మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. నిరంతరం ఆందోళనలు, నినాదాలు, నిరసనలతో ఉభయ సభలను స్తంభింపచేస్తున్నారు. మణిపూర్ సమస్యపై చర్చించాలంటూ పార్లమెంట్‌లో ప్రతిపక్షాల డిమాండ్‌తో పది రోజులుగా సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలుగుతూనే ఉంది.
తాజాగా తాను ఎవరిని సమర్ధించాల్సిన అవసరం లేదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ స్పష్టం చేశారు. తను కేవలం రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందంటూ వ్యాఖ్యానించారు. అయితే మణిపూర్ విషయంలో చైర్మన్ ప్రధాని మోదీని సమర్థిస్తున్నారంటూ బుధవారం ఏఐసీసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రతిపక్ష నేత వ్యాఖ్యల నేపథ్యంలో జగదీప్ ధన్‌ఖడ్ ఈ విధంగా గురువారం బదులిచ్చారు.
కాగా మణిపూర్ హింసపై రూల్ 267 కింద సభలో చర్చ చేపట్టాలంటూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. అయితే వాటిని తిరస్కరిస్తూ..మణిపూర్ వ్యవహారంపై రూల్ 176 కింద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసపై మోదీ ఎందుకు నోరువిప్పడం లేదని ఖర్గే నిలదీశారు. దీనిపై స్పందించిన ధన్‌ఖడ్.. ప్రధాని రావాలనుకుంటే రావొచ్చని, రావాలంటూ ఆదేశించలేనని తేల్చిచెప్పారు. అయితే రాజ్యసభ చైర్మన్ ప్రధాని మోదీని సమర్ధిస్తున్నారంటూ ఖర్గే విమర్శించారు.
ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ గురువారం మాట్లాడుతూ.. ‘మనది 1.3 బిలియన్లకు పైగా జనాభా ఉన్న ప్రజాస్వామ్య దేశమని అందరూ గుర్తించాలి. ప్రధానమంత్రిని నేను సమర్థించాల్సిన అవసరం లేదు. ప్రపంచ వేదికలపై ఆయనకు గుర్తింపు వచ్చింది. నేను ఎవరినీ రక్షించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, మీ హక్కులను రక్షించడమే నా కర్తవ్యం. ప్రతిపక్ష నేత నుంచి ఇలాంటి మాటలు రావడం సరి కాదు’ అని జగదీప్ ధన్‌ఖర్ అన్నారు.
చదవండి: పార్లమెంట్ అంతరాయాలు.. మధ్యే మార్గం ద్వారా పరిష్కారం?
ధన్‌ఖడ్, ఖర్గే మధ్య సరదా సంభాషణ
మణిపూర్ హింసతో పార్లమెంట్ అట్టుడుకుతుండగా.. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇద్దరి మాటలతో సభలో కాసేపు నవ్వులు విరిశాయి. మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో గురువారం మాట్లాడుతూ, రూల్ 267కు ప్రాధాన్యం ఇస్తూ మణిపూర్ సమస్యపై చర్చను చేపట్టాలని, ఇతర సభా కార్యకలాపాలను వాయిదా వేయాలని కోరారు. ‘‘ఈ డిమాండ్‌ను అంగీకరించాలంటే, ఏదో ఓ కారణం ఉండాలని మీరు చెప్పారు. నేను మీకు కారణాన్ని చూపించాను. నిన్న (బుధవారం) కూడా ఇదే విషయంపై విజ్ఞప్తి చేశాను. . కానీ బహుశా మీరు కోపంగా ఉండి ఉంటారు’’ అని అన్నారు.
"मैं 45 साल से शादीशुदा आदमी हूं, इसलिए मैं गुस्सा नहीं करता हूं"
— Amit Singh 🇮🇳 (@KR_AMIT007) August 3, 2023
◆ मल्लिकार्जुन खड़गे से बोले सभापति जगदीप धनखड़, राज्यसभा में लगे हंसी के ठहाके@kharge
| #MallikarjunKharge | Jagdeep Dhankhar | #JagdeepDhankhar pic.twitter.com/8o39PY69p9
ఖర్గే మాటలపై ధన్‌కర్ స్పందిస్తూ.. నాకు పెళ్లై 45 ఏళ్లు దాటింది. నాకు ఎప్పుడూ కోపం రాదు. నమ్మండి అంటూ సరాదాగా పేర్కొన్నారు. తో సభ్యులంతా గొల్లుమని నవ్వారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరాన్ని ఉద్ధేశిస్తూ.. ‘ చిదంబరం గొప్ప సీనియర్ అడ్వకేట్ అనే విషయం మన అందరికీ తెలుసు. ఓ సీనియర్ అడ్వకేట్‌గా(స్వతహాగా ధన్‌ఖడ్ సైతం న్యాయవాదియే) కోపం ప్రదర్శించే అధికారం మనకు లేదు. మీరొక అధికారి(ఖర్గేను ఉద్ధేశిస్తూ), ఈ స్టేట్‌మెంట్‌ను దయచేసి సవరించండి’’ అని కోరారు.
దీనిపై ఖర్గే స్పందిస్తూ, ‘‘మీకు కోపం రాదు, మీరు కోపాన్ని ప్రదర్శించరు, కానీ లోలోపల కోపంగా ఉంటారు’’ అన్నారు. దీంతో సభ్యులు మరోసారి నవ్వుకున్నారు. ఖర్గే కొనసాగిస్తూ.. రూల్ 267 ప్రకారం మణిపూర్‌పై చర్చించాలని పట్టుబట్టారు. ‘ఈ రూల్ ప్రకారం చర్చ జరపడానికి ఎలాంటి కారణం లేదని చైర్మన్ చెబుతున్నారు. కానీ మణిపూర్ అంశం ప్రతిష్టాత్మక సమస్యగా మారింది. మేము దీనిని రోజూ లేవనెత్తుతున్నాము. కానీ వారు దీనిని వ్యతిరేకిస్తున్నారు’ మండిపడ్డారు.
చదవండి: హర్యానా ఘర్షణలు.. ప్రాణాలతో బయటపడ్డ మహిళా జడ్జి, మూడేళ్ల చిన్నారి
Comments
Please login to add a commentAdd a comment