లో చర్చించడం ఆనందంగా ఉందని మాజీ నటి, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ అన్నారు. -
ఉపరాష్ట్రపతిని కలిసిన గవర్నర్ తమిళిసై
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌తో భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీ వచ్చిన తమిళిసై తొలుత నేషనల్ బుక్ ట్రస్ట్–కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన ‘న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్–2023’ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రపంచ పుస్తక ప్రదర్శనలో పార్లమెంట్ లైబ్రరీ, పార్లమెంట్ మ్యూజియం–ఆర్కైవ్స్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. ప్రతిఒక్కరూ పుస్తకాల సేకరణ, పుస్తకాలను కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుందని గవర్నర్ తెలిపారు. అంతేగాక ప్రతిఒక్కరూ ఇంట్లో లైబ్రరీని కలిగి ఉండాలని, చదివే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ను ఆయన నివాసంలో కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. -
ఖర్గే వ్యాఖ్యలపై ఛైర్మన్ జగ్దీప్ ధన్కడ్ సీరియస్
-
కాంగ్రెస్ ఎంపీ రజనీపై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ కార్యకలాపాలను ఫోన్లో చిత్రిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రజనీ అశోక్‌రావ్ పాటిల్‌ను సభాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖడ్ శుక్రవారం సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలయ్యే దాకా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీలపై ఆయన చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానమిస్తుండగా విపక్ష సభ్యుల నిరసనను పాటిల్ వీడియో తీశారు. ఆమెను సస్పెండ్ చేయాలంటూ రాజ్యసభ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ధన్‌ఖడ్ అన్ని పార్టీల నేతల అభిప్రాయం కోరారు. ఆమెపై చర్య తీసుకునే ముందు విచారణ జరిపితే బాగుంటుందని వారన్నారు. -
పార్లమెంట్లో ‘హిండెన్‌బర్గ్’ ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక గురువారం పార్లమెంట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. మార్కెట్ విలువను భారీగా కోల్పోతున్న అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల పెట్టుబడుల అంశంపై తక్షణమే చర్చించాలంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనతో ఉభయ సభలు స్తంభించాయి. హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా 9 విపక్షాల ఎంపీలు వెల్‌లోకి వచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. 9 పార్టీల వాయిదా తీర్మానాలు సభా కార్యకలాపాల ఆరంభానికి ముందే ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతలు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అదానీ అంశంపై కేంద్రం సమాధానం ఇచ్చేదాకా సభా కార్యక్రమాలు అడ్డుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే ఉభయ సభల్లో 9 పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి. లోక్‌సభలో కాంగ్రెస్ తరఫున మాణిక్యం ఠాగూర్, బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వర్రావు, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే వాయిదా తీర్మానం ఇచ్చారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. జాంబియా నుంచి వచ్చిన పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. ప్రశ్నోత్తరాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే, అదానీ అంశంపై చర్చించేందుకు రూల్ 267 కింద తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలంటూ స్పీకర్ పదేపదే కోరినా వెనక్కి తగ్గలేదు. ఏకంగా వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక విపక్ష ఎంపీలు ఆందోళనను కొనసాగించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి జోక్యం చేసుకుంటూ సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. సభను శుక్రవారానికి వాయిదా వేశారు. జేపీసీ లేక సీజేఐ నేతృత్వంలో కమిటీ అదానీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఇందుకోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) లేక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఉదయం ఉభయ సభలు వాయిదా పడిన వెంటనే మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని విపక్ష ఎంపీలు విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘మార్కెట్ విలువ కోల్పోతున్న సంస్థల్లో ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులతో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారు. దీనిపై చర్చించడానికి మేమిచ్చిన తీర్మానాన్ని సస్పెండ్ చేశారు. అదానీ అంశంపై పార్లమెంట్లో లోతుగా చర్చించాలి. అదానీపై విచారణ వివరాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు బయటపెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణతోనే..: నామా, కేకే అదానీ వ్యవహారంపై జేపీసీ లేక సీజేఐ కమిటీతో సమగ్ర విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కె.కేశవరావు పేర్కొన్నారు. ఎల్ఐసీ సహా బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. జనం సొమ్మును లూటీ చేశారు ఎల్ఐసీ, ఎస్బీఐ సహా పలు ప్రభుత్వ సంస్థలతో అదానీ గ్రూప్‌లో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆరోపించారు. తాజా సంక్షోభం వల్ల ఆయా సంస్థలు భారీగా నష్టపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయులు పొదుపు చేసుకున్న సొమ్ము ప్రమాదంలో చిక్కుకుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. అదానీ అంశంపై దర్యాప్తు జరిపించాలని విపక్షాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బును అదానీ సంస్థల్లో పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు వారంతా భయాందోళనకు గురవుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ చెప్పారు. జనం సొమ్మును అదానీ లూటీ చేశారని సీపీఎం నేత ఎలమారమ్ ధ్వజమెత్తారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. భారీ కుంభకోణం జరిగితే ప్రభుత్వం ఎందుకు నోరువిప్పడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ నిలదీశారు. -
ఆ వ్యాఖ్యలకు స్పందించకపోతే.. బాధ్యత పరంగా విఫలమైనట్లే: ధన్ఖర్
న్యూఢిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థను దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. న్యాయ వ్యవస్థపై సోనియా ఇలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. దీంతో సభలో ఈ అంశాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రమోద్ తివాయ్, సహచర సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే లేవనెత్తారు. "లోక్‌సభ సభ్యురాలు సోనియా గాంధీ బయట మాట్లాడిన అంశాన్ని రాజ్యసభలో చర్చించకూడదు. ఒకవేళ వ్యాఖ్యానిస్తే దురదృష్టకరం ఇలా ఎప్పుడూ జరగలేదు. దయచేసి ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి లేదా వెనక్కి తీసుకోండి లేదంటే ఒక చెడ్డ ఉదాహరణగా నిలుస్తుందంటూ కాంగ్రెస్ నేతలు రాజ్యసభ చైర్మన్‌ని అభ్యర్థించారు తాను సోనియా వ్యాఖ్యలకు ప్రతిస్పందించకపోతే తాను చేసిన ప్రమాణాన్ని ఒమ్ము చేసి రాజ్యంగా బాధ్యతలో విఫలమైనట్లేనని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామంపై విశ్వాసలేమిని సూచిస్తున్నాయన్నారు. తాను సరైన విధంగా స్పందించనట్లయితే పాలక పక్ష పార్టీని కించపరిచేలా తప్పుడూ పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. అంతేగాదు న్యాయవ్యవస్థను చట్టవిరుద్ధంగా మార్చడం అంటే ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడనట్లేనని నొక్కి చెప్పారు. ఈ పక్షపాత పోరును అంతర్లీనంగంగా పరిష్కరించుకోవాలని అన్నారు. (చదవండి: పార్లమెంట్లో ‘సరిహద్దు’ రగడ.. లోక్‌సభ ఐదుసార్లు వాయిదా) -
‘మనల్ని చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారు’.. రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం
న్యూఢిల్లీ: కేంద్రంలోని అధికార బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు అధికార బీజేపీ పార్టీ సభ్యులు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు అందుకు నిరాకరించడంతో కొంతసేపు సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ను బీజేపీ నేతలు ‘భారత్ తోడో యాత్ర’గా పేర్కొనటంపై సోమవారం మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. దేశం కోసం కాంగ్రెస్ స్సాతంత్య్రాన్ని తీసుకొచ్చిందని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి నేతలు దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. ‘కనీసం మీ ఇంట్లోని శునకం అయినా దేశం కోసం చనిపోయిందా? అయినప్పటికీ వారు దేశభక్తులమని చెప్పుకుంటున్నారు. మేమేమైనా అంటే దేశద్రోహులుగా ముద్ర వేస్తారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. మంగళవారం పార్లమెంట్ మొదలవగానే.. ఖర్గే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆందోళనకు దిగారు అధికార పార్టీ సభ్యులు. ఖర్గే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. అటు లోక్‌సభలోనూ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మనం చిన్నపిల్లలమా? రాజ్యసభలో ఖర్గే వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్. వివాదాస్పద వ్యాఖ్యలు పార్లమెంట్ వెలుపల చేసినట్లు గుర్తు చేశారు. ‘దేశంలోని 135 కోట్ల మంది ప్రజలు మనల్ని చూసి నవ్వుతున్నారు. సభలో ఇలాంటి ప్రవర్తన మనకు చాలా చెడ్డపేరు తెస్తుంది. సభ నడిచే తీరుతో బయట ప్రజలు నిరుత్సాహానికి గురవుతారు. కనీసం సభాపతి సూచనలను కూట పట్టించుకోవట్లేదు. ఎంతటి బాధాకర పరిస్థితిని సృష్టిస్తున్నారు. మన్నం చిన్నపిల్లలమా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్ఖడ్. ఇదీ చదవండి: రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి -
మీ త్యాగాన్ని జాతి మరువదు
న్యూఢిల్లీ: 2001లో పార్లమెంట్‌పై ఉగ్ర దాడి ఘటనలో నేలకొరిగిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా జాతి యావత్తూ మంగళవారం నివాళులర్పించింది. పార్లమెంట్ భవనం వెలుపల జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అన్ని పార్టీల ఎంపీలు ఘనంగా నివాళులర్పించారు. 2001 పార్లమెంట్ దాడి ఘటనలో వీరమరణం పొందిన వారికి జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ముర్ము అనంతరం ట్వీట్ చేశారు. దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారి త్యాగాన్ని, ధైర్యసాహసాలను ఎన్నడూ మరువబోమని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. ఘనంగా నివాళులర్పించిన రాజ్యసభ అంతకుముందు, పార్లమెంట్‌పై దాడి ఘటనలో ప్రాణాలర్పించిన వారికి రాజ్యసభ నివాళులర్పించింది. సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిలబడి మౌనం పాటించారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్ మాట్లాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో డిసెంబర్ 13వ తేదీ ఎప్పటికీ విషాదకరమైన రోజుగానే గుర్తుండిపోతుందన్నారు. 2001 డిసెంబర్ 13వ తేదీన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్ వద్ద కాల్పులకు తెగబడ్డారు. పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకుపోయేందుకు వారు చేసిన యత్నాన్ని బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ మహిళా జవాను ఒకరు, పార్లమెంట్ సిబ్బంది ఇద్దరు, జర్నలిస్ట్ ఒకరు ప్రాణాలు కోల్పోగా భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులందరూ హతమయ్యారు. -
Rajya Sabha: ఆరోపణలు సరే.. ఆధారాలేవీ?
న్యూఢిల్లీ: సభలో తగిన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదని రాజ్యసభ సభ్యులకు చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ హితవు పలికారు. అలాంటి ఆరోపణలు చేయడం సభా హక్కులను ఉల్లంఘించడంతో సమానమని తేల్చి చెప్పారు. రాజ్యసభలో సోమవారం జీరో అవర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆక్షేపించారు. ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత ఎనిమిదేళ్లలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా 3,000 సోదాలు నిర్వహించిందని, కానీ, కేవలం 23 మంది దోషులుగా తేల్చారని చెప్పారు. సంజయ్ సింగ్ వ్యాఖ్యలపై అధికార ఎన్డీయే ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కలుగజేసుకోవాలని సభాపతిని కోరారు. దీంతో చైర్మన్ ధన్‌ఖడ్ స్పందించారు. సభలో ఎవరు ఏం మాట్లాడినా అది కచ్ఛితత్వంతో కూడినది అయి ఉండాలని సూచించారు. తగిన ఆధారాలతో మాట్లాడాలన్నారు. ఆధారాలు లేని గణాంకాలను సభలో చెబుతామంటే అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇష్టారీతిన తోచింది మాట్లాడడం సభా హక్కులను ఉల్లంఘించడంతో సమానమేనని ఉద్ఘాటించారు. ఇలాంటి అంశాలను తీవ్రంగా పరిగణిస్తానన్నారు. పత్రికల్లో వచ్చిన రిపోర్టులు లేదా ఎవరో వెల్లడించిన అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వబోమన్నారు. సభలో ఏదైనా ఆరోపణ చేసినప్పుడు చట్టబద్ధ∙డాక్యుమెంటేషన్ ఉండాలన్నారు. అనంతరం కేంద్ర మంత్రి గోయెల్ మాట్లాడారు. ఎనిమిదేళ్లలో ఈడీ 3,000 సోదాలు చేసిందనడం పూర్తిగా అవాస్తవమని తేలి్చచెప్పారు. కోర్టు ఆదేశాల మేరకే దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటాయని అన్నారు. సంజయ్ స్పందిస్తూ.. అధికార పార్టీతో సంబంధాలున్న అవినీతిపరులపై దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. -
ప్రపంచానికి భారత్ మార్గనిర్దేశం
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న నేటి అమృత కాలంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే విషయంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజు బుధవారం ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సభలో మోదీ మాట్లాడారు. రెండు చరిత్రాత్మక ఘట్టాలకు మన దేశం సాక్షిగా నిలుస్తున్న సమయంలో జగదీప్ ధన్‌ఖడ్ ఈ బాధ్యతలు చేపట్టారని అన్నారు. శక్తివంతమైన జీ–20 కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తోందని, అలాగే అమృత కాలంలోకి మన ప్రయాణం ప్రారంభించామని చెప్పారు. ఈ అమృత కాలం దేశ అభివృద్ధి, కీర్తిప్రతిష్టలపై మనమంతా దృష్టిపెట్టాల్సిన సందర్భమని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో దేశ ప్రజాస్వామ్యం,పార్లమెంట్, పార్లమెంట్ సంప్రదాయాల పాత్ర చాలా కీలకమని ఉద్ఘాటించారు. రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌పై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనలో ఒక జవాన్, ఒక కిసాన్ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. అచ్ఛమైన రైతు బిడ్డ అయిన ఉపరాష్ట్రపతి సైనిక్ స్కూల్లో చదువుకున్నారని గుర్తుచేశారు. అందుకే ఆయనకు రైతులతోపాటు సైనికులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాల్సిన బాధ్యత ఎగువ సభపై ఉందని మోదీ చెప్పారు. ఈ సమావేశాలను ఫలవంతం చేద్దాం పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ఫలవంతంగా మార్చడానికి అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని, కలిసికట్టుగా పనిచేయాలని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో దేశాన్ని ఉన్నత స్థాయికి చేర్చడానికి కీలకమైన నిర్ణయాలను ఈ శీతాకాల సమావేశాల్లో తీసుకుంటామన్న నమ్మకం ఉందని వివరించారు. లోక్‌సభకు తొలిసారిగా ఎంపికైనవారికి సభలో చర్చల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని అన్ని పార్టీలకు ప్రధాని సూచించారు. ప్రజాస్వామ్యంలో కొత్త తరాన్ని సిద్ధం చేయడానికి, వారి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం నూతన ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇద్దామని అన్నారు. జగదీప్ ధన్‌ఖడ్‌కు మోదీ అభినందనలు తెలియజేశారు. కృష్ణ, ములాయం సింగ్‌కు లోక్‌సభ ఘన నివాళి తెలుగు సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్‌తోపాటు ఇటీవల మరణించిన మరో ఎనిమిది మంది మాజీ ఎంపీలకు లోక్‌సభ ఘనంగా నివాళులు అర్పించింది. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన అనంతరం స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా సంతాపం తెలిపారు. ప్రజాజీవితంలో మాజీ ఎంపీలు చేసిన సేవలను కొనియాడారు. ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో కృష్ణ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ములాయంసింగ్ యాదవ్ ఏకంగా ఏడుసార్లు ఎంపీగా, రక్షణ శాఖ మంత్రిగా, మూడు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ఓం బిర్లా ప్రశంసించారు. మాజీ ఎంపీల మృతికి సంతాపంగా లోక్‌సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. -
రాజ్యసభ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ వైస్ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డిని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ నియమించారు. విజయసాయిరెడ్డితో పాటు మరో ఏడుగురికి వైస్ చైర్మన్ ప్యానల్లో అవకాశం కల్పించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తనకు వైస్ చైర్మన్‌గా అవకాశమిచ్చిన ఉప రాష్ట్రపతికి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. -
సీజేఐ సమక్షంలో.. ఉపరాష్ట్రపతి తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిపాదించిన జాతీయ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ)ని సుప్రీం కోర్టు రద్దు చేయడంపై దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్రంగా స్పందించారు. ఎన్‌జేఏసీ సుప్రీం కోర్టు కొట్టివేసిన తర్వాత పార్లమెంటులో ఎటువంటి చర్చ లేదని, ఇది చాలా తీవ్రమైన సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సమక్షంలోనే ఉపరాష్ట్రపతి ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్లమెంట్ ఒక చట్టం చేసిందంటే.. అది ప్రజల ఆకాంక్ష మేరకే ఉండి ఉంటుంది. అది ప్రజల శక్తి. అలాంటి దానిని సుప్రీం కోర్టు దానిని రద్దు చేసింది. ఇలాంటి ఉదాహరణ ప్రపంచానికి తెలియదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారాయన. రాజ్యాంగంలోని నిబంధనలను ఉటంకించిన ఆయన.. చట్టం పరిధిలో ముఖ్యమైన ప్రశ్న ఇమిడి ఉన్నప్పుడు, సమస్యను కోర్టులు పరిశీలించవచ్చని అన్నారు. అయితే.. నిబంధనను రద్దు చేయవచ్చని ఎక్కడా చెప్పలేదు అంటూ పేర్కొన్నారాయన. ఆ సమయంలో రాజ్యాంగ పీఠికను సైతం ప్రస్తావించారు. ఎన్‌జేఏసీ చట్టం.. లోక్‌సభ, రాజ్యసభ రెండు సభల్లోనూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వోటింగ్ ద్వారా ఆమోదం పొందిందని ధన్కర్ గుర్తు చేశారు. పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టంతో వ్యవహరించింది. రికార్డు విషయంగా మొత్తం లోక్‌సభ ఏకగ్రీవంగా ఓటు వేసింది. రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. మేధావులను, న్యాయవేత్తలను కోరేది ఒక్కటే. దయచేసి.. రాజ్యాంగ నిబంధనను రద్దు చేయగల ఈ ప్రపంచంలో.. ఒక సమాంతరాన్ని కనుగొనండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు ఉద్దేశించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుప్రీంకోర్టు.. దానిని కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26వ తేదీన ఉప రాష్ట్రపతి ధన్కర్ దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కూడా. -
National Games 2022: సర్వీసెస్‌కు అగ్రస్థానం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో మళ్లీ సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టే సత్తా చాటుకుంది. ‘సెంచరీ’ని మించిన పతకాలతో ‘టాప్’ లేపింది. సర్వీసెస్ క్రీడాకారులు మొత్తం 128 పతకాలతో అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో 61 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్యాలున్నాయి. అట్టహాసంగా ఆరంభమైన 36వ జాతీయ క్రీడలకు బుధవారం తెరపడింది. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 8000 పైచిలుకు అథ్లెట్లు ఈ పోటీల్లో సందడి చేశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 38, అక్వాటిక్స్లో 36 జాతీయ క్రీడల రికార్డులు నమోదయ్యాయి. ఆఖరి రోజు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. తదుపరి జాతీయ క్రీడలకు వచ్చే ఏడాది గోవా ఆతిథ్యమిస్తుంది. ► వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ జాతీయ క్రీడలు గోవాలో జరగాలి. కానీ అనూహ్యంగా గుజరాత్‌కు కేటాయించగా... నిర్వాహకులు వంద రోజుల్లోపే వేదికల్ని సిద్ధం చేయడం విశేషం. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఇండోర్ స్టేడియంలో ముగింపు వేడుకలు జరిగాయి. ► పురుషుల విభాగంలో ఎనిమిది పతకాలు సాధించిన కేరళ స్విమ్మర్ సజన్ ప్రకాశ్ (5 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారుడు’గా... మహిళల విభాగంలో ఏడు పతకాలు సాధించిన కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ హషిక (6 స్వర్ణాలు, 1 కాంస్యం) ‘ఉత్తమ క్రీడాకారిణి’గా పురస్కారాలు గెల్చుకున్నారు. గత జాతీయ క్రీడల్లోనూ (2015లో కేరళ) సజన్ ప్రకాశ్ ‘ఉత్తమ క్రీడాకారుడు’ అవార్డు అందుకోవడం విశేషం. ► చివరిరోజు తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ ‘పసిడి పంచ్’తో అలరించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ సర్వీసెస్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొన్నాడు. 57 కేజీల ఫైనల్లో హుసాముద్దీన్ 3–1తో సచిన్ సివాచ్ (హరియాణా)పై గెలిచాడు. ► ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఓవరాల్ చాంప్ సర్వీసెస్‌కు ‘రాజా భళీంద్ర సింగ్’ ట్రోఫీని అందజేశారు. సర్వీసెస్ నాలుగోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకుంది. 39 స్వర్ణాలు, 38 రజతాలు, 63 కాంస్యాలతో కలిపి మొత్తం 140 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన మహారాష్ట్రకు ‘బెస్ట్ స్టేట్’ ట్రోఫీ లభించింది. ఓవరాల్‌గా సర్వీసెస్‌కంటే మహా రాష్ట్ర ఎక్కువ పతకాలు సాధించినా స్వర్ణాల సంఖ్య ఆధారంగా సర్వీసెస్‌కు టాప్ ర్యాంక్ దక్కింది. ► తెలంగాణ 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో 15వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 21వ స్థానంలో నిలిచాయి. 2015 కేరళ జాతీయ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో 12వ స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణా లు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచాయి. హషికకు ట్రోఫీ ప్రదానం చేస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -
జాతీయ స్థాయిలో సత్తాచాటిన ఏపీ.. టూరిజం అభివృద్ధిలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ టూరిజం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. రాష్ట్రాలకు అవార్డులను ప్రదానం చేశారు. కాగా, వీటిలో ఏపీకి పలు అవార్డులు వచ్చాయి. అవార్డుల లిస్ట్ ఇదే.. - సమగ్ర టూరిజం అభివృద్ధిలో ఏపీకి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు. - బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్. - విదేశీ భాషలో ఏపీ కాఫీ టేబుల్ బుక్కు అవార్డ్. - విజయవాడ ది గేట్ వే హోటల్‌కు బెస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ అవార్డు . - బెస్ట్ టూరిజం గోల్ఫ్ కోర్సుగా హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌కు అవార్డు. - అపోలో హెల్త్ సిటీకి బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ అవార్డు - సమగ్ర టూరిజం అభివృద్ధిలో తెలంగాణకు మూడో బహుమతి లభించింది. -
హ్యాపీ బర్త్‌డే మోదీజీ
న్యూఢిల్లీ/షోపూర్: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా శనివారం అన్ని వర్గాల నుంచీ ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశ నిర్మాణం కోసం మోదీ అవిశ్రాంతంగా పని చేస్తున్నారంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ అభినందించారు. కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పుట్టిన రోజులాగే శనివారం కూడా ప్రధాని పలు కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. మధ్యప్రదేశ్‌లోని షోపూర్లో మహిళా స్వయం సహాయక బృందాలతో మాట్లాడారు. ‘‘లక్షలాది మంది మాతృమూర్తుల ఆశీర్వాదం నాకు కొండతం స్ఫూర్తి. సాధారణంగా పుట్టినరోజున అమ్మను కలిసి దీవెనలు తీసుకుంటా. కానీ ఈసారి ఇంతమంది తల్లులు నన్ను దీవించడం చూసి నా తల్లి పరవశించి ఉంటారు’’ అన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా పక్షం రోజుల రక్తదాన్ అమృత్ మహోత్సవ్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ‘‘ఇప్పటికే 1,00,506 మందికి పైగా రక్తదానం చేశారు. ఇది సరికొత్త ప్రపంచ రికార్డు’’ అన్నారు. -
