సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి.. భయాన్ని సృష్టింస్తున్నారని మండిపడ్డారు. తీరా చూస్తే హైడ్రా హడావిడీతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందన్నారు. హైడ్రా కారణంగా రెండు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని తెలిపారు.
రిజిస్ట్రేషన్లు పడిపోయాయని, ఆదాయం తగ్గిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కొత్తగా ఆదాయం సృష్టించకపోయినా ఫర్వాలేదుగానీ, ఉన్నది ఊడగొడుతున్నారని దుయ్యబట్టారు. సామాన్యులు కొనుగోలు, అమ్మకం లేనిది బూమ్ ఎట్లా వస్తది? ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అసలేం చేద్దామనుకుంటున్నారంటూ ప్రశ్నించారు.
పనిమంతుడని పందిరేపిస్తే... పిల్లి తోక తగిలి కూలిందట. గట్లనే ఉంది చీప్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తీరు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి... భయాన్ని సృష్టించాడు. తీరా చూస్తే, రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది.… pic.twitter.com/EwPkTPBOP1
— KTR (@KTRBRS) October 7, 2024
Comments
Please login to add a commentAdd a comment