Parliament Sessions
-
ఈ వారమే లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వక్ఫ్ సవరణ బిల్లు–2024ను ఈ వారంలోనే లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 4వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న దృష్ట్యా, అంతకుముందే ఈ వారంలోనే బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికను ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లాకు అందించింది. వక్ఫ్ బోర్డుల్లో కనీసం నలుగురు ముస్లిమేతరులను చేర్చుకోవచ్చని భూ వివాదాలపై దర్యాప్తు అధికారాన్ని కలెక్టర్ల నుంచి సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు బదిలీ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉండేందుకు వీలు కల్పించడం, కలెక్టర్లకు అదనపు అధికారాల వంటివాటిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
మళ్లీ తెరపైకి రెండో రాజధాని?
పార్లమెంట్ సమావేశాలు దేశ రాజధాని ఢిల్లీ వెలుపల, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లోని ఏదైనా రాష్ట్రంలో నిర్వహించాలని ఇటీవల డిమాండు వస్తోంది. ఇది దేశానికి రెండో రాజధాని అవసరమనే వాదనకు దారి తీయవచ్చనేది ఒక అభిప్రాయం. రాజధాని ఢిల్లీలో తీవ్రమైన వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దక్షిణాదిలోనూ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని ఇటీవల వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహా రాల శాఖ మంత్రి కిరణ్ రిజిజూలకు ఆయన లేఖ రాశారు. ఢిల్లీలోని వాతావరణం వల్ల ఎంపీల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతోందనీ, దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం వల్ల ఈ ఇబ్బంది తొలగడంతో పాటు, జాతీయ సమగ్రత వెల్లివిరుస్తుందనీ ఆయన చెబుతున్నారు.దేశానికి మరో రాజధాని కావాలని ప్రత్యేకించి ఎవరూ ప్రస్తుతానికి డిమాండ్ చేయనప్పటికీ ఆ ప్రతిపాదన మాత్రం పాతదే. రాజధానిలోని పార్లమెంట్లో కాకుండా, బయట రాష్ట్రాల్లో సమావేశాలను నిర్వహిస్తే సాంకేతికంగా రెండో రాజధానిని అంగీకరించినట్లేనని కొందరు మేధావులు చెబుతున్నారు. అయితే ఈ అంశాన్ని మరికొందరు విభేది స్తున్నారు. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రయోజనాల కోసం రాజధాని నగరాన్ని వినియోగిస్తార ని, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇతర రాష్ట్రాలు లేదా ప్రాంతాలను... వేర్వేరు ప్రయోజనాల కోసం వినియోగిస్తారనేది కొందరు మేధావుల అభిప్రాయం. ఈ విధంగా ప్రాధాన్యతనిచ్చే ఇతర నగరం మరో అధికారిక రాజధానిగా పరిగణించబడదని వారు చెబుతున్నారు.చట్టబద్ధంగా నిర్వచించిన ఒక రాజధాని ఉన్న సంద ర్భంలో... రాజధాని అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా మరో రాష్ట్రంలోని నగరాన్ని రాజధానిగా పేర్కొని ఉపయో గించుకుంటే మాత్రం తప్పేమిటని మరికొందరు వాదిస్తు న్నారు. ఒకటికన్నా ఎక్కువ రాజధానులను కలిగి ఉన్న దేశాలు ప్రపంచంలో పదమూడు ఉన్నాయి. మూడు రాజ ధానీ నగరాలను కలిగి ఉన్న ఏకైక దేశంగా దక్షిణాఫ్రికా నిలి చింది. ‘ప్రిటోరియా’ పరిపాలన, కార్యనిర్వాహక రాజ ధానిగా;‘ కేప్ టౌన్’ శాసన రాజధానిగా, ‘బ్లూమ్ ఫోంటైన్’ న్యాయ రాజధానిగా ఉన్నాయి.1950వ దశకం నుంచే దక్షిణ భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి అన్న డిమాండ్ మొద లైందని ఎంపీ గురుమూర్తి చెబుతున్నారు. ఈ అంశంపై 1968లో స్వతంత్ర ఎంపీ ప్రకాశ్ వీర్ శాస్త్రి ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టారనీ, నాడు 18 మంది ఎంపీలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేశారనీ ఆయన గుర్తు చేస్తున్నారు. అప్పటి కేరళ, మైసూరు ప్రభుత్వాలు పార్లమెంటు సమావేశాలకు మౌలిక వసతులు కల్పిస్తామని ముందుకు వచ్చాయనీ, అయితే అప్పట్లో సాధ్యాసాధ్యాలు పరిశీ లించిన అనంతరం ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. అప్పటితో పోల్చితే వీడియో కాన్ఫ రెన్స్, ఇంట ర్నెట్ వంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఎంతో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీ వెలుపల నిర్వహించడం సాధ్యమైన విషయమేనని మేధావులు, పార్లమెంటేరియన్లు అంటున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు ఏడాదికి మూడు సార్లు సమావేశమవుతున్నాయి. జనవరి నెలాఖరున ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు మధ్యలో కొన్నాళ్ల విరామంతో రెండు విడతలుగా సాగుతాయి. జూలై–ఆగస్ట్ నెలల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, నవంబర్ – డిసెంబర్ మాసాల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయ నేది అందరికీ తెలిసిన విషయమే. ఈ మూడు సెషన్లలో కనీసం ఒకటైనా దక్షిణ భారతదేశంలో నిర్వహించా లని దక్షిణాదికి చెందిన వివిధ పార్టీల ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. వారిలో కొందరైతే రెండు సమావేశాలను దక్షిణాదిన నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.దేశంలో జమ్మూ కాశ్మీర్‌కు రెండు రాజధానులు ఉన్నాయి. శ్రీనగర్ వేసవి రాజధాని, జమ్మూ శీతాకాల రాజ ధాని. రాష్ట్రానికే పరిపాలనా సౌలభ్యం కోసం, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రెండు రాజధానులు ఉన్న నేపథ్యంలో... దేశానికి ఉండడం అభ్యంతరం చెప్పాల్సిన విషయం కాదని కొందరంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ–కశ్మీర్ వంటి పలు రాష్ట్రాల్లో/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండు నగరాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో... దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సమావేశాల్లో ఒకటీ రెండు సెషన్లను నిర్వహించాలన్న డిమాండ్ సహేతుకంగానే ఉందని చెప్పవచ్చు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశ రెండో రాజధాని రేసులో ఉన్నాయి. పగిడి రంగారావు వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడుమొబైల్: 94401 38573 -
National : పార్లమెంట్లో 16 కీలక బిల్లులు
-
‘సోషల్ మీడియా నిర్బంధాలపై పార్లమెంట్లో చర్చిస్తాం’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా.. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై పార్లమెంటులో చర్చిస్తామని చెప్పారు. 41a నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయటంపై గట్టిగా నిలదీస్తామన్నారు. చట్టాలను అమలు చేయనప్పుడు ఇక ఆ చట్టాలు ఎందుకని గట్టిగా ప్రశ్నిస్తామని అన్నారు..గురువారం వైఎస్ జగన్‌తో వైఎస్సార్సీపీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు గురువారం సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఎంపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. పోలవరం ఎత్తును తగ్గించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, పోలవరం ఎత్తు తగ్గిస్తే ఆందోళన చేస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. దాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాటం చేస్తామన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించమని, ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. బలం ఉందని పార్లమెంటులో బిల్లును పాస్ చేస్తే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. పార్లమెంటును స్తంభింపచేయటానికి కూడా వెనుకాడమన్నారు. -
35 ఏళ్లలోపు యువతకు 10 శాతం సీట్లు రిజర్వ్ చేయాలి
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో కొందరు చట్టసభ్యులు ప్రైవెట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడుతున్నారు. దీనిలో భాగంగా లోక్‌సభలో 10 శాతం స్థానాలను 35 ఏళ్లలోపు వారికి రిజర్వ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటులో యువత స్పష్టంగా మైనారిటీగా ఉందని, ఇది ప్రజాస్వామిక లోటుకు దారి తీస్తుందని ఆ బిల్లులో పేర్కొన్నారు. మన దేశ జనాభాలో 35 ఏళ్లలోపు వయస్సు గలవారు 65 శాతానికిపైగా ఉన్నారని తెలిపారు. మన దేశంలో యువ ఎంపీలు తగిన సంఖ్యలో లేరని పేర్కొన్నారు. లోక్‌సభలో యువత కోసం కొన్ని స్థానాలను కేటాయించడం వల్ల యువతకు కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నామనే సందేశాన్ని పంపవచ్చని చెప్పారు.అసలు ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ఏమిటి? శాసన ప్రక్రియలో భాగంగా పార్లమెంట్లో రెండు రకాల బిల్లులను చట్ట సభ్యులు ప్రవేశపెడతారు. అవి ఒకటి పబ్లిక్ బిల్లు, మరోకటి ప్రైవేట్ బిల్లు. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును మంత్రి కాకుండా అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. ఇక.. పబ్లిక్ బిల్లులను ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాత్రమే ప్రవేశపెడతారు. అందుకే ఈ బిల్లును ప్రభుత్వ బిల్లు అని కూడా పిలుస్తారు. ప్రైవేట బిల్లు ప్రవేశపెట్టడానికి నోటీసు పీరియడ్ నెల రోజులు ఉంటుంది. చట్ట సభ్యలు ఈ బిల్లును ముసాయిదా రూపంలో మాత్రమే ప్రవేశపెడతారు. ఈ ప్రైవేట్ బిల్లును శుక్రవారం రోజు మాత్రమే ప్రవేశపెట్టి చర్చ జరుపుతారు. పార్లమెంట్ సమావేశాల్లో కేవలం మూడు ప్రైవేట్ బిల్లులను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో శుక్రవారం ముగ్గురు ఎంపీలు మూడు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రైవేటు సెక్టార్లో రిజర్వేషన్లు కోరుతూ ప్రైవేట్ బిల్లుబీమ్ ఆర్మీ చీఫ్, ఎంపీ చంద్ర శేఖర్ ఆజాద్ ప్రైవేట్ సెక్టార్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శుక్రవారం ప్రైవెట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.ప్రైవేట్ రంగంలోని విద్యాసంస్థలు, కనీసం 20 మందితో కూడిన పలు సంస్థల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లులో కోరారు. ఇప్పటివరకు ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు.. పబ్లిక్ సెక్టార్లోనే అమలు అవుతున్న విషయం తెలిసిందే.విమాన ఛార్జీల నియంత్రణపై ప్రైవేట్ బిల్లుకాంగ్రెస్ ఎంపీ షఫీ పరంబిల్ ప్రైవేట్ విమాన ఛార్జీల నియంత్రణపై ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. విమాన ఛార్జీల పర్యవేక్షణ , నియంత్రణ కోసం ఓ రెగ్యూలేటరీ బోర్డును ఏర్పాటుచేయాలని బిల్లులో పేర్కొన్నారు. కొన్ని విమానయాన సంస్థలు అధిక ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకోవటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణించే అవకాశాలను తగ్గిస్తాయని తెలిపారు. -
బడ్జెట్‌పై ‘వివక్ష’ లేబుల్ : నిర్మలా సీతారామన్
Live Updatesకేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్డీయే కూటమి బలవంతం స్పష్టంగా కనిపిస్తోందని ఇండియా కూటమి నేతల ఆరోపణలు"Compulsion of government visible in Budget" say opposition leaders as INDIA bloc protests BudgetRead @ANI Story | https://t.co/G6jlOrJVKj#Budget2024 #INDIAbloc #Protest pic.twitter.com/2gbdRZ0sDN— ANI Digital (@ani_digital) July 24, 2024 బడ్జెట్‌పై విపక్షాల ఆరోపణపై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. ‘‘ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విపక్షాలు చేసేవి చాలా విపరీతమైన ఆరోపణలు. బడ్జెట్‌పై విపక్షాలు వివక్ష అనే లేబుల్ వేశారు’’ అని ఆమె అన్నారు."Outrageous allegation," says Nirmala Sitharaman as opposition protest budget and labels it 'discriminatory'Read @ANI Story | https://t.co/w1LhIzXyRl#NirmalaSitharaman #Budget2024 #Opposition pic.twitter.com/Ua6CoO4n5K— ANI Digital (@ani_digital) July 24, 2024 విపక్షాల వాకౌట్కు ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. కుర్చీని కాపాడుకునే బడ్జెట్. మేము ఈ బడ్జెట్‌ను తీవ్రంగా ఖండింస్తున్నాం. ఇండియా కూటమి పార్టీలు నిరసన చేపడతాము. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడకపోతే.. దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది?#WATCH | Before the Opposition walked out of Rajya Sabha over 'discriminatory' Budget, LoP Rajya Sabha Mallikarjun Kharge said, "...Yeh kursi bachane ke liye yeh sab hua hai...We will condemn it and protest against it. All INDIA alliance parties will protest...How will… pic.twitter.com/i00BsjXuhL— ANI (@ANI) July 24, 2024రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.పార్లమెంట్ సెంట్రల్ హాల్ల కేంద్రమంతులతో మోదీ భేటీఉభయ సభల్లో ఇండియా కూటమిని ఎదుర్కొవటంపై చర్చ పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు.బడ్జెట్ కేటాయింపులపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయిబడ్జెట్లో రాష్ట్రాల పట్ల వివక్షకు నిరసనగా ఇండియా కూటమి ఆందోళన నిరసనలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్లో లబ్ది జరిగిందని ఆరోపణ #WATCH | Delhi | Leaders of INDIA bloc protest against 'discriminatory' Union Budget 2024, demand equal treatment to all States, in Parliament pic.twitter.com/c6uOyF1TQr— ANI (@ANI) July 24, 2024 రాజ్యసభలో కేంద్ర బడ్జెట్, జమ్ము కశ్మీర్ బడ్జెట్‌పై చర్చ జరగనుంది.Rajya Sabha to hold general discussion on Union Budget, Jammu and Kashmir BudgetRead @ANI Story | https://t.co/kowyM0f1u7#RajyaSabha #Budget #KirenRijiju #NirmalaSitharaman pic.twitter.com/JABAVoeIAa— ANI Digital (@ani_digital) July 24, 2024 ఈరోజు నుంచి పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25పై చర్చ20 గంటల పాటు బడ్జెట్‌పై చర్చ జరగనుంది.పార్లమెంట్లో నిరసనలకు సిద్ధమైన ఇండియా కూటమి.ఉభయ సభల్లో నిరసన తెలపాలని ఇండియా కూటమి నిర్ణయంకుర్చి బచావో బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీపై విపక్షాల విమర్శలు బడ్జెట్లో బీజేపీయేతర రాష్ట్రాలను విస్మరించారని ఆరోపణలుకేంద్రం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో బీజేపీయేతర రాష్ట్రాలపై చూపిన వివక్షకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఇవాళ పార్లమెంట్ లోపల, బయట నిరసన చేపట్టనుంది. మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో సహా కూటమి మిత్రపక్ష నేతలు సమావేశం అయ్యారు. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ చూపిన వివక్షకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని నిర్ణయించారు.ఇండియా కూటమి మీటింగ్ అనంతరం కాంగ్రెస్ నేత కేసీవేణుగోపాల్ మీడియాతో మాట్లడారు. ‘‘కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీజేపీయేతర రాష్ట్రాలపై తీవ్రమైన వివక్ష చూపింది. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపేట్టిన కేంద్రం బడ్జెట్.. బడ్జెట్ అనే భావనను నాశనం చేసింది. ఇది చాలా వివక్ష, ప్రమాదకరమైన బడ్జెట్. సమాఖ్యావాదానికి, న్యాయానికి సంబంధించిన నియమాలకు విరుద్ధంగా ఉంది’’ అని అన్నారు.తమ నిరసనలో భాగంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు జూలై 27 జరిగే నీతి ఆయోగ్ మిటింగ్ను బాయ్‌కాట్ చేయనున్నారు. ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించిందని కేసీ వేణగోపాల్ అన్నారు. -
రచ్చ కాదు... చర్చ కావాలి!
కొత్త సభ కొలువు తీరిందన్న మాటే కానీ, పార్లమెంట్లో పాత దృశ్యాలే పునరావృతమయ్యాయి. 18వ లోక్‌సభ ఏర్పడ్డాక జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాలు సభ్యుల ప్రమాణ స్వీకారం, రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికే పరిమితమయ్యాయి. కానీ, నేతలెవరు మాట్లాడుతున్నా... వెనుక నుంచి అవే అరుపులు, గందరగోళ పరిస్థితులు, రన్నింగ్ కామెంటరీలు, సభాపతితో వాగ్వాదాలు, చివరకు వాకౌట్లు తప్పలేదు. సర్వసాధారణంగా ఏకగ్రీవం గానో, లేదంటే అధికార – ప్రతిపక్షాల మధ్య పోటీతోనో జరగాల్సిన లోక్‌సభ స్పీకర్ ఎన్నిక సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మూజువాణి ఓటుతో సాగింది. ఇక, ప్రతిపక్షాలకు కేటాయించాల్సిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని తద్భిన్నంగా గత అయిదేళ్ళుగా ఖాళీగా అట్టిపెట్టేసిన అధికార బీజేపీ, ఈసారి కూడా ఆ పదవిని వారికి వదిలిపెట్టే పెద్దమనసు చేస్తున్నట్టు లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా తన మిత్రపక్షాలకు ఆ పదవిని కట్టబెట్టాలని బీజేపీ చూస్తున్నట్టు వస్తున్న కథనాలే అందుకు నిదర్శనం. ఇక, సభానాయకుడికీ, ప్రతిపక్ష నేతకూ మధ్య పొసగని పరిస్థితి సరేసరి. వెరసి లోక్‌సభలో మంగళవారం, రాజ్యసభలో బుధవారం ముగిసిన తొలి సమావేశాలు అసంతృప్తినే మిగిల్చాయి. ఈ పాపంలో అధికార, ప్రతిపక్షాలు రెంటికీ సమాన భాగస్వామ్యం ఉంది. కొద్ది నెలలుగా పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారంలో మునిగితేలిన పార్టీలు ఇప్పటికీ ఆ మానసిక స్థితి నుంచి బయట పడినట్టు లేవు. ఎన్నికల ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పార్లమెంట్ సాక్షిగా ఇరుపక్షాలూ పరస్పరం ఎన్నికల ప్రచార తరహా ఆరోపణల పర్వం కొనసాగించడం దురదృష్టం. ప్రతిపక్ష నాయకుడిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ తన ప్రథమ ప్రసంగంలోనే ప్రభుత్వంపై నిశిత విమర్శలతో దూకుడు ప్రదర్శించారు. ఇతర ప్రతిపక్ష నేతలు సైతం శక్తిమంత మైన ప్రసంగాలే చేశారు. కాబట్టి వారికి తగినంత సమయం ఇవ్వలేదన్న ప్రసక్తే లేదు. రాహుల్ ఉద్వేగభరితంగా మాట్లాడుతూ మార్కులు సంపాదించినా, సరైన గణాంకాలతో సమస్యల్ని నిర్దిష్టంగా ప్రస్తావించలేకపోయారు. అగ్నివీర్ లాంటి అంశాల్లో ఆయన లెక్కలు తప్పు చెప్పారు. మరోపక్క ప్రధాని లోక్‌సభలో మాట్లాడుతున్నంత సేపూ ప్రతిపక్షాలు నినాదాలు హోరెత్తించాయే తప్ప, హుందాతనం పాటించలేదు. రాహుల్ సైతం సభలో సభ్యుల్ని రెచ్చిపొమ్మన్నట్టు ప్రేరేపించడం సైతం ఏ మాత్రం సమర్థనీయం కాదు.రాహుల్‌ది పిల్లతనం, కాంగ్రెస్ పరాన్నజీవి లాంటి రాజకీయ విమర్శలు గుప్పించిన మోదీ కూడా తక్కువేమీ తినలేదు. ఎంతసేపటికీ పాత ఎమర్జెన్సీ గాయాన్ని గుర్తు చేసి, కాంగ్రెస్‌ను తప్పు బట్టడానికి ప్రయత్నించారు. లేదంటే గడచిన తమ పదేళ్ళ ప్రస్థానాన్ని గుణగాన సంకీర్తన చేశారు. అంతేతప్ప లోక్‌సభలో చేసిన రెండున్నర గంటల సుదీర్ఘ ప్రసంగంలో ప్రతిపక్షాలు ప్రస్తావించిన, దేశాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కార్యాచరణ ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. చెప్పాలనుకోలేదు. సంక్షుభిత మణిపుర్లో ఏడాదిగా ఒక్కసారైన పర్యటించని మోదీ సదరు ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడ్డాయంటూ రాజ్యసభలో అసత్యాలాపన చేయడం మరీ విడ్డూరం. ఒక్కమాటలో... ఈసారి సొంత మెజారిటీ తగ్గి, కూటమి ప్రభుత్వం నడుపుతున్న మోదీ ఇప్పటికీ గత రెండుసార్లు తిరుగులేని మెజారిటీతో సాగిన బీజేపీ ప్రభుత్వ ఆధిపత్య ధోరణినే ప్రదర్శిస్తు న్నారు. ప్రభుత్వ పెద్దగా, అనుభవజ్ఞుడిగా ప్రతిపక్షాలను సైతం కలుపుకొని పోవాలన్న ఆలోచన చేయట్లేదు. పట్టువిడుపులు చూపట్లేదు. దాంతో ఇరుపక్షాలకూ మధ్య రాజీ కుదిరేలా కనిపించట్లేదు.అందరూ కలిసి నాటకీయ చర్యలు, వ్యాఖ్యలతో పార్లమెంట్‌ను (రణ) రంగస్థలిగా మార్చేశా రన్నది చేదు నిజం. అధికార, ప్రతిపక్ష నేతలు అంశాల వారీగా చర్చిస్తే, విభేదిస్తే ఫరవాలేదు కానీ, నిత్యం ఉప్పు నిప్పుగా ఉంటే పార్లమెంట్ నడిచేదెట్లా? మళ్ళీ జనం ముందుకు వెళ్ళడానికి మరో అయిదేళ్ళుండగా, రేపే ఎన్నికలన్నట్టు రాజకీయ విమర్శల్లో మునిగితేలితే లాభమేంటి? నీట్ పరీక్ష, నిరుద్యోగం, ఈ అయిదేళ్ళలో సాగాల్సిన నియోజక వర్గ పునర్విభజన, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిన జనగణన లాంటి అనేక తక్షణ, దీర్ఘకాలిక అంశాలు చర్చకు మిగిలే ఉన్నాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. కీలకమైన బిల్లుల ఆమోదానికి లోక్‌సభలో టీడీపీ, జేడీయూల పైన, రాజ్యసభలో బిజూ జనతాదళ్ సైతం దూరమైనందున ఇతరులపైన ఆధారపడాల్సిన మోదీ 3.0 ఆభిజాత్యం వదులుకోకపోతే కష్టం. ఘర్షణ, విద్వేషం మరింత పెరిగిపోవడాని కన్నా ముందే నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేశ శ్రేయస్సు కోసం హుందా చర్చకు తెర తీయాలి.బడ్జెట్ కోసం జూలై మూడో వారంలో పార్లమెంట్ తిరిగి సమావేశం కానుంది. అప్పుడైనా అధికార, ప్రతిపక్షాలు తమ వైఖరి మార్చుకోవాలి. ఇరుపక్షాలూ విజ్ఞతతో వ్యవహరించాలి. ప్రతిపక్ష వాదనకు చెవి ఒగ్గాల్సిన బాధ్యత పాలకులకు తప్పనిసరిగా ఉంది. అదే సమయంలో– ప్రజలిచ్చిన మెజారిటీతో గద్దెనెక్కి, చెప్పే అధికారం చేజిక్కించుకున్న పాలకుల మాటలను ప్రతిపక్షాలూ సావధానంగా విని తీరాలి. ఎవరు ఎవరిని మాట్లాడనివ్వబోమన్నా, వినిపించుకోబోమన్నా అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాక్షేమానికి అసలు పనికిరాదు. అనేక అంశాలపై పరస్పర భిన్నమైన అభిప్రాయాలు సహజంగానే ఉంటాయి. కానీ పార్లమెంట్లో జరగాల్సింది అర్థవంతమైన చర్చే తప్ప అనవసర రాద్ధాంతం కాదు. ప్రజాస్వామ్య దేవాలయంగా, అత్యున్నత నిర్ణాయక వేదికగా పార్లమెంట్‌కు ఉన్న ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే అది అందరికీ నష్టం. గత పదేళ్ళుగా చట్ట సభల్లో అంతకంతకూ పెరిగిపోతున్న ఇలాంటి ప్రవర్తన ఇలాగే కొనసాగితే, మొదటికే మోసం వస్తుంది. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన చట్టసభల సమావేశాలకు ప్రయోజనం లేకుండా పోతుంది. -
రాహుల్లా ఎవరూ ప్రవర్తించకండి: ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన
న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) తొలిసారి సమావేశమయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో మిత్రపక్ష ఎంపీలను ఉద్ధేశించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ సమావేశాల్లో రాహుల్ గాంధీ, విపక్షాల దాడి నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన విధానాలపై ఎన్డీయే కూటమి ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు.ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించారు. ఎన్డీయే కూటమి ఎంపీలు పార్లమెంట్ నిబంధనలను పాటించాలని, సభలో వారి ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, రాహుల్‌గాంధీపై మోదీ విమర్శలు గుప్పించారు. వరుసగా మూడోసారి కాంగ్రేసేతర పార్టీకి చెందిన నేత ప్రధాని కావడాన్ని విపక్షాలు సహించలేకపోతున్నట్లు విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్ గాంధీ సభలో అవమానకర ప్రసంగం చేశారని మండిపడ్డారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించొద్దని.. ఎన్డీయే ఎంపీలంతా పార్లమెంటరీ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని ప్రధాని సూచించారు.సమావేశంలో మోదీ ప్రసంగం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. దేశసేవ చేసేందుకు ఎంపీలంతా పార్లమెంట్‌కు రావాలని మోదీ సూచించారని తెలిపారు. సభలో ఎలా నడుచుకోవాలో కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పారు. తమ నియోజకవర్గానికి చెందిన అంశాలను పార్లమెంట్లో రెగ్యులర్‌గా ప్రస్తావించాలని, పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలని చెప్పినట్లు పేర్కొన్నారు.‘నిన్న పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ ప్రవర్తించిన తీరు అమర్యాదకరం. స్పీకర్ స్థానాన్ని ఆయన అవమానించారు. రాహుల్‌గా ఎన్డీయే సభ్యులెవరూ ప్రవర్తించొద్దు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధాని కుర్చీని ఓ కుటుంబం తన గుప్పిట్లో ఉంచుకుంది. కానీ మా ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తుంది.పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్ (గతంలోని నెహ్రూ మ్యూజియం)ను సందర్శించాలి. అందులో మాజీ ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానుల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శించారు. వారి జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలి’ అని ప్రధాని ఎంపీలకు సూచించినట్లు రిజిజు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రసంగానికి కౌంటర్ మోదీ ఇస్తారని, ఆ సందేశం ప్రతి ఒక్కర్నీ ఉద్దేశించి ఉంటుందని రిజిజు పేర్కొన్నారు. -
Parliament Session 2024: సభలో ‘హిందూ’ కాక
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సోమవారం ఊహించినట్టుగానే నీట్ దుమారానికి వేదికగా మారాయి. అది కేవలం సంపన్నుల పరీక్షగా మారిపోయిందని, ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తుకు సమాధి కడుతోందని విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ఆయన గంటా 40 నిమిషాల పాటు మాట్లాడారు. అయితే విపక్ష నేత హోదాలో రాహుల్ చేసిన తొలి ప్రసంగమే సభలో తీవ్ర దుమారం రేపింది. లక్షలాది మంది విద్యార్థుల భవిత ప్రమాదంలో పడ్డా మోదీ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆ క్రమంలో చేసిన ‘హిందూ’వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారి తీశాయి. ‘‘తాము హిందువులమని చెప్పకునే వాళ్లు నిరంతరం హింసా ద్వేషాలను, అవాస్తవాలను వ్యాప్తి చేయడంలో మునిగి తేలుతున్నారు’’అంటూ రాహుల్ తీవ్ర విమర్శలు చేయడంతో సభలో గగ్గోలు రేగింది. అధికార బీజేపీ సభ్యులంతా వాటిని తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కలగజేసుకుని రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘విపక్ష నేత మొత్తం హిందూ సమాజాన్నే హింసాత్మకమైనదిగా అభివరి్ణంచారు. ఇది చాలా తీవ్రమైన అంశం’’అంటూ దుయ్యబట్టారు. వాటిని రాహుల్ తోసిపుచ్చారు. తన వ్యాఖ్యలు కేవలం బీజేపీని ఉద్దేశించినవి మాత్రమేనని స్పష్టం చేశారు. ‘‘హిందూ సమాజమంటే కేవలం బీజేపీ, ఆరెస్సెస్, మోదీ మాత్రమే కాదు’’అంటూ చురకలు వేశారు. నిర్భీతి, అహింస గురించి మాట్లాడుతూ శివుడు, గురు నానక్, జీసస్ ఫొటోలు సభలో ప్రదర్శించారు. సభలో మత చిహ్నాల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించబోవని స్పీకర్ ఓం బిర్లా వారిస్తున్నా పట్టించుకోలేదు. ‘‘అన్ని మతాలూ, అందరు మహానుభావులూ చెప్పింది అహింస, నిర్భీతి గురించే. కానీ తాము హిందువులమని చెప్పుకునే వాళ్లు మాత్రం కేవలం హింస, ద్వేషం, అసత్యాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఏ లెక్కన చూసుకున్నా మీరసలు హిందువులే కాదు’’అంటూ బీజేపీ నేతలను దుయ్యబట్టారు. ‘‘మైనారిటీలు దేశానికి గర్వకారణం. అన్ని రంగాల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశభక్తులు. వారిపైనా బీజేపీ దారుణంగా దాడులకు దిగుతోంది. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులపై హింసాద్వేషాలను వ్యాప్తి చేస్తోంది’’అని ఆక్షేపించారు. రాహుల్ ప్రసంగాన్ని ఆయన తల్లి సోనియాగాం«దీ, సోదరి ప్రియాంకా గాంధీ వద్రా లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి వీక్షించారు. హిందువులంతా హింసావాదులా: అమిత్ షా రాహుల్ వ్యాఖ్యలపై నిరసనలతో బీజేపీ సభ్యులు హోరెత్తించారు. రాహుల్ తక్షణం సభకు క్షమాపణ చెప్పి తీరాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ‘‘దేశంలో కోట్లాది హిందువులున్నారు. వారంతా హింసకు పాల్పడేవాళ్లేనన్నది రాహుల్ ఉద్దేశమా? 1975లో ఎమర్జెన్సీ విధింపు, 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల వంటి అకృత్యాలన్నీ కాంగ్రెస్ పుణ్యమే. దేశమంతటా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసిందే కాంగ్రెస్. అలాంటి పారీ్టకి చెందిన రాహుల్‌కు అహింస గురించి మాట్లాడే అర్హతే లేదు’’అంటూ మండిపడ్డారు. అయినా రాహుల్ వెనక్కు తగ్గలేదు. ‘‘క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం, జైనం, సిక్కు వంటి మతాలన్నీ ధైర్యం, నిర్భీతి వంటివాటి గురించే చెప్పాయి. కానీ బీజేపీ ప్రజాస్వామిక విలువలపై ఏనాడూ నమ్మకం లేదు. మోదీ ఆదేశాల మేరకు నాపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి. 20కి పైగా కేసులు పెట్టారు. నా ఇంటిని లాగేసుకున్నారు. నాపై ఈడీని ప్రయోగించి 55 గంటల పాటు విచారణ జరిపారు. అయినా వెరవకుండా రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో ముందుండి నిలిచా. రాజ్యాంగంపై, భారత దేశ మూల భావనలపై బీజేపీ పాల్పడుతున్న వ్యవస్థీకృత దాడులకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు అడ్డుకట్ట వేశారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ వాళ్లు కూడా నాతో పాటు రాజ్యాంగానికి జై కొట్టాల్సి వస్తోంది’’అంటూ ఎద్దేవా చేశారు. ‘నీట్’పై విపక్షాల వాకౌట్ సోమవారం లోక్‌సభ సమావేశం కాగానే నీట్–యూజీ పేపర్ లీకేజీ అంశాన్ని రాహుల్ ప్రస్తావించి తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ‘‘నీట్ వంటి ప్రొఫెషనల్ పరీక్షను కేవలం సంపన్న విద్యార్థులకు అనువైనపక్కా కమర్షియల్ పరీక్షగా మార్చేశారు. గత ఏడేళ్లలో 70కి పైగా పేపర్లు లీకయ్యాయి. ఇంత ముఖ్యమైన అంశంపై ప్రభుత్వం చర్చకు కూడా అంగీకరించడం లేదు. ఇది చాలా తీవ్రమైన అంశం. కనుక సభలో ఒక రోజంతా ప్రత్యేకంగా చర్చ చేపడదాం’’అని ప్రతిపాదించారు. అందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభ్యంతరం తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఇతర అంశాలపై చర్చ కోరడం లోక్‌సభ సభ్యునిగా నా దశాబ్దాల అనుభవంలో ఎప్పుడూ చూడలేదు’’అన్నారు. అనంతరం నీట్‌పై చర్చకు స్పీకర్ తిరస్కరించారు. అందుకోసం ప్రత్యేక నోటీసివ్వాలని విపక్షాలకు సూచించారు. స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. అంతకుముందు మణిపూర్ కల్లోలం, రైతు ఆత్మహత్యలు, జమ్మూ కశీ్మర్లో హింసాకాండ, జీఎస్టీ, నోట్ల రద్దు తదిరాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును రాహుల్ దుయ్యబట్టారు. మణిపూర్‌ను మోదీ సర్కారు అంతర్యుద్ధం దిశగా నెట్టేస్తోందని ఆరోపించారు. ‘‘విపక్షాన్ని శత్రువులుగా చూడకండి. ప్రతి అంశంపైనా దేశ హితం కోసం ప్రజోపయోగకరమైన చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం’’అన్నారు. విపక్షాల నిరసన విపక్ష నేతలను వేధించేందుకు వారిపైకి మోదీ సర్కారు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని ఇండియా కూటమి సభ్యులు ఆరోపించారు. ఇందుకు నిరసనగా రాహుల్‌తో పాటు వారంతా పార్లమెంటు మకర ద్వారం వద్ద నిరసనకు దిగారు. ‘విపక్షాల గొంతు నొక్కేందుకు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం మానుకోండి’, ‘బీజేపీలో చేరండి, అవినీతికి లైసెన్సు పొందండి’అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులపై ఈడీని ఉసిగొల్పడం మానుకోవాలంటూ డిమాండ్ చేశారు. రాహుల్‌ది బాధ్యతారాహిత్యం: బీజేపీ లోక్‌సభలో రాహుల్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారంటూ బీజేపీ విమర్శించింది. విపక్ష నేత వంటి బాధ్యతాయుత స్థానంలో ఉంటూ నీట్, హిందూ సమాజం, అగి్నవీర్ పథకం... ఇలా అన్ని అంశాలపైనా హుందాతనం లేని వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్ర అశ్వినీ వైష్ణవ్ ఆరోపించారు. రాహుల్ ఇప్పటిదాకా బాధ్యతల్లేని అధికారాన్ని మాత్రమే ఆస్వాదించారంటూ బీజేపీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ దుయ్యబట్టారు. సభకు నిత్యం డుమ్మా కొట్టడాన్ని అలవాటుగా మార్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు. మోదీ నవ్వరెందుకో...! ప్రధాని మోదీ గురించి రాహుల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీజీ! మీరెందుకు ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు? విపక్షాలతో ఎప్పుడూ సరదాగా మాట్లాడరు. సభలో మేం ఎదురైనప్పుడు మీలో చిరునవ్వు కూడా కని్పంచదు’’అన్నారు. మోదీ స్పందిస్తూ, ‘‘విపక్ష నేతను సీరియస్‌గా తీసుకోవాలని మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నాకు నేర్పాయి’’అనడంతో ఎన్డీఏ సభ్యులంతా నవ్వుల్లో మునిగిపోయారు. మోదీకి తలవంచి అభివాదమా? రాహుల్ అభ్యంతరం, స్పీకర్ వివరణ నిండు సభలో ప్రధాని మోదీకి స్పీకర్ ఓం బిర్లా తలవంచి అభివాదం చేయడం సరికాదన్న రాహుల్ వ్యాఖ్యలు వారి మధ్య సంవాదానికి దారి తీశాయి. ‘‘మీరు స్పీకర్‌గా ఎన్నికయ్యాక నేను అభినందించినప్పుడు నిటారుగా నిలబడి నాతో కరచాలనం చేశారు. కానీ మోదీ కరచాలనం చేసినప్పుడు ఆయనకు వంగి నమస్కరించారు’’అంటూ రాహుల్ ఆక్షేపించారు. దీన్ని అధికార పక్ష సభ్యులంతా తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ సభాపతి స్థానంపైనే తీవ్ర అభియోగాలు మోపుతున్నారంటూ అమిత్ షా ఆక్షేపించారు. స్పీకర్ స్పందిస్తూ, ‘‘ప్రధాని సభా నాయకుడు. పైగా నా కంటే పెద్దవారు. పెద్దలను గౌరవిస్తా. అవసరమైతే పాదాభివందనం చేస్తా. సమ వయస్కులతో సమాన స్థాయిలో ప్రవర్తిస్తా. అది నా సంస్కృతి’’అని బదులిచ్చారు. అయినా రాహుల్ ఊరుకోలేదు. ‘‘మీ తీరును గౌరవిస్తా. కానీ లోక్‌సభలో స్పీకరే అందరికంటే పెద్దవారు. సభలో అంతా మీకే అభివాదం చేయాలి’’అన్నారు. ‘మైక్ కట్’విమర్శలు... ధన్‌ఖడ్, బిర్లా సీరియస్ విపక్షాలకు మైక్ కట్ చేస్తున్నామన్న విమర్శలపై రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్, స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా స్పందించారు. గత వారం సభలో రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేశానన్న విపక్షాల ఆరోపణలను బిర్లా తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది స్పీకర్ స్థానం గౌరవానికి సంబంధించిన అంశం. మైకుల నియంత్రణ స్పీకర్ చేతిలో ఉండదు. ఈ విషయం విపక్షాలకూ తెలుసు. అయినా ఉద్దేశపూర్వకంగా సభ బయట తప్పుడు ఆరోపణలు చేశారు’’అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. అనంతరం రాజ్యసభలోనూ ఇదే అంశం చర్చకొచి్చంది. విపక్ష నేత ఖర్గే మాట్లాడుతుండగా అంతరాయం కలగడంతో మైక్ కట్ చేశారని విపక్ష సభ్యుడు ప్రమోద్ తివారీ అన్నారు. దానిపై ధన్‌ఖడ్ సీరియసయ్యారు. ‘‘మీ వ్యాఖ్యలతో సభను కించపరుస్తున్నారు. మిస్టర్ ఖర్గే! మైక్‌లను మెకానికల్‌గా నియంత్రిస్తారు తప్ప అది సభాపతి చేతిలో ఉండదు. అది మీకూ తెలుసు’’అంటూ మండిపడ్డారు. మోదీపై రాహుల్ మాటల తూటాలు – మనమంతా మామూలుగా పుట్టి మట్టిలో కలిసే జీవమాత్రులం. మోదీ అలా కాదు. ఆయన ఆత్మతో పరమాత్మ నేరుగా సంప్రదిస్తాడు. తనను దేవుడే పంపాడని మోదీయే స్వయంగా చెప్పుకున్నారు! దేవునితో తనకు నేరుగా కనెక్షన్ ఉందని ప్రకటించుకున్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలంటూ ఓ నాటి రాత్రి వేళ బహుశా మోదీకి దైవసందేశం అందినట్టుంది. వెంటనే ఆ మేరకు ప్రకటన చేసేశారు! – అంతా మర్చిపోయిన మహాత్మా గాం«దీని ఓ సినిమా తిరిగి గుర్తు చేసిందని మోదీ సెలవిచ్చారు. దాదాపుగా మృతప్రాయుడైన గాం«దీకి ఒక సినిమా పునర్జీవం పోసిందట! ఇంతటి అవగాహనరాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి! – సైనికులను అవసరానికి వాడి, ఆ తర్వాత పారేసే కార్మికులుగా మార్చేసిన అగి్నపథ్ కూడా మోదీ మెదడులో పురుడుపోసుకున్న పథకమే. మేం అధికారంలోకొస్తే దాన్ని తక్షణం రద్దు చేస్తాం. -
స్పీకర్ ఎన్నిక: ఓటింగ్‌కు ఆ ఏడుగురు దూరం!.. ప్రభావమెంత?
ఢిల్లీ: అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో 18వ పార్లమెంట్‌లోని లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. ఇవాళ లోక్‌సభ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. అయితే రెండురోజులు పాటు పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరగ్గా.. మరో ఏడుగురు సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయలేదు. ఇది ఇవాళ్టి ఓటింగ్‌పై ప్రభావం చూపబోతుందా? అనే చర్చ నడుస్తోంది. ఎంపీలుగా ప్రమాణం చేయని వాళ్లలో ఇండియా కూటమికి చెందినవారే ఐదుగురు ఉండగా, మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు. శశిథరూర్, శతృఘ్న సిన్హాలాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఎంపీలుగా ప్రమాణం చేయలేదు కాబట్టి ఇవాళ స్పీకర్ ఎన్నికలో ఈ ఏడుగురు ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే.. ఓటింగ్‌పై ఇది ప్రభావం చూపెట్టే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు. సభకు హాజరయ్యే సభ్యుల ఆధారంగనే ఓటింగ్ మెజార్టీని లెక్కగడతారని వారంటున్నారు. అదే సమయంలో.. ఎన్డీయే కూటమి 293 సీట్లతో మెజార్టీలో ఉంది. స్పీకర్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 269గా ఉంది. మరోవైపు బీజేపీ విజ్ఞప్తి మేరకు వైఎస్సార్సీపీ సానుకూలంగానే స్పందించింది. ఇక.. ఇండియా కూటమిలో మొత్తం 232గాను 227 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. అంటే ఇండియా కూటమికి మెజార్టీ లేదనే చెప్పాలి. దీంతో స్పీకర్ ఎన్నిక ఎన్డీయే వైపు ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక.. స్పీకర్ ఎన్నిక కోసం మెజార్టీ ఎంపీలు ఉన్నప్పటికీ బీజేపీ స్పీకర్ ఎన్నికలో 300 ఎంపీల ఓట్ల కోసం టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో లేని పార్టీలను సైతం బీజేపీ మద్దతు కోరింది. స్పీకర్ ఎన్నికకు ఎన్డీయే కూటమి మాజీ స్పీకర్ కోటా ఎంపీ ఓం బిర్లాను, ఇడియా కూటమి కేరళ ఎంపీ కే. సురేష్‌ను బరిలోకి దింపాయి. ఇవాళ 11 గంటలకు స్పీకర్ ఓటింగ్ జరగనుంది. -
ఇంకెన్నాళ్లు ఎమర్జెన్సీపై మాట్లాడతారు?.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సహా కొత్తగా ఎన్నికైన సభ్యులంతా ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకముందు పార్లమెంట్ ప్రాంగణంలో మోదీ మీడియాతో మాట్లాడారు.దేశానికి మూడోసారి సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారు.’స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం ఇది రెండోసారి. 60 ఏళ్ల తర్వాత ఈ అవకాశం వచ్చింది... ప్రజలు మూడోసారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటే దాని ఉద్దేశం, దాని విధానాలు, అంకితభావంపై ముద్ర పడుతుందని, ఇందుకు ప్రజలకు కృతజ్ఞతలు’ తెలిపారుఅనంతరంపై కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపడ్డారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ సమయంలో ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ.. విమర్శలు గుప్పించారు. రేపటికి(జూన్ 25) ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు నిండుతాయని, ఇది దేశ ప్రజాస్వామ్యానికి నల్ల మచ్చగా ఆయన అభివర్ణించారు. భారత రాజ్యాంగాన్ని ఎలా రద్దు చేశారో, దేశాన్ని జైలుగా ఎలా మార్చారో కొత్త తరం మరచిపోదని తెలిపారు. 50ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు మళ్లీ పునరావృతం కాకూడదని మోదీ అన్నారు. ‘ఈ దేశానికి మంచి, బాధ్యతాయుతమైన విపక్షం అవసరం. ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా, సామాన్య పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షాలు నడుచుకుంటాయని ఆశిస్తున్నా. డ్రామాలు, ఆటంకాలను ప్రజలు కోరుకోవట్లేదు. నినాదాలు ఆశించట్లేదు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలి. జనహితం కోసం సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. 18వ లోక్‌సభలో విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలను ప్రధాని మోదీ హెచ్చరిస్తున్నారని అన్నారు. ఎమర్జెన్సీ గురించి మోదీ ఇంకెన్నిసార్లు మాట్లాడతారని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఇంకెనెళ్లు పాలిస్తారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను మోదీ దెబ్బతీస్తున్నారు, గత పదేళ్లుగా ప్రధాని అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని విమర్శించారు.రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న తమ ప్రయత్నానికి ప్రజలు మద్దతు పలికారని ఖర్గే తెలిపారు.పార్లమెంటు లోపల, వెలుపల ప్రజల గొంతును ఇండియా కూటమి పెంచుతుందని అన్నారు. నీట్ చుట్టూ జరుగుతున్న నిరసనలు, పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం, మణిపూర్‌లో కొనసాగుతున్న హింస గురించి ప్రధాని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. -
కిరణ్ రిజిజు V/s జైరాం రమేష్.. ఎక్స్ వార్
న్యూ ఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు నేడు(సోమవారం) ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ శాసనసభ్యుడు భర్తృహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీతో సహా కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతోంది. జూన్ 26న స్పీకర్ ఎన్నికల జరగనుంది.కాగాసమావేశాల్లో తొలి రోజే నీట్-యూజీ, యూజీసీ-నెట్లో అవకతవకలు, ప్రొటెం నియామకంపై వివాదం, స్పీకర్ ఎన్నికల వంటి అంశాలపై ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడనున్నట్లు తెలుస్తోంది.అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీల మధ్య మాటల యుద్ధం నెలకొంది.పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిరణ్ రిజుజు సోమవారం ఉదయం18వ లోక్‌సభ సభ్యులకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కొత్తగా ఎంపికైన ఎంపీలకు స్వాగతం. నేడు(జూన్ 24) లోక్‌సభ మొదటి సమావేశం జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా సభ్యులకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. సభను సమర్ధవంతంగా నడిపేందుకు సభ్యుల నుంచి సమన్వయం కోసం ఎదురుచూస్తున్నారుఈ పోస్ట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాటల కంటే చర్యలు ముఖ్యమని, చెప్పిన మాటలను ఆచరణలో పెట్టాలని కౌంటర్ ఇచ్చారు.జైరాం రమేష్ ట్వీట్‌పై కేంద్రమంత్రి రిజిజు బదులిచ్చారు. మీరు సానుకూలంగా సహకరించడమే సభకు గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు. "ఖచ్చితంగా. జైరాం రమేష్ జీ. మీరు తెలివైన సభ్యులు. మీరు సానుకూలంగా సహకరిస్తే సభకు విలువైన ఆస్తి అవుతారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు అలాగే ఉంటాయి. కానీ మనమంతా దేశానికి మాసేవ చేసేందుకు ఐక్యంగా ఉన్నాం. భారతదేశపు గొప్ప పార్లమెంటరీ సంప్రదాయాలను కొనసాగించడంలో మీ సహకారం ఓసం ఎదురుచూస్తున్నాం." అని తెలిపారు.అయితే ఈ సంభాషణ ఇక్కడితో ఆగలేదు. కేంద్రమంత్రి ట్వీట్‌కు మరోసారి జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు. నీట్ పరీక్షను నిర్వహించడంలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంశాన్ని ప్రస్తావిస్తూ... "ధన్యవాదాలు మంత్రి. నా తెలివితేటలకు మీ సర్టిఫికేట్.. ఎన్టీయే గ్రేడింగ్ కాదని నేను భావిస్తున్నాను. దీనికేమైనా గ్రేస్ మార్కుల ఉన్నాయా?" అంటూ పంచ్‌లు విసిరారు. -
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
-
Parliament Budget Session 2024: ‘ఇది కర్తవ్య కాలం’
న్యూఢిల్లీ: ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వదిలిపెట్టిన సవాళ్లను ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో విజయవంతంగా అధిగమించింది. దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంది’’ అని కేంద్ర ప్రభుత్వం తమ శ్వేతపత్రం(వైట్ పేపర్)లో వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన 59 పేజీల ఈ శ్వేతపత్రాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. యూపీఏ సర్కారు హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన ఆర్థిక ప్రగతిని వైట్ పేపర్లో ప్రస్తావించారు. దీనిపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ అనంతరం మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తారు. ‘‘2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది. ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆర్థిక క్రమశిక్షణ మచ్చుకైనా లేదు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. నిజంగా అదొక సంక్షోభ పరిస్థితి. యూపీఏ ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఆర్థిక వ్యవస్థ వెనక్కిపోయింది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో అప్పటి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. యూపీఏ పాలనలో భారత్ ప్రపంచంలో అత్యంత బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండేది. యూపీఏ హయాంలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయి. అప్పటి అవినీతి వ్యవహారాలు దేశ ప్రజల విశ్వాసాన్ని బలహీనపర్చాయి. 2013లో విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దానివల్ల మనం పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అప్పటి బలహీన నాయకత్వం వల్ల రక్షణ రంగం సైతం సన్నద్ధత కోల్పోయింది. 2014లో దారుణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ యూపీఏ నుంచి ఎన్డీయే ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది. ఆర్థిక వ్యవస్థను, పరిపాలనా వ్యవస్థను గాడిలో పెట్టే పనికి ఎన్డీయే ప్రభుత్వం పూనుకుంది. ఒక క్రమపద్ధతిలోకి తీసుకొచ్చింది. ఆర్థికంగా దేశానికి మంచి జరగాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను మోదీ ప్రభుత్వం గుర్తించింది. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులను పటిష్టంగా మార్చింది. ఇప్పుడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. ప్రపంచంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్ అవతరించింది. మోదీ నాయకత్వంలో మన దేశం ప్రస్తుతం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారింది. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల కేవలం పదేళ్లలోనే ఈ ఘనత సాధ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిణామాలు, సవాళ్లు ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో కొనసాగుతోంది. చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. నిద్రించేలోగా చేరాల్సిన మైళ్లు, ఎక్కాల్సిన పర్వతాలు ఎన్నో ఉన్నాయి. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలి. అదే మన గమ్యం. ఇది మనందరి కర్తవ్య కాలం’’ అని శ్వేతపత్రంలో ఎన్డీయే ప్రభుత్వం పిలుపునిచ్చింది. -
విదేశాల్లో విద్యార్థుల మరణాలపై కేంద్రం పకటన
న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ప్రకటించింది. గత ఐదేళ్లలో.. విదేశాలలో 403 మంది భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ వెల్లడించారు. మూడోరోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఒక ప్రశ్నకు మంత్రి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018 నుంచి విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందగా.. అత్యధికంగా 91 మంది కెనడా దేశంలో మరణించినట్లు తెలిపారు. ఇంగ్లండ్‌లో 48, రష్యాలో 40 మంది, అమెరికాలో 36, ఉక్రెయిన్‌లో 21 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారని పేర్కొంది. అయితే ఇటీవల అమెరికాలో వరుసగా నలుగురు భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాలల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఏ దేశంలో ఇప్పటివరకు అసలు ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో మృతి చెందారన్న విషయంపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. చదవండి: అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు -
Parliament Budget Session 2024: రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో ఉభయ సభలను ఉద్ధేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఉదయం 11:30కు అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుత లోక్‌సభకు చివరి సమావేశాలు కావడంతో సహృద్భావ వాతావరణంలో భేటీలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. కీలక బిల్లులు అన్నింటికి గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ఓట్ ఆన్ అకౌంట్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులను ఆమోదానికి కేంద్రం తీసుకురానుంది. ఈ బిల్లులు అన్నీ ఇప్పటికే ఉభయసభల్లో ప్రవేశ పెట్టినందున ఆమోదం తెలిపేందుకు చర్చకు తీసుకురానున్నట్లు తెలిసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష భేటీ అయ్యింది. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని కేంద్రం కోరింది. ఇదీ చదవండి: రూపాలు మార్చిన రూపాయి పుట్టుక తెలుసా.. -
security breach: ‘దేశద్రోహిని కాదో.. అవునో.. వాళ్లే చెబుతారు’
మైసూర్: పార్లమెంట్లో చోటు చేసుకున్న అలజడి ఘటనలోని నిందితులు మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి పార్లమెంట్ సందర్శన పాసులు పొందిన విషయం తెలిసిదే. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా ప్రతిపక్షాలు.. బీజేపీ ఎంపీ ప్రతాప్‌ను సస్పెండ్ చేయాలని నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు కర్ణాటకలో ఏకంగా అతనిపై దేశద్రోహి ముద్రవేసి పోస్టర్లు కూడా అంటించారు. అయితే ఆ పోస్టర్లపై మొదటిసారి ఎంపీ ప్రతాప్ సింహ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను ఏంటో నా నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలుసు. దాన్ని బట్టి ప్రజలు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పు ఇస్తారు’ అని అన్నారు. ‘దేవతా చాముండేశ్వరీ, కావేరీ మాత, 20 ఏళ్ల నుంచి నా వ్యాసాలు చదివే ప్రజలకు తాను ఏంటో తెలుసు. గత 20 ఏళ్ల నుంచి సేవ చేస్తున్న మైసూరు, కొడుగు ప్రాంత ప్రజలు.. నేను దోశద్రోహినో లేదా దేశభక్తుడినో తేల్చుతారు. అదే విషయాన్ని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం స్పష్టంగా చూపిస్తారు. నేను దోశద్రోహినో.. దేశ భక్తుడనో ప్రజలు తీర్పు ఇస్తారు’ అని ఎంపీ ప్రతాప్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై నిరసనగా ఏర్పాటు చేసిన పోస్టర్లను మైసూరు పోలీసులు తొలిగించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఘటన అనంతరం ప్రతాప్ సింహ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి నిందితులల్లో ఒకరైన సాగర్ శర్ తండ్రిది తన నియోజవర్గమైన మైసూర్ అని తెలియజేశారు. కొత్త పార్లమెంట్ సందర్శించడానికి పాస్ ఇవ్వాల్సిందిగా తన కార్యాలయంలో సాగర్ శర్మ తండ్రి విజ్ఞప్తి చేశారని పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: 2023 Roundup: సుప్రీంకోర్టు వెలువరించిన టాప్-10 జడ్జ్మెంట్స్ -
ఎన్నో అవమానాలు భరించా: జగ్ధీప్ ధన్‌ఖడ్
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తాను ఎన్నో అవమానాలు, బాధలు భరించిన వ్యక్తినని అన్నారు. పార్లమెంట్ భద్రత వైఫల్యంపై విపక్ష ఎంపీలు కేంద్ర హోం మంత్రి స్పందించాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాల ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. దానిని ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ.. జగదీప్ ధన్‌ఖడ్ హావభావాలను అనుకరించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ధన్‌ఖడ్.. తనను, తన కులాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు కూడా. అయితే తాజాగా ఆయన ఈ వ్యవహారంపై ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసు(ఐఎస్ఎస్) ప్రొబేషనర్లు ఏర్పాటు చేసిన ఓ కర్యక్రమంలో మాట్లాడారు. ‘నేను ఎన్నో అవమానాలు, బాధలు అనుభవించిన వ్యక్తిని. అన్ని వైపుల నుంచి వచ్చే అవమానాలు, బాధలను సహించడం నాకు తెలుసు. మనం భారత మాత సేవలో ఉన్నాం’ అని అన్నారు. విమర్శలను తట్టుకోవడం నేర్చుకోవాలని, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నప్పటికీ దేశ ప్రజలు తనకు దూరంగా లేరని తెలిపారు. రాజ్యసభ చైర్మెన్‌గా, ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగ హోదాలో ఉన్నప్పటికీ తనను ప్రజలు ఎప్పుడూ విడిచి పెట్టలేదని తెలిపారు. అది తన ఆలోచనా విధానాన్ని మార్చాలా?.. అది తన మార్గాన్ని తప్పుదారి పట్టించాలా? అని అన్నారు. ధర్మ మార్గంలో మనం ఎల్లప్పుడూ ముందుకు సాగాలని తెలిపారు. మన ఎదుగుదలను చూసి ఎవరైతే తట్టుకోలేరో.. అటువంటి వారే ఎప్పుడూ విమర్శలు చేస్తారని మండిపడ్డారు. చదవండి: ‘మార్పు’పై అసంతృప్తి! -
ఇది విజయమా... వైఫల్యమా?
చరిత్ర సృష్టించటం మంచిదే. కానీ ఆ చరిత్ర తరతరాలు చెప్పుకొనేలా వుండాలి. ఈ నెల 4న ప్రారంభమై ఎజెండా అంశాలన్నీ పూర్తికావటంతో ఒకరోజు ముందు గురువారం నిరవధిక వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలు ఫలవంతమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. లోక్‌సభ వరకూ చూస్తే ఈ సమావేశాలు దాదాపు 62 గంటలు సాగాయి. అత్యంత కీలకమైన 18 బిల్లులు చర్చల అనంతరం ఆమోదం పొందాయి. ఇందులో భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధారాల చట్టం స్థానంలో కొత్త చట్టాలుగా వస్తున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులున్నాయి. టెలికమ్యూనికేషన్ల బిల్లువుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లుంది. వార్తాపత్రికల, మేగజిన్ల కొత్త రిజిస్ట్రేషన్ చట్టం తాలూకు బిల్లు కూడావుంది. మొత్తంగా లోక్‌సభ 74 శాతం ఉత్పాదకతను చూపింది. రాజ్యసభ సైతం 17 బిల్లుల్ని ఆమోదించింది. సమావేశాలు 65 గంటల పాటు సాగాయి. దాని ఉత్పాదకత రేటు 79 శాతం వుంది. ఈ 17వ లోక్‌సభకు సంబంధించిఇవి 14వ సమావేశాలు. వీటన్నిటా ఈ సమావేశాలే అత్యంత ఫలవంతమైనవని గణాంకాలు వివరి స్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా మరో సమావేశం మాత్రమే జరుగుతుంది. అందులో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడం మినహా మరే ఇతర కార్యకలాపాలూ వుండకపోవచ్చు. అయితే బాధాకరమైన అంశమేమంటే... ఈ ప్రధాన బిల్లుల చర్చల్లో దాదాపుగా విపక్షం లేదు. ఇరవైరెండేళ్ల నాటి చేదు అనుభవాన్ని గుర్తుకు తెస్తూ ఈనెల 13న యువకులు పదడుగుల ఎత్తునున్న ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కిందకు దూకి పొగగొట్టాలు వదిలి దిగ్భ్రమపరిచారు. పార్లమెంటువెలుపల సైతం అదే సాగింది. అమెరికాలో వున్న ఖలిస్తానీ తీవ్రవాది పన్నూ పార్లమెంటుపై దాడిచేస్తామని అంతకు చాలారోజులముందే బెదిరించాడు. అప్రమత్తంగా వుండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సూచించాయి. అయినా పార్లమెంటు భద్రత వ్యవహారాలు చూసే వ్యవస్థ నిద్రాణమై వుంది. దాడి జరిగి పదిరోజులు గడుస్తున్నా దానికి సూత్రధారులెవరో ప్రజలకు తెలియలేదు. 2001 దాడినుంచి భద్రతా వ్యవస్థలు ఏ గుణపాఠమూ నేర్చుకోలేదని ఈ పరిణామం తెలియజేసింది. ఇదిగాక దేశాన్ని ఆశ్చర్యపరిచిన ఘటన మరొకటుంది. అది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సభా బహిష్కరణ. ఇన్ని చేదు ఉదంతాల మధ్య సమావేశాలు ఫలవంతంగా జరిగాయని అనుకోగలమా? విపక్షాలు పాలకులను నిలదీయటం, అర్థవంతమైన చర్చల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. తమ సూచనలనూ, సలహాలనూపట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించే ప్రభుత్వానికి మూకుమ్మడిగా తమ అసమ్మతిని తెలియ జేయటానికి వాకౌట్ ఒక ఆయుధం. తగిన జవాబిచ్చినా విపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని, నినాదాలు చేస్తున్నారని, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని, అధ్యక్ష స్థానాన్ని కించపరుస్తున్నారని, దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని భావించినప్పుడు అందుకు కారకులైనవారిపై సస్పెన్షన్ వేటు వేయటం కూడా కొత్తేమీ కాదు. కానీ అటువంటి ఉదంతాలు రాను రాను పెరుగుతుండటం, రివాజుగా మారటం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి ఉభయ సభలనుంచీ 146 మంది ఎంపీలు సస్పెండయ్యారు. లోక్‌సభలోకి యువకులు చొరబడటంపై ప్రధాని, హోంమంత్రి ప్రకటన చేయాలంటూ సభలో ఆందోళన నిర్వహించటం, వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించటం కారణంగా ఈ సస్పెన్షన్లు చోటుచేసుకున్నాయి. కొందరు ఎంపీలపై సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు వెళ్లింది. దేశం మొత్తాన్ని దిగ్భ్రమలో పడేసిన ఉదంతంపై ప్రకటన చేసే విషయంలోకేంద్రం ఎందుకంత పట్టుదలకు పోయిందో ఆశ్చర్యం కలిగిస్తుంది. లోక్‌సభలో దాడిచేసిన ఉదంతంపై ప్రకటన చేసినంత మాత్రాన విపక్షాలకు లొంగిపోయినట్టు కాదు... సంప్రదాయ విరుద్ధం అసలే కాదు. ఈ ఉదంతం వెనక ఏ శక్తులున్నాయో, వారి ఉద్దేశాలేమిటో వివరించటం వల్ల, తదనంతరం తీసుకున్న పటిష్ట చర్యలేమిటో చెప్పటంవల్ల దేశ ప్రజలకు సాంత్వన కలుగుతుంది. ఈ సస్పెన్షన్ల పర్యవసానంగా అత్యంత కీలకమైన బిల్లులపై విపక్షం ఆలోచనలేమిటో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయసంహిత బిల్లు పోలీసులకు తగినంత జవాబుదారీతనం ఇవ్వకుండానే వారికి విస్తృతాధి కారాలు కట్టబెడుతున్నదని నిపుణులంటున్నారు. సీఆర్పీసీ స్థానంలో తెచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో ఏ చర్య ఉగ్రవాదమో, ఏది కాదో నిర్ణయించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చారు. దీన్ని న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని విపక్షాలంటున్నాయి. ఇక టెలికాం బిల్లు అంశానికొస్తే జాతీయ భద్రతా ప్రయోజనాల కోసమంటూ తాత్కాలికంగా టెలికాం సర్వీసుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేందుకు అది వీలుకల్పిస్తోంది. సీఈసీ, ఈసీల నియామకం సంగతి సరేసరి. వీటన్నిటిపైనా లోతైన చర్చ సాగొద్దా? పౌరుల్లో తలెత్తిన సందేహాలకు సమాధానాలు దొరకాల్సిన అవసరం లేదా? కనీసం అందుకోసమైనా విపక్షాల సస్పెన్షన్లు ఎత్తివేసివుంటే పాలకపక్షం పెద్ద మనసు వెల్లడయ్యేది. గత దశాబ్దం వరకూ రాజీవ్‌గాంధీ హయాంలో 66 మంది ఎంపీల సస్పెన్షనే రికార్డుగా నమోదైతే, ఈసారి ఆ సంఖ్య 146కి ఎగబాకటం ఆందోళనకరం. సమావేశాల అంతరా యానికి కారకులెవరన్న అంశాన్నలా వుంచితే... సమన్వయంతో, సదవగాహనతో మెలగి పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టడం ఇరుపక్షాల బాధ్యత కాదా? -
పార్లమెంట్ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రెండు జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. దీనివల్ల కశ్మీర్ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్టసభలో ప్రాతినిథ్యం లభించనుంది. ఈ బిల్లులతోపాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. ఐపీసీ చట్టాల స్థానంలో ద భారతీయ న్యాయ సంహిత, ద భారతీయ నాగరిక సురక్ష సంహిత, ద భారతీయ సాక్ష్య బిల్లును కేంద్రం తీసుకొస్తుంది. మరోవైపు సమావేశాల ప్రారంభానికి ముందు డిసెంబర్ 2న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. చదవండి: దంపతుల పోట్లాట దెబ్బకు.. దారి మళ్లిన విమానం! -
Live: మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Updates.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు అనుకూలంగా 171 మంది ఓట్లు వేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. చరిత్రాత్మకమైన ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో 10 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ చేపట్టగా అనుకూలంగా 171 మంది ఓట్లు వేశారు. కాగా ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడమే తరువాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన వెంటనే చట్టంగా మారనుంది. ► డిజిటల్ డివైజ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ ► మహిళా బిల్లుపై రాజ్యసభలో ప్రారంభమైన ఓటింగ్. ► మహిళా బిల్లుపై రాజ్యసభలో చర్చ నడుస్తోంది. మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది. ► మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్య సభలో కేంద్రంలో నిప్పులు చెరిగారు తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రెయన్. బెంగాల్లో ఆర్ధిక, ఆరోగ్య, పరిశ్రమలు, వాణిజ్య, భూ సంబంధిత శాఖలను మహిళలకు కేటాయించారు. మరి 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీయే ఒక్క రాష్ట్రంలోనైనా మహిళా అభ్యర్థిని సీఎంగా చేసిందా? అని ప్రశ్నించారు. ►2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయలేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఎంపీ కపిల్ సిబల్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లపై చర్చలో ఆర్ కృష్ణయ్య ►మహిళా రిజర్వేషన్లపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ సాయంత్రం ఓటింగ్ జరగనుంది. ► వైఎస్సార్సీపీ తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య ►మహిళా రిజర్వేషన్లు ఓబీసీలకు సబ్ కోటా కేటాయించాలి ►అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా ఇవ్వాలి ►56 శాతం ఉన్న జనాభా ఉన్న బీసీలకు రాజకీయాలలో 15 శాతం మాత్రమే వాటా ఉంది ►బీసీలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం చేయాలి ►బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలి చంద్రయాన్-3 సక్సెస్ పై లోక్‌సభలో చర్చ ►ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ పై లోక్‌సభలో చర్చ జరిగింది. ►వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ లావు కృష్ణదేవరాయలు చర్చలో పాల్గొన్నారు ►ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రయాన్ లాంచ్ చేశారు ►చంద్రయాన్-3 సక్సెస్ కావడం ఆనందంగా ఉంది ►శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధన కోసం కేటాయిస్తున్న నిధులను ఖర్చు చేయడం లేదు ►నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కోసం నిధులు కేటాయిస్తామని చెప్పినప్పటికీ విడుదల చేయలేదు ►రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మహిళా బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ఉంటుంది. రాజ్యసభ, శాసన మండలిలో కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలి అని అన్నారు. ► నూతన పార్లమెంట్ వద్దకు వెళ్లిన సినీ నటి తమన్నా భాటియా. #WATCH | Actor Tamannaah Bhatia arrives at the Parliament in Delhi. pic.twitter.com/sDHceDI1do — ANI (@ANI) September 21, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. బిల్లుకు మేము పూర్తి స్థాయిలో మద్దతిచ్చాం. కానీ, అది తక్షణమే అమలులోకి రావాల్సిన అవసరముంది. ఇది అమలులోకి వచ్చే ముందు నెరవేర్చాల్సిన రెండు షరతులు ముందుగా ఉన్నాయి. ఒకటి జనాభా గణన, డీలిమిటేషన్. ఎందుకంటే జనాభా ప్రకారం సీట్లను కేటాయించడం ప్రారంభిస్తే జనాభా నియంత్రణను అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. అది ఆమోదయోగ్యం కాదు. #WATCH | On the women's Reservation Bill Congress MP Karti P Chidambaram says, "It's a symbolic gesture. We have supported it wholeheartedly but that's not going to come into effect immediately. There are two conditions in precedence which need to be fulfilled before it becomes… pic.twitter.com/X0oTwDu6Sj — ANI (@ANI) September 21, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్లో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా రాజ్యసభలో కూడా బిల్లుకు ఆమోదం లభిస్తుందనే నమ్మకం ఉంది. #WATCH | Women's Reservation Bill | In Rajya Sabha, BJP president and MP JP Nadda says, "...We all know that the proceedings in this new Parliament began from Ganesh Utsav and yesterday in Lok Sabha, the Women's Reservation Bill - Nari Shakti Vandan Adhiniyam - was passed without… pic.twitter.com/XtZIcuKMhf — ANI (@ANI) September 21, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ వద్ద ఎంపీ పీటీ ఉష మాట్లాడుతూ.. మహిళలకు ఇది నిజంగా అమృత్కాల్. ఇది మాకు ఎంతో గౌరవం. #WATCH | On Women's Reservation Bill, Member of Rajya Sabha PT Usha says, "It's a real 'Amrit Kaal' for women, and we are honoured. pic.twitter.com/fcp31mfvTE — ANI (@ANI) September 21, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన అర్జున్‌రామ్ మేఘ్వాల్. Union Law Minister Arjun Ram Meghwal moves the Women's Reservation Bill in Rajya Sabha. pic.twitter.com/UqukFCjIEc — ANI (@ANI) September 21, 2023 ► బీజేపీ ఎంపీ హేమా మాలిని మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి ఒక విజన్ ఉంది. మహిళా బిల్లు విషయంలో మోదీకి ధన్యవాదాలు. బిల్లు విషయంలో అంతకుముందు ఏం జరిగిందన్నది కాదు. ప్రధాని మోదీ బిల్లును తీసుకువచ్చి పాస్ చేశారు. #WATCH | On Women's Reservation Bill, BJP MP Hema Malini says, "The people who question will only question. But PM Narendra Modi has done it. He has done what has never happened before. We all should thank him, and congratulate him. He has a vision..." pic.twitter.com/Fo0tHSXBCT — ANI (@ANI) September 21, 2023 ►పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు భారతీయ మహిళల్లో ఉత్సాహం నింపింది. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసవ్వడం చారిత్రక ఘట్టం. బిల్లు పాసయ్యేందుకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు. #WATCH | Women's Reservation Bill | Prime Minister Narendra Modi says, "Yesterday was a golden moment of India's Parliamentary journey. All the members of this House deserve that golden moment...Yesterday's decision and today when we cross the last mile after Rajya Sabha (passing… pic.twitter.com/s6mRNxPB2G — ANI (@ANI) September 21, 2023 ► పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. ఈరోజు రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతామన్నారు. #WATCH | Women's Reservation Bill | Union Law Minister Arjun Ram Meghwal says, "In Rajya Sabha, it will be brought through Supplementary Business as we were late in Lok Sabha yesterday. Lok Sabha Secretariat knows better about it. But I can tell you that discussion will be held… pic.twitter.com/dQKFL4iBWE — ANI (@ANI) September 21, 2023 ► రాజ్యసభలో మహిళా బిల్లుపై సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు రాజ్యసభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుంది. లోక్‌సభలో ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేసినా రాజ్యసభలో మాత్రం అందరూ మద్దతిస్తారు. కానీ విషయం ఏంటంటే, ప్రతి పక్షానికి ఒక్కో ఆలోచన ఉంటుంది. రాజ్యసభ, శాసనసభల్లో కూడా ఈ బిల్లు అమలు జరగాలని నేను చెప్పాలనుకుంటున్నాను. బిల్లులో పుదుచ్చేరి గురించి ఏమీ చెప్పలేదు, ఢిల్లీ గురించి, పుదుచ్చేరి గురించి కూడా ఉండాలి. బిల్లు ఎప్పుడు అమలులోకి వస్తుందనేది అతి పెద్ద విషయం. 2021లో జనాభా గణన జరగలేదు. దీంతో బిల్లుపై అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశ్యం వారికి లేదు. ఎన్నికల కోసం బిల్లును ప్రవేశపెడుతున్నారు. కానీ, సీపీఐ ఎప్పుడూ రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తోంది. #WATCH | Women's Reservation Bill | CPI MP P Santhosh Kumar says, "The Bill will be unanimously passed in the Rajya Sabha today. It was opposed by two MPs in Lok Sabha but everyone will support it in Rajya Sabha. But the thing is, every party has their own ideas. I would like to… pic.twitter.com/EdVm6EswsZ — ANI (@ANI) September 21, 2023 ► లోక్‌సభలో ప్రతిష్టాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది. భారీ మెజార్టీతో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యింది. ► నేడు రాజ్యసభకు మహిళా రిజర్వేషన్ బిల్లు. ► రాజ్యసభలో బిల్లును ప్రవేశపేటనున్న కేంద్ర ప్రభుత్వం. ►మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ జరుగనుంది. -
మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించింది వీళ్లే!
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్లో చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. బంపర్ మెజార్టీతో మహిళా రిజర్వేషన్ బిల్లు ‘నారీ శక్తి వందన్ అధినియమ్’కు లోక్‌సభ ఎంపీలు ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. మూడవ రోజు బుధవారం ఎనిమిది గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది మహిళా రిజర్వేషన్ బిల్లుపై. ఆపై ఓటింగ్ ద్వారా బిల్లు ఆమోదం పొందగా.. కొత్త పార్లమెంట్లో పాసైన తొలి బిల్లుగా రికార్డు సృష్టించింది. ఓటింగ్ సమయంలో సభలో 456 మంది సభ్యులు ఉండగా.. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు.. వ్యతిరేకంగా రెండు ఓట్లు పడ్డాయి. ఇద్దరు మజ్లిస్ ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించారు. ఎంఐఎం చీఫ్.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మరో ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్(ఔరంగాబాద్, మహారాష్ట్ర) బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడం ఇదే తొలిసారి. గతంలో యూపీఏ హయాంలో రాజ్యసభలో (108వ రాజ్యాంగ సవరణ) బిల్లు పాస్ అయినప్పటికీ లోక్‌సభలో ఆమోదం పొందలేదు. ఇక ఇప్పుడు లోక్‌సభ ఆమోదంతో రిజర్వేషన్ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా బిల్లుకు ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇక డీలిమిటేషన్ తర్వాత 2029 ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్ కోటా అమలుకానుంది. Lok Sabha passes Women's Reservation Bill granting 33% seats to women in Lok Sabha and state legislative assemblies 454 MPs vote in favour of the bill, 2 MPs vote against it pic.twitter.com/NTJz449MRX — ANI (@ANI) September 20, 2023 కాగా టీ కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ మీటింగ్‌తో ముగ్గురు ఎంపీలు ఓటింగ్‌కు హాజరుకాలేకపోయారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మహిళా బిల్లు ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రేపు (సెప్టెంబర్ 21)న రాజ్యసభ ముందుకు రానుంది. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతుండటంతో అక్కడ సైతం ఇది ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే.. మూడు దశాబ్దాల ప్రయత్నం చివరకు ఫలించినట్లు అవుతుంది. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు -
మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వర్తించవని అన్నారు. ఎన్నికలు జరిగిన వెంటనే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేపడతామని చెప్పారు. కావాలంటే చట్టంలో కొన్ని మార్పులు చేస్తామని తెలిపారు. పారదర్శకత కోసమే డీలిమిటేషన్ చేయనున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. ఏయే స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాలనే దానిపై డిలిమిటేషన్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుందని, అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి జనాభా లెక్కల సమాచారం మూలాధారమని అన్నారు. అందుకే 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొన్నారు. బీజేపీకి మహిళా బిల్లు రాజకీయ అంశం కాదని, మహిళల సాధికారత కోసం చేసే ప్రయత్నమని అని స్పష్టం చేశారు. కొందరు ఓబీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారన్న అమిత్ షా... బీజేపీ దేశానికి ఏకంగా ఓబీసీ ప్రధానినే ఇచ్చిందనతి తెలిపారు. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించింది వీళ్లే! కాగా నారీ శక్తి వందన్ అధినియం పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లుపై 80 మంది ఎంపీలు మాట్లాడారు. దాదాపు 8 గంటల వరకు సుధీర్ఘ చర్చ సాగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు విమర్శించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కింద ఓబీసీ, ఎస్సీ కోటా పెట్టాలని, త్వరగా ఈ బిల్లును అమల్లోకి తీసుకు రావాలని డిమాండ్ చేశాయి విపక్షాలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. సోనియా పేరు ఎత్తకుండానే విమర్శల వర్షం కురిపించారు. 2010లో బిల్లు తీసుకొచ్చిన వాళ్లు దాన్ని ఎందుకు పాస్ చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం “ఇది మా బిల్లు” అని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన కోటాలు అడుగుతూ కాంగ్రెస్ దేశాన్నితప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Updates.. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో పాస్ అయ్యింది ► మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. దీంతో.. ఇది ఇక రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. అయితే.. ఇది పెద్దల సభలోనూ ఆమోదం పొందినా.. రిజర్వేషన్ కోటా అమలు అయ్యేది మాత్రం 2029 ఎన్నికల సమయంలోనేనని కేంద్రం స్పష్టం చేసింది. అంతకు ముందు జనాభా లెక్కలు, డీ లిమిటేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. ► మహిళా రిజర్వేషన్ బిల్లుకు..ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఆమోదం లభించింది. బిల్లుకు మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఓటింగ్ సమయంలో 456 మంది సభ్యులు సభలో ఉన్నారు. అనుకూలంగా 454 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. Lok Sabha passes Women's Reservation Bill granting 33% seats to women in Lok Sabha and state legislative assemblies 454 MPs vote in favour of the bill, 2 MPs vote against it pic.twitter.com/NTJz449MRX — ANI (@ANI) September 20, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ ► ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్య. స్లిప్పుల ద్వారా కొనసాగుతున్న ఓటింగ్. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ ప్రారంభమైంది. బిల్లుపై 60 మంది ఎంపీలు మాట్లాడారు. ఎనిమిది గంటలపాటు సుధీర్ఘంగా చర్చ సాగింది. ► 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల తర్వాత జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేపడతామని పేర్కొన్నారు. కావాలంటే బిల్లులో కొన్ని మార్పులు కూడా చేపడతామని పేర్కొన్నారు. అమిత్ షా మాట్లాడుతుండగానే సభ నుంచి రాహుల్ గాంధీ బయటకు వెళ్లిపోయారు. ►కొత్త పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ స్థానంలో కూర్చున్న తొలి తెలుగు ఎంపీగా మిథున్ రెడ్డి రికార్డు. ►లోక్ సభలో సభాపతి స్థానంలో రెండు గంటల పాటు సభా కార్యక్రమాలను నిర్వహించిన ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డి ►చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చను నిర్వహించిన మిథున్ రెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో చర్చ ►వైఎస్సార్సీపీ తరపున ఎంపీ సత్యవతి చర్చలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీల కోటా పెట్టాలని సీఎం జగన్ కోరారని ఎంపీ సత్యవతి తెలిపారు. మహిళ రిజర్వేషన్లను కేవలం 15 ఏళ్ల వరకే అని పరిమితం చేయవద్దని, రిజర్వేషన్లను సమయానుకూలంగా సమీక్షించేలా, పొడిగించేలా బిల్లులో రాయాలని సూచించారు. మహిళలకు నిజమైన ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ►రిజర్వేషన్లను రాజ్యసభ, శాసన మండలిలో కూడా అమలు చేయాలని ఎంపీ సత్యవతి తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలలో 50% కోటాను అమలు చేస్తున్నారని ప్రస్తావించారు. దేశం మొత్తం దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని.. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశా చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ►లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపి వంగా గీత మాట్లాడుతూ.. ‘మహిళలను గౌరవించడంలో ఏపీ ముందుంది. నామినేటెడ్ పదవుల్లో మహిలలకు 50 శాతం మించి పదవులు. మహిళల పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేసింది. మహిళలు తప్పనిసరిగా చట్టసభల్లో ఉండాలి’ అని స్పష్టం చేశారు. ►డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. మహిళా బిల్లును బీజేపీ రాజకీయంగా వాడుకుంటోంది. దేశంలోనే తొలిసారిగా 1921లో తమిళనాడు మహిళ ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నాం. వందేళ్ల తర్వాత ఇప్పటికీ మహిళలకు రిజర్వేషన్లు అమలు కాలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో మహిళా బిల్లును ఆమోదించారు. ► మహిళా బిల్లుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ► సోనియా గాంధీ వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. కాంగ్రెస్ నిర్ణయాలను తప్పుబడుతూ బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. ► లోక్‌సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేం మద్దతు ఇస్తాం. వంటింటి నుంచి ప్రపంచ వేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉంది. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడు ఆలోచించరు. స్త్రీల త్యాగాలు ఎనలేనివి. ► ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి స్త్రీలు పోరాడారు. సరోజినీ నాయుడు, సుచేత కృపాలనీ, ఆరుణాసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్ వంటి వారెందరో దేశం కోసం పోరాడారు. ►ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు తొలిసారిగా రాజ్యాంగ సవరణ చేస్తూ రాజీవ్ గాంధీ బిల్లును తీసుకొచ్చారు. #WATCH | Women's Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "Congress party supports this Bill. We are happy regarding the passing of the Bill but we are also concerned. I would like to ask a question. Indian women have been waiting for their… pic.twitter.com/H3VDbcG6ki — ANI (@ANI) September 20, 2023 ►పీఎం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించింది. ఫలితంగా స్థానిక సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నేతలు ఎన్నికయ్యారు. దీంతో, రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయింది. ఈ బిల్లు ఆమోదంతో అది పూర్తవుతుంది. ► గతంలో బీజేపీ సభ్యులు మహిళా బిల్లును అడ్డుకున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. కానీ, మాకు ఒక భయం ఉంది. ఇప్పటి వరకు 13 ఏళ్లుగా మహిళలు బిల్లు అమలు కోసం వేచిచూస్తున్నారు. ఇంకెన్నాళ్లు మహిళలు వేచిచూడాలి. వెంటనే కులగణన చేసి మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. #WATCH | Women's Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "...On behalf of Indian National Congress, I stand in support of Nari Shakti Vandan Adhiniyam 2023..." pic.twitter.com/BrzkEkba8G — ANI (@ANI) September 20, 2023 ► లోక్‌సభలో అర్జున్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీలోనూ మహిళలకు రిజర్వేషన్లు లభిస్తాయి. ఈ చట్టంతో మహిళల సాధికారత సాధ్యమవుతుంది. మహిళా రిజర్వేషన్ల కోసం వాజ్‌పేయి చాలా కృషి చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో బిల్లు తెస్తే రాజ్యసభలో బీజేపీ మద్దతు ఇచ్చింది. ఏకాభిప్రాయంతో బిల్లును ఆమోదించాలి. #WATCH | Women's Reservation Bill | Union Law & Justice Minister Arjun Ram Meghwal says, "...This Bill will enhance the dignity of women as well as equality of opportunities. Women will get representation. There are four important clauses..." pic.twitter.com/BDamDXOZdq — ANI (@ANI) September 20, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. ► మూడో రోజు పార్లమెంట్ స్పెషల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ► మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల.. సోనియా గాంధీ. #WATCH | On Women's Reservation Bill, Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "It was Rajiv ji's (Gandhi's) dream (Bill)." pic.twitter.com/mZQphniuEZ — ANI (@ANI) September 20, 2023 ► పార్లమెంట్ సమావేశాల హాజరుకు ముందు ఇండియా కూటమి సభ్యులు సమావేమయ్యారు. #WATCH | Delhi | Leaders of INDIA alliance hold a meeting at the office of LoP in Rajya Sabha, Mallikarjun Kharge ahead of the commencement of the Parliament proceedings today. pic.twitter.com/zs6X1HsXDl — ANI (@ANI) September 20, 2023 ►మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. బిల్లుపై సభలో ఉదయం 11 గంటలకు చర్చ ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆరు గంటల వరకు చర్చ జరుగుతుంది. ఈ బిల్లు విషయంలో రాజకీయాలు చేయదలచుకోలేదు. #WATCH | On Women's Reservation Bill, MoS Parliamentary Affairs Arjun Ram Meghwal says, "... Discussion will be done through the day. It will begin at 11 and it has been scheduled to continue till 6 pm...This has nothing to do with politics..." pic.twitter.com/Flq1DIBsu0 — ANI (@ANI) September 20, 2023 నేడు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ ►కాసేపట్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు ప్రారంభం కానున్నాయి. ఈరోజు సమావేశాల్లో భాగంగా సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతుంది. కాగా, మహిళా బిల్లుపై చర్చకు ఆరు గంటల సమయం కేటాయించారు. ►ఇక, మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చను కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీ ప్రారంభించనున్నారు. #WATCH | Delhi: On being asked whether the Congress will be part of the debate on the Women's Reservation Bill, Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury says, "Yes, Sonia Gandhi will take part in it. Sonia Gandhi will start (discussion) from our party, it has been… pic.twitter.com/kFoete0SmB — ANI (@ANI) September 20, 2023 ►మరోవైపు.. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని మోదీ కోరుతుండటం విశేషం. ► మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ..2010లో మేము బిల్లును రాజ్యసభలో ఆమోదించాము. కానీ లోక్‌సభ ఆమోదించడంలో విఫలమైంది. అందుకే, ఇది కొత్త బిల్లు కాదు. ఆ బిల్లును ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ రోజుకి త్వరగా పూర్తయ్యేది. బీజేపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. కానీ, నిజానికి డీలిమిటేషన్ లేదా జనాభా లెక్కలు జరిగితే తప్ప బిల్లు సాధ్యం కాదు. ఈ బిల్లుకు మేము పూర్తిగా సహకరిస్తాం. ఈ బిల్లులో లొసుగులు మరియు లోపాలను సరిదిద్దాలి. #WATCH | On Women's Reservation Bill, Congress president and LoP in Rajya Sabha, Mallikarjun Kharge says, "In 2010, we had passed the Bill in Rajya Sabha. But it failed to be passed by the Lok Sabha. That is why, this is not a new Bill. Had they taken that Bill forward, it would… pic.twitter.com/CbcPBfLifH — ANI (@ANI) September 20, 2023 -
Parliament : సరికొత్త సంకల్పంతో...
ఎన్నో కీలక ఘట్టాలకు వేదికైన పాత పార్లమెంటు భవనం చరిత్ర ముగిసి, కొత్త పార్లమెంటు భవనం అందుబాటులోకొచ్చింది. అయిదురోజులపాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం పాత భవనంలోనే ప్రారంభమైనా, రెండోరోజు కొత్త భవనంలోకి మారాయి. ఇకపై పాత భవనం సంవిధాన్ భవన్‌గా పేరు మార్చుకుని భవిష్యత్తు తరాలకు ఉత్తేజాన్నందిస్తూంటుందని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయనన్నట్టు దేశ ప్రజాతంత్ర యాత్రలో సామాన్య పౌరుల సంపూర్ణ విశ్వాసాన్ని చూరగొన్న చరిత్ర పార్లమెంటుది. ఇక్కడే వేలాది చట్టాలపై ఎడతెగని చర్చలు జరిగాయి. ఎన్నో కీలక నిర్ణయాలు రూపుదిద్దుకున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పక్షాల మధ్య వాగ్యుద్ధాలు చోటుచేసుకున్నాయి. రాజీలేని ధోరణిలో వాద ప్రతివాదాలు సాగాయి. ఎన్నెన్నో భావోద్వేగాలకు అది వేదికైంది. అదే సమయంలో కీలక సందర్భాల్లో బలమైన స్వరాన్ని వినిపించలేని దాని అశక్తత నిరంకుశ చట్టాలకు కూడా కారణమైంది. అది మౌనం వహించటంవల్ల పాలకపక్షం ఆత్యయిక స్థితి పేరిట దేశ ప్రజల గొంతు నొక్కటానికి అవకాశం ఏర్పడింది. తొలినాళ్లలో ఆరోగ్యకరమైన చర్చలకు చోటిచ్చిన సభే రాను రాను ఉత్త ఉపన్యాస వేదికగా, అప్పుడప్పుడు బలప్రదర్శన రంగస్థలిగా మారుతోంది. దేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో తమకూ భాగస్వామ్యం ఉన్నదని... తమ ఆశలూ, ఆకాంక్షలూ వ్యక్తమవుతున్నాయని సామాన్యులు భావించటానికి వీల్లేని స్థితిగతులు నెలకొంటున్నాయి. ఏ విధాన నిర్ణయంలోని మంచిచెడ్డలనైనా ఆరోగ్యకరమైన చర్చల ద్వారా నిగ్గుతేల్చాల్సి వుండగా చాలా నిర్ణయాలు అరుపులూ, కేకల మధ్య మూజువాణి ఓటుతో గట్టెక్కుతున్నాయి. అంతకన్నా దారుణం లక్షల కోట్ల రూపాయలు వ్యయం కాగల ఆర్థిక పద్దులు సైతం గిలెటిన్ అవుతున్నాయి. అవతలి పక్షాన్ని అవహేళన చేయటం, స్వోత్కర్షలకు పోవటం నిత్యకృత్యమైంది. ఇవన్నీ గమనిస్తే నూతన పార్లమెంటు భవనం సరికొత్త ఆశలకూ, విశ్వాసాలకూ అద్దం పడుతుందా అన్నది సందేహాస్పదమే. అది సాధ్యమేనని ప్రధాని తన ప్రసంగంలో బలంగా చెప్పారు. కానీ అధికార, విపక్షాల మధ్య అంతటి సామరస్యత ఏర్పడుతుందా? మన పార్లమెంటు నడతను నిర్దేశిస్తున్న నిబంధనలు సంతృప్తికరంగా లేకపోవటం కూడా సమస్యలకు దారితీస్తోంది. దేన్ని చర్చించాలి...ఏ రూపంలో చర్చించాలన్న అంశాలు తరచు వివాదాస్పదమవుతున్నాయి. సభాధ్యక్షులకుండే విచక్షణాయుత అధికారాలు ఇందుకు దోహదపడుతున్నాయి. గడిచిన కాలాన్ని బేరీజు వేసుకోకుండా, జరిగిన తప్పొప్పులను నిజాయితీగా సమీక్షించుకోకుండా సరికొత్త ప్రయాణం సులభం కాదు. అధికార, విపక్షాల మధ్య విభేదాలుండటం, అవి ఒక్కో సారి తీవ్ర రూపం దాల్చటం అసాధారణమేమీ కాదు. కానీ సమష్టిగా ఉండటానికి ముందుకు రావలసిన తరుణంలో సైతం పాక్షిక దృక్పథంతో వ్యవహరించే ధోరణి ప్రబలుతోంది. ఎదురు పడినప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించుకునే సంస్కృతి కూడా ఆవిరవుతోంది. ఇవన్నీ పార్ల మెంటుపై దేశ ప్రజలకుండే విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. మొన్నటికి మొన్న దేశం మొత్తం సిగ్గుతో తలవంచుకోవాల్సిన మణిపుర్ అకృత్యాలపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాలు రెండూ వ్యవహరించిన తీరు దిగ్భ్రాంతి కలిగించింది. దీన్ని తప్పించుకునే ధోరణిగా చూడాలా లేక ప్రజల మనోభావాలను అవగాహన చేసుకోవటంలోని అశక్తతగా పరిగణించాలా? సమాజంలో భిన్న వర్గాలున్నప్పుడూ, వాటికి భిన్న ప్రయోజనాలున్నప్పుడూ పార్లమెంటులో అవి ప్రతిబింబించటం వింతేమీ కాదు. నిజానికి అలాంటి వైరుధ్యాలకు సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనటమే ప్రజాతంత్ర సంస్థల లక్ష్యం. కానీ బలం ఉంది కదా అని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం, వాటి మంచిచెడ్డల విశ్లేషణకు అవకాశమీయకుండా అసమ్మతికి పాతరేయటం ఇటీవలి కాలంలో రివాజైంది. పార్లమెంటు సజావుగా సాగటానికి, అక్కడ ఆరోగ్యవంతమైన చర్చలు జరగటానికి ప్రస్తుత పాలక్ష పక్ష కూటమికి నేతృత్వం వహిస్తున్న పార్టీగా బీజేపీపై ఎక్కువ బాధ్యత ఉంటుంది. అధికార పక్షంనుంచి అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దాన్ని స్వాగతించి తమ వంతుగా సకారాత్మక దృక్పథాన్ని ప్రదర్శించటం విపక్షాల వంతు. స్వరూపం, సదుపాయాల కోణంలో మాత్రమేకాదు...స్వభావరీత్యా వర్తమాన ప్రగాఢ ఆకాంక్ష లకు కూడా నూతన పార్లమెంటు భవనం అద్దం పడుతుందన్న గ్రహింపు ఏర్పడినప్పుడు ఇరు పక్షాలూ విజ్ఞతతో మెలుగుతాయి. ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయంటే, ఒక బిల్లు విషయంలో, ఒక విధాన నిర్ణయం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయంటే దాన్ని కేవలం రాజకీయకోణంలో కాక, ప్రజానీకంలో ఏర్పడిన అభిప్రాయానికి ప్రతిబింబంగా చూడగలిగితే చాలా సమస్యలకు పరిష్కారాలు సాధ్యమవుతాయి. ప్రస్తుత పార్లమెంటు భవనం లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చొనటానికి అనువుగా ఉంది. సెంట్రల్ హాల్ లేకున్నా, ఉభయసభల ఉమ్మడి సమావేశాల సమయంలో 1,272 మంది కూర్చొనేందుకు లోక్‌సభలో అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కల్పించే బిల్లు రాజ్యసభలో మంగళవారం ప్రవేశించటం శుభపరిణామం. బిల్లు ఆమోదం పొంది చట్టమైనా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఇది అమల్లోకి వస్తుందనటం కొంత నిరాశ కలిగిస్తుంది. ఏదేమైనా కొత్త సభా భవనం సరికొత్త ఆచర ణకు, సమున్నత సంప్రదాయాలకు వేదిక కాగలదని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దాన్ని నెరవేర్చ వలసిన బాధ్యత శాసనకర్తలదే. -
మహిళా బిల్లును కాంగ్రెస్ పట్టించుకోలేదు: అమిత్ షా
Updates.. ► పాత పార్లమెంటుకు సంవిధాన్ సదన్‌గా నామకరణం. నోటిఫికేషన్ జారీచేసిన లోక్‌సభ సెక్రటరీ జనరల్ ►మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఏనాడు సీరియస్‌గా వ్యహరించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వజమెట్టారు. అందుకే విపక్షలు నారీశక్తి వందన్ బిల్లును జీర్ణించుకోలేకపోతున్నాయని దుయ్యబట్టారు. ఈ బిల్లులు మహిళలకు సాధికారికత కల్పించేందుకు మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేందన్నారు. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టడం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ►మహిళా సాధికారితకు మేం వ్యతిరేకం కాదు. ►చట్టాన్ని రూపొందించినట్లయ్యితే.. ఆ కోటాలో ఓబీసీ, ముస్లిం మహిళలు వాటా పొందడం ముఖ్యం. :: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ►మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వందకు వంద శాతం మద్దతు ఇస్తుంది. ►వెనుకబడిన వర్గాల మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించాం. ►2010లో మహిళా బిల్లు పెట్టినప్పుడు కూడా ఇదే డిమాండ్ వచ్చింది. ►బీసీలను అణగదొక్కాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయి. :: బీఆర్ఎస్ నేత కేకే మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతించిన వైఎస్సార్సీపీ ►మహిళా రిజర్వేషన్ బిల్లు కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం ►ఈ బిల్లు త్వరగా అమలు చేయాలని కోరుతున్నా ►సీఎం వైఎస్ జగన్ మహిళా పక్షపాతి ►రాష్ట్రంలో అన్ని పథకాలు మహిళల పేరు మీద అమలు చేస్తున్నారు ►ప్రజా ప్రతినిధుల్లో సైతం మహిళలకు పెద్దపీట వేశారు :::మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత రాజ్యసభలో ఖర్గే ప్రసంగం ►మహిళా రిజర్వేషన్ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది. ►ఈ మహిళా బిల్లులో ఓబీసీ, ఎస్సీ రిజర్వేషన్లు చేర్చాలి. ►మహిళా బిల్లుపై క్రెడిట్ మోదీ మాకు ఇవ్వదలుచుకోలేదు. ►మహిళా రిజర్వేషన్లలో మూడో వంతు వెనుబడిన కులాల మహిళలకు ఇవ్వాలని పట్టుబట్టారు. ►వెనకబడిన కులాల మహిళలకు పెద్దగా చదువు ఉండదు. ►అందుకే రాజకీయాల కోసం వెనబడిన కులాల మమహిళ తరపున వాళ్లు మాట్లాడారు. ►గట్టిగా పోరాటం చేసే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వాళ్లకు ఇష్టం లేదు. ►బలహీన వర్గాల మహిళలను బీజేపీ రాజకీయాల కోసం వాడుకుంటోంది. ►బీజేపీ పాలనలో దేశంలో ఫెడరల్ వ్యవస్థ బలహీనపడుతోంది. ►చాలా రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూలదోసింది. ►చాలా రాష్ట్రాలకు జీఎస్టీ నిధుల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. ఖర్గే ప్రసంగంపై రాజ్యసభలో రగడ ►ఖర్గే ప్రసంగానికి అడ్డు తగిలిన బీజేపీ సభ్యులు ►బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం ►గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది బీజేపీనే: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ►ఏ రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు పెండింగ్‌లో లేవు. ►బకాయిలు ఉన్నట్లు ఆధారాలుంటే చూపించడండని సవాల్ కొత్త పార్లమెంట్లో కొలువుదీరిన రాజ్యసభ ►ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది: ప్రధాని మోదీ ►పార్లమెంట్‌పై దేశ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ►ఎన్నో విప్లవాత్మక బిల్లులు తీసుకొచ్చాం ►లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి రామ్ మెగ్వాల్. ►చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు. ►బిల్లు కాపీలను తమకు ఎందుకివ్వలేదని విపక్షాల ఆందోళన ►డిజిటల్ ఫార్మాట్లో అప్లోడ్ చేశామన్న కేంద్రం ►విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా బిల్లు ►లోక్‌సభలో రేపు బిల్లు ఆమోదం పొందే అవకాశం ►ఎల్లుండి రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు ►మహిళా బిల్లు పేరు నారీశక్తి వందన్ ► మధ్యాహ్నం మూడు గంటలకు లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు. మహిళా బిల్లును ప్రవేశపెట్టనున్న న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్. ► కొత్త పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మా లక్ష్యం. భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చేలా మనం పనిచేయాలి. నెహ్రు చేతికి శోభనిచ్చిన సెంగోల్ నేడు సభలో కొలువుదీరింది. స్వాతంత్ర్య ఉద్యమంతో సెంగోల్‌ది కీలక పాత్ర. అమృతకాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. కొత్త సభలోకి ఎంపీలందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆజాదీ అమృత్ కాలంలో ఇది ఉషోదయ కాలం. వినాయక చతుర్థీ రోజు కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెట్టాం. ఆధునికతకు అద్దం పట్టడంతో పాటు చరిత్రను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్ భవనం. భవనం మారింది, భావనలు కూడా మారాలి. గత చేదు అనుభవాలను మరిచిపోవాలి. #WATCH | In the Lok Sabha of the new Parliament building, Prime Minister Narendra Modi says, "Samvatsari is also celebrated today, this is a wonderful tradition. Today is the day when we say 'micchami dukkadam', this gives us the chance to apologise to someone we have hurt… pic.twitter.com/ssbHT1Hdzf — ANI (@ANI) September 19, 2023 ►మహిళా బిల్లు 1996లో సభ ముందుకు వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముందడుగు వేయబోతున్నాం. ఈరోజు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది. నారీ శక్తి బిల్లుకు చట్టం చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను. మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీశక్తి వందన్ పేరు. ► భారత్ నేతృత్వంలో జీ20ని విజయవంతంగా నిర్వహించాం. మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు. ఆటల నుంచి అంతరిక్షం వరకు మహిళలు ముందంజలో ఉన్నారు. మహిళా కోటా చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. ► కొత్త పార్లమెంట్లో లోక్‌సభ ప్రారంభం. మధ్యాహ్నం 2.30 గంటలకు రాజ్యసభ ప్రారంభం కానుంది. ► కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభం. పేపర్‌లెస్‌గా కొత్త పార్లమెంట్ కార్యక్రమాలు. ఎంపీలకు సభా కార్యక్రమాల వివరాలు కనిపించేలా డిజిటల్ స్క్రీన్స్. #WATCH | Proceedings of the Lok Sabha begin in the New Parliament building. pic.twitter.com/LafXM9xUD9 — ANI (@ANI) September 19, 2023 ►కొత్త పార్లమెంట్ భవనానికి మారిన కార్యకలాపాలు #WATCH | Prime Minister Narendra Modi enters the New Parliament building. pic.twitter.com/ypAAxM0BBX — ANI (@ANI) September 19, 2023 ►పాత పార్లమెంట్ భవనం నుంచి ఎంపీల మార్చ్ ►పాత పార్లమెంట్ భవనంలో ప్రధాని ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో కొత్త పార్లమెంట్ భవనం సంవిధానం సదన్‌లోకి ఎంపీలు నడుచుకుంటూ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందు నడవగా మిగిలినవారు ఆయనను అనుసరించారు. #WATCH | Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, Union Ministers Piyush Goyal, Nitin Gadkari and other parliamentarians move out of the old Parliament building and proceed to the new building. pic.twitter.com/sLAeTEV5km — ANI (@ANI) September 19, 2023 ► పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు, పార్లమెంట్ సభ్యులకు గణేష్ చతుర్తి శుభాకాంక్షలు. కొత్త సంకల్పంతో కొత్త భవనంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ సందర్బంగా భారత తిరంగా యాత్ర గుర్తుకువస్తోంది. ఈ హాల్‌తో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో భావోద్వేగాలు. పార్లమెంట్ భవనం, సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. #WATCH | Special Session of Parliament | Prime Minister Narendra Modi says, "...Muslim mothers and sisters got justice because of this Parliament, law opposing 'triple talaq' was unitedly passed from here. In the last few years, Parliament has also passed laws giving justice to… pic.twitter.com/gnOY7JDtu3 — ANI (@ANI) September 19, 2023 లోక్‌సభ, రాజ్యసభ కలిసి 4వేల చట్టాలు చేశాయి. ఇక్కడే మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది. ఇక్కడే జాతీయ గీతం, జాతీయ పతాకం ఎంచుకున్నాం. 86 సార్లు సెంట్రల్ హాల్లో దేశ అధక్ష్యుల ప్రసంగం జరిగింది. 41 దేశాల అధినేతలు ఇక్కడి నుంచి ప్రసగించారు. ఇక్కడ చట్టాలు చేసి ముస్లిం మహిళలకు న్యాయం చేశాం. తలాక్‌పై నిర్ణయాలు తీసుకున్నాం. ట్రాన్స్జెండర్ల కోసం చట్టాలు చేశాం. ఆర్టికల్ 370ను రద్దు చేశాం. భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం. #WATCH | Special Session of Parliament | PM Narendra Modi says, "Today, we are going to have the beginning of a new future in the new Parliament building. Today, we are going to the new building with the determination to fulfil the resolve of a developed India." pic.twitter.com/FNuI8c4lzz — ANI (@ANI) September 19, 2023 ► ఇదే సరైన సమయం. ఇదే మార్గంలో ముందుకు వెళ్తే మన లక్ష్యాలన్నీ నెరవేరుతాయి. సరికొత్త లక్ష్యాలను సాధించేందుకు ముందుకెళ్తున్నాం. చిన్నా కాన్వాస్‌పై పెద్ద బొమ్మ గీయలేం. ఇకపై మనం పెద్ద కాన్వాస్‌ను ఉపయోగించాలి. మన ఆలోచనలు పెద్దగా ఉండాలి. ప్రపంచ స్థాయిలో అన్ని రంగాల్లో ఎదగాలి. భారత యూనివర్సిటీలు ప్రపంచ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే నూతన ఎడ్యుకేషన్ పాలసీని తీసుకువచ్చాం. ప్రపంచమంతా ఆత్మనిర్భర్ భారత్ గురించే చర్చిస్తోంది. చిన్న చిన్న విషయాలపై రాద్దాంతం చేయవద్దు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మనం ఉండాలి. మనకు 75 ఏళ్ల అనుభవం ఉంది. #WATCH | Special Session of Parliament | Prime Minister Narendra Modi says, "Every law made in the Parliament, every discussion held in the Parliament, and every signal given by the Parliament should encourage the Indian aspiration. This is our responsibility and the expectation… pic.twitter.com/edShzmevhY — ANI (@ANI) September 19, 2023 ► మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక సెంట్రల్ హాల్లో భారత పార్లమెంటు గొప్ప వారసత్వాన్ని స్మరించుకోవడానికి సమావేశమవడం ఆనందకరం. ఈ సెంట్రల్ హాల్లోనే రాజ్యాంగ సభ జరిగింది. 1946 నుండి 1949 వరకు కూర్చొని సభ జరిగింది. ఈరోజు మనం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్, అంబేద్కర్ అందించిన సేవలను వినమ్రంగా స్మరించుకుంటున్నాము. #WATCH | Special Session of Parliament: Leader of LoP in Rajya Sabha Mallikarjun Kharge says "We have all gathered here today the commemorate the rich legacy of the Parliament of India in this historic Central Hall. It is in this very Central Hall that the Constituent Assembly… pic.twitter.com/qURMbGuQHo — ANI (@ANI) September 19, 2023 ► అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అధిక నిరుద్యోగం రేటు పెరిగిపోయింది. ఇది దేశ అభివృద్ధి ఆటంకంగా మారనుంది. యువ జనాభా దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడేలా చేయడం చాలా అవసరం. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, మన తలసరి జీడీపీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది. ఈ ఆర్థిక వృద్ధి సవాలును ఎదుర్కోవడానికి ప్రభుత్వ విధానాలు, తక్కువ ద్రవ్యోల్బణానికి మార్గదర్శకత్వం, వడ్డీ రేట్లు తగ్గించడం, నిరుద్యోగాన్ని తగ్గించడం, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని ప్రోత్సహించడం అవసరం. కొనుగోలు శక్తిని పెంపొందించడం, డిమాండ్‌ను ప్రేరేపించడం, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాన్ని మెరుగుపరచడం అవసరం. #WATCH | Special Session of Parliament: Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury says "...High unemployment rates pose a significant hurdle to leveraging this demographic advantage...It is essential to enable India's youthful population to contribute substantially… pic.twitter.com/eaFzZseQ91 — ANI (@ANI) September 19, 2023 ► బీజేపీ ఎంపీ మేనకా గాంధీ మాట్లాడుతూ.. ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. ఈ చారిత్రాత్మక క్షణంలో నేను భాగమైనందుకు గర్వపడుతున్నాను. కొత్త పార్లమెంట్ భవనం కొత్త ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నాము. లోక్‌సభలో అత్యంత సీనియర్ పార్లమెంటేరియన్‌గా ఈ గౌరవనీయమైన అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించే బాధ్యత నాకు అప్పగించినందుకు ధన్యవాదాలు. నా రాజకీయ జీవితం ఎక్కువ కాలం పార్లమెంట్‌లోనే గడిపాను. నా రాజకీయ జీవితంలో నేను ఏడుగురు ప్రధాన మంత్రులతో పనిచేశాను. స్వతంత్ర సభ్యురాలిగా ఉండి.. చివరకు అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీలో చేరాను. ప్రతీ క్షణం ప్రజల కోసం పనిచేశాను. #WATCH | Special Session of Parliament: BJP MP Maneka Gandhi says "This is a historic day today and I am proud to be a part of this historic moment. We are going to a New Building and hopefully, this grand edifice will reflect the aspirations of a new Bharat. Today, I have been… pic.twitter.com/sqoQEEDomb — ANI (@ANI) September 19, 2023 ►పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రధాని ఊహించిన విధంగా అభివృద్ధి చెందిన దేశానికి మార్గం సుగమం చేస్తున్న కొత్త, అభివృద్ధి చెందుతున్న భారత్‌కు చిహ్నంగా ఉన్న కొత్త భవనం నుండి పార్లమెంటు ఉభయ సభల విధుల పట్ల నేను చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉన్నాను. ► పాత పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్లో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పార్లమెంట్‌లోని తమ అనుభవాలను చెప్పుకొచ్చారు. ► నేడు మహిళా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘవాల్ మహిళా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రేపు మహిళా బిల్లుపై సభలో చర్చించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈనెల 21న మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ► కొత్త పార్లమెంట్ ప్రారంభమైంది. ► నూతన పార్లమెంట్‌లోకి ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా ప్రవేశించారు. ► చివరగా పాత పార్లమెంట్లో సభ్యులకు అభివాదం చేసిన ప్రధాని మోదీ. #WATCH | Prime Minister Narendra Modi meets the members of Parliament at the Central Hall of the Old Parliament building. pic.twitter.com/6MzaosDQr9 — ANI (@ANI) September 19, 2023 ► పార్లమెంట్ సభ్యుల గ్రూప్ ఫొటో సందర్భంగా బీజేపీ ఎంపీ నరమరి అమిన్ నీరసంతో కూప్పకూలిపోయారు. అనంతరం, సభ్యులు సపర్యలు చేయడంతో లేచి కూల్చున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడ ఉంది. అనంతరం.. ఫొటో సెషల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. #WATCH | BJP MP Narhari Amin fainted during the group photo session of Parliamentarians. He has now recovered and is a part of the photo session. pic.twitter.com/goeqh9JxGN — ANI (@ANI) September 19, 2023 #WATCH | Special Session of Parliament | Members of Parliament gather for a joint photo session. The proceeding of the House will take place in the New Parliament Building from today. pic.twitter.com/7NZ58OmInm — ANI (@ANI) September 19, 2023 ► పార్లమెంట్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ.. #WATCH | Delhi: Prime Minister Narendra Modi arrives for the joint photo session ahead of today's Parliament Session. pic.twitter.com/dwLgLPSswE — ANI (@ANI) September 19, 2023 ►మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ వద్ద సోనియా గాంధీ స్పందించారు. ఈ సందర్బంగా ఈ బిల్లు తమదేనన్నారు. ఈ సమావేశాల్లో మహిళా బిల్లును పెట్టాలన్నారు. #WATCH | On the Women's Reservation Bill, Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says "It is ours, Apna Hai" pic.twitter.com/PLrkKs0wQo — ANI (@ANI) September 19, 2023 ► ఈరోజు మధ్యాహ్నం నుంచి కొత్త పార్లమెంట్లో సమావేశాలు జరుగుతాయి. ► మధ్యాహ్నం 1:15 గంటలకు కొత్త పార్లమెంట్లో లోక్‌సభ సమావేశం. ► మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశం. ► సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరుగనుంది. ►నేడు పాత పార్లమెంట్ భవనం ముందు ఫొటో సెషన్. గ్రూప్ ఫొటో దిగనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఎంపీలు. ►పేపర్ లెస్‌గా కొత్త పార్లమెంట్ కార్యక్రమాలు. ఎంపీలకు సభా కార్యక్రమాల వివరాలు కనిపించేలా డిజిటల్ స్క్రిన్స్ ఏర్పాటు. గెజిట్ విడుదల.. ► పార్లమెంట్ కొత్త భవనాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఇందులో కొత్తగా నిర్మించిన భవనమే ఇక నుంచి పార్లమెంట్ అని పేర్కొంది. New building of Parliament to be hereon designated as the Parliament House of India, Gazette notification issued. pic.twitter.com/AmV5InWCdG — ANI (@ANI) September 19, 2023 ► నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొత్త భవనంలోనే జరగనున్నాయి. ప్రత్యేక సమావేశాల సందర్బంగా ప్రధాని మోదీ.. నిన్న(సోమవారం) పాత పార్లమెంట్‌కు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. మరోవైపు.. సభ్యులు కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెడుతున్న వేళ.. కేంద్రం వినూత్నంగా ప్లాన్ చేసింది. ఎంపీలకు ప్రత్యేక కానుక.. ► ప్రత్యేక సమావేశాల సందర్భంగా పార్లమెంట్ సభ్యులు తొలిసారి నూతన భవనంలో అడుగుపెట్టనున్నారు. ఈ విశిష్ట సందర్భానికి గుర్తుగా పార్లమెంట్ సభ్యులకు కేంద్రం ప్రత్యేక కానుకలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. జనపనారతో రూపొందించిన బ్యాగులో భారత రాజ్యాంగ ప్రతి, పాత, కొత్త పార్లమెంటు భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం వారికి ఇవ్వనుంది. ఇక, ఆ బ్యాగులపై ఎంపీల పేర్లు రాసి ఉన్నాయి. ప్రధాని మోదీ సైతం పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్‌కు రాజ్యాంగ ప్రతిని తన వెంట తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానిని ఎంపీలు అనుసరించనున్నట్టు తెలుస్తోంది. A gift bag with a copy of the Indian Constitution, commemorative coins, postal tickets will be given to every MP as Parliament proceedings resume from the new building tomorrow#NewParliamentBuilding pic.twitter.com/dHEI03DjyP — ET NOW (@ETNOWlive) September 18, 2023 -
పార్లమెంట్ ‘ప్రత్యేక’ రహస్యం
ప్రత్యేకం అంటేనే సాధారణమైన దానికి భిన్నమైనది, వేరైనది అని నిఘంటవుల అర్థం. మాటలోనే ఉన్నట్టుగా ఈ నెల 18 నుంచి 22 దాకా జరగనున్న పార్లమెంట్ ఉభయసభల ప్రత్యేక సమావేశాలు అనేక రకాలుగా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాలు ముగిసి, 3 వారాలైన కాక ముందే ప్రభుత్వం మళ్ళీ ప్రత్యేక భేటీ ప్రకటన చేయడం ఒక ప్రత్యేకతైతే... హఠాత్తుగా ఈ భేటీ ఎందుకు జరుపుతున్నదీ అజెండా చెప్పకపోవడం మరో ప్రత్యేకత. ఉమ్మడి పౌరస్మృతి, ‘ఒకే దేశం – ఒకేసారి ఎన్నికల’ చట్టం, దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చడం, మహిళా రిజర్వేషన్లు... ఇలా పలు ఊహాగానాలు వినిపిస్తున్నా పాలకపక్షం నోరు మెదపక ప్రతిపక్షాలను ఊహల్లో, అనుమానాల్లో పెట్టడం మరింత ప్రత్యేకత. ఇది అన్యాయమని విపక్షాలు ఆక్రోశిస్తున్నాయి. ఆగస్ట్ 31నే ప్రత్యేక భేటీ ప్రకటన చేసిన ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష నేత తాజాగా లేఖ రాసినా, రాజకీయాలు చేస్తున్నారంటోంది. వెరసి ప్రత్యేక భేటీ దేనికనే ఉత్కంఠ పెరుగుతోంది. గతంలో 2019 ఆగస్ట్‌లో వర్షాకాల సమావేశాల్లో అజెండాలో లేకుండానే హఠాత్తుగా ఆర్టికల్ 370 రద్దును సభలో తెర మీదకు తెచ్చి, ప్రతిపక్షాల చేష్టలుడిగేలా చేసిన చరిత మోదీ సర్కార్‌ది. మరి ఈ సారి ఎలాంటి రాజకీయ గూగ్లీ విసిరి, వచ్చే 2024 ఎన్నికలకు కొత్త కథనంతో ముందుకు వస్తారన్నది ఆసక్తి రేపుతోంది. సహజంగానే విపక్షాల్లో ఆందోళన పెంచుతోంది. ప్రత్యేక సమావేశా లనే మాటే రాజ్యాంగ నిబంధనల్లో లేదు గనక, వాటి అజెండా ఏమిటన్నది ముందుగా చెప్పాలన్న రూలూ కనిపించదు. కానీ, గతంలో పార్లమెంట్ ప్రత్యేక భేటీని ప్రకటించినప్పుడల్లా ఆ రోజునే సమావేశాల అజెండానూ ప్రకటించడం ప్రభుత్వాలు పాటిస్తూ వస్తున్న సంప్రదాయం. ఇప్పుడు దాన్ని కూడా పాలకపక్షం తుంగలో తొక్కుతోందన్నది ప్రధాన ఆరోపణ. ఇలా జరగడం ఇదే తొలిసారని రాజ్యాంగ నిపుణులూ నిర్ధరించారు. అయితే, సమస్త పార్లమెంటరీ సంప్రదాయా లకూ తిలోదకాలిస్తున్న పాలకులు గద్దె మీదకు వస్తున్న కాలంలో విచారపడి ఉపయోగం లేదు. ప్రత్యేక సమావేశాల్ని నిర్వహించే అధికారం ప్రభుత్వానికి లేదని ఎవరూ అనలేరు, అనరు. కానీ, ప్రజాస్వామ్య దేశంలో అందుకు అనుసరిస్తున్న విధానం మీదే రచ్చ. నిజానికి, నిర్ణీత తేదీల్లోనే పార్లమెంట్ సమావేశం కావాలంటూ మన దేశంలో కచ్చితమైన పార్లమెంటరీ క్యాలెండరంటూ ఏమీ లేదు. ఏటా 12 నెలల వ్యవధిలో కనీసం రెండుసార్లు పార్లమెంట్ భేటీ కావాలి. జనవరి చివర్నించి మే వరకు బడ్జెట్ సమావేశాలు, జూలై నుంచి ఆగస్ట్ దాకా వర్షాకాల భేటీ, నవంబర్ – డిసెంబర్లలో శీతకాల సమావేశాలంటూ ఏటా 3 సమావేశాలన్నది చిరకాల సంప్రదాయం. అయితే, తొలి రెండు దశాబ్దాల పార్లమెంట్ చరిత్రలో లోక్‌సభ ఏటా సగటున 120 రోజుల పైచిలుకు సమావేశమైతే, గత దశాబ్ద కాలంలో అది 70 రోజులకు పడిపోవడం విషాదం. సాధారణ సమావేశాల సంగతే అలా ఉంటే, అసాధారణ భేటీతో ఒరిగేదేంటో చెప్పలేం. ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ సభ్యుల చర్చ లాంటివి లేని ఈ భేటీ మే 28న మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనంలో జరగనుందట. చారిత్రక సంఘటనలు, మైలురాళ్ళ జ్ఞాపకార్థం భారత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగడం కొత్తేమీ కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడూ, ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమ స్వర్ణోత్సవం (1992), భారత స్వాతంత్య్ర రజతోత్సవం (1972), స్వర్ణోత్సవం (1997) వేళ అర్ధ రాత్రి భేటీలు జరిగాయి. ఒక చట్టం చేయడానికంటూ ప్రత్యేక సమావేశం జరిగింది మాత్రం 2017 లోనే! అదీ మోదీ హయాంలోనే! నాటి సర్కార్ ఉభయ సభల అర్ధరాత్రి భేటీలో జీఎస్టీ తెచ్చింది. మళ్ళీ ఇప్పుడు అజెండా వెల్లడించకుండా బుల్డోజర్ ధోరణిలో పార్లమెంట్ ప్రత్యేక భేటీ జరపాల నుకోవడమే రచ్చకు దారి తీస్తోంది. అజెండాను ప్రతిపక్షాలకు చెప్పడం ప్రోటోకాలన్నది పక్కన పెడితే, చివరకు అధికారపక్ష నేతలకూ అజెండా అస్పష్టం, దేవరహస్యంగానే మిగలడం విడ్డూరం. ప్రజాస్వామ్యంలో పాలకులు సర్వంసహా చక్రవర్తులు కాదని గుర్తించాలి. అలా ప్రవర్తించడాన్ని ప్రజలూ హర్షించరని గ్రహించాలి. అదే సమయంలో ‘వీటిపై చర్చించండి’ అంటూ నిన్న గాక మొన్న వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించిన అంశాలపైనే లేఖలో రాయడమూ కాంగ్రెస్ తదితర విపక్షాల మేధాశూన్యతకు అద్దం పడుతోంది. ప్రభుత్వం ఎలాంటి అంశాన్ని తెరపైకి తెచ్చినా, దాన్ని సమర్థంగా చర్చించగల సన్నద్ధత లేకుంటే అది ప్రతిపక్షాల అసమర్థతే. మొన్నటి అవిశ్వాస తీర్మానంపై చర్చలోనూ విపక్షాల్లో ఆ బలహీనత బయటపడిందన్నది నిష్ఠురసత్యం. అయితే, శాసన నిర్మాణంలో అధికార, విపక్షాలు సమన్వయంతో సాగితేనే ప్రజాస్వామ్య రథం సజావుగా సాగుతుంది. ఒకరిపై మరొకరు అపనమ్మకంతో, అన్నిటికీ అనుమానంతో ఉంటే అది ఎన్నటికీ ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. ఆ వాస్తవాన్ని ఇరుపక్షాలూ గౌరవించాలి. ఇప్పటికే ప్రస్తుత 17వ లోక్‌సభ చరిత్రలో మునుపెన్నడూ లేనట్టు అతి తక్కువ రోజులు సమావేశమై, అధిక భాగం వాయిదాలకే పరిమితమైన అపకీర్తిని మూటగట్టుకుంది. ఈ ప్రత్యేక సమావేశాలు అయినా అందుకు మినహాయింపు కావాలని ఆశిద్దాం. అత్యాశ అనుకున్నా అది అభిలషణీయమే. అదే జరిగితే ఇవి అక్షరాలా ‘ప్రత్యేక సమావేశాలు’గా గుర్తుండిపోతాయి. అయితే అందుకు రహస్య అజెండాలు, దాపరికాలు మాత్రం ఉపకరించవు. ఈ లోక్‌సభకు ఇవే ఆఖరి సమావేశాలు కావచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ... కనీసం ఇప్పుడైనా అధికార, విపక్షాల్లో ఉన్న పార్టీలు ఆపాటి హుందాతనం చూపుతాయా అన్నది ప్రధానమైన పశ్న. -
మహిళా బిల్లు కోసం ఒత్తిడి తేవాలి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంటు లో ప్రాతినిధ్యం కలిగిన 47 రాజకీయ పార్టీల అ«ధ్యక్షులతో పాటు దేశంలోని ఇతర పార్టీల నేతలకు కవిత మంగళవారం లేఖ రాశారు. రాజకీయాలకతీతంగా మహిళా బిల్లు కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి ఆమోదించేలా చొరవ తీసుకోవాలని కోరారు. దేశ జనాభాలో మహిళలు 50% ఉన్నా చట్టసభల్లో మాత్రం సరైన ప్రాతినిధ్యం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో ఇప్పటికే దాదాపు 14 లక్షల మంది మహిళలు క్రియాశీలక ప్రజా జీవితంలో ఉన్నారని గుర్తుచేశారు. లింగ సమానత్వం కోసం చారిత్రక నిర్ణయం తీసుకోవాలని రాజకీయ పార్టీలకు ఆమె పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు లేఖలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎంలు వైఎస్ జగన్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, నితీశ్‌కుమార్, నవీన్ పట్నాయక్, హేమంత్ సోరెన్, ఏక్నాథ్ షిండేతో పాటు మాయావతి, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్, సీతారాం ఏచూరి, చంద్రబాబు, వైఎస్ షర్మిల, చంద్రశేఖర్ ఆజాద్, పవన్ కల్యాణ్, లాలూ ప్రసాద్ యాదవ్, అర్వింద్ దేవే గౌడ, ప్రకాశ్ అంబేడ్కర్‌కు కవిత లేఖలు రాశారు. -
ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏ ఏ బిల్లులు ప్రవేశపెడతారు?
-
నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష కాంగ్రెస్ దృష్టి పెట్టింది. కాంంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18 నుంచి ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీలో చర్చిస్తారు. స్వల్ప జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఇంటికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు సమాచారం. విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే త్వరలో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. -
ప్రశ్నోత్తరాలు లేకుండానే పార్లమెంటు ప్రత్యేక భేటీ
న్యూఢిల్లీ: ఈ నెల ద్వితీయార్థంలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మరెన్నో రకాలుగా కూడా ప్రత్యేకంగా నిలవనున్నాయి. సెపె్టంబర్ 18–22 మధ్య ఐదు రోజుల పాటు వాటిని నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషీ గురువారం ప్రకటించడం తెలిసిందే. ఉభయ సభల్లో సాధారణంగా ఉదయాన్నే చేపట్టే ప్రశ్నోత్తరాలు ఈ సమావేశాల్లో ఉండబోవు. అలాగే ప్రైవేట్ సభ్యుల బిల్లులు ప్రవేశ పెట్టేందుకు కూడా అవకాశం ఇవ్వబోరు. రాజ్యసభ, లోక్‌సభ సచివాలయాలు శనివారం ఈ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ‘17వ లోక్‌సభ 13వ సమావేశాలు సెపె్టంబర్ 18 సోమవారం మొదలవుతాయి. ఉభయ సభలు సభ్యులకు ఈ మేరకు సమాచారం ఇవ్వడం జరిగింది‘ అని లోక్‌సభ సచివాలయం; ‘రాజ్యసభ 261వ సమావేశాలు మొదలవుతాయి‘ అని రాజ్యసభ సచివాలయం వేర్వేరు బులెటిన్లలో పేర్కొన్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల అజెండాను కేంద్రం ఇప్పటిదాకా గోప్యంగా ఉంచడం తెలిసిందే. ప్రత్యేక భేటీ కొత్త భవనంలో...? పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రస్తుత లోక్‌సభకు చివరివి అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. భేటీ అనంతరం ఉభయ సభలు సభ్యులకు ప్రత్యేక గ్రూప్ ఫోటో సెషన్‌కు ఏర్పాట్లు జరుగుతుండటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అయితే ఈ సమావేశాలు కొత్త భవనంలో జరిగే అవకాశముందని కూడా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇవి కొత్త భవనంలో జరిగే తొలి సమావేశాలు గనుక ఫోటో సెషన్ ఏర్పాటు చేస్తుండవచ్చని కూడా కొందరు అంటున్నారు. అత్యాధునిక రీతిలో సర్వ హంగులతో రికార్డు సమయంలో నిర్మితమైన పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గత మే 28న ప్రారంభించడం తెలిసిందే. ప్రత్యేక సమావేశాలు ఇలా... ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మొత్తం ఐదు సెషన్లు ఉంటాయి. సమావేశాలకు సంబంధించిన ప్రోవిజనల్ కేలండర్‌ను ఎంపీలకు విడిగా తెలియజేస్తారు. -
అరుదైన దృశ్యం.. విపక్షాల హామీతో సభలోకి స్పీకర్ అడుగు
న్యూఢిల్లీ: లోక్‌సభలో మరో అరుదైన, ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. హుందాగా నడుచుకుంటామని పలువురు విపక్ష సభ్యులు హామీ ఇవ్వడంతో స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం సభలో అడుగుపెట్టి కార్యకలాపాలను నడిపించారు. సభా కార్యకలాపాలకు సభ్యులు పదేపదే అడ్డుకుంటుండటం పట్ల మంగళవారం ఆయన తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చడం, వారి ప్రవర్తనకు హుందాగా లేదంటూ ఆక్షేపించడం, ఇక సభకు రాబోనని ప్రకటించడం తెలిసిందే. ఆ మేరకు బుధవారమంతా స్పీకర్ లోక్‌సభకు దూరంగా ఉన్నారు. గురువారం ఉదయం కూడా ప్రశ్నోత్తరాలయ్యే దాకా సభకు రాలేదు. దాంతో, ‘స్పీకర్ సభకు రావాలన్నది విపక్ష సభ్యులందరి కోరిక. ఆయన్ను సభ మొత్తం ఇష్టపడుతుంది’’ అని అదీర్ రంజన్ చౌధరి (కాంగ్రెస్) అన్నారు. ‘‘ఎన్ని భేదాభిప్రాయాలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. స్పీకర్ మన నాయకుడు’’ అని చెప్పారు. అనంతరం అదీర్ నేతృత్వంలో విపక్ష నేతలు సౌగాథా రాయ్ (తృణమూల్), కనిమొళి (డీఎంకే), సుప్రియా సులే (ఎన్సీపీ) తదితరులతో పాటు మంత్రి గడ్కరీ సైతం బిర్లా చాంబర్‌కు వెళ్లి సభకు రావాల్సిందిగా కోరారు. జీఎన్సీటీడీ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదిస్తుండగా ఆప్ ఎంపీ సుశీల్ రింకూ వెల్‌లోకి దూసుకొచ్చి కాగితాలు చించి స్పీకర్కేసి విసిరారు. దాంతో సమావేశాలు పూర్తయ్యేదాకా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. చదవండి: parliament session: డేటా దుర్వినియోగం చేస్తే రూ.250 కోట్ల జరిమానా -
రాజ్యసభలో నవ్వులు పూయించిన ఖర్గే-చైర్మన్లు..
మణిపూర్ అంశంపై పార్లమెంట్లో విపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. నిరంతరం ఆందోళనలు, నినాదాలు, నిరసనలతో ఉభయ సభలను స్తంభింపచేస్తున్నారు. మణిపూర్ సమస్యపై చర్చించాలంటూ పార్లమెంట్లో ప్రతిపక్షాల డిమాండ్‌తో పది రోజులుగా సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలుగుతూనే ఉంది. తాజాగా తాను ఎవరిని సమర్ధించాల్సిన అవసరం లేదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ స్పష్టం చేశారు. తను కేవలం రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందంటూ వ్యాఖ్యానించారు. అయితే మణిపూర్ విషయంలో చైర్మన్ ప్రధాని మోదీని సమర్థిస్తున్నారంటూ బుధవారం ఏఐసీసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రతిపక్ష నేత వ్యాఖ్యల నేపథ్యంలో జగదీప్ ధన్‌ఖడ్ ఈ విధంగా గురువారం బదులిచ్చారు. కాగా మణిపూర్ హింసపై రూల్ 267 కింద సభలో చర్చ చేపట్టాలంటూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. అయితే వాటిని తిరస్కరిస్తూ..మణిపూర్ వ్యవహారంపై రూల్ 176 కింద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసపై మోదీ ఎందుకు నోరువిప్పడం లేదని ఖర్గే నిలదీశారు. దీనిపై స్పందించిన ధన్‌ఖడ్.. ప్రధాని రావాలనుకుంటే రావొచ్చని, రావాలంటూ ఆదేశించలేనని తేల్చిచెప్పారు. అయితే రాజ్యసభ చైర్మన్ ప్రధాని మోదీని సమర్ధిస్తున్నారంటూ ఖర్గే విమర్శించారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ గురువారం మాట్లాడుతూ.. ‘మనది 1.3 బిలియన్లకు పైగా జనాభా ఉన్న ప్రజాస్వామ్య దేశమని అందరూ గుర్తించాలి. ప్రధానమంత్రిని నేను సమర్థించాల్సిన అవసరం లేదు. ప్రపంచ వేదికలపై ఆయనకు గుర్తింపు వచ్చింది. నేను ఎవరినీ రక్షించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, మీ హక్కులను రక్షించడమే నా కర్తవ్యం. ప్రతిపక్ష నేత నుంచి ఇలాంటి మాటలు రావడం సరి కాదు’ అని జగదీప్ ధన్ఖర్ అన్నారు. చదవండి: పార్లమెంట్ అంతరాయాలు.. మధ్యే మార్గం ద్వారా పరిష్కారం? ధన్‌ఖడ్, ఖర్గే మధ్య సరదా సంభాషణ మణిపూర్ హింసతో పార్లమెంట్ అట్టుడుకుతుండగా.. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇద్దరి మాటలతో సభలో కాసేపు నవ్వులు విరిశాయి. మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో గురువారం మాట్లాడుతూ, రూల్ 267కు ప్రాధాన్యం ఇస్తూ మణిపూర్ సమస్యపై చర్చను చేపట్టాలని, ఇతర సభా కార్యకలాపాలను వాయిదా వేయాలని కోరారు. ‘‘ఈ డిమాండ్‌ను అంగీకరించాలంటే, ఏదో ఓ కారణం ఉండాలని మీరు చెప్పారు. నేను మీకు కారణాన్ని చూపించాను. నిన్న (బుధవారం) కూడా ఇదే విషయంపై విజ్ఞప్తి చేశాను. . కానీ బహుశా మీరు కోపంగా ఉండి ఉంటారు’’ అని అన్నారు. "मैं 45 साल से शादीशुदा आदमी हूं, इसलिए मैं गुस्सा नहीं करता हूं" ◆ मल्लिकार्जुन खड़गे से बोले सभापति जगदीप धनखड़, राज्यसभा में लगे हंसी के ठहाके@kharge | #MallikarjunKharge | Jagdeep Dhankhar | #JagdeepDhankhar pic.twitter.com/8o39PY69p9 — Amit Singh 🇮🇳 (@KR_AMIT007) August 3, 2023 ఖర్గే మాటలపై ధన్కర్ స్పందిస్తూ.. నాకు పెళ్లై 45 ఏళ్లు దాటింది. నాకు ఎప్పుడూ కోపం రాదు. నమ్మండి అంటూ సరాదాగా పేర్కొన్నారు. తో సభ్యులంతా గొల్లుమని నవ్వారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరాన్ని ఉద్ధేశిస్తూ.. ‘ చిదంబరం గొప్ప సీనియర్ అడ్వకేట్ అనే విషయం మన అందరికీ తెలుసు. ఓ సీనియర్ అడ్వకేట్‌గా(స్వతహాగా ధన్‌ఖడ్ సైతం న్యాయవాదియే) కోపం ప్రదర్శించే అధికారం మనకు లేదు. మీరొక అధికారి(ఖర్గేను ఉద్ధేశిస్తూ), ఈ స్టేట్మెంట్ను దయచేసి సవరించండి’’ అని కోరారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ, ‘‘మీకు కోపం రాదు, మీరు కోపాన్ని ప్రదర్శించరు, కానీ లోలోపల కోపంగా ఉంటారు’’ అన్నారు. దీంతో సభ్యులు మరోసారి నవ్వుకున్నారు. ఖర్గే కొనసాగిస్తూ.. రూల్ 267 ప్రకారం మణిపూర్‌పై చర్చించాలని పట్టుబట్టారు. ‘ఈ రూల్ ప్రకారం చర్చ జరపడానికి ఎలాంటి కారణం లేదని చైర్మన్ చెబుతున్నారు. కానీ మణిపూర్ అంశం ప్రతిష్టాత్మక సమస్యగా మారింది. మేము దీనిని రోజూ లేవనెత్తుతున్నాము. కానీ వారు దీనిని వ్యతిరేకిస్తున్నారు’ మండిపడ్డారు. చదవండి: హర్యానా ఘర్షణలు.. ప్రాణాలతో బయటపడ్డ మహిళా జడ్జి, మూడేళ్ల చిన్నారి -
మీ మాటలకు చేతలకూ పొంతన లేదు: మోదీ, షాలపై ఖర్గే విమర్శలు
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంతో గత అయిదు రోజులుగా పార్లమెంట్ సమావేశాలు స్తంభిస్తున్న విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, హింసపై చర్చించాలని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా పట్టుబడుతున్నాయి. దీనిపై చర్చకు సిద్ధమేనని కేంద్రం చెబుతున్నా.. ప్రధానమంత్రి మోదీ సమగ్ర ప్రకటన చేయాలని విపక్షాలు మొండిగా ప్రవర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని సైతం ప్రవేశ పెట్టాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ తమను బ్రిటీషర్లతో, ఉగ్రవాద సంస్థతో పోలిస్తే.. ఇటు అమిత్ షా ప్రతిపక్ష పార్టీల నుంచి సహకారం కోరుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య చాలా కాలం నుంచి దూరం ఉందని, అయితే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా దూరం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు దశ, దిశ లేదని మోదీ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం మాట్లాడే మాటలకు, చర్యలకు పొంతన ఉండటం లేదని విమర్శించారు. చదవండి: మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే! सरकार मणिपुर पर विस्तार से चर्चा के लिये तैयार है लेकिन विपक्ष न जवाब सुनना चाहता है और न किसी प्रकार की चर्चा करना चाहता है। pic.twitter.com/ukmcruMHcA — Amit Shah (@AmitShah) July 25, 2023 మణిపూర్ ఘటనపై చర్చించడంపై విపక్షాలకు అమిత్ షా రాసిన లేఖపై మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ..‘అమిత్‌షా లేఖకు, ప్రభుత్వ వైఖరికి పూర్తి విరూద్ధంగా ఉంది. అందులోని పదాలకు, మీ చేతలకు ఎంతో తేడా ఉంది. పార్లమెంట్లో ప్రభుత్వం వైఖరి ఏకపక్షంగా, నియంతృత్వంగా ఉంది. మీ నుంచి ఈ వైఖరి కొత్తమీ కాదు. గత కొన్ని సెషన్స్ నుంచి మీ వైఖరి ఈ విధంగానే కనిపిస్తోంది. మేము మణిపూర్ సమస్యపై మోదీ లోక్‌సభకు వచ్చి ప్రకటన చేయాలని కోరుతున్నాం. దీనిపై కూలంకషంగా చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. దేశ ప్రజలపై మాకు నిబద్ధత ఉంది. అందుకు ఎంతకైనా తెగిస్తాం’ అని పేర్కొన్నారు. కాగా మణిపూర్‌లో మే 3న రెండు వర్గాల వైరంతో మొదలైన హింసాకాండ ఇంకా చల్లారడం లేదు. 84 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై జరిగిన ఆకృత్యానికి సంబంధించిన వీడియో ఇటీవల వెలుగులోకి రావడంతో దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. చదవండి: హృదయ విదారకం.. చికాగో రోడ్లపై దీనస్థితిలో హైదరాబాద్ మహిళ -
మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే!
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వేర్వేరుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌పై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. దీనిపై అన్ని పార్టీలతో చర్చించి.. చర్చ తేదీని ప్రకటిస్తానని స్పీకర్ వెల్లడించారు. కాగా ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వం లోక్‌సభలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. సభలో ఎన్డీయే కూటమి తమ మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెజార్టీ కోల్పోతే ప్రధానితో సహా, కేబినెట్ మొత్తం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం దిగిపోవాల్సి వస్తుంది. చదవండి: విపక్షాలు ఆందోళనలతో దద్దరిల్లిన పార్లమెంట్.. లోక్‌సభ వాయిదా వీగిపోతుందని తెలిసినా.. అయితే ప్రతిపక్ష పార్టీల అవిశ్వాస తీర్మానం బల పరీక్షలో విఫలమయ్యే అవకాశం ఉంది. అవిశ్వాసం వీగిపోతుందని తెలిసినప్పటికీ ప్రతిపక్ష కూటమి దీనిని ప్రయోగిస్తుంది. అవిశ్వాస తీర్మానం ద్వారా పార్లమెంట్లో మణిపూర్ అంశంపై తప్పక ప్రధాని మోదీ మాట్లాడటంతోపాటు.. తమకు పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనే యోచనతో విపక్ష కూటమి ఈ అడుగువేసింది. ఎవరి బలం ఎంత? లోక్‌సభలో ఎన్డీయే కూటమి 331 ఎంపీల బలం ఉంది. బీజేపీకి సొంతంగానే 303 మంది ఎంపీలు ఉన్నారు. విపక్షాల ఇండియా కూటమి బలం 144, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేడీకి కలిపి 70 మంది ఎంపీల బలం ఉంది. అయితే లోక్‌సభలో 64 మంది తటస్థ ఎంపీలు ఉండగా.. ఆరు ఎంపీ స్థానాలు ఖాళీ ఉన్నాయి. కాగా లోక్‌సభలో మెజారిటీ మార్కు 272. ఎన్డీయే కూటమికి అనుకూలంగా 273 మంది ఎంపీల మద్దతు తెలిపితే.. అవిశ్వాస తీర్మానం ఈజీగా వీగిపోతుంది. ► లోక్‌సభలో మొత్తం సీట్లు : 543 ►ఖాళీగా ఉన్న స్థానాలు: 6 ► ప్రస్తుత లోక్ సభలో ఉన్న సభ్యులు: 537 ►ఎన్డీయే కూటమిబలం : 331 (లోక్ సభ స్పీకర్ తో కలిపి) ►బీజేపీ – 301, శివసేన 13, ఆర్ఎల్ జేపీ – 5, ఏడీపీ – 2, రాంవిలాస్ పార్టీ – 1, అజిత్ పవార్ కూటమి – 1, ఏజేఎస్ యూ – 1, ఎన్డీపీపీ – 1, ఎపీఎఫ్ – 1, ఎపీపీ – 1, ఎస్కేఎం – 1, ఎంఎన్ఎఫ్ – 1, స్వతంత్రులు(సుమలత, నవనీత్ కౌర్) – 2 ►విపక్ష ఇండియా కూటమి బలం – 142 ఎంపీలు ►కాంగ్రెస్ – 50, డీఎంకే – 24, టీఎంసీ – 23, జేడీయూ – 16, శివసేన (ఉద్దవ్ థాక్రే) – 6, శరద్ పవార్ – 4, ఎస్పీ – 3, సీపీఎం – 3, సీపీఐ – 2, ఆప్ – 1, జేఎంఎం – 1, ఆర్ఎస్పీ – 1, వీసీకే – 1, కేరళ కాంగ్రెస్ (మని) – 1 తటస్థ పార్టీల బలం : 31 ►వైఎస్సార్సీపీ-22, బీఆర్ఎస్-9, ఎంఐఎం-2, బీజేడీ – 12, బీఎస్పీ – 9, టీడీపీ – 3, ఎస్ఏడీ – 2, జేడీఎస్ 1, ఆర్ఎల్పీ 1, ఏఐయూడీఎఫ్ 1, శిరోమణి అకాలీదళ్ – 1, ఇండిపెండెంట్ – 1 -
జూలై మూడో వారంలో పార్లమెంట్ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. జూలై 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరుగునున్నాయి. కాగా, కొత్త పార్లమెంట్ భవనంలోనే మాన్సూన్ సెషన్ జరుగనుంది. ఇక, శీతాకాల సమావేశాలు జూలై 17 నుంచి ఆగస్టు 10 వరకు జరుగునున్నాయి. శీతాకాల సమావేశాల్లో భాగంగా ఢిల్లీ పరిపాలనాధికారాల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. అలాగే, ఉమ్మడి పౌరస్మృతిపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. సాధారణ ఎన్నికలకు ముందు ఇవే చివరి వర్షాకాల సమావేశాలు కానున్నాయి. ఇది కూడా చదవండి: వీడియో: అక్కడ కాంగ్రెస్ దూకుడు.. ప్చ్.. బీజేపీ వెనుకంజ! -
సభలు నడవాలని బీజేపీకి లేదు
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సాగాలనే ఉద్దేశం మోదీ సర్కారుకు లేనే లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందుకే ప్రతిష్టంభనను తొలగించేందుకు విపక్షాలతో రాజీ ప్రయత్నాలేవీ చేయడం లేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు. దాంతో చరిత్రలోనే తొలిసారిగా బడ్జెట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తోందన్నారు. కీలకమైన బిల్లులను ఎలాంటి చర్చా లేకుండానే ప్రభుత్వం ఆమోదముద్ర వేయించుకుంటోందని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం స్టాండింగ్ కమిటీలకు పంపాల్సిన బిల్లులను వ్యతిరేకత భయంతో తమ పార్టీ నేతల సారథ్యంలోని సెలెక్ట్ కమిటీలకు పంపుకుంటోందని ఆరోపించారు. మార్చి 13న మొదలైన రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఒక్క రోజు కూడా ఉభయ సభలు సజావుగా జరగని విషయం తెలిసిందే. అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం విచారణకు విపక్షాలు, భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణకు అధికార బీజేపీ పట్టుబడుతుండటంతో రోజూ వాయిదాల పర్వమే కొనసాగుతోంది. -
పార్లమెంటులో అదే సీను
న్యూఢిల్లీ: అదే గందరగోళం. అవే సీన్లు. అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు ఎవరి పట్టు మీద వారు బెట్టుగా నిలిచారు. దాంతో పార్లమెంటులో వారం రోజులుగా కన్పిస్తున్న దృశ్యాలే రిపీటయ్యాయి. ఇరు పక్షాల డిమాండ్లు, హోరాహోరీ నినాదాలు, గందరగోళం మధ్య కార్యకలాపాలేవీ జరపకుండానే ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. అలా మార్చి 13న మొదలైన మలి విడత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా ఆరో రోజూ పూర్తిగా వృథా అయింది. సోమవారం ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలను అధికార బీజేపీ సభ్యులు మరోసారి లేవనెత్తారు. ఆయన క్షమాపణలకు డిమాండ్ చేశారు. ప్రతిగా అదానీ గ్రూప్ అవకతవకల అంశాన్ని కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు తెరపైకి తెచ్చారు. తాము డిమాండ్ చేస్తున్న మేరకు దానిపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో విచారణ జరిపించి తీరాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టారు. ఇరు పక్షాలూ పెద్దపెట్టున నినాదాలు మొదలుపెట్టాయి. ఉభయ పక్షాలూ తన చాంబర్‌కు వస్తే చర్చించుకుని పరిష్కారానికి వద్దామని స్పీకర్ ఓం బిర్లా పదేపదే సూచించినా లాభం లేకపోయింది. దాంతో సభను మధ్యాహ్నం రెండింటి దాకా వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక కొన్ని బిల్లులను ప్రవేశపెట్టగానే ఇరువైపుల నుంచి తిరిగి నినాదాలు, గందరగోళం మొదలయ్యాయి. దాంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ... అటు రాజ్యసభలోనూ దాదాపుగా ఇదే దృశ్యాలు కన్పించాయి. సభ ప్రారంభమవుతూనే ఇరు పక్షాలూ నినాదాలకు దిగాయి. వాటి మధ్యే చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ మాట్లాడారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయడంలో ప్రభుత్వ వైఫల్యంపై చర్చించాలంటూ 267(9) నిబంధన కింద కాంగ్రెస్ సభ్యులు నోటీసు అందజేసినట్టు పేర్కొన్నారు. దాని ప్రకారం ముందుగా నిర్ణయించిన కార్యకలాపాలను పక్కన పెట్టి నోటీసు అంశాన్ని చర్చకు చేపట్టాల్సి ఉంటుంది. అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణకు సీపీఐ, సీపీఎం సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాల హోరు, గందరగోళం అంతకంతకూ పెరిగిపోవడంతో సభ మధ్యాహ్నం రెండింటిదాకా, అనంతరమూ అదే పరిస్థితి కొనసాగడంతో మంగళవారానికి వాయిదా పడింది. నా వ్యాఖ్యలపై లోక్‌సభలో మాట్లాడతా స్పీకర్‌కు రాహుల్ లేఖ ‘‘భారత ప్రజాస్వామ్యం గురించి బ్రిటన్‌లో నేను చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో స్పష్టత ఇస్తా. నేను మాట్లాడేందుకు అనుమతించండి’’ అంటూ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ లేఖ రాశారు. దీనిపై ఆయన ఇప్పటిదాకా బహిరంగంగా స్పందించలేదు. మంగళవారం మాట్లాడేందుకు రాహుల్‌కు అవకాశమివ్వాలని కోరినట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ‘‘మేమేం మాట్లాడబోయినా మైకులు కట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని లండన్‌లో చెప్పినందుకు లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నాచారు’’ అని మండిపడ్డారు. రాహుల్ నివాసానికి పోలీసులు వెళ్లడాన్ని తప్పుబట్టారు. పార్లమెంట్లో తాము లేవనెత్తుతన్న అదానీ, చైనా చొరబాటు వంటి కీలకాంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలా చేస్తోందన్నారు. కేసులకు బెదరను వయనాడ్ (కేరళ): పోలీసు కేసులు, రాజకీయ దాడులతో తనను భయపెట్టలేరని రాహుల్‌గాంధీ అన్నారు. ‘‘సత్యంపై నాకు విశ్వాసముంది. ఎప్పుడూ దానికే కట్టుబడి ఉన్నా. నాపై ఎంతగా దాడి చేసినా పట్టించుకోను. దాంతో, నేనెందుకు భయపడటం లేదా అన్నదే వారికిప్పుడు పెద్ద సమస్యగా మారింది’’ అని బీజేపీపై చెణుకులు విసిరారు. -
జెండాలో ఆ రంగును తీసేస్తారా?: మోదీపై నిప్పులు చెరిగిన ఒవైసీ
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో బుధవారం కూడా అదానీకి సంబంధించిన హిండెన్‌బర్గ్ నివేదికపై రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. కాగా, ఉభయ సభల్లో కేంద్ర మంత్రులు కౌంటర్‌కు దిగారు. కాంగ్రెస్ నేతలు హిండెన్‌బర్గ్ విషయం ప్రస్తావించగా.. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ బోఫోర్స్ అంశాన్ని లేవనెత్తారు. అటు రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పీయూష్ గోయల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఖర్గే ఆరోపణలకు కేంద్ర మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేశ భద్రత విషయంలో రాజీలేదని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖర్గే మాట్లాడుతూ.. నేను నిజం మాట్లాడితే అది దేశ వ్యతిరేకమా? నేను దేశ వ్యతిరేకిని కాదు. ఇక్కడ అందరికంటే నాకు దేశభక్తి ఎక్కువ. మీరు దేశాన్ని దోచుకుంటున్నారు. నేను దేశ వ్యతిరేకిని అని చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. If I speak the truth, is it anti-national? I'm not anti-national. I'm more patriotic than anyone here. I'm a 'bhoomi-putra'...You're looting the country& telling me that I'm anti-national: LoP Rajya Sabha Mallikarjun Kharge during debate on Motion of Thanks on President's address pic.twitter.com/RnasKTzYl5 — ANI (@ANI) February 8, 2023 అటు బడ్జెట్ కేటాయింపులపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాల సందర్భంగా సభలో ఒవైసీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగంలో ముస్లింల గురించి ఒక్క మాట కూడా లేదు. మైనార్టీల పథకాలకు బడ్జెట్లో నిధులు తగ్గించారు. ఆకుపచ్చ రంగు అంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకంత అసహనం?. జాతీయ జెండాలో ఆకుపచ్చరంగును తీసేస్తారా?. మీ నారీశక్తి నినాదం బిల్కిస్ బానో విషయంలో ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. -
Adani Group issue: ‘అదానీ’పై అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు, తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల పతనం కారణంగా తలెత్తిన పరిస్థితులపై పార్లమెంట్లో వెంటనే చర్చ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఏకతాటిపైకి వచ్చిన విపక్ష సభ్యుల ఆందోళనతో శుక్రవారం లోక్‌సభ, రాజ్యసభ స్తంభించాయి. మిగతా సభా కార్యకలాపాలను పక్కనపెట్టి హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాల్సిందేనంటూ ప్రతిపక్షాలన్నీ పట్టుబట్టడంతో వరుసగా రెండోరోజు కూడా ఎలాంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం సమావేశాలకు ముందే తీసుకున్న సంయుక్త నిర్ణయం 15 పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి. లోక్‌సభ ఆరంభమై ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన వెంటనే విపక్ష ఎంపీలు హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు పట్టుబడుతూ ఆందోళనకు దిగారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకురావడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. విచారణ జరిపించాల్సిందే... అదానీ గ్రూప్ పట్ల వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) లేదా సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్‌తో విచారణ జరిపించాలని విపక్షాలు పునరుద్ఘాటించాయి. అత్యంత కీలకమైన ఈ అంశంపై చర్చకు అంగీకరించకపోవడం ఏమిటని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చర్చించే దాకా పట్టు! పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మోదీ సర్కారుపై దాడిని మరింత తీవ్రతరం చేయాలని విపక్షాలు నిర్ణయించాయి. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో 16 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం ఉదయం సమావేశమయ్యాయి. ఈ భేటీలో కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ, ఆప్, బీఆర్ఎస్, శివసేన, ఆర్జేడీ, జేడీ(యూ), సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోస్ మణి), కేరళ కాంగ్రెస్ (థామస్), ఆరెస్పీ ఇందులో ఉన్నాయి. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ అవకతవకలపై సభలో చర్చ జరిగేదాకా పట్టుబట్టాల్సిందేనని పార్టీలన్నీ ఏకగ్రీవంగా నిర్ణయించాయి. దాంతోపాటు అదానీ గ్రూప్ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తుకు కేంద్రం అంగీకరించేదాకా ఉభయ సభల్లోనూ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి. అదానీ అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందే. అప్పుడు మాత్రమే వాటిలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎస్బీఐ పెట్టుబడులకు భద్రత’’ అని భేటీ అనంతరం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మీడియాతో అన్నారు. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రధాని మోదీయే వాటిపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున ఆర్థిక, అకౌంటింగ్ అవకతవకలకు పాల్పడిందంటూ న్యూయార్క్‌కు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల దెబ్బకు గ్రూప్ విలువ చూస్తుండగానే ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేరకు పడిపోయింది. -
గవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగాలని బీఆర్ఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావులు పాల్గొని పార్టీ వైఖరిని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేశారు. అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం కోర్టు సహాయం కోరాల్సి రావడం వంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, కేరళసహా అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థతో ఇబ్బందులు పడుతున్నాయని.. అందువల్ల గవర్నర్ వ్యవస్థతో పాటు సమాఖ్య వ్యవస్థపై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు. అంతేగాక అఖిలపక్ష సమావేశంలో రైతుల పంటల మద్దతు ధర రెట్టింపు చేయలేదన్న అంశంతో పాటు, నిరుద్యో గం అంశంపైనా చర్చ జరగాలని కోరామన్నారు. వీటితో పాటు పార్లమెంట్ సమావేశాలు కేవలం బిల్లుల ఆమోదం కోసం ఏర్పాటు చేయడం కాదని... ప్రజా సమస్యలతో పాటు దేశంలోని అనేక సమస్యలపై చర్చ జరపాలని కోరా మని కేకే, నామా తెలిపారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన సమస్యలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తి పోరాడతామని పేర్కొన్నారు. -
మోదీ సర్కారే టార్గెట్.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్బంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇక, సమావేశంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. అలాగే, గవర్నర్ల వ్యవస్థపై పోరాడాలని పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణకు రావాల్సిన నిధులపై నిలదీయాలని తెలిపారు. రాష్ట్ర విభజన హామీలపై ప్రశ్నించాలని ఎంపీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచనలు చేశారు. పార్లమెంట్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. -
ప్రపంచానికి భారత్ మార్గనిర్దేశం
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న నేటి అమృత కాలంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే విషయంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలిరోజు బుధవారం ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సభలో మోదీ మాట్లాడారు. రెండు చరిత్రాత్మక ఘట్టాలకు మన దేశం సాక్షిగా నిలుస్తున్న సమయంలో జగదీప్ ధన్‌ఖడ్ ఈ బాధ్యతలు చేపట్టారని అన్నారు. శక్తివంతమైన జీ–20 కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తోందని, అలాగే అమృత కాలంలోకి మన ప్రయాణం ప్రారంభించామని చెప్పారు. ఈ అమృత కాలం దేశ అభివృద్ధి, కీర్తిప్రతిష్టలపై మనమంతా దృష్టిపెట్టాల్సిన సందర్భమని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో దేశ ప్రజాస్వామ్యం,పార్లమెంట్, పార్లమెంట్ సంప్రదాయాల పాత్ర చాలా కీలకమని ఉద్ఘాటించారు. రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌పై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనలో ఒక జవాన్, ఒక కిసాన్ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. అచ్ఛమైన రైతు బిడ్డ అయిన ఉపరాష్ట్రపతి సైనిక్ స్కూల్లో చదువుకున్నారని గుర్తుచేశారు. అందుకే ఆయనకు రైతులతోపాటు సైనికులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాల్సిన బాధ్యత ఎగువ సభపై ఉందని మోదీ చెప్పారు. ఈ సమావేశాలను ఫలవంతం చేద్దాం పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ఫలవంతంగా మార్చడానికి అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని, కలిసికట్టుగా పనిచేయాలని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో దేశాన్ని ఉన్నత స్థాయికి చేర్చడానికి కీలకమైన నిర్ణయాలను ఈ శీతాకాల సమావేశాల్లో తీసుకుంటామన్న నమ్మకం ఉందని వివరించారు. లోక్‌సభకు తొలిసారిగా ఎంపికైనవారికి సభలో చర్చల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని అన్ని పార్టీలకు ప్రధాని సూచించారు. ప్రజాస్వామ్యంలో కొత్త తరాన్ని సిద్ధం చేయడానికి, వారి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం నూతన ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇద్దామని అన్నారు. జగదీప్ ధన్‌ఖడ్‌కు మోదీ అభినందనలు తెలియజేశారు. కృష్ణ, ములాయం సింగ్‌కు లోక్‌సభ ఘన నివాళి తెలుగు సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్‌తోపాటు ఇటీవల మరణించిన మరో ఎనిమిది మంది మాజీ ఎంపీలకు లోక్‌సభ ఘనంగా నివాళులు అర్పించింది. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన అనంతరం స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా సంతాపం తెలిపారు. ప్రజాజీవితంలో మాజీ ఎంపీలు చేసిన సేవలను కొనియాడారు. ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో కృష్ణ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ములాయంసింగ్ యాదవ్ ఏకంగా ఏడుసార్లు ఎంపీగా, రక్షణ శాఖ మంత్రిగా, మూడు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ఓం బిర్లా ప్రశంసించారు. మాజీ ఎంపీల మృతికి సంతాపంగా లోక్‌సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. -
ప్రతిపక్షాలకు సమయం కేటాయించాలి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షాలకు 50% సమయాన్ని కేటాయించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కేశవరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నడుచుకోవట్లేదని..17 రోజుల్లో 25 బిల్లులు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వాలు లేని చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలోకి వచ్చిన వారు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుర్వినియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులపై అందరినీ కలుపుకుని పార్లమెంటులో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
‘ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతున్నాం’
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈరోజు(మంగళవారం) కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. అనంతరం ఎంపీ భరత్ మాట్లాడుతూ.. విభజన చట్టం పెండింగ్ అంశాలే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడుతున్నాం’ అని అన్నారు. -
కేంద్రం తీరును ఎండగట్టండి
సాక్షి, హైదరాబాద్: రేపటి(బుధవారం) నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలకు హాజరై రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలను ఆదేశించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో ఆయన సోమవారం రాత్రి ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కేసీఆర్ పలు రాజకీయ, పాలనపరమైన అంశాలు ప్రస్తావించినట్లు సమాచారం. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని, తద్వారా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పార్టీ ఎంపీలకు సుదీర్ఘంగా వివరించినట్లు తెలిసింది. పార్లమెంటులో లోపలా, బయటా చోటు చేసుకునే పరిస్థితులను బట్టి వ్యూహరచన చేసుకోవాలని సూచించారు. సీబీఐ, ఐటీ, ఈడీ సోదాలు, కేసుల విషయంలో విపక్షాలతో కలిసి ఆందోళనలు చేయాలని సూచించారు. ప్రతిపక్షాలు చేసే ఇతర ధర్నాలు, ఆందోళనలకు అంశాల వారీగా టీఆర్ఎస్ మద్దతునిస్తుందని తెలిపారు. అవసరమైతే సమావేశాల బహిష్కరణ! ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిన కుట్రలను పార్లమెంటు వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ సూచించారు. అవసరమైతే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలను అడ్డుకున్న తీరుతో పాటు అందులో బీజేపీ పాత్ర, విచారణను అడ్డుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా ఎంపీలకు వివరించారు. విభజన హామీల అమలులో తెలంగాణ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, నిధుల విడుదలలో చూపుతున్న వివక్షను గణాంకాలతో సహా వివరించారు. గవర్నర్ వ్యవస్థతో పాటు, సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడం ద్వారా విపక్ష రాజకీయ పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రం నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణను ప్రజలకు వివరించేందుకు ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించిన తర్వాత జాతీయ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు ముమ్మరంగా ఉంటాయని చెప్పినట్లు సమాచారం. -
ఎంత ఖర్చుకు ఎంత ప్రయోజనం?
పార్లమెంట్ సమావేశాల కోసం నిమిషానికి రూ. 2.6 లక్షల చొప్పున ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నాం. ఒక్కో సమావేశంపైన రూ.144 కోట్లు ‘కృష్ణార్పణం’ చేసుకుంటున్నాం. అయినా దీనికి తగిన ఫలితం మాత్రం ప్రజలకు అందడం లేదు. ఇక సభల్లో చర్చను తప్పించడానికి ద్రవ్య బిల్లులను పాలక పక్షాలు వాటంగా వాడుకోవడం చాలాకాలంగా నేర్చాయి. ఈ పని కాంగ్రెస్ హయాంలోనూ జరిగింది. ఇప్పుడు బీజేపీ పాలకుల నేతృత్వంలోనూ సాగుతోంది. దీనికి మరో అడుగు ముందుకేసి, ‘ఏక్ భారత్’ అంటే ‘బీజేపీ భారత్’ అనేలా చేస్తోంది పాలక పక్షం. ఆ నినాదాన్ని ఖాయం చేయడానికే లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాలకూ కలిపి ఒకే ఘడియలో ఒకే రోజున ఒకే ఎన్నిక నిర్వహించాలన్న పల్లవి ఎత్తుకుంది. ఈ దేశమైన ‘దటీజ్ భారత్’లో పార్లమెంట్ (ఉభయ సభలు) రోజుకు ఎంతో ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోంది. అయినా కొలది రోజులనాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా పాలనా వ్యవస్థను, సెక్యులర్ రాజ్యాంగాన్ని ఆధునిక ‘నీరో’ చక్రవర్తులుగా తయారైన పాలకుల నుంచి ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం అన్నది ప్రశ్నగానే మిగిలిపోతోంది! అంతే గాదు, ‘మనీ బిల్స్’ పేరిట రాజ్యసభ చర్చలను పక్కతోవ పట్టిస్తూ ‘పెద్దలు’ చేస్తున్న చిల్లర పనులను కూడా కనీస ప్రజాస్వామ్య పాలనా సూత్రాలను కాపాడుకోగోరే ప్రజలూ, ప్రజాస్వామ్య శక్తులూ కట్టడి చేయవలసిన తరుణం వచ్చింది! సభ నిర్వహణ, సభ్యుల జీతనాతాలు, దినసరి ఎలవెన్సులు పేరిట 10–15 రోజులకు రూ. 144 కోట్లు అవుతోంది. కథ ఇంతటితో ముగియదు. భవిష్యత్తులో పార్లమెంటేరియన్లకు పెంచనున్న జీత నాతాల్ని కూడా లెక్క కట్టారు. ఈ లెక్క చూస్తే ‘నుయ్యి తియ్యబోతే దయ్యం బయట పడిందన్న’ సామెతలా నెలసరి జీతాలతో పాటు నియోజక వర్గ అలవెన్సులు, సెక్రటేరియట్ అలవెన్సులు, సభ్యుల కార్యాలయ అలవెన్సులు ఆ దామాషాలో పెరగాల్సిందే. ఎందు కంటే, ప్రజలు ఎన్నుకున్న పాపానికి సభ్యుడి నెల జీతంతో పాటు, ఖర్చులన్నీ తడిసి మోపెడవుతాయి. పార్లమెంట్ సమావేశాలకు ఇంత ఖర్చు పెడుతున్నా దీనికి తగిన ఫలితం మాత్రం ప్రజలకు అందడం లేదు. ఈ సందర్భంలో ఒక కీలక ప్రశ్న తలెత్తింది. నెలసరి జీత నాతాలు పెంచుకునే సభ్యులు పార్లమెంటులో చర్చలు కొనసాగ కుండా అడ్డుకునే మార్గాలు కూడా చూస్తారని ఒకప్పుడు బీజేపీ సీనియర్ సభ్యుడు, మాజీ మంత్రి అరుణ్ జైట్లీయే అన్నారు! రాజ్యసభలో ఇటీవల ‘మనీ బిల్స్’ చాటున పాలకులు కొన్ని చిల్లర మాటలకు దిగడం హాస్యాస్పదం! చర్చను తప్పించడానికి ఈ బిల్స్‌ను పాలక పక్షాలు వాటంగా వాడుకోవడం చాలాకాలంగా నేర్చాయి. ఈ పని కాంగ్రెస్ హయాంలోనూ జరిగింది. ఇప్పుడు బీజేపీ పాలకుల నేతృత్వంలోనూ సాగుతోంది. ‘ఏక్ భారత్’ అంటే ‘బీజేపీ భారత్’ అనే అర్థం చేసుకోవాలట. ఆ నినాదాన్ని ఖాయం చేయడానికే ఇకనుంచి లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాలకూ కలిపి ఒకే ఘడియలో ఒకే రోజున ఒకే ఎన్నిక అవసరమంటున్నారు బీజేపీ నాయకులు. 2014 నుంచి దాన్నే పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ పాలన ఉనికి మహారాష్ట్ర ప్రయోగంతో ఇబ్బందుల్లో పడిన దరిమిలా మరింత వేగంగా ముందుకు సాగుతున్నారని ప్రజలకూ అర్థమయ్యింది. కర్ణా టక బీజేపీ ప్రభుత్వ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని అత్యధిక లోక్‌సభ స్థానాలను జీవనాడిగా భావించుకుని ఉత్తర, దక్షిణ, తూర్పు భారత రాష్ట్రాలను కంట్రోల్ చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు, వేస్తున్న ఎత్తుగడలు బెడిసికొట్టే రోజులు దగ్గర పడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తర ప్రదేశ్‌లోని 85 పార్లమెంటు స్థానాల బెడద (ఉత్తరాఖండ్‌ను కూడా కలుపుకొని) గురించి ఏనాడో రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ పసిగట్టారు. అందువల్లే దక్షిణ భారత దేశానికి హైదరాబాద్ శాశ్వత రాజధానిగా ఉండాలని ప్రతిపాదించారని మరచిపోరాదు! ఉత్తర ప్రదేశ్‌ను ఎలాగూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ– ఆర్ఎస్ఎస్ వర్గీ యులు త్యాగం చేయలేరు కాబట్టి, దక్షిణ తూర్పు రాష్ట్రాలకు ఎసరు పెట్టారు, మరింతగా పెడతారు! ఎలాగూ ‘పెగసస్’ గూఢ చర్యంతో దేశ విదేశాల్లో అభాసు పాలైన మన పాలకులకు ‘అన్యధా శరణం’ లేకనే మధ్యంతర ఎన్నికలకు తహతహలాడుతున్నారని గ్రహించాలి. గుజరాత్లో మైనారిటీలపై తలపెట్టిన 2002 నాటి ఊచకోతలపై సమగ్రమైన విచారణ జరిపేందుకు తాను నియమించిన ప్రత్యేక విచారణ సంఘం (2008) సమర్పించిన నివేదికను విడుదల చేస్తూ, భారతదేశంలో మత సామరస్యం అనేది ప్రజాస్వామ్యానికి జీవశక్తి అని చెబుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా వ్యాఖ్యానించింది. ‘‘ఏ మతమూ ద్వేషాన్ని బోధించదు. మతం పేరిట ప్రజల్ని చంపు కోవడం యావత్తు దేశానికీ, చట్టబద్ధంగా నడుచుకోవలసిన సమాజా నికీ మాయని మచ్చ.’’ గుజరాత్ కేసుల్లాంటివి ఎక్కడ తలెత్తినా వాట న్నింటినీ తుదకంటా వెంటాడి ఒక కొలిక్కి తీసుకురావాల్సిందేనని చెప్పింది. ఆ ఆదేశం ప్రకారం రంగంలోకి దిగిన సుప్రీం ప్రత్యేక ఉన్నత సలహాదారైన న్యాయవాది రాజు రామచంద్రన్ గుజరాత్ సమర్పించిన సాధికార నివేదికను పాలక వర్గం తొక్కి పట్టడమే గాకుండా, దాన్ని నామరూపాలు లేకుండా చేస్తూ, తనను తాను ‘కడిగిన ముత్యం’ అని చాటుకోవడానికి ప్రయత్నించింది! గుజరాత్లో దళిత మైనారిటీలను ఊచకోతకోయగలిగిన వాళ్లకు ‘దళిత, ఆదివాసీ’ పదాలు కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే ఉద్దేశించిన ఊతపదాలు. కనుకనే ఈ ఎత్తుగడను పసిగట్టిన సుప్రసిద్ధ మేధావి, గోవా యూనివర్సిటీలో ‘డి.డి.కోశాంబి’ విజిటింగ్ ప్రొఫెసర్ పీటర్ రోనాల్డ్ డిసోజా ప్రత్యేక వ్యాసం రాస్తూ, ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతి పదవికి బీజేపీ తమ అభ్యర్థిగా నామినేట్ చేయడాన్ని ‘తిరుగులేని దెబ్బగా’ వర్ణించారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఎదు ర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగానూ, ఒక్క తాటిపైకి గుమి గూడబోతున్న ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకుగానూ వేసిన ఎత్తుగడగా దీన్ని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ వ్యవస్థలో ఈ రోజున కోర్టులలో, మీడియాలో, బ్యూరోక్రాట్లలో, యూనివర్సిటీలలో, కార్పొరేట్ సంస్థల్లో ఉన్న అధికారగణంలో ఆదివాసీ ప్రజల తరఫున గొంతు విప్పి మాట్లాడగల్గిన వారి సంఖ్య బహుస్వల్పమని ద్రౌపదీ ముర్మూకు తెలుసు. కానీ ఈ ఆదివాసీ జనాలనే అభివృద్ధి పేరిట, మౌలిక సదుపాయాల కల్పన పేరిట వివిధ నగరాల మురికి వాడల్లో కుక్కడం జరిగింది. తద్వారా దేశ సాంస్కృతికాభివృద్దికి కూడా వారిని దూరం చేశారు. అదే సందర్భంలో రిజర్వేషన్ల పుణ్యమా అని దేశ శాసన వేదికలలో ఆ మాత్రమైనా స్థానం లభించే అవకాశం కల్గింది. కానీ పార్టీ రాజకీయాలు వచ్చి ఆదివాసీలు, దళితుల గొంతు నొక్కేశాయి. ‘ఇప్పుడు ఆదివాసీ అయిన ద్రౌపదీ ముర్మూ ఈ దగా పడిన ఆదివాసీలకు గొంతెత్తి మాట్లాడగల అవకాశం కల్పిస్తారా? ఒక స్త్రీగా, భర్తను కోల్పోయిన ఒక భార్యగా, ఒక ఆదివాసీగా అనుభవించిన కష్టనష్టాల దృష్ట్యా గర్వించదగిన ధృఢమైన రాజకీయ శక్తిగా తన ముద్రను వేయగలరా?’ అని ప్రొఫెసర్ డిసోజా ప్రశ్నించడం ఆసక్తకర చర్చగా మారింది. మరొక కీలకమైన అంశాన్ని లేవనెత్తుతూ... ముర్మూ రాజ్యాంగపరంగా తన అధికారాల పరిధిని పూర్తిగా వినియో గించుకోవాలి. కేవలం రాష్ట్రపతి కార్యాలయ ప్రొటొకాల్ పరి«ధులకే అంటుకుపోయిన కొందరు పాత రాష్ట్రపతుల మాదిరిగా వ్యవహ రించకుండా రాజేంద్రప్రసాద్, రాధాకృష్ణన్‌లా చొరవతో ముందుకు సాగాలని డిసోజా సలహా ఇచ్చారు. అంతేగాదు, రాష్ట్రపతిగా ఆమె తన ఐదేళ్ల పదవీకాలంలో దేశంలో నిర్లక్ష్యానికి గురైన ఆదివాసీ ప్రజలున్న ప్రాంతాలను పర్యటిస్తే అదో ప్రయోజనకర చర్యే కాగల దనీ, ఆయా ప్రాంతాల్లో స్కూళ్లు, ఆసుపత్రులు, మార్కెట్లు, నీటి సౌకర్యాలు ఆమె స్వయంగా కళ్లారా చూస్తే అనుభవంలోకి రాగలవనీ డిసోజా అన్నారు. అలాగే, దేశ రాష్ట్రపతిగా ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి భవన్లో కూర్చోబెట్టడం ఎంతటి తిరుగులేని ఘటనో... అదే స్థాయిలో రాష్ట్రపతి భవన్‌ను ఆదివాసీ సంస్కృతితో ముర్మూ సంస్క రించడానికి ప్రయత్నిస్తారో లేక ఆమెను అదే భవన్ సంస్కృత భాషాభిమానిగా మారుస్తుందో చూడాలని డిసోజా వ్యంగ ధోరణిలో అన్నారు. ఏది ఏమైనా రానున్న ఐదేళ్లూ ద్రౌపదీ ముర్మూ తన పదవిలో ముళ్లమీద కూర్చోకుండా గడిపి గట్టెక్కిరాగలరనే ఆశిద్దాం. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
ఇదేనా మన సంప్రదాయం?
సోమవారం నలుగురు. మంగళవారం 19 మంది. బుధవారం ఒకరు. గురువారం ముగ్గురు. 4 రోజుల్లో 27 మంది. ఈ లెక్కంతా పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల నుంచి సస్పెండైన ప్రతిపక్ష ఎంపీల సంఖ్య. జూలై 18న మొదలైనప్పటి నుంచి సమావేశాలు జరుగుతున్న తీరు, గురువారం సోనియాకూ, పాలకపక్ష సభ్యులకూ మధ్య సభలో సంఘటనలు చూస్తుంటే... పార్లమెంట్ ప్రతిష్ఠ అంతకంతకూ దిగజారుతున్న భావన కలుగుతోంది. ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించకుండా అధికార పక్షం తమ గొంతు నొక్కేస్తోందని ప్రతిపక్షాల ఆరోపణ. గందరగోళం రేపడమే ప్రతిపక్షాల ధ్యేయమై పోయిందని అధికార పక్షం వాదన. మరోపక్క సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో 50 గంటల నిరసన దీక్ష మునుపెరుగని దృశ్యాలకు ప్రతీక. ప్రజాసామ్య దేవాలయంలో సభ్యుల సస్పెన్షన్లు, వరుస వాయిదాలతో ఈ సమావేశాలు సైతం పలు పార్లమెంట్ సమావేశాలలానే నామమాత్రమవుతున్నాయి. సమస్యలు, బిల్లులు చర్చించాల్సిన వేదిక దూషణలు, నినాదాలకు పరిమితం కావడం శోచనీయం. సంఖ్యాబలం ఉంది కాబట్టి, ఏం చేసినా సభలో ఎవరూ ప్రశ్నించకూడదు, చర్చించకూడదని అధికార పార్టీ అనుకుంటే అది మూక స్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. సభలోకి ప్లకార్డులు తెచ్చి అడ్డుపడడం, నిబంధనావళిని చించి, సభాపతి పైకి కాగితాలు విసిరివేయడం ప్రతిపక్షాలకు పబ్లిసిటీకి పనికిరావచ్చేమో కానీ, దానివల్ల ప్రజాసమస్యలైతే పరిష్కారం కావు. ఈ రెండు వైఖరుల వల్ల నష్టపోతున్నది ప్రజలే. వారి బాధల్ని వినిపించడానికీ, వినడానికీ ప్రజాప్రతినిధులెవరికీ వీలుచిక్కని విచిత్ర పరిస్థితి. గతంలో ప్రతిపక్షాలు సభలో నిరసన తెలిపినా అదీ హుందాగానే సాగేది. ప్రభుత్వం సైతం ఎవరెన్ని రోజులు నిరసన తెలిపినా, ఒక్క ఉదుటున సస్పెన్షనే పరిష్కారంగా భావించలేదు. ప్రతిపక్షాలతో చర్చించి ప్రతిష్టంభనకు తెర దించేవారు. ఇప్పుడా పరిస్థితే కనిపించట్లేదు. పైగా, నిన్నటి దాకా అసెంబ్లీలకే పరిమితమైన సుదీర్ఘ సస్పెన్షన్ల సంప్రదాయం పార్లమెంటుకూ పాకడం శోచనీయం. ధరల పెరుగుదల, జీఎస్టీ, అగ్నిపథ్, చైనా ముప్పు సహా రకరకాల సమస్యలపై చర్చ జరగాలనీ, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలనీ ప్రతిపక్షం కోరుకోవడంలో తప్పు లేదు. కానీ, అందుకు సరైన పద్ధతిని అనుసరించక సభను అడ్డుకోవాలని చూస్తే తప్పే. సంయమనంతో ఉండాల్సిన పాలక పక్షం సైతం సస్పెన్షనే సర్వరోగ నివారిణి అనుకోవడం అంతకన్నా పెద్ద తప్పు. 1978 వరకు నూరు శాతానికి పైగా పనిచేసిన ఘనత మన పార్లమెంట్‌ది. సభ స్తంభించి పోవడం అరుదు. తర్వాత నుంచి పరిస్థితి మారింది. కొన్నేళ్ళుగా అందులో సగమైనా పనిచేయని దుఃస్థితి. 1950, ’60లలో లోక్‌సభ దాదాపు 4 వేల గంటలు పనిచేస్తే, పూర్తికాలం సాగిన గత 16వ లోక్‌సభ 1615 గంటలే పనిచేసింది. ఇది లోక్‌సభల సగటు పనిగంటల కన్నా 40 శాతం తక్కువ. దీనికి అధికార, ప్రతిపక్షాలు రెండూ కారణమే! అలాగే, పార్లమెంటరీ చర్చల్లో వాయిదా తీర్మానాలు అత్యంత ప్రధానమైనవి. అయితే, ఆ పరిస్థితీ నేడు కనిపించట్లేదు. 2016 నుంచి పార్లమెంట్లో ఏ ఒక్క వాయిదా తీర్మానాన్నీ ఆమోదించిన దాఖలాలు లేవని పరిశీలకులు లెక్కలు తీశారు. కరోనా సాకుగా మీడియాకు 2020 మార్చి నుంచి పార్లమెంట్లో పరిపూర్ణ అనుమతికి అడ్డం కొట్టిన పాలకులు కరోనా తగ్గినా సరే డైలీ పాసుల పద్ధతి మానలేదు. ఇప్పుడు సస్పెన్షన్లు, చర్చలకు నిరాకరణతో ఏకంగా ‘ప్రతిపక్ష ముక్త పార్లమెంట్’ను కోరుతున్నారనిపిస్తోంది. పార్లమెంట్ ప్రజలదే తప్ప, అయిదేళ్ళకు ప్రజలెన్నుకున్నంత మాత్రాన అది పాలకుల జాగీరైపోదు. రెండోసారి అధికారం లోకి వచ్చాక అధికార బీజేపీ ప్రవర్తన పూర్తిగా మారిందనేది విశ్లేషకుల భావన. ఉభయ సభలూ అధికార పార్టీ కనుసన్నల్లో, పాలకుల అభీష్టం మేరకు సాగుతున్నాయని ఆరోపణ. 2010లో 2జీ స్కామ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కోరుతూ మొత్తం సమావేశాల్ని నీరు గార్చిన చరిత్ర నాటి ప్రతిపక్ష బీజేపీది. అప్పట్లో పార్లమెంట్ స్తంభనా ప్రజాస్వామ్యమే, మంచిదే అంటూ అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు అన్న మాటను ఇప్పుడు ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. పార్లమెంట్ నిర్వహణతో ఖజానాకు ప్రతి నిమిషానికీ రూ. 2.5 లక్షలు ఖర్చవుతాయని 2017 నాటి లెక్క. పార్లమెంట్ స్తంభనతో ప్రజాధనం కోట్లలో వృథా అవుతోంది. బ్రిటన్, కెనడా లాంటి దేశాల్లో పార్లమెంట్ ఆరోగ్యకర చర్చలతో సాగుతోంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన మన దగ్గరే ప్రతిష్టంభన. బ్రిటన్‌లో వారానికోరోజు ప్రతిపక్షాలు వేసే ఏ ప్రశ్నకైనా మంత్రులు జవాబిచ్చే సత్సంప్రదాయం ఉంది. మన దగ్గర అయిదేళ్ళుగా ప్రధాని ఒక్క ప్రశ్నకూ జవాబివ్వని పరిస్థితి. ఒకప్పుడు అర్థవంతమైన చర్చలెన్నిటికో వేదికైన పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు ఏటా మూణ్ణాలుగుసార్లు తప్పనిసరి తద్దినాలుగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య సుహృద్భావం మాట దేవుడెరుగు... పరస్పర విశ్వాసమైనా లేకుండా పోయింది. సభలో చర్చలు మొదలెడితే, ఆనక తమ చట్టాలు ఆమోదం పొందవేమోనని పాలకపక్ష అనుమానం. ముందే చట్టాలకు ఆమోదముద్ర పడిపోతే, ఆపైన అంశాలపై చర్చ లేకనే సభను వాయిదా వేసేస్తారని ప్రతిపక్షాల భయం. ఈ అను మాన భూతాన్ని ఎంత త్వరగా పారదోలితే దేశానికి అంత మంచిది. భిన్నాభిప్రాయాల వేదికగా పార్లమెంట్లో చర్చలే ఏ ప్రజాస్వామ్యానికైనా ప్రాణవాయువు. వైరివర్గాలుగా చీలిన పాలక, ప్రతి పక్షాలకు గుర్తు చేయాల్సింది ఒకటే – ‘నూరు పూలు వికసించనీ... వేయి భావాలు సంఘర్షించనీ’! -
ఫేస్బుక్ మత విద్వేషాలు రెచ్చగొడుతోంది: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: సోషల్ మీడియా అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడటం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఫేస్బుక్ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని తెలిపారు. బుధవారం ఆమె లోక్‌సభ జీరోఅవర్‌లో మాట్లాడుతూ.. భారత రాజకీయాలు, ఎన్నికల్లో ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల జోక్యాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అల్ జజీరా, ది రిపోర్టర్స్ కలెక్టివ్‌లో ప్రచురించిన రిపోర్టును సోనియా గాంధీ ప్రస్తావిస్తూ.. ఇతర రాజకీయ పార్టీలతో పోల్చితే ఫేస్బుక్ ఎన్నికల ప్రకటనల కోసం బీజేపీకి మాత్రమే తక్కువ ధరలో డీల్ ఆఫర్ చేసిందని పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగంలోని ఎన్నికల వ్యవస్థలో సోషల్ మీడియా జోక్యాన్ని క్రమంగా తగ్గించాలని కోరారు. సోషల్ మీడియం జోక్యాన్ని పక్షపాత రాజకీయాలకు అతీతంగా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ పార్టీ ఆధికారంలో ఉన్నా..బాధ్యతగా మనమంతా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గుర్తుచేశారు. -
ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని మోదీ స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భాగంగా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ విభజన తీరును తప్పుబట్టారు. ఏపీ, తెలంగాణ వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. ప్రధాని మోదీ మాట్లాడిన పలు అంశాలు ఇవే... రాజకీయ స్వార్ధం కోసమే ఏపీని హడావుడిగా విభజించారు. తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు. అయితే విభజన కోసం అనుసరించిన పద్ధతి సరిగా లేదు. కలిసి చర్చిస్తే విభజన ప్రక్రియ సాఫీగా జరిగేది ఏపీ, తెలంగాణ మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం. మైక్‌లు కట్‌చేసి పెప్పర్ స్ప్రే కొట్టారు. హడావుడిగా చర్చలేకుండానే విభజన బిల్లును ఆమోదిచారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు. కాంగ్రెస్ అధికార గర్వం వల్ల సమస్యను జఠిలం చేశారు ఏపీ, తెలంగాణ ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాయి విభజన చట్టంపై ఎలాంటి చర్చ జరపలేదు ఏపీ వల్ల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది తెలంగాణ ఇచ్చినా.. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదు -
మొదటి వారం రాజ్యసభ సమావేశాలు.. 52 శాతం సమయం వృథా
సాక్షి, న్యూఢిల్లీ: శీతాలకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాల మీద నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించిన 12 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. 12 మంది ఎంపీలను సస్పెండ్ చేసినందుకు ప్రతిపక్షాలు.. ఇది అప్రజాస్వామిక చర్య అని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయటం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కాని వారు సభకు క్షమాపణలు చెప్పాలని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషీ డిమాండ్ చేశారు. చదవండి: గాంధీల దేశాన్ని గాడ్సే దేశంగా మారుస్తున్నారు: మెహబూబా ముఫ్తీ ఈ నేపథ్యంలో మొదటి వారం రోజులు జరిగిన సమావేశాల్లో 52 శాతం సమయాన్ని రాజ్యసభ కోల్పోయింది. విపక్షాల నిరసన వల్ల సభా సమయం వృథా కావడంపై రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కొంతమంది ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రులతో చర్చించారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై ఇరు పక్షాలు చర్చించి ఒక అభిప్రాయానికి రావాలని తెలిపారు. మొదటి వారం రాజ్యసభ సమావేశాల్లో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. -
'ప్లాన్'తో పంటలేద్దాం..
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పంటలు, వాతావరణ వైవిధ్యం ఉంటుంది. కేంద్రం వార్షిక ప్రణాళికను ప్రకటిస్తే రాష్ట్రం కూడా కేంద్రం ప్రకటించిన వార్షిక ప్రణాళికకు అనుగుణంగా పంటల సాగును ప్రోత్సహిస్తుంది. ఆహార ధాన్యాల సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ, అస్పష్ట విధానాలు తెలంగాణ రైతాంగానికి, దేశంలో వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారాయి. దీనిపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలి. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కనీస మద్దతు ధరతో పాటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి వార్షిక ప్రణాళికను ప్రకటించాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేయాలని టీఆర్ఎస్ ఎంపీలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్రం వార్షిక ప్రణాళికను ప్రకటిస్తే దానికనుగుణంగా పంటలు సాగు చేద్దామన్నారు. ఆహార ధాన్యాల సేకరణ అంశంలో కేంద్రానికి సమగ్ర జాతీయ విధానం ఉండాలని, ధాన్యం సేకరణలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం వర్తింపజేయాలని కూడా డిమాండ్ చేయాలని చెప్పారు. వ్యవసాయ అంశాలపై కేంద్రం ఏర్పాటు చేయనున్న కమిటీ త్వరగా ఏర్పాటయ్యేలా ఒత్తిడి చేయాలని సూచించారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదివారం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు అంశంపై పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. యాసంగి పనులు ప్రారంభమైన నేపథ్యంలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని కేంద్రం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరి సరికాదు ‘రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతాంగాన్ని ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించడం ఒక్కరోజులో అయ్యే పనికాదు. ఇది ఒక క్రమ పద్ధతిలో జరగాల్సిన ప్రక్రియ. వానాకాలం వరి సాగు విస్తీర్ణం విషయంలో కేంద్రం రోజుకో మాటతో కిరికిరి పెడుతోంది. 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి గాను కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నులు (40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం) మాత్రమే సేకరిస్తామని పాత పాట పాడుతోంది. రాష్ట్ర మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యింది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల బృందం కేంద్ర అధికారులను కలిసింది. అయినా కేంద్రం ఎటూ తేల్చకపోవడం సరికాదు..’అని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టే విద్యుత్ చట్టంపై, విభజన హామీలపై గట్టిగా ప్రశ్నించాలని సూచించారు. రైతుల పక్షాన గళం విప్పాల్సిందే.. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్లమెంటు ఉభయ సభల్లో రైతుల పక్షాన గళం వినిపించాలని టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం నిర్ణయించింది. వార్షిక ధాన్యం సేకరణ కేలండర్‌ను విడుదల చేయాలన్న సీఎం డిమాండ్‌ను అభినందిస్తూ, కేంద్రం అనుసరిస్తున్న ఆయోమయ విధానంపై పోరాడాలని నిర్ణయించింది. ధాన్యం దిగుబడిలో తెలంగాణ రైతాంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుండగా.. కేంద్రం వైఖరి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అశనిపాతంగా మారిందని సమావేశం అభిప్రాయపడింది. మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కె.కేశవరావు సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, పి.రాములు, దయాకర్, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, ఎం.శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
పోలవరంపై పట్టుబట్టాలి.. ఎంపీలకు సీఎం జగన్ మార్గ నిర్దేశం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ.55,657 కోట్లకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించేలా పార్లమెంట్ సమావేశాల్లో పట్టుబట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. జాతీయ హోదా ప్రాజెక్టు అంటే విద్యుత్తు, సాగునీరు, తాగునీరు అంశాల కలయికని, అయితే ఎప్పుడూ లేనివిధంగా తాగునీటి అంశాన్ని విడదీసి చూస్తున్నారని పేర్కొన్నారు. కాంపొనెంట్ వారీగా డబ్బులిస్తామని చెబుతున్నారని, కేంద్రం ఇంకా ఆమోదించాల్సిన డిజైన్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇబ్బందికర పరిస్థితులున్నప్పటికీ పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,104 కోట్లు ఖర్చు చేసిందని, అయితే ఆ డబ్బులను కేంద్రం ఇంకా రీయింబర్స్ చేయలేదన్నారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన పలు అంశాలపై ఎంపీలకు సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత లేకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో పేదరికం ఎక్కువగా ఉందనే కోణంలో గణాంకాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇది వాస్తవ విరుద్ధం. ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తలసరి ఆదాయం చాలా తక్కువ. ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి రూ.1,703 కోట్ల బకాయిలు రావాలి. రాష్ట్ర విభజన తర్వాత మన విద్యుత్ తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 6,112 కోట్ల బకాయి పడింది. వీటిని ఇప్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. రాష్ట్ర విభజన సమయంలో రీసోర్స్ గ్యాప్ (రెవెన్యూ లోటు) రూ.22,948.76 కోట్లు అయితే ఇచ్చింది రూ.4,117.89 కోట్లు మాత్రమే. రీసోర్స్ గ్యాప్‌ను 2014–15 బడ్జెట్ ద్వారా పూడుస్తామని చెప్పారు. కాగ్ ప్రకారం గ్యాప్ విలువ రూ.16,078.76 కోట్లు కాగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఎఫ్ లాంటి బకాయిలతో కలిపి లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. ఓవర్ బారోయింగ్ పేరుతో రుణాలు కత్తిరించడం అన్నది ఎప్పుడూ లేదు. చంద్రబాబు హయాంలో చేసిన దానికి రుణాల్లో కత్తిరింపులకు దిగడం సరికాదు. గత ప్రభుత్వం పరిమితికి మించి రుణం సేకరించిందని తెలిసినప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఆనాడే ఎందుకు స్పందించలేదు? రుణాలను ఇప్పుడు ప్రభుత్వం సక్రమంగా తీరుస్తోంది. అలాంటప్పుడు నికర రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. బీసీ కులాల వారీగా జనాభా లెక్కించేలా ఒత్తిడి తేవాలి. ఉపాధిహామీ కింద రాష్ట్రానికి రూ.4,976.51 కోట్ల బకాయిలు చెల్లించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశాం. ప్రత్యామ్నాయాలను కూడా సూచించాం. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా 13 కాలేజీలకు అనుమతి రావాలి. పేదల ఇళ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరాం. దిశ బిల్లు ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరాలి. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అన్నదాతలకు మన పార్టీ తరఫున మద్దతు పలకాలి. మనది ప్రజల కూటమి.. ‘‘మన ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచింది. మరో రెండేళ్ల తర్వాత ఎన్నికల కాలం వచ్చేస్తుంది. మన పార్టీకి అంటూ ఒక సిద్ధాంతం ఉంది. మనకంటూ సొంత బలం ఉంది. మనం ఏ కూటమిలోనూ లేం.. ఎవరి తరఫునా లేం.. మనది ప్రజల కూటమి. మనం ప్రస్తావించే ప్రతి అంశం కూడా ప్రజల తరఫునే. మనం వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ప్రజలకు మేలు జరిగే ఏ అంశం కోసమైనా మనం ముందడుగు వేయాలి. ఎంపీలు అంతా కలసికట్టుగా ముందుకు సాగాలి. సమష్టిగా రాష్ట్రం కోసం పనిచేయాలి. మనకంటూ బలం ఉంది... మన పార్టీకి ప్రతిష్ట ఉంది. ఆ ప్రతిష్టను నిలబెట్టేలా ప్రతి క్షణం ప్రజల కోసం పాటుపడాలి. ప్రజలకు మేలు జరిగే అంశాల్లో మనం ముందుకు అడుగు వేయాలి’’ – వైఎస్సార్ సీపీ ఎంపీలతో సీఎం జగన్ -
రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాం: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ భేటీలో త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. భేటీ అనంతరం వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలిపారు. సమావేశాల్లో పలు అంశాలపై ఎలా స్పందించాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. తాము ఏ కూటమిలో లేమని, తమది ప్రజల కూటమి అని సీఎం జగన్ చెప్పారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రతిష్టను నిలబెట్టేలా పార్లమెంటులో వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారని తెలిపారు. పోలవరం నిర్మాణ ఖర్చు రూ. 55 వేల కోట్లు ఆమోదం పొందేలా కృషి చేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. జాతీయ ప్రాజెక్టులో సాగునీరు, విద్యుత్ కలిపి చూడాలని కొరతామని, జోనల్ కౌన్సిల్లో ముఖ్యమంత్రి లేవనెత్తిన 6 అంశాలు పార్లమెంట్లో గళమెత్తుతామని చెప్పారు. ఆహార భద్రత చట్టం ద్వారా ఏపీకి అన్యాయం జరుగుతోందని, దాన్ని ఉభయసభల్లో లేవనెత్తుతామని.. తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. వరద బాధితులకు తాత్కాలికంగా రూ.1000 కోట్లు కావాలని సీఎం జగన్ కోరారని పార్లమెంటులో ఈ అంశంపై మాట్లాడతామని తెలిపారు. బీసీ జనగణన అసెంబ్లీలో తీర్మానం చేశామని, దాన్ని కూడా కేంద్రంతో ప్రస్తావిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని, దాన్ని లాభాల్లోకి తెచ్చేందుకు గట్టిగా కృషి చేస్తామని అన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం రూ.30 వేల కోట్ల కోసం పోరాడతామని, ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నాని చెప్పారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. చదవండి: ‘ఒకటో తరగతితో బీజం వేస్తే.. 20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం’ -
నవంబర్‌లో ‘ప్రజాసంగ్రామ యాత్ర’
సాక్షి, హైదరాబాద్: రెండో దశ ‘ప్రజాసంగ్రామ యాత్ర’కు రాష్ట్ర బీజేపీ సన్నద్ధమవుతోంది. వచ్చే నెల 10 తర్వాత నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పాదయాత్రకు సంబంధించి జాతీయ నాయకత్వం నుంచి ఆమోదం లభించినట్లు సమాచారం. ఏర్పాట్లకు సంబంధించి వివిధ కమిటీల పునర్ వ్యవస్థీకరణ, మొత్తం యాత్రలో ఉండగలిగే నేతలు, ప్రజల దృష్టిని ఆకర్షించేలా వినూత్న కార్యక్రమాల రూపకల్పనపై పార్టీపరంగా కసరత్తు ఊపందుకుంది. నవంబర్‌లో జరిగే పార్లమెంటు సమావేశాలను దృష్టిలో ఉంచుకుని పాదయాత్ర షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 2 వరకు తొలిదశ పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ సందర్భంగా నిర్మల్ సభా వేదికగా తెలంగాణలో మొత్తం ఐదు విడతల్లో ప్రజాసంగ్రామ యా త్ర చేపట్టనున్నట్లు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల వరకు సన్నద్ధంగా.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమ యం ఉన్నందున అప్పటిదాకా పాదయాత్ర, ఇతర కార్యక్రమాల రూపంలో పార్టీ అధ్యక్షుడు మొదలు కుని వివిధ స్థాయిల నేతలు, కార్యకర్తలు, అను బంధ విభాగాలు భాగస్వాములయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తొలిదశ పాదయాత్రలో కీలకంగా వ్యవహరించిన ముఖ్యనేతలు ఇటీవల ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వానికి ఆయా అంశాలను వివరించి, రెండోదశ యాత్రకు సూత్రప్రాయ అంగీకారం తీసుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలోని పాదయాత్ర పర్యవేక్షకులు పలు సూచనలు చేసినట్లు సమాచారం. తొలిదశ లోటుపాట్లను అధిగమిస్తూ.. తొలిదశ పాదయాత్రలోని లోటుపాట్లు అధిగమించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మొదటిదశ పాదయాత్ర జరిగిన తీరుపై జాతీయపార్టీ తరఫున పర్యవేక్షించిన ఆరుగురు సభ్యుల సాంకేతిక బృందం పార్టీ నాయకత్వానికి నివేదిక సమర్పించింది. తొలివిడత యాత్రకు స్పందన బాగానే ఉన్నా రెండోదశ మరింత విస్తృతంగా చేపట్టేలా పలు సూచనలు చేసింది. గ్రామీణ ప్రాంత ప్రజలను కలుసుకుని, సమస్యలు తెలుసుకుని, బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే దానిపై స్పష్టతనిస్తూ సాగాలని సూచించింది. యాత్ర సాగుతున్న రూట్లోని నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని, ఈ సందర్భంగా ఇతర పార్టీల ముఖ్యమైన నేతలను చేర్చుకునేందుకు ప్రాధాన్యమివ్వా లని సూచనలు చేసినట్లు సమాచారం. -
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, ఢిల్లీ: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. విజయసాయిరెడ్డితో పాటు మరో సభ్యుడిగా బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఎన్నికయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్‌దీపక్ శర్మ.. పార్లమెంట్ బులిటెన్ విడుదల చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలించనుంది. -
పెగసస్‌పై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: పెగసెస్ స్పైవేర్ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. పెగసస్ స్పైవేర్ నిఘా నివేదికలపై కేంద్రం సమాధానం చెప్పాల్సిందేనని విపక్షాలు పట్టు బట్టాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి విపక్షాలు పెగసస్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ.. సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం విపక్షాల డిమాండ్లపై కేంద్రం స్పందించింది. పెగసస్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. పెగాసస్ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ విక్రేత అయిన ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓతో ఎలాంటి లావాదేవీలు చేయలేదని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. డాక్టర్ వి శివదాసన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సోమవారం రాజ్యసభలో రక్షణ మంత్రిత్వ శాఖ సమాధానంలో భాగంగా ఈ ప్రకటన చేసింది. ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్‌తో ప్రభుత్వం ఏవైనా లావాదేవీలు జరిపిందా లేదా అన్న ప్రశ్నకు రక్షణ మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. "ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్‌తో ఎలాంటి లావాదేవీలు జరపలేదు" అని జూనియర్ రక్షణ మంత్రి అజయ్ భట్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. పెగసస్‌తో తాము ఎవరిపైనా అక్రమ నిఘా నిర్వహించలేదని ప్రభుత్వం ఇప్పటివవరకు చెప్తూ వచ్చింది. కానీ ఈ సమాధానం విపక్షాలను సంతృప్తిపరిచేదిగా లేదు. ఈ క్రమంలో విపక్షాలు కేంద్రం ముందు ఒకే ప్రశ్నను ఉంచాయి. అదేంటంటే.. కేంద్రానికి ఎన్ఎస్ఓతో ఏదైనా సంబంధం ఉందా.. అలానే దేశ పౌరులపై కేంద్రం నిఘా ఉంచిందా లేదా అనే దానికి సూటిగా జవాబు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇక రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థలోని ప్రముఖలు లక్ష్యంగా చేసుకుని వారిపై నిఘా పెట్టారని గ్లోబల్ మీడియా కన్సార్టియం నివేదించినప్పటి నుంచి ప్రతిపక్షాలు ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరుతున్నాయి. ఇక ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. -
‘గెజిట్ నోటిఫికేషన్‌తో కేఆర్ఎంబీ సమర్థవంతంగా పనిచేసే అవకాశం’
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో జల విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పలు దఫాలుగా జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందని జల శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కేఆర్ఎంబీకి ఇండెంట్ పెట్టకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో తెలంగాణ ఏకపక్షంగా జల విద్యుత్ ఉత్పాదన చేస్తున్నట్లుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ గత జూలై 5న జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలంటూ గత జూన్ 17న లేఖ ద్వారా తెలంగాణ జన్‌కోను ఆదేశించింది. జల విద్యుత్ ఉత్ప్తత్తి కోసం నీటి వినియోగంపై కేఆర్ఎంబీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు విద్యుత్ ఉత్పాదన చేయవద్దని ఆ లేఖలో సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్‌తోపాటు నాగార్జున సాగర్ డామ్, పులిచింతల ప్రాజెక్ట్‌ల నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తూనే ఉన్నందున దీనిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ జూలై 15న కేఆర్ఎంబీ తెలంగాణ జెన్కో అధికారులను ఆదేశించిందని చెప్పారు. జల విద్యుత్ ఉత్పాదన కోసం వినియోగించే నీరు సాగు, తాగు నీటి అవసరాలకు మాత్రమే వినియోగించడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించినందున కేవలం జల విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించడం తగదని కూడా కేఆర్ఎంబీ స్పష్టం చేసినట్లు మంత్రి చెప్పారు. కేఆర్ఎంబీ రాసిన లేఖలపై తెలంగాణ జెన్కో (హైడల్) డైరెక్టర్ జూలై 16న ప్రత్యుత్తరమిస్తూ జల విద్యుత్ ఉత్పాదన చేయాలని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే తాము విద్యుత్ ఉత్పాదన చేస్తున్నట్లు కేఆర్ఎంబీకి తెలిపారని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పాదన కోసం నీటిని వినియోగించేందుకు కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసే వరకు శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్, నాగార్జున సాగర్ డామ్, పులిచింతల ప్రాజెక్ట్‌లలో విద్యుత్ ఉత్పాదన కోసం నీటి విడుదలను నిలిపివేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా కేఆర్ఎంబీ జూలై 16న రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. అయినప్పటికీ కేఆర్ఎంబీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేఆర్ఎంబీకి కల్పించిన అధికారాలను సద్వినియోగం చేసే దిశగా కేఆర్ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. దీని వలన బోర్డు మరింత సమర్ధవంతంగా పని చేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
2021లో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రులను నెలకొల్పలేదు: రామేశ్వర్ తేలి
సాక్షి, ఢిల్లీ: కొత్త ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటు నిరంతర ప్రక్రియ అని, ఆయా ప్రాంతాల్లో ఈఎస్ఐ సభ్యుల సంఖ్య, తదితర వివరాల ఆధారంగా ఆస్పత్రి ఏర్పాటు జరుగుతుందని కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో మొత్తం 160 ఈఎస్ఐ ఆస్పత్రులు ఉన్నాయని, వాటిలో 50 ఆస్పత్రులను ఈఎస్ఐ కార్పొరేషన్ నిర్వహిస్తుండగా, 110 ఆస్పత్రులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఈఎస్ఐ డైరక్టరేట్లు నిర్వహిస్తున్నాయని తెలిపారు. 2019లో ఒడిశాలోని అంగుల్, ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటు జరిగిందని చెప్పారు. 2020లో కోర్బా(చత్తీస్‌గఢ్), ఉదయ్‌పూర్(రాజస్థాన్), రాయ్‌పూర్(చత్తీస్‌గఢ్)లో ఏర్పాటు చేశామని తెలిపారు. 2021లో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రులను నెలకొల్పలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూర్యాపేట సహా మరెక్కడైనా ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగులో లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. -
ప్రతిపక్షాలది ‘సెల్ఫ్ గోల్’ : ప్రధాని మోదీ
లక్నో: ప్రజాసంక్షేమమే పరమావధిగా కొనసాగే పార్లమెంట్ సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ విపక్షాలు ‘సెల్ఫ్ గోల్’ చేసుకుంటున్నాయని ప్రధాని మోదీ విపక్షాల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఒకవైపు, పలు రంగాల్లో విజయపరంపరలో ‘గోల్’ తర్వాత గోల్ కొడుతూ దేశం ముందుకు సాగుతుంటే, మరో పక్క స్వీయ ప్రయోజనాలు చూసుకుని విపక్షాలు ‘సెల్ఫ్ గోల్స్’ చేస్తున్నాయని మోదీ ఆరోపించారు. ప్రధానమంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన దినోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తున్న సందర్భంగా గురువారం కేంద్రప్రభుత్వ ఆహార భద్రతా పథకం లబ్దిదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. గత ఏడాది అయోధ్య రామమందిరం కోసం ‘భూమి పూజ’ కార్యక్రమాన్నీ ఘనంగా చేసుకున్నాం. ఈసారి ప్రఖ్యాత ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్టు విజయకేతనం ఎగరేసింది. 50 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయింది. రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూళ్లు, వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయ పెరుగుదల, విక్రాంత్ యుద్ధవిమాన వాహక నౌక తయారీ.. ఇలా దేశం ఎంతగా పురోగతిని కోరుకుంటోంది.. ఎంతటి ఘన విజయాలను సాధిస్తోంది. ఎంతగా దేశం పురోగమిస్తుందనేవి ఏవీ విపక్షాలకు పట్టవు. స్వీయ ప్రయోజనాలే లక్ష్యంగా పెగసస్ అంశంపై పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి ’ అని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. యూపీ సీఎంను ఉద్దేశిస్తూ.. ‘ ఆయన సీఎం యోగి మాత్రమే కాదు. కర్మయోగి’ అని కొనియాడారు. మానవాళికి సవాలుగా పరిణమించిన మహా విపత్తును ఎలా ఎదుర్కోవాలా అని ప్రతీ పౌరుడు శ్రమిస్తుంటే.. వీరు( విపక్ష సభ్యులు) జాతి ప్రయోజనాలకోసం చట్టాలు చేసే పార్లమెంట్ సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ వీరు దేశ ప్రగతిని ఆపే పనిలో ఉన్నారు. కానీ 130 కోట్ల భారతీయులు దేశం ముందుకు సాగడం కోసం పాటుపడుతున్నారు. భారత్ ముందడుగు వేస్తోంది(భారత్ చల్ పఢా హై)’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ దేశ ప్రగతి పథం ఢిల్లీకి యూపీ మీదుగా వెళ్తోంది. యూపీని వాడుకుని కొన్ని ‘కుటుంబాలు’ మాత్రమే బాగుపడ్డాయి. ఆ కుటుంబాల వారు యూపీ అభివృద్ధికి చేసింది శూన్యం ’ అని మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. -
రాజ్యాంగాన్ని అవమానిస్తారా?
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాల వ్యవహార శైలిపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులను ఆమోదిస్తున్నప్పుడు సభలో కాగితాలు చించిపారేయడం, ప్రభుత్వాన్ని కించపర్చేలా మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. ప్రతిపక్షాలు శాసన వ్యవస్థను, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని, అర్థవంతమైన చర్చలు జరగడం విపక్ష సభ్యులకు ఇష్టం లేదని దుయ్యబట్టారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పని చేస్తున్నామని, జనం బాగు కోసమే బిల్లులను తీసుకొస్తున్నామని తెలిపారు. పెగసస్ అంశంతోపాటు కొత్త సాగు చట్టాలపై విపక్ష సభ్యులు పార్లమెంట్ ఉభయ సభను స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, వి.మురళీధరన్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో అనుచిత ప్రవర్తన పట్ల ప్రతిపక్షాలు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకపోవడం విచారకరమని ప్రధాని అన్నారని తెలిపారు. విపక్షాలు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాయని, కొందరు ప్రతిపక్ష నేతలు పార్లమెంటరీ ప్రక్రియకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. విపక్ష సభ్యులు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలంటూ తమకు ప్రధాని సూచించారని వివరించారు. -
‘కోవిషీల్డ్ ఉత్పత్తిని 120 మిలియన్ డోసులకు పెంచుతాం’
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ నాటికి కోవిడ్ టీకాల ఉత్పత్తి పెంచుతామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. పార్లమెండ్ సమావేశాల్లో భాగంగా మంగళవారం కోవిడ్ టీకాలపై రాజ్యసభలో మంత్రి మన్సుఖ్ వివరణ ఇచ్చారు. ఈ సదర్బంగా ఆయన మాట్లాడుతూ.. కోవిషీల్డ్ ఉత్పత్తిని నెలకు 120 మిలియన్ డోసులకు పెంచుతామని తెలిపారు. కొవాగ్జిన్ ఉత్పత్తిని నెలకు 58 మిలియన్ డోసులకు పెంచుతామని చెప్పారు. ఈనెల నుంచే టీకాల ఉత్పత్తి పెంపు ప్రారంభం అవుతుందని వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సిన్ల అభివృద్ధికి 'మిషన్ కోవిడ్ సురక్ష' కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనట్లు మంత్రి తెలిపారు. -
‘ప్రకాశం బ్యారేజ్‌ని కేఆర్ఎంబీ పార్టీ నుంచి డీనోటిఫై చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ: 299 టీఎంసీల కోటా నుంచి తెలంగాణ అదనంగా నీరు వాడుకుందని, కేంద్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఆయన సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వరదజలాల వినియోగంపై కేంద్రం వాటర్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారుచేయాలని అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ని కేఆర్ఎంబీ పార్టీ నుంచి డీనోటిఫై చేయాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. -
‘జలశక్తి శాఖలో పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ ఏదీ పెండింగ్‌లో లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను అడ్వైజరీ కమిటీ 2011లో ఒకసారి, ఆ తర్వాత ఫిబ్రవరి 2019లో ఆమోదించిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి షేకావత్ సమాధానం ఇస్తూ.. జలశక్తి శాఖలో పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ ఏదీ పెండింగ్‌లో లేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 2005-06 లెక్కల ప్రకారం రూ.10,151.04 కోట్ల అచనాలతో డీపీఆర్‌ను ఆమోదించామని తెలిపారు. 2009 జనవరి 20న ఈ డీపీఆర్‌ను జలశక్తి శాఖలోని ఫ్లడ్ కంట్రోల్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ 95వ మీటింగ్‌లో ఆమోదించిందని తెలిపారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదన్న కేంద్రం
సాక్షి, న్యూ ఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్దా అహ్మద్ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం పేర్కొంది. అదే విధంగా ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, భాగస్వాముల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపింది. -
‘నౌకాయానం రంగంలో.. ఏపీ ప్రతిపాదనలను ఆమోదించాలి’
సాక్షి, న్యూఢిల్లీ: నౌకాయానం, ఓడరేవులు సంబంధిత రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు కేంద్రాన్ని కోరారు. నౌకాయానానికి సహకారిగా ఉండే సముద్ర ఉపకరణాల బిల్లు–2021పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నౌకాయాన ఉపకరణాల అభివృద్ధి, నిర్వహణ, యాజమాన్యానికి వీలు కల్పించే ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం ఈ బిల్లు ముఖ్యోద్దేశమని, లైట్‌హౌస్ యాక్ట్–1929 చట్టాన్ని దీని ద్వారా తొలగించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలన్నారు. ఏపీకి సంబంధించి 2015లో గుర్తించిన లైట్‌హౌస్‌ల అభివృద్ధిలో పురోగతిలేదని నివేదించారు. దేశ వాణిజ్యం పరిణామాత్మకంగా 95 శాతం, విలువ పరంగా 70 శాతం సముద్రయానం ద్వారానే జరుగుతోందని.. 2019–20లో భారత ఓడరేవులు 1.2 బిలియన్ మెట్రిక్ టన్నుల మేర సరుకు రవాణాకు వీలు కల్పించాయన్నారు. -
రైతులకు మద్దతుగా రాహుల్ ట్రాక్టర్ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. ఐదో రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆయన స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యకతిరేకతంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీకి రాహుల్ గాంధీ మద్దతు పలికారు. అయితే పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే పార్లమెంట్ భవనంలోకి అనుమతి ఉండటంతో రాహుల్ గాంధీ ట్రాక్టర్‌ను లోపలకి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆయన ట్రాక్టర్ మీద నుంచే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించిన సమస్యను పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్లిందని, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను ఉభయ సభల్లో చర్చించడానికి అనుమతించడం లేదని మండిపడ్డారు. దేశంలోని రైతులు తీవ్రంగా అణచివేయబడుతున్నారని, అందుకే తాను రైతుల చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా పాల్గొన్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు.. నల్ల చట్టాలని వాటిని వెంటనే కేంద్రం వెనక్కు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్రం ఈ చట్టాలను రైతుల కోసం కాకుండా కొంతమంది కార్పొరేట్ వ్యాపారుల కోసం తీసుకువచ్చిందని దుయ్యబట్టారు. ఈ నల్ల చట్టాలను ఎందుకు తీసుకువచ్చారో దేశంలోని ప్రజలకు తెలుసన్నారు. పార్లమెంట్ ముందు నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు రణదీప్ సుర్జేవాలా, బీవీ శ్రీనివాస్‌లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై స్వరం పెంచిన ప్రతి ఒక్కరినీ మోదీ ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాబోయే తరాల కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అరెస్టులు చేసినా చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. -
నేడే ‘నెవర్ బిఫోర్’ బడ్జెట్
న్యూఢిల్లీ: కరోనాతో ఒకవైపు జనజీవితం, మరోవైపు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు(సోమవారం) ఉదయం 11 గంటలకు పార్లమెం ట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ‘నెవర్ బిఫోర్’ బడ్జెట్‌ను ప్రకటించనున్నట్లు ఇటీవల నిర్మల ప్రకటించిన నేపథ్యంలో.. కరోనా మహమ్మారితో కుదేలైన వ్యవస్థలన్నీ ఈ బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాయి. కరోనా దుష్ప్రభావాలను నిర్మూలించే సమర్ధవంతమైన ‘వాక్సిన్’ను ఆర్థిక మంత్రి ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నాయి. కరోనా కడగండ్లతో చతికిలపడిన సామాన్యుడికి ఊరట కల్పించే నిర్ణయాలతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ వేగం పెంచే ఉద్దీపనల వరకు.. సమస్త పునరుజ్జీవన చర్యలు ఈ బడ్జెట్లో ఉంటాయన్న ఆశాభావంతో ప్రజలు న్నారు. బడ్జెట్‌ను లెదర్ బ్యాగ్‌లో పార్లమెంటుకు తీసుకువచ్చే దశాబ్దాల సంప్రదాయాన్ని 2019లో తన తొలి బడ్జెట్ ప్రకటన సందర్భంగా నిర్మల తోసిపుచ్చారు. ఎర్రని వస్త్రంలో చుట్టిన ‘బహీ ఖాతా’లో బడ్జెట్‌ను పార్లమెంటుకు తీసుకువచ్చారు. ఈ సారి ఆ బహీ ఖాతాలో ఆర్థిక మంత్రి ఏం దాచారనేది ఆసక్తిగా మారింది. ఒక మధ్యంతర బడ్జెట్ సహా మోదీ హయాంలో ఇది 9వ బడ్జెట్. ఈ బడ్జెట్లో వైద్యారోగ్యం, మౌలిక వసతులు, రక్షణ రంగాల్లో కేటాయింపులు పెరుగుతాయని భావిస్తున్నారు. ఉపా« ది కల్పన, గ్రామీణాభివృద్ధి, ఇతర అభివృద్ధి పథ కాలకు కూడా గరిష్టంగా కేటాయింపులు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రజల చేతిలో మరింత నగదు ఉండేం దుకు వీలు కల్పించేలా కీలక ప్రకటన ఉంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే, మరిన్ని విదేశీ పెట్టబడులను ఆకర్షించేందుకు సంబంధిత నిబంధనల్లో సడలింపు కూడా ఉంటుందని తెలుస్తోం ది. కరోనా దుష్ప్రభావాలను తొలగించాలంటే.. కేవలం జమా ఖర్చుల పద్దును ప్రకటిస్తేనో, లేక పాత సీసాలో కొత్త సారాయి తరహా పథకాలను ప్రకటిస్తేనో సరిపోదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకు రావాలంటే.. దేశ బడ్జెట్ ఒక దార్శనిక ప్రకటనలా ఉండాలంటున్నారు. కరోనా తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ కొనసాగుతుండటం వంటి సానుకూలతల మధ్య వస్తున్న ఈ బడ్జెట్ దేశంలోని అన్ని వ్యవస్థలకు జవజీవాలను చేకూర్చేలా ఉండాలి. కరోనా ప్రారంభమయ్యేనాటికే దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. 2019–20 జీడీపీ 11 సంవత్సరాల కనిష్టానికి దిగజారి, 4 శాతానికి చేరింది. పెట్టుబడుల వృద్ధి రేటు కూడా తిరోగమనంలో ఉంది. ఆ తరువాత, కరోనా వైరస్ కట్టడికి ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఆర్థికరంగ కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. దాంతో, ‘ఆత్మనిర్భర్ భారత్’ పేరుతో ప్రభుత్వం 3 ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిం చింది. అయితే, అవేమీ పెద్దగా ప్రభావం చూపలేదు. కాగా, ఈ బడ్జెట్లో కరోనా టీకా కార్యక్రమం ఖర్చు ఎంత ఉండనుందనేది ఆసక్తిగా మారింది. బీపీసీఎల్, ఎస్సీఐ, ఎయిర్ఇండియా వంటి సంస్థల ప్రైవేటైజేషన్‌తో ఎంత ఆదాయాన్ని సమకూర్చు కోవాలని ప్రభుత్వం భావిస్తోందన్న విషయం కూడా నిపుణుల దృష్టిలో ఉంది. ‘ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో మౌలిక రంగానికి సహకరించాలి. పారిశ్రామిక, సేవలు, సాగు రంగాల్లోకి పెద్ద ఎత్తున ప్రైవేటు, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలి. పన్ను ఆదాయంపై రాజీ పడకుండానే ప్రజల్లో వినియోగం పెంచాలి. ఆరోగ్య, విద్య రంగాల్లో కేటాయింపులు పెంచాలి’ అని ‘డూన్ అండ్ బ్రాడ్షీట్’లో గ్లోబల్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్న అరుణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘ప్రజలపై భారం వేయకుండా, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయడమనే క్లిష్టమైన సవాలు ప్రభుత్వం ముందుంద’ని ఆయన వ్యాఖ్యానించారు. ‘వైద్యారోగ్య రంగంలో మౌలిక వసతులు, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల అమలు వంటి అంశాలపై కూడా ఈ బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ పేర్కొంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సదుపాయం పెంచడంపై, విద్య, వైద్య రంగాల్లో పెట్టబడులు పెంచడంపై దృష్టి పెట్టాలని ‘గ్లోబల్ డేటా’ సంస్థ సూచించింది. -
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి: సీఎం జగన్
‘‘మతం అనేది నాలుగు గోడల మధ్య దేవుడికి, మనిషికి మధ్య ఉన్న అనుబంధం. ఆ గది బయటకు వచ్చిన తర్వాత ప్రతి మనిషి సాటివారికి గౌరవం ఇవ్వాలి. మానవత్వం అంటే ఇదే. దీనినుంచి పక్కకు వెళ్తే సమాజంలో అశాంతి మొదలవుతుంది’’ – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్సార్ సీపీ ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్టీ ఎంపీలతో సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా ముందుకు వెళ్లాలని సూచించారు. పోలవరం, ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణను ఖరారు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులపై పూర్తి వివరాలతో సిద్ధం కావాలని సూచించారు. ఎంపీలతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో ముఖ్యాంశాలు ఇవీ.. పోలవరంపై పట్టుబట్టాలి.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.1,569.86 కోట్ల బకాయిలను రాబట్టేందుకు పార్లమెంట్లో ప్రస్తావించాలి. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్ల పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేసింది. రివిజన్ కమిటీ నిర్ణయించిన ప్రకారం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను కేంద్రం ఆమోదించేలా ఎంపీలు పార్లమెంట్లో ఒత్తిడి తేవాలి. పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా.. మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో గట్టిగా పట్టుబట్టాలి. రాష్ట్రంలో మొత్తం 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా మూడు కాలేజీలకు కేంద్రం ఆమోదం తెలిపింది. మన ఎంపీల కృషి వల్ల ఈ కాలేజీలకు కేంద్రం నిధులు కూడా అందిస్తోంది. మిగిలిన కాలేజీల విషయంలోనూ ముందుకెళ్లేలా గట్టిగా ప్రయత్నించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రం నుంచి రూ.4,282 కోట్ల బకాయిలను రాబట్టేలా పార్లమెంట్లో ప్రస్తావించాలి. 14, 15వ ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రావాల్సిన రూ.1,842.45 కోట్లు నిధులు ఇవ్వాలని కోరాలి. నివర్ తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంటలకు ఎన్టీఆర్ఎఫ్ కింద కేంద్రం ఇవ్వాల్సిన రూ.2,255.70 కోట్ల గురించి పార్లమెంట్లో అడగాలి. విద్యుత్ ఒప్పందాల భారం తగ్గాలి.. ఎన్టీపీసీకి చెందిన కుడ్గీ, వల్లూరు థర్మల్ ప్రాజెక్టుల నుంచి అత్యధిక ధరలతో విద్యుత్ కొనేందుకు గత సర్కారు ఒప్పందాలు చేసుకుంది. యూనిట్ రూ.6 చొప్పున ఒకటి, రూ.9 చొప్పున చేసుకున్న మరో ఒప్పందాలను కేంద్రానికి ఇవ్వడం (సరెండర్ చేయడం) ద్వారా డిస్కమ్‌లపై రూ. 800 కోట్ల భారం తగ్గింది. వీటి పీపీఏలు రద్దు చేయడం వల్ల ఏటా రూ.350 కోట్ల ఫిక్స్డ్ ఛార్జీల చెల్లించాల్సిన ఇబ్బంది నుంచి విద్యుత్ సంస్థలు గట్టెక్కుతాయి. రాష్ట్రంలో విద్యుత్ ధరలను తగ్గించడం, రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్తును అందించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన టెండర్లను పిలుస్తోంది. దీనికి కేంద్రం నుంచి అనుమతులను సాధించే దిశగా ఎంపీలు కృషి చేయాలి. దిశ బిల్లుకు అవసరమైన సవరణలు చేసి తిరిగి కేంద్రానికి పంపాం. దీనికి త్వరగా ఆమోదం లభించేలా ప్రయత్నించాలి. కర్నూలుకు హైకోర్టు తరలింపుపై.. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి బిల్లులను ఆమోదించాం. కర్నూలుకు హైకోర్టు తరలింపుపై తిరిగి రీ నోటిఫికేషన్ ఇవ్వాలని పార్లమెంట్లో ప్రస్తావించాలి. ఈ అంశాన్ని బీజేపీ కూడా వారి మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని పార్లమెంట్ వేదికగా గుర్తు చేయాలి. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.3,707.77 కోట్ల బకాయిల గురించి అడగాలి. పని దినాలను వంద నుంచి 150 రోజులకు పెంచాలని డిమాండ్ చేయాలి. వెనకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.700 కోట్ల బకాయిల విడుదలకు కృషి చేయాలి. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుతోపాటు రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రూ.18,830.87 కోట్లు కేంద్రం ఇవ్వాలనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి తేవాలి. ట్రిబ్యునల్స్ ఏర్పాటు కావచ్చు.. విశాఖ రైల్వే జోన్ విషయంలో అలసత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించాలి. అంతరాష్ట్ర జల వివాదాల బిల్లు పార్లమెంట్లో చర్చకొచ్చే వీలుంది. కొన్ని ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయవచ్చు. నదులను జాతీయం చేసి అనుసంధానించి ఎక్కడ ఎన్ని నీళ్లు వస్తాయో దామాషా పద్ధతిలో, ఏ రాష్ట్రాల్లో ఎంత భూవిస్తీర్ణం ఉందనే దాన్ని బట్టి 15 రోజులకోసారి నీళ్లను పంచుకోవాలనేది యోచనను కేంద్రానికి తెలియచేయాలి. మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెసీ, డీఎన్ఏ టెక్నాలజీ, పర్సనల్ డేటా ప్రొటెక్షన్, ఎన్ఆర్ఐ వివాహ నియంత్రణ, సినిమాటోగ్రఫీ, డామ్సేఫ్టీ, పోర్టు అథారిటీ బిల్లులు చర్చకొచ్చే వీలుంది. మైనర్ పోర్టులపై కేంద్రం అధికారం తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. దీనిపై బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందాం. దాడుల ఘటనలపై చర్చకు సిద్ధం కావాలి.. ఇటీవల దేవాలయాల్లో జరిగిన ఘటనలపై చర్చకు ఎంపీలు సమగ్ర వివరాలతో సిద్ధం కావాలి. ఈ కేసుల్లో రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు ఉన్నట్లు విచారణలో తేలింది. శ్రీకాకుళం జిల్లాలో నంది విగ్రహాన్ని టీడీపీకి చెందిన వ్యక్తులు తొలగించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇది జరిగింది. ఈ ఘటనకు వైఎస్సార్ సీపీ వారు బాధ్యులని తొలుత ప్రచారం చేశారు. ఈనాడు విలేఖరి కూడా ఈ కేసులో భాగస్వామిగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సీసీ కెమెరా విజువల్స్ బయటపడిన తర్వాత చంద్రబాబు తన వాదనను మార్చారు. వైఎస్సార్ విగ్రహాన్ని పెడుతున్నారు కాబట్టి నంది విగ్రహం పెట్టడం తప్పు ఎలా అవుతుంది అంటూ మాట మార్చారు. ఒకరి విగ్రహాలను అడ్డుకోవడానికి ఆలయాల్లోని విగ్రహాలను తొలగించి పెడతారా? వ్యవసాయ చట్టాలపై స్పష్టత... కేంద్రం తీసుకొచ్చే 11 బిల్లుల విషయంలో పార్టీ వైఖరి ఎలా ఉండాలనే విషయంపై ఎంపీలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలపై స్పష్టత ఇచ్చారు. ధాన్యం ఎవరు కొనుగోలు చేసినా, రైతులకు కచ్చితంగా కనీస మద్దతు ధర లభించేలా చూడాలన్నది ప్రభుత్వ విధానమన్నారు. ‘ఎక్కడ కొనుగోళ్లు జరిగినా కనీస మద్దతు ధరకు తగ్గకుండా ఉండాలి. ఎవరు కొన్నా ఎంఎస్పీ కంటే తక్కువకు కొనకూడదు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ షరతులతో కూడిన మద్దతు ఇచ్చింది. వాటిని అమలు చేయాలని పార్లమెంట్లో డిమాండ్ చేయాలి’ అని సూచించారు. దేవాలయాలపై దాడుల్లో టీడీపీ ప్రమేయం: విజయసాయిరెడ్డి దేవాలయాల్లో జరిగిన దాడుల ఘటనల గురించి సమగ్ర వివరాలతో పార్లమెంట్లో ప్రస్తావిస్తామని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ప్రకటించారు. పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం నిర్వహించిన సమావేశానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయాలపై దాడులకు సంబంధించి పది కేసుల్లో టీడీపీ కార్యకర్తల ప్రమేయం ఉందనే విషయాన్ని కేంద్రం దృష్టికి తెస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో నంది విగ్రహాన్ని దేవాలయం నుంచి పెకలించి నడిరోడ్డుపై పెట్టిన ఘటనలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ప్రమేయం ఉందని తేలిందన్నారు. ఇందులో ఈనాడు దినపత్రిక విలేకరి పాత్ర కూడా ఉందని వెల్లడైందని, ఇవన్నీ కేంద్రానికి వివరిస్తామన్నారు. రూ.1.13 కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం అంతర్వేది రథాన్ని పునర్నిర్మించిందన్నారు. -
21వ శతాబ్దపు ఆవశ్యకాలు!
న్యూఢిల్లీ: తాజాగా పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైనవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడం, కనీస మద్దతు ధర వ్యవస్థ కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. తాజా సంస్కరణలతో రైతులు తాము కోరుకున్న ధరకు, కోరుకున్న చోట తమ ఉత్పత్తులను అమ్ముకునే వీలు లభిస్తుందన్నారు. వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేక బిల్లులని, అవి రైతులను నాశనం చేస్తాయని విపక్ష పార్టీలు నిరసిస్తున్న విషయం తెలిసిందే. హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ బిల్లులపై విమర్శలను ప్రధాని తిప్పికొడుతూ.. ‘చాన్నాళ్లు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన నిబంధనల సంకెళ్లలో రైతులను ఉంచి, వారికి అన్యాయం చేసి, వారిని దోపిడీ చేసిన కొందరు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నార’న్నారు. ‘వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల కొందరు ఆ రంగంపై పట్టు కోల్పోతున్నారు. వాళ్లే ఇప్పుడు కనీస మద్దతు ధరపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయకుండా ఏళ్లకేళ్లు గడిపిన వారే ఇప్పుడు మా నిర్ణయాలను విమర్శిస్తున్నారు’ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు తాజా బిల్లులు వ్యతిరేకం కాదని, ఆ మండీల కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రధాని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్‌లో 9 హైవే ప్రాజెక్టులకు సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ రికార్డు స్థాయిలో గోధుమలను ప్రభుత్వం సేకరించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కన్నా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూనె ధాన్యాల సేకరణ 24 రెట్లు పెరిగిందని వివరించారు. -
రాజ్యసభ రచ్చ..
-
రాజ్యసభ: విపక్ష ఎంపీల సస్పెన్షన్
-
రాజ్యసభలో గందరగోళం
-
‘ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్చాలి’
సాక్షి,న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణం రాజు పశువు కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్పించాలని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ సురేశ్ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘బ్యాంకులకు ఎగనామం పెట్టిన చరిత్ర నీది. మెప్పుకోసం పార్లమెంట్లో వాళ్ల కాళ్లు, వీళ్ల కాళ్లు పట్టుకునే వ్యక్తివి నువ్వు’అని పేర్కొన్నారు. -
ఉద్రిక్తంగానే సరిహద్దు.. రాజ్‌నాథ్ ప్రకటన
న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్లో గురువారం మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారు. సరిహద్దు వివాదంపై ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు రాజ్‌నాథ్ సమాధానమిచ్చారు. చైనాతో ఎలాంటి పరిస్థితులున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు. మన సాయుధ బలగాలతో చైనాకు ఇప్పటికే గట్టిగా సమాధానమిచ్చామని.. ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాలను చైనా బహిరంగంగానే ఉల్లఘింస్తుందని మరోసారి గుర్తుచేశారు. కాగా మంగళవారం చైనా సరిహద్దు వివాదంపై రాజ్‌నాథ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుగాధ బలగాలను మొహరించిందని వివరించారు. (చదవండి : సరిహద్దు వివాదం : రక్షణ మంత్రి కీలక ప్రకటన) -
బచ్చన్ ఫ్యామిలీకి మరింత భద్రత
ముంబై: బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై రవికిషన్ చేసిన వ్యాఖ్యలను జయాబచ్చన్ రాజ్యసభలో ప్రస్తావించిన అనంతరం ముంబై పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బచ్చన్ల ఇంటికి సెక్యూరిటీ మరింత పెంచారు. జుహూలోని బచ్చన్స్ ఐకానిక్ బంగ్లా అయిన జల్సా వెలుపల అదనపు భద్రత కల్పించారు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధించి బాలీవుడ్‌పై వస్తోన్న ఆరోపణలపై జయాబచ్చన్ మంగళవారం రాజ్యసభలో ప్రసంగించించారు. ఆమె ప్రసంగంపై సోషల్ మీడియాలో భిన్నరకాలుగా ట్రోల్స్ వచ్చిన తర్వాత ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వినియోగంపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యానించారు. దీనికి జయా బచ్చన్ స్పందిస్తూ.. కొంతమంది వ్యక్తుల కారణంగా బాలీవుడ్ ప్రతిష్టను కించపర్చడం సరి కాదు. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు' అంటూ జయాబచ్చన్ మండిపడిన సంగతి తెలిసిందే. కాగా.. బుధవారం పార్లమెంటులో జయాబచ్చన్ తీసుకున్న వైఖరికి శివసేన మద్దతుగా ముందుకు వచ్చింది. రవికిషన్ ఆరోపణలపై శివసేన అనుబంధ పత్రిక సామ్నా సంపాదకీయంలో 'అలాంటి వాదనలు చేసేవారు కపటవాదులని.. వారి ప్రకటనలు ద్వంద్వ ప్రమాణాలు కలిగి ఉంటాయని పేర్కొంది. (రవి కిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు) -
ఆ బాధ్యత రాష్ట్రాలదే: కేంద్ర హోం శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల దర్యాప్తులో సిబ్బందిని బలోపేతం చేసే బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర హోం శాఖ తెలిపింది. పోలీసులకు సైబర్ నేరాలపై శిక్షణ, ఐటీ నిపుణులను పోలీసు శాఖలో నియామకాలు చేపడుతున్నాయని పేర్కొంది. ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2017లో 3,466, 2018లో 3,353 ఆన్లైన్ మోసాలు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ కేసుల దర్యాప్తులో సంస్థలు ఐటీ నిపుణుల సహాయం తీసుకుంటున్నాయని పేర్కొంది. (చదవండి: చైనాకు దీటుగా బదులిస్తాం) ఇక సైబర్ నేరాల విషయంలో పోలీసులు, ప్రాసిక్యూటర్లు, జ్యుడీషియల్ అధికారులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలకు కేంద్రం చర్యలు చేపట్టిందన్న హోం శాఖ, సైబర్ నేరాల్లో ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేసింది. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఎంపీలు అడిగిన ప్రశ్నలకు బదులుగా కేంద్ర హోం శాఖ ఈ మేరకు సమాధానాలిచ్చింది.(చదవండి: -
జయా బచ్చన్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
-
సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు: మిధున్ రెడ్డి
న్యూఢిల్లీ: పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత మిధున్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంతో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు కేంద్రం నుంచి వచ్చేలా చూడమని చెప్పారు. నిర్వాసితులకు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలా ఒత్తిడి చేయమని కోరారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేశాము. ఈ అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తాము. జీఎస్టీ పెండింగ్ బకాయిలను రాష్ట్రానికి వచ్చేలా అధికారులతో కలుస్తాం. గరీబ్ కళ్యాణ్ కింద రాష్ట్రానికి నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. 'జనాభా ప్రాతిపదికన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ మెడికల్ కాలేజ్ పెట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం మద్దతు కోరారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఉంటే గిరిజనులకు లాభం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారు. అంతర్వేది టనపై నిజాలు నిగ్గు తేలాలి. మతకలహాలు రెచ్చగొట్టే ప్రయత్నిస్తున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. సీఆర్డీఏ, ఫైబర్ గ్రిడ్లపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరపాలి. దిశా బిల్లు, కౌన్సిల్ రద్దు బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. రఘురామకృష్ణంరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి గౌరవం ఇచ్చింది. అయితే ఆయన ప్రతిపక్షాల ఎజెండా ప్రకారం నడుచుకుంటున్నారు. ఆయనపై త్వరితగతిన అనర్హత వేటు వేయాలి' అని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. (వైఎస్సార్సీపీ ఎంపీలతో సమావేశమైన సీఎం వైఎస్ జగన్) -
‘పార్లమెంట్’పై మోయలేని భారం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా ఎంపీలను రక్షించడంలో భాగంగా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను కేంద్రం కుదించింది. కేవలం 18 సిట్టింగ్‌లకు మాత్రమే పరిమితం చేసింది. వరుస ప్రభుత్వాల ఆర్థిక అవకతవకలను ఎండగట్టడానికి, ప్రభుత్వాల పనితీరును తూర్పారబట్టడానికి, ప్రజల్లో ఎంపీల పలుకుబడిని పెంచడానికి గత 70 సంవత్సరాలుగా ఎంతో ఉపయోగపడుతూ వస్తోన్న ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మొదటిసారిగా మార్పు చేశారు. ఇరు సభల్లోను మంత్రులను ఎంపీలు మౌఖికంగా అడిగే ప్రశ్నల విధానాన్ని రద్దు చేసి, లిఖిత పూర్వకంగా అడిగి, లిఖిత పూర్వకంగానే సమాధానాలు పొందే విధానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే జీరో అవర్‌ను కూడా కుదించారు. జీరో అవర్‌ను 30 నిమిషాలకు పరిమితం చేశారు. ఇక ప్రైవేటు బిల్లులకు సమయాన్నే కేటాయించలేదు. గత కొన్ని పార్లమెంట్ సమావేశాల నుంచి పెండింగ్‌లో పెడుతూ వస్తోన్న 17 బిల్లులను ఈ సమావేశాల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటిలో ఆరు బిల్లులను మాత్రమే పార్లమెంటరీ కమిటీలు స్క్రూటినీ చేశాయి. స్క్రూటిని చేయని ఆ 11 బిల్లులను ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎలా ఆమోదిస్తారో ! ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఈ సమావేశాల్లో కొత్తగా మరో 23 బిల్లుల ఆమోదానికి కేంద్రం ప్రతిపాదించింది. వాటిలో 11 బిల్లులు ఆర్డినెన్స్‌లకు సంబంధించినవే ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు అవసరమైన చట్టాలను ఈ ఆర్డినెన్స్‌ల ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులను ఆరు నెలల్లోగా పార్లమెంట్ ఆమోదించక పోయినట్లయితే ఆ ఆర్డినెన్స్‌లు రద్దువుతాయి. (17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్) వీటితోపాటు పలు అనుబంధ పద్దులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణ కారణంగానైతేనేమీ, దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతీన్న నేపథ్యంలోనేమైతేనేమీ బడ్జెట్ ప్రతిపాదనల్లో లేని విధంగా ఆర్థిక వనరులను ఖర్చు పెట్టడం వల్ల ఈ పద్ధులను పార్లమెంట్ ఆమోదించాల్సి అవసరం ఏర్పడింది. పార్లమెంట్ సమావేశాల్లో కీలక పాత్ర పోషించాల్సిన హోం మంత్రి అమిత్ షా గత ఆరు వారాల్లో మూడు సార్లు ఆస్పత్రి పాలయ్యారు. క్రితం సారి సెప్టెంబర్ 12వ తేదీన ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన కోలుకొని ఎప్పటి నుంచి పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాగలరో ఎవరికి అంతు చిక్కడం లేదు. పార్లమెంట్ సమావేశాలపై ఇప్పటికే మోయలేని భారం ఉండగా, కోవిడ్ నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు, దేశ జీడీపీ వృద్ధి రేటు మైనస్ 23.9 శాతానికి పడి పోవడం, సరిహద్దుల్లో యుద్ధానికి కాలు దువ్వుతున్న చైనాను కట్టడికి చర్యలేమిటీ? తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలనుకుంటోన్న ప్రతిపక్షానికి సభా సమయం ఇంకెక్కడి?! (ప్రతి ఎంపీకి డీఆర్డీవో స్పెషల్ కిట్) -
వైఎస్సార్సీపీ ఎంపీలతో సమావేశమైన సీఎం జగన్
సాక్షి, అమరావతి: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో చర్చకు తీసుకురావాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధన అజెండాగా సమావేశం సాగింది. అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్లో వినియోగించుకునేలా ఎంపీలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే బీఏసీ సమావేశంలో ఏపీకి సంబంధించిన కరోనా నియంత్రణ చర్యలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి స్పీకర్‌ను కోరిన సంగతి తెలిసిందే. (అందుకే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ) -
సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశ తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. శని, ఆదివారాలు సహా మొత్తం 17 రోజుల పాటు నిరవధికంగా ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఉభయ సభలు రోజుకు నాగులు గంటలు మాత్రమే జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్యసభ సమావేశాలు జరిగితే, మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 7గంటల వరకు లోక్‌సభ సమావేశాలు కొనసాగనున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌తో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహిణ కోసం అధికారులు ఉభయ సభల్లోను ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ.. పార్లమెంట్ సభ్యులకు సీట్లు కేటాయించనున్నారు. చదవండి: (పార్లమెంట్ ‘ప్రశ్నోత్తరాల’పై వేటు!) -
‘ప్రశ్నోత్తరాల’పై వేటు!
పార్లమెంటు సమావేశాలపుడు రోజూ ఏదో ఒక సమస్యపై వాగ్యుద్ధాలు సాగడం, నినాదాలతో, అరుపులు, కేకలతో దద్దరిల్లడం సర్వసాధారణమైంది. కానీ ఈసారి పార్లమెంటు సమావేశాలకు ముందే అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉండబోదని, జీరో అవర్ వ్యవధి తగ్గిందని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు ప్రకటించడమే దీనికి మూలం. ప్రశ్నోత్తరాల సమయం అతి ముఖ్యమైనది. చట్టసభల సారమంతా అందులోనే కేంద్రీకృతమైవుంటుంది. దాని నిడివి రోజూ గంట మాత్రమే కావొచ్చు...కానీ అక్కడ ఈటెల్లా దూసుకొచ్చే ప్రశ్నలకు దీటుగా జవాబిచ్చినప్పుడే ప్రభుత్వం సత్తా తేలుతుంది. ఆ సమయాన్ని ఎంత చక్కగా సద్వినియోగపర్చుకున్నారన్నదే విపక్షాల పనితీరుకు గీటురాయి అవుతుంది. వివిధ మంత్రిత్వ శాఖల పనితీరుపై నిశితంగా ప్రశ్నించడం, అవసరమైన సమాచారం రాబట్టడం, సరైన జవాబులు రానిపక్షంలో నిలదీయడం...తగిన చర్యలు తీసుకునేలా వారిని ఒప్పించడం సభ్యులు చేసే పని. ప్రభుత్వం పనితీరు ఎలా వున్నదో, అందులో ఎన్ని లొసుగులు చోటుచేసుకుంటున్నాయో బట్టబయలు చేసేందుకు ఈ ప్రశ్నోత్తరాల సమయం విపక్షాలకు ఆయుధం. చెప్పాలంటే ఇదొక మందుపాతర. పైకి అంతా సవ్యంగా వున్నట్టు కనబడుతుంది. ఉన్నట్టుండి పెనుతుపాను మొదలవుతుంది. ఏదో యధాలాపంగా అడిగినట్టు కనబడే ఒక ప్రశ్న ఒక మంత్రి రాజకీయ భవిష్యత్తును లేదా ఒక ప్రభుత్వం తలరాతను నిర్దేశించే ప్రమాదం కూడా వుంటుంది. పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో హరిదాస్ ముంద్రా అనే వ్యాపారవేత్త కంపెనీలో ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ ఎందుకు పెట్టుబడులు పెట్టాల్సివచ్చిందన్న రాంసుభాగ్ సింగ్ అనే ఎంపీ ప్రశ్న 1957లో ఆనాటి నెహ్రూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఆయనకు అధికారపక్ష ఎంపీగావున్న నెహ్రూ అల్లుడు, ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ తోడవటంతో అది దేశమంతా మార్మోగిపోయింది. ఆ ప్రశ్న వెంబడి చకచకా దూసుకొచ్చిన ప్రశ్నల పరంపరతో ఆ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది. తవ్వుతున్నకొద్దీ అదొక కుంభకోణంగా రూపుదిద్దుకుని ఆనాటి ఆర్థికమంత్రి టీటీ కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. చట్టసభల పట్ల ప్రభుత్వాలకుండే జవాబుదారీతనాన్ని బాగా పట్టిచూపేది ప్రశ్నోత్తరాల సమయమే. అక్కడ విపక్షాలు అడిగే ప్రశ్నలు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించవచ్చు. చికాకు పరచవచ్చు. వాటికి నేరుగా జవాబీయకపోవచ్చు. ఏం చేసినా జనానికి ప్రభుత్వ ఆంతర్యం అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రశ్నించేవారు కేవలం తమకుండే సందేహం తీర్చుకోవడం కోసమే ఆ పని చేయరు. ఆ ప్రశ్న ద్వారా, దానిపై తలెత్తే అనేకానేక అనుబంధ ప్రశ్నల ద్వారా ప్రభుత్వ వ్యవహారశైలిని పౌరుల ముందు పరచడం వారి ధ్యేయం. అంతక్రితం మాటేమోగానీ 1991లో లోక్‌సభ, రాజ్యసభల్లోని ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం మొదలుపెట్టాక దీనికి ఎక్కడలేని ప్రాముఖ్యతా వచ్చింది. నేరుగా జనమంతా ఆసక్తిగా చూసేదీ, మీడియా దృష్టి పడేదీ ఈ సమయమే. జీరో అవర్ కూడా ఈ ప్రశ్నోత్తరాల సమయానికి తీసిపోదు. ప్రశ్నోత్తరాల సమయంలో అడిగే ప్రశ్నలకు సంబంధించి పక్షం రోజుల ముందు మంత్రులకు నోటీసు ఇవ్వాల్సివుంటుంది. సభాధ్యక్షుల అనుమతితో అప్పటికప్పుడు ప్రశ్నించడానికి కూడా వీలుంటుంది. జీరో అవర్ కూడా ఇంచుమించు ప్రశ్నోత్తరాల సమయం వంటిదే. అయితే ప్రశ్నోత్తరాల సమయం తరహాలో దీనికి ముందుగా నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదు. సభ్యులు తమ నియోజకవర్గానికి సంబంధించింది అయినా, దేశానికి సంబంధించింది అయినా...ఏ సమస్యనైనా ప్రస్తావించవచ్చు. ప్రభుత్వం ఏమనుకుంటున్నదో తెలుసుకోవచ్చు. ఆ సమస్యపై దృష్టి కేంద్రీకరించేలా చేయొచ్చు. మన పార్లమెంటు సమావేశాలు దాదాపు 175 రోజుల వ్యవధి తర్వాత జరుగుతున్నాయి. గతంలో బడ్జెట్ సమావేశాలకూ, వర్షాకాల సమావేశాలకూ మధ్య ఇంత వ్యవధి ఎప్పుడూ లేదు. కరోనా అనంతర పరిస్థితుల్లో తొలిసారి జరిగే ఈ సమావేశాలు సాఫీగా, సురక్షితంగా సాగడానికి వీలుగా ఉభయసభల అధ్యక్షులూ అన్ని రకాల ముందు జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. సభలో ప్రవేశించే సభ్యులకు, ఇతర అధికారులకు, ఇతరులకు ఆరోగ్య పరీక్షలు చేయడంతో మొదలుపెట్టి, సభలో సభ్యుల స్థానాలమధ్య తగిన దూరం వుండేలా ఏర్పాట్లు చేశారు. సభ్యులు వేర్వేరుచోట్ల కూర్చుని ఆడియో, వీడియో లింకుల ద్వారా సభా కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలుగా మార్పులు తెచ్చారు. అలాగే ఒకేసారి భారీ సంఖ్యలో ఎంపీలు వుండకుండా చూసేందుకు రోజూ తొలి అర్ధభాగం రాజ్యసభ, మధ్యాహ్నం నుంచి లోక్‌సభ పనిచేసేలా సమావేశాలకు రూపకల్పన చేశారు. సమయాన్ని సమర్థవంతంగా వాడుకోవడానికి వీలుగా ప్రశ్నోత్తరాల సమయం రద్దు, జీరో అవర్ కుదింపు అవసరమయ్యాయన్నది ప్రభుత్వం ఇస్తున్న సంజాయిషీ. అదేమంత సంతృప్తికరంగా లేదు. ఈ సభలో ఆమోదించుకోవాల్సినవి చాలానే వుండొచ్చు. దాదాపు డజను ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రభుత్వం బిల్లులు పెట్టాలి. గత సమావేశాల్లో పెండింగ్ వుండిపోయిన బిల్లులు సరేసరి. సమస్యలైతే చాలానేవున్నాయి. కరోనా కట్టడిలో సాఫల్యవైఫల్యాలు, లాక్డౌన్, రాష్ట్రాలకిచ్చిన తోడ్పాటు, జీఎస్టీ బకాయిలు...ఇలా పెద్ద జాబితా వుంది. ఇప్పుడున్నది అసాధారణ పరిస్థితే కావొచ్చు...కానీ దాన్ని సాకుగా చూపి సభ్యుల నోరు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారన్న నింద పడనీయకుండా చూసుకోవడం కేంద్ర ప్రభుత్వ కర్తవ్యం. ఎందుకంటే ఒక్క చైనా దురాక్రమణ జరిగిన 1962లో తప్ప బ్రిటిష్ కాలంనుంచి ఇంతవరకూ చట్టసభలో ప్రశ్నోత్తరాల సమయం రద్దు లేనేలేదు. అవసరమైతే ఆమోదింపజేసుకునే బిల్లుల సంఖ్యను తగ్గించి అయినా దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలని కేంద్రం గ్రహిస్తే మంచిది. -
ప్రశ్నోత్తరాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, ప్రయివేటు మెంబర్ బిజినెస్‌ను రద్దు చేస్తున్నట్టు లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు వేర్వేరుగా జారీచేసిన బులెటిన్లలో వెల్లడించాయి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు వారాంతపు సెలవులు కూడా లేకుండా వరుసగా 18 రోజులపాటు జరిగే ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని, అలాగే శుక్రవారం మధ్యాహ్నం జరిగే ప్రయివేటు మెంబర్ బిజినెస్‌ను కూడా కార్యకలాపాల నుంచి తొలగించారు. లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరితో సహా ప్రతిపక్ష నాయకులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు క్వశ్చన్ అవర్ తొలగించవద్దని లేఖ రాశారు. ఒక సభకు సంబంధించిన ఎంపీల మధ్య భౌతిక దూరం ఉండేలా చూసేందుకు రెండు సభల్లోని సీట్లను కేటాయించనున్నారు. రెండో సభలో కూర్చునే వారు సభాపతి ఉన్న సభలోకి కనిపించేలా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం రాజ్యసభ.. సాయంత్రం లోక్‌సభ మొదటి రోజు మినహా మిగిలిన 17 రోజులు లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 లగంటల వరకు నడుస్తుంది. అయితే తొలి రోజు మాత్రం ఉదయం 9 నుంచి 1 గంట వరకు నిర్వహిస్తారు. రాజ్యసభ మొదటి రోజు మినహా ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యకలాపాలను కలిగి ఉంటుంది. మొదటి రోజు మాత్రం మధ్యాహ్నం 3 నుండి 7 గంటల వరకు కార్యకలాపాలు కలిగి ఉంటుంది. అప్రజాస్వామికం: కాంగ్రెస్ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో క్వశ్చన్ అవర్‌ను రద్దు చేయడం ఏకపక్షం, అప్రజాస్వామికమని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అ«ధీర్రంజన్ చౌధరి అన్నారు. కీలక అంశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సభ్యుల హక్కు అన్నారు. సమావేశాలకు ప్రాణాధారమైన ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఆనంద్ శర్మ అన్నారు. చర్చల నుంచి పారిపోవడం లేదు: జోషి విపక్షాల విమర్శలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. సమావేశాల్లో ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీఏసీలో తీసుకునే నిర్ణయం మేరకు ఏ అంశాన్ని చేపట్టడానికైనా తమకు అభ్యంతరం లేదన్నారు. ఎంపీలు ‘అన్స్టార్డ్’ప్రశ్నల అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, వీటికి లిఖితపూర్వక సమాధానాలను ప్రభుత్వం ఇస్తుందన్నారు. జీరో అవర్ కనీసం అరగంటపాటు ఉంటుందని తెలిపారు. -
సెప్టెంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు?
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికే మొగ్గు చూపుతోంది. సెప్టెంబర్ మూడో వారంలో పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం లోక్‌సభ, సాయంత్రం రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. ప్రతి రోజు నాలుగు గంటల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. దాదాపు రెండు వారాల పాటు సమావేశాలు కోనసాగే అవకాశం ఉంది. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలు జరగాలని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్న తరుణంలో సమావేశాలను నియమాలకు అనుగుణంగా నిర్వహించనున్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన స్పష్టమైన షెడ్యుల్ ఇంకా వెల్లడి కాలేదు. కరోనా సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంతో ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉంటాయో ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
ఐదో రోజూ అడ్డుకున్నారు
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను విపక్షాలు వరుసగా ఐదో రోజూ అడ్డుకున్నాయి. ఢిల్లీ అల్లర్లపై, లోక్‌సభ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడంపై శుక్రవారం విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దాంతో, పలు వాయిదాల అనంతరం లోక్‌సభ, సభ ప్రారంభమైన పావుగంటకే రాజ్యసభ మార్చి 11వ తేదీకి వాయిదా పడ్డాయి. లోక్‌సభ..: ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ఢిల్లీ అల్లర్లపై తక్షణమే చర్చ జరపాలని కాంగ్రెస్, డీఎంకే, ఐయూఎంఎల్ తదితర పార్టీల సభ్యులు వెల్లోనికి వచ్చి నినాదాలు చేశారు. ఢిల్లీ అల్లర్లపై 11న చర్చ జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, స్పీకర్ స్థానాన్ని అవమానించారని పేర్కొంటూ గురువారం ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను లోక్‌సభ నుంచి ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ సహా పలు విపక్షాలు సభలో నిరసన తెలిపాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా చాలామంది విపక్ష సభ్యులు తమ చేతులకు నల్లని బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. గందరగోళం కొనసాగుతుండటంతో సభను స్పీకర్ స్థానంలో ఉన్న కిరిట్ సోలంకీ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తరువాత కూడా విపక్షం శాంతించలేదు. నినాదాల మధ్యనే ఖనిజ చట్టాల(సవరణ) బిల్లు, దివాలా కోడ్(సవరణ) బిల్లు ఆమోదం పొందాయి. రాజ్యసభ..: సభ ప్రారంభం కాగానే తన శాఖకు సంబంధించిన పత్రాలను సభ ముందుంచేందుకు హోంశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లేవగానే.. విపక్ష సభ్యులంతా గట్టిగా నినాదాలు చేశారు. ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చేసిన విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు. దీంతో సభను 11వ తేదీకి వాయిదా వేశారు. జేబుదొంగకు ఉరిశిక్షా? కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌పై ఆ పార్టీ నేత ఆధిర్ రంజన్‌చౌధురి సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశారన్న ఉద్దేశంతో.. ‘జేబు దొంగకు ఉరిశిక్ష వేయకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో కాంగ్రెస్ సభ్యులు ఇబ్బందిగా ముఖం పెట్టగా, కొందరు పెద్దగా నవ్వేశారు. కాంగ్రెస్ సభ్యుడు చెప్పిన పోలిక వింతగా ఉందని, ఆ ఎంపీలను జేబుదొంగలతో పోల్చడం దురదృష్టకరమని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. మరోవైపు, తమ ఎంపీల సస్పెన్షన్‌పై రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపింది. -
డేటా దుర్వినియోగానికి జైలు శిక్ష..
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన పక్షంలో కంపెనీలు ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రానుంది. కోట్ల రూపాయల జరిమానాలు కట్టడంతో పాటు వాటి ఎగ్జిక్యూటివ్‌లు జైలు శిక్షలు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వ్యక్తిగత డేటా భద్రత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వ్యక్తిగత డేటా భద్రత బిల్లు నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో సదరు కంపెనీ .. రూ. 15 కోట్ల దాకా లేదా తన అంతర్జాతీయ టర్నోవరులో 4 శాతం మొత్తాన్ని జరిమానాగా కట్టాల్సి వస్తుంది. ఒకవేళ వ్యక్తుల డేటాను కావాలనే చట్టవిరుద్ధంగా ప్రాసెసింగ్ చేశారని తేలిన పక్షంలో సదరు కంపెనీలో డేటా వ్యాపార విభాగానికి ఇంచార్జిగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌కు మూడేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే తమ డేటాను పూర్తిగా తొలగించేలా తగు చర్యలు తీసుకోవడానికి వ్యక్తులకు హక్కులు లభిస్తాయి. డేటా బిల్లులో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► వ్యక్తులకు సంబంధించిన కీలక డేటాను అన్ని ఇంటర్నెట్ కంపెనీలు.. భారత్‌లోనే భద్రపర్చాలి. ఒకవేళ విదేశాల్లో ప్రాసెస్ చేయాల్సి వస్తే.. చట్ట నిబంధనలకు లోబడి, ఆయా వ్యక్తుల నుంచి కచ్చితంగా పూర్తి అనుమతులు తీసుకోవాలి. ► ఆరోగ్యం, మతం, రాజకీయ అభిప్రాయాలు, బయోమెట్రిక్స్, జన్యుపరమైన, ఆర్థికపరమైన వివరాలను కీలక డేటాగా పరిగణించడం జరుగుతుంది. కీలక డేటాలో మార్పులు, చేర్పుల గురించి కేంద్రం ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది. ► చిన్నపాటి ఉల్లంఘనలకు కంపెనీలపై రూ. 5 కోట్లు లేదా గ్లోబల్ టర్నోవరులో 2% దాకా జరి మానా విధించవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులకు జైలు శిక్ష కూడా విధించవచ్చు. -
రాజ్యాంగ విలువలకు కట్టుబడదాం
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ రచనకు 70 ఏళ్లయిన సందర్భంగా మంగళవారం ఢిల్లీలో ఏర్పాటైన పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ఏర్పరచిన మూడు (న్యాయ, శాసన, కార్యనిర్వాహక) వ్యవస్థలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు, పౌర సమాజ సభ్యులు, పౌరులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. రాజ్యాంగ విలువల ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పిన డాక్టర్ అంబేడ్కర్.. రాజ్యాంగాన్ని అత్యున్నతంగా భావించాలని తెలిపారన్నారు. హక్కులు, విధులు నాణేనికి రెండు పార్శా్వల వంటివి అంటూ బాధ్యతలు నెరవేర్చడం ద్వారానే హక్కులు సిద్ధిస్తాయన్న మహాత్ముని మాటలను రాష్ట్రపతి గుర్తు చేశారు. బాధ్యతలపై దృష్టిపెట్టాల్సిన సమయం హక్కుల కోసం కాకుండా.. విధులు, బాధ్యతలపై ప్రజలు దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సంయుక్త సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రజల హక్కులతోపాటు, బాధ్యతలనూ సుస్పష్టం చేయడం మన రాజ్యాంగం ప్రత్యేకతన్నారు. బాధ్యతలను నిర్వర్తించకుండా హక్కులను కాపాడటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అవగాహన కల్పించాలి: వెంకయ్య పౌరుల ప్రాథమిక బాధ్యతల వివరాలను పాఠ్యాంశాల్లో చేర్చడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించి పౌరులకు అవగాహన కల్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. మాతృభాషకు గౌరవం ఇవ్వడం ఎంతో అవసరమన్న ఉపరాష్ట్రపతి.. మాతృభాష మన దృష్టిలాంటిదైతే, ఇతర భాషలు కళ్లజోడు లాంటివని అభివర్ణించారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు∙విధులను సమర్థంగా నిర్వర్తించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ 250వ సమావేశాలను పురస్కరించుకుని రూ.250 నాణేన్ని, రూ.5 విలువైన పోస్టల్ స్టాంపును రాష్ట్రపతి విడుదల చేశారు. ‘భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యసభ పాత్ర’అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి తొలి ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు. బహిష్కరించిన ప్రతిపక్షం మహారాష్ట్రలో బీజేపీ అనుసరించిన వైఖరిని నిరస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని బహిష్కరించాయి. మొట్టమొదటి సారిగా శివసేన కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలకు మద్దతుగా నిలిచింది. ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం నిరసన తెలిపారు. -
కేంద్రంపై ఉమ్మడి పోరాటం చేద్దాం
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక మందగమనం, ఆర్సెప్ ఒప్పందం, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలు వంటి వాటిపై ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. సోమవారం ఈ అంశంపై సీనియర్ ప్రతిపక్ష నేతల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు ఆజాద్, అహ్మద్ పటేల్, సుర్జేవాలా, ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం నుంచి టీకే రంగరాజన్తోపాటు ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, ఆర్ఎల్డీ నేతలు హాజరయ్యారు. ఇది మా విజయమే: కాంగ్రెస్ ఆర్సీఈపీలో చేరబోవడం లేదని భారత్ ప్రకటించడం తమ విజయమేనని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ వ్యతిరేకించినందువల్లనే ప్రభుత్వం ఆ విషయంలో వెనకడుగు వేసిందని తెలిపింది. ఈ ఒప్పందం కుదిరితే రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయేవారని సూర్జేవాలా అన్నారు. -
ట్రంప్ వాఖ్యలపై పార్లమెంట్లో దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్ పరిష్కారంపై మధ్యవర్తిత్వం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం రేగింది. కశ్మీర్ విషయంలో ట్రంప్‌తో ఏం చర్చించారో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్, ఇత ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకొమ్మని ఎలా అడుతుతారని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్ ఉభయ సభలలో వాయిదా తీర్మానం ఇచ్చాయి. లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ.. అమెరికా ముందు భారత్ దాసోహం అయ్యిందన్నారు. మనం బలహీనులం కాదు, దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని మోదీ కోరలేదని రాజ్యసభలో కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. (చదవండి : కశ్మీర్‌పై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన భారత్) -
అన్నదాతకు ఆసరా ఎలా?
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనా, ప్రత్యేకించి రైతుల ఆత్మహత్యలపైనా పార్లమెంటులో అరుదుగా చర్చ జరుగుతుంటుంది. కనుక లోక్‌సభలో గురువారం జీరో అవర్‌లో రైతుల ఆత్మ హత్యలు ప్రస్తావనకు రావడాన్ని స్వాగతించాలి. దేశంలో రైతుల స్థితిగతులు దారుణంగా ఉన్నా యని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించినప్పుడు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత అయిదేళ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. దశాబ్దాలపాటు ఏలిన గత పాలకులే రైతుల ప్రస్తుత దుస్థితికి కారణమని కూడా ఆయన చెప్పారు. ఈ ఆరోపణలు, ప్రత్యా రోపణల సంగతలా ఉంచితే రైతులు చాలా దుర్భర స్థితిలో ఉన్నారని అందరూ గుర్తించాలి. ఈ చర్చ జరగడానికి ముందు రోజు ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఒక రైతు ఆత్మహత్య గురించిన కథనం మీడియాలో వచ్చింది. రైతు తన కుమార్తెను మెడిసిన్ చదివించాలన్న కోరికతో ఆమెను ఒక కోచింగ్ సెంటర్లో చేర్చాలనుకున్నాడు. అందుకోసం తనకున్న కొద్దిపాటి భూమిని తనఖా పెట్టాలనుకున్నాడు. కానీ అప్పటికే అప్పులున్న ఆ భూమిపై అదనంగా రుణం ఇవ్వడానికి వడ్డీవ్యాపారులు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పంటలు దెబ్బతినడం, కుటుంబాల్లో అనారోగ్యం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇలా అనేక కారణాలు రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. తాజా ఉదంతంలో పోలీసులు ఆ రైతు మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. బహుశా ప్రభుత్వం కూడా ఆయన మరణం వెనక సాగు సంబంధ కారణాలు లేవని చెప్పే అవకాశం ఉంది. కానీ బుందేల్‌ఖండ్ ప్రాంతంలో గత రెండేళ్లలో 20మంది రైతులు కన్నుమూశారు. పంటలు బాగా పండి, ఆ పంటలకు గిట్టుబాటు ధర లభిస్తే... వీరు కుటుంబ సంబంధమైన బాధ్యతల్ని నెరవేర్చుకోలిగేవారు. అందరిలా జీవనం సాగించేవారు. బలవన్మర ణాలకు పాల్పడే స్థితి ఉండేది కాదు. అందువల్ల రైతుల ఆత్మహత్యలను నమోదు చేయడంలోనూ, ఆ కుటుంబాలను ఆదుకోవడంలోనూ ప్రభుత్వాలు పెద్ద మనసుతో వ్యవహరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ వలసపాలన కాలంలో 1830లో పాలకుడిగా ఉన్న లార్డ్ మెట్కాఫ్ బ్రిటన్‌కు ఒక నివేదిక పంపుతూ భారత్‌లో గ్రామాలన్నీ వేటికవి రిపబ్లిక్ల వంటివనీ, అవన్నీ స్వయంపోషకాలనీ అభివర్ణించాడు. ఈ కారణం వల్లనే అన్ని ఒడిదుడుకులనూ ఎదుర్కొని భారత్ మనుగడ సాగించగలుగుతున్నదని చెప్పాడు. అప్పట్లో గ్రామాలకున్న ఈ శక్తిసామర్థ్యాలకు వ్యవసాయం, చేతివృత్తులే ప్రధాన కారణమని వేరే చెప్పనవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తూ గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండూ క్రమేపీ దెబ్బతిన్నాయి. ఒకనాడు దేశ మనుగడకూ, దాని ఆత్మవిశ్వాసానికీ వెన్నెముకగా నిలిచిన రైతు ఇప్పుడు తానే ఒత్తిళ్లకు లోనవుతున్నాడు. రేపన్నరోజు గడిచేదెలాగో అర్ధంకాక తనువు చాలిస్తున్నాడు. విత్తనాలు మొదలుకొని అన్నీ సకాలంలో సరైన ధరలకు లభ్యమయ్యేందుకు...దిగుబడులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు... దళారుల బెడద తప్పించేం దుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోగలిగితే ఈ రైతు ఆత్మహత్యల్ని నివారించడం సాధ్యమవుతుంది. బహుళజాతి సంస్థ మోన్శాంటో దేశమంతా 450 గ్రాముల బీటీ పత్తి విత్తన ప్యాకెట్‌ను రూ. 1858కి అమ్ముతున్న రోజుల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ విషయంలో పట్టుదలగా పోరాడి, చివరకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఆ ప్యాకెట్ ధరను రూ. 750కి తగ్గించేలా చేశారు. ఈ విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ పెద్దల ద్వారా ఆయనకు నచ్చజెప్పించినా వైఎస్ లొంగ లేదు. ఆ ఒరవడిని తర్వాత కాలంలో ఎందరు ముఖ్యమంత్రులు అనుసరించగలిగారు? చాలా సంస్థలు రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొన్న విత్తనాలను మళ్లీ వారికే అత్యధిక ధరకు అమ్ముతున్నాయి. నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న సంస్థలున్నాయి. ఎరువులు, పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆరుగాలం శ్రమించి అధిక దిగుబడి సాధించినా కనీస మద్దతు ధరకు దిక్కులేదు. వీటన్నిటి సంగతలా ఉంచి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి పంటనష్టం జరిగినప్పుడు సాయం అందించడానికి సవాలక్ష నిబంధనలు అడ్డొస్తాయి. వీటిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం అలాంటి రైతుల కుటుంబాలను ఆదు కోవాలన్న స్పృహ కూడా పాలకులకు ఉండటం లేదు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో 2014–19 మధ్య 1,513 మంది రైతులు ప్రాణాలు తీసుకుంటే అంతో ఇంతో ఆర్థిక సాయం దక్కింది కేవలం 391 కుటుంబాలకు మాత్రమే. మిగిలిన కుటుంబాలన్నిటి వివరాలూ సేకరించి అర్హతగల ప్రతి కుటుంబానికీ రూ. 7 లక్షల చొప్పున పరిహారం అందించాలని తాజాగా జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ భరోసా పథకాన్ని చెప్పినకంటే ముందే ప్రారంభించి వార్షిక సాయం రూ. 12,500 అందించాలని నిర్ణయించారు. ఉచిత పంటలబీమా, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు వంటివి ఏర్పాటుచేశారు. అసెంబ్లీలో గురు వారం చర్చ సందర్భంగా రైతు సంక్షేమానికి తీసుకోబోయే చర్యల్ని వివరించారు. ఇలా సమస్యల్ని సహృదయంతో అర్థం చేసుకుని, మానవీయ కోణంలో ఆలోచించే పాలకులుండటం ఇప్పటి అవసరం. మొన్నటివరకూ కేంద్ర వ్యవసాయమంత్రిగా పనిచేసిన రాధామోహన్ సింగ్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల మంగళవారం బదులిస్తూ 2015 తర్వాతనుంచి రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను రాష్ట్రాలేవీ పంపలేదని, అందువల్ల జాతీయ క్రైం రికార్డుల బ్యూరో దగ్గర గణాంకాలు లేవని చెప్పారు. బలవన్మరణాలకు పాల్పడిన రైతులెందరో చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వాలున్నప్పుడు వాటినుంచి ఇక ఆశించే దేముంటుంది? ఈ పరిస్థితి మారాలి. పాలకులు చిత్తశుద్ధితో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. -
హోదా హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి
-
పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం
-
ప్రభుత్వ నినాదం సబ్కా సాథ్..సబ్కా వికాస్
సాక్షి, న్యూఢిల్లీ : ‘సబ్కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్కా విశ్వాస్’ అనేది తమ ప్రభుత్వం నినాదమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ఆయన నేడు(గురువారం) ప్రసంగించారు. లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన రాష్ట్రప్రతి.. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను అభినందించారు. ప్రభుత్వం సుపరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా ఆయన ప్రసంగం కొనసాగింది. సుస్థిరత, పారదర్శకత, అభివృద్ధిని కాంక్షిస్తూ దేశ ప్రజలు విజ్ఞతతో ఓటువేశారని రాష్ట్రపతి కితాబిచ్చారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారని, ఈ సారి ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. 2014 నుంచి కొనసాగుతున్న ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇచ్చారని, మహిళా సభ్యుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. దాదాపు పురుషులతో సమానంగా మహిళా సభ్యులున్నారని చెప్పారు. లోక్‌సభలో సగం మంది తొలి సారిగా ఎన్నికైన వాళ్లే ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 2014కు ముందు ఉన్న పరిస్థితులు నుంచి దేశాన్ని బయటకు తీసుకురావాలని జనం భావించారు. ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు మా ప్రభుత్వం పనిచేస్తోంది. శక్తి వంతమైన భారత దేశం నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం. రైతుల గౌరవం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ అందిస్తాం. వీర్‌జవాన్ స్కాలర్షిప్లను రాష్ట్రాల పోలీసుల పిల్లలకు అందజేస్తాం. నదులు కాల్వలు ఆక్రమణల వల్ల జల వనరుల తగ్గిపోతున్నాయి. స్వచ్ఛభారత్ తరహాలో జల సంరక్షణ కార్యక్రమం చేపడతాం. జల సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తాం. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆక్వాకల్చర్ ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. దీని కోసం బ్లూ రివల్యూషన్ తీసుకొస్తాం. జన్‌ధన్ యోజన్ ద్వారా బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికి చేర్చాం. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ కింద 20 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోంది. 2024 నాటికి దేశంలో 50 లక్షల స్టార్టప్స్ ఏర్పాటవుతాయి. ఉన్నత విద్యాసంస్థల్లో 2 కోట్ల సీట్లు అదనంగా వస్తాయి. ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తాం. క్రీడాకారులకు అత్యాధునిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నాం. మహిళా రక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. దేశంలో బ్రూణ హత్యలు తగ్గాయి. ట్రిపుల్ తలాఖ్‌ను అరికట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల పక్కా ఇళ్లు నిర్మిస్తాం. జీఎస్టీ రాకతో పన్నుల వ్యవస్థ సులభతరమైంది. జీఎస్టీ చెల్లించే వ్యాపారులకు రూ.10 లక్షల జీవిత బీమా అమలు చేస్తున్నాం. అవినీతి అంతానికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. నల్లధనానికి వ్యతిరేకంగా ప్రారంభించిన కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తాం. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వాళ్ల వివరాలు సేకరిస్తున్నాం. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు నేరుగా డబ్బు చేరుతోంది. 400కు పైగా పథకాలకు డీబీఎస్‌ను విస్తరించాం. చిన్న వ్యాపారుల కోసం పెన్షన్ యోజన పథకం తెస్తాం. రియల్ ఎస్టేట్ రంగంలో నల్లధనాన్ని తగ్గించాం. రెరా చట్టంతో రియల్ ఎస్టేట్ రంగంలో నల్లధనానికి అడ్డుకట్ట వేశాం. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేస్తాం. ఉపరితల రవాణతో పాటు జల రవాణాకు ప్రాధాన్యత ఇచ్చాం. డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తెస్తున్నాం. అనేక రాష్ట్రాల్లో మెట్రో రైళ్లను ప్రోత్సహిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అన్ని దేశాలతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నాం మసుద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి భారత్ చేసిన ఒత్తిడి ఫలించింది విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెంటనే స్వదేశానికి రప్పించేందుకు సాయం అందిస్తున్నాం. త్వరలోనే రఫేల్, అపాచి యుద్ధ విమానాలు అందుబాటులోకి వస్తాయి. మాజీ సైనికుల పెన్షన్‌ను పెంచుతాం. ఉగ్రవాదుల ఏరివేతకు చర్యలు తీసుకుంటున్నాం ప్రజల ఆకాంక్షలను మా ప్రభుత్వం నెరవేరుస్తోంది. -
కొలువుదీరిన 17వ లోక్‌సభ
-
కాంగ్రెస్-టీడీపీ మధ్య డీల్ ఏమైనా కుదిరిందా?
-
ఏపీకి ఇలాంటి పరిస్ధితి రావడానికి కారణం కాంగ్రెస్ కాదా?
-
బీజేపీ-కాంగ్రెస్‌లతో టీడీపీ అ'విశ్వాస' డ్రామా
సాక్షి న్యూఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అ'విశ్వాస' బంధం కొనసాగింది. నన్ను ఏం చేయొద్దు.. నేను ఏమీ చేయను అన్న చందంగా కాంగ్రెస్-బీజేపీలతో టీడీపీ బంధం ప్రతిబింబించింది. శుక్రవారం రోజున అవిశ్వాస తీర్మానం సందర్భంగా కేశినేని నాని బదులుగా గల్లా జయదేవ్ పార్లమెంట్లో ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే నుంచి బయటకు రాగానే టీడీపీపై కేంద్రం యుద్ధం ప్రకటించిందని చెప్పారు. అయితే రాష్ట్రానికి నిధులు, పరిశ్రమల కోసం రాయితీలు ఇవ్వడంలో దారణంగా విఫలైమందని చెప్పిన గల్లా ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారో చెప్పకపోవడం విశేషం. ప్రత్యేక ప్యాకేజీని అర్ధరాత్రి వేళ స్వాగతించిన తెలుగుదేశం.. హోదా కంటే ప్యాకేజీనే మేలంటూ అరుణ్ జైట్లీకి చేసిన సన్మాన కార్యక్రమం గురించి ప్రస్తావించలేదు. పైగా కేంద్రం నుంచి అందరికంటే ఎక్కువగా సాధించామని, ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తూ ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు. ఈ విషయంపై కూడా గల్లా నోరు మెదపలేదు. విభజన చట్టాన్ని అప్రజాస్వామికంగా సభలో నెగ్గించారని చెప్పిన గల్లా, విభజనతో పాటు కేంద్రం తీరుతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని వ్యాఖ్యానించారు. అలాగే కేంద్రం పూర్తి చేస్తామన్న పోలవరం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో చెప్పలేదు. నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా టీడీపీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఏనాడు బీజేపీని ప్రశ్నించలేదు. పైగా అన్నీ సాధించామంటూ జబ్బలు చరుచుకున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసే అలవాటు ఉన్న బాబు నాలుగేళ్ల తరువాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం జరిగిదంటూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే బీజేపీపై గల్లా విమర్శలు చేశారు. కానీ రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్‌ను మాత్రం తెలుగుదేశం పల్లెత్తు మాట అనలేదు. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇస్తూ చంద్రబాబు ఇచ్చిన లేఖ విషయాన్ని ప్రస్తావించలేదు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గల్లా జయదేవ్ ప్రసంగాన్ని విన్నానని చెప్పారు. గల్లా ప్రసంగంలో ఆవేదన కనిపించిందంటూ గల్లను వెనుకేసుకొచ్చారు. పైగా 21వ శతాబ్ధంలో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం అంటూ మొసలి కన్నీరు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కాంగ్రెస్ అంతా చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. ఆర్థిక లోటుతో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేసి.. ఇప్పుడు మాత్రం కంటి తుడుపు చర్యగా పార్లమెంట్లో తెలుగుదేశం వ్యాఖ్యలకు మద్దతుగా రెండు ముక్కలు ప్రసంగించారు. విభజన సమయంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిని చట్టంలో పొందు పరచకుండా ఏపీ ప్రజల గొంతు కోశారు. ఆనాడు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్లపై సానుకూలతలు పరిశీలించాలంటూ తీర్మానాలు చేసి చేతులు దులుపుకున్నారు. పైగా వచ్చే ప్రభుత్వం వాటిని అమలు చేయాలంటూ ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలను తీర్మానాల పాలు చేశారు. ఏపీ తీవ్రంగా నష్టపోతుందని తెలిసి కూడా ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం నేడు పార్లమెంట్ సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందంటూ మొసలి కన్నీరు కార్చింది. అనుకున్న ప్రకారం టీడీపీ, కాంగ్రెస్‌లు భాయ్ భాయ్ అనుకుంటూ కొత్త డ్రామాకు తెరదీశాయి. ఏపీకి జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని ఏమీ అనకపోవడం గమనార్హం. పార్లమెంట్ సాక్షిగా మూడు పార్టీలు ఇలా మరోసారి తెలుగు ప్రజలను వంచన చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
ఢిల్లీలో భారీ వర్షం : తడిచిపోయిన మీడియా కెమెరాలు
సాక్షి, న్యూఢిల్లీ : శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వాడివేడిగా సభ జరగాల్సిన సమయంలో భారీ వర్షం ఢిల్లీని ముంచెత్తింది. భారీ వర్షం దెబ్బకు ఢిల్లీలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై తొలిసారి అవిశ్వాసం జరగనుండటంతో దేశం మొత్తం ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తోంది. అవిశ్వాస తీర్మానంతో వాడి వేడిగా జరగనున్న వర్షాకాల సమావేశాలను కవర్ చేయడానికి దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు ఢిల్లీలో పాగావేశాయి. అయితే శుక్రవారం కురిసిన భారీ వర్షానికి వార్తా సంస్థల ఎలక్ట్రానిక్ పరికరాలు తడిచిపోయాయి. కెమెరాలు, ఇతర కవరేజి వస్తువులు తడిసిముద్దయ్యాయి. -
ఆపని చేయడం బాబుకే సాధ్యం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రత్యక హోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని తీవ్ర తరం చేసింది. విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తమ పదవులకు రాజీనామా చేసిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పార్టీ మాజీ ఎంపీలు, వైవీ సుబ్బారెడ్డి మేకపాటి రామమోహన్ రెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డిలతో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. టీడీపీ నాలుగేళ్ల పాటు బీజేపీపై ఎటువంటి వత్తిడి తేకపోవడం వల్లే ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడం వల్లే బీజేపీలో కనువిప్పు కలిగిందని అన్నారు. తమతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు అప్పుడే రాజీనామా చేసి ఉంటే కేంద్రం ఎప్పుడో దిగి వచ్చేదని పేర్కొన్నారు. కానీ టీడీపీ మాత్రం అవకాశ రాజకీయం, ద్వంద వైఖరి రాజకీయాలు చేస్తూ ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. కడప ఉక్కు పరిశ్రమపై ఆరునెలల్లోపు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని విభజన చట్టంలో ఉంటే నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండీ ఏమాత్రం పట్టించుకోని తెలుగుదేశం, ఒక పార్టీయేనా అంటూ ఎద్దేవా చేశారు. ఏదో ఒక విధంగా అధికారంలో ఉండాలన్న ఆశ తప్పితే, చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదని ఆయన ధ్వజమెత్తారు. మొదటి సారి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన బాబు రెండో సారి వాజ్‌పేయ్ పుణ్యమా అని ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. తరువాత బీజీపీపై ఘాటు విమర్శలు చేసిన బాబు, 2014 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడానికి బీజేపీ, మోదీ పంచన చేరిన చరిత్ర బాబుదని విమర్శించారు. నాలుగేళ్ల పాటు కేంద్ర భాగస్వామిగా ఉన్న బాబు ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చిన నిధులన్నింటిని దోచుకొన్నారని ఆరోపించారు. పవిత్ర నదులకు వచ్చే పుష్కరాలను సైతం తన అవినీతికి వాడుకున్నారంటూ ధ్వజమెత్తారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను ఉపయోగించుకొని భారీ అవినీతికి పాల్పడ్డారని ద్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేస్తే.. వారితో కలిసి పొత్తుకు ప్రయత్నిస్తున్నారని మండిడ్డారు. ఏ ఎండకు ఆగొడుగు పట్టడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని విమర్శించారు. ఇప్పటికీ ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే అది వైఎస్సార్సీపీ అథినేత వైఎస్ జగన్ పోరాటం వల్లేనని వరప్రసాద్ గుర్తు చేశారు. -
టీడీపీ అవకాశ రాజకీయం, ద్వంద వైఖరి రాజకీయాలు..
-
టీడీపీ నిజస్వరూపాన్ని జేసీ బయటపెట్టారు
సాక్షి, విజయవాడ : నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చకునేందుకే టీడీపీ అవిశ్వాసం పెడుతోందని ఆయన మండిపడ్డారు. గత పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వైవీ సుబ్బారెడ్డి 13సార్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చారని, అయినా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. కానీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో తొలిరోజే అవిశ్వాస నోటీస్‌ను పరిగణలోకి తీసుకోవడం వెనుక ఉన్న ఒప్పందం ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీ లాలూచీ రాజకీయాలకు అద్దం పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. నాలుగేళ్లు కేంద్రంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం సాధించారని మల్లాది నిలదీశారు. టీడీపీ నిజస్వరూపాన్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బయటపెట్టారని చెప్పారు. నాలుగేళ్లుగా విభజన హామీలపై ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. నేడు అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రజల కోసం పోరాడుతున్నామని టీడీపీ గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. అవిశ్వాసం పెట్టి ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీకి దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని మల్లాది విష్ణు సవాల్ విసిరారు. విభజన హామీల సాధనకు వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే.. టీడీపీ మాత్రం ప్రజలను మభ్యపెట్టేందుకు నాలుగేళ్లపాటు భాగస్వామిగా ఉన్న కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చిందని ఆరోపించారు. టీడీపీ, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజలు వారి నాటకాలను గమనిస్తున్నారని చెప్పారు. ఏపీకి బీజేపీ, టీడీపీలు చేసిన అన్యాయంలో చంద్రబాబు ప్రాధాన పాత్ర పోషించారని, కానీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. -
పార్లమెంట్ సాక్షిగా బయటపడింది!
సాక్షి, అమరావతి : దేశ దేవాలయం పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల లోపాయకారి ఒప్పందం మరోసారి బయట పడింది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 సార్లు అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్న తెలుగుదేశం అధినేత, పార్టీ నేతలు ఒక్కసారిగా స్వరం మార్చారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో కేంద్రం నుంచి వైదొలగి కొత్త నాటకానికి తెరలేపింది. అయితే ఇక్కడే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు అసలు నాటకాన్ని ప్రారంభించాయి. ఏపీ విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక హోదాను చట్టంలో పొందు పరచకుండా నయవంచన చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాతో పాటు విభజన సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తూ, ప్రజలను, నాయకులను ఏకం చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరగా ద్వంద వైఖరి అవలంభించింది. గత పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను నెరవేర్చాలంటూ 13సార్లు అవిశ్వాసం తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టారు. అయితే తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకోవడానికి తెలుగుదేశం ఎంపీలు తమదైన శైలిలో నాటకం రక్తి కట్టించారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రభసకు దిగారు. వీటితో పాటు స్పీకర్ తమిళనాడు కావేరి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తమిళనాడు ఎంపీల ఆందోళన సాకుతో వైఎస్సార్సీపీ ఇచ్చిన నోటీస్‌ను చర్చకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో సభ సక్రమంగా జరగట్లేదంటూ స్పీకర్ సభను వాయిదా వేస్తూ వచ్చారు. వీటన్నింటి వెనుక టీడీపీ, బీజేపీలతో పాటు కాంగ్రెస్ హస్తం ఉందని అప్పుడే వైఎస్సార్సీపీ ఆరోపించింది. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే అనూహ్య వింత చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలు లేచి నిలబడ్డారు. వారు మద్దతు తెలిపిన అనంతరం చర్చకు ఆమోదం తెలుపుతున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. మూడు రోజుల్లో చర్చ తేదీని నిర్ధారిస్తామని అన్నారు. పదిరోజుల్లోపు చర్చకు అనుమతిస్తామని స్పీకర్ తెలిపారు. గత సమావేశాలు దాదాపు నెలరోజుల పాటు జరిగినా, ఒక్క రోజు కూడా స్పీకర్ చర్చకు అనుమతించలేదు. పైగా సభ ఆర్డర్లో లేదంటూ వాయిదా వేస్తూ వచ్చారు. గత సమావేశాల్లో వైఎస్సార్సీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాలపై ద్వంద వైఖరి వహించిన కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి మాత్రం సంపూర్తిగా మద్దతు తెలపడం విశేషం. ఇలా మూడు పార్టీలు తమ లోపాయకారి ఒప్పందాన్ని అనుకున్న విధంగా అమలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తుంగలో తొక్కేశారు. -
అవిశ్వాస తీర్మానాలపై స్పీకర్ అధికారాలేమిటి?
లోక్‌సభలో మంగళవారమైనా అవిశ్వాస తీర్మానాల నోటీసులను స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతిస్తారా? అనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సర్కారు ప్రత్యేక హోదా నిరాకరించినందుకు నిరసనగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మొదట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ నెల 16న అవిశ్వాస తీర్మానాల నోటీసులను విడివిడిగా ఇచ్చాయి. శుక్రవారం లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కూడా కేంద్ర సర్కారుపై ‘అవిశ్వాస’ నోటీసు ఇచ్చారు. సోమవారం మరో జాతీయ పార్టీ సీపీఎం నేత పి.కరుణాకరన్ మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ సెక్రటేరియట్‌కు సమర్పించారు. మొదటి రెండు నోటీసులు ఇచ్చిన రోజు నుంచి లోక్‌సభలో క్రమం తప్పకుండా గందరగోళ పరిస్థితులున్నాయనే కారణంతో స్పీకర్ వాటిని ప్రవేశపెట్టే విషయమై సభ అనుమతి కోరే ప్రయత్నం చేయలేదు. సభ సజావుగా ఉంటేనే అవిశ్వాస తీర్మానాల అనుమతి కోసం ఇచ్చిన నోటీసులకు అవసరమైన 50 మంది సభ్యుల మద్దతు ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవడం సాధ్యమౌతుందని స్పీకర్ మొదట్నించీ చెబుతూనే ఉన్నారు. దాదాపు నాలుగేళ్ల నరేంద్ర మోదీ సర్కారుపై అవిశ్వాసం ప్రకటించడానికి ఇచ్చిన నోటీసులను స్పీకర్ సభ ముందు ఉంచకుండా ఇన్నాళ్ల పాటు వాయిదా వేస్తూ రావడం సబబు కాదనే వాదనలు ముందుకొస్తున్నాయి. ఈ విషయంపై లోక్‌సభ సెక్రటరీ జనరల్ పదవి నిర్వహించిన ముగ్గురు ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకుందాం. స్పీకర్‌దే బాధ్యత: పీడీటీ ఆచారి అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చాక అదే రోజు వాటిని లోక్‌సభలో స్పీకర్ చేపట్టాలని 14, 15వ లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి అభిప్రాయపడ్డారు. అవిశ్వాస తీర్మానం నిబంధనల ప్రకారమే పద్ధతిగా ఉన్నదీ, లేనిదీ పరిశీలించడం ఒక్కటే సభాపతి బాధ్యత అనీ, తర్వాత తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చేది సభేగాని స్పీకర్ కాదని ఆయన తన తాజా వ్యాసంలో వివరించారు. ‘‘ మరే ఇతర వ్యవహారానికైనా సభ ముందుకు రావడానికి పూర్వం స్పీకర్ అనుమతి అవసరం. అవిశ్వాస తీర్మానం నోటీస్ విషయంలో స్పీకర్ అది తనకు అందిన వెంటనే దాన్ని సభ అనుమతి కోసం చేపట్టాలి. ఈ ప్రక్రియ ప్రారంభించి పూర్తిచేయకుండా మరే ఇతర విషయాలను (బిల్లులు, తీర్మానాలు) సభ చేపట్టి పూర్తిచేయకూడదు’’ అని ఆచారి పేర్కొన్నారు. ‘‘అధికారంలో ఉన్న ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి ప్రతి లోక్‌సభ సభ్యుడికి హక్కు ఉంది. ఏ సభ్యుడు లేదా సభ్యురాలు ఇచ్చే నోటీసు సక్రమంగా ఉన్నదీ, లేనిదీ మాత్రమే స్పీకర్ చూడాలి. చర్చను చేపట్టడానికి అనుమతించడానికి లేదా అనుమతించక పోవడానికి స్పీకర్‌కు అధికారం లేదనే నిబంధనలు చెబుతున్నాయని’’ ఆచారి అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మొదటి అవిశ్వాస తీర్మానం నుంచి కిందటి తీర్మానం నోటీసు వరకూ జరిగింది పరిశీలిస్తే ఈ ప్రక్రియనే సభాపతులందరూ అనుసరించారని స్పష్టమౌతోందని ఆయన తెలిపారు. అవిశ్వాస నోటీసు అందగానే సభ ముందుంచాలి: సుభాష్ కశ్యప్ అవిశ్వాస తీర్మానం నోటీసు అందిన వెంటనే దాన్ని సభ ముందు పెట్టి, దానికి 50 మంది సభ్యుల మద్దతు ఉన్నదీ, లేనిదీ పరీక్షించడం పార్లమెంటరీ సంప్రదాయమని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ చెప్పారు. ‘‘అయితే, సభలో గందరగోళ పరిస్థితులుంటే నోటీసుకు అనుకూలంగా ఎంత మంది ఉన్నదీ లెక్కించడం కష్టమే. ఇదో సాంకేతిక సమస్య. సభలో రభస కారణంగా నోటీసును చేపట్టకపోవడానికి ఏ ఒక్క వ్యక్తినీ నిందించలేం. ఎంపీలు స్పీకర్ మాట వినే మూడ్‌లో ఉండాలి. కానీ, తీర్మానాన్ని తప్పకుండా చేపట్టడమే సంప్రదాయం’’ అని ఆయన స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం అత్యంత గంభీర అంశం: ఎస్.సీ.మల్హోత్రా సభలో గొడవ జరుగుతోందనే కారణంతో పది రోజులుగా అవిశ్వాస తీర్మానాల నోటీసులను స్పీకర్ చేపట్టకపోవడాన్ని గతంలో లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన మరో ప్రముఖుడు ఎస్.సీ.మల్హోత్రా సమర్ధించారు. ‘‘ ఏ విషయం చేపట్టాలన్నా సభలో పరిస్థితి బావుండాలి. అవిశ్వాస తీర్మానం వంటి అత్యంత గంభీర అంశానికి ఇది మరీ అవసరం. ప్రస్తుత ప్రతిష్టంభనకు రాజకీయపక్షాల నేతలు ప్రధాన బాధ్యులు. తర్వాత ప్రభుత్వం, స్పీకర్‌కు అందులో వాటా ఉందని’’ ఆయన అన్నారు. అవిశ్వాస నోటీసులను సభ చేపట్టకుండా పాలకపక్షం మరి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్మయితే సభలో రభస జరుగుతోందనే నెపంతో నిరవధికంగా అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలనకు చేపట్టకపోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చివరికి ఎటు పోతుందనే కీలక ప్రశ్న తలెత్తుతోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
నేడు ఎంపీలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌పై కొద్ది రోజులుగా పార్లమెంట్లో ఎంపీలు పోరాటం చేస్తుండటం, ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటులో తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రజా సంకల్ప యాత్రలో తాను విడిది చేసిన శిబిరం వద్ద సోమవారం వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో సమావేశమవుతారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల గ్రామంలో ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో ప్రధానంగా ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరింత ఉధృతం చేయడం, హోదాకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టడం, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఎంపీలకు సలహాలు, సూచనలివ్వనున్నారు. -
ప్యాకేజీ రాష్ట్రానికి కాదు.. చంద్రబాబుకు : వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో బయటపడటానికే చంద్రబాబు ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయడానికైన వెనకాడబోయేది లేదని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టంలోని ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని వైవీ అన్నారు. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టు సాధించే వరకూ తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో జరుగుతున్న అవినీతి, అనుచరుల దోపిడీల గురించి ప్రజలకు తెలియచేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రాముఖ్యత, దాని ఆవశ్యతను వివరిస్తూ, విభజన హామీలు అమలుకు పాదయాత్రల ద్వారా పోరాటం చేస్తామని తెలిపారు. జైట్లీ ప్రసంగంలో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని మండిప్డడారు. హోదా బదులు రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక పాకేజీకి సైతం చట్టబద్దత లేదని విమర్శించారు. ఇంకా ఎంతకాలం చంద్రబాబు ప్రజలను మభ్యపెడతారంటూ ప్రశ్నించారు. ప్యాకేజీ రాష్ట్రానికి కాదని, చంద్రబాబుకు ప్యాకేజీ అని, దోచుకోవడానికే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని వైవీ మండిపడ్డారు. -
ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంతో తెలుసా..?
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌పై గత ఏడాది మార్చి నాటికి రూ.2,16,027 కోట్ల మేర అప్పుల భారం ఉన్నట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి పొన్.రాధాకృష్ణ రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మంగళవారం అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఈ వివరాలు వెల్లడించారు. అప్పులపై 2017–18 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ కింద రూ.14,738 కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసిందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం రూపొందించిన ద్రవ్య సూచిక ప్రకారం రాష్ట్ర స్థూల ఆదాయంలో అప్పుల నిష్పత్తి 2017–18 ఆర్థిక సంవత్సరానికి 25.09% ఉంటుందని అంచనా వేయగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 28.11%కు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేసిందన్నారు. రాష్ట్ర ప్రజల తలసరి అప్పు ఎంత ఉందో చెప్పడానికి అధికారిక గణాంకాలు ఏవీ అందుబాటులో లేవన్నారు. ఫార్మా డీ గ్రాడ్యుయేట్ల ఉద్యోగాల కోసం పలు చర్యలు ఫార్మా డీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాల కల్పన కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆరేళ్ల ఫార్మా డీ కోర్సు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ ఆరోగ్య విభాగం, ప్రైవేట్ ఆస్పత్రులలో తమ అర్హతకు తగిన ఉద్యోగాలు రాక మానసిక క్షోభకు గురవుతున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ దృష్టికి తెచ్చారు. సీనియర్ ఫార్మసిస్ట్, చీఫ్ ఫార్మసిస్ట్, డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్ లాంటి ఉద్యోగాలకు అర్హుల జాబితాలో ఫార్మా డీ గ్రాడ్యుయేట్లను కూడా చేర్చినట్లు మంత్రి తన జవాబులో వివరించారు. ఫార్మసిస్ట్ పోస్టుకు ఫార్మా డీను విద్యార్హతగా నిర్ధారిస్తూ నియామక నిబంధనలు సవరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) లేఖలు రాసిందన్నారు. ఫార్మా డీ గ్రాడ్యుయేట్లు ఫార్మసీ కళాశాలల్లో బోధన నిర్వహించేందుకు కూడా అర్హులేనని చెప్పారు. ఇంకా మదింపు దశలోనే ప్రపంచ బ్యాంకు రుణం రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రూ.3,324 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం ఇంకా పరిశీలన దశలో ఉన్నట్లు కేంద్ర మంత్రి రాధాకృష్ణ తెలిపారు. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... ఈ ప్రాజెక్టుపై ప్రపంచబ్యాంకు బృందం మదింపు చేస్తోందని, ఇది ఇంకా ప్రాథమిక అంచనాలు, అధ్యయనాల దశలోనే ఉందని తెలిపారు. మదింపు, సంప్రదింపులు పూర్తయిన తర్వాతనే రుణానికి ప్రపంచబ్యాంకు ఆమోద ముద్ర వేస్తుందన్నారు. ఈ సందర్భంగా అమరావతి కేపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉన్నతాధికారి ఒకరు ఈ ప్రాజెక్ట్‌కు రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలిపినట్లుగా మీడియా ప్రతినిధులకు చేసిన ప్రకటనను విజయసాయిరెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. గత పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు విరుద్ధంగా తాము ఏమీ మాట్లాడలేదంటూ ఆ ఉన్నతాధికారి వివరణ ఇచ్చారని తెలిపారు. -
‘టీడీపీ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో కొత్తేమీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నాలుగేళ్లు అయినా విభజన హామీలను అమలు చేయరా అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఏపీకి అన్యాయంపై లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వైఎస్ఆర్సీపీ ఎంపీలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రయోజనాల విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరిని ప్రజలు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జైట్లీ ప్రకటనలో కొత్తగా ఏం చెప్పారని టీడీపీ ఎంపీలు సంతృప్తి చెందారని ప్రశ్నించారు. అధికారంలో ఉండి టీడీపీ ఎంపీలు ఆందోళన చేయడం ఏమిటని ఆయన నిలదీశారు. శాసనాలు చేయాల్సింది.. ప్రధానమంత్రిపై ఒత్తిడి తేవాల్సింది మీరే కదా.. ఆ బాధ్యతను మరిచిపోయి.. ప్రజలను మోసం చేస్తారా? అని టీడీపీ నేతలను ఉద్దేశించి వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఆడుతున్న డ్రామాను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, పోలవరం సహా విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే పార్లమెంటు లోపల, బయట ఆందోళన కొనసాగిస్తామని, ఏపీ ప్రజల తరఫున తాము నిలబడతామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఎందుకు ఆందోళనలో పాల్గొనలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. హోదా కసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని తెలిపారు. విభజన హామీలను ఇంకెప్పుడు అమలు చేస్తారని నిలదీశారు. ఏపీకి న్యాయం జరిగేవరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
వెనక్కి తగ్గిన టీడీపీ.. ఆందోళనపథంలోనే వైఎస్ఆర్సీపీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరుబాట కొనసాగిస్తుండగా.. అధికార టీడీపీ ఎంపీలు మాత్రం వెనక్కి తగ్గారు. ఆంధ్రప్రదేశ్ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటన చేసిన నేపథ్యంలో ఉభయ సభల్లో టీడీపీ ఎంపీలు తమ ఆందోళన విరమించారు. మరోవైపు.. టీడీపీ ఎంపీలు నిర్వహించిన ఆందోళనకు కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి దూరంగా ఉండటం గమనార్హం. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఆందోళన కొనసాగించాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు నిర్ణయించారు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో కొత్త విషయం లేదని వారు స్పష్టం చేశారు. గతంలో చెప్పినవాటినే జైట్లీ మళ్లీ చెప్పారని తెలిపారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు తాము వెనక్కితగ్గబోమని వైఎస్ఆర్సీపీ ఎంపీలు తేల్చిచెప్పారు. పార్లమెంటు లోపల, బయట తమ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. -
కలిసికట్టుగా దేశాన్ని నూతనంగా మార్చుకుందాం
-
130 కోట్ల మంది కల.. నవభారతం
సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలోని చిట్టచివరి వ్యక్తి దాకా అభివృద్ధి ఫలాలు చేరాలన్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గంలో కేంద్ర ప్రభుత్వం పయనిస్తున్నదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. పేదరికాన్ని నిర్మూలించి, ఆర్థిక అంతరాలను తగ్గించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నదని, అవకాశాలను అందిపుచ్చుకుంటూ అంతర్జాతీయ యవనికపైనా సత్తాచాటుతున్నదన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు(సోమవారం) ఆయన ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. 2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతాయని, అప్పటికి అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి ‘నూతన భారతం’గా రూపాంతరం చెందుతుందని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. సుదీర్ఘ ప్రసంగం : కోవింద్ రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలు ఇవే కావడంతో ఆయన ప్రసంగంపై ఆసక్తినెలకొంది. ‘‘ఇటీవలే మనం సంక్రాంతి, పొంగల్ తదితర పండుగలు చేసుకున్నాం. గణతంత్రదినోత్సవం కూడా మనకు చాలా ముఖ్యమైన పండుగ. ఆ సందర్భంలో ఆసియాన్ దేశాల ప్రతినిధులను ఆహ్వానించి, వసుధైక కుటుంబాన్ని నిర్మించే ప్రయత్నం చేశాం. నూతన భారత స్వప్నాన్ని సాకారం చేసుకునే క్రమంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన మీరంతా(సభ్యులు) కీలక భూమిక పోషిస్తున్నారు..’ అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కోవింద్ ప్రసంగంలో ముఖ్యాశాలు.. ⇒ ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించలేకపోతే రాజకీయ ప్రజాస్వామ్య అంతిమ లక్ష్యం పూర్తికాదన్న బీఆర్ అంబేద్కర్ ఆశయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళుతున్నది. సామాజిక న్యాయంతోపాటు ఆర్థిక స్వావలంబనకు విశేషప్రాధాన్యం ఇస్తున్నది. ⇒ పెద్ద ఎత్తున మరుగుదొడ్లను నిర్మించి స్త్రీల గౌరవాన్ని కాపాడుకున్నాం. ఇది కూడా సామాజిక న్యాయమే. ⇒ మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి భారత్‌ను.. పరిపూర్ణ స్వచ్ఛభారత్ (పరిశుభ్రమైన దేశంగా) మార్చేయాలి. ⇒ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా ప్రభుత్వం లక్షల సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. తద్వారా మహిళలు కట్టెలు, బొగ్గులపై వంట చేస్తే బాధను తొలగించగలిగారు. ⇒ త్రిపుల్ తలాక్ చట్టం ద్వారా ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం. ⇒ గర్భందాల్చే ఉద్యోగినులకు 26 వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు మంజూరుచేశాం. ⇒ బేటీ బచావో, బేటీ పడావో లాంటి కార్యక్రమాలతో బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నాం. ⇒ ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా సుమారు రూ4లక్షల కోట్ల రుణాలను అందించాం ⇒వ్యవసాయ, విద్యుత్, విద్యా రంగాల్లో మునుపటికంటే ఘనమైన ప్రగతిని సాధించాం. ⇒దేశంలో ఏదొఒక చోట నిరంతరం ఎన్నికలు జరుతుంటాయి. ఆ విధానానికి స్వస్తిపలకి, జమిలి ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ⇒ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆర్థికాభివృద్ధి, స్వావలంబనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ⇒బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించడమేకాక ఆ వర్గాలకు అవసరమైన చేయూత అందించడంలో ప్రభుత్వం ఎల్లపుడూ ముందుంటుంది. ⇒2022లోగా దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. ⇒జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రజలకు సేవలను దగ్గరచేశాం. ⇒ప్రధాన మంత్రి జన్ ఔషది యోజన ద్వారా సుమారు 800 రకాల మందులను అతితక్కువ ధరకు అందిస్తున్నాం ⇒స్టంట్ల ధరలను తగ్గించి, దాదాపు 500 జిల్లాల్లో డయాలసీస్ కేంద్రాలను ఏర్పాటుచేశాం. ⇒రైల్వే వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకున్నాం. ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య హైస్పీడ్ రైలును ఏర్పాటుచేశాం. ⇒మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు వైమానిక సేవలను దగ్గరచేసే క్రమంలో ద్వితీయశ్రేణి నగరాల్లో విమానాశ్రయాలను ప్రారంభించాం ⇒ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. అసోం-అరుణాచల్‌ను అనుసంధానించే డోలా సాధియా వంతెను ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ⇒దేశంలో వామపక్ష తీవ్రవాదం క్రమంగా బలహీనపడుతున్నది. గత మూడేళ్లలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలిశారు. ⇒జమ్ముకశ్మీర్‌లో శాంతి స్థాపన కోసం అన్ని వర్గాలనూ చర్చలకు ఆహ్వానించాం. సైనిక, అర్థసైనిక బలగాలు చొరబాట్లను గట్టిగా తిప్పికొడుతున్నారు. -
‘ట్రిపుల్ తలాక్’.. అందరికళ్లూ కాంగ్రెస్‌పైనే!
సాక్షి, న్యూఢిల్లీ : తీవ్రచర్చనీయాంశమైన ట్రిపుల్ తలాక్ బిల్లు నేడు రాజ్యసభకు రానుంది. బీజేపీకి భారీ మెజారిటీ ఉన్న లోక్‌సభలో తలాక్ బిల్లుకు సులువుగా ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. అయితే రాజ్యసభలో మాత్రం విపక్షాలదే మెజారిటీ కావడంతో తలాక్‌కు ఆమోదం లభిస్తుందా, లేదా అనేదానిపై ఉత్కంఠనెలకొంది. కాంగ్రెస్ నేతృత్వంలో అన్ని విపక్ష పార్టీలు ఏకమైతే తలాక్ బిల్లు వీగిపోయే అవకాశాలే ఎక్కువ. తలాక్ బిల్లు విషయంలో రాజ్యసభలో అనుసరించాల్సిన విధానంపై కాంగ్రెస్, సీపీఎం, ఇతర పక్షాల మధ్య చర్చలు నడిచాయి కానీ ఉమ్మడి నిర్ణయం ఉంటుందని మాత్రం ఇంకా ప్రకటన వెలువడలేదు. అందరికళ్లూ కాంగ్రెస్‌పైనే : మిగతా పక్షాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ సొంతగా బిల్లులో కొన్ని మార్పులను సూచించే అవకాశాలున్నట్లు తెలిసింది. మార్పులకు ప్రభుత్వం అంగీకరించని పక్షంలో ‘సెలెక్ట్ కమిటీ’ ని వేయాలని డిమాండ్‌ను తెరపైకి తేనున్నట్లు సమాచారం. వివాహలకు సంబంధించినవి సివిల్ వివాదాలుకాగా.. బీజేపీ తీసుకొచ్చిన బిల్లుతో వాటిని క్రిమినల్ వివాదాలుగా మార్చేసిందన్న సీపీఎం వాదనతో ఏకీభవిస్తున్నట్లు కాంగ్రెస్ గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు రాజ్యసభలో కాంగ్రస్ తీసుకోబోయే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎంపీలకు విప్ జారీ : మూడురోజుల సెలవుల తర్వాత మంగళవారం పార్లమెంట్ సమావేశాలు పునఃప్రారంభంకానున్నాయి. ట్రిపుల్ తలాక్‌తోపాటు మరికొన్ని కీలక బిల్లులు కూడా నేడు, రేపు ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో జనవరి 2, 3 తేదీల్లో సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ బీజేపీ తన సభ్యులకు విప్ జారీచేసింది. రేపు(బుధవారం) ఉదయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. -
దిగజారుతున్న విలువలు
సందర్భం పార్లమెంట్ చర్చలు అంటే శిఖరప్రాయులైన వక్తలు, అద్భుత వాదనా పటిమ, నిఖార్సయిన గణాంకాలు, గౌరవప్రదమైన ముగింపు అనే రోజులు పోయాయి. ఇప్పుడది పరస్పర ఘర్షణగా, దూషణల పర్వంగా దిగజారిపోయింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భద్రతకోసం ఒక రోజుకు రూ. 25వేలు ఖర్చుపెడుతున్నారంటూ రామ్మనోహర్ లోహియా 1963లో ఒక కరపత్రం రాశారు. అప్పట్లో రోజుకు 3 అణాపైసలపై బతుకీడుస్తున్న భారతీయ నిరుపేదల రోజువారీ దుర్భర జీవి తంతో పోలిస్తే ఇది చాలా పెద్ద వ్యత్యాసం. తర్వాత నెహ్రూ దానిపై పార్లమెంటులో చర్చిస్తూ, ప్రణాళికా సంఘం గణాంకాలను ప్రస్తావిస్తూ భారతీయుల రోజు వారీ ఆదాయం 15 అణాపైసలుగా ఎత్తిచూపారు. ఈ సందర్భంగా ఆర్థిక అసమానతలకు సంబంధించి లోహియా, నెహ్రూ గొప్ప చర్చకు నాంది పలికారు. ఈ మేటి చర్చకు ముగింపు పలకడం కోసం ఏంపీలు సీరియస్‌గా చర్చించారు. కానీ ఆ చర్చ అత్యంత నాగరిక రీతిలో సాగింది. శిఖరప్రాయులైన వక్తలు అత్యద్భుత వాదనా పటిమతో, నిఖార్సయిన గణాంకాలతో తమతమ వాదనలను వినిపించారు తప్పితే మొత్తం చర్చాక్రమంలో చిన్న అంతరాయం కానీ, దూకుడుతనాన్ని కానీ ప్రదర్శించడం జరగలేదు. కాని మన రాజకీయ చర్చలు క్రమేణా దిగజారుతూ వచ్చాయి. అలాగే హిందూ న్యాయ స్మృతి బిల్‌ని చూడండి. 1948లో బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో ఎంపిక కమిటీ రూపొందించిన దీని ముసాయిదా అత్యంత వివాదాస్పదమైంది. అది హిందువులు, జైనులు, బౌద్ధులు, ఆదివాసులకు వర్తించే పర్సనల్, స్థానిక పౌర చట్టాలను క్రోడీకరించిన చట్టంతో మార్చడానికి చేసిన ప్రయత్నం. కులానికి ఉన్న చట్టపరమైన ప్రాధాన్యతను తగ్గించడం, విడాకులను సులభతరం చేయడం, వితంతువులకు, మహిళలకు కూడా ఆస్తి హక్కులో భాగం కల్పించడం ఈ బిల్లులో ముఖ్యాంశాలు. హిందూ కోడ్ బిల్లుపై చర్చను ప్రారంభించిన మోషన్ తీర్మానంపై 50 గంటలపాటు చర్చ జరిగింది. పార్లమెంటులో, డాక్టర్ రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖులు సైతం ఈ బిల్లును రౌలట్ చట్టంతో పోల్చారు. కొంతమంది సభ్యులు హిందూ మతమే ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అంబేడ్కర్ వంటివారు హిందూ సమాజం కాలానుగుణంగా పరిణమించాలని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీలు చేసిన గొప్ప ప్రసంగాలు పార్లమెంటుకే ప్రమాణంగా నిలిచిపోయాయి. 1949 నవంబర్‌లో అంబేడ్కర్ ‘అరాజకపు వ్యాకరణం’పై చేసిన ప్రసంగం.. ఇకనుంచి సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, శాసనోల్లంఘన వంటి పోరాటరూపాలను పరి త్యజించాలని చెప్పడమే కాకుండా, సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ విధానాలను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. తర్వాత భారత్ తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిన సందర్భంలో ప్రముఖ పార్లమెంటేరియన్ పీలూ మోడీ, నాటి ప్రధాని ఇందిరాగాంధీని గుచ్చి గుచ్చి అడుగుతూ, ‘మేడమ్ ప్రైమ్ మినిస్టర్, మన శాస్త్రజ్ఞులు సాంకేతికరంగంలో గొప్ప విజయాలు సాధిస్తున్నారు. కానీ మన టెలిఫోన్లు ఎందుకు పనిచేయడం లేదో మీరు వివరిస్తే మేమంతా కాస్త సంతోషపడతాం’ అన్నారు. స్వాతంత్య్రానంతర భారత్ ఒక రకంగా చూస్తే అదృష్టవంతురాలు అనే చెప్పాలి. నెహ్రూ, పటేల్, లోహియా వంటి దిగ్గజ నేతలు దూషణలకు తావు లేకుండా అనేక అంశాలపై చర్చకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజాస్వామిక అభినివేశాన్ని ప్రోత్సహించాలని చూసేవారు. నెహ్రూ నుంచి వాజపేయి దాకా పార్లమెంటు కార్యకలాపాలను భక్తిభావంతో కొనసాగించడం కోసం అనేక ఉత్తమ సంప్రదాయాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి, శాసన సంబంధమైన లక్ష్యాల సాధనపై వీరు ప్రముఖంగా దృష్టి పెట్టేవారు. ఒకప్పుడు అద్భుత ప్రసంగాలకు, వాదనాపటిమకు తావిచ్చిన మన పార్లమెంటరీ చర్చాప్రక్రియ జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, సమస్యలపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఈ చర్చా సంప్రదాయాన్ని వారసత్వంగా స్వీకరించడానికి బదులుగా, రానురానూ ఎంపీలు వాగాడంబరత్వానికి, అరువుతెచ్చుకున్న పదప్రయోగాలకు దిగజారిపోయారు. మృదు చర్చల స్థానంలో దూకుడుతనం ప్రవేశించింది. మన పార్లమెంటు ఎలాంటి చారిత్రక క్షణాలను ఆస్వాదించిందో ఒక్కసారి చూద్దాం. రాజాజీ ఒకసారి లోక్‌సభలో ప్రవేశపెట్టిన సవరణను సభ తిరస్కరించినప్పుడు నెహ్రూ ప్రసంగిస్తూ, ‘మెజారిటీ నా వైపే ఉంది రాజాజీ’ అన్నారు. దానికి రాజాజీ జవాబిస్తూ, ‘మెజారిటీ మీవైపే ఉండవచ్చు నెహ్రూజీ, కానీ తర్కం నా వైపే నిలిచింది’ అన్నారు. ప్రస్తుత పార్లమెంటులో ప్రమాణాలు పూర్తిగా అడుగంటిన చర్చాప్రక్రియను చూస్తుంటే పరస్పర ఘర్షణగా, రాత్రి 8 గంటల వార్తాప్రసార పోరాటాల స్థాయికి దిగ జారిపోయినట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు పార్లమెంటులో రాకెట్ ప్రయోగాల గురించి చర్చ సాగితే ఇప్పుడు పురాతన చరిత్రపై ఏకపక్ష ప్రదర్శన జరుగుతోంది. ఒకప్పుడు గౌరవనీయ కళగా సాగిన రాజకీయ వాక్పటిమ నెహ్రూ, బర్క్, చర్చిల్ వంటి గొప్ప వక్తలను రూపొందించింది. ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కోవడమే ప్రధానమైపోయింది. ఈ నేపథ్యంలో మురికి రాజకీయ తెట్టును శుద్ధి చేయాలంటే ఉత్తమశ్రేణి పార్లమెంటేరియన్లు మళ్లీ ఆవి ర్భవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరుణ్ గాంధీ వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
నేటి నుంచి శీతాకాల సమావేశాలు
-
నేడు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
-
సీత జన్మస్థలంపై పార్లమెంట్లో రగడ
- ఆధారాల్లేవు.. ఇది విశ్వాసాలకు సంబంధించిన అంశం - కేంద్ర మంత్రి మహేశ్ శర్మ ప్రకటన.. రాజ్యసభలో రగడ న్యూఢిల్లీ: సీత జన్మించిన ప్రాంతం మన విశ్వాసాలకు సంబంధించిన విషయమని కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ రాజ్యసభలో పేర్కొనడం పట్ల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి చారిత్రక ఆధారాలు లేవని ప్రతిపక్షం పేర్కొంది. అయితే శర్మ తన సమాధానాన్ని సమర్థించుకున్నారు. సీత జన్మించిన ప్రాంతంపై సందేహాలు అక్కర్లేదని, ఆమె మిథిలలో జన్మించినట్లు వాల్మీకి రామాయణంలో ఉందని తెలిపారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝా బిహార్‌లోని సీతామర్హి ప్రాంత(సీత జన్మించినదిగా భావిస్తున్న చోటు) అభివృద్ధి గురించి వివరాలు కోరిన సందర్భంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. సీతామర్హి జిల్లాలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎలాంటి తవ్వకాలు చేపట్టలేదని కాబట్టి ఆ ప్రాంతంలో సీత జన్మించిందని అనడానికి చారిత్రక ఆధారాలు లేవని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. సీతారాముల స్వయంవరానికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అని వ్యగ్యంగా ప్రశ్నించారు. రాముడికి చెడ్డపేరు తేవొద్దు: తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయుధాలు ప్రదర్శిండం పట్ల తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభలో నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలతో రాముడికి అపకీర్తి తేవొద్దని కేంద్రాన్ని కోరింది. రామనవమి లాంటి పవిత్ర దినాన శాంతి, ప్రేమను ప్రచారం చేయడానికి బదులు ఆయుధాలు పట్టేలా యువతను ప్రోత్సహించడం తాలిబన్ సంస్కృతిని పోలినట్లు ఉందని పేర్కొంది. -
'ఎంపీలు దొరికేస్తారని కలలో కూడా అనుకోలేదు'
మన విమానయాన సంస్థలలో భద్రతా నిబంధనలు చాలా బాగున్నాయని, అయితే ఒక పార్లమెంటు సభ్యుడు ఇలా దొరికేస్తాడని తాను కలలో కూడా ఊహించలేదని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు లోక్‌సభలో వ్యాఖ్యానించారు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో సిబ్బంది ఒకరిని 25 సార్లు చెప్పుతో కొట్టడం, దాంతో పలు విమానయాన సంస్థలు ఆయనను తమ విమానాల్లో ఎక్కించుకోబోమంటూ నిషేధం విధించిన అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లోను సోమవారం చర్చ జరిగింది. కమెడియన్ కపిల్ శర్మ కూడా బాగా తాగేసి విమానంలో గొడవ చేశాడని, అయితే అతడిపై మాత్రం నిషేధం ఎందుకు విధించలేదని శివసేన ఎంపీ ఆనందరావు అడ్సుల్ ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయని ఈ సందర్భంగా లోక్‌సభలో అశోక్ గజపతిరాజు చెప్పారు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ను నిషేధించడం ద్వారా విమానయాన సంస్థలు తమ దాదాగిరీ చూపించుకుంటున్నాయని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ రాజ్యసభలో వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద పలు పార్టీలకు చెందిన ఎంపీలు రవీంద్ర గైక్వాడ్‌కు మద్దతుగా నిలిచి తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
నా హాజరు శాతాన్ని వక్రీకరించారు
ఆంగ్ల పత్రికపై ఎంపీ జితేందర్ రెడ్డి ఆగ్రహం సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తన హాజరు శాతాన్ని వక్రీకరించి ప్రచురించిందంటూ ఓ ఆంగ్ల పత్రికపై టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీల హాజరు శాతానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ఓ ఆంగ్ల పత్రిక శుక్రవా రం ఎడిషన్‌లో వార్తను ప్రచురించింది. అందులో అత్యల్పంగా 9% మాత్రమే తాను సభకు హాజరైనట్టు పేర్కొందంటూ జితేందర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. తన హాజరు శాతం సదరు పత్రిక పేర్కొన్న దానికంటే అత్యధి కంగా ఉందని, ఈ విషయంలో నిజాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు..సదరు పత్రిక బహి రంగ క్షమాపణ చెప్పి.. తన హాజరు శాతాన్ని పక్కాగా తిరిగి ప్రచురించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో కూడా జితేందర్‌రెడ్డి ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. సదరు పత్రిక ఎడిటర్, పబ్లిషర్లకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. -
ప్రత్యేక హోదాపై గళం విప్పండి: వైఎస్ జగన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాయే సంజీవిని, హోదా లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తులేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అందుకోసం పార్లమెంట్లో గళమెత్తాలని పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రత్యేక హోదాకు ఏదీ సాటిరాదని దీనిపై పార్లమెంట్ ఉభయ సభల్లో గళం వినిపించాలని, కేంద్ర సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామన్నారు. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధానంగా చర్చ జరిగిందని ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చి మాట మార్చారన్నారు. ఇప్పుడు హోదాతో ప్రయోజనం లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి హోదాతోనే పరిశ్రమలు రాయితీలు వస్తాయని చెప్పారు. హోదాతోనే 11 రాష్ట్రాలు అభివృద్ధి చెందాయన్నారు. చట్టంలో ఉన్నవే చేస్తున్నప్పుడు మళ్లీ చట్టబద్ధత అనే మాటకు అర్థంలేదని చెబుతున్నారని, దీన్ని బట్టి చూస్తే ప్రత్యేక ప్యాకేజీ, చట్టబద్ధత అనే మాటలు బూటకమని, ఆ పేర్లతో ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయని బాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీలు ఆరోపించారు. గత ఏడాది నిర్వహించిన సదస్సుల్లో ఎన్ని కోట్ల పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, బుట్టారేణుక, విజయసాయిరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
ప్రత్యేక హోదాపై గళం విప్పండి: వైఎస్ జగన్
-
నోట్ల రద్దుపై చర్చకు భయపడే..
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు భయపడే పార్లమెంట్ సమావేశాలు జరగకుండా అడ్డుకున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, తృణాముల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పార్లమెంటులో చర్చను జరగకుండా స్తంభింపజేయడం దురదృష్టకరమన్నారు. పెద్దనోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం చర్చకు సిద్ధమేనని ప్రకటించినా ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకున్నాయో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. -
నోట్ల రద్దు పెద్ద కుంభకోణం: సురవరం
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణమని సీపీఐ జాతీయ అధ్యక్షుడు సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ జరగకపోవడానికి బీజేపీనే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లబాబులు దాచుకోవడానికే రూ.2 వేల నోటు తీసుకువచ్చారని విమర్శించారు. బ్యాంకులకు దాచుకున్న డబ్బులు కాదు దోచుకున్న డబ్బులే వస్తున్నాయని చెప్పారు. కేంద్రప్రభుత్వాన్ని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీనే మందలించారన్నారు. అహ్మదాబాద్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పెద్దమొత్తంలో నోట్లు మార్చుకున్నారన్నారు. ప్రధాని మోదీని చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ భయపడుతున్నారని సుధాకర్ రెడ్డి విమర్శించారు. -
రాహుల్‌పై వెంకయ్యనాయుడు విసుర్లు!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుపై లోక్‌సభలో తనను మాట్లాడనివ్వడం లేదని, తాను మాట్లాడితే భూకంపం వస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. రాహుల్‌వి చిన్నపిల్లాడి వ్యాఖ్యలని, అపరిపక్వతతో కూడుకున్నవని విమర్శించారు. అయినా రాహుల్ సెలవుల్లో మాత్రమే పార్లమెంటుకు వస్తారని, ఆయన రెగ్యులర్‌గా సభకు రారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూరితంగానే పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తున్నదని, తమ అసలు స్వరూపం బయటపడుతుందనే భయంతోనే వారు ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీని పార్లమెంటులో మాట్లాడనివ్వకపోవడంతోనే ఆయన జనసభల్లో మాట్లాడుతున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. పెద్దనోట్ల రద్దు అనేది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం అని, తాను లోక్‌సభలోనే దీనిపై మాట్లాడలనుకుంటున్నానని రాహుల్‌గాంధీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి యావత్ దేశంలో ప్రసంగాలు ఇస్తున్నారు గానీ, లోక్‌సభకు రావడానికి మాత్రం భయపడుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. -
నేను మాట్లాడితే భూకంపమే
పెద్దనోట్ల రద్దు అంశంపై లోక్‌సభలో తనను మాట్లాడనివ్వడం లేదని, తాను మాట్లాడితే భూకంపం వస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ భయంతోనే ప్రభుత్వం చర్చ నుంచి పారిపోతోందని ఆయన చెప్పారు. పెద్దనోట్ల రద్దు అనేది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం అని, తాను లోక్‌సభలోనే దీనిపై మాట్లాడలనుకుంటున్నానని, అక్కడ అన్నీ చెబుతానని అన్నారు. ప్రధానమంత్రి యావత్ దేశంలో ప్రసంగాలు ఇస్తున్నారు గానీ, లోక్‌సభకు రావడానికి మాత్రం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు మీద చర్చించడానికి తాము దాదాపు నెల రోజుల నుంచి ప్రయత్నిస్తున్నామని, పాలకు పాలు.. నీళ్లకు నీళ్లు ఏవో తేలిపోవాలనే తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు. -
పేటీఎం అంటే.. పే టు మోదీ!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. రోమన్ చక్రవర్తి నీరోలా వ్యవహరిస్తున్నారని, రోమ్ నగరం తగలబడిపోతుంటే ఆయన ఫిడేలు వాయించుకున్నట్లుగానే ఈయన వ్యవహారం ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పేటీఎం అంటే 'పే టు మోదీ' అన్నట్లుగా తయారైందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పేటీఎం లాంటి ఈ వ్యాలెట్ కంపెనీలకు లాభం చేకూర్చడానికే ఆయన పెద్దనోట్లను రద్దుచేశారని ఆరోపించారు. నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధాని 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసినప్పటి నుంచే పేటీఎం లాంటి ఈ వ్యాలెట్ కంపెనీల లావాదేవీలు ఒక్కసారిగా పెరిగిపోయాయని అన్నారు. నగదురహిత లావాదేవీల వల్ల కొద్దిమంది అత్యధిక ప్రయోజనం పొందుతున్నారని పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. లోక్‌సభలో తనను మాట్లాడినిస్తే ఈ కుంభకోణాన్ని బయటపెడతానన్నారు. ప్రధాని కొన్ని కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. పెద్దనోట్లను రద్దుచేసిన తర్వాత.. అసలు నగదు అన్నదే దొరక్కపోవడంతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మాత్రం నవ్వుతూనే ఉన్నారని మండిపడ్డారు. ఇది మూర్ఖపు చర్య అని, ఎవరినీ పరిగణనలోకి తీసుకోకుండా హడావుడిగా నిర్ణయం తీసేసుకున్నారని అన్నారు. పేదలు, రైతులు, రోజుకూలీల కుటుంబాల మీద దీనివల్ల తీవ్ర ప్రభావం పడిందన్నారు. తాను సభలో మాట్లాడాలనే అనుకుంటున్నానని, తన ఉపన్యాసం కూడా సిద్ధంగా ఉందని, బీజేపీ వాళ్లు వచ్చి సభ ప్రారంభిస్తే అప్పుడు తెలుస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధానమంత్రి మోదీ లోక్‌సభకు రావాలని, తనను మాట్లాడనివ్వాలని, ఆ తర్వాత లోక్‌సభలోనే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్లు మాత్రం పెద్దనోట్ల రద్దుపై చర్చ జరిగినంతసేపు ప్రధాని మోదీ రాజ్యసభలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. -
టీవీ కవరేజి కోసమే గందరగోళం చేస్తున్నారు
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. ప్రతిపక్షం, అధికార పక్షాల సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం, ఆయా నేతలకు మద్దతుగా ఎంపీలు నినాదాలు చేయడంతో పార్లమెంటు ఉభయ సభలు సమావేశమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ''బ్యాంకుల్లో భారీగా నగదు జమ అయ్యిందంటున్నారు, మరి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది ఎందుకు, అసలు బ్యాంకులన్నింటిలో కలిపి ప్రతిరోజూ ఎంత మొత్తం జమ అయ్యిందో, ఎంత ఇస్తున్నారో అనే వివరాలు రహస్యంగా ఎందుకు ఉచుతున్నారు, వాటిని సభ ముందు ఉంచాలి'' అని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. 30 రోజులవుతున్నా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని మాయావతి అన్నారు అయితే.. అసలు ఈ అంశంపై ప్రతిపక్షం చర్చ కోరిన మరు నిమిషమే తాము అంగీకరించామని, కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ చర్చను ప్రారంభించారని, ఇప్పటికి ఒకటిన్నర రోజులు దానిపై చర్చ జరిగిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. విషయం చాలా ముఖ్యమైనది కాబట్టి చర్చ పూర్తికావాలని, ఆజాద్ ప్రస్తావించిన అంశాలన్నీ చర్చలో భాగమేని ఆయన చెప్పారు. ప్రతిరోజూ ఏదో ఒక వంకతో చర్చను ఆపేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని, కేవలం టీవీ కవరేజిల కోసమే ప్రతిపక్ష సభ్యులు గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ విషయం మీద చర్చజరగాలో దాన్ని మాత్రం జరపడం లేదన్నారు. ప్రతిపక్షానికి ధైర్యం ఉంటే నోట్ల రద్దుపై చర్చను కొనసాగనివ్వాలని జైట్లీ అనడంతో ఒక్కసారిగా ప్రతిపక్ష సభ్యులు లేచి నినాదాలు మొదలుపెట్టారు. వాళ్లకు వ్యతిరేకంగా అధికార పక్ష సభ్యులు కూడా నినాదాలు చేయడంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఇరుపక్షాలపై మండిపడ్డారు. చివరకు సభను 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురుకావడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా సభను 12 గంటలకు వాయిదా వేశారు. -
అడ్డగోలుగా విభజించి మళ్లీ చర్చలా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చర్చపై లోక్‌సభ స్పీకర్ అన్ని పార్టీలతో మాట్లాడారని, బీఏసీలో మాట్లాడిన తర్వాత ప్రత్యేక హోదా అంశంపై చర్చను పరిశీలిస్తామన్నారని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహనరెడ్డి చెప్పారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ముందుగానే వాగ్దానం చేసిన తర్వాత ఇంకా చర్చలెందుకని తాము అడిగినట్లు ఆయన తెలిపారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి మళ్లీ చర్చలు అంటున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను అమలుచేయాలని మేకపాటి రాజమోహనరెడ్డి డిమాండ్ చేశారు. -
హోదా కోసం గళమెత్తిన ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు లోక్‌సభలో గళమెత్తారు. సమావేశాలు ప్రారంభం కాగానే వాళ్లు 'ప్రత్యేక హోదా కావాలి', 'వుయ్ వాంట్ జస్టిస్' అని నినదిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. వారి నినాదాల మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ వరుసగా రెండోరోజు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే దాన్ని స్పీకర్ ఆమోదించలేదు. దాంతో వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమ నినాదాలను కొనసాగించారు. వారిని సొంత స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని, ప్లకార్డులు చూపించవద్దని స్పీకర్ చెప్పారు. సీట్ల నుంచి కదలని టీడీపీ ఎంపీలు ఒకవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు నేరుగా వెల్ లోకి వెళ్లి ఆందోళన చేస్తుంటే.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఏపీ ఎంపీలు మాత్రం తమ సీట్ల నుంచి కదలకుండా అక్కడే లేచి పసుపుపచ్చ రంగు ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డారు. అయితే కేంద్ర మంత్రులు మాత్రం ఈ ఆందోళనలో పాల్గొనలేదు. -
'విమానం గల్లంతు విద్రోహచర్య కాదేమో'
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్-32 అదృశ్యం వెనుక విద్రోహుల హస్తం ఉండకపోవచ్చని, అలా జరిగే అవకాశాలు చాలాచాలా తక్కువని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. శుక్రవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన గల్లంతైన విమానం ఆచూకీ కోసం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలను సభ్యులకు తెలిపారు. (ఆపరేషన్ తలాష్) ''ఆపరేషన్ తలాష్'ను స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా. ఇది విద్రోహ చర్య అయ్యే అవకాశాలు చాలా తక్కువ. గల్లంతైన విమానంలో ప్రయాణించిన 29 మందికి చెందిన కుటుంబాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం' అని పరీకర్ తెలిపారు. ఈ నెల 22న గల్లంతైన ఐఏఎఫ్ ఏఎన్ 32 విమానం గల్లంతై ఎనిమిది రోజులు కావస్తున్నా ఇంతవరకు దాని జాడ తెలియక పోవడంతో అందులో ప్రయాణించిన నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. (భగవంతుడా మాకేంటీ కష్టం..!) విమానం గాలింపులో రోబోలు ఇప్పటికే వివిధ శాఖలు విమానం ఆచూకీ కోసం తలపెట్టిన 'ఆపరేషన్ తలాష్' లో నిమగ్నమయ్యాయి. జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు చెందిన చక్రనిధి అనే నౌక ద్వారా అత్యాధునిక రోబోలను గురువారం నుంచి గాలింపు పనుల్లో ప్రవేశపెట్టారు. అత్యాధునికమైన ఈ నౌకకు అమర్చే రోబోలు నడిసముద్రంలో ఎంతటి లోతులో ఉన్న వస్తువులనైనా గుర్తించగలవు. (చివరి ప్రయత్నంగా విదేశాల సాయం తీసుకుంటాం) బంగాళాఖాతంపై ఎగురుతున్నప్పుడే విమానం ప్రమాదానికి లోనై ఉంటుంది, విమాన వేగానికి సుమారు 13 వేల అడుగుల లోతుల్లోని ఇసుకలో కూరుకు పోయి ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమానాన్ని కనుగొనడం అంత సులువు కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే రోబోల ప్రవేశం వల్ల కూలిపోయిన విమానం ఆచూకీ లభిస్తుందని నమ్ముతున్నామన్నారు. గత ఏడాది కూలిపోయిన కోస్ట్‌గార్డ్ విమానం శకలాలను సైతం ఈ రోబోల ద్వారానే గుర్తించినట్లు తెలిపారు. (విమానాలను నడుపుతున్న తీరు బాధాకరం) -
2వ రోజు పార్లమెంట్ సమావేశాలు
-
ఈరోజు రాజధానిలో ఏం జరగబోతోంది?
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో రాజకీయ ప్రకంపనలకు కారణమైన కీలక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్నిఎత్తి చూపుతూ కాంగ్రెస్ పక్షం, విపక్ష ఆరోపణలకు తిప్పికొడుతూ అధికార పక్షం ఒకే రోజు, ఒకే చోట నిరసనలకు దిగడంతో ఈ రోజు ఢిల్లీలో ఏం జరగబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడిందంటూ, ఆరోపితులపై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అధికార బీజేపీ ఎంపీలు శుక్రవారం ఉదయం నుంచి పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న బీజేపీ సభ్యులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, సరిగ్గా అదే ప్రదేశానికి (గాంధీ విగ్రహం వద్దకు) కాంగ్రెస్ ఎంపీలు ర్యాలీ రానుంది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ లలో రాష్ట్రపతి పాలలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ ఉదయం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు 'సేవ్ డెమోక్రసీ' పేరుతో ర్యాలీని చేపట్టింది. చీఫ్ సోనియా గాంధీ, వీపీ రాహుల్ గాంధీ, మాజీ పీఎం మన్మోహన్ సహా ముఖ్యనాయకులంతా ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయిస్తారు. ఇరు పక్షాలు గాంధీ విగ్రహం వద్ద ఎదురుపడే అవకాశం ఉండటంతో ఎవరో ఒకరు పక్కకు తప్పుకుంటేతప్ప ఉద్రిక్తత తప్పే అవకాశం లేదు. మరోవైపు ఇవే అంశాలపై వైరిపక్షాన్ని సభలోనూ నిలదీయాలని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. -
మంచి కబురు చెప్పిన మంత్రి గజపతిరాజు
న్యూఢిల్లీ: 'కర్ణుడి చావుకు వంద కారణాలు' అన్నట్టు.. ప్రభుత్వ సేవా సంస్థల నష్టాలకు కారణాలు కోకొల్లలు. ఇక విమానయాన సంస్థల మాట ఎత్తితే నష్టాలు తప్ప మరొకటి వినిపించదు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పరిస్థితి ఇటీవలే కాస్త మెరుగు పడింది. ఈ మేరకు ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విషయంలో మంచి కబురు చెప్పారు పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు. మంగళవారం రాజ్యసభలో ఎయిర్ క్యారేజ్ (సవరణ) బిల్లుపై మాట్లాడిన మంత్రి గజపతిరాజు.. ఎయిర్ ఇండియా నిర్వహణా లాభాన్ని ఆర్జించిందని తెలిపారు. 'ఈ ఏడాది ఎయిర్ ఇండియా నిర్వహణా నష్టాలను చవిచూడకపోగా లాభాన్ని సాధించింది' అని ప్రకటించారు. మంత్రి ప్రకటనను పలువురు సభ్యులు బల్లలుచరిచి ఆహ్వానించారు. గత ఏడాది నుంచి విమాన ఇంధనం ధరలు తగ్గడం విమానయాన సంస్థలకు కొత్త ఊపిరినిచ్చినట్టయింది. ఖర్చులు తగ్గడంతో 2015-15 ఆర్థిక సంవత్సరంలో పలు దేశీయ విమానయాన సంస్థలు లాభాలను ప్రకటించాయి కూడా. అయితే విదేశాలకు సర్వీసులు నడుపుతోన్న ఎయిర్ ఇండియా లాంటి సంస్థలకు మాత్రం నష్టాలు తప్పలేదు. గతేడాది ఎయిర్ ఇండియా 90-92 కోట్ల డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నష్టాలను అధిగమించినట్లు మంత్రి ప్రకటించడం శుభసూచికం. -
'ఉగ్రవాదులు ఎలా వచ్చారో అర్థంకాలేదు'
న్యూఢిల్లీ: గణతంత్ర్యవేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ అయినప్పటికీ ఆయుధాలు చేతపట్టుకున్న ఉగ్రవాదులు పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ పై దాడికి తెగబడ్డారు. జనవరి 2న చోటుచేసుకున్న నాటి ఘటనతోపాటు దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితులపై అధ్యయనం చేసింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. తన నివేదికను పార్లమెంట్ కు సమర్పించనున్న నేపథ్యంలో కమిటీ చైర్మన్, ఎంపీ ప్రదీప్ భట్టాచార్య మంగళవారం ఢిల్లీలో మాట్లాడారు. 'పఠాన్ కోట్ ఎయిర్ బేస్ చుట్టూ ఉన్న రక్షణ కంచె బలంగా లేదు. భద్రతా చర్యలు బలహీనంగా ఉన్నాయి' అని భట్టాచార్య అన్నారు. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత కూడా ఉగ్రవాదులు లోపలికి ఎలా వచ్చారో అర్థంకాలేదని పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతుందన్న కమిటీ.. తీవ్ర చర్యలు చేపడితేతప్ప పరిస్థితిలో మార్పురాబోదని ప్రభుత్వానికి సూచించింది. -
ఓఎంజీ! పరేశ్ రూల్స్ బ్రేక్ చేశాడు!!
గంట కొట్టకముందే బడికి వెళ్లాల్సి ఉన్నా, తొట్రుపాటులేకుండా, క్రమశిక్షణ తప్పకుండా పద్ధతిగా వెళతారు విద్యార్థినీ విద్యార్థులు. అదే ప్రజాస్వామ్యానికి దేవాలయంలా భావించే పార్లమెంట్ కు హజరయ్యే క్రమంలో 'పెద్ద'లైన ఎంపీలు మాత్రం ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ, నిబంధనల్ని అతిక్రమిస్తున్నారు. బడ్జెట్ భేటీలో భాగంగా సోమవారం ప్రారంభమైన రెండో దశ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు మరోసారి ఎంపీల నీర్లక్ష్యవైఖరిని కళ్లకుకట్టాయి. సీన్ నంబర్ 1 సోమవారం ఉదయం పదిన్నర గంటలు దాటిన తర్వాత పార్లమెంట్ వైపునకు నారింజపండు రంగులోని ఓ కారు సర్రున దూసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ నంబర్ డీఎల్ 9 సీఏ 1914. చివరిది సరి అంకె. సరి బేసి నిబంధనల ప్రకారం ఢిల్లీలో ఇవ్వాళ బేసి నంబర్ ఉన్న వాహనాలకు మాత్రమే వినియోగించాలి. అహ్మదాబాద్ (ఈస్ట్) స్థానం నుంచి లోక్ సభకు ఎంపికైన ఈ బీజేపీ ఎంపీ గడిచిన రెండేళ్లుగా ఢిల్లీలోనూ ఉంటున్నారు. ఆయనకు సరి-బేసి నిబంధన తెలియదనుకోవటం పొరపాటే!అలా నిబంధనలను బేఖాతరు చేసిమరీ పార్లమెంట్ లోకి పోతున్న ఆయనను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు 'ఎందుకిలా రూల్స్ బ్రేక చేశారు?' అని అడితే పొంతనలేని సమాదానాలిచ్చి వెళ్లిపోయారు.. ఆ తర్వాత కొద్దిసేపటికి 'పెద్ద నేరం చేశాను. క్షమించండి' అంటూ ఢిల్లీ ప్రజలు, సీఎం కేజ్రీవాల్ కు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు ఎంపీ పరేశ్ రావల్. సీన్ నంబర్ 2 టైర్ల నిండా గాలి, ట్యాంకు నిండా పెట్రోలుతో శ్రుభ్రంగా ముస్తాబయిన బస్సు స్టాప్ లోకి వచ్చి ఆగింది. ఇద్దరు తప్ప బస్సులో ఎక్కడానికి ఎక్కువమంది రాలేదక్కడికి. ఆ స్టాప్.. ఎంపీల క్వార్టర్స్. ఆ బస్సు.. కేవలం ఎంపీలను పార్లమెంట్ కు చేరవేసేందుకు డీటీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు. బీజేపీ ఎంపీలు రాంజన్ భట్, హరి ఓమ్ సింగ్ రాథోడ్ లు మాత్రమే స్పెషల్ బస్సును వినియోగించుకున్నారు. మిగతావాళ్లంతా తమ తమ సొంత (నిజానికి అవికూడా ప్రభుత్వ వాహనాలే) కార్లల్లో పార్లమెంట్ కు వచ్చారు. ప్రధాని, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఇతర కీలక పదవుల్లో ఉన్నవారిని మినహాయిస్తే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీల కోసం ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ) ఆరు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదేశాలమేరకు ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ గోపాల్ రాయ్ దగ్గరుండిమరీ బస్సులను సిద్ధంచేశారు. కాలుష్య నియంత్రణతోపాటు క్రమశిక్షణా అలవర్చుకోవచ్చనే ఉద్దేశంతో గత డిసెంబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీల కోసం ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ బస్ సర్వీసులను ప్రారంభించారు. ఇప్పుడా ఎలక్ట్రిక్ బస్సు జాడలేదు. డీటీసీ ఏర్పాటుచేసిన బస్సును ఎక్కడానికేమో ఎంపీలు ముందుకు రావట్లేదు! -
అన్ని పార్టీలు సహకరించాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మలివిడత పార్లమెంట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమని ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేసింది. పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరిగే సూచనలు ఉన్నాయి. రాజ్యసభలో ఉత్తరాఖండ్ రాజకీయ పరిణామాలపై చర్చించాలని జేడీయూ నోటీసు ఇవ్వగా, ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్‌పై చర్చజరగాలని బీజేపీ పట్టుబడుతోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం సీనియర్ మంత్రులతో సమావేశయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని మోదీ కోరారు. ఇదిలావుండగా, ఈ రోజు సాయంత్రం ఎథిక్స్ కమిటీ సమావేశంకానుంది. బ్యాంకు రుణాలను చెల్లించకుండా విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మల్యా వ్యవహారంపై చర్చించనుంది. -
‘చవక’ ఇళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి
- లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి సాక్షి, న్యూఢిల్లీ: చవకగా అందుబాటులోకి తెచ్చే ఇళ్లకు మరిన్ని ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో మంగళవారం రియల్ ఎస్టేట్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రియల్ ఎస్టేట్ బిల్లు స్వాగతించదగినది. ఇది వినియోగదారుల హక్కులను కాపాడుతుంది. ఈ రంగంలో నేరాలు, జాప్యాలను తగ్గిస్తుంది. అయితే కొన్ని అంశాలపై ఈ బిల్లు మౌనం వహిస్తోంది. ప్రమోటర్లు ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ లేకుండానే అడ్వాన్సులు తీసుకుంటారు. ఇలాంటి అంశాలకు ఈ బిల్లులో పరిష్కారం లేదు. అలాగే చవక ఇళ్లకు మరి న్ని రాయితీలు కల్పిం చాలి. వడ్డీ తగ్గించాలి. పన్నులు మినహాయిం చాలి. ‘2022 నాటికి అందరికీ ఇల్లు’ అనే నినాదాన్ని అమలు చేసేందుకు సానుకూల అవకాశాలను పరిశీలించాలి.’ అని వెలగపల్లి పేర్కొన్నారు. -
శివరాత్రి సమయంలో ఉగ్రదాడులకు కుట్ర?
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో.. శివరాత్రి పుణ్యదినం సందర్భంలో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఈ విషయం తమకు అత్యంత విశ్వసనీయంగా తెలిసిందని, అయితే ఆ దాడిని తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని భారత ఆర్మీకి చెందిన ఓ టాప్ కమాండర్ చెప్పారు. భద్రతకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, శివరాత్రి సందర్భంగా తమకు కొన్ని ఎలర్టులు వచ్చాయని, దాంతో అదనపు భద్రతా చర్యలు తీసుకుంటున్నామని పశ్చిమ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజే సింగ్ తెలిపారు. దాని గురించిన వివరాలు తెలియజేయాలని కోరగా, చెప్పేందుకు నిరాకరించారు గానీ.. ఆ దాడులతో విస్తృత ప్రచారం పొందాలన్నది వాళ్ల ప్లాన్ అని మాత్రం అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయం కాబట్టి మరింత ప్రచారం వస్తుందని అలా చేయాలనుకుంటున్నారన్నారు. పండుగ సమయంలోను, పార్లమెంటు జరుగుతున్నప్పుడు అంటే డబుల్ ప్రభావం ఉంటుందని కుట్ర పన్నినట్లు వివరించారు. అందుకే పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్లు సింగ్ తెలిపారు. -
అగ్ర కులస్తుడితో ‘రోహిత్’ దర్యాప్తా?
♦ ప్రభుత్వంపై మండిపడిన మాయావతి ♦ కమిషన్‌లో దళితుడిని సభ్యుడిగా చేర్చాలని డిమాండ్ న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై రాజ్యసభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి శుక్రవారం కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ఇరానీ ప్రకటనతో తాను సంతృప్తి చెందడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీలో దళితుడికి కూడా స్థానం కల్పించాలని ఫిబ్రవరి 24న తాను కేంద్రాన్ని కోరానని, దానిపై ఇప్పటివరకు స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోహిత్ ఆత్మహత్యపై అగ్రకులస్తుడైన అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్‌కుమార్ రూపన్వాలాతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ దురుద్దేశం దీంతో తేటతెల్లమవుతోంది’ అని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం కమిషన్‌లో మరో సభ్యుడిని నియమించే అవకాశముందని, అయితే, ఆ ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. రోహిత్‌కు ఫెలోషిప్‌ను నిలిపివేయడంపై మాయావతి ప్రశ్నించగా.. కొన్ని పత్రాలు రోహిత్ వర్సిటీ అధికారులకు ఇవ్వాల్సి ఉన్నందున ఫెలోషిప్‌ను నిలిపివేశారని ఇరానీ బదులిచ్చారు. హెచ్‌సీయూ క్రమశిక్షణ కమిటీలో దళితులెవరూ లేరన్నది నిరాధార ఆరోపణ అని స్పష్టం చేశారు. కాగా, ఫేస్బుక్లో రోహిత్ తనపై చేశాడంటూ ఇరానీ పేర్కొన్న కామెంట్ల ప్రామాణికతను సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఆ ఫేస్బుక్ అకౌంట్ రోహిత్‌దేనని రుజువేమైనా ఉందా? అని అడిగారు. ప్రామాణికతను నిర్దేశించకుండా ఆ కామెంట్లను సభలో ప్రస్తావించడాన్ని ఏచూరి తప్పుబట్టారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ జోక్యం చేసుకుంటూ.. స్మృతి చదివిన ఆ కామెంట్లను వర్సిటీ రిజిస్ట్రార్ ధ్రువీకరించారన్నారు. సభలో దుర్గామాతపై దూషణలా? హిందువుల దేవతైన దుర్గామాతపై అసభ్యంగా, దూషణపూర్వకంగా రాసిన రాతలను గురువారం సభలో చదివి వినిపించిన ఇరానీపై శుక్రవారం రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. సభకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. జేఎన్‌యూ విద్యార్థుల తీరుపై తాను చేసిన వ్యాఖ్యలకు రుజువులు చూపాలని ప్రశ్నించినందువల్లనే ఆ కరపత్రాలను చదివి వినిపించానని ఇరానీ సమర్థించుకున్నారు. తాను దుర్గామాత భక్తురాలినని చెప్పారు. ‘ఆ కరపత్రాలను సమర్థిస్తుంది.. కానీ వాటిని సభలో చదవడాన్ని మాత్రం తప్పంటుంది’ అని కాంగ్రెస్‌కు చురకలేశారు. అయితే, దైవదూషణకు సంబంధించిన వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లవని డిప్యూటీ స్పీకర్ స్పష్టం చేశారు. అంతకుముందు, దైవాన్ని నిందించే వ్యాఖ్యలేవీ సభలో మాట్లాడరాదని రాజ్యాంగం, నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఎస్సీ జాబితాలో మరిన్ని కులాలను చేర్చాలన్న ప్రతిపాదనతో సభముందుకు వచ్చిన ప్రైవేటు మెంబర్ బిల్లు రాజ్యసభలో ఓడిపోయింది. మోదీకి కూడా ‘మౌనీబాబా సిండ్రోమ్’ లోక్‌సభలో తృణమూల్ సభ్యుడి విమర్శ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌లాగా ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ‘మౌనీ బాబా సిండ్రోమ్’తో బాధపడుతున్నారని టీఎంసీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ వ్యాఖ్యానించారు. రెండు అధికార కేంద్రాలు ఉండటంతో మౌనంగా ఉండే వ్యాధి వస్తుందని, ప్రస్తుతం నాగపూర్‌లో మరో అధికార కేంద్రం ఉండటం వల్ల మోదీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం నాగపూర్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. తీర్మానంపై చర్చలో కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడిన 70 నిమిషాలు ప్రధానిని పొగడడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ఈ ప్రభుత్వం యూపీఏ 3నా లేక ఎన్డీయే 2నా’? అని జోకులు పేలుతున్నాయన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనలకు వెళ్లినప్పుడు కరెన్సీ నోట్ల కట్టలతో వెళ్తున్నారని సుల్తాన్ అహ్మద్ చేసిన ఆరోపణలను హోంమంత్రి రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యంతో మోదీలో నిస్పృహ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ఎన్జీవోలు, బ్లాక్‌మార్కెటీర్లు కుట్రలు చేస్తున్నారంటూ మోదీ చేసిన ఆరోపణలపై సీపీఎం స్పందించింది. ప్రధానిగా రెండేళ్లు గడవకముందే మోదీలో నిరాశానిస్పృహలు తలెత్తాయని పార్టీ పత్రిక ‘పీపుల్స్ డెమొక్రసీ’లో రాసిన సంపాదకీయంలో కారత్ పేర్కొన్నారు.రోహిత్ ఆత్మహత్యపై అగ్రకులస్తుడైన అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్‌కుమార్ రూపన్వాలాతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ దురుద్దేశం దీంతో తేటతెల్లమవుతోంది. కొన్ని పత్రాలు వర్సిటీ అధికారులకు రోహిత్ ఇవ్వాల్సి ఉన్నందున ఫెలోషిప్‌ను నిలిపివేశారు. హెచ్‌సీయూ క్రమశిక్షణ కమిటీలో దళితులెవరూ లేరన్నది నిరాధార ఆరోపణ. -
నేతాజీ 'రహస్యం' పెద్ద జోకా?
న్యూఢిల్లీ: 'సాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ సుభాష్ చంద్రబోస్ విదేశాల్లో అంతర్థానమయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన రహస్యాలు వెలుగులోకి వస్తే పలు దేశాలతో మనకున్న దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతింటాయి' అని చిన్నప్పటి నుంచి స్కూల్, కాలేజీల్లో చదువుకున్నాం. నాటి జవహర్ లాల్ ప్రభుత్వం నుంచి నేటి మోదీ సర్కార్ దాకా అందరికి అందరూ ఇదే విషయాన్ని చెబుతూవచ్చారు. కాలం సమీపించడంతో నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బహిర్గతం చేసింది. అయితే ముందునుంచీ భయపడ్డట్లు దీనిపై ఇటు రష్యాగానీ, అటు జపాన్ గానీ ఒక్కమాటైనా మాట్లాడలేదు. వాళ్లతో భారత్ సంబంధాలు తెగిపోనూలేదు. అంటే ఇన్నాళ్లూ నేతాజీ విషయంలో ప్రభుత్వాలు చెప్పినవన్నీ అబద్ధాలా? నేతాజీ అంతర్థానం, దాని వెనకున్న రహస్యం పెద్ద జోకా?' అంటూ పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీశారు బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపీ బతృహరి మహతాబ్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాధాలు చెప్పే తీర్మానంలో భాగంగా శుక్రవారం లోక్ సభలో మాట్లాడిన ఎంపీ మహతాబ్.. నేతాజీ అంతర్థానం, రహస్య ఫైళ్ల వెల్లడిలో ప్రభుత్వాలు అనుసరించిన తీరును ఘాటుగా విమర్శించారు. విడతల వారీగా ప్రభుత్వం వెల్లడిస్తోన్న రహస్య ఫైళ్లలో కొత్త విషయాలేవీ లేవని, అందులో ఉన్నదంతా దేశప్రజలకు ఇదివరకే తెలుసునని, గొప్ప యోధుడి విషయంలో ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవపట్టించడం దారుణమని మహతాబ్ అన్నారు. అటల్ బిహారీ ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పాటుచేసిన ఎం కె ముఖర్జీ కమిషన్ నివేదికను ప్రస్తావిస్తూ.. నేతాజీ అంతర్థానం అయ్యారని భావిస్తున్న ప్రాంతంలో విమాన ప్రమాదమేదీ జరగలేదని ఆ కమిటీ పేర్కొందని, మిగతా ఫైళ్లు మాత్రం ప్రమాదం జరిగిందని నివేదించడం గమనార్హమన్న ఆయన.. ఇప్పటికైనా ఈ విషయంలో అన్ని విషయాలు వెల్లడైనట్టా? లేక ఇంకేవైనా రహస్యాలను ప్రభుత్వం దాచిపెడుతోందా? అని ప్రశ్నించారు. లోక్ సభలో మాట్లాడుతున్న బీజేడీ ఎంపీ బతృహరి మహతాబ్. -
'మోదీ కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నారు'
న్యూఢిల్లీ: 'రెండు పవర్ సెంటర్ల మధ్య ఇమడలేక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మౌనీబాబాలా వ్యవహరించేవారు. ఇప్పుడు మోదీదీ అదే పరిస్థితి. ఇటు నాగ్ పూర్ ఆదేశాలు పాటించాలో లేక ఢిల్లీలోని అధికార యంత్రాంగం మాట వినాలో తెలియక మోదీ సతమతమవుతున్నారు. అందుకే మౌనాన్ని ఆశ్రయించి మిన్నకుండిపోయారు' అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుల్తాన్ అహ్మద్ పార్లమెంట్ లో ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాధాలు తెలిపేక్రమంలో ఆ పార్టీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ శుక్రవారం లోక్ సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మౌనీబాబా సిండ్రోమ్(వ్యాధి)తో బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. 56 ఇంచుల ఛాతీ ఉందని చెప్పే ప్రధాని.. జాట్ ఉద్యమం సందర్భంగా దేశ రాజధానికి 35 కిలోమీటర్ల దూరంలో అల్లర్లు చెలరేగి, రూ.34 వేల కోట్ల ప్రజాధనం బూడిద అయిపోయినా అడ్డుకోలేకపోయారని, గతంలో పటేళ్లు కూడా ఇదే మారిది విధ్వంసానికి దిగినా ప్రధాని ఒక్క మాటైనా మాట్లాడలేదని, అందుకే హోం మంత్రి రంగంలోకి దిగి కోటా ప్రకటన చేశారని అహ్మద్ అన్నారు. ప్రధాని మాట్లాడే ఒకే ఒక్క కార్యక్రమం 'మన్ కీ బాత్'ను కూడా ప్రజలు పట్టించుకోవడం మానేశారని ఎద్దేవాచేశారు. -
రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
-
'మీరు మాతో గొంతెత్తగలరా?'
-
'ప్రత్యేక హోదానే మా ప్రధాన అంశం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే తమ అజెండాలో ప్రధాన అంశమని, ఇదే విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని, ఇందుకు తాము పట్టబడుతామని ఆయన చెప్పారు. అదేవిధంగా ఇటీవల వర్షాలతో రాష్ట్ర రైతులు నష్టపోయారని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధర పెంచాలని కోరుతామన్నారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర సమస్యలన్నింటినీ ప్రధానంగా లేవనెత్తుతామని ఆయన వివరించారు. -
'ప్రత్యేక హోదానే మా ప్రధాన అంశం'
-
పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్
-
పార్టీ ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఆదివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఎంపీలతో చర్చిస్తున్నారు. ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలు లేవనెత్తాలని పార్టీ భావిస్తోందని, ఈ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
26 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
-
పార్లమెంట్లో గందరగోళం
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య మంగళవారం ప్రారంభమయ్యాయి. లలిత్ మోదీ, వ్యాపం కుంభకోణాలపై ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై లోక్‌సభలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. లలిత్ మోదీ వ్యవహారంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.. వాయిదా తీర్మానాలను తిరస్కరించాయి. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. విపక్షాల ఆందోళన మధ్యే పార్లమెంట్ కొనసాగుతోంది. -
ఎంపీలను సస్పెండ్ చేశారని.. గుండుతో నిరసన
నల్లగొండ(సూర్యాపేట): పార్లమెంట్ సమావేశాలకు రాకుండా కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేయడంపై ఓ అభిమాని మనస్తాపానికి గురయ్యాడు. సస్పెండుపై స్పందిస్తూ.. గుండు చేయించుకుని వినూత్నంగా నిరసన తెలిపాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన రాహుల్ గాంధీ జన జాగృతి జాతీయ అధ్యక్షుడు రిక్షా చంద్రశేఖర్, తెలంగాణ తల్లి విగ్రహం ఎదుటు గుండు గీయించుకుని నిరసన తెలిపారు. -
మోదీపై విరుచుకుపడ్డ సోనియాగాంధీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్లో విపక్షాల ఆందోళనను ప్రభుత్వం సెన్సార్ చేస్తోందని ఆమె గురువారమిక్కడ ఆరోపించారు. విపక్ష సభ్యులు ఉభయ సభల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి చేస్తున్న నిరసనను తెరపై చూపించకుండా చేస్తున్నారని సోనియా మండిపడ్డారు. ఇది మోదీ స్టైల్ సెన్సార్షిప్ అని మండిపడిన సోనియా.... ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేస్తోందని దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రం, రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నా మోదీ ఎందుకు స్పందించటం లేదని సూటిగా ప్రశ్నించారు. వ్యాపం, లలిత్ గేట్‌పై మోదీ ఎందుకు స్పందించటం లేదంటూ రాహుల్ ప్రశ్నలు సంధించారు.