పార్లమెంటులో లాయర్లు తగ్గుతున్నారు
న్యూఢిల్లీ: ‘‘పార్లమెంటులో గతంలో న్యాయ కోవిదులు ఎక్కువగా ఉండేవారు. రాజ్యాంగ పరిషత్తులోనూ, స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కొలువుదీరిన పలు పార్లమెంటుల్లోనూ చాలామంది వాళ్లే. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యంగాన్ని, తిరుగులేని చట్టాలను మనకందించారు. కానీ కొంతకాలంగా పార్లమెంటులో న్యాయ కోవిదుల సంఖ్య బాగా తగ్గుతోంది. ఆ స్థానాన్ని ఇతరులు భర్తీ చేస్తున్నారు. ఇంతకు మించి మాట్లాడబోను’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన జగ్దీప్ ధన్‌ఖడ్ గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదిగా అపార అనుభవం ధన్‌ఖడ్ సొంతమన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఎలాంటి రాజకీయ గాడ్‌ఫాదర్లూ లేకుండానే దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొలువుదీరే స్థాయికి ఎదిగారు. ఇది మన ప్రజాస్వామ్య గొప్పదనానికి, ఉన్నత రాజ్యాంగ విలువలకు తార్కాణం’’ అన్నారు. ‘‘ప్రతి సభ్యుడినీ సంతృప్తి పరచడం తేలిక కాదు. కానీ ధన్‌ఖడ్ తన అపార అనుభవం సాయంతో రాజ్యసభ చైర్మన్‌గా రాణిస్తారని, అందరినీ కలుపుకునిపోతారని నాకు నమ్మకముంది. న్యాయవాదిగా అపార అనుభవం, గతంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహించి ఉండటం ఆయనకెంతో ఉపయోగపడతాయి. అతి త్వరలో రిటైరవుతున్న నేను ధన్‌ఖడ్ పర్యవేక్షణలో రాజ్యసభలో జరిగే నాణ్యమైన చర్చలను టీవీలో చూస్తానని ఆశిస్తున్నా’’ అన్నారు. ధన్‌ఖడ్‌ను ఆయన సన్మానించారు. న్యాయ మంత్రి కిరెన్ రిజిజు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంబార్ అసోసియేసన్ అధ్యక్షుడు వికాస్‌సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతకాలంగా పార్లమెంటులో చర్చల కంటే అంతరాయాలే ఎక్కువయ్యాయని రిజిజు ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చర్చల నాణ్యత బాగా పడిపోయింది. ఇటీవలి దాకా లోక్‌సభతో పోలిస్తే రాజ్యసభ కాస్త ప్రశాంతంగా ఉండేది. ఈ మధ్య అక్కడా గలాభా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సభను అదుపు చేసేందుకు ధన్‌ఖడ్ అనుభవం పనికొస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన ఓ లాయర్ ఉపరాష్ట్రపతి కావడం ఇదే తొలిసారని తుషార్ మెహతా అన్నారు. ధన్‌ఖడ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ -
ఘోర ప్రమాదం: ట్రాక్టర్-ట్రక్కు ఢీ.. భక్తుల దుర్మరణం
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతో పలువురు మృతి చెందారు. జైసల్మేర్ రామ్‌దేవ్ర ఆలయానికి వెళ్తున్న క్రమంలో.. వేగంగా వస్తున్న ట్రక్కు.. ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి పాలి జిల్లా సుమేర్పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 25 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, కొన్ని ఆంబులెన్స్‌లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఘటనపై ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్లు చేశారు. The accident in Pali, Rajasthan is saddening. In this hour of grief, my thoughts are with the bereaved families. I pray for a speedy recovery of those injured: PM @narendramodi — PMO India (@PMOIndia) August 19, 2022 Anguished by the loss of lives in a road accident in Pali, Rajasthan. My heartfelt condolences to the bereaved families and prayers for the speedy recovery of the injured. — Vice President of India (@VPSecretariat) August 19, 2022 ఇదీ చదవండి: చిల్లర మాయం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం