సాక్షి, హైదరాబాద్: హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, చెరువులు, నాలాలు మొదటి ప్రయారిటీగా పేర్కొన్నారు. ‘‘అక్రమ భవనాలను కూల్చేస్తాం. కేటీఆర్ ఫాంహౌస్‌కు సర్పంచ్ అనుమతి ఇచ్చారంటున్నారు. సర్పంచ్‌కు అనుమతులు ఇచ్చే అధికారం ఉండదు. ప్రజా ప్రయోజనాల కోసమే కూల్చివేతలు. నా కుటుంబ సభ్యులవి అక్రమ కట్టడాలుంటే ఆధారాలు చూపాలి’’ అని రేవంత్ అన్నారు.
‘‘రాయదుర్గంలో కూల్చివేత సరైనదే. 111 జీవోపై సుప్రీంకోర్టు, ఎన్‌జీటీ గైడ్‌లైన్స్ పాటిస్తున్నాం. చెరువులు, కుంటలలో కొన్ని భవనాలు కట్టుకోవడానికి ఎక్సంప్షన్ ఇచ్చింది. సెక్రటేరియట్ జీహెచ్ఎంసీ లాంటి భవనాలపై సుప్రీంకోర్టు అనుమతి ఉంది.’’ అని రేవంత్ చెప్పారు.
కవిత బెయిల్‌పై రేవంత్ స్పందన
కవిత బెయిల్‌పై సీఎం రేవంత్ స్పందిస్తూ.. ‘‘సిసోడియాకు బెయిల్ ఇవ్వడానికి 15 నెలలు పట్టింది. కేజ్రీవాల్ కు ఇప్పటివరకు బెయిల్ రాలేదు. కవితకు బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందనుకుంటున్నా. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్‌ఎస్ పనిచేసింది’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
రుణమాఫీపై..
ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశాం. రుణమాఫీపై సవాల్‌కు హరీష్‌రావు కట్టుబడి లేడు. కేటీఆర్ కొండగల్ వస్తానంటే స్వాగతిస్తా. కేటీఆర్‌ను.. కేసీఆరే నమ్మడు. కలెక్టర్ దగ్గర గ్రీవెన్స్ పెట్టాం. రుణమాఫీ కాని వారి లిస్ట్ కలెక్టరేట్‌లో ఇవ్వాలి. ఇప్పటి వరకు రూ. 17,933 కోట్లు రుణమాఫీకి జమ చేశాం’’ అని రేవంత్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment