
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలోని 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం మేడ్చల్‌లోని జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. కావ్య ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ అసమ్మతి కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి వైజాగ్ టూర్‌కు వెళ్లినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా ఎన్నుకున్న మేయర్‌తో అసమ్మతి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్య విభేదాలన్న విషయం తెలిసిందే. ఇక.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టికి మలిపెద్ది సుధీర్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
చదవండి: TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం
Comments
Please login to add a commentAdd a comment