కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగమైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ వేర్వేరుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌పై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. దీనిపై అన్ని పార్టీలతో చర్చించి.. చర్చ తేదీని ప్రకటిస్తానని స్పీకర్ వెల్లడించారు.
కాగా ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వం లోక్‌సభలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. సభలో ఎన్డీయే కూటమి తమ మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెజార్టీ కోల్పోతే ప్రధానితో సహా, కేబినెట్ మొత్తం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం దిగిపోవాల్సి వస్తుంది.
చదవండి: విపక్షాలు ఆందోళనలతో దద్దరిల్లిన పార్లమెంట్.. లోక్‌సభ వాయిదా
వీగిపోతుందని తెలిసినా..
అయితే ప్రతిపక్ష పార్టీల అవిశ్వాస తీర్మానం బల పరీక్షలో విఫలమయ్యే అవకాశం ఉంది. అవిశ్వాసం వీగిపోతుందని తెలిసినప్పటికీ ప్రతిపక్ష కూటమి దీనిని ప్రయోగిస్తుంది. అవిశ్వాస తీర్మానం ద్వారా పార్లమెంట్‌లో మణిపూర్ అంశంపై తప్పక ప్రధాని మోదీ మాట్లాడటంతోపాటు.. తమకు పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనే యోచనతో విపక్ష కూటమి ఈ అడుగువేసింది.
ఎవరి బలం ఎంత?
లోక్‌సభలో ఎన్డీయే కూటమి 331 ఎంపీల బలం ఉంది. బీజేపీకి సొంతంగానే 303 మంది ఎంపీలు ఉన్నారు. విపక్షాల ఇండియా కూటమి బలం 144, బీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, బీజేడీకి కలిపి 70 మంది ఎంపీల బలం ఉంది. అయితే లోక్‌సభలో 64 మంది తటస్థ ఎంపీలు ఉండగా.. ఆరు ఎంపీ స్థానాలు ఖాళీ ఉన్నాయి. కాగా లోక్‌సభలో మెజారిటీ మార్కు 272. ఎన్డీయే కూటమికి అనుకూలంగా 273 మంది ఎంపీల మద్దతు తెలిపితే.. అవిశ్వాస తీర్మానం ఈజీగా వీగిపోతుంది.
► లోక్‌సభలో మొత్తం సీట్లు : 543
►ఖాళీగా ఉన్న స్థానాలు: 6
► ప్రస్తుత లోక్ సభలో ఉన్న సభ్యులు: 537
►ఎన్డీయే కూటమిబలం : 331 (లోక్ సభ స్పీకర్ తో కలిపి)
►బీజేపీ – 301, శివసేన 13, ఆర్ఎల్ జేపీ – 5, ఏడీపీ – 2, రాంవిలాస్ పార్టీ – 1, అజిత్ పవార్ కూటమి – 1, ఏజేఎస్ యూ – 1, ఎన్డీపీపీ – 1, ఎపీఎఫ్ – 1, ఎపీపీ – 1, ఎస్కేఎం – 1, ఎంఎన్ఎఫ్ – 1, స్వతంత్రులు(సుమలత, నవనీత్ కౌర్) – 2
►విపక్ష ఇండియా కూటమి బలం – 142 ఎంపీలు
►కాంగ్రెస్ – 50, డీఎంకే – 24, టీఎంసీ – 23, జేడీయూ – 16, శివసేన (ఉద్దవ్ థాక్రే) – 6, శరద్ పవార్ – 4, ఎస్పీ – 3, సీపీఎం – 3, సీపీఐ – 2, ఆప్ – 1, జేఎంఎం – 1, ఆర్ఎస్పీ – 1, వీసీకే – 1, కేరళ కాంగ్రెస్ (మని) – 1
తటస్థ పార్టీల బలం : 31
►వైఎస్సార్‌సీపీ-22, బీఆర్‌ఎస్-9, ఎంఐఎం-2, బీజేడీ – 12, బీఎస్పీ – 9, టీడీపీ – 3, ఎస్ఏడీ – 2, జేడీఎస్ 1, ఆర్ఎల్పీ 1, ఏఐయూడీఎఫ్ 1, శిరోమణి అకాలీదళ్ – 1, ఇండిపెండెంట్ – 1
Comments
Please login to add a commentAdd a comment