సాక్షి, హైదరాబాద్: కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ సమర్పించింది. 10 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్రెడ్డి కట్టడాలు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలను కూల్చివేసినట్లు హైడ్రా రిపోర్ట్‌లో వెల్లడించింది. మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజుల రామారం, అమీర్పేట్లో అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేసినట్లు హైడ్రా పేర్కొంది.
నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి
18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. నందినగర్‌లో ఎకరం స్థలాన్ని, లోటస్‌పాండ్‌లో పార్కు కాంపౌండ్ వాల్‌ను కబ్జాదారుల నుంచి హైడ్రా కాపాడింది.
- మనసురాబాద్ సహారా ఎస్టేట్‌లో కబ్జాలు కూల్చివేత
- ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా కూల్చివేత
- మిథాలీ నగర్‌లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
- బీజేఆర్ నగర్‌లో నాలా కబ్జా నుంచి కాపాడిన హైడ్రా
- గాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం కూల్చివేత
- గాజుల రామారావు భూదేవి హిల్స్‌లో చెరువు ఆక్రమణలను చేసిన బోనాలు కూల్చివేత
- బంజారా హిల్స్‌లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేత
- చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసిన హైడ్రా
- నందగిరి హిల్స్‌లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేత
- నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు నమోదు
కాగా, హైదరాబాద్‌లో ‘హైడ్రా’ చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోందని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ తరహా వ్యవస్థలను ఇతర నగరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి. అవకాశమున్న చోటఆక్రమణలను తొలగించడం, కొత్తగా కబ్జాలు జరగకుండా కాపాడేలా చర్యలు చేపట్టనున్నట్టు వివరించాయి.
ఇందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఎక్కడ చెరువుల ఆక్రమణలు జరిగినట్టు గుర్తించినా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలంటూ శనివారం ఓ వీడియో విడుదల చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ గౌతం తదితరులు రాష్ట్రంలోని ఇతర నగరాల్లోని పరిస్థితిపై సమీక్ష కూడా జరిపినట్టు తెలిసింది. త్వరలోనే ఇతర నగరాల్లో ‘హైడ్రా’తరహా వ్యవస్థల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment