సాక్షి,హైదరాబాద్: కొంత కాలం గ్యాప్ తర్వాత హైడ్రా మళ్లీ తన జేసీబీలకు పని చెప్పింది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని యాప్రాల్‌లో హైడ్రా శుక్రవారం (డిసెంబర్6) అక్రమ కట్టడాలపై కూల్చివేతలు చేపట్టింది. సర్వే నెంబర్ 32,14లో ఉన్న ఫంక్షన్‌హాల్‌ను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. ప్రభుత్వ భూమిలో నిర్మించినందుకు ఫంక్షన్‌హాల్‌లో కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు తెలిపారు.
కూల్చివేతలు వివాదాస్పదమైనందున హైడ్రా తన దూకుడు కొద్దిగా తగ్గించింది. హైకోర్టు చివాట్లతో తన స్పీడుకు బ్రేకులు వేసింది. అక్రమ నిర్మాణాలని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే కూల్చివేతలకు రంగంలోకి దిగుతోంది. తాజాగా హైడ్రా కూల్చివేతలు చేపట్టిన జవహర్‌నగర్ ప్రాంతంలో చాలా వరకు భూ కబ్జాలతో పాటు అక్రమ నిర్మాణాలున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఫిర్యాదులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment