no confidence motion
-
నేటితో GHMC పాలకమండలి ఏర్పడి నాలుగేళ్లు పూర్తి
-
ఇక ట్రిపుల్ ఇంజన్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత అధికార పీఠం దక్కించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు చెప్పినట్లుగానే డబుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందంటూ వారు చేసిన ప్రచారం ప్రజలపై బాగానే ప్రభావం చూపింది. దాంతో ఇప్పుడిక ఢిల్లీలో ఏకంగా ట్రిపుల్ ఇంజన్‌పై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అత్యంత కీలకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నిక రెండు నెలల్లో జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నెగ్గితే దేశ రాజధానిలో ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం కొలువుదీరినట్లే. కేంద్రంలో, రాష్ట్రంలో, కార్పొరేషన్లో బీజేపీ ఆధిపత్యం సుస్థిరమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకత్వం ఇక ఎంసీడీ మేయర్ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తోంది.పుంజుకున్న కమలం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 250 కౌన్సిలర్ స్థానాలున్నాయి. వీరిని ప్రజలు నేరుగా ఓట్లేసి ఎన్నుకుంటారు. ఢిల్లీలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ఎంసీడీ పరిధిలోని 14 మంది ఎమ్మెల్యేలకు కూడా మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కుంది. ఎంసీడీలో బీజేపీకి ప్రస్తుతం 120 మంది, ఆప్‌కు 122 మంది కౌన్సిలర్లున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది బీజేపీ కౌన్సిలర్లు, ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు ఎమ్మెల్యేలుగా నెగ్గారు. బీజేపీ కౌన్సిలర్ కమల్జీత్ షెరావత్ గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో వెస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా గెలిచారు. అలా ఎంసీడీలో 12 కౌన్సిలర్ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎంసీడీలో తాజాగా బీజేపీ బలం 112, ఆప్ బలం 119గా ఉన్నాయి. 2024 నవంబర్‌లో మేయర్ ఎన్నిక జరిగింది. ఆప్ అభ్యర్థి మహేశ్ కిచీ మేయర్‌గా ఎన్నికయ్యారు. పోలైన 263 ఓట్లలో కిచీకి 133, బీజేపీ అభ్యర్థి కిషన్ లాల్‌కు 130 ఓట్లు లభించాయి. అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంసీడీలో బీజేపీ బలం పెరిగింది. మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కున్న 14 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు బీజేపీకి చెందినవారే. మేయర్ పదవిని సులభంగా దక్కించుకోగలదు. కనుక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరగానే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించాలని పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచి్చనట్లు సమాచారం. తర్వాత మేయర్ పదవిని సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
No Confidence Motion: అస్త్రశ్రస్తాలతో సిద్ధమైన విపక్షాలు
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఏడాది కాలంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో గురువారం జరగనున్న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని అన్ని పార్టీలూ సవాల్‌గా తీసుకుంటున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం, ప్రజా సమస్యలపై సాధారణ సమా వేశం రెండూ ఒకేరోజు నిర్వహిస్తున్నారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం అంశం ఇప్పటి వరకు హాట్‌టాపిక్‌గా ఉన్నప్పటికీ, దాని సాధ్యాసాధ్యాలు అంచనా వేసిన పార్టీలు ప్రస్తుత సమావేశంలో ప్రజా సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించాలని తమ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశాయి. విపక్షాలు సంధించే ప్రశ్నలను, ఎదురయ్యే పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు తగిన యుక్తి ప్రదర్శించాల్సిందిగా కాంగ్రెస్ తమ పార్టీ కార్పొరేటర్లకు వివరించినట్లు తెలిసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు బుధవారం మేయర్, కొందరు కార్పొరేటర్లతో మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశానికి బయలుదేరేముందు గురువారం ఉదయం మరోసారి కాంగ్రెస్ కార్పొరేటర్లు మంత్రి పొన్నంతో ఆయన నివాసంలో సమావేశం కానున్నట్లు సమాచారం. మంగళవారం బీజేపీ కార్పొరేటర్లకు జాతీయ, రాష్ట్ర నేతలు దిశానిర్దేశం చేశారు. నిధుల కోసం.. పార్టీలకతీతంగా కార్పొరేటర్లు తమ ఫండ్ కోసం పట్టుబట్టనున్నారు. ఎన్నికలకు మిగిలింది ఏడాది కాలమే. తిరిగి ఓట్లకోసం ప్రజల వద్దకు ఎలా వెళ్లాలని వారిలో వారే చర్చించుకుంటున్నారు. మేయర్ కేవలం స్టాండింగ్ కమిటీ సభ్యులకు మాత్రం రూ.25 కోట్ల ఫండ్ ఇవ్వాలని కమిషనర్‌ను కోరడం కార్పొరేటర్లకు పుండుపై కారం చల్లినట్లుగా మారింది. ఈ నేపథ్యంలో సభ సజావుగా సాగుతుందా.. లేక ఎప్పటిలాగే రసాభాసగానే ముగుస్తుందా? అన్నది కొద్ది గంటల్లో వెల్లడి కానుంది. మొత్తానికి వాతావరణం మాత్రం వాడీవేడిగానే ఉంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్డగోలు బడ్జెట్ బడ్జెట్ అడ్డగోలుగా ఉందని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. నగర ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులతో వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఎండగట్టనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారుల అనుభవ రాహిత్యంతో బడ్జెట్ రూపకల్పనే సవ్యంగా లేదని అవి విమర్శిస్తున్నాయి. స్టాండింగ్ కమిటీలో బడ్జెట్ తొలుత ఆమోదం పొందకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. రూ.8 వేల కోట్లకుపైగా ఉన్న బడ్జెట్‌పై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేయనున్నాయి. సభలో మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి. బీఆర్ఎస్ తమ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు కనిపించడం లేదని, తాము పూర్తి చేసిన పనులను కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటోందని గళమెత్తనుంది. ఇక కాంగ్రెస్.. తమ ప్రభుత్వంలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పనుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వ హయాంలోనే జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించడాన్ని ప్రస్తావించనుంది. కమిషనర్‌కు తొలి సమావేశం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తికి పాలకమండలి తొలి సమావేశం ఇది. కొందరు హెచ్ఓడీలు కూడా కొత్త. సభ్యులనుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఎలా స్పందిస్తారో, ఎలాంటి సమాధానాలిస్తారో సభలో వెల్లడి కానుంది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో కాంగ్రెస్ కార్పొరేటర్ల బలం 24 మందికి పెరిగినప్పటికీ, వారిలో ఎందరు పార్టీకి అనుకూలంగా గళమెత్తనున్నారో తెలియని పరిస్థితి. బహుశా, ఈ విషయం తెలిసే పార్టీ వారంతా సభలో కలిసికట్టుగా వైరి పక్షాలను ఎదుర్కొనాలని మంత్రి పొన్నం వారికి సూచించారు. సభ అధ్యక్షత వహించే మేయర్‌కు పరిస్థితి క్లిష్టంగానే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గొడవలతోనే సరిపెడతారా.. సమస్యలు పరిష్కరిస్తారా? నగరంలో పలు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. రాత్రుళ్లు వీధి దీపాలు వెలగడం లేదని నెలల తరబడిగా ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకున్న దిక్కు లేదు. సమావేశంలో వీటిని ప్రస్తావిస్తారా లేదా అని ప్రజలు ప్రశి్నస్తున్నారు. దిగువ సమస్యలను తీర్చాలంటున్నారు. చెత్త సమస్యలు ఎప్పటికీ తీరడం లేదు. ప్రతిరోజూ స్వచ్ఛ ఆటో కారి్మకులు ఇంటింటికీ వెళ్లడం లేదు. దీనిపై ఎవరిని సంప్రదించాలో అర్థం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. తిరిగి సీఆర్ఎంపీ ఏజెన్సీలకే కట్టబెట్టాలనే యోచనతో కాబోలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇంజినీర్లు పనులు చేయడం లేదు. కాలనీలతో పాటు ప్రధాన రోడ్లలోనూ గుంతలు కనిపిస్తున్నాయి. ప్రజలకు బర్త్, డెత్సర్టిఫికెట్ల కోసం అగచాట్లు తప్పడం లేదు. పుడ్ సేఫ్టీ లేక ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నా, లక్షల బిల్లులు చెల్లిస్తున్నా, ప్రాణాలు పోతున్నా జీహెచ్ఎంసీ నిద్ర పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నా, హోటళ్ల తనిఖీల్లో లోపాలు బట్టబయలవుతున్నా ఎలాంటి మార్పూ లేదు. నాలాల కోసం ఏటా వందల కోట్లు ఖర్చు పెడుతున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అక్రమ భవనాల నిర్మాణాలకు హద్దూపద్దూ లేకుండా వెలుస్తున్నాయి. దాంతో పరిసరాల్లోని ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కళ్లెదుట నిలువెత్తు అక్రమాలు కనిపిస్తున్నా చర్యల్లేకుండాపోయాయి. ఇలా వివిధ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు మొత్తుకుంటున్నా, ప్రతిసారీ అధికార, ప్రతిపక్ష సభ్యుల గందరగోళాలతోనే ముగిస్తున్నారు. ఈసారైనా చర్చించి పరిష్కరిస్తారా? అని ప్రజలు ప్రశి్నస్తున్నారు. -
GHMC: అవగాహన లేకుండా ‘అవిశ్వాసం’
సాక్షి, హైదరాబాద్: బల్దియా పాలకమండలి ఏర్పాటై వచ్చే నెల 10వ తేదీకి నాలుగేళ్లు పూర్తి కానుండటం.. ఆ తర్వాత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం జరగనున్న జీహెచ్ఎంసీ ప్రత్యేక బడ్జెట్, సాధారణ సర్వసభ్య సమావేశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ ఈ సమావేశాల సందర్భంగా ఏం జరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నా అందుకు పాలకమండలి సమావేశం వేదిక కాకపోయినప్పటికీ, పొలిటికల్ హీట్ మాత్రం పెరిగింది. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం బీజేపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ నాయకుడు, ఎంపీ కె.లక్ష్మణ్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. పలువురు పార్టీ అగ్రనేతలు కూడా హాజరైన ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై నిలదీయాలని ఉద్భోదించారు. కేంద్రం నిధులివ్వడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే అంటున్నందున జీహెచ్ఎంసీలో ప్రజలు వేల కోట్ల పన్నులు కడుతున్నా మీరెందుకు వారికి పనులు చేయడం లేదని ప్రశ్నించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నిధులు ఎక్కడికి మళ్లిస్తున్నారో అడగాలని, ఆ నిధులన్నీ ఏం చేస్తున్నారో నిలదీయాలని సూచించారు. ముఖ్యంగా.. జీహెచ్ఎంసీ బడ్జెట్‌పైనా, ప్రజా సమస్యలపైనా గళమెత్తాలని ఆదేశించారు. సమస్యలపై ప్రశ్నించేందుకు బీజేపీ సభ్యులకు అవకాశమివ్వకపోవడం తగదన్నారు. ప్రశ్నల ద్వారా సమాధానాలు రాబట్టాలన్నారు. మేయర్‌పై అవిశ్వాసానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది. హాజరైన కార్పొరేటర్లు ముగ్గురే.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తమ పార్టీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఆమె బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ కావడం తెలిసిందే. పాలకమండలి తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచి్చంది కేవలం రెండు కార్పొరేటర్ స్థానాలే అయినప్పటికీ, ఏడాది క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీలోనూ కాంగ్రెస్ బలం పెరిగింది. ప్రస్తుతం ఆ పారీ్టలో 24 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మేయర్ ఆహ్వానానికి కేవలం ముగ్గురు మాత్రమే హాజరు కావడం బల్దియాలో చర్చనీయాంశంగా మారింది. అనుసరించాల్సిన వ్యూహం కోసం పిలిస్తే కనీస సంఖ్యలో కూడా సభ్యులు రాలేదు. అవగాహన లేకుండా ‘అవిశ్వాసం’ తనపై ఏ పార్టీవారు అవిశ్వాస తీర్మానం పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని మేయర్ విజయలక్ష్మి ఉప్పల్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. చట్టం, నిబంధనల మేరకు వారికా అవకాశం ఉందంటూ ఫిబ్రవరి 11 తర్వాత మాత్రమే అది సాధ్యమన్నారు. ఆలోగా ఏయే పార్టీలు కలిసి అవిశ్వాసం పెడతాయో చూద్దామన్నారు. అసలు అవిశ్వాసం పెట్టాలంటే ఎంత బలం ఉండాలో వారికి తగిన అవగాహన లేదన్నారు. తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అవినీతి వ్యాఖ్యలపై స్పందిస్తూ, పదేళ్లుగా తాను, దాదాపు యాభయ్యేళ్లుగా తనతండ్రి కేశవరావు రాజకీయాల్లో ఉన్నా.. మా లైఫ్‌స్టైల్ ఏంటో, కొత్తగా ఎమ్మెల్యేలైన బీఆర్ఎస్ వారి లైఫ్ స్టైల్ ఏంటో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ఎవరు అవినీతికి పాల్పడుతున్నారో దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చునన్నారు. బీజేపీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ వ్యాఖ్య జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పక్ష నాయకుడు దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఈటల రాజేందర్‌కు దక్కకుండా ఉండేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలివిగా ప్లాన్ చేశారని ఆరోపించారు. గద్దర్‌కు అవార్డు ఇవ్వకపోవడం గురించి చేసిన వ్యాఖ్య ద్వారా బీజేపీ అధ్యక్ష పదవికి ఈటల అర్హుడు కాదనే సంకేతాలిచ్చారన్నారు. -
మేయర్‌పై అవిశ్వాసం
సాక్షి, సిటీబ్యూరో: నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మాన అంశం మంగళవారం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన విందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణల్లో మేయర్‌పై అవిశ్వాసం అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. మేయర్ పదవీ బాధ్యతలు స్వీకరించి వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీకి నాలుగేళ్లు పూర్తి కానుండటం, ఆ తర్వాత అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మిగ తా అంశాలతో పాటు దీనిపై కూడా కొద్దిసేపు మా ట్లాడినట్లు తెలిసింది. విందుకు పలువురు నేతలు హాజరు కావడం.. మేయర్‌పై అవిశ్వాసానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఉండటంతో ఇదే అంశంపై చర్చ జరిగిందనే ప్రచారం వైరల్‌గా మారింది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో, జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పార్టీ మారినందునే.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేయర్ పదవి కోసం ఎంతోమంది పోటీ పడినా.. గద్వాల్ విజయలక్ష్మికే బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. కాగా.. ఆమె కనీస కృతజ్ఞత లేకుండా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. దీంతో అవిశ్వాసం అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కేవలం కుటుంబ కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశంలో, తాము రాజకీయాల్లో ఉన్నందున రాజకీయ అంశాలు కూడా పిచ్చాపాటీగా చర్చకు వచ్చాయని పార్టీ నాయకుడొకరు తెలిపారు. వివిధ అంశాలతో పాటు మేయర్‌పై అవిశ్వాసం కూడా ప్రస్తావనకు వచ్చిందిని, అంతకు మించి ఎక్కువ చర్చ జరగలేదని చెప్పారు. బహుశా వచ్చే శనివారం.. లేదంటే ఆదివారం నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తదితరులతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఆ రోజు రాజకీయ అంశాలతో పాటు రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితరాలపై ఎజెండాకు అనునుగుణంగా సమావేశం జరగనున్న ట్లు తెలిసింది. అదే సమావేశంలో మేయర్‌పై అవిశ్వాసానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇంతకీ ఏం జరగనుంది? మేయర్‌పై అవిశ్వాసం పెడితే ఏం జరగనుంది? గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పదవిని కోల్పోక తప్పదా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనలు, ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఆయా పార్టీల బలాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే పదవి పోయేంత ప్రమాదమేమీ లేదని మున్సిపల్ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. నిబంధనల మేరకు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల్లో (స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) 50 శాతం మంది అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ.. నిరీ్ణత ప్రొఫార్మా ద్వారా సంతకాలు చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందజేయాలి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం 196 మంది ఉండగా, అందులో 98 మంది సంతకాలు చేస్తేనే అది సాధ్యం, బీఆర్ఎస్కు కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియోలు కలిసి 71 మంది సభ్యుల బలం ఉంది. ఆ పార్టీలు కలిసి వచ్చేనా? అవిశ్వాసం పెట్టాలంటే మరోపార్టీ కలిసి రావాలి. ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉండటం తెలిసిందే. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి నడుస్తుందని చెప్పలేం. ఇక మిగిలింది బీజేపీ. అది సైతం బీఆర్ఎస్తో కలిసే పరిస్థితి లేదు. ఒకవేళ అవిశ్వాసం కోసమే రెండింటిలో ఏదో ఒక పార్టీ సభ్యులు లోపాయికారీగా సంతకాలు చేసి.. అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా అవిశ్వాసం నెగ్గే పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీలోని సంబంధిత సెక్షన్ 91–ఎ మేరకు మొత్తం ఓటు హక్కున్న సభ్యుల్లో మూడొంతుల మెజారిటీ ఉంటేనే అవిశ్వాసానికి కోరం ఉన్నట్లు లెక్క. ఆ లెక్కన ప్రస్తుతమున్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియోలను పరిగణనలోకి తీసుకుంటే 131 మంది సభ్యుల బలం ఉండాలి. బీఆర్ఎస్తో బీజేపీ కలిసినా, లేక ఎంఐఎం కలిసినా అది సాధ్యం కాదు. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే మొత్తం బలం 116 అవుతుంది. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసినా 122 అవుతుంది. కోరమే ఉండనప్పుడు అవిశ్వాసం ముందుకు వెళ్లే పరిస్థితే ఉండదని జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల గురించి తెలిసిన నిపుణులు చెబుతున్నారు. -
పార్లమెంట్లో అదే రగడ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రగడ యథాతథంగా కొనసాగింది. ప్రధానంగా రాజ్యసభలో గురువారం వాగ్వాదాలు, నిరసనలు, నినాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం పట్ల అధికార బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా బిలియనీర్ జార్జి సోరోస్‌తో కాంగ్రెస్ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని, దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభ్యుల ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము లేవనెత్తిన అంశాలపై సభలో వెంటనే చర్చ ప్రారంభించాలని కోరుతూ విపక్షాలు ఇచ్చిన ఆరు నోటీసులు చైర్మన్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. సభలో కేంద్ర మంత్రి జె.పి.నడ్డా మాట్లాడారు. ధన్‌ఖడ్ బీజేపీ ప్రతినిధిగా పని చేస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలను ఖండించారు. చైర్మన్ ఇచ్చిన రూలింగ్‌ను విమర్శించడం సభా మర్యాదను ఉల్లంఘించడమే, సభాధ్యక్ష స్థానాన్ని అగౌరవపర్చడమే అవుతుందని అన్నారు. చైర్మన్‌ను చీర్లీడర్ అనడం ఏమిటని కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం అంటే, పార్లమెంటరీ సంప్రదాయాలు అంటే గౌరవం లేదని ఆక్షేపించారు. జార్జి సోరోస్‌కు, సోనియా గాం«దీకి సంబంధాలు ఏమిటని నిలదీశారు. దీనిపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మన దేశాన్ని ముక్కలు చేయడానికి సోరోస్ కోట్లాది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాడని నడ్డా ధ్వజమెత్తారు. నడ్డాపై వ్యాఖ్యలపై సభలో మల్లికార్జున ఖర్గే స్పందిస్తుండగా, బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో మైనారీ్టలపై హింసాకాండపై ప్రధాని మోదీ స్పందించాలని, సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ సభ్యులు నినాదాలు ప్రారంభించారు. సభ ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు. ముఖం దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నా: గడ్కరీ దేశంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రమాదాల నివారణపై ఆయన లోక్‌సభలో గురువారం సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. విదేశాల్లో జరిగే సమావేశాలకు వెళ్లినప్పుడు మన దేశంలో రోడ్డు ప్రమాదాల ప్రస్తావన వస్తే తన ముఖాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అయితే రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిందేనని తేలి్చచెప్పారు. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్(సవరణ) బిల్లు–2024ను లోక్‌సభలో విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. వాతావరణ మార్పులను ఎలా ఎదుర్కొంటారో ఈ బిల్లులో ప్రస్తావించలేదని విమర్శించారు. ఈ బిల్లు గురువారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. -
అతిపెద్ద అధికార ప్రతినిధి ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభ నిర్వహణలో రాజ్యసభ చైర్మన్ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన జగదీప్ ధన్‌ఖడ్ పూర్తి పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి అతిపెద్ద అధికారి ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తాయి. ధన్‌ఖడ్‌ను తొలగించాలంటూ అవిశ్వాస తీర్మానం నోటీసును మంగళవారం రాజ్యసభలో విపక్ష సభ్యులు అందజేయడం తెల్సిందే. దీనిపై బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తోటి విపక్షాల ‘ఇండియా’ కూటమి ఎంపీలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ ధన్‌ఖడ్ ఒక ప్రభుత్వ అధికారి ప్రతినిధిలా ప్రవర్తిస్తున్నారు. సీనియర్ పార్లమెంటేరియన్లకూ పాఠశాల ప్రధానోధ్యాయునిలా ధన్‌ఖడ్ క్లాసులు పీకుతున్నారు. సభలో విపక్ష సభ్యులకు మాట్లాడే స్వేచ్ఛనివ్వట్లేదు. సభ సజావుగా సాగకుండా అడ్డు తగిలే అతిపెద్ద అవరోధం ధన్‌ఖడ్. ఆయన చూపే వివక్ష చూసి విసుగెత్తిపోయాం. ఆయన వైఖరి, ధోరణి సైతం విపక్షాలకు అనుకూలంగా లేదు. అందుకే ఆయనను తొలగించాలని నోటీస్ ఇచ్చాం. రాజ్యసభ నియమ నిబంధనావళిని తుంగలో తొక్కి రాజకీయాలు ముందంజలోకి వచ్చాయి’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ రాజ్యాంగం, రాజ్యాంగబద్ధ సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ ధన్‌ఖడ్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తర్వాత మరేదో పదోన్నతి వస్తుందన్న ఆశతో పనిచేస్తున్న అతిపెద్ద అధికార ప్రతినిధిలా ఆయన వాలకం ఉంది. ఆయన తన వైఖరితో రాజ్యసభకు ఉన్న ప్రతిష్టను, పరువును దెబ్బతీస్తున్నారు. మాకు ఆయనపై ఎలాంటి వ్యక్తిగత కక్ష, కోపాలు లేవు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మేం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు పట్టుబడుతున్నాం’’ అని ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి: డీఎంకే‘‘ ఛైర్మన్ ద్వారా బీజేపీ ప్రదర్శిస్తున్న ఈ వైఖరి స్పష్టంగా ప్రజాస్వామ్యంపై దాడే’’ అని డీఎంకే నేత తిరుచ్చి శివ వ్యాఖ్యానించారు. ‘‘ రాజ్యసభలో విపక్ష సభ్యుల గొంతుక వినిపించే అవకాశం చిక్కట్లేదు’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత నదీముల్ హక్ అన్నారు. ‘‘ చైర్మన్ రాజ్యసభను నడుపుతున్నట్లు లేదు ఒక సర్కస్‌ను నడుపుతున్నట్లు ఉంది. ఉన్న సమయమంతా ఆయన తన సొంత విషయాలు మాట్లాడటానికే సరిపోతోంది. ఉన్న కాస్తంత సమయాన్ని ఆయనే వృథాచేస్తారు’’ అని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. టీఎంసీ నేత సాగరికా ఘోష్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా తదితరులు ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇదీ చదవండి: ధన్‌ఖఢ్‌పై అవిశ్వాసం -
రాజ్యసభ ఛైర్మన్ పై ఇండియా కూటమి అవిశ్వాసం
-
ధన్‌ఖడ్‌పై ‘అవిశ్వాసం’
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపార్టీలు మంగళవారం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న ధన్‌ఖడ్‌ను రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి తొలగించాల్సిందేనని తేల్చిచెప్పాయి. అవిశ్వాస తీర్మానం నోటీసుపై కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆమ్ ఆద్మీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యసభ చరిత్రలో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం గట్టిగా పోరాడుతామన్న సందేశం ఇవ్వడానికే అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చినట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. ఆయన అన్ని పరిధులు అతిక్రమించారని, అందుకే నోటీసు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యనాయకులపై బీజేపీ ఎంపీలు ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నా ధన్‌ఖఢ్ పట్టించుకోలేదని విమర్శించారు.ఈ మేరకు జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ధన్‌ఖఢ్ విషయంలో ఇండియా కూటమి పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. సభను ఆయన నడిపిస్తున్న తీరు సక్రమంగా లేదన్నారు. ప్రతిపక్షాలపై ఆయన వివక్ష చూపుతున్నారన్న అభిప్రాయం కలుగుతోందన్నారు. ధన్‌ఖఢ్ కేవలం ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు తప్ప రాజ్యసభ చైర్మన్‌గా నిజాయతీగా పనిచేయడం లేదని తప్పుపపట్టారు. ధన్‌ఖడ్‌ను పదవి నుంచి తప్పించడానికి అవసరమైన బలం తమకు లేదని రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు సాగరికా ఘోష్ చెప్పారు. అయినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ కోసమే పోరాడుతున్నారని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని తేలి్చచెప్పారు. ధన్‌ఖడ్‌ను చూసి గర్వపడుతున్నాం: రిజిజు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను పదవి నుంచి తొలగించడానికి విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడం చాలా విచారకరమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ధన్‌ఖడ్‌ను చూసి తాము గర్వపడుతున్నామని చెప్పారు. ఆయన చాలా హూందాగా, పక్షపాతానికి తావులేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశం ఎంతమాత్రం లేదని, రాజ్యసభలో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉందని రిజిజు గుర్తుచేశారు. లోక్‌సభలో మూడుసార్లు నోటీసులు లోక్‌సభలో స్పీకర్‌ను తొలగించాలని కోరుతూ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. 1954 డిసెంబర్ 18న అప్పటి స్పీకర్ జి.వి.మౌలాంకర్, 1966 నవంబర్ 24న హుకం సింగ్, 1987 ఏప్రిల్ 15న బలరాం జక్కడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి. మౌలాంకర్, బలరాం జక్కడ్‌పై తీర్మానాలు వీగిపోయాయి. హుకుం సింగ్‌పై ఇచ్చిన నోటీసు తిరస్కరణకు గురైంది. ఓటింగ్‌లో పాల్గొనడానికి 50 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు సముఖత వ్యక్తం చేయకపోవడమే ఇందుకు కారణం. ఓటింగ్ జరగాలంటే కనీసం 50 మంది సభ్యులు అంగీకరించాలి. -
ధన్‌ఖడ్‌పై అవిశ్వాసం..జరిగేది ఇదే..!
సాక్షి,ఢిల్లీ: ఉపరాష్ట్రపతి,రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానంపై దాదాపు 70 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అవిశ్వాస తీర్మానానం అంశంలో కాంగ్రెస్ లీడ్ తీసుకుంటోంది. కాంగ్రెస్ సభ్యులతో చైర్మన్ రాజ్యసభలో వ్యవహరిస్తున్న తీరు వల్లే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు చెబుతున్నారు.అధికార బీజేపీ సభ్యులకు చైర్మన్ కావాలనే కాంగ్రెస్-సోరోస్ లింకులపై నినాదాలు చేయడానికి అవకాశాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే తీర్మానం ఆమోదం పొంది ఉపరాష్ట్రపతి దన్ఖడ్ను తొలగించాలంటే పార్లమెంట్ ఉభయసభల్లో అవిశ్వాస తీర్మానం మెజారిటీ ఓట్లతో నెగ్గాల్సి ఉంటుంది. అధికార ఎన్డీఏతో పోలిస్తే ఇండియా కూటమికి పార్లమెంట్ ఉభయసభల్లోనూ మెజారిటీ లేకపోవడంతో ఈ తీర్మానం నెగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే తమ తీర్మానంతో ఇండియా కూటమి సభ్యులంతా మళ్లీ ఒక్కటై రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం అంశంలో విజయం సాధిస్తామని విపక్షాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.కాగా, ప్రొసీజర్ ప్రకారం అవిశ్వాస తీర్మానం ముందు రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలని రాజ్యాంగం చెబుతోంది. అయితే ఈ పార్లమెంట్ సెషన్ డిసెంబర్ 20తో ముగుస్తుండడంతో తీర్మానం అసలు సభలోకి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. కేవలం చైర్మన్ తీరును దేశ ప్రజల ముందు ఎండగట్టాలనే వ్యూహంతోనే ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందన్న మరో వాదనా వినిపిస్తోంది.ఒకవేళ రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. తర్వాత ఏం జరుగుతుంది..?చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ఒకవేళ రాజ్యసభలో ప్రవేశ పెట్టారనే కాసేపు అనుకుందాం. ఇక్కడ తీర్మానం సింపుల్ మెజారిటీతో ఆమోదం పొందాలి. అప్పుడే తీర్మానం లోక్‌సభకు వెళుతుంది. అక్కడికీ వెళ్లిందనుకుందాం.. తీర్మానం.. అక్కడా సింపుల్ మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇంత జరిగితేనే ధన్‌ఖడ్ పదవిని కోల్పోతారు. నిజానికి నోటీసు ఇచ్చినప్పటి నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలంటే 14 రోజుల టైమ్ రాజ్యాంగ నిబంధన. ఇక్కడ ఆ నిబంధనను ఇండియా కూటమి పాటించలేదు. సెషన్ మరో 10 రోజులుందనగా నోటీసు ఇచ్చింది. దీంతో తీర్మానం అసలు రాజ్యసభకే వెళ్లదని తెలుస్తోంది. ఒక వేళ వెళ్లినా ఏ సభలోనూ ఇండియా కూటమికి సింపుల్ మెజారిటీ లేదనే విషయం తెలిసిందే. -
రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి.. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. రాజ్యసభలో చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు తరుచూ ఆరోపిస్తున్నాయి. ఆయన తమ ప్రసంగాలకు అంతరాయం కలిగిస్తున్నారని, క్లిష్టమైన అంశాలపై తగిన చర్చకు అనుమతించడం లేదని, వివాదాస్పద చర్చల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలోనే రాజ్యంగంలోని ఆర్టికల్ 67(బీ) ప్రకారం జగ్దీప్ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, ఇతర భారత బ్లాక్ పార్టీల సభ్యులు ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తీర్మానంపై ఇప్పటికే ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన 70 మంది ఎంపీలు సంతకాలు చేశారు.కాగా బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరస్‌తో కాంగ్రెస్ నేతలు లింకు పెట్టుకున్నట్లు బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. సభాపక్ష నేత, ప్రతిపక్ష నేతలతో ధన్కడ్ సమావేశం నిర్వహించి సభను సజావుగా సాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఐక్యత, సార్వభౌమత్వం.. దేశానికి పవిత్రమైనవని, ఆ ఐకమత్యాన్ని, సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడాన్ని సహించబోమని ధన్కడ్ తెలిపారు. -
ఫ్రాన్స్ లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్న విపక్షాలు
-
ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం
పారిస్: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని మైకేల్ బార్నియర్ సారథ్యంలోని ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మితవాద, అతివాద విపక్షాలు చేతులు కలపడంతో ఈ అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. 577 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీ దిగువ సభలో బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి 331 మంది ఎంపీలు ఓటేశారు. దీంతో తీర్మానం నెగ్గింది. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన కేవలం మూడు నెలలకే బార్నియర్ తన పదవిని కోల్పోవాల్సి రావడం గమనార్హం. ప్రధాని తన రాజీనామాను దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు అందజేశారు. ఫ్రాన్స్ పార్లమెంట్లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం గత అరవై ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారికావడం విశేషం. ఈ ఏడాది మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మళ్లీ వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో కేవలం నూతన ప్రధానిని ఎంపిక చేసే బాధ్యతలు మాత్రం అధ్యక్షుడు మేక్రాన్ చేతికొచ్చాయి. ఇటీవలి కాలంలోనే ఈయన రెండు సార్లు ప్రధానులను ఎంపికచేశారు. జూలైలో పగ్గాలు చేపట్టిన గేబ్రియల్ కొద్దికాలానికి వైదొలగగా ఇప్పుడు బార్నియర్ అదేబాటలో పయనించారు. దీంతో మేక్రాన్ తాజాగా మూడోసారి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. అవిశ్వాస తీర్మానానికి అధ్యక్షుడు మేక్రాన్ పదవికి సంబంధం లేదు. దీంతో మేక్రాన్ పదవికి ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేదు.France's government officially collapses after a no-confidence vote against French Prime Minister Michel Barnier. pic.twitter.com/t0vP2LoA9D— Spacy (@TheSpacy_) December 5, 2024 -
ఫ్రాన్స్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం !?
పారిస్: ఫ్రాన్స్‌లో మైనారిటీ ప్రభుత్వాన్ని నడపలేక తిప్పలు పడుతున్న ప్రధాని మైఖేల్ బార్నర్ను మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దిగువసభలో ఓటింగ్ చేపట్టకుండానే బడ్జెట్‌ను ఆమోదింపజేసుకున్నారన్న ఆగ్రహంతో ఈ చర్యకు దిగుతున్నాయి. తీర్మానానికి అతివాద న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి, వామపక్ష నేషనల్ ర్యాలీ (ఎన్ఆర్) తదితరాలు మద్దతివ్వనున్నాయి. ఈ ప్రయత్నాలను బార్నర్ తీవ్రంగా ఖండించారు. ‘‘ దేశ భవిష్యత్తును పణంగా పెట్టి స్వప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్న ఇలాంటి పార్టీలను ప్రజలు క్షమిస్తారనుకోను. మా ప్రభుత్వం కూలితే దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతుంది’’ అని హెచ్చరించారు. అవిశ్వాస తీర్మానం నెగ్గితే గత 60 ఏళ్లలో ఫ్రాన్స్‌లో ఒక ప్రభుత్వం కూలడం తొలిసారి అవుతుంది. తాను మాత్రం 2027లో పదవీకాలం పూర్తయ్యేదాకా అధ్యక్షునిగా కొనసాగుతానని ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కూలితే ఫ్రాన్స్‌లో మళ్లీ రాజకీయ ముఖచిత్రం మారనుంది. ప్రస్తుత పార్లమెంట్ దిగువసభ అయిన నేషనల్ అసెంబ్లీలో మేక్రాన్‌కు చెందిన మధ్యేవాద కూటమి, అతివాద న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి, మరీన్ లీ పెన్ సారథ్యంలోని నేషనల్ ర్యాలీ పార్టీలు ఉన్నప్పటికీ ఏ పార్టీకి మెజారిటీ లేదు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం 574 మంది సభ్యులకుగాను 288 మందికిపైగా సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి. అయితే విపక్షాలు రెండూ కలిస్తే వాటి బలం 330కిపైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో తీర్మానం నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు విద్యుత్‌పై కొత్త పన్నులను తొలగించాలని మరీన్ లీ పెన్ డిమాండ్‌చేశారు. -
టార్గెట్ హిమాచల్‌ప్రదేశ్?
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్ష బీజేపీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నష్ట నివారణ కోసం ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలిచి్చంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సీనియర్ నేతలు భూపేష్ బఘేల్, భూపీందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్‌ను పార్టీ పరిశీలకులుగా హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలుండగా, కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు తగిన బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ పార్టీ అభ్యర్థి అభిõÙక్ మనూ సింఘ్వీ ఓడిపోయారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రఎమ్మెల్యేలు బీజేపీ అభ్యరి్థకి ఓటువేశారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ‘జైశ్రీరామ్, బన్ గయా కామ్’ అని నినదిస్తూ బీజేపీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, హిమాచల్‌ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు సమరి్పంచానని చెప్పారు. ప్రభుత్వంలో తనకు, తన కుటుంబానికి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోందో అధిష్టానం తెలుసుకోవాలని కోరారు. తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటానని వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు హిమాచల్‌ప్రదేశ్ శాసనసభలో బుధవారం అనూహ్య పరిణామం చేసుకుంది. 15 మంది ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కులదీప్ సింగ్ పఠానియా సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ కూడా ఉన్నారు. బీజేపీ సభ్యులు సభలో స్పీకర్‌ను అగౌరవపరుస్తున్నారని, ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, సభ సజావుగా సాగాలంటే వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ మంత్రి హర్షవర్దన్ చౌహాన్ ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవడానికే తమను సస్పెండ్ చేశారని జైరామ్ ఠాకూర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారీ్టలో పడిందని, ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సింగ్ సుఖూ రాజీనామా చేయాలని జైరామ్ ఠాకూర్ అన్నారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందింది. ప్రజా తీర్పును కాపాడుకుంటాం హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రజా తీర్పును కాలరాచే ప్రయత్నాలను సహించబోమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, త్వరలో సమగ్ర నివేదిక సమరి్పంచాలని కాంగ్రెస్ పరిశీలకులను ఖర్గే ఆదేశించారని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, అదే సమయంలో ప్రజలు ఇచి్చన తీర్పును కాపాడుకోవడం ముఖ్యమని తేలి్చచెప్పారు. హిమాచల్‌లో అధికారంలోకి రావడానికి బీజేపీ తప్పుడు మార్గాలు వెతుకుతోందని ఆరోపించారు. -
కాంగ్రెస్‌లో చేరిన వెంటనే.. ఆ జెడ్పీ చైర్‌పర్సన్‌పై బీఆర్ఎస్ అవిశ్వాసం
సాక్షి,రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డిపై 12 మంది జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. శుక్రవారమే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ మరుసటి రోజు శనివారం(ఫిబ్రవరి 17) ఆమెపై అవిశ్వాసం నోటీసు ఇవ్వడం వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ మేరకు అవిశ్వాసం నోటీసును 12 మంది బీఆర్ఎస్ సభ్యులు కలిసి జెడ్పీ సీఈవోకు అందించారు. సునీతామహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచే జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్పర్సన్ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అవిశ్వాసం గనుక నెగ్గితే సునీతామహేందర్‌రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ పదవి కోల్పోవాల్సి ఉంటుంది. సునీతామహేందర్‌రెడ్డితో పాటు ఆమె భర్త మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌కు రేవంత్ బర్త్ డే విషెస్ -
మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్!
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలోని 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం మేడ్చల్‌లోని జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. కావ్య ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ అసమ్మతి కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి వైజాగ్ టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా ఎన్నుకున్న మేయర్‌తో అసమ్మతి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్య విభేదాలన్న విషయం తెలిసిందే. ఇక.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టికి మలిపెద్ది సుధీర్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చదవండి: TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం -
పెద్దపల్లి: పుట్టామధుకు అవిశ్వాస గండం?
సాక్షి, పెద్దపల్లి: మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ ప్రస్తుత ఛైర్మన్ పుట్టామధుపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. ఆయనపై అవిశ్వాసం పెట్టడానికి జెడ్పీటీసీలు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఉత్కంఠ నెలకొంది. జెడ్పీటీసీ సభ్యులు రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. 2,3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి జడ్పీటీసీలు సిద్ధమవుతున్నారు. మెజార్టీ సభ్యుల అసమ్మతితో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కాగా, బుధవారం స్టాండింగ్కమిటీ సమావేశం ఉన్నప్పటికీ ఇద్దరు సభ్యులు మినహా మెజారిటీ జడ్పీటీసీలు కాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. అసంతృప్త జడ్పీటీసీలు వేర్వేరు చోట్ల క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. గత నెల 28న జరగాల్సిన జడ్పీ జనరల్ బాడీ సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే మెజారిటీ బీఆర్ఎస్ సభ్యులు అవిశ్వాసానికి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు ఎన్టీపీసీలో జరగాల్సిన జెడ్పీ సర్వ సభ్య సమావేశం కూడా కోరం లేక వాయిదా పడింది. జిల్లాలోని 13 మంది జెడ్పీటీసీలకు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 11 మంది జెడ్పీటీసీలు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలుపొందారు. ఇటీవలే బీఆర్ఎస్ను వీడిన పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి బీజేపీలో చేరారు. ఓదెల జెడ్పీటీసి గంటా రాములు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మెజారిటీ సభ్యుల అసమ్మతి నేపథ్యంలో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. ఇదీ చదవండి: ముఖేష్ గౌడ్ కొడుకు దారెటు.? -
రసవత్తరంగా నల్గొండ మున్సిపాలిటీ రాజకీయాలు
-
బ్రిటన్ పీఎం సునాక్‌కు పదవీ గండం!
లండన్: తన మంత్రివర్గంలో అనూహ్యంగా మార్పులు చేసి, కొత్త వివాదానికి తెరలేపిన యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని, పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ సొంత పార్టీ(కన్జర్వేటివ్) ఎంపీ ఆండ్రియా జెన్కిన్స్ తాజాగా ‘1922 కమిటీ’ చైర్మన్ సర్ గ్రాహమ్ బ్రాడీకి లేఖ రాశారు. అయితే, రిషి సునాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి డిమాండ్ తెరపైకి రావడం ఇదే మొదటిసారి. సొంత పార్టీ నుంచే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. యూకే మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ను మద్దతుదారుగా పేరుగాంచిన ఎంపీ ఆండ్రియా జెన్కిన్స్ రాసిన అవిశ్వాస లేఖ చర్చనీయాంశంగా మారింది. సునాక్ పదవి నుంచి తప్పుకోవాలని, ఆ స్థానంలో అసలు సిసలైన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిని నియమించాలని జెన్కిన్స్ తేల్చిచెప్పారు. ‘జరిగింది ఇక చాలు. రిషి సునాక్ ఇంటికెళ్లాల్సిన సమయం వచ్చింది’ అని ‘ఎక్స్’లో జెన్కిన్స్ పోస్టు చేశారు. అవిశ్వాస లేఖను కూడా జతచేశారు. ప్రధానమంత్రిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ పదవి ఊడడానికి ముమ్మాటికీ సునాక్ కారణమని ఆయన ఆరోపించారు. సుయెల్లా బ్రేవర్మన్ను హోంమంత్రి పోస్టు నుంచి తొలగించడాన్ని జెన్కిన్స్ తప్పుపట్టారు. నిజాలు మాట్లాడినందుకే ఆమెపై వేటు వేశారని ఆక్షేపించారు. సునాక్ రాజీనామా కోసం తన సహచర ఎంపీలు కూడా గళమెత్తుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం కోసం తాము పోరాడుతున్నామని పేర్కొన్నారు. అవిశ్వాసం సాధ్యమేనా? అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో 15 శాతం మంది ఎంపీలు అవిశ్వాసాన్ని కోరుతూ లేఖలు రాస్తే సునాక్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. పార్లమెంట్లో అవిశ్వాస పరీక్ష ఎదుర్కోక తప్పదు. నైపుణ్యం, అనుభవానికి పెద్దపీట: సునాక్ మంతివర్గంలో మార్పులపై ప్రధాని రిషి సునాక్ స్పందించారు. తన ప్రతిస్పందనను ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశానికి దీర్ఘకాలంలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుట్టడానికి సిద్ధంగా ఉండే ఒక ఉమ్మడి బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నైపుణ్యం, అనుభవం, సమగ్రతకు పెద్దపీట వేశామన్నారు. దేశ కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బృందం తోడ్పడుతుందని వివరించారు. -
మున్సిపాలిటీల్లో అవిశ్వాసం ఆపాలన్న పిటిషన్ల కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఆపాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు దాఖలు చేసిన 28 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 9న కౌన్సిలర్లు తనపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ స్వీకరించడం, సంబంధిత ప్రక్రియ ప్రారంభించడాన్ని గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ నేతి చిన్న రాజమౌళి హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరుతూ కౌన్సిలర్ల తరఫున గౌరారం రాజశేఖర్‌రెడ్డి కేవియట్ దాఖలు చేశారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా అవిశ్వాసాలను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ఏప్రిల్‌లో తీర్పు రిజర్వు చేశారు. కొత్త తెలంగాణ మునిసిపాలిటీల చట్టం–2019 ప్రకారం చైర్పర్సన్ లేదా వైస్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఎలాంటి నిబంధనలు రూపొందించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అవిశ్వాస ప్రక్రియకు జారీ చేసిన నిబంధనలు ఏపీ మున్సిపాలిటీల చట్టం–1965 ప్రకారం రూపొందించినవని, అయితే అవి రద్దయ్యాయని పేర్కొన్నారు. కొత్త క్లాజ్‌లో సెక్షన్ 299, సెక్షన్ 299 (2)లను ఏపీ మునిసిపాలిటీల చట్టం నుంచే రూపొందించారని రాజశేఖర్‌రెడ్డి వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. ప్రతివాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. చట్టప్రకారం అవిశ్వాస తీర్మాన ప్రక్రియ సాగుతుందని పేర్కొంటూ పిటిషన్లు కొట్టివేశారు. పిటిషన్లు వేసిన మున్సిపల్ చైర్మన్లు,వైస్ చైర్మన్లు వీరే... ఎరుకల సుధ(యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట చైర్పర్సన్), మంజుల రమేశ్(వికారాబాద్ చైర్పర్సన్), శంషాద్ బేగం(వికారాబాద్ వైస్ చైర్పర్సన్), తాటికొండ స్వప్న పరిమళ్(వికారాబాద్ జిల్లా తాండూరు చైర్పర్సన్), స్రవంతి(రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చైర్పర్సన్), కోతా ఆర్థిక (రంగారెడ్డి ఆదిబట్ల చైర్పర్సన్), ముత్యం సునీత(కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ చైర్పర్సన్), తోకల చంద్రకళ(నల్లగొండ జిల్లా చండూర్ చైర్పర్సన్), దోతి సుజాత(నల్లగొండ జిల్లా చండూర్ వైస్ చైర్పర్సన్), వి. ప్రణీత(మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ చైర్పర్సన్), మర్రి దీపిక(మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ చైర్పర్సన్), కరుణ అనుషారెడ్డి(నల్లగొండ జిల్లా నందికొండ చైర్పర్సన్), మందకుమార్ రఘువీర్(నల్లగొండ జిల్లా నందికొండ వైస్ చైర్మన్), వి.శంకరయ్య(యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు చైర్మన్), గందే రాధిక(కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ చైర్పర్సన్), పోకల జమున(జనగాం జిల్లా జనగాం చైర్పర్సన్), శ్రీరాంప్రసాద్ మేకల(జనగాం జిల్లా జనగాం వైస్ చైర్మన్), గూడెం మల్లయ్య(సంగారెడ్డి జిల్లా ఆందోల్–జోగిపేట్ చైర్మన్), మేదరి విజయలక్ష్మి(సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి చైర్పర్సన్), దమ్మాలపాటి వెంకటేశ్వర్రావు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు చైర్మన్), పిల్లోడి జయమ్మ(సంగారెడ్డి జిల్లా సదాశివపేట చైర్పర్సన్), నేతి చిన్న రాజమౌళి(సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ చైర్మన్), అర్రగొల్ల మురళీధర్ యాదవ్(మెదక్ జిల్లా నర్సాపూర్ చైర్మన్), వి.రాజు(యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ చైర్మన్), సుతకాని జైపాల్(ఖమ్మం జిల్లా వైరా చైర్మన్), సి.కిష్టయ్య(యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి వైస్ చైర్మన్), ఎ.ఆంజనేయులు (యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి చైర్మన్). వీరి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. -
మణిపుర్ గాయాల్ని మాన్పాలంటే...
మణిపుర్ పోలీసులకు చెందిన సుమారు 4,500 ఆయుధాల ఆచూకీ ఇప్పటికీ తెలియదు. కేంద్రం వెంటనే రాష్ట్ర పాలనా బాధ్యతలు తీసుకోవాల్సిన అసాధారణమైన, ప్రమాదకరమైన పరిస్థితి ఇది. మణిపుర్ ఏళ్లుగా తుపాకుల నీడలో, మత్తుమందుల ప్రభావంలో, బలవంతపు వసూళ్ల మధ్య బతికింది. వీటన్నింటి నుంచి బయటపడేందుకు రాష్ట్రానికి న్యాయమైన అవకాశం ఇవ్వాల్సిన సమయం ఇదే. రాజకీయంగా చర్చలు ప్రారంభించాలి. ఆర్థిక పరిపుష్టికి ఊతమివ్వాలి. మణిపుర్‌లోని అన్ని తెగలు కూడా దృఢమైన, న్యాయమైన పాలన కోసం ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రపతి పాలనలో సమర్థమైన అధికార యంత్రాంగం మణిపుర్‌ను మళ్లీ సరైన మార్గంలో పెట్టగలదు. మణిపుర్ నివురుగప్పిన నిప్పులా అసందిగ్ధ భవిష్యత్తుకేసి చూస్తోంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు, దుకాణాలు, రహదారులు కూడా ధ్వంస మైపోయి రాష్ట్రం నిర్జీవమైన మట్టిదిబ్బ రూపం సంతరించుకుంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మణిపుర్ ప్రస్తావన పార్లమెంటులో వచ్చింది. కానీ ఇరుపక్షాల పరస్పర నిందారోపణలతో ఒరిగింది శూన్యం. దేశ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను అమలు చేసే క్రమంలో అసాం రైఫిల్స్, మణిపుర్ పోలీసుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం కూడా పరిస్థితి మరింత దిగజారేందుకు కారణమైంది. ఈ ఏడాది మే 4న కాంగ్పోకీ జిల్లాలో ఇద్దరు అమాయక మహిళలపై జరిగిన అకృత్యాలు సుప్రీంకోర్టును సైతం నిర్ఘాంతపోయేలా చేశాయి. రాష్ట్రం తన బాధ్యతను పూర్తిగా విస్మరించగా కొందరి ప్రయోజనాలు, పక్షపాతాలతో రాజకీయాలు నడిచాయి. జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగితే కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా అస్సలు సహించరాదు. అధ్వాన్నమైన స్థితి ఏమిటంటే... సంఘటన జరిగిన తొలిరోజే పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోవడం. వారిని ఉద్యోగాల్లోంచి తొలగించేందుకు ఇంతకంటే బలమైన కారణం కని పించదు. కొన్ని రోజుల తరువాత ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా పరిస్థితి ఎక్కడిదక్కడే ఉంది. పోలీసులు, నాయకులు తమ బాధ్యతలను విస్మరించి, వారి వారి తెగల్లో హీరోలు కావాలని అనుకుంటే ఇంతకంటే ఎక్కువేమీ ఆశించలేము. ఈ ఘటన తరువాతి రోజే ఇంఫాల్‌లో కార్లు కడిగే పనిచేస్తున్న ఇద్దరు మహిళలపై దారుణమైన నేరం జరిగింది. రాష్ట్రం స్పందన భిన్నంగా ఏమీ లేదు. దౌర్భాగ్యకరమైన స్థితి ఏమిటంటే, ఈ మూక దాడుల్లో మహిళలూ భాగస్వాములు కావడం! రాష్ట్ర పోలీసులకు చెందిన సుమారు 4,500 ఆయుధాల ఆచూకీ ఇప్పటికీ తెలియదు. కేంద్రం వెంటనే రాష్ట్ర పాలనా బాధ్యతలు తీసు కోవాల్సిన అసాధారణమైన, ప్రమాదకరమైన పరిస్థితి ఇది. నిఘా వర్గాలు కూడా దీనిపై కచ్చితంగా నివేదిక అందించే ఉంటాయి. రాష్ట్రం తనదైన కారణాలతో నోరు మెదపదు కానీ అంతర్గత ఘర్షణలతో అట్టుడుకుతున్న రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిది. నిబద్ధత కలిగిన హోంశాఖ కార్యదర్శి ఎవరైనా సరే... మణిపుర్ ఘటనపై సీరియస్‌గా స్పందించి ఉండేవారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలుతున్న వైనాన్ని గమనించి రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా సిఫారసు చేసేవారు. అయితే జరిగిందేమిటి? ఎత్తుకెళ్లిన ఆయుధాలు తిరిగి ఇచ్చేయండి సామీ అని రాష్ట్ర డీజీపీ స్వయంగా బతి మాలడం, ఆయుధాల సేకరణ కోసం రాజకీయ నేతల ఇళ్ల ముంగిట్లో డ్రాప్‌బాక్స్‌ల ఏర్పాటుచేయడం! మణిపుర్ విషయంలో కేంద్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం ఇదే. రాష్ట్రం సాధారణ స్థితికి చేరుకుని తన కాళ్లపై తాను నిలబడగలగాలంటే కనీసం రెండేళ్లపాటు రాజకీయాలను దూరంగా పెట్టాలి. నిష్పక్షపాతమైన, ప్రొఫెషనల్‌గా వ్యవహరించే యంత్రాంగం పాలనా విధులు చేపట్టాలి. మణిçపుర్‌ను మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు ఈ కార్యాచరణ అనుసరించడం మేలు: 1. రాష్ట్ర పెద్దగా బాధ్యతగా వ్యవహరించలేకపోయిన, ప్రజల నైతిక మద్దతు కోల్పోయిన ముఖ్యమంత్రిని వెంటనే తొలగించాలి. కుకీలతోపాటు కొందరు మైతేయిల్లోనూ ముఖ్యమంత్రిపై విశ్వాసం పోయింది. శాంతిభద్రతలు భయంకరంగా ఉన్నాయని బీజేపీ నేతలే కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించడం ద్వారా ప్రధానమంత్రి రాష్ట్రానికి మాత్రమే కాకుండా, తనకు తాను మేలు చేసుకున్న వారవుతారు. 2. రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రంలోని విశ్రాంత అధికారుల్లో సమర్థులను ఎన్నుకుని గవర్నర్‌గా నియమించాలి. 3. ఐఏఎస్, ఐపీఎస్, రక్షణ శాఖల నుంచి ఒక్కొక్కరిని గవర్నర్‌కు సలహాదారులుగా నియమించాలి. జి.ఎస్.పంధేర్, హర్జీత్ సంధూ, ఎ.ఎన్.ఝా, నిఖిలేష్ ఝా, జాన్ షిల్సీ, జర్నేల్ సింగ్, బీ.ఎల్.వోహ్రా లాంటి అత్యుత్తమ అధికారులను పరి గణనలోకి తీసుకోవచ్చు. ఆర్థిక, పారిశ్రామిక పరిస్థితిని పునరుద్ధరించేందుకు ఆర్థికరంగ నిపుణులు ఒకరిని కూడా సలహాదారుగా నియ మించుకోవచ్చు. 4. ప్రత్యేక హక్కుల చట్టంతో సైన్యాన్ని తీసుకు రావద్దు. ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రాన్ని పాలించలేమన్న సంకే తాన్ని పంపడం అనవసరం. పైగా ఏఎఫ్ఎస్పీఏతో సైన్యాన్ని దింపితే అది పాత గాయాలను మళ్లీ రేపవచ్చు. 5. క్షేత్రస్థాయి పోలీసింగ్ మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలి. అవసరమైతే జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్పీలను డిప్యుటేషన్‌పై బయటి రాష్ట్రాల నుంచి తీసుకురావచ్చు. 6. ఆయుధాలు ఎత్తుకెళ్లిన వారిని ‘సిట్’లు అరెస్ట్ చేసేలా చూడాలి. దుండగుల చేతుల్లో 4,500 ఆయుధాలున్నాయంటే మణి పుర్ ఇప్పుడు సాయుధ రాష్ట్రమనే లెక్క. ఆయుధాలు ఎత్తుకెళ్లిన వారి పేర్లు వెల్లడించకపోతే తగిన చర్యలుంటాయని పోలీసులను హెచ్చరించాలి. దోపిడి సమయంలో అక్కడే ఉన్నవారిపై చట్టపరమైన విచారణ జరగాలి. 7. మిలిటెంట్లకు వ్యతిరేకంగా భద్రతాదళాలు తీసుకుంటున్న చర్యలకు విఘాతం కలిగిస్తున్న మహిళా వర్గాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. తగినంత మంది మహిళ అధికారిణులు, సిబ్బందిని ఈ కార్యక్రమాల కోసం ఉపయోగించాలి. 8. నిందితుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు, నేర విచారణ బృందాలను ఏర్పాటు చేయాలి. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం బాధితుల్లో కలిగించేందుకు ఇది అత్యవసరం. 9. కుకీ మిలిటెంటు గ్రూపులు ఇరవై ఐదింటిపై చర్యలను నిలిపి వేయడంపై ఉన్న గందరగోళాన్ని తొలగించాలి. పద్నాలగు క్యాంపుల్లోని 2,200 మంది కేడర్ వద్ద ఉన్న ఆయుధాలను సమీక్షించాలి. కుకీ, మైతేయి మిలిటెంట్లు ఏర్పాటు చేసుకున్న బలవంతపు వసూళ్ల చెక్ పోస్టులను పెకిలించాలి. నల్ల మందు మాఫియాపై స్థానిక పోలీసులు కఠిన చర్యలకు దిగాలి. ఈ మాఫియాలో కొందరు రాజకీయ నేతలూ మిలాఖత్ అయి ఉన్నారు. డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతున్న అదనపు ఎస్పీ థౌనావోజామ్ బృందం తనకు తగిన మద్దతు లేదని రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇటువంటి వారిని మళ్లీ నియమించుకుని డ్రగ్ మాఫియా ఆటలు కట్టేలా చూడాలి. 10. నిరాశ్రయులైనవారు మళ్లీ తమ ఇళ్లకు చేరుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఇందుకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేయాలి. పాలన యంత్రాంగ చక్రాలు కదలడం మొదలై, అది ప్రజలకు స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టిన తరువాత రెండో దశ కార్య కలాపాలకు శ్రీకారం చుట్టాలి. పోలీసు కౌన్సిల్స్ ఏర్పాటు చేసి అందులో తటస్థులైన విద్యావేత్తలు, జర్నలిస్టులు, పౌర సమాజపు సభ్యులను చేర్చాలి. గతంలో భయంతో లేదా తమ తెగలకు నిబద్ధంగా ఉండాలన్న కారణంతో కొందరు సభ్యులు రాజీనామా చేశారు. తటస్థులను సభ్యులుగా చేయడం ద్వారా శాంతి స్థాపన సాధ్యం. చివరగా... ఘర్షణల సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు తెగువ చూపిన వారిని బహిరంగంగా గౌరవించాలి. కుకీలున్న చోట మైతేయిలను, మైతేయిల ప్రాబల్యం ఉన్న చోట కుకీలను కాపాడిన ఘటనలు కోకొల్లలు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్ సంక్షోభాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరి ష్కారం దీర్ఘకాలికమైందిగా ఉండాలి. ప్రతి తెగకూ తమ బాధలు చెప్పుకునేందుకు అనువైన వేదిక, ప్రాతినిధ్యం కల్పించాలి. అప్పుడు మాత్రమే ఉగ్రవాదులు ఆయుధాలు వదిలేయడం సాధ్యమవుతుంది. కంచెలు, కందకాలు తొలగిపోతాయి. యశోవర్ధన్ ఆజాద్ కేంద్ర మాజీ సమాచార కమిషనర్,విశ్రాంత ఐపీఎస్ అధికారి, డీప్స్ట్రాట్ ఛైర్మన్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
విపక్షాలు పారిపోయాయి
న్యూఢిల్లీ: విపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపెట్టున విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభ నుంచి పారిపోయాయని ఎద్దేవా చేశారు. దాన్ని దేశమంతా వీక్షించిందన్నారు. మణిపూర్ హింసాకాండపై చర్చ విషయంలో వాటికి చిత్తశుద్ధే లేదని ఆరోపించారు. మణిపూర్ ప్రజలకు అవి ద్రోహం చేశాయన్నారు. ప్రజా సంక్షేమం కంటే స్వార్థ రాజకీయాలకే విపక్షాలు ప్రాధాన్యమిచ్చాయని దుమ్మెత్తిపోశారు. దాంతో కీలక సమస్యలకు పార్లమెంటులో చర్చ ద్వారా పరిష్కారం సాధించే సువర్ణావకాశం చేజారిందని ఆవేదన వెలిబుచ్చారు. దేశవ్యాప్తంగా విపక్షాలు వ్యాప్తి చేస్తున్న ప్రతికూల భావజాలాన్ని తమ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. పశి్చమ బెంగాల్లో పంచాయతీ రాజ్ పరిషత్‌ను ఉద్దేశించి శనివారం మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. వారికి రాజకీయాలే ముఖ్యం రెండు రోజుల క్రితమే విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని 140 కోట్ల భారతీయుల ఆశీర్వాదంతో ఓడించామని మోదీ అన్నారు. ‘అలాగే వారు వ్యాప్తి చేస్తున్న ప్రతికూలతనూ ఓడించాం. మణిపూర్ అంశంపై చర్చించాలని కేంద్రం భావిస్తోందంటూ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలయ్యే ముందే విపక్షాలకు లేఖ రాశామని. కానీ ఏం జరిగిందో మీరంతా చూశారు. దానిపై చర్చను అవే అడ్డుకున్నాయి. అంతటి సున్నిత అంశంపై చర్చ జరిగి ఉంటే మణిపూర్ ప్రజలకు కాస్త ఊరటన్నా దక్కి ఉండేది. సమస్యకు కొన్నయినా పరిష్కారాలు దొరికి ఉండేవి. కానీ మణిపూర్ హింసాకాండకు మూల కారణానికి సంబంధించిన వాస్తవాలు విపక్షాలను ఎంతో బాధిస్తాయి. కనుక కావాలనే చర్చను జరగనీయలేదు. అసలు పార్లమెంటులో ఏ చర్చ జరగడమూ వారికి ఇష్టం లేదు. ప్రజల బాధ వాటికి పట్టదు కావాల్సిందల్లా కేవలం రాజకీయాలు’ అంటూ తూర్పారబట్టారు. విపక్షాల నిజ రూపాన్ని దేశ ప్రజల ముందు బట్టబయలు చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ప్రజల విశ్వాసమే నాకు స్ఫూర్తినిస్తుంది. నా ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది’ అని అన్నారు. మమతది అరాచక పాలన గత నెల బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విపక్షాలను భయభ్రాంతులను చేసేందు కు పాలక తృణమూల్ కాంగ్రెస్ భాయోతోత్పాతానికి, బెదిరింపులకు దిగిందని విమర్శించారు. పైగా ప్రజాస్వామ్య పరిరక్షకుల్లా పోజు లు కొడుతోందని మండిపడ్డారు. -
సగం సమయం కూడా పని చెయ్యలేదు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ సమయంలో సగం కూడా పని చెయ్యలేదు. అయినప్పటికీ రికార్టు స్థాయిలో 23 బిల్లులు పాసయ్యాయి. మణిపూర్‌లో జాతుల ఘర్షణ ఈ సారి ఉభయసభల్ని కుదిపేసింది. లోక్‌సభ కార్యకలాపాలు 43% జరిగితే, రాజ్యసభ 55% సమయం కార్యకలాపాలు కొనసాగించింది. పాలసీ రీసెర్చ్ స్టడీస్ (పీఆర్ఎస్) అందించిన డేటా ప్రకారం లోక్‌సభ 17 రోజులు సమావేశమైంది. అవిశ్వాస తీర్మానంపై 20 గంటల సేపు చర్చ జరిగింది. ఈ చర్చలో 60 మంది సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లుల్లో ఢిల్లీలో పాలనాధికార బిల్లు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు, అటవీ సంరక్షణ సవరణ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు ప్రధానమైనవి. ఈసారి సభలో ప్రవేశ పెట్టిన బిల్లుల్లో 56% కేవలం ఎనిమిది రోజుల్లో పార్లమెంటు ఆమోదాన్ని పొందాయి. మరో 17% బిల్లుల్ని కమిటీల పరిశీలనకు పంపారు. -
'ఓటింగ్‌కు భయపడ్డారు.. సభ మధ్యలోనే వెళ్లిపోయారు..'
కోల్‌కతా: అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ వేయడానికి ప్రతిపక్షాలు భయపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తే ప్రతిపక్షాలకు లేదని విమర్శించారు. ఈ రోజు బెంగాల్లో నిర్వహించిన పశ్చిమ బెంగాల్ క్షేత్రీయ పంచాయతీ రాజ్ సమ్మేళన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ మేరకు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. #WATCH | PM Modi addressing BJP's Kshetriya Panchayati Raj Parishad in West Bengal, via video conferencing "We defeated the opposition's no-confidence motion in Parliament and gave a befitting reply to those spreading negativity in the entire nation. The members of the… pic.twitter.com/tZSgBjehkH — ANI (@ANI) August 12, 2023 అవిశ్వాస తీర్మాణంతో దేశంలో బీజేపీపై దుష్ప్రాచారం లేయాలనుకున్న ప్రతిపక్షాల కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. విపక్ష సభ్యులు సభ మధ్యలోనే వెళ్లిపోయారని దుయ్యబట్టారు. ఓటింగ్ వేయడానికి భయపడ్డారని ఆరోపించారు. అవిశ్వాసంలో ప్రతిపక్షాలను ఓడించామని ప్రధాని మోదీ అన్నారు. బెంగాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా రెండు రోజుల పాటు పర్యటన చేయనున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి కోల్‌కతా ఎయిర్‌పోర్టులో దిగారు. రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టనున్న పంచాయత్ కాన్ఫరెన్స్‌లో నడ్డా పాల్గొంటారు. బెంగాల్ బీజేపీ కోర్ కమిటీ, ఎంపీల మీటింగ్, బీజేపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. Hon. BJP National President Shri @JPNadda Ji was warmly greeted by @BJP4Bengal State President @DrSukantaBJP Ji alongwith other party leaders and karyakartas upon his arrival in Kolkata, West Bengal. pic.twitter.com/uuu8G8ojWK — Office of JP Nadda (@OfficeofJPNadda) August 11, 2023 బెంగాల్లో ఆగష్టు 12న తూర్పు పంచాయతీ రాజ్ పరిషత్ వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అండమాన్ నికోబార్, ఒడిశా, జార్ఖండ్లతో సహా తూర్పు ప్రాంతానికి చెందిన దాదాపు 134 వర్కర్లు, జిల్లా కౌన్సిల్ మెంబర్లతో సమావేశం కానున్నారు. జేపీ నడ్డాతో పాటు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌తో సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వర్చుల్‌గా పాల్గొననున్నారు. Hon. BJP National President Shri @JPNadda Ji's Public Programs in West Bengal on 12th August 2023. Watch Live- . https://t.co/YU8s4nWcrF . https://t.co/qpljG4G7Jz . https://t.co/NPs3aOvCXh pic.twitter.com/uxx2XD3byf — Office of JP Nadda (@OfficeofJPNadda) August 11, 2023 ఇదీ చదవండి: తప్పుడు వాగ్దానంతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు.. -
మణిపుర్‌కు దక్కిందేమిటి..?
గత మూడు నెలలుగా అత్యంత ఘోరమైన, దారుణమైన పరిణామాలను చవిచూస్తున్న మణిపుర్ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండిపోయారని ఆరోపిస్తూ లోక్‌సభలో విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం గురువారం వీగిపోయింది. మోదీ వాక్పటిమ గురించి ఎవరికీ సందేహాలు లేవు. ఆయన రెండు గంటల పది నిమిషాల సుదీర్ఘ ప్రసంగం మరోసారి ఆ విషయాన్ని రుజువు చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొలగి, ఆయన సభకు రావటం అటు విపక్షాలతోపాటు ఇటు అధికార పక్షానికి కూడా కలిసొచ్చింది. విపక్ష స్వరం దీటుగా వినబడ టానికి రాహుల్ దోహదపడితే... ఆయనపైనా, కాంగ్రెస్‌పైనా నిప్పులు చెరిగేందుకు అధికారపక్షానికి అవకాశం చిక్కింది. అయితే క్షతగాత్రగా మారిన మణిపుర్‌కు ఏమాత్రం సాంత్వన చేకూర్చామన్నది ఇరుపక్షాలూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సేవుంది. ఇది గతంలో అనేకమార్లు సభలో చర్చకొచ్చిన అవిశ్వాస తీర్మానాలవంటిది కాదు. రాఫెల్ ఒప్పందంలో అవినీతి దాగుందంటూ 2018లో విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాసంతో కూడా దీన్ని పోల్చలేం. ఇది యావత్తు సమాజమూ సిగ్గుతో తలదించు కోవాల్సిన దురదృష్టకర ఉదంతాల పర్యవసానంగా చర్చకొచ్చిన అవిశ్వాస తీర్మానం. మణిపుర్లో దాదాపు అంతర్యుద్ధ పరిస్థితులేర్పడటం, పరస్పరం భౌతిక దాడులు చేసుకోవటం, నివాసాలు తగలబెట్టుకోవటంతో మొదలై... చివరకు మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టే హీన స్థితికి చేరు కోవటం చరిత్రలో కనీవినీ ఎరుగనిది. ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి ప్రజలు చెట్టుకొకరూ, పుట్టకొకరూ కావటం, అలా వెళ్లలేనివారిని సాయుధ మూకలు చిత్రవధ చేయటం, పోలీసులే తమ కస్టడీలో ఉన్న మహిళలను సాయుధ గుంపులకు అప్పగించాన్న ఆరోపణలు రావటం మామూలు విషయం కాదు. ఈ హింసాపర్వం మొదలై మూడు నెలలు దాటుతున్నా ఇప్పటికీ అక్కడ సాధారణ పరిస్థితులు నెల కొనకపోవటం, పోలీసులూ, కేంద్ర బలగమైన అస్సాం రైఫిల్స్ పరస్పరం నిందారోపణలు చేసు కోవటం దిగ్భ్రాంతికరం. ఆఖరికి లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రధాని జవాబిస్తున్న సమయంలో కూడా మే 3 నాటి మరో దారుణ ఉదంతం వెలుగులోకొచ్చింది. ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమె ఇంటిని తగులబెట్టారన్నది ఆ ఉదంతం సారాంశం. ఇప్పటికీ స్వస్థలాలకు వెళ్లే సాహసం చేయలేనివారు వేలాదిమందివుంటే, వెళ్లినవారు భయాందోళనల్లో మునిగి తేలు తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను సంజాయిషీ ఇచ్చుకునేలా చేయటంలో అవి శ్వాస తీర్మానం బ్రహ్మాస్త్రం వంటిది. అందునా రాక్షసమూకల కొమ్ముకాసిందన్న ఆరోపణలెదుర్కొంటున్న మణిపూర్ సర్కార్‌పై కఠిన చర్యలు తీసుకోవటంలో తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టడానికి దీనికి మించిన ఆయుధం లేదు. మూడురోజులపాటు ఇరుపక్షాల నేతలూ ప్రసంగించారు. అయితే ఆ వాగ్ధాటి హోరులో మణిపుర్ విషాదం మరుగున పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. ప్రధాన అంశాన్ని మరిచి సవాళ్లూ, ప్రతిసవాళ్లూ, అర్థరహితమైన ఆరోపణలూ విసురు కుంటూ రెండు పక్షాలూ కాలక్షేపం చేశాయి. వర్తమాన దుఃస్థితికి గతంలో పాలించిన కాంగ్రెసే కారణమని అధికారపక్షం అంటే... కేంద్ర బలగాలను ఉద్దేశపూర్వకంగానే వినియోగించుకోలేదనీ, అందువల్లే ఇంతటి హింస చెలరేగిందనీ విపక్షాలు ఆరోపించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపుర్ గురించి సవివరమైన ప్రకటనే చేశారు. అమిత్ షాయే మాట్లాడతారని మొదటినుంచీ అధి కారపక్షం చెబుతోంది. కాదు, ప్రధానే మాట్లాడాలన్నది విపక్షం డిమాండ్. ప్రధాని సుదీర్ఘ ప్రసంగంలో మణిపుర్ ప్రస్తావన వచ్చింది. దుండగులపై చర్య తీసుకుంటామని, శాంతి నెలకొల్పుతా మన్న హామీ కూడా ఇచ్చారు. ఈశాన్యానికి తమ హృదయంలో కీలక స్థానమున్నదని చెప్పారు. మణి పుర్ మహిళలతో భుజం భుజం కలిపి నడుస్తామన్నారు. కానీ ఇది మాత్రమే సరిపోతుందా? అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న మణిపుర్ ప్రజానీకానికి ఈ సభావేదిక నుంచి సహానుభూతి ప్రకటిస్తూ, ఈ ఉదంతాలు పునరావృతం కానీయబోమనీ, దోషులను కఠినంగా దండిస్తామనీ వాగ్దానం చేస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించివుంటే దాని ప్రభావం వేరుగా ఉండేది. వారి పునరా వాసానికి అవసరమైన పథకాలు ప్రకటిస్తే బాగుండేది. అధికార పక్షం వీటిని విస్మరించిందనుకున్నా ప్రతిపక్షం మాత్రం చేసిందేమిటి? ప్రధాని ప్రసంగం పూర్తిగా వినకుండానే వాకౌట్ చేసింది. అధికార పక్షానికి తిరుగులేని మెజారిటీ ఉన్న సభలో అవిశ్వాసం చివరికేమవుతుందో అందరికీ తెలుసు. అయినా ఆ సందర్భంగా జరిగే చర్చలను ప్రజానీకం ఆసక్తిగా గమనిస్తుంది. విపక్షం ఏయే అంశాలపై అధికారపక్షాన్ని నిలదీస్తున్నదో, వాటికి అధికారపక్షం ఏం చెబుతున్నదో తెలుసుకోవ టమే ఆ ఆసక్తిలోని ఆంతర్యం. ఆ సందర్భంగా ఎవరి మంచిచెడ్డలేమిటో బేరీజు వేసుకుంటారు. ముఖ్యంగా మణిపుర్ ప్రజలూ, ఈశాన్య రాష్ట్రాల ప్రజానీకం తమకు జరగబోయే న్యాయం గురించి ఆలోచిస్తారు. కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికలు, అందులో గెలుపోటములే చర్చల్లో ప్రధానంగా వినబడ్డాయి. ఇది సరైందేనా? మణిపుర్ విషాదంపై సుప్రీంకోర్టు ఇప్పటికే చొరవ తీసుకుని లైంగిక హింసపై సాగే సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించింది. పునరావాసం, పరిహారం, ఆవాసాల, ప్రార్థనామందిరాల పునర్నిర్మాణం తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు రిటైర్డ్ మహిళా న్యాయమూర్తులతో కమిటీ ఏర్పరిచింది. తనవంతుగా చేయబోయేదేమిటో కేంద్రం ప్రకటిస్తే ఈ అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు అర్థవంతమైన ముగింపు ఉండేది. -
‘మణిపూర్ మంట చల్లారడం మోదీకి ఇష్టం లేదు’
సాక్షి, ఢిల్లీ: నిన్న లోక్‌సభలో నవ్వుతూ కనిపించిన ప్రధానికి దేశంలో ఏం జరుగుతుందో తెలియదా? అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిలదీశారు. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. తన ప్రసంగంలో ఎక్కువ భాగం విపక్షాల తీరు, ప్రత్యేకించి కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ క్రమంలో ఆయన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. సైన్యానికి అవకాశం ఇస్తే రెండు రోజుల్లో మణిపూర్ పరిస్థితిని సరిదిద్దేది. మణిపూర్‌లో దారుణ పరిస్థితులను చూసి కేంద్ర బలగాలే ఆశ్చర్యపోయాయి. నిప్పుల గుండం లాంటి మణిపూర్‌ను చల్లార్చాల్సింది బోయి బీజేపీ.. మరింత ఆజ్యం పోసింది అని మండిపడ్డారు రాహుల్ గాంధీ. ప్రధానిగా మోదీ కనీసం మణిపూర్‌కు వెళ్లాల్సింది. అక్కడి ప్రజలకు నేనున్నా అని భరోసా ఇవ్వాల్సింది. నేను మీ ప్రధాని.. ఎలాంటి సమస్య ఉన్నా కూర్చుని సామరస్యంగా పరిష్కరించుకుందాం అని ఆయన అనాల్సింది. కానీ, ఆయనలో అలాంటి ఉద్దేశం ఏం కనిపించడం లేదు. మణిపూర్ మంటలు ఆరడం ఆయనకు ఇష్టం లేనట్లుంది అని రాహుల్ అన్నారు. #WATCH | Congress MP Rahul Gandhi says, "Yesterday the PM spoke in Parliament for about 2 hours 13 minutes. In the end, he spoke on Manipur for 2 minutes. Manipur has been burning for months, people are being killed, rapes are happening but the PM was laughing, cracking jokes. It… pic.twitter.com/WEPYNoGe2X — ANI (@ANI) August 11, 2023 భారత్‌ను హత్య చేశారు అని నేను అనలేదు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారు అని ఊరికే అనలేదు. ‘బీజేపీ మణిపూర్‌ను, భారత్‌ను హత్య చేసి.. రెండుగా చీల్చింది’ ఇదీ నేను అన్నమాట. మణిపూర్ మండుతుంటే.. ప్రజలు చనిపోతుంటే.. మోదీ మాత్రం నవ్వుతూ పార్లమెంట్లో కనిపించారు. మణిపూర్ ఇష్యూను తమాషాగా మార్చారు. ప్రధాని స్థానంలో ఉన్న మోదీ.. మణిపూర్‌లో జరుగుతున్న హింసను ఎందుకు ఆపలేకపోయారు?. దేశంలో ఇంత హింస జరుగుతుంటే.. ప్రధాని రెండు గంటలపాటు నవ్వుతూ ఎగతాళి చేశారు. అలాంటి వ్యవహార శైలి మోదీకి సరికాదు. ఇక్కడ ప్రశ్న 2024లో మోదీ మళ్లీ ప్రధాని అవుతారా? కాదా? అనికాదు.. మణిపూర్‌లో జనాల్ని, పిల్లల్ని ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ప్రధాని అయ్యాక రాజకీయ నాయకుడిగా ఉండడం మానేయాలి. ఆయన దేశ వాణికి ప్రతినిధి అవుతాడు. అలాంటప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి చిల్లర రాజకీయ నాయకుడిలా కాకుండా.. ప్రధాని తన వెనుక ఉన్న భారతీయ ప్రజల గుండెబరువుతో మాట్లాడాలి. కానీ, మోదీ అలాకాకుండా వ్యవహరించడం బాధాకరం. అలాంటి ప్రధాని వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. #WATCH | Congress MP Rahul Gandhi says, "When the PM becomes a PM, he ceases to be a politician. He becomes the representative of the voice of the country. Politics should be put aside and the PM should speak not as a petty politician but the PM should speak with the weight of… pic.twitter.com/jJqu4KZTrP — ANI (@ANI) August 11, 2023 -
అవిశ్వాసం తీర్మానంతో తమకు శుభాలు కలుగుతున్నాయన్న ప్రధాని మోదీ.. లోక్‌సభలో వీగిపోయిన విపక్షాల అవిశ్వాస తీర్మానం..ఇంకా ఇతర అప్డేట్స్
-
విద్వేష రాజకీయాలు దేశానికి చేటు
సాక్షి, న్యూఢిల్లీ: అధికార బీజేపీ దేశంలో విద్వేషం సృష్టిస్తోందని..ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలు దేశానికి చేటు చేస్తాయని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. చైనా ఓ పక్క దేశాన్ని ఆక్రమిస్తుంటే, కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మణిపూర్, హరియాణాలో జరుగుతున్న హింసాకాండకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలన్నారు. దేశాన్ని ఓ దుకాణదారుడు, ఓ చౌకీదార్ ఏలుతున్నారని, మైనార్టీలపై దాడులు జరుగుతున్నా ఏ ఒక్కరూ నోరు మెదపడం లేదని..ఇది ఇలానే కొనసాగితే దుకాణదారుడి దుకాణం మూతపడుతుందని, చౌకీదార్ మారుతాడని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఒవైసీ మాట్లాడారు. నుహ్ హింస, యూసీసీ, హిజాబ్, మణిపూర్ సహా పలుఅంశాలను ఆయన ప్రస్తావించారు. అక్కడ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు మీ మనస్సాక్షి ఎక్కడికి పోయిందని కేంద్రాన్ని ప్రశ్నించారు. సీఎం సహకరిస్తున్నారు కాబట్టి ఆయన్ను తొలగించడం ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. హరియాణాలోని నూహ్‌లో 750 భవనాలను ముస్లింలవి అనే కారణంగానే నిబంధనలు పాటించకుండా కూల్చివేశారని, అవి పూర్తిగా చట్టవిరుద్ధమని, హైకోర్టు పేర్కొందని గుర్తు చేసిన ఒవైసీ, భవనాలు కూలుస్తున్నప్పుడు దేశ మనస్సాక్షి ఎక్కడికి పోయిందన్నారు. క్విట్ ఇండియా నినాదం ముస్లిందే ఇటీవల మీనాసాహబ్ అనే వ్యక్తిని అతను ధరించిన దుస్తులు, గడ్డం చూసి, పేరు అడిగి ఒకరు చంపారు...అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో బతకాలంటే మోదీకి ఓటేయాలన్నారు. ఇది ఛాందస వాదానికి ఉదాహరణ కాదా? అని ఒవైసీ ప్రశ్నించారు. ఇక దేశంలో హిజాబ్‌ను సమస్యగా మార్చి, ముస్లిం బాలికలను చదువుకు దూరంగా ఉంచారని దుయ్యబట్టారు. ‘బిల్కిస్‌బానో ఈ దేశపు పుత్రిక కాదా అని నేను అడుగుతున్నా. బిల్కిస్‌బానోపై 11 మంది అత్యాచారం చేశారు, ఆమె తల్లిపై అత్యాచారం చేసి హత్య చేశారు. మీరు నేరస్తులను విడుదల చేశారు. మీరు మెజారిటీ కోసం పనిచేస్తున్నారు’అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు మాట్లాడితే ‘క్విట్ ఇండియా’అంటున్నారని, అయితే ఈ నినాదం ఒక ముస్లిం ఇచ్చారని తెలిస్తే మాత్రం ఈ మాట చెప్పడం మానేస్తారని ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధీ ఆమోదించిన క్విట్ ఇండియా నినాదాన్ని యూసుఫ్ మెహర్ అలీ రూపొందించారని చెప్పారు. పాకిస్తాన్లో ఉన్న కులభూషణ్ జాదవ్‌ను ఎందుకు తీసుకురావడం లేదన్నారు. ‘విశ్వగురు–విశ్వగురు అంటారు కానీ మీరు కులభూషణ్ జాదవ్‌ను మర్చిపోయారు. నేవీ అధికారులు ఖతార్‌లో ఒక సంవత్సరం జైలులో ఉన్నారు, కానీ మీరు వారిని తీసుకురాలేకపోయారు’అని అన్నారు. చైనా ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నారు ఇక చైనా అంశాన్ని ప్రస్తావిస్తూ ‘మీరు చైనా గురించి ఏమీ మాట్లాడరు. 2013లో మోదీ సమస్య ఢిల్లీలో ఉందని, సరిహద్దులో లేదన్నారు. ఈ రోజు చైనా మన భూమిపై కూర్చోలేదా?, ప్రభుత్వం ఏం చేస్తోంది. మోదీ అహ్మదాబాద్‌లో జిన్‌పింగ్‌ను పిలిచి, హత్తుకున్నారు.అతన్ని చెన్నైకి తీసుకెళ్లారు. అయితే ఏం జరిగింది, ఫలితం ఏమిటి?’అని అడిగారు. ఒకదేశం, ఒకేచట్టం అనే యూసీసీ ఫార్ములా ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. దేశంలో ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే భాష అనేది నియంతల ఫార్ములా అని పేర్కొన్నారు. దేశంలో లెక్కలేనన్ని భాషలు, అనేక మతాలు ఉన్నాయని గుర్తు చేశారు. -
మోదీకి కాంగ్రెస్ ఫోబియా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఫోబియాలో నిండా కూరుకుపోయారని ఆ పార్టీ ఎద్దేవా చేసింది. అందుకే గురువారం లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు బదులిచ్చే క్రమంలో దాదాపు రెండు గంటల ప్రసంగంలో ఆసాంతం కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించింది. ప్రధాన సమస్య అయిన మణిపూర్ జాతుల హింసాకాండను కేవలం ప్రస్తావనతో సరిపెట్టారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉప నేత గౌరవ్ గొగోయ్ దుయ్యబట్టారు. ప్రధాని ప్రసంగంలో మణిపూర్ ప్రస్తావన లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్, సహా పలు విపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం పార్లమెంట్ ఆవరణలో నేతలు మీడియాతో మాట్లాడారు. బీజేపీది కుహనా జాతీయవాదమని గొగొయ్ ఆరోపించారు. వాళ్లసలు దేశ భక్తులే కారన్నారు. ‘మణిపూర్‌లో హింసాకాండను అదుపు చేయడంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఆపసోపాలు పడుతోంది. విపక్ష ఇండియా కూటమి నిండు సభలో తన కళ్ల ముందే ఒక్కతాటిపై రావడం, ఇండియా, ఇండియా అంటూ నినాదాలతో హోరెత్తించడాన్ని మోదీ భరించలేకపోయారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఇండియా కూటమి పోరాడుతుంది. 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించి అధికారంలోకి వస్తుంది‘ అని ధీమా వెలిబుచ్చారు. ‘మేం లేవనెత్తిన మూడు ప్రశ్నలకు బదులివ్వనందుకు, మణిపూర్ బీజేపీ ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు, అన్ని రకాలుగా విఫలమైన మణిపూర్ సీఎంకు క్లీన్ చిట్ ఇచ్చినందుకు, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులపై మౌనంగా ఉన్నందుకు... ఇలాంటి పలు కారణాలతో మేం వాకౌట్ చేశాం‘ అని వివరించారు. ‘రావణుడు తనను తాను మహా మేధావిని అనుకునేవాడు. కానీ అహంకారమే అతని పతనానికి కారణమైంది‘ అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, విదేశీ చట్ట సభల్లో పేరు గొప్ప ప్రసంగాలు మాని మన పార్లమెంటులో దేశ సమస్యలకు సమాధానాలు ఇచ్చేలా చేయడమే మా అవిశ్వాస తీర్మానం లక్ష్యం. రోజుల తరబడి పోరాడి మోదీని లోక్ సభకు రప్పించడంలో ఇండియా కూటమి విజయం సాధించింది. కానీ రాజ్యసభలో కూడా చర్చలో పాల్గొనాలనే ఇంగితం ఆయనలో లేకపోయింది‘ అంటూ తూర్పారబట్టారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ..‘మణిపూర్ అంశంపై మాట్లాడాలని ప్రధానిని కోరాము. ఒక గంటా 45 నిమిషాల ప్రసంగం ముగిసినా మణిపూర్ పేరును ఆయన ప్రస్తావించనేలేదు. ఆయన మొత్తం రాజకీయాలపైనే మాట్లాడారు. అందులో కొత్తేముంది? గతంలో మాదిరిగానే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారు. దేశ ప్రజలకు ఆయన చెప్పేదేమిటో మనకు తెలియదా? అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రశ్నలకు ఆయన ప్రసంగంలో ఎటువంటి సమాధానాల్లేవు’అని అన్నారు. డీఎంకే ఎంపీ టీఆర్ బాలు మాట్లాడుతూ..మణిపూర్ సహా దేశంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న మిగతా ప్రాంతాల్లో పరిస్థితులపై ప్రధాని మోదీ మాట్లాడతారని మేమంతా ఎదురుచూశాం. ఆయన మాత్రం రాజకీయ ప్రసంగం చేశారు. అవిశ్వాస తీర్మానం లక్ష్యం నెరవేరలేదు. ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగించాం. ఆయన స్పందించలేదు’అని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ..దేశ చరిత్రలో గొప్ప స్పిన్నర్ ఎవరనే చర్చ ముగిసింది. అది ఎవరో కాదు ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వమే. 90 నిమిషాల ప్రసంగంలో అసలు అంశం మణిపూర్‌పై ప్రసంగించలేదు. ప్రధాని సభకు వచ్చి, మణిపూర్ సమస్యపై ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం చెబుతారనే లక్ష్యంతోనే అవిశ్వాస తీర్మానం పెట్టాం. ఇది దేశ సమగ్రతకు అవమానం. అందుకే మేం వాకౌట్ చేశాం’అని తెలిపారు. -
నేను ప్రధాని కావడం కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదు: మోదీ
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు తమపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిప్పుడల్లా శుభాలే కలుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అవిశ్వాసం అంటే శుభపద్రం, శుభసూచకమేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తామని, వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారు. 2028లో కూడా తమపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పేదల బిడ్డను ప్రజలు కచ్చి తంగా ఆశీర్వదిస్తారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇండియా’ కూటమి అహంకారులతో నిండిపోయిందని మండిపడ్డారు. అందులో అందరూ పెళ్లికొడుకులేనని ఎద్దేవా చేశారు. మోదీ లోక్‌సభలో 2.10 గంటలపాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. మణిపూర్ అంశాన్ని మోదీ ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసలు విషయం మోదీ మాట్లాడడం లేదని వారు ఆరోపించారు. మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుందని ప్రధాని చెప్పారు. ప్రజలపై అరాచకాలకు పాల్పడ్డ దుండగులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దేశ ప్రజలంతా మీకు అండగా ఉన్నారంటూ మణిపూర్ మహిళలకు భరోసా కల్పించారు. అవిశ్వాసంపై జరిగిన చర్చలో టీడీపీ తరపున ఎవరూ మాట్లాడలేదు. మోదీ ప్రసంగం అనంతరం సభలో అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే... 2028లోనూ అవిశ్వాసం పెట్టండి వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మేము మళ్లీ ఘన విజయం సాధించడం తథ్యం. రికార్డులను తిరగరాయడం ఖాయం. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మాకు శుభప్రదమే. 2018లో మాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించాం. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాం. ఆ అవిశ్వాస తీర్మానం మాకు శుభ సూచకమని నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు ప్రవేశపెట్టిన అవిశ్వాసం కూడా మాకు శుభాలు చేకూర్చబోతోంది. వచ్చే ఎన్నికల్లో నెగ్గబోతున్నాం. ప్రజలకు కుంభకోణాల రహిత, అవినీతి రహిత పాలన అందిస్తున్నాం. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తాం. 2028లో కూడా మాపై మరో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం తథ్యం. మా ప్రభుత్వంపై దేశ ప్రజలు మళ్లీ మళ్లీ విశ్వాసాన్ని కనబరుస్తున్నారు. అందుకు వారికి కృతజ్ఞతలు. ఈ పేదల బిడ్డను ప్రజలు ఆశీర్వదిస్తారు. నార్త్ఈస్ట్... జిగర్ కా తుక్డా ఈశాన్య ప్రాంతం మన దేశం హృదయంలో ఒక భాగం(జిగర్ కా తుక్డా). మణిపూర్‌లో హింస జరగడం నిజంగా బాధాకరం. మణిపూర్‌లో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయి. త్వరలోనే అక్కడ శాంతి నెలకొంటుంది. మహిళలపై అరాచకాలను ఎంతమాత్రం సహించబోం. మహిళలను అవమానించిన వారిని, అకృత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాం. మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుందని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా. మణిపూర్ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు హామీ ఇస్తున్నా. దేశం మొత్తం మీకు అండగా ఉంది. పార్లమెంట్ మీకు అండగా ఉంది. మణిపూర్‌లో సమస్యలకు పరిష్కారాన్ని కచ్చి తంగా కనుగొంటాం. మణిపూర్ త్వరలోనే మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మహిళలపై నేరాలు క్షమార్హం కావు మణిపూర్ హైకోర్టు నిర్ణయం తర్వాతే అక్కడ సమస్య మొదలైంది. చిన్నచిన్న సంఘటనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. హింస చోటుచేసుకుంది. ఎన్నో కుటుంబాలను సమస్యలను ఎదుర్కొన్నాయి. చాలామంది తమ ఆప్తులను కోల్పోయారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాలు క్షమార్హం కావు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగడం ప్రతిపక్షాలకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే నిత్యం ఉభయ సభల్లో ఉద్దేశపూర్వకంగా రగడ సృష్టిస్తున్నాయి. దేశ అభివృద్ధికి సంబంధించిన బిల్లులపై పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలు చర్చ జరగనివ్వడం లేదు. వారికి దేశం కంటే పార్టీయే ముఖ్యమని నిరూపిస్తున్నారు. ప్రజలు వంచిస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రభుత్వంపై విమర్శలపై ఉన్న శ్రద్ధ పార్లమెంట్లో ఆమోదం పొందాల్సిన కీలక బిల్లులపై లేదు. విపక్షాలు నోబాల్స్ వేస్తుంటే అధికార పక్షం సెంచరీలు కొడుతోంది. మణిపూర్ విషయంలో రాజకీయాలు చేయొద్దని విపక్షాలను కోరుతున్నా. ప్రజల భాధలను తగ్గించే ఔషధంగా పనిచేయండి. మా అంకితభావానికి నిదర్శనం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత తొమ్మిదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో 50 పర్యాయాల కంటే ఎక్కువే పర్యటించా. మా మంత్రులు 400 కంటే ఎక్కువసార్లు అక్కడ పర్యటించారు. ఇవి కేవలం గణాంకాలు కాదు. ఈశాన్యంపై మా ప్రభుత్వానికున్న అంకితభావానికి ఇవొక నిదర్శనం. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1966 మార్చి 5న మిజోరాం ప్రజలపై వైమానిక దాడులకు పాల్పడింది. సొంత ప్రజలపై వైమానిక దాడుల చేసిన ఘటన దేశ చరిత్రలో ఇదొక్కటే. 1962లో భారత్–చైనా యుద్ధ సమయంలో ఈశాన్య ప్రాంతాల ప్రజలను అప్పటి నెహ్రూ ప్రభుత్వం గాలికొదిలేసింది. 1980వ దశకంలో పంజాబ్‌లో అకల్ తఖ్త్‌పై కాంగ్రెస్ సర్కారు సైనిక చర్యకు దిగింది. మణిపూర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీవ్రవాదులు చెలరేగిపోయారు. ప్రభుత్వ కార్యాలయాల్లో గాందీజీ చిత్రపటాలు పెట్టనివ్వలేదు. స్కూళ్లలో జాతీయ గీతం పాడనివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహంపై ముష్కరులు బాంబుదాడి చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయి. దాడులు చేస్తున్న దేశంతో చర్చలు జరపాలా? కాంగ్రెస్‌కు, దాని మిత్రపక్షాలకు పాకిస్తాన్ అంటే ఎనలేని ప్రేమ. మనదేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడల్లా పాకిస్తాన్‌పై అనురాగం ప్రదర్శిస్తుంటాయి. భారతీయులను మనోభావాలను పక్కనపెట్టి పాకిస్తాన్‌ను సమర్థిస్తుంటాయి. విపక్షాలు ఎప్పుడూ పాకిస్తాన్నే నమ్ముతుంటాయి. భారతదేశపు అంతర్గత శక్తియుక్తులపై, భారత సైనికుల సామర్థ్యంపై ప్రతిపక్షాలకు విశ్వాసం లేదు. కశ్మీర్‌లోని వేర్పాటువాదులంటే విపక్ష నాయకులకు ఎంతో మక్కువ. వారు ఎక్కువగా వేర్పాటువాదులనే కలుస్తుంటారు. పాకిస్తాన్ మన సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మన దేశంలోకి పంపిస్తోంది. భారత్‌లో ఉగ్రదాడులు జరిగితే పాకిస్తాన్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. అయినా మన ప్రతిపక్ష నాయకులు పాకిస్తాన్నే సమర్థి,స్తుంటారు. పాకిస్తాన్ ఏది చెబితే అది నిజమని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తారు. మన గడ్డపై పాకిస్తాన్ ముష్కరులు దాడులు చేస్తున్నా ఆ దేశంతో చర్చలు జరపాలని మూర్ఖంగా వాదిస్తుంటారు. పాకిస్తాన్ జెండాలు మోసినవారే కాంగ్రెస్‌కు ఇష్టం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాద మంటల్లో కశ్మిర్ చిక్కుకుంది. అమాయక జనం బలైపోయారు. అయినా కశ్మిర్లోని సామాన్య ప్రజలను ఏనాడూ కాంగ్రెస్ విశ్వసించలేదు. హురియత్ కాన్ఫరెన్స్‌ను, వేర్పాటువాదులను, పాకిస్తాన్ జెండాలు మోసినవారిని మాత్రమే కాంగ్రెస్ నమ్మింది. పాకిస్తాన్ భూభాగంలో నక్కిన ముష్కరులపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినప్పుడు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నానా యాగీ చేశాయి. మన సైనిక దళాల బలాన్ని విశ్వసించలేదు. మన శత్రువులు చెప్పినదాన్నే విశ్వసించాయి. భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా దాన్ని మరింత పెద్దది చేసి చూపి, సంబరపడే శక్తి ప్రతిపక్షాలకు ఉంది. ప్రతిపక్షాల వద్ద ‘రహస్య వరం’ ప్రతిపక్షాలు అహంకారానికి, అవిశ్వాసానికి మారుపేరు. వాటిది నిప్పుకోడి తరహా మనస్తత్వం. భారతదేశ కీర్తిప్రతిష్టలు అంతర్జాతీయ నూతన శిఖరాలకు చేరుతున్నాయి, ప్రజల్లో కొత్త ఉత్సహం, కొత్త శక్తి నిండుతోంది. ఈ నిజాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రతిపక్షాల వద్ద ‘రహస్య వరం’ ఏదో ఉన్నట్టుంది. ఇతరులకు చెడు జరగాలని వారు (విపక్ష నేతలు) కోరుకుంటే మంచి జరుగుతోంది. అందుకు నేనే ఉదాహరణ. గత 20 ఏళ్లుగా నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. కానీ, నాకు ఏమీ కాలేదు. బ్యాంకింగ్ రంగంపై, ప్రభుత్వ రంగంలోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌పై, భారతీయ జీవిత బీమా సంస్థపై ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేశాయి. వాస్తవానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించాయి. హెచ్ఏఎల్ రికార్డు స్థాయిలో రెవెన్యూ సాధించింది. ఇక ఎల్ఐసీ అద్భుత పనితీరుతో లాభాల బాటలో దూసుకెళ్తోంది. విపక్షాలు ఇప్పుడేం చేయాలో తెలియక చివరకు దేశాన్ని శపిస్తున్నాయి. కానీ, మన దేశం మరింత శక్తివంతంగా మారుతోంది. ప్రభుత్వం సైతం బలోపేతం అవుతోంది. మూడో పర్యాయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అప్పుడు మన దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. భారత్ ఇప్పుడు చాలా కీలక దశలో ఉంది. దీని ప్రభావం మరో వెయ్యేళ్లు ఉంటుంది. దేశ ప్రజల బలం, శ్రమ, కష్టపడే తత్వం వచ్చే వెయ్యి సంవత్సరాలకు బలమైన పునాది వేస్తాయి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం.. దేశంలో గత ఐదేళ్లలో ఏకంగా 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ నిర్వాకం వల్లే ఈశాన్యంలో సమస్యలు పరాయి గడ్డ నుంచి మన దేశంలోకి వస్తున్న ముష్కర మూకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అందుకే కాంగ్రెస్ పట్ల దేశ ప్రజలు పూర్తి అవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఒక విజన్ గానీ, ఒక విధానం గానీ లేవు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పాత్ర గురించి కాంగ్రెస్‌కు తెలియదు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ది వెనుక తమ నాయకుల పాత్ర ఉందని ఆ పార్టీ చెప్పుకుంటోంది. అందులో ఎంతమాత్రం నిజంలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో అన్ని సమస్యలకు కాంగ్రెస్, ఆ పార్టీ నీచ రాజకీయాలే మూలకారణం. అక్కడి ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది. ఈశాన్యంతో నాకు భావోద్వేగ అనుబంధం ఉంది. ప్రధానమంత్రిని కాకముందే ఆ ప్రాంతంలో ఎన్నోసార్లు పర్యటించా. విపక్ష దుకాణం త్వరలో బంద్ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అహంకారులైన వారసత్వ రాజకీయ నాయకులతో నిండిపోయింది. విద్వేషం, విభజన, అత్యవసర పరిస్థితి, సిక్కులపై దాడులు, అబద్ధాలు, అవినీతి, కుంభకోణాలు, రెండంకెల ద్రవ్యోల్బణం, అస్థిరత, బుజ్జగింపు రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, నిరుద్యోగం, ఉగ్రవాదం.. ఇవన్నీ ప్రతిపక్షాల ఘనతలే. ప్రతిపక్ష నాయకులు గనుక అధికారంలోకి వస్తే దేశాన్ని రెండు శతాబ్దాలు వెనక్కి తీసుకెళ్తారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి బీటలువారిన ఇంటికి పూతలు పూసే ప్రయత్నంలా ఉంది. మా కూటమి ఎన్డీయే కేవలం అభివృద్ధి రాజకీయాలు చేస్తోంది. దేశం పేరు పెట్టుకున్న విపక్ష కూటమితో ఒరిగేదేమీ లేదు. విపక్షాల కొత్త దుకాణం త్వరలో బంద్ అవుతుంది. ఈ విషయం విపక్ష నేతలకు కూడా తెలుసు. అది కేవలం లూటీ దుకాణం, విద్వేష బజార్. మా కూటమి ఎన్డీయే. దానికి రెండు ‘ఐ’ అక్షరాలు కలిపి ‘ఇండియా’ అని పెట్టుకున్నారు. అందులో ఒక ‘ఐ’ 26 పార్టీల అహంకారం. మరో ‘ఐ’ ఒక కుటుంబ అహకారం. పేరు మార్చుకున్నంత మాత్రాన పాత పాపాలను దాచలేరు. వారసత్వ రాజకీయాలు అంతం కావాలని మహాత్మాగాందీ, అంబేడ్కర్, మౌలానా ఆజాద్ తదితర గొప్ప నాయకులు ఆకాంక్షించారు. కానీ, వారసత్వ రాజకీయాలు, డబ్బుతోనే ఒక కుటుంబం చుట్టూ ‘ఇండియా’ కూటమి ఏర్పాటైంది. నేను ప్రధాని కావడం కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదు నేను పేద కుటుంబం నుంచి వచ్చా. పేదల బిడ్డ అధికారంలోఉండడాన్ని గాంధీ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. దేశంలో 30 ఏళ్ల తర్వాత ప్రజలు పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నిరుపేద బిడ్డ ఉన్నత పదవిలో ఉండడం ఏమిటని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. వారు(కాంగ్రెస్ నాయకులు) గతంలో విమానాల్లో పుట్టిన రోజు కేకులు కట్ చేసుకున్నారు. మనం అదే విమానాల్లో వ్యాక్సిన్లు రవాణా చేశాం. వారు తమ దుస్తులను విమానాల్లో పంపించుకున్నారు. నేడు పేదలు సైతం విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వారు నావికాదళం నౌకలను విందులు వినోదాల కోసం వాడుకున్నారు. అది ‘ఇండియా’ కాదు, ముమ్మాటికీ అహంకార కూటమి. అందులోని ప్రతి నాయకుడు పెళ్లి కొడుకు(ప్రధానమంత్రి) కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌ను ఒక విదేశీయుడు స్థాపించారు. ఆ పార్టీ జెండా, పార్టీ గుర్తు, సిద్ధాంతాలు ఇతరుల నుంచి దొంగిలించినవే. అహంభావం వల్లే కాంగ్రెస్ 400 సీట్ల నుంచి 40 సీట్లకు పడిపోయింది. బెంగళూరులో ‘యూపీఏ’కు సమాధి కట్టిన విపక్ష స్నేహితులకు ఇదే నా సానుభూతి. రాహుల్.. విఫల ఉత్పత్తి మన భరతమాత మృతి చెందాలని కొందరు ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. భారతమాత హత్య అంటూ అనుచితంగా మాట్లాడడం భారతీయుల మనోభావాలను తీవ్రంగా గాయపర్చింది. ప్రజాస్వామ్యం హత్య, రాజ్యాంగం హత్య అంటూ మాట్లాడే ఈ వ్యక్తులే(కాంగ్రెస్ నాయకులు) భరతమాతను మూడు ముక్కలు చేశారు. బానిసత్వం నుంచి భరతమాతకు విముక్తి కలిగించే సమయం వచ్చి నప్పుడు ఆమె అవయవాలను నరికేశారు. కాంగ్రెస్‌కు రాజకీయాలు చేయడం తప్ప మరేమీ తెలియదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పలుమార్లు రాజకీయాల్లో ప్రవేశపెట్టారు. ప్రతిసారీ ఆయన విఫలమయ్యారు. ఆయనొక ‘విఫల ఉత్పత్తి’. -
PM Modi Speech in Parliament : విపక్షాలపై మోడీ ఫైర్... ఇకపై మాకు అంతా శుభమే...!
-
మణిపూర్ శాంతికి నాదీ హామీ: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: ఐదేళ్లు గడువిచ్చినా.. ప్రతిపక్షాలు అవిశ్వాసానికి సిద్ధం కాలేకపోయాయని, నో కాన్ఫిడెన్స్.. నో బాల్‌గానే మిగిలిపోయింది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మణిపూర్ అంశంపై విపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా గురువారం సాయంత్రం లోక్‌సభలో ప్రసంగించారాయన. ఈ మోషన్ మీద మీ చర్చ ఎలా జరిగింది?.. చర్చ సమయంలో మీరు మాట్లాడిన ప్రతీ మాట దేశం మొత్తం వింది. సోషల్ మీడియాలో దీనిపై ఏమని చర్చించారో తెలుసా?.. ‘విపక్షాలు ఫీల్డింగ్ చేస్తుంటే.. ఫోర్లు, సిక్సర్లు మా నుంచి పడ్డాయి’ అని మోదీ ఛలోక్తులు సంధించారు. మా గెలుపును నిర్ణయించేశారు దేవుడే ఎంతో దయ గలవాడు. ఏదో ఒక విధంగా మాట్లాడాలని చూస్తాడు. దేవుడి దయతోనే విపక్షాలు అవిశ్వాసం పెట్టాయని నమ్ముతున్నా. 2018లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా నేను చెప్పాను, ఇది మాకు బలపరీక్ష కాదు, వారికి బలపరీక్ష అని. ఫలితంగా వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల అవిశ్వాసం మాకు ఎప్పుడూ అదృష్టమే. ఈ రోజు మీరు మీరు (ప్రతిపక్షం) చేసిన పని మా గెలుపును నిర్ణయించేసింది. 2024 ఎన్నికల్లో ఎన్డీయే, బీజేపీ గొప్ప విజయం సాధిస్తాయని, మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొడతాయని.. ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి వస్తాయని ఒక అభిప్రాయానికి వచ్చేశా. భారత్ ఎదుగుదలను ప్రపంచం చూస్తోంది అవిశ్వాసం, అహంకారం విపక్షాల నరనరాల్లో నిండిపోయింది. భారత్‌ను అప్రతిష్టపాలు జేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. మేం దేశ ప్రతిష్టతను ఖండాంతరాలకు వ్యాపింపజేశాం. స్కామ్‌లు లేని భారత్‌ను అందించాం. ఫలితంగానే.. భారత్‌పై ప్రపంచ దేశాల్లో ఒక నమ్మకం ఏర్పడింది. దేశం ఎంత బలపడిందో చెప్పేందుకు విదేశీ పెట్టుబడులే నిదర్శనం. మన సంక్షేమ పథకాలను ఐఎంఎఫ్ ప్రశంసించింది. భారత్ నలుమూలలా విస్తారంగా అవకాశాలు దక్కుతున్నాయి. భారత్ ఎదుగుదలను ప్రపంచం చూస్తోంది. భారత్‌లో ప్రణాళిక, కృషి కొనసాగింపు కొనసాగుతుంది. అవసరాన్ని బట్టి దానికి కొత్త సంస్కరణలు ఉంటాయి. పనితీరు కోసం అన్ని ప్రయత్నాలు చేయబడతాయి. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. మీరు 2028లో అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చినప్పుడు, ప్రపంచంలోని మొదటి మూడు దేశాలలో దేశం ఒకటిగా ఉంటుందని దేశం విశ్వసిస్తోంది అంటూ ప్రధాని మోదీ విపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కోల్‌కతా నుంచి ఫోన్ వచ్చిందా? ఈ అవిశ్వాసంతో మునుపెన్నడూ చూడనివి, కొత్తవి, ఊహించలేనివి చూస్తున్నాం. ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ మాట్లాడకపోవడం విడ్డూరం. ఆయన్ని కాంగ్రెస్ ఎందుకు మాట్లానివ్వలేదు. బహుశా కోల్‌కతా నుంచి ఫోన్ వచ్చిందేమో. కాంగ్రెస్ ఆయన్ని పదే పదే అవమానిస్తూ వస్తోంది. అందుకే ఆయన్ని పక్కనపెడుతోంది. #WATCH | PM Modi says, "A few things in this No Confidence Motion are so strange that they were never heard or seen before, not even imagined...The name of the Leader of the largest Opposition party was not among the speakers...This time, what has become of Adhir ji (Adhir Ranjan… pic.twitter.com/NXdGzauxjT — ANI (@ANI) August 10, 2023 అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. తమ విధానాలతో దేశం కంటే పార్టీనే ముఖ్యమని కొన్ని విపక్ష పార్టీలు చాటి చెబుతున్నాయి. బహుశా మీకు దేశంలోని పేదల ఆకలితో పట్టింపులేదేమో. ఎందుకంటే వాళ్లకు అధికార దాహమే ఆలోచనగా ఉండిపోయింది కాబట్టి. ఎల్ఐసీపై దుష్ప్రచారం చేశారు అనరాని మాటలు అనడంతో విపక్షాల మనస్సులు శాంతించి ఉంటాయి. భారత్‌లో జరిగిన మంచిని విపక్షాలు సహించలేకపోతున్నాయి. HAL దివాళా తీస్తుందని ప్రచారం చేశారు. కానీ, హెచ్ఏఎల్ సరికొత్త రికార్డులు సృష్టించింది. అత్యధిక ఆదాయం అర్జించింది. ఎల్ఐసీ ప్రైవేటీకరణ చేస్తే నాశనం అవుతుందని, దివాళ తీస్తుందని ప్రచారం చేశారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణతో పేదల డబ్బులు పోతాయని ప్రచారం చేశారు. కానీ, ఎల్ఐసీ పటిష్ట స్థితిలో ఉంది. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని ప్రచారం చేశారు. రాబోయే రోజుల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంటుంది అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Hindustan Aeronautics Limited (HAL) recorded its highest-ever revenue. Despite their (opposition's) allegations, HAL has emerged as the pride of the country. They said many things about LIC that the money of the poor will sink but today LIC is getting stronger. 'Share… pic.twitter.com/dH2eOoGuk9 — ANI (@ANI) August 10, 2023 కాంగ్రెస్‌పై ప్రజలకు నో కాన్ఫిడెన్స్ కాంగ్రెస్‌కు ఎలాంటి విజన్ లేదు. నిజాయితీ లేదు. కాంగ్రెస్‌కు అంతర్జాతీయ ఆర్థిక విధానం లేదు. కాంగ్రెస్ హయాంలో దేశం పేదరికంలో మగ్గిపోయింది. కశ్మీర్‌పై, కశ్మీర్ ప్రజలపై కాంగ్రెస్‌కు ప్రేమ లేదు. తమిళనాడులో 1962లో, త్రిపురలో 1988లో, నాగాలాండ్‌లో 1988లో చివరిసారిగా నెగ్గారు. తమిళనాడు భారత్‌లో భాగం కాదన్నట్లు మాట్లాడుతున్నారు. ఢిల్లీ, ఏపీలోనూ ప్రజలు కాంగ్రెస్‌ను దూరం పెట్టారు. యూపీ, బీహార్, గుజరాత్ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు. అధికారం కాంగ్రెస్‌కు అహంకారంతో కళ్లు మూసుకుపోయాయి. అందుకే అన్ని రాష్ట్రాల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రజలు కాంగ్రెస్‌పై నో కాన్ఫిడెన్స్ ప్రకటించారు. విపక్షాలకు పాకిస్తాన్ అంటే ప్రేమ కనిపిస్తోంది. పాక్ చెప్పిందే విపక్షాలు నమ్ముతున్నాయి. పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రయిక్స్ చేశామంటే సైన్యాన్ని సైతం కాంగ్రెస్ నమ్మలేదు. మేక్ ఇన్ ఇండియా అంటే ఎగతాళి చేశారు. భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌పై విపక్షాలకు నమ్మకం లేకుండా పోయింది. #WATCH | PM Modi says, "People of the country have no confidence in Congress. Due to arrogance, they are not able to see the reality. In Tamil Nadu, they won in 1962 and since 1962 the people of Tamil Nadu are saying 'No Congress'. In West Bengal they won in 1972, people of West… pic.twitter.com/8xHvTcIIKm — ANI (@ANI) August 10, 2023 ఇండియా కూటమిపై సెటైర్లు విపక్షాలు కొన్నిరోజుల కిందట బెంగళూరులో యూపీఏకి అంత్యక్రియలు జరిపాయి. ఇన్ని తరాలు గడిచినా.. పచ్చి మిర్చి, ఎండు మిర్చికి తేడా తెలియని రీతిలో ఉంది మీ తీరు. విపక్షాలు చివరకు ఇండియాను.. I.N.D.I.Aగా ముక్కలు చేశారు. తమను తాము బతికించుకోవడానికి ఎన్డీయే మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి వారిది. NDAలో రెండు ఐ(I లెటర్లు)లు చేర్చారు. మొదటి I.. 26 ;పార్టీల అహకారం. రెండో I.. ఒక కుటుంబ అహంకారానికి నిదర్శనం. అలవాటు లేని ‘నేను’(I) అనే అహంకారం వారిని వదలడం లేదు. ఈ క్రమంలో ఎన్డీయేను కూడా దోచుకున్నారు. #WATCH | PM Narendra Modi says, "I want to express my sympathy with the opposition because a few days ago you performed the last rites of UPA in Bengaluru. On one hand, you were performing last rites par aap jashan bhi mana rahe the aur jashan bhi kis cheez ka- khandhar par naya… pic.twitter.com/cJXh220UNk — ANI (@ANI) August 10, 2023 ప్రతీ పథకం పేరు కాంగ్రెస్ ఒక కుటుంబం పేరును చేర్చింది. అక్కడ స్కీమ్‌లు లేవు. అన్నీ స్కామ్‌లే. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు గాంధీ పేరును వాడుకున్నారు. తమ పేర్ల మీద పథకాలు నడిపించారు. కాంగ్రెస్‌కు కుటుంబ పాలన, దర్బార్ పాలన అంటేనే ఇష్టం. వారి కుటుంబం నుంచి కాకుండా వేరే కుటుంబం నుంచి ప్రధాని అయితే సహించలేరు. మేం కుటుంబ పాలనకు వ్యతిరేకం. విపక్షాలది ఇండియా కూటమి కాదు.. అహంకారుల కూటమి. ఫెయిల్డ్ ప్రాజెక్టును కాంగ్రెస్ పదేపదే లాంచ్ చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. ఇండియా కూటమిలో ప్రతీ ఒక్కరిదీ ప్రధాని కావాలనే కోరిక. ప్రజలే దేవుళ్లు.. తీర్పు ఇచ్చారు లంక దహనం జరిగింది హనుమాన్ వల్ల కాదు. రావణుడి అహంకారం వల్లే!. ప్రజలు కూడా రాముడి లాంటివాళ్లు. అందుకే 400 నుంచి మిమ్మల్ని 40కి పడేశారు. ప్రజలు రెండుసార్లు పూర్తి మద్దతు మాకు ఇచ్చారు. కానీ, మీకు ఓ పేద వ్యక్తి ఎలా ఇక్కడికి ఎలా వచ్చాడనే ఆలోచన మీకు నిద్రపట్టనివ్వడం లేదు. ప్రజలు 2024లోనూ మిమ్మల్ని నిద్రపోనివ్వరు. ఒకప్పుడు విమానాల్లో కేక్ కట్టింగులు జరిగాయి. కానీ, ఇప్పుడు అవే విమానాల్లో పేద ప్రజల కోసం వ్యాక్సిన్లు పంపుతున్నాం. #WATCH | PM Narendra Modi says, "It is true that Lanka was not set ablaze by Hanuman, it was set ablaze by his (Ravan) arrogance. People are also like Lord Ram and that is why you have been reduced to 40 from 400. People elected full majority government twice but it is troubling… pic.twitter.com/aMaxHkyfbH — ANI (@ANI) August 10, 2023 వారికి కలలో కూడా మోదీ కనిపిస్తాడు. 24 గంటలు మోదీ నామస్మరణ చేస్తారు. విపక్షాలు కొత్త కొత్త దుకాణాలు తెరుస్తున్నారు. కాంగ్రెస్‌ది అబద్ధాల దుకాణం. త్వరలో ఆ దుకాణానికి కూడా తాళాలు వేయాల్సి వస్తుంది. దేశంలోని వ్యవస్థలన్నీ చచ్చిపోయానని వీళ్లు అంటున్నారు. కానీ, అవేంతో అదృష్టం చేసుకుని ఉన్నాయి. దేశానికి, ప్రజాస్వామ్యానికి వాళ్లు శాపనార్థాలు పెడుతున్నారు. కానీ, మన దేశం, ప్రజాస్వామ్యం మరింత బలపడతాయి. అలాగే.. మేం కూడా మరింత బలోపేతం అవుతాం. విపక్షాలపై ప్రధాని విసుర్లు కొనసాగుతుండగానే.. ఇండియా కూటమి ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. #WATCH | Opposition MPs walk out of the Lok Sabha as Prime Minister Narendra Modi speaks on #NoConfidenceMotion pic.twitter.com/2kYKRBiP1Z — ANI (@ANI) August 10, 2023 మణిపూర్‌పై.. మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలకు అర్థవంతమైన చర్చ జరిపే ఉద్దేశం లేదు. మేం చర్చలకు ఆహ్వానించినా.. వాళ్లు రావడం లేదు. ఎందుకంటే మణిపూర్‌పై చర్చ విపక్షాలకు అవసరం లేదు. మణిపూర్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందటారు. వాళ్ల మనసులో ఏదుంటే అదే కనిపిస్తుంది.. అదే బయటపడుతోంది. కొందరు భారతమాత చావు ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. భారతమాతను ముక్కలు చేసింది వీళ్లే. వందేమాతరం కూడా ముక్కలు ముక్కలు చేసింది కూడా వీళ్లే. కాపాడాల్సిన వాళ్లే భారతమాత భుజాలు నరికేశారు. తుక్డే గ్యాంగ్‌ను ప్రొత్సహిస్తున్నారు. 1966లో మిజోరాం ఘటనలకు కారణం ఎవరు? మిజోరాంలో సామాన్యులపైనా దాడులు చేయించారు. ఎయిర్‌ఫోర్స్‌ను ఉపయోగించారు. నెహ్రూపై లోహియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈశాన్య భారతంను చీకట్లో ఉంచేశారని లోహియా అన్నారు. మిజోరాం వాస్తవాన్ని కాంగ్రెస్ దేశ ప్రజల ముందు ఉంచింది. ఈశాన్య రాష్ట్రంలో 50సార్లు పర్యటించాను. మా ప్రభుత్వ హయాంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి జరిగింది. ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అలాంటిది ఈశాన్య రాష్ట్రాల గురించి వీళ్లా మనకు చెప్పేది. మణిపూర్‌లో సాయంత్రం నాలుగు తర్వాత గుడిలు, మసీదులు మూసేవారు. ఈ పాపం కాంగ్రెస్‌ది కాదా? అని నిలదీశారాయన. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్‌లో అభివృద్ధిని కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని మండిపడ్డారాయన. #WATCH | PM Narendra Modi speaks on Manipur; says, "Both the state and central governments are doing everything possible to ensure that the accused get the strictest punishment. I want to assure the people that peace will be restored in Manipur in the coming time. I want to tell… pic.twitter.com/cgI7RqSWs4 — ANI (@ANI) August 10, 2023 హైకోర్టు తీర్పు తర్వాత మణిపూర్‌లో పరిస్థితులు మారాయి. హైకోర్టు తీర్పులో రెండు కోణాలు ఉన్నాయి. మణిపూర్‌లో జరిగింది దిగ్భ్రాంతికరం. రాబోయే కాలంలో మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని నేను అక్కడి ప్రజలకు హామీ ఇస్తున్నాను. నిందితులకు కఠిన శిక్ష పడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా కృషి చేస్తున్నాయి. దేశం మీ వెంట ఉందని అక్కడి ఆడపడుచులు, బిడ్డలకు నేను చెప్పాలనుకుంటున్నా. ‘యావత్ దేశం మీ వెంట(మణిపూర్ ప్రజలను ఉద్దేశించి..) ఉందమ్మా’. మణిపూర్ త్వరలో ప్రగతి పథంలో పయనిస్తుంది. మణిపూర్ అభివృద్ధికి అన్నివిధాలుగా అండగా ఉంటాం. #WATCH | Prime Minister Narendra Modi says, "...In 2018, I gave them (Opposition) a work - bring No Confidence Motion in 2023 - and they followed my words. But I am sad. In 5 years, they should have done better. But there was no preparation, no innovation, no creativity...I will… pic.twitter.com/5gNGZ2OlP7 — ANI (@ANI) August 10, 2023 ప్రపంచానికి ఈశాన్య రాష్ట్రాన్ని దిక్సూచిని చేస్తాం. మన నుంచి ప్రజలు మంచి ఆశిస్తారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండి. 2047 నాటికి భారత్ అభివృద్ధిచెందిన దేశంగా ఉంటుంది. మరోసారి అవిశ్వాసం పెట్టేముందు సరిగ్గా ప్రిపేర్ అవ్వండి అంటూ విపక్షాలకు చురకలంటించారాయన. -
లోక్‌సభలో బండి సంజయ్ భావోద్వేగ కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ సర్కార్, కాంగ్రెస్ పార్టీపై సభలో సంజయ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఓ గజినీ అని అన్నారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని సెటైరికల్ పంచ్ వేశారు. కేసీఆర్.. ఖాసిం చంద్రశేఖర రజ్వీ అని కామెంట్స్ చేశారు. అవిశ్వాసంలో భాగంగా బీజేపీ పక్షాన బండి సంజయ్ 10 నిమిషాలపాటు మాట్లాడారు. సభకు శిరస్సు వంచి నమస్కారం.. లోక్‌సభలో బండి సంజయ్ తెలుగులోనే మాట్లాడుతూ.. దేశ్ కీ నేత.. దిన్ బర్ పీతా. యే కాంగీ, బెంగాల్ దీదీ, ఢిల్లీ కేజ్రీ, బీహార్ జేడీ, ఔర్ తెలంగాణ కేడీ.. మోదీని ఏమీ చేయలేరు. తెలంగాణ ఇచ్చిన పార్లమెంట్ పవిత్ర దేవాలయం.. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సుష్మా స్వరాజ్‌కు నా సెల్యూట్. చీమల పుట్టలో పాములా తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేరింది. కేంద్రం పుష్కలంగా నిధులిచ్చినా కేసీఆర్ సహకరించడం లేదు. రైతు సగటు ఆదాయంకంటే సాగుపై కేసీఆర్ కుటుంబ ఆదాయం వందల రెట్ల ఎట్లా పెరిగాయి? అని ప్రశ్నించారు. ఇక, మణిపూర్‌కు ప్రధాని మోదీ వెళ్లలేదని అడిగే నైతిక అర్హత మీకుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు.. ఇందుకు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని అన్నారు. రాహుల్ గాంధీపై ఫైర్.. భారతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ విరుచుకుపడ్డారు. ‘ఆయన ఎప్పుడేం చేస్తడో ఆయనకే తెలియదు. ఒకసారి కన్ను కొడతడు.. ఒకసారి కౌగిలించుకుంటాడు. ఇంకోసారి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. గజినీలాగా తయారయ్యాడు. ఇలాంటి వ్యక్తితో కలిసి అవకాశవాద కూటమి అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం హాస్యాస్పదం. ఏ కాంగీ.. బెంగాల్ దీదీ.. ఢిల్లీ క్రేజీ.. బీహార్ జేడీ.. ఔర్ ఔర్.. తెలంగాణ కేడీ.. సభ్ లోగ్ మిల్ కర్ ఆయే తోబీ మోదీజీ కో నహీ రోకేంగే. భరతమాత జోలికొస్తే కన్ను పీకే ఆదర్శనేత నరేంద్ర మోదీ’అంటూ విరుచుకుపడ్డారు. మోదీ నాయత్వంలో ఎన్డీయే ప్రభుత్వం శక్తివంతమైన దేశంగా మారుతోందన్నారు. బీఆర్ఎస్ ఎంపీలకు సవాల్.. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామంటూ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ను పూర్తిగా తప్పుదోవ పట్టించాయన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘తెలంగాణలో 24 గంటలపాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఇదిగో నా రాజీనామా.. నిరూపించే దమ్ముందా? నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? ముక్కు నేలకు రాసి సభకు క్షమాపణ చెబుతారా?’ అంటూ సవాల్ విసిరారు. సుష్మా స్వరాజ్‌కు సెల్యూట్.. ఈ పవిత్రమైన పార్లమెంట్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణను సాకారం చేసిన దేవాలయమిది. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వల్ల 1400 మంది యువకులు బలయ్యారు. జై తెలంగాణ అంటూ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. ట్రైన్‌కు ఎదురుగా పోయి చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే సభ వేదికగా తెలంగాణ బిల్లు పెడతారా, మేం వచ్చాక ఇవ్వమంటారా? అంటూ సుష్మా స్వరాజ్ నిలదీస్తే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూడటానికి మీరు బతికి ఉండాలని అప్పీల్ చేస్తే యువతకు భరోసా ఇచ్చిన మహానేత. చిన్న రాష్ట్రాలకు బీజేపీ మొదటి నుండి అనుకూలం. తెలంగాణకు అనుకూలంగా కాకినాడ తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని అన్నారు. బీఆర్ఎస్పై సెటైర్లు.. చీమల పుట్టలో తాచుపాము జొర్రినట్లు.. తెలంగాణలో ఒక కుటుంబం చేరింది. బీఆర్ఎస్ అంటే.. భ్రష్టాచార్ రాక్షస సమితి. బీఆర్ఎస్ లీడర్ పేరు ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ. తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. బీఆర్ఎస్ నేతది ఒకే పని.. అదేమిటంటే.. రాత్ బర్ పీతా.. దిన్ బర్ సోతా.. కిస్ సే బీ నహీ మిల్ తా.. యే హై దేశ్ కీ నేత అని సెటైర్లు వేశారు. కేసీఆర్ ఆస్తులు ఎంత పెరిగాయంటే.. అధికారంలోకి రాకముందుతో పోలిస్తే 2018 నాటికి ఖాసీం రజ్వీ కొడుకు ఆస్తులు 400 రెట్లు పెరిగాయి. ఆయన భార్య ఆస్తులు 18వందల శాతం పెరిగాయి. ఆశ్యర్యమైన విషయమేంటంటే.. తెలంగాణ రైతుల సగటు ఆదాయం 1 లక్షా 12 వేల 836 రూపాయలు.. కేసీఆర్ వ్యవసాయం ఆదాయం కోటి రూపాయలు.. కేటీఆర్ 59 లక్షల 85 వేలు. రైతుల కంటే 5 వేల శాతం అధికం. ఆయన కోడలు ఆదాయం 2 వేల శాతం అధికం. నా తెలంగాణలో రైతులు నష్టపోతున్నారని అన్నారు. నిధులు దారి మళ్లించిన కేసీఆర్.. కొత్త రాష్ట్రానికి కేంద్రం పుష్కలంగా నిధులిచ్చింది. తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసింది. రూ.9 లక్షల 60 వేల కోట్లకుగా అప్పులిచ్చింది. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్న ఘనత మోదీదే. టాయిలెట్లకు నిధులిస్తే దోచుకున్నారు. రూ.4 వేల కోట్ల అంచనాలతో రూపొందించిన భగీరథను 40 వేల కోట్లకు పెంచి దోచుకున్నారు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్న ఘనత మోదీదే. ఉచితంగా రేషన్ అందిస్తుంటే వాటిని అమ్ముకుంటున్న దొంగలు బీఆర్ఎస్ నేతలు. జాతీయ ఉపాధి హామీ పైసలను కూడా దారి మళ్లించారు. మణిపూర్ సరే.. తెలంగాణ సీఎం చేస్తున్నదేమిటి? మణిపూర్ ఘటనపై అమిత్ షా జీ చెప్పారు. దాంట్లోకి నేను వెళ్లను. తెలంగాణలో ఎంత పెద్ద దుర్ఘటన జరిగినా తెలంగాణ సీఎం ఎందుకు వెళ్లలేదు? రైతులు చనిపోయినా వెళ్లరు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా వెళ్లరు.. మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణాలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, భూ కబ్జాల సంగతేంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. గల్లీలో కుస్తీ పడుతున్నట్లు యాక్షన్ చేస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తూ మోదీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాయి. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటేసినట్లే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కవల పిల్లలు. తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతమైంది. కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ స్థానిక ఎన్నికల్లో జీరో. ఈ ఫలితాలే నిదర్శనం. తెలంగాణలో అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే సాధ్యం అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: బుద్వేల్ భూముల వేలం.. తొలి సెషన్లో రికార్డులు బ్రేక్ చేసిన ప్లాట్స్ -
అంతా అబద్ధం! దానికి ప్రధాని పదవి ఉంది!!
అంతా అబద్ధం! దానికి ప్రధాని పదవి ఉంది!! -
నేడు మూడోరోజు లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ
-
లోక్ సభలో మణిపూర్ అలజడి..అవిశ్వాసంలో బీజేపీ గెలుస్తుందా ?
-
లోక్‌సభలో కేంద్రంపై వీగిన అవిశ్వాసం
Live Updates ►లోక్‌సభలో కేంద్రంపై వీగిన విపక్షాల అవిశ్వాసం ►మూజువాణి ఓటుతో వీగిపోయిన అవిశ్వాసం ►లోక్‌సభలో విపక్షాల వాకౌట్ చేయడంతో ఓటింగ్ లేకుండానే వీగిపోయిన అవిశ్వాస తీర్మానం ► అవిశ్వాసంపై చర్చ సందర్భంగా.. మొత్తం 2గం.13 నిమిషాలపాటు ప్రధాని మోదీ ప్రసంగించారు. మణిపూర్‌పై మోదీ వ్యాఖ్యలు.. ►మణిపూర్‌లో జరిగింది దిగ్భ్రాంతికరం .. మణిపూర్‌లో జరిగింది అమానవీయం ► మణిపూర్‌పై చర్చ విపక్షాలకు అవసరం లేదు. మణిపూర్‌పై అమిత్ షా పూర్తి వివరాలు అందించారు. మేం చర్చకు ఆహ్వానిస్తే.. వారు వెళ్లిపోయారు. మణిపూర్ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. కొందురు ఎందుకు భారతమాత చావు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. వీళ్లే రాజ్యాంగం హత్య గురించి మాట్లాడుతారు. వాళ్ల మనసులో ఉన్నదే ఇప్పుడు బయటపడుతోంది. ► వీళ్లు దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మిజోరంపైనా దాడులు చేయించారు. 1966లో మిజోరంలోని సామాన్యులపై దాడులు చేయించారు. ఈశాన్యం అభివృద్ధిని నెహ్రు అడ్డుకుంటారని లోహియా. ఇందిరా హయాంలో మిజోరంపై జరిగిన దాడిని ఇప్పటికీ దాచారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కాంగ్రెస్ విస్మరించింది. ► నేను ఇప్పటికి 50సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాను. 1962 నాటి నెహ్రు ప్రసంగం నేటికి ఈశాన్య రాష్ట్రాల మనసుల్ని గుచ్చుకుంటుంది. మిజోరం మార్చి 5వ తేదిని ఇప్పటికీ నిరసన దినంగా పాటిస్తుంది. ► మణిపూర్‌లో విధ్వంసాలన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనివే. గత ఆరేళ్ల నుంచి మణిపూర్ సమస్యల కోసం పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాంగ్రెస్ ఏ సమస్యనైనా రాజకీయం చేస్తోంది. ప్రపంచానికి ఈశాన్య రాష్ట్రాలకు దిక్సూచి చేస్తాం. మణిపూర్ అభివృద్ధికి ఎన్డీఏ తీవ్ర కృషి చేస్తోంది. మణిపూర్, నాగాలాండ్, మిజోరంలో అభివృద్ధిని కాంగ్రెస్ చూడలేకపోతోంది. మరోసారి అవిశ్వాసం పెట్టే ముందు సంసిద్ధంకండి. ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్ అవిశ్వాసంపై ప్రధాని ప్రసంగం.. హైలైట్స్ ►ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావాలని వారు చూస్తున్నారు ►విపక్షాలది ఇండియా కూటమి కాదు.. అహంకార కూటమి ►మేం కుటుంబ పాలనకు వ్యతిరేకం ►24 గంటలు వారు మోదీ నామ స్మరణ చేస్తున్నారు ►ఫెయిల్డ్ ప్రొడక్ట్‌ని కాంగ్రెస్ పదే పదే లాంచ్ చేస్తోంది ►వారు కొత్త కొత్త దుకాణాలను తెరుస్తున్నారు ►వారి కొత్త దుకాణానికి కూడా తాళం వేయాల్సి వస్తుంది ►కాంగ్రెస్ పాలనలో స్కీమ్‌లు లేవు.. అన్ని స్కామ్‌లే: ప్రధాని మోదీ ►పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్ జరిపిన సైన్యాన్ని విపక్షాలు నమ్మలేదు ►మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్ వచ్చినా విపక్షాలు విశ్వసించలేదు ►అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించలేదు ►కశ్మీర్ పౌరులపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదు ►2028లో కూడా మాపై విపక్షాలు అవిశ్వాసం పెడతాయి ►విపక్షాలకు పాకిస్తాన్ అంటే ప్రేమ కనిపిస్తోంది ►పాకిస్తాన్ చెప్పదే విపక్షాలు నమ్ముతున్నాయి ►కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ ఉగ్రదాడులు జరిగాయి ►కాంగ్రెస్ హయాంలో భారత్ పేదరికంలో మగ్గిపోయింది ►కాంగ్రెస్‌కు నిజాయితీ లేదు.. విజన్ లేదు ►2014 తర్వాత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలోభారత్ ఐదో స్థానానికి చేరింది ►LIC ప్రైవేటీకరణతో పేదల డబ్బులు పోతాయని ప్రచారం చేశారు ►ఈరోజు LIC ఎంతో పట్టిష్టంగా ఉంది ►భారత్ ఎదుగుదలను ప్రపంచం ప్రశంసిస్తోంది. ►రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానానికి చేరుకుంటాం ►భారత్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి ►చర్చ సమయంలో మీరు మాట్లాడిన ప్రతీ మాటా దేశం మొత్తం విన్నది ►ఎన్నో అసత్యాలు ప్రచారం చేశారు ►బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారు ►HALపై ఇష్టానుసారం మాట్లాడారు ►మన సంక్షేమ పధకాల్ని ఐఎంఎఫ్ ప్రశంసించింది ►జల జీవన్ మిషన్, స్వచ్చ భారత్, అభియాన్లు లక్షలాది మంది జీవితాల్ని నిలబెట్టాయి ►దేశ ప్రజల్ని ఇండియా కూటమి తప్పుదోవ పట్టిస్తోంది ►స్కామ్‌లు లేని ప్రభుత్వాన్ని దేశానికి ఇచ్చాం ►దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు విస్తరింపజేశాం ►దేశంలో ఎంత బలపడిందో చెప్పడానికి విదేశీ పెట్టుబడులే నిదర్శనం ►2018లో నో కాన్ఫిడెన్స్.. నో బాల్‌గానే మిగిలిపోయింది ►ఫీల్డింగ్ విపక్షాలు చేస్తుంటే.. సిక్స్‌లు, ఫోర్లు మావైపు వచ్చి పడ్డాయి PM Narendra Modi says, "Through their conduct, a few Opposition parties have proven that for them Party is above Nation. I think you don't care about the hunger of the poor but the hunger for power is on your mind." pic.twitter.com/bQ4mIiVfNe — ANI (@ANI) August 10, 2023 ►విపక్షాలకు అధికార దాహం పెరిగింది ►అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ►విపక్షాలకు పేదల భవిష్యత్ కంటే అధికారమే ముఖ్యమైపోయింది ►ఐదేళ్లు టైం ఇచ్చినా విపక్షాలు సిద్ధం కాలేదు ►అధీర్‌ను ఎందుకు మాట్లాడనివ్వలేదు.. కోల్‌కతా నుంచి ఫోన్ వచ్చిందేమో ►ఇది విపక్షాలకే పరీక్ష.. మాకు కాదు.. అవిశ్వాస తీర్మానం మాకు శుభపరిణామం ► అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు ధన్యవాదాలు. దేవుడే అవిశ్వాసం పెట్టాలని విపక్షాలకు చెప్పాడు. మూడు రోజులుగా చాలామంది మాట్లాడారు. 2018లో కూడా అవిశ్వాసం పెట్టారు. కానీ, విపక్షాలకు ఎంత మంది ఉన్నారో.. అన్ని ఓట్లు కూడా రాలేదు. 2024లో ఎన్డీయే కూటమి అన్ని రికార్డులు బద్ధలు కొడుతుంది. ► మా ప్రభుత్వంపై దేశ ప్రజలు పదే పదే విశ్వాసం చూపిస్తున్నారు. కోట్లాది దేశ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. ►ప్రారంభమైన ప్రధాని మోదీ ప్రసంగం PM Narendra Modi begins his speech on the no-confidence motion in Lok Sabha pic.twitter.com/IAJ79r4bjE — ANI (@ANI) August 10, 2023 ► మరికాసేపట్లో అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ► లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ జరుగుతోంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడారు.. తెలంగాణ ఉద్యమంలో 1,400 మంది చనిపోయారు. ఎంతో మంది బలిదానంతో తెలంగాణ ఏర్పడింది. అవినీతి కుటుంబ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది. సీఎం కొడుకు ఆస్తులు 400 రేట్లు పెరిగాయి. మోదీ హయాంలో శక్తివంతమైన భారత్ నిర్మాణానికి ప్రయత్నం జరుగుతోంది. అవిశ్వాసం ఎందుకు పెట్టారో వాళ్లకే తెలియదు. భరతమాత వైపు కన్నెత్తి చూస్తే కళ్లు పీకే హీరో మోదీ. కాంగ్రెస్ నేతలకే లిక్కర్‌తో సంబంధం. రాహుల్ గాంధీని చూస్తే గజిని గుర్తుకు వస్తున్నారు. ► కాంగ్రెస్‌ది అవినీతి దుకాణం. పేరు మార్చుకున్నా కూడా వాళ్ల దుకాణంలో దొరికే సరుకు మాత్రం అదే: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా #WATCH | Union Minister and BJP MP Jyotiraditya Scindia says, "...They are trying to build their launchpad by misusing the Manipur incident. What is happening in Manipur is highly condemnable, no Indian citizen can support this, it is condemnable for all...All the issues in the… pic.twitter.com/p6Ak3fcydk — ANI (@ANI) August 10, 2023 ► యూపీఏ హయాంలో ఈశాన్య రాష్ట్రాలను నిర్లక్ష్యంగా చేయబడిన ఏడుగురు సోదరీమణులుగా సింధియా అభివర్ణించారు. ► అవిశ్వాసంపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రసంగిస్తున్న టైంలో.. ఇండియా కూటమి ఎంపీలు వాకౌట్ చేశారు. ‘‘లోక్‌సభ నుంచి వాళ్లు బయటికి వెళ్లిపోయారు. కానీ, దేశ ప్రజలు ఎప్పుడో వాళ్లను సాగనంపారు’’ అని సింధియా సెటైర్ వేశారు. #WATCH | Opposition MPs walk out of Lok Sabha as Union Minister Jyotiraditya M. Scindia speaks on the no-confidence motion "The people of the country have shown them the exit door, now they are going out of the Lok Sabha as well, " says Union Minister Jyotiraditya M. Scindia pic.twitter.com/bLAI6VN9oQ — ANI (@ANI) August 10, 2023 ►ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభకు హాజరయ్యారు. ►ప్రధానిపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు అధిర్ రంజన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. ప్రధానికి ఆయన క్షమాపణలు చెప్పాలని అన్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు #WATCH | Parliamentary Affairs Minister Pralhad Joshi says "...Baseless allegation against the Prime Minister cannot be accepted. This should be expunged and he should apologise" https://t.co/F5sD2IW0Kj pic.twitter.com/NgKqfPtaNx — ANI (@ANI) August 10, 2023 ►కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలనే ఆలోచనే తమకు లేదని, కేవలం దీనిని ప్రవేశపెట్టేందుకు ప్రధాని మోదీనే కారణమని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.‘అవిశ్వాస తీర్మానానికి ఉన్న శక్తే నేడు పార్లమెంట్‌కు ప్రధానిని తీసుకొచ్చింది. ఈ అవిశ్వాస తీర్మానం గురించి మేమేమీ ఆలోచించలేదు. మేము కేవలం ప్రధాని పార్లమెంటుకు వచ్చి మణిపూర్ సమస్యపై మాట్లాడాలని మాత్రమే డిమాండ్ చేశాం. పార్లమెంట్‌కు రావాలని ఏ బీజేపీ సభ్యుడిని డిమాండ్ చేయలేదు. మా ప్రధాని రావాలని కోరుకున్నాం అంతే.’ అని వ్యాఖ్యానించారు. #WATCH | Congress MP Adhir Ranjan Chowdhury says "The power of no-confidence motion has brought the Prime Minister in the Parliament today. None of us were thinking about this no-confidence motion. We were only demanding that PM Modi should come to the Parliament and speak on the… pic.twitter.com/LdxWcAuYsr — ANI (@ANI) August 10, 2023 ► మీ (ప్రధాని మోదీ)పై భారతదేశం విశ్వాసం కోల్పోయింది. కొత్త పార్లమెంటు ఛాంబర్లో మత బోధకులకు గొప్ప ప్రజాస్వామ్య ప్రధానమంత్రి తలవంచి నమస్కరిస్తున్న దృశ్యం సిగ్గుతో మమ్మల్ని తలపిందేలా చేసింది. పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం, ఛాంపియన్ రెజ్లర్లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం మాలో అవమానాన్ని నింపింది. హర్యానాలోని 3 జిల్లాల్లో 50 పంచాయితీలు రాష్ట్రంలోకి ముస్లిం వ్యాపారులు రాకూడదని లేఖలు ఇవ్వడం సిగ్గుచేటు. :::టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా #WATCH | TMC MP Mahua Moitra says "India has lost confidence in you (PM Modi). The spectacle of the prime minister of the greatest democracy bowing to religious Seers of a majority in the chamber of the new Parliament fills us with shame, police manhandling and filing FIRs… pic.twitter.com/BBFMVIqExC — ANI (@ANI) August 10, 2023 ► విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభ రేపటికి వాయిదా. Rajya Sabha adjourned for the day to meet at 11 am on tomorrow. pic.twitter.com/DHsQ5OIDLf — ANI (@ANI) August 10, 2023 ► ఫార్మసీ బిల్లు(2023)కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆగష్టు 7వ తేదీన లోక్‌సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. Pharmacy (Amendment) Bill, 2023 moved in the Rajya Sabha for passage to amend the Pharmacy Act, 1948. Earlier, the Bill was passed by the Lok Sabha on August 7. pic.twitter.com/gPffPCoHiT — ANI (@ANI) August 10, 2023 ► స్కాలర్షిప్లు నిలిపివేయడం ద్వారా 1.80 లక్షల మంది ముస్లింలు ఉన్నత విద్యను పూర్తి చేయలేకపోయారని లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏఐఎంఐఎం నేత ఒవైసీ పేర్కొన్నారు. ► కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు చేరుకున్నారు. #WATCH | Congress leader Rahul Gandhi refuses to comment on parts of his Lok Sabha speech expunged. pic.twitter.com/gEEiNaMIBg — ANI (@ANI) August 10, 2023 ►అవిశ్వాస తీర్మానంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ విపక్ష ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ►ప్రతిచోట మహిళలు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. అది మణిపూర్, ఢిల్లీ, రాజస్థాన్ ఎక్కడైనా కావచ్చు. దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. దీనిపై రాజకీయాలు అవసరం లేదన్నారు. ‘అయితే సభ మొత్తానికి 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేయాలనుకుంటున్నాను. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత చీర లాగి కించపరిచారు. అక్కడ కూర్చున్న డీఎంకే సభ్యులు ఆమెను చూసి నవ్వారు. ఆ రోజు జయలలిత సీఎం అయితే తప్ప సభకు రానని ప్రమాణం చేశారు. రెండేళ్ల తర్వాత మళ్లీ తమిళనాడు సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. . #WATCH | FM says, "I agree that women suffering anywhere - Manipur, Delhi, Rajasthan - will have to be taken seriously. No politics played. But I want to remind this entire House of one incident which happened on 25th March 1989 in Tamil Nadu Assembly. Then she hadn't become CM… pic.twitter.com/DRUTV4qeIg — ANI (@ANI) August 10, 2023 ►తమ ప్రత్యక్ష నగదు బదిలీ(DBT) ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. యూపీఏ హాయంలో (2013-14) కేవలం 7,367 కోట్ల రూపాయలు లబ్దిదారులకు బదిలీ చేయగా... 2014-15 నాటికి డిబీటీ బదిలీలు 5 రెట్లు పెరిగాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లు చెప్పారు. ► గత యూపీఏ హయాంలో ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులు, పోర్టులు భవిష్యత్తులో నిర్మిస్తాం అనే మాటలు వినపడేవి. ప్రస్తుతం ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులు, పోర్టులు వచ్చేశాయి మాటలు వినిపిస్తున్నాయన్నారు. ►పేదరికాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో గరీబీ హఠావో' నినాదాలు ఉండేవని కానీ నేడు తతమ ప్రభుత్వ విధానాల వల్ల కేవలం 9 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుని ఆర్థికాభివృద్ధి సాధించిందన్నారు.కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదన్నారు. ►2014లో ప్రసూతి మరణాల రేటులో భారతదేశం 167వ స్థానంలో ఉండగా.. ఎన్డీయే హయాంలో 97వ స్థానంలో ఉన్నామని చెప్పారు. ►2022-23లో మన వాస్తవ జీడీపీ వృద్ధి 7.2 శాతంగా ఉందని, అదే 2023-24లో 6.5 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ అంచనాలను అనేక గ్లోబల్ ఏజెన్సీలు అందించాయని, అలాగే RBI ప్రొజెక్షన్ కూడా ఇదేనని తెలిపారు. పరివర్తన అనేది చర్యల వల్ల వస్తుందని చెప్పే మాటల వల్ల కాదని పరోక్షంగా గత యూపీఏ ప్రభుత్వాన్ని ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించారు. వారు ప్రజలను కలల్లో విహరిస్తే మేము వారి కలలను సాకారం చేసి చూపిస్తున్నామని తెలిపారు ►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నివేదికను లోక్‌సభలో సమర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం, నెమ్మదింపు వంటి సవాళ్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పోరాడుతోందని ఆమె పేర్కొన్నారు. ►ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, బలమైన ఆర్థిక వ్యవస్థలూ ఇబ్బందులుపడుతున్నాయన్నారు.భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం పురోగమిస్తుందని అని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో అన్నారు. దేశ భవిష్యత్తు వృద్ధి ఆశాజనకంగా సానుకూలంగా ఉందన్నారు. ► లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై మూడో రోజు చర్చ ప్రారంభమైంది. ►సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటారని పీఎంఓ కార్యాలయం ట్వీట్ చేసింది. ► మణిపూర్ పరిస్థితిపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, ఆప్ ఎంపీ సందీప్ పాఠక్, కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్, ఆప్ ఎంపీ సుశీల్ గుప్తా మణిపూర్ పరిస్థితిపై చర్చించేందుకు రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు. ►రాజ్యసభ 2 గంటలకు వాయిదా పడింది. ►పార్లమెంట్‌కు వచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సమస్య ఏంటని రాజ్యసభలో ఏఐసీసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. మోదీ ఏం దేవుడు కాదని వ్యాఖ్యానించారు. #WATCH | Rajya Sabha LoP Mallikarjun Kharge says, "...Pradhan Mantri ke aane se kya hone wala hai, kya parmatma hai kya woh? Yeh koi bhagwan nahi hai" (Source: Sansad TV) pic.twitter.com/YvzSbpura1 — The Times Of India (@timesofindia) August 10, 2023 ► పార్లమెంట్లో అవలంభించాల్సిన ప్రభుత్వ వ్యూహాలను చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్వాల్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ►ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ఎంపీ రాఘవ్ చద్దా గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. అయిదుగురు ఎంపీల ఫోర్జరీ సంతకాలు తీసుకొని వారి పేర్లను సెలెక్ట్ కమిటీకి పంపిన పేపర్‌ను చూపించాలని బీజేపీకి సవాల్ విసిరారు. ► ఢిల్లీ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని రాఘవ్ చద్దా రాజ్యసభలో ప్రవేశ పెట్టిన తీర్మానంపై తమ సంతాకాలను ఫోర్జరీ చేశారని అయిదుగురు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనుమంతి లేకుండా తమ పేర్లను ప్రస్తవించారని ఆరోపించారు. దీనిపై ఆప్ ఎంపీకి పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఐదుగురు సభ్యులు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. #Watch | On the allegation of MPs claiming that their names were mentioned on the proposal moved by #AAP MP #RaghavChadha to send the Delhi NCT Amendment Bill to the Select Committee without their consent, AAP MP Raghav Chadha says "The rule book says that any MP can propose the… pic.twitter.com/5ZCUYv39KZ — The Times Of India (@timesofindia) August 10, 2023 చైనాతో సరిహద్దు పరిస్థితిపై చర్చించాలి ►చైనాతో సరిహద్దు పరిస్థితులపై చర్చించాలంటూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ గురువారం లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈమేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు మనీష్ తివారీ లేక రాశారు..తక్షణ ప్రాముఖ్యత కలిగిన ఒక నిర్దిష్ట అంశాన్ని చర్చించే ఉద్దేశ్యంతో వాయిదా తీర్మానాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా సరిహద్దులో పరిస్థితిని సభకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ►కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఫార్మసీ (సవరణ) బిల్లు 2023ని రాజ్యసభలో నేడు ప్రవేశపెట్టనున్నారు. ఫార్మసీ చట్టం1948ను సవరిస్తూ తెచ్చిన ఈ బిల్లును ఆగస్టు 7న లోక్‌సభ ఆమోదించింది. ►విపక్ష కూటమిని లక్ష్యంగా చేసుకుని హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ గురువారం కౌంటర్ అటాక్‌కు దిగారు. భారత కూటమిపై తీవ్ర ఆరోపణలు చేసే బదులు మణిపూర్, హర్యానా వంటి రాష్ట్రాల్లోని హింస, అల్లర్లు, పాలనపై దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చతో పార్లమెంట్ సమావేశాలు హీటెక్కాయి. రెండు రోజులు జరిగిన చర్చల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగారు. బుధవారం ప్రధాని మోదీ టార్గెట్‌గా రాహుల్ గాంధీ చెలరేగిపోగా దీనికి కౌంటర్‌గా కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, అమిత్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మొత్తంగా మణిపూర్ మంటలతో లోక్‌సభ అట్టుడుకుతోంది. మోదీ ఏం మాట్లాడనున్నారు అవిశ్వాస తీర్మానంపై చివరిరోజైనా నేడు (గురువారం) కూడా చర్చ జరగనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు దీనిపై మాట్లాడనున్నారు. అవిశ్వాస తీర్మానంపై సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. అయితే మణిపూర్ హింసపై మోదీ మాట్లాడాలని పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో అందరి దృష్టి ప్రధానిపైనే ఉంది. మణిపూర్, అవిశ్వాసంపై మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారనేది ఉత్కంఠగా మారింది. చదవండి: Manipur Violence: మాటల తూటాలు.. బలాబలగాలు ఇక మోదీ రిప్లై తరువాత ఈ తీర్మానంపై సభలో ఓటింగ్ ఉంటుంది. బీజేపీ- ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉండటం వల్ల ఈ తీర్మానం వీగిపోవడానికి అధికావకాశాలు ఉన్నాయి. లోక్‌సభలో మెజారిటీ మార్కు 272. లోక్‌సభలో ఎన్డీయే కూటమి 331 ఎంపీల బలం ఉంది. బీజేపీకి సొంతంగానే 301 మంది ఎంపీలు ఉన్నారు. విపక్షాల ఇండియా కూటమి బలం 144, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేడీకి కలిపి 70 మంది ఎంపీల బలం ఉంది. లోక్‌సభలో అయిదు స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఇక ఎన్డీయే కూటమికి అనుకూలంగా 273 మంది ఎంపీల మద్దతు తెలిపితే.. అవిశ్వాస తీర్మానం ఈజీగా వీగిపోతుంది. చదవండి: భరతమాతను హత్యచేశారంటే.. బల్లలు చరుస్తారా ? -
భరతమాతను హత్యచేశారంటే.. బల్లలు చరుస్తారా ?
న్యూఢిల్లీ: మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వంపై విపక్షాలు చేసిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా రాహుల్‌కు ఘాటుగా స్మృతి తన స్పందన తెలిపారు. ‘ సభలో ఆయన ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా. భరతమాత హత్యకు గురైందంటూ సభలోనే వ్యాఖ్యలు చేయడం పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారి. ఆయన ఇలాంటి తీవ్రవ్యాఖ్యలు చేస్తుంటే తోటి కాంగ్రెస్ సభ్యులు చప్పట్లు కొడుతూ, బల్లలు చరుస్తారా ?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ నా ముందే ప్రసంగం చేశారు. ముందు వరసలో మహిళా సభ్యులు ఉండగా ఆయన(రాహుల్) గాలిలో ముద్దులు విసిరారు. ఇలాంటి అసభ్య సైగలు గతంలో మరెవరూ చేయలేదు. ఈ (గాంధీ)కుటుంబం సంస్కృతి ఇప్పుడు దేశం మొత్తానికి తెలిసొచ్చింది’ అని వ్యాఖ్యానించారు. స్మృతి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా కొందరు మహిళా బీజేపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ ఫ్లయింగ్ కిస్‌పై ఫిర్యాదుచేశారు. కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఆర్టికల్ రద్దు వల్లే అది సాధ్యమైంది ‘విపక్ష కూటమి పార్టీ నేత ఒకరు తమిళనాడులో.. భారత్ అంటే ఉత్తరభారతమే అని వివాదాస్పద వ్యాఖ్యచేశారు. దమ్ముంటే ఈ అంశంపై రాహుల్ మాట్లాడారు. మరో నేత కశ్మీర్‌పై రెఫరెండం కోరతారు. ఇలాంటి ప్రకటనలు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో వస్తున్నాయా ?. మీ కూటమి ‘ఇండియా’ కాదు. భారత్‌లో అవినీతిని పెంచారు’ అని ఆవేశంగా మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్లో కొనసాగడంపై స్మృతి ఎద్దేవా చేశారు. ‘ రక్తంతో తడిసిన కశ్మీర్ లోయ అది. యాత్ర పేరుతో అక్కడికెళ్లి స్నో బాల్స్‌తో ఆడుకున్నారు. ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ రద్దుచేయడం వల్లే అక్కడ అల్లర్లు తగ్గి నెలకొన్న ప్రశాంతత కారణంగా మీరు ఆ పని చేయగలిగారు. ఆ ఆర్టికల్‌ను మళ్లీ తెస్తామని అక్కడి వారికి రాహుల్ హామీ ఇచ్చి వచ్చారు. కానీ అది ఎన్నటికీ సాధ్యపడదు. ఆర్టికల్ పునరుద్ధరణ ఉండదు’ అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలనలో అత్యయక స్థితిని స్మృతి గుర్తుచేశారు. ‘ మీ పాలనా చరిత్ర అంతా రక్తసిక్తం. 1984 సిక్కుల వ్యతిరేక అల్లర్లు, కశ్మీర్లో అశాంతి..’ అని వ్యాఖ్యానించారు. -
నిండు సభలో.. మహిళా మంత్రికి ముద్దులా?
న్యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్ల్లయింగ్ కిస్‌లు బుధవారం పెను వివాదానికి దారి తీశాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతుండగా అధికార సభ్యుల కేసి ఆయన ముద్దులు విసిరారు. రాహుల్‌కి ఉన్న మహిళా విద్వేషానికి ఇది నిదర్శనమని బీజేపీ దుమ్మెత్తిపోయగా, అధికార పార్టీ రాహుల్ ఫోబియాతో బాధ పడుతోందంటూ కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది. రాహుల్‌పై అత్యంత కఠిన చర్య తీసుకోవాలంటూ బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ బిర్లాకు ఫిర్యాదుచేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాహుల్ తీరును తూర్పారబట్టారు. మొత్తంమ్మీద అనర్హత వేటు తర్వాత సభలో అడుగుపెట్టిన తర్వాత రాహుల్‌గాంధీ చేసిన సైగలతో రేగిన దుమారం కొద్దిరోజులపాటు పార్లమెంట్‌ను కుదిపేసేలా కనిపిస్తోంది. సభలోనే కన్ను కొట్టిన చరిత్ర రాహుల్‌ది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి లోక్‌సభలో రాహుల్ అసభ్యకర సైగలు చేశారంటూ స్పీకర్‌కు బీజేపీ లిఖితపూర్వక ఫిర్యాదుచేసింది. మంత్రులు శోభా కరంద్లాజే, దర్శన జర్దో‹Ùతోపాటు 20 మందికిపైగా బీజేపీ మహిళా ఎంపీలు దానిపై సంతకం చేశారు. ‘ రాహుల్ చేసిన దిగజారుడు పని సభలోని మహిళా సభ్యులను తీవ్రంగా అవమానించింది. అంతేకాదు, లోక్‌సభలో గౌరవానికి కూడా భంగం కలిగింది. అందుకే ఆయనపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుమ్మెత్తిపోశారు. ఒక సభ్యుడు నిండు సభలో ఇంత బాహాటంగా స్త్రీ విద్వేషం ప్రదర్శించిన ఉదంతం పార్లమెంట్ చరిత్రలోనే ఎన్నడూ లేదని మహిళా బీజేపీ ఎంపీ అన్నారు. గాంధీ కుటుంబీకులు పాటించే విలువలకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇలాంటి దిగజారుడు ప్రవర్తనకుగాను రాహుల్‌కు తగిన శిక్ష పడి తీరాలని డిమాండ్ చేశారు. ఇరానీ ప్రసంగం వినాల్సిందిగా బీజేపీ సభ్యులు కోరినందుకు రాహుల్ వారివైపు రెండు మూడు అడుగులు వేసి మరీ ఫ్లైయింగ్ కిస్సులు విసిరారని శోభా కరంద్లాజే ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీలు చూసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనూ లోక్‌సభలో కన్ను కొట్టిన చరిత్ర రాహుల్‌కు ఉందని ఎంపీలు గుర్తుచేశారు. ఆయన ప్రవర్తనలోనే ఏదో లోపముందని అభిప్రాయపడ్డారు. మణిపూర్‌పై చర్చ తప్పించుకునేందుకే: కాంగ్రెస్ లోక్‌సభలో రాహుల్ ఫ్ల్లయింగ్ కిస్సులను కాంగ్రెస్ గట్టిగా సమరి్థంచుకుంది. ఆయన మహిళలను ఎప్పటికీ అగౌరవపరచజాలరని పార్టీ స్పష్టంచేసింది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో చర్చ జరగడం అధికార పారీ్టకి అస్సలు ఇష్టం లేదంటూ ఎదురుదాడికి దిగింది. అందుకే రాహుల్‌పై ఇలా తప్పుడు ఆరోపణలకు బరితెగించిందని ఆరోపించింది. బీజేపీకి, స్మృతి ఇరానీకి రాహుల్ ఫోబియా పట్టుకుందని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ముద్దులు.. ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనమని ఆయన చేసిన భారత్ జోడో యాత్రను చూసిన వారందరికీ తెలుసు అని కాంగ్రెస్ పారీ్టప్ర«దాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గుర్తుచేశారు. రాహుల్ చర్య ఆప్యాయత చిహ్నమేనని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది వ్యాఖ్యానించారు. ‘అప్పట్లో రాహుల్ ప్రేమ దుకాణం అన్నారు. ఇదీ అలాంటి సదుద్దేశంతో కూడిన సైగ మాత్రమే’ అని స్పష్టంచేశారు. -
Manipur Violence: మాటల తూటాలు.. అట్టుడికిన లోక్‌సభ
►మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు లోక్‌సభలో పెను దుమారం సృష్టించాయి. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత తొలిసారిగా సభలో మాట్లాడిన ఆయన ఘాటు వ్యాఖ్యలతో బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రెండోరోజు బుధవారం కూడా కొనసాగింది. అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగాయి. ►మణిపూర్‌లో హింసాకాండను అరికట్టడంలో నరేంద్ర మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని రాహుల్ నిప్పులు చెరిగారు. మణిపూర్ ప్రజలను హత్య చేయడం ద్వారా భారతదేశాన్ని హత్యచేశారని, అందుకే ప్రధాని అక్కడికి వెళ్లడం లేదని విమర్శించారు. బీజేపీ నాయకులు దేశ భక్తులు కాదు, ముమ్మాటికీ దేశ ద్రోహులేనని మండిపడ్డారు. విపక్షాల ఆరోపణలను లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. ►మణిపూర్ అంశాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటని విపక్షాలపై ధ్వజమెత్తారు. అగి్నకి ఆజ్యం పోయవద్దని సూచించారు. పొరుగు దేశం మయన్మార్ నుంచి కుకీ తెగ గిరిజనులు మణిపూర్‌కు వలస రావడం వల్లే అక్కడ సమస్య మొదలైందని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో ఘర్షణలు తగ్గు ముఖం పట్టాయని వెల్లడించారు. హింసకు ఇక స్వస్తి పలికి శాంతియుతంగా కలిసిమెలసి ఉండాలని మణిపూర్ తెగలకు ఆయన విజ్ఞప్తి చేశా రు. మణిపూర్‌లో శాంతిని కోరుకుంటూ అమిత్ షా ప్రతిపాదించిన తీర్మానాన్ని లోక్‌సభలో ఆమోదించారు. రాజకీయం చేయడం సిగ్గుచేటు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం న్యూఢిల్లీ: మణిపూర్ అంశంలో ప్రతిపక్షాల వైఖరిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ వ్యవహారాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బుధవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. విపక్ష నేత రాహుల్ గాంధీ తీరును తప్పుపట్టారు. మణిపూర్‌లో ముఖ్యమంత్రిని మార్చడం గానీ, రాష్ట్రపతి పాలన గానీ అవసరం లేదని తేలి్చచెప్పారు. మణిపూర్‌లో శాంతిని కాంక్షిస్తూ అమిత్ షా ప్రతిపాదించిన తీర్మానాన్ని లోక్‌సభలో ఆమోదించారు. సభలో అమిత్ షా ప్రసంగం ఆయన మాటల్లోనే... రాహుల్ 13సార్లు విఫలం ‘‘మణిపూర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెద్ద డ్రామా నడిపించారు. ఆయన పర్యటనకు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. వాటిని తిరస్కరించారు. చురాచాంద్పూర్కు హెలికాప్టర్లో వెళ్లాలని కోరితే రోడ్డు మార్గంలో వెళ్తానన్నారు. మొదటిరోజు సత్యాగ్రహం చేశారు. రెండోరోజు హెలికాప్టర్లో వెళ్లారు. 13 సార్లు రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాయకుడు(రాహుల్ గాం«దీ) ఈ సభలో ఉన్నారు. ఆయన 13 సార్లు విఫలమయ్యారు. మహారాష్ట్రలోని విదర్భలో కళావతి అనే పేద మహిళతో కలిసి రాహుల్ భోజనం చేశారు. ఆమె అనుభవిస్తున్న కష్టాలను ఈ సభలో ప్రస్తావించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే ఆరేళ్లు అధికారంలో ఉంది. కానీ, కళావతి పేదరికాన్ని పోగొట్టడం కోసం రాహుల్ చేసిందేమీ లేదు. మోదీ ప్రభుత్వమే కళావతికి ఇళ్లు, కరెంటు, గ్యాస్ సౌకర్యాలు కలి్పంచింది. రేషన్ సరుకులు ఇస్తోంది. మోదీ సర్కారు ఎన్నో ఘనతలు సాధించింది ప్రధాని మోదీ గత తొమ్మిదేళ్లలో 50 సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆయన శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో మణిపూర్‌లో ఎన్నోసార్లు హింసాత్మక సంఘటనలు జరిగాయి. అప్పట్లో హోంమంత్రి మణిపూర్‌లో పర్యటించలేదు. కానీ, నేను ఆ రాష్ట్రంలో 23 రోజులపాటు పర్యటించా. ఈశాన్యంలో గత తొమ్మిదేళ్లలో 8 వేల మంది సాయుధ తీవ్రవాదులు లొంగిపోయారు. దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది. ఎన్నో ఘనతలు సాధించింది. ఆ వీడియో వెనుక ఆంతర్యం ఏమిటి? ‘‘మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న జరిగింది. ఈ వీడియో జూలై 19న బయటికొచి్చంది. వీడియోను సోషల్ మీడియాలో పెట్టే బదులు రాష్ట్ర డీజీపీకి అందజేస్తే బాగుండేది. తద్వారా నేరçస్తులను వెంటనే గుర్తించి, అరెస్టు చేసేందుకు వీలుండేది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు ఈ వీడియోను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారు. దాని వెనుక ఆంతర్యం ఏమిటి? వీడియో బయటపడిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసింది. అందువల్లే అసలు సమస్య మయన్మార్‌లో 2021లో అక్కడి సైనిక ప్రభుత్వం మిలిటెంట్లపై కఠిన చర్యలు ప్రారంభించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడున్న కుకీలు మన దేశంలోని మణిపూర్‌కు వలసవచ్చారు. మణిపూర్ లోయలోని అడవుల్లో వారు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అందువల్ల ఇక్కడ సమస్య మొదలైంది. వలసవచి్చన కుకీల స్థావరాలను గ్రామాలుగా అధికారికంగా ప్రకటిస్తున్నారని వదంతులు రావడంతో అశాంతి ప్రారంభమైంది. మైతేయిలను ఎస్టీల్లో చేర్చే ప్రక్రియ ప్రారంభించాలని మణిపూర్ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో సమస్య ఇంకా ముదిరింది. మణిపూర్‌లో ఘర్షణల నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. హింసను చాలావరకు అరికట్టాం. కాంగ్రెస్‌కు అవినీతి పనులు అలవాటే ప్రభుత్వాలను కాపాడుకోవడానికి అవినీతికి పాల్పడిన ఘన చరిత్ర కాంగ్రెస్‌దే. విపక్ష కూటమి అసలు రూపం ప్రజలకు తెలుసు. 1999లో అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి వాజ్‌పేయి తప్పుడు మార్గాలు ఎంచుకోలేదు. మౌనంగా పదవి నుంచి దిగిపోయారు. ముడుపులు ఇచ్చి ప్రభుత్వాలను కాపాడుకోవడం కాంగ్రెస్‌కు అలవాటే. 1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని అలాగే రక్షించుకున్నారు. 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా అదేవిధంగా సంక్షోభం నుంచి గట్టెక్కింది. కాంగ్రెస్ పార్టీ అసలు రంగు ఇదే. బీజేపీ ఎప్పటికీ విలువలకు కట్టుబడి ఉంటుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలకు విశ్వాసం లేకపోవచ్చు గానీ ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పొందిన నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమే. ఆయన రెండు సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఇలా జరగడం 30 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అవినీతి.. క్విట్ ఇండియా, వారసత్వ రాజకీయాలు.. క్విట్ ఇండియా, బుజ్జగింపు రాజకీయాలు.. క్విట్ ఇండియా అని మేము నినదిస్తున్నాం. చేతులు జోడించి ప్రార్థిస్తున్నా.. చేతులు జోడించి ప్రారి్థస్తున్నా. హింసకు ఇక స్వస్తి పలికి శాంతియుతంగా కలిసిమెలసి ఉండాలని మణిపూర్ తెగలను కోరుతున్నా. సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో చర్చలు జరపడానికి కుకీలు, మైతేయిలు ముందుకు రావాలి. మణిపూర్ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు. అరాచకాలను ఎవరూ సమరి్థంచరు. మణిపూర్‌లో జరిగిన ఘటనలు సిగ్గుచేటు. వాటిని రాజకీయం చేయడం సిగ్గుచేటు. మణిపూర్‌లో అగి్నకి ఆజ్యం పోయవద్దని ప్రతిపక్షాలను కోరుతున్నా. మణిపూర్‌లో జరిగిన ఘర్షణల్లో మే 3వ తేదీ నుంచి ఇప్పటిదాక 152 మంది మరణించారు. 14,898 మంది నిందితులు అరెస్టయ్యారు. 1,106 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరణాలు తగ్గుతున్నాయి. మే నెలలో 107 మంది, జూన్‌లో 30 మంది, జూలైలో 15 మంది మరణించారు. మణిపూర్ ముఖ్యమంత్రిని తొలగించే అవకాశం లేదు. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించే విషయంలో సీఎం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారు. అక్కడ రాష్ట్రపతి పాలన అవసరం లేదు’’ అని అమిత్ వివరించారు. -
మరో వివాదంలో రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ లోక్‌సభలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడి వెళ్లిపోయే క్రమంలో రాహుల్ ఆ పని చేశారని స్మృతి ఇరానీ ఆరోపించారు. కేవలం స్త్రీద్వేషి మాత్రమే ఇలా తమ స్థానాల్లో కూర్చున్న మహిళా ఎంపీలను చూసి ఫ్లయింగ్ కిస్ ఇస్తారేమో అంటూ రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారామె. తన చేష్టల ద్వారా ఆయన అగౌరవంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. In this video MP Rahul Gandhi can be showing blowing 'Flying Kiss'. pic.twitter.com/5XnHWHQwkD — Facts (@BefittingFacts) August 9, 2023 ఇదిలా ఉంటే రాహుల్ ఫ్లయింగ్ కిస్ వ్యవహారంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ మహిళా ఎంపీలు, మంత్రులు. దీంతో అధికారులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ, మోదీ సర్కార్‌పై విరుచుకుపడగా.. కౌంటర్‌గా స్మృతి ఇరానీ ఆవేశపూరితంగా ప్రసంగించారు. బీజేపీది అనవసర రాద్ధాంతం ఇదిలా ఉంటే రాహుల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు వీడియోలో ఉందని కాంగ్రెస్ ఎంపీలు చెబుతున్నారు. ఈ మేరకు స్పీకర్‌ను కలిసి బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: మరోసారి క్విట్ ఇండియా చేపట్టాలి: స్మృతి ఇరానీ -
లోక్‌సభలో రాహుల్ ఘాటు ప్రసంగం.. ప్రధాని టార్గెట్‌గా విమర్శలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో రెండో రోజు అవిశ్వాస తీర్మానంపై వాడీవేడీ చర్చ జరుగుతోంది. మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ప్రధాని దృష్టిలో మణిపూర్ మన దేశంలో లేదని అన్నారు. మణిపూర్‌లో భారత మాతను చంపేశారని, మీరు దేశ భక్తులు కాదు.. దేశ ద్రోహులని రాహుల్ ధ్వజమెత్తారు. మీరు మణిపూర్ ప్రజల మనసులను గాయపరిచారని, ఈశాన్య రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించారని మండిపడ్డారు. కాగా లోక్‌సభలో చర్చ ప్రారంభం కాగానే రాహుల్ ప్రసంగిస్తూ.. అదానీ గురించి మరోసారి ప్రస్తావించారు. నేడు అదానీ గురించి మాట్లాడనని, మీరు భయపడాల్సిన పనిలేదని బీజేపీపై సెటైర్లు వేశారు. గతంలో అదానీ గురించి మాట్లాడినప్పుడు ఓ పెద్ద నేతకు ఇబ్బంది అనిపించిందేమోన్నారు. తనది రాజకీయ ప్రసంగం కాదని, మణిపూర్ గురించి మాట్లాడతానని తెలిపారు. బీజేపీ నేతలు రిలాక్స్ అవ్వొచ్చు.. ఒకటి రెండు తూటాలు పేలుతాయి.. కానీ భయం వద్దు అంటూ చురకలంటించారు. చదవండి: లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ.. సభ నుంచి వెళ్లిపోయిన రాహుల్ #WATCH | Congress MP Rahul Gandhi says, "Bharat ek awaaz hai, Bharat hamari janta ki awaaz hai, dil ki awaaz hai. Uss awaaz ki hatya aapne Manipur mein ki. Iska matlab Bharat Mata ki hatya aapne Manipur mein ki...You killed India by killing the people of Manipur. You are a… pic.twitter.com/eroj209SKY — ANI (@ANI) August 9, 2023 కన్యాకుమారినుంచి కశ్మీర్ వరకు యాత్ర చేపట్టానన్న రాహుల్.. పాదయాత్రలో ఎన్నో నేర్చుకున్నానని చెప్పారు. లక్షల మందితో తనతో కలిసి రావడంతో ధైర్యమొచ్చిందని, జోడో యాత్రలో ప్రజల సమస్యలను దగ్గరుండి చూశానని తెలిపారు. తన యాత్ర ఇంకా ముగియలేదు.. లద్ధాఖ్ వరకు వెళ్తానని చెప్పారు. యాత్రకు ముందు నాకు అహంకారం ఉండేదని.. యాత్ర తన అహంకారాన్ని అణచివేసిందన్నారు. #WATCH | Congress MP Rahul Gandhi says, "They killed India in Manipur. Not just Manipur but they killed India. Their politics has not killed Manipur, but it has killed India in Manipur. They have murdered India in Manipur." pic.twitter.com/u0ROyHpNRL — ANI (@ANI) August 9, 2023 మణిపూర్ సహాయ శిబిరాల్లో బాధితులను కలిశానన్నారు రాహుల్. మహిళలు, పిల్లలతో మాట్లాడా.. వారి బాధను విన్నాని పేర్కొన్నారు. తల్లి కళ్లముందే కొడుకును కాల్చి చంపారని, ఆ తల్లి బాధను కళ్లారా చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఈ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చదవండి: శరద్ పవార్ అందుకే ప్రధాని కాలేకపోయారు: మోదీ సంచలన వ్యాఖ్యలు #WATCH | Congress MP Rahul Gandhi speaks on his Bharat Jodo Yatra; says, "...Initially, when I started (the Yatra), I had in my mind that walking 25 km is no big deal if I can run 10 km every day. Today, when I look at that - it was arrogance. I had arrogance in my heart at that… pic.twitter.com/QhFjtkZhLb — ANI (@ANI) August 9, 2023 ప్రధాని మోదీని రాహుల్ రావణుడితో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ అమిత్ షా, అదానీ మాటలే వింటారని అన్నారు. రావణుడు ఇద్దరి మాటలే(మేఘనాథుడు, కుంభకర్ణుడు) వింటాడని..మోదీ కూడా ఇద్దరి మాటలే వింటాడని వ్యాఖ్యానించారు. రావణుడి అహంకారమే నాడు లంకను కాల్చేసిందని అన్నారు. #WATCH | Congress MP Rahul Gandhi says, "A few days back, I went to Manipur. Our PM didn't go, not even to this day, because for him Manipur is not India. I used the word 'Manipur' but the truth is that Manipur does not remain anymore. You have divided Manipur into two. You have… pic.twitter.com/QodCZnLHWs — ANI (@ANI) August 9, 2023 రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్న అధికార పక్షం అడ్డుపడింది. ఒక దశంలో రాహుల్ ప్రసంగానికి స్పీకర్ సైతం అడ్డుపడి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం ఎంపీలు డిమాండ్ చేశారు. ఇరుపక్షాల మాటలతో లోక్‌సభ దద్దరిల్లుతోంది. స్పీకర్ కల్పించుకొని ఇరుపార్టీల సభ్యులను వారిస్తున్నా మాటల యుద్ధం ఆగడం లేదు. ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన రాహుల్ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అటు నుంచి ఆయన రాజస్థాన్ వెళ్లనున్నారు. బన్స్వారా జిల్లాలోని మాన్‌గర్ ధామ్‌లో ఆదివాసీల ర్యాలీలో పాల్గొననున్నారు -
అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ
-
‘మణిపూర్ ఘటనలు సిగ్గుచేటని అంగీకరిస్తున్నాం’
Live Updates: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. అవిశ్వాసంపై ఇవాళ రెండోరోజు కూడా వాడీవేడీ చర్చ సాగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన అనంతరం.. లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా ప్రసంగం మణిపూర్ అంశంపై అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భగా.. కేంద్రం తరపున హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించారు. అవిశ్వాసం ఒక రాజ్యాంగ ప్రక్రియ.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా అవిశ్వాసంతో కూటముల బలమెంతో తెలుస్తుంది కూడా. ప్రజలకు అంతా తెలుసు. వాళ్లు అంతా చూస్తున్నారు. ప్రజలకు మాపై పూర్తి విశ్వాసం ఉంది. ► ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపుల వైరల్ వీడియో గురించీ ప్రస్తావించారు అమిత్ షా. ‘‘ఆ వీడియోను పోలీసులకు ఇచ్చి ఉండాల్సింది. పార్లమెంట్ సమావేశాలకు ముందే వీడియో రిలీజ్ అయ్యింది’’ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మణిపూర్‌ను రాజకీయం చేశారు. నేను స్వయంగా మూడు రోజులపాటు మణిపూర్ వెళ్లాను. అల్లర్ల ప్రాంతాల్ని సందర్శించిన మొదటి వ్యక్తిని నేనేనే. మా సహాయ మంత్రి కూడా 23 రోజులపాటు పర్యటించారు. మెయితీ, కుకీ వర్గాలతో చర్చిస్తున్నాం. త్వరలోనే మణిపూర్ పరిస్థితులను అదుపులోకి తెస్తాం. ► మణిపూర్‌పై మేమేమీ మౌనవ్రతం చేయడం లేదు. మణిపూర్ అల్లర్లలో ఇప్పటివరకు 152 మంది చనిపోయారు. వీరిలో మే నెలలోనే 107 మంది చనిపోయారు. మణిపూర్ సీఎంను మార్చాల్సిన అవసరం లేదు. మణిపూర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోయకండి. ► మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు బాధాకరం. మణిపూర్‌లో ఘటనలు సిగ్గు చేటని మేమూ అంగీకరిస్తున్నాం. కానీ, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. మణిపూర్ అంశంపై కేంద్రం చర్చకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని మొదటి రోజు నుంచే చెబుతున్నాం. స్పీకర్‌కు లేఖ కూడా రాశాం. కానీ, కేంద్రం అంగీకరించడం లేదని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మణిపూర్ చర్చకు విపక్షాలే సిద్ధంగా లేవు. చర్చ నుంచి పారిపోతున్నాయి ఆ పార్టీలు. ► గత ఆరున్నరేళ్లుగా మణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ ఆరున్నరేళ్లలో ఏనాడూ మణిపూర్‌లో కర్ఫ్యూ విధించలేదు. మే వరకు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మణిపూర్ హింసకు కారణం అయ్యాయి. మెయితీలను గిరిజనులుగా ప్రకటించాకే.. ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించడంతోనే హింస ప్రజ్వరిల్లింది. మే 3వ తేదీన మొదలైన మణిపూర్ హింస నేటికీ కొనసాగుతున్నాయి. మణిపూర్ ఇష్యూలో దాచడానికి ఏం లేదు. ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోం. ► ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ము కశ్మీర్లో ద్వంద్వ ప్రమాణాలను తొలగించాం. అది తొలగిస్తే కశ్మీర్ అల్లకల్లోలం అవుతుందని విపక్షాలు భయపెట్టాయి. మేం మాత్రం.. సర్జికల్ స్ట్రయిక్స్‌తో ఉగ్రవాదాన్ని రూపుమాపే యత్నం చేశాం. పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని స్పష్టం చేశాం. ► కాంగ్రెస్‌ది కరప్షన్ క్యారెక్టర్. బీజేపీ విలువల కోసం సిద్ధాంతాల కోసం పోరాడే పార్టీ. ► వచ్చే ఐదేళ్లలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌తిరుగులేని శక్తిగా మారుతుంది. ► మేకిన్ ఇండియా కాన్సెప్ట్‌ను రాహుల్, అఖిలేష్ తప్పుబట్టారు. ► ఒక ఎంపీ 13సార్లు రీలాంచ్ అయ్యాడు. ఆ ఎంపీ 13సార్లూ ఫెయిల్ అయ్యాడు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా షా సెటైర్లు వేశారు. ► మీరు చాలా చెప్పారు. కానీ, ఏదీ చెయ్యలేదు. మేం చేసి చూపించాం అంటూ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. ► యూపీఏ రూ.70 వేల కోట్ల రుణమాఫీ తాయిళాలు ఇచ్చింది. మేం తాయిళాలను పంచడం లేదు. రుణమాఫీలపై మాకు నమ్మకం లేదు. ఎవరూ లోన్ తీసుకోకూడదన్నదే మా ఉద్దేశం. మేం మాత్రం సాగుకు ఇబ్బంది పడకుండా రైతులకు సాయం మాత్రం అందిస్తున్నాం. రుణమాఫీ కాదు.. రుణభారం లేకుండా చేశాం. జన్‌ధన్ యోజన తెచ్చినప్పుడు ఎగతాళి చేశారు. డీబీటీ ద్వారా జన్ ధన్ యోజనలో నగదు జమ అవుతోంది. ► ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ఇంకా ఉందంటూ విపక్షాలకు అమిత్ షా చురకలంటించారు. ► నాడు పీవీ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు నెగ్గారు. కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు జైలుకు వెళ్లారు. గతంలో డబ్బులిచ్చి అవిశ్వాసం గెలిచారనే ఆరోపణ కాంగ్రెస్‌పై ఉంది. కానీ, మేం అలా కాదు. కాంగ్రెస్‌లా జిమ్మిక్కు చేయలేదు. వాజ్‌పేయి సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు నిజాయితీగా వ్యవహరించాం. ఫలితంగానే ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయింది. ► మోదీ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి. ఈ ప్రభుత్వం మైనార్టీలో లేదు. సంపూర్ణ మెజార్టీతో ఉంది. ప్రజలకు మోదీ సర్కార్‌పై సంపూర్ణ విశ్వాసం ఉంది. ► ఆగష్టు 9వ తేదీన నాడు గాంధీ క్విట్ఇండియా పిలుపు ఇచ్చారు. ఇండియా కూటమికి కౌంటర్‌గా మోదీ కూడా ఇప్పుడు క్విట్ ఇండియా పిలుపు ఇస్తున్నారు. అమిత్ షా పిలుపునకు బీజేపీ ఎంపీల స్పందనతో క్విట్ ఇండియా నినాదాలతో మారమోగిన లోక్‌సభ అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రసంగం ► రోజులో 17 గంటలు పని చేసే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల దృష్టి మళ్లించేందుకే అవిశ్వాసం ► ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రజల్లో మద్దతు లేదు. కేవలం గందరగోళం సృష్టించేందుకు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తీసుకొచ్చారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం పట్ల అమితమైన విశ్వాసంతో ఉన్నారు. ► విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ పాటిస్తోంది. ఆదివాసీలు, గిరిజనుల పట్ల ప్రధానికి చులకన భావం ఉంది. ప్రధాని మోదీపై ప్రజలకు విశ్వాసం పోయింది. మణిపూర్‌లో జరిగిన దాడులపై ప్రధాని మోదీ జాతికి క్షమాపణ చెప్పాల్సిందే. :::అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ► ఈ దేశంలో భాగమైనందుకు మేము గర్విస్తున్నాము. అయితే ఈ దేశానికి హిందువులకే కాదు.. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. ప్రధానమంత్రి ఒక రంగుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించడు.. ఆయన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. గత 10 సంవత్సరాలలో మీరు (కేంద్రం) ఎంత మంది కశ్మీరీ పండిట్లను తిరిగి తీసుకువచ్చారు?. మేము భారతదేశంలో భాగం కాదని.. మేం పాకిస్తానీలమని, దేశద్రోహులమని మాత్రం చెప్పకండి. మనం ఈ దేశంలో భాగం.. అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా ఆవేశపూరితంగా ప్రసంగించారు. #WATCH | National Conference MP Dr Farooq Abdullah during #NoConfidenceMotion debate in Lok Sabha "We stand proud to be part of this nation. But this nation has a responsibility not only to Hindus but to everybody who lives in India. PM doesn't represent only one colour, he… pic.twitter.com/kn4WRjhNT5 — ANI (@ANI) August 9, 2023 ► మా ఉద్దేశ్యం ఏంటంటే.. మణిపూర్‌పై సభలో సవివరమైన చర్చ జరిగినప్పుడు కొన్ని వివరాలు బయటకు వస్తాయని. కానీ, ప్రధాని సభకు రావడానికి సిద్ధంగా లేరు, ప్రభుత్వం మా మాట వినడానికి సిద్ధంగా లేదు. నిరసనగా, మేము సభ నుంచి బయటకు వెళ్లిపోవడమే సరైంది’’ ::కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మణిపూర్ ఇష్యూపై రాజ్యసభలో రచ్చ ► మణిపూర్ అంశంపై రాజ్యసభలో రచ్చ జరిగింది. మణిపూర్‌పై రాజకీయం కాదు.. చర్చ జరగాలని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. మణిపూర్‌పై ఒక్కరోజు చర్చ పెడితే సరిపోతుంది. కానీ పదిరోజులుగా సాగదీస్తున్నారు మండిపడ్డారాయన. ఈ దశలో చర్చకు సిద్దమని కేంద్రం ప్రకటించింది. మణిపూర్ అంశాన్ని లిస్ట్ చేసేందుకు రెడీ అని చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. అయితే.. విపక్షాలకు చర్చ జరగడం ఇష్టం లేదని బీజేపీ ఎంపీలు అనడంతో.. సభ్యుల మధ్య వాగ్వాదం జరగ్గా.. కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. Congress MPs stage walkout in Rajya Sabha over Manipur issue "Our intention was that when a detailed discussion happens on Manipur in the House then some details will come out. PM is not ready to come to the House. The Government is not ready to listen to us. As a mark of… pic.twitter.com/sRGZ1sQu3z — ANI (@ANI) August 9, 2023 లోక్‌సభ నుంచి వెళ్లిపోయిన రాహుల్ ►లోక్‌సభలో అవిశ్వాసంపై వాడీవేడీ చర్చ ►రాహుల్ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్న అధికార పక్షం ►ఒక దశంలో రాహుల్ ప్రసంగానికి అడ్డుపడి అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్ ►ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన రాహుల్ ►రాజస్థాన్‌కు బయలు దేరిన రాహుల్ ►బన్స్వారా జిల్లాలోని మాన్‌గర్ ధామ్‌లో ఆదివాసీల ర్యాలీలో పాల్గొననున్న కాంగ్రెస్ ఎంపీ మణిపూర్ రెండుగా చీల్చలేదు ►భరత మాతను చంపేశారని సభలో ఇప్పటి వరకు ఎవరూ అనలేదు. ►మణిపూర్‌ను ఎవరూ ముక్కలు చేయలేరు. ►మణిపూర్ భారత్‌లో అంతర్భాగం ►కశ్మీర్లో పండిట్లపై జరుగుతున్న దారుణాలు మీకు కనిపించడం లేదా? ►ఆర్టికల్ 370 మళ్లీ తీసుకురావాలని ప్రతిపక్షం కోరుకుంటోంది. ►మణిపూర్‌లో శాంతికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ►ఇప్పటికే మణిపూర్ అల్లర్లపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాం రాహుల్ వ్యాఖ్యలకు స్మృతి ఇరానీ కౌంటర్ ►రాహుల్ భారతీయుడు కాదు. ►ఆయన వ్యాఖ్యలను జాతి క్షమించదు. ►భారతమాత హత్య గురించి మాట్లాడతారా? ►విపక్ష కూటమి ఇండియా కాదు ►అది అవినీతి,తుష్టీకరణ కూటమి ►న్యాయం గురించి కాంగ్రెస్ మాట్లాడుతుందా? ►గిరిజ టిక్కు, సరళ భట్‌కు ఎప్పుడు న్యాయం చేస్తారు? మోదీని రావణుడితో పోల్చిన రాహుల్ ► ప్రధాని మోదీ అమిత్ షా, అదానీ మాటలే వింటారు. ► ప్రధానిని రావణుడితో పోల్చిన రాహుల్ ►రావణుడు ఇద్దరి మాటలే(మేఘనాథుడు, కుంభకర్ణుడు) వింటాడు. ►మోదీ కూడా ఇద్దరి మాటలే వింటాడు. లోక్‌సభలో గందరగోళం ►హిందుస్థాన్‌ను మణిపూర్‌లో హత్యచేశారన్న రాహుల్ ► రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం ►రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ►అధికార , విపక్ష సభ్యుల మధ్య పోటాపోటీ వాదనలు ►ఇరు పక్షాల వాదనలతో దద్దరిల్లిన లోక్ సభ ►స్పీకర్ జోక్యం చేసుకున్నా ఆగని మాటల యుద్దం జోడో యాత్ర నా అహంకారాన్ని అణచివేసింది ► జోడో యాత్రలో ప్రజల సమస్యలను దగ్గరుండి చూశాను. ►లక్షల మందితో తనతో కలిసి రావడంతో నాకు ధైర్యమొచ్చింది. ►నా యాత్ర ఇంకా ముగియలేదు.. లద్ధాఖ్ వరకు వెళ్తాను ►పాదయాత్రలో ఎన్నో నేర్చుకున్నాను. ►యాత్రకు ముందు నాకు అహంకారం ఉండేది. జోడో యాత్ర నా అహంకారాన్ని అణచివేసింది. బీజేపీ సభ్యులపై రాహుల్ గాంధీ సెటైర్లు ►గతంలో అదానీ గురించి మాట్లాడినప్పుడు ఓ పెద్ద నేతకు ఇబ్బంది అనిపించిందేమో: రాహుల్ గాంధీ ►అదానీ గురించి ఈరోజు మాట్లాడను. భయపడాల్సిన పనిలేదు. ►నాదీ రాజకీయ ప్రసంగం కాదు. ►బీజేపీ సభ్యులు నా సమయాన్ని వృధా చేస్తున్నారు. లోక్‌భలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ ప్రారంభం.. ►చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ►ఎంపీ పదవిని పునరుద్దరించినందుకు ధన్యవాదాలు. ►మరోసారి అదనీ పేరు ప్రస్తావించిన రాహుల్ ►రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం ►మణిపూర్ గురించి మాట్లాడుతా.. ►బీజేపీ నేతలు రిలాక్స్ అవ్వొచ్చు. ►ఒకటి రెండు తూటాలు పేలుతాయి.. కానీ భయం వద్దు. ►కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చెపట్టా ►యాత్ర నా అహంకారాన్ని అణిచివేసింది. #WATCH | Congress MP Rahul Gandhi says, "Speaker Sir, first of all, I would like to thank you for reinstating me as an MP of the Lok Sabha. When I spoke the last time, perhaps I caused you trouble because I focussed on Adani - maybe your senior leader was pained...That pain might… pic.twitter.com/lBsGTKR9ia — ANI (@ANI) August 9, 2023 రాజ్యసభ వాయిదా ►ప్రతిపక్షాల ఆందోళనలతో మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. ►ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్ష నేతలు మణిపూర్ మణిపూర్ అంటూ నిరసనలు చేపట్టడంతో లోక్‌సభ మొదలైన కాసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ► స్వాతంత్య్ర ఉద్యమానికి బీజేపీ పూర్తిగా వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. బీజేపీకి క్విట్ ఇండియాకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. వారి నేతలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదని తెలిపారు. క్విట్ ఇండియా దినోత్సవం గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ చారిత్రాత్మకమైన రోజున.. ప్రధాని మోదీ సమక్షంలో పార్లమెంట్లో చర్చ పెట్టాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రధాని పార్లమెంట్‌కు రావడం లేదని, మణిపూర్ సమస్య గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు. ►కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు(బుధవారం) రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారని ఆ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. బన్స్వారా జిల్లాలోని మాన్‌గర్ ధామ్‌లో జరిగే ర్యాలీలో పాల్గొంటున్నట్లు చెప్పారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై తప్పక చర్చలో పాల్గొంటారని ఆయన తెలిపారు. అయితే అది ఈ రోజా? రేపా అనేది క్లారిటీ లేదన్నారు. ►ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి అన్నారు. వాళ్లు బ్రిటీష్ వారికి లేఖలు రాస్తూ, వారికి ఇన్ఫార్మర్లుగా వ్యవహరించిన ఉద్యమ సమయంలో.. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలేవి లేవని అన్నారు. ఆకలి సూచీ, విద్య, ఆరోగ్యం, విదేశీ నిల్వల సంగత ఏంటీ అని ప్రశ్నిచారు. బీజేపీ కేవలం వ్యక్తిగత దాడికి దిగజారిందని విమర్శించారు. #WATCH | Congress MP Pramod Tiwari says, "They are scared of the I.N.D.I.A. alliance...We (Congress) have a history of participating in the freedom struggle, while they were writing letters to the British & acting as their informers...They have no achievements of theirs- what is… pic.twitter.com/ccLejPsHL9 — ANI (@ANI) August 9, 2023 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం లోక్‌సభలో రెండో చర్చ జరగనుంది. మణిపూర్ హింసతోపాటు పలు అంశాలపై తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీయనున్నారు. తీర్మానంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు బుధవారం మాట్లాడనున్నారు. రాహుల్ మాట్లాడకపోవడానికి కారణం అదేనా అయితే మంగళవారం అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ఎందుకు చర్చను ప్రారంభించలేదనేది పెద్ద ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ తరపున మాట్లాడేవారి జాబితాలో తొలుత రాహుల్ గాంధీ పేరును చేర్చారు. కానీ, చివరి క్షణంలో తొలగించారు. అయితే గాంధీ చర్చను ప్రారంభించకపోవడానికి ప్రధానంగా పలు కారణాలు కనిపిస్తున్నాయి. చర్చను ప్రారంభించిన గొగొయ్ ఈశాన్య ప్రాంతానికి చెందిన ఎంపీ కావడం మొదటిది. మణిపూర్ హింసపై ఆయన మాట్లాడితే ప్రాధాన్యత కలిగి ఉంటుందని కాంగ్రెస్ భావించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎంపీగా సభలోకి తిరిగి వచ్చిన వెంటనే రాహుల్ అవిశ్వాసంపై మాట్లాడితే వారసత్వ రాజకీయాలను ఉద్ధేశిస్తూ అధికార బీజేపీ మాటల యుద్దానికి దిగుతుందని యోచించినట్లు సమాచారం. ఇక మరో కారణం ప్రధాని మోదీ నిన్న సభలో లేకపోవడం. మోదీ రేపు(గురువారం) లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఉంది. కాగా తొలిరోజు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాడీవేడిగా చర్చ జరిగింది. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌన వీడి, ప్రకటన చేయడానికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. మరోవైపు ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న పేదల బిడ్డ నరేంద్ర మోదీపై విశ్వాసం లేదంటూ సభలో ఓటు వేస్తారా? అని అధికార బీజేపీ సభ్యులు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మణిపూర్ హింసాకాండకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సహా పలువురు విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఆరోపించారు. శివసేన ఎంపీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సభలో కాసేపు హనుమాన్ చాలీసా పఠించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను అసోం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రారంభించారు. మణిపూర్‌పై పార్లమెంట్లో ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేశారు. అనంతరం బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతుండగా కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, : డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, టీఎంసీ ఎంపీ సౌగత రాయ్, బీజేడీఎంపీ పినాకి మిశ్రా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, సీపీఎం నేత ఎ.ఎం.అరీఫ్, బీజేపీ సభ్యుడు నారాయణ్ రాణే, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ తదితరులు మాట్లాడారు. -
లోక్‌సభలో గరంగరం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాడీవేడిగా చర్చ జరిగింది. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనవ్రతాన్ని విచ్ఛిన్నం చేయ డానికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని ప్రతిపక్షాలు వెల్లడించాయి. ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న పేదల బిడ్డ నరేంద్ర మోదీపై విశ్వాసం లేదంటూ సభలో ఓటు వేస్తారా? అని అధికార బీజేపీ సభ్యులు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మణిపూర్ హింసాకాండకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సహా పలువురు విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఆరోపించారు. శివసేన ఎంపీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సభలో కాసేపు హనుమాన్ చాలీసా పఠించారు. అవిశ్వాస తీర్మానంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, సీపీఎం నేత ఎ.ఎం.అరీఫ్, బీజేపీ సభ్యుడు నారాయణ్ రాణే, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ తదితరులు మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ తరపున మాట్లాడేవారి జాబితాలో తొలుత రాహుల్ గాంధీ పేరును చేర్చారు. కానీ, చివరి క్షణంలో తొలగించారు. తీర్మానంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు బుధవారం మాట్లాడనున్నారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించండి మణిపూర్‌లో హింస, సరిహద్దుల్లో చైనా సైనికుల చొరబాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నోరువిప్పడం లేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ఆ పార్టీ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ నిలదీశారు. ప్రధాని మౌనం వీడేలా చేయడానికే కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు. మంగళవారం సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను గౌరవ్ గొగోయ్ ప్రారంభించారు. ‘‘ప్రధాని మోదీ మణిపూర్‌ను ఇప్పటిదాకా ఎందుకు సందర్శించలేదు? రాష్ట్రంలో హింసాకాండపై కేవలం 30 సెకండ్లపాటు స్పందించడానికి 80 రోజులదాకా ఎందుకు వేచిచూశారు? మణిపూర్ ముఖ్యమంత్రిని పదవి నుంచి ఎందుకు తొలగించలేదు?’’అంటూ మూడు ప్రశ్నలు సంధించారు. మోదీ తక్షణమే మణిపూర్‌లో పర్యటించాలని, అఖిలపక్ష బృందాన్ని వెంట తీసుకెళ్లాలని, రాష్ట్రంలోని ప్రజా సంఘాలతో చర్చించి, శాంతిని పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గౌరవ్ గొగోయ్ ఇంకా ఏం మాట్లాడారంటే... తప్పులను అంగీకరించడం మోదీకి ఇష్టం లేదు ‘‘మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణను, హింసను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర హోంశాఖ, జాతీయ భద్రతా సలహాదారు ఘోరంగా విఫలమయ్యారు. చేసిన పొరపాట్లను అంగీకరించడానికి ప్రధాని మోదీ ఇష్టపడడం లేదు. మణిపూర్ ప్రభుత్వం విఫలమైందని బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. తప్పులను అంగీకరించడం కంటే మౌనం ఉండడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదు, కేవలం మణిపూర్‌కు న్యాయం చేకూర్చాలన్న ఆశయంతోనే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. మణిపూర్‌లో విభజన జరిగితే దేశంలో విభజన జరిగినట్లే. అందుకే ఈ అంశంపై ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ, ఆయన మౌనవ్రతం కొనసాగిస్తున్నారు. ప్రధాని మౌనం వీడాలన్నదే అవిశ్వాస తీర్మానం అసలు ఉద్దేశం. మణిపూర్‌లో పర్యటించడానికి అభ్యంతరం ఏమిటో మోదీ చెప్పాలి. మణిపూర్ అంశంపై కేంద్ర మంత్రులు మాట్లాడితే సరిపోదు, ప్రధానమంత్రి మాట్లాడాలి. మంత్రుల అధికారాలు, ప్రధానమంత్రి అధికారాలు సరిసమానం కాదుకదా! మణిపూర్‌లో శాంతి కోసం మోదీ కనీసం పిలుపు కూడా ఇవ్వకపోడం విచారకరం. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు మోదీ అధికారం కోసం ఓట్ల వేట సాగించారు. దేశం కంటే అధికారమే ముఖ్యమనుకున్నారు. ఇదేనా జాతీయవాదం? ఒకే దేశం(వన్ ఇండియా) అని చెబుతున్న మోదీ ప్రభుత్వం రెండు మణిపూర్‌లను సృష్టిస్తోంది. 2002లో గుజరాత్లో మత కలహాలు చెలరేగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి అక్కడ పర్యటించారు. ఇప్పటి ప్రధాని మోదీ మాత్రం కల్లోల మణిపూర్‌కు దూరంగా ఉంటున్నారు. సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడల్లా మోదీ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. మణిపూర్‌లో శాంతి కోసం చొరవ తీసుకోవాల్సిన ప్రధానమంత్రి విపక్ష కూటమిపై విమర్శలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి విద్వేషం ఒక ఆయుధంగా మారడం దురదృష్టకరం. మీ ‘విద్వేష దుకాణం’ముందు మా ‘ప్రేమ దుకాణాన్ని’తెరుస్తాం. దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని మీరు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు, అదే మాట ఒక నిరుపేద కూరగాయల విక్రేత ఎదుట చెప్పగలరా?’’అని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. రాజధర్మం పాటించడం లేదు ‘‘దివంగత ప్రధాని వాజ్‌పేయి ‘రాజధర్మానికి’మద్దతుగా నిలిచారు. కానీ, ఇప్పుడు మహిళలను నగ్నంగా ఊరేగించినా మనం రాజధర్మం పాటించడం లేదు. మణిపూర్‌లో జరిగిన అకృత్యాలను ప్రపంచమంతా ఖండించింది. దీనిపై యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. ప్రధాని మోదీ వైఖరిని బ్రిటిష్ పార్లమెంట్ సైతం తప్పుపట్టింది. చెడును సంహరించాలన్నదే మా లక్ష్యం. అందుకే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నాం’’ – టి.ఆర్.బాలు, డీఎంకే సభ్యుడు అవిశ్వాసానికి ఇది సమయం కాదు ‘‘ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతగా ఎదిగారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారబోతోంది. అందుకే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇప్పుడు అవసరం లేదు. ప్రతిపక్షాలు ఇకనైనా ఇలాంటి తీర్మానాలను పక్కనపెట్టి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో పాల్గొనాలి. తప్పుడు సమయంలో అవిశ్వాసం పెట్టినందుకు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు చింతించడం తథ్యం. బీజేపీని, మోదీని ఇష్టపడకపోయినా సరే దేశానికి మాత్రం మద్దతు ఇవ్వండి. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఈశాన్యం గ్రోత్ ఇంజిన్‌గా మారాలని ఆశిస్తోంది. వాస్తవానికి మణిపూర్‌లో ఇప్పటి సమస్యలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకాలే కారణం. మణిపూర్‌ను సందర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాతోపాటు వస్తారా?’’ – కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రి విపక్షాలు ఇక ఇంటికే.. ‘‘ఇండియా అని పేరుపెట్టుకున్న విపక్ష కూటమిలో జగడాలు ముదురుతున్నాయి. విపక్ష నేతలు తమలో తాము కలహించుకుంటున్నారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ జైలు శిక్షపై సుప్రీంకోర్టు కేవలం స్టే ఇచ్చింది. ఆయనను నిర్దోషిగా తేల్చలేదు. క్షమాపణ చెప్పడానికి సావర్కార్‌ను కాదని రాహుల్ దురుసుగా మాట్లాడారు. నిజానికి ఆయన ఎప్పటికీ సావర్కార్ కాలేరు. ఒకప్పుడు కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలే ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో నిస్సిగ్గుగా చేతులు కలిపాయి. పేదలకు మంచి చేసిన నాయకుడికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానమిది. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత విపక్షాలు మళ్లీ సభలో అడుగుపెట్టవు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400కు పైగా సీట్లు లభించడం ఖాయం’’ – నిషికాంత్ దూబే, బీజేపీ ఎంపీ -
‘మోదీ ఏమైనా స్పెషలా.. మన్మోహన్, వాజ్‌పేయి చేశారుగా..’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరుగుతోంది. అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మణిపూర్ అంశంపై గొగొయ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ.. ఇప్పటి వరకు మణిపూర్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కాగా, లోక్‌సభలో గౌగవ్ గగొయ్ మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అయితే, ఇది సంఖ్యా బలానికి చెందిన విషయం కాదు. మణిపూర్‌కు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేయడం కోసమే తాము తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మణిపూర్ కోసం ఈ తీర్మానం తెచ్చామని, మణిపూర్‌కు కచ్చితంగా న్యాయం జరగాలన్నారు. మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాకా డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. అసోం రైఫిల్స్ మణిపూర్ పోలీసులు కొట్టుకున్నారు. ఇదేనా నవభారతం అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై నమ్మకం లేకే సుప్రీంకోర్టు కమిటీ వేసింది చురకలు అంటించారు. వాజ్‌పేయి, మన్మోహన్ వెళ్లారుగా.. ఇదే సమయంలో పార్లమెంట్లో మాట్లాడరాదు అని ప్రధాని మోదీ మౌనవ్రతం చేపట్టారు. ఆయన మౌనాన్ని బ్రేక్ చేసేందుకే ఈ తీర్మానాన్ని తీసుకువచ్చామన్నారు. ఆయన్ను మూడు ప్రశ్నలు అడగాలని ఉందని, ఇప్పటి వరకు ఆయన ఎందుకు మణిపూర్‌ను విజిట్ చేయలేదని, 80 రోజుల తర్వాత ఆ అంశంపై కేవలం 30 సెకన్లు మాట్లాడారని, ఎందుకు ఆయన ఇంత సమయాన్ని తీసుకున్నారని, మణిపూర్ సీఎంను ఎందుకు ఇంత వరకు తొలగించలేదని గౌరవ్ గగోయ్ ప్రశ్నించారు. అలాగే, కోక్రాఝర్‌లో హింస జరిగినప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అసోంకు వెళ్లారు. ఇక, 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో అప్పటి ప్రధాని వాజ్పేయూ కూడా అక్కడికి వెళ్లారని గుర్తు చేశారు. మణిపూర్‌లో హింస జరుగుతుంటే ఇండియా కూటమిని తిట్టడంపైనే ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారని విమర్శించారు. మేము అధికారాన్ని కాదు, శాంతిని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. When i talked about PM, CM & Home Minister no one had problems but, when i talked about ADANI, why BJP MPs stood in anger? -Gaurav Gogoi schooling BJP🔥 pic.twitter.com/yUvkzSPCal — Amock (@Politics_2022_) August 8, 2023 సంక్షోభ సమయాల్లో మౌనమే మోదీ సమాధానమా? పలు సందర్భాల్లో మోదీ మౌనంపై గగొయ్ విరుచుకుపడ్డారు. చైనా విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే. బాలీలో జిన్‌పనింగ్, మోదీ ఏం మాట్లాడుకున్నారో కేంద్రం దాచేసింది. చైనా గురించి మీరు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్ల సమయంలోనూ మోదీ సమాధానం మౌనమే. రెజర్ల ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే. రైతు ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే అని అన్నారు. తన తప్పును దేశ ప్రజల ముందు మోదీ ఒప్పుకోవడం లేదని అన్నారు. ఎంతమంది మాట్లాడినా ప్రధాని స్పందిస్తే వేరుగా ఉంటుందన్నారు. మణిపూర్‌లో కేంద్ర ఇంటెలిజెన్స్ విఫలమైంది. అక్కడ ఇప్పటి వరకు 150 మంది చనిపోయారు. 5 వేల వరకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 60 వేల మంది శిబిరాల్లో ఉన్నారు. 60 ఎఫ్ఐఆర్లు నమోదయినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మణిపూర్ సీఎంను ఎందుకు తొలగించలేదు? అని ప్రశ్నించారు. మణిపూర్ అంతా బాగుందని మీరు అంటున్నారు. ఇప్పటికీ ఇంటర్నెట్ లేదు, పిల్లలు స్కూళ్లకు దూరమయ్యారు. ఇద్దరు మహిళలను రోడ్డుపై నగ్నంగా ఊరేగించారు, అయినా మోదీ మౌనం వీడలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైందని మాట్లాడాల్సి వస్తుందని మోదీ స్పందించడం లేదా? అని ప్రశ్నించారు. అక్కడి ప్రజలు న్యాయం కోరుతున్నారని స్పష్టం చేశారు. #WATCH | Congress MP Gaurav Gogoi says, "PM took a 'maun vrat' to not speak in the Parliament. So, we had to bring the No Confidence Motion to break his silence. We have three questions for him - 1) Why did he not visit Manipur to date? 2) Why did it take almost 80 days to… pic.twitter.com/rfAVe77sNY — ANI (@ANI) August 8, 2023 ఇది కూడా చదవండి: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. మోదీపై కాంగ్రెస్ నిప్పులు -
అవిశ్వాసంపై చర్చకు ముందు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానిపై చర్చకు ముందు మంగళవారం ఉదయం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ ఆగ్రనేతలందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడంపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలది ఇండియా కూటమి కాదని, అహంకారుల కూటమి అని తీవ్రంగా మండిపడ్డారు. అహంకారులను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు క్విట్ ఇండియా అని పేర్కొన్నారు. చదవండి:అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? నెహ్రూ నుంచి మోదీ వరకు.. అత్యధికంగా ఎదుర్కొన్నది ఎవరూ? సోమవారం రాజ్యసభలొ ఆమోదం పొందిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లును ప్రధాని ప్రస్తావిస్తూ.. విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు. విపక్ష కూటమిలోని అవిశ్వాసాన్ని కప్పిపుచ్చుకునేందుకే అవిశ్వాసం తీసుకొచ్చారని దుయ్యబట్టారు. లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టి మ్యాచ్ నెగ్గినట్టే విపక్షాలపై పైచెయ్యి సాధించాలని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంప్రతిపక్షాలఐక్యతకు, వారి అంతర్గత విశ్వాసానికి పరీక్ష అని తెలిపారు. ఈ ఓటుతో వెరు ఐక్యంగా ఉన్నారో, ఎవరూ లేరో స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రతిపక్ష కూటమి ఇండియా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ-ఫైనల్’ కావాలని కోరుకుంటోందని, దానికి తగ్గట్లే ఫలితాలు అందరూ చూడాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా పార్లమెంట్ వేదికగా అధికార విపక్షాల మధ్య చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే సర్కార్ నేడు లోక్‌సభలో అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. ఇండియా కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా ఆమోదించి.. చర్చకు మూడు రోజులు(8,9,10 తేదీలు) సమయమిచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అవిశ్వాసంపై చర్చ ప్రారంభించనున్నారు. చదవండి: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. రాహుల్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి -
అవిశ్వాస తీర్మానం.. నెహ్రూ నుంచి మోదీ వరకు.. నెగ్గింది, ఓడింది వీరే!
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అసలు సిసలైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై నేడు లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. మణిపూర్ హింసపై అధికార, విపక్షాల మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై వాడివేడీగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అవిశ్వాసంపై చర్చను ప్రారంభించనున్నారు. మోదీ ఇంటి పేరు కేసులో శిక్ష కారణంగా నాలుగు నెలల తర్వాత పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన రాహుల్.. అవిశ్వాస తీర్మానంపై చేయనున్న తొలి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. రేపు, ఎల్లుండి కూడా అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగనుంది. ఆగస్టు 10న మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో అసలు అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి? దాన్ని ఎలా, ఎప్పుడు ప్రవేశపెడతారు? ఇప్పటి వరకు స్వతంత్ర భారత దేశంలో ఎన్నిసార్లు ప్రతిపాదించారు? ఎవరూ నెగ్గారు? ఎవరూ ఓడిపోయారు? ఎవరిపై ఎక్కువసార్లు అవిశ్వాసం ప్రవేశపెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.. చదవండి: No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ప్రసంగం.. ఏం మాట్లాడనున్నారు? గత ప్రభుత్వాలపై అవిశ్వాస తీర్మానాలు అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రజలకు, దేశానికి జవాబుదారీగా ఉంచడానికి ఉపయోగించబడింది. ప్రత్యేకించి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన సమయంలో వాటిని పడగొట్టడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. ►దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి 2018లో నరేంద్ర మోదీ వరకు అనేకమంది నేతలు ఈ అవిశ్వాన్ని ఎదుర్కొన్నారు. మొదటిసారిగా 1963లో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంపై విపక్ష నేత ఆచార్య జేబీ కృపలానీ ప్రవేశ పెట్టారు. 1962లో చైనాతో జరిగిన యుద్దంలో భారత్ ఓడిపోవడంతో ఆగస్టులో నెహ్రూపై ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. తర్వాత చదవండి: ‘బిల్కిస్ బానో’ కేసులో దోషులను వదలొద్దు ►మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యధికంగా 15సార్లు అవిశ్వాసాలను ఎదుర్కొన్నారు. అయితే అన్నింట్లోనూ ఆమె విజయం సాధించారు. ► లాల్ బహదూర్ శాస్త్రి, పివి నరసింహారావు (మూడు చొప్పున), మొరార్జీ దేశాయ్ (రెండు), జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ఒకొక్కసారి ఎదురుకున్నారు. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీపీ సింగ్‌తోపాటు 1999లో వాజ్‌పేయి ఒక ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. ► దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు 27 అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. తాజాగా మోదీ ఎదుర్కొంటున్నది 28వ తీర్మానం. ►చివరి సారి 2018లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోగా.. 199 ఓట్లతో విజయం సాధించింది. ప్రస్తుతం మరోసారి మోదీ ప్రతిపక్షాల నుంచి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నారు. దీంట్లోనూ బీజేపీ సర్కార్ తప్పక విజయం సాధించే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం అంటే.. అవిశ్వాస తీర్మానం అనేది కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయామని తెలియజేసేందుకు ప్రతిపక్షాలు ఉపయోగించే పార్లమెంటరీ సాధనం. దీనిని స్పీకర్ ఆమోదీస్తే విశ్వాసాన్ని కాపాడుకునేందుకు అధికార పక్షం లోక్‌సభలో మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెజారిటీ కోల్పోతే ప్రభుత్వం వెంటనే పడిపోతుంది. లోక్‌సభలో మెజారిటీ ఉన్నంత వరకే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రతిపక్షాల ఆయుధం ప్రతిపక్షాలు తరచుగా ఓ వ్యూహాత్మక సాధనంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగిస్తూ ఉంటాయి. దీని ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, వారి వైఫల్యాలను ఎత్తిచూపడానికి, వీటన్నింటినీ సభలో చర్చించడానికి ఉపయోగపడుతోంది. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కూడా ఈ తీర్మానం కీలక పాత్ర పోషిస్తోంది. అదే సభలో తీర్మానం ఆమోదం పొందితే ప్రధానితో సహా మొత్తం మంత్రివర్గం రాజీనామా చేయాలి. లోక్‌సభ ప్రత్యేక హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 ప్రకారం కేంద్ర కేబినెట్ సమిష్టిగా లోక్‌సభకు జవాబుదారీగా ఉంటుంది. అవిశ్వాస ప్రతిపాదనను కేవలం ప్రతిపక్షాలు మాత్రమే ప్రవేశపెట్టగలవు. అలాగే లోక్‌సభలో మాత్రమే దీనిని ప్రవేశపెట్టవచ్చు. రాజ్యసభలో ప్రతిపాదించేందుకు అనుమతి లేదు. పార్లమెంటులో సభ్యత్వం కలిగిన ఏ పార్టీ అయినా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే అధికారంలో కొనసాగడానికి ప్రభుత్వం తప్పక తన మెజారిటీని నిరూపించుకోవాలి. చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్.. లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం ఎలా ప్రవేశపెడతారు.. లోక్‌సభ నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. లోక్‌సభ నియమాలు 198(1), 198(5) ప్రకారం స్పీకర్ చెప్పిన తర్వాత మాత్రమే దీనిని ప్రవేశపెట్టవచ్చు. లోక్‌సభకు తీసుకురావాల్సిన సమాచారాన్ని ఉదయం 10 గంటలలోపు సెక్రటరీ జనరల్‌కు ఆయన కార్యాలయంలో లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సభలో అదే సమయంలో కనీసం 50 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. తీర్మానం ఆమోదం పొందితే.. చర్చకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. దీనిపై అధికార పార్టీతో సహా, ప్రతిపక్షాలు చర్చిస్తాయి. అంతేగాక రాష్ట్రపతి సైతం తమ మెజార్టీని నిరూపించుకోమని ప్రభుత్వాన్ని కోరవచ్చు. ప్రభుత్వం నిరూపించుకోలేకపోతే మంత్రివర్గం రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ స్వయంగా ప్రకటిస్తారు. మరోవైపు మణిపుర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటన చేయాల్సిందేనని విపక్ష కూటమి పట్టుబడుతున్న విషయం తెలిసిందే. మూడు నెలలుగా మణిపూర్ హింస రుగులుతున్నా పరిస్థితులను అదుపు చేయడంలో, శాంతి భద్రతలు పునర్నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి(జూలై20) దీనిపై ప్రభుత్వం చర్చించాలని విపక్షాల మొండిపట్టుతో సభలు వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. -
పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా
No Confidence Motion Day-1 Live Updates పార్లమెంట్ ఉభయ సభలు రేపటి(బుధవారం)కి వాయిదా. ► పార్లమెంట్ సాక్షిగా ఆర్టికల్ 370 రద్దయ్యి నాలుగేళ్లు పూర్తి కావొచ్చింది. కానీ, ఇంకా అక్కడ ఎన్నికలు జరగలేదు అని ఎంపీ తివారి అన్నారు. ఆ టైంలో కొందరు ఎన్డీయే ఎంపీలు ‘ఈ వ్యవహారం కోర్టులో ఉందని.. సభలో చర్చించొద్ద’ని తివారికి సూచించారు. వెంటనే తివారి ‘నేషనల్ హెరాల్డ్ కేసు న్యాయస్థానంలోనే ఉంది కదా!’ అని వాళ్లను ఎదురు ప్రశ్నించారు. ► అవిశ్వాసంపై చర్చ సందర్భంగా.. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి ప్రసంగిస్తున్నారు. విపక్షాలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్.. ► గతంలో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల వేటలో చతికిలపడేది. కానీ, 2020లో ఏడు మెడల్స్ గెలిచింది. క్రీడాకరులపై మోదీ సర్కార్ చూపిన శ్రద్ధే అందుకు ప్రధాన కారణం అని చెప్పనక్కర్లేదు. ► ప్రమాదాలు ఊహించని విషాదాలే. అలాంటిది రైలు ప్రమాదంలో ఒక్క ప్రాణం పోయినా.. అది పెద్ద నష్టం కిందకే వస్తుంది. 2004-14 మధ్య 171 రైలు ప్రమాదాలు జరిగాయి. ఆ సంఖ్య 2014-23 మధ్య 71కి చేరి.. ప్రమాదాల తగ్గుముఖం తెలియజేస్తోంది. ► అమృత్కాల్ అనేది ఎన్డీయే కోసమో బీజేపీ కోసమో కాదు.. ఇది దేశం కోసం. మా పార్టీ తరపున.. ప్రభుత్వం తరపున అందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. 2047 కల్లా.. భారత్‌ను అభివృద్ధి చెందిన కేసుగా నిలబెట్టే ప్రయత్నాలు చేద్దాం. ► విదేశీ శక్తులు భారత్‌కు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పే రోజులు పోయాయి. ఇవాళ మన అంతర్గత విషయాల్లో ఏ విదేశీ శక్తి జోక్యం చేసుకోవట్లేదు. ► ఇస్రో చంద్రయాన్-3 లాంటి ప్రాజెక్టులతో భారత్ ఖ్యాతిని ప్రపంచం నలువైపులా చాటుతోంది. అమెరికాలాంటి అగ్రరాజ్యాలు సైతం అంతరిక్ష రంగంలో భారత్‌తో పని చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ►ఇండియా కూటమితో ఒరిగేదిమీ లేదు. వీరంతా దేశానికి చేసిందేమీ లేదు. ► 2014కు ముందు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రజలు ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో జాతి వివక్షకు గురయ్యారు. ► 2014 తర్వాత కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. ► స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా గౌహతిలో డీజీపీ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో, ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతకు పోలీసులు తప్పనిసరిగా భద్రత కల్పించాలని ప్రధానమంత్రి ఆదేశించారు. Before 2014, many people from the Northeast faced racial discrimination and atrocities in Delhi and other major cities of the country. After 2014 the situation changed, and the DGP conference was held in Guwahati for the first time after independence. During this meeting, the PM… pic.twitter.com/YRYCW6DPX9 — ANI (@ANI) August 8, 2023 ►అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం లేదు: బీజేడీ(బిజూ జనతా దళ్) ఎంపీ పినాకి మిశ్రా ►బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నేను మద్దతు ఇవ్వడం లేదు. ►ఒడిశా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు తీసుకొచ్చింది. అందుకే అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడం లేదు. No Confidence Motion Discussion | BJD MP Pinaki Misra says, "I cannot support a No Confidence Motion against a Central Govt today, even though we are against the BJP as a political party...I am grateful for the many things that the Central Govt has done for Odisha which is why,… pic.twitter.com/RLHk17UesH — ANI (@ANI) August 8, 2023 కేంద్ర ప్రభుత్వానికి మనసు లేదు ►మణిపూర్ అల్లర్లతో అట్టుడుకుతుంటే ప్రధాని విదేశీ పర్యటనకు ఎందుకు వెళ్లారు?: టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ ► కేంద్ర ప్రభుత్వానికి మనసు లేదు. ►మోదీ ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరించడం లేదు ► పశ్చిమ బెంగాల్లో ఏం జరిగినా ప్రతిసారీ అక్కడికి ఓ ప్రతినిధి బృందాన్ని పంపుతారు. కానీ మణిపూర్‌కు ఒక్క ప్రతినిధి కూడా వెళ్లలేదు. ►మణిపూర్‌లో ఎంతో మంది మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ►మణిపూర్‌పై కనికరం లేదు కాబట్టే అక్కడికి వెళ్లడం లేదు. ►భారత్‌ను ప్రేమించేవారెవరైనా మోదీని ద్వేషిస్తారు. No Confidence Motion discussion | TMC MP Saugata Roy says, "This Government is government of the heartless. They are sending delegation to West Bengal on any plea. But not one delegation has gone to Manipur where our brothers and sisters are dying...You have no compassion and… pic.twitter.com/CDEvfQaaIY — ANI (@ANI) August 8, 2023 మణిపూర్ భగ్గుమంటుంటే ప్రధాని మోదీ ఎక్కడున్నారు? ►పార్లమెంట్‌కు వచ్చేందుకు వచ్చేందుకు మోదీకి అభ్యంతరం ఏంటి?: డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ►మణిపూర్‌లో శాంతిభద్రతలు పడిపోతే ఐరోపా, యూకే ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా మోదీ సర్కార్ మౌనం దాల్చింది. ►మణిపూర్ అల్లర్లలో 163 మంది మరణించినా ప్రధాని నోరుమెదపలేదు. ► దేశంలో నెలకొన్న పరిస్ధితిలాగే మణిపూర్‌లోనూ మెజారిటీ వర్సెస్ మైనారిటీ అన్నట్టుగా పరిస్ధితులు నెలకొన్నాయి. No Confidence Motion discussion | DMK MP TR Baalu says, "Minorities of Manipur have been killed ruthlessly. 143 people have been killed. 65,000 people have fled the state. Two women were stripped, gang-raped and paraded naked on the streets of Manipur...The CM is helpless. The PM… pic.twitter.com/3giXM3oFFq — ANI (@ANI) August 8, 2023 మణిపూర్ సీఎం తక్షణమే రాజీనామా చేయాలి ►మణిపూర్‌లో 10 వేల అల్లర్లు, హత్యలు, అత్యాచార కేసులు నమోదయ్యాయి: సుప్రియా సూలే ►అయినప్పటికీ కేంద్రంలో చలనం లేదు. ►మణిపూర్ సీఎం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. No Confidence Motion discussion | NCP MP Supriya Sule says, "I demand that the (Manipur) CM must resign immediately...10,000 cases of rioting, murder and rape. Have we become so insensitive? This is the problem with this Govt..." pic.twitter.com/9UCFXjtWad — ANI (@ANI) August 8, 2023 రాహుల్ గాంధీ ఎప్పటికీ సావర్కర్ కాలేరు: నిషికాంత్ దూబే ►మోదీ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టారు. ఇంతకీ విపక్షాల కూటమిలో విశ్వాసం ఉందా? ►ఇండియా ఫుల్‌ఫామ్ కూడా ఆ కూటమిలోని సభ్యులకు తెలియదు. ►కూటమిలో ఏ పార్టీ ఎవరి వైపు తెలుసుకునే పరీక్ష ►ఇండియా అని పేరు పెట్టుకున్నారు.. కానీ అందరూ గొడవ పడుతున్నారు. ►లాలూ ప్రసాద్ యాదవ్‌ను జైలుకు పంపింది ఎవరు? ►రాహుల్ మాట్లాడుతారని ఆశించాం. కానీ ఆయన రెడీగా లేరు. ►రాహుల్ గాంధీ సభకు వస్తే పెద్దగా సెలబ్రేట్ చేశారు. ►సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు. స్టే మాత్రమే ఇచ్చింది ►రాహుల్ లేటుగా నిద్రలేచారేమో? ►నేను సావర్కర్ కాను.. క్షమాపణలు చెప్పనని రాహుల్ అంటున్నారు. ►రాహుల్ గాంధీ ఎప్పటికీ సావర్కర్ కాలేరు. #WATCH | BJP MP Nishikant Dubey raises the issue of the Supreme Court staying Rahul Gandhi's conviction in the ‘Modi’ surname remark case following which his membership was restored. He says, "The Supreme Court has not given a judgement. It has given a stay order...He is saying… pic.twitter.com/7Q6UZ5Fxd9 — ANI (@ANI) August 8, 2023 లోక్‌సభలో అధికార, విపక్షాల ఎంపీల నినాదాలు ►నిన్న సభలో రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే విమర్శలు ►చైనా, న్యూస్ క్లిక్ విషయంలో దూబే ఘాటు వ్యాఖ్యలు ►దూబే వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ లేఖ ►దూబే వ్యాఖ్యలు తొలగించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీల నిరసన ►రికార్డులు మళ్లీ అపడ్లోడ్ చేశారంటూ అధిర్ రంజన్ అభ్యంతరం లోక్‌సభలో గందరగోళం ►బీజేపీ తరపున చర్చను ప్రారంభించిన నిషికాంత్ దూబే ►బీజేపీ ఎంపీపై విపక్షాల ఆందోళన ►నిషికాంత్ దూబే ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ సభ్యులు ►షేమ్ షేమ్ అంటూ ఇండియా కూటమి ఎంపీల నినాదాలు ►గందరగోళం మధ్యం నిలిచిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రధాని మణిపూర్ ఎందుకు వెళ్లరు? ►కోక్రాఝర్‌లో హింస జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ అసోం వెళ్లారు. ►2002 గుజరాత్ అల్లర్ల సమయంలో అప్పటి ప్రధాని వాజ్పేయూ అక్కడికి వెళ్లారు. ►ఇండియా కూటమిని తిట్టండపైనే మోదీ ఫోకస్ ►మణిపూర్‌లో శాంతి స్థాపన మోదీ ప్రాధన్యత కాదా ►మణిపూర్‌కు అఖిలపక్షాన్ని తీసుకెళ్లారు. ►మేము అధికారాన్ని కాదు, శాంతిని కోరుకుంటున్నాం. సంక్షోభ సమయాల్లో మౌనమే మోదీ సమాధానమా? ►చైనా విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే. ►బాలీలో జిన్‌పనింగ్, మోదీ ఏం మాట్లాడుకున్నారో కేంద్రం దాచేసింది. ►చైనా గురించి మీరు మాట్లాడుతున్నారా? ►ఢిల్లీ అల్లర్ల సమయంలోనూ మోదీ సమాధానం మౌనమే ►రెజర్ల ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే ►రైతు ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే ►అదానీ విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే ►తప్పును దేశ ప్రజల ముందు ఒప్పుకోవడం లేదు ►మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాకా డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ►అసోం రైఫిల్స్ మణిపూర్ పోలీసులు కొట్టుకున్నారు ►ఇదేనా నవభారతం ►ప్రభుత్వంపై నమ్మకం లేకే సుప్రీంకోర్టు కమిటీ వేసింది అసలు మణిపూర్‌లో ఏం జరగుతోంది? ►సంఖ్యాబలం లేదన్న విషయం మాకు తెలుసు. తప్పని పరిస్థితుల్లో అవిశ్వాసం పెట్టాం. ►మణిపూర్‌కు రాహుల్, విపక్ష ఎంపీలు వెళ్లారు. ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదు. ►మణిపూర్‌లో హింస కొత్తది కాదు, గతంలోనూ చాలాసార్లు అల్లర్లు జరిగాయి. ►ఇప్పటి పరిస్థితికి అప్పటి పరిస్థితికి సంబంధమే లేదు. ప్రస్తుత పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ►ఒక వర్గం మరో వర్గాన్ని తీవ్రంగా ద్వేషిస్తుంది. ►మణిపూర్ అల్లర్లపైప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదు. ►80 రోజుల తర్వాత అది కూడా 30 సెకన్లు మాత్రమే మాట్లాడారు. ►ఎంతమంది మాట్లాడినా ప్రధాని స్పందిస్తే వేరుగా ఉంటుంది. ►మణిపూర్‌లో కేంద్ర ఇంటెలిజెన్స్ విఫలమైంది. ►అక్కడ ఇప్పటి వరకు 150 మంది చనిపోయారు. 5 వేల వరకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 60 వేల మంది శిబిరాల్లో ఉన్నారు. 60 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. Congress MP Gaurav Gogoi says, "PM will have to accept that his double-engine govt, his govt in Manipur has failed. That is why, 150 people died in Manipur around 5000 houses were torched, around 60,000 people are in relief camps and around 6500 FIRs have been registered. The CM… pic.twitter.com/MBSbSsyJLH — ANI (@ANI) August 8, 2023 మణిపూర్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తోంది? ►మణిపూర్ సీఎంను ఎందుకు తొలగించలేదు? ►మణిపూర్ అంతా బాగుందని మీరు అంటున్నారు. ►ఇప్పటికీ ఇంటర్నెట్ లేదు, పిల్లలు స్కూళ్లకు దూరమయ్యారు. ►ఇద్దరు మహిళలను రోడ్డుపై నగ్నంగా ఊరేగించారు, అయినా మోదీ మౌనం వీడలేదు. ►డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైందని మాట్లాడాల్సి వస్తుందని మోదీ స్పందించడం లేదా? ►మణిపూర్‌లో పోలీస్ స్టేషన్లోకి చొరబడి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. ►అక్కడి ప్రజలు న్యాయం కోరుతున్నారు #WATCH | Congress MP Gaurav Gogoi says, "PM took a 'maun vrat' to not speak in the Parliament. So, we had to bring the No Confidence Motion to break his silence. We have three questions for him - 1) Why did he not visit Manipur to date? 2) Why did it take almost 80 days to… pic.twitter.com/rfAVe77sNY — ANI (@ANI) August 8, 2023 మణిపూర్ భారత్‌లో అంతర్భాగం: గౌరవ్ గోగోయ్ ►మణిపూర్ మండుతుంటే దేశం మండుతున్నట్లే. ►మణిపూర్‌పై పార్లమెంట్లో ప్రధాని మాట్లాడాలి. ►మణిపూర్ కోసమే అవిశ్వాసం తెచ్చాం. ►మణిపూర్ న్యాయం కోరుతోంది. ►లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై మధ్యాహ్నం 12 గంటలకు చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అవిశ్వాసంపై చర్చను ప్రారంభించారు. మొదట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అది జరగకపోవడంతో సభ ప్రారంభమైన వెంటనే తీవ్ర వాగ్వాదం జరిగింది. రాహుల్ ఎందుకు చర్చ ప్రారంభించలేదని బీజేపీ ఎంపీలు చురకలు అంటించారు. పార్టీలకు సమయం కేటాయించిన స్పీకర్ ►మొత్తం 16 గంటలపాటు చర్చ కొనసాగనుంది. ►బీజేపీకి 6. 41 గంటలు, కాంగ్రెస్‌కు గంటా 9 నిమిషాలు కేటాయింపు ►డీఎంకే, టీఎంసీకి 30 నిమిషాల చొప్పున సమయం కేటాయింపు ►వైఎస్సార్సీపీకి 29 నిమిషాలు, శివసేనకు 24 నిమిషాలు, బీఆర్ఎస్కు 12 నిమిషాలు, బీఎస్పీకి 12 నిమిషాలు కేటాయింపు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. లోక్‌సభలో ఈ చర్చను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడనున్నారు. దీంతో మణిపూర్ హింసపై కాంగ్రెస్ అగ్రనేత ఎలాంటి ప్రసంగం చేస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాహుల్ ఏం మాట్లాడనున్నారు? మూడు నెలలుగా హింసాకాండతో రగిలిపోతున్న మణిపూర్‌లోని ఘర్షణ ప్రాంతాలను జూన్‌లో రాహుల్ సందర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మాన చర్చలో రాహుల్ 'సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్' అవుతారని కాంగ్రెస్ ధీమాతో ఉంది. ఇక అవిశ్వాస తీర్మానంపై చర్చ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై.. సాయంత్రం 7 గంటల వరకూ ఉంటుంది. ఇలా వరుసగా మూడు రోజులపాటు చర్చ జరుగనుంది. అనంతరం చివరి రోజైనా ఆగస్టు 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ చర్చకు సమాధానమిస్తారు. అదే రోజు గురువారం ఓటింగ్ నిర్వహించనున్నారు. రాహుల్ ఈజ్ బ్యాక్ ఇదిలా ఉండగా మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని సోమవారం పునరుద్దరించడంతో నాలుగు నెలల అనర్హత వేటు అనంతరం నిన్న ఆయన పార్లమెంటులో అడుగు పెట్టారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, ప్రతిపక్ష కూటమి నేతలు సంబరాలు చేసుకొని.. రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. చదవండి: పంచాయతీ రాజ్ ప్రాముఖ్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేదు లోక్‌సభలో ఎవరి బలం ఎంత? కాగా లోక్‌సభలో మెజారిటీ మార్కు 272. లోక్‌సభలో ఎన్డీయే కూటమి 331 ఎంపీల బలం ఉంది. బీజేపీకి సొంతంగానే 301 మంది ఎంపీలు ఉన్నారు. విపక్షాల ఇండియా కూటమి బలం 144, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేడీకి కలిపి 70 మంది ఎంపీల బలం ఉంది. అయితే లోక్‌సభలో 64 మంది తటస్థ ఎంపీలు ఉండగా.. ఆరు అయిదు స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఎన్డీయే కూటమికి అనుకూలంగా 273 మంది ఎంపీల మద్దతు తెలిపితే.. అవిశ్వాస తీర్మానం ఈజీగా వీగిపోతుంది. ► లోక్‌సభలో మొత్తం సీట్లు : 543 ►ఖాళీగా ఉన్న స్థానాలు: 5 ► ప్రస్తుత లోక్ సభలో ఉన్న సభ్యులు: 537 ►ఎన్డీయే కూటమిబలం : 331 (లోక్ సభ స్పీకర్ తో కలిపి) ►బీజేపీ – 301, శివసేన 13, ఆర్ఎల్ జేపీ – 5, ఏడీపీ – 2, రాంవిలాస్ పార్టీ – 1, అజిత్ పవార్ కూటమి – 1, ఏజేఎస్ యూ – 1, ఎన్డీపీపీ – 1, ఎపీఎఫ్ – 1, ఎపీపీ – 1, ఎస్కేఎం – 1, ఎంఎన్ఎఫ్ – 1, స్వతంత్రులు(సుమలత, నవనీత్ కౌర్) – 2 ►విపక్ష ఇండియా కూటమి బలం: 143 ఎంపీలు ►కాంగ్రెస్ – 51, డీఎంకే – 24, టీఎంసీ – 23, జేడీయూ – 16, శివసేన (ఉద్దవ్ థాక్రే) – 6, శరద్ పవార్ – 4, ఎస్పీ – 3, సీపీఎం – 3, సీపీఐ – 2, ఆప్ – 1, జేఎంఎం – 1, ఆర్ఎస్పీ – 1, వీసీకే – 1, కేరళ కాంగ్రెస్ (మని) – 1 తటస్థ పార్టీల బలం : 63 ►వైఎస్సార్సీపీ-22, బీజేడీ – 12, బీఆర్ఎస్-9, ఎంఐఎం-2, బీఎస్పీ – 9, టీడీపీ – 3, ఎస్ఏడీ – 2, జేడీఎస్ 1, ఆర్ఎల్పీ 1, ఏఐయూడీఎఫ్ 1, ఇండిపెండెంట్ – 1. ఏ పార్టీకి ఎంత సమయం! లోక్‌సభలోని పార్టీ సభ్యుల బలం ఆధారంగా.. బీజేపీకి దాదాపు 6 గంటల 41 నిమిషాలు అవిశ్వాసంపై చర్చించేందుకు సమయం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి దాదాపు గంటా 15 నిమిషాల సమయం కేటాయించారు. వైఎస్సార్ సీపీ. శివసేన, జనతాదళ్ -యునైటెడ్ (జేడీయూ, బిజూ జనతాదళ్ (బీజేడీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) , లోక్ జనశక్తి పార్టీకి (ఎల్జీపీ) కలిపి మొత్తం 2 గంటల సమయం ఇచ్చారు. ఇక ఇతర చిన్న పార్టీలు, స్వతంత్ర ఎంపీలకు 1 గంట 10 నిమిషాల కాల పరిమితిని నిర్ణయించారు. వీగిపోతుందని తెలిసినా.. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిశ్వాసాన్ని ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2018లో తొలిసారి ప్రతిపక్షాలు మోదీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. 325 ఎంపీల మద్దతుతో ఎన్డీయే కూటమి ఈ చర్చలో నెగ్గింది. అవిశ్వాసానికి అనుకూలంగా కేవలం 126 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి కూడా బల పరీక్షలో కేంద్రం తేలిగ్గా గెలవగలదు. అవిశ్వాసం వీగిపోతుందని తెలిసినా.. మణిపూర్ అంశంపై ప్రధాని ఇంత వరకూ మాట్లాకపోవడంతో, ఇప్పుడైనా ఎలాగైనా స్పందిస్తారని ప్రతిపక్ష కూటమి ఈ అస్త్రాన్ని ప్రయోగించింది. కీలకంగా మూడు రోజుల చర్చలు పార్లమెంట్లో మోదీ మాట్లాడాలని వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి విపక్ష పార్టీ సభ్యులు ఉభయసభలను అడ్డుకుంటూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు వారాల నుంచి పార్లమెంట్ ఏ ఒక్క రోజూ కూడా సజావుగా సాగలేదు. ప్రతి రోజూ వాయిదాల పర్వమే కొనసాగుతోంది. అయితే జులై 26న కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్.. ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. లోక్‌సభ ఒప్పుకుంది. ఆ తర్వాత చర్చకు లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ 3 రోజుల సమయం ఇచ్చింది. మరి ఈ మూడు రోజులు పార్లమెంట్ సమావేశాలు ఎలా సాగుతాయో వేచిచూడాలి. -
ఢిల్లీ బిల్లుపై కేంద్రానికి బీజేడీ మద్దతు
న్యూఢిల్లీ: ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుకు ఒడిశా అధికార పక్షం బిజూ జనతా దళ్(బీజేడీ) మద్దతివ్వనుంది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి సైతం వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేడీ నిర్ణయాన్ని మంగళవారం రాజ్యసభలో ఆ పార్టీ నేత సస్మిత్ పాత్ర ప్రకటించారు. బీజేడీ నిర్ణయం ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో పార్లమెంట్లో ముఖ్యంగా రాజ్యసభలో కేంద్రానికి పెద్ద ఊరటనివ్వనుంది. బీజేపీ కూటమితోగానీ ప్రతిపక్షాలతోగానీ జట్టుకట్టకుండా ఢిల్లీ ఆర్డినెన్స్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తర్వాత కేంద్రానికి మద్దతు పలికిన రెండో పార్టీ బీజేడీ. రాజ్యసభలో అధికార పక్షంపై ప్రతిపక్ష పార్టీలదే పైచేయిగా ఉంది. బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నిర్ణయంతో రాజ్యసభలో కేంద్రం తీసుకొచ్చే బిల్లును ఓడించాలన్న ప్రతిపక్షాల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీలకు చెరో 9 మంది సభ్యుల బలముంది. ఈ రెండు పార్టీల 18 మంది సభ్యుల మద్దతుతో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లు రాజ్యసభలో నెగ్గేందుకు అవకాశమేర్పడింది. -
parliament session 2023: 8న అవిశ్వాసం
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పకపోవడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 8వ తేదీ నుంచి 3 రోజులపాటు లోక్‌సభలో చర్చ జరుగనుంది. 10వ తేదీన ప్రధాని మోదీ దీనిపై సమాధానమిచ్చే అవకాశం ఉంది. మంగళవారం లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై బుధవారం నుంచే చర్చ చేపట్టాలంటూ తాము డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి సహా ఇతర ప్రతిపక్ష ఎంపీలు బీఏసీ సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. కేంద్రంపై గత నెల 26న విపక్ష ‘ఇండియా’ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2014 తర్వాత మోదీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటుండడం ఇది రెండోసారి. 2018 జూలై 20న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది ఎంపీలు ఓటేశారు. మోదీ సర్కారు సునాయాసంగా గట్టెక్కింది. ఈసారి కూడా గెలుపు లాంఛనమే. ప్రస్తుత లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి కనీసం 332 మంది ఎంపీల మద్దతు ఉంది. నంబర్ గేమ్‌లో తాము ఓడిపోతామని తెలుసని, మణిపూర్ అంశంపై మాట్లాడేలా ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచాలన్నదే తమ ఉద్దేశమని విపక్షాలు చెబుతున్నాయి. మణిపూర్ అంశంపై విపక్షాల అందోళన మణిపూర్ వ్యవహారంపై పార్లమెంట్లో రగడ కొనసాగుతూనే ఉంది. వాయిదాల పర్వం ఆగడం లేదు. మణిపూర్ హింసపై పార్లమెంట్లో చర్చించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సైతం ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు ఆందోళనకి దిగారు. ప్రకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. లోక్‌సభ, రాజ్యసభ బుధవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో ‘ఢిల్లీ’ బిల్లు లోక్‌సభ మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. కొందరు వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ స్థానం పక్కనే నిల్చున్నారు. నినాదాలతో హోరెత్తించారు. ఇంతలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. హరియాణాలో జరిగిన హింసను బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ సభలో ప్రస్తావించారు. నినాదాలు, అరుపులతో గందరగోళం నెలకొనడంతో 15 నిమిషాల్లోనే స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు, నిరసనలకు తెరపడకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో జనన, మరణాల రిజి్రస్టేషన్(సవరణ) బిల్లు, ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్(డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) సవరణ బిల్లు, కానిస్టిట్యూషన్(òÙడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ అమెండ్మెంట్ బిల్లుపై స్వల్ప వ్యవధిపాటు చర్చించి, ఆమోదించారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ పాలనా సేవల నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023ని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సభలో విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. తమ చేతుల్లోని కాగితాలను చించి విసిరేశారు. వారి తీరును కేంద్ర హోంశాఖ అమిత్ షా తప్పుపట్టారు. విపక్ష ఎంపీల నిరసన కేవలం రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు. భారత రాజ్యాంగం ప్రకారం ఢిల్లీకి సంబంధించిన చట్టాలను చేసే అధికారం పార్లమెంట్‌కు ఉందని గుర్తుచేశారు. రాజ్యసభ నుంచి ‘ఇండియా’ ఎంపీల వాకౌట్ మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ రాజ్యసభ నుంచి ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో వాకౌట్ చేశారు. అంతకుముందు మణిపూర్ అంశంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. ప్రతిపక్షాల నినాదాల మధ్యే చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. సభలో ఎంపీల ప్రవర్తన ప్రజల దృష్టిలో హాస్యాస్పదంగా మారుతోందని ధన్‌ఖడ్ చెప్పారు. సభకు సహకరించాలని విపక్షాలను కోరారు. మణిపూర్ హింసపై చర్చ కోసం రూల్ 267 కింద విపక్ష ఎంపీలు ఇచ్చిన 60 నోటీసులను ఆయన తిరస్కరించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖకు సంబంధించిన ‘సిటిజెన్స్ డేటా సెక్యూరిటీ, ప్రైవసీ’పై పార్లోమెంటరీ స్థాయీ సంఘం ఇచ్చిన నివేదికపై సీపీఎం సభ్యుడు జాన్ బ్రిటాన్ లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను ధన్‌ఖడ్ తోసిపుచ్చారు. దేశంలో సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన మలీ్ట–స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీస్(అమెండ్మెంట్) బిల్లు–2023ను ఎగువసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఈ బిల్లు గత నెలలో లోక్‌సభలో ఆమోదం పొందింది. -
‘అవిశ్వాసం’ పూర్తయ్యేదాకా సభలో బిల్లులు ఆమోదించొద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఇతర బిల్లులను ఆమోదించడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ అభిప్రాయపడ్డారు. అవిశ్వాసంపై చర్చ, ఓటింగ్ జరిగి ఫలితం తేలిన తర్వాతే ఇతర బిల్లును ప్రవేశపెట్టడం లేదా ఆమోదించడం చేయాలని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం దీనిపై 10 రోజుల్లోగా చర్చ, ఓటింగ్ నిర్వహించాల్సి ఉంది. బిల్లులను ఇష్టారాజ్యంగా ఆమోదింపజేసుకోవడానికి ఈ గడువును వాడుకోవద్దని మనీశ్ తివారీ హితవు పలికారు. అలా చేయడం పార్లమెంటరీ సంప్రదాయాలకు, నైతిక విలువలకు విరుద్ధమన్నారు. -
పట్టువీడని విపక్షాలు
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే పార్లమెంట్లో సమాధానం చెప్పాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మణిపూర్‌లో అమాయకులు బలైపోతున్నా ప్రధానమంత్రి ఎందుకు నోరువిప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విపక్ష ఎంపీలు శుక్రవారం సైతం పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనకు దిగారు. అలాగే మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో తక్షణమే చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉభయసభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. కార్యకలాపాలేవీ జరగకుండానే లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభలో 3 బిల్లులకు ఆమోదం లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పదేపదే విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. 1978 మే 10న కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వెంటనే చర్చ జరిగిందని కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి గుర్తుచేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందిస్తూ.. ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నడుచుకుంటుందని, అవిశ్వాస తీర్మానంపై 10 రోజుల్లోగా చర్చ చేపట్టవచ్చని తేలి్చచెప్పారు. సంఖ్యా బలం ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల దాకా సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గందరగోళం మధ్యే పలు బిల్లులను సభ ఆమోదించింది. ఇదేమన్నా స్టేజీయా: చైర్మన్ ఆగ్రహం మణిపూర్ తదితర అంశాలపై చర్చకు రాజ్యసభలోనూ విపక్షాలు పట్టుబట్టాయి. 47 మంది ఎంపీలు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నోత్తరాల ప్రాధాన్యతను వివరిస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ జోక్యం చేసుకున్నారు. అది తమకు తెలుసని, మణిపూర్ హింసపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. దాంతో, ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి ఇది నాటక రంగం కాదని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఓబ్రెయిన్ బల్లపై చేతితో గట్టిగా కొడుతూ అరిచారు. ఆయన తీరును తప్పుబడుతూ సభను చైర్మన్ సోమవారానికి వాయిదా వేశారు. -
..అందుకే ఓకే చెప్పారనుకుంటా!
..అందుకే ఓకే చెప్పారనుకుంటా! -
ఈనాడు క్రెడిట్ టీడీపీ అసలు రంగు బయటపెట్టిందా?
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అసలు రంగు బయటపడింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తీరు తాజా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో డొల్ల అని తేలింది. ప్రపంచంలో ఏం జరిగినా.. ఆ క్రెడిట్ చంద్రబాబుదేనని చెప్పడంలో ఈనాడు ముందుంటుంది. అందులో భాగంగానే కేంద్రంపై విపక్షాలు అవిశ్వాసం పెట్టగానే.. ఆ క్రెడిట్ తెలుగుదేశందేనని తేల్చేసింది. ఓ వార్తను అచ్చేసింది. మరి ఈనాడు ఇంతగా జాకీలు పెట్టి లేపినా.. సభలో తెలుగుదేశం సభ్యులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కుర్చీలకే పరిమితమయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో క్రెడిట్ కొట్టేయాలి, ఢిల్లీలో బల్లిలా అతుక్కుపోవాలన్నది టీడీపీ, ఈనాడు సిద్ధాంతంలా కనిపించింది. చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా? ‘‘టీడీపీ స్ఫూర్తితోనే ‘ఇండియా కూటమి’ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ‘ఈనాడు’ చెప్పింది. మరి తీర్మానానికి మద్దతుగా టీడీపీ సభ్యులు పార్లమెంట్లో ఎందుకు లేచి నిలబడలేదో టీడీపీ కానీ, చంద్రబాబు కానీ, రామోజీ కానీ సమాధానం చెప్పాలి’’ అంటూ ఈనాడు వార్త, టీడీపీ తీరును ఎండగడుతూ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చురకలంటించారు. టీడీపీ స్ఫూర్తితోనే ‘ఇండియా కూటమి’ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ‘ఈనాడు’ చెప్పింది. మరి తీర్మానానికి మద్దతుగా టీడీపీ సభ్యులు పార్లమెంట్ లో ఎందుకు లేచి నిలబడలేదో టీడీపీ కానీ, చంద్రబాబు కానీ, రామోజీ కానీ సమాధానం చెప్పాలి! pic.twitter.com/NZPJABgTpR — Vijayasai Reddy V (@VSReddy_MP) July 27, 2023 -
దేశ చరిత్రలో దీంతో కలుపుకుని 27 అవిశ్వాస తీర్మానాలు
-
పార్లమెంట్లో మణిపూర్ ఘటన పై రచ్చ రచ్చ..!
-
ఏమిటీ తీర్మానం...?
ఒక్కోసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ మే లోక్‌సభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రవేశపెట్టేదే విశ్వాస తీర్మానం. ఇలా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మూడు ప్రభుత్వా లు బలం నిరూపించుకోలేక పడిపోయాయి... పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా అది ప్రత్యక్షంగా ఎన్నికయ్యే చట్టసభలో (భారత్‌లో అయితే లోక్‌సభ) మెజారిటీ ఉన్నంత కాలమే మనుగడ సాగించగలదు. కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు ఉమ్మడిగా బాధ్యత వహిస్తుందని రాజ్యాంగంలో 75(3) ఆర్టీకల్ నిర్దేశిస్తోంది. ఏమిటీ అవిశ్వాస తీర్మానం? ► ప్రభుత్వం, అంటే మంత్రిమండలి లోక్‌సభ విశ్వాసం కోల్పోయిందని, మరోలా చెప్పాలంటే మెజారిటీ కోల్పోయిందని భావించినప్పుడు బలం నిరూపించుకోవాలని ఎవరైనా డిమాండ్ చేసేందుకు అవకాశముంది. ► సాధారణంగా విపక్షాలే ఈ పని చేస్తుంటాయి. ఇందుకోసం అవి లోక్‌సభలో ప్రవేశపెట్టే తీర్మానమే అవిశ్వాస తీర్మానం. ► అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టే వీలుంది. ► లోక్‌సభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్లోని 198వ నిబంధన మేరకు దీన్ని ప్రవేశపెడతారు. ► కనీసం 50 మంది సహచర ఎంపీల మద్దతు కూడగట్టగలిగిన ఏ లోక్‌సభ సభ్యుడైనా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ► అనంతరం తీర్మానంపై చర్చ, అధికార–విపక్షాల మధ్య సంవాదం జరుగుతాయి. ప్రభుత్వ లోపాలు, తప్పిదాలు తదితరాలను విపక్షాలు ఎత్తిచూపుతాయి. వాటిని ఖండిస్తూ అధికార పక్షం తమ వాదన విని్పస్తుంది. ► చర్చ అనంతరం అంతిమంగా తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. ► లోక్‌సభకు హాజరైన ఎంపీల్లో మెజారిటీ, అంటే సగం మంది కంటే ఎక్కువ తీర్మానానికి మద్దతుగా ఓటేస్తే అది నెగ్గినట్టు. అంటే ప్రభుత్వం సభ విశ్వాసం కోల్పోయినట్టు. అప్పుడు మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం పడిపోతుంది. ప్రభుత్వమే పరీక్షకు నిలిస్తే.. విశ్వాస తీర్మానం ► అలాగే 1997లో హెచ్డీ దేవెగౌడ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచి్చన 10 నెలలకే బలపరీక్షకు వెళ్లింది. కేవలం 158 మంది ఎంపీలే దానికి మద్దతిచ్చారు. 292 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో ప్రభుత్వం కుప్పకూలింది. ► ఇక 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం చివరి క్షణంలో అన్నాడీఎంకే ప్లేటు ఫిరాయించి వ్యతిరేకంగా ఓటేయడంతో అనూహ్యంగా ఓడి ప్రభుత్వం పడిపోయింది. ► 1990లో రామమందిర అంశంపై బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో లోక్‌సభలో బలం నిరూపించుకునేందుకు వీపీ సింగ్ ప్రభుత్వం విశ్వాస తీర్మానం పెట్టింది. తీర్మానానికి అనుకూలంగా కేవలం 142 ఓట్లు రాగా వ్యతిరేకంగా ఏకంగా 346 ఓట్లు రావడంతో ప్రభుత్వం పడిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
27సార్లు అవిశ్వాసాలు.. ఒక్కటీ నెగ్గలేదు
స్వతంత్ర భారత చరిత్రలో లోక్‌సభలో ఇప్పటిదాకా ఏకంగా 27 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెగ్గలేదు. వాటి కారణంగా ఒక్కసారి కూడా కేంద్రంలో ప్రభుత్వం పడిపోలేదు. అయితే ప్రభుత్వమే కోరి తెచ్చుకునే విశ్వాస పరీక్షల్లో మాత్రం కనీసం మూడుసార్లు ప్రభుత్వాలు పడిపోయినట్టు పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే అధ్యయన సంస్థ పేర్కొంది. ఇందిరపై అత్యధికంగా 15 ‘అవిశ్వాసాలు’ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఏకంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ప్రధాని హయాంలో ఇదే అత్యధికం! ► ఇందిరపై తొలి అవిశ్వాసాన్ని 1966లో ఆమె అధికారంలోకి రాగానే కమ్యూనిస్టు దిగ్గజం హీరేంద్రనాథ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. కేవలం 61 మంది ఎంపీలే మద్దతివ్వగా 270 మంది వ్యతిరేకించారు.1966లోనే ఆమెపై రెండో అవిశ్వాసమూ వచి్చంది. తర్వాత 1967, 1968 (రెండుసార్లు), 1969, 1970, 1973, 1974 (రెండుసార్లు), 1975 (రెండుసార్లు–రెండోసారి ఎమర్జెన్సీ విధింపుకు కేవలం నెల రోజుల ముందు), 1976, 1978, 1981 (రెండుసార్లు), 1982ల్లో ఇందిరపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ► 1976లో ఇందిర ప్రభుత్వంపై బీజేపీ (నాటి జనసంఘ్) మేరునగం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రవేశపెట్టడం విశేషం! దానికి ఏకంగా 162 మంది ఎంపీలు మద్దతిచ్చారు! ఒక అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వచి్చన అత్యధిక ఓట్లు ఇవే. 257 మంది వ్యతిరేకంచడంతో తీర్మానం వీగిపోయింది. ఇదీ చరిత్ర... ► స్వతంత్ర భారత చరిత్రలో తొట్టతొలి అ విశ్వాస తీర్మానం 1963లో లోక్‌సభ తలుపు తట్టింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ కాంగ్రెస్‌కే చెందిన ఆచార్య కృపాలనీ దీన్ని ప్రవేశపెట్టడం విశేషం. 1962లో చైనాతో యుద్ధంలో ఓటడిన వెంటనే కృపాలనీ ఈ చర్యకు దిగారు. దీనిపై ఏకంగా 4 రోజుల పాటు 20 గంటలకు పైగా చర్చ జరిగింది. కేవలం 62 మంది ఎంపీలు మాత్రమే దీన్ని సమరి్థంచారు. 347 మంది వ్యతిరేకించడంతో చివరికి తీర్మానం వీగిపోయింది. ► లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంపై 1964లో ఎన్సీ ఛటర్జీ 1965లో ఎస్.ఎన్.ది్వవేది, స్వతంత్ర పార్టీ ఎంపీ ఎం.ఆర్.మసానీ ప్రవేశపెట్టారు. ► 1979లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ రాజీనామాకు దారితీసింది. తీర్మానంపై ఓటింగ్ జరగక చర్చ అసంపూర్తిగా మిగిలిపోయినా ఆయన స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం! ► 2003లో వాజ్‌పేయీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్ష నేత హోదాలో నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. కేవలం 189 మంది ఎంపీలు మద్దతివ్వగా, 314 మంది వ్యతిరేకించారు. దాంతో 21 గంటల చర్చ అనంతరం తీర్మానం వీగిపోయింది. ► 2018 మోదీ సర్కారుపై టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి 135 మంది ఎంపీలు మద్దతివ్వగా 330 మంది వ్యతిరేకించారు. పీవీపై మూడుసార్లు తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ప్రభుత్వం మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొంది! తొలిసారి 1992లో బీజేపీ ఎంపీ జశ్వంత్‌సింగ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై అధికార, విపక్షాలపై లోక్‌సభ వేదికగా నువ్వా నేనా అన్నట్టుగా పోరాటం జరిగింది. ఏకంగా 225 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతిచ్చారు. 271 మంది వ్యతిరేకించడంతో తీర్మానం వీగిపోయి పీవీ సర్కారు ఊపిరి పీల్చుకుంది! 1992లోనే పీవీ ప్రభుత్వంపై వాజ్‌పేయీ, 1993లో అజయ్ ముఖోపాధ్యాయ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. రాజీవ్ సర్కారుపై మన ఎంపీ మాధవరెడ్డి... ► 1987లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ టీడీపీ ఎంపీ సి.మాధవరెడ్డి కావడం విశేషం! అయితే అది మూజువాణి ఓటుతో వీగిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Parliament Monsoon Session 2023: అవిశ్వాసానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు దాదాపు ఏడాది ఉండగానే అధికార బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమి తదితర విపక్ష పార్టీల బాహాబాహీకి అనూహ్యంగా రంగం సిద్ధమైంది. అనూహ్యంగా లోక్‌సభే ఇందుకు వేదికగా మారనుంది! మణిపూర్ హింసాకాండ తదితరాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టే వ్యూహంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన నాటినుంచీ విపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తుండటం తెలిసిందే. అందులో భాగంగా మరో అడుగు ముందుకేసి మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని అవి తాజాగా నిర్ణయించాయి. ఆ సవాలు స్వీకరించి విపక్షాల ఎత్తును చిత్తు చేసేలా మోదీ సర్కారు పై ఎత్తు వేయడం, అందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పరిగణనలోకి తీసుకోవడం... ఇలా బుధవారం హస్తినలో అనూహ్య రాజకీయ పరిణామాలు ఒకదాని వెంట ఒకటి చకచకా చోటుచేసుకున్నాయి...! అన్ని పార్టీలతో సంప్రదించాక అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీ, సమయం తదితరాలు వెల్లడిస్తానని స్పీకర్ ప్రకటించారు. అదే రగడ...: మణిపూర్ హింసాకాండ తదితరాలపై లోక్‌సభలో బుధవారం కూడా రగడ జరిగింది. దాంతో సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం కాగానే, కేంద్ర మంత్రివర్గంపై విశ్వాసం లేదని పేర్కొంటూ గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్) ఇచి్చన నోటీసును స్పీకర్ అనుమతించారు. దానికి ఎందరు మద్దతిస్తున్నారని ప్రశ్నించగా కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ, ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), టీఆర్ బాలు (డీఎంకే), సుప్రియా సులే (ఎన్సీపీ) తదితర విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యులంతా లేచి నిలబడ్డారు. దాంతో తీర్మానాన్ని అనుమతిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎంపీలు శ్రీనివాసరెడ్డి, రాములు, దయాకర్ లోక్ సభ సెక్రటరీ జనరల్‌కు అవిశ్వాస నోటీసులిచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, రంజిత్‌రెడ్డితో పాటు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా దానిపై సంతకాలు చేశారు. ‘ఇండియా’ కూటమిలో బీఆర్ఎస్ భాగస్వామి కాని విషయం తెలిసిందే. ఇప్పడేమవుతుంది? అవిశ్వాస తీర్మానంపై ఏ రోజు, ఎప్పుడు చర్చ మొదలు పెట్టాలో స్పీకర్ సారథ్యంలో జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయమవుతుంది. ► చర్చలో పాల్గొనేందుకు ఏయే పార్టీకి ఎంత సమయం ఇవ్వాలో స్పీకర్ నిర్ణయిస్తారు. ► చర్చ తర్వాత తీర్మానంపై ప్రధాని సమాధానమిస్తారు. తర్వాత ఓటింగ్ జరుగుతుంది. లోక్‌సభలో బలాబలాలివీ... లోక్‌సభ మొత్తం బలం 543. ప్రస్తుతం 5 ఖాళీలున్నాయి. బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ పక్షానికి 330 మందికి పైగా, విపక్ష ‘ఇండియా’ కూటమికి 140కి పైగా ఎంపీల బలముంది. ఈ రెండు కూటముల్లోనూ లేని ఎంపీలు 60 మందికి పైగా ఉన్నారు. మోదీ జోస్యమే నిజమైంది! విపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో ప్రధాని మోదీ నాడు చెప్పిన జోస్యమే నిజమైందంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 జూలై 20న మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తెలిసిందే. దానికి అనుకూలంగా 126 మంది ఓటేయగా 325 మంది ఎన్డీఏ సభ్యులు వ్యతిరేకించారు. దాంతో భారీ మెజార్టీతో మోదీ సర్కారు గట్టెక్కింది. ఆ సందర్భంగా అవిశ్వాస తీర్మానంపై చర్చకు మోదీ బదులిస్తూ విపక్షాలను ఎద్దేవా చేశారు. ‘2023లోనూ నా ప్రభుత్వంపై అవిశ్వాస పరీక్ష పెట్టేంతగా వాళ్లు సన్నద్ధం కావాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ చెణుకులు విసిరారు. అచ్చం ఆయన అన్నట్టుగానే ఇప్పుడు జరుగుతోందంటూ బుధవారం రోజంతా సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి. -
మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే!
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోనుంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వేర్వేరుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌పై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. దీనిపై అన్ని పార్టీలతో చర్చించి.. చర్చ తేదీని ప్రకటిస్తానని స్పీకర్ వెల్లడించారు. కాగా ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వం లోక్‌సభలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. సభలో ఎన్డీయే కూటమి తమ మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెజార్టీ కోల్పోతే ప్రధానితో సహా, కేబినెట్ మొత్తం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం దిగిపోవాల్సి వస్తుంది. చదవండి: విపక్షాలు ఆందోళనలతో దద్దరిల్లిన పార్లమెంట్.. లోక్‌సభ వాయిదా వీగిపోతుందని తెలిసినా.. అయితే ప్రతిపక్ష పార్టీల అవిశ్వాస తీర్మానం బల పరీక్షలో విఫలమయ్యే అవకాశం ఉంది. అవిశ్వాసం వీగిపోతుందని తెలిసినప్పటికీ ప్రతిపక్ష కూటమి దీనిని ప్రయోగిస్తుంది. అవిశ్వాస తీర్మానం ద్వారా పార్లమెంట్లో మణిపూర్ అంశంపై తప్పక ప్రధాని మోదీ మాట్లాడటంతోపాటు.. తమకు పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనే యోచనతో విపక్ష కూటమి ఈ అడుగువేసింది. ఎవరి బలం ఎంత? లోక్‌సభలో ఎన్డీయే కూటమి 331 ఎంపీల బలం ఉంది. బీజేపీకి సొంతంగానే 303 మంది ఎంపీలు ఉన్నారు. విపక్షాల ఇండియా కూటమి బలం 144, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేడీకి కలిపి 70 మంది ఎంపీల బలం ఉంది. అయితే లోక్‌సభలో 64 మంది తటస్థ ఎంపీలు ఉండగా.. ఆరు ఎంపీ స్థానాలు ఖాళీ ఉన్నాయి. కాగా లోక్‌సభలో మెజారిటీ మార్కు 272. ఎన్డీయే కూటమికి అనుకూలంగా 273 మంది ఎంపీల మద్దతు తెలిపితే.. అవిశ్వాస తీర్మానం ఈజీగా వీగిపోతుంది. ► లోక్‌సభలో మొత్తం సీట్లు : 543 ►ఖాళీగా ఉన్న స్థానాలు: 6 ► ప్రస్తుత లోక్ సభలో ఉన్న సభ్యులు: 537 ►ఎన్డీయే కూటమిబలం : 331 (లోక్ సభ స్పీకర్ తో కలిపి) ►బీజేపీ – 301, శివసేన 13, ఆర్ఎల్ జేపీ – 5, ఏడీపీ – 2, రాంవిలాస్ పార్టీ – 1, అజిత్ పవార్ కూటమి – 1, ఏజేఎస్ యూ – 1, ఎన్డీపీపీ – 1, ఎపీఎఫ్ – 1, ఎపీపీ – 1, ఎస్కేఎం – 1, ఎంఎన్ఎఫ్ – 1, స్వతంత్రులు(సుమలత, నవనీత్ కౌర్) – 2 ►విపక్ష ఇండియా కూటమి బలం – 142 ఎంపీలు ►కాంగ్రెస్ – 50, డీఎంకే – 24, టీఎంసీ – 23, జేడీయూ – 16, శివసేన (ఉద్దవ్ థాక్రే) – 6, శరద్ పవార్ – 4, ఎస్పీ – 3, సీపీఎం – 3, సీపీఐ – 2, ఆప్ – 1, జేఎంఎం – 1, ఆర్ఎస్పీ – 1, వీసీకే – 1, కేరళ కాంగ్రెస్ (మని) – 1 తటస్థ పార్టీల బలం : 31 ►వైఎస్సార్సీపీ-22, బీఆర్ఎస్-9, ఎంఐఎం-2, బీజేడీ – 12, బీఎస్పీ – 9, టీడీపీ – 3, ఎస్ఏడీ – 2, జేడీఎస్ 1, ఆర్ఎల్పీ 1, ఏఐయూడీఎఫ్ 1, శిరోమణి అకాలీదళ్ – 1, ఇండిపెండెంట్ – 1 -
అవిశ్వాస తీర్మానానికి అనుమతిచ్చిన స్పీకర్
-
విపక్షాల అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి
-
అవిశ్వాసం.. నాలుగేళ్ల కిందటి ప్రధాని మాటలు వైరల్
ఢిల్లీ: ఎన్డీయే సర్కార్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టిన వేళ.. మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. విపక్షాలు మళ్లీ 2023లో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడతాయని ప్రధాని నరేంద్ర మోదీ నాలుగేళ్ల కిందట మాట్లాడిన మాటల్ని బీజేపీ వైరల్ చేస్తోంది. 2019 ఫిబ్రవరి 7వ తేదీన బడ్జెట్ సమావేశాల టైంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ సమయంలో 2023లో ప్రతిపక్షం మరో అవిశ్వాసానికి రెడీ అవుతుందని వ్యాఖ్యానించారు. ‘‘2023లో మరో అవిశ్వాసంతో ముందుకు వచ్చేలా వాళ్లకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అంటూ ఆయన ప్రసంగించగా.. పక్కనే ఉన్న రాజ్‌నాథ్ సహా అధికార ఎంపీలంతా టేబుల్స్‌ను తట్టి నవ్వులు చిందించారు. ‘‘మేం చేసిన సేవకు ఇద్దరు ఎంపీల నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. అహంకారంతో వాళ్లు 400 నుంచి 40కి పడిపోయారు. ఇవాళ వాళ్లు ఎక్కడున్నారో చూడండి.. అంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు సైతం అక్కడే ఉన్నారు. VIDEO: PM Sh @narendramodi had made a prediction 5 years back about the opposition bringing a No confidence motion! pic.twitter.com/dz8McicQ40 — Dr Jitendra Singh (@DrJitendraSingh) July 26, 2023 అంతకు ముందు ఏడాది అంటే.. 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఇండియా కూటమి, బీఆర్ఎస్ పార్టీ వేర్వేరుగా ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతిస్తూ.. అఖిలపక్ష భేటీ తర్వాత తేదీని నిర్ణయయిస్తామని లోక్‌సభలో వెల్లడించారు. -
అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు...
-
మోదీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
-
విపక్షాలు ఆందోళనలతో దద్దరిల్లిన పార్లమెంట్.. లోక్‌సభ వాయిదా
లోక్‌సభలో ఎన్డీయేపై అవిశ్వాసం.. Live Updates లోక్‌సభ వాయిదా మణిపుర్ అంశంపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. మణిపుర్‌పై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన నడుమ లోక్‌సభను బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ► “ప్రధానమంత్రి పార్లమెంటును గౌరవించాలి. ఇది రాష్ట్రపతి పాలన కాదు, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’’..లోక్‌సభ స్పీకర్ ఆమోదించిన అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ► ఢిల్లీ పాలనాధికారాల బిల్లుపై కాంగ్రెస్, బీఆర్ఎస్లు విప్ జారీ చేశాయి. లోక్‌సభ ఎంపీలంతా సభకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీ. ఢిల్లీ పాలనాధికారాల బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలంటూ విప్లో పేర్కొంది. ► మణిపూర్ అంశంపై పార్లమెంట్లో నెలకొంటున్న గందరగోళంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ‘‘ప్రధాని మోదీని వచ్చి మాట్లాడమని మేం కోరుతున్నాం.ఆయన మౌనం ఆయన ప్రతిష్టకే భంగం కలిగిస్తుంది. దేశ ప్రజలకు మేం కట్టుబడి ఉన్నాం, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాం. అంటూ లేఖలో పేర్కొన్నారయన. LoP in Rajya Sabha Mallikarjun Kharge writes to Union Home Minister Amit Shah over the logjam in the Parliament over Manipur issue. "We have been urging the Prime Minister to come and speak in the Parliament but it seems that will hurt his prestige. We are committed to the… pic.twitter.com/OtAr41TqK8 — ANI (@ANI) July 26, 2023 ► ప్రధాని మోదీ గైర్జాహజరు విపక్ష సభ్యులు నిలదీయడంతో సభలో గందరగోళం నెలకొనగా.. లోక్‌సభ మధ్యాహ్నాం 2గం. వరకు వాయిదా పడింది. Lok Sabha adjourned till 2 pm amid sloganeering by the Opposition MPs who are demanding the PM's presence in the House for discussion on Manipur. pic.twitter.com/vSJTsQRR9a — ANI (@ANI) July 26, 2023 ► ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ గోగోయ్ ప్రవేశపెట్టిన తీర్మానంపై.. సోనియా గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలు తమ తమ స్థానాల్లో నిలబడి మద్దతు ప్రకటించారు. అయితే అఖిలపక్షంతో భేటీ తర్వాత అవిశ్వాసంపై తేదీ ప్రకటిస్తానని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ► తిరిగి ప్రారంభమైన లోక్‌సభ ► బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానంపై ఆ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి సాక్షి టీవీతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంతో మాకు సంబంధం లేదు. మేము విడిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. మా అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన ప్రతిపక్షం. ఆ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తి లేదు. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడాలి. ఆయన అసలు ఎందుకు మాట్లాడడం లేదు? అని ఎంపీ రంజిత్ రెడ్డి నిలదీశారు. ► BRS ఎంపీల అవిశ్వాస తీర్మానంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు. Rajya Sabha adjourned till 12 noon amid sloganeering by MPs in the House, who are demanding discussion on Manipur. pic.twitter.com/7KYA1vVmpx — ANI (@ANI) July 26, 2023 రాజ్యసభలో మైక్ లొల్లి ► రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మైక్‌ను ఆపేశారంటూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. మైక్ ఆపేయడం వల్ల తన ఆత్మగౌరవం దెబ్బతిందని వాదించారాయన. అయితే తాను మైక్ ఆపేయలేదని చైర్మన్ ధన్‌ఖడ్ స్పష్టం చేశారు. అయినా ఆ వివరణతో ప్రతిపక్ష సభ్యులు సంతృప్తి చెందకుండా.. నిరసన కొనసాగిస్తున్నారు. ► విపక్ష సభ్యుల నినాదాలతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. ► రాజ్యసభలోనూ విపక్షాల మొండిపట్టు. మణిపూర్‌పై చర్చ జరగాలని డిమాండ్. ► మణిపూర్ పరిస్థితులపై ప్రధాని మోదీ స్పందించాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ► పార్లమెంట్వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. బుధవారం ఉభయ సభలు ప్రారంభం అయ్యాయి. మణిపూర్ ఘటనపై చర్చించాలని విపక్షాలు నినాదాలు చేస్తున్నాయి. ► లోక్‌సభలో ఎన్డీయే కూటమి బలం 330, ఇండియా కూటమి బలం 141, ఏ కూటమిలో లేని మరో 64 మంది ఎంపీలు. ఆరు ఎంపీ స్థానాలు ఖాళీ ఉన్నాయి. అవిశ్వాస తీర్మానంపై 50 మంది ఎంపీలు సంతకం చేశారు. వీగిపోతుందని తెలిసి కూడా.. అవిశ్వాసంతో మణిపూర్ అంశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా విపక్ష కూటమి ప్రయత్నిస్తోంది. ► అందుకే అవిశ్వాసం మా పార్టీ తరపున అవిశ్వాస తీర్మానం పెట్టాం. సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష నేతలంతా మణిపూర్ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రధాని మాట్లాడితే శాంతి నెలకొంటుంది.అందుకే మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. :::బీఆర్ఎస్ ఎంపీ నామా #WATCH | BRS MP Nama Nageswara Rao says, "We have moved the No Confidence Motion on behalf of our party. Since the commencement of the session all Opposition leaders had been demanding discussion on Manipur issue. If the PM speaks on this, there will be peace among people of the… https://t.co/wHC997gWVm pic.twitter.com/Jb9NWfEKPR — ANI (@ANI) July 26, 2023 ► ప్రజలే బుద్ధి చెప్పారు దేశ ప్రజలకు ప్రధాని మోదీ, బీజేపీపై విశ్వాసం ఉంది. గత టర్మ్‌లోనూ అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారు. ఈ దేశ ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు. :::పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి #WATCH | Parliamentary Affairs Minister Pralhad Joshi says, "People have confidence in PM Modi and BJP. They brought a No Confidence Motion in the last term as well. People of this country taught them a lesson." pic.twitter.com/GCemoT5gLT — ANI (@ANI) July 26, 2023 ► లోక్ సభలో వేరుగా.. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. అలాగే.. తన పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది బీఆర్ఎస్. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎంపీలకు విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది. BRS MP Nama Nageswara Rao has also filed the No Confidence Motion against the Government. pic.twitter.com/TAdLp1fD2Q — ANI (@ANI) July 26, 2023 ► మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ► డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ శుక్లా, రంజీత్ రంజన్, ఆప్ ఎంపీ రాఘ చద్దా రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ నోటీసును సస్పెండ్ చేస్తూ మణిపూర్ పరిస్థితిపై చర్చకు డిమాండ్ చేశారు. ► కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అంతా రంగం సిద్ధమైంది. యాభై మంది ఎంపీలు సంతకాలు చేశారు. బుధవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. Congress MP Gaurav Gogoi files the No Confidence Motion against the Government in Lok Sabha. pic.twitter.com/osx0ljhrPZ — ANI (@ANI) July 26, 2023 ► మణిపూర్ అంశంపై విపక్ష కూటమి ప్రభుత్వంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని చర్చకు రావాలన్న డిమాండ్‌కు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. పైగా దీర్ఘకాలిక చర్చకూ సిద్దంగా లేదు. ఈ తరుణంలో అవిశ్వాస తీర్మానానికి విపక్ష కూటమి సిద్ధమైంది. ► బుధవారం ఉదయం విపక్ష కూటమి INDIA నేతలు సమావేశం కాగా.. 50 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం కోసం సంతకాలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్‌చౌదరి సైతం ధృవీకరించారు. ► అవిశ్వాసం వీగిపోతుందని తెలిసినా.. ఒకవేళ స్పీకర్ గనుక ఓటింగ్-చర్చకు అనుమతించడం ద్వారా మణిపూర్ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం దొరుకుతుందని, తద్వారా బీజేపీని నిలదీయొచ్చని విపక్ష కూటమి ఇండియా భావిస్తోంది. -
కేంద్రంపై అవిశ్వాసం.!
-
పార్లమెంట్లో నేడే అవిశ్వాసం
సాక్షి, న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై పార్లమెంట్ వెలుపలా, లోపలా నిరసనలతో హోరెత్తిస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ నోరుమెదపకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరిట ఇటీవలే ఒక్కటైన కాంగ్రెస్ సహా 26 విపక్షాలు ఈ అంశానికి సంబంధించి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన మంగళవారం జరిగిన విపక్షాల భేటీలో అవిశ్వాస తీర్మానంపై కీలక చర్చలు జరిగాయి. బుధవారం నేతలతో మరోసారి సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. తీర్మాన ప్రతి ఇప్పటికే సిద్ధమైందని, 50 మంది ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియ జరుగుతోందని వివరించారు. ఆ రోజు విధిగా లోక్‌సభకు హాజరవాలంటూ కాంగ్రెస్ ఇప్పటికే తమ సభ్యులకు విప్ జారీ చేసింది. మరోవైపు, మణిపూర్‌పై చర్చిద్దాం రమ్మంటూ ఉభయ సభల్లో విపక్ష నేతలు ఖర్గే, అదీర్ రంజన్ చౌదరిలకు అమిత్ షా లేఖలు రాశారు. లోక్‌సభలో ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. 83 రోజులుగా సాగుతున్న మణిపూర్ హింసపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధాని మోదీ సమగ్రమైన ప్రకటన చేయాల్సిందేనని ఖర్గే డిమాండ్ చేశారు. అక్కడ పరిస్థితిని మెరుగు పరిచేందుకు కేంద్రం ఏం చేస్తోందో పార్లమెంటుకు చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. ఖర్గే వర్సెస్ గోయల్ ఉభయ సభల్లోనూ విపక్షాలు మంగళవారం నాలుగో రోజు కూడా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. మణిపూర్‌పై మోదీ వచ్చి ప్రకటన చేయాలంటూ నినదాలతో హోరెత్తించాయి. ఉదయం రాజ్యసభ ఆరంభానికి ముందే బీఆర్ఎస్తో పాటు 51 మంది విపక్ష ఎంపీలు 267 నిబంధన కింద నోటీసులిచ్చారు. 176 నిబంధన కింద ఇచ్చిన నోటీసులపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని సభా పక్ష నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. 267 కింద నోటీసులిస్తే 176 కింద ఎలా చర్చ చేపడతారని కాంగ్రెస్ నేత పి.చిదంబరం ప్రశ్నించారు. తమ ఎంపీ సంజయ్‌సింగ్ సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఆప్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. దాంతో సభ మధ్యాహా్ననికి వాయిదా పడింది. తిరిగి మొదలవగానే విపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగాయి. గోయల్, ఖర్గే మధ్య వాగ్వాదం జరిగింది. మణిపూర్ తగలబడుతుంటే దానిపై చర్చకు ‘మోదీ సాబ్’ సభకు ఎందుకు రాలేదని ఖర్గే ప్రశ్నించగా, విపక్ష పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అకృత్యాల మీదా సభలో చర్చిద్దామని గోయల్ అన్నారు. దాంతో సభ మధ్యాహ్నం రెండింటి దాకా వాయిదా పడింది. ఎస్టీల రాజ్యంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టగానే విపక్షాల ఆందోళన నేపథ్యంలో సభ బుధవారానికి వాయిదా పడింది. లోక్‌సభ కూడా నేరుగా మధ్యాహ్నం రెండింటికి, అనంతరం జీవ వైవిధ్య బిల్లును ప్రవేశపెట్టాక సాయంత్రం ఐదింటికి వాయిదా పడింది. తర్వాత సహకార సంఘాల బిల్లును సభ ఆమోదించింది. ప్రతిష్టంభనకు ఫుల్స్టాప్ పెట్టేందుకు అఖిల పక్ష నేతలతో స్పీకర్ ఓం బిర్లా భేటీ అయినా లాభం లేకపోయింది. మోదీ వచ్చి మణిపూర్ హింసపై స్వయంగా చర్చ మొదలు పెట్టాల్సిందేనని వారు స్పష్టం చేశారు. ఏ రోజైనా చర్చకు సిద్ధమని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చర్చ మొదలు పెడతారని అధికార పక్షం ప్రతిపాదించింది. ఇక సంజయ్ సింగ్ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద విపక్ష కూటమి సోమవారం రాత్రంతా బృందాలవారీగా చేసిన ధర్నాలో బీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. మోదీకి ‘ఇండియా’ పేరు నచ్చినట్టుంది: మమత కోల్‌కతా: ‘‘ప్రధాని మోదీకి థ్యాంక్స్. విపక్ష కూటమి పేరు ‘ఇండియా’ ఆయనకు బాగా నచ్చినట్టుంది’’ అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చెణకులు విసిరారు. విపక్ష కూటమి గురించి బీజేపీ ఎంతగా విమర్శలు చేస్తే, ‘ఇండియా’ అనే పేరు వారికి అంతగా నచ్చినట్టు అర్థమన్నారు. -
ఎన్డీయేపై సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం?
ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. విపక్ష కూటమి ఇండియా(INDIA) లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రసంగంపై కేంద్రం వెనకడుగు వేస్తున్న వేళ.. విపక్షాల కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే మణిపూర్ అంశం మళ్లీ కుదిపేసింది. ఈ క్రమంలో విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ తర్వాతే విపక్ష కూటమి అవిశ్వాసం దిశగా ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మణిపూర్ అంశంతో రాజ్యసభలోనూ గందరగోళం నెలకొనగా.. వాయిదా పడింది. ప్రధాని సెటైర్లు.. ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రానా(విపక్షాల) వారి తీరు మారుతుందా? అంటూ ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి దిశ దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదని వ్యాఖ్యానించిన ఆయన.. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిద్దీన్లోనూ ఇండియా అనే పదం ఉందంటూ సెటైర్లు వేసినట్లు సమాచారం. -
కోరం లేకున్నా.. బడ్జెట్ ఆమోదమే!
సాక్షి, హైదరాబాద్: చాలా మునిసిపల్ పాలకమండళ్లకు పలువురు సభ్యులు అవిశ్వాస నోటీసులు ఇవ్వడంతో బడ్జెట్ సమావేశాలకు కోరం కరువైంది. కోరం లేకున్నా మునిసిపల్ బడ్జెట్లు ఆమోదం పొందుతున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో 2023–24 వార్షిక బడ్జెట్ల ఆమోదానికి శుక్రవారం ఒక్కరోజే గడువు మిగిలి ఉంది. రాష్ట్రంలోని 128 మునిసిపాలిటీలు, 13 కార్పొరేషన్లకుగాను ఇప్పటికే మూడోవంతు పట్టణ పాలకమండళ్లు సమావేశాలు నిర్వహించి రాబోయే వార్షిక బడ్జెట్లకు ఆమోదం తెలిపాయి. అయితే ఈసారి పురపాలికల్లో అవిశ్వాసాల రగడ మొదలవడంతో చాలా మునిసిపాలిటీల్లో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. మునిసిపల్ చట్టసవరణకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో మూడేళ్ల పదవీకాలం పూర్తయిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫిబ్రవరిలో అవిశ్వాసాల ప్రక్రియ సాగింది. ఇందులో భాగంగా జగిత్యాల మునిసిపల్ చైర్పర్సన్ ఏకంగా రాజీనామా కూడా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు హుజూరాబాద్, వికారాబాద్, తాండూర్, యాదగిరిగుట్ట, ఆలేరు, చండూరు, జనగాం, దమ్మాయిగూడెం, జవహర్‌నగర్ కార్పొరేషన్, చౌటుప్పల్, నాగార్జునసాగర్, ఇబ్రహీంపట్నం తదితర 37 మున్సిపల్ పాలకమండళ్లకు సంబంధించి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. అవిశ్వాస ప్రతిపాదనల గడువును మూడేళ్ల పదవీకాలం నుంచి నాలుగేళ్లకు పెంచిన సవరణ చట్టం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో మునిసిపల్ చైర్పర్సన్లే హైకోర్టును ఆశ్రయించి 29 చోట్ల స్టే తెచ్చుకున్నారు. మిగతా మునిసిపాలిటీలకు సంబంధించి కూడా ఎలాంటి పురోగతి లేదు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ముగియనున్న పాత ఆర్థిక సంవత్సరంలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కోరంతో సంబంధం లేకుండా ఆమోదం అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మునిసిపల్ చైర్పర్సన్లు నిర్వహించే బడ్జెట్ సమావేశాలకు సభ్యులు హాజరుకాని పరిస్థితి నెలకొంది. ఇటీవల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో బడ్జెట్ సమావేశం నిర్వహించగా, కోరం లేక తొలిరోజు వాయిదా పడింది. మరుసటిరోజు కోరంతో సంబంధం లేకుండా సమావేశాన్ని నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించారు. అదే జిల్లాకు చెందిన కొత్తపల్లి మునిసిపాలిటీలో అవిశ్వాస నోటీసు ఇవ్వకపోయినా, సరిపడా సభ్యులు రాలేదు. అయినా కోరంతో సంబంధం లేకుండా మరుసటిరోజు బడ్జెట్‌ను ఆమోదించారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రల్లో భాగమే... : వెన్‌రెడ్డి రాజు, మునిసిపల్ చాంబర్స్ చైర్మన్ రాష్టంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగమే ‘అవిశ్వాసాలు’. నాలుగేళ్ల పదవీకాలం వరకు అవిశ్వాస తీర్మానానికి ఆస్కారం లేకుండా చేసిన సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదించకపోవడంతో ఈ గందరగోళం నెలకొంది. బడ్జెట్ ఆమోదానికి కోరంతో సంబంధం లేదు. తొలిరోజు కోరం లేకుండా వాయిదా పడితే, మరుసటి రోజు ఏకపక్షంగా ఆమోదించే అధికారం సభకు ఉంటుంది. -
లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం!
న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ అంశంపై బహుముఖ దాడితో అధికార బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ముందుగా ‘ఏకపక్షంగా వ్యవహరించి రాహుల్‌పై వేటు వేశా’రంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఎంపీలంతా మంగళవారం ఉదయమే సమావేశమై దీనిపై మల్లగుల్లాలు పడ్డారు. కోర్టు శిక్ష విధించిన గంటల వ్యవధిలోనే ఆగమేఘాలపై రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన వైనాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా హైలైట్ చేయొచ్చన్న భావన వ్యక్తమైంది. అనంతరం దీనిపై విపక్షాలతో కూడా విస్తృతంగా చర్చోపచర్చలు జరిపినట్టు సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే సోమవారం అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే కొన్ని విపక్షాలు ఇందుకు అభ్యంతరం చెబుతున్నట్టు సమాచారం. ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్న విపక్షాల ఐక్యత యత్నాలకు ఇది గండి కొట్టే ప్రమాదముందన్నది వాటి వాదనగా తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు సంతకాలు అవసరం. పైగా పార్లమెంటు ఉభయ సభలూ రెండు వారాలుగా ఒక్క రోజు కూడా సజావుగా నడవని నేపథ్యంలో తీర్మానం సాధ్యాసాధ్యాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పెట్టినా వీగిపోయే అవకాశాలే ఉన్నప్పటికీ ముందుకెళ్లాలనే యోచనలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. త్యాగాలకు సిద్ధమవ్వాలి విపక్షాలకు రాహుల్ పిలుపు రాహుల్‌పై వేటును నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్‌తో సహా 17 ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌కు తాజాగా సంఘీభావం ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంటులో కన్పించిన విపక్షాల ఈ ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా ఏప్రిల్ తొలి వారంలో విపక్ష అగ్రనేతలతో కీలక సమావేశం జరపాలని నిర్ణయించింది. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన విపక్షాల భేటీలోనే ఈ మేరకు ప్రతిపాదన వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘విపక్షాల అగ్ర నేతలు, అధ్యక్షులంతా భేటీ అయ్యేలా కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌తో పాటు డీఎంకే, జేడీ(యూ), సీపీఎం నేతలు ప్రతిపాదించారు. 2024 సాధారణ ఎన్నికలకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా ఉందని వారు పదేపదే చెప్పారు’’ అని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు వివరించారు. విపక్షాలన్నీ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. ‘‘విపక్షాల ఐక్యత కోసం ఎంతటి త్యాగాలకైనా కాంగ్రెస్ సిద్ధం. నేనూ సిద్ధం’’ అని ఆయన కుండబద్దలు కొట్టారని సమాచారం. ఆ భేటీకి దూరంగా ఉన్న శివసేన (ఉద్ధవ్ వర్గం) కూడా తమతో కలిసి నడుస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వివరించారు అదానీ ఉదంతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తృణమూల్ సహా విపక్షాలను కాంగ్రెస్‌కు దగ్గర చేయడం తెలిసిందే. ‘అదానీ’పై మోదీకి లేఖలు! రాహుల్‌పై వేటును నిరసిస్తూ, అదానీ అంశంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ నెల రోజుల పాటు బ్లాక్ స్థాయి నుంచి హస్తిన దాకా దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మార్చి 24న పార్టీ స్టీరింగ్ కమిటీ, పీసీసీ చీఫ్‌లు, అనుబంధ విభాగాల చీఫ్‌లతో జరిగిన భేటీలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. వివరాలు... ► ఢిల్లీలోని ఎర్రకోట నుంచి మొదలు పెట్టి దేశంలోని 35 ప్రధాన నగరాల్లో మంగళ, బుధవారాల్లో ‘లోక్తంత్ర్ బచావో శాంతి మార్చ్’ ► ఏప్రిల్ రెండో వారంలో ‘జై భారత్ మహా సత్యాగ్రహం’. ఇందులో భాగంగా బ్లాక్/మండల కాంగ్రెస్ విభాగాలు సభలు, సమావేశాలు నిర్వహించి రాహుల్‌పై వేటు, అదానీతో ప్రధాని మోదీ బంధంపై ప్రజలకు వివరిస్తాయి. రాహుల్ సందేశాన్ని పార్టీ సోషల్ మీడియా విభాగాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాయి. ► ఏప్రిల్ 15 నుంచి 20 దాకా జై భారత్ మహా సత్యాగ్రహంలో భాగంగా విపక్షాలతో కలిసి జిల్లాల్లో కలెక్టరేట్ల ఘెరావ్. రాష్ట్ర స్థాయిలోనూ భారీ కార్యక్రమం. ఒక్క రోజు ఉపవాస దీక్షలు. అనంతరం ఢిల్లీలో జాతీయ స్థాయిలో భారీ సత్యాగ్రహం. ► మార్చి 31న జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతల మీడియా సమావేశాలు. ► యూత్ కాంగ్రెస్, ఎన్ఎన్యూఐ తదితరాల ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం. అదానీ అవినీతి, రాహుల్‌పై వేటు తదితరాలపై ప్రశ్నిస్తూ ప్రధాని మోదీకి లేఖలు. ► మహిళా కాంగ్రెస్ నిరసన ర్యాలీ. -
వైరా మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్‌పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్ వీపీ గౌతమ్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఇటీవల జైపాల్‌తోపాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు మాజీ ఎంపీ పొంగులేటికి మద్దతు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఆయనను సస్పెండ్ చేయగా, మరో ముగ్గురు కౌన్సిలర్లు పార్టీకి రాజీ నామా ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం 14 మంది బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మంతనాలు జరి పారు. అనంతరం వీరంతా ఎమ్మెల్యే నేతృత్వంలో అవిశ్వాస తీర్మానం నోటీసును కలెక్టర్‌కు అందజేశారు. పొంగులేటి వర్గం కావడంతో.. వైరా మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 20 వార్డులకుగాను బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ రెండు, స్వతంత్రులు రెండు, సీపీఎం ఒక స్థానం గెలుచుకున్నాయి. ఆ తర్వాత ఇద్దరు స్వ తంత్ర అభ్యర్థులు, సీపీఎం కౌన్సిలర్ బీఆర్ఎస్లో చేరా రు. బీఆర్ఎస్పై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమాలకు జైపాల్ హాజరయ్యారు. దీంతో ఆయనపై బీఆర్ఎస్ వేటువేసింది. ఆ తర్వాత మరో ముగ్గురు కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనా మా చేసి పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎజెండా కాపీలను కౌన్సిల్ సమావేశాలకు ముందు అందజేయడంలేదని, అభివృద్ధిని పట్టించుకోవడంలేదని ఆయనపై మిగిలిన కౌన్సిర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం గమనార్హం. -
సొంతవారిపైనే ‘నోకాన్ఫిడెన్స్’!
ఉమ్మడి నల్లగొండ నందికొండ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గీయ కౌన్సిలర్ల మధ్య విభేదాలు అవిశ్వాసానికి దారితీశాయి. చైర్పర్సన్ కర్న అనూషారెడ్డిపై ఎనిమిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ లతలపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాస తీర్మానం పెట్టే క్రమంలో ఏడుగురు కౌన్సిలర్లు గోవా క్యాంపునకు వెళ్లారు. ఒకటీ రెండు రోజుల్లో నోటీసులు ఇవ్వాలనే ఆలోచనలో వారున్నట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బల్దియాల్లో అవిశ్వాసాల రచ్చకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో అసంతృప్త కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలకు సై అంటున్నారు. కొన్నిచోట్ల చైర్మన్లు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కౌన్సిలర్లను పట్టించుకోక పోవడంతో వారంతా గుర్రుగా ఉన్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో అక్రమ కట్టడాలు, రియల్ఎస్టేట్ వెంచర్లు, ఇంటి నిర్మాణాల అనుమతుల్లో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారుతున్నాయి. ఈ పంపకాల్లో తేడాలు కూడా పలుచోట్ల అసంతృప్తికి దారితీసి అవిశ్వాసాలకు కారణమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. మరికొన్ని చోట్ల.. ఎన్నికల్లో రూ.లక్షలు ఖర్చు చేసి గెలుపొందిన కౌన్సిలర్లు పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిని చైర్మన్లు వ్యతిరేకించడం కౌన్సిలర్లకు మింగుడు పడటం లేదు. ఈ నేç³థ్యంలోనే మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న చైర్మన్లు, వైస్ చైర్మన్లపై నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానాలకు తెర లేపుతున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఉన్నవారు 4 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న పక్షంలోనే అవిశ్వాస తీర్మానాలు పెట్టే సవరణ బిల్లుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. దీంతో పలుచోట్ల అవిశ్వాసాల రచ్చ కొనసాగుతోంది. తిరుగుబాటు పార్టీపై కాదు ఒకటీ రెండు మినహా బల్దియాలన్నీ అధికార బీఆర్ఎస్ పార్టీ చేతుల్లోనే ఉన్నాయి. అయితే దాదాపు అన్నిచోట్లా అధికార పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానాలకు నాయకత్వం వహిస్తున్నారు. వీరికి ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు మద్దతు తెలుపుతుండటం గమనార్హం. అయితే తాము పారీ్టకి వ్యతిరేకం కాదని, కేవలం చైర్మన్ పదవుల్లో కొనసాగుతున్న వారి తీరుకు మాత్రమే వ్యతిరేకమని కౌన్సిలర్లు పేర్కొంటున్నారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని వారు స్పష్టం చేస్తున్నారు. కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు బల్దియాల్లో అవిశ్వాసాల రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్లకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున అవిశ్వాస తీర్మానాల నోటీసులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ఆ నోటీసులను మున్సిపల్ పరిపాలన శాఖకు పంపాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టాలంటే ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న కౌన్సిలర్ల సంఖ్యలో 50 శాతం మంది స్వయంగా కలెక్టర్ ముందు హాజరు కావాలి. తమకు సంబంధించిన వ్యక్తిగత ధ్రువీకరణ (ఐడెంటిటీ ప్రూఫ్) చూపించి కలెక్టర్ ముందే నోటీసుపై సంతకాలు చేయాలి. అనంతరం కలెక్టర్ సర్వ సభ్య సమావేశం తేదీ ప్రకటించాల్సి ఉంటుంది. అయితే పలుచోట్ల కలెక్టర్లు అందుబాటులో లేకపోవడంతో అసమ్మతి కౌన్సిలర్లు అదనపు కలెక్టర్లకు, ఏఓలకు నోటీసులు అందజేస్తున్నారు. వారు తీసుకునేందుకు నిరాకరించడంతో ఇన్వర్డ్ సెక్షన్లలో ఇచ్చి వెళ్తున్నారు. ఇలా అవిశ్వాస నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్లు ప్రత్యేక శిబిరాలకు వెళుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ఏడుగురు గోవా వెళ్లారు. సంగారెడ్డి అసమ్మతి కౌన్సిలర్లు హైదరాబాద్‌లో ఓ రిసార్టుకు వెళ్లివచ్చారు. ‘మీరు ఇచ్చే నోటీసులు ప్రభుత్వ పరిశీలనకు పంపుతాం.. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయి..’అంటూ సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానాల నోటీసు ఇచి్చన కౌన్సిలర్లకు ఆ జిల్లా కలెక్టర్ శరత్ స్పష్టం చేయడం గమనార్హం. అవిశ్వాస తీర్మానాలు తలనొప్పిగా మారడంతో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అసంతృప్తి కౌన్సిలర్లను బుజ్జగించే పనిలో పడ్డారు. -
అందోల్, జోగిపేట చైర్మన్‌ను దింపేద్దాం..
సాక్షి, జోగిపేట(అందోల్): సంగారెడ్డి జిల్లాలోని అందోల్–జోగిపేట మున్సిపాలిటీ రాజకీయాలు ఊహించని విధంగా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై సొంత పార్టీ (బీఆర్ఎస్)కి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీనిపై శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో నోటీసును అందజేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. శనివారం ఉదయం 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమ కుటుంబ సభ్యులతో కలసి చిట్కుల్లోని చాముండేశ్వరీ అమ్మవారి ఆలయం ఆవరణలో సమావేశమయ్యారు. చైర్మన్, వైస్చైర్మన్ల వ్యవహారశైలిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, వారిని పదవిలో నుంచి దింపేయాలని తీర్మానించారు. అక్కడ నుంచి నేరుగా సంగారెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ కలెక్టర్ లేకపోవడంతో అదనపు కలెక్టర్ వీరారెడ్డిని కలిశారు. ఆయన సూచన మేరకు ఇన్‌వార్డులో అవిశ్వాస తీర్మానం నోటీసును అందించారు. అక్కడి ఉద్యోగులు సోమవారం వచ్చి కలెక్టర్‌ను కలవాలని సూచించడంతో నోటీసు అందించి వెనుదిరిగారు. మెజారిటీ కౌన్సిలర్ల వ్యతిరేకత అందోల్ – జోగిపేట మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులున్నాయి. ఇందులో 14 మంది బీఆర్ఎస్, ఆరుగులు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు చైర్మన్‌ను వ్యతిరేకిస్తున్నారు. రోజూ చైర్మన్ వెంట ఉండే కౌన్సిలర్లు సైతం బహిరంగంగా చైర్మన్ తీరుపై విమర్శలు చేయడం విశేషం. కాగా, ఈ పరిణామంపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. -
బీఆర్ఎస్లో తిరుగుబావుటా.. మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు బేఖాతరు!
అధికార పార్టీ బీఆర్ఎస్లో తిరుగుబాటు జెండా ఎగురుతోంది. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో సొంత పార్టీ మేయర్లు, చైర్మన్ల పైనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు అందజేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 13 పురపాలక సంఘాలు ఉండగా, మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసులు సమర్పించడంపై బీఆర్ఎస్ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. సొంత బంధువులు ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలక సంఘాల్లో కూడా కౌన్సిలర్లు మంత్రి మల్లారెడ్డి గీత దాటడంతో పాటు విపక్షాలతో చేతులు కలపడం వంటి విషయాలు రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక పురపాలక సంఘాలు కలిగిన శాసన సభా నియోజకవర్గంగా మేడ్చల్‌కు పేరుంది. ఇక్కడనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఆదేశాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాటించక పోవడంతో పట్టును కోల్పోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్త మవుతోంది. అలాగే మేడ్చల్ నియోజకవర్గంలోని పలు పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా అదే పార్టీకి చెందిన మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన మంత్రి మల్లారెడ్డి వివిధ మార్గాల ద్వారా అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. బుధవారం ‘మన ఊరు–మన బడి’ కింద మరమ్మతులు పూర్తయిన ప్రభుత్వ పాఠశాలల భవనాల ప్రారం¿ోత్సవానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్ పురపాలక సంఘాల్లోని అసమ్మతి వాదులతో సమావేశమై.. బుజ్జగింపుల పర్వానికి తెర లేపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా... మంత్రి మల్లారెడ్డిపై దాదాపు నెల రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలు ఆరోపణలతో తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా నామినేటెడ్ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అలాగే తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు విషయంలో కలెక్టర్‌ను మంత్రి పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు అప్పట్లోనే మీడియా సమావేశంలో ప్రకటించారు. జవహర్‌నగర్ బాటలో మరికొన్ని.. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 20 మంది కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికపై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానానికి సంబంధించిన నోటీసు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 సె క్షన్ 37 అనుసరించి నో కాన్ఫిడెన్స్ మోషన్ పిటిషన్ చైర్మన్‌కు వ్యతిరేకంగా సమర్పిస్తున్నట్లు వారు నోటీసులో పేర్కొన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మరో 4 పురపాలక సంఘాలకు చెందిన అధికార బీఆర్ఎస్కు చెందిన అ మ్మతి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు కలెక్టర్ కు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. -
తమిళిసై వద్ద పెండింగ్‌లో ఫైల్.. పురసారథులకు ‘పరీక్ష’
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్‌జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. గవర్నర్ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో.. ► మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్‌నగర్ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు. ► బోడుప్పల్ కార్పొరేషన్‌లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్‌పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్ఎస్ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. ► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. ► తుర్కయంజాల్‌లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కౌన్సిలర్ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్‌పర్సన్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్‌గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్ చేయండి: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి) -
డోంట్ కేర్.. ట్రస్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం!
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి!. ఈ మేరకు వందకు పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు.. పార్టీ కమిటీ హెడ్ గ్రాహం బ్రాడీని కలిసి ట్రస్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి లేఖలు సమర్పించనున్నట్లు డెయిలీ మెయిల్ ఒక కథనం ప్రచురించింది. ప్రధాని లిజ్ ట్రస్‌ను తొలగించే ప్రయత్నాలు మంచివి కాదని.. దాని వల్ల ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని డౌనింగ్ స్ట్రీట్(ప్రధాని కార్యాలయం) చేసిన హెచ్చరికలను కన్జర్వేటివ్ చట్టసభ్యులు బేఖాతరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ఈ వారంలోనే ట్రస్‌ను గద్దె దించే ప్రయత్నాలు ఊపందుకోనున్నట్లు తెలిపిన ఆ కథనం.. దానికి ఆధారం ఏంటన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఆమె సమయం ముగిసింది అని ట్రస్‌కు చెప్పాలని, లేదంటే.. ఆమె నాయకత్వంపై విశ్వాస పరీక్షను తక్షణమే నిర్వహించాలని, ఇందుకోసం రాజకీయ పార్టీ నియమాలను మార్చమని బ్రాడీని ఒత్తిడి తెచ్చేందుకు కన్జర్వేటివ్ ఎంపీలు ప్రయత్నించబోతున్నట్లు డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. యూకే చట్టాల ప్రకారం.. సాంకేతికపరంగా లిజ్ ట్రస్ ప్రధాని పదవికి ఏడాదిపాటు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే.. 1922 బ్యాక్‌బెంచ్ ఎంపీల కమిటీ తన రూల్స్ మారిస్తే గనుక ట్రస్‌కు సవాల్ ఎదురుకావొచ్చు. ఒకవేళ తిరుగుబాటు-అవిశ్వాస ప్రయత్నాలే జరిగితే గనుక.. అక్టోబర్ 31వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్, తదనంతర పరిణామాల దాకా ఓపిక పట్టాలని గ్రాహం బ్రాడీ, ఎంపీలను కోరే అవకాశం కనిపిస్తోంది. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చాక.. బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ గ్యాప్‌లో ఏకంగా ముగ్గురు ప్రధానులు గద్దె దిగాల్సి వచ్చింది. ఈ మధ్యే ప్రధాని పగ్గాలు చేపట్టిన లిజ్ ట్రస్.. కిందటి నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. ఊహించని ఈ పరిణామాలతో ఏకంగా తన మద్దతుదారు, ఆర్థిక మంత్రి అయిన క్వాసీని పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారామె. ఈ తరుణంలో ట్రస్-జెరెమీ హంట్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దాకా ఆగాలని గ్రాహం బ్రాడీ కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ది టైమ్స్ సైతం కన్జర్వేటివ్ రెబల్స్.. ట్రస్‌ను తప్పించి ఆ స్థానే మరో నేతను ఎన్నుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఓ కథనం ప్రచురించింది. ఇదీ చదవండి: బైడెన్ వ్యాఖ్యలతో పాక్ గుస్సా! -
బెట్టువీడిన బీజేపీ నేత.. ఎట్టకేలకు రాజీనామా
పాట్నా: బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా.. ఎట్టకేలకు బెట్టువీడారు. అవిశ్వాస తీర్మానం పెట్టినా బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ భీష్మించుకున్న ఆయన.. చివరికి తగ్గాడు. బుధవారం మహాఘట్బంధన్ కూటమి ప్రభుత్వ బలనిరూపణ కంటే ముందే.. అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించారాయన. రాజీనామా సమర్ఫణకు ముందుగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా సమర్పించిన అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా, అసంబద్ధంగా ఉందని, రూల్స్ ప్రకారం తీర్మానం సమర్పించలేదని సభ్యులను ఉద్దేశించి తెలిపారు. అయితే.. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను రాజీనామా చేయాల్సి ఉందని, కానీ, తనపై తప్పుడు ఆరోపణల నేపథ్యంలో తాను ఆ పని చేయకూడదని నిర్ణయించుకున్నానని సభకు తెలిపారు. ఇదీ చదవండి: బలపరీక్ష రోజే తేజస్వీకి షాక్ -
అవిశ్వాసం పెట్టినా.. రాజీనామా చెయ్యను
పాట్నా: బీహార్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామంపై జోరుగా చర్చ నడుస్తోంది. నితీశ్ కుమార్ సర్కార్‌కు బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా ఝలక్ ఇచ్చారు. మొదటి నుంచి నితీశ్‌కు కొరకరాని కొయ్యగా తయారైన విజయ్.. తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టినా రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాకు వ్యతిరేకంగా మహాఘట్బంధన్ కూటమి నుంచి 55 ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. నేనొక పక్షపాతినని, నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నానని అందులో వాళ్లు ఆరోపించారు. అవన్నీ ఉత్తవే. అలాంటి ఆరోపణల నేపథ్యంతో రాజీనామా చేయాల్సి వస్తే.. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే అంశమే. అందుకే నేను రాజీనామా చేయదల్చుకోలేదు అని విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. బీజేపీ నేత అయిన విజయ్ కుమార్ సిన్హా వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. జేడీయూతో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన నిర్ణయాలు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేవి. సభాముఖంగా నితీశ్‌ను ఎన్నోసార్లు మందలించారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన్ని మార్చేయాలంటూ బీజేపీ అధిష్టానానికి నితీశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేకుండా పోయింది. సాధారణంగా.. ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో స్పీకర్ పదవి నుంచి సదరు వ్యక్తి వైదొలగాల్సి ఉంటుంది. కానీ, మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడి రెండు వారాలు గడుస్తున్నా విజయ్ కుమార్ సిన్హా రాజీనామాకు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ వ్యవహారాల నిబంధనల్లో రూల్ నెంబర్ 110 ప్రకారం సిన్హా పదవి నుంచి తప్పుకోవాలంటూ ఆగస్టు 10వ తేదీనే 55 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన తీర్మానాన్ని అసెంబ్లీ సెక్రటేరియెట్‌కు అందించింది కూటమి ప్రభుత్వం. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు బీజేపీ కూడా ఈ వ్యవహారంపై గప్‌చుప్‌గా ఉంటోంది. మరోవైపు ఆయన స్వచ్ఛందంగా వైదొలిగితే బాగుంటుందని జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి ముందు నుంచి చెబుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 24న(ఇవాళ) నుంచి రెండు రోజులపాటు బీహార్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్లోనే బలనిరూపణతో పాటు స్పీకర్ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్ కుమార్ సిన్హా గనుక ఈ సమావేశాలకు గైర్హాజరు అయితే డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారి(జేడీయూ) సభా వ్యవహారాలను చూసుకుంటారు. ఇదీ చదవండి: బీజేపీ మాకు భయపడుతోంది -
తొండి ఆటతో.. హిట్ వికెట్
నాయకుడంటే ఎలా ఉండాలి? మాట తప్పకూడదు. మడమ తిప్పకూడదు ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గకూడదు ప్రధాని పీఠం ఎక్కేవరకు తూటాల్లా పేలే మాటలతో, భావోద్వేగ ప్రసంగాలతో అవినీతి నాయకులపై సమరోత్సాహంతో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవి చేపట్టాక ఎందుకు ప్రజల ఆశలకి తగ్గట్టుగా ఉండలేకపోయారు? సమర్థుడైన క్రికెట్ కెప్టెన్‌గా పాక్‌కు ప్రపంచ కప్‌ను అందించిన ఇమ్రాన్ ఒక అసమర్థ ప్రధానిగా ప్రపంచ దేశాల్లో ఎందుకు ముద్ర పడ్డారు? మొదటి నుంచి పాటించిన ఉన్నత విలువలకు అధికారం రాగానే తిలోదకాలు ఇచ్చారు కాబట్టి.. మాట తప్పి.. ప్రధాని పదవిని నిలుపుకోవడానికి అమెరికా బూచి చూపి పాక్ ప్రజలను బురిడీ కొట్టించాలని చూశారు కాబట్టి.. క్రికెట్ నుంచి రాజకీయాల వరకు ఇమ్రాన్ ప్రస్థానం అత్యంత ఆసక్తికరమే అయినప్పటికీ అబద్ధమాడి ప్రజాదరణను కోల్పోయారు! క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలింగ్‌తో దూకుడు చూపించి పాకిస్తాన్‌కు వరల్డ్‌కప్ అందించిన సమర్థుడైన కెప్టెన్‌గా పేరుప్రతిష్టలు సంపాదించుకున్న ఇమ్రాన్‌ఖాన్ పొలిటికల్ పిచ్‌పై అవమాన భారంతో పెవిలియన్ ముఖం పట్టారు. దుందుడుకు స్వభావం, ఆవేశాన్ని అణచుకోలేని తత్వం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఆయన రాజకీయ జీవితానికి ఎదురు దెబ్బలా మారాయి. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఎగువ మధ్యతరగతి కుటుంబంలో 1952 సంవత్సరం అక్టోబర్ 5న ఇమ్రాన్‌ఖాన్ జన్మించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ చేశారు. క్రికెట్‌పై మక్కువతో దానిపైనే దృష్టి పెట్టారు. 1976లో జాతీయ స్థాయిలో పాక్ క్రికెట్ జట్టులో స్థానం పొందారు. ఎదురులేని ఆల్‌రౌండర్‌గా ఎదుగుతూనే , తనకున్న అందమైన రూపంతో ఒక ప్లేబాయ్ ఇమేజ్ సంపాదించారు. అత్యంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ లేడీ లిజా కేంబెల్, సుసన్నా కాన్ స్టాంటైన్ వంటి మోడల్స్‌తో ప్రేమాయణం నడిపారు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ తన వ్యక్తిగత జీవితాన్ని దాచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్ స్మిత్‌ను 1995లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. 2004లో విడాకులు తీసుకున్నారు. 2015లో టీవీ యాంకర్ రెహామ్ ఖాన్‌ను రెండోసారి పెళ్లి చేసుకున్నారు. పది నెలల్లోనే వారి బంధం ముగిసింది. ముచ్చటగా మూడోసారి తన ఆధ్యాత్మిక గురు బష్రా మనేకను పాకిస్తాన్ ప్రధాని పదవి అందుకోవడానికి కొన్ని నెలల ముందే పెళ్లాడారు రెండు సీట్ల నుంచి ప్రధాని పదవి వరకు 1992లో పాక్‌కు ప్రపంచ కప్ అందించాక క్రికెట్‌కు గుడ్‌బై కొట్టిన ఇమ్రాన్‌ఖాన్ ప్రజాసేవ వైపు మళ్లారు. 1996లో అందరికీ న్యాయం అన్న నినాదంతో పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అన్న పార్టీని స్థాపించారు.మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పీటీఐ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అవినీతికి వ్యతిరేకంగా 2008 ఎన్నికల్ని బహిష్కరించిన ఇమ్రాన్‌ఖాన్ 2011 వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకున్నారు. దేశంలో అవినీతి నేతలకు వ్యతిరేకంగా గళమెత్తి, ఉద్వేగభరితంగా చేసే ప్రసంగాలు వినడానికి జనం వెల్లువెత్తారు. ప్రధాన పార్టీలైన నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్), బేనజీర్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)ని ఢీ కొట్టి బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగారు. 2013 నాటికల్లా పీటీఐ 35 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ప్రధానంగా ఆయన నవాజ్ షరీఫ్ అవినీతిపైనే న్యాయపోరాటం చేసి, చివరికి ఆయనని జైలు పాలు చేశారు. 2018 ఎన్నికల్లో జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రధాని పీఠం అందుకున్నారు. ప్రధానిగా ఎలా విఫలమయ్యారు ? నయా పాకిస్తాన్‌ను నిర్మిస్తానన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్ గత మూడున్నరేళ్లలో కఠినమైన సవాళ్లే ఎదుర్కొన్నారు. ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడంలో విఫలమయ్యారు. ఆర్థిక వృద్ధి రేటు 3.5శాతానికి మించలేదు. ద్రవ్యోల్బణం 12 శాతానికి పరుగులు పెట్టింది. కోటి ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ నెరవేర్చలేక చేతులెత్తేశారు. దీంతో సాధారణ ప్రజల్లో ఇమ్రాన్‌పై వ్యతిరేకత పెరిగిపోయింది. ప్రభుత్వం కంటే ఆర్మీ శక్తిమంతంగా ఉండే పాకిస్తాన్లో ఇమ్రాన్‌ఖాన్‌కి, ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో విభేదాలు ఏర్పడడంతో ఆయన పదవికి గండం ఏర్పడింది. ఐఎస్ఐ చీఫ్ జనరల్‌గా నదీమ్ అహ్మద్ అంజుమ్ నియామకం అంశంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో విపక్ష పార్టీలు ఇదే అదునుగా ఏకమై ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేశాయి. మళ్లీ పాక్‌లో సైనిక పాలన వస్తుందని భావించారు కానీ ఈసారి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకే ఆర్మీ మొగ్గు చూపించినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పటివరకు పాకిస్తాన్ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా పూర్తి కాలం పదవిలో లేరు. అయితే సైనిక తిరుగుబాటు లేదంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వాలు పతనమయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్‌కి ఇప్పుడు అదే అనుభవం ఎదురైంది. పశ్చిమదేశాలపై ఎందుకీ ఆరోపణలు అమెరికా కుట్ర చేసి తన ప్రభుత్వాన్ని కూల్చేస్తోందంటూ ఇమ్రాన్‌ఖాన్ చేసిన ఆరోపణలు పెను సంచలనంగా మారి చర్చకు దారి తీశాయి. రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన ఫిబ్రవరి 24నే ఇమ్రాన్ రష్యా పర్యటనకు వెళ్లి అధ్యక్షుడు పుతిన్‌ను కలుసుకోవడం రాజకీయంగా కలకలం రేపింది. తాను రష్యా వెళ్లినందుకే అమెరికా కక్ష కట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించిందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలే ఇప్పుడు ఆయన పదవికి ఎసరు తెచ్చాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో విపక్షాలపై వ్యతిరేకత ఏర్పడడానికే ఇమ్రాన్‌ఖాన్ ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువే పోతుందని భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానం ఫలితంతో సంబంధం లేకుండా పాకిస్తాన్లో గడువు కంటే ముందే ఎన్నికలు వస్తాయని అంచనాలు ఉండడంతో.. అతివాద భావజాలం ప్రబలుతున్న పాక్‌లో అమెరికా ఎదురించిన రియల్ హీరో ఇమేజ్ను సంపాదించి మళ్లీ ఎన్నికల్లో గెలవాలనేది ఇమ్రాన్‌ఖాన్ ఆలోచనగా ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. – నేషనల్ డెస్క్ సాక్షి -
ఎట్టకేలకు... ఇమ్రాన్ ఇంటికి
ఇస్లామాబాద్: నెలకు పైగా నానా మలుపులు తిరుగుతూ వచ్చిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం కథ ఎట్టకేలకు కంచికి చేరింది. పాక్ జాతీయ అసెంబ్లీలో శనివారం రోజంతా జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం అర్ధరాత్రి దాటాక అధికార సభ్యుల గైర్హాజరీలో జరిగిన ఓటింగ్‌లో 174 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దాంతో విపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గడం, ఇమ్రాన్ పదవీచ్యుతుడు కావడం చకచకా జరిగిపోయాయి. అంతకుముందు జాతీయ అసెంబ్లీ వేదికగా శనివారం రోజంతా పాక్ రాజకీయాలు నానా మలుపులు తిరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తీర్మానంపై ఓటింగ్ జరిపేందుకు ఉదయం 10.30కు సమావేశమైన సభ అర్ధర్రాతి దాకా నాలుగైదుసార్లు వాయిదా పడింది. స్పీకర్ అసద్ ఖైజర్ ఉద్దేశపూర్వకంగానే ఓటింగ్‌ను జాప్యం చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. తక్షణం ఓటింగ్ చేపట్టాలని కోరాయి. కానీ ఓటింగ్‌కు స్పీకర్ ససేమిరా అన్నారు. ‘‘ఓటింగ్ జరిపి ఇమ్రాన్‌తో నా 30 ఏళ్ల బంధాన్ని తెంచుకోలేను. కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సి వచ్చినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ జరపబోను’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ గలాభా మధ్యే రాత్రి వేళ ఇమ్రాన్ తన నివాసంలో అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించారు. రాజీనామా చేయబోయేది లేదని స్పష్టం చేశారు. ఆయన సభకు కూడా వెళ్లలేదు. అనంతరం పాక్ కాలమానం ప్రకారం రాత్రి 10.30 తర్వాత స్పీకర్ ఇమ్రాన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. విదేశీ కుట్రకు రుజువుగా కేబినెట్ తనకు ముఖ్యమైన పత్రాలు అందజేసిందని, వాటిని సీజేఐ, విపక్ష నేత పరిశీలించాలని కోరారు. ‘‘ఓటింగ్ జరిపి విదేశీ కుట్రలో భాగం కాలేను. రాజీనామా చేస్తున్నా’’ అని అర్ధరాత్రి 11.30కు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి కూడా ఆయన బాటలోనే నడిచారు. స్పీకర్ సూచన మేరకు విపక్ష పీఎంఎల్ (ఎన్)కు చెందిన ప్యానల్ చైర్మన్ అయాజ్ సాదిక్ అధ్యక్షతన అర్ధరాత్రి 11.45కు ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. 11.50కి అధికార పీటీఐకి చెందిన 156 మంది ఎంపీలూ సభ నుంచి వెళ్లిపోయారు. సభ నిబంధనల మేరకు 11.58కి సభను మర్నాటికి వాయిదా వేశారు. నాలుగు నిమిషాల అనంతరం అర్ధరాత్రి 12.02కు సభ తిరిగి సమావేశమైంది. అనంతరం మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానాన్ని ఓటింగ్‌కు స్వీకరిస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. తర్వాత తలుపులన్నీ మూసేసి ఓటింగ్ చేపట్టారు. 12.10కి ఓటింగ్ జరిగింది. 342 మంది సభ్యులున్న సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే విపక్షాలకు కనీసం 172 మంది మద్దతు అవసరం. రాత్రి ఒంటిగంటకు 174 మంది అనుకూలంగా ఓటేయడంతో తీర్మానం సులువుగా గట్టెక్కింది. అంతకుముందు, శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఇమ్రాన్ కావాలనే ధిక్కరిస్తున్నారంటూ విపక్షాలు మరోసారి కోర్టు తలుపు తట్టాయి. ఇమ్రాన్ దేశం విడిచిపోకుండా చూడాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తూ వచ్చిన సుప్రీంకోర్టు ప్రధా న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ శనివారం అర్ధరాత్రి 12 తర్వాత కోర్టును సమావేశపరచాలని అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. పూర్తిస్థాయి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరుపుతామని ప్రకటించారు. ఈలోపు పరిస్థితులు మారి పరిణామాలు ఓటింగ్‌కు దారి తీశాయి. భారత్‌కే వెళ్లిపో... ఇమ్రాన్‌పై విపక్షాల ధ్వజం భారత్‌ను ప్రశంసిస్తూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై అక్కడి విపక్షాలు మండిపడ్డాయి. భారత్ అంతగా నచ్చితే అక్కడికే వెళ్లిపోవాలని పీఎంఎల్ (ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం అన్నారు. భారత్ సిసలైన సార్వభౌమ దేశమని, ఏ అగ్రరాజ్యం కూడా దాన్ని శాసించలేదంటూ ఇమ్రాన్ ప్రశంసించడం తెలిసిందే. ‘‘అవిశ్వాస తీర్మానాల విషయంలో కూడా భారత్‌ను అనుసరించు. అక్కడి ప్రధానులు 27 దాకా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు. వాజ్‌పేయి వంటివారు కేవలం ఒక్క ఓటుతో ఓడి హుందాగా తప్పుకున్నారు. అంతే తప్ప నీలా ఎవరూ ప్రజాస్వామ్యంతో, రాజ్యాంగంతో, విలువలతో ఇష్టానికి ఆడుకోలేదు’’ అని ఆయన్నుద్దేశించి మరియం అన్నారు. ‘‘ఇమ్రాన్ ఓ సైకో. ఆయనకు పిచ్చెక్కింది’’ అంటూ మండిపడ్డారు. -
భారత్‌ను ఏ మహాశక్తి శాసించలేదు: ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ సుప్రీం కోర్టు తీర్పు దరిమిలా నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస పరీక్షకు సిద్ధమయ్యాడు ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. అయితే దానికంటే ముందు జాతిని ఉద్దేశించి ప్రసగించాడు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. పాక్ ప్రజలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ ప్రధాని శుక్రవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు. తనను గద్దె దించడం వెనుక విదేశీ హస్తం ఉందన్న మాటే మరోమారు హైలైట్ చేసిన ఆయన.. పనిలో పనిగా మరోసారి భారత్‌పై ప్రశంసలు గుప్పించడం విశేషం. సుప్రీం తీర్పు తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని డిప్యూటీ స్పీకర్ దర్యాప్తులో గుర్తించారు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం చెల్లదని ప్రకటించారు. అలాంటిది.. సుప్రీం కోర్టు కనీసం విచారణ చేపట్టినా బాగుండేది. ప్రాణ హాని ఉందన్న లేఖను సైతం కోర్టు పట్టించుకోలేదు. అయినా కోర్టు తీర్పును గౌరవిస్తాం. అమెరికా దౌత్యవేత్తలు ఇక్కడి నేతల్ని కొందరిని కలిసిన తర్వాతే.. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు తెర లేచింది. ప్రజాప్రతినిధులు గొర్రెల్లా అమ్ముడుపోయారు. ఇక్కడి మీడియా కూడా ప్రభుత్వం కుప్పకూలుతుంటే.. సిగ్గు లేకుండా సంబురాలు చేసుకుంటోంది. ఆత్మ గౌరవం విషయంలో పాక్.. భారత్‌ను చూసి ఎంతో నేర్చుకోవాలి. అక్కడి ప్రజలు తమ దేశాన్ని గర్వంగా భావిస్తుంటారు. అందుకు కారణం.. ఏ మహాశక్తివంతమైన దేశాలు కూడా వాళ్లను శాసించలేవు కాబట్టి. వాళ్ల విధానాలు వాళ్లకు ఉంటాయి. అక్కడి రాజకీయాల్లోనూ బయటి శక్తుల జోక్యం ఉండదు. కానీ, మనం(పాక్‌ను ఉద్దేశించి) ఎందుకూ పనికిరాం. పాక్‌ను ఓ టిష్యూ పేపర్‌లాగా తీసి పారేస్తున్నారు. రేపటి ఎన్నికల్లో.. ఆ శక్తివంతమైన దేశానికి లొంగి ఉంటారే లేదో బేరీజు వేసుకున్నాకే.. సరైన వాళ్లను ఎంచుకోండి. బానిసల్లాగా బతకాలనుకుంటున్నారా? లేదంటే ప్రజాస్వామ్యయుత దేశంలో జీవించాలనుకుంటున్నారా? ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఇక మీదే(పాక్ పౌరుల్ని ఉద్దేశించి). మీ దేశ సౌభ్రాతృత్వం ఇక మీ చేతుల్లోనే ఉంది. దానిని రక్షించాల్సిన బాధ్యత మీకే ఉంది. బయటకు రండి.. నిరసన తెలియజేయండి.. మీ స్వాతంత్ర్యాన్ని(ఆజాదీ)ని మీరే రక్షించుకోండి అంటూ ప్రసగించాడు ఇమ్రాన్ ఖాన్. చదవండి: పాక్ గడ్డపై మళ్లీ నవాజ్ షరీఫ్! -
అధ్యక్షుడు అరీఫ్ తొలగింపు..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ గద్దె దిగిపోవడానికి సమయం దగ్గరకొస్తోంది. సుప్రీం కోర్టు నిర్ణయంతో శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంటులోని దిగువ సభ జాతీయ అసెంబ్లీలో ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సభలో మెజార్టీ లేకపోయినప్పటికీ ఆఖరి బాల్ వరకు పోరాడుతానంటూ ఇమ్రాన్ ఇంకా మేకపోతు గాంభీర్యాన్నే ప్రదర్శిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్లో ప్రతిపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. విపక్షాలన్నీ చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గలేక ఇమ్రాన్ గద్దె దిగిపోతే అధ్యక్షుడు అరిఫ్ అల్వీని తొలగించడానికి ప్రణాళికలు రూపొందించాయి. అదే విధంగా యూకేలో ప్రవాసానికి వెళ్లిపోయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని తిరిగి పాక్‌కి తేవాలని భావిస్తున్నాయి. పాకిస్తాన్ ముస్లింమ్ లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) అధ్యక్షుడు, జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు షెబాజ్ షరీఫ్ (70) కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రమాణ స్వీకారమయ్యాక ఆయన ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి వెల్లడించే అవకాశాలున్నాయని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ఒక నివేదికలో వెల్లడించింది. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా విపక్షాల అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర దాగి ఉందన్న ఆరోపణలపై విచారణ జరపడానికి ప్రభుత్వం. రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ తారిక్ ఖాన్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీధుల్లో నిరసన తెలపండి: ఇమ్రాన్ పాకిస్తాన్లో ‘దిగుమతి అయిన ప్రభుత్వాన్ని’ ఎంతమాత్రం అంగీకరించబోనని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం తేల్చిచెప్పారు. తనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన ‘బెదిరింపు లేఖ’ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. శనివారం అవిశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్న ఇమ్రాన్ పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆదివారం సాయంత్రం తనతో కలిసి వీధుల్లో నిరసన తెలపాలని మద్దతుదారులకు సూచించారు. దీన్నిబట్టి పదవి నుంచి దిగిపోక తప్పదన్న నిర్ణయానికి ఆయన వచ్చి నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి, పదవి నుంచి తప్పుకున్న తొలి పాక్ ప్రధానిగా చరిత్రకెక్కుతారు. -
గొటబయ ప్రభుత్వంపై అవిశ్వాసం
కొలంబో: దేశంలో నెలకొన్న సంక్షోభాలను తక్షణం పరిష్కరించే చర్యలు చేపట్టకుంటే గొటబయ రాజపక్సే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని లంక ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ పార్టీ ప్రకటించింది. దేశంలో అధ్యక్ష పాలన పోవాలని పార్టీ నేత సజిత్ ప్రేమదాస అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య అధికార పంపిణీ జరగాలన్నారు. గొటబయ తొలగాలన్న ప్రజా డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. లేదంటే తామే అవిశ్వాసం తెస్తామని హెచ్చరించారు. మరోవైపు అవిశ్వాసానికి మద్దతుగా ఎంపీల సంతకాల సేకరణను ఎస్‌జేబీ ఆరంభించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని గతంలో గొటబయ ఎస్‌జేపీని ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానాన్ని పార్టీ తిరస్కరించింది. దేశంలో రాజపక్సేల ఆధిపత్యం పోవాలని ఎస్‌జేబీ కోరుతోంది. గొటబయ రాజీనామా చేయకపోతే అవిశ్వాసం తెస్తామని మరో విపక్షం జేవీపీ నేత విజేత హెరాత్ చెప్పారు. అయితే రాజీనామా డిమాండ్‌ను గొటబయ తోసిపుచ్చారు. పరిష్కారం దొరకలేదు దేశం ఎదుర్కొంటోన్న ఆర్థిక సంక్షోభపై చర్చ పార్లమెంట్లో మూడు రోజులు చర్చించినా తగిన పరిష్కారం లభించలేదు. పలువురు మంత్రులు రాజీనామా నేపథ్యంలో తక్షణం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ నివారణా మర్గాలు అన్వేషించాలని అధికార కూటమి సభ్యులు కూడా కోరుతున్నారు. తమ ప్రభుత్వం ఐఎంఎఫ్, చైనా, ఇండియాతో సాయంపై చర్చలు జరుపుతోందని గొటబయ చెబుతున్నారు. ప్రజలు పొదుపుగా వ్యవహరించాలని సూచించారు. దేశంలోని విదేశీ దౌత్యవేత్తలతో విదేశాంగమంత్రి పెరిస్ చర్చలు జరిపారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో పబ్లిక్ రంగ ఉద్యోగులు శుక్రవారం ఒక్కరోజు సమ్మె చేశారు. మరోవైపు దేశంలో ఔషధాలు, వైద్య పరికరాల కొరత తీవ్రస్థాయికి చేరింది. -
ఇమ్రాన్ యార్కర్..: పాక్‌లో రాజకీయ సంక్షోభం...
నెల రోజులుగా పదవీ గండం ఎందుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (69) కీలక సమయంలో తనలోని కెప్టెన్‌ను పూర్తిస్థాయిలో బయటికి తీశారు. అవిశ్వాస తీర్మానంపై డిప్యూటీ స్పీకర్‌తో పదునైన యార్కర్ వేయించారు. ఆ తీర్మానం చెల్లదనే నిర్ణయంతో విపక్షాలను డిప్యూటీ స్పీకర్ క్లీన్‌బౌల్డ్ చేయగానే జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్ చేసేశారు. అందుకు అధ్యక్షుడు ఆమోదముద్ర వేయడంతో దేశంలో ముందస్తు ఎన్నికల నగారా మోగింది. ఇదంతా రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఇమ్రాన్ యార్కర్‌ను నో బాల్‌గా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే విచారణపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఇమ్రాన్‌ఖాన్‌పై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకునేందుకు ఆదివారం జరిగిన జాతీయ అసెంబ్లీ కీలక సమావేశం అనూహ్య పరిణామాలకు వేదికైంది. డజనుకు పైగా అధికార పార్టీ సభ్యులు కూడా తీర్మానానికి మద్దతివ్వడంతో ఇప్పటికే మైనారిటీలో పడిన ఇమ్రాన్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడటం లాంఛనమేనని అంతా భావించారు. స్పీకర్ అసద్ ఖైజర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవచ్చన్న అనుమానంతో సమావేశం మొదలవగానే విపక్షాలు ఆయనపై అవిశ్వాస నోటీసు కూడా ఇచ్చాయి. దాంతో సమావేశానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి, తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి విపక్షాలకు ఊహించని షాకిచ్చారు. ‘‘తీర్మానం దేశ రాజ్యాంగానికి, నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కానీ అదలా లేదని న్యాయ మంత్రి స్పష్టంగా చెప్పారు. అది విదేశీ కుట్రలో భాగంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అందుకే తీర్మానాన్ని తిరస్కరిస్తున్నా’’ అని ప్రకటించారు. ఆ వెంటనే సభను వాయిదా వేశారు. దీనిపై విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ దుయ్యబట్టాయి. నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేదాకా సభను వీడేది లేదన్నాయి. సభలో గలాభా జరుగుతండగానే ఇమ్రాన్ హుటాహుటిన అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కలిసి జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయడం, అందుకు ఆయన ఆమోదముద్ర వేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇమ్రాన్ ఇచ్చిన వరుస షాకులతో నోరెళ్లబెట్టడం విపక్షాల వంతైంది. పాక్ చరిత్రలో ఇప్పటిదాకా ఏ ప్రధానీ పూర్తికాలం పాటు పదవిలో కొనసాగలేదు. షెడ్యూల్ ప్రకారం పాక్‌లో 2023 ఆగస్టులో ఎన్ని కలు జరగాల్సి ఉంది. ఇమ్రాన్ 2018 ఆగస్టు 18న దేశ 22వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. విదేశీ కుట్ర భగ్నం: ఇమ్రాన్ జాతీయ అసెంబ్లీ రద్దు సిఫార్సు అనంతరం ఇమ్రాన్ జాతిని ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానం ముసుగులో ప్రభుత్వాన్ని మార్చేందుకు జరిగిన విదేశీ కుట్రను విజయవంతంగా అడ్డుకున్నట్టు ప్రకటించారు. దేశ భవితవ్యాన్ని అవినీతి శక్తులు నిర్ణయించలేవన్నారు. ఎన్నికలకు సిద్ధమవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానం నిజానికి విదేశీ కుట్రలో భాగమని అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ ఆరోపించారు. తీర్మానం నెగ్గి ప్రభుత్వం పడిపోగానే ఇమ్రాన్‌ను అరెస్టు చేయడానికి కుట్ర జరిగిందన్నారు. దాన్ని భగ్నం చేశామని, 90 రోజుల్లోపు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఇమ్రాన్ 15 రోజుల పాటు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారన్నారు. ఈ పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని సైన్యం అధికార ప్రతినిధి బాబర్ ఇఫ్తికర్ ప్రకటించారు. అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్‌కు సుప్రీం నోటీసులు జాతీయ అసెంబ్లీ రద్దును విపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇమ్రాన్‌ను దేశద్రోహి అంటూ విపక్ష నేతలు షాబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో జర్దారీ, మరియం ఔరంగజేబ్ తదితరులు దుమ్మెత్తిపోశారు. పిరికి నిర్ణయాల ద్వారా తన తప్పిదాలను పరోక్షంగా అంగీకరించారని దుయ్యబట్టారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ విపక్షాలు సుప్రీంకోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి. అత్యవసరంగా విచారణకు స్వీకరించి తక్షనం తీర్పు వెల్లడించాలని కోరాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. మొత్తం ఉదంతంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ అసెంబ్లీ రద్దు విషయంలో అధ్యక్షుడు, ప్రధాని తీసుకున్న నిర్ణయాలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ తదితరులకు నోటీసులు జారీ చేసి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు ఎలాంటి రాజ్యాంగవిరుద్ధ చర్యలకూ పాల్పడొద్దని ఇరు వర్గాలనూ ఆదేశించింది. రాజ్యాంగ విరుద్ధమే: నిపుణులు డిప్యూటీ స్పీకర్ చర్య, జాతీయ అసెంబ్లీ రద్దుకు ఇమ్రాన్ సిఫార్సు రెండూ రాజ్యంగ విరుద్ధమేనని పాక్ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు ఆర్టికల్ 6 ప్రకారం వారిద్దరిపై న్యాయ విచారణ జరిగే చాన్సుందని సుప్రీంకోర్టు బార్ అధ్యక్షుడు అషన్ భూన్ అన్నారు. మైనారిటీలో పడటమే గాక పార్లమెంటులో అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న ప్రధానికి సభ రద్దుకు సిఫార్సు చేసే అధికారం ఉండదని ప్రముఖ న్యాయ నిపుణుడు, కేంద్ర మాజీ మంత్రి అభిషేక్ మను సింఘ్వి కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ చౌధరి సర్వర్‌ను ఇమ్రాన్ బర్తరఫ్ చేశారు. అవిశ్వాసం నుంచి అవిశ్వాసం దాకా... 2021లో ఇమ్రాన్ తొలిసారి అవిశ్వాస పరీక్ష గట్టెక్కిన నాటి నుంచి జాతీయ అసెంబ్లీ రద్దు దాకా పాకిస్థాన్‌లో జరిగిన కీలక రాజకీయ పరిణామాలు... ► 2021 మార్చి 3: సెనేట్ ఎన్నికల్లో ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్‌పై విపక్ష నేత యూసుఫ్ రజా గిలానీ నెగ్గడంతో తొలిసారి అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ఇమ్రాన్ ప్రభుత్వం ► మార్చి 6: అవిశ్వాస పరీక్షను నెగ్గిన ఇమ్రాన్ ► 2022 మార్చి 8: ద్రవ్యోల్బణం అదుపులో విఫలమయ్యారంటూ ఇమ్రాన్‌పై మరోసారి విపక్షాల అవిశ్వాస తీర్మానం ► మార్చి 19: విపక్ష కూటమికి మద్దతు ప్రకటించిన పలువురు అధికార పీటీఐ ఎంపీలకు ఇమ్రాన్ షోకాజ్ నోటీసులు ► మార్చి 25: అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించకుండానే సభను వాయిదా వేసిన స్పీకర్ ► మార్చి 27: తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని ఇమ్రాన్ ఆరోపణ ► మార్చి 28: జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్ష నేత షాబాజ్ షరీఫ్ ► మార్చి 30: కీలక భాగస్వామ్య పక్షం విపక్షాలతో చేతులు కలపడంతో మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ ప్రభుత్వం ► ఏప్రిల్ 1: తనకు ప్రాణహాని ఉందని ఇమ్రాన్ ఆరోపణ ► ఏప్రిల్ 3: అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్ ఖసీం సూరి. జాతీయ అసెంబ్లీ రద్దుకు ఇమ్రాన్ సిఫార్సు, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదం. వారి నిర్ణయాలు తమ విచారణకు లోబడి ఉంటాయన్న సుప్రీంకోర్టు. -
అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది!.. 5 కీలక అంశాలు
Pakistan Political Crisis: పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి విపక్షాల మధ్య మొదలైన యద్ధం రసవత్తరంగా మారుతోంది. ఇమ్రాన్‌ఖాన్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. కాగా, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే క్రమంలో జాతీయ అసెంబ్లీకి ఇమ్రాన్‌ఖాన్ హాజరు కాలేదు. అదే సమయంలో జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ఇమ్రాన్‌ఖాన్ సిఫారుసు చేశారు. అంటే అవిశ్వాస తీర్మానం కాకుండా నేరుగా ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్ భావిస్తున్నారు. ఈ అనూహ్య నిర్ణయం ద్వారా ప్రతిపక్షాలకు పెద్ద షాక్ తగిలింది. అంతేకాకుండా ఇమ్రాన్‌ఖాన్‌కు పదవీ గండం తప్పింది. ప్రస్తుతం పాక్‌లోని రాజకీయ సంక్షోభంలో 5 కీలక అంశాలు ఇవే.. 1.ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి చెందిన 12 మందికి పైగా శాసనసభ్యులు, అలానే పార్టీలో కీలకంగా ఉన్న ప్రతిపక్షాలకు మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గత వారం, ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ 342 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్లో మెజారిటీని కోల్పోయింది. ప్రభుత్వం కొనసాగాలంటే 172 మంది సభ్యుల బలాన్ని ఇమ్రాన్ ప్రభుత్వం నిరూపించుకోవాల్సి ఉంది. 2. జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సాదిక్ సంజరానీ ఈ అవిశ్వాస తీర్మానమంతా విదేశీ కుట్ర అని ఆరోపిస్తూ సభను రద్దు చేశారు. అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. 3.ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. పాకిస్తాన్ ప్రజలను ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే ప్రతిపక్షాల కుట్ర భగ్నమైందని ఆయన అన్నారు. 4. ‘ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతించలేదు. ఉమ్మడి ప్రతిపక్షాలు పార్లమెంటును విడిచిపెట్టడం లేదు. ఈ అంశంపై మా న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు’.. అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ ట్వీట్ చేశారు. 5.పాకిస్థాన్ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. రష్యా, చైనాలకు వ్యతిరేకంగా ప్రపంచ సమస్యలపై అమెరికా యూరప్ తరపున మాట్లాడనందుకే ఈ పరిణామాలని వివరించారు. ఈ కారణంతోనే ప్రతిపక్షాలు తనను తొలగించడానికి అమెరికాతో కలిసి కుట్ర పన్నుతున్నాయని ఇమ్రాన్ ఆరోపించారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ సిపారసుతో జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)ను ఆ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీ రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలకు పిలుపు నిచ్చారు. దీంతో పాక్‌లో ముందుస్తు ఎన్నికలు జరగడం ఖాయమైంది. చదవండి: Social Media Ban in Sri Lanka: శ్రీలంకలో ఆంక్షలు.. అల్లాడుతున్న లంకేయులు -
‘అవిశ్వాస’ పరీక్షలో ఇమ్రాన్ నెగ్గేనా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ జరుగనుంది. తక్షణ రాజీనామా, అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం, ఎన్నికలకు వెళ్లడమనే మూడు ఆప్షన్లను ప్రత్యర్థులు తనకిచ్చారని ఇమ్రాన్ శనివారం చెప్పారు. వారెవరన్నది బయట పెట్టలేదు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చివరి క్షణం దాకా పోరాడతానని స్పష్టం చేశారు. కొందరు ద్రోహులు తమ కూటమిని వీడి విపక్షాలతో చేతులు కలిపారని మండిపడ్డారు. ఎంపీలను సంతల్లో మేకల్లా కొనేస్తున్నారని ధ్వజమెత్తారు. విదేశీ కుట్రకు స్వదేశీ నేతలు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన లాయర్లతో మాట్లాడానని, ద్రోహులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. యువత నిశ్శబ్దం వీడాలని కోరారు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వీగిపోవాలంటే ఆయనకు అనుకూలంగా 172 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ, తమకు 175 మంది సభ్యుల మద్దతు ఉందని ప్రతిపక్ష కూటమి చెబుతోంది. -
ఇమ్రాన్ ఖాన్ టంగ్ స్లిప్.. ఖండించిన అమెరికా
తనను గద్దెదింపేందుకు జరుగుతున్న రాజకీయ కుట్ర వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలకు భారీగా డబ్బు ఎరవేసి ఆ దేశం ఈ పని చేయిస్తోందంటూ ఖాన్, అతని అనుచర గణం.. అవిశ్వాసం దరిమిలా పదే పదే రీల్ వేస్తున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా నేరుగా అగ్రరాజ్యం అమెరికా మీదే ఖాన్ విమర్శ చేశాడు. ఈ నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని వైట్‌హౌజ్ ఉన్నతాధికారి కేట్ బెడింగ్‌ఫీల్డ్ వ్యాఖ్యానించారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనను అధికారం నుంచి దింపేయాలని అమెరికా ప్రయత్నిస్తోందంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. పాక్ రాజ్యాంగం, చట్టాలపై మాకు గౌరవం ఉంది. జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు మేం పరిశీలిస్తున్నాం’’ అంటూ ప్రకటనను ఆమె మీడియాకు చదివి వినిపించారు. అంతకు మించి స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారామె. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం ఓ జాతీయ టీవీ ఛానెల్లో ఇమ్రాన్ ఖాన్ సుదీర్ఘ ప్రసంగం ప్రసారం అయ్యింది. ఈ సందర్భంగా తనను గద్దె దించేందుకు కారణం తన స్వతంత్ర్య విదేశాంగ విధానమే అని పేర్కొన్న ఖాన్.. ఉక్రెయిన్ ఉద్రిక్తల సమయంలో మాస్కోలో పర్యటించడం నచ్చకనే సదరు దేశం తనను గద్దె దించాలని కుట్ర చేసిందని ఆరోపించాడు. అయితే గంటపాటు సాగిన ప్రసంగంలో దాదాపుగా అమెరికా పేరు తీయకుండా మాట్లాడిన ఆయన.. మధ్యలో మాత్రం ఒకసారి నోరు జారి అమెరికా అని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ తరుణంలోనే అమెరికా స్పందించింది. ఇక భారీగా మిలిటరీ, ఆర్థిక సాయం పాకిస్థాన్‌కు అందించినప్పటికీ.. తనను మాత్రం పట్టించుకోకపోవడంతోనే ఇమ్రాన్ ఖాన్, అమెరికాను ఒక విలన్‌గా చూస్తూ వస్తున్నాడు. అయితే అమెరికా మాత్రం పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. -
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ గురువారం సంచలన ప్రకటన చేశారు. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుంటే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తానని విపక్షాలకు ఇమ్రాన్ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఓ ముఖ్యమైన వ్యక్తి ద్వారా జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన షాబాజ్ షరీఫ్‌కు ప్రధానమంత్రి సందేశాన్ని చేరవేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇమ్రాన్ ఇచ్చిన ఆఫర్‌ను ప్రతిపక్షాలు అంగీకరిస్తే పాక్‌లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ ఆఫర్‌ను ప్రతిపక్షాలు తిరస్కరించినట్లు సమాచారం. ఏప్రిల్ 3కు వాయిదా పాకిస్తాన్ పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే డిప్యూటీ స్పీకర్ సభను వాయిదా వేశారు. దీంతో పాకిస్తాన్ పార్లమెంట్ ఏప్రిల్ 3కు వాయిదా పడింది. కాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై మార్చి 28న ఆ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, పీఎంఎల్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ ఫరీఫ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జాతినుద్దేశించి ప్రసంగం తనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో జాతీయ భద్రతా కమిటీతో ఇమ్రాన్ ఖాన్‌కు గురువారం అత్యవసర సమావేశం కానున్నారు. ప్రధాని నివాసంలోనే ఆ మీటింగ్ జరగనుంది. ప్రధాని ఇమ్రాన్‌తో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. నెగ్గడం కష్టమే.. అవిశ్వాస తీర్మానం నుంచి ఇమ్రాన్ ఖాన్ గట్టేక్కడం కష్టతరంగా మారింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ అవిశ్వాసంలో నెగ్గాలంటే 172 సభ్యుల ఓట్లు అవసరం. ప్రస్తుతం ఇమ్రాన్‌కు మిత్రపక్షంతో కలిపి 176 మంది సభ్యుల బలముంది. అయితే ఎంక్యూఎం-పీ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించడంతో ఇమ్రాన్ ప్రభుత్వం బలం 163కి పడిపోయింది. అంతేగాక సొంతపార్టీ పీటీఐ నుంచి 12 మందికి పైగా ఎంపీలు సైతం ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించాయి. కానీ వారు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు కోర్టు నుంచి ఉత్తర్వులు పొందేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వం తీవ్ర విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంది. అవిశ్వాస తీర్మానానికి ముందే ఇమ్రాన్ ఇంటి దారి పట్టేలా కనిపిస్తోంది. అయితే ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయమన్న వార్తల నేపథ్యంలోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే జాతీయ అసెంబ్లీని రద్దు చేసే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి ఎలాగైనా దింపేందకు అవసరమైన బలాన్ని విపక్షాలు కూడగడుతున్నాయి. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ దిగిపోతే ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్ షహబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు పాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర!
దారులన్నీ మూసుకుపోయాయి. అయినా రాజకీయ జీవితాన్ని నిలబెట్టుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ అన్నివిధాల ప్రయత్నిస్తున్నాడు. ఏది ఏమైనా రాజీనామాకు ససేమీరా అంటున్నాడు. మిత్ర పక్షాలన్నీ తనని గద్దె దించడం ఖాయమని ఫిక్స్ అయిపోయాడు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. ఈ నేపథ్యంలోనే.. జాతిని ఉద్దేశించి ప్రసంగించాల్సిన కార్యక్రమాన్ని సైతం ఆర్మీ సలహా మేరకు వాయిదా వేసుకున్నాడు కూడా. ఈ తరుణంలో.. పాకిస్థాన్ తెహ్రీక్-యి-ఇన్సాఫ్ పార్టీ (PTI) సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయన హత్యకు కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పీటీఐ సీనియర్ నేత ఫైజల్ వవ్దా. పాక్ రాజకీయాలను ప్రభావితం చేయాలని కొన్ని బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ సంక్షోభానికి తెర లేపాయి. ఆయన మొండిగా ముందుకెళ్తున్నాడు. అందుకే చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఫైజల్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇమ్రాన్ హత్యకు కుట్ర జరుగుతోందన్న సమాచారం ఇంటెలిజెన్సీ వర్గాలు తమ ప్రభుత్వానికి అందించాయని పీటీఐ నేతలు పలువురు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బుల్లెట్‌ప్రూఫ్ షీల్డ్‌తో పాటు కార్లను సైతం ఉపయోగించాలని నిఘా వర్గాలు ఇమ్రాన్ ఖాన్‌కు సూచించాయట. అయితే తాను చావుకు భయపడనని ఇమ్రాన్ ఖాన్.. తోటి నాయకులతో చెప్పినట్లు ఏఆర్వై న్యూస్ కథనం ప్రచురించింది. అయితే ప్రతిపక్షాలు ఇదంతా ఉత్త డ్రామాగా కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని, ఇందుకోసం ప్రతిపక్షాలకు డబ్బు ఆశ ఎర చూపుతున్నాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నాడు. ఇమ్రాన్ సర్కార్‌కు 172 మంది ప్రజాప్రతినిధుల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం 164 మంది ఉన్నారు. వీళ్లలోనూ మరికొందరు బయటకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చదవండి: ఖాన్‌కు అదనంగా విషమ పరీక్ష విశేషం ఏంటంటే.. 75 ఏళ్ల పాక్ రాజకీయ చరిత్రలో ఏ ప్రధాని కూడా పూర్తి పదవీకాలం(ఐదేళ్లు) పూర్తి చేసుకోలేదు. మిలిటరీ జోక్యంతో దాదాపుగా గద్దె దిగిపోవడం లేదంటే శరణార్థులుగా బయటి దేశాలకు పారిపోవడం జరిగింది. అలాగే ఏ ఒక్కరూ అవిశ్వాసంలో ఓడిపోలేదు కూడా. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నాడు. ఈ తరుణంలో.. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలోనూ ఉన్నాడు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ నుంచి రాజీనామాను ఆశించని ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్ షహబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు పాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. సంబంధిత వార్త: లాస్ట్ ఓవర్.. ఐదు బంతులు.. 36 పరుగులు.. -
చివరి బంతి వరకూ పోరాడుతా..
ఇస్లామాబాద్: పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని కచ్చితంగా ఎదుర్కొంటానని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(69) సంకేతాలిచ్చారు. ఆయన గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఫలితంతో సంబంధం లేకుండా బలీయమైన శక్తిగా తిరిగి వస్తానని చెప్పారు. రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, అసలు ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. తాను క్రీడాకారుడినని, 20 ఏళ్లపాటు క్రికెట్ ఆడానని, చివరి బంతి వరకూ పోరాడుతూనే ఉంటానని అందరికీ తెలుసని చెప్పారు. జీవితంలో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదని చెప్పారు. తమ విధానాలు అమెరికాకు, యూరప్‌కు, భారత్‌కు వ్యతిరేకం కాదని అన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని విమర్శించారు. భారత్–పాక్ మధ్య ఉన్న అతిపెద్ద వివాదం కశ్మీర్ అంశమేనని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాతే భారత్‌కు పాక్ వ్యతిరేకంగా మారిందన్నారు. అవినీతిపరులు కావాలా? పాకిస్తాన్‌పై విదేశీ శక్తుల పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. కొందరు పాక్ ప్రతిపక్ష నేతలు విదేశీ శక్తులతో అంటకాగుతున్నారని మండిపడ్డారు. డబ్బు కోసం, అధికారం కోసం దేశాన్ని అమ్మేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ అధ్యక్షుడు షెహజాద్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో–చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ, జామియత్ ఉలెమా–ఇ–ఇస్లామా నేత మౌలానా ఫజలుర్ రెహ్మాన్‌పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. కుట్రదారుల ఆటలు సాగవని హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రయాణం ఎటువైపు అన్నది అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ తర్వాత తేలిపోతుందని వ్యాఖ్యానించారు. నోరుజారిన ఇమ్రాన్ తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలో భాగంగా అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు లేఖ పంపిందని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఇన్నాళ్లూ కేవలం విదేశాల కుట్ర అని ఆరోపిస్తున్న ఆయన పొరపాటున అమెరికా పేరును బయటపెట్టారు. ఆ లేఖ కేవలం తనకు వ్యతిరేకంగా ఉందని, తన ప్రభుత్వానికి కాదని చెప్పారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో ప్రధాని 342 మంది సభ్యులున్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)లో అవిశ్వాస తీర్మాన పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ నెగ్గాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, తమకు 175 మంది ఎంపీలు మద్దతిస్తున్నారని ప్రతిపక్ష కూటమి చెబుతోంది. పాకిస్తాన్ చరిత్రలో ఇప్పటిదాకా ఇద్దరు ప్రధానమంత్రులు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఎవరూ ఈ తీర్మానంలో ఓడిపోలేదు. అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ రికార్డుకెక్కారు. పాక్ పార్లమెంట్ 3కు వాయిదా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) సెషన్ అనూహ్యంగా ఆదివారానికి వాయిదా పడింది. గురువారం దిగువ సభ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ‘గో ఇమ్రాన్ గో’ అంటూ నినాదాలు చేశారు. శాంతించాలంటూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి చేసిన వినతిని వారు పట్టించుకోలేదు. దీంతో సభను ఆదివారం ఉదయం 11.30 వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్ జరుగనుంది. పాక్‌కు ఎలాంటి లేఖ పంపలేదు: అమెరికా తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వెనుక అమెరికాతో సహా ఇతర దేశాల కుట్ర ఉందంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలను అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖండించారు. ఇమ్రాన్ చెబుతున్నట్లుగా పాకిస్తాన్‌కు తమ ప్రభుత్వ సంస్థలు గానీ, అధికారులు గానీ ఎలాంటి లేఖ పంపలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్లో తాజా పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అమెరికా ప్రభుత్వాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. జాతీయ అసెంబ్లీ రద్దుకు తెరవెనుక ముమ్మర యత్నాలు 342 సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో మెజారిటీని కోల్పోయిన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన పరువు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ప్రతిపక్షాలతో రాజీకోసం ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. జాతీయ అసెంబ్లీ రద్దు కోసం ప్రతిపక్షాలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై అధికార తెహ్రిక్–ఇ–ఇన్సాఫ్ ప్రభుత్వం, ప్రతిపక్షాల నడుమ చర్చలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు ఉపసంహరించుకోవడం, అందుకు ప్రతిఫలంగా పార్లమెంట్‌ను రద్దు చేసి, మళ్లీ తాజాగా ఎన్నికలకు వెళ్లడం.. ఇదే ఈ చర్చ ఏకైక ఎజెండా అని వెల్లడించాయి. అయితే, ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదన పట్ల ప్రతిపక్షాలు అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయి, ఎన్నికలు రావాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్‌కు ‘సేఫ్ ప్యాకేజీ’ ఇవ్వొద్దని ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో గురువారం అన్నారు. పార్లమెంట్లో మెజారిటీని కోల్పోయిన ఇమ్రాన్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు.