Jawahar Nagar
-
HYD: యాప్రాల్‌లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: కొంత కాలం గ్యాప్ తర్వాత హైడ్రా మళ్లీ తన జేసీబీలకు పని చెప్పింది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని యాప్రాల్‌లో హైడ్రా శుక్రవారం (డిసెంబర్6) అక్రమ కట్టడాలపై కూల్చివేతలు చేపట్టింది. సర్వే నెంబర్ 32,14లో ఉన్న ఫంక్షన్‌హాల్‌ను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. ప్రభుత్వ భూమిలో నిర్మించినందుకు ఫంక్షన్హాల్లో కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు తెలిపారు.కూల్చివేతలు వివాదాస్పదమైనందున హైడ్రా తన దూకుడు కొద్దిగా తగ్గించింది. హైకోర్టు చివాట్లతో తన స్పీడుకు బ్రేకులు వేసింది. అక్రమ నిర్మాణాలని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే కూల్చివేతలకు రంగంలోకి దిగుతోంది. తాజాగా హైడ్రా కూల్చివేతలు చేపట్టిన జవహర్‌నగర్ ప్రాంతంలో చాలా వరకు భూ కబ్జాలతో పాటు అక్రమ నిర్మాణాలున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఫిర్యాదులున్నాయి. -
20 ఏళ్లుగా ఉంటున్నాం.. మీరెవరు పొమ్మనడానికి..
-
ఇళ్లు వదిలి పోండి..
-
చిన్న పిల్లోడు...20 కుక్కలు ఒకేసారి..!
-
విధి కుక్కల దాడిలో..
-
వీధికుక్కలు దాడిలో మరో చిన్నారి మృతి
-
మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్!
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలోని 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం మేడ్చల్‌లోని జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. కావ్య ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ అసమ్మతి కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి వైజాగ్ టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా ఎన్నుకున్న మేయర్‌తో అసమ్మతి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్య విభేదాలన్న విషయం తెలిసిందే. ఇక.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టికి మలిపెద్ది సుధీర్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చదవండి: TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం -
జవహార్ నగర్ బాధితురాలికి అండగా మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: జవహార్ నగర్లో జరిగిన దుశ్శాసన పర్వం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో బాధితురాలికి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అండగా నిలిచారు. ఆమెకు పెళ్లి చేయడంతో పాటు ఉద్యోగం ఇప్పించే బాధ్యతను ఆయనే తీసుకున్నారు. బాలాజీ నగర్లో మద్యం మత్తులో ఓ కీచకుడు ఆమె దుస్తులు చించేసి.. నగ్నంగా రోడ్డుపై నిలబెట్టిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చుట్టూ వంద మంది ఉన్నా ఎవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయకపోగా.. ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఉదంతంపై బాధితురాలు మీడియా ముందు వాపోయింది కూడా. అయితే.. ఈ కేసులో పోలీసులు బాధితురాలికి అండగా నిలవడంతో పాటు నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయితే ఆ బాధితురాలికి మంత్రి మల్లారెడ్డి అండగా నిలబడ్డారు. బాధితురాలికి(28) మున్సిపల్ కార్పోరేషన్లో ఉద్యోగం ఇప్పించడంతో పాటు ఆమె పెళ్లి చేసేందుకు కూడా ఆయన ముందుకొచ్చారు. అంతేకాదు.. ఆమెకు డబుల్ బెడ్రూం ఇవ్వాలంటూ అధికారులకు సైతం మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్‌లోనూ ఆమె యోగక్షేమాలన్నీ తానే చూసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులకు అభయం ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి. గవర్నర్ ఆరా జవహార్ నగర్లో మహిళను వివస్త్ర చేసిన ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. మహిళా కమిషన్ సీరియస్ జవహార్ నగర్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సైతం సీరియస్ అయ్యింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ.. డీజీపీ నుంచి వివరణ కోరింది. -
హైదరాబాద్ నడిరోడ్డుపై దుశ్శసన పర్వం..
హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న యువతిని వివస్త్రను చేసి, దాడికి పాల్పడిన ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి, జవహర్‌నగర్ డీఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్ శివాజీనగర్‌కు చెందిన పెద్ద మారయ్య (30)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసగా మారి భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో భార్యతో గొడవ పడిన మారయ్య తన తల్లితో కలిసి బాలాజీనగర్ డివైడర్ మార్గంలో రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో షాపింగ్‌కు వెళ్లి వస్తున్న ఓ యువతి (28)పై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆమె మారయ్య చెంప చెళ్లుమనిపించింది. దీంతో అతను కోపంతో ఆమెపై దాడి చేసి దుస్తులు లాగి వివస్త్రను చేశాడు. పక్కనే ఉన్న మారయ్య తల్లి కుమారుడిని వారించలేదు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ మహిళ అడ్డుకోగా ఆమెపై కూడా దాడి చేశాడు. కొద్దిసేపటి తర్వాత పలువురు మహిళలు వచ్చి ఆమెపై కవర్లను కప్పారు. నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేస్తుంటే స్థానికులు సెల్ఫోన్లలో వీడియోలు తీశారు తప్ప అడ్డుకోలేదని పలువురు మండిపడుతున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్‌లో అమానుషం.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు
సాక్షి, హైదారాబాద్: జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలాజీ నగర్ బస్టాండ్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని ఓ కీచకుడు వివస్త్రను చేశాడు. పెద్దమారయ్య (30) అనే కూలీ తాగిన మత్తులో యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె బట్టలు చింపేసి అందరి ముందు పరువు తీశాడు. అడ్డుచ్చిన వారిపై సైతం దాడికి తెగబడ్డాడు దుర్మార్గుడు. దీంతో 15 నిముషాల పాటు యువతి రోడ్డుమీద నగ్నంగా ఉన్నా ఎవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయలేదు. మారయ్య అక్కడి నుంచి వెళ్లాక పలువురు కవర్లు కప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెకు రక్షణ కల్పించి, మారయ్యను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
Hyderabad: సమస్యకు చెక్.. చెత్త దూరం.. కరెంటు లాభం!
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకు మరింతగా జనాభా పెరిగిపోతున్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వెలువడుతున్న చెత్త కూడా అంతే స్థాయిలో పెరిగిపోతోంది. ఈ చెత్తను డంప్ చేస్తే కాలుష్యం, మురికి, అనారోగ్య సమస్యలు. ఈ క్రమంలోనే అటు చెత్త సమస్యకు చెక్ పెట్టడం, ఇటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ప్రయోజనం పొందడం లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తోంది. జవహర్‌నగర్‌లో తొలుత 19.8 మెగావాట్ల ఉత్పత్తితో ప్రారంభమైన రాంకీ సంస్థ (రీసస్టెయినబిలిటీగా పేరు మారింది) ప్లాంట్ సామర్ధ్యం ప్రస్తుతం 24 మెగావాట్లకు పెరిగింది. మరో 24 మెగావాట్ల ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతించింది. ఈ సంస్థ మార్చి చివరినాటికి దుండిగల్‌లో 14.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ప్రారంభించనుంది. ఇదిగాక నగర శివార్లలో ఏర్పాటు కానున్న పలు ప్లాంట్లతో రెండేళ్లలో వంద మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు చెత్త ప్రాసెస్ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెత్తగుట్టలు పోగుపడవు. ఘన వ్యర్థాలు (చెత్త) ఎప్పటికప్పుడు ప్రాసెస్ అవుతాయి. శివార్లలోని పలు ప్రాంతాల్లో చెత్త ట్రీట్మెంట్తోపాటు ఆ సమీపంలోనే ఉండే ప్లాంట్లతో విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. మున్సిపల్ కార్మికులు సేకరించే చెత్తలో విద్యుత్‌కు పనికొచ్చేది దాదాపు 50 శాతం ఉంటుంది. మిగతా చెత్తను కంపోస్టు, రీసైక్లింగ్‌తో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ వంటి వాటికి వినియోగిస్తారు. అంతిమంగా ఎందుకూ పనికిరానిదాన్ని పాతిపెడతారు. మరోవైపు చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అది అంత శ్రేయస్కరం కాదని, ఖర్చు కూడా ఎక్కువని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. హైదరాబాద్ నగరంలో ఏటికేడు పెరుగుతున్న చెత్తను, తద్వారా ఉత్పత్తి చేయగల విద్యుత్‌ను జీహెచ్ఎంసీ అధికారులు 2018లో అంచనా వేశారు. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 70–100 టన్నుల చెత్త అవసరమవుతుంది. వంద మెగావాట్ల ఉత్పత్తికి దాదాపు పదివేల టన్నులు కావాలి. ప్రస్తుతం నగరంలో రోజూ 7000 టన్నుల చెత్త వెలువడుతోంది. పరిసర మున్సిపాలిటీలను కలిపితే ఇది పదివేల టన్నులకు చేరుకుంటుందని అంచనా. దీనికి తగినట్టుగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సిటీ శివార్లలోని విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఇదీ.. ►యాచారంలో శ్రీవెంకటేశ్వర గ్రీన్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు 12 మెగావాట్ల ఉత్పత్తికి ప్రభుత్వ అనుమతి ఉంది. మరో 2 మెగావాట్లు పెంచి 14 మెగావాట్లకు అనుమతించాల్సిందిగా ఆ సంస్థ కోరింది. అనుమతి వస్తే 14 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ►బీబీనగర్‌లో ఆర్డీఎఫ్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 11 మెగావాట్ల ప్లాంట్ పనులు ప్రారంభమై చాలాకాలమైనా వివిధ కారణాలతో జాప్యం జరుగుతోంది. ఇటీవల యాజమాన్య మార్పు జరగడంతో పనులు వేగంగా అవుతాయని అధికారులు చెప్తున్నారు. ►‘రీసస్టెయినబిలిటీ లిమిటెడ్’ ప్యారానగర్లో 15 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ►జవహర్‌నగర్‌లో ప్రస్తుతం 24 మెగావాట్లు, అదనంగా రానున్న 24 మెగావాట్లు, దుండిగల్‌లో 14.5 మెగావాట్లతోపాటు కొత్తగా రానున్న ప్లాంట్లన్నీ కలిపితే మొత్తం 102.5 మెగావాట్లకు ‘చెత్త విద్యుత్’ ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది. మున్సిపల్ వ్యర్థాల నుంచి తక్కువే.. గత సంవత్సరం కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ రాజ్యసభలో ఇచ్చిన సమాచారం మేరకు దేశంలో చిన్నవి, పెద్దవి కలిపి 249 ప్లాంట్లు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో మున్సిపల్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేవి 11 ప్లాంట్లే. వీటి సామర్ధ్యం 132.1 మెగావాట్లు. ఇటీవల మరికొన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు మరికొన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. ఇక దేశంలోని అన్ని నగరాల్లో భారీగా చెత్త వెలువడుతున్నా.. దాన్ని విద్యుత్‌గా మార్చే ప్లాంట్లు కొన్ని నగరాల్లోనే ఉన్నాయి. జీరో వేస్ట్ లక్ష్యంగా.. హైదరాబాద్ నగరంలో చెత్తను వివిధ రకాలుగా వేరు చేయడంతో బయోగ్యాస్, కంపోస్టు ఎరువు వంటివాటితోపాటు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ‘జీరో వేస్ట్’ లక్ష్యంతో పనులు చేస్తున్నాం. తద్వారా చెత్త పేరుకు పోదు. చెత్త వస్తున్న చోటనే తడి–పొడిగా వేరుచేయడంలో ఇంకా కృషి జరగాల్సి ఉంది. మిగతా దశలకు సంబంధించి చాలా నగరాల కంటే మనం ముందంజలో ఉన్నాం. – బి.సంతోష్, అడిషనల్ కమిషనర్ (పారిశుధ్యం, ఆరోగ్యం), జీహెచ్ఎంసీ వ్యయమెక్కువ.. శ్రేయస్కరం కాదు.. చెత్త నుంచి విద్యుదుత్పత్తికి అధిక వ్యయం అవుతుంది. వాతావరణ కాలుష్యం సమస్య కూడా ఉంటుంది. విద్యుత్ కోసమే అయితే సోలార్ పవర్ ఖర్చు తక్కువ. చెత్త కుప్పలు కనిపించకుండా ఉండేందుకు విద్యుత్ ఉత్పత్తికి మొగ్గుచూపుతున్నారు. దీనికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. ఏర్పాటు చేసే కంపెనీలకు రాయితీలిస్తారు. ఇది శ్రేయస్కరం కాదు. చెత్తను ప్రాథమికంగానే వేరు చేయడం ఉత్తమ మార్గం. రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ విధానమే మేలైనది. దానివల్ల ఎక్కువమందికి జీవనోపాధి లభిస్తుంది. – ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి, పర్యావరణవేత్త -
Hyderabad: స్వప్నతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..
సాక్షి, హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. సీఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా దర్పనపల్లి మండలం దమ్మన్నపేట్ తండాకు చెందిన మాలోత్ మంజుల(24)ను సిరిసిల్లా జిల్లాకు చెందిన మాలోత్ ప్రసాద్‌తో 2021 జనవరి 8న వివాహం జరిగింది. పెళ్లిలో రూ.10లక్షల నగదు, ప్లాట్, 8 తులాల బంగారాన్ని కట్నంగా అందజేశారు. ఉపాధి కోసం హకీంపేట్‌కు వలస వచ్చిన ప్రసాద్, అతడి భార్య, 15 నెలల కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రసాద్‌కు స్వప్ప అనే మహిళతో పరిచయం ఏర్పడింది. భార్య, కుమారున్ని పట్టించుకోకుండా ప్రసాద్ తిరుగుతున్నాడు. కుల పెద్దలకు ఫిర్యాదు చేసినా ప్రసాద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతేకాకుండా మంజులను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన మంజుల ఇంట్లో ఫ్యాన్ రాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీకి తరలించి మంజుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ ఇంటి ఎదుట మహిళ హంగామా) -
వీడిన చిన్నారి ఇందు మృతి మిస్టరీ
-
దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: జవహర్ నగర్ బాలిక ఇందు మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతిచెందినట్లు జవహర్‌నగర్ పోలీసులు గుర్తించారు. కాగా గురువారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమై.. తెల్లారి చెరువులో శవమై తేలిన విషయం తెలిసిందే. దీంతో జవహర్‌నగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఆదివారం సీఐ చంద్రశేఖర్ ప్రత్యేక బృందాలతో కలిసి పరిసర ప్రాంతాలను జల్లెడ పడ్డారు. చెరువులో ఉన్న నీరు ఊపిరితిత్తులలోకి చేరి ఇందు మృతిచెందినట్లు పోస్టుమార్టమ్ రిపోర్టు నివేదికలోనూ వెల్లడైంది. అసలు ఏం జరిగింది? మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో గజ ఈతగాళ్లతో గాలించగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. చదవండి: డబ్బు వసూలు చేసినట్లు నిరూపించు.. రోహిత్ రెడ్డికి రఘునందన్ సవాల్.. -
జవహర్ నగర్ బాలిక మృతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
-
మేడ్చల్: జవహార్‌నగర్ బాలిక అదృశ్యం విషాదాంతం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక గురువారం ఉదయం కనిపించకుండా పోగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. దీంతో చెరువు వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. అయితే, పాఠశాల నుంచి బాలిక చెరువు వద్దకు ఎందుకు వచ్చింది? ఎవరైనా తీసుకెళ్లారా? హత్య చేసి చెరువులో పడేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. ఏం జరిగింది? దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్యకు హెచ్ఐవీ సోకే విధంగా వైద్యం -
భార్యపై అనుమానం.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మరీ భర్త దారుణం
సాక్షి, హైదరాబాద్: అనుమానమే పెనుభూతమై కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. జనగాం జిల్లా కొడవటూరు గ్రామానికి చెందిన బండ రాజు (38), బండ కవిత (34) దంపతులు జవహర్‌నగర్‌లో నివాసముంటున్నారు. రాజు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె జ్యోతి ఇంటర్ చదువుతుండగా కుమారుడు పదోతరగతి చదువుతున్నాడు. కాగా కొన్ని రోజులుగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న రాజు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మా ఇద్దరి శవాలను తీసుకెళ్లండి అని సమాచారం అందించాడు. భయపడ్డ కుటుంబసభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి వచ్చారు. గడ్డపారతో డోర్ పగులగొట్టి చూసే సరికి రక్తపు మడుగులో కవిత, ఉరివేసుకుని రాజు విగతజీవులుగా కనిపించారు. భార్యను అతికిరాతకంగా కట్టర్‌తో గొంతు కోసి హత్యచేసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు బావిస్తున్నారు. ఘటనా స్థలానికి మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఇంచార్జ్ ఏసీపీ విజయ్ శ్రీనివాస్, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు అనిల్‌రెడ్డి, అనిల్‌కుమార్ చేరుకుని ఆధారాలు సేకరించి, మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తల్లిదండ్రులిద్దరూ మృతిచెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పిల్లలు ఇంటికి వచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో, తండ్రి ఉరివేసుకుని విగతజీవులుగా పడి ఉండడంతో పిల్లల రోదనలు మిన్నంటాయి. చదవండి: Nizam College: విద్యార్థుల నిరసన.. తలనొప్పిగా సర్కార్ ఉత్తర్వులు -
హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో విషాదం
-
విషాదం.. చెరువులోకి మునిగి టీచర్‌తోపాటు ఐదుగురు విద్యార్థుల మృతి
సాక్షి, మేడ్చల్: ఈత సరదా ఐదుగురు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. వారిని రక్షించడానికి వెళ్లిన మదరసా టీచర్ సైతం మృత్యువాత పడ్డారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ విషాదకర ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కాచిగూడ ప్రాంతానికి చెందిన హనీఫా మదరసాలో చదువుకునే దాదాపు 40 మంది విద్యార్థులు శనివారం డీసీఎం వాహనంలో వారి టీచర్ యహియా (25)తో కలసి జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో ఓ గృహప్రవేశానికి హజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో కొందరు ఫంక్షన్ జరుగుతున్న ఇంట్లోకి వెళ్లగా మరికొందరు బయట ఆడుకుంటున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థులు సమీపంలో ఉన్న ఎర్రగుంట చెరువులో సరదాగా ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగిన విద్యార్థులు ఈతరాక ఒక్కొక్కరుగా మునిగిపోయారు. వీరిని గమనించిన ఉపాధ్యాయుడు యహియా వేగంగా వచ్చి నీళ్లలోకి దిగి పిల్లలను కాపాడేప్రయత్నం చేశారు. అయితే పిల్లలు ఆయనను గట్టిగా పట్టుకోవడంతో అందరూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. వీరిలో ఒక విద్యార్థిని అక్కడే ఉన్న స్థానికుడు రక్షించి ఒడ్డుకు చేర్చాడు. ఈ లోగా టీచర్ యహియాతో పాటు ఐదుగురు విద్యార్థులు.. ఇస్మాయిల్ (11), జాఫర్ (10), సోహెల్ (09), అయాన్ (09), రియాన్(12)లు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న కుషాయిగూడ ఏసీపీ సాధన రశ్మీ పెరుమాల్, జవహర్‌నగర్ సీఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్లను రప్పించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చదవండి: నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా?.. వీడియో బయటపెడతా భయాందోళనలో తోటి విద్యార్థులు మదరసా నుంచి గృహప్రవేశానికి వచి్చన విద్యార్థులు సరదాగా గడుపుతున్న సమయంలో టీచర్‌తోపాటు ఐదుగురు స్నేహితులు జలసమాధి అయిన విషయం తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. తోటి విద్యార్థులు నీటిలో మునిగిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. ఆగ్రహించిన స్థానికులు ఎర్రగుంట చెరువులో పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆ ప్రాంతంలోని చెరువుల్లో మునిగి చనిపోయారని, వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంబర్‌పేటలో విషాదఛాయలు మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కారం ఎర్రగుంట చెరువులో శనివారం ఈతకు వెళ్లి మృతి చెందిన ఐదుగురు విద్యార్థులు అంబర్‌పేట నియోజకవర్గం హడ్డికార్ఖానా, సుందర్‌నగర్, నెహ్రూనగర్ ప్రాంతాలతో పాటు అంబర్‌పేటకు చెందినవారు కావడంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాచిగూడ పోలీసులు హడ్డికార్ఖానా ప్రాంతంలోని మదరసా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌లు పరామర్శించారు. కాగా, గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ పిల్లల మృతదేహాలను చూసి భోరున విలపించారు. ఈ సందర్భంగా మృతదేహాలకు పోస్టుమార్టం వద్దని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు మార్చురీ అద్దాలను ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్యే, కార్పొరేటర్ నచ్చజెప్పడంతో వారు శాంతించారు. చదవడి: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని.. యువకుడు మృతి -
యువతులు, ఒంటరి మహిళలే టార్గెట్.. జీవనోపాధి కల్పిస్తానని చెప్పి
సాక్షి, హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తూ అమాయక మహిళలను మోసం చేసిన ఓ మహిళపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం పీడీ యాక్టు నమోదు చేశారు. జవహర్‌నగర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిగాడి అరుణ దమ్మాయిగూడ వాయుశక్తినగర్లో ఓ ఇంట్లో నివాసం ఉంటూ కళాశాల యువతులు, ఒంటరి మహిళలకు జీవనోపాధి కల్పిస్తానని చెప్పి వ్యభిచారం నిర్వహిస్తుంది. వ్యభిచారం నిర్వహిస్తున్న అరుణను జూన్ 16న పోలీసులు అదుపులోకి తీసుకొని చంచల్‌గూడ జైలులో తరలించారు. ఈ మేరకు అరుణపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు తెలిపారు. మసాజ్ సెంటర్‌పై దాడి.. ముగ్గురు మహిళల అరెస్టు అనుమతి లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న బ్యూటీ సెలూన్ వెల్నెస్ సెంటర్‌పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పనామా చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఎస్బీ బ్యూటీ అండ్ సెలూన్ వెల్నెస్ సెంటర్లో అనుమతి లేకుండా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందంది. దీంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా బుధవారం దాడి చేశారు. అందులో పనిచేస్తున్న ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. మసాజ్ సెంటర్ నిర్వాహకుడు రాధామనోహర్‌రెడ్డి, మేనేజర్ ప్రశాంత్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారి నుంచి 4 సెల్ఫోన్లు, రూ. 500 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘మమ్మీ.. డాడీ నన్ను క్షమించండి.. నేను కరెక్ట్‌గా లేను’
సాక్షి, హైదరాబాద్: మమ్మి, డాడీ నన్ను క్షమించండి, మీరు కరెక్ట్‌గా ఉన్నారు. నేను కరెక్టుగా లేను, నేనేమీ చేయలేను... నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా.. అమ్మా.. నన్ను క్షమించు మీరు నా ప్రాణం... మీకు అందనంత దూరం వెళ్లిపోతున్నా అంటూ లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకున్న ఓ యువకుడు సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విధారక సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. జవహర్‌నగర్ పోలీసులు, స్ధానికులు తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఖాధర్ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నాపురంలోని సాయిగణేష్ కాలనీలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముర్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఖాజా మోహినుద్దీన్ (23) ఉన్నారు. ఇద్దరు కుమార్తెల వివాహం జరిగింది. మదర్సాలో చదువుతున్న ఖాజా ఇంట్లో ఆన్లైన్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఖాజా ఫోన్‌తో పాటు ఇంట్లో ఉన్న తండ్రికి ఫోన్ ద్వారా లోన్ యాప్ నుంచి రూ. లక్ష లోన్ తీసుకున్నాడు. అసలు వడ్డీ లోన్‌కు సంబంధించి రూ. 40 వేలు కట్టాలని లోన్‌యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. దీంతో తండ్రి కొంత డబ్బును కట్టాడు. ఈ నెల 8న ఖాజాను తండ్రి మందలించాడు. జీతం వస్తుంది కడతానని చెప్పాడు. అదేరోజు ఖాజా తల్లిదండ్రులు సోదరి ఒక గదిలో నిద్రిస్తుండగా వంటగదిలోకి వెళ్లిన ఖాజా మోహినూద్ధీన్ సూసైడ్‌నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ట్రాప్ చేసింది ప్రజాప్రతినిధుల కుమారులే! ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
125 గజాల వరకు ఉచితం... ఆపై పైకం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను 125 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. అందు కోసం గత నెల 21 నుంచి మీ–సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. మార్చి 31తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఆయితే అధికారులు ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం.. పేదలకు క్రమబద్ధీకరణ జీఓ పై సరైన సమాచారం లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. జవహర్‌నగర్ కార్పొరేషన్లో ప్రత్యేక సమావేశం జీఓ.58, 59 దరఖాస్తు అవగాహన కోసం మేయర్ మేకల కావ్య అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కీసర ఆర్డీవో రవి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్‌లో కార్పొరేషన్, రెవెన్యూ సంయుక్తంగా చేయాల్సిన పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాప్రా తహసీల్దార్ అనిత, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. కేవలం వీరికే వర్తిస్తుంది.. 2014 జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. 2014 డిసెంబర్ 30న ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓల్లోని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గత నెల 14వ తేదీన కొత్త జీఓ జారీ చేసింది. 250 గజాలు దాటితే మార్కెట్ విలువ చెల్లించాల్సిందే.. ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీఓ ప్రకారం 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ విలువలో 50శాతం, 250 నుంచి 300 చదరపు గజాలు దాటితే 75శాతం, 500 నుంచి 1000 గజాల్లో నిర్మాణాలు చేసుకుంటే 100 శాతం మార్కెట్ విలువ చెల్లించాలి. ఈసారైనా ముందుకొచ్చేనా? జవహర్‌నగర్ కార్పొరేషన్లో దాదాపు 2 లక్షల మంది పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారు. 2014 క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించినా చాలా మంది ముందుకు రాలేదు. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా వివరాలు లేకపోవడంతో మౌలిక సదుపాయాలు కల్పించడం అధికారులకు ఇబ్బందిగా మారింది. (క్లిక్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తప్పని నిరాశ) అడ్డదారుల్లో వెళ్తే క్రిమినల్ కేసులు: ఆర్డీవో జీఓ.58, 59 దరఖాస్తుల కోసం అడ్డదారుల్లో వెళ్లి నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కీసర ఆర్డీవో రవి హెచ్చరించారు. గ్రామపంచాయితీ పేరున గతంలో తీసుకున్నట్లు బిల్లులు తీసుకువస్తే వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లక్రమబద్ధీకరణ కోసం కొన్ని చోట్ల 2014 సంవత్సారానికి ముందు తేదీలలో నకిలీ ధ్రువపత్రాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి వాటిని గుర్తించి వాటిపై దర్యాప్తు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జవహర్‌గనర్‌లో గతంలో జీఓ.58 ప్రకారం 5,546, జీఓ 59 ప్రకారం 1,666 మంది దరఖాస్తులు చేసుకున్నారని వీటికి సంబంధించి మరో 10 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ఈనెల 31 వరకు మీ–సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు కావాల్సినవి.. ► 2014 జూన్ 2వ తేదీకి ముందున్న నిర్మాణాలను మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తారు. ► ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► రూ. వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ►ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలి. ► ఆధార్‌కార్డు, రిజిస్టర్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రసీదు, విద్యుత్, నీటి బిల్లులు దరఖాస్తులతో సమర్పించాలి. ► ఎంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారన్న వివరాలు తెలియజేయాలి. ► గతంలో అధికారులు ఏదైనా నోటీస్ జారీ చేస్తే అది కూడా జత చేయాలి. ► కోర్టు కేసులు ఉంటే వివరాలు తెలియజేయాలి. -
డెలివరీ బాయ్ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో
సాక్షి, జవహర్‌నగర్: ప్రేమ పేరుతో ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడి ఆ ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీజేఆర్‌నగర్‌లో చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని బీజేఆర్‌నగర్‌కు చెందిన నవీన్(23) ఫుడ్ డెలివరీ బాయ్. రెండు సంవత్సరాలుగా స్థానికంగా ఉండే యువతిని పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. చదవండి: Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఇటీవలే యువతికి వారి తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న నవీన్ యువతి బంధువులను బెదిరించి యువతి ఇంటిని తగలబెడతానని హెచ్చరించాడు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు వారి నానమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ నెల 10న ఇంటికి తాళం వేసి ఊరెళ్లారు. ఈ నెల 23న యువతి ఇల్లు కాలిపోయినట్లు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితులు నవీన్ ఈ ఘాతకానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు! -
వృద్ధురాలిపై దాడి చేసిన ఆవు
-
Hyderabad: ఎప్పటిలాగే విధులకు వెళ్లారు..కానీ తిరిగి రాలేదు
సాక్షి, జవహర్‌నగర్: యువతి అదృశ్యమైన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మిగడ్డ జైజవాన్ కాలనీలో నివసించే లాజరు పెద్ద కుమార్తె బూలగ్రేస్ (20) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతి అదృశ్యం బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎన్బీనగర్లో నివసించే మహేశ్వరి (20), రెండు నెలలుగా రత్నదీప్ సూపర్ మార్కెట్లో పని చేస్తోంది. ఎప్పటిలాగే విధులకు వెళ్లిన మహేశ్వరి రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్యూటీకి వెళ్లి.. బంజారాహిల్స్: విధులకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 10, శ్రీరాంనగర్‌లో నివసించే బి. లోకేష్ స్టార్ ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి రెండ్రోజులైనా ఇంటికి రాకపోవడంతో సోదరుడు కుమార్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.