లీవ్ ఇండియా పేరుతో నోటీసులు: తెలంగాణ డీజీపీ | Telangana DGP Jitender About Pakistanis In The State | Sakshi
Sakshi News home page

లీవ్ ఇండియా పేరుతో నోటీసులు: తెలంగాణ డీజీపీ

Published Sat, Apr 26 2025 8:42 PM | Last Updated on Sat, Apr 26 2025 8:48 PM

Telangana DGP Jitender About Pakistanis In The State

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ‘సాక్షి’ తో మాట్లాడిన డీజీపీ జితేందర్.. తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు ఉన్నారు. వీరిలో 199 మంది లాంగ్ టర్న్ వీసాలు కలిగి ఉన్నారు. 
కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదు. మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి. ఈ షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారిని గుర్తిస్తున్నాము.

లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చాము. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు టైం ఉంది. మిగిలిన వారు రేపు తిరిగి వెళ్ళిపోవాలి. ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుండి వెళ్ళిపోవచ్చు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. షార్ట్ టర్మ్ వీసాలు ఉండి తిరిగి వెళ్ళిపోని పాకిస్తానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. 

ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి కో ఆర్డినేషన్ లో  జాయింట్ ఆపరేషన్ చేస్తాము. కర్రెగుట్టలో తెలంగాణా పోలీస్ శాఖ నుండి ఎలాంటి ఆపరేషన్ లేదు. మా బలగాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టల వద్ద ఎలాంటి బలగాలు మోహరించలేదు. ములుగులో కూంబింగ్ కి తెలంగాణ పోలీసులకు సంబంధం లేదు’ అని డీజీపీ జితేందర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement